Skip to main content

తెలంగాణ 2022

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
 వీరా గుడిపల్లి
*********
కవి వరుల జాబితా
1.అపరాజిత్ గారు
2.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
3.కె.వి.రమణాచారి గారు
4.మదునూరి సూర్య నారాయణ గారు
5.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు
6.అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు
7.గొర్రెపాటి శ్రీ ను గారు
8.వురిమళ్ళ సునంద గారు
9.గొర్రెపాటి శ్రీ ను గారు
10.కవిత వెంకటేశ్వర్లు గారు
11.గజవెళ్ళి శ్రీ నివాస చారి గారు
12.దారల విజయ కుమారి గారు
13.తంగిరాల నాగ లక్ష్మి గారు
14.పొర్ల వేణు గోపాల్ రావు గారు
15.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
16.వనపర్తి గంగా ధర్ గారు
17.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
18.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
19.వేదాంతం సురేష్ బాబు గారు
20.ఏడెల్లి రాములు గారు
21.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు
*****************----
1.
[31/05, 8:00 pm] Aparajith: జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

పట్టపగలు ఆకాశంలో నక్షత్రం పొడిచింది
శ్రీకాంత్ చారి అగ్నికి ఆహుతియయ్యి
తెలంగాణ రాష్ట్ర అవతరణకు పురిటినొప్పులు అనుభవించాడు!
జయశంకర్ కోదండరాం లాంటి విద్యావేత్తలు మార్గదర్శనంలో
తెలంగాణలో జన చైతన్య జ్వాల లూదారు
కేసీఆర్ పట్టిన పట్టు వదలకుండా
ఆమరణ నిరాహారదీక్ష బూనాడు!
జనజీవన శ్రవంతిలో చైతన్యం వచ్చి
మన నీళ్ళు మనకు సింగరేణి మనది
మన తెలంగాణ కోటి ఎకరాల మాగాణి
చదువులు పూర్తిచేసుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి
రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు ప్రజానీకం వెల్లువెత్తారు!
నడిరోడ్లపై వంట వార్పు, బోనాలు, బతుకమ్మలతో
సకల జనుల సమ్మెతో పోరుబాట పట్టారు!
ఎట్టకేలకు కేంద్రం స్పందించి
తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోంది శాంతించండన్నారు
నిమ్మరసం నీళ్ళు తాగి కేసీఆర్ దీక్ష విరమించారు!
అయినా ఆంధ్రా నాయకులు కలిసేవుందాం అంటూ నినదించారు
ఇటు తెలంగాణ అటు ఆంధ్ర అతలాకుతలం అయ్యింది
తెలంగాణలో తొమ్మిదివందల మంది బలిదానాలయ్యాయ్!!
పరిస్థితి చేయిదాటి పోతోందని సోనియా గాంధి నేతృత్వంలో
ప్రతిపక్ష బీజేపీ తో మంతనాలు జరిపి
రెండు పార్టీలు ఒక్కత్రాటిపైకి వచ్చి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ అయ్యింది!!
జై తెలంగాణ అంటూ నేతలు ప్రజానీకం పండుగ చేసుకున్నారు
జై తెలంగాణ!!జై జై తెలంగాణ!!??

అపరాజిత్
సూర్యాపేట
2
[31/05, 8:03 pm] కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు Poet: అంశం... తెలంగాణ స్ఫూర్తి
శీర్షిక...... దేశానికే మకుటం ::: 02/06/2022
స్వీయ రచన:::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
సెల్ ఫోన్::6281697982 :: 8497924605
***************************************

నా తెలంగాణ కోటి రతనాల వీణ...అయినా
ఉమ్మడి రాష్ట్రంలో తంత్రులు తెగిన దీన 

ఉద్యమాల సెగ తగిలించి పర పాలనను తొలగించిన, అర వీర భయంకర తెలంగాణ

నీళ్ళు నిధులు నియామకాలు తస్కరించిన
తస్కరులను... తరిమి కొట్టిన త్రయంబకేశ్వరి

కని విని ఎరుగని రీతిలో తరగని నీటి సంపదను
పెంచి
బీడు భూములను పంట పొలాలుగ మార్చిన
మాంత్రికుడు కాకలు తీరిన కాకతీయుడు

చవుడు నేలలకు నీళ్ళందించి చేను చెలకల
సత్తువ పెంచి సస్యశ్యామలం చేసిన చమత్కారి
గంగను వదిలిన చంద్రశేఖరుడు

ఎండిన నోటికి గుక్కెడు నీళ్లకు కోసెడు దూరం నాడు
వంట ఇంటికే బండెడు నీళ్ళతో భగీరథుడే ప్రత్యక్షం నేడు 
పంటలు లేక పస్తులు తోటి కంట నీరుతో రైతులు నాడు
పండిన పంట పొదుపు చేయుటకు తావును వెదికే హాలికులిపుడు 

బీడు భూములు చవుడు నేలలు గరికే మొలవని క్షేత్రాలానాడు
కాకతీయతో కళకళలాడుతూ జలజలమంటూ
పారే వాగులు నిండిన చెరువులు కుంటలు... తళ తళ వాడే జలకళ ...అదే అదే జీవకళ

ఎటు చూసినా పచ్చని పొలాలు నిగ నిగలాడే
చేను చెలకలు ఉన్నాయంటే కాళేశ్వరుని కనికట్టే

మన్నును జున్నుగ మార్చే మంత్రం తెలిసిన మట్టి మనుషివి...ఆ కిటుకులు తెలిసిన కర్మయోగివి ఉద్యమయోగివి స్ఫూర్తి ప్రదాతవు

తెలంగాణ రాష్ట్ర సమితితో తల ఎత్తుకుని నిలిచి 
దేశ భవితకు దిశా నిర్దేశనం చేసే ధ్రువ తార
నా తెలంగాణ కోటి రతనాల వీణ ఈనాడు

ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలతో అజేయమై
సగర్వంగా భాసిస్తోంది దేశానికే మకుటంగా 

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
3
[31/05, 8:04 pm] +91 94904 14273: *తేజోమూర్తులు*

*ఉవ్వెత్తునఎగిసినఉద్యమా దివిటీలు*
*తెగింపు తెలంగాణకు  తేజోమయ మూర్తులు*

తొలి తెలుగు కవనాన్ని చిలికిన పాల్కుర్కి.
తెలంగాణ చరిత్రను శోధించిన ఆదిరాజు వీరభద్ర.
పత్రిక రంగన్ని పరిగెత్తించిన ఒద్దిరాజు సోదరులు
మన సాంఘిక చరిత్రను మలుపు తిప్పి రాసిన సురవరం
*ఉవ్వేత్తున*
మహిళ మొల్ల కవ్వనమై మేటి రచయితై నిలిచే.
పాటల పూదోట మన సుద్దాల హనుమంతు.
శాసనాల తపస్వి వెలిసే బి. ఎన్ .శాస్త్రి.
సంఘ సంస్కరణ వెలుగు కిరణమే మన భాగ్యరెడ్డి వర్మ.
*ఉవ్వెత్తున*
కష్టజీవి కన్నీటి దార తోడుగా నిలిచే కాళోజీ.
నుడికారపు కథన శైలి యశోదారెడ్డి.
కవనానికి పెద్ద దిక్కు మనకు దాశరథి.
చరిత్రకు ఆధారాలు బహుధాన్య పురమై నిలిచే.
*ఉవ్వెత్తున*
ఉద్యమాల బాట నడిచి ఐలమ్మ ,కొమురయ్యలు.
అడవి బిడ్డల  కొండ అయినా కొమరం భీముడు.
విశ్వ వాకిట్లో పతాక మెగిరించిన సాయుధ పోరాటాలు.
పోతన దేవుల పల్లి జయశంకర్ సినారే లా దీప్తి.

*ఉవ్వెత్తునఎగసినఉద్యమా దివిటీలుతెగింపు తెలంగాణకుతేజోమయ మూర్తులు*



పై రచన నేను స్వయంగా రాసినది అని హామీ ఇస్తున్నాను 



       కె వి రమణ చారి
భాషోపాధ్యాయుడు తెలుగు
ప్రా కో పా గంగర మంద
మాక్లూర్
నిజామాబాద్ జిల్లా
   pH no 9490414273
4. 
అంశం :తెలంగాణ
శీర్షిక: అగ్నిపునీత
🌹🌹🌹
తెలగాణ సిరులు నింపే మాగాణి
అరవిరిసిన పూదోటలో పూబోణి
   సాత్విక భావాల కలబోత
 సహజీవన సంస్కృతుల సహజాత
అగ్ని శిఖను దాల్చి
రణన్నినాదంచేసి
శత్రుసంహారం చేసిన
పడిలేచిన కడలితరంగానివి.
ఊరుమ్మడి బతుకుల 
ఉద్యమబావుటా
పోరాటం నరనరాన 
జీర్ణించుకున్న అగ్గిబరాటా
అభివృద్ధని పేరుజెప్పి
విషపు పాములు 
బుసలుకొడితే
అదను చూసే దెబ్బగొట్టే 
వీరనారివి నీవెగా
 కులమనే కుంపట్లనన్ని
కూలదోసి 
పచ్చపచ్చని తివాచీపై
పరగ నిలిచిన
ప్రకృతి మాతవు
అగ్నిపునీతవు
నీవు నడిచే మార్గమొక ధైర్యం
నీవు చూసే చూపులే మాకొక చల్లని ఉషోదయం.

 మదునూరి సూర్యనారాయణ 
  బీరంగూడ ,రామచంద్రాపురం
   హైదరాబాదు.
5
 డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: తెలంగాణ

వీరుల ఆత్మలు ఫలితంగా
అమరుల త్యాగ ఫలితంగా
నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన నాటి నుంచి

నీళ్లు నిధులు నియామకాలు
ప్రధాన వివక్షకు వ్యతిరేకంగా
పల్లవించిన ప్రజా ఉద్యమ
ఆవిర్భావం తెలంగాణ

ప్రజల సుభిక్ష తకు
ప్రజా చైతన్య యాత్ర కు ఉస్మానియా విద్యార్థుల
అమరుల త్యాగ ఫలితంగా అమరవీరుల స్తూపం సాక్షిగా

నాలుగు కోట్ల తెలంగాణ
29వ రాష్ట్రంగా కళ్ళముందు బంగారు తెలంగాణ సాకారం ఇకముందు సమగ్ర తెలంగాణ

కోటి రత్నాల వీణ గా వెలుగొందాలని ఆకాంక్ష లతో
ప్రజా తెలంగాణ రాష్ట్ర
కళ్ళముందు సాకారమైన నిజ సామాజిక తెలంగాణ బంగారు తెలంగాణ నలుదిక్కుల అభివృద్ధి పదమై సాగాలి సాగాలి

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453
6
[01/06, 9:24 pm] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: కవితాగానం( సీజన్3)
ఆధ్వర్యంలో
తేది:-01-06-22
అంశం:-
తెలంగాణ ఆవిర్భావం ప్రత్యేక కవిత
శీర్షిక:-
నా తెలంగాణ కోటిరతనాల వీణ
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
................................
నైజం నిరంకుశ పాలన నెదిరించి దాశరధి, కాళోజి
చాకలి ఐలమ్మ వంటి ఎందరో త్యాగధనుల ఫలితమే తెలంగాణ కు
ఆయువు పట్టయిన నేటి హైదరాబాద్ భారత దేశంలో విలీనం
ఉక్కుమనిషి పటేల్ వజ్ర సంకల్పానికి నిదర్శనం..!

తెలుగువారు ఒకటైన
ఒక ప్రాంతపు వరిపాలనలో
చిన్నచూపు చూడబడిన తెలంగాణ నాటి మహాకవి
దాశరధి అన్నట్లు కోటి రతనాల వీణయే.
కనుతెరిస్తే జననం
కనుమూస్తే మరణం
లిప్త పాటు జీవితకాలం అన్న సి.నా.రె మరియు
రావూరి భరద్వాజ ఇద్దరు
జ్ఞానపీఠ పురస్కారమహనీయులు 
తెలంగాణ ముద్దు బిడ్డలే.!

ఎందరో విద్యార్థుల,మహనీయుల
త్యాగఫలితమే తెలంగాణ
ఆవిర్భావం. సంక్షేమ పథకాలలో,స్త్రీ జానోద్ధరణ
షాదీ ముబారక్ ,ఉచితవిద్య, నీటి పారుదల ప్రాజెక్టులు ఎన్నో ఎన్నెన్నో పధకాలను ప్రవేశ పెట్టిన నేటి ప్రభుత్వం, పర్యావరణ పరిరక్షణ ను" వృక్షో రక్షతి రక్షితః" అని చిలుకూరు బాలాజీ మందిరం నుంచి
ప్రారంభించి దేశంలోనే అగ్రగామిగా నిలవడం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండవ తేదీన జరుపుకోవడం
భరతావనికే గర్వకారణం.!
..............................
ఇది నా స్వీయ రచన
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762

.............................
7
[01/06, 9:26 pm] Gorrepati Srinu Garu Poet: కవితా గానం

రచన : గొర్రెపాటి శ్రీను
పరాయి పాలకుల నిరంకుశ పోకడలకు తట్టుకోలేక..
అడుగడుగున ఎదురవుతున్న అవహేళనలు,అవమానాలకి విసిగి వేసారి..
స్వరాష్ట్రం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో ..తెలంగాణ సమాజం అంతా ఒక్కటై ..
కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి సారద్యంలో ఉద్యమించగా..ఎన్నో ఏళ్ళ తీరని స్వప్నం నిజమవ్వగా..
నేడు శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాకుండా ..అన్నిరంగాల్లో ప్రగతిపథాన నడుస్తున్న తెలంగాణ నిజంగా దేశానికే ఆదర్శం !
నాడు విమర్శించిన వాళ్ళే నేడు మెచ్చుకుంటూ..అనుసరిస్తుంటే
ఇది ప్రజా విజయం !
ఇది మొక్కవోని ఆత్మవిశ్వాసంతో సాగుతున్న ప్రతిఒక్క తెలంగాణ ముద్దుబిడ్డ సాధించిన ఘన విజయం !
జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు !
స్వరాష్ట సాధన కోసం అసువులు బాసిన అమరులకి జోహార్లు !
8
[01/06, 9:36 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 3*
తేదీ:01/06/2022
పేరు వురిమళ్ల సునంద
ఊరు ఖమ్మం
అంశం: తెలంగాణ స్ఫూర్తి
*తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని*
****************
తెలంగాణ ఉద్యమ కీర్తి
ప్రపంచానికే ఆదర్శమైన స్ఫూర్తి
ఎందరో వీరులను
స్వతంత్ర సమర యోధులను కన్న ధాత్రి 

అస్తిత్వం కోసం అరవై ఏళ్ల పాటు
అవిశ్రాంత పోరాటం చేసి
అనుకున్నది సాధించిన ధీర తెలంగాణ మనది..

భాష కోసం యాస కోసం
బతుకునిచ్చే
నీళ్ళు నిధులు నియామకాల కోసం
పోరాడి గెలుచుకున్న వీర తెలంగాణ మనది...

ఆనాటి ఆధిపత్యాన్ని సవాలు చేసిన
కొమురం భీం దొడ్డి కొమురయ్య చాకలి ఐలమ్మల సాహసం

కలానికి గళాన్ని ఇచ్చి నిరసన తెలిపిన సుద్దాల హనుమంతు ధైర్యం

వివక్షపై పిడికిలి బిగించి
తుపాకీ చేత పట్టిన మల్లు స్వరాజ్యం శౌర్యం..

ఊరు మనది వాడ మనది
భాష మనది
మన భాషను కాదన్న వాడిని
ఎదిరించే తరుణమిదని
వెన్నుతట్టి జ్వాలను రగిలించిన కాళోజీ..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఫజుల్ అలీ శ్రీకృష్ణ కమిటీని ప్రశ్నించిన సిద్దాంత కర్త జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తితో
సాధించుకున్న తెలంగాణ
దాశరథి వట్టికోట
కవి గాయక రచయితలకు కన్నతల్లి
నా తెలంగాణ కోటి రత్నాల వీణ...

నా తెలంగాణ 
అనుకున్న ప్రణాళికలతో
హరిత వనాలతో
సస్యశ్యామలం కావాలి..
9.
కవితా గానం

రచన : గొర్రెపాటి శ్రీను
పరాయి పాలకుల నిరంకుశ పోకడలకు తట్టుకోలేక..
అడుగడుగున ఎదురవుతున్న అవహేళనలు,అవమానాలకి విసిగి వేసారి..
స్వరాష్ట్రం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో ..తెలంగాణ సమాజం అంతా ఒక్కటై ..
కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి సారద్యంలో ఉద్యమించగా..ఎన్నో ఏళ్ళ తీరని స్వప్నం నిజమవ్వగా..
నేడు శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాకుండా ..అన్నిరంగాల్లో ప్రగతిపథాన నడుస్తున్న తెలంగాణ నిజంగా దేశానికే ఆదర్శం !
నాడు విమర్శించిన వాళ్ళే నేడు మెచ్చుకుంటూ..అనుసరిస్తుంటే
ఇది ప్రజా విజయం !
ఇది మొక్కవోని ఆత్మవిశ్వాసంతో సాగుతున్న ప్రతిఒక్క తెలంగాణ ముద్దుబిడ్డ సాధించిన ఘన విజయం !
జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు !
స్వరాష్ట సాధన కోసం అసువులు బాసిన అమరులకి జోహార్లు !

10.
కవితా గానం 3
అంశము::తెలంగాణ రాష్ట్ర
ఆవిర్భావ దినం
తేదీ::1.6.22...బుధవారం
శీర్షిక:: ఉద్యమము - ఉత్సాహము

తెలంగాణ ప్రజల అందరిదీ
ఒకే మాట
ప్రత్యేక రాష్ట్రమనే మాట
అందరిది అదే బాట
అదే వారందరిది కలల పంట
అది నెరవేరితే చల్లారు కడుపు
మంట
పట్టిన పట్టు వీడ లేదు
ఉడుము పట్టు మారలేదు
ఏ ఆశకు లొంగలేదు
రాష్ట్రమే కావాలన్నారు
సాధించుకున్నారు
అందుకు ఉద్యమాలు చేశారు
నిరాహార దీక్షలు చేశారు
సత్యాగ్రహాలు చేశారు
విజయము పొందువరకు
మడమ తిప్పలేదు
మారుమాట లేదు
ప్రాణాలెన్నో గాలిలో కలిశాయి
ఆత్మార్పణలెన్నో జరిగాయి
ముందుతరాల బాగుకై
యువత ఉద్యోగావకాశాలకై
మా నీళ్లు మా కరెంటుకై
మా ఉద్యోగాలకై మాపేమెంటుకై
మాప్రాజెక్టులకై మా బొగ్గుకై
మా బంగారు జీవితాలకై
మాబంగారు తెలంగాణకై
మా పండుగలకై మాబతకమ్మకై
అందరూ పోరాటము సల్పినారు
ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారు
ప్రాజెక్టులు కట్టుకున్నారు
ఫుల్ కరెంటు తెచ్చుకున్నారు
నీటిని సమృద్ధి చేసుకున్నారు
ఉద్యోగ ఉపాధి సృష్టించుకున్నారు
ఒకరిపై ఆధారపడకుండ
వేరేవారికి సాయము చేసే స్థితికి చేరుకున్నారు
దేశానికి ఆదర్శంగా నిలిచారు
జై తెలంగాణ జైజై తెలంగాణా!!
                  కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.      8309920625
ఈ కవిత నా స్వంత రచన అని
హామీ.
11.
[02/06, 8:18 pm] +91 90594 38068: అంశం: తెలంగాణ ఆవిర్భావం
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
కాజీపేట హన్మకొండ జిల్లా
...
తెలంగాణ గడ్డ
పోరాటాల గడ్డ

అణిచివేతకు గురైన జనం 
స్వరాష్ట్ర సాధన కోసం 
సబ్బండ వర్ణాలు ఏకమై 
సకల జనుల సమ్మెతో 
బతుకమ్మ పండగ స్ఫూర్తితో
రాస్తా రోకోలు 
బంద్ పిలుపులతో 
తెలంగాణ పదాలు పాడుతూ 
కదం కదం కలుపుతూ 
కదిలింది జనం 
ఉవ్వెత్తున ఉప్పెనలా 
ఎగిసిపడింది ఉద్యమం 

కాళోజీ, జయశంకర్ వంటి 
మహనీయుల దిశా నిర్దేశంతో 
జనం అలుపెరుగని పోరాటం చేయగ
యువకుల బలిదానాలు 
జనుల పోరాట ఫలితమే
తెలంగాణ రాష్ట్ర అవతరణం 
తెలంగాణ ప్రజల 
చిరకాల స్వప్నం సాకారమైంది
జయహో తెలంగాణ 
జయజయహో తెలంగాణ
12
[02/06, 8:28 pm] దారల విజయ కుమారి Poetess: కోటి రతనాల వీణ
****************

ఉనికి కోసం
అస్థిత్వం కోసం..తరతరాలుగా
తల్లడిల్లిన తెలంగాణా

రజాకార్ల దురాగతాలను
దునుమాడి..
పోరాట గడ్డలో
శాంతి స్థాపన చేసి
గోల్కొండ ఖిల్లా పై
ఆత్మాభిమానపు జెండాలను
ఎగరేసేందుకు..

ఎన్ని ఆత్మత్యాగాలు..
మరెన్ని బలిదానాలు
బంగారు తెలంగాణ సాధనలో

ఎన్ని దేహాల బండ్లు కట్టారో
ఎందరు గొడవలు వినిపించారో
ఎన్ని లక్షల పదాలు
పాటలై ప్రవహించాయో

పరాయి పాలనలో
విరిగి..నలిగిన
కల్లా కపటమెరుగని
తెలంగాణ జన సామాన్యం

ఆ ఆత్మార్పణలు పరిచిన 
అడుగుల్లో అడుగులేస్తూ
అభివృద్ధి దిశగా
ఆబాలగోపాలాన్ని
ఆపలేరిక

చేరాల్సిన చోటికే చేరి
అందుకోవాల్సిన చేతుల్లో కే 
అందిన ఆ కోటి రతనాల వీణ

డా.దారల విజయ కుమారి
13
[02/06, 8:31 pm] +64 21 233 1334: అంశం: తెలంగాణ ఆవిర్భావం
డా. తంగిరాల నాగలక్ష్మి
స్వతంత్రత వచ్చిందని మురిసే జనం
ఎందుకలోచించరు
మనమంతా ఒక్కటే వేరు కాదని
పెనవేసుకున్న బంధాన్ని విడదీయటం
భాషా ప్రాతి పదిక మీద రాష్ట్ర విభజన
జరిగాక మళ్ళీ ఎందుకీ ఉద్యమాలు
మనలో మనకి
ఇదే గెలుపా
రాష్ట్ర విభజన వలన
నష్టమా లాభమా
అలిచించవలసిన విషయం
స్వ లాభం  కోసం 
ప్రలోభం  చూపటం
దేశాన్ని ముక్కలు చేయటం
ఇదేనా రాజకీయం
ఇదేనా లక్ష్యం సాధించటం
తెలుగు తెలంగాణ తేడా ఏమిటి
 వేరు పడట మెందుకు
ఒకే కుటుంబం విచ్ఛిన్న మయింది
దేశ భక్తి కల్గి త్యాగధనులైన అందరూ
ఆంధ్రులే భారతీయులే
తెలంగాణా కోసం ఆందోళన
సాధించిందేమిటి
ఒకరికి ఆవేదన మరొకరికి ఆనందం
ఐక మత్యత అర్ధం ఇదేనా
ఈరోజు తెలంగాణా రేపు రాయల సీమ
ఇలా వేరు పడితే ఎలా
విదేశీ ఆచారాలు మనకెందుకు
కలసి కట్టుగా ఉండాలి
ప్రగతి పథంలో పయనించాలి
ప్రేమాభిమానాలు పంచాలి
ఆంధ్ర రాష్ట్రం ముక్కలయిందనే ఆవేదన
ఒక సైపు
మనకో రాష్ట్రం వచ్చిందనే సంతోషం
మరో వైపు
ఈ అభివృద్ధి అంతా  కలసికట్టుగా సాధించింది కాదా?
ఆంధ్రా అయినా తెలంగాణా అయినా
మనం తెలుగోళ్ల మే
మన మాతృభాష తెలుగే
సామరస్య  సమభావం  సహజీవనం మాననీయం
తెలుగు మాతకి జై కొట్టు
14
[02/06, 8:35 pm] Porla Venu Gopala Rao Poet: *కవనజ్యోతి సమూహం*
*తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కవితలు*
తేదీ: *02-06-2022-గురువారం*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *నవ వసంతం*
ప్రక్రియ: *పద్యము(కందము)*
*********************
1)
*వచ్చెను మనకొక రాష్ట్రము*
*తెచ్చెను నవరాజకీయ తీర్పుల నిచటన్!*
*మెచ్చెడి పథకము లమరెను!*
*నచ్చిన తీరుగ జనులకు నవపథమొసగన్!*

2)
*రైతుకు బంధువు పథకము*
*రైతన్నలపాలిటాయె లాభపు ఫలమై!*
*ప్రీతిగ పెట్టుబడి దొరికె!*
*చేతులలో సొమ్ము నిండె! చింతలు తొలగెన్!*

4)
*ఆసర పింఛను పథకము*
*కాసులు కురిపించు చుండె! కష్టము తీరెన్!*
*ఊసులు మోసులు వేసెను*
*కాసుండగ బంధుజనులు గడపను త్రొక్కున్!*

5)
*రాజ్యము త్యాగపు ఫలితము*
*భోజ్యము కాకుండ చూడు! బొక్కసమందున్!*
*వ్యాజ్యము లన్నియు త్యాజ్యము!*
*నాజ్యము పోసిన తదుపరి నగ్నియె మండున్!*
*********************
*(తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమూహంలో సభ్యులందరికి శుభాభినందనలతో)*

హామీపత్రము: *స్వీయరచన*
15
[02/06, 8:37 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం సీజన్ 3
తేది : 02-06-2022
అంశం:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని

పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి: 9505152560
**********************

పోరు గడ్డ తెలంగాణ
తీరు చూడు ఉద్యమ  హోరు
అరవై యేండ్ల పాటు
అవిరళ సమరం చేసి
హస్తగతం చేసుకున్న తెలంగాణ...

తెలివాహన నది అస్థిత్వం 
గోదావరి ప్రవాహం
తెలంగాణ అయినది
అనంతరం

పరాయి పాలనను నిరసిస్తూ
చాకలి ఐలమ్మ
కొమురం భీం దొడ్డి కొమురయ్య పోరాట పటిమ
సుద్దాల హనుమంతు
సృజనాత్మక గళం
తుపాకీ మందు గుండు
సంధించిన మల్లు స్వరాజ్యం
ఉద్యమ కలాలు గళమెత్తిన దాశరథి
నా తెలంగాణ కోటి రతనాల వీణ మీటిన
విప్లవ గీతం...
వట్టికోట ఆళ్వారుస్వామి 
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళ కదలిక
ఉత్తేజం నూరిపోసిన కాళోజీ!
గద్దర్ ఉద్యమ గానం
మొహియుద్దీన్ విప్లవ  స్ఫూర్తి!

ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల బలిదానం
జయశంకర్ సార్ బ్రహ్మచర్య ఉద్యమ ప్రభావం

నా తెలంగాణకు పెట్టింది వీరకంకణం
మిషన్ భగీరథ
సస్య కేదారాల నిత్యహరితం నందనవనం!
       ***
 *సయ్యద్* *జహీర్* *అహ్మద్*
16
[02/06, 8:37 pm] Vanaparthy Gangadhar Poet: *కవితా గానం(సీజన్ 3)*
*****************************
*తేదీ:02.06.2022*
*అంశం:తెలంగాణా ఆవిర్భావ దినం*
*శీర్షిక:స్వేచ్ఛా విహంగం*

అణచివేత మేఘాలు కమ్ముకొని
స్వేచ్ఛకి అడ్డు తగిలితే
ఆవేశ విహంగాలు రెక్కలు విప్పి
ఎదురొడ్డి పోరితే సంకెళ్లు వీడిన శుభతరుణం

సకల జనులు సంఘటితమై
సమైఖ్యమై పిడికిలెత్తి సమర శంఖం
పూరించి నిశ్శబ్ధాన్ని ఛేదించి
ఐక్యతా భావాన్ని చాటిన అపురూప దినం

సబ్బండ వర్ణాలు ఏకమై 
తెలంగాణ స్వేచ్ఛకై ఉద్యమమై
వీరత్వాన్ని చాటిన అపురూప ఘట్టం
తెలంగాణ తల్లి ఋణం తీర్చుకున్న సంబరం

విషాద వదనాలపై వెలుగు రేఖలు
విచ్చుకొని సంతోష కుసుమాలు
అందరి హృదయాన తాండవమై
నాట్యం చేసిన అపురూప సమయం
తెలంగాణ ఆవిర్భావ సుదినం

*పేరు:వనపర్తి గంగాధర్*
ఊరు:హన్మకొండ

ఈ కవిత నా స్వీయ రచన
17
[02/06, 8:40 pm] +91 99373 80136: కవితాగానం సీజన3
అంశం:తెలంగాణ అవిర్భావదినోత్సవం.
నేడే ఈనాడే తెలంగాణ అవిర్భావదినోత్సవం
ఎన్ళో ఏళ్ళుగా పోరాడి సాధించుకున్న దినం
ఎందరో త్యాగధనుల త్యాగఫలం
ఎందరో మహానుభావులు రక్తంచిదించినదినం
దశాబ్ధాల పోరాటఫలం
ఉద్యమాలకు ఊపిరులూదింది
ఉత్తేజంగా ఉత్సాహంగా జరుపుకోవాల్సినదినం
సాధించుకున్నాం ప్రత్యేకరాష్ట్రం
ప్రజారాజ్యం ఏర్పరుచుకున్నాం
ప్రజాసంక్షేమానికి పాటుపడుతున్నాం
ప్రగతిరధాన్ని మనుముందుకు నడిపిద్థాం
ప్రపంచశటంలో ప్రత్యేకతను చాటుకుందాం!

ఇది నాస్వీయరచన.
దోసపాటి వేంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా
చరవాణి7780594995.
18
[02/06, 8:40 pm] Thathapudi Somashekara Sharma: కవితా గానం (సీజన్ 3)
తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా 
శీర్షిక..అభివృద్ధి తెలంగాణా
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
==================

అనేక త్యాగమూర్తుల త్యాగఫలం 
ఎందరో మేధావుల మేధాతనం 
మహిళాశక్తుల సమన్వయము 
ఆత్మార్పణ అయిన వీరసైన్యం 
ఎందరోనాయకుల వీరమరణాలు 
వీటితో మొదలైంది భాగ్యనగరశోభ

అన్నిరంగాలలో ఆదర్శప్రాయం 
ప్రగతిపథంలో మరోపురోగమనం 
పల్లె ప్రగతి రైతుబంధు రైతుబీమా 
ఆడపడుచుల వరం కల్యాణ లక్ష్మీ 
వితంతులకు వృద్ధులకు పెంక్షన్ లు 
షాదీముబారక్ వికలాంగులకుఆసరా
మిషన్ భగీరథతో తాగునీరు సాగునీరు 
ఎన్నోరకాల సంక్షేమ పథకాలనిలయం 
తెలంగాణా అభివృద్ధికి సోపానాలు 

కవి గాయకుల కళాకారుల పుట్టినిల్లు 
సినీప్రఖ్యాత గేయరచయిత దాశరథి 
సి.నారాయణరెడ్డి,కాళోజీమహానీయ                     శ్రీ పి. వీ. నరసింహారావు ప్రధానమంత్రి 
ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు 

రాష్ట్రాలలో  మేటిరాష్ట్రం తెలంగాణా 
ఉభయ రాష్ట్రాలలో మేటి తెలంగాణా 
రోజురోజుకు ఎన్నోపధకాలసమ్మేళనతో 
అభివృద్ధిపథం వేపు పరుగులుతీస్తుంది 

భాగ్యనగరమంటేనే అభివృద్ధినగరం 
పరిపాలనా సామర్ధ్యంతో ప్రగతిపథం 
అన్ని రంగాలలో ముందున్న రాష్ట్రం 
బ్రతుకు తెరువు లేని బాధితులకు 
బ్రతుకు వెలుగునిచ్చే నవతెలంగాణా

      ============
హామీపత్రం
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
19
[02/06, 11:05 pm] +91 94236 90615: కవితా గానం ‌ (సీజన్ 3)
**********************
అంశం:- తెలంగాణ ఆవిర్భావం
************************************
అలుపెరుగని పోరాటం
అరవై యేండ్ల ఆరాటం
స్వరాష్ట్ర సాధన కోసం
తెలంగాణ ఆవేశం

ఆచార్యులు జయశంకరు
మలిచిన ఘన సిద్ధాంతం
కలలను సాకారం చేయగ
కదిలింది జన సంద్రం

ఆత్మ గౌరవం జెండా
చేతబూని నడిచె జనం
స్వపరి పాలనం కోసం
ప్రతి హృదిలో ఉత్సాహం

నాలుగున్నర కోట్ల ప్రజలు
లక్ష్యం చేరుట కొరకై
మడమ తిప్పకుండ పోరు
బాటను పట్టిన తరుణం

తెలంగాణ అస్తిత్వపు
ఆత్మ గౌరవం జెండా
గోలుకొండ కోటమీద
ఎగరేయగ ఆరాటం

సకల జనుల సమ్మెలతో
అవిశ్రాంత పోరాటం
మిలియను మార్చులు జేసిన
కోట్ల ప్రజల ప్రభంజనం

బతుకమ్మలు బొడ్డెమ్మలు
రోడ్ల పైన వంటా వార్పూ
ఎక్కడి కక్కడ జేసిన
రా‌స్తారోకోల జోరు

తెలగాణ విముక్తి కొరకు
ప్రాణాలను పణం పెట్టి
ప్రాణ హారతుల నిచ్చిన
విద్యార్థుల ఆత్మ బలులు

అగ్ని కీలయై వెలిగిన
శ్రీకాంతుని ఆత్మ దహనః
ఉరికొయ్యకు వేలాడిన
యాదిరెడ్డి బలిదానం

ఎందరో వీరుల త్యాగం
తెలంగాణ ఆవిర్భావం
అమర వీరులకు చేద్దాం
తలలు వంచి మన ప్రణామం.

జయము జయము తెలంగాణ 
జయము కోటి రతనాల వీణ
*******************************
🖋️ వేదాంతం సురేశ్ బాబు
      చంద్రపూర్
     మహారాష్ట్ర
20.
కవితా గానం
ఏడెల్లి రాములు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
శీర్షిక*నా ధరణి నవ్వగా...

వెదురు మురళికి ఎన్ని గాయాలో
పాటల పల్లవిలో అన్ని మధురాలు

బతుకులను బందూకు చేసే
సాహసం
చావునోట్లో తలపెట్టాక చావోరేవో
తేల్చుకునే యుద్ధం అనివార్యం

పిల్లిని ఎన్నాళ్ళు బంధీ చేస్తావ్
పులిగా పంజా ఎత్తక తప్పలేదు
మరో దారి లేదు

నా తెలంగాణ  నినాదమంటేనే
నిషేధిత పదమైన వేళ
సబ్బండ వర్ణాల సమర శంఖారావం
జై తెలంగాణ జైత్రయాత్ర పోరాటం

ఎక్కిరింతలనెదిరించి
ఎదురీదిన యుద్ధ క్షేత్రం నా తెలంగాణం

తెలంగాణ తెచ్చుడో సచ్చుడో
అందరిదీ ఒకే నినాదం
పల్లె నుండి డిల్లికి సెగతాకిన ఉద్యమం

ఉరకలెత్తే యువరక్తం
పోరాట సమిధలై రగిలించిన అమరత్వం
తెలంగాణ తల్లికి తీరని పుత్రశోకం

ఈ అశ్రు ధారలకు కారణంబెవ్వరు
జగడాల దండుగమారి మారీచులు

అమరులారా మీ ఆశయాల బాటలో
నడుస్తుందీ నవ తెలంగాణం
పారేనీళ్ళకు మాట్లేసి
ధాన్యాగారమైందీ పసిడి పంటల మాగాణం

కరెంట్ లేక చీకట్లో ఉంటరనే నాలుకలకు
నాణ్యమైన కరెంట్ సరఫరా నడుస్తుంది

నియామకాలకు పచ్చజెండా ఊపగా
పరీక్షలకు యువత సన్నద్ధం

అక్కడక్కడ
ఇంటి దొంగల సందడే ఆగాలి మరి
కబ్జాల లండేశాలకే అరదండాలేయాలి

నా ధరణి నవ్వగా
ఆకుపచ్చ పాసుబుక్కులు 
సాదాబైనామాలకు హక్కు పత్రం
రావాలి
తప్పుల్లేని పహాణీలు పచ్చసంతకాలతో విరిసి మురియాలి

ఏడెల్లి రాములు ✍️
ది*02*06*2022(11*24)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
21.
కవితా గానం (సీజన్..3)
అంశం....తెలంగాణా ఆవిర్భావం 
శీర్షిక....త్యాగఫలం

5000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర కలిగినది ఆణిముత్యం లాంటి తేట తెలుగు స్వాతిముత్యం ఈ తెలంగాణా....

కాకతీయ రాజ వంశీయులతో
కుతుబ్ షాహీ,అసఫ్ జాహీ
ముస్లిం రాజులతో పాలింపబడ్డ
కళలకు పట్టం కట్టే రెండు వేర్వేరు సంస్కృతుల సంస్థానమీ తెలంగాణా ...

కాకతీయ పండుగైనా
బోనాలు ,బతుకమ్మ,దసరా , సంక్రాంతి,మీలాద్ ఉన్ నబి,రంజాన్ యైనా కలిసి కట్టుగా చేసుకునే సాంప్రదాయం , విభిన్న భాషలు కలదీ తెలంగాణా ...

ఉత్తరానికి దక్షిణం 
దక్షిణానికి ఉత్తరంగా 
గంగా యమునల తెహజీబ్ గా
భారతదేశంలోనే ప్రసిద్ధి ఈ తెలంగాణా ....

ఉర్దూ కవి కులీ కుతుబ్ షాతో కలిపి పోతన, కంచర్ల గోపన్న 
మల్లియ రేచన, గోన బుధ్ధారెడ్డి, పాల్కురికి సోమనాథుడు, మల్లి నాధ సూరి, హుళక్కి భాస్కరుడు ప్రాచీన కవి తంత్రుల సమూహమీ తెలంగాణా....

ఆధునికత సంతరించుకున్న
 తెలుగు సాహిత్య అకాడమీ    
గ్రహీత కుసుమాలు సురవరం ప్రతాపరెడ్డి, పద్మ విభూషణ్ కాళోజీ, సాహిత్య అకాడమీ గ్రహీత దాశరథి, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత డా. సి. నారాయణరెడ్డి,భారత దేశ తొమ్మిదవ ప్రధాని పి.వి. నరసింహారావు లాంటి మహామహులున్న బహుభాషా కూటమీ తెలంగాణా ....

బౌధ్ధ మత స్మారక కట్టడాలు
శివ , విష్ణు,హనుమంతుడు, గణపతి ఆలయాలకు ప్రసిద్దీ తెలంగాణా ...

చార్మినార్ అయినా గోల్కొండ అయినా చారిత్రాత్మక కట్టడాలకు పెట్టిన పేరిదీ తెలంగాణా ...

నవ తెలంగాణా ఆవిర్భావం
భాయీ, భాయీ అనుకునే
ఆంధ్రా తెలంగాణా విభజన
చంద్ర శేఖరుని కలను సాకారం చేస్తూ 
జలనిధి కాళేశ్వర ప్రాజెక్ట్ కు ఊపిరి అంది ఎన్నో పంటలకు
ఆయువు పోసిందీ తెలంగాణా.....

సరికొత్త విన్నూత పధకాలకు 
నాంది పలికి ఎందరో త్యాగ వీరుల ఫలమీ
కోటి రతనాల వీణ తెలంగాణా ....!!

మొహమ్మద్. అఫ్సర వలీషా 
ద్వారపూడి (తూ గో జి )

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...