Skip to main content

క్విట్ ఇండియా ఉద్యమం

 



నిర్వహణ: వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం: శివునూరి లలితాకృష్ణ
************************************
కవి వరుల జాబితా
1.ఇంద్రావత్ రాహుల్ గారు
2.కె.ఇ.నిలమంగై గారు
3.డాక్టర్ సి.హెచ్ ఆంజనేయులు గారు
4.ధనాశి ఉషారాణి గారు
5.స్వర్ణ సమత గారు
6. డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
7. వై.కె.సంధ్యా శర్మ గారు
8. వీరా గుడిపల్లి గారు
9. సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
10.ఎ.భూపతి గారు
11.మర్రి జయశ్రీ గారు
12.నారాయణ భాగ్యలక్ష్మి గారు
13.చివుకుల శ్రీ లక్ష్మి గారు
14.వురిమళ్ళ సునంద గారు
15.రాజశేఖరుని శివ లక్ష్మి గారు
16.డా.దీపక్ న్యాతి గారు
17. కోరాడ నరసింహారావు గారు
18.వల్లాల విజయ లక్ష్మి గారు
19.జల్లిపల్లి బ్రహ్మం గారు
20.రాపోలు అరుణా స్వామి గారు
21.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
22.శివునూరి లలితా కృష్ణ గారు

************************

*కవిత గానం*
===========

అంశం : క్విట్ ఇండియా ఉద్యమం 
తేది : 11/09/2020



 బొంబాయి నందు 
జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం 
క్విట్ ఇండియా 
ఉద్యమం చేసిన 
మహానుభావుడు గాంధీ 
స్వరాజ్యం కొరకు
ఆంగ్లేయులను గడగడలాడించిన
మహావీరుడు
 స్వరాజ్య స్థాపనకు 
నిరంతరం కష్టపడినా 
మహా యోధుడు 
శాంతి, అహింసలతో 
ముందుకు వెళ్లి స్వేచ్ఛగా 
బ్రతికే విధంగా చేసిన 
మహా దాత... 


*హామీపత్రం*: ఈ కవిత నేను స్వయంగా రాసాను... అని హామీ ఇస్తున్నాను... 

          ధన్యవాదములు.. 🙏🌹


ఇంద్రావత్ రాహుల్ 
  కొత్తపేట్
నిజామాబాద్ 
9848054079
2.
[11/09, 8:58 PM] Komandoori Neela Poet: అంశం: *క్విట్ ఇండియా*
(పద్యాల రూపంలో)
ఆ.వె1:ఆంగిలేయుల పని యాటంక పరుచగా
పోరు బందరందు పుట్టె నొకడు
న్యాయశాస్త్ర మందు న్యాయ పట్టా నొంది
పోరు బాట నడువ పిలుపు నిచ్చె!

ఆ.వె2:తెల్లవారి పైన తిరుగుబాటు జరిపి
తొలుగు మంద రనుచు పిలుపు నిచ్చె
భారతమ్ము నొదిలి భవిత నొసగుమంచు
పిలుపునిచ్చె గాంధి గెలుపు నొసగె!

ఆ.వె3:శాంతి స్థాపనంబు శాంతిగా చేసేను
నాయుధంబు లేక నాహవమున
జనులు తోడు రాగ జాగృతి చేసేను
తెచ్చె మనకు  స్వేచ్ఛ తెగువ తోడ!

ఆ.వె4:సత్యమైన మాట స్వేచ్ఛయిచ్చునటంచు
సత్య మార్గమందు సంచరించి
పరమ నీచు లైన పగతురులందరిన్
వెడలి పొమ్మనమని హడల గొట్టె!
 
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
చరవాణి సంఖ్య:8897155600.
*ఈ పై పద్యాలు ఈ సమూహం కోసం రాసినవేనని హామీ ఇస్తున్నాను.*
3
[11/09, 9:07 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: బాపు
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు
ఆనాడు తెల్లదొరల ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఢీకొన్న మహానుభావుడు పూజ్య బాపూజీ
రెండు వందల ఏళ్ల పాటు సామాన్యుడైన అసమాన్యుడు
bapu bapu bapu
పోరాడి నాడు ఒంటరిగా భారతదేశమంతా అందరినీ కలుపుకొని
అహింసా పరమో ధర్మముగా
సత్యాగ్రహమే సాధనముగా

విదేశీ వస్తు బహిష్కరణ లో భాగంగా
తెల్ల దొరల గుండెల్లో నిదురించిన బాపు 

విభజించి పాలించే తెల్లదొరలను వెళ్ళిపొండి వెళ్ళిపొండి అంటూ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించి
గో శించిన మహానుభావుడు

మై ఎక్స్పరిమెంట్ విత్ ట్రూత్
గ్రంథంలో తెలియజేశారు
దేశీయమైన వస్తువుల కే ప్రాధాన్యం ఇచ్చాడు
4.
కవిత గానo

శీర్షిక.క్విట్ ఇండియా ఉద్యమం
..........
తెల్లదొరల పాలనలో మగ్గిన
బారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడు దారిలో నిలిచి
అహింస ఆయుధముగా ధరించి
ప్రజల గుండెల్లో స్వరాజ్య భావాన్ని నింపి

 అతివాదుల విప్లవ జ్వాలకి
అహింస వలను విసిరి శాంతిబాటను వేసిన నాయకుడు
బోసి నవ్వుల తోడుగా స్వదేశీ భావాన్ని జనుల గుండెల్లో నిలిపి

విదేశీవస్త్ర బహిష్కరణకు కారకులై చరిత్ర పుటల్లో నిలిచిన ధీరుడు
క్విట్ ఇండియా ఉద్యమంతో 
ఆంగ్లేయుల గుండెల్లో సింహమై నిలిచి

స్వరాజ్యంను ఊపిరిగా నిలిచి
సమస్త భారతీయుల గుండెల్లో నిలిచి స్వాతంత్ర్యమనే భావన నిలిపి
జాతి వివక్షతపై సమరం చేసిన నేత   గాంధీ
అందుకోవయ్యా మా జోహార్లు

 ధనాశి ఉషారాణి
 చిత్తూరు జిల్లా
సత్యహరిశ్చంద్రుని కథలో నుండి స్ఫూర్తి పొందాడు
యంగ్ ఇండియా పత్రిక లో ఎన్నో విషయాలు తెలియజేశారు
జాతి వివక్షతకు వ్యతిరేకంగా అలనాడు దక్షిణాఫ్రికాలోనే పోరాడిన మహానుభావుడు పూజ్య బాపూజీ

ఈ కవిత ఎక్కడ ప్రచురింపబడలేదు దీనికోసమే రచించాను అనుకరణ కాదు హామీ ఇస్తున్నాను 11/9/20

5
[12/09, 8:00 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*12/09/2020*

     *క్విట్ ఇండియా*
    *ఉద్యమం*

భారత స్వాతంత్ర్య సమరంలో
భాగంగా 1942 లో
*క్విట్ ఇండియా ఉద్యమం*
 జరిగింది,
ధర్మా చరణే ధ్యేయంగా
సత్యమే సంరక్షణ గా
అహింసే ఆయుధంగా
సాగిన పోరు,
అది ఒక హోరు
బహు జోరు 
వీరులు అనేకులు కలిసి
కదిలిన కదన ము
వేదభూమి,పుణ్య భూమి
ఆంగ్లేయులను
గడ గడ లాడించిన
 ధర్మ భూమి_కర్మ భూమి
ఇండియా ను వదిలి
వెళ్ళమని హెచ్చరించిన
ఉద్యమము,
మహా సంద్రమై
ఉప్పెన అయి ఉరుమై
ఎగిసే కెరటం లా
రణరంగం లో దూసు కెల్లిన
సైన్యం,
మన భారత మాత ముద్దు బిడ్డలు,
ఎందరో మహానుభావులు.

*స్వర్ణ సమత*
6
[12/09, 8:00 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** క్విట్ ఇండియా ***
                           ✍️డా.పాండాల

కోమటిగను బుట్టి కోట్లాదిహృదయాన
సత్యసూత్ర స్వేచ్ఛ నిత్యవ్రతుడు
దేశమాత సేవ చేయండి మీరంత
చాతగాక పోతె చావు మనెను!

శాంతి దూతగాను సబ్బండ వర్ణాల్లొ
దేశభక్తి నింపె దీప్తి గాను
చెడును వినకు కనకు 
చెడును మాట్లాడకు
జాగృతంబు జేసె జాతిపితగ! 

సత్యమైనవాక్కు కృత్యతేజంబిచ్చు స్వేచ్ఛభావుకతయె స్వీయ యుక్తి
పరమ నీచబుద్ది పాశ్చాత్య సంస్కృతి
వెడలి పొమ్ము పొమ్ము వేగమనెను!

దండిదీక్షజేసి మొండిగా తెల్లోల్ల
గల్లిడిల్లిలందులొల్లిబెట్టి
గుండెకలతలేప గాండీవమేసిండు!
గాంధిమార్గమెపుడుకాంతినిచ్చు!

బోసినవ్వులల్ల బోళశంకరురీతి
త్రిగుణ శక్తి రక్తి తీరుగొప్ప
గీతచేతబూని రాతనే మార్చినా
కర్మయోగి తనది ధర్మ నిరతి!

తెల్లదొరల తరుమ తేజంగ గాంధీజి
పోరుబందరమున పురిటి బిడ్డ
న్యాయకోవిదుండు నవ్యనాగరికుడు
బంధనాలు తెంచె  భవ్యముగను!

✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
7
[12/09, 8:10 PM] Sandya Sharma Poetess: క్విట్ ఇండియా
కవితాగానం
వై.కె.సంధ్యశర్మ
శీర్షిక: క్విట్ ఇండియా!
రాలిపోతున్న రెక్కలను
గుండెల్లో పొదువుకుంటూ
స్వతంత్ర  పోరాట
సమైఖ్యతను చాటిన
ఉద్యమం
క్విట్ ఇండియా.....
మువ్వన్నెల రెపరెపల కోసం
గుబులు రేపే గూడులన్నీ
కదిలి కదిలి కడలి కెరటమై
ఎగసి... పడే అగ్ని కణాల్లా
తెల్లవారి పీఠమణచ
ఎలుగెత్తి చాటింది...
క్విట్ ఇండియా...
ప్రతి భారతీయుని 
పలుకు పలుకు
పోగేసి... దాస్యశృంఖలాలను
వెలివేసి ... స్వేచ్ఛా 
వాయువులనొడినింపుకునే
భరతమాత స్వాతంత్య్ర సిరిగా
ఒక్కటై నిలిచింది 
క్విట్ ఇండియా... నినాదం
బాపూజీ  కలల సౌదం!!
8
[12/09, 8:15 PM] Veera Gudipally: ఇది వీరా గుడిపల్లి కవిత
12092020
క్విట్
***************
వంద సంవత్సరాలు
వంగొంగి సలాం చేశాం
వ్యాపార మంటే నమ్మి
వంచనకు గురయ్యాం

ఝాన్సీ,సైరా, ప్రతాప్, అల్లూరి
మడమ తిప్పని పోరాటాలు 
ప్రాంతాలకే పరిమితమైనా
ఆశలు నాటి ఆంకాక్షలను చిగురిపజేశారు
సిపాయిల తిరుగుబాటు
చిదిమేయ బడినా
తుపాకి లేకుండా, రుమాలు వదలకుండా
హింసకు తావివ్వకుండా
దేశమొదిలి పొమ్మని నినదించే ధైర్యం
గుండెల్లో కొలువైన బోసినవ్వుల తాత
పలికించిన నినాదం
క్విట్ ఇండియా
..... *ఇది వీరా గుడిపల్లి కవిత*
9
[12/09, 8:18 PM] STTRao Kama Reddy Poet: క్విట్ ఇండియా

తక్షణమే ఇండియాను
వదిలి వెళ్ళండి అని మహోద్యమ
ఉగ్రరూపము ధరించి బ్రిటిష్ వారిపై
నిరసనలు వెల్లువెత్తాయి 

అహింసామార్గము ద్వారా శాంతియుత పోరాటము ద్వారా
గాంధీజీ సిద్దాంతము అహింసయే పరమధర్మమని నినదించెను 

స్వేచ్చాయుత భావనల ద్వారా
స్వతంత్రమే ధ్యేయముగా 
క్విట్ ఇండియా ఉద్యమము కదిలింది

సింహగర్జనలె గర్జించిన ప్రజలు బ్రిటిష్ వారి దాస్యశృంఖలాల నుండి
విముక్తి కొరకు పోరాటం సాగింది
క్విట్ ఇండియా నినాదము భారతదేశమంతట మారుమ్రోగింది

బ్రిటీష్ గుండెలో వణుకు పుట్డింది
గాంధీజీ కలలు సాకారమైయే 
దృశ్యరూపము

సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
10
[12/09, 8:30 PM] Bupathi Sir: ....క్విట్ ఇండియా ఉద్యమం...

సంప్రదాయలొక వైపు..
శాస్త్రాలు మరొక వైపు...వర్ణవ్యవస్థ ఇంకొక వైపు..దేశంలో నిండిఉన్న నాడు....బ్రిటిష్ వారు సంస్థానాల ద్వార సామ్రాజ్య విస్తరణ గావించగా...నిరకరస్యత నిండిన కాలన...బాంచన్
దొర అనే రోజుల్లో... సాగుతున్న 
స్వేచ్ఛ స్వతంత్ర సంగ్రామనికి 
బక్కపలసని బాపు సత్యహింసలే ఆయుధాలుగా
మలచి అనక, అనేక పోరాటాలు చేసిన మహాశక్తి
మన బాపు....బ్రిటిష్ వారి
దారుణాలకు తుపాకీ గుండు 
లేకుండా ఎదురునిలిచిన 
ధీరుడు గాంధీ....
జైలు జీవితలెన్నో, అనుభవించిన
ఆదర్శ  జీవనం గాంధీ ది
బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి
పంపించే ఉద్యమానికి నాయకుడిగా బ్రిటిష్ వారి
గుండెల్లో దడ పుట్టించిన బోసి
నవ్వుల బాపు క్విట్ ఇండియా
ఉద్యమాన్ని ఉదృతం చేసి ప్రపంచానికి దారి చూపి
దేశ స్వాతంత్య్రానికి మూల
పురుషుడయినాడు గాంధీ...

ఈ కవిత నసొంతం ,గతం లో 
ప్రచురించ లేదు .

ఏ.. భూపతి.. హైదరాబాద్..
11
[12/09, 8:33 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..క్విట్ ఇండియా ఉద్యమం.
శీర్షిక...భావితరాలకు స్ఫూర్తి


రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో
బాంబే కాంగ్రెస్ కమిటీలో
మహాత్ముడు ఆరంభించిన ఉద్యమం
బ్రిటిష్ పాలకుల గుండెల్లో ఫిరంగులు మ్రోగించింది
భారత స్వాతంత్రోద్యమాన్ని ఉదృతం చేసి
జాతి యావత్తు తరలి వచ్చేలా
ఉద్యమానికి ఊపిరి పోసింది
సహించని వలసపాలకులు
ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపిన
చెదరని గుండెధైర్యంతో
డూ ఆర్ డై అనే నినాదంతో
యూసుఫ్ మెహరల్లి సూచించిన పదం క్విట్ ఇండియా
భారతీయుల మదిలో బలంగా నాటుకున్న నినాదం
భారత జాతి ఆత్మగౌరవం
సంపూర్ణ స్వరాజ్య కాంక్షను రగిలించి
స్వాతంత్ర్య సంగ్రామాన్ని మలుపుతిప్పింది
అధికార మదంతో విర్రవీగే ఆంగ్లేయులుస్వచ్ఛందంగా భారత్ ను విడిచి వెళ్ళాలి అనేలా ప్రభావితం చేసింది
క్రిప్స్ మిషన్ విఫలమై
గోవాలియా ట్యా0క్ మైదానంలో 
జాతిపిత అహింసా మార్గంలో ఆరంభించిన ఆగస్టు 1942 ఉద్యమం
ఆంగ్లేయులలో సంచలనం సృష్టించింది
భావితరాలకు స్ఫూర్తిగా నిలిచింది.
12
[12/09, 8:37 PM] Bhagya Laxmi Kanipakam Poetess KS 42: కవితా గానం
నారాయణ భాగ్యలక్ష్మి
కవితా శీర్షిక:

సమతా ఐక్యతల శాంతి మంత్రం
***************************
మితిమీరిన ఆంగ్లేయుల 
అంతులేని ఆరళ్లకు 
విసిగి వేసారిన 
సహనమే క్విట్ ఇండియా..

వ్యాపారమంటూ వచ్చి
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు బలహీనతలతో ఐక్యత చెడగొట్టి 
మనలో మనకే చిచ్చుపెట్టిన
గుంతనక్కల వెలివేతే క్విట్ ఇండియా ..

మతిలేని పన్నుల ముష్కరుల దౌర్జన్యం
ఉక్కుపాదమై బానిసలుగ అణుచుటను
సహించని భారత శౌర్య సింహాల  
శాంతి మార్గమే క్విట్ ఇండియా..

స్వతంత్ర పోరాట సాత్విక ఉద్యమమై అహింసామార్గంలో బాపూజీ నేతృత్వంలో  ఆంగ్లేయుల గుండెల్లో అదురు పుట్టించిన
మహాత్ముని ఐక్యతా నినాద ఆయుధమే
క్విట్ ఇండియా .. 

సమతా ఐక్యతల శాంతి మంత్రం 
స్నేహ సౌబ్రాతత్వపు అద్భుత తంత్రం
బోసి నవ్వుల బంగారు బాపూ సూత్రం  స్వాతంత్ర్య ఫలాల సాపల్యా చత్రం.. క్విట్ ఇండియా
13
[12/09, 8:39 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం 
తేదీ: 12 -09- 2020 
అంశము: క్విట్ ఇండియా 
పేరు: చివుకుల శ్రీలక్ష్మి

          "డు ఆర్ డై"
వ్యాపారం కోసం వచ్చిన తెల్లదొరలు
హద్దూ- అదుపూలేని శాసనాలు
స్వేచ్ఛ కోసం తిరగబడ్డ ప్రజలు
చేశారు ఎన్నో ఉద్యమాలు!
యుద్ధమంటే తీరని కాంక్ష పాలకులకు
యుద్ధమంటే లాభాలే వ్యాపారులకు
స్వేచ్ఛా నినాదమే ఉద్యమకారులకు 
తక్కిన ఉద్యమాలు నీరు కారగా
అహింసా సిద్ధాంతమే మహాశక్తిగా
పిలుపునిచ్చారు గాంధీ
క్విట్ ఇండియా! క్విట్ ఇండియా!
ద్వితీయ ప్రపంచ సంగ్రామంతో
ముడిపడ్డ ఈ ఉద్యమం
అఖండ భారతావని
హిందూ ముస్లింగా విడిపోయేందుకు  
అంకురార్పణం!
బానిసలుగా బ్రతికే కంటే
దేశాన్ని చెర విడిపించు లేదా చావు
      డూ ఆర్ డై
బ్రిటిష్ పాలన అంతం కోసం నినదించారు
ఈ దేశం వదిలి పో! ఈ దేశం వదిలి పో!
తెల్లవారికిది సహింపరాని భావన
కలిసిరాని నాయకుల వలన
నిర్దాక్షిణ్యంగా అణిచివేత!
ఉద్యమమంటే తీవ్ర భావాలుగా
గాంధీ మాటకు వ్యతిరేకంగా
సమ్మెలూ హర్తాళ్ లూ 
ప్రభుత్వ ఆస్తులు దగ్ధం
కమ్యూనికేషన్ విచ్ఛిన్నం
ఫలితం లక్షలాదిమంది జైలుపాలు
లాఠీ దెబ్బలు పోలీసుకాల్పులు
అమాయకుల దుర్మరణాలు
ఎవరు దోషులు? ఎవరు నిర్దోషులు?
విచారణ లేదు కఠిన కారాగారవాసమే!
గాంధీజీ 21 రోజులు ఉపవాస దీక్ష
కస్తూరిబా మరణంతో క్రుంగిపోయి 
అనారోగ్యం పాలయ్యే గాంధీజీ!
14

*కవితా గానం*
తేదీ:12-09-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం:
 *క్విట్ ఇండియా ఉద్యమం* *******************
మహాత్ముని 
మనో ధైర్యం లోంచి ఉదయించిన ధర్మాగ్రహం!
చావో రేవో తేల్చుకునేందుకు
నడుం కట్టిన సాహసం!

స్వాతంత్ర్య బీజాలు పురుడు పోసుకుని
కణ కణ మండే ఉద్యమ కణికలై..

క్రమబద్ధమైన బ్రిటిష్ ఉపసంహరణ కోరుకుంటూ
సాగిన భారీ నిరసనోద్యమం!
ఎటు చూసినా ఉవ్వెత్తున ఎగిసిపడిన సమైక్యతా రాగం!

క్విట్ ఇండియా ఉద్యమాన్ని
క్వయిట్ ఇండియాగా అణిచివేతకు పాల్పడిన 
విభజించు పాలించు అనే  బ్రిటిషు వారి దౌత్యం!

ప్రాణాలను పణంగా పెట్టిన గాంధీ మహాత్మునికి జైలుశిక్ష
సామూహిక నిర్భంధాలతో బ్రిటిష్ ప్రభుత్వం చూపిన దుష్టత్వం!
శాంతి యుత ఉద్యమాన్ని
సంక్లిష్టమైన తిరుగు బాటును చేసినా
 నేర్చుకుంది గుణపాఠం..

బాపూజీ అడుగు జాడల్లో నడిచే 
దేశ ప్రజల సమైక్యతా నినాదం
15.
[12/09, 9:01 PM] Lakshmi Chamarthi Khammam: విప్లవ ధిక్కార స్వరమై… 

 శతాబ్దాలు సుదీర్ఘ మౌనాన్ని  బద్దలుకొట్టి
 జాతి గళాల్లో 
 అస్తమించని రవి విస్తుపోయేలా
  నినదించిన ధిక్కార స్వరం
 క్విట్ ఇండియా ఉద్యమం..

 సత్యం శివం సుందరమై 
 జాతీయ ఔన్నత్యాన్ని చాటే
 కీర్తి పతాక రెపరెపలు
 గుండె గుండెల్లో
 రగిలిన స్వాతంత్ర కాంక్ష పరాకాష్ట
 క్విట్ ఇండియా ఉద్యమం….

 ధర్మచక్రంపై నిలిచిన సింహాలై 
 జాతి యావత్తు
 నిప్పు రవ్వలై  గర్జిస్తూ కదం తొక్కి
 తెల్ల జాతిని తరిమికొట్టిన
 విప్లవ శంఖారావం 
 క్విట్ ఇండియా ఉద్యమం…..

రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి 
కల్లూరు 
ఖమ్మం జిల్లా
16
[12/09, 9:04 PM] దీపక్ న్యాతి: *కవితా గానం* 
పేరు : డా.దీపక్ న్యాతి
తేది : 12-09-2020
అంశం : క్విట్ ఇండియా ఉద్యమం
శీర్షిక : స్వాభిమానం

నే పుట్టిన గడ్డ నాది
నా పూర్వీకుల వేదభూమిది
అతిథిదేవోభవ అన్న పాపానికి
సాయంచేయ చేయి నందించిన తప్పిదానికి
మాకే రాజులయ్యారు మృగరాజులు
ఓర్పుకూ హద్దులుంటాయని మరిచారు
బానిసత్వ బంధనాల నుండి
విముక్తి నాశించిన స్వాభిమాన భారతీయులు
దౌర్జన్య పాలనపై దండయాత్రలనక
ఐక్యమత్యంగా వందేమాతరం అని
శాంతి కపోతాల సహజ గుణ సంపన్నులైన
భారత దేశ హిందుస్తానీయులు
హింస జోలికెళ్ళక శాంతియుతంగా
అహింసావాది మహాత్మాగాంధీ
నేతృత్వాన పెల్లుబికిన ఆందోళన
క్విట్ ఇండియా ఉద్యమం
నాటి పరిపాలన యంత్రాంగ నేతలను
బ్రిటిషు దేశ గుమస్తాలను
దేశం వదలి పో నాదేశం వదలి పో
మా భారతదేశం వదలిపో
శాంతియుత గర్జన గడగడలాడించి
బ్రిటిష్ గుండెల్లో భయం గుండ్లను పేల్చింది
క్విట్ ఇండియా ఉద్యమం తో
లండన్ వరకు పరుగు పెట్టించింది
భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టింది
క్విట్ ఇండియా ఉద్యమం

డా.దీపక్ న్యాతి
హైదరాబాద్
17
[12/09, 9:09 PM] Korada: కవితాగానం
అంశం:- క్విట్ఇండియా
కోరాడనరసింహారావు !
స్వాతంత్ర్యసాధనలో ....
          కీలక పాత్ర....!!
    ***************
1942-ఆగష్టు 9.చారిత్రిక ప్రదేశంకాబోతున్న....ముంబై ప్రగతి మైదాన్ !
ఊపిరి  పోసు కుంది....
భారతస్వాతంత్ర్యోద్యమ 
ఉగ్రరూపం...క్విట్ఇండియా ...!
సోషలిష్టుల కీలక పాత్ర తో...డూ ఆర్ డై...గాంధీ నిర్ణయప్రణాళికతో1000 
మంది దేశ భక్తుల ప్రాణ త్యాగాలతో....నాయ కత్వము లేకనే నడచి ఊపందుకున్న....
ఉద్యమం...!
తాత్కాలిక ప్రభుత్వ ఏ ర్పాటుకు అనుమతి  పొందీ ...గాంధీ-జిన్నా 
చర్చలువిఫలమై...అవాంతరమేర్పడినా...,దేశ విభజనకూ  ఇది బీజ మైనామతకలహాలలో ఎన్నోవేలప్రాణాలు బలైపోయినా  ...స్వాతంత్ర్యసాధనలో ఈ క్విట్ ఇండియాఉద్యమమేకదా కీలకం!
భారతదేశస్వాతంత్ర్య చరిత్రలో చెరగని ముద్ర యే  ఈ క్విట్ఇండియా
ఉద్యమం....!!
*******************
.....కోరాడ.
ఎప్పటికైనా తప్పదు భారత్ ను వదిలి వెళ్ళడం!
 క్విట్ ఇండియా కలిగించింది
బ్రిటిష్ ప్రభుత్వ గుండెల్లో కలకలం!
క్విట్ ఇండియా మాట
తెరమరుగాయె!
                ***********
18

[13/09, 9:08 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *క్విట్ ఇండియా ఉద్యమం* 
*************************
మహాత్ముని మార్గదర్శనాన
మహాప్రభంజనమై సాగిన జైత్రయాత్ర
బ్రిటీష్ సామ్రాజ్య సింహాసనాన్ని
కదిలించిన అజేయ జనయాత్ర

దేశభక్తి ప్రభోధిత స్ఫూర్తిమంత్ర0
స్వతంత్రసిద్దికి రెండవ ప్రపంచయుద్ధకాలమే
అనుకూలమని భావించి ఇచ్చిన నినాదం
*సాధించు లేదా మరణించు*

సాధారణ ప్రజలకు గాంధీజీ నినాదం
'ఇండియాను వొదిలి వెళ్ళు"మని నల్లపాలనా 
తెల్లదొరలు బ్రిటీష్ వారిని హెచ్చరి0చిన 
అద్వితీయ ద్విముఖ వ్యూహం

స్వాతంత్ర్య సాధనా ఆయుధం
పరాయిపాలనా విముక్తికి విశేష అస్త్రం
శత్రువుతో చేసిన ఆఖరిపోరాటం
దేశభక్తిపరుల అద్భుత ప్రజాప్రభంజనం

ఉప్పెనై బ్రిటిష్ వారి పరిపాలనా చాప కిందకు
నీళ్లు తెచ్చిన ప్రచండ తుఫాన0టి ఉద్యమం
మరపురాని మహోజ్వల ఘట్టం
భారతదేశచరిత్రలో కీలక *క్విట్ ఇండియా ఉద్యమం*

:వల్లాల విజయలక్ష్మి
ఆలేరు
19
[13/09, 9:26 PM] +91 96428 92848: కవితా గానం
౼౼౼౼౼౼౼౼
క్విట్ ఇండియా ఉద్యమం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

మర్రి విత్తనం చిన్నదే మహా వృక్షమై నీడ నిస్తుంది
ఊహించని ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ఆకాశాన్ని ప్రజ్వలింప జేస్తుంది
హింసను అహింస అమాంతం మింగేస్తుంది ...ఒక యోగి గుండెలో గూడు కట్టుకున్న అహింస మంగళధ్వనులతో దేశమంతా మారుమ్రోగింది.. దుష్ట శక్తులు దూరమవ్వాలని  దేశానికి పట్టిన అరిష్టం తొలగాలని  కర్మయోగిలో కదలిన సంకల్పమే ఈ ప్రభంజనం..సంకెళ్ళతో సంకల్పాలను బంధించలేరు  కారాగారంలోకి తరలించడం నిప్పును గుప్పిట్లో నిలపాలను కోవడమే...నింగి  అంచులను  చెరపాలను కోవడమే..అవుతుంది
తెలివి లేని తెల్లముఖాలకు తెలియదు..లాటీలు విరిగినా తూటాలు పేలినా..ఉద్యమం ఊపందుకుందే తప్ప ఊరట పొందలేదు..తనను తాను తపింప జేసుకుని దేశంకోసం ఆవిరై పోయిన యోగి ఆత్మ. త్రివర్ణపతాకమై రెపరెప లాడుతుంది..దేశ తలమానికమై....

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
                జల్లిపల్లి బ్రహ్మం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
20
[13/09, 9:29 PM] Rapolu Aruna Siripuram Poet: అంశం:క్విట్ ఇండియా

శ్వేత జాతీయులారా
వెళ్లిపోండి
మా దేశాన్ని విడిచిపెట్టి
వెళ్లిపోండి

మానేలపై మీపెత్తనం
చెల్లదింకను వెళ్లిపోండి
పరతంత్ర పాలనలో 
చాలునింక మీ దూరాగతాలు

మాదేశంలో నాటుకు పోయిన
విదేశీే పాలనావిషవృక్షాన్ని
కూకటి వేళ్ళతో పెకిలించేస్తాం

ప్రాణాలు తీయాలంటే ఆలోచిస్తాము కానీ
దేశంకోసం ప్రాణాలనుఅర్పించుటకు
ముందుంటామ్

లాఠీదెబ్బలకోర్చి,
జైలు గోడల్లో కఠిన శిక్షలను అనుభవించి,
మానవతుల కించపరిచే మీ దుశ్చర్యలు చూస్తూ
,మీకు దాస్యం చేస్తూ.....

ఇంకానా ఇక చెల్లదు
మా దేశాన్ని విడిచి వెళ్లిపోండి
క్విట్ ఇండియా
జై హింద్
✍రాపోలు అరుణాస్వామి, సిరివురం
21
[13/09, 9:29 PM] Balloori Umadevi Poetess: కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం: క్విట్ ఇండియా ఉద్యమం

పరపాలన అంతం చేయాలన్న సంకల్పంతో
పిలుపు నిచ్చెను జాతికి  బాపూజీ
దేశం వీడి హెచ్చరికలు చేస్తూ
సాధించడమో చావడమో చేద్దామంటూ
ముందడుగు వేసిన నేతలతో కదిలెనుదేశం వడివడిగా
రెండవ ప్రపంచ యుద్ధం తో మొలకెత్తిన బీజం 
మొక్కై మానై ఎదిగినంతనే
ఆగ్రహించిన తెల్లదొరల ప్రతాపంతో నేతలెల్ల
చెరసాలల పాలైపోగా
శాంతి అహింసలు ఆయుధాలుగా క్విట్ ఇండియా నినాదంతో ఆంగ్లేయుల గుండెల్లో గుబులు రేపిన ఉద్యమమిదియే  స్వరాజ్యకాంక్షను ఏ దిశలో సాగినదీ ఉద్యమము స్వాతంత్ర్య సాధనకు బీజమై దారి దీపమై సాగినదీ క్విట్ ఇండియా ఉద్యమం
22
క్విట్ ఇండియా ఉద్యమం 

 దౌర్జన్యపుసెగల్లో 
దమనపు పొగల్లో 
రగిలిన మనసులకు 
విసిగి వేసారిన
బానిసత్వపు బతుకులకు 
బాసటగా నిలిచిన వాదం 
వలస పాలకులతో  విబేధించిన వివాదం 
బాపూ అందించిన నినాదం 


పాశ్చాత్యుల పడగనీడనుండి 
దేశం సొంతం చేసుకోవడమో...
దేహం అంతం చేసుకోవడమో
తేల్చుకుందామన్న తెగింపుప్రస్థానం 

 
 మనోనిబ్బరపు శస్త్రం తో
  మహాత్మునితో మమేకమై
స్వేచ్చాభారతికై సాగించినసమరంలో 
పూరించిన అహింసాశంఖం 

ఆత్మాభిమానపు  ప్రతీకలు
ఆత్మ గౌరవాన్ని పతాకస్థాయికి చేర్చిన సందర్భమది 
*ఆంగ్లేయులను తరిమిన ఆగస్టు ఉద్యమమది*

*********లలితాకృష్ణ

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...