నిర్వహణ
వీరా గుడిపల్లి
సమన్వయం
శివునూరి లలితాకృష్ణ
సహకారం
మెరుగు మధు
అవధాని
ఐతగోని వెంకటేశ్వర్లు గారు
**********"**************
కవి వరుల జాబితా
1.రాపోలు అరుణా స్వామి గారు
2.కోరాడ నరసింహారావు గారు
3.పైల పురుషోత్తం రెడ్డి గారు
4.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
5.పాల్వంంచ హరి కిషన్ గారు
6.శివునూరి లలితా కృష్ణ గారు
7.వై.కె.సంధ్యా శర్మ గారు
8.డాక్టర్ ఆంజనేయులు గారు
9.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
10.డాక్టర్ షరీఫ్ గారు
11.అయిత అనిత గారు
12.స్వర్ణ సమత గారు
13.జల్లిపల్లి బ్రహ్మం గారు
14.మర్రి జయశ్రీ గారు
15.వల్లాల విజయ లక్ష్మి గారు
16.ఇంద్రావత్ రాహుల్ గారు
17.సునంద వురిమిళ్ళ గారు
18.కె.ఇ.నిలమంగై గారు
19..నీలా రంగనాధం గారు
20.డా.షరీఫ్ గారు
21.పూర్ణ కృష్ణ గారు
22. ఎం.భూపతి గారు
23.కందూరి సుజాతా రాణి గారు
24.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
****************************
[05/09, 8:13 PM] Rapolu Aruna Siripuram Poet: కవితాగానం
*గురుస్తుతి*
కం.1
గురువే విరించి రూపము
గురువన నారాయణుండు గురుడే శివుడౌ
గురువే తల్లిగ తండ్రిగ
నిరతము నీ యశము గోరు నిక్కము సుమ్మీ
కం.2
గురువే చలిమల సమమగు
గురువనగా కల్పతరువు కుఱియును వరముల్
గురుపదమును మది నమ్మిన
గురుదీవెన బలము నిచ్చు కోరిన వేళన్
కం.3
వెలిగెడి దీపము గురువై
వెలిగించును వేనవేల విద్యా జ్యోతుల్
తొలుగగ నజ్ఞానము వే
వెలుగై మెరుగులను దిద్ది విలువలు బెంచున్
కం.4
నడిచే గ్రంథాలయమై
బడిపిల్లల శంక దీర్చు పండితునివలెన్
గుడిలో శిలగా నిలచియు
బడిలో కొలువుంచెనిట్లు బడయగ పూజల్
కం.5
పరిపరి విధముల జూచిన
గురుదక్షిణ వేరు వలదు కుదురుగ వినుమా
గురువుకు తలవంపులుగా
పొరపాటుల జేయకున్న పుణ్యాత్ముడవే
కం.6
: గురువు తన సంతు కైనను
విరివిగ నేర్పంగబోడు విద్యలనెపుడున్
గురిగల శిష్యుల గనుగొని
సరియగు బోధనలనిచ్చు సఖ్యత తోడన్
✍రాపోలు అరుణాస్వామి,
సిరిపురం
ఇదినా స్వంత రచన. దేనికీ అనువాదం, అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను
2
[05/09, 8:16 PM] Korada: అంశం:- గురువు
కోరాడ నరసింహా రావు ;
* నాగురువులు *
************
అక్షరాలుదిద్దించి
చక్కగాను చదివించి
మంచీ-చెడు తెలియ జెప్పి...
గొప్పమనుషులుగా మలచి,బ్రతుకు దారి చూపినట్టిగురువుల కివె వందనాలు !
జ్ఞాన సారపు తనపాలనుతాపించి...
లాలి,జోలపాటల తో.....
భాషను,భావాన్ని నే ర్పిన నా తల్లే....
నాకుతొలి గురువు ...!
తన చిటికెన వేలిచ్చి
తప్పటడుగుల నా నడకను....
మంచి నడ తగ మార్చిన నాన్నే...
నా మలిగురువు !
పరిసరాల తికమకలతో...
పాఠశాల లోన చేరితే ...
తప్పొప్పుల పాఠాలుచెప్పి ...
జ్ఞానా భివృద్ధిగావించిన.....
మామాష్టారు మొదటి గురువు....!
అడుగడుగునా ఆటు పోట్లఅనుభవాలు
నన్ను బతుకు పోరు లో...రాటు దేల్చిన గురువులు ...!
పరికించి చూస్తే ....
ప్రక్రుతి లోని ప్రతి అణువూ...
ఒక్కో పాఠాన్నీ,గుణపాఠాన్నీ ...
నేర్పే గురువులే !
జన్మకు అర్ధం తెలిపి...
నిస్సారమైనజన్మ ,కర్మలనుండి...
నన్ను ముక్తుని గావించి....
మోక్ష మునుప్రసాదించు
ఆ పరమాత్మే ...
నాఅసలు గురువు...!!
ఆది గురువాతడే!!
*****************
......కోరాడ.
సెల్:7981327110.
3
[05/09, 8:16 PM] Purushottam Reddy Utf Poet: "ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు"
"నేటి ఉపాధ్యాయుడా"!
~~~~~~~~~~~~~
నేటి ఉపాధ్యాయుడా!
తన విలక్షణ బోధనతో
నవ సమాజాన్ని తరగతి గదిలో నిర్మించే
ఓ అద్భుత దార్శినికుడా!
అజ్ఞాన తిమిరంతో సమరం చేసి
విజ్ఞానామృతాన్ని జగతికి పంచి
హృదయ పూదోటలో విజ్ఞాన విరులు పెంచి
జేజేలందుకున్న నీవు!
భద్రతాజీవనం నుండి మరలి
నేడు అభద్రతా జీవన స్థితిలో ఉన్నావు!
శ్రీ రాధాకృష్ణన్ వారసుడు గా
జనుల మదిలో తాత్త్విక తను పెంపొందించు!
సమైక్య సమాజాన్ని నిర్మించు!
అమరజీవులు శ్రీ "చెన్నుపాటి","దాచూరి"వారి
మహోన్నత ఆశయాలను కొనసాగించు
వినూత్న ఆలోచనలను పెంపొందించు
చైతన్య సమాజాన్ని నిర్మించు!
స్వార్ధ పాలకుల విధానాలతో
నీ ఉనికికే ప్రమాదమేర్పడి
హక్కులను కాలరాస్తున్న వేళ
అన్యాయమని అదరవద్దు
పోరాటాలు చేయుటకు బెదరవద్దు
బడుగుపిల్లల భవితే ధ్యేయంగా
అహర్నిశలు శ్రమించు
ఉత్తమ పౌరసమాజాన్ని స్థాపించు!
మీ
పైల పురుషోత్తం రెడ్డి
తెలుగు ఉపాధ్యాయుడు
ZPHSchool కంచిలి
శ్రీకాకుళం జిల్లా
[05/09, 8:19 PM
4
] STTRao Kama Reddy Poet: గేయము
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
సర్వేపల్లి అందరికి ఆదర్శప్రాయుడు
సర్వవిధ్యార్ధులకు సర్వోత్తముడు
గురువుగా ఎదిగిన వాడు
విధ్యార్ధులను మలిచినవాడు//సర్వేపల్లి//
పేదరికమును అనుభవించిన
పట్టుదలతో పరిశ్రమించెను
ఉన్నతమైన ప్రొఫెసర్ గా నిలిచి
విధ్యార్ధులను ఉన్నతంగా తీర్చిదిద్ది
జ్ఙానమును అందించినాడు
భావిభారతపౌరులుగా మలిచాడు
//సర్వేపల్లి//
భారతరాష్ట్రపతిగా బాధ్యత చేపట్డాడు
విద్యాసంస్కరణము ఎన్నో తెచ్చాడు
భారతరత్న బిరుదును అలంకరించాడు
సర్వసమానత్వమును చాటి చెప్పాడు
//సర్వేపల్లి//
తన పుట్డినరోజును
ఉపాధ్యాయదినోత్సవముగా చేసుకొమ్మన్నాడు
భారత భారత ముద్దుల బిడ్డగా
నిలిచాడు
ఆదర్శమూర్తిగా ఉన్మతంగా నిలిచాడు
//సర్వేపల్లి,//
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
5
[05/09, 8:23 PM] పాల్వంచ హరికిషన్: కవితాగానం
అంశం: గురువు
శీర్షిక: గురుదేవోభవ..!
నిగ్రహానికే నిలువెత్తు రూపం..
విగ్రహానికే లేదా దైవ బావం..
అమ్మా నాన్నల మించిన అభయహస్తం !
పిల్లల ప్రపంచమే అతడి సమస్తం !!
చిన్నారుల ఆత్మీయతలకు బంధీయై
బడినే తన ఇల్లుగ బావించి..
దుఃఖం వచ్చినా కనపడనివ్వక..
సంతోషం కల్గిన పొంగిపోక..
ఇఛ్ఛగా నవ్వలేక.. స్వేఛ్ఛగా తిరుగలేక..
పిల్లల చూపుల పహారాలో..
నిరంతరం బుద్ధిగ మసలుతాడు !
తనను నిత్య విద్యార్థిగ భావిస్తూ..
ఆదర్శంగా మెలుగుతాడు !!
మంచిని కరుణను జ్ఞానమొసగుటలో..
ప్రవక్త.. ఏసు.. బ్రహ్మ అవుతాడు !
గుండెను బడిలో వదిలి వెళ్ళి..
దిశ..దశలకు మార్గదర్శకుడై
కలకాలం మదిలో నిలిచిపోతాడు !!
మాతృదేవోభవ.. పితృదేవోభవ..
గురు దేవోభవ అని పలికే సూక్తికి
నిత్య సత్య నిదర్శనంగా నిలిచే
ఓ గురువర్యా.. ఆపాదమస్తకం
చేస్తున్నాం మీకు ప్రణామ్యహం.. !!
( సెప్టెంబర్-5 గురుపూజోత్సవ శుభాకాంక్షలతో... )
-- పాల్వంచ హరికిషన్
రామన్నపేట, యాదాద్రి జిల్లా
9502451780
6
[05/09, 8:23 PM] Veera Gudipally: ఆనాటి ఆ బడి గొడుగు నీడే కదా
నేటి ఆశయాల ప్రదాతగా
ప్రగతి బాటను చూపింది
తెల్ల బోయిన నల్లబల్లలతో
ఉపాధ్యాయుల ఉనికిలేక
అజ్ఞానపు జడివాన లో
బాల్యం
తిరోగమనతీరరేఖ వైపు తరలి పోతున్న తరుణంలో
విజ్ఞానపు బడి గొడుగు కిందికి కొన్ని తరాలచిన్నారులను చేర్చిన
*గోవర్ధన* గిరిధారిని
అసలెప్పుడు
మరిచామని ....?
జీవనగమనమైన గణితం
కరి మబ్బులు కమ్ముకున్ననీలాకాశంలా వికృత వికటాట్టహాసంతో
భయపెడుతుంటే ..
భ్రమలతెరలను తొలగించి...
విరక్తి జాడ్యాన్ని వేయి మైళ్లదూరానికి విదిలింపజేసి..
ఆసక్తి ఔషధం తో
గమ్మత్తుగా గణితవ్యసనానికి గురి చేసిన వారిని మరచిందెవరని...?
ఆంగ్లభాషలో సత్యం సర్
హిందీలో తిరుపతి రెడ్డి సర్
కనిపించని దెప్పుడని ...?
*అమ్మ భాషలోని* నడత *నడకను నేర్పిన నాన్న*
ఆ పునాది రాళ్లని
నే మరచిందెప్పుడని ...?
అల్లరిని అలర్ట్ చేసే గంభీరగళగురువులు
విలువలవిరులు
ప్రసంగాల ప్రదీప్తులు..
త్రిభాషా సౌరభాలతో పరిమళింపజేసిన పూదోట
బాటమరచిoదెవరని..?
అందుకే నే
నేర్చిన
ప్రతిమాటలో
నాటి బడి గొడుగునీడలో
ఆదర్శాలకలబోత యైన తరువులగురువులే సాక్షాత్కరిస్తారు
బడి అంటే *సిరివెన్నెల్లో వెలిగిన జ్యోతిర్మయి....* గుర్తొస్తుంది
వెలిగించిన మా గోవర్ధన్ రెడ్డి మాస్టారు గుర్తొస్తారు
.... *శివునూరి లలితాకృష్ణ*
7
[05/09, 8:36 PM] Sandya Sharma Poetess: ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు💐💐💐
కవితాగానం
అంశం : గురువు
వై.కె.సంధ్యశర్మ
*గురువు*
విద్య నేర్పి విలువ
తెల్పి తేట తెలుగు
నుడి కారపు రుచిని
పంచి ఇచ్చె గురువు...
విజ్ఞానపు తోటమాలి..
విజయాలకు ధీరశాలి..
వినయము నేర్పించే..
విదుషీ మణుడయ్యె...
బుద్ధి మాటలు చెప్పి
శుద్ధిగా నేర్పించె
పలక బలపం పట్టి
బతుకు తీర్చిదిద్దే
నల్లబల్ల పై శ్వేత
వర్ణాక్షరమాలగా
కలమే కమలమై
వాణిని అర్చించమనే
గురువు....
దీపమై వెలుగును
పంచుతూ కొడిగట్టే
వత్తిలా తను కరుగుతూ
కొండంత అండనిచ్చె....
ఆమని రాగాలన్నీ
శృతి చేసి సంగీత
స్వర సాధనమునే
జీవన సారమని భోదించే
గురువు.....
ఆటపాటలలోనే
ఆయువుందని పలికి
ఆటుపోటుల ఉనికి
తెల్పి ఆడంబరాలెరుగక
కల్లకపటమెరుగని
బంగరు బాల్యపు
కలలకు కానుకనిచ్చి
కన్నీటిని దూరం చేసే
గురువు...
పదము పలుక నేర్పే
పద్యము నేర్పెను
వాక్యనీతి నేర్పెను
మంచి మార్గము నేర్పె
చెడును పెంచరాదని
చెడుపు చేయరాదని
చెరిచి తిరగరాదనియు
చెలిమితో కలిమని చెప్పె
గురువు....
ధనము చేత బట్టి
ధనవంతడైననేమి
విద్యనేర్చి వాడేగద
గుణము కూడబెట్టనెంచమనె
గురువు మాట గురి కదరా
విలువునిచ్చి బతకరా!
8
[05/09, 8:41 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: Teachers day
డా సిహెచ్ ఆంజనేయులు
టీచర్స్ అంటే భావి భారత నిర్మాతలని
టీచర్స్ ప్రతి అంశంలో నైతిక బోధకులు
విశాల విశ్వంలోని ఒక సైంటిస్ట్ కావాలన్నా
ఒక డాక్టర్ కావాలి అన్నా
ఒక అడ్వకేట్ కావాలన్న
ఒక హాస్టల్ కావాలన్నా అక్షరాల ప్రబోధకుడు ఒక ఉపాధ్యాయుడు
ఉప రాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి దాకా
అనేక సార్లు నోబెల్ ప్రైజు కు పంపించబడిన రాధాకృష్ణుని రోజు టీచర్స్ డే జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 నాడు
అందుకే నేనంటాను నీ కవితా గానం చేయాలన్న అక్షరాల ప్రబోధకుడు ఉపాధ్యాయుడు కావాలి
నాలుగు గోడల మధ్య ప్రపంచాన్ని కావలసిన జ్ఞానాన్ని అందించే వాడు ఒక ఉపాధ్యాయుడు
ఆనాటి ద్రోణాచార్యుడు అర్జునునికి ఏకలవ్యుని కి జ్ఞానాన్ని అందించాడు
సాందీపని ఆశ్రమంలో కలిసి చదువుకున్న శ్రీ కృష్ణుడు కుచేలుడు ఇద్దరు జ్ఞాన మూర్తులు అయ్యారు
ఈరోజు విద్యార్థి లోకమంతా గురువులకు గురువు దక్షిణలు సమర్పించి ఎటువంటి నిజమైన టీచర్స్ డే గురువులు పాదాభివందనం చేయడం విద్యార్థి ప్రథమ కర్తవ్యం
గురుదేవోభవ ఆచార్యదేవోభవ అన్నారు పెద్దలు
గురువంటే చీకటిని పారద్రోలి జ్ఞానాన్ని పెంచే వాడు
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు బోనగిరి ఖమ్మం 7702537453
9
[05/09, 8:42 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** గురువు కల్పతరువు ***
✍️డా.పాండాల
సమస్త విద్యనందించే గురువు..
జ్ఞానశక్తి ప్రదాత
గురుబ్రహ్మగా గురువిష్ణుగా గురుమహేశ్వరులేకమైన పరబ్రహ్మమే
ఆచార్యుడు
ఆత్మలోగిలిలో కొలువైనకోర్కెలు
తీర్చె తిమిర సంహారుడు..!
సృష్టి స్థితి లయల మూర్తిమత్వాలకు మూలవిరాటు
నాలుగ్గోడలతరగతి గదిలో
దశదిక్కుల శతాంశాల అనంత విశ్వపు
గమక చమక మార్పుల్ని
చిరుగుండెల్లో నిక్షిప్తం చేసే
మేధో వికాసానికి నాంది..!
గూగుల్ కన్న మిన్న ప్రభాకాంతుల కర్తవ్యపిపాసి
బడి గుండెలగుడి
బాధ్యత భవిష్యత్తుల కాలజ్ఞాని
త్రికాల మానవచరిత్రలో గురువే దిక్సూచి
సమాజ నిర్మాణంలో సమన్వయవిలువల సంస్కారి--!
గురువునారాధించు
గురువు బోధనే జ్ఞానకిరణం
ధ్యాన ప్రసారమే విషయ
విస్తృతికి మూలకం--!
గురువంటే మనుగడ నేర్పే మరయంత్రమా !కాదు..
మానవ గతులకు నైతికమల్లే
విలువల శిల్పి
గుండెలోతుల గుణగణాలను తీర్చిదిద్దెటి నిత్యమహర్షి
అభిమానాలే ఆభరణాలుగ
నమస్కారమే సంస్కారముగ
సహనశీలమే సంస్కృతి చాటే
ఉజ్వల భవితకు
పునాదులేసే సూత్రధారుడు.. !
కర్రపెత్తనం లేక పోయినా
కలం జులుంతో బలం ధరిత్రిగ
ఆశబారెడు ఆస్తి మూరెడు
ఆశయమంత అరాటాలే
అల్లరి చిల్లర సంతోషాలే
చీమల చూపుతు చెట్లను నాటుతూ
సమాజానికి చదవనే ప్రాణవాయువును పంచుతున్న ప్రాతఃస్మరణీయుడు గురువు. ...!
✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
10
[05/09, 8:47 PM] Sharief Sir: 🌹ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు🌹
ఉ:
ఓర్పుగ శిష్యులందరికి నొప్పెడి
రీతిగ బోధనమ్ము లో
మార్పులు జేసి యర్థమగు మాటల మూటలు విప్పి పాండితీ
నేర్పును యద్ది, సంస్కృతిని నీతిని జెప్పుచు నుత్తమమ్ముగా
నార్పును భేదభావములు , నాగురువున్ మనసార మ్రొక్కెదన్!
డా.మహ్మద్ షరీఫ్
11
[05/09, 8:56 PM] Anitha Aitha Poetess: *కవితాగానం*
అంశం : గురువు
శీర్షిక: *భవిత శిల్పికే బతుకు గండమా?*
ఎందరికో రాతలు నేర్పి
తలరాతలు మార్చిన
ఆ...గురువుల నుదుటిగీతలనే కరోనా మార్చెనా?
బతుకు దెరువుకు మార్గం చూపే
బతుకుపాఠాలను వల్లెవేయించిన
గురువుల బతుకే దినదిన గండమాయెనా?
నెలసరి జీతం వస్తేగానీ
పస్తుల పొట్టలు నిండని
ప్రైవేటు ఉపాధ్యాయుని అవస్థలు కొంచెమైనా తీరేనా?
పిల్లలు రాక
ఫీజులు అందక
యాజమాన్యపు వ్యధలకు
ఉపాధ్యాయులే బలిఅయ్యేనా?
శిష్యుల భవితలను చెక్కే
శిల్పికే భవితవ్యం అగమ్యగోచరమయ్యేనా?
మాయదారి కరోనా అమానుషంగా కాటేసేనా?
ప్రైవేటు ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలను!
భవితవ్యపు దారులను మూసేనా?
పాఠాలు చెప్పిన మహనీయులే
వీధుల్లో పళ్లను అమ్ముకోగా
విద్యనేర్పిన విదూషకులే
దెరువు దొరకక విలవిల పోగా
వారి బతులకు అండ ఎవరు?
వారి ఇక్కట్లకు ఓదార్పేది?
ఓ...యాజమాన్యమా! ప్రత్యామ్నాయమేది?
రచన
అయిత అనిత
8985348424
12
*కవితా గానం*
*05/09/2020*
*విద్యను పంచే విరించి*
దిన దిన దినకరుడు
నిత్య ప్రభాకరుడు
గురువు,
వికాసాన్ని పంచి,
విశ్వాసాన్ని పెంచి,
నుదుటి రాత మార్చే మరో
బ్రహ్మా,
ప్రతి శిష్యుని గమనించి,
జ్ఞాన మెంతో పంచి,
మమత తోడ నేర్పించి,
అక్షరాల స్వరమై,
లక్షణాల వర మై,
*గురువంటే గణపతి*
*గురువంటే సరస్వతి*
గురువంటే బృహస్పతి
గురువంటే వాచస్పతి
గురువే సర్వము,
చదువే కన్నుల పర్వము.
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
****************************
[05/09, 8:13 PM] Rapolu Aruna Siripuram Poet: కవితాగానం
*గురుస్తుతి*
కం.1
గురువే విరించి రూపము
గురువన నారాయణుండు గురుడే శివుడౌ
గురువే తల్లిగ తండ్రిగ
నిరతము నీ యశము గోరు నిక్కము సుమ్మీ
కం.2
గురువే చలిమల సమమగు
గురువనగా కల్పతరువు కుఱియును వరముల్
గురుపదమును మది నమ్మిన
గురుదీవెన బలము నిచ్చు కోరిన వేళన్
కం.3
వెలిగెడి దీపము గురువై
వెలిగించును వేనవేల విద్యా జ్యోతుల్
తొలుగగ నజ్ఞానము వే
వెలుగై మెరుగులను దిద్ది విలువలు బెంచున్
కం.4
నడిచే గ్రంథాలయమై
బడిపిల్లల శంక దీర్చు పండితునివలెన్
గుడిలో శిలగా నిలచియు
బడిలో కొలువుంచెనిట్లు బడయగ పూజల్
కం.5
పరిపరి విధముల జూచిన
గురుదక్షిణ వేరు వలదు కుదురుగ వినుమా
గురువుకు తలవంపులుగా
పొరపాటుల జేయకున్న పుణ్యాత్ముడవే
కం.6
: గురువు తన సంతు కైనను
విరివిగ నేర్పంగబోడు విద్యలనెపుడున్
గురిగల శిష్యుల గనుగొని
సరియగు బోధనలనిచ్చు సఖ్యత తోడన్
✍రాపోలు అరుణాస్వామి,
సిరిపురం
ఇదినా స్వంత రచన. దేనికీ అనువాదం, అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను
2
[05/09, 8:16 PM] Korada: అంశం:- గురువు
కోరాడ నరసింహా రావు ;
* నాగురువులు *
************
అక్షరాలుదిద్దించి
చక్కగాను చదివించి
మంచీ-చెడు తెలియ జెప్పి...
గొప్పమనుషులుగా మలచి,బ్రతుకు దారి చూపినట్టిగురువుల కివె వందనాలు !
జ్ఞాన సారపు తనపాలనుతాపించి...
లాలి,జోలపాటల తో.....
భాషను,భావాన్ని నే ర్పిన నా తల్లే....
నాకుతొలి గురువు ...!
తన చిటికెన వేలిచ్చి
తప్పటడుగుల నా నడకను....
మంచి నడ తగ మార్చిన నాన్నే...
నా మలిగురువు !
పరిసరాల తికమకలతో...
పాఠశాల లోన చేరితే ...
తప్పొప్పుల పాఠాలుచెప్పి ...
జ్ఞానా భివృద్ధిగావించిన.....
మామాష్టారు మొదటి గురువు....!
అడుగడుగునా ఆటు పోట్లఅనుభవాలు
నన్ను బతుకు పోరు లో...రాటు దేల్చిన గురువులు ...!
పరికించి చూస్తే ....
ప్రక్రుతి లోని ప్రతి అణువూ...
ఒక్కో పాఠాన్నీ,గుణపాఠాన్నీ ...
నేర్పే గురువులే !
జన్మకు అర్ధం తెలిపి...
నిస్సారమైనజన్మ ,కర్మలనుండి...
నన్ను ముక్తుని గావించి....
మోక్ష మునుప్రసాదించు
ఆ పరమాత్మే ...
నాఅసలు గురువు...!!
ఆది గురువాతడే!!
*****************
......కోరాడ.
సెల్:7981327110.
3
[05/09, 8:16 PM] Purushottam Reddy Utf Poet: "ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు"
"నేటి ఉపాధ్యాయుడా"!
~~~~~~~~~~~~~
నేటి ఉపాధ్యాయుడా!
తన విలక్షణ బోధనతో
నవ సమాజాన్ని తరగతి గదిలో నిర్మించే
ఓ అద్భుత దార్శినికుడా!
అజ్ఞాన తిమిరంతో సమరం చేసి
విజ్ఞానామృతాన్ని జగతికి పంచి
హృదయ పూదోటలో విజ్ఞాన విరులు పెంచి
జేజేలందుకున్న నీవు!
భద్రతాజీవనం నుండి మరలి
నేడు అభద్రతా జీవన స్థితిలో ఉన్నావు!
శ్రీ రాధాకృష్ణన్ వారసుడు గా
జనుల మదిలో తాత్త్విక తను పెంపొందించు!
సమైక్య సమాజాన్ని నిర్మించు!
అమరజీవులు శ్రీ "చెన్నుపాటి","దాచూరి"వారి
మహోన్నత ఆశయాలను కొనసాగించు
వినూత్న ఆలోచనలను పెంపొందించు
చైతన్య సమాజాన్ని నిర్మించు!
స్వార్ధ పాలకుల విధానాలతో
నీ ఉనికికే ప్రమాదమేర్పడి
హక్కులను కాలరాస్తున్న వేళ
అన్యాయమని అదరవద్దు
పోరాటాలు చేయుటకు బెదరవద్దు
బడుగుపిల్లల భవితే ధ్యేయంగా
అహర్నిశలు శ్రమించు
ఉత్తమ పౌరసమాజాన్ని స్థాపించు!
మీ
పైల పురుషోత్తం రెడ్డి
తెలుగు ఉపాధ్యాయుడు
ZPHSchool కంచిలి
శ్రీకాకుళం జిల్లా
[05/09, 8:19 PM
4
] STTRao Kama Reddy Poet: గేయము
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
సర్వేపల్లి అందరికి ఆదర్శప్రాయుడు
సర్వవిధ్యార్ధులకు సర్వోత్తముడు
గురువుగా ఎదిగిన వాడు
విధ్యార్ధులను మలిచినవాడు//సర్వేపల్లి//
పేదరికమును అనుభవించిన
పట్టుదలతో పరిశ్రమించెను
ఉన్నతమైన ప్రొఫెసర్ గా నిలిచి
విధ్యార్ధులను ఉన్నతంగా తీర్చిదిద్ది
జ్ఙానమును అందించినాడు
భావిభారతపౌరులుగా మలిచాడు
//సర్వేపల్లి//
భారతరాష్ట్రపతిగా బాధ్యత చేపట్డాడు
విద్యాసంస్కరణము ఎన్నో తెచ్చాడు
భారతరత్న బిరుదును అలంకరించాడు
సర్వసమానత్వమును చాటి చెప్పాడు
//సర్వేపల్లి//
తన పుట్డినరోజును
ఉపాధ్యాయదినోత్సవముగా చేసుకొమ్మన్నాడు
భారత భారత ముద్దుల బిడ్డగా
నిలిచాడు
ఆదర్శమూర్తిగా ఉన్మతంగా నిలిచాడు
//సర్వేపల్లి,//
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
5
[05/09, 8:23 PM] పాల్వంచ హరికిషన్: కవితాగానం
అంశం: గురువు
శీర్షిక: గురుదేవోభవ..!
నిగ్రహానికే నిలువెత్తు రూపం..
విగ్రహానికే లేదా దైవ బావం..
అమ్మా నాన్నల మించిన అభయహస్తం !
పిల్లల ప్రపంచమే అతడి సమస్తం !!
చిన్నారుల ఆత్మీయతలకు బంధీయై
బడినే తన ఇల్లుగ బావించి..
దుఃఖం వచ్చినా కనపడనివ్వక..
సంతోషం కల్గిన పొంగిపోక..
ఇఛ్ఛగా నవ్వలేక.. స్వేఛ్ఛగా తిరుగలేక..
పిల్లల చూపుల పహారాలో..
నిరంతరం బుద్ధిగ మసలుతాడు !
తనను నిత్య విద్యార్థిగ భావిస్తూ..
ఆదర్శంగా మెలుగుతాడు !!
మంచిని కరుణను జ్ఞానమొసగుటలో..
ప్రవక్త.. ఏసు.. బ్రహ్మ అవుతాడు !
గుండెను బడిలో వదిలి వెళ్ళి..
దిశ..దశలకు మార్గదర్శకుడై
కలకాలం మదిలో నిలిచిపోతాడు !!
మాతృదేవోభవ.. పితృదేవోభవ..
గురు దేవోభవ అని పలికే సూక్తికి
నిత్య సత్య నిదర్శనంగా నిలిచే
ఓ గురువర్యా.. ఆపాదమస్తకం
చేస్తున్నాం మీకు ప్రణామ్యహం.. !!
( సెప్టెంబర్-5 గురుపూజోత్సవ శుభాకాంక్షలతో... )
-- పాల్వంచ హరికిషన్
రామన్నపేట, యాదాద్రి జిల్లా
9502451780
6
[05/09, 8:23 PM] Veera Gudipally: ఆనాటి ఆ బడి గొడుగు నీడే కదా
నేటి ఆశయాల ప్రదాతగా
ప్రగతి బాటను చూపింది
తెల్ల బోయిన నల్లబల్లలతో
ఉపాధ్యాయుల ఉనికిలేక
అజ్ఞానపు జడివాన లో
బాల్యం
తిరోగమనతీరరేఖ వైపు తరలి పోతున్న తరుణంలో
విజ్ఞానపు బడి గొడుగు కిందికి కొన్ని తరాలచిన్నారులను చేర్చిన
*గోవర్ధన* గిరిధారిని
అసలెప్పుడు
మరిచామని ....?
జీవనగమనమైన గణితం
కరి మబ్బులు కమ్ముకున్ననీలాకాశంలా వికృత వికటాట్టహాసంతో
భయపెడుతుంటే ..
భ్రమలతెరలను తొలగించి...
విరక్తి జాడ్యాన్ని వేయి మైళ్లదూరానికి విదిలింపజేసి..
ఆసక్తి ఔషధం తో
గమ్మత్తుగా గణితవ్యసనానికి గురి చేసిన వారిని మరచిందెవరని...?
ఆంగ్లభాషలో సత్యం సర్
హిందీలో తిరుపతి రెడ్డి సర్
కనిపించని దెప్పుడని ...?
*అమ్మ భాషలోని* నడత *నడకను నేర్పిన నాన్న*
ఆ పునాది రాళ్లని
నే మరచిందెప్పుడని ...?
అల్లరిని అలర్ట్ చేసే గంభీరగళగురువులు
విలువలవిరులు
ప్రసంగాల ప్రదీప్తులు..
త్రిభాషా సౌరభాలతో పరిమళింపజేసిన పూదోట
బాటమరచిoదెవరని..?
అందుకే నే
నేర్చిన
ప్రతిమాటలో
నాటి బడి గొడుగునీడలో
ఆదర్శాలకలబోత యైన తరువులగురువులే సాక్షాత్కరిస్తారు
బడి అంటే *సిరివెన్నెల్లో వెలిగిన జ్యోతిర్మయి....* గుర్తొస్తుంది
వెలిగించిన మా గోవర్ధన్ రెడ్డి మాస్టారు గుర్తొస్తారు
.... *శివునూరి లలితాకృష్ణ*
7
[05/09, 8:36 PM] Sandya Sharma Poetess: ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు💐💐💐
కవితాగానం
అంశం : గురువు
వై.కె.సంధ్యశర్మ
*గురువు*
విద్య నేర్పి విలువ
తెల్పి తేట తెలుగు
నుడి కారపు రుచిని
పంచి ఇచ్చె గురువు...
విజ్ఞానపు తోటమాలి..
విజయాలకు ధీరశాలి..
వినయము నేర్పించే..
విదుషీ మణుడయ్యె...
బుద్ధి మాటలు చెప్పి
శుద్ధిగా నేర్పించె
పలక బలపం పట్టి
బతుకు తీర్చిదిద్దే
నల్లబల్ల పై శ్వేత
వర్ణాక్షరమాలగా
కలమే కమలమై
వాణిని అర్చించమనే
గురువు....
దీపమై వెలుగును
పంచుతూ కొడిగట్టే
వత్తిలా తను కరుగుతూ
కొండంత అండనిచ్చె....
ఆమని రాగాలన్నీ
శృతి చేసి సంగీత
స్వర సాధనమునే
జీవన సారమని భోదించే
గురువు.....
ఆటపాటలలోనే
ఆయువుందని పలికి
ఆటుపోటుల ఉనికి
తెల్పి ఆడంబరాలెరుగక
కల్లకపటమెరుగని
బంగరు బాల్యపు
కలలకు కానుకనిచ్చి
కన్నీటిని దూరం చేసే
గురువు...
పదము పలుక నేర్పే
పద్యము నేర్పెను
వాక్యనీతి నేర్పెను
మంచి మార్గము నేర్పె
చెడును పెంచరాదని
చెడుపు చేయరాదని
చెరిచి తిరగరాదనియు
చెలిమితో కలిమని చెప్పె
గురువు....
ధనము చేత బట్టి
ధనవంతడైననేమి
విద్యనేర్చి వాడేగద
గుణము కూడబెట్టనెంచమనె
గురువు మాట గురి కదరా
విలువునిచ్చి బతకరా!
8
[05/09, 8:41 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: Teachers day
డా సిహెచ్ ఆంజనేయులు
టీచర్స్ అంటే భావి భారత నిర్మాతలని
టీచర్స్ ప్రతి అంశంలో నైతిక బోధకులు
విశాల విశ్వంలోని ఒక సైంటిస్ట్ కావాలన్నా
ఒక డాక్టర్ కావాలి అన్నా
ఒక అడ్వకేట్ కావాలన్న
ఒక హాస్టల్ కావాలన్నా అక్షరాల ప్రబోధకుడు ఒక ఉపాధ్యాయుడు
ఉప రాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి దాకా
అనేక సార్లు నోబెల్ ప్రైజు కు పంపించబడిన రాధాకృష్ణుని రోజు టీచర్స్ డే జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 నాడు
అందుకే నేనంటాను నీ కవితా గానం చేయాలన్న అక్షరాల ప్రబోధకుడు ఉపాధ్యాయుడు కావాలి
నాలుగు గోడల మధ్య ప్రపంచాన్ని కావలసిన జ్ఞానాన్ని అందించే వాడు ఒక ఉపాధ్యాయుడు
ఆనాటి ద్రోణాచార్యుడు అర్జునునికి ఏకలవ్యుని కి జ్ఞానాన్ని అందించాడు
సాందీపని ఆశ్రమంలో కలిసి చదువుకున్న శ్రీ కృష్ణుడు కుచేలుడు ఇద్దరు జ్ఞాన మూర్తులు అయ్యారు
ఈరోజు విద్యార్థి లోకమంతా గురువులకు గురువు దక్షిణలు సమర్పించి ఎటువంటి నిజమైన టీచర్స్ డే గురువులు పాదాభివందనం చేయడం విద్యార్థి ప్రథమ కర్తవ్యం
గురుదేవోభవ ఆచార్యదేవోభవ అన్నారు పెద్దలు
గురువంటే చీకటిని పారద్రోలి జ్ఞానాన్ని పెంచే వాడు
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు బోనగిరి ఖమ్మం 7702537453
9
[05/09, 8:42 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** గురువు కల్పతరువు ***
✍️డా.పాండాల
సమస్త విద్యనందించే గురువు..
జ్ఞానశక్తి ప్రదాత
గురుబ్రహ్మగా గురువిష్ణుగా గురుమహేశ్వరులేకమైన పరబ్రహ్మమే
ఆచార్యుడు
ఆత్మలోగిలిలో కొలువైనకోర్కెలు
తీర్చె తిమిర సంహారుడు..!
సృష్టి స్థితి లయల మూర్తిమత్వాలకు మూలవిరాటు
నాలుగ్గోడలతరగతి గదిలో
దశదిక్కుల శతాంశాల అనంత విశ్వపు
గమక చమక మార్పుల్ని
చిరుగుండెల్లో నిక్షిప్తం చేసే
మేధో వికాసానికి నాంది..!
గూగుల్ కన్న మిన్న ప్రభాకాంతుల కర్తవ్యపిపాసి
బడి గుండెలగుడి
బాధ్యత భవిష్యత్తుల కాలజ్ఞాని
త్రికాల మానవచరిత్రలో గురువే దిక్సూచి
సమాజ నిర్మాణంలో సమన్వయవిలువల సంస్కారి--!
గురువునారాధించు
గురువు బోధనే జ్ఞానకిరణం
ధ్యాన ప్రసారమే విషయ
విస్తృతికి మూలకం--!
గురువంటే మనుగడ నేర్పే మరయంత్రమా !కాదు..
మానవ గతులకు నైతికమల్లే
విలువల శిల్పి
గుండెలోతుల గుణగణాలను తీర్చిదిద్దెటి నిత్యమహర్షి
అభిమానాలే ఆభరణాలుగ
నమస్కారమే సంస్కారముగ
సహనశీలమే సంస్కృతి చాటే
ఉజ్వల భవితకు
పునాదులేసే సూత్రధారుడు.. !
కర్రపెత్తనం లేక పోయినా
కలం జులుంతో బలం ధరిత్రిగ
ఆశబారెడు ఆస్తి మూరెడు
ఆశయమంత అరాటాలే
అల్లరి చిల్లర సంతోషాలే
చీమల చూపుతు చెట్లను నాటుతూ
సమాజానికి చదవనే ప్రాణవాయువును పంచుతున్న ప్రాతఃస్మరణీయుడు గురువు. ...!
✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
10
[05/09, 8:47 PM] Sharief Sir: 🌹ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు🌹
ఉ:
ఓర్పుగ శిష్యులందరికి నొప్పెడి
రీతిగ బోధనమ్ము లో
మార్పులు జేసి యర్థమగు మాటల మూటలు విప్పి పాండితీ
నేర్పును యద్ది, సంస్కృతిని నీతిని జెప్పుచు నుత్తమమ్ముగా
నార్పును భేదభావములు , నాగురువున్ మనసార మ్రొక్కెదన్!
డా.మహ్మద్ షరీఫ్
11
[05/09, 8:56 PM] Anitha Aitha Poetess: *కవితాగానం*
అంశం : గురువు
శీర్షిక: *భవిత శిల్పికే బతుకు గండమా?*
ఎందరికో రాతలు నేర్పి
తలరాతలు మార్చిన
ఆ...గురువుల నుదుటిగీతలనే కరోనా మార్చెనా?
బతుకు దెరువుకు మార్గం చూపే
బతుకుపాఠాలను వల్లెవేయించిన
గురువుల బతుకే దినదిన గండమాయెనా?
నెలసరి జీతం వస్తేగానీ
పస్తుల పొట్టలు నిండని
ప్రైవేటు ఉపాధ్యాయుని అవస్థలు కొంచెమైనా తీరేనా?
పిల్లలు రాక
ఫీజులు అందక
యాజమాన్యపు వ్యధలకు
ఉపాధ్యాయులే బలిఅయ్యేనా?
శిష్యుల భవితలను చెక్కే
శిల్పికే భవితవ్యం అగమ్యగోచరమయ్యేనా?
మాయదారి కరోనా అమానుషంగా కాటేసేనా?
ప్రైవేటు ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలను!
భవితవ్యపు దారులను మూసేనా?
పాఠాలు చెప్పిన మహనీయులే
వీధుల్లో పళ్లను అమ్ముకోగా
విద్యనేర్పిన విదూషకులే
దెరువు దొరకక విలవిల పోగా
వారి బతులకు అండ ఎవరు?
వారి ఇక్కట్లకు ఓదార్పేది?
ఓ...యాజమాన్యమా! ప్రత్యామ్నాయమేది?
రచన
అయిత అనిత
8985348424
12
*కవితా గానం*
*05/09/2020*
*విద్యను పంచే విరించి*
దిన దిన దినకరుడు
నిత్య ప్రభాకరుడు
గురువు,
వికాసాన్ని పంచి,
విశ్వాసాన్ని పెంచి,
నుదుటి రాత మార్చే మరో
బ్రహ్మా,
ప్రతి శిష్యుని గమనించి,
జ్ఞాన మెంతో పంచి,
మమత తోడ నేర్పించి,
అక్షరాల స్వరమై,
లక్షణాల వర మై,
*గురువంటే గణపతి*
*గురువంటే సరస్వతి*
గురువంటే బృహస్పతి
గురువంటే వాచస్పతి
గురువే సర్వము,
చదువే కన్నుల పర్వము.
*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
13
[05/09, 9:09 PM] +91 96428 92848: కవితా గానం
౼౼౼౼౼౼౼౼
గురువు
-----------
గురువు తోడు రాగ గుర్తు తెలిసి వచ్చు
బరరువు తరిగి పోవు బాధ తీరు
గురువు దేవుడనెడి గురి నీకు కుదరాలి
భ్రాంతి తొలగు వింటె బ్రహ్మ వాక్కు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
జల్లిపల్లి బ్రహ్మం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
14
[05/09, 9:09 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..గురువు
ఉగ్గుపాలతోనే సంస్కారం బోధించే అమ్మ ఆది గురువు
బుడి బుడి అడుగుల తప్పటడుగులు వేసేవేళ
తన వేలుపట్టి లోకాన్ని చూపి
అనుభవాల పాఠాలు నేర్పే గురువు నాన్న
అమాయకత్వం నిండిన హృదయంలో అక్షరాల మొలకలు నాటి పెంచి పోషించే తోటమాలి గురువు
సమాజానికి కల్ప తరువు
తను వేసే ప్రతి అడుగు
విద్యార్థుల భవితకు ముందడుగని ఆచి తూచి అడుగులు వేస్తూ
ఈ వ్యక్తంటే నా కిష్టమనేలా
వ్యక్తిత్వం మలచుకొనే సంస్కార శీలి
నిండైన విజ్ఞానం అందించే పరమాత్ముడు
ధనవంతుడికైనా
గుణవంతుడికైనా
వెలుగు దివ్వెలా దారి చూపే
పరమాత్ముడు
ఉన్న స్థితిలో మాత్రం తానుండి
శిష్యుల ఉన్నస్థానం కోరుకునే నిస్వార్దజీవి
భావి బాటను చూపే మార్గదర్శకుడు
జాతి నిర్మాత
అలుపెరుగని భాస్కరుడా
గురువర్యా! వందనం నీకు వందనం.
15
[05/09, 9:24 PM] విజయ లక్ష్మి యాదాద్రి: **మా గురువర్యులు*
*******************
*ఆహ్లాదపరిచే చిరునవ్వుతో*
*సున్నితమైన స్వభావంతో*
*సులభమైన కథాగేయాలతో*
*చదువు యెడ ప్రియాన్ని పెంచిన గురువులు*
*అధ్యయనాన్ని సులభతరం చేసిన*
*మాతృభాషలో నా ప్రతిభను ప్రోత్సహించిన*
*లెక్కల చిక్కులముడి విప్పి ఆసక్తిని పెంచిన*
*సాహిత్యఅభిరుచిని పెంచిన గురువులు*
*మృధుమధుర భాషణలతో అలరించి*
*కంటిచూపుతో బెదిరించి క్రమశిక్షణనలవర్చి*
*కళలతో మంత్రించి స్పందించే భావనను పెంచి*
*అమితాదరణను చూపిన ఔదార్యమూర్తులు నా *గురువర్యులు**
*ఆంగ్లసాహిత్యం ఎడ అభిమానాన్ని పెంచి*
*ఎన్నోరకాలుగ ప్రోత్సహించిన గురువులు*
*బోధించేశాస్త్రాల పట్లనే కాదు జీవితం పట్లా*
*ఆసక్తిని పెంచి అయ్యారు సదా స్మరనీయులు*
*స్టేజీభయాన్ని పోగొట్టి నాకో నేస్తంలా మెదిలి*
*నేనో గురువునయ్యేలా స్ఫూర్తినిచ్చిన*
*ఎందరెందరో నా విద్యాదాతలు*
*నా చదువుసౌరభాల ప్రధాతలు*
*సాహితీవ్యాసంగానా నా గురువులెందరో!*
*జీవితప్రాంగణానా నా మార్గదర్శకులెందరో!*
*మంచి ప్రేమ సేవా ధనసంపన్నులెందరో!*
*అందరినీ సదా స్మరించే చిన్ని శిష్యురాలను*
:*వల్లాల *విజయలక్ష్మి*
*ఆలేరు*
16
[05/09, 9:26 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
===========
అంశం : గురువు
తేది : 05/09/2020
📖 *గురువు*✒️
ఒక్క క్షణం కళ్లు మూసుకుంటే మనో గగనాన్ని పరికిస్తే
ఒక అద్భుత కాంతిపుంజం
ఆవిష్కృతమవుతుంది
అమృత శాంతి కలశం
ప్రత్యక్షమవుతుంది
ఆ దివ్య దీపమే ఉపాధ్యాయుడు
నిత్య చైతన్య స్వరమే ఉపాధ్యాయుడు
అనురాగాల చల్లదనాన్ని పంచే అమ్మ ఆత్మీయత కాంతులు పంచే నాన్న కరుణ అమృతాన్ని
ఆ చేతనాన్ని కదిలించే
నవ్య చైతన్య ప్రవాహం
అజ్ఞానాన్ని పారద్రోలే
అనంత కాంతి తరంగం
జ్ఞానానికి ప్రాణం పోసే దేవుడు
జాతి భవితను నిర్మించే శ్రామికుడు తరిగిపోని జ్ఞాన సిరినిచ్చే మాంత్రికుడు
హాస్యాన్ని పండించే ఇంద్రజాలికుడు
నకిలీ రౌద్రాన్ని చూపే నటసార్వభౌముడు
శుద్ధ ముక్కలతో జీవితాలు దిద్దు శిల్పకారుడు నమస్కారానికి పొంగిపోయే అల్పసంతోషుడు విద్యార్థులను మంచి మార్గంలో నడిపించే నావికుడు
విద్యార్థుల విజయానికి మురిసిపోయే నిస్వార్థపరుడు అలాంటి గురువుకు వందనాలు పాదాభివందనాలు...
*హామీపత్రం*: ఈ కవిత నేను స్వయంగా రాసాను... అని హామీ ఇస్తున్నాను...
ధన్యవాదములు.. 🙏🌹
*ఇంద్రావత్ రాహుల్*
*కొత్తపేట్*
*నిజామాబాద్*
*9848054079*
18.
*అంశం: గురువు*
(పద్య కవిత్వం)
ఆ.వె1:చంద్రు వెన్నెలలను చక్కగా మదినింపి
నేర్పు విద్యలన్ని నేర్పరిగను
మండు వేసవందు నిండు జాబిలివోలె
చిన్న నవ్వు తోడ చింత తీర్చు!
ఆ.వె2:విద్యలన్ని నేర్పి విజ్ఞానిగా చేయు
తిమిర హంతకుండు తీర్చు మనల
గమ్య మలవి కాక కలవర పడుచుండ
మంచి మార్గమేదొ యెంచి చూపు!
ఆ.వె3: దేవ దేవులైన దివినుండి భువికొచ్చి
శిష్యులైరి మంచి శిక్షకులకు
యెంత వారలైన సుంత తెలివితోడ
శిక్షణొంద వలయు సేవ చేసి!
ఆ.వె4:గురువు చూపు త్రోవ గుట్టుగా నేర్చుకు
నడువ వలయు మంచి నడత తోడ
కోటి విద్యలన్ని కూటికొరకెగాని
యెంచి నడువ వలెయు యెక్కడైన!
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు: నీలా రంగనాధం
ఊరు: నాదర్గుల్,హైదరాబాదు.
చరవాణి సంఖ్య:8897155600.
*ఈ పద్యాలు నా స్వీయ రచన,ఈ సమూహం కొరకు రాసినదేనని హామీ ఇస్తున్నాను.*
19
[06/09, 8:51 PM] Komandoori Neela Poet: *అంశం: టీచర్స్ డే*
లఘు కవిత్వం
ఋజు మార్గ పథగామికి ఒక్కరోజేనా..?
ఏమైందో,ఏమౌతుందో తెలియక పయనం సాగిస్తున్నామా..?
అక్షరాల విరులను చక్కగా మాలలల్లి ద్రాక్షరసంలా నేర్పుతూ నిత్య విద్యార్థిగా మసలే టీచర్స్ కు ఒక్క రోజు కాదు..
మనం ఎంతో ఋణగ్రస్తులం అవుతున్నాం..!
ఎల్ల వేళలా అనవరతం కృతజ్ఞతా సుమాలను గుభాళింప చేస్తూ గురుతుంచుకోవాలి..!
భవితను వ్రాసిన బ్రహ్మలా,స్థిరతను చూపే విష్ణువులా,భయమును పారద్రోలే శివునిలా..!
అదే టీచర్స్కు మనమిచ్చే కానుక..!
టీచర్స్ డే జరుపుకున్నంత వేడుక..!
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు: నీలా రంగనాధం
ఊరు: నాదర్గుల్,హైదరాబాదు.
చరవాణి సంఖ్య:8897155600.
20
*ఈ లఘు కవిత నా స్వీయ రచన,ఈ సమూహం కొరకు రాసినదేనని హామీ ఇస్తున్నాను.*
[06/09, 9:01 PM] Sharief Sir: 🌹టీచర్స్ డే🌹
అ.వే:
అక్షరములు నేర్పి యవనిలో
నేర్పుగా
జీవనమ్ము జేయు త్రోవ జూపి
విలువలన్ని నేర్పి వెలగట్ట
లేనట్టి
బ్రతుకు దెరువు నేర్పు బలము
నిచ్చు
నాకుజ్ఞాన భిక్ష పెట్టి ఇంతటి వాన్ని జేసిన నాగురువుల పాదపద్మములకు 🙏
డా మహ్మద్ షరీఫ్
21
[06/09, 9:14 PM] +91 94915 62006: శ్రీ గురుభ్యోనమః
పంచచామరము
స్వరాలభాషభూషణమ్ము
జాగృతమ్ము జేయ యే
భరమ్మునైనదీర్చు శిష్య
ప్రాభవమ్ముగోరుచున్
వరాలజల్లునిత్యసత్య
భవ్యమానసమ్ముతో
ధరాతలమ్ములోనదివ్య ధైవరూపుగుర్వులే
శా:
ప్రోత్సాహమ్ముభరోస సాహసము సంపూజ్యంబు దేదీప్యమౌ
నుత్సాహమ్మును ఛాత్రమానసములోనూత్నంబుగావర్ణ మ
త్యుత్సాహమ్ములెదీర్చిదిద్దుభవితన్ ద్యోతింప శ్రేయమ్ముతో
మాత్సర్యంబునుధ్వస్తిజేయు గురువా మాహోత్ర స్తోత్రాలివే
కం
రవిలో శశిలో వెలుగుల
భువికే రోచిస్సులిచ్చు ప్రోధితవర్యా
జవమై నిలుమా ధిషణా
స్తవనీయపుపూజ్యనీయ సంపూజ్యనుతుల్
డా.పూర్ణకృష్ణ
22.
........టీచర్స్ డే....
ఉగ్గు పాల పాఠాలు పరిమళింప జెసి...
తరగతి గది లోన తరగని
నిధి గా నిత్య నూతన
జ్ఞాన దారులు చూపిన...
గురుబాంధవుల కు
సంతరించినదే టీచర్స్ డే..
అక్షర అంకురాలు అణిముత్యాల ఓలే ఆనందంగా అందిన అధ్భుత శక్తి ని
గుర్తు చేసే సమయం
టీచర్స్ డే...
జీవన గమ్యాల కు రెక్కలిచ్ఛి న
తరగతి గది లోని పొది
గురుస్తానం..
ఆలనా, లాలన, పాలన కు
జ్ఞాన ములాలనిచ్చే
మహోన్నత శక్తి గురు స్థానం..
అట్టి గురువును ప్రార్థిస్తూ
స్మరించే ఉన్నత మయిన
రోజు టీచర్స్ డే.....
ఈ కవిత నా సొంతం, ఎక్కడ ప్రచురించ లేదు .
ఏ. భూపతి ...హైదరాబాద్
23
[06/09, 9:21 PM] కందూరి సుజాత Poetess: అంశం.. టీచర్స్ డే
శీర్షిక.. 🌹గురుదేవుడు🌹గేయం
.......... ........... ...........
చిన్ననాటి జ్ఞాపకాలు చిత్రమైనవీ .
చిన్నపోయి ఉన్నవేళ సిరులేఅవీ .
సర్కారీ బడిలోన
బడిత పట్టుకున్నతను
మా ఊరి గురుదేవుడు.
ఓనమాలు నేర్పిస్తూ ఆటలే ఆడిస్తూ
నా అభిమాని అయ్యాడు నా భాగ్యము
కొట్టడు తిట్టాడు కోరుకున్నవిస్తాడు
బడిఅంటే భయము తరిమి
హుషారును చిలకరించి జ్ఞానముగ్గునే పరిచాడు గురుదేవుడు.
అమ్మ ఊరికిెళ్ళినప్పుడు
తనజేబు దువ్వెనతో నా తల దువ్విండూ
కుచ్చులా జడలు రెండు వేసిండి.
చిరుతిళ్ళ కోసమై పైసలు ఇచ్చిండు.
నాదదోసీట్ల గోలీలు తను కూడా తిన్నడు గురుదేవుడు .
బడిఇడ్చిి పోతుంటే జాగ్రత్తలు చెప్పిండు కంటతడి పెట్టిండు.
అమ్మ అయ్య అన్న కాని మరో ఆత్మీయ బంధువు మా గురు దేవుడు.
కందూరి సుజాతారాణి
రజంద్రనగర్, హైదరాబాద్
9392163822🌹
24
[06/09, 9:24 PM] Balloori Umadevi Poetess: కవితా గానం
పేరు: డా బల్లూరి ఉమాదేవి
శీర్షిక:
ఉపాధ్యాయ దినోత్సవం గురువు
1.కం:అఙ్ఞానంబును బాపుచు
విఙ్ఞానమొసంగునొజ్జ;విశదముగా తా
ప్రఙ్ఞావంతుల చేయుచు
సుఙ్ఞానమొసగు గురువుకు జోతలొ సగుదున్.
2.తే.గీ:.ముగురు మూర్తుల బోలెడి ముఖ్య వ్యక్తి
తల్లి తరువాత యంతటి తాన మీత
నిదిల వినయాదికంబులు నేర్పు నట్టి
గురువు కంటెను వసుధలో గొప్ప యెవరు?.
3.ఆ.వె:రామకృష్ణు లిలను రహితోడ నేర్చిరి
గురువు చెంత చదువు కూర్మి తోడ
దేవదేవు డైన దీనుడే యైననూ
గురువు వద్ద నేర్వ గొప్ప యగును.
4ఆ.వె:గురువు దారి జూప గురిని ముట్ట గలము
గురువె తల్లి దండ్రి గురువె సర్వ
మనుచు నెంచి సరిగ నభ్యసించి చదువ
గౌరవింతురు నిను ఘనము గాను
5.ఆ.వె:చదువు తోడ తాను సంస్కార మును నేర్పి
ఛాత్ర తతిని పెంచి జగతి యందు
గురువు నేర్పు చుండు గొప్ప విద్యలనెల్ల
బుద్ధిమంతు లవగ మురిసి పోవు.
6ఆ.వె:గురిని చూపు వాడు గురువౌను నిలలోన
తీర్చి దిద్దు తాను తీరుబడిగ
నుర్వి యందు వార లుత్తములుగ నుండ
మురిసి పోవు చుండు గురువు తాను.
Comments
Post a Comment