Skip to main content

ఉన్నాడు 2022

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*****************
కవివరుల జాబితా
1.,తాతపూడి సోమ శేఖర శర్మ గారు
2.కోరాడ గారు
3.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు
4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
5.వేదాంతం సురేష్ బాబు గారు
6.కవిత వెంకటేశ్వర్లు గారు
7.బల్లూరి ఉమాదేవి గారు
8.వేమూరి సత్యవతి గారు
9.గజవెల్లి శ్రీ నివాసాచారి గారు
10. కుందూరి సుజాతా రాణి గారు
11.సునంద వురిమళ్ళ గారు
*******
1.pu కవితా గానం (సీజన్ 3)
అంశం.. ఔను... ఉన్నాడు
శీర్షిక..అందాల రాముడు 
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

కొలువై ఉన్నాడే కోడందరాముడు
హృదిలో వున్నాడే అందాల రాముడు
మనసులో ఉన్నాడే కౌసల్య రాముడు
మనలో ఉన్నాడే అయోధ్య రాముడు

కొలచినవారికి కొలువై యున్నాడు
తలచినవారికి తలపుగ యున్నాడు
మానవుడై పుట్టి మాధవుడైనాడు
కంటచూస్తూ మనలకాచిబ్రోచేడందుకు

రామరామ అంటే పాపములు తొలగును
రామకృష్ణ అంటే మనవెంటే వుండును
రామ కృష్ణ అంటూ నామ జపం చేయుదుము
మనలను రక్షించి కాపాడి బ్రోచేను....

హామీపత్రం ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
2
[17/05, 8:48 pm] Korada: అంశం :- ఔను... ఉన్నాడు !*మాటనిలబెట్టుకుంటున్నాడు*
    కోరాడ నరసింహా రావు !
         **************
నేను విన్నాను. !నేను ఉన్నాను
అన్నవాడు... మాట నిలబెట్టుకుంటున్నాడు... !
నవరత్నాలన్నాడు...
ఔను...ఆ  మాటమీదే ఉన్నాడు
అప్పులంటారా... ! మునుపు వారూ చేశారు !!
వారుచేసిన అప్పులకు అభి వృద్దయితే కనిపించలేదుగా !ఈ అప్పులకు సంక్షేమం...  సుస్పష్టం !!
  
ఇంక రేట్లు పెరగటమంటారా...
నాకు ఊహ తెలిసిన దగ్గరనుం డీచూస్తూనేఉన్నాను...నావయసుతో పాటు... నిత్యావసరాల రేట్లూ పెరుగుతున్నాయేగాని తగ్గిందెప్పుడు !?

    ఇది సామాజికమైతే...., 
ఆధ్యాత్మిక కోణంలో కలడు, కలండనువాడు కలడో, లేడో !?
ఈ సందేహం నీకెందుకు ?!ఔను ఉన్నాడు ! కాబట్టే  నువ్వూ....
నేను... ఈ ప్రపంచమూ ఇలా ఉండగలుగుతున్నాయి !
కర్త లేని కార్యమెలా జరుగు  తుందనుకుంటున్నావ్ !?
   గాలి కనిపిస్తుందా ? విద్యుత్ 
కనిపిస్తుందా..ఉనికి అనుభవ మైనాగుర్తించలేకపోవటం... నీ 
అజ్ఞానమోయ్ !  
      ఔను ఉన్నాడు !
   మంచిలో, మానవత్వం లో, ప్రేమలో, సేవలో, త్యాగంలో... 
ఇన్నిట్లో ప్రతిఫలిస్తున్న వాడిని 
ఉన్నాడా... ?! అన్న సంశయ 
మెందుకు...?!
     ఔను   ఉన్నాడు... !అవసరమైన ప్రతిసారీ ప్రత్యక్ష మౌతూనే ఉన్నాడు !!
      ****************
3
[17/05, 9:06 pm] అఫ్సర్ వలీషా గారు: కవితా గానం( సీజన్ 3)
అంశం....ఔను..ఉన్నాడు
శీర్షిక...సరి లేరు నీకెవ్వరు

అందరూ తలిచేదొకటి
అందరి అంచనాలకు మించి
అందకుండా  నీవు చేసే దొకటి....

ఇక్కడ బంధాలను కలుపుతావు
అక్కడ భవ బంధాలను తెంపుతావు......

ఇక్కడ చిరునవ్వుల చిరు
 జల్లులు  కురిపించి వెండి
 వెలుగుల్లో ఓ జన్మకు స్థాన మిస్తావు....

అక్కడ శోకసంద్రంలో ముంచి
 నిశీధి తెరలు గుప్పించి 
 ప్రాణానికి ప్రాణమైన వారిని
 అస్తమయం చేస్తావు....

అక్కడ సిరిగల వారింట్లో
 సిరుల రాసులు గుప్పిస్తావు...

ఇక్కడ గుప్పెడు అన్నం కూడా
నోచుకోని గుండెల్లో దిగులు
మేఘాలు కమ్మిస్తావు....

నవ్వించేది నీవే 
నమ్మించేది నీవే .....

ఆటాడించేది నీవే 
అలసింప చేసేది నీవే....

సరిలేరు నీకెవ్వరు 
సరిరారు ఇంకెవ్వరు...!!

మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి)
4.
[17/05, 9:25 pm] Aalla Nageshwar Rao Poet: కవితా గానం (సీజన్ 3)
అంశం : ఔను.... ఉన్నాడు
శీర్షిక :  
     ""  నాన్నున్నాడు... మరి  ""

ఆడపిల్ల పుట్టిందనగానే
మహాలక్ష్మి పుట్టిందని నా పుట్టుకను
ఓ పండుగలా  జరుపుకున్న మా నాన్నున్నాడు... మరి!
ఆడపిల్లను. గుండెలపై. కుంపట్లని. భావిస్తున్న తరుణంలో
నేను తన గుండెలపై తన్నే తన్నులను
ఆనందంగా భరించిన నాన్నున్నాడు మరి!
చదివించుటలో. లింగ  వివక్షతను చూపుతున్న నేటి కలియుగంలో
అన్నయ్యతో. సమంగా నన్ను చదివించిన నాన్నున్నాడు మరి!
సర్వకాల సర్వావస్థ ల్లో నాకు అండగా మా నాన్నున్నాడు మరి!
రచన :
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
సెల్..7416638823
పై. కవిత నా స్వీయరచనేననింహామీ ఇస్తున్నాను.
5

**********************
అంశం:- అవును..... ఉన్నాడు!!!
""""""'""""""""""""""""""""""""'""""""""""""'""""'""''
అవును ఉన్నాడు
ఇన్నాళ్లు వేచి ఉన్నాడు
సమయం కోసం ఎదురు చూస్తున్నాడు
తన స్వామిని సేవించుకోవటానికై 
కన్నుల్లో వత్తులు వేసుకుని
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని
చెవులు రిక్కించి
చిరు‌ గంటల శబ్దాన్ని వింటూ
ఢమరుకం ఎప్పుడు మోగుతుందా అని
ఢక్కా మృదంగాలు ఎప్పుడు ధ్వనిస్తాయని
త్రిశూలం వెలుగులు విరజిమ్మే కాంతికై
పద ఘట్టనలతో ముష్కర మూకల
అంతు చూసేవాడు రావాలని
ప్రళయ తాండవం చేస్తూ
ప్రకృతిని కాపాడే వాని కోసం
ఏళ్ళ తరబడి జ్ఞాన వాపిలో ఉన్న
తన స్వామి ఎప్పుడు తన సేవలను
అందుకోవడాని వస్తాడా అని
ఉత్సాహం ఉరకలు వేస్తుంటే
రంకెలు వేస్తూ ఆనందంగా
బసవన్న ఎదురు చూస్తూ
ఉన్నాడు అవును ఉన్నాడు.
🖋️ వేదాంతం సురేశ్ బాబు
...
.

కవితా గానం సీజన్ - 3
అంశం:: ఉన్నాడు
తేదీ:: 18.5.22...బుధవారం
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
సెల్:: 8309920625

ఉన్నాడు ..ఉండే ఉంటాడు
లేకుంటే లెక్కించని ఊపిరిని
చూడని వాయువుని
కనిపించని గాలిని
పట్టుకోలేని పరిమాలాన్ని

కనపడని మనసుని
నీ మనసు బాగోలేదని
బావుందని
ఎలా అనగలుగుతున్నాము
అంటే వాడు వున్నాడు
అందరికి కనపడనున్న
కనిపించిన వారి జీవితాలు
మనకు కలవెన్నో తార్కానాలు

ఒక బిందువు గర్బములో చేరి
తొమ్మిది నెలలో శిశువుగామారి
భువిపైకి పంపుతావు
కొందరిని బాగా బ్రతుకిస్తావు
కొందరికి ఊహకే ఏడిపిస్తావు
ఏమిటో నీ లీల
అంతా అర్థము కానీ గోల
అందుకే అతడు వున్నాడు
అందరిలో ఉన్నాడు
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు
ఉంటాడు!!
6..
కవితా గానం సీజన్ - 3
అంశం:: ఉన్నాడు
తేదీ:: 18.5.22...బుధవారం
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
సెల్:: 8309920625

ఉన్నాడు ..ఉండే ఉంటాడు
లేకుంటే లెక్కించని ఊపిరిని
చూడని వాయువుని
కనిపించని గాలిని
పట్టుకోలేని పరిమాలాన్ని

కనపడని మనసుని
నీ మనసు బాగోలేదని
బావుందని
ఎలా అనగలుగుతున్నాము
అంటే వాడు వున్నాడు
అందరికి కనపడనున్న
కనిపించిన వారి జీవితాలు
మనకు కలవెన్నో తార్కానాలు

ఒక బిందువు గర్బములో చేరి
తొమ్మిది నెలలో శిశువుగామారి
భువిపైకి పంపుతావు
కొందరిని బాగా బ్రతుకిస్తావు
కొందరికి ఊహకే ఏడిపిస్తావు
ఏమిటో నీ లీల
అంతా అర్థము కానీ గోల
అందుకే అతడు వున్నాడు
అందరిలో ఉన్నాడు
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు
ఉంటాడు!!
7.
[18/05, 8:29 pm] Balloori Umadevi Poetess: 18/5/22
కవితా గానం
పేరు:డా.బల్లూరి ఉమాదేవి
అంశము:అవును ఉన్నాడు
శీర్షిక: సర్వాంతర్యామి

అవును ఉన్నాడు
 సర్వాంతర్యామి ఐన శ్రీహరి
కోరి కొలుచు వారి భక్తుల గుండెల్లో
అక్కడా ఇక్కడా అనే ప్రశ్నే లేకుండా 
అన్నిచోట్ల జగదానందకారకుడ
అవును ఉన్నాడు
ఆల ప్రహ్లాదునికై కంభం నుండి వచ్చాడు
ఎక్కడో మడుగులో నీరు త్రాగే కరిని
మకరి పట్టి బాధిస్తే కరి మొర విని
సిరి కి కూడా చెప్పక వచ్చిన శ్రీహరి
ఉన్నాడు
నిండు కొలువులో ద్రౌపది కోకను
దుష్టబుద్ధితో కౌరవుడు లాగినప్పుడు
ఆపద్బాంధవ కావరా అనగానే
అక్షయంగా కోకలు ఇచ్చిన కృష్ణుడు
ఉన్నాడు 
శిలగా మారిన అహల్యను ఉద్ధరించిన
శ్రీ రామ చంద్ర స్వామి ఉన్నాడు
  నమ్మకముతో కోరి కొలిచే వారి
 మనసుల్లో ఎల్ల వేళలా 
ఉంటాడు ఉన్నాడు!
8
[18/05, 8:34 pm] +91 98851 36308: శీర్షిక-ఉన్నాడున్నాడు!!

ఒక్కసారిగా అతిశయం అంతరించి
నిల్చున్న నేల కదలి పాతాళానికి పడుతుంటే..
నువ్వేం దిగొచ్చావా?....అని
కోట్లాది అభాగ్యుల్లో ఒకఅంకెవనే వాస్తవం..
శరీరంలో రుగ్మతగానో..
మనసుని ముక్కలుచేస్తున్నరంపాలుగానో..
చావో బతుకో తెలియని యాతన..
ఎన్ని గంటల్లో జరిగిందో గానీ  --
అతడున్నాడు!!!!!
అంతటా నిండిన అతడు నాకున్నానని చెంప దెబ్బ తగిలినచోట  నిమిరి..
నన్నోదార్చి, నాకో తీరం చూపాడు!!
         --------

ఈ రచన స్వంత రచన.
వేమూరి.సత్యవతి.
9
[18/05, 9:10 pm] +91 90594 38068:
 గజవెళ్ళి శ్రీనివాసాచారి 
అంశం: ఉన్నాడు
శీర్షిక: ఔను..ఉన్నాడు 
...
ఔను..ఉన్నాడు భగవంతుడు 
భగవంతుడు సర్వాంతర్యామి 
ప్రహ్లాదుడు చెప్పినట్టుగా 
ఇందుగలడందు లేడని 
సందేహము వలదన్నాడు 

ఆ సర్వాంతర్యామి 
లేని చోటున్నదా..లేదుగా 
గాలిలో..నీరులో..నిప్పులో 
మంచి మనుషుల మనసులలో 
మానవత్వంలో 
సేవాభావంలో 
అమ్మానాన్నల అనురాగంలో 
కల్మషం లేని ప్రేమలో 
విరిసిన పూలలో 
భక్తుల గానంలో 
కీర్తనలలో 
ఉన్నాడుగా భగవంతుడు
10
[18/05, 9:14 pm] కందూరి సుజాత Poetess: 🌷  
దైవం🌷
.........................
ఉండు ఉండు ఉన్నడు దైవము .
నమ్మకం ఉంటేనే ...
న్యాయం తోటలో   ధర్మం కోటలో 
ఉన్నడు దైవము. 

కనిపించని గాలిలా  వికసించే నీతిలా 
పంచభూతాలను పెంచుతున్నడు.
గుడిలో విగ్రహంలా  గూడులో దీపంలా ఉన్నడు దైవము .

నమ్మితె చాలదూ
మోసం చేరని జీవితం ఉండాలి .
ఏకాగ్రత ద్యాసతో ద్యానంపూనాలి.
ఉపకార మనసులో ఓంకారం నిలపాలి .
ఉండు ఉండు ఉన్నడు దైవము.

ఖ్యాతిని పెంచుకకొనగ నీతిని చంప్పెటొల్ల ... 
స్వార్థం చింతనతో ద్రోహం చేసెటొల్ల... 
ఆశకు అంతులేక పాపం 
చేసెటొల్ల..
అరాచక రాక్షస భూతం గాల్లకు...
తప్పని శిక్షలు పురాణాలె సాక్ష్యము. 

పాపమే మిగిలున్న కలియుగ కాలంలో తక్షణ శిక్షలేయ ..
రావణ కష్టము, రామ రాజ్యమీయ... 
ఉండు ఉండు ఉన్నడు దైవము.

కందూరి సుజాతా రాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్ 
9392162822🌷
11
[18/05, 9:33 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 3*
తేదీ:18/05/2022
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం:ఉన్నాడు!!!
***†************†***
చరాచర సృష్టికి మూలాధారమై..
సకలజీవులను కాచే
సర్వాంతర్యామియై...

గజేంద్రుడిని రక్షించిన శ్రీమహావిష్ణువై
ప్రహ్లాదుడిని కాపాడిన నృసింహావతారమై ఉన్నాడు...

మానవీయ విలువల మనిషి రూపంలలోనూ
మమతానురాగాల అమ్మగా
బాధ్యతలను బరువులనూ భుజాలపై ఎత్తుకునే నాన్నగా
విచక్షణా జ్ఞానాన్ని వివేకాన్ని అందించే గురువుగా
మనో మందిరాల్లో కొలువై ఉన్నాడు

అల్లా జీసస్ రాం పేరేదైనా మతమేదైనా
 అంతా ఒక్కటే అని చెప్పే
నిరాకార రూపంలో వెలుగుతున్న వాడు

ఆత్మతో తిలకిస్తే 
పరమాత్మయై దర్శనం ఇచ్చే వాడు ఉన్నాడు

 *వురిమళ్ల సునంద, ఖమ్మం*

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...