Skip to main content

పర్ణశాల 27052022

నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*****************
కవితా గానం సీజన్ 3
నేటి అంశం
27.05.2022

*పర్ణశాల*

రాత్రి ఎనిమిది నుండి
 తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.

ఆసమయంలో ఎలాంటి ఇతర స్పందనలు
 తెల్పకుండా సహకరించగలరు.

కవి వరుల జాబితా
1.ఆపరాజిత్ గారు
2.కవిత వెంకటేశ్వర్లు గారు
3.కోరాడ నరసింహారావు గారు
4.ఏడెల్లి రాములు గారు
5.వురిమళ్ళ సునంద గారు
6.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
7. కందూరి సుజాతా రాణి గారు
8.వేమూరి సత్యవతి గారు
9.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
10.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
11.తంగిరాల నాగ లక్ష్మి గారు
12.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
13.వీరా గుడిపల్లి
14..శివునూరి లలితా కృష్ణ గారు

**************
1
పర్ణశాల

కఠోర దీక్షా సంపన్నులు
రామ లక్ష్మణ సీతా తపోదనులు
సత్పురుషులతో సీతామాత సాంగత్యం కడు రమణీయం
రామలక్ష్మణులు అరణ్యవాసంలో
తగు జాగరూకతతో నిర్మించుకొనిరి పర్ణశాల
దుష్ట దుర్మార్గ పన్నాగంలో భాగంగా
బంగారు మాయలేడితో రామలక్ష్మణులను దారిమళ్లించి
రావణాసురుడను రాక్షసుడు సీతమ్మపై
కన్ను మిన్ను కానని కండకావారంతో
కామం ఎంత బలీయమైనదో
అంతటి విధ్వంసానికి దారితీస్తుంది
ఆ దానవుని చెరకు తీసుకుపోబడి
సీతమ్మవారు విధి చేతిలో పావుయై
చివరకుకిరాతక రావణ రాజ్యం పరిసమాప్తం అయ్యింది!!
సత్యమేవ జయతే!!

అపరాజిత్
సూర్యాపేట
2.
కవితా గానం 3
అంశం:: పర్ణశాల
తేదీ::27.5.22...శుక్రవారం

తండ్రి మాట జవదాటని తనయుడు
మాట తప్పని మార్చని మహనీయుడు
ఏ ఆశకు లోనుగాక
రాజ్య కాంక్షకు లొంగక
బయలు దేరిరి నార బట్టలు
ధరించి అడవులకు
సీతా లక్ష్మణ సమేత రాముడు
కానల కేగినాడు
పంచవటిలో పర్ణశాల నిర్మించుకొనిరి
అందులో జీవనము సాగించిరి
మారీచుని మాయవల్ల
బంగారు లేడి వలలో
సీత పడగా రాముణ్ణి పంపగా
రావణాసురుడు సీతను లంకను తీసుకెళ్లగా
హనుమంతుని సహాయముతో
వానర సమూహముతో
రావణాదులతో సమరం సల్పగా
మండోదరి మగడు మరణించే
ఆనందంగా అయోధ్యను పాలించే!!
                  కవిత వెంకటేశ్వర్లు
ఈ కవిత నా స్వీయ రచన అని
హామీ
3.
[27/05, 9:21 pm] Korada: @రామాయణం లో పర్ణశాల@
     కోరాడ నరసింహా రావు !
        *****************
ప్రకృతిసోయగాలతోపరవశింప జేయు చిత్రకూట పర్వతమది!
సోదరలక్ష్మణునితో శ్రీరాముడు,
సీతయునువనవాసదీక్షకై...యేతెంచినవేళ...ఆవాసమునకై 
నిర్మించుకునిరచట... అందాల పర్ణశాల ! 
        ఫల, పుష్పనాదులతో... ఆహ్లాదపు పరిమళములు !
     ఖగ, మృగ విహారముల శోభిల్లు ప్రదేశమది !!
 సుందర ప్రశాంతతల అలరా రుతు రాజభవనముకన్నహాయి
ని కలిగించె నహో... !
     శ్రీరాముడు భరతునకు పాదుకలిచటే ఇచ్చెను !
 సూర్పనఖకు ముక్కు, చెవులు 
తెగిపోయినవిచటే... !
   మాయలేడిగా... మారీచుడు 
మోసగించె నీ స్థలినే !
  లక్స్మన రేఖతొ సౌమిత్రి... 
    సీతను హెచ్చరించె నిక్కడే !  
దశకంఠుడు జానకినిఇటనుండే
అపహరించె... !!
   రామాయణ కధలో...ముఖ్య మైనమలుపులకు పర్ణశాలయే సాక్షి...!
     చారిత్రిక చిహ్నమయి నేటికినీ యాత్రికులకు సాక్ష్య మిచ్చు చున్నది ఈ పర్ణశాల !!
       *******************
4
[27/05, 9:25 pm] Ramulu adelli Poet: కవితా గానం
అంశం*పర్ణశాల
శీర్షిక*ప్రకృతి శిల్పాలు

పచ్చ పచ్చని కాపురం
వెన్నెల సంతకమైన గోపురం
ఇష్టపదులు గోదారి అలలపై పాట
ప్రేమంతా సీతారామ దాంపత్యానికి
పూలతోట

అల్లుకున్న విరిమల్లె సన్నజాజులు
ఆరేసిన నారచీర అంబర గురుతులు
ఇతిహాసాన కీలక మలుపు
రావణాది కుంభకర్ణులకు శాపవిముక్తి

సీతమ్మధారలు
రాముని గుండాలు

నా దేశం సదా పవిత్ర నేల
ఆదర్శాల ఆచరణశీలుర ఇల
శబరీమాతకు ఫలించిన కల
శ్రీ రామ నామము మార్మోగిన శాల

ఒకే మాట
ఒకే బాట
శ్రీ రాముని సుగుణాల ఆభరణం
ఆచరించే వారి మది పూసిన పారిజాతం

ఆ శాల శోభిల్లింది సీతమ్మ అడుగులతో
ఆ పర్ణశాల మూర్చిల్లింది సీతమ్మ
అపహరణతో

ఆదిత్యహృదయం తో అవని మురిసింది
శ్రీ రామ పట్టాభిషేకం తో
మళ్ళీ పులకించింది

పర్ణశాల పూర్ణ చందమామల్లా వెలిగే
సీమ
పల్లెటూళ్ళలో నాటి కుటీరాలన్నీ
ప్రకృతి చెక్కిన జీవన శిల్పాలు

ఋషులకు నేటికీ తపోవనాలు
జ్ఞాన సంపదకు నెలవైన దీపస్థంభాలు

ఏడెల్లి రాములు ✍️
ది*27*05*2022(21*22)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
5
[27/05, 9:30 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 3*
తేదీ:27/05/2022
పేరు వురిమళ్ల సునంద
ఊరు ఖమ్మం
అంశం: పర్ణశాల
***************
నిజాలకు కొన్నైనా సాక్ష్యాలుంటాయి
వనవాసంలో శ్రీరామ జీవితం
అడుగడుగునా కనిపిస్తుంటే మనసుకు మోదం

ప్రశాంత వాతావరణంలో
పర్ణశాల అందం
ఫల పుష్పాలతో ప్రకృతి సోయగం
సీతమ్మ వారి చిరు నగుమోము 
కళ్ళ ముందు కదలాడును నిజము

గలగలా పారే గోదారి ఒడ్డున
జానకమ్మ ఆరేసిన నార చీరల చిహ్నం
భక్తులను అబ్బుర పరిచే అపురూప దృశ్యం

మాయ లేడి రూపంలో
మారీచుని ఉనికి
శూర్పణఖకు జరిగిన పరాభవం

సీతా రామ లక్ష్మణులు
తిరుగాడిన ప్రదేశం
తలుచుకుంటే ఇప్పటికీ
మదిలో కలుగును మధురమైన అనుభూతి

చరిత చాళ్ళలో చిరస్థాయిగా
నిలిచిన పర్ణశాలను
సందర్శించి పొందుదాం
అపరిమితమైన ఆనందం..
6
అంశం .... పర్ణశాల... గానం...28/5/22
శీర్షిక.... పంచవటి పంచామృతం
స్వీయ రచన కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
**************************************

అయోధ్యా పురి అన్నుల మిన్నుగా అందంగా అలంకరించబడుతోంది
పుర జనులు... పరివ్రాజకులు, ఆబాలగోపాలం
అందరూ ఆనందంగా గెంతుతున్నారు 
సమధికోత్సాహమున సమాయత్తమౌతుందీ
సురపురి
శ్రీ రామచంద్రుని పట్టాభిషేకం తిలకించాలని...
అందరికి ఒకటే తపన,
ఆ దివ్య మంగళ రూపం దర్శించి తరించాలని

మరోపక్క
అంతః పురం ఆంతరంగిక మందిరంలో మందర మంతనాలు... కైకేయి అలక 
దిగులుతో మంచం పట్టిన దశరథ మహారాజు 

కన్న నాన్నకు కష్టము బాపగ కానన కేగుటే 
మార్గమని యెంచిన రాముడు...
సీతా లక్ష్మణ సమేతుడై వనవాసానికి బయల్దేరి దండకారణ్యంలో ప్రవేశించెను

చుట్టూ ఎత్తైన కొండలు గుట్టలు వాటి మధ్య 
గలగలా గానం చేసే కిన్నెరలా గోదావరి... ఇసుక తిన్నెల చుట్టూ వయ్యారంగా వంపులు తిరిగుతు పరుగులు తీసే గౌతమి

పచ్చని చెట్లు గుబురైన పూల పొదలు, ఎటు చూసినా తేనె పట్టులు ... పెట్టిన పుట్ట తేనియ పట్టి పంచవటి
 
నయగారాల పచ్చని చిలకల నగవుల పసలు 
సుస్వర శోభిత కోయిల సంగీత కచేరీ వేదిక 
ఈ గోదావరి తటి
నచ్చిన జానకి మెచ్చిన రాముడు, నిర్మించెను
లక్ష్మణ
సుందర పంచవటిలో పర్ణశాల, ప్రభు రాముడు
విశ్రమించ సతి సీతను కూడి ...

చేయాలి పదు నాలుగు ఏళ్ళ వనవాసం
తండ్రి బాసను నిలిపెడి రాముడు
దుష్టుల దునిమే కోదండ రాముడే
పర్ణశాలలో పురుషోత్తముడు 
7
🌷ప్రకృతి పావడ 🌷
******************
వర్ణనాతీతం పర్ణశాల 
మమతను బందాల తీరం పర్ణశాల.
నింగిలోన పూచింది చలువల 
చందమామ పువ్వు .
నేలపై విరిసింది సకల సిరుల సీతమ్మ పువ్వు. 

కరకు అడవుల్లో కృర రాకాసి వీధుల్లో ...
నిరంతర నిర్భయ ప్రభాస పర్ణశాల వెలిసింది   
పరమాత్మ గృహసీమగా. 

ఎదురు బొంగులే ఇంటి గోడలుగా 
వన పూలు ఆభరణాలుగా..
కలహంసలే పరిచారికలుగా ..
రాచిలకలే ఆత్మీయ అతిథులుగా ..
సీతాకోక చిలుకలలే మురిపాల మువ్వలుగా ..
నెమలి ఆట కోకిల పాటలతో ..
మెల్లమెల్లగా పరిమళ మత్తును విరజల్లుతూ వీచే పవన తెమ్మెరలో ..
అల్లుకున్న ఆదిదంపతుల అనురాగ తరంగాలలో
ప్రకృతి పావడై మెరిసింది పర్ణశాల .

కామపు రాకాసీ కన్ను చేరింది ...
సీతాపహరణం జరిగింది. 
సీతా మనసులా విలవిలలాడుతూ   
నేల కూలింది పర్ణశాల.
ఆనవాలు అందిస్తూ... 
రావణ సంహారమును సాకింది. 
జగతికి నీతిని తెలిపింది. 

ప్రకృతి పావడై ఎదిగి ఒదిగిన పర్ణశాలా రామావతార రమణీయ దీపం. 
రాకాసి ముక్కు చెవులు తురిమిన చతురత దివ్యం. 
పరమాత్ముల సేద తీర్చన 
పగడపు ప్రకృతి పావడ పర్ణశాల.

కందూరి సుజాతా రాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్ 
9392162822
8
శీర్షిక-పర్ణశాలాచిత్రం.
ఆడంబరాలకి దూరంగా..
ఐశ్వర్యం కొలబద్ద కాకుండా..
ఆధ్యాత్మికతకి ప్రతీకలా..
సెలయేటి గలగల సవ్వడులతో..
పక్షుల కలకూజితాలతో..
నిర్భయంగా తిరిగే పెంపుడు కుందేళ్ళు,లేళ్ళతో..
పూలపరిమళాల పొదరిళ్ళతో..
ప్రకృతి సౌందర్యాన్ని పట్టిచ్చెలా..
పర్ణశాల పలకరిస్తోంది!!
మహామునుల తపోనిలయంగా..
అధ్యయనాలకి గురుకులంగా..
అనుష్ఠానాలకి ఆనవాలుగా..
రామాయణంలోవనవాసపు సన్నివేశమే కాదు,
సీతమ్మతల్లికి పురుడు పోసిన నేల,.
శకుంతలని పెంచినఆశ్రమంలా-.పర్ణశాల అంటే ఆకుల పందిరి కాదు,
చల్లని ప్రశాంతత నిచ్చేమనోహరచిత్రం!!!
     --------------
ఇది నా స్వంత రచన!
డా. వేమూరి.సత్యవతి.
9
కవితా గానం ( సీజన్ 3 )
అంశం.. పర్ణశాల
శీర్షిక.. పంచవటి
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

శ్రీరామచంద్రుని పట్టాభిషేకం
అయోధ్యానగర అమృతాభిషేకం
పట్టణవాసులకు పరమానందాభిషేకం
దశరథమహారాజు అనందంవర్ణానాతీతం

మంథర మంతనాలు కైకేయి రెండు వరాలు
శ్రీరామచంద్రుడు 14 ఏండ్లు అరణ్యవాసం
సీతారాములు లక్ష్మణునితో సహా అరణ్యవాసం 
భరతునిపట్టాభిషేకం రామాయణకథమలుపుతిరిగింది 

అరణ్యవాసం దండకారణ్యం
అందాల ప్రశాంతవాతావరణం
ఆనందాలు వెదజల్లే రమణీయం
ఆమనివసంతాల ప్రకృతిశోభాయమానం

సుందరమైన కుటీర నిర్మాణాలు 
సుధీర్ఘమైన పరవళ్ళ జలపాతాలు
ఆకుపచ్చని నిండారా పచ్చికబయళ్ళు
సాధుజంతువుల ప్రేమపూర్వకస్వాగతాలు

అందాల ఆనందాల సుందర కుటీరం
సుందర కోమలాంగి సీతామహాసాధ్వి
ఆజానుబహుఅరవిందనేత్రుడు శ్రీరాముడు
భాతృప్రేమికుడు రక్షణాకవచం లక్ష్మణస్వామి
 
ఇక ఈ అందమైన కుటీరమే పర్ణశాల
మృధుమధుర అమృతధారావాహిని
పర్ణశాల సీతారామలక్ష్మణుల కుటీరం
మమతానురాగాల పవిత్రమైన కుటీరం

పర్ణశాల సొగసు వర్ణణాతీతం
అందాల రంగవల్లులు ముగ్గులు
రంగురoగుల అల్లికల తివాచీలు
సుగంధ పరిమళాల పూలమొక్కలు

ప్రేమతో పెంచుకునే లేళ్ళు
అనురాగాల పంచే కుందేళ్లు
వీవెనవీచే పింఛాల నెమళ్ళు
చిలకల ముద్దుముద్దు కబుర్లు

అన్నీ సీతమ్మ అమర్చుకున్నవే
అరణ్యములో కూడా పతిసేవే
సీతమ్మ నడిచింది రామునివెంట
రాముడు నడిచాడు సీతమ్మప్రక్క

ఇద్దరికిఅనురాగంతో నిర్మించాడుతమ్ముడు
అనురాగ సుమవిరిజల్లు పర్ణశాల
రూపురేఖలు దిద్దిన సీతమ్మ తల్లి
అందాల పసిడి పంచవటి హరివిల్లు

హామీపత్రం
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
10.
[29/05, 8:23 pm] Aalla Nageshwar Rao Poet: కవితా గానం  సీజన్  3
అంశం : పర్ణశాల
శీర్షిక :
      "" ప్రకృతివడిలో కుటీరం ""
 
పత్నికిచ్చిన మాటకు కట్టుబడి దశరదుడు
దశరధుడి ఆజ్ఞను శిరసావ హిస్తూ శ్రీరాముడు
శ్రీరాముని అడుగుజాడల్లో సీతా, లక్ష్మణులు కలసి
అరణ్యవాసం కై కానలకేగి
ప్రకృతిమాత వడిలో నిర్మించుకున్న అందమైన  కుటీరమే ఈ పర్ణశాల
ప్రకృతి సౌందర్యానికి ప్రతీకయై
ప్రశాంతతకు ప్రాణప్రధమై
దుష్ట రావణ సంహారానికి కీలకమై
లక్ష్మణుని శీలానికి పరీక్షయై
రాక్షసి శుర్పణకు అంద విహీనతకు కారణమై నిలిచిన
సీతారామ లక్ష్మణుల నివాస గృహం
కానలలో  నిర్మించిన పర్ణశాల
బంగారు జింక సృష్టికి మూలం
రామ రావణ యుద్దానికి బీజమే ఈ పర్ణశాల
దుష్టశిక్షణ, శిష్టరక్షణ ఆరంభం ఇక్కడ నుంచే
రామరాజ్య స్థాపనకు కేంద్రం ఈ
పర్ణశాలే!
...........................................
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు... జిల్లా
ఆంధ్రప్రదేశ్... రాష్ట్రము
చరవాణి :7416638823
............................................
పై కవిత నా స్వీయరచన.
12
[29/05, 8:59 pm] +64 21 233 1334: అంశం: పర్ణశాల
డా. తంగిరాల నాగలక్ష్మి
రాచరికపు అంతః పురాలు వీడి
నార చీరలతో  నిరాడంబరంగా 
సామాన్య వేష ధారణతో
తండ్రి మాట నిలబెట్టుట అనే నెపంతో
అడవుల కేగి
రాక్షస వీరులను మట్టిపెట్టిన రామావతరా
సంఘటనలకు ప్రతీక పర్ణశాల
సీతా రామ లక్ష్మణుల అనురాగ ఆలయం
పర్ణ శాల
పంచవటి లో
పర్ణశాల నిర్మించె లక్ష్మణ స్వామి
అన్నా వదినలకు పవిత్ర గోదావరి తీరాన  వన వాస సమయంలో
పచ్చని ప్రకృతి ఒడిలో  
వన్య పక్షుల గానాలలో
పంచ వెన్నెల రామ చిలుకలతో
ప్రశాంత వాతావరణం లో 

సీతారామ మందిరం పర్ణశాల
రాజ భవనంలో నివసించిన
సీతా రాములు అంతే ఆనందంతో
 సంతోషం గా గడిపిన శాంతి నిలయం పంచవటి పర్ణశాల

ఆత్మ పరమాత్మ కలిసి ఆహ్లాదకరమైన జీవనం సాగించిన  గుడి పర్ణశాల
రావణ సంహారానికి ఆరంభం సీతాపహరణం
జరిగింది ఈ పర్ణ శాల లోనే

అయోధ్య నుండి ఆంధ్ర కు అభిమానం తో
వేంచేసిన మన ఆరాధ్య దైవం సీతారామ స్వామి
 వాహన మైన   సుపర్ణుని 
శాశ్వత నివాసమైన
 వైకుంఠాన్ని వదలి
శిష్ట రక్షణకు కష్టాలకోర్చి
భూలోకం లో అవతరించిన నామ నారాయణుడు పాదం మోపిన
పరమ పావన పర్ణశాల యది

యుగాలు గడిచినా 
మహా యుగాలు దాటినా
ఇప్పటికీ ఆ చిహ్నాలు పదిలంగా 
ఉన్న మహనీయ స్థలం పర్ణ శాల
అరణ్యంలో కూడా  సంతృప్తి తో
మెలిగిన సీతారామ చరితం
ప్రతి మానవునికీ ఆదర్శం
13
[29/05, 9:37 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం సీజన్ 3
నిర్వహించు కవితల సమాహారం
తేది: 29-05-2023

అంశం: పర్ణశాల

పేరు సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు కర్నూలు
చరవాణి:9505152560
**********************
    పంచవటిలో

చక్కని పూల తీగెలు
గుంపులు గుంపులుగా సీతాకోక చిలుకలు
కనులు పండువుగా ప్రదేశం
నీటికి దగ్గరలో మనసుకు చేరువలో
స్వేచ్ఛా విహారానికి యోగ్యమైన చోటు
పూలు పండ్లు కట్టెలు దర్భలు దొరుకు 
అనుకూల స్థలం
గట్టి నేల కాదు శయనించగ నునుపైన నేల
కోరి తమ్ముడు లక్ష్మణుని కి చెప్పిన
స్థలం

అగస్త్యుడు చెప్పిన 
గోదావరి కమలాలు
హంసలు చక్రవాకాలతో 
మయూరి నాట్యాలతో 
భారీ వృక్షాలు నిండివున్న ప్రాంతంలో నిర్మించుకున్న కుటీరమే పర్ణశాల!
      ***
14
పర్ణశాల
27052022
వీరా గుడిపల్లి
***********
పరిమళ భరితమైన
పరిసరాలలో
నార చీరలు ఆరేసిన 
గుర్తులు

నా దృష్టిని దాటని
ఆ అడుగుల జాడలు
ఇంకా కనిపిస్తున్నాయి.
కోదండం స్పర్శతో పులకించిన
మట్టి కలవరం
మనోజవం తో మదిని మురిపిస్తుంటే

సీతా మాత శ్వాసించిన
చోటు
లక్ష్మణుడు రేగు పళ్ళు ఆరగించక
ఆదమరపు లేక
అవనికి ఆనవాళ్లు వదిలిన చిఱునామా

జాడలు వదిలి
 జవం ,జీవం తామని చాటి
నేటికీ రామాయణం సజీవంగా
కనిపిస్తున్న గుర్తు

మాటలకందని మార్మిక సౌందర్యం
మరెవరికీ లభించని 
మధురానుభుతి.

రామ భక్తులను కున్నా
సీతా పుత్రులమనుకున్నా
మన మనుగడ కానవాళు
పర్ణశాల
...... *వీరా గుడిపల్లి*
15

పర్ణశాల 

ఎండ కన్నెరుగని
ఆ సుకుమారత్వం..

కటిక నేలపై విశ్రమించడమెలాగని తల్లడిల్లిందేమో..!!!
తల్లి మనసు 

ప్రకృతిలాలనలో పరవశింపచేయమని 
సాంత్వనల ప్రాంతమవమనీ..

అవని..
వనానికి కబురంపిందేమో!!!

 విపినమంతా వ్యాపించిన వార్తతో 

గహనం ఘనంగా ముస్తాబయినట్టు

పంచవటికి 
పట్టలేనంత ఆనందం కలిగినట్టుగా.....

తన చెంతన చేరడంతోనే 
మరింత శోభ నలదుకున్నట్టు.....
ఆ ఆనవాళ్లు

అన్నా వదినల కోసం
తమ్ముడు నిర్మించిన కుటీరానికి
అనువయిన ఆకులు కొమ్మలతో...

నీడనిచ్చి....
చల్లదనాన్ని కురిపించిన ఛాయలింకా వీడలేదు 
 
సీతమ్మ వాగు.

ఆరేసిన నారచీరల చారలు..

సేద తీరమంటున్న గోదారి తీరంతో 

పావన మూర్తులకు ఆతిథ్యమిచ్చిన..
ఆ ప్రదేశం....

ఆణువణువూ పులకించిన ఆ చోటు....

ఆ పర్ణశాల

తండ్రి మాట జవదాటని
తనయుడిని 

అన్న బాట పట్టిన అనుజుడిని 

 మనువాడిన వాడే 
మనో వనమయ్యాక 

వనవాసమైనా.. అయోధ్యేనన్న అయోనిజను 
చూపింది...

పల్లవించిన బంధాలను 

పరిమళించిన అనురాగాలను..

పరిచయం చేసిన పర్ణశాల 

అన్యోన్య దాంపత్యమంటే
సీతారాములదేనంటున్నది....

మానవుడున్నంత కాలం
మనగల రామాయణమంటున్నది.

సంస్కరించుకొమ్మనే కమ్మని కావ్యాన్ని 
పదే పదే తలపిస్తూ...

********శివునూరి లలితాకృష్ణ

.

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...