Skip to main content

హృదయం9/2020

 



నిర్వహణ

వీరా గుడిపల్లి

The mathematics teacher and poet

సమన్వయం

శివునూరి లలితాకృష్ణ

**************************

కవి వరుల జాబితా

1.వీరా గుడిపల్లి గారు

2.నీలా రంగనాధం గారు

3.డా.రామక కృష్ణ మూర్తి గారు

4.అపరాజిత్ గారు

5.డా.సి హెచ్ ఆంజనేయులు గారు

6.ధనాశి ఉషారాణి గారు

7.అయిత అనిత గారు

8.కృష్ణ కలం

9.బండి భాను చందర్ గారు

10.కోరాడ గారు

11.భరద్వాజ గారు

12.స్వర్ణ సమత గారు

13 .వురిమళ్ల సునంద, ఖమ్మం గారు

14.వల్లాల విజయలక్ష్మి గారు

15.మర్రి జయశ్రీ గారు

16.వేంకట కృష్ణ ప్రగడ గారు

17.డా.పాండాల మహేశ్వర్ గారు

18.కోరాడ నరసింహారావు గారు

19.కె.సి.నరసయ్య గారు

20.అపరాజిత రెడ్డి గారు

21.తగిరంచ నర్సింహారెడ్డి గారు

22.దీపక్ న్యాతి గారు

23.వినీలమ్మ

24.శ్రీకాంత్ కడార్ల గారు



*****"*********************

1

ఇది వీరా గుడిపల్లి కవిత

29092020

వచ్చెల్లిపోయింది

********

తను

వచ్చెల్లిపోయాక తెలిసింది

ఎంత అమాయకుడినో

వాళ్లూ వీళ్ళు అంటే విని

ఎంత భయపడ్డానో

తనొస్తుందని తెలిసి నపుడు


ఇప్పుడు తెలిసింది

చెవులెవరికో అప్పగించడం వల్ల

మనసెంత కలుషిత మౌతుందో

తన రాక అందరికీ పండగే

నాకేదో జరుగుతుందని


తనెల్లిపోయినా పండగే

ఓదార్చే అవకాశం లభించింది కదా


ఎడమవైపు ఉండే గుండె

కుడివైపు ఉండే హృదయం

రెండూ ఒకటా కాదా తెలీని అమాయకత్వం

నన్ను ప్రేమిస్తున్నారో ద్వేషిస్తున్నారో

తెలీని ద్వైదీ భావం


I love them

They don't know 

Are they loving me or not

But they are with me only


నాకైతే ప్రేమించడమే తెలుసు

లేడంటున్న వాడిని కూడా

....... *వీరా గుడిపల్లి*

2

కవితా గానం

అంశం: *హృదయం*

29/9/2020

వచన కవిత(లఘు కవిత)


ఎదలోని మధుర భావనా వీచికలను పదిల పరుస్తూ..,

కష్ట,సుఖాలను కడలి తరంగములా హృదయ పీఠంపై నిక్షిప్తం చేసుకుని..,


బాధల బందిఖానాలో ఖైదీయైనా బైటకు రానీయక

ఆనందపు హాయినే నలుగురికీ పంచుతూ..,


విజయపు కేతనాన్ని ఎగురవేసే ఉద్విగ్న క్షణాలను మాత్రమే పొంగిపోయేలా చేసే ప్రేమైక మందిర ద్వారమే హృదయ సింహాసనం..!!!!



పేరు: కె.ఇ.నిలమంగై

కలం పేరు:నీలా రంగనాధం

ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.

చరవాణి సంఖ్య:8897155600.

*ఈ పై కవిత ఈ సమూహం కోసం రాసినవేనని హామీ ఇస్తున్నాను.*

3

పేరు:డా.రామక కృష్ణమూర్తి

తేది:29-9-2020

అంశం:హృదయం

ప్రక్రియ: వచనకవిత్వం

శీర్షిక: హృదయ నివేదన

**************************



గుండె బరువెక్కనీయకు

తడి ఆరనీయకు

వేదనలతో,వేపుళ్ళతో కృశింపజేయకు

నిరంతర స్పందనలను

ఆగిపోనీయకు

నీకిచ్చే ముందస్తు సూచనలను ఆలకించు

అవగాహనతో గుండెనిబ్బరం చేసుకో

రుధిరగమనాలను చక్కగా చేరనీ

అడ్డంకుల గోడలను కట్టనీయొద్దు

మొద్దునిదుర వదలి నడక సాగించు

చెడుకొవ్వులను పెరగనీయొద్దు

మంచికొవ్వులను మరువొద్దు

మంచి చేసే మంచినూనెలను ఎంచుకో

ఊబకాయం ఊతమవ్వకుండా

ఆయాసం ఆయుష్షును హరించకుండా

ఎల్లవేళలా అప్రమత్తతో ఉండు

నీ హృదయ స్పందనలను ఆలకించు

ఆరోగ్యం,సంతోషంతో నింపు

నవ్వుతూ,నవ్విస్తూ గుండె నింపుకో

చెత్తను ఎత్తి పారేసి

స్టంట్ ల అతుకులు రాకుండా

శస్త్రచికిత్సల అవసరం లేకుండా

గుండె లయను ఆడించే

కృత్రిమ యంత్రాల సహాయం లేకుండా

పదిలం గుండె ఆరోగ్యం-ఆయుష్షు.

4:

 జీవన రాగాలు !

నీవు నడిచే దారిలో 

జాజిమల్లెలు గుబాళిస్తున్నాయి 

నీ అడుగుల సవ్వడికి 

తుమ్మెదలు రొద పెడుతున్నాయ్ !

నీ హృదయ వేదికపై 

నీ ప్రియురాలిని నర్తించనీ

నీ గుండెల్లోని గుబులు 

సమసి పోయే దాక !

నీ వేదన - సంవేదనలు 

హృదయ వీణ పై 

రాగాలు తీసేదాక !

ఆణువణువూ పులకరించేదాక !

అనురాగపు టవదులు 

దాటేదాకా !

నీ వేదనలు వెన్నపూసలా

కరిగి కరిగి తీయ తేనియల 

గీతాలాలపించనీ !

జీవన మధురిమలు 

వినవోయ్ ప్రియతమా !

అనుభవాల సారం 

అనుభూతులుగా మారె వేళ !

నదీ తీరంలో సేద తీరే పక్షి సైతం 

నీ గుండె గూటిలో 

రాగాలు తీస్తూ నీ జీవనం 

రాగ రంజితం చేస్తుంది !!


అపరాజిత్

5

[29/09, 8:32 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: Hrudayam poyindi

మనిషి హృదయాన్ని పోగొట్టుకున్నాడు

జనారణ్యంలో తిరుగుతూ స్వాగతం కవచం తొడుక్కొని గుంట నక్కల తిరుగుతున్నాడు

మానవీయ విలువలకు పాతర వేశాడు

నిరంతరం తన తపనే తన మార్గమే తన బ్రతికే ఇప్పుడు విలువలకు తిలోదకాలు ఇచ్చారు


కాలం ముందు కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు

తన దరిదాపుల్లోకి ఎవరిని రానివ్వడం లేదు ఎందుకంటే తన సొమ్ము ఏమైనా లాక్ ఉంటారేమో అని


ఆశయాల ఆదర్శాలను మార్కెట్లో తూకం వేసి అమ్ముకున్నాడు

డబ్బు మూటల ముందు సర్వం పోగొట్టుకున్నాడు ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ పార వేసుకున్నాడు


ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి సిన మానవీయ హృదయంలో తరగని గని

మనిషి మానవీయ పతాకాన్ని ఎగుర వై నీ మమతల లోగిలి ని అందరికీ స్వాగతం పలుకుతూ సాగిపో చివరి శ్వాస దాకా సమాజానికి ఒక చైతన్య పతాకాన్ని ఎగరవేసి ఇవ్వు


మానవతా కవితామూర్తి నీ అక్షరాలలో తరతరాల విలువలను నిక్షిప్తం చెయ్

అలాంటి మానవుడే నాకు స్ఫూర్తి అలాంటి మనిషి నాకు ఆదర్శ జీవి అతనికే నా కవితా కార్పెట్ పరుస్తాను పచ్చగా నిత్యం


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

6

[29/09, 8:38 PM] Dhanasi Usha Rani Poetess: కవితా గానo

శీర్షిక.హృదయo

........

ఎముకల గూడిలో దేవుడు

సృష్టించిన అద్భుతమైన దేవుడి సృష్టి హృదయం

పుట్టింది మొదలు గిట్టేంత వరకు నిత్యము తోడు నీడగా నిలిచే భావాల పరంపరకు నెలవు హృదయo


నమ్మి మోసపోయిన నాడు

గుండెకు తగిలిన గాయాలకు

కన్నీటితో తడిపి లెహనములా బాధను తీర్చును హృదయo

మనసు లోగిలిలో నిలిచినట్టి

అంధమైన బావాలకు అద్భుతముగా ప్రాణము పోయినది హృదయము


మానవత్వం ముసుగు కప్పి

బంధాల విలువులను తెలియజేయును నిజముగా

కన్న పేగులో దాగిన మమకారములకు యదార్థముగా స్పందించును 

నిజముగా హృదయమే మనిషికి గొప్ప బొమ్మరిల్లు 


అమానుషంగా అవమానముకు

గురైనాను అనురాగముపై అమాంతముగా దాడి జరిగిన

నిత్యము తోడు నీడగా నిలిచి

విజేతగా నిలిపేది హృదయo

చరిత్రను లిఖించేది హృదయo



  ధనాశి ఉషారాణి

  చిత్తూరు జిల్లా

7

[29/09, 8:40 PM] Anitha Aitha Poetess: శీర్షిక: *షరా మామూలే..!*

నమ్మిన వారు మోసం చేస్తే

నమ్మకం  పైనే నమ్మకం పోయినప్పుడు హృదయవిదారకమే..!


అనుకున్నపని కానప్పుడు

అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు

మనోబాధ జనించడమే!

కష్టానికి తగ్గ ఫలితం రానప్పుడు

వచ్చే విజయం గద్ద తన్నుకు పోయినప్పుడు

ఎదఘోష తప్పదుగా..!


ఆశలు కొలువై

ఆనందాలకై నిరీక్షించే

ప్రతి డెందములో ఘర్షన షరామామూలే..!


కోరిలను అదుపు చేసి

వ్యాయామం..యోగాను ఆచరిస్తే

ప్రశాంతత రాకపోదు!

పరిమిత లక్ష్యాలతో నిదానంగా సాగితే విజయం వరించకపోదు..!!


రచన

అయిత అనిత

8985348424

8

[29/09, 8:42 PM] వేంకట కృష్ణ ప్రగడ,విశాఖపట్నం 

కలం  : "కృష్ణ" కలం: శీర్షిక : ఆమె తప్పిపోయింది 


ప్రేమను వెతుకుతూ 

ఆమె తప్పిపోయింది 


మనసును తాకుతూ

ఆమె తప్పిపోయింది 


గుండెను గుచ్చుతూ

ఆమె తప్పిపోయింది 


మదిని కుదుపుతూ

ఆమె తప్పిపోయింది 


యదన కదులుతూ 

ఆమె తప్పిపోయింది 


అతని ఊహల మేఘాల 

ఆశల తీరాలు దాటుతూ


మెరుపు తాకిడికి మురిసి

వాన చినుకై జారిపోయింది ...


చినుకు చినుకు చాటున 

చెణుకై 

వాన దారల నడుమ

దరుసై


పొంగి పొరలే ఏరున 

ఎరుకై 

పారుతూ సాగిపోయింది ...

అలా 

ఆమె తప్పిపోయింది ...


                  ... ✍ "కృష్ణ"  కలం

9

[29/09, 8:43 PM] బండి భానుచందర్: బండి భానుచందర్ 


శీర్షిక : వెర్రిమనసా!.. 


హ్రుదయంలో ఉదయించిన భావాలెన్నో 

ఆ భావాలు కన్న కలలెన్నో 

ఆ కలలు చూపించిన నిజాలెన్నో 

ఆ నిజాలే కల్లల్లుగా మిగిలినవి ఎన్నో ఎన్నెన్నో!.. 

హ్రుదయంలో ప్రియమైనభావం పొంగిన వేళ 

తనను తానే మరిచేంతలా అనుభూతి చెందుతుంది!.. 

అదే భావమే దుఃఖం అయితే 

పెదవులు మెదపక 

కనుల వెనుక కన్నీటిని దాచి 

అంతులేని వింత రోదనను భరిస్తూ 

తనలో తాను కుమిలి కుమిలి చస్తూ బ్రతుకుతుంది 

ఏమిటో!.. ఈ వెర్రి మనసు!..

10

[29/09, 8:46 PM] Korada: కవితాగానం

అంశం:-* హృదయం *

*******************

చూసుకో...పదిలం గా...!

********************

లబ్-డబ్ మంటూ .....

గుండె ఆదేవరకే  ....

ఈప్రాణుల గారడీఆటలు

     చెడునంతాస్వీకరించి

మంచిని పంచి...అది...

ఆనందంగా ఉంచేవరకూ

మనము  శివమే....!

అది కాస్తా ఆగిపో తే  ...

శ వా ల మే......!!

మంచీ-  చెడులకు స్పం దించటం దీని ప్రవ్రుత్తి !

ఆనంద-భయాలను ప్రతి స్పందించటంలో...ముందుంటుంది!

దయ,జాలి ,ప్రేమ,త్యాగా  లకు ...యిదే ప్రతీక....!

యివికొరవడిన వాళ్ళను

గుండెలేనిమనుషులని ...మనమనటం   లేదూ !!

ఈ నాలులు గదుల గుప్పెడంత  గుండె ....

ఈ దేహి మనో బుద్ధి చిత్తహంకారాలన్నిటి... అనుభూతులకూ స్పంది  స్తూ...ప్రతిస్పందింస్తుంది కదూ!

       దీన్ని మనం ఎంత శ్రద్దగా చూసుకో వాలి ...!

యెంత భద్రతతో  కాపా డు కోవాలి  ...!!

కరకుఉప్పుకాషాయాలతో....కల్తీ నూనెల తో...

ఘాటు మషాలాలతో...

ధూమ,మద్యపాన వ్యస

నాలతో....ఈ గుండెను పొగ చూరించి  దానికి ఆందోళనలను  పెంచి...

నీ నిండు జీవితాన్ని అర్ధాంతరంగంగా ముగిం చేసుకోకు  !  

దాన్ని పదిలంగా  చూసు కొంటూ...పదికాలాలు పచ్చని చెట్టులా వర్ధిల్లు!! 

*******************

........కోరాడ.

11

[29/09, 8:47 PM] భరద్వాజ గారు: 🌹🌱కవితాగానం 3🌱🌹🎺

నేటిఅంశం *హృదయం *

☘️శీర్షిక - నేనే నీసమస్తం 🏵️

నేస్తమా ...!

నేనెవరో నీకుతె లియకపోయినా 

నీవెవరో నాకు తెలుసు...-

నీఆలోచనల సంద్రాన్నినేను -

నీస్పందనా జలపాతాలకు  పుట్టిల్లు నేను -

నీహృదయకవాటాల ప్రజ్వరిల్లు ఆలోచనాతరంగాన్ని నేను కంటికి కనిపించకపోయినా నడిపిస్తుంటానునిన్ను -

నేను ఒక  పద్మవ్యూహాన్ని-

ప్రవేశించటానికి అభిమన్యుడవుకావునీవు  -

నాలోఇమిడి ఉంది ఓప్రణయకావ్యం -

ఛేదించడం సులభంకాదు -

గమ్యంలేని ప్రయాణం నువ్వు చేస్తుంటే -

హెచ్చరించే మనసుంది నాకు -

ఒక్కసారి నన్ను తలచిచూడు-

తిరుగులేనివిజయాలు అవుతాయి నీకుసొంతం -

నన్నుపట్టించుకోకపోతే మునుగుతావు ఆసాంతం -

నీవయసు తో నాకుపనిలేదు 

భాషతో, మతం తో సంబంధమేలేదు --

ఎన్నిడిగ్రీలు తెచ్చుకున్నా నన్ను నీవు చదవలేవు -

నాగురించి పుస్తకాలలో దొరకదు -

జీవితాలలో తప్ప -

కాలాలు మారవచ్చు -

కలలు,కాలాల లో  మార్పులురావచ్చు -

నీఆలోచన్లో మార్పువచ్చినా నేను ఎప్పుడూ నీవెంటే -

ముఖ్యమైన నీ వ్యక్తుల్ని దాచిపెడతా -

నీజ్ఞాపకాల పొరలను నా కంప్యూటర్  ఫోల్డర్లో  భద్రపరుస్తా -

నన్ను నమ్మని నీకు బ్రతుకు లేదు -

నీప్రతి అడుగు నావైపే సాగాలి  -

అప్పుడప్పుడు నీకష్టాలకు నాగుండెను 

నీవుగాయం చేసిన నెప్పులతో బాధపెట్టినా బాగు చేసుకుంటావు నువ్వే -

ఎందుకంటె నేను లేని నువ్వు లేవుకదా.. ..!

నేను హృదయాన్ని -

నీహృదయాన  వెలిగే  దీపాన్ని...! 

ఇదినాస్వీయరచన 

భరద్వాజరావినూతల(RB)🖊️ 

కొత్తపట్నం 9866203795

ప్రకాశంజిల్లా

12

*కవితా గానం*

*29/09/2020*


         *హృదయం*


అందమైన అద్భుత కుహరం

అమోఘ అనుపమాన అనిర్వచనీయ అనూహ్య

అనుభూతి నిలయం

అనన్య సామాన్య స్థానం

అద్వితీయ అలౌకిక అగణిత అజేయ అపూర్వ ఆదరణ

స్పందన

అదో రకమైన తీయటి అనుభవం,

తీరం లేని సాగరం

విజయ మునకు స్థావరం

ఆనంద నిలయ ముల

ఆలయం

ఆహాల్లాధ ఆమని సరాగాల

చక్కని హిమనగం

సంపంగి, కమల కోమల కవాటం

హృది తడిలో సంద్రం కావాలి

హృది గుడిలో దైవం కొలువు

ఉండాలి.

*స్వర్ణ సమత*

13

*కవితా గానం*

తేదీ:29-09-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: హృదయం

******************

సృష్టి కర్తకు సృజనకు ప్రతి రూపం

మన దేహంలో ప్రతి అవయవం

ఓ అద్భుతం!

 గుప్పెడంత గుండె

దేహ దేవళంలో దీపమై వెలుగుతూ

మలగకుండా ఆవరణాన్ని ఏర్పాటు చేసుకోవడం!


 పిడికెడు ఎడద  ఆలోచనల సంద్రాలను ఒడిసి పట్టుకుని

అంతరంగాన్ని వెన్నగా చిలకడం!

అపూరూపమైన జ్ఞాపకాల మంజూషయై 

అనేకానేక సంవేదనలను  దాచుకోవడం....

ఎంత వైచిత్రి ఈ హృదయ సంవేదనం!

అరిషడ్వర్గాలను,తాపత్రయాలను

 నిష్కామ కర్మలకు నిశ్చల స్థితికి 

కనిపించని రూపంలో  

దేహ సామ్రాజ్యాన్ని పాలించడం..

ఇదే కదా అమేయమైన విజయాల నిలయం!

ఆవేదనల సంవేదనల సమ్మిళితం!

ఆవిష్కరణలకు మూలం!

14

*హృదయం*

************


ఎంత అందమైన భావన!

అది లేక దుర్లభమనుకున్నా జీవనం!

కానీ *ఎందరో* హృదయంలేని మనుషులు!

-మంచి మమతలు తెలియని జనులు!


వయసు చదువు హోదా పరిచయాలతో 

తరిగే సహనం హృదయ0లేని వారి నైజం

నటనలకు లోని' హృదయం లేకుండాపోతుంది

దుర్మార్గచింతనలకు ఎప్పుడో చితికిపోతుంది


అమూర్తభావనల నిలయమైన హృదయం

అమృతాన్నాయినా చిలికి తరగని

చెలిమికలిమితో మన విలువను పెంచు

విషాన్నయినా చింది మనసుల దహించు


నియంత్రణలేని భావోద్వేగాలు

ఎదుటి వారి మనసునే కాదు

మన గుండెనూ గాయపరచు

గుండె లేకుండా ఎవరుండగలరు?

చిత్రం!హృదయం లేకుండా ఎందరున్నారో!


గుండె హృదయం మనసు ఎద 

పర్యాయపదాలని భావించినా

అద్భుతావయవం'గుండె'కిచ్చే ప్రాధాన్యత

మిగతా వాటికివ్వకపోవటమే వింత!


ఎన్ని అసూయలు!ఎన్నెన్ని అహంకారాలు!

ఎన్ని అభిమానాలు!ఇంకెన్ని అవమానాలు!

అన్నీ హృదయాకాశాన విరిసే భావతారకలు!

ఎన్నో!మదిబురదలో పూచే భిన్న గంధాల సుమాలు!

:వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

15

[29/09, 9:32 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..హృదయం


గుప్పెడంత గుండె

కంటికి కనిపించదు కానీ

నేనున్నానని సవ్వడి చేస్తూ

దేహంలో ఉన్న అవయవాలన్నింటిపైనా ఆధిపత్యం చేలాయిస్తుంది

చెప్పినట్లు వింటే సరే

లేదంటే తన విధిని నిర్వర్తించక మొండికేస్తుంది

చెప్పలేని మాయలెన్నో చేస్తుంది

మర్మం తెలియనివ్వదు

బాధలోను,సంతోషంలోను

అన్నీ తానై వెంట ఉంటుంది

ఆదరిస్తే అక్కున చేర్చుకుంటుంది

బాధ కలిగిస్తే బాధతో కుమిలిపోతుంది

అందుకే హృదయాన్ని పదిలంగా చూసుకుంటూ

యోగా వ్యాయామం సాధనతో

 ఉత్సాహ పరిస్తేనే

స్వార్థం,కుళ్ళు, కుతంత్రాల పొరలు కమ్మకుండా కాపాడుకుంటేనే

జీవితం సుసంపన్నం.

16

[29/09, 9:32 PM] వేంకట కృష్ణ ప్రగడ,విశాఖపట్నం 

కలం  : "కృష్ణ" కలం: హృదయం పలికిన మాటలు 


అనామికా ...

వంచిన తల ఎత్తని

కొత్త పెళ్లి కూతురులా 

కూర్చున్న నిన్ను

దగ్గరగా ఇపుడే చూసాను ...


అపుడే విరిసిన 

మందారం ఆ మోము

గోక్షీరం విడిచిన 

గారం వెన్న నీ దరహాసం


మూసి ఉన్న 

నీ కన్నులు 

మువ్వన్నెలు 

నింపుకొన్నాయి


తెరుచుకొన్న ఈ గుండె 

అది మనసంతా పంచుకొంది

తలచి మురిసి మెరిసే 

17.

[30/09, 8:01 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** అనుభూతుల వరదాయిని ***

                             ✍️డా.పాండాల.


లబ్-డబ్ లాలిత్యాల సరాగతంత్రం

ప్రతిక్షణం గారడీ గమకాలయంత్రం

మంచిచెడుల వివేచన శీలం

ఆనంద విచారాల డొలాయమానం 

ఊపిరికూతమై 

దేహదారుడ్యానికి ఆధారమై 

అదృశ్య గాలితంత్రుల గవాక్షం క్షేమం!

కాస్తాగితే ..  మనిషిప్రాణం...శివైక్యమే...!


కూనిరాగాల శృతిలయలే

గుండెలోగిలి లో వీణా ప్రవృత్తి !

ఆనందోత్సాహాలతో ఊరేగడం

ఊహల ఊయలలో ఊగిసలాడడం భావుకతరాగాల కరుణ ప్రేమ,త్యాగాల

త్రిగుణాత్మకమై 

పిడికెడంత ఆకారంలో అనంతవిషయాల ఆలోచనల ఎదవాకిలిగా చిరు ఆశ 

ఎన్నెన్నో వింతైన విలాస కలాపాల ప్రపంచాన్ని వీక్షింపజేస్తుంది!!

నాలుగ్గోడల  చిరుహృదయం 

మనో వాక్కాయ బుద్ధి వికాసాల అనుభూతుల వరదాయినీ .....!


భక్తిశ్రద్దల సుగుణాల సెలయేరు

వ్యవహారాల దిక్సూచి

పదిలంగా చూసుకో ...! 

బాధ్యతగా కాపాడుకో ...!!

కల్తీ కల్చర్ తో గజంలా దూరముండు


దుర్మార్గపు వ్యసనాలతో... 

గుండెను పొగ చూరనీయకు

పరిమళ భావాలకు సత్యంశివం సుందరంగా నిండైన జీవితాన్ని చంద్రార్క లోకహితంగా 

నిత్య చైతన్యశీలంగా 

పచ్చని చెట్టులా ఎదుగుతూ పరోపకారమిదం శరీరంగా!  

వర్థిల్లమని ప్రబోధించే 

అదృశ్య గాలితంత్రుల గవాక్షం క్షేమం

సర్వ శ్రేయోదాయకమే 

గుండెకు బలం....

సెల్లు చార్జ్ అయిపోతే

గడియారమాగినట్లు 

వ్యవహార సంస్కృతి చెడితే  గుండాగి పోయినట్లు కదా...!


✍️డా.పాండాల మహేశ్వర్

గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.

18

అంశం:- * హృదయం *

*******************

చూసుకో...పదిలం గా...!

********************

లబ్-డబ్ మంటూ .....

గుండె ఆదేవరకే  ....

ఈప్రాణుల గారడీఆటలు

     చెడునంతాస్వీకరించి

మంచిని పంచి...అది...

ఆనందంగా ఉంచేవరకూ

మనము  శివమే....!

అది కాస్తా ఆగిపో తే  ...

శ వా ల మే......!!

మంచీ-  చెడులకు స్పం దించటం దీని ప్రవ్రుత్తి !

ఆనంద-భయాలను ప్రతి స్పందించటంలో...ముందుంటుంది!

దయ,జాలి ,ప్రేమ,త్యాగా  లకు ...యిదే ప్రతీక....!

యివికొరవడిన వాళ్ళను

గుండెలేనిమనుషులని ...మనమనటం   లేదూ !!

ఈ నాలులు గదుల గుప్పెడంత  గుండె ....

ఈ దేహి మనో బుద్ధి చిత్తహంకారాలన్నిటి... అనుభూతులకూ స్పంది  స్తూ...ప్రతిస్పందింస్తుంది కదూ!

జాలితో  హృదయం ద్రవిస్తుంది  !

నమ్మకాన్నివమ్ముచేస్తే...

మోసగించి వంచిస్తే...

ముక్కలై పోతుంది !ఇంక యే మందులూ  దాన్ని బాగుచెయ్యలేవు  !

       దీన్ని మనం ఎంత శ్రద్దగా చూసుకో వాలి ...!

యెంత భద్రతతో  కాపా డు కోవాలి  ...!!

కరకుఉప్పుకాషాయాలతో....కల్తీ నూనెల తో...

ఘాటు మషాలాలతో...

ధూమ,మద్యపాన వ్యస

నాలతో....ఈ గుండెను పొగ చూరించిదానికి భౌతికంగాబాధించో...మానసికంగా హింసించి 

 ఆందోళనలను  పెంచో...

నీ నిండు జీవితాన్ని అర్ధాంతరంగంగా ముగిం చేసుకోకు  !  

దాన్ని పదిలంగా  చూసు కొంటూ...పదికాలాలు పచ్చని చెట్టులా వర్ధిల్లు!! 

*******************

........కోరాడ.

19

కవితా గానం

అంశం: హృదయం

శీర్షిక: ప్రక్రుతి స్పందన 


పకృతి హృదయస్పందన

ధరణిపై ప్రాణుల మనుగడ


ప్రకృతి  ఉచ్వాస నిశ్వాస

అవనిలో ప్రాణుల కదలికలు


పకృతి ఆరాటం

ప్రాణుల జీవన్మరణ పోరాటం


పకృతి లయబద్ధమైన  విన్యాసం

గల గలా పారుతున్న సజీవ నదులు


చల్లని స్పర్శతో సూర్యునికి స్వాగతం

కన్నె మనసుతో వెన్నెలకు  ఆహ్వానం


కలివిడితనంగా కాల చక్రంతో పరుగు

వెచ్చని స్పర్శతో వరుణుడి ఆలింగనం


పులకరించిన పుడమితో రైతు చెలిమి

విశ్వంలో జీవకోటికి

ప్రాణప్రదమైన ప్రకృతి హృదయస్పందన


పేరు: కట్టెకోల చిన నరసయ్య, ఖమ్మం

7981814784

20

ఒంటరిని !


వెండి పూల వాన 

గుండె లోగిలిలోకి 

తొంగి చూస్తే !

కారుచీకట్లలో,,,,,,,, !

ఈదురు గాలికి 

కొట్టుకుంటున్న చిరుదీపం !

లబ్ డబ్ చప్పుడు తప్ప 

మరో చప్పుడు వినపడని 

ఈ చిమ్మచీకట్ల అర్ధరాత్రి 

నేనొక్కడినై !!

నే రాసే రాతలు 

లోకానికి పిచ్చి రాతలై !

ఈ విద్యుత్ దీపాలు 

భగవంతుణ్ణి బందీచేసి 

వెలుగులు చిందిస్తున్నాయా అన్నట్లు !!

గతం తాలూకు ఆనవాళ్లు 

ఈ విద్యుత్ తీగలకు వేలాడేసి 

నేనొక్కడినై !!

జనసంచారానికి దూరమై 

ఈ కరోనా భూతానికి 

ఒకింత భయపడి 

దుఃఖితుడనై 

నేనొక్కడినై,,,,,,,,,, !!

అపరాజిత్

21

కవితాగానం 

రచన : ఇతగిరంచనర్సింహారెడ్డి

గజల్ 

వేలవేల భావాలతొ  వికసించెను హృదయమే 

వేధించే మాటలతో..   విలపించెను  హృదయమే 


అనురాగపు విత్తులనే ప్రేమ జల్లు తడపగా

ఆత్మీయత బంధాలకు.. పులకించెను హృదయమే 


తారలాగ తళతళలే .. లోలోపల కపటమే 

జిత్తులమారి నటనలకు.. రోదించెనుహృదయమే


తడి ఎరుగని జడ జీవులు..  బతికున్నా వృధాయే

 పరిమళాల సుమాలనే..  స్పర్శించెను  హృదయమే


ఆలోచనలెంత లోతు..బుసలుకొట్టె కోట్లకై 

స్వార్థరహిత వృక్షాలను.. హర్షించెను హృదయమే 


ఆత్మగల్ల గుణమునిలుప  ముసుగుదీయు "తగిరంచ"

మనసులలో తేనెలనే..  వర్షించెను హృదయమే

22

*కవితా గానం*

డా.దీపక్ న్యాతి

తేది : 30-09-2020

అంశం : హృదయం

శీర్షిక : మస్తిష్క మారుపేరు హృదయమా


పంచభూతాల సారధి హృదయం

తల్లి గర్భాన చెక్కబడిన శిల్పానికి

హృదయ స్పందన పోస్తుంది ప్రాణం

అవిరామంగా కర్తవ్య పాలనలో

లీనమవుతుంది హృదయం

నిరంతరంగా కదిలే శిల్పానికి

ప్రాణవాయువును అందిస్తుంది హృదయం

మస్తిష్క కుస్తీకి శక్తినందిస్తుంది హృదయం

మనిషి శరీరాంతరాలలో కనబడేట్టుగా

కదలాడే అవయవం హృదయం

అందుకే ఆదిమానవుడు మనిషి ఆలోచనలకు

హృదయం అని నామకరణం చేశాడు

మస్తిష్కానికి మారుపేరుగా హృదయమన్నాడు

ఆ సంభోధన నచ్చిన నవనాగరికులు

హృదయానికి గుణగణాలను అంటగట్టారు

ప్రేమకు చిహ్నంగా హృదయాన్ని

దర్శించి ఆనందిస్తూ ఆత్మీయత పంచుకుంటున్నారు

మొత్తానికి జీవికి హృదయం

ముఖ్యమని ప్రముఖమని గుర్తెరిగారు

హృదయాన్ని హృదయంతో కాపాడుకుంటే

మనిషి జీవితకాలం ఆయుష్షు గడిచేవరకు

ఆరోగ్యంగా సాగుతుందనేది ఘంటాపథం

డా.దీపక్ న్యాతి

హైదరాబాద్

23

[30/09, 9:02 PM] Vineelamma: కవితాగానం

పేరు: విజయదుర్గ

కవితా శీర్షిక : హృదయం

కవితా సంఖ్య: 30

తేదీ: 30/09/20 


అదొక పిచ్చిది ఎత్తుపల్లాలు

తెలీని అమాయక కుసుమం

ఆశల పందిరి కింద పవళిస్తూ

తీయని కలల కౌముది....!!


తనలోకం ప్రేమను పంచే

అమృతలోకం

కనుల ఒలికించు అనురాగ సిరులను

ధమనుల నిండా నా వాళ్ళనే

మమకారమే....!!


ప్రతి బొట్టులో సంతోష అణువులను నింపి

అరుణోదయ కాలాన్ని మోయాలని

ఆశల ఊపిరిని వదిలేను....!!


మనిషికి జీవనాధారమై

బంధాలకు సడిచేస్తూ గమనమై

జ్ఞాపకాల ఒడిలో తానొక భ్రమరమై

సాగేను కాలమంతా....!!

24

[30/09, 9:02 PM] శ్రీకాంత్ కడార్ల Poet: కవితాగానం

అంశం: హృదయం

నిర్వహణ : లలితా కృష్ణ గారు

పేరు:శ్రీకాంత్ కడార్ల

................


హృదయం నాలుగు తలుపులు

ఎన్నో తలపులు..

యదలో ఎప్పుడు స్పందనలు

 ఎన్నో ఊసులు..


హృదయం ఓ రక్తాన్ని పంపుచేసే 

అవయవమే కాదు

ఉద్వేగాలను మోసే కవాటం....


.. గదిగదిలో ఏముంటుందో తెలియదు

మదిమదిని తట్టిలేపునది మాత్రం

హృదయమే....


తాను ఎప్పుడూ ఆగక

మనల్ని ఎచ్చోట ఉంచక

మనమెంటో తెలిసేలా ఉంచే

గుప్పెడు గుండె ఎంత గొప్పది!!!! 


హృదయాన్ని తెరిస్తే

కనిపించే దారులు మల్లెలతో పరచిన రహాదారులు


హృదయాన్ని మూసివేస్తే

నడిచేదారులు నరకయాతన సమములు.. 


హృదయాన్ని తెరవండి ఏ బంధంలో నైనా.. 

గుప్పెడు గుండె సప్పుడు ఎంతో గొప్పగా ఉంటుంది💐💐💐💐💐


Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...