నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ
*********
1.గొల్లపల్లి రఘు రామ శర్మ గారు
2.డా.బల్లూరి ఉమాదేవి గారు
3. ఆలూరి విల్సన్ గారు
4.డా.దీపక్ న్యాతి గారు
5.డా.ఆంజనేయులు గారు
6.గొల్లపల్లి రఘు రామ శర్మ గారు
7.అపరాజిత్ గారు
8.దేశపతి మోహన్ శర్మ గారు
9.కోరాడ నరసింహారావు గారు
10.డా.ఆంజనేయులు గారు
11.కొలచన విజయ భారతి గారు
12. డా.పాండాల మహేశ్వర్ గారు
13.వల్లాల విజయ లక్ష్మి గారు
14.సంధ్యా శర్మ గారు
15.మన్నె లలిత గారు
16.వలిపే సత్య నీలిమ గారు
17.నీలా రంగనాధం గారు
18.పరాంకశం రఘు నారాయణ గారు
19.సుధారాణి కృష్ణం రాజు గారు
20. అడ్మిన్ లలితా కృష్ణ గారు
21.మేడిశ్రీ గారు
22.ప్రమోద ముని మడుగు గారు
23. అపరాజిత్ గారు
24.ఇంద్రవత్ రాహుల్ గారు
25.డా.ఆంజనేయులు గారు
26.కందూరి సుజాతా రాణి గారు
27. జ్ఞాన ప్రసూనా శర్మ గారు
28.సునంద వురి మళ్ళ గారు
29.మర్రి జయశ్రీ గారు
30.కె.సి.నరసయ్య గారు
31.రాపోలు అరుణా స్వామి గారు
*********
ఆద్యంతరహితుడై యలరారు వానికి
యభిషేకమొనరించ నార్తి యేల?
దిక్కులన్ ధరియించు దేవదేవుడువాడు
వస్త్రములర్పించ వాంఛ యేల?
వాసనలంటక వరలు సాంబనికిని
గంధమ్ము నలదనాకాంక్ష యేల?
ఆకలియెరుగని యాశుతోషునకేల
పంచభక్ష్యమ్ములేర్పరచు నిచ్ఛ?
లోకాలు తిరుగాడు లోకేశు చుట్టి రా
నూటొక్కచుట్లని నుడువు టేల ?
జ్యోతి స్వరూపమైజోతలందెడు వాన్కి
దీపముల్ ధూపముల్ చూపనేల?
పరిపూర్ణ తత్వమై భాసిల్లునీశుని
ప్రస్తుతించగచాలు భావమొకటి
హృదయ పద్మమందు ముదముగా వెలిగెడి
యాత్మ లింగముపయినమితప్రీతి
భక్తి భావనమున ముక్తిని గోరుచు
పరమ శివుని కిడుడు ప్రణతులెపుడు
**********లలితాకృష్ణ
1
[11/03, 9:34 AM] +91 99891 49454: భక్తసులభుడుపరమేశ్వరుడు💐💐💐💐💐
సీ!!
నిరతమునిటలాక్షునియమాలసేవించ
భవములదొలగించుభద్రమూర్తి
మారేడుదళములమదనారిపూజింప
అక్షయధనమిచ్చుయక్షసఖుడు
సతముపంచాక్షరిసంతుష్టహృదయుడు
వ్యథలుదొలగించువామదేవ
అష్టసిద్దులనొసగెడిఅహిరాజభూషణ
ఘనతాపములబాపుగరళకంఠ
గీ!!
తననుశరణన్నవారినితప్పకుండ
కాచిబ్రోచెడిపరమాత్మకలుషహరుడు
వానినమ్మినవసుధలోప్రాణులన్ని
సకలశుభములుపొందునుసత్యమిదియె!!
ఆవె!!
ఒక్కకణముజలమునొకబిళ్వదళముతో
జనులుపూజసేయసంతసమున
ఆయువొందివారునారోగ్యవంతులై
సుఖముప్రాప్తిగలుగుశూలికృపను!!
💐💐💐💐💐గొల్లపల్లిరఘురామశర్మ🙏🏻🙏🏻🙏🏻🙏🏻
2
[11/03, 10:20 AM] Balloori Umadevi Poetess: శివరాత్రి శుభాకాంక్షలతో
శీర్షిక: ద్వాదశ జ్యోతిర్లింగాలు
రచనా ప్రక్రియ: పద్యములు
1.ఆ.వె: రామ నాథు డనగ రామేశ్వరము నందు
వెలసి భక్త జనుల విన్నపముల
నాల కించి తీర్చు చనవరతమ్మును
వరములొసగు చుండు వాసిగాను.
2.ఆ.వె:మల్లికార్జునుడన మానుగా శ్రీశైల
క్షేత్ర మందు నిలిచె జీవనుండు
పార్వతి కొలువయ్యె భ్రమరాంబికగ తాను
పూజలందుకొనుచు పుడమి యందు.
3.ఆ.వె:భువనగిరిని వెలసె భూతపతియు తాను
చంద్రభాగ చెంత చక్కగాను
త్రిపురుల వధియించి తీరికగా తాను
కొలువు దీరి నట్టి గుడియు నిదియె.
4ఆ.వె: వారణాసి లోన వాస ముండె హరుడు
భక్తజనుల బ్రోచు వాసి గాను
అన్నపూర్ణ యనగ నంబయు వెలసెనీ
పుణ్య క్షేత్ర మందు భూరి గాను.
5.ఆ.వె:శంకరుండు తాను సౌరాష్ట్ర మందున
సోమనాథు డనగ శుభము లొసగు
చక్కగా ప్రతిష్ట చంద్రుడే యొనరించె
ననుచు తెలుపు చుందు రార్యు లిలను.
6.ఆ.వె: క్షేత్రమైన యట్టి ఘృష్ణేశ్వరము నందు
క్షేత్ర నామ ముననె సేవ గొనుచు
కాపు కాచు చుండు కమ్మగా సతతము
భక్త వత్సలుడన వాసి గాంచె.
7.ఆ.వె: మంచు కొండలందు మందాకినీ చెంత
శంకరుండు వెలసె చల్ల గాను
కేలు మోడ్చి జనులు కేదార నాథుని
కొలవ వచ్చు చుంద్రు కూర్మి తోడ
8ఆ.వె:ద్వారకపురి చెంత దారుకా వనమున న
మూడు పొద్దు లందు ముచ్చటగను
నాగభూషణుండు నాగేశ్వరుడనంగ
వెలసి పూజలందు వేడ్కతోడ
9ఆ.వె: గౌతమీ తటమున కాకోల గ్రీవుడు
నర్చన గొను చుండు ననవరతము
తాత్రయంబకుడన తాపములను బాపి
కాపు కాచు చుండు కంతు హరుడు
10ఆ.వె: కాంతి పురము నందు కనుల పండువగాను
వైద్య నాథు డనగ వాసిగాను
మూడు నదుల చెంత ముక్కంటి వెలసి తా
పూజ లందు చుండు భువిని సతము.
11ఆ.వె: మామలేశ్వరమున మహ రుద్రదేవుడు
రెండు భాగములుగ రెండు పేర్ల
నొప్పు గాను తాను నోంకార నాథుడ
నంగ కొలువు దీరె నవని యందు.
12ఆ.వె: శివుని లింగ మొప్పె క్షిప్రానది దరిని
సాగరాది తీర్థ చయము తోడ
మధ్య దేశమందు మహకాళు డను పేర
పూజలందు కొనుచు పురహరుండు
ఖ్యాతు డయ్యె తాను కంతు హరుడు.
:డా బల్లూరి ఉమాదేవి
3
[11/03, 12:14 PM] Aluri Wilson Poet: మహా శివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా శుభాకాంక్షలతో....
రచన: డా.ఆలూరివిల్సన్
చరవాణి:9396610766
ఈ-మెయిల్: aluriwilson55@gmail.com
కవితా శీర్షిక :"శివ భక్తుల పుట్టినిల్లు చెరువు గట్టు"
చెరువు గట్టు పైన
శివుడు దర్శన మిచ్చును మూడు గుండ్ల పైన
కోర్కెలు దీర్చును
లింగాకారమై కొలువైన శివుడే శివుడు
పరశురాముని శివలింగ క్షేత్రమది
భార్గవరాముని పవిత్ర స్థలమది
మహిమాన్విత క్షేత్రమై విలసిల్లు
పార్వతీ జడల
రామ లింగేశ్వర స్వామి
నిలయమది
భక్తుల కోర్కెలు దీర్చు స్వామి వారి పుణ్య క్షేత్రమది
కార్తీక మాసాన
ఉపవాస జాగరణ మొక్కులతో
దాన ధర్మాల
కోనేరు స్నానాలు
పుణ్య ఫలాలు స్వీకరించు వేడుకల జాతర
చెరువుగట్టు
రాక్షస ప్రవేశము నడ్డగించు
పాలకుడాంజనేయుడు
కొలువై దర్శనమిచ్చు
పవిత్ర స్థలమది
సంప్రదాయాల లక్మీదేవి
అంశ తలసికి
మహా విష్ణురూపం అశ్వత్థామ వృక్షాల
కళ్యాణం భక్తుల ఆశలు తీర్చు పుణ్యప్రధం
గోవాక్పతి కొలనులో
స్వామి నిత్యాభిషేకం
జల నీటి ఆయురారోగ్యాలతో
భక్తుల పరవశం
ఇరుకు మార్గాన
లింగ దర్శనం
శివనామ స్మరణతో
భక్తి భావనల
ఓం శివ దర్శనం
సంతాన ప్రాప్తి నొంద
పార్వతీ మాత ఆలయమున భక్తుల నిత్య మొక్కులు
గట్టుకింద అమ్మవారు ఆరోగ్య ప్రాప్తి నందించు
శివ భక్తుల పూజలందుకొను శుభవేళ
పార్వతీ సమేత మల్లికాఖార్జున స్వామి కొలువై
దర్శన మిచ్చు
శివ భక్తుల పుట్టిినిల్లు
చెరువు గట్టు
4
[11/03, 12:37 PM] దీపక్ న్యాతి: *దివిటీలు 203*
అందని అనంతాల ఆశించకు నిత్యం
మానవత్వం నిండిన మనిషి సత్యం
జననమరణాలు సూత్ర మహత్యం
బూడిద శూన్యం శివుడి తత్వం
డా.దీపక్ న్యాతి
హైదరాబాద్
5
[11/03, 12:55 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: హర హర మహాదేవ శివ శివ మహాదేవ దయాసాగరా కరుణామయా మృత్యుంజయ శివ నామ సంకీర్తన సర్వపాపహరణం
లోకమున manavaliki శుభములు పూజించే దాతవు నీవే గంగాధర గౌరీపతి
nagabharanam చంద్రకళాధర
మార్కండేయ రక్షించిన మహాదేవ సర్వ లోకాన్ని కాపాడే దయామృత ముని నీవే కదా నీలకంధరా
మహాదేవ దయామృత sagara మహదేవా కరుణాసాగర
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
6
[11/03, 12:56 PM] +91 99891 49454: భక్తసులభుడుపరమేశ్వరుడు💐💐💐💐💐
సీ!!
నిరతమునిటలాక్షునియమాలసేవించ
భవములదొలగించుభద్రమూర్తి
మారేడుదళములమదనారిపూజింప
అక్షయధనమిచ్చునక్షసఖుడు
సతముపంచాక్షరిసంతుష్టహృదయుడు
వ్యథలనుదొలగించువామదేవ
అష్టసిద్ధులనిడునహిరాజభూషణా
ఘనతాపములబాపుగరళకంఠ
గీ!!
తననుశరణన్నవారినితప్పకుండ
కాచిబ్రోచెడిపరమాత్మకలుషహరుడు
వానినమ్మినవసుధలోప్రాణులన్ని
సకలశుభములుపొందునుసత్యమిదియె!!
ఆవె!!
ఒక్కకణముజలమునొకబిళ్వదళముతో
జనులుపూజసేయసంతసమున
ఆయువొందివారునారోగ్యవంతులై
సుఖముప్రాప్తిగలుగుశూలికృపను!!
💐💐💐💐💐గొల్లపల్లిరఘురామశర్మ🙏🏻🙏🏻🙏🏻
7🙏🏻
[11/03, 3:18 PM] Aparajith: శివ తత్వం
సృష్టి లయ స్థితి కారకుడా
రాముడు రావణుని వధియించిన
తదుపరి నిన్ను పూజించెనట!
లోక కళ్యాణాకి గరళం మింగితివట
అల్ప సంతోషి వట!
శివ లింగాన్ని మారేడు దళములతొ పూజిస్తే
భూత ప్రేత పిశాచాలన్ని పారిపోవునట
అర్ధనారీశ్వరా ముక్కంటి రూపంతొ
శివ పార్వతుల నర్తనం ఆహ్లాదం
శోభిళ్ళు జగమెల్ల
గంగను నెలవంకను శిరస్సున నాగును మెడలోన దాల్చిన నీవు
సృష్టి మూలం నుండి
అనాది భగవానునివి
మానవుని ఙ్ఞానాన్నిచ్చింది నీవే
సకల పాపహరణం నిను కొలిచిన
మనస్సు మకిలి తొలగు నిను కొలిచిన
శివ శివ శంభో శంకర!
ఆపరాజిత్
8
[11/03, 4:54 PM] Deshapathi Mohan: 🕉️మహాశివునికి మణిపూసల హారం🔱
*ఆ కైలాసాన శివుడు*
*పార్వతీసతి సమేతుడు*
*ప్రమధ గణాలతోకూడి*
*అగుపించు మహాదేవుడు* (1)
*తన శిరమున గంగనుంచి*
*అర మేను గౌరికి పంచి*
*ప్రణవ స్వరూపుడాయెను*
*జ్యోతిర్లింగములలోంచి* (2)
*నుదుటన విభూతిధారి*
*కరమున త్రిశూలధారి*
*నంది వాహన మెక్కిన*
*సర్వలోక సంచారి* (3)
*చంద్రుని శిరమున బెట్టి*
*వాసుకిని మెడకు చుట్టి*
*స్మశాన వాసియతడే*
*కపాలము చేతబట్టి* (4)
*చెంబెడు నీళ్ళు పోసినా*
*చిటికెడు ఊది పూసినా*
*తృప్తిపడి కరుణించును*
*శివుడే..అభిషేకమునా* (5)
*నమకం తొలి అభిషేకం*
*చమకం మలిఅభిషేకం*
*మహాశివరాత్రి నాడు*
*మహారుద్రాభిషేకం* (6)
*పాలు పెరుగు మధురములు*
*పంచదార ఆజ్యములు*
*పంచామృతములై కలిసి*
*శివునికి ప్రీతికరములు* (7)
*మూడు దళముల మారేడు*
*పూజలతోటి...మా రేడు*
*ముదముతో వరములిచ్చు*
*సాంబసదాశివుడు అతడు* (8)
*శివపూజకు నది జలాలు*
*పసుపు కుంకుమ గంధాలు*
*పత్రి పుష్ప ఫలములతో*
*శంభునికి నిత్యార్చనలు* (9)
*శవ భస్మవిలేపనాలు*
*ధూపదీప నివేదనలు*
*లింగోద్భవకాలమున*
*మహా శివరాత్రి పూజలు* (10)
*భక్తితో గజముఖుడు*
*శక్తితో షణ్ముఖుడు*
*నిత్యపూజలందుకొనెను*
*భవానీశంకరుడు* (11)
*సృష్టికి బ్రహ్మదేవుడు*
*స్థితికై నారాయణుడు*
*లయకారుడైన శివుడే*
*త్రిమూర్తుల స్వరూపుడు*
*అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు*
*పరమశివుని పాదపద్మాలకు భక్తితో*
✍️దేశపతి మోహన్ శర్మ టీచర్ మెదక్
9
[11/03, 5:20 PM] Korada: నేటి మినీకవితలు
***************
ఆద్యంతములు లేని నీ విశ్వ లింగా కృతిని గాంచి....
హరి-బ్రహ్మాదులే ఆశ్చర్య బోవు
వేళ.....,
ఆదేవతలు...మునులు...సకల
లోకములేకమై....హర హర మహా దేవ యనగ...
దిక్కులన్నియునీ నామ సంకీర్తనల మారుమ్రోగ...,
ఆ రాత్రి... శివ రాత్రియై...
ఈనాటికే గాదు.... యేనాటికిని
అభిషేక,పూజాధికములందుచు అలరగలదు.... హర... హర... మహాదేవ శంభో.... శంకరా... నీ కృప జూపూమయ్యా.....!!!
************************
...కోరాడ నరసింహా రావు!
[11/03, 7:55 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️
*మహాశివరాత్రి పర్వదినాన్ని*
పురస్కరించుకొని..
ఉదయం నుండి
కవితాభిషేకం చేసిన
కవివరులు...
ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు
మళ్ళీ పంపగలరు.
మహా శివరాత్రి పర్వదినానికి సంబంధించిన
కవితలతో ప్రత్యేక సంకలనం ఉంటుంది.
గమనించగలరు.
✳️✳️✳️✳️✳️✳️✳️
10
[11/03, 8:09 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: సకల జనులకు దిక్కు నీవే శివ
కరుణా సాగరా కారుణ్య వాస
మార్కండేయ నికి రక్షణ నీవే కదా నీ నామస్మరణ చేసినప్పుడు
సకల పాపహరణం జరిగెను
కైలాసనాధ గంగాధర మహాదేవ సర్వ
పాపాలను తొలగించ త్రినేత్ర ధారి
పాహిమాం పాహిమాం మహేశా
నీలకంఠ సకల పాపహరణం కైలాసనాధ కదలి రావయ్యా జన రక్షక పార్వతి నీ సతీ అయి శక్తి రూపిణి అయిన తల్లి శైలజ సదా నటరాజ మూర్తి
వందే జగద్గురు మ్ మహాదేవ శివోహం శివోహం
పార్వతీపతి పరమేశ్వర
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి
7702537453 లోకాలకు రక్షకుడవు నీవే కదా
11
[11/03, 8:19 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం
పేరు: కొలచన విజయ భారతి
ఊరు:హైదరాబాద్
అంశం: మహాశివరాత్రి
శీర్షిక:లోక కల్యాణం
తేదీ:11-3-2021
*********************
శివాయ పరమేశ్వరాయ
చంద్రశేఖరాయ నమోనమః
ఆదిమధ్యాంతములు లేని
లింగోద్భవ రూపుడై వెలిసావు
జీవజాల గతిని లయముచేయ
శివరూపుడవైనావు
ఆదిశక్తిని పరిణయమాడిన
అపురూప పర్వదినమీ రోజు
ఆభరణమవసరములేదు
నాగభూషణుడవు
జలాభిషేకముతో సంతృప్తి చెందుతావు
మొక్కుకున్న చాలు ఇక్కట్లు తొలగించే ముక్కంటివీవు
మారేడుదళముల పూజింప
మురిసే మారాజు నీవు
పృథ్వి,ఆకాశ, అగ్ని,వాయు
జలతత్వముల ఒదిగినావు
ద్వాదశ జ్యోతిర్లింగాలలో
దర్శనమిచ్చి జన్మ జన్మల
పాపపుణ్యాల తోలగింపచేస్తున్నావు
అర్థనారీశ్వర రూపుడవై
ఆలుమగల పరమార్థము ఎరుకపరచిన జ్యోతి స్వరూపుడవు
వాక్కు అర్థాలకు ప్రతిరూపమైన
పార్వతీ పరమేశ్వరుల
కల్యాణం లోకకల్యాణం
ఈ మహాశివరాత్రి పర్వదినం
🙏🙏🙏🙏🙏
12
[11/03, 8:28 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** మహాశివరాత్రి ***
✍️డా.పాండాల
కాలచక్ర లయత్వంలో
ప్రతీ నెల చతుర్దశి మాస శివరాత్రి
మాఘమాస బహుళపక్ష
చతుర్దశి మహా శివరాత్రి!!
అహంకార మధం చేత
విష్ణు బ్రహ్మలకు యుద్ధం
ఆదిమూలమవధిలేని
ఆదిభిక్షువు ఈశ్వరుడు
ఆద్యంత రహితుడు
అగ్ని స్తంభమునందు
లింగమయ్యగా జనించి
శివుని జాడ తెలుసుకొన
హంసనెక్కిబ్రహ్మ వెదికె
వరాహమెక్కి హరి వెతికే
కానరాని శివ మహిమలు
హరి బ్రహ్మలకే తెలియదు
మానవులకు ఏంతెలుసు?
మహిమాన్విత శోభితం
అరుణాచల క్షేత్రం
పవిత్ర అగ్ని లింగం!
బ్రహ్మతో అసత్య సాక్షి పుష్పం
పూజార్హత కోల్పోయెను
బ్రహ్మ పంచముఖాన్ని
భైరవుడు ఖడ్గముతో ఖండించ
చతుర్ముఖ బ్రహ్మ పూజార్హత కోల్పోయే!!
లింగోద్భవం రోజే మహాశివరాత్రి
శివోహం పర్వదినం
శివనామ స్మరణం సర్వపాప హరణం
ఉపవాస దీక్షనెంచి శివ సన్నిధి
జాగరణం..మానసికోత్తేజం సకలశుభం శివమయం!!పంచాక్షరీ మంత్రం
మారేడు దళపూజలు
పంచామృత అభిషేకం
మంగళమయ మహేశ్వరుడు
శివతాండవమూర్తి లాస్య
వందేపార్వతీ పతిం
ద్వాదశ జ్యోతిర్లింగ నమస్తే నమస్తే!!
✍️🕉️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
13
[11/03, 8:57 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *శివరాత్రి మహత్యం*
*********. **********
భక్తవత్సలుడికి ప్రియమైన రోజు
బ్రహ్మవిష్ణులే ఆద్యంతాలు కనుగొనలేని
*మహాలింగోధ్బవo* జరిగిన మహత్తర దినం
ఉపవాసంతో భగవంతుని సమీపాన చేరి
భక్తకోటి భజించే మహా పుణ్యదినం
మానవ జన్మను పావనం
గావించే ప్రత్యేక పర్వదినం *శివరాత్రి*
గరళాన్ని తన కంఠాన దాచి..
దేవతలకు అమృతాన్ని పంచి
వారల అమరులుగా మలచిన
త్యాగశీలి బోళాశంకరుని గురించి
జీవితాన ఎంత తలచిన..
మనసున అంత భక్తి పరవశం
సగ మేనున జగద0బను నిలిపి
నిండయిన కుటుంబంతో
మెoడైన రూపుతో కొండపై కొలువై
ఉత్త జలాభిషేకానికే మురిసే
మెత్తని హృదయుడైన బంగారు కొండను
త్రిగుణాత్ముడైన జగాల తండ్రి మహా దేవుడిని
నిష్కల్మష మనస్సుతో సేవించి తరిద్దాం
*మహా శివరాత్రి మహిమను* తలచి
మన జన్మను పావనం గావించుకుందాం
:వల్లాల విజయలక్ష్మి
ఆలేరు
14
[11/03, 9:01 PM] Sandya Sharma Poetess: కవితాగానం
మహా శివరాత్రి శుభాకాంక్షలతో
అంశం: శివయ్య
**************
పారేటి గంగలో
మూడు మునకలే
మూడు కళ్ళ మౌని
మురిసిపోతాడు!
చిటికెడు నీళ్ళంతే
చిత్రాలు చూపిస్తడు..
చిటారు కొమ్మన
చిగురాకవుతడు.. !
ఆకు అలములు
అన్నీ తనవే...
అర్థనారీశ్వర తత్వం
అమలు పరచే..!
అరచేత అన్నపూర్ణమ్మ.....
నెలవు..
అన్ని లోకాలకు
అన్నదాతగా వెలసె!
గరళమాయ
తన కంఠం..
సరళమే సాత్వికుని
అభయహస్తం..!
బుసలు కొడుతూ
బూడిదలో ..
భవబంధుడయ్యె
భక్తుల హృదిలో.. !
✍️వై.కె.సంధ్యశర్మ
చిత్తూరు
15
[11/03, 9:02 PM] మన్నె లలిత గారు కవయిత్రి: కవితాగానం
తేదీ :11/ 3 /21
అంశము : మహాశివరాత్రి
శీర్షిక: పంచాక్షరీ మంత్రం
పేరు: మన్నె పిన్నక లలిత
హైదరాబాద్
మాఘమాస బహుళ చతుర్దశి రోజు
బోళా శంకరా! పార్వతీపతి అయిన రోజు
శంకరా! అర్ధనారీశ్వరా!! జటాజూట ధారీ!! నీలకంఠా!! బోళాశంకరుడా!!
నాగభూషణధారీ !!పులి వస్త్రధారిీ !!
నటరాజా! శివ శివ శంకరా!!
అలనాడు గజమును రక్షించి
మార్కండేయుని భక్తికి మెచ్చి
భక్త కన్నప్పకు కళ్ళు ఇచ్చి
సాలెపురుగు ,పాము ,ఏనుగులకు
ముక్తినిచ్చి శ్రీకాళహస్తి నందు వెలసి
పంచారామాలయములందు వెలసి
ఘంటసాలయందు పార్వతితో పూజలందుకుంటూ
కాళేశ్వరములో ఏక పానవట్టంపై రెండు లింగాలుగా అభిషేకించుకుంటూ
రావణునిడకి ఆత్మలింగాన్ని ఇచ్చిన
బోళా శంకరుడివై
నీ ఆడంబరము లేని రూపం
నీ సర్వ భూత దయ
మారేడు దళములతో ప్రీతీ చెందుతూ
ఇతరులకు ప్రీతిపాత్రమైన వాడా నటరాజా!!
ఉపవాస జాగరణలతో మహాశివరాత్రి రోజు
ఓం నమ శివాయ మంత్రంతో
సర్వ శుభాలను ఇచ్చే శివా! వందనం !అభివందనం!!!
16
[11/03, 9:26 PM] కె. సత్యనీలిమ
వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: కవితాగానం
శీర్షిక : అర్ధనారీశ్వరుడు
కైలాసశిఖరాన కార్తీకమాసాన
కొలువైన దేవదేవుడు
అడిగిన వరములు ఇచ్చి
ఆశ్రయం కలిగించే బోళాశంకరుడు
లలాటమందు విభూతిరేఖలతో
ముచ్చటగా ముసిముసిగా
నవ్వుతూ మురిపించే ముక్కంటి
ఆడవారిని చులకన చేయరాదని
తన శరీరంలో సగభాగం సతికిచ్చి
అర్ధనారీశ్వరుడై ఆదిదంపతులుగా
పూజలందుకొనుచున్న పార్వతీపతి
అభిషేక ప్రియుడై లోకాన్ని
రక్షింప గరళాన్ని గళమున
నిలుపుకున్న గౌరీనాథుడు
లింగరూపమున దర్శనమిచ్చి
భక్తులను కాపాడే లయకారుడు
వలిపే సత్యనీలిమ
వనపర్తి
9502156813
17
[11/03, 9:26 PM] Komandoori Neela Poet: కవితా గానం
అంశం: *శివలీల*
తేది:11/03/2021
పద్య కవిత్వం
ఆ.వె1:గంగ తలను నుండ గౌరీశు చిందేయు
బూది పూసుకొనును పూర్తి గాను
రుద్ర భూమి నందు రుద్రుడై చరియించు
శివుని కొలువ మనకు చింత రాదు!
ఆ.వె2:భూత నాథుడనియు బూదిలో తిరుగుచు
ప్రేత యాత్మలన్న ప్రీతియనియు
గంగ నెత్తినుండ గౌరితో కులికేను
కొలువ శివుని మనము కూర్మి గూర్చు!
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
చరవాణి సంఖ్య:8897155600.
18
[11/03, 9:55 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*అంశం*శివ శివ శంకరా*
11-03-2021(గురువారం)
కన్నప్పను కాచిన శంకరుడు
భక్తితో కొలిచిన వెంటనే గాచే
తాండవమాడే శివుడు
నంది వాహనుడు గా నాగుపాము ను మెడలో ధరించి హలా హలమును
కంఠమునందు ధరించి తలపైన
గంగతోను పార్వతీ పతిగా గౌరితోను ఆది దంపతులు గా
భార్యాభర్తలకు ఆదర్శంగా
పార్వతీ పరమేశ్వరులు
ఎంతో అన్యోన్య దంపతులు గా
భక్తులకు వరాలను ఇచ్చే శివ శంకరుడు మారేడు దళములతో పూజించి న కోరిక తీర్చే భోళాశంకరుడు
బాధలతో భక్తులు అతను ఏమివ్వగలడు బూడిద తప్ప
అలాంటి శివుడిని ఏమి కోరినా
వృథా అని శంకరుని అసహనం తో తులనాడిన వారిని పరీక్షించి ఏమీ చేయలేని పరిస్థితి కలిగించి అసహనంతో
సాధించలేనిది భక్తితో మాత్రమే సాధ్యం అని అహంకారాన్ని
అణచివేసి పశ్నత్తపంతో కుమిలి పోతున్న భక్తుల కొరకు
కైలాసం వదిలి వచ్చి వరములను ఇచ్చే శంకరుడు
ఓం నమః శివాయ అనగానే
చేసిన పాపాలు తొలగిపోయి
మోక్షం ప్రసాదించేది కరుణా సముద్రుడు శివయ్య🙏🙏👍
19
[11/03, 9:59 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితాగానం*
*శీర్షిక:శివ మహత్యమ్*
********************
*శుభ సౌమ్యాలకు ప్రతిరూపo శివోహమ్*!
*ప్రళయ రుద్రుని స్తోత్ర మహత్యం శివోహమ్!*
*భక్త జనాశ్రయ శాక్తేయగళం శివోహమ్!*
*పన్నగ భూషణం శశిధర ప్రియం శివోహమ్!*
*సత్వ ,తమో, రజో, గుణ సమ్మోహనం శివోహమ్*!
*అనంత పరిశుద్ధ శివారాధనo శివోహమ్!*
*శివలింగారాధనo మహాదర్శనయోగం శివోహమ్!*
*శివ సహస్రనామ స్తోత్ర పారాయణం శివోహమ్!*
*శివలింగ బిల్వాష్టక స్తోత్రం శివోహమ్!*
*పవిత్ర భస్మo శక్తిప్రసరణ వాహకం శివోహమ్!*
*గుణ, రూప, రస, గంధ స్పర్శాత్మకo శివోహమ్!*
*శబ్ద ,బ్రహ్మ ,స్వరూప ఢమరుకo శివోహమ్!*
*స్కంధ ,భవిష్యోత్తర,లింగ పురాణాల సమాహారo శివోహమ్!*
*సర్వ పాప ప్రశమన సాదృశ్యo శివోహమ్!*
*నిరాకార పరబ్రహ్మ సాకారo శివోహమ్!*
*రుద్రాక్ష ,విభూతి ,కుంకుమ, చందనాలంకరణo శివోహమ్*
*శివారాధన జాగరణం మంగళ దాయకం శివోహమ్*
*నిరాకార నిర్మల నిరంజక స్వయం జ్యోతిర్లింగం శివోహమ్*
*లింగమోoకార మంత్రపుష్పరాజం శివోహమ్*
*ఓo నమో శివాయ నమః*
*అష్టాక్షరీ మహామంత్ర జపం శివోహమ్*
పరాంకుశం రఘు నారాయణ
గ్రామం:తొర్రూరు
జిల్లా:మహబూబాబాద్ చరవాణి సంఖ్య: 9949749987
*ఈ పై పద్యాలు ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*
20
[12/03, 7:54 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️✳
*మహాశివరాత్రి పర్వదినాన్ని*
పురస్కరించుకొని..
*మనకవితగానం ప్రత్యేక కవితలకు ఆహ్వానం*
పలికిన విషయం సభ్యులకు తెలిసిందే కదా....
కవితలుపంపడానికి
ఈరోజు కూడా అవకాశం ఉంది.
రాత్రి
ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు పంపగలరు.
మనకవితా గానం కోసమే రాసినవి హామీ పత్రం తో
పంపగలరు.
*మహా శివరాత్రి* *పర్వదినానికి* *సంబంధించిన*
*కవితలతో ప్రత్యేక* *సంకలనం ఉంటుంది*.
*గమనించగలరు.*
✳️✳️✳️✳️✳️✳️✳️
20
[12/03, 8:15 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*
పేరు : డా.దీపక్ న్యాతి
తేది : 12-03-2021
అంశం : శివరాత్రి
శీర్షిక : నిత్యార్చన
విశ్వ కళ్యాణ చిహ్నం లింగం
జగతి జాగృతి రూపం లింగం
లోకాన జీవ సూత్రం లింగం
విశ్వకర్త ప్రతిరూపం లింగం
విశ్వేశ్వరుడి జ్ఞానబోధ లింగం
సృష్టి రహస్యాల సూచించే లింగం
లోకజ్ఞానాన్ని నినదించు లింగం
రూపాల చెక్కు శిల్పి రూపం లింగం
తరతరాల ఆంతర్యాన్ని బోధించు లింగం
జాతుల సంగమ ప్రతిబింబం లింగం
ప్రేమ పాశాల కలయిక సూచి లింగం
సుఖ సంతోషాల శిల్పం లింగం
మమతా అభిషేకాలు ప్రియమైన లింగం
నిజాకృతి సత్యం ఎరిగిన లింగం
శుభాలు పొంద శోభిల్లు లింగం
రేపటి భవిత మార్గదర్శి లింగం
చిత్రీకరించిన చిత్తశుద్ధి లింగం
మహిన మనిషి మనుగడకాధారం లింగం
అంధకారాన వెలుగు చిమ్ము లింగం
నిత్య పూజలందుకొను లింగం
డా.దీపక్ న్యాతి
హైదరాబాద్
21
[12/03, 8:39 PM] Shiva Kumar Medisree: .... మట్టి పరిమళం...
జాగ్రత్త సుమీ..
నీ పాట ఎక్కడ
పరమశమౌతుందో...
అక్కడే
మేధస్సును తొడుక్కున్న
నక్కలుంటాయి...
నీ పాటకు
నీ ఆటకు
తలలూపుతుంటాయి...
అంతర్గతంగా
అవి నీలోని సాహిత్యాన్ని
ఎలా సంగ్రహించాలని
ఆలోచిస్తుంటాయి...
లేడికి పరుగులు
కుందేళ్ళకు ఉరుకులు
నేనే నేర్పించానంటారు..
పిల్ల బాటకు
కొంచెం నిడివి పెంచి
రహదారి నేనే వేశానని చెప్పుకుంటారు..
నలుగురిలో
నానిన పదానికి
నేనే పురుడు పోశానంటారు..
ఉన్న తాడుకు
నాలుగు పోగుల్ని కలిపి
తాడంతా తానే పేనినట్టూ..
అంటు గట్టిన కొమ్మ..
తానే చెట్టును బతికించిందని
చెప్పినట్లూ...
పలుకుబడి
పది మందిలో పలుచన కావొద్దు..
ఉన్నత స్థితి నుండి
ఊడలు పట్టుకుని కిందకి జారొద్దు..
తప్పును సమర్థించుకుని
నీ భుజాలు నీవే కొట్టుకోవద్దు..
సొత్తు అందరిది అయినప్పుడు
వీలునామాలో
ఒకరి పేరే ఎట్లా అచ్చైతది..
ఎండిన గొంతులను తడి చేస్తూనే
వెలక్కాయలా అడ్డు పడతారు..
పరాయి బిడ్డను ఎత్తుకుని
నా బిడ్డ అంటావెందుకు
చిలక పలుకులుకు
వేరే జ్యోతిష్యాలెందుకు..
.........మేడిశ్రీ
యాదాద్రి
12-3-2021
22
[12/03, 8:42 PM] Pramoda Munimadugu Poetess: అంశం: శివరాత్రి
ప్రమోద మునిమడుగు
12/03/2021
సాంబశివా!
శివా..... నిర్వికార రూపుడవైన నిన్ను...ఎలా కనుగొనను?
దేవా.....మనసంతా నిండిపోయిన నిన్ను ఎలా...చూడగలను
స్వామీ....నిన్ను ఏవిధంగా ప్రస్తుతించ గలను..
మనసనే మంత్ర పుష్పాన్ని..
ఆర్తితో సమర్పించడం తప్ప....
నేను నిన్ను ఎలా అర్చించగలను?.
కోరినంతనే వరాల నొసగే తండ్రీ....
నిన్ను ఏ వరం కోరగలను?
నీ పాద సేవ భాగ్యం కంటే మెండైన వరం ఈ జగత్తులో కానరాదే
కామక్రోధ మదమాత్సర్యాలు పటాపంచలై న ఈ వేళ.....
ప్రపంచంలో ప్రతి అణువణువూ..నువ్వే అని తెలిసింది.
ప్రతి జీవిలో నీ అస్తిత్వం ....కనులకు కనపడింది
నీ నామ గానములో నన్ను నేను మర్చిపోయాను
నువ్వే నేననుకున్న నా మది విశ్వాంత రాళ్ళా ల్లో ఆనంద తాండవమే చేస్తుంది...అహం బ్రహ్మ తత్వమసి అనుకుంటూ....
23
[12/03, 8:44 PM] Aparajith: చిత్రకవిత
సృష్టి స్థితి లయల్లో శీవోహం
ఢమరుక ద్వనుల్లో శివరూపం,,,,ఆత్మ,,,,,
అండ పిండ బ్రహ్మాండరూపం శివలింగం
కైలాసంలో శివపార్వతుల తాండవం
సకల ప్రాణికోటి ఆనందంలో మునకలేయును!
భూత ప్రేత పిశాచాల హరాణం శివ నామ స్మరణం
భూమండలంలో అర్ధనారీశ్వరీ తత్వం
స్త్రీ పురుషులిరువురు సగం సగం!
సమస్త బ్రహ్మాండం బూడిద
నుండి ఉద్భవించెను
చివరకి బూడిదలోకలియును!
సకల ఙ్ఞానాలకు నిలయం ఙ్ఞాన నేత్రం
దుష్ట దుర్మార్గం పెచ్చరిల్లిన భస్మం చేయును ఆ నేత్రం
ఆది మధ్యాంతరుడు కైలాసగిరి వాసుడు
ఈ త్రిలింగదేశంలోశక్తి పీఠాల్లో ఒకటి శ్రీశైలంలో వెలిసెను
బ్రహ్మ మురారి కొలిచిన శివలింగం
అనాది శివోహంలో,,,,,,ఓంకారం,,,,,,,
సృష్టికి మూలం తిమిరంలో,,,,,,
జ్యోతిర్లింగం
సాగర మధనంలో గరళం మింగి కంఠం లో నిలుపుకుని
సమస్త సృష్టిని కాపాడెను శివ శివ మూర్తి
శివలింగం ముందు జ్యోతిని వెలిగించి ప్రణమిల్లిన
సమస్త పాపాలను హరించి ముక్తినిచ్చు భోళాశంకరుడు!
ఆకాశగంగను,నెలవంకను తలలో ఇముడ్చుకుని
నాగుపాముని మెడలో దాల్చి బూడిద ఒళ్లంతా రుద్దుకున్న ఆదిభిక్షువు
ఆదిశంకరాచార్యులకు శివతత్వం ఆత్మలో లీనమయ్యెను
సృష్టికి మూలం శివలింగం,,,,,,,,జ్యోతి ర్లింగం,,,,,,,,,
భూమండలంలోఅశాంతి ఆక్రందనలు పైశాచికత్వం పెచ్చరిల్లినపుడు
ప్రళయ రుద్రుడు మూడో కన్ను తెరచినంతనే
భూ సముద్రాలు అల్లకల్లోలం,,,,,,,ప్రళయం,,,,,!!
అపుడు సత్యవంతులే మిగులుతారు!!?
ఆపరాజిత్
24
[12/03, 8:58 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఇప్పుడు అక్షరాలతో ఒక శిఖరం సాగిపోతుంది ఆకాంక్షలతో వినూత్నంగా పదచిత్రాలు కుమ్మరిస్తుంది
అక్షరం కొత్తదనాన్ని పులుముకుంది
జీవన విలువలతో తాత్వికతను ఆవిష్కరిస్తుంది అది శంకరుని యొక్క కటాక్ష మేమూ
జీవితం పడిన లేచిన నృత్యం చేసిన అంతా ఆదిశంకరుని యొక్క ఆకాంక్షలు ఏమో జటాజూట దరి
భంగిమల్లో పలికిన మధుర గీతాలు ఏమో అది లాస్య మా
తాండవ మా ఆ అడుగుల నిత్యం చూస్తే ఆహా ఆనంద తాండవం అనిపిస్తున్నది
మానవాళికి నవత్ వాన్ని
శోభను చేకూరుస్తూ ఉన్న ఈ వేళ ఎందుకో మధురాతి మధురమైన రాగ భావాలు ఇస్తున్న ఆ కైలాస నాధుని యొక్క కటాక్షము
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
25
[12/03, 9:04 PM] Indravat Rahul Poet Ks 11: *"కవిత గానం"*
*꧁༺༒༻꧂*
*అంశం :* శివరాత్రి
*తేది :* 12/03/2021
*శీర్షిక :* శివ లీలా
🕉️ *"శివ లీలా*🕉️
సృష్టికి మూలం...
సృష్టికి కర్త, క్రియ, కర్మ..
అన్ని నీవేగా శివయ్య
పంచ గంగా అభిషేకంతో
పాలు, నెయ్యితో
కావాలి నీకు అభిషేకం
మారేడు దళంతో నీ పద్మ
పూజ చేయును శివ
దళమైన, పుష్పం అయినా
భక్తితో నీకు సమర్పిస్తే
నా పూజ స్వీకరిస్తావ్ కదా రుద్రా
శంఖంతో నిన్ను నిద్రలేపి
రుద్రక్షాను నీ మేడలో వేస్తాను భళా
శివ తాండమే చేసి నిన్ను
మెప్పిస్తాను శంకర
మధురమైన నీ భక్తిలో
నేను దాసుడను శంకర...
*హామీ పత్రం :* ఈ కవిత నా స్వీయరచన..✍️
*ఇంద్రావత్ రాహుల్*
కొత్తపేట్
నిజామాబాద్
9848054079...
26
[12/03, 9:04 PM] కందూరి సుజాత Poetess: శీర్షిక....🌷 శివరాత్రి 🌷
............. ........... .....
మహా శివరాత్రి
కైలాస ఈశునికి కమణీయ శుభదినము.
ముక్కంటి కందించు ముడుపు మూటల్లొ ఉపవాస నోములు.
జగదీషునికొసగు
జన్మ జాగార హారములు. శివనామస్మరణతో
శివరాత్రి పొద్దు భక్తితోవను దిద్దు.
జటాజూటమున జలసిరిని దాచి
ప్రచంఢ శక్తి కిరణం త్రినేత్రమును దాల్చి..
మణిమయ ఫన్నాగాభరణముల
విభూతి దేహమున...
త్రిశూల అస్త్రమున
పులిచర్మ వస్త్రమున...
ఆదిశక్తి తోడ అర్ధనారీశ్వరుడు
నందీష వాహనమున నెలవంక సిగతో కొలువున్న ఢమరుకా రుధ్రుడు.
క్రోధ కాలభైరవుడు
భక్తుల బ్రోచు బోలా శంకరుడు.
తపోసిద్దుల విడిచి కన్నప్పను వలచి
దారి మార్చి ధరి చేర్చుకొని ....
పరీక్షలచే కటాక్షించేె స్వామి .
అనునిత్య పూజారి భక్తి బైరాగిగ మలిచిన....
అఖిలాండేశ్వరుని ఆధ్యాత్మిక చరితం శివరాత్రికిది మూలాధారం.
మహిన మహేశ్వరుని మహిమ రూపాలు స్వయంభు ద్వాదశ జ్యోతిర్లింగములు .
మనసు మనోహర పరుచు
భ్రమరాంబిక మల్లికార్జున శ్రీశైలమందిరం.
పాపనాషణీ ఉరవడుల పాతాళగంగ స్వామి పాదాల చెంత.
శివనామ తపమున తరలు మృత్యువు తాకకుండా.
భక్తి కడలిన ముంచి మది చైతన్య
పరుచు శివ మాలధారణా.
కర్పూర దీపాలు రమణీయ కీర్తనలు
గరళఖంఠునీ ఘనమైన వేడుకలు.
మనసు మాలగ వేసి కొలిచినాను స్వామి
ముక్తి నొసగు ఈ జన్మకు మూలపురుషా.
"శరభ శరభ శంభో శంకర
హర హర మహదేవా కైలాసవాసా. "
కందూరి సుజాతారాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్
9392162822🌷
27.
*కవితాగానం*
పేరు: జ్ఞానప్రసూనాశర్మ
తేదీ:12-03-2021
అంశం:: శివరాత్రి
శీర్షిక:: శివకళ్యాణం
****************
సీసమాలిక.
**********
కమనీయ మైనట్టి ఘనమాఘ మాసాన
పార్వతీమాతతో పరమశివుడు
కోరితాను వెలిసి కోటిలింగేశుడై
పూజలందుకొనును పుష్కళముగ
క్షీరసాగరమందు గరళముద్భవ మంద
కంఠానదాచిన కాలకంఠి
శివరాత్రిపర్వపు సేవలందిశివుడు
అభిశేకముల తోడనలరుచుండు
గౌరిని గంగను కాంక్షతోడవలిచి
పెండ్లిపీటలనెక్కె పేర్మితోడ
నిత్యవరుడుగాను నిరతము నిటలాక్షు
భస్మ ధారణచేత భవుడువెలిగె
సతులిద్దరినడుమ శంభుడు గూర్చుండ
కళ్యాణముజరుగు ఘనముగాను
లోక కళ్యాణంబు లోకులువీక్షించ
జన్మధన్యతనొందె జగతియంత
ఆ.వె
*****
పసుపు కుంకుమిచ్చి పడతుల గాచుచూ
జగతినేలుచుండు జనని గౌరి
ఆర్థజనుల పాలి యభయప్రదాతయై
శాంతిసుఖము లిచ్చు సాంబశివుడు
*************************
28
[12/03, 9:20 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*
తేదీ:12-03-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: మహా శివరాత్రి
శీర్షిక:
********************
ఆది మధ్యాంత రహితుడు
అందరి హృదయాలలో కొలువైన దేవుడు
ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఊపిరిలో
ఊయలూగే ప్రాణం శివుడు!
చెంబెడు గంగనీళ్ళ స్నానానికి మురిసే అభిషేక ప్రియుడు!
మారేడు నేరేడు దళాల పత్రికే మురిసే మారేడు వాడు!
ఉపవాసం జాగరణకు తృప్తి చెంది
కొండంత వరాలనిచ్చే జంగమ దేవర వాడు!
పుట్టిన రోజునే తల్లి పార్వతిని
పరిణయమాడి
అర్థనారీశ్వర తత్వాన్ని తెలిపిన ఆదిదేవుడు!
మనలోని అహంకారాలు అత్యాశల భిక్షాన్ని స్వీకరించి
పుణీతులను చేసే మహేశుడు!
అష్టాదశ జ్యోతిర్లింగాల రూపమెత్తి
మానవాళిని కాపాడే ఈశుని
ఓంకార నాదం
ఎదలో కలిగించు ఆధ్యాత్మిక చింతనం!
ముక్కంటి రూపంలో ముల్లోకాలను నడిపించే కైలాస గిరి వాసుడా
కరుణించి కాపాడు మహా రుద్రుడా!
29
[12/03, 9:23 PM] KC Narsaiah KS 26: కవితా గానం
తేది:12-3-2021
అంశం: శివరాత్రి
పేరు: కెసి నరసయ్య
శీర్షిక: అర్ధనారీశ్వరం
ఆభరణాలే సర్పాలు
సర్వ ప్రాణులకు అభయం
తత్వమెరిగిన తత్వం
లోక కళ్యాణంలో శివ తత్వం
స్మశానంలో నివాసం
కైలాసం నివాసంలో లోక విలాసం
అర్ధాంగి పరమార్థం
అర్ధనారీశ్వర పరమార్థ తత్వం
నిరాకార తత్వం
విశ్వంలో శివలింగం సర్వ వ్యాప్తం
అఖిలాండ బ్రహ్మాండం
అనంత కోటి శివతాండవ స్వరూపం
ముల్లోకాల త్రినేత్రం
దేవాది దేవతల దైవస్వరూపం
క్షీర సాగర లో అమృతం విషం
శివుడి కంఠంలో గరళం భద్రం
విశ్వ శాంతి మంగళం
శాంతంలో ఏకాంతం పార్వతీ సమేతం
30
[12/03, 9:25 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..మహాశివరాత్రి
శీర్షిక...అభిషేకప్రియుడా
ఓం నమః శివాయ అంటూ
జపించే పంచాక్షరీ మంత్రానికి పొంగిపోయే పరమ శివా
కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరా
లోకకల్యాణం కోసమే
గరళం కంఠంలో దాచి
అమృతాన్ని అమరులకిచ్చిన త్యాగమయా
అభిషేక ప్రియుడా
ఆది అంతాలు లేని నిరాకారా
లయకారకా!
పేద సాధలపైనే పేర్మి నీకు
హర హర మహాదేవా
శంభో శంకరా అని స్మరిస్తే చాలు
కైలాసాన నీ నాట్యవిన్యాసాలు
ఆదిశక్తి పరిణయ మాడి
గంగను తలపై మోసిన నీ లీలలు వర్ణించుట సాధ్యమా
అర్దనారీశ్వర తత్వాన్ని లోకానికి చాటిన ఆదర్శ స్వరూప
మహాలింగోద్భవంగా అవతరించిన మహత్తరమైన దినమున0దు
భక్తుల కోటి చేత బహు పూజలందుకొని
ఉపవాస,జాగరణలతో
మానవాళికి ముక్తిని ప్రసాదించే మహేశ్వరా
నాడు లోక కల్యాణం కోసం త్యాగం నిజమైతే
లోకానికి కమ్మిన కరోనా పీడను బాపుమా
స్వార్ధపు పొరలు కమ్మిన లోకానికి కనువిప్పు కలిగించుమా
కరుణించుమా
31
శీర్షిక: *శివోహం*
వంకర కన్నులవాడు భ
యంకరముగ బాము తిరుగు నాతని మెడలోన్
వంకను సిగపై గలిగియు
తంకములను బాపు శివుని దలతును మదిలో
బోళా శంకరుడీవట
నీలగళేశ్వరుడ వీవు నిఖిల జగతిలో
మాలోపములను బాపిన
నీ లీలలు నిజమటంచు నిత్యము దలతున్
హే శంకరా! శుభంకర!
నీ శుభ చరణాలు నమ్మి నిలిచితిమయ్యా
శ్రీశా! మహేశ! పాప వి
నాశా! మము బ్రోవుమయ్య నయమొప్పంగన్
గిరిపుత్రిక కోరికతో
కరుణను కురిపించి వలచి కల్యాణముకై
గిరినే దిగి వచ్చితివ త్రి
పురారి ! యంబికనుగూడి పుడమి నిలువుమా!
✍రాపోలు అరుణాస్వామి, సిరిపురం
[13/03, 8:36 AM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితాగానం*
*శీర్షిక:శివ మహత్యమ్*
********************
*శుభ సౌమ్యాలకు ప్రతిరూపo శివోహమ్*!
*ప్రళయ రుద్రుని స్తోత్ర మహత్యం శివోహమ్!*
*భక్త జనాశ్రయ శాక్తేయగళం శివోహమ్!*
*పన్నగ భూషణం శశిధర ప్రియం శివోహమ్!*
*సత్వ ,తమో, రజో, గుణ సమ్మోహనం శివోహమ్*!
*అనంత పరిశుద్ధ శివారాధనo శివోహమ్!*
*శివలింగారాధనo మహాదర్శనయోగం శివోహమ్!*
*శివ సహస్రనామ స్తోత్ర పారాయణం శివోహమ్!*
*శివలింగ బిల్వాష్టక స్తోత్రం శివోహమ్!*
*పవిత్ర భస్మo శక్తిప్రసరణ వాహకం శివోహమ్!*
*గుణ, రూప, రస, గంధ స్పర్శాత్మకo శివోహమ్!*
*శబ్ద ,బ్రహ్మ ,స్వరూప ఢమరుకo శివోహమ్!*
*స్కంధ ,భవిష్యోత్తర,లింగ పురాణాల సమాహారo శివోహమ్!*
*సర్వ పాప ప్రశమన సాదృశ్యo శివోహమ్!*
*నిరాకార పరబ్రహ్మ సాకారo శివోహమ్!*
*రుద్రాక్ష ,విభూతి ,కుంకుమ, చందనాలంకరణo శివోహమ్*
*శివారాధన జాగరణం మంగళ దాయకం శివోహమ్*
*నిరాకార నిర్మల నిరంజక స్వయం జ్యోతిర్లింగం శివోహమ్*
*లింగమోoకార మంత్రపుష్పరాజం శివోహమ్*
*ఓo నమో శివాయ నమః*
*అష్టాక్షరీ మహామంత్ర జపం శివోహమ్*
పరాంకుశం రఘు నారాయణ
గ్రామం:తొర్రూరు
జిల్లా:మహబూబాబాద్ చరవాణి సంఖ్య: 9949749987
[13/03, 8:36 AM] పరాంకుశం రఘు నారాయణ KS40: शिव माहात्म्य
""""""""""""""""
शुभ व सौम्य का प्रतिरूप है शिवोहम्!
प्रलय रुद्र-स्तोत्र माहात्म्य है शिवोहम्!
भक्त जनाश्रय शाक्तेय-कंठ है शिवोहम्!
पन्नगभूषण शशिधर प्रिय है शिवोहम्!
सत्व- तम-रज-गुण सम्मोहन है
शिवोहम् !
अनंत परिशुद्ध शिवाराधना है शिवोहम्!
शिवलिंगाराधना महादर्शनयोग है शिवोहम्!
शिव सहस्र नाम स्त्रोत्र पारायण है
शिवोहम्!
शिवलिंग बिल्वाष्टक स्तोत्र है शिवोहम्!
पवित्र भस्म शक्तिप्रसारण वाहक है शिवोहम्!
गुण रूप रस गंध स्पर्शात्मक है शिवोहम्!
शब्द ब्रह्मम स्वरूप डमरू है शिवोहम्!
स्कंध भविष्योत्तर लिंग पुराण समाहार है शिवोहम्!
सर्व पाप प्रशमन सादृश्य है शिवोहम्!
निराकार परब्रह्म साकार है शिवोहम्!
रुद्राक्ष विभूति कुम्कुम चंदन अलंकरण है शिवोहम्!
ओम् नमः शिवाय नमः
अष्टाक्षरी महामंत्र जप है शिवोहम्।
मूल रचना (तेलुगु):
परा'कुशम् रघु नारायण
(ग्राम: तोर्रूर
जिला: महबूबाबाद,
दूरभाष: 9949749987
अनुवाद (हिन्दी):
श्रीपेरंबुदूरु नारायण राव 'श्रीनारा'
' साहित्य साधना '
प्लाट नं: 96, म-नं : 10--167,
गायत्री होम्स, हैदराबाद-500097
[13/03, 9:57 AM] Rapolu Aruna Siripuram Poet: శీర్షిక: *శివోహం*
తంకములను బాపుచు, నెల
వంకనుతలపైధరించి పామును మెడ, మూ
డంకెల కన్నుల వాడు భ
యంకరముగ బాము తిరుగు నతడే హరుడౌ
బోళా శంకరుడీవట
నీలగళేశ్వరుడ వీవు నిఖిల జగతిలో
మాలోపములను బాపిన
నీ లీలలు నిజమటంచు నిత్యము దలతున్
హే శంకరా! శుభంకర!
నీ శుభ చరణాలు నమ్మి నిలిచితిమయ్యా
శ్రీశా! మహేశ! పాప వి
నాశా! మము బ్రోవుమయ్య నయమొప్పంగన్
గిరిపుత్రిక కోరికతో
కరుణను కురిపించి వలచి కల్యాణముకై
గిరినే దిగి వచ్చితివ త్రి
పురారి ! యంబికనుగూడి పుడమి నిలువుమా!
✍రాపోలు అరుణాస్వామి, సిరిపురం
Comments
Post a Comment