నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
**********
1.కోరాడ నరసింహారావు గారు
2.కొలచన విజయ భారతి గారు
3.డా.ఆంజనేయులు గారు
4.విజయ దుర్గ గారు
5.డా.ఆంజనేయులు గారు
6.మన్నె లలిత గారు
7.విజయ లక్ష్మి గారు
8.సుధారాణి కృష్ణం రాజు గారు
9.మర్రి జయశ్రీ గారు
10.వురిమళ్ల సునంద గారు ఖమ్మం
**************
1
[23/03, 8:18 PM]
Korada: కవితాగాన0
అంశం :- * ఆణిముత్యాలు *
కోరాడ నరసింహా రావు...!
మీకీవేమాజోహార్లు🙏💐🙏
💐🌹🌷💐🌹🌷💐
దేశ మాత దాస్య విముక్తి కోసం
పాటు పడిన ఆ రేండు వాదాలలో...అతివాదానికే యువరక్తం...ప్రభావితం...!
కన్నుకు కన్నూ... పన్నుకు పన్నూ బదులివ్వనిదే.... ఆంగ్లేయులకు బుద్ది రాదని...
మంచిగా అర్ఢిస్తే... కరిగే హృదయం వారిది కాదని....
డుర్మార్గానికి దండనీతియే
సరియని... ప్రాణాలకు తేగించి
తిరగబదినందుకు.... ఆగ్రహించిన తేల్లదోరతన0...!
కాలాపానీ అన్డమాన్లో.నిర్బంధం
అతికిరాతక శిక్షలతో కక్ష సాధి0పు....!
తలవంచని ఆ మువ్వురూ...
భరత జాతి రత్ణాలై... భావి యువతకు దేశ భక్తి స్పూర్తి ప్రదాత లయ్యిరహో....!
అమ్మ కీర్తి కిరీటమున మేరయు చున్నవేలకట్టలేని ఆణిముత్యా లే మీరు!!
ఇంక్విలాబ్జిందాబాదంటూ...
ఉరికోయ్యల ముద్దాడి...
అమరవీరులైనా రు...!
జయహో... భగత్సింగు....
జయహో.... రాజగురు.....
జయహో.... సుఖ్డేవు లు...!!
జయ... జయ... జయ హో..!!!
********************
........కోరాడ
2
కవితా గానం
పేరు: కొలచన విజయ భారతి
ఊరు: హైదరాబాద్
అంశం: ఆణిముత్యాలు
శీర్షిక:అమూల్య రత్నాలు
కవిత సంఖ్య:21
తేదీ:23-3-2021
*****************
ఈ భువిపై దేవుడు
సృష్టించిన ఆణిముత్యాలెన్నో
స్వాతంత్ర్య ఉద్యమంలో
దేశభక్తితో భరత జాతికి
స్వేచ్ఛాఊపిరులు అందించిన
సమరయోధులు
తమ గానామృతంలో సంగీత ప్రియులను ఓలలాడించిన
గాన గంధర్వులు
సాహితీ లోకంలో తమ కవితా
పాండిత్యంతో ప్రజల
హృదయాలను గెలుచుకున్న
సాహితీ దురంధరులు
క్రీడారంగంలో దేశానికే
వన్నెతెచ్చిన క్రీడాకారులు
సాంకేతిక రంగాన
గగనానికి దూసుకుపోతున్న
శాస్త్రవేత్తలు
ఒకటనేమిటి అనేక రంగాల్లో
స్వయం ప్రకాశంతో ప్రకాశిస్తున్న
ఆణిముత్యాలెందరో
కారణజన్ములై పుట్టిన
అమూల్య రత్నాలు వీరందరూ
🌹🌹🌹🌹🌹
3
[23/03, 8:56 PM]
డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: అతడు భగభగ మండే సూర్యుడు అతడు ఈ దేశపు విప్లవకారుడు అతని సహచరులు రాజ్ గురు సుఖ్ దేవ్ అతడు అమరుడు అతని త్యాగం అజరామరం
అతడు ఒక సామాజిక వేత్త అతడు ఒక విప్లవకారుడు అతడొక పంజాబ్ సింహం ఆయన తిరుగులేని త్యాగశీలి ఆయన చేతిలోంచి మళ్లీ లేచే ఫినిక్స్ పక్షి
అతడు అమరవీరుడు దేశం కోసం తన ప్రాణాలను ఏనాడు లెక్కించండి వాడు కుల మత లౌకిక శక్తులు ఏకం చేసిన మహావీరుడు
భగత్ సింగ్ ఉరికొయ్యల కౌగిట చేరి ఈ దేశపు స్వతంత్రాన్ని అందించిన త్యాగ జీవి ప్రజలే 🔥
సర్వస్వంగా జీవించిన వారు పార్లమెంటులో బాంబు విసిరి ఆంగ్లేయులకు దడ పుట్టించిన వాడు అతడే భగత్ సింగ్
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
4
[23/03, 9:01 PM]
Vineelamma: కవితాగానం
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : ఆణిముత్యాలు
కవితా సంఖ్య: 44
తేదీ: 23/03/21
చరాచర సృష్టి లో
మనిషొక అద్భుత సాగరం
ప్రతి క్షణం పోరాడే సమస్యల
వేటగాడు....!!
సంసార నావ లో సాగే యానంలో
బహుళ ముఖ యుద్దకాండమే
స్వంత ప్రవచనమైనా
అజ్ఞానంధకారంలో గిజిగాడే యోధుడై....!!
మహాపురుషుల జన్మలు
పరోపకారాలకు నైవేద్యాలు
దేశమాత రక్షణకు ఆలవాలు
మన అను భావన లేక
మనది అను అక్షరాలకు తారాజువ్వలు...!!
స్వాతంత్ర్య విప్లవ గగనాన
ఎదురెడ్డి పోరాడి ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులు
సమాజ శ్రేయస్సుకై పాటుపడే
మనసున్న మారాజులు
ఆణిముత్యాలే కాలసంద్రంలో....!!
🌹వినీల🌹
5
[23/03, 9:04 PM]
డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: మహామహులు ఎందరో ఆణిముత్యాలు ఎందరో
ఎందరో మహానుభావులు సమాజ శ్రేయస్సుకై నిరంతరం పాటుపడే దీరులు వీరులు
ఆణిముత్యాలు లేందే ఈ వ్యవస్థ సరికొత్త మార్పులను పొందలేదు అభివృద్ధి ప్రయాణం సాగదు
నిరంతరం ప్రజల కోసం బ్రతికే వారు చరిత్ర గర్భంలో అమరులు
ఆణిముత్యాలు ఎప్పుడు మెరుస్తూనే ఉంటాయి సముద్రంలో నూ జన సముద్రం లోనూ
ఈ వినీల ఆకాశం లో అనిముత్యాలు నక్షత్రాల నువ్వు సిగలో ధరించి
ఆగిపో ఆణిముత్యాల రాసిగా మిగిలిపో
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
6
[23/03, 9:15 PM]
మన్నె లలిత గారు కవయిత్రి: కవితా గానం .
తేదీ :23 03:21.
అంశం : ఆణి ముత్యాలు.
శీర్షిక :వజ్రపు తునకలు.
పేరు : మన్నె పిన్నక లలిత.
ఊరు :హైదరాబాద్.
వజ్రపు తునకలు- వచన కవిత.
పరాయి చేతుల్లో బందీగా ఉన్న భారతమాతను దాస్యవిముక్తి గావించుటకు
ప్రాణాలు అర్పించిన వారెందరో
దేశం కోసం ,రాష్ట్రం కోసం ,ప్రాణాలు పణంగా పెట్టిన
గాంధీజీ ,పొట్టి శ్రీరాములు, అల్లూరి ,ఝాన్సీ లక్ష్మీబాయి
వీర సావర్కర్ ,వందలాది మంది వీరులు, వీరవనితలు
భగత్ సింగ్, గురుదేవ్, రాజ్ గురు, సుఖదేవ్..
లాల్ ,బాల్ ,పాల్
చరిత్ర పుటలు పట్టని
వీరందరే కదా ఆణిముత్యాలు
జలియన్ వాలాబాగ్ దురంతంలో
ప్రాణాలొడ్డిన పిల్లా ,పెద్దా
వీరందరే కదా ఆణి ముత్యాలు
కారోనా కష్టకాలంలో ప్రాణాలొడ్డిన
వైద్యాధికారులు, సిబ్బంది
కరోనాకు భయపడక ప్రాణాలకు తెగించి
విధినిర్వహణ చేసిన, చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది
రక్షణ శాఖ సిబ్బంది ,పోలీస్ వ్యవస్థ
నిరంతర శ్రమతో రాత్రింబవళ్లు లెక్కచేయక
పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ,సిబ్బంది
నింగిపై, నేలపై పరిశోధనల్లో ప్రథములుగా ఉన్న
స్త్రీ రత్నాలు ఆణి ముత్యాలే
కష్ట సమయంలోనూ కర్తవ్య నిర్వహణ చేస్తు
దేశ భవితను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ఆణిముత్యాలే
ఏది ఎలా ఉన్నా, ఆకలి కి అన్నం పెట్టే
ఆకలి తీర్చే రైతన్నలు
ఆణిముత్యాలే! వజ్రపు తునకలే!!
7
[23/03, 9:29 PM]
విజయ లక్ష్మి యాదాద్రి: *ఆణిముత్యాలు*
***************
ఎవరున్నారు
ఆ త్రిమూర్తుల కన్న త్యాగధనులు?
ఎవరు చేయగలరు
అంత ధీరోదాత్తులై ప్రాణాల బలిదానాలు?
స్వతంత్య్రం కొరకు
త్రికరణశుద్ధితో తపించి
గుండెధైర్యంతో శ్రమించి
ఎన్నోవిధాల ప్రయత్నించి
వ్యతిరేక పరిస్థితులను గమనించి
ప్రాణాలను ఉరికొయ్యలకు అర్పించి
తరతరాలకు తరగని సూర్తిని కలిగించి
ఎప్పటికీ ఆరిపోని
దేశభక్తిజ్యోతిని వెలిగించిన త్రిమూర్తులు
రాజ్ గురు సుఖదేవ్ భగత్ సింగ్ లు
వారికి నా వేవేల ప్రణతులు
:
:వల్లాల విజయలక్ష్మి
ఆలేరు
8
[23/03, 9:33 PM] సుధారాణి
Krishnam Raju Poetess: 🙏🙏 కవితా గానం🙏🙏
🙏 సుధారాణి కృష్ణంరాజు🙏
*అంశం*ఆణిముత్యాలు*
23-03-2022(మంగళవారం)
భారత దేశం ఘనతను చాటిన
భరతమాత ముద్దుబిడ్డ లుగా
ఆయా రంగాలలో ఆరితేరిన
ఆణిముత్యాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
మధురగాయకుడు ఘంటసాలతన గాన మాధుర్యాన్ని వీనులకు విందుగా పంచిన గానమృతంలో తడిసి వినసొంపుగా విరహ గీతం అయిన యుగళ గీతమైన ఏదైనా తనకంఠంలో అమృత
ధారాలు కురిపించిన మధుర గాయకుడు ఆణిముత్యం గా
కీర్తి గాంచిన మేధావి
తన గానంతో ఎందరో అభిమానులను తన సంగీత
సాహిత్య సమలంకృతే అంటూ
సరస్వతీ కటాక్షం పొందిన గంధర్వ గాయకుడు గాన గంధర్వుడు బాలుడుగా అందరి హృదయాలలో ఆ చంద్రార్కం నిలిచిపోయే ఆణిముత్యం మన బాలుగారు
ఆణిముత్యాలు గా అందరి మనసు దోచిన మంచి ముత్యాలు అన్ని రంగాలలో
భారత దేశం ఖ్యాతిని చాటిన
వారెందరో ఆణిముత్యాలు అందరికీ వందనాలు
🙏🙏👍
9
[23/03, 9:37 PM]
Lalita Sister: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం...ఆణిముత్యాలు
కదనరంగంలో కాళికలా విజృభించి
శత్రువులను చీల్చి చెందాడిన పరాక్రమ వనిత రాణి రుద్రమ
పరాయి పాలనలో మగ్గుతున్న భారత జాతి విముక్తి కోసం
ప్రాణాలు లెక్కచేయని ధీరులు
దేశ సేవకే అంకితమైన మహానుభావులు ఆణిముత్యాల వలె
అన్ని రంగాలలో
భారత కీర్తి భావుటాను ఎగురవేస్తున్న విజ్ఞాన సంపన్నులు
సమాజానికి మార్గనిర్దేశనం చేసి
సంస్కార బాటలు చూపిన మహానుభావులు
భగ భగ మండే నిప్పురవ్వలై
యువరక్తం ఉప్పొంగుతూ
ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగిన
అమర వీరులు
ఎందరెందరో పుణ్యమూర్తులు
అందరూ ఆణిముత్యాలే
అణువణువునా దేశభక్తి నిండిన పుణ్యమూర్తులు
అందరికి జన్మనిచ్చిన ఈ నేల ఎంత ధన్యమో కదా.
10
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: ఆణిముత్యాలు
*******************
భరత మాత కంఠంలో హారంగా మెరిసిన ఆణిముత్యాలు
దేశం కోసం ప్రాణాలర్పించిన అమరులు
భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవులు!
ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో
బ్రిటిష్ వారి గుండెల్లో కొదమ సింహాలై గుబులు పుట్టించిన విప్లవ యోధులు!
దేశ దాస్య శృంఖలాలు తెచ్చేందుకు
జీవితాలను త్యాగించిన వీర కిషోరాలు!
ముష్కర బ్రిటిష్ సామ్రాజ్య అంతం
సామ్యవాదం సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా తపించిన దేశ భక్తులు!
పెదవులపై చిరునవ్వు చెరగనీయకుండా
తమలాంటి ఎందరో యువకులకు స్ఫూర్తి కలిగించేలా
ఉరికొయ్యలను ముద్దాడిన సాహసులు!
వారి మరణం చివరి చరణం కాదు
వారి సాహసం చిరస్మరణీయం!
అశేష భారత ప్రజల హృదయాల్లో వారి పేర్లు విప్లవాక్షర లిఖితాలు!
రుధిరాశ్రువుల నీరాజనాలు!
ఈ దేశ చరిత్రలో పుటల్లో వారి జీవితాలు
ఉద్విగ్న భరిత స్మారక చరితలు!
Comments
Post a Comment