Skip to main content

ఆత్మాభిమానం 15 th September



నిర్వహణ

శివునూరి లలితాకృష్ణ

వీరా గుడిపల్లి

మెరుగు మధు

ఐతగోని వెంకటేశ్వర్లు

****************

కవివరుల జాబితా

1.ఇంద్రావత్ రాహుల్ గారు

2.డాక్టర్ సి హెచ్ ఆంజనేయులు

3.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు

4. వీరా గుడిపల్లి గారు

5. రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి గారు

6.అయిత అనిత గారు

7.స్వర్ణ సమత గారు

8.శ్రీలక్ష్మి చివుకుల గారు

9.కె.సి.నరసయ్య గారు

10.వురిమళ్ళ సునంద గారు

11.ధనాశి ఉషారాణి గారు

12.వల్లాల విజయ లక్ష్మి గారు

13. కందూరి సుజాతా రాణి గారు

14.వై.కె.సంధ్యా శర్మ గారు

15.ఏ.భూపతి గారు

16.రాపోలు అరుణా స్వామి గారు

17.జల్లిపల్లి బ్రహ్మం గారు

18.మర్రి జయశ్రీ గారు

*********************

1

అంశం : ఆత్మాభిమానం 

తేది : 15/09/20

 ఆత్మ గౌరవం ఆత్మ విశ్వాసంతో పోరాడి 

చేసే పనిలో

అవరోధాలు ఎదురొచ్చినా

అలుపు రానియ్యక ఎదురొడ్డుతూ 

అధిగమించటానికి ప్రయత్నం చేస్తూ

దేశాన్ని మనుషులను 

గౌరవిస్తూ ఉంటూ 

ఉన్న దాంట్లో తృప్తిగా 

అందరిలో మంచి వారిగా

ఆకట్టుకోవాలని చేసే పని

నీ అంతరాత్మకు సమ్మతమా ఆత్మాభిమానం కోల్పోకెన్నడూ 

అలుసై పోగలరు అందరిలో...



*హామీపత్రం*: ఈ కవిత నేను స్వయంగా రాసాను... అని హామీ ఇస్తు


          ధన్యవాదములు.. 🙏🌹



ఇంద్రావత్ రాహుల్ 

  కొత్తపేట్

నిజామాబాద్ 

9848054079

2

[15/09, 8:15 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఆత్మాభిమానం లేకపోతే

డా సిహెచ్ ఆంజనేయులు

ఆత్మాభిమానం లేకపోతే అతను మనిషే కాదు

నిన్ను నీవు గౌరవించుకోవడం తోనే

మీ ఆత్మాభిమానం విలువ తెలుస్తుంది

అభిమానం కొనడానికి ప్రేమ కావాలి

డబ్బు కంటే విలువైనది ఆత్మాభిమానం


సమాజంలో ఆత్మాభిమానంతో వెలిగి పోవడం ఎవరికి వారే అది మూలధనం లాంటిది

ఆత్మాభిమానం కంటే అన్నింటికంటే

మనిషికి ఆత్మగౌరవాన్ని కొలవడానికి

ఇదే మూల కారణం


ఆత్మాభిమానం ఉన్నప్పుడే ఎదుటి వారు మనల్ని గౌరవించి నప్పుడే

మనకు అంతరాత్మ లో ఏదో నిధి లభించినట్లు గా ఉంటుంది


ఆత్మాభిమానం చంపుకుని బ్రతకడం మనిషిగా బ్రతికున్న శవం తో సమానం

ఆత్మ అభిమానులారా మీ మీ పిల్లల దగ్గర బంధువుల దగ్గర

స్నేహితుల దగ్గర ఆత్మాభిమానం పొందడమే నీ జీవితానికి సముచిత విలువకు సంకేతం


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి

3

[15/09, 8:34 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** ఆత్మాభిమానం ***

                             ✍️ డా.పాండాల.


విశ్వాసం ఆదర్శం త్యాగాల మిలితమే

ఆత్మాభిమానం...!

ఆత్మ విశ్వాసం మాటల్లో చేతల్లో వ్యవహారంలో త్రిగుణాత్మకమై  

చేసేపనిలో విశ్వాసాన్ని పెంచి

అవరోధాల్ని ఎదుర్కొనే 

స్థిరధైర్యాల సాహసం...!

అలసట నిర్లక్ష్యాలకు తావివ్వక వివేచనంగా వినూత్నంగా ప్రగతిదారిలో పయనించేది ఆత్మసంయమనం...!


ఆటంకాల కంటకాలను అవలీలగా తీసిపారేస్తూ

జాగృతపథాన జనం మెచ్చేట్లు దేశాభ్యుదయ మార్గాన్వేషణే

ఆత్మవిశ్వాసం ...


అందరిలో ఒకడిగా అందరికోసం ముందుండే లాక్షణికుడిగా

సమాజ హితైషిగా సాగే సంస్కరణ

శీలమే ఆత్మవిశ్వాసం..!

 

అంతరాత్మ కోవెలలో 

సంతృప్తి సమ్మతమే ఆత్మాభిమానమనే వజ్రసంకల్పం...!


✍️డా.పాండాల మహేశ్వర్

గౌసుకొండ పోచంపల్లి యాదాద్ర

4

[15/09, 8:40 PM] Veera Gudipally: ఇది వీరా గుడిపల్లి కవిత

15092020

ఆత్మాభిమానం

 ****************

జుట్టుకు రంగేసుకుంటూ

మొహానికి నవ్వు పులుముకుంటూ

పలకలేని నిజాలను

పంటిబిగువున వత్తి పట్టి

నడకొకరి తీరు

నడతొకరి తీరు

నాదంటూ యేముందసలు

ఆత్మాభిమానమంటే 

నీవు నీలా ఉండడమే


అమ్మ కోసం మెడిసిన్

నాన్న కోసం సివిల్స్ 

యేం చదవాలో తేల్చుకోలేక

నచ్చిన కోర్సు వదులుకున్నాక

దోస్త్ కోసం నచ్చని సినిమా చూసానా

ఇంకేముంది 

ఆత్మాభిమానమంటే


తనకేమిష్టమో నని 

అదే తినడం

పక్కింటోళ్ళు  కొన్న వెంచర్ లోనే ప్లాటు కొనడం

కొలీగ్ కొడుకు

యూ యస్ వెళ్ళాడని కొడుకు ను యూయస్  పంపించడం

యేముందసలు

ఆత్మాభిమానమంటే

మనమొకరితో పోల్చుకోవడం కాదు


మన బతుకు మనచేతిలో ఉండడం

మనల్ని మనమే శాసించుకోవడం

తెల్లోడి ప్రభావాన్ని దాటలేని

తెల్లబోయిన మానసిక స్థితిని

 తట్టి లేపి

స్వదేశీ మీటను మీటితేగదా

ఆత్మాభిమానమంటే తెలిసింది.

నీవు నీలా ఉండడమే ఆత్మాభిమానం

నిన్ను నీవు ఏలుకోవడమే

ఆత్మాభిమానం

..... *వీరా గుడిపల్లి*

5

[15/09, 8:45 PM] Lakshmi Chamarthi Khammam: కవితాగానం 

రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి 

05/07/2020

అంశం :ఆత్మభిమానం 


శీర్షిక :సమైక్యతా దీపాలు వెలగనీ… 


మూడు రంగుల వానలో దేశమంతా తడుస్తోంది

శాంతి కపోతానికంటిన నెత్తుటి మరకల్ని కడిగేయడానికి

 అసువులు బాసిన అమరుని ప్రాణానికి నివాళిగా

 నిషేధాజ్ఞల పర్వం నడుస్తోంది


 నరనరాల్లో ఊపందుకున్న దేశభక్తి గళాల్లో

 స్వదేశీ నినాదం సింహగర్జనలా  మార్మోగుతోంది


 అంటుకున్న పాశ్చాచ్య వ్యామోహాన్ని

 కూకటివేళ్లతో పెకలించే యజ్ఞానికి

 సమిధలుగా కలుస్తున్న చేతుల్లో

 సమైక్యతా దీపాలు వెలుగుతున్నాయి


 రెచ్చగొట్టే చౌకబారు పొరుగు దేశపు పొగరణచగల

 పటిష్ట ఆర్థిక ప్రపంచ పునాదులపై

 స్వదేశీ నినాదాలు ప్రణాళిక రచన చేస్తున్నాయి


 నిద్ర నుంచి మేల్కొన్న నిప్పురవ్వలై 

 అణువణువునా కణకణమండే ఆత్మగౌరవ గుండెలన్నీ 

 జయ జయ భారతానికి జనగణమన అంటూ

 జనగళములో మారుమోగుతున్నాయి


 కాకపోతే ఇది స్వాతంత్ర పోరాటం కాదు

 స్వాభిమాన సంగ్రామం

 ఎగరేసిన సాధికార విప్లవ కేతనానికి

 కోట్ల గళాలు ఒకటై చేస్తున్న నాంది ప్రస్తావన వందనం

6

[15/09, 8:50 PM] Anitha Aitha Poetess: *కవితా గానం*

అంశం : ఆత్మాభిమానం

శీర్షిక: *నేనిలాగే ఉంటాను..!*


మనసును చంపుకొని

మార్థవంగా మాటడలేను..!


నిజాలకు నివురుగప్పి

అబద్దాలను పలకలేను...!


కనిపించే అన్యాయాన్ని

చూసికూడా

గుడ్డిదానిలా బతకలేను..!


పాశపు కొమ్మన వాలిన పిట్టనై

పక్షపాతం చూపలేను..!


ఎదుటి వారెవరైనా

ఉన్నదున్నట్డుగా చెబుతాను..!

లేదా మౌనాన్నన్నా ఆశ్రయిస్తాను..!


హోదాలకై

ఒకరి అడుగులకు మడుగులొత్తలేను..!

విజయాలకై అవినీతి పంచన చేరలేను..!!


చేయనితప్పుకు

శిక్షను భరించలేను..!

స్వార్థం మింగిన చేపను అవలేను..!



నిలాగే ఉంటాను..!

తెలియదు నాకు

అత్మాభిమానం అంటే ఇదేనేమో!


రచన

అయిత అనిత

8985348424

జగిత్యాల


హామీపత్రం

ఇది నా స్వీయరచన

7

*కవితా గానం*

*15/09/2020*


*ఆత్మాభిమానం*


మనిషి తన ఆత్మాభి మనమును చంపుకొని

బ్రతుకు ట తప్పు,

ఆత్మ లేనిదే ఏది లేదు,

ఆత్మ సాకారం తో

పరమాత్మ ఆకారము 

నిరూపణ అవుతుంది,

ఆత్మే అన్నిటికీ మూలం,

ఆత్మా భి మానము 

అమోఘమైన,అద్వితీయ మైన

ఓ కేంద్ర బిందువు,

చలనం లో, కృత్యం లో

ముందుకు నడిపేది 

ఆత్మాభి మానమే,

ఆత్మ లేని శరీరం నష్వరం

అభి మానము లేని ఆత్మ

శూన్యము,

స్థితి శక్తి ఆత్మ

గతి శక్తి పరమాత్మా

అందుకే ఆత్మతో తదేక త

పొందుతూ ,పరమాత్మా

తత్వం తెలుసుకోవాలి.

8

కవితా గానం 

తేదీ: 15-09- 2020 

అంశము: ఆత్మాభిమానం 

పేరు: చివుకుల శ్రీలక్ష్మి


సొంత గూట్లో గంజి తాగినా మేలు

పరాయి పంచల పాల కోసం ప్రాకులాడకు

ఆత్మాభిమానమే నిన్ను నిన్నుగా నిలుపు

అదే బానిస భావన నుండి గెలుపు!


విదేశీయుల పరాయి పాలనలో

గతకాలమంతా తల్లడిల్లాం!

దేశాభిమానం నాకు కలదని 

ఉద్యమాలు చేసి ఉరికంబం ఎక్కాము!


పండిన పత్తి మనది నేసిన వస్త్రం తెల్లోడిది

గంజి మెతుకులు నీవి పండిన పంట వాడిది

పరాయి బిరుదులకు పరాయి ధనానికి

పశు ప్రవృత్తిని సహించాము!


స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా 

ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి

ఎవరో ఒకరి కాళ్ళకు 

మొక్కుతూనే ఉన్నాము


నీ తల్లి నీ నేల నీ దేశం 

స్వర్గంతో సమానం అని మరువకు

నీకై నీవు జీవించు 

స్వేచ్ఛావాయువులు పీల్చుకో!


*స్వర్ణ సమత*

9

కవిత గానం

అంశం: ఆత్మాభిమానం

తేది: 15-9-2020

పని దొరికితే

పూట గడుస్తుంది

పని లేకపోతే

ఆ పూట పస్తులే మరి

రోజురోజుకు

భారమవుతున్న కుటుంబ భారం

ఆకలితో అలమటిస్తున్న బిడ్డలు

ఇష్టంతో ఏ కష్టమైనా చేయగలను

పని ఏదైనా

వెనకడుగు వేసేది లేదు

ఆపదలో అందరిని

ఆదుకున్న వాడినే

చెయ్యి చాచేదిలేదు

తల దించేది లేదు

పస్తులతో మరొక గడపలో

అడుగు పెట్టేది లేదు

ఆత్మాభిమానాన్ని చంపుకొలేను

ఓడలు బండ్లు బండ్లు ఓడలు

అన్నింటికీ కాలమే సమాధానం


హామీ పత్రం: ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను

10

*కవితా గానం*

తేదీ::15-09-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం:: ఆత్మాభిమానం

***************

మనల్ని మనంగా నిలబెట్టి

మనమేంటో లోకానికి పరిచయం చేసే వ్యక్తిత్వ చిరునామా!


ఆత్మ విశ్వాసం ఆత్మ గౌరవం

కలగలిపిన ఆత్మాభిమానమే

స్వతంత్ర భారతి సంకెళ్ళు తెంచేందుకు

ఉవ్వెత్తున లేచిన ఉత్తుంగ తరంగమయ్యింది!


 కార్చిచ్చులా రగిలిపోతూ

బ్రిటిష్ సామ్రాజ్యానికి 

ఆత్మాభిమాన విశ్వ రూపం చూపింది!


 భారతీయుల ఆత్మాభిమానం

భావి పౌరులకు ప్రేరణగా

మహాత్ముని లాంటి 

మహానుభావులను పరిచయం చేసింది!

మనమేమిటో మన మనశ్శక్తి ఏమిటో లోకానికి చాటింది!


మనిషికి పెట్టని ఆభరణం

కట్టుకున్న కంచుకోట

విజయానికి పూల బాట

సహృదయతకు పెద్ద కోట

ఆత్మాభిమానం..

11

కవితా గానo

శీర్షిక.ఆత్మాభిమానం

..........

మనిషి జీవిత దారిలోన

మనసు లోగిలిలో దాగిన

దేవుని రూపము అయినట్టి ఆత్మాభిమానము మరిచి

కాసుల గాలములో చిక్కి

ఇతరుల మనసుపై వేసేరు 

చేరగని బాధను నిజముగా


జన్మనిచ్చిన తల్లిదండ్రులు

కూడాను మగ ఆడ తేడాతో

కన్నప్రేగు బంధాన్ని బలిని చేసేరు

పేదరికము ఉచ్చులో చిక్కిన

మనిషి దాసోహము అయ్యేరు

బతుకు పోరాటంలో


కులమత భేదాలతో

మానవతవ్వమును బలిని చేశారు

లoచగొండి తనములో 

నాశనము చేసేరు జీవితాలను

మనసు చెప్పే పాఠము మరిచి

ఇతరులను మోసము చేయకు

సేవలో మనిషిగా నిలుచు



ధనాశి ఉషారాణి

చిత్తూరు జిల్లా

12

[16/09, 8:12 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *ఆత్మాభిమానం*

***************


జగాన మనను బాగా

ప్రేమించేది మనమే కదా?

లోకాన మనను ఎంతో

గౌరవించేదీ మనమే కావాలి!


దురభిమానంగా మారనంతవరకు

గౌరవప్రద0 ఆత్మాభిమానకవచం

"మన గౌరవం మనకెంత ముఖ్యమో!

ఎవరి అభిమానం వారికి భూషణమే!


సంపదను దోచుకునేవారే కాదు

ఆత్మాభిమానధనాన్ని ఉద్దేశ్యపూర్వకంగా

దోచాలనుకునేవారూ చోరులే"నని అందరం

గ్రహించి ఇతరులను గౌరవిస్తే అంతా శాంతమే


ఆత్మాభిమానం గాయపడిన జనులు

దేనికైనా వెనుకాడరనేoదుకు సాక్ష్యాలు

తెల్లోళ్లను పారదోలిన దేశప్రజల త్యాగాలు

తెలంగాణ'ను కాంక్షించిన రాష్ట్రప్రజల ఆకాంక్షలు


ఆత్మవిశ్వాసానికి ఆ'ధారమయ్యే ఆభరణం

'ఆత్మాభిమానం' అందమైన మానవ సుగుణం

ఆ సహజ బలమే సదా మన ఆయుధం

అదెప్పుడు కావొద్దు మన పతన కారకం


:వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

13

[16/09, 8:21 PM] కందూరి సుజాత Poetess: అంశం.. ఆత్మాభిమానం 

శీర్షిక.. 🌷 మరో చరిత్ర 🌷

............  ...........   .........

ఆత్మాభిమానం సహజ అలంకారం .

వ్యక్తి భాహ్యాంతరాలకు బలీయ ప్రాకారం. ఆత్మాభిమానం వృత్తి ధర్మముకడ ఉన్నతమైననూ  

కన్నవారికడ మితమే మిన్న .


ద్రౌపతి వస్త్రాపహరణం 

గండిపడిన  పాండవుల ఆత్మాభిమాన సంద్రం .

శపధ శాపములచే హోరెత్తిన కురుక్షేత్ర

ప్రళయం.

కౌరవనాశన ప్రవాహం 

పాండవ పట్టాభిషేకం.

ఆత్మగౌరవ గద్దెనెక్కి 

సైరంధ్రి సంతషమున కురులుముడిచెను నాడు. 

కాకాబట్టి కార్యములు సాధించుకొనెడీ నేడు 

ఆత్మాభిమానం వచ్చిపోయే చుట్టమాయే 


స్వాభిమానం ఎంతో ఉన్న 

నీ శ్రేయస్సుకై తప్పించు వారలకై 

త్యజించు కొంతా. 

ఉన్నతస్థాయి నుంచి కూల్చగా 

నీ ఆత్మాభిమానం తుంచగ చూస్తే క్షమావహించు కొంతే. 

అహంకారమున చేరు ఆత్మాభిమానం

నిను ధహించు నీటిలోని జ్వాలా. 


ఎగసిన కెరటం తిరిగి కడలికి సొంతం. ఆత్మాభిమానమున కార్యసాధనలో అన్యులకు ఆదర్శమైన  

నిరాడంబరతకు నీవు కొలమానమైన 

"నీ ఘనత మరోచరిత్ర  అగును."


కందూరి సుజాతారాణి. 

రాజేంద్రనగర్, హైదరాబాద్ 

9392162822🌷

14

కవితాగానం

అంశం :ఆత్మాభిమానం

వై.కె.సంధ్యశర్మ

చిత్తూరు.

శీర్షిక:.స్వతంత్రాభిమానం 

@@@@@@@@@@@@@@@@ఆవిరయ్యే ఆశలను

అరచేత పొదువుకుంటూ

   క్రొంగొత్త ఊహలకు అంటుగడితే

చిగురులేసే... స్వతంత్రాభిమానం

రెక్కల ముక్కలయ్యే  

నిశిరాత్రులన్నీ  నిరాహారదీక్షలతో

లాంతరు మశిలో  వెలుగు

రెమ్మలలుముకుంటూ 

రెల్లు పొదలో పిక్కటిల్లే

స్వతంత్రాభిమానం.....

కన్నీటిమడుగులో

కులమతాలకతీతమై

కక్ష కార్పణ్యాలు వదలి

కడలంత పొంగె...

స్వతంత్రాభిమానం....

మువ్వన్నెల రెపరెపలే

భరత మాత గుండె గుడిలో

నిశ్శబ్ధ గంటలై మ్రోగాలని...

ఆసేతుహిమాచలం....

ఆగమై ఏకమయ్యె...

స్వతంత్రాభిమానంతో.....

 నిత్య సమరంతో...!

15


[17/09, 8:03 PM] Bupathi Sir: ....ఆత్మాభిమానం.....


భారతీయుల మెదడును

నరాలుగ మార్చి నార, 

తీసిన తడుగా పేని,

మన సంస్కృతి పై ,మన

జీవన శైలి పై బ్రిటిష్ వారి

పెత్తనం, వారి దాయాదుల

వీరంగం సంపూర్ణ బానిసత్వంలో నిద్రబుచ్చి

నంత కాలం తెలువ లేదు

ఆత్మభిమానం యొక్క రుచి,...

దేశం లో అక్కడక్కడ జరుగుతున్న దామనకాండలు

హత్యాచారాలు, హద్దులు దాటి విహంగం ఓలే విహరిస్తుంటే, భరించ లేని

భారతావని, ఆత్మభి మానం తో

ఆ సే తు హిమాచల్ వరకు స్వేచ్ఛ స్వతంత్ర సమరానికి

నడుం కట్టినది,....

ఎన్నో బలి దానాలు, మరెన్నో

మానభంగాలు,ఉరిశిక్షలు,......ఉక్కుసంకెళ్లు,ఫిరంగి గుండ్లు

ఎదురొచ్చినా మనవారి ఆత్మభిమానం మరింత బలాన్ని

పెంచిందే తప్ప ఎక్కడ దిగజారలేదు.....

స్వతంత్ర నినాదం,జన జీవన

స్రవంతి లో మమేకమై

మందు గుండు మోత లేకుండా

సత్యా హింసల ఆయుధాలుగా

ఆత్మభిమానం లో ఐక్యమై

దేశ స్వతంత్రా ని కి బాటలు

వేసినది,.... అదే అధ్భూత

ఆత్మభిమానం మన తెలంగాణ 

మనకైనది,.....ఆత్మభిమానం 

ఉన్న నాడే ఎంతటి శిఖ రాన్నైనా ,స్థానాన్నైనా అధిరోహించ గలం....

16

[17/09, 8:32 PM] Rapolu Aruna Siripuram Poet: కవితాగానం

ఆత్మాభిమానం(వచనకవిత)


ఉన్నంతలో ఉన్నతంగా బ్రతకడమే ఆత్మాభిమానం

వ్యక్తిత్వాన్నీ పెంపొందించే

అవ్యక్త భావనయె ఆత్మాభిమానం


తప్పుచేయనీయదు తలదించుకోనీదు

తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పనీయదు


విదేశీ వస్తువుల్ని బహిష్కరించి

స్వదేశాభిమానాన్ని చాటి చెప్పిన ఘనత మనది


ప్రతిపౌరుడు 

నాది స్వతంత్ర భారతదేశమని

తలయెత్తుకు తిరిగేలా చేసింది

నాటి త్యాగధనుల ఆత్మాభిమానమే


నెత్తిమీద పేను పెత్తనం లాగా

ఆశ్రమాన్ని కోరివచ్చి

ఆక్రమించిన తెల్లవారిదూరాగతాల్ని

అడ్డుకోవడం ఆత్మాభిమానం


అదే స్ఫూర్తితో 

ప్రతి పౌరుడు ఒక సైనికుడై

ఆత్మబలమే బలగముగా

ముందుకు సాగిపోతే

స్వాతంత్ర్యానికి సార్ధకత చేకూరుతుంది


✍రాపోలు అరుణాస్వామి,

          సిరివురం

17

[17/09, 8:44 PM] +91 96428 92848: కవితా గానం

౼౼౼౼౼౼౼౼

అంశం:ఆత్మాభిమానం

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

శీర్షిక: నేనునేనే

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


గుండె నాదైనపుడు ధైర్యంనాదె

రక్తం నాదైనపుడు ఆవేశం నాదే

నన్ను నేనుగా నిలుపుకునే ప్రయత్నంలో ప్రపంచం చిన్నదయి పోయింది ౹

గగనాన్ని కాలదన్ని పక్షి నింగిలో ఎగిరి నపుడు౹ తన అస్తిత్వాన్ని ఎంతగా ప్రకటించిందో ౹

రంగుల సీతా కోకచిలుక హంగులు ప్రకటించడంలో ఎం త ఆత్మాభిమానముందో ౹

వెలుగే సూర్యుడు వెన్నెల చంద్రుడు౹ పారే నది పరుగుల ఝరి ౹విరిసే సుమం కురిసే హిమం౹అన్నిట్లో అస్తిత్వం ముంది ఆంతర్యంలో ఆత్మాభిమానం ఉంది౹నాకు ఎన్నిదూరమైనా నాకు నేను దూరం కాను నా మీద నాకు అభిమానం౹నామీద నాదేహమ్మీద నా దేశమ్మీద..'నా'అన్న అస్తిత్వం మీద ఉండే పౌరుషం..నా అభిమానం...ఆత్మాభిమానం

ఎలా దూరమౌతుంది!

18

కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..ఆత్మాభిమానం

శీర్షిక..అసలైన చిరునామా



మనకు ఏది నచ్చుతుందో

అది చేయడమే సరియైనది

ఎవరో మెచ్చాలని

ఏదో ఘన కీర్తి రావాలని ఆశించడం అంతకన్నా సమంజసం కాదు

నటిస్తూ బ్రతకడం

ముందు ఒకరకం మాట

వెనకో మాట మాట్లాడుతూ

ఊసర వెల్లిలా రంగులు మారిస్తూ నటించడం కాదు

అవసరానికి ఒకలా

తీరాక మరోలా ప్రవర్తించే నడవడిక ఏనాటికైనా ప్రమాదం

అది కాదు మనిషి సుగుణం

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం

వ్యక్తిత్వానికి అసలైన చిరునామా

కలిమిలోను,లేమిలోను

ఆత్మస్థైర్యం ఆయుధంగా జీవించడం

సమస్యలకు జంకని అడుగులై

స్థిరంగా ఉండడం

చేయి చాచి అడిగే స్థితి తెచ్చుకోకుండా

మన చేయి పైది గా నిలవడం

మనిషికి ఆభరణం

అసలైన ఆత్మాభిమానం

భారతీయుల ఆత్మాభిమానమే

వలస పాలకుల గుండెల్లో గుబులు రేకేత్హించింది

బాపూజీ నాయకత్వంలో 

శాంతి అహింసలే సాధనములై

స్వాతంత్య్రం ను సముపార్జించినది.

భారతీయుల గౌరవాన్ని దిగంతాలకు చాటింది


౼౼

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...