Skip to main content

లోకం పోకడ 18032021

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ

Author of vennela shilpam

**************

1.దీపక్ న్యాతి గారు

2.సుధారాణి కృష్ణం రాజు గారు

3.డా.ఆంజనేయులు గారు

4.అపరాజిత్ గారు

5.కెసి నరసయ్య గారు

6. పరాంకుశం రఘు నారాయణ గారు

7.మర్రి జయశ్రీ గారు

**********

[18/03, 7:18 PM] Lalita Sister: 🌻🌻🌻🌻🌻🌻


కవితాగానం


18.03.2021

నేటి అంశం


*లోకంపోకడ*



ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు

అంశానికి కవితలతో స్పందించగలరు.


ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.


🌻🌻🌻🌻🌻🌻

1

[18/03, 8:12 PM] దీపక్ న్యాతి: *కవితా గానం* 

పేరు : డా.దీపక్ న్యాతి

తేది : 18-03-2021

అంశం : లోకం పోకడ

శీర్షిక : నెరవేరని మొక్కులు


సాటి వారితో పోటీ పడడం పోకడ

పోకడ కోసం నానా పాట్లు అగచాట్లు

పోకడలతో ఒరిగేది ఏమి లేదు

పోకడలతో పెత్తనం రాదు

పోకడలతో పరువేం పెరగదు

సహజానికి అసంమంజస పోకడలు

నా ప్రేమెక్కువని దంపతుల పోకడ

సంతానాన్ని పోషిస్తున్నాననే పోకడ

గురువు వద్ద అతివినయ పోకడ

బంధువుల వద్ద పరువుల పోకడ

మిత్రునితోడ మంచితనం పోకడ

భగవంతుడి ముందు అతిభక్తి పోకడ

సమాజంతో నటన మాడే పోకడ

నాయకుడి నిజాయితీ పోకడ

ఆస్తి అంతస్తులు పెంచే పోకడ

గౌరవ మర్యాదలు తెచ్చి పెట్టుకునే పోకడ

విజ్ఞానినని వివేకం లేని పోకడ

పుణ్యానికై అసందర్భ దానం పోకడ

పోకడల ఫలితం పగటి చుక్కలు

నెరవేరని అత్యాశల మొక్కులు


డా.దీపక్ న్యాతి

హైదరాబాద్

2

[18/03, 8:32 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏 కవితా గానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*అంశం*లోకం పోకడ*

18-03-2021(గురువారం)

*అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇది లోకం పోకడ ఎప్పుడూ ఎదుటి వారిని విమర్శించడం తమ తప్పు లను కప్పి పుచ్చు కోవడం

స్వార్థం వంచన తాము బాగుండాలనే స్వార్థం మంచిదే

అది ఎదుటి వారిని పడగొట్టి

పొందే ఎదుగుదల గొప్ప కాదు

లోకం తీరు ఇంతే అని సర్ది చెప్పుకొన్న వారిని బలహీనులు గా జమకట్టి వారిపైన పెత్తనం

చేసే నేర్పరులు వారి సంతోషం

కొరకు ఏదైనా చేయగల సమర్థులు అపవాదులు వేసే

లోకం తరువాత జరిగే పరిణామాలు పట్టని లోకం

నా పోకడ ఇంతే ఏవిషయం

అయినా చిలువలు పలువలుగా సృష్టించే నైజం

అన్నట్టుగా ప్రవర్తన తో అమాయకులు బలి అవుతున్నారు

లోకం అంటే అందరం కలిస్తేనే

కదా లోకం అలాంటప్పుడు ఎవరికి వారే లోకం పోకడ ఇంతే అంటారు లోకంలోని

అందరి లో నైతిక మైన మార్పు

తో మాత్రమే కుతంత్రాలు లేని

లోకాన్ని సృష్టించే నేర్పరులు

లోకం లోని బాధ్యత గల జనులే కదా జగతిని మార్చే

మేధావులు🙏🙏👍

3

[18/03, 8:44 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: లోకం పోకడ , మార్గము వాళ్లదే నైతిక విలువలతో మానవీయ విలువలతో కుట్రలు కుతంత్రాలు చక్కటి



నిరంతరం మానవీయ మమతలు పూజించాలి అప్పుడే మనిషిగా లోకంలోని బాధ్యతగల సంఘంలోని విలువ అ పొందినప్పుడే నిజమైన మనిషి

అందరికీ వందనాలు అదియే నా జీవన సౌభాగ్యాలు

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి నేర్పరులు బాధ్యతగల జనులు జగతిని మార్చే మేధావులుగా వారికి వందనాలు అలాంటి వాళ్ళను వందనాలు సమర్పించి ముందుకు సాగాలి

4

[18/03, 9:00 PM] Aparajith: కవిత అంశం: నూతన సంవత్సరం 

శీర్షిక: సామాజిక పోకడలు 

రచయత పేరు:  ఎం ఆపరాజిత్ రెడ్డి 

ఫోన్ నంబర్: 9848532031

ఊరు: సూర్యాపేట 

జిల్లా:సూర్యాపేట 


ఆది ఏది? అంతం ఏది?

మానవ మదికి గోచరించని 

నిరంతర కాల ప్రవాహంలో 

కాలభైరవుడి నిరంతర నర్తన ఆగదు!

క్షణాలు గంటలుగా రోజులుగా వత్సరాలుగా 

గతించిపోతూనే వుంటాయి!

చీకటి వెలుగుల దివారాత్రులు 

చిరిగిన వస్త్రాలు విడిచి 

సరికొత్త వస్త్రాలు ధరించినట్లు 

సంవత్సరాలకు సంవత్సరాలు గడిచిపోతూనే వుంటాయ్!

అంతుపట్టని జటిలమైన మానవ మేధస్సు 

సరికొత్త పుంతలు ప్రయోగాలు సళ్పుతూ 

సైన్స్ లో వింత వింత పోకడలు పోతూనే వుంటారు!

మానవుడు సాధించిన ప్రగతి చిన్నబోయేట్లు 

అన్నార్తుల ఆకలి కేకలు 

మానప్రాణాలకు రక్షణ లేని పడతులు అభాగ్యులు,,,,,,,!

నిర్వీర్యమై దేశదిమ్మరుళ్లా తిరిగే యువత 

ఎంతటి ఊడీగమైనా చేస్తామన్నా 

ఉద్యోగాలివ్వని ప్రభుత్వం!

ఇందులోనే రక రకాల వైరస్ లు చుట్టుముట్టి 

ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైనం!

మనిషి గ్రహాంతరాళల్లోకీ వెళ్లినా 

యువత వ్యక్తిత్వ నిర్మాణం లేక 

ప్రవర్తనా తీరు వికారాలు బోతూ!

ఆకతాయిల వింత వింత రోతగొల్పు పోకడలు 

ఈ కొత్త వత్సరంలోనైనా 

ఈ బికారి సమాజం సరికొత్త మనోభావాలతో 

ఉన్నతంగా మహోన్నతంగా ఎదగాలని ఆ పరమాత్మున్ని ప్రార్ధిద్దాం!


ఆపరాజిత్ 


హామీ పత్రం: ఇది నా స్వీయ రచన

5

[18/03, 9:04 PM] KC Narsaiah KS 26: కవితా గానం

పేరు: కేసి నరసయ్య

18-3-2021

అంశం: లోకం పోకడ

శీర్షిక: స్వార్థం వెంట పరుగులు



 కదం తొక్కుతున్న అభివృద్ధి

 రూపురేఖలు మారుతున్న పల్లెలు

 జిగేల్ మంటున్న నగరాలు పట్టణాలు

 అంతరిక్షంలో

 అంత్యాక్షరి ఆడుతున్న మనిషి

 పాలకులు పాలితులు

 అందరిదీ ఒకటే దారి

 స్వార్థం వెంట

 పరుగులు పెడుతున్న మనిషి

 నీతికి స్వస్తిచెప్పి అవినీతికి జేజేలు

 సహనం కోల్పోతున్న జీవి 

 మానవతా విలువల కోసం

 ఎండమావుల వెంట పరుగులు

 లోకం పోకడలో అందరిదీ గొర్రెపోకడ దారే

6

[18/03, 9:17 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితా గానం* 


  *అంశం :లోకం పోకడ* 

************************

లోకం పోకడ ఎలా ఉన్నా!


 మన తాహతును గమనంలోకి,


 తీసుకోవడం మరీ ముఖ్యం!!


 మంచిని గ్రహించు!


 చెడును త్యజించు!


వృధా ఖర్చును తగ్గించు !


పొదుపును పాటించు!


 పోలికకూ, ఓ..హద్దుoటుందని మరువకు!


అత్యాశకు వెళ్లి నిరుత్సాహంతో కృంగిపోకు!


 సంతృప్తి జీవనమే ఉత్తమం !


స్వీయ విశ్లేషణమే అత్యుత్తమo!!


లోక o తీరును పరిశీలించడమే  జీవనం సఫలం!!!


 పరాoకుశం రఘు నారాయణ

       మహబూబాబాద్

7

[18/03, 9:27 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం...లోకం పోకడ

శీర్షిక....మాయాజాలం




ఆధునిక కాలం

అంతా మాయాజాలం

వింత మనుషులు

విపరీత పోకడలు

ఊసర వెళ్ళిలా మారే 

విచిత్రమైన ప్రవర్తనలు

స్వార్థంతో ఎంతటి దారుణాలకైనా వెనుకాడని 

అమానవీయత నేటి నాగరికత

అవసరంలో అందమైన అబద్ధాలు చెబుతూ

అమాయకులను వంచించడం 

నేటి లోకం తీరు

మంచి అనేదే కరువైపోయి

మానవతా విలువలు దిగజారిపోయి

రాక్షసుల్లా మారిన మానవ మృగాల మధ్య ఆడపిల్లల బతుకులు అగమ్యగోచరం 

అనుబంధాలు,ఆప్యాయతలు

అడుగంటిపోయి

మనుషులు ఏకాకులుగా జీవిస్తున్న దౌర్భాగ్యం

కనిపెంచిన తల్లిదండ్రులు

కన్నపిల్లలకు బరువైన రోజులివి

తను బాగుంటే చాలు

ఎదుటివారు ఏమైతే నాకేం అనుకునే క్రూర స్వభావం రాజ్యమేలుతున్న రాక్షసలోకం

డబ్బుంటే చాలు ఏదైనా చేయగలమనే వెర్రి ఆలోచనలు

మనిషికి మనిషిని దూరం చేసే మాయదారి రోజులు

ఆపదలో ఉన్నవాడిని ఆదరించలేకుండా

అమాంతం ఉసురు తీసే విషపు దినాలు

ఇదే నేటి లోకం తీరు

మంచితనమేదో

నటనమేదో గుర్తించలేని రోజులు

కుతంత్రాల ప్రణాళికలు

వ్యూహారచనలు చేసే లోకం తీరు మారేది ఎన్నటికో మరి

[18/03, 9:35 PM] Lalita Sister: 18/3/21

కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి

అంశం:లోకం పోకడ.


చిత్రమైనదీలోకం

అంతు చిక్కని మాయా జాలం

ఎప్పుడెలా మారుతుందొ

తెలియబోదెవ్వరికీ

పనులు జరిగినపుడేమో

ఘనత చాటుకోవడం

పనులు విఫలమైన

దైవంపై నెట్టడం

గాలిలోన దీపమెట్టి

వెలుగుతుంటె తన గొప్పనడం

ఆరిపోతె కర్మనడం

పరుల బాధ జూచి ఎగతాళి చేయడం

ముఖస్తుతిని చేస్తూనే

వెనుక పోటు పొడవటం

నరంలేని నాలుకంటు

పరులను నిందించడం

గురివిందగింజ తన నలుపు

తానెరుగనట్లు పరులను

చులకన చేయడం జన నైజం

ఎపుడు మారు నీతీరు?

తీరు మార్చే దైవ మెవరు?

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...