Skip to main content

ఎండమావులు 3/2021

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ

*********

1.ధనాశి ఉషారాణి గారు

2.కందూరి సుజాతా రాణి గారు

3.డా.ఆంజనేయులు గారు

4.డా.బల్లూరి ఉమాదేవి గారు

5.కోరాడ నరసింహారావు గారు

6.సుగుణ మద్ది రెడ్డి గారు

7.వీరా గుడిపల్లి గారు

8.సునంద వురి మళ్ళ గారు

9.గంజాం భ్రమరాంబ గారు

10.పరాంకుశం రఘు నారాయణ గారు

11.మర్రి జయశ్రీ గారు

**********

1

[13/03, 8:01 PM] +91 70755 17538: శీర్షిక.ఎండమావులు

..............

కల్లబొల్లిమాటలతోను

కమ్మని మాటల చాటున

శృతిమెత్తని మాటలతోను

ఊసరవెళ్లి రంగులును మార్చుతూ

అవసరముబట్టి మనసులతో ఆడుకుంటూ

మాయ మాటలతో మదికి గాయము చేసేటి

మాయగాళ్లలో ప్రేమను వెతుకుట ఎండమావి అగును

కాలము గడిచిన కొద్దీ

చేసిన భాషలు ఊసులు అన్నీ

బూడిదలో పోసిన పన్నీరుగా

పదే పదే మాయజేసేటి

మోసగాళ్ల మాయలోన

చిక్కి చితికిపోయే గాయానికి తెలుసు

మనసులో దాగిన బాధలు అన్నీయును

కలికాలపు ఒడిలోన చేసిన

తప్పులకు తగిన శిక్షలు

అనుభవించక తప్పదు సుమా

కనువిప్పు కలుగక తప్పదు 

మనిషికి మానవత్వ విలువలు

శ్రీరామరక్ష నిజము భువిలోన


హామీపత్రము. ఇదినా స్వంతము అనిహామీ  ఇస్తున్నాను


ధనాశి ఉషారాణి

చిత్తూరు జిల్లా

2

[13/03, 8:12 PM] కందూరి సుజాత Poetess: అంశం...ఎండమావులు

శీర్షిక... 🌷పారా హుషార్.. పౌరుడ 🌷

............  ..........  ..........

హిమ తుషారముల ఉషోదయంలా

వికసించే సుకుమార  కుసుమం 

బాల్యము. 

తెలివితో మలుచుకో  తెగువతో 

నడచుకో..

పారా హుషార్ పౌరుడా 

భావితరం వీరుడా.


గున్న మామిడి కొమ్మల్లో కూత నేర్చు కోకిలలా... 

అమ్మవడిలో జ్ఞానాంకురమై ఉదయించిన బాలుడా... 

కన్నవారి అనురాగపు గుబురులో చదువులో రానించు 

సకలవిద్యల్లో ప్రావీణ్యత సాధించు.

మానవజాతికి మెరుగులుదిద్దు గురువుగా పరిమణమిల్లు భావి పౌరుడా. 


కుర్రతనపు వెెర్రి వేషాలతో 

శ్రమ తెలియని సోమరివై దారిలోని ముల్లువై  

తగాదాలల్లో తలపడుతూ ఉగగ్రవాదివైతే 

కన్నవారి ఆశల పందిరిని అల్లుకొలేని తీగవు నీవు... 

ప్రకృతికి పనికిరాని ఎండమావి నీవు.


మానవ హితంకు నీ పాదం కలుపు .

సమాజ శాంతికి నీ నాదం  గెలుపు. 

ఎండమావుల హృదయ జడత్వం  త్యజించు. 

మానవత్వమును విశ్వసించు .

విజ్ఞతలో విహరించు 

సహన సాహసమున ప్రకాశించు .

భూతదయతో మది ఒయాసిస్సును ఒలికించు. 

ఎండమావిగా కాబోకు   సమాజ గుండెవై శాషించూ. 

"పారా హుషార్ పౌరుడా 

సౌదాన్ బావి సంరక్షకుడా"


కందూరి సుజాతారాణి 

రాజేంద్రనగర్, హైదరాబాద్ 

9392162822🌷

3

[13/03, 8:24 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఎండమావులు లాంటి వాగ్దానాలను నమ్మి మోసపోకండి ప్రజలారా


రాజకీయనాయకులు తాత్కాలిక ఊకదంపుడు ఉపన్యాసాలు కు తేనె పూసిన కత్తి లాంటి మా పలుకులకు


సంతోష పడకండి ముందుంది ముసళ్ళ పండుగ


ఎలక్షన్స్ అయిపోయిన అంటే మీ ముఖం ఎవరూ చూడరు


కాలం నేర్పిన గుణపాఠాలు తెలుసుకోండి

కాలమే మీకు అనేక సమాధానాలు చెప్తది



కత్తుల వంతెన లాంటిది కాలం

ఎండమావులు లాంటి వాగ్దానాల వర్షం కురుస్తున్న ది మోసపోయి ఓట్ల విత్తనాలు చల్లి మోసపోకండి


మట్టిలో కలిసిపోయే వి


బ్రతుకులో కష్టపడే వాడు తన సొంత డబ్బుతోనే బ్రతకండి కాబట్టి మిత్రులారా ఎండమావుల్లో వాగ్దానాలు మీ క్షేమ సహాయాలు


ఇన్నేళ్ళ ప్రజాస్వామ్యంలో పాలకులు ఎంతవరకు చూస్తారు క్షేమాన్ని మీ అందరికీ తెలిసిందే ఈ కల్లబొల్లి కబుర్లు నమ్మకండి ప్రజలారా ఇవి వాగ్దానాల మేఘాలు ఎక్కడ ఎక్కడ ఎవరికీ అంతుబట్టని విచిత్ర సమయం ఇది


ఈ ఎండమావులు లాంటి దాంట్లో మీ క్షేమమని నీరు ఉంటుందని భావించకండి


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

4

[13/03, 8:32 PM] Balloori Umadevi Poetess: 13/3/21

కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి

శీర్షిక: ఎండమావి


అందనిదని  తెలిసిన తప్పని ఆరాటం

మనిషి కైనా జంతువు కైనా వదలిన జాడ్యం

ఇది జగమెరిగిన నగ్న సత్యం

అందని ద్రాక్ష ఆరాటపడే నక్కైనా 

అందని ఆకాశం అందుకోవాలనిపించే 

నరుల అంతేలేని ఆశ లైనా

ఎండమావి లోని నీటి చెలమ లాంటిదే

కమ్మగా ఊరిస్తూ పరుగులు తీయిస్తూ

ఆగని ఆకర్షణలై నిలిచేవీ మరీచికలు

 అందుకోలేమని తెలిసిన ఆపని ప్రయత్నం 

నిరాశా నిస్పృహలతో వెనకడుగు వేయడం 

మానవజాతికి అతి సహజగుణం

గాలి బుడగ వంటి జీవన గమనంలో

ఏదీ మన వెంటరాదని తెలుసుకొంటూ

ఎండమావుల వెంట పరుగులు తీయక

సంతృప్తే సంపద అంటూ అందిన దానితో 

తృప్తి గా జీవనం సాగించే దిశలో నడుద్దాం

 వూరించే మరీచికల వెంట పడడం ఆపేద్దాం.

5

[13/03, 8:34 PM] +91 90354 73216: అంశం.. *ఎండమావులు*


శ్రమ  పడకుండా  ఏదో సాదించాలనే ఊహల్లో తేలిపోవడం..... 

లేనిది ఉన్నట్లు.... భ్రమ

చెంది వాటికోసం పరుగెత్తడం... ..


 ఓటేయడానికి చాచినపుడు తెలుసు  వాటి విలువ

ఎండమావేనని.. .. 


వ్యసనాలకు లోనైన యువతకు తెలుసు తన భవిష్యత్తే ఓ ఎండమావి కాబోతుందని.... 


  లంచంతీసికోవడం తప్పని తెలుసు ఐనా.... ఏదో సాదించాలని తపన.. 

.

 మోసగాళ్లకి  తెలుసు 

 మోసం చేయకూడదని..

 తప్పించుకోవచ్చనే భ్రమతో.... 


   అవినీతితో కట్టలు  కట్టలు డబ్బు పేర్చి ..... 

ఆ కట్టలే వానికి చితికి కట్టెలౌతాయని...తెలుసు



పోయే టప్పుడు సంపాదించినది

ఏదీ తనతో రాదని  తెలుసు

కానీ అక్రమ సంపాదన... 

  


  అన్నీ తెలిసి...... తప్పులు చేయడమే......   

ఎండమావులు. 


  ఈ  ప్రపంచమే..... ఎండమావని  తెలుసుకో మనిషీ..... 



ఆధ్యాత్మిక చింతనతో

 బతుకు.

పట్టిచూడు ఓ మెతుకు. 

  తెలిసికో

 జీవనగమ్యపు అతుకు

ఎండమావుల  భ్రమలో ఎండిపోకు...

వ్యసనాల బతుకుతో

వంగిపోకు.. 

 వాస్తవం తెలుసుకో... 

భక్తి మార్గ మెంచుకో.

ముక్తి మార్గం సంపాదించుకో.  ..


సుగుణ మద్దిరెడ్డి

ఐలవారిపల్లె

ఐరాల 🌷

6

[13/03, 8:39 PM] Korada: కవితాగాన0

అంశం :-  ఎండ మావులు

    కోరాడ నరసింహా రావు..!

      " నీ పరుగు లన్నీ......! "

    ******************** 

ఓ... మనిషీ....!

ఏండ మావుల వేంట ఆ పరుగులేందుకోయి....!!

నువు పగటికల లు కంటూ...

ఊహా లోకాల్లో... విహరిస్తూన్నన్త కాలం...

తప్పవయ్యా నీకీ తిప్పలు...!

ఇక నైనా కళ్ళు తేరు...,

నీ భ్రమలు తోలగితేనే గానీ...

ఈ భ్రాంతులు పోవయ్యా...!

ఆ భ్రాంతుల్లో నీకు అనుభవమయ్యేవన్నీ....

మృగతృష్ణ లే......!!

 నువ్వు నమ్మి  ఎదురు చూడా ల్సిన్ది నీ అదృష్టమును కాదోయి

ఆ అదృష్ట మైనా తేరగా వచ్చేది

కాదు సుమా....!

అది పూర్వం నువు చేసుకున్న

పుణ్య కర్మల ఫలం...!

అదేగనక ఉంటే... నువ్వేదురు చూడాల్సిన పనిలేదు... వేదకులాట అవసరమే ఉండదు...! దానికదిగా నిన్ను

వచ్చి చేరుతుంది...!!

నీవీ జీవిత మజిలీ లో...

ఏంత అలసి-సోలసి పోయినా

నీ ఆర్తి తీరాలంటే... నీ బావిని నీవే... అపు డేపుడో... తవ్వే ఉండాలి...!

లేకుంటే.... యిదిగో యిలాగే

నీ పరుగులన్నీ... యేందమావుల వేంటే....!!

   *****************

..........కోరాడ.

[13/03, 8:56 PM

7

] Veera Gudipally: *ఇది వీరా గుడిపల్లి కవిత*

13032021

*ఎండమావులు*

*****************

ఇప్పుడన్నీ అవే కదా

సంపూర్ణాంతర పరావర్తనం

ససేమిరా నమ్మని మనం


జీవితాలు

సహవాసం చేస్తున్నాయి

తెలిసీ ..

....దోసిళ్ళు పడుతున్నాయి

ఎన్ని కలలు కంటున్నాం


రాముడంతటి వాడికి

బంగారు జింక

కైకకు మందర


కృష్ణుడికి

శమంతకమణి


అశోకుడి కి

కళింగ యుద్ధం


అభిమన్యుడి కి

 కృష్ణ పరమాత్మ


తిమ్మరుసు కు

కృష్ణ దేవరాయలు


చివరిగా

నాకు తెలంగాణ


ఎవరు తప్పించుకున్నారని

ఎండమావుల బతుకుల్లో ఎన్ని కష్టాలో కదా


దేవుడా....

గిలాంటప్పుడే నీవున్నావనిపిస్తుంది.


ఎండమావులు...ఎంతందంగా ఉంటాయి

.......  *వీరా గుడిపల్లి*

8

[13/03, 9:05 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ:13-03-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

శీర్షిక: ఎండమావులు

*********************

ఇప్పుడిప్పుడే తెలుస్తోంది తాతా!

జీవితానుభవంతో  నువు బోధించిన విషయాలు!


మెరుస్తున్న దీపకాంతిని ఆహరమనుకొన్న శలభంలా

దరి చేరిన  వారందరినీ ఆత్మీయులు అనుకోవద్దన్న 

నీ ఆంతర్యం అర్థమవుతోంది!


మంచి చెడూ బొమ్మా బొరుసులా

కొందరిని అంటి పెట్టుకొని ఉంటాయన్న నమ్మలేని నిజం  మోసపు అంచుల దాకా నెట్టేయబడ్డప్పుడు కానీ 

ఆ భ్రమలోంచి తేరుకోలేదు!


కోరికల దాహంతో నడిచే దారిలో 

ఊరించే ఎండమావులు  చాలానే ఎదురవుతాయన్నప్పుడు..


నా ఆశల దప్పిక తీరనివ్వని

ఆగర్భ శత్రువు నువ్వేనని

 పీకల దాకా కోపం వచ్చింది..


 తాతా!

మాయలేడి లాంటి మరీచికల  వల వేసి

మానాభిమానాలను దోచుకునేందుకు

అడుగడుగునా నక్కల్లా  పొంచి ఉన్న వాళ్ళను చూస్తుంటే..


నీ  భవిష్యత్ దర్శన శక్తికి ఆశ్చర్యానందాలతో అంజలి ఘటిస్తున్న!

9

[13/03, 9:09 PM] Ganjam Bhramaramba: ఎండమావులు

గంజాం భ్రమరాంబ

తిరుపతి


మనం చేరాల్సిన తీరం ఇదేనంటూ

మదిలో అలజడిని పుట్టిస్తాయి.


ఎడారిలో ఒయాసిస్ లాగా భ్రమింపజేస్తూ

తమ వెంట పరుగులు పెట్టిస్తాయి.


దాహం తీర్చడం కాదుకదా...

మనసంతా తీవ్రమైన తృష్ణని పెంచేస్తాయి.


ఎండమావులని సరిగ్గా అంచనా వేయకుంటే..

జీవితాన్ని ఎడారి కోయిలలా మార్చేస్తాయి.


ఎండమావులు త్వరగా ఆకర్షిస్తాయి.

అంత త్వరగానే కళ్ళు తెరిపిస్తాయి.

అప్పటికే జీవితం...

అందనంత దూరంలో ఉంటుంది.

అందుకే.. తస్మాత్ జాగ్రత్త...


గంజాం భ్రమరాంబ

తిరుపతి

9949932918

10

[13/03, 9:26 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితా గానం* 

*అంశం: ఎండమావులు!* 


అందని దానికై ఆశపడకు!


 నిరాశ నిరాసక్తతతో క్రుంగిపోకు!


 సంతృప్తి జీవనమే మెరుగు!


 అసంతృప్తి జీవనం వదలు!


 అదృష్టంతో నేస్తo చేయకు!


శ్రమఫలమే దక్కు నీకు!


 నీదైతే నీకు రాకమానదు!


 నీది కానిదానికై వెంపర్లాడకు!


 కలల ప్రపంచంలో జీవిస్తే,


 అదొక ఎండమావి అని మరువకు!


 అంతకంటే ముందుగా..,


 అదొక అడవి కాచిన వెన్నెలని భావించు!!


  నేల విడిచి సాము చేయొద్దు! 


వాస్తవ జీవనమే అందరికీ ముద్దు !


అందమైన కలలు కనాలి!


 అవి సాధించేందుకు కృషి చేయాలి !


శ్రమ జీవనమే సౌందర్యము!


 భ్రమ జీవనం అపహాస్యము!!


 పరాంకుశం రఘు నారాయణ 

     మహబూబాబాద్

11

[13/03, 9:30 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..ఎండమావులు

శీర్షిక..జీవిత పరమార్థం





అందని దానికోసం

ఆరాటపడడం మానవ నైజం

ఎంత పోరాటం చేసినా

ఎండమావుల వెంట పరుగుతీయడమేనని

క్షణభంగురమైన జీవనం కోసం

పోటీ పడుతూ బ్రతకడం

అత్యాశతో చేరువలోనున్న అవకాశాల్ని చేజార్చుకోవడం

దూరపుకొండలు నునుపులా

ఇంకా ఏదో ఉందని భ్రమిస్తూ

స్వార్థంతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ

సంపదపై మోజుతో 

సంతృప్తి లేకుండా జీవించడం

అన్నిటికీ మూలం

అంతులేని కోరికల సమాహారం

మృగ తృష్ణలో నీరు త్రాగడం లాంటిదే కదా

మంచి చెడులే చివరకు మిగిలేవి

ఓ మనిషి! అందుకే

ఉన్నదానితో ఉన్నతంగా జీవిస్తూ

పదుగురికి సాయం అందిస్తేనే

జీవిత పరమార్థం

ఆ దిశగా పయనించడమే ఉత్తమం.


Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...