Skip to main content

Ramadan 2022

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
************
కవి వరుల జాబితా
1.వీరా గుడిపల్లి.
2.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
3.నల్లు రమేష్ గారు
4.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
5.కవితా వెంకటేశ్వర్లు గారు
6.తంగిరాల నాగ లక్ష్మి గారు
7.దిడ్డి మారుతి గారు
8. సునంద వురిమళ్ళ గారు
9.ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
10.సింగీతం సంతోష్ కుమార్ గారు
11.గజవెళ్ళి శ్రీనివాసాచారి 
12.వేదాంతం సురేష్ బాబు గారు
13.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
14.పిన్నక నాగేశ్వరరావు గారు
15.శివునూరి లలితా కృష్ణ గారు
*****----
1.
ఇది వీరా గుడిపల్లి కవితి
*******************
అర్థం కావడం కష్టమైనా
యాడాదంతా తిరిగే నెల
ప్రక్షిప్తాలకు చోటులేని
పవిత్ర గ్రంథం ప్రభవించిన మాసం

నెలవంక
 నేల వంక చూడగానే
సంబరాలు అంబరాన్ని అంటేలా
పరవశాన్ని ప్రకటించే
సమస్త మానవాళికి
రంౙాన్ శుభాకాంక్షలు

జంజం జలాల
శాస్త్రీయత పై 
సమస్త మానవాళికి లభించిన సందేశం

మొహమ్మద్ ప్రవచించిన
విలువల నందుకోవడం కోసం
అహరహం శ్రమిస్తున్న మానవాళికి
రంౙాన్ శుభాకాంక్షలు

ఎడారి జీవితాల కథలు
ఎండమావుల విన్యాసాలు
నిజ నిర్ధారణ పేరుతో సాగే
దురాగతాలు
ఖురాన్ ముందు
తలవంచి 
ఏకాంతం లో మోకరిల్లి
ఎవరికివారు నిజం తెలిసినా
పెదాల మాటున నొక్కి పట్టి
హృదయంలో దాచి పెట్టి

పలక గలిగి పలకలేక పరితపిస్తున్న
సహోదరులందరికీ

హృదయ పూర్వక శుభాకాంక్షలు

మనమంతా భరతమాత ముద్దుబిడ్డలం.
ఏకోదరులం.
.....  *వీరా గుడిపల్లి*
2.
 రంజాన్ పర్వదినం
కవితా శీర్షిక :
   "" సమతా మమతల వెలుగులు ""

మతాల సారం మానవత్వమని
మనిషికి ముఖ్యం సోదరతత్వమని ప్రభోదించే
సృష్టికర్త అల్లా విరచిత  ఖురాన్
పవిత్ర గ్రంధాన్ని
పవిత్ర రంజాన్ మాసంలో అనుదినము నిర్మల మనస్కులై
పఠనం గావిస్తూ
మూడు పూటలా కఠిన నియమాల్ని పాటిస్తూ
దైవప్రార్ధనతో నమాజు చేసుకుంటూ
కనీసం లాలాజలాన్ని కూడా మింగకుండా ఉపవాస దీక్షను మాసం పాటు చేస్తూ
దీనజనులకు ఉడుతాభక్తిగా సాయమందిస్తూ
కారుణ్యాన్ని మనోఫలకం పై ముద్రించుకుంటూ
సమాజ సేవలో రంజాన్ మాసపు  దినాల్ని గడుపుతూ
ప్రకృతిలోని ఆణువణువును దైవచింతనతో నింపుతూ
చెడులను తరిమెసేందుకు కళ్ళకు పరదాలను వేసుకుంటూ
కళ్ళకు కట్టిన అహంకారపు పొరలను తొలిగించుకుంటూ
హృదయమనే ప్రమిదలో
మానవత్వమనే తైలంపోసి
దాతృత్వ మనే దివ్వెలను వెలిగించి
జగతిని సమతామామమతల వెలుగులను పంచే
రంజాన్ పర్వదినాన్ని ఈద్ ముబారక్ అంటూ స్వాగతిద్దాం!
............................................ రచన :
ఆళ్ళ నాగేశ్వరరావు
ఆర్టీసీ కండక్టర్
నాజారుపేట
తెనాలి....522201
గుంటూరు... జిల్లా
ఆంధ్రప్రదేశ్... రాష్ట్రము
సెల్ నెంబర్:7416638823
............................................ పై వచనకవిత నా స్వీయరచనే నని హామీ ఇస్తున్నాను.
3
శీర్షిక : స్నేహాన్ని దానంగా....

 పగలంతా దేహాన్ని ఎడారి చేసి
 ఆకలి నదులను ఆవిరి చేయడం
 నా మిత్రునికి అలవాటే!

 నెలంతా నమాజును
 నుదిటి మీద వీలు రాయించుకుటుంటే
 వాడు నిజంగా నడిచే అల్లానే!

 కనిపించని నెలవంకను
 నేను ఆకాశంలో వెతకను
 వాడి పెదాల పైనే ఎక్కువ సార్లు చూస్తుంటా!

 ఆస్తులతో కుస్తీ పట్టడం
 అలవాటు లేదు సరికదా
 దాన ధర్మాలు వాడి స్నేహితులే!

 కండలు కరిగిన అత్తరు బుడ్డిని
 స్వార్థంతో చల్లుకోక
 లేనివారిని పరిమళింపచేయడం వాడి దినచర్యే!

 పైసాతో పైసాను పుట్టించి
 పేదరికానికి పురుడు పోయడం
 పిసరంత కూడా తెలియని పవిత్ర ముస్లిం వాడు

 మతాలు వేరైనా మేం మిత్రులం
 నిజాయితీకి నిజమైన వారసులం
 పండుగ ఆనందం
 పదిమందికి పంచే వేళ
 వాడి స్నేహాన్నే దానంగా కోరుకుంటూ...
 ఈద్ ముబారక్....నేస్తం!

                           నల్లు రమేష్
                         నెల్లూరు జిల్లా
                        9989765095
4
 Thathapudi Somashekara Sharma: కవితాగానం  ( సీజన్ 3)
అంశం.. రంజాన్ సందేశం
శీర్షిక.. ఖుదా కీ దయా
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328069336

ముప్పది రోజుల రంజాన్
మనిషికి పవిత్ర మైనరంజాన్
మనిషిగా బ్రతకాలని నేర్పే రంజాన్
మానవత్వంతోమెలగాలని చెప్పే రంజాన్

ఐక్యత మనకి నేర్పే పండుగ రంజాన్
నిష్టానియమాలునేర్పేపండుగ రంజాన్
మనిషి మనిషిగా బ్రతకాలనీదే రంజాన్
నూటపద్నాలుగుఖండికలసారాంశం రంజాన్

ఉపవాసదీక్షలే నియమాల రంజాన్
విశ్వశాంతి స్థాపనయే నిజమైనరంజాన్
మనఃపూర్వకప్రార్ధనలు చేయడమేరంజాన్
కఠినక్రమశిక్షణఅవలంబించుటయే రంజాన్

పవిత్రమైన ఖురాన్ పాఠనయే రంజాన్
ఇమాన్ నమాజ్ రోజా జాకాత్ హజ్ ల 
నిర్వహణనియమాల ప్రాతిపదికయేరంజాన్
పుణ్యములుచేస్తూ దానధర్మాలుచేస్తూ
మానవజీవనం గడుపుటయే రంజాన్
పుణ్యఫలాలు అందిస్తూ స్వర్గద్వారాలు
మనకి అందించే గొప్ప పండుగ రంజాన్

హామీ పత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
అంశం.. రంజాన్ సందేశం
శీర్షిక.. ఖుదా కీ దయా
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328069336

ముప్పది రోజుల రంజాన్
మనిషికి పవిత్ర మైనరంజాన్
మనిషిగా బ్రతకాలని నేర్పే రంజాన్
మానవత్వంతోమెలగాలని చెప్పే రంజాన్

ఐక్యత మనకి నేర్పే పండుగ రంజాన్
నిష్టానియమాలునేర్పేపండుగ రంజాన్
మనిషి మనిషిగా బ్రతకాలనీదే రంజాన్
నూటపద్నాలుగుఖండికలసారాంశం రంజాన్

ఉపవాసదీక్షలే నియమాల రంజాన్
విశ్వశాంతి స్థాపనయే నిజమైనరంజాన్
మనఃపూర్వకప్రార్ధనలు చేయడమేరంజాన్
కఠినక్రమశిక్షణఅవలంబించుటయే రంజాన్

పవిత్రమైన ఖురాన్ పాఠనయే రంజాన్
ఇమాన్ నమాజ్ రోజా జాకాత్ హజ్ ల 
నిర్వహణనియమాల ప్రాతిపదికయేరంజాన్
పుణ్యములుచేస్తూ దానధర్మాలుచేస్తూ
మానవజీవనం గడుపుటయే రంజాన్
పుణ్యఫలాలు అందిస్తూ స్వర్గద్వారాలు
మనకి అందించే గొప్ప పండుగ రంజాన్

హామీ పత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
5.
కవితా గానం
తేదీ::3.5.22...మంగళవారం
అంశం:: రంజాన్ పండుగ

నెల రోజుల రోజా
పాటిస్తారు ముస్లీమ్ ప్రజా
మంచి నీళ్ళు ముట్టరు 
లాలాజలం మింగరు

ఉదయ సాయంకాలలో భోజనం
ఐదు పూటల నమాజుకు
కేటాయిస్తారు సమయం
వచ్చే సంపాదనలో 10%
పేదలకు చేయాలి సాయం
ఒక ముస్లీమ్ కుటుంబము
కష్టపడుతుంటే ఆదుకునే
ఉదారం
ఏ విషయమైనా సెకండ్లలో
అందుతుంది సమాచారం
అన్యమత ప్రసాదం ముట్టరు
అన్యదేవుణ్ణి కొలువరు
అందరితో కలిసిపోతారు
ఇంటికి పిలిచి విందు ఇస్తారు
ప్రేమ దయ కలిగి ఉంటారు
కరుణా సేవా భావము 
అందరితో సోదరభావము
కుల మతాలు గోడలు కూల
దోసి 
అందరమూ అన్ని పండుగలు
చేసుకుంటే ఎంత ఆనందము
అందరమూ అన్ని గుళ్లుకు
మసీదులకు చర్చీలకు పోతే
ఎంత సంతోషం
అందరమూ ఒక చోట కలిసి
సహపంక్తి భోజనాలు చేస్తే
ఎంత సంబరం
అలా జరిగితే ఎంత బావుంటుంది
భిన్నత్వంలో ఏకత్వము కాదు
ఏకత్వములో మమేకమవుతుంది
మమేకముతో మానవత
మానవత్వం వెల్లివిరుస్తుంది!!
                  కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.      8309920625
6.
[03/05, 8:49 pm] +64 21 233 1334: రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ పోగొడుతుంది మనిషి లోని
దురలవాట్లు
అల్లాని గురించి ఆలోచింప చేస్తుంది
ఖురాన్ చదివి మంచిని ప్రభోదించే
అమూల్య సమయం ఈ నెల రోజులు
హిందువులు చేసే కార్తీక మాస నక్తాల లా

ఏ మతమైనా సామరస్యమే ప్రధానం
హిందూ ముస్లింలు జత కట్టాలి
సర్వ సమానత్వమే స్వర్ణా భరణం
మతభేదాలు మంట కలపాలి
సాటి మనిషి కన్నీరు తుడవాలి
 అన్ని మతాల సారాంశం ఒక్కటే
అహింసే పరమ ధర్మం
మానవీయతే మాననీయం
ప్రేమించు ప్రతి జీవినీ
నెల రోజుల ఉపవాసం
ఇంద్రియాల నిగ్రహం విశేషం
మహమ్మద్ ప్రవక్త సందేశం
ముస్లిం ప్రజలకే కాదు
మనుజలందరికి మరువరాని ఉపదేశం
7
[03/05, 8:53 pm] Maruthi Diddi Poet Tp: అంశం: రంజాన్ సందేశం.
అంశం: రంజాన్ ముబారక్.
•••••••••••••••••••••••••••••
*********************

కులమేదైనా మతమేదైనా
మానవులం మనమంతా సోదరులం.
జాతి, మతాలు, కులములకన్నా
ముందే మనమంతా మానవులం.
దేవుడు ఒకడని తెలిసిన మనిషి
భక్తిని చాట బహు రూపాలను
బాధ్యతగా భజియించు చుండగా
భేదము మనిషికి ఎక్కడిది.
మానవ జాతిని ఏకం చేయ
పండుగలెన్నో ముందుకు రాగా
కుల, మత భేదము లన్నీ మరిచి
కూడీ కలిసి ఆనందంగా
చేయీ చేయీ కలుపుకు తిరిగే
మానవులం మనమంత అసోదరులం
పుడమి తల్లి ఒడిలోని బిడ్డలం.
అందుకే *రంజాన్* పండుగ జరిపే
సోదర జనులకు ముబారకు.

మీ...
దిడ్డి మారుతి,
కంగ్టి.
8.
*కవితా గానం సీజన్ 3*
తేదీ:03/05/2022
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
శీర్షిక: రంజాన్ సందేశమిదే
****************
క్రమ శిక్షణ దాతృత్వం ధార్మిక చింతనలతో
సాటి వారి హితాన్ని కోరమనీ..

ఉపవాస వ్రతంతో మనో సౌందర్యం మెరుగు పరుచుకుని
లోలోపలి చెడు ఆలోచనల కలుపు మొక్కలను సమూలంగా పెరికేసుకుంటూ
మంచి మానవతా విలువలతో మెలగాలనీ..

కులమతాలకు అతీతంగా
విశాల హృదయంతో
అభాగ్యులకు అనాధలకు
జకాత్ ఫిత్రా దానం ధర్మం చేయమనీ ..

సత్ప్రవర్తనతో  మనీషిగా బతకాలని చెప్పిన
మహమ్మద్ ప్రవక్త బోధనల
విశాల దృక్పథం
దివ్య ఖుర్ఆన్ నిర్దేశించిన మార్గం
మహోన్నత రంజాన్ పండుగ సారమిదే..

 *వురిమళ్ల సునంద, ఖమ్మం*
9.
*కవితాగానం..సీజన్..3 ఆధ్వర్యంలో 
తేదీ..3.5.22
అంశం:- రంజాన్ 
శీర్షిక:-
ప్రేమతత్వంమే మానవత్వం.
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:- విశాఖపట్నం
...............................
జగతిన ఉన్న మానవులంతా
పరమేశ్వరుని ప్రతిరూపాలేనని
ఇతరులకు సహాయపడటంలో ఆనందం ఉందని
దాతృత్వాన్ని మించినది లేదని
చివరికి అందరు చేరేది పరమాత్ముని సన్నిధికేనని
మానవత్వమే అన్ని మతాల సారమని
ముస్లింసోదరులు లోక కల్యాణం కొరకై భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఉపవాస దీక్ష చేసి నెలరోజులు ఖురాన్ పఠనం   చేయటమే గాక అనుసరించి కులమత వర్ణ భేదాలను మరచి పేదలకు ఉన్నదానిలో దానంచేసి
చివరి రోజున నెలవంకను చూసి 'ఇఫ్తార్' విందును
ఈద్ ముబారక్ అని ప్రేమపూర్వకంగా కౌగలించుకొని కలసి అల్లాను తలచుకుని ఆరగించే పవిత్ర రంజాన్
ప్రేమతత్వమే మానవత్వానికి ప్రతీక 
అదే ముముక్షత్వానికి  సోపానం .......!!
............................
ఇది నా స్వీయరచన
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
................................
10.
[04/05, 8:23 pm] సింగీతం సంతోష్ కుమార్: కవితా గానం....  సీజన్3  ఆధ్వర్యంలో
అంశం:- రంజాన్
శీర్షిక:- పవిత్ర మాసం

కవి పేరు:- సింగీతం సంతోష్ కుమార్
ఊరు:-కామారెడ్డి
చరవాణి :-8897152205

_______________________________

ముస్లిం సోదరులు అతి పెద్ద పండుగ
ముప్పై రోజుల పాటు కొనసాగిన ఉపవాస దీక్ష
పవిత్ర దివ్యఖురాన్ అవరించిన మాసం
కఠోర నియమాలను పాటిస్తూ
చిన్న,పెద్ద,యువకుడు, వృద్దుడు అని లేకుండా
భగవంతునికే అంకితమై
నీరు తాగకుండా
పొద్దున, సాయంత్రంవేళలో మసీదులలో
నిరంతరం ఖురాన్ పఠిస్తూ 
పాలనను పాటిస్తూ
క్రమశిక్షణ ఐక్యమత్యం తో పేదవారికి,వస్త్రాలు,పండ్లు, పైసలు,ఆహార పదార్థాలు దానం చేస్తూ
ఆపదలో ఉన్న వారికి ఆదుకున్న ఎలా మానవాళికి ఇచ్చే గొప్పనైన సందేశం
సహాయానిక,సమైక్యతకు సామరస్యానికి,కరుణకు,
సర్వమానవ సమానత్వానికి
ప్రతీక
క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతన కలయిక రంజాన్.....

*******************************
 హామి పత్రం:- ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
11
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
అంశం: రంజాన్ 
...
భక్తికి 
పవిత్రతకు ప్రతీక రంజాన్ 
ఖురాన్ అవతరించిన మాసమే 

రంజాన్ మాసంలో 
ఉపవాస దీక్ష, జాకత్
ముస్లిం సోదరుల ధర్మం 

మనుషుల మధ్య 
ప్రేమాభిమానాలు 
క్రమశిక్షణ, సహనం 
సర్వమానవ సోదరతత్వం 
పెంపొందించే మాసం 

ఉపవాస దీక్షతో 
శరీరాన్ని శుష్కింపచేసి 
ఆత్మలో మలినాలు ప్రక్షాళణ చేసేది 
రంజాన్ మాసంలో రోజా అంతరార్థం
12.
కవితా గానం సీజన్ 3
*********************
అంశం:- రంజాన్
*****************
నింగిలో నెలవంక
తొంగి చూసిన వేళ
పొంగి పోయిన మనసు
అంతరంగపు హేల
ఉపవాస దీక్షతో
ఉదయాస్త మాలలో
నియమాలు తోడుగా
బ్రతుకు సాగించగా
మార్గ నిర్దేశనము
మనుషులకు నేర్పగా
శాంతి సమరస భావ
చింతనలు పెంచగా
దాన ధర్మాలతో
జనుల సేవించగా
ప్రకృతిలో  అణువణువు
పరమాత్మ రూపుగా
దైవ చింతన తోడ
కార్యమ్ము సాగగా
ఉచ్చ నీచము మరచి
ఉల్లాస మొప్పగా
కనుల చీకటి పొరలు
కను మరుగు అవ్వగా
వెలుగు జిలుగుల తోడ
జగతి వ్యాపించగా
మనిషి మనిషికి మధ్య
అంతరమ్ములు తొలగ
అంతర్ముఖం లోన
అల్లాను చూడగా
మానవత్వము, మమత
మహిలోన నిండగా
సృష్టి కర్తకు ప్రణతి
రంజాను పండుగ.
🖋️ వేదాంతం సురేశ్ బాబు
      చంద్రపూర్
13.
 పండుగ
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి: 9505152560
***********************

    ప్రత్యేక పండుగ

షాబాన్ నిష్క్రమణ రంజాన్ నెలవంక దర్శనంతో ఆరంభం
ఆధ్యాత్మికతను సంతరించకొని మొదలవును తరావీహ్ నమాజు...

తొలిజాము వేళ సహరీ 
మరి సంధ్య ఇఫ్తార్ మధ్య రోౙా దీక్ష

మంచిని ఆహ్వానిస్తూ
చెడు తలపును నిర్జించి
ఆకలి దప్పులు గ్రహించగలిగి ఆహ్లాదాన్ని పొందగలిగే ఏకైక మార్గం
చూపించిన మహమ్మద్ ప్రవక్త గారి ప్రవచనం
సంపన్నులు పేదరికాన్ని గుర్తించి
వితరణ ప్రదానం గుణం అలవర్చే నియమం!

పండుగనాడు పేదవాడు పాతబట్టలు
 ధరించరాదని
ౙకాత్ వస్త్రదానం!

ప్రవక్త నిర్బంధంలో సైతాన్ కు సంకెళ్ళు
సత్ప్రవర్తన కలిగి
సద్భావన సమత మమతకు ద్వారాలు

సౌమ్యం సౌశీల్యం సద్గుణం నిరాడంబరతకు సన్మార్గాలు....

అయిదు పూటలా నమాజు
అయిదు విధాల ఉపయోగం!

ఖురాన్ అవతరించిన
షబే ఖదర్ రాత్రి
పుణ్యప్రదము

షవ్వాల్ నెలవంక దర్శనంతో ఈదుల్ ఫిత్ర్ పండుగ సంబరాలు
ప్రతి ఇంటా షీర్ ఖుర్మ
ఆలింగనాల స్పర్శ
హృదయ కాఠిన్యం తరిగి
కరుణాత్మక మృదుత్వం వృద్ధి చెందును
మనసులోని మాలిన్యం
తొలగి సౌభ్రాతృత్వం
పొందు ప్రబోధం

పదకొండు నెలల అనంతరం పన్నెండవ నెల కోసం నిరీక్షణ

ఒక్క రంజాన్ మాసంలో లెక్కలేనన్ని పుణ్యఫలాలు
అందరూ సుఖంగా వుండాలని దీవెనలు
అందుకునే మహత్తరమై
ప్రపంచ మానవాళిని ఏకతాటిపై నడిపించేందుకు నియమింపబడిన
ఏకైక పండుగ!
    ***
       హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.
           ఇట్లు 
సయ్యద్ జహీర్ అహ్మద్
     షవ్వాల
14.

కవితా గానం(సీజన్3).         4--5--2022.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- రంజాన్ ప్రాముఖ్యత. 

మత సంస్కృతికి దోహదం చేసేవి పండుగలు
మతమేదైనా ప్రతి పర్వదినం వెనుక 
ఉంటుంది ఏదో ఒక సందేశం
ముస్లింలు పవిత్రంగా జరుపుకునే పండుగ
"రంజాన్"
ముస్లింల పవిత్ర గ్రౕంథం "ఖురాన్" ఈ మాసంలో ఆవిర్భవించడమే రంజాన్ కు
ఇంత ప్రాముఖ్యత 
క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతనల 
కలయిక ఈ పండుగ
విధిగా ఈ నెలలో ఆచరించవలసినది
ఉపవాస వ్రతం.... దీనినే "రోజా" అంటారు
దాదాపు ప్రతివారు ఈ వ్రతాన్ని పాటిస్తారు 
ఉన్నవారు లేనివారికి దానధర్మాలు 
చేయడం మరో విశేషం
దీనినే "జకాత్" అంటారు
పేదవారు కూడ సంతోషంగా పండుగలో
పాలుపంచుకోవడం జకాత్ ఉద్దేశం
ఉపవాస దీక్షలు విరమించిన మరురోజు 
రంజాన్ పండుగ జరుపుకుంటారు
ప్రతివారు క్రొత్తబట్టలు ధరించి
నిర్ణీత ప్రదేశములో నమాజు చేసి
ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
**************************************
15.
ఆధ్యాత్మిక తరంగం

నెలవంక కోసం
ఆకాశమంత ఎదురుచూపులు.....

నెల రోజుల రోజా సమస్త మానవాళికి నేర్పే పాఠాలెన్నని చెప్పడం...

ఆకలి దప్పులకతీతుల్ని
చేసిన దీక్షలన్నీ
నిగ్రహపు స్వీయసమీక్షలవడం కోసమనీ..

ఉన్నా లేకున్నా..
 చేసే 
దానం.....
నిత్యజీవన విధానమవాలనీ..

ప్రవక్త ప్రవచనాలను మది మదిలో పదిలపరచి 
మానవతను మేల్కొలిపే
సంప్రదాయమనీ..

సానుకూల భావనా 
వనంలో విహరింపజేసే 
పవిత్ర మాసమనీ 

వరాల వసంతమనీ..

అందించే సందేశాలేమని చెప్పడం....

రంజాన్ అంటే..

ఋజుమార్గంలో
పయనించమనే 
కాంతి పుంజం 

విలువల దర్పణం 

స్వయంసమర్పణం 

అంతరంగాన సద్గుణాలను ధ్వనింపజేసే
ఆధ్యాత్మికతరంగం 

********శివునూరి లలితా కృష్ణ

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...