Skip to main content

నీటి మీద రాతలు 3/2021

 నిర్వహణ:

శివునూరి లలితాకృష్ణ

author of vennela shilpam

**********

1.కోరాడ నరసింహారావు గారు

2.సుధారాణి కృష్ణం రాజు గారు

3.డా.కందూరి సుజాతా రాణి గారు

4.సునంద వురిమళ్ళ గారు

5.విజయ దుర్గ గారు

6.మన్నె లలిత గారు

7.ఉషారాణి గారు

8.డా.ఆంజనేయులు గారు

9.సుగుణ మద్ది రెడ్డి గారు

10.పరాంకుశం రఘు నారాయణ గారు

11.మర్రి జయశ్రీ గారు

******************

1

[02/03, 8:13 PM] Korada: కవితాగాన0

అంశం:-   నీటిమీద రాతలు

కోరాడ నరసింహా రావు...!

* చరిత్రలో... చిర స్థాయిగా...!*

    ********************

 కల్మషం లేని హృదయం లో

నుండి వచ్చిన మాటలు...

అవి చదరని  శిలాక్షరాలు!

కుస్చిత హ్రుదయుల వన్నీ...

నీటిమీద రాతలే....!!

మాత యిచ్చిన తరువాత...

ప్రాణం పోతుందన్నా....

మాట మీద నిలబడాల్సిందే!

ఆడి... తప్పటమన్టే...అది మరణంతో సమానమే...!!

మాటకు సత్యమే కదా ప్రాణం!

మాట నిలబేట్టుకోవడం అంటే

సత్యానికి ప్రాణం పోయ్యట0!

నిజాయితీని.... నిరూపించుకోవట0!!

మనవి యేనాడూ... రాజకీయ నాయకుడి వాగ్డానాల్లా... నీటిమీద రాతలుకాకూడదు...!మనం ఆడి తప్పని హరిస్చంద్రుని లా మాటాడాలి!

యిచ్చిన మాట కోసం యేన్నేన్ని

కష్టాల నుభవించాడు తను!!

కనుకనే...చరిత్రలో చిరస్థా యిగా...నిలవ గలిగాడు...!

    ********************

       ;.......కోరాడ.

2

[02/03, 8:27 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*అంశం*నీటిమీద రాతలు*

02-03-2021(మంగళవారం)

*మాట ఇచ్చి తప్పటం వాగ్దానాలు చేయటం అవసరం

తీరగానే ఏరు దాటగానే తెప్ప తగలేసి నట్టుగా ఉంటాయి

కొందరి ప్రవర్తన

అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇలా తమ పనులు చక్క

బెట్టుకుని ఇచ్చిన మాట తప్పడం నీటి మీద రాతలు

ఎలా నిలబడవో మాట మీద

నిలబడని మనిషి కూడా దీనికి

ఉదాహరణగా చెప్పవచ్చు

నీకోసం తల తాకట్టు పెట్టి మరీ

అడిగింది ఇస్తాము అంటారు

అది కాని పని అయినా అవతలి వ్యక్తి అంటే ఎంత

అభిమానం ఉందో గుర్తించడానికి అంటారు

నీటిమీద రాతలు  అలాంటివే🙏🙏👍

3

[02/03, 8:29 PM] కందూరి సుజాత Poetess: అంశం.. నీటి మీది రాతలు

శీర్షిక..🌷  నీటి మూట 🌷

.... ..........  .... ............

జగత్ ప్రస్తామున జగమెరిగిన సత్యం 

పగటి కలలు సమస్తం నీటి మూటలే నిత్యం .


పంతులు మంత్రం కొసరు ఆధ్యాత్మికం .

పరిజనుల గారడితంత్రం సకల అధ్యాయం .

పార్టీల అవిశ్వాస వాద్గానం.

మాటకారి మాయాజాల తత్వం .

సున్నిత సుకుమార లీలతో ...

నాలుక చీల్చు గాలం వేయు 

మనిషి నేర్చిన మాయాఅస్త్రం

నీటి మూట .


కూజ పాయసం నక్కకు పళ్లెం పాయసం కొంగకు .

పండుగ కానీ ఎండగ నిజానికది 

నీటిమూటా.

విజ్ఞత చంద్రలోక సవారీ

అజ్ఞానం స్వార్థ సుపారి.

నీటిమీద రాతలు  నీతి లేని చేతలు.

 

తీరం చేర్చు తెప్పకు తెలుసు తెడ్డు సుద్దులు స్వార్థంమనీ. 

గంగిగోవుకు తెలుసు యజమాని ప్రేమ స్వార్థంమనీ .

తెలిసిన తేల్చుకోలేని స్థితులవీ.


అతిసూక్ష్మ విజయాలు చేజారి 

విఫలం కోరినా ప్రాణమే ఒక నీటిమూట .

కబోదికి దర్పణం కానుకొసుగు కుటిల నీటిమూటలు. 

"ఆశపడు నీటి మూట అవాంతరాలు చేరు మీట"


కఃదూరి సుజాతారాణి రాజేంద్రనగర్, హైదరాబాద్ 

9392162822🌷

4

[02/03, 8:38 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ:02-03-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: నీటి మీద రాతలు

*********************

మాటలు పెదాలపై ఒలికే రసగంగా ప్రవావాలు

మనసాకాశంలోకి తొంగి చూసి

అమవస చీకట్లను తొలగించే శరత్కాల వెన్నెలలు!


మనో స్తబ్ధతను వదిలించి

ఎదలో చైతన్య  దీపాలను వెలిగించే మాటలు..


కాకూడదు ఎప్పుడూ నీటి మీద రాతలు!

మనిషి అంటే మాటే కదా

మాటంటే మనిషే కదా

మాట పునాది మీదనే కదా

మనిషిని మనిషిగా నిలబడేది...


 అందుకే

మాటలు ఎప్పుడూ  కావాలి

మదిలో లిఖించిన శిలాక్షరాలు

మానవతా విలువల ప్రతి రూపాలు..

5

[02/03, 8:41 PM] Vineelamma: కవితాగానం

పేరు: విజయదుర్గ

కవితా శీర్షిక : నీటిమీద రాతలు

కవితా సంఖ్య: 42

తేదీ: 02/03/20 


మానవుడు నిత్యం స్వార్ధపు

గోడలను కడ్తుంటె

నిజాయితీకి స్థానమెక్కడ

నీతి నియమాలకు విలువల

వలువలు ఒలిచి

నగ్నవీధుల ఊరిగేస్తూ అడుగులు కదుపును.....!!


నాయకులై రక్షణా కవచాలయి

కాపాడాల్సిన వాళ్ళు

తోడుదొంగలై ఖజానా కొల్లగొట్టి

చదరంగాన్ని నడిపుతూ

ఆట ఆడితే ఎవరు జవాబు....!!


ఓటు కొక్క మాటల మూట

పిచ్చి ప్రజల కై ఆకర్షణ మంత్రాలు

ప్రతి పాదాలకు దండాలు,దస్కాలు

ఆఖరన నీవెవరో నేనెవరో......!!


వరాలన్నీ నీటిమీదరాతలై

అసలే మోసాల గనిలా

కుక్క,పిల్లి పంచుకునే తీరులో

గుర్రపు పందాలే ప్రతినిత్యం....!!


ఎటు పోతుందో ప్రజాస్వామ్య

దేశం

మళ్ళా ఏ తెల్లోడి చేతిలోనో

కాలమే జవాబు చెప్పాలి

ధరల మోపును మోస్తూ చతికిల పడాలేమో.....!!



                                 🌹వినీల🌹

[02/03, 8:56 PM] మన్నె లలిత గారు కవయిత్రి: కవితాగానం 

6

తేది :2/3 /21.

 శీర్షిక  :నీటిమీద రాతలు.

 పేరు:మన్నె పిన్నక లలిత.

 హైదరాబాద్

************************************

   మనసులో నుండి రావాలి మాటలు

 పెదవుల చివరనుండి రాకూడదు

 మనుష్యుల పోకడలు

 ఓట్ల కోసం పాట్లు పడుతూ

 పెదవులపై నవ్వులు కురిపిస్తూ

 తీయ తీయని తేనెల మాటలతో

 మైమరిపింప చేసే మాయగాళ్ళు

 ఎన్నికలయ్యాక ఆ మాటలు నీటి మీద రాతలే!!

 అమ్మాయిని వలలో వేసుకొని 

చెప్తాడు ఎన్నో   తీయని మాటలు

 మోజు తీరాక అవి నీటి మీద రాతలే!!

 పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో  

ఉత్తీర్ణుడనవుతానన్న విద్యార్థి

 ఫలితాలు వచ్చాక నీటిమీద రాతలుఅయి

 ముఖం చాటేశాడు

 నీటిమీద రాతలు నీతిబాహ్యమైన చేతలు

7

[02/03, 8:58 PM] +91 70755 17538: శీర్షిక.నీటి మీద రాతలు

.....

ఊసరవెల్లి రంగులు మార్చి

మగ ఆడ బేధాలు చూపే

అమ్మా నాన్న ప్రేమలు

నీటిమీద రాతలు వలెను

మారిపోతు గుప్పెడు బాధను మిగుల్చు


వయస్సు పెరిగినా 

మనసు పెట్టె ఉరుకులు పరుగుల దారిలోన

మనిషి సాగిపోయి 

కళ్లబొల్లి మాటలతో గాలము వేసేటి

మగవాడి మాయ మాటలు

నీటి మీద రాతలల్లే

చేరిగిపోయి బతుకును బండరాయి చేసేరు


బతుకు దారిలో

స్నేహాలు కరెన్సీ నోటుతోను

అల్లుకున్న బంధాలు 

నీటిమీద రాతల్లే మారిపోవు


డి.ఉషారాణి

చిత్తూరు జిల్లా

8

[02/03, 8:59 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: కొద్ది మంది మాటలు నీటి మీద రాతలు తమ స్వార్థం కోసం అప్పుడప్పుడు ఎన్నికల వాగ్దానాలు పెడుతూ ఉంటారు


తమ పబ్బం గడిచిన తర్వాత వాళ్ల మాటలు నీటి మీద రాతలే


కొద్దిమంది మాటకోసం తమను తాము అనిపించుకుంటారు కొద్దిమంది స్వార్థం కోసం అప్పటికప్పుడు మాట్లాడి


తర్వాత కనిపించకుండా ఎక్కడికో వెళ్ళి పోతూ ఉంటారు మళ్ళీ అవసరం వచ్చేదాకా వాళ్లు మాట్లాడిన మాటలు మాట్లాడారు


అవును కొద్ది మంచి మాటలు నీటిమీద రాతలు గా ఉంటాయి

కొద్దిమంది మాటలు

త్యాగాల మూటలు పదిమంది కోసం మాట ఇచ్చినప్పుడు తమను తాము అనిపించుకోవడం వారి జీవిత లక్ష్యం డబ్బుల కోసం ఆశపడే డబ్బు పిచ్చి వాళ్ళు కాదు వారి సర్వస్వంగా ఆభరణంగా తీసుకుంటారు వారి శక్తి


ధార పోస్తారు వాళ్లు చరిత్రలో చిరకాలం నిలిచిపోయే మహానుభావులు


ఒక సుందరయ్య ఒక నాగిరెడ్డి 


ఒక గుమ్మడి నర్సయ్య

ఒక మల్లు స్వరాజ్యం ఒక ధర్మభిక్షం లాగా ఆదర్శంగా నిలిచే వాళ్ళు నేడు ఎంతమంది వీళ్ళు నిజమైన త్యాగ జీవులు మాట కోసం నిలిచిన ఒక ధర్మభిక్షం ఒక కొండ లక్ష్మణ్ బాపూజీ మాట కోసం సర్వస్వాన్ని ధారపోసి మహనీయులు


మాట మహత్తు తో కూడినది

ఒక ఆరుట్ల లక్ష్మీ నరసింహ రెడ్డి ఒక కమలాదేవి ఒక రామచంద్ర రెడ్డి త్యాగం ఒక గురువారెడ్డి త్యాగం చరిత్రలో కలకాలం నిలిచిపోయేది


మాట కోసం జీవితాలను అంకితం చేసిన ఎందరో మహానుభావులు వారికి నా వందనాలు


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453

[02/03, 8:59 PM] +91 90354 73216: అంశం.  నీటి మీద రాతలు


వాగ్దానాలు... వాంతులు నిజమని  మతి భ్రమించిన వింత ప్రాణులు


  చెలియా. 

నీవు లేక నేనులేననే

హృదయం లేని జీవులు


 న్యాయదేవతకి కళ్లు  కప్పిన

కళ్లున్న కభోదులు 

 

       

రైతు  రెక్కలిరిగి  కుప్పకూలితే  రివ్వున ఇచ్చే భరోసా లు 


శవాలకు సూదు లే( సే) పే

  ప్రయత్నంలోతెల్లదుస్తులను

జూసి తెల్లబోయిన మొహాలు


రంగురంగుల భవంతుల్లో

 సరస్వతి దాగుందని

 మభ్యపెట్టే  నేర్పరులు


మేలుకో.. మనిషీ.... మేలుకో... 

మసలుకో.....   మనిషీ...మసలుకో ఎరుకతో..... 

పైరాత లెక్కడివని 

అడుగవద్దు... 

నీటిలో వెతకవద్దు... 

ఎందుకంటే

కనపడని

అ(వి) నీ(టి)తి మాటలు

మన బతుకుల్తో

 చలగాటమాడే

అ(వి) నీ(తి)టి మీద రాతలు. 

 


సుగుణ మద్దిరెడ్డి

ఐలవారిపల్లె

ఐరాల 🌷

9

[02/03, 9:30 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితా గానం* 

అంశం: నీటిమీదరాతలు *కవితా శీర్షిక:  మాటల వెతలు-  బంధాల తెరలు*


సకల జీవరాశులలో ,


జ్ఞాని విజ్ఞాని మనిషే కదా!


 భావ వ్యక్తీకరణ కోసం,


 భాషను సృష్టించాడు!


 జీవనభృతి కోసం,


 ఆహారోత్పత్తులను పండించాడు!


 ముక్తి కోసం ఆధ్యాత్మికతలో ,


అంతా తానై మునిగిపోయాడు!


 సౌకర్యాల కోసం వసతులెన్నో,


 ఏర్పాటు చేసుకున్నాడు! 


సుఖ జీవనానికై,


యంత్రాలను కనిపెట్టాడు!


 కుటుంబ నేపథ్యాన్ని స్థాపించాడు!



 మానవ జీవనంలో, అదొక కోణమైతే,



 అసమ్మతి సెగలు స్వార్ధపు నీడలో,


 యాంత్రిక జీవనంలో,


 సతమతమౌతున్నాడు!


 ధన సంపాదనపై,


 మక్కువ పెంచుకున్నాడు!


 లేనిపోని ఆశలతో,


నిత్యం  బలౌతున్నాడు!


 నైతికతకు దూరమౌతున్నాడు!


మాట పలుకుబడిలో,


 తేడా వస్తున్నది!


 *"నేను"*  *"నా"* అనే ,


సంకుచిత భావాలతో,


 వ్యక్తి శీలాన్ని కోల్పోతున్నాడు! 


తన మాటలలో నిన్నటి నమ్మకాన్ని,


 నెమ్మదిగా వమ్ము చేస్తున్నాడు !


ఆయన మాటలు నీటి మీద,


 రాతలౌతున్నాయి!


 వ్యక్తిగత కక్ష్యలకూ,

 

బీజాలౌవుతున్నాయి!


 స్వార్ధపు ఛట్రంలో బందీయై,


మనిషి మనిషి మధ్య ఉండే ,


బంధాలు తెగిపోతున్నాయి!


 పరాంకుశం రఘు నారాయణ

      మహబూబాబాద్

10

[02/03, 9:44 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..నీటిమీద రాతలు



మదిలోని భావాలన్ని

మాటల రూప0లో వెల్లువయ్యే ప్రవాహాలు

మాటలే వ్యక్తిత్వానికి ప్రతిబింబం

మమతలు పంచే మాటలు

ప్రాణం పోసే సంజీవని

తూటాల్లా పేలే మాటలు

ఎదకు చేసే మానని గాయాలు

స్వార్థంతో మాట్లాడే మాటల గారడి

నీటిమీద రాతలే కదా

మధువులొలికించు మధురమైన మాటలన్నీ

అప్పటికప్పుడు పబ్బం గడుపుకునే ఊక దంపుడు ఉపన్యాసాలు

సజీవమైన మాటలు సత్యం

మాటలు కోటలు దాటుననేలా

చేతల్లో చూపినప్పుడే ఇచ్చిన మాటకు సార్థకత

నెరవేర్చని వేళ అన్ని నీటిమీద తేలిపోయే మాటలే

నేటికాలంలో

ఎన్నికల్లో నేతల హామీలు

నీటిమీద రాతలే

ఐదేళ్ల కోమారు జనాకర్షణ కోసం

పదవీ కాంక్షతో 

ప్రజలను తమవైపు తీపుకునేందుకు తాయిలాలు సమర్పిస్తూ

అప్పటికప్పుడు మభ్యపెట్టి తమ పబ్బం గుడుపుకునేందుకు నేతల జిత్తులు

ప్రజాస్వామ్య దేశంలో

ప్రజలను మోసం చేస్తూ

అవినీతి అక్రమాలకు పాల్పడుతూ

నేతలు చేసే మాయాజాలంలో చిక్కుకోకుండా

మాటలు నిలిపే సమర్థుల కోసం ఓటు వినియోగిస్తే

నీటిమాటలకు తావు దొరకదని గుర్తుంచుకో

మార్చే ఓటనే పదునైన ఆయుధం 

మన చేతుల్లో ఉందనే మరిచిపోకుండా

గురిచూసి వదులు.



Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...