నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
****************
1.మద్ది పుల్లారావు గారు
2.డా.బల్లూరి ఉమాదేవి గారు
3.ఆపరాజిత్ గారు
4.అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు
5.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
6.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు
7.గొర్రెపాటి శ్రీ ను గారు
8.తరణికంటి సూర్య లక్ష్మి గారు
9.కవిత వెంకటేశ్వర్లు గారు
10.సింగీతం సంతోష్ కుమార్ గారు
11.గజవెళ్ళి శ్రీ నివాసా చార్యులు గారు
12.ముద్దు వెంకట లక్ష్మి గారు
13. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
14.శ్రీకాంత్ కడార్ల గారు
15.టేకుమళ్ళ విజయ లలిత గారు
16.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
17.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
18.పొర్ల వేణు గోపాల్ రావు గారు
19.కందూరి సుజాతా రాణి గారు
20.వేదాంతం సురేష్ బాబు గారు
21.ఏడెళ్ళి రాములు గారు
22.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు
23.సునంద వురిమళ్ళ గారు
24.పిన్నక నాగేశ్వరరావు గారు
***********
1.
[కవితాగానం సీజన్ 3
మాతృదినోత్సవ సందర్భంగా
...................
మద్ది. పుల్లారావు
నందిగామ
శీర్షిక:అమ్మ మనసు
ప్రక్రియ:ఇష్టపది
7-5-22
1)
మాతృదేవోభవా...మహిన వెలిగే సూక్తి
పురిటి నొప్పుల తోటి..పుట్టుకనిస్తుందీ
రోదించే బిడ్డకు..రొమ్ము పాలిస్తుంది
బుడిబుడి నడక చూసి...పులకించి పోతుంది
అంబాడే వయసున.. అంతా తానే యగు
ఆదిగురువు తానై...అన్నీ నేర్పుతుంది
పాఠశాల కు పంపి..పరమ సంతసమందు
రాయుదును ఇష్టపది.. రామచంద్రుని తలచి
2)
పెరిగే వయసు లోన..ప్రేమానుబందాలు
చదువు బిడ్డను జూసి..సర్వం మరుస్తుంది
నాన్న కోపం నుండి.. కన్న తల్లి రక్షణ
తప్పులన్నింటినీ..దాచిపెడుతుంది
తనకడుపుమాడ్చుకొని.తనయులకుపెడుతుంది
గుణవంతులైనట్టి...కొడుకులను జూసి
మహదానందంతో..మనసు పరవశమగును
రాయుదును ఇష్టపది.. రామచంద్రుని తలచి
3)
తనయులు ద్వేషించిన...తాను దూషించదూ
ఆత్మజుల కోసమని..యాత్మను చంపుకొనును
అమ్మ చూపించేటి..ఆప్యాయత ల ముందు
కోటి వరాలయినా...గోటికి సమానమే
త్యాగానికి రూపం...ధరిత్రిలో అమ్మే
ఫలాపేక్ష లేకనె...ఫలాలిచ్చును తల్లి
అనురాగ జలదియూ..ఆప్యాయతల కడలి
రాయుదును ఇష్టపది.. రామచంద్రుని తలచి
4)
వృద్దాశ్రమాలలో...వృద్ధులనుంచవద్దు
ముసలిదైనతల్లిని...ముచ్చటగా చూద్దాం
బిడ్డల కౌగిలిలో.. పెద్దలు సేద తీర
తల్లి దండ్రులను జూచే...తనయులే దైవాలు
మనుమలతో గడీపే...మహాభాగ్యాన్నిపుడు
పెద్దలకందించిన...పిల్లల కాదర్శము
ఆదిదేవుడైనను..అమ్మ ప్రేమను గోరు
రాయుదును ఇష్టపది.. రామచంద్రుని తలచి
ఆమె పొత్తిళ్ళు పాపాయి కి స్వర్గధామం.
ఆమె స్పర్శ భాధారహితం.
అమ్మచూపు చల్లనిది
ఆమె జీవితాన తొలిగురువు.
ఆమె లేకపోతే సృష్టిలేదు.
అందుకే ఆమె నడయాడే దేవత.
తల్లిని మించిన దైవము లేదు. అందుకే మాతృమూర్తి కి శతకోటి వందనములు.......!!
................................
2
[07/05, 8:37 pm] Balloori Umadevi Poetess: కవితా గానం
డా బల్లూరి ఉమాదేవి
శీర్షిక:అమ్మ
అమ్మంటే అంతులేని అనురాగం
అమ్మంటే కమ్మనైన మమకారం
అమ్మంటే త్యాగానికి ప్రతిరూపం
అమ్మే మానవాళి కాదర్శం
నవమాసాలు కడుపున మోసి
పేగుతెంచి రక్తమాంసాలిచ్చి
మనకీ అస్తిత్వమిచ్చేది అమ్మ
కడుపులో నుండి కాలితో తన్నినా
బయటి కొచ్చి పెరిగి రొమ్ముపాలు తాగి
ఆరొమ్మునే బలంగా గుద్దినా
సహనంతో భరించే శక్తి అమ్మదే
గోరుముద్దలు గోముగా కలిపి
కొసరికొసరి తినిపించు
కమ్మగా పప్పు నెయ్యికలిపి
చేతిముద్దలతోడ తీపి ప్రేమనే పంచు
కన్నబిడ్డ బాధపడితె తాను కంటతడిపెట్టు
కనిపించని దైవాలకు ముడుపు కట్టి
పూజలు వ్రతాలెన్నొ సంతు కొరకు చేసే
కనిపించే దైవమే ఈ కన్నతల్లి
మణులు మాణిక్యాలను కోరదెపుడు
కన్నసంతుబాగు నహరహమ్ము కోరు
అందుకే
అంతులేని అమ్మప్రేమతోడ
ఆడుకోకు ఎప్పుడూ
ఆదరించి ప్రేమపంచి
ఆప్యాయతతో పలకరించు
అదేపదివేలటంచు పదుగురికి
చాటిచెప్పు అమృతమయి
అమ్మ
అర్పిద్దాం అమ్మకు
వేలవేల వందనాలు.
3
[07/05, 9:09 pm] Aparajith: అమ్మ భాష!
పాల బువ్వ తిన్నట్లు
జున్ను పాలు తాగినట్లు
లేత కొబ్బరి తిన్నట్లు
లేగదూడ అంభా అన్నట్లు
ముద్దు ముద్దు మాటల పసిపాప
అమ్మ పాలు తాగుతూ హాయిగా
అమ్మ ఒడిలో నిద్దరోయినట్లు
వెన్నెల్లో ఆటలాడే పిల్లలు
ఉల్లాసంగా గంతులేస్తూ
పండు వెన్నెల జాబిల్లిని పట్టుకున్నట్లు
కమ్మ కమ్మని శీతాఫలాలు ఆరగించినట్లు
అమ్మ చేసిన కమ్మని అరిసెలు తింటున్నట్లు
జుంటితేనె జుర్రుకుంటున్నట్లు
చెట్టుపై జామపండును రామచిలుక
ముక్కుతో కొడుతున్నట్లు
ఒక్కొక్క అక్షరం నేర్చుకుంటున్న పాప
పాలకోవా లాంటి అక్షర సముదాయాలను పలుకుతున్నట్లు
తీయ తీయని పలుకుల అమ్మదనం
కమ్మనైన తెలుగు భాష గొప్పదనం!
తంగెడు పూల లేత పసుపు స్వచ్చదనం
గోరెంట పూల అందాల మొక్కల్లా
గళగళ పారే సెలయేళ్ళు
తెలుగు నేల పులకరించేలా
రైతన్నలు చేసే సేద్యం
సుతారంగా సుతిమెత్తని తెలుగు భాష
నిలవాలి కలకాలం ఈ కమ్మదనం
నిన్ను కన్నతల్లి తెలుగు తల్లి
మరువకు మరియెప్పుడూ
తెలుగు భాష తెలుగు యాస!
అపరాజిత్
సూర్యాపేట
4
[07/05, 9:19 pm] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: శీర్షిక:-
నడయాడే దైవమే అమ్మ.
పురిటి నొప్పులను భరించి
పునర్జన్మ నొంది పుడమి పైకి మనల్ని తెచ్చిన అమ్మ నిజంగా అమృతమూర్తియే.....!!
అందం, ఐశ్వర్యం ఏమి చూడకుండా జగతిన ప్రేమించే ఒకే ఒక మనిషి
తను తిన్నా, తినకపోయిన
పిల్లల ఆకలి తీర్చే త్యాగమయి, ప్రేమమూర్తి...!!
అమ్మ జోలపాటలో అలుపు ఉండదు.
ఆమె పొత్తిళ్ళు పాపాయి కి స్వర్గధామం.
ఆమె స్పర్శ భాధారహితం.
అమ్మచూపు చల్లనిది
ఆమె జీవితాన తొలిగురువు.
ఆమె లేకపోతే సృష్టిలేదు.
అందుకే ఆమె నడయాడే దేవత.
తల్లిని మించిన దైవము లేదు. అందుకే మాతృమూర్తి కి శతకోటి వందనములు.......!!
................................
పేరు:-
అయ్యలసోమయాజుల ప్రసాద్
రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి
విశాఖపట్నం.
చరవాణి:-9963265762
..................................
5
[07/05, 9:38 pm] Thathapudi Somashekara Sharma: కవితా గానం (సీజన్ 3)కవితలపోటీ
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం , 8328079346
అంశం..మదర్స్ డే సందర్భంగా
శీర్షిక.. అమ్మే దేవత
*****************
పల్లవి :
అమ్మ దేవత కన్న గొప్పది..... అమ్మే నమామి
అమ్మ దైవ స్వరూపమే....సదా స్మరామి
చరణం :
చందమామను చూపిస్తూ
గోరుముద్దలు తినిపిస్తూ
చంకలోనికి ఎత్తుకుంటూ
నడ్డిన వీపున తిప్పుకుంటూ
ఎలాగైన గోరు ముద్ద తినాలని
పాటలు పాడుతూ నృత్యం చేస్తూ
గోరు గోరంటూ గోములు చేస్తూ
గోరుముద్దలు పెట్టే మా అమ్మ
చరణం :
విరిసిన వసంతగానంలా
ఉషోదయ సూర్యబింబంలా
నాబాల్యంలో వచ్చిన అరిష్టాలను
తనచేతులతో మోసిన మాఅమ్మ
నవమాసాలు మోసిన మాఅమ్మ
నవకాంతులను వెదజల్లిన మాఅమ్మ
నాసౌఖ్యమే తనసర్వస్వమనుకుకొని
నన్ను సాకిన దేవత మాఅమ్మ
అమ్మదేవతకన్నగొప్పది.. అమ్మేనమామి
అమృతమందించినమాఅమ్మకే సహస్రప్రణామి
హామీపత్రం..
ఈ కవితాగానం నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
పేరు.. తాతపూడి సోమశేఖర శర్మ
యానాం.. 533464
పాండిచ్చేరి స్టేట్
చరవాణి.. 8328079336
6.
అంశం: మాతృ దినోత్సవం
డా. తంగిరాల నాగ లక్ష్మి
శ్రీ మాత్రే నమః
ప్రతి దినం అమ్మ కు నమస్కారం
అది మన సంస్కారం
ఒంటరితనంతో చీకటిలో అమ్మ కడుపులో కొట్టు మిట్టాడు తున్న
జీవాన్ని వెలుగు లోకి తెచ్చేది అమ్మ
మాతృ మూర్తి ఓ మధురానుభూతి
మనసు లోప లుండు మార్గ దర్శి
మహిమ జూపు దేవి మహిలోన మనలకు
మమతల అను రాగ మాల అమ్మ
మాతృమూర్తి యన్న మనకు దైవంబిల
మరువలేము కన్న తల్లిని నిన్నటికి
నవమాసాలు తనలో మోసి
జన్మ నిచ్చి ఆలనా పాలన చూడు తల్లి
అమృతం పంచు అమ్మ
మాట నేర్పు రతనాల బాట కూర్చు
ఆర్తి తో అక్కున చేర్చుకొని
ఆటలాడి పాటపాడి
గోరు ముద్ద తినిపించు ముద్దు ముద్దుగా
శిక్షణ నిచ్చు కాని శిక్షించదు అమ్మ
లాలించి నిదురపుచ్చు
అమ్మ విలువ అమూల్యం
అవసరానికి ఆదుకొనేది అమ్మ
అందాల అమ్మ ఆనందాల ముద్దు గుమ్మ
అమ్మ దీవెన నుండ అసాధ్య మే లేదు
అమ్మను మించిన దై వం లేదు
అందుకే మాతృదేవో భవ
అమ్మ మాట ముత్యాల మూట
అమ్మను ఆదరించు
అమ్మ కన్న మిన్న లేదురా జగతిని
అమ్మ ఋణం తీర్చుకోవా లంటే ఎలా తీరేది కాదు అయినా
చిన్నప్పటి నుండి నిన్ను పెంచి పెద్ద చేసింది
అదే విధంగా నువ్వు ఆవిడకు చేసే సమయం వృద్ధాప్యం వచ్చినపుడు
ఆమె ప్రాణ ప్రయాణ సమయాన
దగ్గరుండు
ఎన్ని అడ్డంకులు వచ్చినా అండగా ఉండు
చిరునవ్వుతో శాస్త్ర విధులతో సాగనంపు
ఆ దినాన్ని గిర్తుంచుకో తద్దినం పెట్టు
మూఢ నమ్మకాలని అజ్ఞానం తో త్రోసి పుచ్చకు
జనని జన్మ భూమి నీకు తోడు నీడ ఓ మానవుడా
పేగు పంచిన బంధం అమ్మతో అనుబంధం
అమ్మా అమ్మా రతనాల కొమ్మా
చేరువై యుండమ్మ నా కెపుడు
7...
[08/05, 8:02 pm] Gorrepati Srinu Garu Poet: కవితాగానం
అంశం : మాతృదినోత్సవం
శీర్షిక : "అమ్మ .."
రచన : గొర్రెపాటి శ్రీను
అమ్మ ..
మమకారానికి మరో పేరు !
అమ్మ..
భగవంతుడు అన్ని చోట్ల వుండలేక
సృష్టించిన మహోన్నత మానవతామూర్తి !
అమ్మ..
సదా మన విజయాన్ని కాంక్షిస్తూ
మన కోసమే జీవించే ప్రేమస్వరూపిణి !
అమ్మ..
దేవతలా అడుగడుగుకి ఆధారమై నిలుస్తూ
వరాలేన్నో ప్రసాదించే అమృతమూర్తి !
అమ్మ..
సూక్తులు చెప్పే గురువు !
స్ఫూర్తిని పంచే చైతన్యం !
సన్మార్గంలో నడుపుతూ
ప్రేరణని అందిస్తూ
ముందుకు నడిపే మార్గదర్శి!
అమ్మ..
అనురాగానికి అర్థాన్ని చెప్పే నిఘంటువు !
ఆప్యాయతల బంధానికి భాష్యాన్ని బోధించే
కల్మషం ఎరుగని ప్రేమకు సంకేతం !
అమ్మ తోడుంటే అడుగడుగునా ఆనందాల పంటే !
అమ్మ చేయందుకుని నడుస్తుంటే విజయాలన్నీ మన వెంటే !
"అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా వ్రాసిన కవిత .."
- గొర్రెపాటి శ్రీను
8
[08/05, 8:05 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం( సీజన్3) 8/5/2022/ ఆదివారము
మాత్రుదినోత్సవ సందర్భంగా
" అవనిదేవత అమ్మ"
(1)
సీ! అమ్మకుతెలుసును అనురాగమమతలు
మురిపాలపెరుగును ముద్దుబిడ్డ
పొత్తిళ్ళబిడ్డను మెత్తగనిమురుతు
లాలించిపాలిచ్చి లాలబోయు
గోముగబిడ్డకు గోరుముద్దలుబెట్టు
ఆకలినెరిగిన అమ్మమనసు
అడ్డాలబిడ్డను అపురూపముగపెంచు
పదిమంది మెచ్చగ పరవసించు
ఆ! ఎల్లవేళతల్లి పిల్లలనెప్పుడు
కంటిపాపతీరు గాంచుచుండు
తరతరాలువెలుగు తరగనిసంపద
అమ్మకన్న మిన్న నవనిలేదు!
(2)
ఆ! అమ్మమనసునందు నాప్యాయతనెరుగ
మహినిదెలియరాని మనుజులెవరు
భువినిదొరకెతల్లి భూలోకదైవము
అమ్మలేకపోతె నవనిలేదు!
తరణికంటి సూర్యలక్ష్మి.
_____
9.
[08/05, 8:08 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం సీజన్ - 3
అంశం:: అమ్మా
తేదీ:: 8.5.22...ఆదివారం
శీర్షిక::: అమ్మ
అమ్మ అమ్మ అంటావు
అమ్మకు కూడు పెట్టక పస్తులుంచుతావు
అమ్మే దేవతంటావు
ఆ దేవతకు నైవైద్యం పెట్టక
నలువుతావు
అమ్మ సేవలు చేసిందంటావు
ఆమెకు నీవు సేవలు చేయవు
నీ ఆలితో చేయించవు
పాలిచ్చి పెంచేనంటావు
నేడు విషమిచ్చి చంపుతున్నావు
నీ బాగోగులు చూసిందంటావు
నేడామే బాగును మరిచావు
నీకు జబ్బు చేస్తే
కంటికి రెప్పలా కాపాడేనంటావు
నేడామేకు కళ్ళు కనపడకుంటే
చీదరించుకుంటావు
ఓమూలన పడి వుండమంటావు
ఆస్తి కోసం అస్తికలు విరగొట్టుతావు
డబ్బు కోసం జబ్బలు విరుస్తావు
నీ కోసం కష్టపడ్డ ఆ తల్లి ఋణము
ఎన్ని జన్మలెత్తిన తీర్చుకోలేవు
పురిటి నొప్పుల బాధ తెలుసు
కోవాలంటే
నీవొక స్త్రీగా పుట్టేంత వరకు
తెలియదు
తల్లి ప్రేమ చచ్చేంత వరకు చావదు!!
కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు
సెల్::8309920625
ఈ కవిత నా స్వంత రచన అని
హామీ
10
[08/05, 8:08 pm] సింగీతం సంతోష్ కుమార్: కవితా గానం...
కవి పేరు:- సింగీతం సంతోష్ కుమార్
ఊరు:-కామారెడ్డి
చరవాణి:- 8897152205
శీర్షిక:-
త్యాగశీలి - అమ్మ
_______________________________
కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి "అమ్మ".
పాలు త్రాగించి,
తన చేతి వేళ్ళ స్పర్శతో నీ అమ్మనిర అంటూ
అమ్మ ముహంలో ఆనంద బాష్పాల తో
ఆహారం తినిపిస్తూ
ప్రేమతో పెంచుతుంది "అమ్మ".
పుట్టాక మనల్ని కంటికి రెప్పలా
కాపాడుతూ,చిన్న గాయమైన తనకు అయింది అనుకొని బాధపడేది "అమ్మ"
అమ్మ అంటే ఓ అనుబంధం...
అమ్మ అంటే ఓ ఆప్యాయత
అమ్మ అంటే ఓ ఆత్మీయత
మన ఆలనా పాలనా చూసి పెంచి పెద్ద చేసేది "అమ్మ"
ఇల్లును ఆసుపత్రి గా మార్చి నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఒక వెజ్జుడిగా మరి
ఎంతో సేవ చేసే మన సేవ మూర్తి "అమ్మ"
ప్రపంచంలోకెల్లా తీయనైన పదం "అమ్మ"
బ్రహ్మదేవుడు సృష్టించిన అపురూపమే "అమ్మ".
ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మే పసిగట్టి కడుపు నిండా అన్నం తినిపించే మాతృమూర్తి
మమతానురాగాల రూపమే"అమ్మ"
త్యాగానికి ప్రతిరూపమే 'అమ్మ'
తీర్చుకోలేనిది రుణమే అమ్మ......
11.
[08/05, 8:09 pm] +91 90594 38068: అంశం:
Poem missing
హామీ పత్రం
...
ఇది నా స్వంత రచన
12
[08/05, 8:09 pm] Muddu Venkata Laxmi పిఠాపురం కవయిత్రి: కవితాగానం సీజన్ 3
*08-05-2022*
అంశం : మాతృ దినోత్సవం
శీర్షిక :
*చెదరని అనుభూతులు*.
చాలీ చాలని జీతపు మా మధ్యతరగతి కుటుంబంలో పండుగకు
ముందు రోజు రాత్రంతా
కుట్టు మిషను టకటకలాడిస్తూ అమ్మ తన చేతులతో తాను కుట్టి,
తెల్లవారక ముందే మా అక్క చెల్లెళ్ళకు తలంట్లు పోసి మాకు కొత్త పట్టుపావడాలు తొడిగి పొంగిపోయిన అమ్మ చేతి అమృతంపు స్పర్శ!
కొత్త పరికిణీని ఇటూ అటూ తిప్పుకుంటూ రాగాల పడవలో అలా అలా.. పయనిస్తున్నట్టు కూనిరాగాలు పాడుకుంటూ ఇరుగు పొరుగు మిత్రురాళ్ళ ఇళ్ళకువెళ్ళి గొప్పలుపోయిన రోజులు ;
కాలం
గిఱ్ఱున తిరిగి అందమైన పట్టుపరికిణీలతో కనువిందుచేస్తూ గిర గిర తిరిగే మనుమరాళ్ళ సందడిలో గతకాలపు సంతోషాలు
చెక్కు చెదరని అనుభూతులై
కనుల ముందు కదలాడుతున్నాయి !
ముద్దు వెంకటలక్ష్మి పిఠాపురం.
13.
[08/05, 8:11 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం సీజన్ 3
నిర్వహించు అంతర్జాతీయ మాతృ దినోత్సవ సందర్భంగా కవిత...
తేది:08-05-2022
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి:9505152560
*************************
మాతృదేవోభవ
విశ్వమంతా ప్రతి జీవి పుట్టుక అమ్మతోనే
తన రక్త మాంసాలతో
ఆకృతిని మలచి
భ్రూణ దశ నుంచి భూమి దిశకు దారి చూపించిన మార్గదర్శి!
ప్రసూతి నొప్పులు భరించి
సిజేరియన్ కు సిద్ధపడి సజీవ శిథిలమై లోకానికి
పరిచయం చేసింది
తొమ్మిది నెలల కఠిన శిక్షను అనుభవించి
కష్టాన్ని దిగమింగి
ప్రేమతో హత్తుకుని
ముద్దులతో ముంచెత్తింది అమ్మ!
అమ్మ ప్రతిరూపం నాకిచ్చిన మరుజన్మ!
బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సైతం
జన్మ ఇచ్చింది అమ్మ!
ఆడా మగ వివక్షత ఎరుగక
స్కానింగ్ వద్దని నిరాకరించి
బిడ్డ క్షేమం కోరి
ప్రసవ వేదం
కనిపించని ఆరవ వేదం....
తనువును ఫణంగా పెట్టి
పిల్లలను సరిసమానంగా లాలించే అమ్మ
ఇలలో కనిపించే దైవం స్వరూపం
జీవిత చరమాంకంలో
వృద్ధాశ్రమంలో వదిలేయడం పాపం
రెండడుగుల పాదముద్రలో వుంది
స్వర్గము
ఆమె త్యాగనిరతికి ఏమిచ్చినా
ఋణం తీరదు!
***
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.
14
[08/05, 8:12 pm] శ్రీకాంత్ కడార్ల Poet:
అఆలు ఎంత అదృష్టం
చేసుకున్నాయి *అమ్మ* ను అక్షరాలలో బంధించ
పెదాలు ఎంత పుణ్యం చేసుకున్నాయి
ఆ కమ్మని మాటను పలుకంగా
దేవుడెంత భారాన్ని దించుకున్నాడు
తన ప్రతినిధిగా ఆమెనివ్వంగా
అలసట లేదు ఆయాసం రాదు
తన అల్లారుపిల్లలను సాకంగా
నిదురపోదు నీరసించదు
తన చంటిబిడ్డలను చూడంగా
అమృతాన్ని గుమ్మరించి
ఆత్మీయతను రంగరించి
అంతులేని ప్రేమను అందించి
ఆయువునొసిగితే అయ్యేది అమ్మేగా
ఆమె హృదయం మల్లెలవనం
మమతల నిలయం
ఆమె మనస్సు సప్తవర్ణశోభితం
తన పిల్లల బాగుకే అంకితం
దేవుడేందుకిలా చేసాడో
అమ్మను ఇలా ఎందుకు మలిచాడోకానీ
తన బాధ తనదికాదెప్పుడు
తన సంతోషంలో తను లెదెప్పుడు
తన శోకంలో తనుండదెప్పుడు
ఆమె గుండె చప్పుడే నీకోసం
ఆమె ఉండేదే మనకోసం......
అమ్మ అని పిలిచినా బావుంటుంది
అమ్మా అని అరచినా అంతే బావుంటుంది
నరనరాల్లో ప్రవహిస్తోంది రక్తం
హృదయాంతరాల్లో జనియిస్తుంది
ఆమె మాతృత్వం...
తల్లులైన మీ అందరికీ
ఎల్లలు లేని ప్రేమ ప్రతినిధులైన
అమ్మలందరికీ
అమ్మ అనే పిలిచే అదృష్టం అందించిన
మా అమ్మకు
అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు 💐💐🌹
✍️శ్రీశైనిక
15.
మాతృదేవోభవ
****************
ప్రాణాలను ఉగ్గబట్టి,
జన్మ నిచ్చే కన్నతల్లి...
ప్రాణంగా పొదివిపట్టి,
నిను పెంచును ఆతల్లి...
ఊసులాడు వయస్సులోనే,
మురిసిపోవు నా తల్లి...
తప్పటడుగులనుదిద్ది,
నడిపించెను నీ తల్లి...
ఆటలాడువయసులోన
నీకు గాయమైతే చాలు
తానేడ్చును ఆ తల్లి
ఊష్టమొచ్చి పడుకుంటే,
తల్లడిల్లే ఆ తల్లి...
గోరుముద్దలను పెట్టి,
గారం చేసె నాతల్లి...
చదువుకునే వయసులో
మంచి చెడులు చెబుతూనే,
ఎదుగుతున్న నిన్ను చూసి,
సంతసించే నా తల్లి...
వయసుమీద పడ్డ గాని,
బిడ్డ ఎప్పుడూ ముద్దాయె..
ఏ కష్టం తనకొచ్చిన.,
కనులారా నిన్ను చూసి,
స్థిమిత పడే ఆ తల్లి.....
తల్లి అంటే" కని"పించే
దైవమని తెలుసుకొని
ఆమెకిదే వందనం
పాదాభివందనం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
**************************
టేకుమళ్ళ విజయ లలిత
ఉపాధ్యాయిని
పూసపాటిరేగ
16.
సంరర్భం : అంతర్జాతీయ మాతృ దినోత్సవం
శీర్షిక :
"" మాతృదేవోభవ ""
సృష్టికర్త బ్రహ్మను
కన్నది ఓ అమ్మే
నీ కున్నదీ ఆ అమ్మే!
నవమాసాలూ. మోసి
రక్తమాంసలు పంచి
తాను పునర్జన్మ ను పొందుతూ
నీకు జన్మను ప్రసాదిస్తుంది అమ్మ!
చల్లని వెన్నెల్లో ఆడిస్తూ
చక్కని. కబుర్లు చెప్తూ
గోరుముద్దలు తినిపించేది అమ్మ!
కన్పించని దేవతల్ని పూజించే కన్నా
కని.... పెంచిన మాతృదేవతను
సేవించడమే మిన్న!
తల్లిగా
చెల్లిగా
ఇల్లాలిగా
దేవుని ప్రతిరూపంగా
ఇంటిల్లిపాదికి కల్పవల్లియై
భువిలో వెలసిన దేవతను
మాతృదేవోభవ అంటూ
మనసారా ప్రణమిల్లుదాం
కనుపాపవోలె కాపాడుకుందాం!
...........................................
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు.... జిల్లా
ఆంధ్రప్రదేశ్.... రాష్ట్రము
చరవాణి :7416638823
........................................
పై వచనకవిత నా స్వీయరచనే నని హామీ ఇస్తున్నాను.
17.
కవితాగానం సీజన్3
తేది08052022,ఆదివారం
అంశం:మాతృమూర్తికి వందనం.
(అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా).
మాతృమూర్తికి వందనం అభివందనం
జన్మనిచ్చిన జననికి వందనం
జగతిని పరిచయంచేసిన ప్రాణదాతకు వందనం
జీవితమంటేమిటో తెలిపిన జీవనజ్యోతికి వందనం
కన్నీటిని కనురెప్పలమాటున దాచుకున్న కన్నతల్లికి వందనం
గుండెలొ భడభాగ్నులను నింపుకున్న మాతృమూర్తికి వందనం
పలుకులలో మృధుత్వం
చూపులలో చల్లదనం
అమృతతుల్యం
దయార్ధ్రహృదయం
త్యాగశీలం
సహనశీలం
ఏన్నిజన్మలకైనా తీర్చుకోలేనిది తల్లిరుణం
ఎప్పటికి కొలిచే దైవానికి వందనం !
ఇది నాస్వీయరచన.
దోసపాటి వేంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా
చరవాణి7780594995.
18.
[08/05, 8:36 pm] Porla Venu Gopala Rao Poet: *కవితాగానం..సీజన్.3*
*అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా*
*ప్రత్యేక కవితల పోటీలు*
తేదీ: *08-05-2022-ఆదివారం*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *సరిలేరు నీకెవ్వరు*
ప్రక్రియ: *వచనకవిత*
*********************
*భగవంతుని మరో అవతారం.. అపర బ్రహ్మ..అమ్మ!*
*సకల చరాచర సృష్టికి మూలం.. ఆమే కదా! అమ్మే కదా!*
*తన కడుపులో నువు నలుసుగా పడ్డ దగ్గర నుండి*
*తొమ్మిది నెలలూ నువ్వే తనకు.. ఆశ..శ్వాస..ధ్యాస..అభిలాష..అన్నీ!*
*నీకోసమే తింటుంది..నిన్నే కలగంటుంది.. నిదురలోనూ.. మెలకువ లోనూ!*
*ఒక్కో నెలలో ఒక్కో మార్పు! తనకు తానే ఓదార్పు!*
*గర్భాలయంలో రూపు దిద్దుకుంటున్న అద్భుతమైన సజీవ శిల్పం.. ఇంకెవరు..నువ్వే!*
*ఆమె వేవిళ్ళు.. సందళ్ళు.. ఉరవళ్ళు..పరవళ్లు.. అన్నీ నీకోసమే!*
*అహోరాత్రాలూ తపించి పోతుంది.. ఎప్పుడు జన్మనిస్తానా.. ఎప్పుడు చూస్తానా..అని!*
*తన ఆశల ప్రతిరూపమైన నిన్ను భువి పైకి తేవడానికి*
*ఎంత ప్రసవ వేదన పడుతుందంటే.. చచ్చి బ్రతుకుతుంది.. ఔను.. పునర్జన్మే!*
*తన రుధిరధారలను.. నీకు క్షీరసాగరంగా మార్చి..*
*అమృత స్తన్యపానం చేయించే మాతృ దేవతకు నిజంగా జేజేలు!!*
*నువ్వు నవ్వితే తాను నవ్వుతుంది! నువ్వేడిస్తే.. తనకంట నీలాలు!!*
*తను కన్న కలలన్నీ నీ రూపంలో నిజం చేసుకుందామని*
*సర్వం సమర్పించిన త్యాగమయి కదా అమ్మంటే!!*
*నీ ఆట, పాట, ముద్దు, ముచ్చట, చదువు, సంధ్య.. ఇవే తనకు ఆస్తులు, సంపదలు*
*ఆమెకు లక్ష్యం, మార్గం, గమనం, గమ్యం ... అన్నీ నువ్వే!*
*తను కంటే మురిసిపోయి.. తనకంటూ ఏమీ లేకుండా..తనకంట్లో పెట్టుకుని*
*తనకంటే గొప్పవారైతే తనకంటితో చూసి మురిసిపోయేది కేవలం తల్లేరా!!*
*అటువంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?*
*గుండెల్లో గుడికట్టి..పూజించడం..ప్రేమించడం తప్ప!!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
18
08/05, 8:37 pm] కందూరి సుజాత Poetess: 🌷వందనం 🌷
............................
తెల్ల మెతుకు బతుకు బలము.
కన్నతల్లి బతుకు భాగ్యము.
తలదించి ముక్కుకోను తపోనిధీ.
తల ఎత్తి చెప్పుకోను సేవనిధీ.
అమ్మా వందనం అభివందనం .
గుడ్లు పెట్టిన గూడు వదలని పిచ్చుక సహితం ..
పొదిగి పిల్లలు పెంచు సాహసం .
పేగు బంధం బంధిఖానలో
కలలు అలలు చేయగా ...
పొద్దుమాపు సేదతీరమరిచి సేవచేయు సంరక్షణం .
తల్లిప్రేమకు వందనం.
నీడలేని తోవలోన
జాడ తెలియని బతుకై ఎతుకుతున్న తల్లులు ..
కరుగుతున్న అనాధి కొవ్వత్తులు.
దేవుడు విసిరిన మెరుగుల వెలుగుతున్న తల్లులు ..
ఆరని అభినవ దివ్యలు .
ధనం దాగిిన సంచి కన్నా మాతృత్వతీపి దాగిిన గర్భసంచి మిన్నగా ..
తరం సాలుకు సహకరించిన
తల్లి ప్రేమకు వందనం .
సహజ సంపద ఆరోగ్యమును ఒదిలీ పురిటినొప్పులకు సిద్ధమై ...
వంశ పుష్పమును వికసింప చేసిన
అనంతకోటి తల్లి ప్రాణినికి ...
వందనం అభివందనం.
కుదురు సుజాతా రాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్
9392162822🌷
20.
కవితా గానం సీజన్ 3
***********************
అంశం:- అమ్మ
""''''''""""'"''''"""''''''"""""""""""""""""""""'
కనిపించే దేవత అమ్మ
కనిపెంచే దేవత అమ్మ
మమతా మమకారం అమ్మ
అంతులేని అనురాగం అమ్మ
అనుబంధం ఆత్మీయత అమ్మ
బిడ్డల భాగ్యవిధాత అమ్మ
ధాతకు ప్రతి రూపం అమ్మ
ప్రేమకు శ్రీకారం అమ్మ
తన గర్భాలయంలో
అణువుగా అంకురించిన
పసికందును నవమాసాలు మోసి
ఉమ్మనీటి అమృత సరోవరంలో
బిడ్డకు పవిత్ర స్నానాలు పోసి
ప్రాణశక్తిని జీవశక్తిని
పాపల కందించే అమృత వర్షిణి అమ్మ
తన పిల్లల భవితను కోరి
బంగారు బాటలు వేసి
అహర్నిశలు తపనను పడుతూ
తీర్చిదిద్దే దేవత అమ్మ
అమ్మ ఉన్న ప్రతి ఇల్లు
ఆనందాలకు అది నెలవు
అమ్మ నోటి ప్రతి మాట
అదియే అమృతపు ఊట
ఆది గురువు అవతారం అమ్మ
ఆదిశక్తి ప్రతి రూపం అమ్మ
🖋️ వేదాంతం సురేశ్ బాబు
21.
[08/05, 9:16 pm] Ramulu adelli Poet: కవితా గానం
అంశం* మాతృదినోత్సవం
శీర్షిక*అమ్మకు వందనం 🙏
అమ్మకు మించిన కమ్మని పదమేదీ
అమ్మ ప్రేమనుపంచే బంధు గణమేదీ
అమ్మ ఒడి గుడి
ఆ గుడిలో నేనే చిన్న కన్నయ్యను
అమ్మ ఒడి బడి
ఆ బడిలో నేనే కథల బాలరాజును
ఎంతెత్తుకు ఎదిగినా
ఆ ఒడిలో చేరితే ఎంత మధురం
జోలాలి పాటతో నిదురపుచ్చే
ఆ కనులు చందమామ వెన్నెల్లు
పనులెన్ని ఉన్నా
కొంగు వీపున ఊయల కట్టి
అలసట లేకుండా ముచ్చట్ల పాలవెల్లి
అమ్మొక అపురూపం
అమ్మొక వరాలదీపం
అమ్మకు అక్షరాలు రాకున్నా
అలవోకగా చుక్కల్లో పిల్లల కోడిని
చూయించి
గోరుకొయ్యల కాలం కథల కల్పవల్లి
గడియారం చూడకుండానే
జాము జాములో పొద్దును కొలిచేది
అలారం లేకుండానే
కోడికూతకు ముందేలేచి
ఎడ్లకొట్టం పొల్లికట్టెతో స్వచ్చ భారత్
అమ్మొక పెద్దబాలశిక్ష
ఇంటిల్లిపాదికీ ఆరోగ్య రక్ష
నాన్న ఎవుసానికి మేడి అయ్యేది
శర్కర కుడుకల ప్రేమకు
కులం కార్డు అక్కరలేని ఆడబిడ్డ
తన జీవిత కాలం
మాకు వెన్నెల కిరణం
ఇంకా అమరత్వాన్ని ముద్దాడినా
మా కనుల కొలనులో పూచే కలువ
ఏడెల్లి రాములు ✍️
ది*08*05*2022(21*14)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
(మా అవ్వ (అమ్మ) యాదిలో
చిన్న యాది మనాదిగా)
22
[08/05, 9:18 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: అమ్మ ప్రపంచంలోనే
అపూర్వ ప్రేమికురాలు
ఆమె జీవితమంతా పిల్లల అభివృద్ధి ధ్యేయం అయిపోయింది
ఆమె అడుగడుగునా కంచం లోకి తెల్లని మెతుకులు అందించినటువంటి
అపూర్వ శక్తివంతురాలు
ఆమె ఆ గృహానికి నడిచే దీపం ఆమె వెలుగులే ఆ గృహమంతా వాకిలి ప్రసరించే కాంతికిరణాలు
ఆమె లేని గృహం బోసిపోయిన నిశ్శబ్దమైన పాడుబడిన గృహాన్ని
చూడలేము చూడలేము ఆగ్రహాన్ని ఆమె ఎక్కడున్నా పిల్లల కోసం ప్రేమ అనే టువంటి ప్రవాహాన్ని కురిపించేది
ఆమె ప్రవహించే ప్రేమ వర్షం
ఆమె ఒక జీవన దీపిక
ఆమె నిరంతరం పిల్లల ఆరోగ్య రక్షణ రేఖ
పిల్లల కోసం తను సర్వస్వం నిలిచిన టువంటి ప్రపంచ మాతృమూర్తి
ఆ మాతృమూర్తికి సదా వందనం ఆ మాతృమూర్తికి సదా ప్రేమపూర్వక జై జైలు
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453
23.
[*కవితా గానం సీజన్ 3*
తేదీ:08/05/2022
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: మాతృ మూర్తికి వందనం
( అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా)
*****************
పేగు బంధం ఎంత గొప్పదో కదా
ప్రేమ పేరుతో మోసం చేసినా
వివాహ బంధంతో ఎన్ని హింసలు పెట్టినా
కడుపులో పడిన నలుసు కోసం
కష్టాల కడలి ఈదడానికి సిద్ధపడుతుంది అమ్మతనం
వేవిళ్ళతో ఉక్కిరిబిక్కిరైనా
లోపలి బిడ్డ కోసం హితవు చేసుకుని భరిస్తుంది..
పసిగుడ్డుకు జన్మనివ్వడం కోసం
ప్రాణాలను పణంగా పెట్టడం
అమ్మకు మాత్రమే సాధ్యం...
పొట్ట లోని శిశువు పొత్తిళ్ళలో లోకి చేరే వేళ
ఆమె పడే ప్రసవ వేదన
కాన్పుల గది గోడలకూ
డాక్టర్లు నర్సమ్మలకూ తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో...
అయిష్టాలను ఇష్టంగా మార్చుకొని
పాలధారల కోసం పత్యాన్ని
తపస్సుగా యోగిని అమ్మ
అశుద్ధాల నడుమ మురికైన పసితనాన్ని
ఆనందంగా శుద్ధిచేసి గుండెలకు హత్తుకునే మమకారం
ఓర్మికి మారురూపం అమ్మ!
కొంచెం నలతగా ఉన్నా
కన్నపేగు క్షేమం కోసం
కోటొక్క దేవుళ్ళకు ముడుపులు కట్టి
కటిక ఉపవాస వ్రతాలు చేసేది ఈ జగతిలో ఒక్క అమ్మ మాత్రమే..
బిడ్డ భవిష్యత్తు కోసం
అహర్నిశలు ఆరాటపడే అమ్మతనాన్ని
సమస్యలతో పోరాడే ధీరగుణాన్నీ
కట్టె కాలే వరకూ కడుపు తీపి ప్రేమ పాశాన్ని
రాత రాసిన విధాత గానీ
యమదూత గానీ ఎవరూ
విడదీయలేని కన్న ప్రేమ కన్నా స్వర్గం ఉందా ఇలలో..
అలాంటి అమ్మతనానికి శిరసా వందనం.
పాదాభివందనం..
వురిమళ్ల సునంద ఖమ్మం
24.
కవితా గానం(సీజన్3). 8--5--2022.
పిన్నక నాగేశ్వరరావు.
శీర్షిక :-- మాతృమూర్తికి వందనం.
1. తే.గీ.
మోసి నవ మాసముల్ నిన్ను ముదముతోడ
జన్మ నిచ్చును తా పునర్జన్మ నొంది
మొదటి యేడుపు వినినంత మురిసిపోయి
యెదకు హత్తుకొనును తల్లి యెలమితోడ.
2. తే.గీ.
మంచితనమును నేర్పుచు పెంచు తల్లి
బాల్య, కౌమార దశలందు వర్తనమ్ము
నొక్క కంటను కనుచు తా నుత్తమముగ
తీర్చి దిద్దును సంతును తీరుగాను.
3. తే.గీ.
పతిని యెడబాయకుండగ సతిగ నన్ని
చర్యలందున దాసిగా సహకరించి
మంచి సలహాల నిచ్చుచు మంత్రి వోలె
శయ్యమందున రంభగా సౌఖ్యమిడుచు
నోర్పు,సహనమున మెలంగు నుర్వి తల్లి.
4.తే.గీ.
దైవమంతట నుండెడు దారిలేక
తల్లినే సృష్టి చేసెను దైవము వలె
కంటి పాపగ కాపాడు కన్నతల్లి
మాతృమూర్తికి వందన మాచరింతు.
**************************************
.
Comments
Post a Comment