Skip to main content

మహిళా దినోత్సవం 2021

 నిర్వహణ: శివునూరి లలితాకృష్ణ

******

కవివరుల జాబితా

వీరా గుడిపల్లి

శ్రీమతి శివునూరి లలితాకృష్ణ

1.డా.దీపక్ న్యాతి గారు

2.మన్నె పిన్నక లలిత గారు

3.సంధ్యా శర్మ గారు

4.కందూరి సుజాతా రాణి గారు

5.భరద్వాజ గారు

6.కోరాడ గారు

7.డా.ఆంజనేయులు గారు

8.సంజీవ రెడ్డి ఐలేని గారు

9.కొలచన విజయ భారతి గారు

10.పరాంకుశం రఘు నారాయణ గారు

11.డా.బల్లూరి ఉమాదేవి గారు

12.. సుధారాణి కృష్ణం రాజు గారు

13.కె.ఇ.నిలమంగై గారు

14.ధనాశి ఉషారాణి గారు

15.సుగుణ మద్ది రెడ్డి గారు

16.సునంద వురిమళ్ళ గారు

17.మన్నె లలిత గారు

18.సత్య నీలిమ గారు

19.మర్రి జయశ్రీ గారు

20.డా.పాండాల మహేశ్వర్ గారు

21. అపరాజిత్ గారు

22.తిరు వేంకటాచార్యులు గారు

23.పాల్వంచ హరి కిషన్ గారు

24.గుండ్ల రాజు గారు

25.ఇంద్రావత్ రాహుల్ గారు

26.రాపోలు అరుణా స్వామి గారు

27.డా.ఆంజనేయులు గారు

***********

[06/03, 7:33 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️


కవితాగానం 


అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని

మనసమూహం ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతుంది.


మన కవితాగానం కోసమే రాసిన కవితలు మాత్రమే....


రాత్రి ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు పంపగలరు.


✳️✳️✳️✳️✳️✳️

*వీరా గుడిపల్లి కవిత*

మహిళా దినోత్సవం సందర్భంగా

8032021

*నీవంటే కోపం*

*********

ఆకలంటే యేమిటో

తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు

నీవే 

ఆకలిని ఆలింగనం చేసుకున్నావు

కష్టమంటే యేమిటో

కనీసం తెలియకుండా చేశావు

అన్నీ

నీవే భరించావు

నా ఓటమి నీపై కోపంగా మారితే

అంగీకరించావు

నా చేతకాని తనం

నీపై చేయిచేసుకుంటే 

నాకా హక్కుందని నమ్మించావు

గెలుపంతా నాకు ఆపాదించడం

అపజయాలన్నీ నీపై వేసుకోవడం

యెంత స్వార్థం నీది

అందుకే నీవంటే కోపం

నా అహంకారాన్ని భరించే

నీవంటే అసూయ

యెన్ని జన్మలెత్తినా

నిన్ను చేరుకోలేనని తెలుసు

నిన్నందు కోలేనని తెలుసు

అందుకే ... నీవంటే కోపం

.....  *వీరా గుడిపల్లి*

*********

ఆమె

ఇది లలితా కృష్ణ కవిత

********

ఆప్యాయతలు

అభిమానాల

నల్లుకున్న

మమతలకల్పవల్లి 


దూరమవుతున్న ప్రేమలలో 

నిబంధనల బంధనాలను 

 త్రెంచి అనుబంధాలను పండించే అనురాగవల్లి


ఆంక్షల ఆరళ్ళను 

వివక్షల విసుర్లను 

ఆధిపత్యపు పైత్యాన్ని

భరించడానికి నిత్యం 

సంయమనపుటౌషధాన్నిపథ్యం గా సేవించి జీవించే సహనశీలి

 బాధల బడబాగ్నులతో

అంతర్నిహితంగా ఘోషిస్తూ..

ఓర్మి పేర్మిల తో 

నిశ్శబ్దంగా శాసించే మార్మిక సంద్రం

సున్నిత మనస్తత్వం

ఉన్నత వ్యక్తిత్వంతో భాసిల్లే

హిమగిరి శిఖరం

ప్రకృతికి ఆకృతియైన

పరిపూర్ణతత్వం.....


భరించడం మే నైజం గా

సాగడం... కాదు

నిర్ణయాత్మక శక్తిగా ఎదిగాలన్న నిజం

గమనించేదెప్పుడో....

1

[06/03, 8:08 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*

పేరు : డా.దీపక్ న్యాతి

తేది : 06-03-2021

అంశం : అంతర్జాతీయ మహిళా దినోత్సవం

శీర్షిక : పూజ అనివార్యం


మహిళల దేవతగా పూజించిన

అలనాటి సంప్రదాయం అద్భుతం

అమ్మగా మహిళ కీర్తి అంతర్జాతీయం

అమూల్యమైన అమ్మతనానికి నిర్వచనం

జగతిన మనిషి జన్మ కారకం

లోక కల్యాణానికి త్యాగమయ్యే తేజసం

సమాజ బాధ్యత నేలే రాజసం

భవితను బంగారుమయం చేసే నైపుణ్యం

కనుమరుగవుతూ వెలుగు చూపే దీపం

సమస్త జీవుల ఓదార్చే మానవత్వం

మమతల పంచు అనురాగం

తనను కన్న వారిని తను కన్నవారిని

కంటికి రెప్పలా కాచుకునే కారుణ్యం

అమ్మింటినీ అత్తింటినీ మెప్పించే అమ్మతనం

తనవారికై సమస్తాన్ని అర్పించు శిల్పం

రంగమేదైనా అందరికీ దీటుగా నర్తించు వైనం

మహిళ మహోన్నతం మహిమాన్వితం

ఒక్క రోజైనా కేరింతలు కొట్టడం అనివార్యం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం


డా.దీపక్ న్యాతి

హైదరాబాద్

2

[06/03, 8:14 PM] మన్నె లలిత గారు కవయిత్రి: కవితా గానం.

 తేదీ :6 /3 /21 -శనివారం. 

అంశము :అంతర్జాతీయమహిళాదినోత్సవాన్ని

పురస్కరించుకుని .....

శీర్షిక :మూలాధారం .

పేరు : మన్నె పిన్నక లలిత .

 హైదరాబాద్ .

చరవాణి సంఖ్య :741 686 32 89.

****************************************************


 జగతికి మూలాధారం మహిళ 

భూమాత ,జలదేవత, వనదేవత

 అష్టలక్ష్ములు ,ఆది పరాశక్తి

 అక్షర  మణి దీప్తులతో 

  అలరించే సరస్వతీదేవి

 పురాణ పురుషుల  నామాల్లో

ప్రధమ నామానివి

 కుటుంబానికి ఆధారానివి

 జగతికి సూత్రధారిణివి

 కరవాలముపట్టి ,హలముపట్టి, కలముపట్టి

 సముద్రాంతర్భాగం నుండి ,ఆకాశపుటంచుల వరకు

  ఐ.ఏ.ఎస్ ,ఐ.పీ.ఎస్ ,దేశ రక్షణ చేస్తున్నా ,

నీ దేహ రక్షణ విషయంలో

 ఎందుకు బేలవౌతున్నావు?

 జననం నుండి మరణం వరకు 

ఎన్నో పాత్రలు నిర్వహించే నీవు

 కాముకులను ఎదుర్కొనే శక్తి లేక

 కాయాన్ని పణం పెడుతున్నావు

  కాముక పురుష శక్తిని ఎదుర్కొనే

 ఆధునిక రక్షణ విద్యలు నేర్చి అంతమొందించు

 అప్పుడే జాతీయ మహిళా దినోత్సవం చేసినా

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసినా

 అర్థం 

 ఒక రోజు మహిళాదినోత్సవంతో, 

ఒకరోజు ఊక దంపుడు ఉపన్యాసాలతో

 తీరే సమస్య కాదు

  చెట్టుకు వేరులా,సమస్త వృక్షవిశ్వానికి

 నీవే మూలాధారమైన వేరు 

 నీవు లేక జగతి లేదు

 శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం  సాగి

 జాతీయ, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని

 మనస్ఫూర్తిగా జరుపుకునే రోజు  రావాలి.

3

[06/03, 8:26 PM] Sandya Sharma Poetess: కవితాగానం

*అంశం:అంతర్జాతీయ మహిళా దినోత్సవం*

*శీర్షిక: ఓ మహిళా*



మహిళా ఓ మహిళా

అందాల బొమ్మవు

అరుదైన అమ్మవు

అవనికి నీవే పూజా పుష్పము

అణువణువూ నిండిన

ఆకాశం తాకినా సంద్రమంత లోతే

 నీ మనసు

 అడుగంటే కన్నిరే నీ లోనే దాచినా

 చిరునవ్వు లు చిందించె

చిత్రమే నీరూపు...


మహిళా ఓ మహిళా...

మల్లెలాంటి సొగసు నీది

 ముల్లులాంటి కలత నీది

మన్నించే మమత నీది

మందార సిగ్గు నీది

మహిళా ఓ మహిళా...

ఆప్యాయత పంచిన

అనురాగం చూపినా

ఆలివై పాలించే విశ్వమంత నీదే

ఆ ధ్యైర్యాన్నే శాసించే కనక దుర్గ

అంశ నీవే...

అంతరిక్షంలో అడుగేసినా

అర్థశాస్త్రమే నీదైనా

అమ్మగా ఆరాటమే

ఓ తల్లిగా పోరాటమే...

ఓ అబలగా ఆవేదనే...

ఓ సబలగా ఆలోచనే..

ఓ చరితగా తన ఖ్యాతినే

పొగిడినా చాలదే

ఈ జీవితం...

మహిళా ఓ మహిళా...!


✍️వై.కె.సంధ్యశర్మ

చిత్తూరు

4

[06/03, 8:26 PM] భరద్వాజ గారు: 🦚కవితాగానం 🦚

శని  వారం  

 కవిత తేదీ6-0321

అంశం-మహిళాదినోత్సవం 

శీర్షిక-  మనఇంతులు .!

****************************

అబల అన్నది సబబు ఆడదానికొకనాడు -

ఆదిశక్తి అన్నమాట అలంకారమాస్త్రీకి ఈనాడు -

ప్రగతి పధాన రధసారధులు అతివలు -

పరుగులప్రపంచాన పథకాలు చేజిక్కించుకున్న రాణులు -

అధికారపుఅందాలాలు అలంకారాలు చేసుకున్న మగువలు -

అంతర్జాతీయ నృత్యాలలో నోబెల్ బహుమతులు అందుకున్న మహిళలు 

కత్తిపత్తికాదనరంగాన కాలూనిన వనితలు -

కలం పట్టి సాహితీయుద్దాలుచేసిన మొల్లలు -

అలీనశ క్తులను సంఘటితం చేసిన ఇందిరలు -

శాంతి సేవాతత్పరతకు అం కితమైన మదర్  థెరెసాలు -

సమాజాభ్యుదయరంగంలో సమరం చేస్తూ -

మొక్కవోని ఆశయాలతో మగవాడికి -

ధీటుగా-

మేటిగా -

సాటిగా -

ఉంటున్నారు ఈమహిళలు -

అన్నితామేమీ పోటీసాటీ అంటున్న ఇంతులు 

**********************************

 ఇదినాస్వీయరచన 

✍️భరద్వాజ రావినూతల (RB)✏️

*************************

5

[06/03, 8:36 PM] కందూరి సుజాత Poetess: అంశం... మహిళా దినోత్సవం 

శీర్షిక...🌷 గృహిణి  🌷

.........   .......  ........

గృహిణి నీవు లేవాయే 

గృహసీమ   వెల వెలాయే.

పచ్చ పచ్చ పైరులా   పల్లవించు పాటలా మురిపాల  కుసుమమా' 

మమతలూరించు  పుష్పమా.

గృహిణి బాంధవ్య సంరక్షణీ .


కమలంపై లక్ష్మీలా కాపురాన అడుగిడు కోమలమా. 

నట్టింట్లో చక్రంలా నవ్వుల సంసార  మూలమా .

వెన్నతోడు కవ్వంలా పరిజనులకు సహకరించు సాత్వికమా. 

ధరణి మాత ఓర్పులా చెరగని దరహాసమా.

గృహసిమా రాణి   తరతరాల  సంప్రదాయ విరభోణి. 


కడలిలోని నిగూడా ముత్యమా 

సహన నీ శ్రమకు   నిస్వార్థ నీ ప్రేమకు 

చిల్లి పడిన క్షణమునా...

కల్లోల కెరటమై కలవరపు ప్రళయామై 

శౌర్యంతో సాదించగ 

పైకముకై పయనించి..

విజ్ఞతలో విహరించగ   ప్రపంచంతొ పరుగిడితూ...

పలు కోణాలతో ఉద్యోగ వేటలో....

మమతల కోవెలను దాటిన కొసమెరుపు.


తెల తెల తెల్లవారులా

తెగువతో అడుగులేస్తూ 

నింగి దాక సాగిన... 

రాణి లేని కోట రాళ్లపాలు 

శాంతి లేని చోటు సంఖెళ్ళ పాలు .

కోడి లేని పిల్ల గద్ద పాలు 

మగనాలి లేని ఇల్లు మట్టిపాలు. 


వెలుగు ఉపాదీ    చీకటి విశ్రాంతి కలగలుపు దినం మానవ పేజి.

ఉపాదికై గడప దాటిన గృహిణి అడుగుతో నీరుగారిన అనురాగబంధాలు. 

దూరమైన మనిషిలోని మానవత్వం 

చేరువైనా మరమనిషి తత్వం .

చట్ట శాసనాలు కోకొల్లలున్న  

"గృహిణి పాదం 

గృహసీమ వెలిగించు వేదం."


కందూరి సుజాతారాణి 

రాజేంద్రనగర్, హైదరాబాద్ 

9392161822🌷

6

[06/03, 8:37 PM] Korada: కవితాగాన0

అంశం :- మహిళా దినోత్సవం

  కోరాడ నరసింహా రావు...!

          * నేటి మహిళ *

             **********

ఆనాటి మహిళ కాదీమే....!

అన్ని శక్తులనుసమకూర్చు కున్న...ఈనాటి ఆధునిక మహిళ ఈమే!!

ఆంక్షల తో...అణగద్రోక్కజూస్తే

ఆటమ్బామ్బై పేలుతుంది...!

అధికారం చలాయించవస్తే...

నిన్నబాసుపాలు జేస్తుంది !!

వంచించాలను కుంటే....

ఉప్పేనయై... ముంచేస్తుంది!

నువు ప్రేమాభిమానాలనే...

జూపితే..., ఆమే నీ పాలిట కల్ప తరువే ఔతుంది...!!

చిట్టి పాపగా...నట్టిన్టనడయాడి

కన్నవారి కంటికి కాం తై....,

యింటి కే...శోభ నిస్తుంది...!

పిన్న వయసు లోనే... ఎన్నదగ్గ

ఘన కార్యములు ఎన్నేన్నో

అవలీలగా సాధించి....

అందరి మన్నన లందగలదు!

అన్నదమ్ముల తోడ బుట్టి తను

అనురాగాన్నే పంచుతుంది!

అత్త వారింట సేవలతో...

ఆప్యాయతనే కురిపించి వారి

వారి అభిమానాన్నీ...

పోందగలదు....!!

చదువులలో...సరస్వతి

సిరి, సంపదల...శ్రీ లక్ష్మి

ధైర్య-స్తైర్యములపార్వతీ మాత

క్షమా-సహనముల భూదేవి ఈమే...!!యిలలో తొలి కొల

వాల్సిన దేవత ఈమే...!!

ఆటలలో... పాటలలో...

మేటియైన  ఎన్నో పనులలో...

తన సత్తా చాటుతూ....

మేము ఏందులోనూ ....

యే  ఒక్కరీకీ తీసి పోమనీ

అన్నింటా... విజయాల తో

తన సత్తా చాటుతోంది నేడు!!

     ********************

............కోరాడ.

7

[06/03, 8:43 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: మహిళా దినోత్సవం

మహిళలు అన్ని రంగాలలో అగ్రగాములుగా నిలుస్తున్నారు

నాడు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక విజయలక్ష్మి పండిత్ కమలా నెహ్రూ తమ పతులకు తోడునీడగా అండగా నిలిచారు


ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్టు లెక్క అని మహాత్మాగాంధీ విన్నవించారు


ఎక్కడైతే స్త్రీలు గౌరవింప పడతారు అక్కడ దేవతలు విలసిల్లు తారు


ఒక పార్వతీపరమేశ్వరుల ఒక లక్ష్మీ మాధవు లాగా


నేడు స్త్రీలు అన్ని రంగాలలో అగ్రగాములుగా


అంతరిక్షంలోకి ప్రయాణం చేసిన కల్పనా చావ్లా

జ్యోతిరావు పూలే కు అండగా నిలిచిన సావిత్రిబాయి పూలే


ఆనాటి పురాణ పురుషులైన వశిష్టుడు తన సతి అండదండలతోనే నిలిచారు సతీ సావిత్రి సతీ సక్కుబాయి సతీ అనసూయ పవిత్ర మూర్తులుగా నిలిచారు పతివ్రత ధర్మాన్ని పాటించిన మహనీయులు మహిళలు మణిపూసలు


భారత కోకిల సరోజినీ నాయుడు దుర్గాబాయి దేశ్ముఖ్ అందరూ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారు


joe biden కొలువుకూటం లో నిలిచిన కమల హారిస్

ఇంకా 26 మంది భారతీయ అమెరికన్ సంతతి మహిళలంతా ఆయన కొలువుకూటం లో అండదండలు అందిస్తున్న వారే బస్ కండక్టర్ గా

తాటి చెట్లు ఎక్కే మహిళలుగా


అంతటా మహిళలే అన్నిటా మహిళలే తమ శక్తిని ప్రదర్శిస్తున్న మహిళా శక్తులు వందనం వారికి అభినందనలు తెలియజేస్తున్నాను డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

8

[06/03, 8:47 PM] సంజీవ రెడ్డి ఐలేని: ......నేటి మహిళ....


నేటి మహిళ

ఆత్మ విశ్వాసానికి ప్రతీక

ఇల్లైనా ఆఫీసైనా

వ్యాపారమైనా రాజకీయమైనా 

తన ఆలోచనలతో

తనదైన ముద్ర వేస్తూ

అభివృద్ధికి ఐకాన్ అయింది

నేటి వనిత

సమాజం ఇంకా

చిన్న చూపు చూస్తున్నా 

వివక్ష ఇంకా

వేటాడుతూ వున్నా 

తరగని విశ్వాసం తో

చెదరని ధైర్యం తో

దూసుకుపోతునే వుంది 

ఆమె మనలో సగం

ఆమెతోనే పరిపూర్ణమీజగం 

ఆమెకు మనసుంది

ఆలోచిస్తుంది

ఆమెకు ఆశయాలున్నై 

సాధిస్తుంది

ఆమెకు ప్రేమానురాగాలున్నై

పంచుతుంది  

అందుకే ఆమెను

స్వేచ్ఛగా ఎదగనిద్దాం

మనసుతో గౌరవిద్దాం

నేటి మహిళ శ్రమను

అందరం గుర్తిద్దాం .


... సంజీవరెడ్డి ఐలేని...

9

[06/03, 8:51 PM] కొలచన విజయ భారతి Poetess: కవితా గానం

పేరు: కొలచన విజయ భారతి

ఊరు:హైదరాబాద్

అంశం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కవిత

శీర్షిక: మగువా!ఓ మగువా!

తేదీ:6-3-2021

  *********************

మగువా !ఓ మగువా! ఎవరికున్నదమ్మా  నీ కున్న తెగువ

పురుడు పునర్జన్మ అని తెలిసినా బిడ్డలకు జన్మనిస్తావు

అడ్డాల నాడే బిడ్డలు

గడ్డాలనాడు కాదని తెలిసినా

నీ ప్రాణాలొడ్డి వారిని

కంటికి రెప్పలా కాచుకుంటావు


పుట్టింట ఆడపిల్లగా భారమన్నారు

మెట్టినింట పనిభారాన్నంతా నీపైనే మోపుతారు

కన్నవారింట మొలకవై పెరిగావు

కట్టుకున్న వాని ఇంట వంశవృక్షంగా ఎదిగావు

పతిలో  సగమన్నారు

సతీ సహగమనం చేయించారు


ఒకప్పుడు నిన్ను ఇంటికే 

పరిమితం చేసారు

కానీ నేడిప్పుడు  ఇంటా బైటా

నీవు ఎరగని ప్రపంచంలేదు

నీవు ఎదగని రంగం లేదు


ఆకాశ యానాలు  చేస్తున్నావు

అంతరిక్షంలో కాలు మోపావు

చరిత్ర కాలం నుంచే

ఓ ఝాన్సీ లక్ష్మీబాయిగా

ఓ కాకతి రుద్రమ దేవిగా

చరిత్ర పుటల్లో వాసికెక్కావు


సీతలా సాధ్వివై  నిలుస్తావు

శక్తిలా పోరాడి గెలుస్తావు

అబలను కాను సబలనని

నిరూపిస్తున్న వీరనారీమణివి

నరనారీ శిరోమణివి

ఓ మగువా ఎవరికున్నదమ్మా నీకున్న తెగువ

       ధన్యవాదాలు

10

[06/03, 9:00 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితా గానం*

 పేరు, పరాంకుశం రఘు నారాయణ

 జిల్లా, మహబూబాబాద్ 

తేది, 6/ 3 /2021 


*కవితా శీర్షిక, మహిళా శిరోమణి*


 మన భారతీయ సాంస్కృతిక, చారిత్రక కోణoలో,


 స్త్రీ పాత్ర అద్వితీయం! 

అమోఘం!!


 పురాణేతి హాసాలలో దైవ మూర్తిగా ,


దైవమూర్తిగా వెలుగొందిన,


 ఘనంగా పూజింపబడిన,


 చారిత్రక నేపథ్యముoది ఆమెకు!


 ఆ వారసత్వం లోనే, నేటి మహిళ కూడా,


 విభిన్న రంగాలలో అగ్రభాగాన ఉంటూనే,


 పురుషాధిక్యత నుండి తనదైన ఉనికిని,


 పదిల పరుచుకుని


 తేజోమూర్తిగా వెలుగొందుతోంది!


 శాస్త్ర సాంకేతిక రంగాల నుండి,


 పారిశ్రామికాభివృద్ధి దిశగా,


 తనదైన ముద్ర వేయడానికై,


ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తోంది !


జనాభాలో సగభాగంగా ఉన్న స్త్రీలు,


 ఈ పోటీ ప్రపంచంలో రాణిస్తేనే ,


మానవ మనుగడ సాధ్యమన్నది వాస్తవం!


 ఆమె నిష్కామకర్మను అందరం అభినందిద్దాం!


 ఆమె శ్లాఘనీయ పాత్రను వేనోళ్ళ కొనియాడుదాం!!

11

[06/03, 9:11 PM] Balloori Umadevi Poetess: కవితా గానం

06/3/21

పేరు:డా.బల్లూరి ఉమాదేవి


అంశం:మహిళా శిరోమణి


ఆకలెరిగి అన్నం పెట్టె తల్లి ఆడది

ఆప్యాయతతో ఆభి మానించే అక్క ఆడది

గారాలుపోతూ మారాంచేసే చిట్టిచెల్లి ఆడది

తనువు మనసు అర్పించి జీవితాంతం

తోడుగ నిల్చే నీడలాంటి ఇల్లాలు ఆడది

రక్తాన్ని పంచుకు పుట్టే దుహిత ఆడది

ఇంకా 

మమతానురాగాల నందించే

పిన్ని,పెద్దమ్మ,అత్త ,వదినా బామ్మ

ఇలా వరస యేదియైన 

అనురాగం పంచేప్రేమైక మూర్తి ఆడది

అందుకే

ఆడపిల్ల పుట్టిందంటే

అయ్యో  అంటూ వాపోకు

ఆడపిల్లవంటూ అలుసుగా చూడకు

అభిమానధనురాలు ఆడదని తెలుసుకో

ఆడదంటె అబలకాదు

ఆడదంటె కాలికింది కసవుకాదు 

కంటిలోని నలుసుకాదు

ఆడదంటె అన్నపూర్ణ

ఆడదంటె ఆదిశక్తి

ఆడదంటె అమృతధార

ఆడదంటె అవనితల్లి

జగతిలోన సగభాగం

జీవనస్రవంతిలోన సగభాగం

అందరిలో అమ్మను చూద్దాం

అమ్మలగన్న యమ్మలకు వేవేల

జేజేలు పల్కుదాం

12


[06/03, 9:15 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితాగానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*అంశం*మగువ వేదన*

06-03-2021(శనివారం)

నేటి భారతం మహిళలపై

అకృత్యాలు అమానుషం

లైంగిక వేదింపులు రాగింగ్ లు

హత్యా చారాలు అత్యాచారాలు ఎటు పోతుంది సభ్యసమాజం

యువత లో మానవ శిక్షత్వం  మంటగలిసిసమాజాన్ని భ్రష్టు

పట్టించడమే ఘనతగా మంచి నడవడి వంచనగా మారితే గాడి తప్పిన దురాగతాలు

ఆడవారిని వేధింపులతో మానసిక చిత్రహింసలకు గురి చేసి పాశవిక ఆనందంతో మంచి తనాన్ని మరచి వారి మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతూ దావానలంలా పెరిగి పోతున్న కిరాతక చర్యలతో నట్టిల్లు ను నెట్టిల్లుగా మార్చి విచక్షణ కోల్పోయి వాట్సాప్ తో కుస్తీలు ఫేస్ బుక్ తో దోస్తీ లు దీనిపైన ఉన్న శ్రద్ధ చదువు సంస్కారంలో మచ్చుకైనా కనిపించవు

పాపాలకు రాజులుగా మారి మరణ శాసనాలు చేసే దుర్మార్గం చదువుకున్న అజ్ఞానులు కొందరైతే చదువు కొన్న దుర్మార్గులు మరెందరో

కళ్ళుండి మంచిని చూడని అంధుల్లా ప్రవర్తనలో దురాగతాలు చేతల్లో మాటల్లో

వినిపించే చెడును మానవత్వం

ప్రశ్నగా మారితే సమాధానం చెప్పే అగత్యం యువత దే అన్ని రంగాల్లో పురుషులకే మాత్రం తీసిపోకుండా ఆర్థిక రాజకీయ అంశాలలో తామే సాటిగా దూసుకుపోతు పురోగమిస్తున్న మహిళ సమాజంలో తనను తాను రక్షించుకోలేక తిరోగమిస్తున్న బలి కావాల్సిందే నా

ఆడవారికి కావాలి రక్ణణ

ప్రస్తుతం అందరి ముందు ఉన్న

నిరీక్షణ

వంచన తో  స్త్రీ జాతిని పాతాళానికి నెట్టితే అది దావానలంలా యువతను దహించి వేసి పశ్చాత్తాపం అనే బీజాలు మీకు మీరు నాటితే

యువత సత్తా చూపితే

స్వతంత్ర భారతావనిలో ఆడవారు నిర్భయంగా వెళ్ళిన

రోజే భరత మాత ముద్దు బిడ్డలు గా భావి భారత పౌరులు గా ఘనఖ్యాతిని పొందే యువత మానవత్వం

కాపాడుటే మీ భవిత🙏🙏👍

13

[06/03, 9:19 PM] Komandoori Neela Poet: కవితా గానం

అంశం: *మహిళ*

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాసినది.

తేది:06/03/2021

        పద్య కవిత్వం


ఆ.వె1: మహిళ యున్న చోట మాలక్ష్మి కొలువుండు

కలికి నడచు చున్న కలిమి యుండు

లలన వున్న యింట లవలేశ మైనను

కొఱత నుంద బోదు కూర్మి నిలుచు!


ఆ.వె2:నాతి యింట నడువ నళినాక్షి నిలుచుండి

సర్వ సంపదలిచ్చి సతతముండు

పతికి సాయమయ్యి పాపల రక్షించి

మెట్టినింటి వారి మెప్పు పొందు!


ఆ.వె3:సుదతి కంట నీరు శోభను తొలగించు

కలిమి కరిగి పోయి కలత మిగులు

స్త్రీని క్షోభ పెట్టి శ్రీమంతుడెవ్వడు

కొఱత లేని బ్రతుకు కోరు కొనడు!


ఆ.వె4:వసుధ లాంటి దంటు వనితను పొగడుచు

పైకి నటన చేయు వారలంత

హితులవోలె మారి హింసింప తలచిన

కాళికోలె మారి ఖతము చేయు!

   

పేరు: కె.ఇ.నిలమంగై

కలం పేరు:నీలా రంగనాధం

ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.

చరవాణి సంఖ్య:8897155600.

*ఈ పై  పద్యాలు ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*

14

[06/03, 9:31 PM] +91 70755 17538: శీర్షిక.స్త్రీ శక్తి

....

నిద్రలేచింది మొదలు

ఉరుకులు పరుగులుతో

బ్రతుకు దారిలో సాగుతూ

నడుము వాల్చుటకు కాసింత టైం దొరకపోయినా

శ్రమలో నిత్యము ఓదార్పు పొందుతూ

కుటుంబం ముందుకు నడుపుటకు చెమట చిందించుతూ

తనవారి కోసము నిత్యము త్యాగము చేస్తూ

పిల్లల భవిష్యత్తు కోసము నిత్యము పరితపిస్తూ

ఆకలి దప్పికలు మరిచి

నిత్యము ప్రగతి దారిలో నిలిపి

బంగారు బతుకును ఇచ్చుటకు

అణునిత్యము కలలు కంటూనే

బంగారు భవితను దిద్దే

స్త్రీ శక్తికి సాటిలేరు ఇలలోన

ఆధిపత్య సమాజములో

నిత్యము ఆణిగిమణిగి ఉంటూనే

ప్రతిభను చాటే  స్త్రీకి సాటిలేరు

జోహార్ అందుకో స్త్రీ శక్తి


ధనాశి ఉషారాణి

చిత్తూరు జిల్లా

15

[06/03, 9:34 PM] +91 90354 73216: అంశం. మహిళా దినోత్సవం 


సృష్టికి మూలం స్త్రీ

జగతికి వెలుగు

 ఇంటికి మహాలక్ష్మి 

అమ్మనాన్నకి అపురూప కానుక

 అక్కగా. చెల్లిగా. 

 వదినగా. అమ్మగా అమ్మమ్మగా  నీ రూపాలెన్నో....

లక్ష్మి. పార్వతి. సరస్వతి దేవతా మూర్తులు... 

కాళీ. దుర్గ.. అవతార 

 స్వరూపులు... 

 

వేద కాలము నుంచి సీత కాలం వరకు.... 

రాజులకాలంనుంచి రాజ్యమేలేదాకా... 

నాటి నుంచి నేటికాలంవరకు అడుగడుగునా ఎన్నో అవరోధాలు దాటుకుంటూ

 ప్రతినిత్యం ఎన్నో వైవిధ్యమైన

పాత్ర లతో... 

 నీ ఘనత చూపుతూ.. 

సంసార సాగరం లో

  జీవిత నౌకను ముందుకు తీసుకెళ్లే  చుక్కానివినీవు. 

 బతుకు 

బండి కి ఇరుసువి నీవు

ఏ రంగంలోనైనా 

  నీకునువ్వేసాటి.


 ప్రతి ఉదయం ప్రకాశిస్తూ 

  ప్రతి నిత్యం వికసిస్తూ 

పరిమళించే సిరిమల్లె పూవా. 

అమ్మ... అమృతధార.

 నీకు వందనం.... 

వందనం..... 

వందనం.... 


  సుగుణ మద్దిరెడ్డి 🌹 ఐలవారిపల్లె

ఐరాల.

16

[06/03, 9:40 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ:06-03-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం:  నేటి మహిళ

శీర్షిక:

*********†********

అందరికీ జవ జీవాలనిచ్చే రవి కిరణం

శరత్కాల వెన్నెలై  ప్రేమానురాగాలు పంచే శశిబింబం

ఆమె అవరోధాల బండరాళ్లను

ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొంటూ 

 సాగిపోయే బతుకు నది!


కష్ట నష్టాల కన్నీటి సుడులను

కంటి రెప్పల చెలియలి కట్టను దాటనీయని మహా సాగరం!


ఇందు గలదందు లేదనే సందేహానికి తావీయక

సమస్త ఋతువుల సమ్మిళితమై

సర్వత్రా ఉనికి పతాక నెగరేస్తున్న  

నేటి మహిళ లేనిది ఎక్కడ!


మానవ సృష్టికి ఊపిరులూదిన

మగువ

మనసూ తనువును కుటుంబానికై అంకితించే త్యాగమూర్తి!

అనుబంధాల పురులు విడిపోకుండా

ఆజన్మాంతం తపించే మాతృమూర్తి!


ఎన్నో ఎన్నెన్నో శిశిరాలను మోస్తూ

అకుంఠిత దీక్షతో విజయాల

వసంతాలను చవి చూస్తూ

సాధికారత దిశగా 

అడుగులు వేస్తున్న నారీ శిరోమణి!


అనంతాకాశ సహన శక్తితో

విశ్వాంతరాళం వైపు పయనిస్తున్న

ఆమెకు సాటి ఇలలో ఎవరు,..

17

[07/03, 8:00 PM] మన్నె లలిత గారు కవయిత్రి: కవితా గానం.

 తేదీ :7 /3 /21 ఆదివారం .

అంశము: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని .

 శీర్షిక:దివ్యాంగులం

పేరు  :మన్నె పిన్నక లలిత.

 హైదరాబాద్ .

చరవాణి సంఖ్య: 741 686 32 89.

************************************

 దివ్యాంగుల  మేం దివ్యాంగులం

 పుట్టుకతోనే దివ్యాంగులం

  అందులోనూ ఆడపిల్లలం

తల్లి ,తండ్రి చేత వదిలివేయబడిన వాళ్ళం 

తల్లి తండ్రి ఉన్నా నిర్లక్ష్యంగా చూడబడిన వాళ్ళం

 తిండి దండగని ఆకలి చేత చంపబడిన వాళ్ళం    

 కళ్ళు ,కాళ్ళు ,వినికిడి లేని వాళ్ళం

 మా చీకటి ప్రపంచానికి మేమే ఏలికలం

 సంఘ నిరాదరణకు కారణం అయిన వాళ్ళం

 మా  అవిటితనంతో జీవనం ఈడుస్తున్న వాళ్ళం

 దివ్యాంగులం  మేం దివ్యాంగులం

 ఈ లోకానికి పనికిరాని వాళ్ళం

 రోజులు మారాయ్

 చక్రాల  కుర్చీలు ,వినికిడి సాధనాలు

 బ్రెయిలీ లిపి ,నేత్ర దానాలు వచ్చి

 మమ్మల్ని మనుషులుగా  నిలబెట్టింది సంఘం

 ఇప్పుడు మేం ఐఏఎస్, ఐపీఎస్, నోబెల్ గ్రహీతలం

  సంఘంలో పట్టున్న వాళ్ళం

 ఏ పనైనా సాధించగలిగే వాళ్ళం

 దివ్యాంగులం మేం  దివ్యాంగులం.

18

[07/03, 8:02 PM] కె. సత్యనీలిమ 


వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: *కవితాగానం*

*అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని*

తేదీ:07-03-2021

*మహిళ*


*మ* హినంతా పాలిస్తూ

మందిరముగా మార్చి

మమతానురాగాలను పంచుతూ

మంచిని పెంచుతూ

మానవత్వాన్ని ప్రతి ఒక్కరి

మదిలో నింపుతుంది మహిళ...


*హి* తాన్ని కోరి

హింసను అణగదొక్కి

హంస పాలను నీటిని

వేరుచేసినట్లుగా

మనసు నుంచి చెడును

వేరుచేసి మనీషిగా మారుస్తుంది మహిళ...


క *ళ* కళలాడుతూ

నట్టింట్లో తిరుగుతూ

ఇంటిని శోభాయమానంగా

చేసే రూపకర్త మహిళ

సృష్టికర్తకైనా నీవేగా

జన్మప్రదాత....


హామీ పత్రము:ఈకవిత కేవలం కవితాగానం కొరకు మాత్రమే రాసినది.


వలిపే సత్యనీలిమ

వనపర్తి

9502156813

19

[07/03, 8:07 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..మహిళా దినోత్సవం

శీర్షిక..తనకు తానే స్ఫూర్తి



ఆంక్షల కంటకాలెన్నో గుచ్చుతున్న

వివక్ష వలయంలో బంధించినా

అవకాశాలను అందుకుంటూ

ఆత్మవిశ్వాసంతో

అడుగు ముందుకు వేస్తున్న మగువ

అనుబంధాలకు విలువనిస్తూ

అనుకువతో మెదులుతూ

అమ్మగా ప్రేమామృతం పంచుతూ

ఆలిగా అనురాగం అందిస్తూ

బామ్మగా మార్గదర్శనం చేస్తూ

చెల్లిగా వెలలేని ఆప్యాయతను అందిస్తూ

అమ్మా నాన్నలకు అపురుపమై

 కూతురుగా మహాలక్షి యై

సంతోష సిరులను కురిపిస్తూ

మదిలో బాధలెన్నో ఉన్నా

మోమున చిరు నవ్వులు చెదరనివ్వక

భూమాతగా సహనంతో

కుటుంబ బాధ్యతలు మోస్తూ

అన్ని రంగాలలో రాణిస్తూ

విభిన్న పాత్రలలో జీవిస్తూ

తనకు తానే స్ఫూర్తి పొందే మహిళ

నిత్య చైతన్య

 20


[07/03, 8:12 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: 🙏అంతర్జాతీయమహిళాదినోత్సవ శుభాకాంక్షలు 🙏

 

*** మహిళా విలాసం ***

                              ✍️డా.పాండాల.

మత్తకోకిల!!


వాణిగౌరిగ లక్ష్మిరూపుగ వాస్తుబంచెటి

కాంతిరా

వేణిమెల్కెల బాధతీర్చెటి వేల్పు

పల్కుల కీర్తిరా

పాణితో రసరమ్య భోజ్యము పంచ శక్తుల పావనీ..

బోణిగన్ శుచి చిత్రశుభ్రపు పుణ్య

కృత్యపు శోభినీ ...! 1


యెట్టి కాలపునీతికైతల యింగితాలకు భక్తిరా

వొట్టిమాటలనెల్ల బల్కక పుట్టినింటికి యుక్తిరా

పట్టుబట్టియు యారుకర్మలప్రజ్ఞ

పంచెటి రక్తిరా

మెట్టినింటికికీర్తి కూర్చెటినిండుగుండెల

ముక్తిరా..2



ఎన్ని యున్నను ఏమి జూసిన ఎంత ముచ్చట గొల్పినా

ఎన్ని యేడులు భిన్న వేడుక లెంత కన్నుల పండినా

నిన్ను జూచితెచాలుయెప్పుడు నిక్కమే హృది నిండె,నా

కన్నులెంతటి భాగ్యమందెనొ కాంతరో నిను గాంచగన్..!3


ఆడపిల్లలు గల్లయిల్లిల అందమైనది కోవెలా

ఆడపిల్లకు సేవ జేసిన యంబయే ముదమొందురా

ఆడపిల్లయె భారమవ్వదు ఆత్మ

తృప్తికి నాందిరా

ఆడపిల్లొకతుంటె చాలుర నిండ ధైర్యము నిచ్చురా ... 4



✍️🕉️డా.పాండాల మహేశ్వర్

గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి

21

[07/03, 8:23 PM] Aparajith: నేటి మహిళ!


ఓ మహిళా 

తెలుగు వాకిల్లలో కళ్లాపి జల్లి 

ముగ్గులు పెడుతూ తూరుపు తెలవారగా 

ఈ నిలువు దోపిడీ సమాజంలో,,,,,,,!

వరి నాట్లల్లో,,,,,కుప్పనూర్పిళ్లలో 

పత్తి చేలల్లో,,,,,,మిరప తోటల్లో 

పంట ఏదైనా నీవై!

మగవాళ్ళతో సమానంగా దినసరి కూలీవై 

పనికి సమాన కూలీ పైకం పొందలేక 

కురిసే బ్రతుకు జడివానలో ముద్దై!

ఇక బస్తీల్లో కాలేజీ చదువుల్లో సరస్వతివై 

అబ్బాయిల కంటే గొప్పగా చదివి 

ఇంజనీరింగ్,మెడిసిన్,సైన్స్,ఆర్ట్స్ 

ఇది అది అనకుండా అన్ని రంగాలలో మేటివై!

గవర్నమెంటు ఉద్యోగాల్లేక 

ప్రయివేటు టీచర్,,,,,,ప్రయివేటు లెక్చరర్ 

సాఫ్టువేరు ఇంజనీర్,,,,,,మెడికల్ ప్రాక్టీషనర్ 

ప్రయివేటు అన్నిరంగాలలో,,,,,,,,,,,,,!

ఆడవాళ్లని చూడకుండా 

వెట్టిచాకిరీ చేయించుకునే యాజమన్యం 

నీ నిస్వార్థ సేవకు అందేది తృణమో ఫణమో!

మాయలోళ్ల సినిమాల్లో,టీవీల్లో 

నిన్ను అసభ్యంగా చూపించే నైజం!

వెర్రి మొర్రి కుర్రకారు 

నిన్ను అవమానించి అభాసుపాలు చేస్తే!!?

సహనంలో అవణిని మించిన అవణివి!

క్రీడల్లో మేటివై 

దేశ పతాకాన్ని వినువీధిలో ఎగరేశావ్!

నాటి భారత కోకిల సరోజినీనాయుడు 

నిన్న మొన్నటి ప్రధాని ఇందిరా ప్రియదర్శిని 

వినీల ఆకాశంలో సేదతీరిన కల్పనా చావ్లా 

భారతరత్న సంగీత చూడామణీ ఎం ఎస్ సుబ్బలక్ష్మి 

మహిళా,,,,,,,,భరతమాత సిగాలో 

ఎన్నెన్ని కీర్తి పతాకాలో గదా!!

మహిళా,,,,,నీ హృదయ వేణువుకు ఎన్ని గాయాలో గదా 

మహిళా,,,,,ధరిత్రి నిండా నీవే!

ఆ వినీల గగనంలో చూడచక్కని చందమామ 

కురిపించే చల్లని వెన్నెలను 

దోసిట్లో పట్టలేము సుమా!!


ఆపరాజిత్

22

[07/03, 8:40 PM] Tiru Venkatacharyulu Ks6: భారత"మాత"లకు శుభాభినందనలు. 

*** *** *** *** *** *** 


మల్లెతీగకు పందిరివేసిన 

మెల్లమెల్లగ పైకిపాకును,

మల్లెపూలను, తావినిచ్చును, 

చల్లని నీడనిచ్చును, 

మరందమునిచ్చు మధుపములకును. 


మల్లెతీగవోలె మగువసైతము 

ప్రేమపంచును, 

మగని మదిని గెలుచును, 

గృహమునే స్వర్గమ్ము జేయును,

పతివంశమును వర్ధిల్లజేయును. 


దాసియై, మంత్రియై, మాతయై, మరువంపుమల్లెయై, 

మగని పరివారమునేలు మహరాణియై, 

యిడుములందు మగనిచేదోడై, 

రాజ్యాలనేలేటి    సామ్రాజ్ఞియై, 

రాణించగలదు మగువ సకలరంగముల. 


లక్ష్మియై మెట్టింట సిరిసంపదల బెంచు, 

వాణియై సంతతికి సద్బుద్దులందించు, 

(ధర్మ)గ్లాని ఏర్పడినవేళ రుద్రాణియై,

రుద్రమయై, దుష్టుల దునుమాడి శాంతి, ధర్మముల నుద్ధరించు. 


మగని గెలుపువెనుక మగువ యున్నట్టులే మగువ గెలుపువెనుక మగడుండి తీరును, 

పూవు, తావి రీతి దంపతులేకమై, 

అన్యోన్య సహకార, యనురాగ సుధలు గ్రోలుచును, 

సంఘమునకాదర్శ జ్యోతులు వెలయింత్రుగాక. 

💐💐💐💐💐💐💐

  

 భారతనారీమతల్లులకు 

సమూహం పక్షాన మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో...


ముడుంబ తిరువేంకటాచార్యులు, 

ఫ్లాట్ నం. 206, S.V. towers, kankaraboad, మహబూబాబాద్.

23

[07/03, 8:48 PM] పాల్వంచ హరికిషన్: 🌱కవితా గానం🌱 


        అమ్మ...!


రాత రాసేది బ్రహ్మ 

ప్రాణం పోసేది అమ్మ 

మంచిని పంచిన జన్మ 

స్ఫూర్తి తరువుల కొమ్మ 

అనుబంధాల పూల రెమ్మ 

చీకటింట వెలుగులు చిమ్మ 

అందరమ్మలలో నీవమ్మ.. 

జగతికే సగము నీవమ్మ 

నీ ఆశీర్వాదముంటే చాలమ్మ 

వట వృక్షమై నిలుచు నా జన్మ 


  -- పాల్వంచ హరికిషన్ 

     రామన్నపేట

     9502451780

24

[07/03, 8:56 PM] Gundla Raju Sir: 💐💐మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో..


సంసార వనమున సౌందర్య పుష్పమై

     సౌరభాలను జల్లు సబలగాదె

కౌటుంబ జీవన కార్యమ్ములను దీర్చు

    సుగుణాలరాశి యాసుమతిగాదె

కష్టాల సంద్రమ్ము నిష్టమ్ముగా నీది

    కౌతుకమ్మును పంచు కవిత గాదె

పుట్టినింటి వెలుగు మెట్టినింటికి జేర్చి

    లాలిత్యమును నింపు లలన గాదె


అమ్మయై చెల్లి, భార్యగా నాదరించి

అత్తయై కోడలికి ప్రేమ విత్తమిచ్చి

ఆమెయై సర్వ శుభముల నంది యిచ్చి

బహుముఖీనమౌ పాత్రల ప్రభలు గొల్పు!!


*🌺🌺🌺గుండ్లరాజు🌺🌺🌺*

25

[07/03, 9:02 PM] Indravat Rahul Poet Ks 11: *"కవిత గానం"*

============


*అంశం :* మహిళా 

*శీర్షిక :* ఆదిపరాశక్తి మహిళా 

*తేది :* 07/03/2021


 

 *ఆదిపరాశక్తి మహిళా*      



అద్భుతమైన మాటలకు 

అక్షరాలని చేర్చి 

ప్రేమ, బంధాలకు దారంగా 

నేటి సమాజంలో 

ఎన్నో కష్టాలకు తను 

దినం దినం అందరి 

మాటల తూటాలతో 

అన్ని రంగాలలో ముందుకు 

ఆప్యాయత, అనురాగలకు 

ఆమె మొదటి మెట్టు 

కష్టాలలో సీతలా 

నాటి గృహాలక్ష్మి 

కుటుంబ బాధ్యతతో 

కోడలిగా, భార్యగా, తల్లిగా 

ఎనలేని ప్రేమకి సంపదవై 

కష్టానికి కార్యషు దాసీవై

ఇష్టంకి తోలకరి జల్లువై

బంధాలకు ఆది వై 

యువతరంకు జగతికి 

మూలమైన ఓ మహిళా 

నీకు వందననం పాదాభివందనం.... 



*ఇంద్రావత్ రాహుల్* 

      *కొత్తపేట్*

 *నిజామాబాద్*

  9848054079..

26

[07/03, 9:14 PM] Rapolu Aruna Siripuram Poet: యత్ర నార్యస్తు పూజ్యంతే


మహిలో మహత్తు కలిగిన మహనీయురాలు మహిళ

 

తాను తనకోసమై

ఎప్పుడూ బ్రతకదు


చిన్ననాడు తన ఆట పాటలతో

ఇంటిల్లిపాదిని అలరిస్తూ

అందరినీ ఆకట్టుకుంటుంది


అమ్మచాటుబిడ్డగా 

ఆ ఇంటి మహాలక్ష్మిగా

కళకళలాడుతూ మురిపిస్తుంది


తాను పుట్టిపెరిగిన వాతావరణం విడిచి

మెట్టినింట అడుగుపెట్టి

సర్వస్వాన్ని ధారబోస్తుంది


మగువ, మల్లెతీగ

జతలేక బ్రతకలేవంటారు

కానీ...

జీవం లేని ముళ్లపందిరినైనా

అల్లుకుంటూ

తన సౌరభాల్ని వ్యాపిస్తుంది


తరుణి తరువు లాంటిది

ఉన్నచోట ఉనికిని కాపాడేందుకు

ప్రకృతిని ఆసరాగా చేసుకుని

పచ్చని సంసారంలో

చల్లని నీడనిస్తుంది

తీయని పండ్లనిస్తుంది


అంతేనా ఆడది అంటే

అసలు ఆమె లేనిదెక్కడ?

పొలం పనుల్లో, కర్మగారాల్లో,

బడిలో, బస్సులో, ఖాకీ దుస్తుల్లో,

సాంస్కృతిక కార్య కలాపాల్లో,

అడవుల్లో, సముద్రగర్భంలో,

ఆకాశంలో, అంతరిక్షంలో


ఎక్కడచూసినా మగువ

తక్కువేమికాదు కదా

అన్ని రంగాలలో అడుగుపెట్టిన మహిళ

 తన ప్రతిభ చాటుతూనే వుంది



ఏడాదికొక్క రోజు

ఉత్సవాలుకాదు కావాల్సింది

సంపూర్ణ భద్రతతో

స్త్రీకి రక్షణ కావాలి


అందుకు అందరు తల్లిదండ్రులు చైతన్యవంతులై

తమ సంతానాన్ని ఉత్తమంగా

తీర్చిదిద్దాలి


ఎక్కడ మహిళ గౌరవించబడుతుందో,

అక్కడ దేవతలు కొలువుంటారు

✍రాపోలు అరుణాస్వామి, సిరిపురం


- - - - - - - - - - - - - - - - - - - - - - 

ఈ రచన నా స్వంతం. ఈ సమూహం కోసమే వ్రాసినదని హామీ ఇస్తున్నాను

27

[07/03, 8:00 PM] మన్నె లలిత గారు కవయిత్రి: కవితా గానం.

 తేదీ :7 /3 /21 ఆదివారం .

అంశము: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని .

 శీర్షిక:దివ్యాంగులం

పేరు  :మన్నె పిన్నక లలిత.

 హైదరాబాద్ .

చరవాణి సంఖ్య: 741 686 32 89.

************************************

 దివ్యాంగుల  మేం దివ్యాంగులం

 పుట్టుకతోనే దివ్యాంగులం

  అందులోనూ ఆడపిల్లలం

తల్లి ,తండ్రి చేత వదిలివేయబడిన వాళ్ళం 

తల్లి తండ్రి ఉన్నా నిర్లక్ష్యంగా చూడబడిన వాళ్ళం

 తిండి దండగని ఆకలి చేత చంపబడిన వాళ్ళం    

 కళ్ళు ,కాళ్ళు ,వినికిడి లేని వాళ్ళం

 మా చీకటి ప్రపంచానికి మేమే ఏలికలం

 సంఘ నిరాదరణకు కారణం అయిన వాళ్ళం

 మా  అవిటితనంతో జీవనం ఈడుస్తున్న వాళ్ళం

 దివ్యాంగులం  మేం దివ్యాంగులం

 ఈ లోకానికి పనికిరాని వాళ్ళం

 రోజులు మారాయ్

 చక్రాల  కుర్చీలు ,వినికిడి సాధనాలు

 బ్రెయిలీ లిపి ,నేత్ర దానాలు వచ్చి

 మమ్మల్ని మనుషులుగా  నిలబెట్టింది సంఘం

 ఇప్పుడు మేం ఐఏఎస్, ఐపీఎస్, నోబెల్ గ్రహీతలం

  సంఘంలో పట్టున్న వాళ్ళం

 ఏ పనైనా సాధించగలిగే వాళ్ళం

 దివ్యాంగులం మేం  దివ్యాంగులం.

[07/03, 8:02 PM] కె. సత్యనీలిమ 


వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: *కవితాగానం*

*అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని*

తేదీ:07-03-2021

*మహిళ*


*మ* హినంతా పాలిస్తూ

మందిరముగా మార్చి

మమతానురాగాలను పంచుతూ

మంచిని పెంచుతూ

మానవత్వాన్ని ప్రతి ఒక్కరి

మదిలో నింపుతుంది మహిళ...


*హి* తాన్ని కోరి

హింసను అణగదొక్కి

హంస పాలను నీటిని

వేరుచేసినట్లుగా

మనసు నుంచి చెడును

వేరుచేసి మనీషిగా మారుస్తుంది మహిళ...


క *ళ* కళలాడుతూ

నట్టింట్లో తిరుగుతూ

ఇంటిని శోభాయమానంగా

చేసే రూపకర్త మహిళ

సృష్టికర్తకైనా నీవేగా

జన్మప్రదాత....


హామీ పత్రము:ఈకవిత కేవలం కవితాగానం కొరకు మాత్రమే రాసినది.


వలిపే సత్యనీలిమ

వనపర్తి

9502156813

[07/03, 8:07 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..మహిళా దినోత్సవం

శీర్షిక..తనకు తానే స్ఫూర్తి



ఆంక్షల కంటకాలెన్నో గుచ్చుతున్న

వివక్ష వలయంలో బంధించినా

అవకాశాలను అందుకుంటూ

ఆత్మవిశ్వాసంతో

అడుగు ముందుకు వేస్తున్న మగువ

అనుబంధాలకు విలువనిస్తూ

అనుకువతో మెదులుతూ

అమ్మగా ప్రేమామృతం పంచుతూ

ఆలిగా అనురాగం అందిస్తూ

బామ్మగా మార్గదర్శనం చేస్తూ

చెల్లిగా వెలలేని ఆప్యాయతను అందిస్తూ

అమ్మా నాన్నలకు అపురుపమై

 కూతురుగా మహాలక్షి యై

సంతోష సిరులను కురిపిస్తూ

మదిలో బాధలెన్నో ఉన్నా

మోమున చిరు నవ్వులు చెదరనివ్వక

భూమాతగా సహనంతో

కుటుంబ బాధ్యతలు మోస్తూ

అన్ని రంగాలలో రాణిస్తూ

విభిన్న పాత్రలలో జీవిస్తూ

తనకు తానే స్ఫూర్తి పొందే మహిళ

నిత్య చైతన్య దీప్తి

[07/03, 8:12 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: 🙏అంతర్జాతీయమహిళాదినోత్సవ శుభాకాంక్షలు 🙏

 

*** మహిళా విలాసం ***

                              ✍️డా.పాండాల.

మత్తకోకిల!!


వాణిగౌరిగ లక్ష్మిరూపుగ వాస్తుబంచెటి

కాంతిరా

వేణిమెల్కెల బాధతీర్చెటి వేల్పు

పల్కుల కీర్తిరా

పాణితో రసరమ్య భోజ్యము పంచ శక్తుల పావనీ..

బోణిగన్ శుచి చిత్రశుభ్రపు పుణ్య

కృత్యపు శోభినీ ...! 1


యెట్టి కాలపునీతికైతల యింగితాలకు భక్తిరా

వొట్టిమాటలనెల్ల బల్కక పుట్టినింటికి యుక్తిరా

పట్టుబట్టియు యారుకర్మలప్రజ్ఞ

పంచెటి రక్తిరా

మెట్టినింటికికీర్తి కూర్చెటినిండుగుండెల

ముక్తిరా..2



ఎన్ని యున్నను ఏమి జూసిన ఎంత ముచ్చట గొల్పినా

ఎన్ని యేడులు భిన్న వేడుక లెంత కన్నుల పండినా

నిన్ను జూచితెచాలుయెప్పుడు నిక్కమే హృది నిండె,నా

కన్నులెంతటి భాగ్యమందెనొ కాంతరో నిను గాంచగన్..!3


ఆడపిల్లలు గల్లయిల్లిల అందమైనది కోవెలా

ఆడపిల్లకు సేవ జేసిన యంబయే ముదమొందురా

ఆడపిల్లయె భారమవ్వదు ఆత్మ

తృప్తికి నాందిరా

ఆడపిల్లొకతుంటె చాలుర నిండ ధైర్యము నిచ్చురా ... 4



✍️🕉️డా.పాండాల మహేశ్వర్

గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి

[07/03, 8:23 PM] Aparajith: నేటి మహిళ!


ఓ మహిళా 

తెలుగు వాకిల్లలో కళ్లాపి జల్లి 

ముగ్గులు పెడుతూ తూరుపు తెలవారగా 

ఈ నిలువు దోపిడీ సమాజంలో,,,,,,,!

వరి నాట్లల్లో,,,,,కుప్పనూర్పిళ్లలో 

పత్తి చేలల్లో,,,,,,మిరప తోటల్లో 

పంట ఏదైనా నీవై!

మగవాళ్ళతో సమానంగా దినసరి కూలీవై 

పనికి సమాన కూలీ పైకం పొందలేక 

కురిసే బ్రతుకు జడివానలో ముద్దై!

ఇక బస్తీల్లో కాలేజీ చదువుల్లో సరస్వతివై 

అబ్బాయిల కంటే గొప్పగా చదివి 

ఇంజనీరింగ్,మెడిసిన్,సైన్స్,ఆర్ట్స్ 

ఇది అది అనకుండా అన్ని రంగాలలో మేటివై!

గవర్నమెంటు ఉద్యోగాల్లేక 

ప్రయివేటు టీచర్,,,,,,ప్రయివేటు లెక్చరర్ 

సాఫ్టువేరు ఇంజనీర్,,,,,,మెడికల్ ప్రాక్టీషనర్ 

ప్రయివేటు అన్నిరంగాలలో,,,,,,,,,,,,,!

ఆడవాళ్లని చూడకుండా 

వెట్టిచాకిరీ చేయించుకునే యాజమన్యం 

నీ నిస్వార్థ సేవకు అందేది తృణమో ఫణమో!

మాయలోళ్ల సినిమాల్లో,టీవీల్లో 

నిన్ను అసభ్యంగా చూపించే నైజం!

వెర్రి మొర్రి కుర్రకారు 

నిన్ను అవమానించి అభాసుపాలు చేస్తే!!?

సహనంలో అవణిని మించిన అవణివి!

క్రీడల్లో మేటివై 

దేశ పతాకాన్ని వినువీధిలో ఎగరేశావ్!

నాటి భారత కోకిల సరోజినీనాయుడు 

నిన్న మొన్నటి ప్రధాని ఇందిరా ప్రియదర్శిని 

వినీల ఆకాశంలో సేదతీరిన కల్పనా చావ్లా 

భారతరత్న సంగీత చూడామణీ ఎం ఎస్ సుబ్బలక్ష్మి 

మహిళా,,,,,,,,భరతమాత సిగాలో 

ఎన్నెన్ని కీర్తి పతాకాలో గదా!!

మహిళా,,,,,నీ హృదయ వేణువుకు ఎన్ని గాయాలో గదా 

మహిళా,,,,,ధరిత్రి నిండా నీవే!

ఆ వినీల గగనంలో చూడచక్కని చందమామ 

కురిపించే చల్లని వెన్నెలను 

దోసిట్లో పట్టలేము సుమా!!


ఆపరాజిత్

[07/03, 8:40 PM] Tiru Venkatacharyulu Ks6: భారత"మాత"లకు శుభాభినందనలు. 

*** *** *** *** *** *** 


మల్లెతీగకు పందిరివేసిన 

మెల్లమెల్లగ పైకిపాకును,

మల్లెపూలను, తావినిచ్చును, 

చల్లని నీడనిచ్చును, 

మరందమునిచ్చు మధుపములకును. 


మల్లెతీగవోలె మగువసైతము 

ప్రేమపంచును, 

మగని మదిని గెలుచును, 

గృహమునే స్వర్గమ్ము జేయును,

పతివంశమును వర్ధిల్లజేయును. 


దాసియై, మంత్రియై, మాతయై, మరువంపుమల్లెయై, 

మగని పరివారమునేలు మహరాణియై, 

యిడుములందు మగనిచేదోడై, 

రాజ్యాలనేలేటి    సామ్రాజ్ఞియై, 

రాణించగలదు మగువ సకలరంగముల. 


లక్ష్మియై మెట్టింట సిరిసంపదల బెంచు, 

వాణియై సంతతికి సద్బుద్దులందించు, 

(ధర్మ)గ్లాని ఏర్పడినవేళ రుద్రాణియై,

రుద్రమయై, దుష్టుల దునుమాడి శాంతి, ధర్మముల నుద్ధరించు. 


మగని గెలుపువెనుక మగువ యున్నట్టులే మగువ గెలుపువెనుక మగడుండి తీరును, 

పూవు, తావి రీతి దంపతులేకమై, 

అన్యోన్య సహకార, యనురాగ సుధలు గ్రోలుచును, 

సంఘమునకాదర్శ జ్యోతులు వెలయింత్రుగాక. 

💐💐💐💐💐💐💐

  

 భారతనారీమతల్లులకు 

సమూహం పక్షాన మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో...


ముడుంబ తిరువేంకటాచార్యులు, 

ఫ్లాట్ నం. 206, S.V. towers, kankaraboad, మహబూబాబాద్.

[07/03, 8:48 PM] పాల్వంచ హరికిషన్: 🌱కవితా గానం🌱 


        అమ్మ...!


రాత రాసేది బ్రహ్మ 

ప్రాణం పోసేది అమ్మ 

మంచిని పంచిన జన్మ 

స్ఫూర్తి తరువుల కొమ్మ 

అనుబంధాల పూల రెమ్మ 

చీకటింట వెలుగులు చిమ్మ 

అందరమ్మలలో నీవమ్మ.. 

జగతికే సగము నీవమ్మ 

నీ ఆశీర్వాదముంటే చాలమ్మ 

వట వృక్షమై నిలుచు నా జన్మ 


  -- పాల్వంచ హరికిషన్ 

     రామన్నపేట

     9502451780

[07/03, 8:56 PM] Gundla Raju Sir: 💐💐మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో..


సంసార వనమున సౌందర్య పుష్పమై

     సౌరభాలను జల్లు సబలగాదె

కౌటుంబ జీవన కార్యమ్ములను దీర్చు

    సుగుణాలరాశి యాసుమతిగాదె

కష్టాల సంద్రమ్ము నిష్టమ్ముగా నీది

    కౌతుకమ్మును పంచు కవిత గాదె

పుట్టినింటి వెలుగు మెట్టినింటికి జేర్చి

    లాలిత్యమును నింపు లలన గాదె


అమ్మయై చెల్లి, భార్యగా నాదరించి

అత్తయై కోడలికి ప్రేమ విత్తమిచ్చి

ఆమెయై సర్వ శుభముల నంది యిచ్చి

బహుముఖీనమౌ పాత్రల ప్రభలు గొల్పు!!


*🌺🌺🌺గుండ్లరాజు🌺🌺🌺*

[07/03, 9:02 PM] Indravat Rahul Poet Ks 11: *"కవిత గానం"*

============


*అంశం :* మహిళా 

*శీర్షిక :* ఆదిపరాశక్తి మహిళా 

*తేది :* 07/03/2021


 

 *ఆదిపరాశక్తి మహిళా*      



అద్భుతమైన మాటలకు 

అక్షరాలని చేర్చి 

ప్రేమ, బంధాలకు దారంగా 

నేటి సమాజంలో 

ఎన్నో కష్టాలకు తను 

దినం దినం అందరి 

మాటల తూటాలతో 

అన్ని రంగాలలో ముందుకు 

ఆప్యాయత, అనురాగలకు 

ఆమె మొదటి మెట్టు 

కష్టాలలో సీతలా 

నాటి గృహాలక్ష్మి 

కుటుంబ బాధ్యతతో 

కోడలిగా, భార్యగా, తల్లిగా 

ఎనలేని ప్రేమకి సంపదవై 

కష్టానికి కార్యషు దాసీవై

ఇష్టంకి తోలకరి జల్లువై

బంధాలకు ఆది వై 

యువతరంకు జగతికి 

మూలమైన ఓ మహిళా 

నీకు వందననం పాదాభివందనం.... 



*ఇంద్రావత్ రాహుల్* 

      *కొత్తపేట్*

 *నిజామాబాద్*

  9848054079..

[07/03, 9:14 PM] Rapolu Aruna Siripuram Poet: యత్ర నార్యస్తు పూజ్యంతే


మహిలో మహత్తు కలిగిన మహనీయురాలు మహిళ

 

తాను తనకోసమై

ఎప్పుడూ బ్రతకదు


చిన్ననాడు తన ఆట పాటలతో

ఇంటిల్లిపాదిని అలరిస్తూ

అందరినీ ఆకట్టుకుంటుంది


అమ్మచాటుబిడ్డగా 

ఆ ఇంటి మహాలక్ష్మిగా

కళకళలాడుతూ మురిపిస్తుంది


తాను పుట్టిపెరిగిన వాతావరణం విడిచి

మెట్టినింట అడుగుపెట్టి

సర్వస్వాన్ని ధారబోస్తుంది


మగువ, మల్లెతీగ

జతలేక బ్రతకలేవంటారు

కానీ...

జీవం లేని ముళ్లపందిరినైనా

అల్లుకుంటూ

తన సౌరభాల్ని వ్యాపిస్తుంది


తరుణి తరువు లాంటిది

ఉన్నచోట ఉనికిని కాపాడేందుకు

ప్రకృతిని ఆసరాగా చేసుకుని

పచ్చని సంసారంలో

చల్లని నీడనిస్తుంది

తీయని పండ్లనిస్తుంది


అంతేనా ఆడది అంటే

అసలు ఆమె లేనిదెక్కడ?

పొలం పనుల్లో, కర్మగారాల్లో,

బడిలో, బస్సులో, ఖాకీ దుస్తుల్లో,

సాంస్కృతిక కార్య కలాపాల్లో,

అడవుల్లో, సముద్రగర్భంలో,

ఆకాశంలో, అంతరిక్షంలో


ఎక్కడచూసినా మగువ

తక్కువేమికాదు కదా

అన్ని రంగాలలో అడుగుపెట్టిన మహిళ

 తన ప్రతిభ చాటుతూనే వుంది



ఏడాదికొక్క రోజు

ఉత్సవాలుకాదు కావాల్సింది

సంపూర్ణ భద్రతతో

స్త్రీకి రక్షణ కావాలి


అందుకు అందరు తల్లిదండ్రులు చైతన్యవంతులై

తమ సంతానాన్ని ఉత్తమంగా

తీర్చిదిద్దాలి


ఎక్కడ మహిళ గౌరవించబడుతుందో,

అక్కడ దేవతలు కొలువుంటారు

✍రాపోలు అరుణాస్వామి, సిరిపురం


- - - - - - - - - - - - - - - - - - - - - - 

ఈ రచన నా స్వంతం. ఈ సమూహం కోసమే వ్రాసినదని హామీ ఇస్తున్నాను



Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...