నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*******************
1.మన్నె పిన్నక లలిత గారు
2.డా.ఆంజనేయులు గారు
3.కోరాడ నరసింహారావు గారు
4.సుగుణ మద్ది రెడ్డి
5.సుధారాణి కృష్ణం రాజు గారు
6.డా.బల్లూరి ఉమాదేవి గారు
7.ధనాశి ఉషారాణి గారు
8.మర్రి జయశ్రీ గారు
*******
1
[24/03, 8:00 PM]
మన్నె లలిత గారు కవయిత్రి: కవితా గానం
తేదీ :24/ 3/21 .బుధవారం.
నేటి అంశం :ఓదార్పు
శీర్షిక :ఒక్క క్షణం ఆలోచిస్తే....?!
పేరు ;మన్నె పిన్నక లలిత
ఊరు :హైదరాబాద్
చరవాణి సంఖ్య: 741 686 32 89.
సమస్యల వలయంలో తిరిగే మనిషి
చిన్న ఆధారం కోసం వెతుకులాడి
గడ్డిపోచ ఆధారం దొరకక
నట్టనడి సముద్రంలో మునిగి పోతున్నాడు
ఒక్కో మనిషికి ఒక్కో వ్యసనం
అందరి వ్యసనం చరవాణి
బాధ్యతలు మరచిన బంధుత్వాలు
ఆపదలో ఆదుకోలేని స్నేహితులు
పక్కవారితో మాట్లాడలేని
కష్టసుఖాల్లో భాగస్వామ్యం
పంచుకోలేని మనుష్యులు
అందరూ ఉండి ఎవరూ లేని ఒంటరి వారై
సుఖంలో లేకపోయినా కష్టంలో
భుజం పై భరోసా ఇచ్చే చేయి
నోటి నుండి ఓదార్పు
కష్టంలో ' నీకు నేనున్నాను 'అంటూ
ఓదార్పు నిచ్చే ఒక అమృతపు మాట
'మరణమే శరణ్యం' అనుకున్న మనిషిని
మరణం దిశ నుండి మరల్చదా?!
2
[24/03, 8:14 PM]
డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: మనిషిని
ఆపదలో మనిషిని ఆదుకోవడమే ఓదార్పు నివ్వడమే ఘనమైన నా వ్యక్తిత్వం
వ్యక్తి ఎల్లప్పుడూ మనిషి ఇ ఎదుటి వారి పట్ల అన్ని రకాలుగా
ప్రేమ కోరుతూ అన్ని రకాలుగా మనిషిని ప్రేమించే ఎల్లప్పుడూ ప్రేమ కొరకు కు మనిషిని ప్రేమించే గుణం కోసం ప్రయత్నిస్తూ ముందుకు సాగడానికి మనిషిగా ఒకరికి ఒకరు అందుకే ఆలోచన అమృతం భావించి ముందుకు వెళ్లడం ఆలోచింప చేయడమే నూతనమైన భావాలను ఆవిష్కరిస్తూ
కన్నీళ్లను తొలగించి అమృత భావాలతో మరణమే శరణ్యం అనుకున్నా మమతల మార్గానికి ముందుకు సాగిపోవడం ఎల్లవేళలా ఓదార్పు పొందడం
నూతన భావి ఓదార్పును ఆస్వాదిస్తూ నూతన భావాలతో ఆలోచనల్లో అందరికీ వెలుగును ఆనంద సాగరంలో తేలిపోతున్న భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నా భాగంగా
3
24/03, 8:22 PM] Korada:
కవితాగాన0:-@ ఓదార్పు @
కోరాడ నరసింహా రావు...!
* నువు మనిషివి *
*************
కలత చేందిన హృదయా నికి
ఓదార్పు దివ్య ఔ షధ మే...!
నిరాశా నిష్ప్రుహలతో...
కృ0గి పోయిన మనిషిలో...
నూతనోత్సాహాన్ని నింప టమే
ఓదార్పంటే....!
ఓదార్పు... ఓ దివ్య మంత్ర0!
అది చూపించే ప్రభావం ఇంత
అనిచేప్పే.... కోలమానాలే లేవు
కుప్ప కూలి పోయిన వారిని సైతం...భరోసానిచ్చి భుజం తడితే... అద్భుతాలు సృష్టించి
అబ్బో... అనిపించ గలుగుతారోయి....!
నీలో... నిజమైన మానవత్వం
ఉంటే... ఏదుటి మనిషి బాధను చూసి ...కరిగిపోతావు
నీ నుండి... దయ, జాలి, ప్రేమ
పోంగుకోస్తాయి....! ఆ వ్యక్తిని ఓదార్చే ప్రయత్నం ఖచ్చితం గా
చేస్తావు...! అప్పుడే కదూ నీవు
నిజమైన మనిషివి....!!
********************
.........కోరాడ.
4
[24/03, 8:26 PM] +91 90354 73216:
అంశం. ఓదార్పు
కష్టాల్లోని వ్యక్తికి ధైర్యం
ఇవ్వడం ఓదార్పు.
బాధలో ఉన్న వ్యక్తికి అండగా నిలవడం ఓదార్పు.
గాయపడిన మదికి ఓ తీయని మాట చెప్పడం ఓదార్పు.
పంట నష్టపోయిన రైతుకి భరోసా ఇవ్వడం ఓదార్పు.
బతుకు మీద ఆశలేని వారికి నేనుతోడున్నాననడం ఓదార్పు.
సఫలీకృతం కాకపోతే
వైఫల్యంలోని పాఠాలు
తెలియపరచడమే
అసలైన ఓదార్పు.
సుగుణ మద్దిరెడ్డి 🌷
ఐలవారిపల్లె
ఐరాల.
5
[24/03, 8:51 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*నేటి అంశం*ఓదార్పు*
24-03-2021(బుధవారం)
*ఓదార్పు లేని జీవితం బ్రతుకంతా బాధలమయం
అందరికి ఓదార్పు ఏదో ఒకసారి అవసరం*
*పసివారు గుక్క పట్టి ఏడుస్తుంటే తల్లి ఓదార్పు గా
జోలపాట పాడితే వారికి ఆక్షణం చెప్పలేని అనుభూతి
పొంది ఆ ఓదార్పు చిరునవ్వు గా మారుతుంది*
*ఆస్తులు నష్ట పోయినప్పుడు అయిన వారు దూరమైనప్పుడు ఎటు తెలియని జీవితం తెగిపోయిన
గాలి పటంలా ఉంటే మంచి మిత్రులు పంచే ఓదార్పు వేయి
ఏనుగుల బలం ఆ క్షణంలో
ఆస్తులు పోయిన అపురూపంగా చూసుకునే మిత్రుల ఓదార్పు కోట్లు పోసినా
దొరకదు ఆనందం*
అలాగే పిల్లలను పెంచి పోషించి ఒక ఉన్నతమైన స్థానం లో వారిని చూడాలని
ఉవ్విళ్ళూరే కన్నా వారికి వారి
జీవిత చరమాంకంలో కన్న బిడ్డలు ప్రయోజకులై వారిని కంటికి రెప్పలా ఏకష్టం కలుగకుండా చూసుకుని
రోజు లో ఒక్క సారైనా మనసుకు నచ్చే విధంగా సంతోషంగా మాట్లాడే మాటలు
వారికి ఓదార్పు నిస్తాయి*
ఓదార్పు అనేది జీవితం హాయిగా సాగ డానికి ఒక ఉల్లాసాన్ని కలిగించే ఔషధం🙏🙏👍
6
[24/03, 9:07 PM] Balloori Umadevi Poetess: కవితా గానం
డా.బల్లూరి ఉమా దేవి
అంశం: ఓదార్పు
అతలాకుతలమైన మనసుకు
నేనున్నా ననే మాటే అమృత భాండం
అంతులేని ఆవేదనతో
ఆత్మీయుల విరహంతో
అలమటించే బాధితులకు
కొత్త ఊపిరి పోసే సంజీవిని ఓదార్పు
పంచుకుంటే తగ్గుతుంది అంటూ
చెంతచేరి పలికే తీయని పలుకులే
అందిస్తాయి వెయ్యేనుగుల బలం
కష్టాలను పంచుకో లేకపోయినా
కన్నీటిని తుడిచి నేనున్నానని
భరోసా నందిస్తే కలిగే తృప్తి
అనిర్వచనీయం కాదా
ఆపదలో నున్న మనిషికి సాటి మనిషి
చూపే మానవత్వమీ సానుభూతి
కాలిన గాయాలకు పూసే మందు లాగ
క్రుంగిన మనసుకు ఓదార్పు నిస్తూ
బ్రతుకు పై ఆశలు పెంచేదీ సాంత్వనమే మాటల్లో కాక చేతల్లో చూపగలిగితే
కలకాలం గుండెల్లో నిలిచిపోయే అనుభూతి.
7
[24/03, 9:12 PM] +91 70755 17538:
శీర్షిక. ఓదార్పు
......
కష్టాలు కన్నీరులో
ఒక్కరున్నారని నమ్మిన హృదయము
ఈర్ష ద్వేషము చూసినవేళ
హృదయము ఉప్పొంగు
భాదల సుడిగుండములోన
పరాయి మాటల తూటాలతో
మనసు అలా కృంగిన వేళ
ఓదార్పులేక మనిషి కన్నీటి సుడిగుండములోన మునిగిపోవును
తియ్యని మాటల చాటున
మనిషిని వెన్నుపోటు పొడిచినవేళ
గుండెల్లో మరణ ఛాయను ఆవరించును
కన్నీటి సుడిగుండములో చితికి
గుండెలోతు నమ్మకము ఆవిరిగాను మారి
ఓదార్పు శూన్యమైపోవును
మమతలు చితికిపోయి
బండమారి పోవును
బతుకు దారిలో తన్ను తాను
ఓదార్చుకోని వెలుగు దారిలో
నిలవాలి
గెలుపు దారిలో వెలుగొందాలి
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
8
[24/03, 9:26 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..ఓదార్పు
మానవ జీవన పయనయం
కష్ట సుఖాల సమ్మేళనం
పుట్టినది మొదలు గిట్టే వరకు సాగే జీవితంలో
ఎదురెయ్యే ఒడిదొడుకులెన్నో
ఎవరి వారే ఎదుర్కొనే
సమస్యలెన్నో
ఉక్కిరిబిక్కిరి చేస్తూ
ప్రశాంతత కరువై
బతుకు మీద ఆశ వదులుకుని
ఒంటరులై బాధ పడే మనుషులకు ఓదార్పు
కొండంత ధైర్యం
అనార్యోగ్యంతో పోరాడే మనిషికి కాసింత ఓదార్పు
అత్యంత శక్తివంతమైన ఔషధం
సాటి మనిషిని మనిషిగా గుర్తిస్తూ
అపహాస్యం చేస్తూ
అవమాన పరచకుండా
ఆపదలో ఆదుకోవడమే
అసలైన ఓదార్పు
నీకు నేనున్నానన్నదే
మనిషికి మనిషిచ్చే భరోసా
మానవత్వంతో మెలగడమే
అసలైన మహానీయత
[24/03, 9:31 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*
తేదీ:24-03-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: ఓదార్పు
శీర్షిక: నిన్ను మించిన...
********************
కంటిపాపల్లో కొలువై
రెప్పల తీరం దాటకుండా
నిరంతర ఆర్ద్రతను నింపుకుంటావు!
వేదనల మబ్బులు కమ్మిన హృదయాన్ని సేదదీర్చేందుకు
నయనాకాశంలోంచి జారిపడిన
చినుకా
నిన్ను మించిన ఓదార్పు ఇంకెవరు ఇస్తారు!?
చెక్కిలిని ప్రేమగా తడిమే
కరుణా రస కన్నీటి బిందువువు!
మదిలోని మమతల నదిని
మానవీయ ప్రవాహం చేసి
చెదిరిన కలల బీడుపై వర్షించి
హరితాన్ని పల్లవింప చేసే
అశ్రు గీతానివి!
కలతపడిన మనసుకు
కన్నీటి సాంత్వనయై
నీవిచ్చే ఓదార్పు
కనుదోయిలో వసంతాలు పూయిస్తుంది!
కష్టం ఎవరికి వారిదైనా
కదిలించే స్నేహించే
హృదయ సౌందర్యం కన్నీటిది!
ఓదార్చే కన్నీటి చుక్క
మనో సీమలోంచి జాలువారే మానవతా రూపం!రా గుడిపల్లి
Comments
Post a Comment