Skip to main content

పౌర్ణమి 052022 జాతీయ పతాకం

నిర్వహణ 
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
**********************
కవివరుల జాబితా
1.కోరాడ నరసింహారావు గారు
2.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
3.జోషి పద్మావతి గారు
4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
5.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
6.శివ చరణ్ నాయుడు తరాల
7.గొర్రెపాటి శ్రీ ను గారు
8.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
9.డా.కమలా దేవి గారు
10.అపరాజిత్ గారు
11.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
12.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు
13.కవిత వెంకటేశ్వర్లు గారు
14.డా.బల్లూరి ఉమాదేవి గారు
15.డా.వేమూరి సత్యవతి గారు
16.బొప్పెన వెంకటేశ్ గారు
17.తిప్పా వఝల నరసింహ మూర్తి గారు
18.మద్ది పుల్లారావు గారు
19.టేకుమళ్ళ విజయ లలిత గారు
20.పిన్నక నాగేశ్వరరావు గారు
21.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
22.దారల విజయ కుమారి గారు
23.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు
24.పొర్ల వేణు గోపాల్ రావు గారు
25.సింహాద్రి వాణి గారు
26.వురిమళ్ళ సునంద గారు
27.తరణికంటి సూర్య లక్ష్మి గారు
28.తోట సులోచన గారు
29. వేదాంతం సురేష్ బాబు గారు
30.మన్నె లలిత గారు
31.గజవెళ్ళి శ్రీనివాసా చారి గారు
************************
1
వైశాఖమాసం పౌర్ణమి కవితల పోటీకి :- 
అంశం :- భారతజాతీయగీతం,
......కోరాడనరసింహారావు!       శీర్షిక:- *అజరామర0.....ఆ హృదయ....నివేదనం... !"
      *****************
దేశభక్తితో...స్పందించిన రవీం ద్రుని హృదయం... ప్రస్తుతించి నదీ పవిత్రగీతం... !
     జన, గణ, మన.... పుణ్య, 
పురుషార్ధాల ఉభయ తారకం!
భారతజాతి జన సమూహాలు 
తమ హృదయాలలో... 
    స్వాతంత్ర్య సముపార్జనా ఆశాజ్యోతిగా ప్రతిష్టించుకున్న 
మహాత్మునిపై ప్రేమపూర్వక కృతజ్ఞతాంజలులివి !
       దేశ స్వాతంత్య్రం కోసం 
యావత్ భారతప్రజానీకాన్నీ తనవెంట నడిపించగలిగిన 
మహోన్నత వ్యక్తిత్వానికి... 
అభినందన చందన, సుమగం ధమీ గానం !
  అశేషభారతహృదయానందము గావించిన కవీంద్రా, ఓ రవీంద్రా
నీజీవితం... అమరం... !
   నీ గీతం... అజరామరం !!
     ******************
2.
భారతావని వందేమాతరగీతం *************************
 కాశ్మీరం తన కుంకుమరేఖై
 కన్యాకుమారి పాదపద్మమై
 వింధ్య హిమాచల విలసితమై పుణ్య తీర్థముల కలవనమై
 భువిలో వెలసిన భారతావని 
సకలమతాల సంగమపావని 
భారతావని... ఆహా.. హా.. హా భారతావని
 వందేమాతరం.. వందేమాతరం 
 భరతనాట్యాన కొలువై 
 అటు కూచిపూడికి నెలవై పదునారు కళలను పోషించి
 ఏకైక రాజ్యమై వెలుగొందే గగనమున..
 చంద్రలేఖలా భువనమున.. 
స్వర్గసీమలా భువిలో వెలసిన భారతావని
 సకలమతాల సంగమపావని భారతావని 
ఆహా.. ఆహా.. హా భారతావని వందేమాతరం..
 వందేమాతరం 
 గాంధీ మహాత్ముని శాంతం అ చంద్రబోసుని శౌర్యం
 కలబోసి విరిసిన వీరులము ప్రపంచాన సరి ధీరులము
 సుచరితము.. సుధర్మము సుభాషితము.. సుధన్యము
  సుధ జనగణమన మంగళదాయకమే
 గీతాంజలి లిడు భారతావని సకలమతాల సంగమపావని
 భారతావని ఆహా.. హా.. హా భారతావని వందేమాతరం..
 వందేమాతరం 
 హామీపత్రం ఈ కవితాగానం నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,
3.
మాతకు గీతరాజము
* ***********************
 మానవగళం మధురంగా పాడగలిగే సత్యసంధతాగీతం వికసిత మానవ మస్తిష్కపు పరిమళచిహ్నం దశదిశలా కురిసిన ఆలోచనామృత వర్షం విశ్వకవి రవీంద్రుని కలంనుండి జాలువారినజాతీయగీతం ఆసేతుహిమాచల‌,సస్యశ్యామల జీవధాత్రికి పులకాంకురములు మొలకెత్తించే రాగం పంజాబసింధు గుజరాత మరాఠ,ద్రావిడ ఉత్కళ వంగ మిళిత జీవధాత్రికి జయహోఅంటూ, పర్వత నదీనదాల నినాదమును నినదిస్తూ, ప్రకృతిపులకింతలను శ్వాసిస్తూ భాషాప్రాంత,మత భేదమన్నదెరుగక ఆనందంగా అందరూ ఆలపించే జాతీయగీతం! జనగణమన అధినాయకజయహే అంటూ భరతమాత శుభనామమును స్మరిస్తూ.... జయజయధ్వానలను పలుకుతూ, భిన్నత్వాన ఏకత్వాన్ని సాధించిన సోదరసోదరీమణులంతా గర్వకారణంగా పాడుకొనే జాతీయగీతం సురుచిర సుందర సువిశాల భరతావనికి సమర్పించిన మేలిమి ముత్యాలహారం
Submitted
4.
మాతకు గీతరాజము* *********************** మానవగళం మధురంగా పాడగలిగే సత్యసంధతాగీతం వికసిత మానవ మస్తిష్కపు పరిమళచిహ్నం దశదిశలా కురిసిన ఆలోచనామృత వర్షం విశ్వకవి రవీంద్రుని కలంనుండి జాలువారినజాతీయగీతం ఆసేతుహిమాచల‌,సస్యశ్యామల జీవధాత్రికి పులకాంకురములు మొలకెత్తించే రాగం పంజాబసింధు గుజరాత మరాఠ,ద్రావిడ ఉత్కళ వంగ మిళిత జీవధాత్రికి జయహోఅంటూ, పర్వత నదీనదాల నినాదమును నినదిస్తూ, ప్రకృతిపులకింతలను శ్వాసిస్తూ భాషాప్రాంత,మత భేదమన్నదెరుగక ఆనందంగా అందరూ ఆలపించే జాతీయగీతం! జనగణమన అధినాయకజయహే అంటూ భరతమాత శుభనామమును స్మరిస్తూ.... జయజయధ్వానలను పలుకుతూ, భిన్నత్వాన ఏకత్వాన్ని సాధించిన సోదరసోదరీమణులంతా గర్వకారణంగా పాడుకొనే జాతీయగీతం సురుచిర సుందర సువిశాల భరతావనికి సమర్పించిన మేలిమి ముత్యాలహారం
5.
కవితాగానం సీజన్ 3
వైశాఖమాసం
పౌర్ణమి  కవితలపోటీ కి 14/5/22
అంశం :భారత జాతీయ గీతం...
శీర్షిక:::: జాతీయత

*******************************

భరతుడేలిన భవ్య దేశము దివ్య ధామముల
ధూపితము

తానే అమ్మై ... చనుబాలలో దేశభక్తిని రంగరించి
ఉగ్గుగిన్నెతో  తాగించిన కవి రవీంద్రుడు భారతమాత  ముద్దు బిడ్డడు

దేశ భక్తిని ధాటిగ నింపే ధమనుల దడదడ సవ్వడి... భారత జాతీయ గీతం

జీవ నదులతో నిండుగ భారతి తొణికిసలాడే
పాడి పంటలు
కిల కిల నవ్వుల పువ్వులు విరిసిన భరత భూమిలో జాతీయ గీతా గానం

అవని యందునే... భరత భూమిలో
ఇంచుఇంచుకు... అంచుఅంచున అద్వితీయమే
గోచరించునట

రంగు రంగుల హంగులు యెన్నో పులము కున్న సీతాకోక చిలుకలను బోలు...

జాతి, వర్ణము, భేద మెంచక భిన్న జాతుల సంగమం... మన భారత దేశం

విభిన్న భాషలు, వేర్వేరు ప్రాంతాలు, ఏవైనా...
మమతలు పంచే మనసొకటే

కట్టు బొట్టు వేరైనా... కలిమి లేములను కలిసి పంచుకుని ... కూడా నడిచే సామరస్యము
తోడుగ నిలిచే సౌభ్రాతృత్వం

సాటి మనిషికి సాయం చేసే మంచి మనుషుల
ధార్మిక ధాత్రికి మాతృక జాతీయతే...

ప్రజల మనసులో పంచ ప్రాణమై తిష్ట వేసిన  దేశ భక్తికి మూలపుటమ్మ జాతీయ గీతం
అది బోధించిన మానవత్వపు విలువల సారం

జాతి మొత్తమును ఏకం చేసి జాడ్యాలను హననం చేసి ఏక తాటిపై నడిపించే ... జాతీయ సమైక్యతా భావం ... ప్రభోదించే జాతీయ గీతం

కన్యా కుమారి నుంచి కాశ్మీర్ వరకు... అస్సాం నుండి గుజరాత్ దాకా...

జన్మ భూమికి జీవితమంతా సేవ చేయుటకు ఆమంత్రించిన భారత జాతీయ గీతం

ఏక గళమై ఆలాపించే జాతీయ సమగ్రతా తారక మంత్రం... అదే మన జాతీయ గీతం

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
6.
భారతదేశ చరిత్రలో జాతీయ గీతం "జనగణమన "అనేది వింటే పసిపిల్లల కూడా ఉత్తేజం వస్తుంది మన భారతదేశ చరిత్రలో కుల మత వర్ణ వివక్ష లేకుండా మనం ఆలాపించే గీతం జనగణమన ఎందరో మహనీయుల త్యాగమే పర పాలనలో విజయకేతనం ఐ ఉద్భవించిన గీతం కులమతాలు ఎన్నయినా సబ్బండ వర్గాలు మనమంతా భారతమాత ముద్దు బిడ్డ లమే అని గర్వంగా చెప్పుకోవడానికి ఈ గీతం మనకు స్ఫూర్తి నిస్తుంది మన భారతదేశ గొప్పతనాన్ని మన ఐక్యమత్యాన్ని ఈ గీతం వింటే చాలు ఎవరికైనా ఒంట్లో చచ్చుబడిన నెత్తురు ఉప్పెనలా ఎగిసిపడే వస్తుంది ఇంత గొప్ప గేయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు ఈ గేయం మన ఐక్యమత్యాన్ని కి నిదర్శనం ఈ గీతాన్ని నేను గర్వంగా పాడాలి అంటే నేటి కుటిల రాజకీయ వ్యవస్థ మారాలి ఆడపిల్లలపై అత్యాచారాలు ఆగాలి లంచగొండితనం లేని రాజ్యం మనకు రావాలి అప్పుడే నేను తలెత్తుకొని ఈ గీతాన్ని ఆలపించే గలను భారత్ మాతాకీ జై.... 

శివ చరణ్ నాయుడు తరాల
7.
రచన : గొర్రెపాటి శ్రీను 
ధగా పడ్డ బతుకులు..
అడుగడుగునా అవమానాలు చీదరింపులు ..
బానిసల్లా దొరల కాళ్ళ దగ్గర కొలువులు..
తలొంచి పని చేయడమే తప్ప ..ప్రశ్నించే ధైర్యం లేదు..
భరతమాత బానిస సంకెళ్ల లో మగ్గుతుండగా .. 
పౌరుషం నశించిన భారతావని లోని జనులు మా బ్రతుకులింతే అనుకుంటూ ..
నిరాశగా జీవనం సాగిస్తున్న రోజులవి !
తెల్లవాడు వాణిజ్యం పేరుతో దేశంలో కి వచ్చి
..దేశాన్నంతా చెప్పుచేతల్లో కి తీసుకుని 
అరాచక పాలన సాగిస్తూ ..  
"రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం" అంటూ 
పరాయివాడు మనవాళ్ళ పై దౌర్జన్యంగా పెత్తనం సాగిస్తుంటే..
అప్పుడు..
భరతమాత  బానిస సంకెళ్లు తెంచగా ...
భారతావని లోని ప్రతి ఒక్కరి హృదయాలలో ..
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ లిఖించిన
"జనగణమన.." జాతీయగీతం విప్లవమై మెరిసింది !
జనులందరినీ ఏకతాటి పై నిలిపి
స్వాతంత్ర్య సంగ్రామంలో సింహా లై గర్జించే లా స్ఫూర్తిని నింపి..
భారత   జాతీయ గీతం..సంఘటిత శక్తి ని తెలియజేసింది ! 
పరాయి పెత్తనమిక సహించేది లేదంటూ ..
పరదేశీయుల పాలనకు అంతం పలకడం లో 'భారత జాతీయ గీతం '..
భారతావని ముద్దుబిడ్డ లందరిలో ఐక్యతారాగమై నిలిచి
బ్రిటీష్ వాడిని దేశం నుండి తరిమికొట్టింది ..!
మన దేశ జాతీయ పతాకం మువ్వన్నెల జెండా వినీల గగన సీమలో స్వేచ్చగా  రెపరెపలాడుతుంటే ..
జనగణ రాగమై ..విజయ సింహనాదమై  దేశమంతా మారుమ్రోగింది  ! 
                                                       -  గొర్రెపాటి శ్రీను
8
దోసపాటి వేంకటరామచంద్రరావు
జిల్లా
*
శ్రీకాకుళం
ఫోన్ నెంబర్
7780594995
కవిత
*
కవితాగానం సీజన్3
వైశాఖమాస పౌర్ణమి కవితలపోటి
అంశం:భారత జాతీయ గీతం
శ్రీర్షిక:దేశభక్తి సమన్వితం
భారతజాతీయగీతం దేశభక్తిసమన్వితం
అఖండభారతవనికి మేల్కొలిపే సుస్వరం
ఆసేతుహిమాచలం ఉత్ప్రేరకం
జనజీవనచైతన్యానికి సంకేతం
భారతీయుల హృదయప్రతిస్పందనం
జాతీయసమైక్యతా ప్రభంజనం
సమగ్రనైసర్గిక స్వరూపం
పవిత్రనదీనదాల వైశిష్ట్యనినాదం
శుభసూచిక శుభాకాంక్షల గీతం
సర్వజనానందకారకం
భారతభాగ్యవిధాత ప్రసాదం
జనసంక్షేమసంరక్షణా ప్రదాయకం
శుభాశిస్సులనొసగే ప్రార్వనాగీతం
పవిత్రగంగాతరంగాల తారంగం
సర్వరాష్ట్రప్రాధాన్యతా స్వరూపం
స్వాతంత్ర్యసమరానికి సమరశంఖనిస్వనం
భారతీయ జననాడి ప్రతిధ్వనించిన గేయం
మహమహులనెందరికో ప్రజ్ఞాపాటవం
తరతరాలకు అందించిన ఆణిముత్యం
నిత్యసత్యనిరంతరగళవిన్యాసం
జయహే !జయహే!జయ జయ జయహే!
జనగణమన అధినాయక జయహే!
ఇదినాస్వీయరచన.
9.
[14/05, 7:29 am] Lalita Sister: కవితాగానం (సీజన్ 2)
వైశాఖమాస పౌర్ణమి కవితలపోటీ కి నాకవిత
అంశం : జాతీయగీతం
శీర్షిక : మన జండా 
ఎగిరే ఎగిరే  జండా 
జాతీయ జండా 
మన జాతీయ జండా
అదిగో  అదిగో  అదిగదిగో
మన జాతీయ జండా 
పింగళి సృష్టించిన జండా
మువ్వన్నెల ముచ్చటైన
జండా
వన్నె వన్నెలకు అర్థం తెలిపే
జండా
మన జాతి గర్వకారణం మన జండా
ఎగిరెగిరే జండా అదిగో  అదిగో 
త్యాగవీరుల సంస్మరణ ఫలం
రౌద్రవీరుల శౌర్యఫలం
అహింసావాదుల వాదఫలం
మహాత్ముల జీవన భరణం
మన జంఢా అదిగదిగో మన
జండా
జాతికి చిహ్నం, నేతల స్మరణం
వీరుల ఖ్యాతి, పౌరుల ధ్యేయం
కుల మత రాహిత్యం
భారతీయుల  ఔన్నత్యం
మన జండా అదిగో  అదిగదిగో మన జండా 
ఆత్మవిశ్వాసమె  ఆలంబనం
సత్యాహింసలె ఆయుధాలు
త్యాగశాంతులె ధ్యేయం
సౌభాతృత్వానికె ప్రాధాన్యం
అదే మనజండా
అదిగదిగో మనజండా
జాతీయజండా
శ్వేతవర్ణం స్వచ్ఛత గుర్తు 
హరిత వర్ణం సంపద తెలుపు
కాషాయ వర్ణంత్యాగచిహ్నం
వర్ణవర్ణమున విలువలు
తెలిపే జండా మన జండా  
అదిగో  అదిగదిగో 
మనజండా
ఇరువదినాలుగు గీతలు
ఇరువది నాలుగు గంటలు
కాలపు విలువలుతెలుపు
అశోకచక్రం శాంతికి నిలయం
మనజండా 
అదిగో  అదిగదిగో మనజండా 
మన జాతీయ జండా

పేరు : డా.కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
చరవాణి : 9871096566

హామీ : పైకవిత నాస్వంతం

10
[14/05, 7:29 am] Lalita Sister: అంశం:భారత జాతీయగీతం,,,,,,,
శీర్షిక:భారతీయుని హృదయ కుహరం,,,,!
పేరు:యం అపరాజిత్ రెడ్డి
ఊరు:సూర్యాపేట
భారతీయుని నర నరం లోని రక్తం ఉప్పొంగేలా
జాతి సమైక్యతను ప్రభోధిస్తూ సాగే తీయ తేనియల గీతం
జాతీయ పతాకం ఎగరేసి దేశభక్తిని రగిలించే గీతం పాడితే
ఉజ్వలంగా ఉత్తేజంగా ఉప్పెనలా జనం గుండెల్లో జీవం ఉప్పొంగి
గాంధేయ మార్గంలో జనం కదన రంగంలో దూకి
తెల్లవాడిని తరిమి తరిమి కొట్టేందుకు జనాన్నిఉసిగొలిపిన ఉద్యమ గీతం!
రవీంద్రుని కలం నుండి జాలువారిన అద్భుత గీతం
పంజాబు, సింధు, గుజరాత్, మరాఠి, ద్రావిడులు, వంగ సమస్త భారతి తన కలంలో ఓ ఉద్దీపన!
హిమగిరులు నదులు మైదానాలతో పర్వతాలతో అలరారే ఈ దేశం మనందరిది
అంటూ సాగే మహోన్నత భావం ఇమిడి వున్న గీతం!
ఇంతటి మహోన్నత భావంతో దేశభక్తిని రగిలించే గీతం యావత్తు ప్రపంచంలో మరెక్కడా లేదు,,,,,,,
పాఠాశాలల్లో ప్రతి రోజు పిల్లలు పాడుతుంటే జీవం ఉట్టిపడుతున్నట్లు,,,,,,,
మహాత్ముని లాంటి నాయకుల జీవితార్పణల ఫలితమీ స్వరాజ్యం,,,,,!
ఓ పౌరుడా అఖండ పరంజ్యోతి భారతావనికి నీవు సెల్యూట్ చేస్తున్నావు
జవాన్లు రైతులు కార్మికులు నీకు బలము రక్షణ కవచాలు
రవీంద్రుని గీతం సహజంగానే ఎన్నెన్నో భావనలు వ్యక్తపరిచింది!!

అపరాజిత్

హామీ పత్రం: ఇది నాకలం సేత అని నా హామీ
11

[14/05, 12:17 pm] Lalita Sister: కవితా గానం ( సీజన్-3)
వైశాఖ పౌర్ణమి పోటీకి
తేది:-14-05-22
అంశం:-
భారత జాతీయ గీతం
శీర్షిక:-
జాతి ఔన్నత్యానికి ప్రతీక
పేరు:-
అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:- విశాఖపట్నం
చరవాణి:-9963265762
..................................
జాతి గౌరవాన్ని చాటిచెప్పేది జాతీయగీతం.
భరతావాని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. 
వివిధ సంస్కృతి సంప్రదాయాల మేళవింపు భారతదేశం.
ఆసియాలో సాహిత్యం లో విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ వ్రాసిన'జనగణ మన' భారతదేశ కీర్తిప్రతిష్ఠలను వసుదైక కుటుంబానికి చాటిన జాతీయ గీతం.
సాహిత్యం లో ఆసియాలో మొదటి నోబెల్ బహుమతి పొందిన రవీంద్రనాధ్ ఠాగూర్ మహర్షియే.
మొదట జాతీయ కాంగ్రెస్ మహాసభలో  ఆలపించిన జాతీయ గీతం స్వాతంత్ర్య సంగ్రామానికి ప్రేరణ ఇచ్చిందని జాతిపిత మహాత్మాగాంధీ స్వయంగా చెప్పుట ,మా స్వాతంత్ర్య సంగ్రామ ఊపిరియే అని
ఆచార్య వినోభాభావే అనుట జాతీయ గీతం ప్రాముఖ్యతను ,విశిష్టతను తెలియచేస్తున్నది.
ఆంధ్రుల గర్వకారణం రవీంద్రులు మదనపల్లె లో 
దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలు ఐర్లెండ్ దేశస్తురాలు శిష్య బృందంతో జాతీయ గీతాన్ని స్వరపరచడమే
జాతీయగీతాన్ని ఆంగ్లంలోకి అనువదించడం ఆంధ్రలోనే జరగడం ' మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' అని పిలవడం జరిగినది 
పందొమ్మిది వందల ఏబది సంవత్సరం ఇరువది ఆరు ( 1950 జనవరి 26) న
జనగణ మన జాతీయగీతం ప్రభుత్వం గుర్తించి అధికారిక కార్యక్రమాలలో  గౌరవ సూచకం గా జాతీయం గీతాలాపన చేయడం
జాతి గౌరవానికే ప్రతీక..!
...........................
ఇది నా స్వీయ భారత జాతీయ గీతం కవిత
అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
..............................
12.
అంశం: భారత జాతీయగీతం:
డా. తంగిరాల నాగలక్ష్మి
జనగణమన అధి నాయక జయహే
పవిత్ర భారత చరిత్ర కు సందేశమిచ్చే జాతీయ గీతం
రవీంద్ర నాథ్ ఠాగూర్  కలం నుండి వెలువడిన సత్య భరత  గీతం
భారత పౌరుల భాగ్య గీతం
నేను నా దేశం జయం మా లక్ష్యం
కాశ్మీర్ నుండి కన్యా కుమారి వరకు
పంజాబ్ సింధు గుజరాత్  హిమాలయ
అన్ని రాష్ట్రాలకు శుభం కలగాలి అనే ఉద్దేశం తో రచించిన గీతం
గంగ యమున నదుల ప్రవాహాల సంగమ గీతం
ఎన్నో మతాలు ఉన్నా సామరస్యంతో
దేశం సుభిక్షమై సస్య శ్యామల మై
వర్ధిల్లాలనే విజయ ఘోష జాతీయ గీతం
మన జాతి గౌరవం తెలిపే గీతం
దేశ భక్తి చాటే గేయం
స్వదేశం పరాయి వారి పాలనలో పడి
ప్రజలు కష్టాల పాలై అల మటిస్తున్న
రోజుల్లో  స్వతంత్ర సమరంలో ఆక్రోశం తో
మాతృ దేశ రక్షణ కోసం
పోరాటంలో దాస్యవిముక్తి కావాలనే ఆరాటం 

13
 గానము సీజన్-3
అంశం::భారత జాతీయ గీతం
తేదీ:: 14.5.22...శనివారం
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
సెల్:: 8309920625

భారత జాతీయ గీతము
కవీంద్రుడు రవీంద్రుని విరచితము
భారతీయుల హృదయము మీ గీతము
జనగణమన అని ఎక్కడ వినబడితే
అక్కడే నిలబడి సెల్యూట్ చేసే
గౌరవము
త్రివర్ణ పతాక రెపరెపలు
మా గుండె చప్పుళ్ళు
గీతము మా హృదయ స్పందనము 
ఒక్కొక్క పదం
మన సిఫాయిల కదం
అన్ని రాష్ట్రాల ఉచ్చారణ
దేశభక్తికి ప్రేరణ
గీతం పాడుతుంటే 
నరనరం కణకణ0 ఉత్తేజం
రక్తం పారే ప్రతి చోట ఉత్సాహం
వత్సరానికి రెండు మార్లు
వినబడే జాతీయ గీతం
విన్న ప్రతిసారి నూతనోత్సాహం
బడిలో ప్రార్థన అయిన తర్వాత
జాతీయ గీతం పాడిస్తారు
పిల్లలకు పెద్దలకు కంఠస్థం
అందరికి జయం కలగాలని
ప్రార్ధిస్తాము
రైతుల పొలాలు సస్యశ్యామల
మవ్వాలని
కర్మాగారాలతో కళకళ లాడాలని
ప్రపంచ దేశాలలో మనదేశం
అగ్రగామిగా నిలవాలని
కుళ్లు కుతంత్రాలు లేకుండా
హత్యలు ఆత్మహత్యలు జరగకుండా
కులమతాలు కుమ్ములాటలు
రాజకీయ నాయకుల వెన్నుపోట్లు
సమాన హక్కులతో 
సమసమాజ దృక్కులతో
మన దేశం సాగాలని
సాగుతూ వుండాలని కోరుతూ...
          ఈ కవిత నా స్వీయ లిఖితము అని హామ
పెల్లుబికిన
 జాతీయ గీతం
జై హింద్ వందే మాతరం
జై జవాన్ జై కిసాన్ జయ జయ నాదాలతో  పుణ్య భూమి కర్మ భూమి  
వర్ధిల్లాలి
విజయభేరీ మ్రోగించే
గీతం మనజాతీయ గీతం
14.
డా.బల్లూరి ఉమాదేవి గారు

విశ్వకవి రవీంద్రుడు విరచించె
జాతీయగీతమును జగతి యందు
భారతదేశ గరిమ చాటెడుగ రీతిగా
  వ్రాయబడిన గొప్ప గేయమిదియు
 భారత దేశ చరిత్రను సంస్కృతిని 
చాటి చెప్పు నట్టి దేశభక్తి గీతమిదియే
పాఠశాలలందు ఉత్సవం సమయాన
క్రీడలను విజయ వేళలందు 
సచివాలయములందు విధిగా
  ఆలపించుట సాంప్రదాయమయ్యె 
వంగభాషలో రచించి సంగీత బాణిని కూర్చి
ఖ్యాతు డయ్యె విశ్వకవి టాగూర్
మార్గరేట్ సోదరీమణులుకమ్మని స్వరముతో
ఆలపించిరి తెలుగు సీమ యందు
దేశమున ప్రవహించు నదులన్ని యు
 భరతమాతను తలచురీతిగా వ్రాసె
జన సమూహాధినాయక మైనట్టి
 దేశమాత శుభనామమే పాడుచు
దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో
 జయ ఘోషలిడు జాతీయ గీతమిది

15.
డా.వేమూరి సత్యవతి గారు

శీర్షిక- దండాలు  దండాలు భారతమాతా!

  ఇదేదో  చిన్న విషయమా?--ఏమిటి?
కోట్లాది భారతీయుల బృంద ఛాయాచిత్రం!!
అది  మాటల చేర్పు కాదు,!పాటగా కూర్పు కాదు,!!
అది ఆరాధనకి  అద్భుతమైన  మార్గం!!
జాతీయ-సమైక్యతకి చక్కని  సంకేతం!!
కొండలు,నేలా,నింగీ,నదులూ,వెలుగుల ఉనికి!!
ఎన్నెన్నో త్యాగాలకి,అంకిత భావాలకీ ప్రతీక!!
అశోకచక్రం,నాల్గు తలల సింగం, ప్రతీకలైతే..
అహింసే ఆచరించాలనీ, సత్యమే జయించాలనే తపన..
కృషి,శాంతి,త్యాగం ఆకుపచ్చగా,తెల్లగా,కాషాయంగా కన్పిస్తాయి.!
నిలబెట్టె జెండా- గడ  చివర మువ్వన్నెలకిచ్చె హారతి-పాట!
పాటంటే  లొల్లాయిపాట కాదు,  దేశపటం దాగున్నంత గొప్పది!!
 మనమంతా ఒకటనే నేలపై ల భక్తి జాతీయగీతమైంది!!
సరిగా,భావయుక్తంగా ఈ గీతమాలపించటం,
ప్రణవాక్షరాల్లాంటి వాటిని సరిగా ఉచ్చరించటం,
చిన్నా,పెద్దా మనందరి కర్తవ్యం!!
తెలియదనకుండా తెల్సుకోవటం,
రాదనకుండా నేర్చుకోవటం,చేయాలి కదా!!
అమ్మకి నమస్కరించటం మరొకరు నేర్పాలా?
దండాలు దండాలు భారతమాతా-అంటూ
నేలతల్లికి దండమంటే జాతీయగీతాలాపనేకదా!!?
16.
కవిత శీర్షిక: అక్షర హారం


రవీంద్రుని కలం నుంచి జాలు వారుతూ
భారత జాతి ఆశకు ఆయువూదిన గానం 

స్వాతంత్ర్య కాంక్షను తనువెల్లా రవళించిన గీతం
రగిలించెను పోరాటం
సిద్ధించగా స్వరాజ్యం

దేశ ఐక్యతకు అద్దంపడుతూ
అందర మొకటని చాటే ప్రగతి గీతం

కోటి కోటి గుండెల చప్పుడు కోరుకున్న స్వరాజ్యం సాధించిందప్పుడు

భరతమాత మెడలో అక్షర హారం
జాతి గౌరవ సమాహారం

జనగణమన అంటూ సాగుతూ
ప్రతి నోటిలో పదిలంగా జనులు మెచ్చగా వెలిసింది

చరితకెక్కిన గీతం చరితనే మార్చేసిన గీతం
ఆత్మగౌరవానికి హక్కుల
కలబోతగా కదిలించిన గీతం జయహే జనగణమన గీతం

బొప్పెన వెంకటేష్
17.
కవితా గానం సీజన్3
వైశాఖ మాసం పౌర్ణమి నగదు పోటీకి
అంశం:మనజతీయగీతం
శీర్షిక:ఐక్యతా రాగం

సంస్కృతి, సాంప్రదాయలకు నెలవు మనజన్మభూమి.
ఉస్థానపతనాల చవిచూసిన సహనశీలి
మనమాతృభూమి.
రామరాజ్యం నడయాడింది మనపుణ్యభూమిలో.
తెల్లవాడు పాలన్నీపిండుకోగా బొక్క గోవై నిలిచింది మన కన్న తల్లి.
దేశ ఉచ్ఛ,నీచ స్థితికి కారకుడు ఆ పరమాత్మ.
దేశ భవిత నిర్దేశకుడు ఆ జగన్నాధుడు.
దేశభాగ్యవిధాత ఆ సర్వేశ్వరుడు.
ఆ ఈశ్వరుని శుభాశీస్సులు కోరుతూ వ్రాసిన గీతమే మన జాతీయగీతం.
ఈ గీత సారాంశమే చేసింది దీన్ని ప్రత్యేకం.
సౌందర్యమే చేసింది మహత్తరం.
కవితాత్మకమే అయింది ఆభరణం.
ఈ గీతానికి సాటి రాలేదు వేరొక గీతం.
అందుకే అయింది జనగణమన మన జాతీయగీతం.
జాతీయ భావనను శక్తిమంతం చేసిందీ గీతం.
మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు వివిధ సంస్కృతుల ప్రతిబింబాలు.
పూలదండలోని పూలవలె అన్నీ కల్సి ఆరోపించాయి ఐక్యతా రాగం.
పవిత్ర గంగా యమున లు దేశ ఉజ్వల భవితకు పరమేశ్వరుని నామాన్ని జపిస్తున్నాయి.
జాతీయ గీతాలాపన చేస్తుంటే గర్వంతో ఉప్పొంగుతుంది గుండె. 
పులకరిస్తుంది ఒళ్ళు.
నిక్కబొడుచుకొంటాయి రోమాలు .
జాతీయ గీతాలాపన మన పూర్వజన్మ సుకృతం.
భారతదేశంలోనే మళ్ళీమళ్ళీ పుడదాం
జాతీయ గీతాలాపన చేద్దాం
జాతీయ గీతాన్ని గౌరవిద్దాం
మన జన్మలు సార్థకం చేసుకొందాం

తిప్పావఝల నరసింహమూర్తి.  బుచ్చిరెడ్డి పాళెం
18.
కవితాగానం వైశాఖ పౌర్ణమి కవితా పోటీకి
అంశం:జాతీయ గీతం
పేరు:మద్ది. పుల్లారావు
ఊరు:నందిగామ
తేదీ:14-5-22
----
జనగణమణ మన జాతి గీతి
విశ్వమందున పొందెనెంతో ఖ్యాతి
గుండె గుండెను కదిలించెను ఠాగూర్ స్ఫూర్తి
రవీంద్రుని అంతరంగమున జనియించి
ఆసేతు హిమాచల భారతాన్ని ఏకం చేసిన
మహామహోజ్వల ధాత్రి గీతి
ఉత్తర భారత ప్రాంతము ఉజ్వలమనీ
దక్షిణ భారత ప్రాంతము దైవతమనీ
తూర్పతీరమంతా మహిమాన్వితమనీ
మధ్య భారతమంతా మధుర మధురమనీ
పశ్ఛిమ భారతప్రాంతము భాండాగారమనీ
ఈశాన్య భారతము యీప్సితాలు తీర్చుననీ
హిమాలయాలు పెట్టని కోటలై ఉన్నతములనీ
వింధ్య పర్వతాలు విశిష్ట మైనవనీ
గంగా,యమునలు కనకంబు రాసులనీ
హిందూమహాసమద్రము సుందర జలధియనీ
బహు సంస్కృతులు భారత పట్టుగొమ్మలనీ
బహు భాషలతో అలరారే శారదాంబయనీ
ఆర్య,ద్రావిడ,ఉత్కళ,వంగలు వేరు కాదనీ
గుజరాత,మరాఠ,పంజాబులు ఒక్క టేననీ
విశ్వశ్రేష్ట భారతము మనదనీ
అణువణువు భారతమాతనే తలుస్తున్నాయి
శుభాశీశ్శులు కోరుకుంటున్నాయి
భారత విజయగాధలు పాడుకుంటున్నాయి
జయము భారతమాత జయహే భాగ్యవిధాత
.....
ఇది నా స్వీయరచన.
...
ధన్యవాదాలు
19.
జయ జయ జయ జననీ 
••••••••••••••••••••••••••••••••••
గురుదేవుని కలం నుండి జాలువారిన..,
అమృతపు స్వరఝరిని గ్రోలిన
భారతజాతి ఎద దేశభక్తితో ఉప్పొంగి..,
ఆసేతు హిమాచలం యావత్తు,
ఆ జయగీతికను కోయిలలై ఆలపించగా..,
జీవ నదీనదముల జలధారలతో..,
ఉత్తుంగతరంగ పరవళ్ళతో..,
భరతమాత నిలువెత్తు రూపానికి,
నీరాజనాలు పలుకంగ
సాగరముల గలగలలే ఆమె పాద పద్మముల మంజీర నాదములై సవ్వడి చేయంగ..,
బహు భాషలనే ఆభరణాలను ఆపాదమస్తకం అలంకరింపజేసి..,
పంజాబ, సింధు, ద్రవిడ, ఉత్కళ..,
పెక్కు ప్రాంత పుష్పాదులను భక్తి భావనతో ఆ తల్లికి అర్పించి..,
వైషమ్యాలు వైదొలగి,
భిన్నత్వంలో ఏకత్వ సుస్థిర స్థాపన చేయు ఆత్మస్థైర్యాన్ని అందజేయుమా మాతా అని వేడుకొనుచూ !!
జనగణమన గీతిక ఉజ్వల తేజోమయమై, 
ఆ చంద్రతారార్కం శాశ్వతత్వాన్ని పొందునటుల ఆశీస్సులీయవా జయ జయ జయ జననీ...!!
=======================
టేకుమళ్ళ.విజయలలిత
ఉపాధ్యాయిని
20.
*కవితా గానం(సీజన్3).       14--5--2022.
పిన్నక నాగేశ్వరరావు.
వైశాఖ మాసం పౌర్ణమి కవితల పోటీకి...
అంశము :-- భారత జాతీయ గీతం.
శీర్షిక :-- జాతీయ గీతం ప్రాముఖ్యత. 

1. తే.గీ.
పలు రకాల సంస్కృతులను కలిగి, వివిధ
భాషలున్ రాష్ట్రములు గల భారతాన
జనులు జాతీయ గీతము సరణి పాడు
కొనగ రచన చేసిన పాట "జనగణమన".

2. తే.గీ.
ప్రజల నొకటిగా చేయు తలంపు తోడ
భరతమాత కీర్తిని చాట పలు దిశలను 
విశ్వకవిగ వెలిగిన రవీంద్రుడంద 
జేసె నీ గీతమును వంగ బాస లోన.

3. తే.గీ.
ద్రావి,డోత్కళ, సింధు రాష్ట్రాల తోడ
వింధ్యయున్ హిమాలయములు వెల్లివిరియ
గంగ, యమునల ఝరుల తరంగములను 
శోభితమగు భాగ్య విధాత! శుభము నీకు
జయము కలుగు గాక విధాత జయము,
                                                జయమ
టంచు స్ఫూర్తి కలుగగ రచించె గీతి.

4. తే.గీ.
"జనగణమన" పాటను ప్రపంచమున నుత్త
మమగు గేయముగ 'యునెస్కొ'మండలి
                                                     గుఱు 
తించి విలువైన కాన్క నందించు టెంతొ 
భారతీయు లందరికి గర్వమ్ము గాదె!!

5. తే.గీ.
పాట పాడగ కొన్ని నిబంధనలను
ప్రభుతయె విధించె; పాట యేబదియు రెండు 
సెకనుల వ్యవధిలోనె కచ్చితముగాను
పాడవలెను; ముఖ్యులు రాష్ట్రపతి, గవర్న
రులకు గౌరవ వందనములనిడు సమ
యమున, నధికార కార్యక్రమంబులకును
పాట వినిపించు టెపుడు తప్పనిసరి యనె.
**************************************
21.
[15/05, 7:51 am] Lalita Sister: కవన జ్యోతి నిర్వహించిన వైశాఖ మాసం కవితల పోటీకి
తేది: 14-05-2022
అంశం: మన జాతీయ గీతం

పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి:9505152560
**********************
    
        *జయహో* 

జనగణమన అధినాయక జయహే
విశ్వ కవి రవీంద్రనాథ్ లిఖిత సృష్టి
మాతృక బెంగాలీలోని తొలి భాగం
1911 డిసెంబర్ 27న
కలకత్తాలో
భారత జాతీయ కాంగ్రెసు సభలో మొదటిసారి ఆలాపన
1912 జనవరిలో తత్వ బోధిని పత్రికలో
భారత విధాత శీర్షికన ప్రచురణ!

దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన గీతం
దేశవారీ ప్రాంతాలు
రాష్ట్రాల పేర్లను ఉటంకిస్తూ
పర్వతాలనుంచి
నదులు ప్రవాహం గురించి అనుసంధానం...

నా గీతం ఎప్పుడూ సౌభ్రాతృత్వం సమానత్వం గురించి చెబుతుంది...
రవీంద్రుని స్వీయ గాత్రంతో ధారణ

అధికారిక, క్రీడోత్సవాల్లో, ఇతర ఉత్సవాలలో రాగరంజితం
ప్రతి దినం పాఠశాల మొదలయ్యే ముందు
అసెంబ్లీలో పాడటం
రేడియో, టెలివిజన్ ఆరంభంలోనో అంతంలోనో
దేశభక్తి గీతం 
భారతదేశం బంగ్లాదేశ్ లో ఒకే జనగణమన!
నోబుల్ బహుమతి గ్రహీత
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 
          ***

సయ్యద్ జహీర్ అహ్మద్
22
[15/05, 7:52 am] Lalita Sister: కవితా గానం సీసన్ 3
శుభకృత్ నామ సంవత్సర వైశాఖ పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ కోసం 
************************
అంశం : భారత జాతీయ గీతం
**********************
శీర్షిక : ఏకత్వగానం
*********************
ఘన చరిత్రను సిగలో తురుముకుని
భిన్న సంస్కృతులను హృదిలో దాచుకుని
తల్లి భారతి గొంతు పలికిన ఏకత్వగానం

ఆ జనగణమన చినుకులు జాలువారితే చాలు
ఉవ్వెత్తున జాతీయతా మట్టి పరిమళం అలుముకుంటుంది

ఆసేతు హిమాచలమంతా అల్లుకుని
ఉత్తేజపు సుమాలను పూయించే జాతీయ తీగ

జెండా రెపరెపల కింద సేదతీరిన కోట్ల 
గాయపడిన గుండెలలో సాంత్వన నింపి
గతుకుల్లో..ఎత్తుపల్లాల్లో చేయిపట్టుకు నడిపించి
ప్రత్యర్థుల ఎదల్లో ప్రకంపనలు సృష్టించే గీత మది

అంతర్లీనంగా ప్రవహించే ఆ భావోద్వేగ గాన నది 
ధీరోదాత్త స్వప్నాలను పూయిస్తుంది..
మనసులకు జాతీయతను మూటగట్టిస్తుంది

ఎవ్వరైనా..ఏ చోటున్నా..ఏం చేస్తున్నా
లేవనెత్తి వీపుతట్టి నిలబెడుతూ..

వర్గాలుగా వర్ణాలుగా పగులగొడుతున్నా
దూరాలను దగ్గరగా..మెత్తుకుంటూ వస్తుందా మట్టి గీతం

జాతీయ గీతం..
భారతీయుల స్వరం లో ప్రతిధ్వనించే 
ఆశావహ దృక్పథం
హద్దులను చెరిపేసి..ప్రాణలను కలిపి కట్టిన దారం
తరతరాలకు సజీవమై నిలిచే త్యాగం

డా.దారల విజయ కుమారి

హామీ పత్రం
***********
నమస్తె సర్/ మేడం
ఈ కవిత నా స్వంత రచన.అనువాదం కాదు.
ఎక్కడా ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
డా.దారల విజయ కుమారి
23
[15/05, 7:52 am] Lalita Sister: కవితా గానం (సీజన్ _3)
పౌర్ణమి కవితల పోటీ 
అంశం....భారత జాతీయ గీతం 
శీర్షిక...గౌరవ గీతం

నూటా నలభై కోట్ల మందిని
నిలబెట్టి కదల కుండా కట్టి పడేసే
నా, నీ ,మనందరి కోసం 
యావత్  భరత జాతి కోసం
రవీంద్రనాథునిచే పొందికగా అల్లబడినది....

  చరిత్రలో మొదటి భారత
 జాతీయ గీతం 
జన గణ మనగా ఎన్నుకో బడినది....

భారత చరిత్ర, నాగరికత,
 సంస్కృతి , దేశ జనాభా గురించి 
మాట్లాడే జన గణ మన
రాజ్యాంగ హోదా పొందినది..

జనం గుండెల్లో ఓ గౌరవప్రదమైన 
సుస్థిర స్థానం పొందినది....

స్వాతంత్ర్యం వచ్చిన మూడు  సంవత్సరాలనంతరం
 1950 జనవరి 24 న రాజ్యాంగ 
అసెంబ్లీ స్వీకరించబడ్డ జాతీయ గీతమిది....

ఈ సుస్వారాల దేశ భక్తి గీతం
పాడటంలో వాయించడంలో
నియమాలు నిబంధనలు పొందినది...

49 మరియు 52 సెకన్ల మధ్య 
ముగియాలనే ఆంక్షల ఉల్లంఘనకు
జైలు , జరిమానాలు తప్పని సరైనది....

ఎన్ని ఏండ్లు గడిచినా 
ఎన్నటికీ మారనిది
భావి తరాలకు తరగని నిధి
భారత జాతీయ గౌరవ గీతమిది...!!

హామీ...నమస్తే ఈ కవిత నా స్వీయ రచన అని ఈ పోటీ కొరకే వ్రాశానని  మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను 🙏

మొహమ్మద్ .అఫ్సర వలీషా 
ద్వారపూడి (తూ గో జి)
24
[15/05, 7:52 am] Lalita Sister: *కవితాగానం సీజన్-3*
*వైశాఖ మాస పౌర్ణమి కవితల పోటీలు..*
*అంశము: భారత జాతీయ గీతం*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాలరావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *జనగణమనకే జయహే!*
ప్రక్రియ: *వచనకవిత*
*********************

*జనగణముల మనసుల నధిరోహించిన నాయకునికి*

*జయగీతము పాడెనుగా విశ్వకవి రవీంద్రుడే!*

*భారత దేశపు భాగ్యము సర్వము నీవే ఓ విధాతా!*

*అంటూ జయకేతనమును ఎగురవేసెను భారత జాతే!!*

*అన్ని రాష్ట్రముల సమూహమీవే! అన్ని నదుల సంగమమీవే!*

*అన్ని తరులు,గిరులు,విరులు, సిరులు, ఉన్నత హిమ శృంగములు*

*కిరీటములుగా ఉన్న దేశమాతకు వందనమనరే!జనులారా!*

*నీ శుభనామమే ఎల్లపుడూ మా చెవులలో ఇంపుగా మారు మ్రోగగా!*

*నీ శుభ ఆశీస్సులే మేమెప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకోగా!*

*ఠాగూర్ కలము నుండి వెలువడిన ప్రియ శుభగీతము నీవే!నీవే!!*

*స్వతంత్ర భారత సార్వభౌమత్వానికి సంపూర్ణ చిహ్నము నీవే కదా!*

*మువ్వన్నెల జాతీయ పతాకంతో ముప్పేటలా ముడిపడినది నీవే!!*

*సత్యం, ధర్మం, న్యాయం, చట్టం, శాంతి,అహింస ల రూపం నీవే!*

*సమగ్ర భారత నిర్మాణానికి మార్గదర్శనం చేస్తున్నావు!*

*నిను గానం చేయగా పులకించెనులే రోమరోమములు దేశభక్తితో!*

*నిను వినిపించగా మా కంఠంబులు రసరాగాలే పలికించెనులే!*

*దేశపు శక్తిని, తేజము,బలమును కురిపించినదీ నీ గానమే!!*

*ఎన్నో కులములు, ఎన్నో మతములు.. ఐక్యతాశక్తివి నీవే! నీవే!!*

*ప్రతి ఒక జననం! ప్రతి ఒక మరణం! భారతమాతా! నిన్నే స్మరణం!!*

*కవికులమందున ప్రతి కలమందున దాగిన తేజం నీవే! నీవే!!*

*స్వాతంత్ర్యోత్సవ అమృతోత్సవమున  అఖండ విజయం నీ జయ గీతం!!*

*స్వతంత్ర భారత శంఖ నినాదం! ప్రతి భారతీయుని హృదయపు శబ్దం!!*

*జయహే! జయహే! జాతీయ గీతం!! జయహో! జయహో! భారతదేశం!!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
25
[15/05, 7:52 am] Lalita Sister: కవితా గానం సీజన్--3
వైశాఖ మాసం
పౌర్ణమి కవితల పోటీకి
అంశం:--భారత జాతీయ గీతం
శీర్షిక:-- సమైక్యతా గేయం
రచన:-- సింహాద్రి వాణి
ఊరు:--విజయవాడ చరవాణి :--7569820872

భారతదేశ సమైక్యతా గేయం
కుల మత ప్రాంతీయ రహిత సర్వ సమానతాభావ జరీ ప్రవాహం
భారతీయ చరిత్ర, సంస్కృతులను మేళవిస్తూ
ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ప్రతీకగా నిలచిన
అద్భుత అక్షర సౌగంధికా సుమాల హారం
స్వచ్ఛమైన భారతీయుల కర్ణ రంధ్రాలలో దూరి
శరీరంలో అణువణువునా చేరి
అనుక్షణం దేశభక్తితో ఉత్తేజపరచే అచ్చమైన ప్రేరణ స్తోత్రం
రాజ్యాంగ సభచే జాతీయ గీతంగా ఆమోదించబడిన 
విశ్వకవి రవీంద్రుని మేధోమధన ఆవిష్కృతం
జాతీయ, వ్యక్తిగత,  సామాజిక పర్వదినాలలో గానం చేయబడే
రసరమ్య గేయం
భారతీయులందరిచేత గొప్పగా గౌరవాన్ని పొందే జాతీయ గీతం.

హామీ:-- ఇది నా స్వీయ రచన.
26
[15/05, 7:56 am] Lalita Sister: ఒక్క సారి ఉచ్చరిస్తే చాలు...
***************

జనగణమన పదాన్ని 
ఒక్క సారి ఉచ్చరిస్తే చాలు
హృదయం ఉత్తుంగ తరంగమై పొంగిపొరలుతుంది!

జనగణమన మంగళ దాయక జయహే యని మనసారా ఆలపిస్తుంటే చాలు..

ఆ సేతు హిమాచలం నుండి
కన్యాకుమారి దాకా 
భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే
నా దేశ సంస్కృతి సంప్రదాయాలు
కళ్ళముందు కమనీయంగా కదలాడుతుంటాయి...

....యమునా గంగా యని
తలుచుకుంటే చాలు
సస్యశ్యామల నా దేశంలో
పరవళ్ళు తొక్కే జీవనదులు
నా నరనరాన జీవ జలమై ప్రవహిస్తూ
నా మనో క్షేత్రం హరిత వర్ణ భూషితం అవుతుంది!

నా దేశ ప్రజలంతా ముక్త కంఠంతో
యాభై రెండు సెకండ్లు ధ్యానిస్తూ పాడితే చాలు..

అచంచల దేశభక్తిని పెంచేలా రాసిన
నోబెల్ బహుమతి గ్రహీత
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్  నిలువెత్తు రూపం
కనులలో ఠీవిగా కనిపిస్తూ...

మన దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసిన
 గీతాంజలి నవలను ఎప్పుడెప్పుడు చదవాలా 
మనసు తహతహలాడుతుంది..


వురిమళ్ళ సునంద
27.
కవితాగానం ( సీజన్‌3)  13/5/2022/ శుక్రవారము
వైశాఖమాస పౌర్ణమి కవితలపోటీ
అంశం:- " భారతజాతీయగీతం"

   భారతమాత ఘనతను చాటెడు జాతీయ గీతము
జనులలోజాలువారెడు గీతమై
వెలుగొందుచున్న గీత ము

రవీంద్రుని కమ్మని భావముల కదలాడిన గీతము
జాతీయ గీతముపాడ భారతీయతనంత నరనరము కదలాడు పరవశాన

జనగణమన అనగానే జనరంజకమై జడునినోటివెంట కూడ జాలువారెడు గీతము
పండితుడైన పామరుడైన గీతము చెవులబడగానె భక్తి భావనతో నిలబడు బొమ్మవోలె
జండా వందనమనుచు గణతంత్రదినోత్సవమనుచు ఆబాలగోపాలము నాగీతమునే పాడుచుండు

జాతిఘనతనుచాటు జాతీయగీతము అన్నిరాష్ట్రముల ఘనతను చాటుచూ వింధ్య హిమాచల పర్వతశ్రేణుల వర్ణనలతో యమునా గంగా పుణ్యనదుల ప్రవాహములతో మహాన్నత సముద్ర తరంగాల ఘోషలతో ఎల్లవేళలా భరతమాత శోభలను తలపిస్తూ తమఆశీస్సుల కోరుతూ తమవిజయ సాధననే పాడుకొనుచున్నవని తెలియజేయు గీతము
ఆచంద్రతారార్కము భారతీయులందరము మనజాతీయ గీతము పాడుకొందాము
" జాతీయగీతానికి జేజేలు"
    తరణికంటి సూర్యలక్ష్మి.
               _________
28.
[15/05, 8:26 pm] Lalita Sister: కవితా గానం  సీజన్ -3
వైశాఖమాసం  కవితల  పోటీ
అంశం    భారత జాతీయ గీతం
తోట సులోచన
నెల్లూరు
చరవాణి   9490173053
శీర్షిక   మన జాతి గౌరవం

భారత జాతీయ గీతము నోబెల్ బహుమతి 
 గ్రహీత  రవీంద్ర నాధ్ ఠాగూర్  హస్త
కమలం  నుండి  జాలు వారిన యద్భుత
గీతం
సంస్కృతికి, గౌరవానికి   ప్రతిబింబం
ఠాగూర్  బెంగాలీ భాషలో రచించినా
అందులో సంస్కృత పదాలు  జోడించే
మొదట యీ గీతాన్ని  ఠాగూర్ గారు
అంధ్ర ప్రదేశ్ లోని  మదనపల్లిలో
చిత్తు ప్రతిగా  వ్రాసి  నాలపించే
కానీ మొదట 1911లో  కలకత్తాలో
జాతీయ కాంగ్రెస్ సమావేశంలో
పాడిన జాతీయ గీతమిదియే
ఈ గీతాన్ని" తత్త్వభోధిని"యనేపత్రికలో 
భారత  విధాత పేరుతో ప్రకటించబడే
1950లో జనవరి 4వ తేదీన జాతీయ
గీతంగా  రాజ్యాంగ సభ  స్వీకరించే
ఈ గీతానికి  బాణి కూడా ఠాగూర్ గారే
ఈ గీతాలాపనకు 52సెకన్లు  సరిపోవు
జాతీయ గీతాన్ని విన్నప్పుడు మన
మనసు  పులకించి పరవశిస్తుంది
మన పెదవుల  పలికే తారకమంత్రమే
ఠాగూర్ గారు యేడు చరణాల్లో రచించే
దానిలో ఎనిమిది వరుసలను  జాతీయ
గీతంగా  తీసుకున్నాక, దీనిని నాంగ్లంలో
మార్నింగ్ ఆఫ్ ఇండియా యని రచించే

హామీపత్రం
ఈ కవిత నా సొంతమనియు, దీనికొరకే
వ్రాయబడినదని  హామీ ఇచ్చు చున్నాను
29
[15/05, 9:36 pm] Lalita Sister: కవితా గానం 3
******************
అంశం:- జాతీయ గీతం
************************
జన హృదయము లలరించిన జయగీతిక
జనులను జాగృతం చేసిన విజయ గీతిక
హిమగిరి సొగసులు పంచిన సుమ గీతిక
సాగర మేఖల మిచ్చిన సుర గీతిక
గంగా యమునా కృష్ణ  గోదావరులు
పచ్చని అడవులు లోయలు పచ్చిక బయలు
కొండలు కోనలు పలికే జయ ధ్వానాలు
యోగుల మానస ధ్యానం ఓంకారాలు
కాశీ మధుర ప్రయాగ హరిద్వారాలు
బదరీ గంగోత్రులు కేదారాలు
అనురాగం ఆప్యాయత అనురాగాలు
అందించే భారత సంస్కృతి మూలాలు
భాషలు యాసలు ఊసులు బహు వేషాలు
తల్లీ తండ్రీ గురువుల అభిమానాలు
సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింసలు
సర్వత్రా వినిపించే మూల మంత్రాలు
వీరశివాజీ రాణా ప్రతాప సింహులు
రుద్రమ ఝాన్సీ లక్ష్మి వీర నారులు
హరిశ్చంద్ర శిబి రంతి దానకర్ణులు
మాంధాత రఘు జనకులు చక్రవర్తులు
మమ్ము గన్న మాతృభూమి వేల దండాలు
రెపరెపలాడే జెండా మూడు రంగులు
మాతృ భూమి నర్చించే జయ గీతికలు
జనగణమన జయ భారత జయగీతాలు,
🖋️ వేదాంతం సురేశ్ బాబు
      చంద్రపూర్
30.
[16/05, 8:01 am] Lalita Sister: కవితాగానం _సీజన్ 3
వైశాఖ మాసం పౌర్ణమి కవితల పోటీలు
అంశం :జాతీయగీతం
శీర్షిక :మన జన గణన
********************************
'జన గణ మన' జాతీయ గీతం/
విశ్వకవి రవీంద్రుని విరచితం /
మది మదిని చేస్తుంది ఉత్సాహభరితం/
ప్రపంచ గుర్తింపు పొందిన గీతం/
భరతమాతకు కీర్తి కిరీటం/
ప్రథమ పౌరునిచే ప్రకటించబడిన 
జాతీయ గీతం/
నదీ నదాలతో సిరులు పొంగిన జీవగడ్డ/
ఏ దేశమేగినాఎందు కాలిడినా పాడే గౌరవగీతం/
ఒలింపిక్స్లో ,సినిమాలలో, సభలలో సెల్యూట్ చేయించుకునే గీతం/
వేణు నాద మై పలికిన గీతం/
ఈల గానమే చేసిన గీతం/
సరిగమలతో పాడే మధుర గీతం/
బడులలో బాలలు పాడే గీతం/
వీర సైనికులు  హిమవన్నగము పై జెండా
ఎగురవేసి పాడే వీర గీతం/
విజయగాథలనే స్మరిస్తుంది/
వీరత్వాన్నే నింపుతుంది/
దేశ మాత మేలును కాంక్షిిస్తుంది/
జీవకోటి క్షేమాన్ని కీర్తిస్తుంది/
"జనగణమన..."
మన "జన గణనను ''అదుపులో పెట్టుకోవాలనే అంతరార్థం /
**************************************************
హామీ: ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.
రచన: మన్నె లలిత
హైదరాబాద్
31
[16/05, 8:02 am] Lalita Sister: కవితాగానం సీజన్ 3
..
వైశాఖ మాసం 
పౌర్ణమి కవితల పోటీ కోసం 
...
అంశం: భారతీయ జాతీయ గీతం 
శీర్షిక: శ్రీరామ రక్ష
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
కాజీపేట 
...
జనగణమణ గీతమే 
భారత జాతీయ గీతం 
భరత జాతికి గర్వకారణము 
మన జాతి ఆత్మగౌరవము 

స్వాతంత్ర్య సమరవేళ 
స్వాతంత్ర్య సమరయోధులను 
ఉత్తేజ పరిచిన గీతము 

విశ్వకవి విరచించి 
స్వరపరిచిన గీతం 
జనగణ పదాలు 
మన హృదయ వీణా తంత్రులపై 
దేశభక్తి స్వరాలను ఆలపించు 
జాతీయ భావాలను పెంపొందించు 

భారతీయుల మదిలో 
సదా మెదిలే తారకమంత్రం 
సంస్కృతి సంప్రదాయాల వారసత్వము 
మన భరతమాత ఔన్నత్యాన్ని కీర్తిస్తూ 
మనం ఆలపించే జాతీయ గీతం 

మొట్టమొదటిసారిగా 
దక్షిణ భారత దేశపు శాంతినికేతన్ లో 
బహిరంగంగా ఆలపించిన గీతం

భారత జాతీయ గీతం 
జాతికి శ్రీరామ రక్ష
...
హామీ పత్రం 

ఈ కవిత నా స్వంత రచన

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...