నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
***""******"""
కవి వరుల జాబితా
1.డా.ఆంజనేయులు గారు
2.డా.బల్లూరి ఉమాదేవి గారు
3.సుధారాణి కృష్ణం రాజు గారు
4.ఉదయశ్రీ ప్రభాకర్ గారు
5.మన్నె పిన్నక లలిత గారు
6.సుగుణ మద్దిరెడ్డి గారు
7.సునంద వురి మళ్ళ గారు.
8.రమా కులకర్ణి గారు
9.డా.దీపక్ న్యాతి గారు
10.పరాంకుశం రఘు నారాయణ గారు
11.: కె.ఇ.నిలమంగై గారు
12.కందూరి సుజాతా రాణి గారు
13.మహేందర్ జవ్వాజి గారు
14.మర్రి జయశ్రీ గారు
15.కోరాడ నరసింహారావు గారు
**********
1
[26/03, 8:26 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: కలల ప్రపంచంలో విహరించే మనిషి వాస్తవ భూమిలోకి సాగవని
కలల ప్రపంచం మనిషిని మత్తులోకి లాగుతుంది
అనేక భావాలతో కలలు కనడం వారోత్సవం కావడం గొప్ప కలల్ని ఆవిష్కరించడం ఇంత గొప్ప
కలలన్నీ మనిషిని ఎక్కడెక్కడో దూరదూర ప్రదేశాల్లో విహరింప చేస్తోంది
కలలు కనడం వాటిని నిజం చేసుకోవడం మనిషి నైజం
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
2
డా.బల్లూరి ఉమా దేవి
అంశం: కలలప్రపంచం
మదిలో పుట్టిన మధురమైన ఊహ
విత్తై మొలకై మానై పరిమళం భరితమై
ఫలవంతమయ్యే తోట స్వప్న లోకమేసుమా
రెక్కల గుర్రమెక్కి చుక్కల లోకం చూడాలన్నా
వెండివెన్నెల్లో ఆదమరచి విహరించాలన్నా
సుసాధ్యమయ్యేదీ సరికొత్త లోకంలోనే
పోటీలేని విపిణి వీధిలో ఏదైనాకొనేవీలు
ఆనందాన్ని కూర్చే అంబరాన్నంటేవి కొన్ని ఆవేదన మిగిల్చి పాతాళానికి తోసేవి కొన్ని
ఏదీ వాస్తవం కాదని తెలిసిన
ఆ లోకంలో విహరించి నంతసేపు అదే నిజమనే భ్రమలో మునగడం మానవ నైజం
అప్పుడే చేసుకోవాలి చక్కని ఒప్పందం
కాన్న కలలన్ని సాకారం చేయాలంటూ సవ్యదిశలో సాగితేనే మరో మాట అంటూ
కన్న కలలన్నీ కల్లలుగా కాక పూమాలికలా
అందమైన అక్షరాల తోరణంలాగా
మస్తిష్కంలోనే నిక్షిప్తం కాకుండా
దున్నిన తెల్లటి చేనులో నల్లని విత్తనాల్లా
పుస్తకాల్లో దిగిపోయేలా చేయమని
కలల బేహారీ తో సరికొత్తగా బేరమాడదాం
కుదుర్చు కొందాం చక్కనైన ఒప్పందం.
3
[26/03, 8:33 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*నేటి అంశం*కలల ప్రపంచం*
26-03-2022(శుక్రవారం)
*కలలో విహరిస్తూ దానినే ప్రపంచంగా భావించే వారికి
వాస్తవాల విలువ ఆకలలు
కల్లలుగా మారినపుడు కాని
అర్థం కాదు పక్షి ఆకాశంలో ఎగరాలంటే రెక్కల సహాయం
కావాలి రెక్కలు తెగినపుడు
అది ఆకాశం లో ఎగరలేదు
రెక్కలను కాపాడుకుంటూ అందినంత వరకే ఎగిరే స్వేచ్ఛ
ఉంటుంది
అలాగే అందరికి ఆశలు ఉంటాయి దానికి తగిన శ్రమతో మాత్రమే వాటిని నెరవేర్చుకోవాలి ఇతరుల గురించి ఆలోచించడం వారు
ఎదిగిన ఎత్తు కు మనం కూడా
ఎదగాలి అనుకుంటే సరిపోదు
దానికి ఎదుటి వారు పడ్డ శ్రమతో మాత్రమే పోటీ పడితే
వారికంటే అన్నింటిలో విజయం
వరిస్తుంది
*ఏవిధమైన కష్టం, ఖర్చు లేనివి
కలలు మాత్రమే ఆ ప్రపంచంలో
ఊహలకు అందని వాటిని పొందవచ్చు అది తాత్కాలికమే
వాస్తవ ప్రపంచంలో వచ్చిన ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి
*కలలు ఎప్పుడూ కల్లోలాలు సృష్టిస్తాయి అవే నిజమనుకుని
కష్ట పడకుండా ఫలితం రావాలి
అనుకోవడం కలలోనే వీలవుతుంది దురాశ దుఃఖానికి చేటు అన్నట్టుగా శ్రమ అధికంగా చేసి ఫలితం తక్కువగా ఊహించడం వలనే
అనుకున్న కలలు నెరవేరడానికి
సాధనమున పనులు సమకూరు ధరలోన సిద్దాంతాన్ని పాటించి మంచి ఫలితాలు పొందడమే మానవ
ధర్మం🙏🙏👍
4
[26/03, 8:40 PM] ఉదయ శ్రీ ప్రభాకర్ Poetess: 💐కవితా గానం💐
పేరు. ఉదయశ్రీ ప్రభాకర్
అంశం.కలల ప్రపంచం
అదో కలల ప్రపంచం
ఆ చూపులకు అన్నీ అద్భుతాలే
బాల్యం బాగవంతుడిచ్చిన వరం
చిరునవ్వుల దొంతరాల మధ్య అలా అలా కదిలిపోతూ
అమ్మ చీర కొంగుతో ఆడుకుంటూ
స్వార్ధం చేరని మనసులో
అన్నీ ప్రేమ పూలే
రేపటికై చూపు సారించక
నేటిలోని ఆనందాలలో ఓలలాడుతూ
నిదురమ్మ ఒడిలో కమ్మని కలలు కంటూ సాగిపోయే
మధురానుభూతిని పొందే
మధుర ఘట్టమే..బాల్యం
ఉదయశ్రీ ప్రభాకర్
5
26.03.21
[26/03, 8:41 PM] మన్నె లలిత గారు కవయిత్రి: కవితాగానం .
తేదీ :26/ 3 /21 .
అంశము: కలల ప్రపంచం.
శీర్షిక :కలలు నెరవేరితే....!
పేరు: మన్నె పిన్నక లలిత.
హైదరాబాద్.
*****************************
కలలు కంటున్నాను నేను
నెరవేరని కలలు కాదు
నెరవేర వలసిన కలలు
వీపున కట్టిన చీరలో
పాల కోసం తల్లడిల్లే
ఎముకల గూడును కట్టుకున్న
తల్లి పడే వేదనను చూచి
రాతి పాలాభిషేకాలు ఆపి
గుక్కెడు పాలు ఎముకల గూటికి
పోసి బ్రతికిద్దామని
కలలుకంటున్నా
కాములకు బలైపోయిన
"ఆడ "ఆర్తనాదాలు వింటూ
అక్కడికక్కడే వాడిని చంపి ముక్కలు చేసి
కాకులకు గద్దలకు వేయాలని కలలుకంటున్నా
కష్టించే రైతన్నకు మంచి విత్తునై
చినుకులై పుష్పించి ఫలించి
రైతు కంటిలో కన్నీటికి అడ్డుకట్ట వేసి
ఆత్మహత్యలు నివారించాలని కలలుకంటున్నా
కరుణ లేని కరోనాను సూదులతో
గుచ్చి గుచ్చి చంపి
తరిమేయాలని కలలుకంటున్నా
నిరుద్యోగంతో ఉద్యోగం కోసం
ప్రయత్నించే యువతకు
చేతులు ఖాళీ పెట్టక
చేతనైన పని చేయమని
ఆకలికి గంజి కైనా
సంపాదించమని కలలుకంటున్నా
నా ఈ కలలన్నీ కలల ప్రపంచంలోి
బొంగరం లాగా తిరుగుతూనే ఉన్నవి
6
[26/03, 8:47 PM] +91 90354 73216:
అంశం. కలల ప్రపంచం.
అనుకున్నది సాధిస్తే కల నెరవేరిందంటారు
సాధించలేకపోతే కల చెదిరిందంటారు.
వాస్తవాలను విస్మరించి
ఏవీ జరుగని
కలల ప్రపంచం లో తేలుతూ
ఏవేవో ఊహించుకొంటుంటారు
రాత్రి నిద్ర లోని కలలను గుర్తు తెచ్చుకుని ఊహల్లో తేలుతూ నిజమనుకొంటారు మరికొందరు
పగటిపూట ఏవేవోఅనుకుని ఏమీ సాధించలేక
మాటలతో కాలాన్ని వృధా చేసే వారు మరికొందరు
నీవు నిద్ర లో చూసి అనుభూతి చెందేది కల కాదు నీకు నిద్ర రానీయని దే కల అన్నారు మన కలాం
నీవు చేసే నిరంతర కృషి ఉడుంపట్టు లాంటి పట్టుదల కార్యం సిద్ధించే వరకు
వదలని దీక్ష
విజయ సంకేతాలకు అన్వేషించే ఆలోచనలు అనునిత్యం ఆచరిస్తూ ప్రతినిత్యం సాధన చేస్తూ
నీ లక్ష్యాన్ని నెరవేర్చి
గమ్యాన్ని చేరుకొనేదే
*కల*.
కలల ప్రపంచం లో
గమ్యాన్ని చేరేలా
నీ *కల* ఉండాలని
నా ... కలమ్ . తో
నీకో .. సలామ్.
సుగుణ మద్దిరెడ్డి 🌷
ఐలవారిపల్లె
ఐరాల
7
[26/03, 8:50 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*
తేదీ:26-03-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: కలల ప్రపంచం
**************†*****
అక్కడంతా
కలల ప్రపంచంలో ఈదులాడుతున్న పిల్లలే..
వాళ్ళ కన్నుల్లో ఎన్ని కలలో
మరెన్ని హాశ్చర్యార్థకాలో!
పిట్టల్ని దాని విన్యాసాలు చూస్తారా
ఇక వాటికా నేర్పు ఎలా వచ్చిందో
చేతులు చాచి పిలుస్తారు!
కుహు కుహు రాగాల కోయిలమ్మ పాట వింటారా!
ఇదిగో నేనంటూ రెట్టించి పాడుతుంటారు!
పూచిన పువ్వేం మాట్లాడుతుందో తెలియదు కానీ
చిట్టి చేతులతో నీళ్ళు పోసి
వాటి బుగ్గలను తడుముతుంటారు!
చినుకు పడితే చాలు
ఆకాశంతో ఎన్ని కబుర్లో
అవని మీద వారు చేసే ఆనంద తాండవం చూడాల్సిందే...
అమ్మ నాన్నలను బతిలాడుకుని
చిట్టి పడవలను వదిలే దృశ్యం చూస్తుంటే
వానమ్మతో సంధి కుదుర్చుకున్నారా అనిపిస్తుంది!
వాళ్ళ కలలు ఎంత బాగుంటాయో..
సింగిడి రంగుల ఆ
కలల ప్రపంచంలోకి మనమొక్క సారి వెళ్ళామా!
నిత్య జీవన ఆరాట పోరాటాలన్నీ హుష్ కాకి!
మనసంతా అవుతుంది ఆనందాల హోళీ!
8
[26/03, 8:55 PM] Rama Kulakarni Hyderabad Poet: కవితాగానం
************
రమాదేవి కులకర్ణి
హైదరాబాదు
8985613123
అంశం కలల ప్రపంచం
**************
మేలుకో
💭💭💭💭
మూసిన కన్నుల కల
తెరవాలి ఆశలు ఇల
సుషుప్తి లోని చింతన
ఆలోచన లోని యోచన
కర్తవ్యం ఇలను మరచిన
పగటి కలల్లో తేలిన
స్వాప్నిక జగత్తున నిలిచిన
అందునా లక్ష్యం మున్ముందున ....? ? ? ?
మనః కొలమానం మననం
స్వర్ణమయమే స్వప్నం ...
కావాలి మరి సాకారం
సద్ దిశణ నీ సంకల్పo
కల్పమంత విస్తరించగా .....
వికల్పమవ్వాలి నిర్వేదం
నీరసించనీ నైరాశ్యం
ఇక .......! ! ! !
గుండెలోని ప్రతిస్వప్నo
పగటికలలోనూ జాగృతం
మెలిపెడితే నీలో ఆశయం
కలలో ఇలలో ఎల్లవేళలో ....
నీవే ఇక నవచైతన్యం .....! ! !
9
[26/03, 9:05 PM] దీపక్ న్యాతి: ✴️✴️✴️✴️✴️✴️✴️
*కవితా గానం*
పేరు : డా.దీపక్ న్యాతి
తేది : 26.03.2021
అంశం : *కలలప్రపంచం*
శీర్షిక : అందరూ బాగుండాలి
జన్మకు ముందు జగమెరుగను
జగాని కెందుకొచ్చానో కూడా ఎరుగను
నా తల్లిదండ్రుల అనురాగ ఫలమని
ఆత్మీయ ప్రేమనీ ఎరుగను
నచ్చింది కావాలనే కలల ప్రపంచం
స్వర్గం బాగుంటుందంటే వెళ్ళాలి
ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా
వెళ్ళాలనేదే కలల ప్రపంచం
సంపాదన వర్షించాలనే కలల ప్రపంచం
మంచి సంతానం సొంతమవ్వాలి
కీర్తి చరిత్ర పుటలు కెక్కాలి
అదృష్టం వరించి సహకరించాలి
ఇవే ఇవే అప్పటి కలల ప్రపంచం
మస్తిష్కాన అనుభవం నిండిన వేళ
అందరూ బాగుండాలన్న కలల ప్రపంచం
మానవత్వం తప్ప మరేం చేయలేమని
తేలింతర్వాత విస్తుపోవడమే మన వంతైన
కలల ప్రపంచం కలనే వాస్తవం
భయం లేని బ్రతుకందాలందరికి
అందరూ బాగుంటే అందులో నేనున్నట్టే
ప్రస్తుత కలల ప్రపంచం అదే అదే నిజం
తెలియజేసంది కరోనా మానవ సృజన
డా.దీపక్ న్యాతి
సినీ గేయ రచయిత
హైదరాబాద్
10
[26/03, 9:07 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితా గానం*
అంశం, కలల ప్రపంచం
*శీర్షిక ,కలలే నిజమౌను!*
సకల జీవరాశులలో
మానవజన్మకో ప్రత్యేకత ఉంది!
నిత్యం ప్రగతి గమనం వైపు పరిగెడుతున్నాడు!
ఆయన చేసే ప్రతి పనిలో,
కాల విభజనను ప్రామాణికంగా,
బేరీజు వేసుకుంటూనే ముందుకు దూసుకెళ్తున్నాడు!
శ్రమిస్తూనే.., గొప్ప కలల కంటూ. ,
ఊహాజనిత ప్రపంచంలో విహరిస్తున్నాడు!
మన భావి సమాజ నిర్దేశకుల ఆలోచనల కనుగుణంగా,
కలలు కంటూనే సార్ధకత కోసం ,
నిరంతరం తనకు ఎదురయ్యే,
సమస్యలను అధిగమిస్తూనే,
ముందుకు పోతున్నాడు!
కలల ప్రపంచంలో ఊరేగడమే,
ఆయన ప్రగతికి కొలమానమైoది!
కలలు వాస్తవ జీవనంలో సత్ఫలితాలిస్తున్నాయి!
నిజాలు విజయ మార్గం వైపు నడిపిస్తున్నాయి !
పరాంకుశం రఘు నారాయణ
మహబూబాబాద్
11
[26/03, 9:09 PM] Komandoori Neela Poet: కవితా గానం
అంశం: *కలల ప్రపంచం*
తేది:26/03/2021
వచన కవిత్వం
అలసిన మేను పవళించే సమయంలో..,
ఆశల దీపాలను వెలిగించాలనుకుని సేద తీరుతున్న వేళ..,
పుడమి పచ్చని కోకను కట్టుకొని చల్లని మలయ మారుతాన్ని వీవెనగా వీస్తూ..,
జీవులందరికీ జోల పాడుతూ ఊయలూపుతున్నవేళ..,
నీలాకాశపు పందిరిక్రింద..,
తారల తళుకులు మినుకు మినుకు మంటూ..,
చంద్రుని వెన్నెలలను నలుదిక్కులా పంచుతూ..,
మేఘమాలికలతో స్నేహం చేస్తున్నట్లు *కలల ప్రపంచం* లో తేలిపోతున్న ఊహల మేనాపైకెక్కి అందుకున్నట్లు...!!!!
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
చరవాణి సంఖ్య:8897155600.
*ఈ పై కవిత ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*
12
[26/03, 9:12 PM] కందూరి సుజాత Poetess: అంశం.. కలం ప్రపంచం
శీర్షిక.. 🌷వింత కల 🌷
.............. ........ ..... .
నా వింత కలల ప్రపంచంలో విహరిస్తూ ...
నా వాలుజడలో పూలు తురిమి మురవాలని కలగన్నా. ...
తల్లి ఒడిని వీడిన పూబాల త్యాగాన్ని గుర్తించి దేవుని పాదాల నిలిపా.
మేని ముసుగు ధరించి మురిసి
మెరవాలని కలగన్నా...
ఆ ముసుగు కొత్త పెళ్ళికూతురు సిగ్గులకే సొంతమనీ గ్రహించి స్వాగతించా .
అమ్మ వజ్రాల వడ్డాణం పెట్టుకుని వయ్యారంగా నడవాలని కలగన్నా....
రవ్వల ముక్కెర పెట్టుకొని ముద్దులొలుకు ముచ్చట్లలో మునగాలని కలగన్నా... రతణాల కాసులపేరు వేసుకుని
రాజ్యసంగ నిలవాలని కలగన్నా..
అవి నగలు కావు నట్టింటి పరువులని తెలిసి ప్రణమిల్లా.
ప్రణాళికా రహిత నిర్మాణం
అద్భుత పిచ్చుక గూడు లాంటి మెడ కావాలని కలగన్నా...
అక్షర విన్యాసం చేస్తూ కవన కథలు అల్లుతూ
నా వింత కలల సౌధవాన్ని సమకూర్చా.
కందూరి సుజాత రాణి
రాజంధ్రనగర్, హైదరాబాద్
9392162822🌷
13
[26/03, 9:13 PM] Mahender Javvaji: అంశం.కలలప్రపంచం
పేరు. మహేందర్ జవ్వాజి
౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
తల్లి గర్భంలోఉన్న సమయంలో ప్రసవవేధన పడుతూ త్వరగా తన పసికందు ను కొత్త లోకానికి పరిచయం చేయబోతున్న అనేగొప్ప అనుభూతి ఓ కలల ప్రపంచమే మరీ..
నవజీవన పోరాటం లో సుఖదు:ఖాల సాగరంలో రంగు రంగుల పండగ చేసుకోవాలని మానవులు రూపులేని రేపటి సంగతిని తలుచుకోవడం ఓ కలల ప్రపంచం...
పూలకొమ్మలు మొగ్గలేసీ పూతపూసి పుష్పవణం లోసువాసనలు వెదజల్లే తీరొక్క పుష్పమా నీ జీవితం అంతా దేవాలయం లో పూజలందించాలని కలలెన్నె కంటావు సందర్భోచితంగా.. కలలన్నీ కలిషితమాయోధారపుండకు బందియై ....నీ జన్మంతా జనజాతరె కదా...✍️✍️
14
కవితాగాన0
అంశం:- * కలల ప్రపంచం *
కోరాడ నరసింహా రావు...!
"కలలు... కనాల్సిందే....!"
*******************
ఉన్నతాసయాల కల లు....
ప్రతి ఓక్కరూ కనాల్సిందే...!
ఆ లక్ష్య సాధన కోసం....
అవిశ్రాంతంగా పరిస్రమించి
ఆ ఉదాత్తాసయాన్నీ.....
సాకారం చేసుకో వలసిందే !!
వాస్తవాలను విస్మరించి....
కేవలం ఊహా లోకాల్లో విహరిస్తూ.... ఆ కలల ప్రపం
చంలోనే మునిగి పోయే వాళ్ళకు... భవిష్యత్తు అయో
మయ మే కదూ....!
అందరూ కంటారు అందమైన
రంగుల కల లు....!
అందుకోసం చిత్తశుద్దితో....
ప్రయత్నించే వారేందరు....!?
ఈ ప్రపంచంలో... ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కనాలే
గానీ... అలా కలల ప్రపంచం లోనే మునిగి పోయి... బ్రతికేస్తే
వాస్తవ జీవితాన్ని కోల్పోక....
మరేమవుతుంది....?!
అందుకే.... నీజీవితాసయాన్ని
లక్ష్య కల గా.... భావి0చు....
దాన్ని సాకారం చేసుకునే దిశగా
నీ ప్రయాణాన్ని సాగించు.....
ఆ నీ కల లను నిజం చేసుకుని
జీవితాన్ని ఆనందం గా భోగిస్తూ.... సుఖించు....!!
*************************
......కోరాడ.
Comments
Post a Comment