Skip to main content

భూతాపం 032021

 నిర్వహణ

వెన్నెల శిల్పం సృష్టి కర్త

శివునూరి లలితాకృష్ణ

****************

1.కోరాడ నరసింహారావు గారు

2.డా.ఆంజనేయులు గారు

3.మన్నె లలిత గారు

4.జక్కిడి వెంకట రెడ్డి గారు

5.సుగుణ మద్ది రెడ్డి గారు

6.సునంద వురిమళ్ళ గారు

7.డా.బల్లూరి ఉమాదేవి గారు

8.డా.దీపక్ న్యాతి గారు

9. దీపావళి ఉషారాణి గారు

10.సుధారాణి కృష్ణం రాజు గారు

11.ప్రమోద ముని మడుగు గారు

12. మర్రి జయశ్రీ గారు

*********

1

 ✴️✴️✴️✴️✴️✴️✴️✴️

కవితాగానం

నేటి అంశం

27.03.2021


*కాలుష్యపు పాపం -భూతాపం*


ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు

అంశానికి కవితలతో

స్పందించగలరు.


ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.


✴️✴️

అంశం :-"కాలుష్యపుపాపం ................భూతాపం..... "

 కోరాడ నరసింహా రావు....!

  @  ప్రాణ సంకటం....! @

      @@@@@@@@

మితి మీరిన మనిషి సుఖం

కాలుష్యపు రక్కసిగా మారి

ప్రాణాలను హరించగావిషపు

కోరలు చాస్తోంది....!

మనిషి చేసిన.... చేస్తున్న...

పాపమిది..., ఫలితాన్ని రుచి

చూపు తోంది....!!

ప్రకృతి సిడ్డముగ పోందిన దానికి తృప్తి చేందని ఓ మనిషీ

అధిక సుఖములకు అర్రులు చాస్తూ... హద్దులనే మీరావూ!

సహజమ్మును వీడి నీవు కృ తకమ్గా మారావు...ఈ పంచ భూతాలనూ... సంకరం తో

నిమ్పావూ...!!

నీ స్వార్ధ సౌ లభ్యానికి ప్రకృతి నే వికృతి చేసేవూ.....,

నీ సమాధి గోతులు నీవే...

తవ్వుకుంటు న్నావు....!

సమతుల్య సహజానంద భూగోలము నేడు మల మల

మాడ్చే అఘ్ని గోలమయ్యే నేడు....!!

ఏ సీ లు... ఫ్రీజ్జులు వాడుతు

మరింత వేడిని పేంచేవు...!

నీ భావి వారసుల బ్రతుకు

బుగ్గిపాలు చేస్తున్నావు...!!

ఓ మనిషీ... ఇకనైనా... మైకమును వీడి కళ్ళు తేరు !

ప్రాణికోటి మనుగడ కోసం...

ప్రయత్నాలు ప్రారంభించు...!!

  **********************

      .....కోరాడ.

2

[27/03, 8:15 PM] 

మన్నె లలిత గారు కవయిత్రి: 

కవితా గానం

 తేదీ :27 /03/21

 అంశము: కాలుష్యపు పాపం -భూతాపం

 పేరు :మన్నె పిన్నక లలిత

 ఊరు: హైదరాబాద్


 ప్రకృతి శాపం ,మానవుని తాపం


 నాడు లేని  కల్మషం,  నేడు ఇస్తుంది కాలుష్యం

 ధన దాహం లేని కాలం

 ఆంధ్ర అన్నపూర్ణ అయిన కాలం

 ఆకలిగొన్న వానికి ,బుక్కెడు బువ్వ పెట్టిన కాలం

 పచ్చని పంటలు ,పాడి పశువులతో 

 అలరారిన  కాలము

  నీటి జల సమృద్ధిగా ఉన్న కాలము

 నేడేది? వీటన్నిటికీ వెతుక్కుంటున్న నేటి మానవుడు


 సోమరితనం, ధనదాహం పెరిగి

 ఆయాచితంగా వచ్చే డబ్బులకు మరిగి

 అంతస్థుల పై అంతస్తులు పెరిగి

 భూమిలోని జల తరిగి

 ప్రాణాధారమైన చెట్లను ,అడవులను

 నరికి

 కాలినడక మాని ,వాహనాల  రవాణా పెరిగి

 పరిశ్రమల కాలుష్యాన్ని నీటిలో కలిపి

 'ప్లాస్టిక్' వాడకాన్ని నిషేధించక

 మురుగును పెంచి,  ఆయుష్ తగ్గించి

 సహజ వాయువు పీల్చలేక

 కృత్రిమ వాయువులు  పీలుస్తూ

 కాలుష్య పాపాన్ని అనుభవిస్తున్న

 నేటి మానవుడు

' ఓజోన్ 'పొర ద్వారా

 వేడి ఎక్కువై, భూతాపం పెరిగి

 వర్షాలు తగ్గి, అల్లాడుతున్న నేటి మానవుడు

 కాలుష్యపు పాపం పెరిగి ,భూతాపం పెరిగి

 ప్రాణవాయువు కై పరుగులు పెడుతున్న

 నేటి మానవుడు

 జ్ఞాని అయిన మానవుడు

 నూతన విజ్ఞానంతో 

కాలుష్య భూతం  భూతాపం

 పోగొట్టే పథకములతో ముందుకు సాగి 

భావితరానికి జల ,ప్రాణవాయువును ఇవ్వాలి

3

[27/03, 8:30 PM]

 డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ప్రపంచమంతా కాలుష్యం కోరల్లో చిక్కుకుంది మనుషులందరూ కాలుష్య జలం తాగుతూనే ఉన్నారు


వాయు కాలుష్యంతో ఆస్తమా పేషెంట్లు గా క్యాన్సర్ పేషెంట్లు గా మిగిలిపోతున్నారు


ప్లాస్టిక్ పెనుభూతం క్యాన్సర్ కారక మై ఎక్కడ వేసిన అది కరిగి పోవడం లేదు

మనిషి ఎంత జ్ఞాని అయినప్పటికిని ఎన్ని పరిశోధనల ఫలితాలు అందుకున్నప్పటికీ ఇంకా ప్రకృతి ముందు నిస్సహాయుడు



అందుకే ప్రపంచమంతా కాలుష్యం పెనుభూతమై అతన్ని వెంటాడుతూనే ఉన్నది అనేక రోగకారక మూలం అవుతున్నది



ఉంటాను భావితరాలకు రాబోయే కాలానికి ఆక్సిజన్ బార్లు రాబోతున్నది


ఆహార కాలుష్యం సమస్త కాలుష్యం పెనుభూతమై అవినీతి కూపంలో చిక్కుకున్నది


కాలుష్య మా తరిమికొట్టండి అందుకే నేడు కారో నా లు పెనుభూతమై మానవ విషాదానికి మరణాలకు మూలమై ప్రపంచాన్ని అల్లకల్లోలం పరుస్తున్న ది



జాగ్రత్త తస్మా తస్మాత్

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

4

  అంశం :కాలుష్యపు పాపం -భూతాపం ...

    పేరు : జక్కిడి వెంకటరెడ్డి .

  ......   .........    .........

   కాలుష్య భూతం 

   కరాళనృత్యం 

   దానిని ....

      సృష్టించిన   మనిషేమో 

   కుంభకర్ణ నిద్రలో 

   ఏమిపట్టనట్లు ....

   ఎవరికీ వారు 

    నాకెందుకులే అని 

  నేనే బుద్ది జీవినని 

   తనకు  తానే 

    భూతాపం పెంచి 

  భూస్థాపితమయితున్నాడు ...

    బుద్ధిలేని 

    బుద్దిజీవి 

    ఉనికికి ఉప్పెనెదురైతున్నా 

       ఉలుకు పలుకు 

     లేకా ....

   లగ్జరీకి 

     లెక్కలేసి ....

     గొప్పలకు 

   రంకెలేసి ....

     తనగోరికి తానే 

    రాళ్లను పేర్చుకొని 

    అద్భుత కట్టడమని 

     తన ఆచూకీ 

    వెతుకుకొని 

      ఆనంద పడుతుండు ...

    అల్ప సంతోషి .....

    సకల జీవులకు 

     మరణశాసనం రాస్తూ 

    సకలం తానే   అంటుండు ...

       శకలం లాగ 

     మారనుండు ...

    ఈ  మనిషి ...

      భూ గ్రహానికి 

     గ్రహణం పట్టించి....

      కాలుష్య ధూళిని 

        పెంచి ......తాను 

    అంతరిక్ష  ధూళిలో 

      ఐక్యం అవుదామనేమో  .......

         ---జక్కిడి వెంకటరెడ్డి .

5

భూతాపం

ప్రకృతి లో మనిషి   ఆనాడు


ప్రకృతి   లో మనీ, కోసం చేసే పోరాటమే కాలుష్య పాపం నేడు

 కనిపించని శాపం 


నీరు కాలుష్యం... 

గాలి కాలుష్యం... 

మనిషి కాలుష్యం... 

మనసు కాలుష్యం.... 

స్వార్థం అనే ధన దాహంతో ప్రకృతిని నాశనం చేస్తూ తనను తాను నాశనం చేసుకుంటున్న  ఓ.. మనిషి...... 


చెట్లు నరికి పాపానికి గురై

గాలి లేక వర్షాలు లేక 

  పుడమిని  కాపాడే 

అన్ని పొరలు కరిగి పోతుంటే అన్ని తెలిసి..... కాపాడలేని 

ఓ..... మనీ........ షి..... 

చెట్లు పెంచు 

కాలుష్యం నిరోధించు భూతాపం తగ్గించు మానవత్వం ముంచు

భావితరాలను బతికించు

   పరిసర  పచ్చదనం పెంచు


 ప్రకృతి లో నీవొకడివై జీవించు   భూతాపం తగ్గించు. 

  సకల జీవులను బతకనీ..... 


సుగుణ మద్దిరెడ్డి 🌹ఐలవారిపల్లె

ఐరాల

6

సునంద వురిమళ్ళ గారు:

 *కవితా గానం*

తేదీ: 27-03-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: కాలుష్యపు పాపం.. భూతాపం

**********************

అమ్మకు జ్వరమొచ్చింది

ఒంట్లో పాల ధారలను పీల్చి పీల్చి పిప్పి చేయడంతో

అనీమియా పేషెంట్ లా మారిన అమ్మకు

 పచ్చని కోకగట్టి 

పసిడి సిరులను కొంగున దాచిపెట్టే అమ్మ చీరను

దుశ్శాసన సంతతి లాగి తగలబెట్టడంతో

ఒళ్ళంతా ఎడారుల గాయాలైన అమ్మకు..


సమున్నతంగా తలెత్తి నిలిచిన

గిరి శిఖరాలను

సమూలంగా నాశనం చేసిన

పరశురాముని వారసుల వల్ల

 కండల కొండలు కరిగి 

చిక్కి శల్యమైన అమ్మకు...


 సెలయేటి గలగలలతో

జలజలా పారే జలాలతో కళకళలాడుతున్న  మోములో జీవ కళను ఎత్తుకు పోయిన

దుర్మార్గుల దుష్టత్వంతో

కాలుష్య రోగాల బారినపడి అమ్మకు...


తన చుట్టూ రక్షణగా నిలిచిన ఓజోన్ కవచ కుండలాలను

దోచుకున్న 

అవివేక మానవుల పట్ల

భరించరాని తాపంతో విలవిలలాడుతున్న అమ్మకు...

 

జ్వరమొచ్చింది..

ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉంచేంత ప్రమాదంలో పడిపోయింది అమ్మ..మన అవనమ్మ..


అమ్మ ఆగమైతే బిడ్డలకు బతుకేదీ

సమస్త జీవుల ఉనికేదీ

పంచభూతాలు నిర్వీర్యం అయ్యాక

మానవ మనుగడకు దారేది..?

రేపటి తరానికి వెలుగేది..?

7.

[28/03, 8:31 PM] Balloori Umadevi Poetess: కవితా గానం

డా బల్లూరి ఉమాదేవి

అంశం:భూతాపం

 శీర్షిక:అవని వేదన:


సహనశీలివంటు మునగచెట్టెక్కిస్తారు

ముందరి కాళ్ళకు బంధాలే వేస్తారు

సహనముకు హద్దుంటుందని తెలుసుకోలేరు

మీ బరువునెప్పుడూ యెత్తుకొని తిరిగేను

ప్రతిఫలంబేదియు నాశింపనూలేదు

నా మానాన నన్ను బ్రతుక నిచ్చుట లేదు

చెత్తా చెదారలతో ముంచెత్తు తున్నారు

అలనాడు నను నీట ముంచె నా రక్కసుడు

వుద్ధరింపగ వచ్చె నా పరంధాముడు

నేడెవరితో  నేను మొర పెట్టుకోను

కాపాడి కరుణించు నాథు డెవ్వాడు

ఆగ్రహంబున నేను వురిమి చూశానంటె    

కంపించి పోయేను భూగోళమంతా

నిలువనీడైన మీకు దొరకదిది నిజము.

[28/03, 8:35 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: గాంధీగిరి

గాంధీజీ అంటే ఆనాటి స్వాతంత్రోద్యమంలో అర్ధ దిగంబరిగా ప్రజలందరినీ చైతన్య పరిచిన శక్తి


అనేక ఉద్యమాలు నడిపించిన ఘనుడు సత్యాగ్రహమే సాధనమ్మ


అహింస పరమ ధర్మంగా భావించి దక్షిణాఫ్రికా నుండి భారత భూమి అంతటా స్వాతంత్రోద్యమ జ్వాలను రగిలించిన జాతి గాంచిన మహాత్ముడు


ఆయన అపార శక్తి ముందు మనమంతా దిగదుడుపే


చకచకా నడిచేను భూమి కంపించెను అయితే నేమి

కోమటి పుడితేనే మా గాంధీ

కొల్లాయి గట్టితేనేమీ మా గాంధీ అంటూ అందరూ గాంధీ టోపీ పెడతారు

గాంధీ గాంధీ ఆశించిన ఖద్దరు ధారణ కోరుతారు


అందరికీ టోపీలు మాత్రం పెట్టకండి


ఓ మహాత్మా ఓ మహర్షి

దండి సత్యాగ్రహం సత్యాగ్రహం

సత్యాగ్రహం అన్నింటిలో నీవే ఉన్నావు


ఉద్యమాలు అన్నీ నీవే దేశానికి స్వాతంత్రం తెచ్చింది ప్రధానమైన నీ ఆశయము ఆదర్శం మహాత్మా ఓ మహర్షి


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7703537453

8.

[28/03, 8:35 PM] దీపక్ న్యాతి: *కవితాగానం* 

డా.దీపక్ న్యాతి

తేది : 28.03.2021

అంశం :  భూతాపం

శీర్షిక : జన్మ సార్థకం


పంచభూతాలు సమతుల్యం

భూమండల ప్రపంచం

అతివృష్టి అనావృష్టి దురదృష్టం

సమతుల్యాన్ని కాపాడుకో

సమర్ధత విశ్వ సూత్రం

అత్యాశల అసమర్థత

ప్రకృతిని పలచన చేస్తుంది

వివేకవంతమైన మనిషిగా

స్వార్థపు హద్దులు దాటకుండా

కృత్రిమ వనరుల పెంచకుండా

జలమును జాగ్రత్త చేయకుండా

విపరీతంగా విద్యుత్ వియోగించకుండా

భూతాపాన్ని కాపాడుకునే

గురుతర బాధ్యత నెరిగి

భవితను భావితరాన్ని భద్ర పరుకో

మనిషి జన్మ సార్థకం చేసుకో


డా.దీపక్ న్యాతి

దివిటీలు ప్రక్రియ రూపకర్త

హైదరాబాద్

9

[28/03, 8:44 PM] +91 70755 17538: శీర్షిక.భూతాపము

.........

పెరిగిపోతున్న జనాభాకు

తరిగిపోతున్న వనరులకు

పట్టణముల అభివృద్ధి దారిలో

పెరుగుతున్న పరిశ్రమలతోను

భూమాత అతలాకుతలం ఐపోతువుoటే

విచక్షణ మరిచి అణువణువు ప్లాస్టిక్ వాడి

విషతుల్యము చేస్తున్న మనిషి తీరు

భూమాత ఉగ్రరూపముతోను అతలాకుతలం అవుతున్న ప్రకృతిమాతను

కాపాడి అడవులను పెంచాలసిన బాధ్యత అందరిదీ

రాబోయే తరానికి జలవనరులను అందించి

భావి జగతిని బంగారు మయo చేయాలి

భావి తరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించాలి


ధనాశి ఉషారాణి

చిత్తూరు జిల్లా

10

[28/03, 8:55 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏 సుధారాణి కృష్ణంరాజు🙏

*అంశం*భూతాపం*

28-03-2021(ఆదివారం)

*పర్యావరణ కాలుష్యముతో

భూతాపం పెరిగి ప్రకృతి భీభత్సాలకు కారణంగా మారు తున్నాయి 

పర్యావరణం పరిరక్షణ లేక చెట్లను నరకడం వలన భూతాపం ఎక్కువగా పెరిగి పోతుంది

ఎక్కడ చూసినా పరిమితి లేని ఆకాశహార్మాలు వృక్ష సంపదకు

నష్టం కలిగించి ఎటు చూసినా

ఇళ్ళు కట్టి పచ్చదనం లేకుండా

అలాగే పరిశుభ్రత లేని మానవ దురలవాట్లకు భూమి మీద ఉన్న జీవరాసులు భూతాపం తో విల విల కొట్టుకుని భరించలేని ప్రకృతి విలయం సృష్టించి కష్ట నష్టాలు కలగజేస్తూ పచ్చదనం స్థానంలో భూతాపం తో పంటలు పండక సమయానికి

వరుణ దేవుని కరుణ లేక‌ భూకంపాలు పెరిగి‌జనులు అనేక వ్యాధుల బారినపడి

కోలుకోలేక పోవడం చెట్లను నాటుదాం

పచ్చ దనమే పరిశుభ్రత  ప్లాస్టిక్ 

కవర్లను నిషేధించడం మొక్కలను పెంచడం ద్వారా 

కాలుష్య నియంత్రణ చేయడం

వ్యర్థాలను జన సమర్థ ప్రదేశాలలో కాకుండా వాటికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన

వాటిని ఉపయోగించకుని

భూతాపం తగ్గించవచ్చు

స్వచ్చ భారత్ ను సాధించుటే

అందరి బాధ్యత కావాలి🙏🙏👍

[28/03, 9:08 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: భూతాపం

కాలుష్య నియంత్రణ చేయటం చుట్టూరా పరిసరాలను శుభ్రం చేయకపోవడం


ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాలు వాడడం

జల కాలుష్యం ప్రకృతిని ధ్వంసం చేయడం

అరణ్యాలను ధ్వంసం చేయడం

ప్రకృతి లో జన్మించిన మనిషి ఇ ప్రకృతిలోనే తన ఆధిపత్యాన్ని చూపి 


అందుకే ప్రజలంతా స్వచ్ఛ భారత్ ను పాటిస్తూ

అందరూ బాధ్యతతో మెలిగిన అప్పుడు

సమస్త కాలుష్యాలు ధ్వంసమై పోతాయి

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453

11

[28/03, 9:09 PM] Pramoda Munimadugu Poetess: శీర్షిక:భూతాపం:

ప్రమోదమునిమడుగు


పచ్చని ప్రకృతి లో...

సకల చరాచర జీవజాలం తో, 

స్వచ్ఛమైన సెలయేరుల గలగల లతో,

అమ్మతనపు కమ్మదనాన్ని అనుభవిస్తూ

భూగోళం ....ప్రశాంతంగా సేదతీరింది

కానీ.....

ఆ ఆనందం మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. 


ప్రకృతి లో మానవుని వికృత చేష్టలకు ప్రతిబింబాలు.గా...

వాతావరణం లోనీ వింత మార్పులు

మానవులకు వచ్చే విచిత్ర రోగాలు

పంచభూతాల సాక్షిగా...కనుమరుగైన  ఆరోగ్యకరమైన జీవన విధానాలు...

పచ్చని ప్రకృతి ..కాంక్రీట్ జంగిళ్లుగా

పీల్చే గాలి... తినే తిండి....తాగే నీరు అన్ని విషతుల్యమైన వైనం.              ప్లాస్టిక్కు తో ప్రతి పని ముడిపెట్టినం..

అధ్వాన్నం గా మారి కనుమరుగవుతున్న

అపురూప జీవజాలం

 ఆధునికత ముసుగులో...అజ్ఞానం లో మనం....

ఫలితంగా పెరిగిన భూతాపం...

హీమానీ నదాల......అస్తిత్వం ప్రశ్నార్థకం??                                      మన తప్పులు మనమే సరిదిద్దుకోవాలి                                 పునరాలోచనం చేసుకోవాలి.          రేపటి నవ తరానికి బతుకునివ్వాలి.                    అందుకే మనమంతా....తిరిగి ప్రకృతి దగ్గరికి చేరాలి....ప్రకృతిలో మమేకం కావాలి

12

[28/03, 9:30 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..భూతాపం

శీర్షిక...భరోసా నిస్తేనే




పచ్చని పంటలతో 

అలరారే పల్లెల రూపు రేఖలే మార్చేసి

ఆధునికత పేరుతో

అడవులను మాయ చేస్తూ

ఆకాశ హార్మ్యాలను నిర్మిస్తూ

నాగరికత అంటూ

సాంకేతికత వైపు పరుగులు తీస్తూ

కాసుల వేటలో 

స్వార్థంతో జీవిస్తున్న మానవుడు

ఫ్లాస్టిక్ భూతానికి ప్రాణం పోసి

పంచభూతాలను కలుషితం చేస్తూ

భూతాపానికి కారకుడై

భస్మాసుర హస్తం తనపైనే సంధించు కుంటున్న వేళ

పుడమి తల్లికి ఆవేదన మిగిలి

ఆమె కంటిలో నీరే కరువైంది

వింత రోగాలన్నీ చుట్టుముడుతూ

జీవకోటి మనుగడయే ప్రశ్నార్ధకమవుతున్న వేళ

ఓ మనిషి !ఇకనైనా మేలుకో!

తరువులను పెంచి

వర్షాలను ఆహ్వానించి

భావి తరాలకు భరోసా నిస్తేనే

జీవజాతులు మనగలిగేదని మరువకు

ప్రకృతి పరిరక్షణయే కర్తవ్యంగా సాగిపో.

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...