Skip to main content

భాద్రపద మాసం పౌర్ణమి

 నిర్వహణ

వీరా గుడిపల్లి

సమన్వయం

శివునూరి లలితాకృష్ణ

సహకారం

మెరుగు మధు

అవధాని

ఐతగోని వెంకటేశ్వర్లు

న్యాయ నిర్ణేత

దేవినేని అరవింద రాయుడు

*********************************

కవివరుల జాబితా

*భాద్రపదమాసం పౌర్ణమి పురస్కారాలపోటీకి*

 అందిన కవితలు 


*గూగుల్ ఫామ్ లో 28*

*సమూహంలో       14*

*మొత్తం 42 కాగా*


అందులో గూగుల్ ఫామ్ లో 

*ఎనిమిది  (8)కవితలు* *అంశానికి సంబంధం లేనివి,*

*అయిదు (5)*

*కవితలు మళ్ళీ మళ్ళీ*  *పోస్ట్* *చేయబడ్డాయి.* 


వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. 



 29 కవితలు 

మాత్రమే లెక్కలోకి తీసుకోవడం జరిగింది. 


సభ్యులు గమనించగలరు. 




*అంశానికి వచ్చిన* *కవితలు..* 

*శీర్షికతో....* 


1.విజయభారతిగారు 

సత్యమేవజయతే 


2.కోరాడ నరసింహరావు గారు 

శాశ్వత ఖ్యాతి 


3.శ్రీహరి ఏలే గారు 

సత్యమేవజయతే 


4.స్వర్ణసమత గారు 

సత్యమేవ జయతే 


5.నారాయణ భాగ్యలక్ష్మి గారు 

సత్యం నిత్యం రక్షితం


6.అపరాజిత్ గారు 

సత్యమేవజయతే 


7.ఇంద్రవత్ రాహుల్ గారు 

అహింసనే ఆయుధం 


8.వల్లాలవిజయలక్ష్మి గారు 

సత్యమేవజయతే 


9.పూర్ణకృష్ణ గారు 

సత్యమేవజయతే 


10.నీలారంగనాథం గారు 

సత్యమేవ జయతే 

పద్యాలు 


11.వురిమళ్ళ సునంద గారు 

అత్యున్నత విలువలరూపం 


12.ధనాశి ఉషారాణి గారు 

సత్యమేవ జయతే 


13.కాసుల ఆంజనేయులు గారు 

సత్యమేవ జయతే 


14.రవికుమార్ కంచి గారు 

సత్యం 



15.డాక్టర్. రామకకృష్ణమూర్తి గారు 

సత్యమే సాధనం 


16.దీపక్ న్యాతి గారు 

అక్షరాలనగ్నసత్యం 


17.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 

సత్యమేవజయతే 


18.కందూరి సుజాతా రాణి గారు 

తరతరాల సూక్తి 


19.రాజశేఖరుని శివలక్ష్మి గారు 

సత్యాన్వేషితనై 


20.అయిత అనిత గారు 

సత్యంవద ధర్మంచర


21.డాక్టర్. బల్లూరి ఉమాదేవి గారు 

సత్యమేవజయతే పద్యాలు 


22.రమాదేవి కులకర్ణిగారు 


పెట్టనిగోడ


23.చివుకుల శ్రీలక్ష్మి గారు 

సత్యమేజయించు 


24.గుమ్మన్నగారి బాలసరస్వతి గారు 

సూర్యబింబమే.. 


25.మర్రిజయశ్రీ గారు 

రాజముద్ర 


26.సంధ్యాశర్మ గారు 

సత్యవాక్కు 


27.రాపోలు అరుణాస్వామి గారు స

సత్యమేవజయతే


28..ముడుంబతిరువేంకటాచార్యులు గారు 


సత్యమేదైవం 


29.డాక్టర్. మహమ్మద్ షరీఫ్ గారు 

కాంతికిరణం

పద్యాలు

*********************

[15/09, 8:51 AM] Lalita Sister: *పౌర్ణమి కవితల పోటి*

*సమీక్షలు*

*సమీక్షకుడు* - *అరవిందరాయుడు దేవినేని*


(1)


★★★★★★★★


కొలచన విజయ భారతి 

కవితా గానం

పౌర్ణమి కవితల పౌటీ

పేరు:  కొలచన విజయ భారతి

ఊరు:హైదరాబాద్

తేదీ:2-9-2020


అంశం: సత్యమేవ జయతే

***********************

సత్యమేవ జయతే

మన భారత జాతీయ నినాదం

నాటి. ఎందరెందరో మునులు ఋషులు ఆచరించి చూపించిన నీతి సూత్రాలు

 

"సత్యం వద..ధర్మం చర"

సత్యం పలుకు..

ధర్మాన్ని ఆచరించు..

అనే సత్యవాక్యాల్ని

నేటి సమాజ పోకడలు

సత్యం వధ ..ధర్మం చెఱగా

ఆకృతి మార్చుకుని

అర్థం చెప్పుకుని

సత్యానికి సంకెళ్లు వేసి

ధర్మాన్ని చెఱలో బందీని చేసి

రాజ్యమేలుతున్నాయి

అరాచకాలు సృష్టిస్తున్నాయి


సత్యాన్ని కాపాడిన నాడు

సత్యవ్రతుడవై నిలిచిన నాడు

నీవు దేనికీ తలవంచనక్కరలేదు

తప్పించుకు తిరగనక్కరలేదు


సత్యధర్మమే నిను నిలబెడుతుంది

సత్యమే జయిస్తుంది

సత్యమార్గమే గెలుపు తీరానికి

నిను చేరుస్తుంది

       🌹👍👍👍🌹


💐💐💐💐💐💐💐💐💐


1


కొలుచన విజయభారతిగారూ.... పలుకు ఆచరించు అనే అర్థాలు గల సంస్కృత పదాలు వద చర లను వధ చెఱ అనే వ్యంగ్యార్థం ద్యోతకమయ్యేలా అభివ్యక్తీకరించిన విధం బాగుంది సమాజపు తీరుతెన్నులను అద్దం పట్టిన ఈ రెండు వాక్యాలుచాలు మీ కవితబలాన్ని తెలుపుతోంది నిజమే విజయభారతిగారూ సత్యమేజయిస్తుంది అభినందనలు మీకు


★★★★★★★★★

[


కవితాగానం

పౌర్ణమినగదుబహుమతుల పోటీ....!

అంశం:-  సత్యమేవ జయతే..!  కోరాడ

నరసింహా రావు ;

  * శాశ్వతఖ్యాతి *

     ***********

అసత్యం ధైర్యం గా

తలెత్తుకు నిలబడ గలదా...మేక పోతు

గాంభీర్యం తప్ప..!

కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగాచూడగలదా

పాపానికి అనుమాన మూ  భయమూ ...

ఎక్కువేగా....!

అసత్యంగెలిచింది... అంటేకుట్ర,కుతంత్రాలతోనో ...పశుబలాన్ని  ప్రదర్శించో ...!

అది తాత్కాలికమే..,

అంతిమవిజయం ఎ ప్పుడూ...సత్యానిదే గా...!

అసత్యంకుయుక్తులతో ఎన్నాళ్ళు పెత్తనం చలాయించినా...ఓటమిని చవి చూడ వల సిందే...!

చరిత్రలోఎన్నిసాక్ష్యాలు...!

ఎన్నెన్నికష్టాలుపడినా ...హరిశ్చంద్రుడునలుడుఅంతిమవిజయులై...సత్కీర్తితో చ రిత్రలోనిలిచిపోలేదూ

అంతవరకూఎందుకు

నిన్నమొన్నటి గాంధీ

తాను నమ్మిన సత్యా హింసల కోసం...తన ప్రాణాలను సైతం త్య జించలేదూ.....!!

అ సత్యానిది  కేవల పశుబలం!సత్యానిది 

సత్వదైవీగుణం...!!

సరదాకైనా...అసత్యంహానికరమే...అయ్యా పులివచ్చే...  కథాఫలితమే  !

సత్యమే...నిత్యమూశాశ్వతమైన దివ్య వ్రతం...!

సత్యనిష్ఠనుతూచగలయజ్ఞ,తప,జప,హోమాదులేవీ లేవు !

సత్య ముతో ఏది పోటీపడినా ...గెలుపుసత్యానిదే...!

సత్యమేవజయతే..!

తత్సత్.....!!

*****************

........కోరాడ.


◆◆◆◆◆◆◆◆◆◆◆◆

2


కోరాడ నరసింహారావు గారూ..


అసత్యానిది మేకపోతుగాంభీర్యం..పదునైన అభివ్యక్తి సర్...కళ్ళలో కళ్ళుపెట్టిచూడలేని పాపానికీ అనుమానమూ భయమూ ఎక్కువే...గతపు మీ కవితలు చదివాను సర్...మీ కలం రానురానూ పదునెక్కుతోంది...మీరన్నది అక్షర సత్యం సత్యానిది సత్వదైవీగుణం...అభినందనలు


■■■■■■■■◆

[15/09, 8:52 AM] Lalita Sister: (3)


కవితా గానం 

పౌర్ణమి కవితల పోటీ 

పేరు : శ్రీహరి. ఏలె 

ఊరు : నల్లగొండ 

తేది : 02/09/2020

అంశం : సత్యమేవ జయతే 


భారతీయ ఆత్మలో ఇమిడిన

ఉపనిషత్ ఉషస్సుల ఉపదేశము 


తాత్విక జీవన గమనానికి 

ప్రాచీన ఆధ్యాత్మిక ఆణిముత్యం 


వేద వాఙ్మయం ప్రపంచానికి 

అందించిన నవ నినాదం 


గాంధీజీ స్వయంగా ఆచరించి 

చూపిన మానవీయ నైతిక సోపానం 


సర్వ కాల సర్వావస్తలో సమాజపు 

సుమధుర పరిమళ సుభాషిణి 


చెడుపై మంచి సాధించిన విజయం చేసే రణ నినాదం 


మానవీయ అనుబంధాల సేతువును 

బలోపేతం చేసే అనురాగపు  హేతువు 


పురాణ ఇతిహాస కాలపు కథల ద్వారా 

సత్య విలువలను చాటే దీపదారి 


సత్యం శివం సుందరంలో 

చాటిన మన జాతి ఔన్నత్య కేతనం !


అనుబంధాల పునాదుల బంధువు

"సత్యమేవ జయతే "!!


హామీ పత్రము : ఈ నా కవిత స్వయం లిఖితం అని హామీ ఇస్తున్నాను. 


శ్రీహరి. ఏలె 

నల్లగొండ.


●●●●●●●●●


3


ఏలె శ్రీహరి గారూ...


పురాణ ఇతిహాసపు కథలద్వారా సత్యవిలువలను చాటే దీపదారి..నిజం సర్ భారతీయ సాంప్రదాయపుగమనాన్ని మీదైన శైలిలో అద్దంపట్టారు..నిజమే సర్ గాంధీమహాత్ముని చేతిలో పోతపోసుకున్న నైతికసోపానం సర్వకాల సర్వావస్థలలో సమాజపు సుమధుర పరిమళ సుభాషితాలలో సత్యం శివం సుందరపు ఔన్నత్యం దిక్కుదిక్కులకూ వ్యాపిస్తూనే ఉంటుంది


■■■■■■■■■

[


*సత్యమేవ జయతే*


సత్యం ఎప్పటికీ సత్యమే

పూర్వం దుష్యంతుని 

సత్య వాక్యము తో

జయించిన శకుంతల

భరతుడు,

సత్యము నిత్యము

సత్యానికి తోడు అవసరం ఉండదు,

సత్యానికి దైవమే తోడు

సకల చరాచర జగత్తు తోడు

మనల్ని ఎంత పెద్ద సమస్య నుండి అయిన కాపాడేది

సత్యమే,

అనునిత్యం నీతో ఉంటుంది

నిన్ను విజయు న్నీ చేస్తుంది

*సత్య మేవ జయతే*

*పరమ పావన మైనధి,

పవిత్ర మైన ది,శక్తి కలది

మహనీయులను చేసేది

మహాత్ములు గా మార్చేది

సత్యమే,

శాశ్వత మైన ది,అద్భుత మైనదీ,

ఆనంద నందన వనము

ఆమని గీతము,

ఆహా ల్లాధ భరితము

సత్యమే.


*స్వర్ణ సమత*

*నిజామాబాద్*


◆◆◆◆◆◆◆◆

4

స్వర్ణసమత గారూ...సత్యం ఎప్పటికీ సత్యమే...సత్యానికి తోడు అవసరం లేదు నిజమే సమతగారూ భగవంతుడు నివాసం ఉండే సత్యం అక్షయమే..అభినందనలు


★★★★★★★

[


కవితా గానం

పౌర్ణమి కవితల పోటీకి

నారాయణ భాగ్యలక్ష్మి

అంశం:సత్యమేవ జయతే

కవితా శీర్షిక:


సత్యం నిత్యం రక్షితం

******************

సత్యమేవ జయతే 

జాతీయ నినాదం


సత్యమే సర్వత్ర విజయతే 

నా జీవన నాదం


ఈ సకల చరాచర జగత్తుకి 

ఈ సత్య ధర్మాలే రథచక్రాలు


సత్య సౌగంధిక సుగంధ సౌరభాలు 

పిడికిట మూసినా ఆగని పరిమళమల్లె


అడుగడుగునా అవరోధాలున్నా 

నిజాయితీ నిర్భయ శాంతి పదం 

ఈ సమ్మోహాన క్రాంతి పథం


అజ్ఞానం ఉదయించే ఉషస్సును 

అరచేయి అడ్డుపెట్టి ఆపలేనట్లే 


అసత్యం అట్టహాసంగా ఆవలించినా

ఆ నిలకడ లేని ఉనికి తాత్కాలికం


మబ్బులు ఆలస్యంగా విడినా 

సత్యం అను నిత్యం శాశ్వతం 


ఏ ఆధారాలు లేని నీలాకాశంలో 

పగలు రేయి వెలుగుచ్చే 

రవిచంద్రులకాధారం ఈ సత్యం


సనాతన ధర్మ సహృభావన

అహింస పరమ పవిత్ర జీవిత 

సర్వమతాల సారం ఒక్కటేనట్లు 


భగవద్గీత బైబిల్ ఖురాన్ మొదలగు  సర్వశాస్త్రల ప్రబోధ ఆశయసారం ఒకటే


అదే 

అహింసా పరమో ధర్మః సూక్తిని ఆచరిస్తు 

సత్యమేవ జయతే బాటను అనుసరిస్తూ మన ముందు తరాలను ఆచరింప చేయడమే


సత్యమేవ జయతే అను పదం మానవజాతికి రక్షణ కవచమని 

అది 

నిత్యం పుడమిన నడయాడే నిత్య నూతన 

తేజో కాంతిపుంజం సత్యమేవ జయతేని భావితరాలకు తెలపడం మన కనీస ధర్మం.


◆◆◆◆◆◆◆◆

5

నారాయణ భాగ్యలక్ష్మి గారూ... 


చరాచర జగత్తుకు సత్యధర్మాలే రథచక్రాలు..మానవజాతి రక్షణకవచం సత్యమనడం బాగుంది.. సత్యమేవ జయతే అన్న మండూకోవనిషత్తు సూక్తిని సృష్టికి ఆధారభూతమనడం బాగుంది అభినందనలు


■■■■■■■■■

[15/09, 8:53 AM] Lalita Sister: ( 6)


సత్యమేవజయతే !


భారతావని జన జీవన హృదయ 

కుహరపు ప్రతిధ్వనుల్లో 

సత్యమెపుడు నిలబడియుంటుంది !

మహాత్మా గాంధీ సత్యమార్గమునే 

తన భారత స్వాతంత్ర్య కాంక్ష నెరవేర్చాడు !

కళింగయుద్ధం అశోకుని హృదయం కలుక్కుమంది 

బుద్ధుని ప్రవచనాలతో గుండెల నిండుగా 

సత్య మార్గముతో శాంతియుతంగా భారతావనినేలాడు !

దుష్ట దుర్మార్గ ఆలోచనలను ఖండ ఖండాలు చేసే 

భగవత్ గీతా బోధనలు అనే సత్య వాక్కులు జగద్విదితం !

వినోబాబావే భూదాన ఉద్యమం 

సత్యవంతమైన పంధానే అనుసరించాడు !

సత్యమేవజయతే అంటూ 

హిందూ, ముస్లిం, క్రైస్తవ మతగ్రంధాలు భోదిస్తున్నాయ్ !

ఏ దేవుడైన ఏ సిద్ధాంతమైనా అది పార్టీ అయినా సంఘమైన 

వాటి మూలసిద్ధాంతం సత్యం !

జీవితంలో అగ్నిగుండాలు పెను తుఫానులు వేసవి తాపాలు ఎదురైనా 

విరిగినలగనిదే తీయని చెరుకు రసం రాదు !

గుండెలు కొలిమిలా మండితేనే 

సత్యం విలువ తెలిసి వస్తుంది !

చివరన సత్యం గెలిచి జీవితం అమృతతుల్యమవుతుంది !!

నీతి నియమాలు లేని జీవితం వ్యర్థం 

అశాంతి అలజడులకు నిలయం భయంకరం !!

సత్యమార్గమునే విజయదుందుబి మ్రోగించు 

నీ అంతరాత్మకు ఎనలేని సంతృప్తినిస్తుంది !

సత్యమేవజయతే !!


అపరాజిత్


◆◆◆◆◆◆◆◆

6

అపరాజిత్ గారూ....


మహనీయులు బోధించిన  సత్యధర్మాలే  మానవజాతికి దిక్కన్నభావనను కవితాక్షరబద్ధంచేశారు...కష్టించనిదే ఫలితరాదన్నట్టు ఫలితానికి రుచిరాదన్నట్టు సంఘర్షణ సత్యానికి సహజమన్న సందేశాన్ని మీ కవితలో ప్రతిధ్వనింపజేశారు


●●●●●●●

[15/09, 8:53 AM] Lalita Sister: *( 7 )*


*విద్యార్థి పేరు* : ఇంద్రావత్ రాహుల్ 

*ఊరు* : కొత్తపేట్ 

*జిల్లా* : ఇందూర్ /నిజామాబాద్ 

*మండలం* : ఇందూర్ /నిజామాబాద్ 

*చరవాణి* : 9848054079

*కవిత అంశం* : సత్యమేవ జయతే 

*శీర్షిక* : అహింసనే ఆయుధం 


  

       

   🇮🇳 *అహింసనే ఆయుధం* 🇮🇳

         


అహింసాయుధంతో‍ భారతావని

బానిస సంకెళ్ళను తొలగించిన

శాంతి దూత

సత్యమేవ జయతే నినాదాన్ని

సర్వజగత్తుకు చాటిచెప్పిన నేత

శ్రమ విలువను పెంచుతూ స్వదేశీ

వస్త్రాలను రూపొందించిన జాతిపిత

సహనానికి హద్దులు లేవని సాధించు లేదా మరణించు 

అనే సందేశంతో 

జనజగృత పరిచిన స్ఫూర్తి ప్రదాత

అసలు సత్యం అంటే ఏమిటి?

సత్యంకు ఎందుకు ఈ ఘనత?

సత్య జ్ఞానము అంటే అంతా బ్రహ్మ..

సత్యమేవ జయతే అని...

సత్యమే సాధనకు ఆలంబనం అని.. 

సత్యమే  సద్గుణము...

సత్యమే పరమాత్మ...

నిజాయితీ నాయకులు గాంధీ తాత

జనాహితమే పరమావధిగా 

జాతి ఐక్యతకై

దేశమంతా నడిచిన దైవదూత

మాతృ భూమి సంరక్షణ కొరకు

మహిలో అమరత్వాన్ని

 పొందిన మహాత్మాగాంధీ

మతం కంటే మానవత్వమే ప్రధానమని

సర్వ మతాల సారాంశం ఒక్కటేనని తనువును బలిదనమిచ్చిన త్యాగ దాత

పల్లె పరిమళం లోనె దేశ సంస్కృతి కొలువైందని ప్రపంచానికి చాటి చెప్పి 

గ్రామ స్వరాజ్యనికి పునాదులువేసిన 

నవ భారత జాతి నిర్మాత.. 


*హామీపత్రం*: ఈ కవిత నేను స్వయంగా రాసాను... అని హామీ ఇస్తున్నాను.. 


           ధన్యవాదములు... 🙏🌹


●●●●●●●●

7

ఇంద్రావత్ రాహుల్ గారూ....వాస్తవాన్ని కవిత్వీకరించారు...లక్ష్యసాధనకు సత్యమే ఆలంబనమన్న మీ అభిప్రాయం బాగుంది...సత్యపరిమళాల గరిమతో దైవత్వం సిద్ధించుకున్న మహాత్ముని రీతి మీ కవిత్వంలో అభివ్యక్తీకరించారు..అభినందనలు


■■■■■■■◆■



విజయ లక్ష్మి యాదాద్రి: To

కవితాగానం పౌర్ణమి పోటీలు


*సత్యమేవ జయతే* 

******************


*సత్యమే చరాచర ఆధారం*

*సత్యభావనం పరమపావనం*

*సత్యజీవనమే పరమోత్క్రుష్టం*

**సత్యమే కావాలి మన నిత్యనేస్తం.*


*సత్యసంధతతో కొన్ని చిక్కులొచ్చినా*

*సత్యవచనం నిష్ఠూరాన్ని తెచ్చినా*

**సత్యవాక్య సుపరిపాలనమే*

*సహృదయుల అనుసరణీయం*


*అబద్ధాలు అందమైన అద్దాలమేడలు*

*అవనిపై ఎల్లకాలం నిలువజాలవు*

*అసత్యప్రచారాలు వ్యక్తిత్వబింబంపై దుమ్ము*

*దాన్ని దులుపగ కావాలి సత్ప్రవర్తనా దమ్ము*


*అబద్ధాలాడగ భయపడే సత్యవంతులు*

*అవనిని గెలిపిస్తున్న శక్తివంతులు*

*అబద్ధాలాడగ సిగ్గుపడని మూఢులు*

*అవనిపంటకు పట్టిన పిచ్చిచీడలు*


 *కరోనా కాలాన చేతులనే కాదు* 

*మనసు వాక్కు భావనలకు పట్టిన*

*అసత్యవైరస్ ను వదిలించుకుందాం*

*సత్యమేవ జయతే'ని మనస్ఫూర్తిగ నమ్ముదాం*


*సత్యమేవ జయతే" కాదు కేవలం వాక్యం*

*కాకూడదు ఆ సూక్తి అలంకారప్రాయం*

*మన గౌరవాన్ని పెంచే జాతీయవాక్యం*

*మన జీవితాల నడిపే కనపడని హస్తం*


హమీపత్రం; ఇది నా సొంత రచన,,కవితాగానం కోసమే రాసినది అని మీకు హామీ ఇస్తున్నాను


:వల్లాల *విజయలక్ష్మి*

*ఆలేరు*


★★★★★★★★★

8

వల్లాల విజయలక్ష్మిగారూ...అబద్ధాలను అందమైన అద్దాలమేడలతో పోల్చడం బాగుంది అసత్యవైరస్ ను త్రికరణాలనుండి వదిలింద్దామంటూ మీరిచ్చిన పరిష్కారం బాగుంది...సత్యమేవ జయతే సూక్తి కేవలం వాక్యమో అలంకారమో కాకూడదన్న మీ అభివ్యక్తి బాగుంది అభినందనలు


■■■■■■■■■◆



 *సత్యమేవ జయతే* 

🦜🦜🦜🦜🦜🦜🦜🦜

తరాలు మారినా 

అంతరంగాలు చెదరినా 

గమన శీలత సంవర్ధనమునకు ముల్లోకాలలో 

శిఖరాయమానము నిలిపేది నిత్యనూతనం సత్య సనాతనంగా

 నరుని నారాయణ గా మార్చేది చూసే చూపులు 

పలికే పలుకులు

 వేసే అడుగులు త్రికరణశుద్ధిగా సమాజ హితైషత్వానికి

సమున్నత జీవిత వైభవానికి ఉపనిషత్తుల సారం 

హరిశ్చంద్రుని ఆయుధం బాపూజీని దీక్షాదక్షుడుని చేసినది పసిప్రాయంలో అందించాల్సిన అమృతం 

అభీష్టాలను నెరవేర్చుకునే తారకమంత్రం 

అధికారిక చిహ్నం లోని ధర్మసూత్రం 

*సత్యమేవ జయతే* *ఆచరిస్తే పురోగతి* 

*ఆదమరిస్తే భవిత చరిత అధోగతి*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

డా.పూర్ణకృష్ణ


◆◆◆◆◆◆◆◆

9

డా౹౹పూర్ణకృష్ణ గారూ....


నిజమే సత్యము హరిశ్చంద్రుని చేత ఆయుధమై భాసించింది 

గాంధీని మహాత్మునిగా వర్థిల్లజేసింది సమున్నత జీవనవైభవానికి ఆధారభూతంకాదగనది సత్యమే!ఆచరిస్తే పురోగతీ అదమరిస్తే అధోగతి ...అంటూ సమాజానికి సున్నితమైన హెచ్చరికను మీ కవితలో అందజేశారు అభినందనలు


★★★★★★★★



శ్రీ శార్వరీ నామ సంవత్సరం భాద్రపద మాసం పౌర్ణమి నగదు బహుమతుల పోటీ

*అంశం: సత్యమేవ జయతే*

         (పద్య కవిత్వం)

ఆ.వె1:సత్యమిచ్చు జయము శాశ్వత మనియెంచి

గాంధి నడచి నాడు గారవముగ

జనులు తోడు రాగ జగమంత కలిసేను

భారతమ్మ స్వేచ్ఛ భవ్యమాయె!


ఆ.వె2: సత్య వచన చేసి సత్యవంతుడనుచు

పేరు నొందినాడు ధారుణందు

విశ్వ మిత్రుని చేత విశ్వ వ్యాపన చేసి

జయము నొందినాడు జగతి మెచ్చ!


ఆ.వె3:సత్య వచన కష్ట సాధ్య తరమెయైన

మాట తప్ప లేదు మహిన రేడు

కాయ మందు మాంస ఖండంబు కోసిచ్చి

జయము నొందె శిబియు జగతిలోన!


ఆ.వె4:పారతంత్ర్యములను పారద్రోలగచేసె

సత్య మార్గమిలను సాధ్య పరచె

భారతమ్మ కీర్తి బావుటా నెగరేసి

ఖ్యాతి నొంది నాడు గాంధి నిజము!


పేరు: కె.ఇ.నిలమంగై

కలం పేరు: నీలా రంగనాధం

ఊరు: నాదర్గుల్,హైదరాబాదు.

చరవాణి సంఖ్య:8897155600.

*ఈ కవిత నా స్వీయ రచన,ఈ సమూహం కొరకు రాసినదేనని హామీ ఇస్తున్నాను.*


■■■■■■■■■

10

కె.ఇ.నిలమంగై గారూ.....


చాలా బాగా చెప్పారు సత్యమిచ్చు జయమే శాశ్వతమని గాంధీనమ్మిన విధాన్ని....తన సత్యాన్ని లోకంచేత ఆదరింపజేస్తూ దేశాన్ని కష్టాలనుండి తప్పించిన వైనాన్ని కవిత్వంచేశారు..ఆడితప్పకపోవడమే కాదు బలహీనుని పక్షాన నిలవడమూ సత్యమేనన్న సిద్ధాంతాన్ని మీ మూడోపద్యంలో ప్రతిపాదించారు...లోకవిదితమైన మాటనే

విలక్షణంగా కవితాత్మకంగా ఛందోబద్ధంగా ఆవిష్కరించారు అభినందనలు

[

సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*

పౌర్ణమి నగదు బహుమతుల పోటీ....!

అంశం:- సత్యమేవ జయతే

పేరు:వురిమళ్ల సునంద,ఖమ్మం

శీర్షిక:అత్యున్నత విలువల రూపం

*******************

అత్యున్నత విలువల రూపంతో

అవని యందు వెలుగొందే సత్యం 

ఎప్పుడూ స్వయం ప్రకాశమే!


మానవ జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించే సత్యం

కాలాలకు అతీతంగా ఎన్నటికీ వాడని  హృదయ సంస్కార పుష్పమే!


తరాలు యుగాలు గడిచినా 

అంతరంగాలు కొత్త దనాన్ని ఆహ్వానించినా

అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మారనీ ధర్మ దేవత రూపమే సత్యం!


మహాత్ముని సత్య శోధన వైపు నడిపించిన దైవ గుణం

అలనాటి హరిశ్చంద్రుడి సత్య నిష్ఠనే!


కష్టాలు నష్టాలు సునామీలా ఎన్ని చుట్టు ముట్టినా

చివరికి జయించేది సత్యమే!


ఆడిన మాట తప్పని బలి చక్రవర్తి

ఇచ్చిన మాటకు కట్టుబడిన శిబి మహా రాజు

సత్యమే జయిస్తుందని నమ్మిన ధర్మరాజు లాంటి వారెందరో..


సత్య జయ కేతనాన్ని ఎగరేసిన

పురాణేతిహాసాల పుణ్య మూర్తులు!


సత్యం ఓ ఆత్మ గౌరవ జ్వాల రూపం!

సత్యం ఓ మానవతా దృక్పథం!

సత్యం  ఓ తారక మంత్రం!

సత్యం ఓ మానవీయ జీవన విధానం!


సత్యమై సత్యంగా జీవిద్దాం

సత్యమేవ జయతే అని నిరూపిద్దాం!


 *హామీ పత్రం* 

 ఈ కవిత నా స్వీయ రచన ఎక్కడా ప్రచురింపబడలేదు దేనికి అనువాదం అనుకరణ కాదు

 *వురిమళ్ల సునంద ఖమ్మం*


★★★★★★★★★

11


వురిమళ్ళ సునందగారూ


పురాణపురుషుల సత్యనిష్టను ఉదహరిస్తూనే సత్యం స్వయంప్రకాశక మనడం బాగుంది...నిజమే సత్యమే తారకమంత్రం..తప్పక అనుసరించవలసిన మానవీయజీవన విధానం అభినందనలు మీకు


[

కవితా గానము

పౌర్ణమి పోటీలు

అంశం.సత్యమే వజయితే

పేరు. ధనాశి ఉషారాణి

.......

విప్లవము ఆకాశాన్ని తాకి

అహింసా మార్గములో జనులు నడిచిన వేళ

హింసను నిలువునా విడిచి శాంతి బాటలో నడచాలని 

హితవు పిలికిన బోసినవ్వుల

బాపూ బాటకు సలామ్


స్వేచ్ఛ స్వాతంత్ర్యపు పరిమళా లు వీచి

భారత జాతికి వెలుగును పంచిన సత్యపు మార్గములో

అన్యాయం అన్ని వేళలా నిలిపి గెలిచినావు బాపూ


శాంతి నీతిని నమ్మిన ఎవ్వరూ

ఓడిపోరు భువిలో నిజము అని చాటి

తెల్లని స్వచ్ఛమైన మనసు కలిగిన ప్రతి మనిషిని

మానవసేవ చేసి భగవంతున్ని కృపకు పాత్రులు అగుదురు అనుచూనే

విప్లవకారుల అసహనంలో నలిగినా 

స్వరాజ్య సాధనలో సాగినావు ఓ వీరుడా సాధన బ్లాముతోను


జాతి ఐక్యతకు పాటు పడిన నేతగా

అన్నీ మతాలు సారాంశము ఒక్కటే అని చాటి

సర్వమతాలు సారాంశము ఒక్కటే అనుచూ

మానవులను ఓ దారిలో నడిపినావు భువిలోన


బానిస సంకెళ్లను తొలిగించిన నిజమైన శాంతిదూత

బుద్దిని ప్రవచనాలలో సారాంశంను బతుకు బాటలో

ఆచరించి సాగాడు అహింస బాటలోన

భారత జాతికి వెలుగును నింపి

నిలువెత్తు అండగా నిలిచిన

భారతీయుల ఆశల కెరటమా

భావి తరానికి నీవు ఇచ్చిన విలువు ఐన నినాదం 

సత్యమే వజయితే

యువతరానికి ఇచ్చిన శాంతి నినాదము

అందుకో వయ్యా మా జోహార్లు


హామీ పత్రము.ఇది నా స్వంతము అని హామీ ఇస్తున్నాను


ధనాశి ఉషారాణి

 చిత్తూరు జిల్లా


●●●●●●●●


12


ఉషారాణి గారూ....అహింస మూర్తీభవించిన మహాత్మాగాంధీని ఉదహరిస్తూ నీతిని నమ్మినవారికి అసాధ్యమనేది ఉండదనడం బాగుంది...సత్యమార్గాన నడిచిన మహనీయుడైన గాంధీజీని కేంద్రబిందువును చేస్తూ కవితను నడిపించారు అభినందనలు


■■■■■■■■■

[

డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: కవితా గానం

పేరు డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు

పౌర్ణమి పోటీలు


సత్యమేవ జయతే

సత్యముతో మెలిగిన అప్పుడే

వస్తా నిత్య విశ్వాసంతో సాగుతుంది

సత్యవాక్కు పరిపాలన లోనే

సత్య హరిశ్చంద్ర మహారాజు

ఎన్ని కష్టాలు అనుభవించిన

భార్య పిల్లలను అమ్ముకున్న


సత్యం తప్ప లేదు

సత్యం ధర్మం ఈ వ్యవస్థకు అత్యవసరం

పలికే ప్రతి పలుకు సత్యము తో కూడిన దయితే అది ఇది నిత్య ప్రవచనం గా మెలుగుతుంది


సత్యం దీపంలా వెలిగే జ్యోతి

సత్యం కోసమే మాట తప్పని మహారాజులు ఎందరో ఉన్నారు

సత్యవాక్కు పరిపాలన మే ఆనాడు ఈనాడు ఈ రాజ్య వ్యవస్థను నడవాలని అందరూ భావిస్తారు


లేదంటే యధా రాజా తథా ప్రజా

సత్యవాక్ పరిపాలనకు కట్టుబడి ఉండడమే ప్రజలు రాజులు నేతలు దూతలు అందరూ నిలవాలని ఆకాంక్షిస్తున్నాను


సత్యవాక్కు పరిపాలన తోనే దశరథ మహారాజు తన కుమారుడు రామచంద్రుడు అరణ్యాలకు తండ్రి మాట జవదాటని వాడుగా సీతాసమేతంగా వెళ్ళాడు


గాంధీజీ సత్య అహింస లను పాటించాడు

సత్య హరిశ్చంద్ర మహారాజు కథలు విని ప్రభావితుడయ్యాడు


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు భువనగిరి ఖమ్మం 7702537453


■■■■■■■■


13


డా౹౹ఆంజనేయులు గారూ! సత్యం నిత్యప్రవచనం కావాలన్న అభీష్టం మీకవితలో ద్యోతకమైంది..సత్యాన్ని దీపంతో పోల్చడం బాగుంది హరిశ్చంద్రుని కథల ప్రభావితులైన మహాత్మునివలెనె తరం ప్రభావితంకావలసిన విధిని వ్యంజింపజేశారు అభినందనలు

[)*


కవితా గానం 'పౌర్ణమి' పోటీలు.


రవికుమార్ కంచి,

ఉపాధ్యాయులు,

9494345594,

హైదరాబాద్.


శీర్షిక: 'సత్యం'


______👍______


   అడ్డగోలు అబద్ధాలతో తెప్ప దాటగలవేమో సముద్రం ఈద లేము

ఒడ్డుకు చేరలేము

 మనసులో నిజాన్ని దాచి కపట ముఖం తో కప్పెట్టలేము

 నిజం నిప్పులాంటిది ఎలాగైనా అంటుకోగలదు

  స్నేహితుల దగ్గరో, బంధువుల దగ్గరో,

తల్లిదండ్రుల దగ్గరో,

నిజాన్ని దాచావా ... ఆ భారం భరించలేనిది,

  ఒక్కసారి నిజం చెప్పి చూడు, ఆకాశంలో విహరించే పక్షిలా మనసు తేలికవుతుంది

 కొత్త ఆలోచనలు పరిష్కారాలు చూపిస్తుంది

   ముందు కాస్త ఇబ్బంది అయినా సత్యం పలికేన నోటికే విలువెక్కువ,

 సత్యం కలిసిన మాటలకే పవరెక్కువ,

  సత్యం నడిచిన 

బాటకే వెలుగెక్కువ,

  ఆలస్యమయినా సత్యానిదే విజయం,

 అందుకే అన్నారు సత్యమేవ జయతే... ఈమాట నిత్య సత్యమే.


- రవికుమార్ కంచి.


______👍______


●●●●●●●●●


రవికుమార్ కంచి గారూ


నిజాన్ని దాచావా ఆ భారం భరించలేనిది ఒక్కసారి నిజం చెప్పిచూడు ఆకాశంలో విహరించే పక్షిలా మనసుతేలికవుతుంది..వాస్తవాన్ని ఆకట్టుకునే మాటల్లోకి మలచడమే కదా కవిత్వం..నిజం సర్ సత్యం పలికిన నోటికి విలువెక్కువ..మాటకు పవరెక్కువ..బాటకు వెలుగెక్కువ అభినందనలు మీకు

[

: కవిత

శీర్షిక:సత్యమే సాధనం


మానవ జీవన గమనానికి సత్యమే సుపథం

కర్తవ్యనిర్వహణకు సుసాధనం

ధర్మ ప్రతిష్ఠాపనకు సాయుధం

నైతికవిలువల సుస్థాపితం

మానవవిలువల సులోచనం

కఠినమైనా,బాధలెన్ని వచ్చినా

ఆ మార్గమే రాజసం

కానలకెళ్ళినా,కళ్ళు లేకున్నా 

దాచలేమన్నది పరమసత్యం.

మార్గం గహనమైనా ముక్తికి ద్వారం

ప్రకాశం దశదిశలా విస్తరిస్తుంది.

కీర్తి అజరామరమై నిలిచిపోతుంది.

తాత్కాలిక ఒడిదుడుకులున్నా

అంతిమవిజయం తప్పనిసరి.

బంధాలను తెంచినా,స్నేహాన్ని దూరం చేసినా

సత్యపథమే శాశ్వతమని

జెండాపై కవిరాజులా విజయశంఖం పూరిస్తుంది.


హామీపత్రం: పై వచనకవిత నా స్వంత రచన.దేనికీ అనువాదం,అనుకరణ కాదు.ఎక్కడా ప్రచురింపబడలేదు.


◆◆◆◆◆◆◆


15


రామక కృష్ణమూర్తిగారూ 


కఠినమైనా....బాధలెన్ని వచ్చినా...సత్యమార్గమే రాజసం వాస్తవం సర్ అన్నీ రహదారులే అయితే అడ్డుదారుల దొంగదారులకు నిరాశ్రయమే కదూ అలాంటిరోజు రావాలని కోరుకుందాం...సత్యకీర్తి చివరకు అజరామరమై నిలిచిపోతుందంటూ మహనీయుల నీతివంతమైన ఘట్టాలను ఉదహరించారు అభినందనలు


■■■■


: కవితా గానం

పౌర్ణమి కవిత పోటీలో కొరకు

పేరు : డా.దీపక్ న్యాతి

అంశం : సత్యమేవ జయతే

శీర్షిక : అక్షరాల నగ్నసత్యం


సత్యమేవ జయతే ఓ విధానం ఓ నినాదం

ముండక ఉపనిషత్తు మంత్ర మూలం

భారతావని సనాతన ధర్మ సంప్రదాయ మిది

ప్రపంచ ఖ్యాత భారతదేశ చిహ్న మిది

అశోక చిహ్నాన దేవనాగరి లిపినున్న చిహ్నపూర్ణమిది

హిందుస్తాన్ జాతీయ నినాదమిది

ప్రతి భారతీయుడు మనసా వాచా కర్మణా

గౌరవించి నమ్మిన నినాద సిద్ధాంతమిది

సత్యమే జయిస్తుంది ఇది తథ్యం

ఇది ధర్మ సిద్ధాంతమౌనేమో గాని

సత్యం వేరు ధర్మం వేరు

సత్యం ఏకం శాశ్వతం పటిష్టం

ధర్మం భూమి భవన జాతి రీతులచే

అవతారాలెత్తుతుంది

బహుముఖ కర్మలలా ఫలితాలలా మారుస్తుంది

సత్యం మారదు కరగదు వెరవవదు

లోకం మెచ్చిన స్వచ్ఛమైన నినాదం

సత్యమేవ జయతే...సత్యమేవ జయతే


డా.దీపక్ న్యాతి

నంది అవార్డు గ్రహీత


■■■■■■■


16


డా౹౹ దీపక్ న్యాతి గారూ!


నిజమే భారతావని సనాతన సాంప్రదాయమిది ప్రతీభారతీయుడు మనసా వాచా కర్మణా నమ్మిన సిద్ధాంతమిది మన భావితరాలవారు శిరసావహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అభినందనలు


■■


: కవిత

శీర్షిక... సత్యమేవజయతే


సత్యమును ఆచరించటము ధర్మబద్ధంగా

నడవడం,మానవుడు నైతికవిలువకు నిదర్శనం

సత్యమార్గము ద్వారా నడిచిన ,నీతినియమాలు

ఆచరించటము వలన సమాజము శాంతియుతమైన

జీవనములో పురోభివృద్ధి సాధిస్తుంది

శాంతియుతమైన మార్గముద్వారా ,శాంతయుత

పోరాటముద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించగలము

గాంధీజీ హరిశ్చంద్ర నాటకముచూసి సత్యమును

ఆచరించాడు

ఎంతటి విపత్కర పరిస్థితులలో కూడా సత్యాన్ని

పలకాని,సత్యమే మనకు జయము ఇస్తుంది

గాంధీ సత్యాన్ని నమ్మాడు

స్వాతంత్ర్య పోరాటములో ,అహింసా మార్గాన్ని

ఎన్నుకొని శాంతియుతమైన పోరాటముద్వారా

స్వాతంత్ర్య తెచ్చిన రధసారధి అయ్యాడు

పిల్లలకు చిన్నప్పుడు నుంచే సత్యమార్గాన్ని అవలంభించిన హరిశ్చంద్ర కధలు చెప్పాలి

సత్యమును నమ్ముకున్నవానికి అపజయాలు ఎదురైన చివరికి సత్యమే విజయము సాధిస్తుంది


సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు

కామారెడ్డి


■■■■■■■■


17


తిరుమలరావు గారూ...


వాస్తవం హరిశ్చంద్ర నాటకం గాంధీజీలో పరివర్తన తెచ్చింది...నేటి మాధ్యమాలు యువతరంపై ఏమేరకు అనుకూలప్రభావాన్ని చూపుతున్నాయో మనం సమాజంలోని ఇబ్బందికర సంఘటనలు చూస్తేనే అర్థం ఔతుంది..ఏదేమైనా మన వంటి కవులకలం కదంతొక్కాలి నైతికవిలువలు సాధించబడడానికి అభినందనలు


■■■

అంశం.సత్యమేవజయతే

శీర్షిక.. 🌹 తరతరాల సూక్తి 🌹

****** ****** ********

సత్యమనే పొలం మానవత్వ మొలకలకు సారవంతం.

పురాణాల ఉపదేశం అసత్య సంహరణ

సత్య పునర్జీవనం.


సత్యమేవజయతే నినాదంతో -

సత్యాగ్రహ విద్యుత్ లతలతో -

గ్రామా గ్రామాలకు చైతన్య కిరణాలను వొసగెను గాంధీ .

స్వరాజ్యం జన్మహక్కుగా-

సత్యమే రథ విల్లంబులుగా -

ఆగక సాగిన రణం -ఫలితం స్వదేశీ విజయం. సఫలం సత్యమేవజయతే.


అయోధ్య రామమందిరం స్థాపనకు -

ప్రతిమది రామనామ ఘంటారావం .

అసత్య కుహరమును చీల్చుకొచ్చి -

సత్యమే పునాదుల ఇటుకవగా -

ధర్మమే మహాధ్వనుల గంటై మ్రోగిన- సత్యమేవజయతే.


మెరుయు వస్త్రాభరణాలతో

స్వేదం రాల్చక ధనం పేర్చిన

అవినీతికిి ఆప్తులూ-

పట్టుబడిన క్షణాన సత్యసంఖెల్లతో అధోగతి .

మట్టివాసన మేనుతో -కారే స్వేద ధారలతో -

ఆరుగాలం కష్టించు అన్నదాత-

మూడు పూటలా భుక్తి నోచని నీతి భక్తి పరుడు.

రైతే రాజన్న సత్యసూక్తి కి కరతాళధ్వనులు.


మదికలచు నిర్భయ దిశ విషాదాలలో

మానవ మృగాలను వేటాడి అన్యాయపు కోరలు చీల్చి ఉవ్వెత్తున ఎగిసి నృత్తించెను సత్యం .

కష్టేపలిగా ఎదిగిన సుశాంత్ మరెందరో పరుల మోసానికి భలి అయిన మరణదుస్థితి .

సత్యతీగకు తాకి కదులుతున్న అన్యాయపు డొంకలు

చిన్నవిత్తులో దాగున్న మహాశక్తిలా

యుగాలు మారినా మారణహోమాలు జరిగినా

తుదితీర్పు అసత్యానికి చితులు

సత్యమేవజయతే హర్షధ్వనులు.


అక్రమమున సరిహద్దులు దాటుతూ

గతితప్పిన దేశాలకు

అధికార దాహంతో అసత్య పాలకులకు

పార్టీలకు

మానవత్వం లోపించిన మనుషులకు

అతి తేలిక పుల్లతో ఉద్బవించు మహాఅగ్నిశిఖలా

నివురుగప్పిన నిప్పులా

నిజమన్నది గుండె చీల్చి గుణపాఠం నేర్పునూ.

"తప్పని తరతరాల

సూక్తి సత్యమేవజయతే."


●●●●●●


18


కందూరి సుజాతారాణి గారూ !


సత్యాన్నిపొలంగానూ మానవత్వాన్ని మొలకలుగానూ అభివర్ణించడంబాగుంది...అవినీతిని అసత్యఫలంగానూ మట్టివాసననూ శ్రమైకజీవన సౌందర్యాన్ని సత్యంగానూ చక్కగా మేళవించారు అభినందనలు


◆◆◆◆◆◆◆◆ 

[15/09, 8:57 AM] 


సత్యాన్వేషితనై……..


నిరాశల నిశిని నరుక్కుంటూ

ప్రేరణ పరిమళాల్ని వెతుక్కుంటూ

పున్నమి వేళ సత్యశోధనకై బయలుదేరాను


ప్రతి సూర్యోదయాన

కొత్తగా జన్మించే విశ్వంలో

కలితో కప్పబడ్డ నిజాన్ని

ఆకలితో శోధించాను


అలసిన స్వప్నాలు రాలి

శూన్యాన్ని ఆలింగనం చేసుకుంటే

చితికిపోయిన వ్యక్తిత్వాల నిస్సహాయతలో

వ్యధా పూరితమైన అనాధ వాక్యాలుగా

కొన్ని నిగ్గుదేలని నిజాలై సమసిపోతే

ఇంకొన్ని నిలదీసే ప్రశ్నార్థకాలుగా మిగిలిపోయాయి


చేయని నేరాల చితిలో

అగ్నిపునీతగా దహనమవుతున్న

సంస్కారానికి మెరుగులు దిద్దుతూ

స్వాంతన చేకూర్చే శాంతి వచనాల్ని

విరించి కుంచెనై మళ్లీ రచిస్తున్నాను


నిశ్శబ్దాల్ని మోస్తున్న బతుకు దోసిట్లో

ఆనంద వర్ణాల్ని పట్టుకొని

స్వశ్చతా కిరణాల్ని ఆవహించిన విషాదగీతాల్ని

వధిస్తూ పోతున్నాను


సత్యమేవ జయతే అనే జయజయధ్వానాలని

దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ

సత్యాన్వేషితనై సాగుతూనే వున్నానిలా……… !


●●●●●●


19


రాజశేఖరుని శివలక్ష్మి గారూ !...

 నిరాశల నిశిని నరుక్కుంటూ ప్రేరణ పరిమళాల్ని వెదజల్లుతూ సత్యశోధనకు బయలుదేరానంటూ ఆశావహ దృక్ఫథాన్ని వ్యక్తీకరించే ఎత్తుగడతో కదంతొక్కిన మీ కవిత అలసిన స్వప్నాలురాలి శూన్యాన్ని ఆలింగనం చితికిపోయిన వ్యక్తిత్వాలు నిగ్గుదేలని నిజాలై సమసిపోయినవైనానికి చక్కగా అద్దం పట్టింది స్వచ్ఛతాకిరణాల్ని ఆవహించిన విషాదగీతాల్ని వధిస్తూ పోతున్నానంటూ కవిలక్ష్యాన్ని అద్భుతంగా కవితలో నినదించారు...చక్కని సాంద్రమైన కవితండీ అభినందనలు


■■■■■■■■■

[15/09, 8:57 AM]


శీర్షిక: *సత్యంవద ధర్మంచర*


కష్టమైన నిష్టురమైనా

కలనైనా ఇలనైనా

సత్యాన్నే పలుకుము!


పరువుకైనా ప్రతిష్టకైనా

పదవియైనా హోదాయైన

ధర్మాన్నే ఆచరించుము!


అబద్దమెప్పుడూ

అందంగానే ఆకర్షిస్తుంది

కపటమెప్పుడూ

తాత్కాలిక విజయమే అందిస్తుంది!


భ్రమలో బతుకీడ్వక

మాయలో ఓలలాడక

నిత్యం సత్యపథాన్నే సాగు!


నిజమెప్పుడూ

నివురుగప్పిన నిప్పే

బూడిద మాయమయ్యాక

కణికై ప్రజ్వరిల్లుతుంది

అన్యాయాన్ని దహించి వేస్తుంది!


ఆలస్యమైనా

గెలుపు మాత్రం సత్యానిదే!

ముళ్ల బాటలా

తోచినా

పూలనే కానుకిస్తుంది

ఇది సతతం సత్యం

నిజమే నిరతం నిలుచునన్నది తథ్యం!


రచన

అయిత అనిత

8985348424

పౌర్ణమి నగదు బహుమతుల పోటి


●●●●●


20


అయిత అనిత గారూ!...


అబద్ధమెపుడూ అందంగానే ఆకర్షిస్తుంది కపటమెపుడూ తాత్కాలిక విజయాన్నే ఆవిష్కరిస్తుంది నిజం నివురుగప్పిన నిప్పు అంటూ చివరకు అది కణికై ప్రకాశిస్తుందంటూ ఆశావహ దృక్ఫథాన్ని జోడించి కవితను ఆవిష్కరించారు అభినందనలు


◆●◆◆◆◆◆◆

[


కవితా గానం

పేరు :డా.బల్లూరి ఉమాదేవి

అంశము: సత్యమేవ జయతే

ప్రక్రియ: పద్యములు


ఆ.వె:సత్య మాడ మదికి సంతోషమే కల్గు

తప్పిదమును చేయ దండమదియు

తప్ప దనుచు నెరిగి తగిన రీతిచరింప

మాన్య తంద వచ్చు మహిని నెపుడు


ఆ.వె:ఆడి తప్ప ననుచు నాలినే యమ్మిన

నేత జనుల మదిని నిలిచె గాదె

నెట్టి కష్ట మైన నించుకయు చలింప

కాచ రించి చూపె నవని యందు.


ఆ.వె:కల్లలాడ ఫలము కనరాదు జగతిలో

సత్యము విడ కుండ సాగు చున్న

విజయమెపుడు మనకు వెన్నంటి యేనుండు

ననుచు నుందు రార్యు లనవరతము


ఆ.వె:మాట నిలుపుకొనగ మదినెంచి యొక గోవు

ప్రాణ మొసగ సిద్ధ పడియె నాడు

నీతి కథగ నదియు నేటికీ ఖ్యాతమై

సత్య వాక్య మహిమ చాటు చుండె


ఆ.వె:సత్యమెప్పు డైన సంపద వంటిదే

కంటిరెప్ప వలెను కాచుచుండు

ధర్మ మార్గమునకు దారిని చూపెడు

దీప మది యటంచు తెలియు డయ్య.


ఆ.వె: సత్య మెల్ల వేళ జయమొందు ననుచును

కథల నాల కించి ఘనము గాను

మదిని విశ్వసించి మహిని మహాత్ముడు

సాగె కడ వరకును చక్కగాను


●●●●


21


బల్లూరి ఉమాదేవిగారూ!....సత్యవచనము వలన మాన్యత లభించుననియు సత్యము సంపదలాంటిది నిత్యము రక్షించునని చెప్పడం బాగుంది ధర్మమార్గానికి దారిదీపము సత్యమనుటయు బాగుంది అభినందనలు


రమాదేవి కులకర్ణి

హైదరాబాద్

8985613123

అంశం.. సత్యమేవ జయతే

---------------------------------------


పెట్టని గోడ


తెలీక వాడు ఉందన్నాడు

చూపించమంటే

ఇదిగో అంటూ...

ఇంకొక్కరిది తనదన్నాడు

అది కాస్తా తెలిసిపోతే

అసలేమవుతుందో అనీ...

యాజమానినే చంపేశాడు..

హత్యానేరం నెత్తినపడకుండా

సాక్షిని కూడా తుదముట్టించాడు

అధికారాన్ని కొందామనుకుని

ధనం కోసం దోపిడి చేశాడు

పాపం వాడు ఒక్క అబద్దం కోసం

పాపిగ మారాడు.... !

పంకిలం లో కూరుకుపోయాడు.. !!


అప్పుడే లేదని అని ఉంటే

డాంభికమే విడిచివుంటే

తప్పుల తడకను కట్టేపనిలేదు

పాపపు మూటను మోసే పనిలేదు

చెడు కర్మలపోగు చేసే పనిలేదు

అదేదో దేశంలో ఆయన

సత్యం అన్నది పట్టుకుని

ఆ దేశం కోసం పోరాడాడు

అంతేనా ఏంటి...??

ఆ సత్యమే ఆయుధం చేసి

పోటు గాండ్లమనుకున్న దొరలను

పొలిమేరల దాకా దునిమాడు

మన దేశమాతకు కూడా

స్వేచ్ఛ ఊపిరులను ఊదాడు

శ్రీ కృష్ణుడి గీతాగానం

బుద్ధుని త్రిపిటికా సూత్రం

సాయి రమణులు, సద్గురువుల

బోధనాసారం వదతు సత్యం అనే కదా

అదే మనిషికి రక్షణ నిచ్చే పెట్టని గోడ కదా


●●●●


■■■■■■




22


రమాదేవి కులకర్ణిగారూ... వర్తమాన సంఘటనలను సత్యదూరమైన విషయాల వల్ల కలిగే అనర్థాలను ప్రపంచాన్ని గెలిచిన ధీరులను పలాయనం కట్టించిన గాంధి సత్యయుక్తినీ కవిత్వంచేశారు అభినందనలు

[. 

కవితాగానం

అంశం: సత్యమేవ జయతే

పేరు: చివుకుల శ్రీలక్ష్మి

ఊరు: విజయనగరం

కవితా శీర్షిక

సత్యమే జయించు


సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ!

సత్యం అంటే నమ్మకం! ఎన్నటికీ మారనిది!

ద్వంద్వాతీత స్థితిలోని భ్రాంతిని

తొలగించేది సత్యం!

సత్య ధర్మ శాంతి ప్రేమలనే

నాలుగు స్తంభాలపై నిలచిన

ఈ భరత భూమిపై సత్యానిదే అగ్రాసనం.

ప్రాపంచిక ధర్మాలలో మునిగితేలడం సత్యం

ప్రపంచం మాయ అని తెలుసుకోవడం సత్యం

'యదార్థవాది లోకవిరోధి' అన్నారు అయినా

సత్యం పలుకుము సత్యమునే పలుకుము

సత్యం కానిదేదీ పలుక వద్దు.

సత్యమును పాటించు వాడు

ధర్మపాలన చేయగలడు

అచ్చోట శాంతి చేకూరును

అదే ప్రేమకు ఆలవాలము

విశ్వజనీనమైన సత్యవచనాలు

దేశ కాలములతో సంబంధం లేనివి.

హిత వచనము మృదువుగా పలికి

సత్యోన్ముఖులు అయ్యేట్లు చూడాలి

సత్యవాక్పాలకుడు హరిశ్చంద్రుడు

సత్యం కోసం రాజ్యాన్ని వీడి

ఆలు బిడ్డలను అంగడిలో అమ్మినా

మహర్షుల ప్రయత్నాలు వమ్ము చేసి

సత్యం కోసం నిలచిన షట్చక్రవర్తులలో ఒకడు!

ఈ చరిత్రని ఆలంబన చేసుకుని

సత్యంతో ఎన్నో ప్రయోగాలు చేసి

సత్యాన్నికున్న మహత్తును గ్రహించి

బ్రిటిష్ వారిపై సత్యాగ్రహమనే

ఆయుధాన్ని ప్రయోగించి

భరతమాత శృంఖలాలను విడిపించిన

గాంధీజీ దేశానికి మహాత్ముడైనాడు

సత్యవాదికి ధైర్యస్థైర్యాలను ఇచ్చేది సత్యమే!

అందుకే సత్యవాక్పాలనయే నీ ఊపిరి!

సత్యమేవ జయతే!


●●●●●

23

చివుకుల శ్రీలక్ష్మిగారూ....నిజమే భ్రాంతిపటాపంచలు చేసేది సత్యం పురాణపురుషులను మొదలుకొని గాంధీమహాత్ముని వరకు సత్యశోధనలో కృతకృత్యులై భాస్వంతయశోవిరాజితులైన మహనీయులెందరినో మీ కవితలో స్పృశించారు అభినందనలు


■■■■■■■■■

శీర్షిక: *సూర్య బింబమే...*


**********************


*అది..*.

అపురూప వర్ణ సమ్మిశ్శ్రి త 

ధవళిమలను విరజిమ్మే 

 అర్కబింబం.....

తిమిరపు యవనికల్లో దాగి

నిదానంగా బయల్పడుతూనే.

ఉషస్సును పంచుతుంది..

మబ్బులు ...చుట్టూరా ఆవరించి..

మసకచీకట్లలో మాయం చేయాలని చూసినా,

చండ మార్తాండమై,

ప్రపంచాన్ని తేజోమయం చేస్తుంది....

తాను స్వయం ప్రకాశకమై,

తన మండలం లోని

గ్రహాల తామసపు చాయల్ని

అమాంతంగా తరిమివేస్తుంది...

విశాల విశ్వంలో

ఏ వైపునన్నా,

భాసురమై...సుభాషణమై,

సుభూషితమై

వెలుగులీనుతుంది...

తనను నమ్మి, బతికేవారికి

సదా సంక్షేమాన్ని చేకూర్చుతుంది...

*అదే....సత్యం...*

*ధర్మ* పుటాకాశాన్ని ఆధారంగా చేసుకుని...

ఆదరువుకే అమూల్య రత్నమై శోభిల్లుతుంది... 

*ఆ ఇనబింబమే..సత్యం* 

సప్తాశ్వ రథ గామి

సకల ప్రపంచ శక్తికి మూలమై,జాడ్యాలను జయించి...

చైతన్యానికి నాందిపలికినట్లే,

సత్యమే

సకల సామాజిక శక్తికి

మూలమౌతుంది..

అంధస్సును జయించి ఉషస్సుగా మార్చి చైతన్య పరిచే  సత్తువ

 సవిత్తు కుంటే,

సామాజిక ,ప్రాపంచిక అసత్య  తమస్సును  జయించి,

విజయపు దిశగా నడిపే శక్తి..

సత్యానిది...

అందుకే...

అనాదిగా మన తత్వం..

*సత్యమేవ జయతే*

ఆర్యోక్తి ని

అకుంఠిత దీక్షతో అనుసరించడం....

ఆపై....

అపూర్వ విజయాలను సాధించడం....

***********************


ఇది నా స్వంత రచన మే నని ,కాపీ, అనుసరణ,అనుకరణ కాదని, ఈ రోజు పోటీకొరకే రాసిందని తెలుపుతూ...


______*గుమ్మన్నగారి బాలసరస్వతి* సిద్దిపేట


■■■■■■■


24


బాలసరస్వతి గారూ....


తిమిరపుయవనికల్లో దాగి నిదానంగి బయల్పడుతూనే ఉషస్సును పంచుతుందంటూ అర్కబింబాన్ని ఉపమానంచేసి సత్యాన్ని అభివర్ణిస్తూనే సత్యానిది మొదటిగెలుపుకానంత మాత్రాన క్రుంగిపోవద్దనే సందేశాన్ని నర్మగర్భంగా పాఠకలోకానికి అందించడం బాగుంది నిజమేనండీ...సత్యం  ఏ మూలనున్నా భాసురమై సుభాషితమై సుభూషణమై వెలుగొందుతుంది అభినందనలు


◆◆◆◆◆◆●

[


కవితాగానం పౌర్ణమి నగదు పురస్కారాల పోటీకి కవిత

అంశం...సత్యమేవజయతే

శీర్షిక...రాజముద్ర


సర్వకాల సర్వావస్థలలో

ఆచరించవలసిన జీవన సూత్రం

నేటికి వన్నె తరగని సువర్ణం

తరతరాలుగా మానవజాతి ఆత్మాభిమానం

ఎందరో మహనీయులు వదలని

ఆదర్శమార్గం

బుద్ధుడు కనుగొన్న ధర్మం

అశోకుడి ఏక సింహారాజధాని నుండి స్వీకరించిన అమూల్యమైన వాక్యం

ముండ కోపనిష్యత్తు లోని సూత్రం

స్వాతంత్ర్య సంగ్రామంలో

మహాత్ముడికి  అండగా నిలిచి

ధైర్యం నూరిపోసిన తారక మంత్రం

విజయానికి చేరువ చేసిన గాంధీజీ ఆశయం

మన జాతీయ నినాదం

మూడు సింహాలరాజముద్ర

నిష్కామమైన ఋషులు పరమాత్మను చేరుకొనే దివ్యమార్గం

దేవనాగరి లిపిలో లిఖించబడిన

పవిత్రమైన వాక్కు

విప్లవాత్మకమైన ఉపనిష్యత్తు సారము

స్వార్థం,కల్మషం నిండిన సమాజంలో

అసత్యం కొన్నాళ్ళు  రాజ్యమేలిన

ప్రకాశించే కాంతికిరణమై

నిత్యం వెలుగులు పంచును సత్యం

ప్రతి సందర్భంలో ప్రచురించి తీరాలనే

ప్రభుత్వ ఆదేశం

కర్మకాండల కన్నా

క్రతువులకన్నా

జ్ఞానానికి ప్రాధాన్యత నిచ్చే 

సత్యమేవజయతే

సదా ఆచరించి తరిద్దాం.

సత్యమార్గమే సదా విజయం.



మర్రి జయశ్రీ గారు


★★★★★


25


మఱ్ఱి జయశ్రీ గారూ.....


సర్వకాల సర్వావస్థలలో ఆచరించవలసిన జీవనసూత్రంమంటూ సత్యమార్గాన్ని సూత్రీకరించారు చరిత్రప్రసిద్ధులైన మహనీయుల విజయగాథల మర్మాన్ని కవితలో వ్యక్తీకరించారు నిజమే మేడమ్ ప్రభుత్వాలు క్రతువులకన్నా సత్యమార్గాన్వేషణకు ప్రథమతాంబూలమీయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అభినందనలు


■■■■■■■

[


అంశం :సత్యమేవ జయతే

శీర్షిక:  సత్య వాక్కు!


మాసిన బడి గోడలపై  మాయని

మంత్రాక్షరాలుగా

బాల్యపు రెక్కల్లో

దాచుకున్న అక్షర తూణీరాలను

జీవన సంగ్రామంలో 

అసంతృప్త ఖడ్గాలను

స్వాధీనం చేసుకునే

ఏడు రంగుల కాంతి రేఖై

ప్రసరించి....


పెదవి పూలపై చిరునవ్వుల

పుప్పొడి రాల్చుతూ

మనస్సును అంతర్లీనంగా

అస్తిత్వం వైపు మళ్ళిస్తూ

ఆంక్షల వలయాలు దాటి

ఆత్మస్థైర్యం నింపే

అమృత బిందువులను

ఒంపుకుని......


ఉద్యమమైనా 

సత్యాగ్రహమైనా

నమ్మిన విశ్వాసాల్ని

ఉజ్వల భారత భవిత 

బాటల్ని చూపే

ఋజు మార్గాలుగా

ఊపిరి పోసుకున్న  సుతిమెత్తని

వాక్కును ఒంటికి కప్పుకుని...


స్వేచ్ఛా సౌభ్రాతృత్వాన్ని

నిర్మలాకాశపు నిండు చంద్రుడి

వెలుగుల్లో నింపి....

సనాతనాన్ని నిశ్చలం చేసిన

ఆద్యంతరహితమైన

సత్యవాక్కు *"సత్యమేవ జయతే!"*


సంధ్యా శర్మ


★★★★★


26


సంధ్యాశర్మ గారూ.... బాల్యం నుండి సత్యసంధతను నరనరాన జీర్ణింపజేసే భారతీయ విద్యావిధానాన్ని మన మూలాల్లోనే పాదుకొని పాతుకుపోయిన ధర్మానురక్తిని మీ కవితలో వ్యక్తీకరించారు మాసినబడిగోడలు అనే ప్రయోగం ద్వారా సంకటస్థితిలోనూ చలించని మన సంకల్పబలాన్ని ప్రతిబింబింపజేసే ప్రయత్నంచేశారు ఏడురంగుల కాంతిరేఖ అనడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వసాకారరూపమైన భారతీయతను గుర్తుచేశారు అభినందనలు

[


కవితాగానం 

సత్యమేవ జయతే


సత్యమా

నీ చిరునామా ఎక్కడ??

నేటి ఆధునిక యుగంలో

సత్యం విలువ గుర్తించిన వారెందరు??


సత్య హరిశ్చంద్రుని సత్యవాక్పాలన

మనమెరుగలేదా??

గాంధీజీ నెరపిన సత్యాగ్రహం

మనకు తెలియనిదా??


 అనాదినుండి నేటిదాకా

సత్యాన్ని నమ్ముకొని 

చరిత్రలో నిలిచిన వారెందరో..?? 


స్వార్ధం మితిమీరి

మానవత్వాన్ని మరచిన 

సంఘ విద్రోహులు కొందరు

సత్యంవద, ధర్మంచర

అనే నానుడిని

సత్యం వధ ధర్మం చెరగా

మార్చి వేస్తున్నారు


నీతి నిజాయితీ న్యాయం ధర్మం

సత్యమనే పునాదిపైనే నిలబడగలవు


సజ్జనుండు సత్యాన్నే నమ్ముకుని

ఉత్తముడౌతాడు

దుర్జనుడు అసత్యానికమ్ముడుపోయి

పూర్తిగా దిగజారి పోతాడు


అసత్యం అప్పటికప్పుడు రక్షిస్తుందేమో కానీ

ఎప్పటికైనా నిలబడేది

గెలిపించేది సత్యం ఒకటే


అందుకే సత్యాన్నే వచించు

సత్యాన్నే ఆచరించు

సత్యమే నిత్యమై

సత్యమే నిఖిలమై

నిలుచుటయే తథ్యం

అదేఅదే సత్యం


రాపోలు అరుణా స్వామి


★★★★★★★


27


రాపోలు అరుణాస్వామి గారూ!....వ్యాపారదృక్ఫథమే పాలకుల నరనరాన జీర్ణించుకుపోయిన వ్యవస్థలో సత్యమా నీ చిరునామా ఎక్కడ అంటూ ఎత్తుగడలోనే నిలదీయడం బాగుంది..జగత్ప్రసిద్ధుల విజయగాథల వెనుక దివ్యేంధనమైన సత్యనిష్టను గుర్తుచేశారు అభినందనలు



: కవిత

శీర్షిక: సత్యమే దైవం 


"సత్యమేవ జయతే", 

సత్యమే గెలుస్తుంది.

ఇది మాండూక్యోపనిషత్తులోని వాక్యము, భారత జాతీయవాక్యము, 

సర్వవేదసారము, 

భారతజాతి ఆత్మ, 

మన సంస్కృతీ సంప్రదాయాల మూలాధారము. 

మబ్బుచాటు సూర్యునివలె, 

నివురుగప్పిననిప్పువలె, 

పరొక్షప్రభావకారి, 

నమ్మి అనుసరించిన వాణ్ణి పరీక్షిస్తూనే పరిరక్షించి, వజ్రంలా మారుస్తుంది, 

చివరకు గెలిపిస్తుంది, 

ఆదర్శపురుషున్ని చేస్తుంది, 

లోకోత్తర ఉపకారిగా, 

సకలసుగుణ సంపన్నునిగా గుర్తింపునిస్తుంది. ప్రస్తుతసమాజంలో సత్యనిష్ఠుడు దుఃఖభాజనుడుగా, 

అఙ్ఞానిగా, మూర్ఖునిగా 

బిరుదులందుకొని 

ప్రత్యేకంగా చూడబడే 

వింతమానవుడు. 

సత్యపరీక్షలకు తట్టుకొని, 

కాలంలో చివరివరకు 

స్థిరంగా నిలబడినప్పుడు 

విజేతగా వెలుగొందుతూ, 

హేళన చేసిన సమాజం చేతనే 

ప్రశంసలను అందుకుంటాడు, అనితరప్రాప్తమైన గౌరవమర్యాదలతో అమూల్యరత్నముగా గుర్తించబడి, అనుసరింపబడతాడు. 

"సత్యమేవ ఈశ్వరోలోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత:" అన్నట్లు, 

' సత్యమే దైవం,  సత్యమే ధర్మాన్ని ప్రతిష్టించి నడిపిస్తుంది '. 

"భూతభవిష్యద్వర్తమానాలలో ఇది నిరూపించబ డుతూనే వుంది ".  

**** **** **** *** *** *** 

ఇది నా స్వంతరచన. ఇతరుల రచనలకు అనుకరణ గానీ, అనుసరణ గానీ, అనువాదము గానీ కాదు. అముద్రితము.

ముడుంబ తిరు

 వేంకటాచార్యులు గారు


◆◆◆◆◆◆


28


వేంకటాచార్యులు గారూ...


వాస్తవం..సత్యం మబ్బుచాటు సూర్యునివలె..నివురుగప్పిన నిప్పువలె  మానవున్ని పరీక్షలకు గురిచేస్తుంది!సత్యపరీక్షలకు తట్టుకొని నిలబడ్డవాడే తుది విజేత అవుతాడు...అతడు నీతిని చివరిక్షణందాక విడువనప్పుడే ఇంతటి మహత్కార్యం సాధించగలడు అనే భావాన్ని మీ కవితద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు..అభినందనలు


■■■■■■■■■

[


కవితాగానం-భాద్రపదమాస"పౌర్ణమి " నగదు పురస్కారాలకై:-

శీర్షిక: "సత్యమేజయము"

ఉప శీర్షిక: "కాంతికిరణం"

1కం:

సత్యము పలుకుము నెప్పుడు

సత్యమునకు సాటిలేదు సంపద ధరలో!

సత్యము నిత్యము వెలుగును

సత్యము భగవంతుడండ్రు 

సజ్జను లెపుడున్!

2ఉ:

సత్యము బల్కువారు పలు సద్గతి కార్యములందు శ్రద్ధతో

నిత్యము పాలుపంచుకొని నెప్పుడు తప్పులు జేయబోరు సా

నిత్యముగా మెలుంగ రవినీతి

పరుల్ దరిజేర వచ్చినన్

నిత్యము సత్యమున్ బలికి నీతికి పట్టము జేతురీభువిన్!

3తే.గీ:

నిత్యమున్ జేసెగాంధీజి సత్య దీక్ష

సత్యమే గెల్చె భారత సమర మందు

సత్యమును లోకమందున సాటి లేదు

జయము నిచ్చును సత్యమ్ము

జగతి కెపుడు

4తే.గీ:

ఒక్క మాటనె నిలబెట్టు నిక్క

ముగను

సత్యమను మాట నిలిచెను చరిత యందు

పేరు ముందుగ జేరెను మేరు నగము

సద్గునుడు హరిశ్చంద్రుడు సాక్షి మనకు

5 పంచచామరం:

నిరంతరమ్ము సత్యమాడు నీకు తోడు నుండురా

ధరాతలమ్ము నీదు పేరు ధన్య మౌను చూడరా

తరాలు మారుగాని కీర్తి తగ్గకుండ జేయురా

చరాచరమ్ములోన పేరు చంద్రికై

వెలుంగురా

6 మత్తకోకిల:

సత్యమెప్పుడు మాట లాడుము సన్నుతించును

లోకమే

చైత్యమై నిలుచుండు నెప్పుడు

చారు సుందర రూపమై

సత్యమే గెలుపొందు చుండును

సర్వవేళల యందునా

ముత్యమై వెలుగొందు జూడగ

మోక్షమిచ్చెడి మంత్రమై


                       "ప్రతిభారత్న"

                   డా.మహ్మద్ షరీఫ్

                           సంగారెడ్డి

ఈ పద్యాలు పౌర్ణమి పురస్కారాల పోటిగురించి

వ్రాసినవి.ఇవి నాస్వంతము

అని హామిఇస్తున్నాను


                     "ప్రతిభారత్న"

                  డా.మహ్మద్ షరీఫ్


◆◆◆◆◆◆◆


29


డా౹౹ మహమ్మద్ షరీఫ్ గారూ!


వివిధ ఛందస్సులలో రాసిన పద్యాలు బాగున్నాయి సర్..సత్యము నత్యము భగవంతుడండ్రు...ఒక్కమాటనే నిలబెట్టు నిక్కముగను వాస్తవం సర్ అసత్యం బహురూపులు కానీ సత్యానికి ఒకేరూపు...నిత్యము సత్యానికి పట్టంగట్టడమే నీతికి పట్టం అన్నభావన బాగుంది...అభినందనలు


■■■■■■■

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...