Skip to main content

చరవాణి 18/09/2020




 నిర్వహణ

వీరా గుడిపల్లి

The mathematics teacher and poet

శివునూరి లలితాకృష్ణ

మెరుగు మధు

ఐతగోని వెంకటేశ్వర్లు

*****************-***

కవి వరుల జాబితా

1.సత్య నీలిమ గారు

2.శ్రీలక్ష్మి చివుకుల గారు

3.కోరాడ గారు

4.డాక్టర్ ఆంజనేయులు గారు

5.మేడిశ్రీ గారు

6.కందూరి సుజాతా రాణి గారు

7.కె.సి.నరసయ్య గారు

8.దేశపతి మోహన్ శర్మ గారు

9.అమరగాని మధు గారు

10.వేంకట కృష్ణ ప్రగడ గారు

11.సునంద వురిమళ్ళ గారు

12.కె.ఇ.నిలమంగై గారు

13.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు

14.కోరాడ గారు

15.స్వర్ణ సమత గారు

16. డా.పాండాల మహేశ్వర్ గారు.

17.ఏ.భూపతి గారు

18.సంధ్యా శర్మ గారు

19.రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి గారు

20.ధనాశి ఉషారాణి గారు

21.శివునూరి లలితా కృష్ణ గారు

22.వల్లాల విజయ లక్ష్మి గారు

**************

1.

[18/09, 8:11 PM] కె. సత్యనీలిమ 

వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: *కవితాగానం*

*శీర్షిక : చరవాణి మోజు*

కాశీకి వెళ్ళినా రామాహరి

చేతిలో చరవాణి ఉండాలి రామాహరి

ఫుల్ చార్జింగ్ లో ఉండాలి రామాహరి

శ్రీశైలమెళ్ళినా రామాహరి

సెల్ఫీలు తీయాలి రామాహరి

యూట్యూబ్ లో వీడియోలు పెట్టాలి రామాహరి

అన్నమక్కరలేదు రామాహరి

అంతర్జాలం ఉంటే చాలు రామాహరి

ముఖచిత్రం చూడాలి రామాహరి

లైకులే రావాలి రామాహరి

కైలాస మెళ్ళినా రామాహరి

వాట్సాప్ ఓపెనే రామాహరి

ఫోటోలు షేరింగు చేయాలి రామాహరి

నిద్ర అన్నది లేదు రామాహరి

చేతిలో చరవాణి ఉంటే చాలు రామాహరి

4G స్పీడులో రామాహరి

ఇయర్ ఫోన్ పెట్టుకుని రామాహరి

పాటలే వినాలి రామాహరి

డ్యాన్సులే చేయాలి రామాహరి....

             ✍....సత్యనీలిమ,

             వనపర్తి

9502156813

2

[18/09, 8:28 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం 

తేదీ: 18-09-2020 

అంశము: చరవాణి

పేరు చివుకుల శ్రీలక్ష్మి

 *ప్రాణాలు నిలిపే సంజీవని* 


చరవాణి అందరికీ ప్రియవాణి 

అచ్చంగా పాతికేళ్ళ పూబోణి

మనసులను మాయ చేసిన విరిబోణి

అరచేతిలో పట్టేసిన రంగుల ఓణి! 

మొదటి సెల్యులార్ ఫోన్ మోటారోలా

స్మార్ట్ ఫోన్ మన చేత చిక్కి పాతికేళ్ళే!

సోనీ బ్లాక్ బెర్రీ నోకియా మనతో

జతకూడి ఇరవై ఏళ్లయింది

ప్రపంచమే అరచేతిలో ఇమిడింది

స్మార్ట్ ఫోన్ ఫీచర్ ఫోన్ 2G 3G 4G 5G……..

వైఫై, బ్రాడ్ బ్యాండ్, ఇంటర్నెట్ ఉంటే చాలు

రేడియో టీవీ సినిమాలు పాటలు

కెమెరాలు ఫోటోలు వీడియోలు సెల్ఫీలు

సమస్తం అందులోనే!

మొబైల్ ఆటలు ఎన్నో ..ఎన్నో .ఎన్నెన్నో..

కొంప ముంచే ఆటలు

బ్రతుకు కొల్లేరు చేసే క్రీడలు

వ్యాపారాలు వాణిజ్యాలు గ్యాంబ్లింగ్ లు

ఇంటి ముందుకే సమస్తం తెచ్చేసే యాప్ లు

ఆధ్యాత్మిక ప్రవచనాలు

కవి సమ్మేళనాలు, సన్మానాలు

64 కళలూ ఆన్ లైన్ లో నేర్పే 

నిష్ణాతులైన గురుదేవులు

అంతర్జాల తరగతులూ,పరీక్షలు

అంతర్జాతీయ సెమినార్లు వెబ్ నార్ లు

ప్రపంచ విశేషాలన్నీ చుట్టి వచ్చి 

అందంగా చూపించే యాత్రీకులు

ఐఫోన్ ఆండ్రాయిడ్ పుట్టి పదేళ్ల పిల్లలయారు

బ్రతుకుతెరువుకి ఇదే మార్గం అంటూ వచ్చారు

చాకలి పద్దూ కిరాణా పద్దు మందులు వంటలు పిజ్జాలు బర్గర్లు అన్ని అమ్మకాలు అందులోనే

మూడేళ్లలో విశ్వవ్యాప్తమైంది

90 శాతం మందికి చరవాణి చేతిలో ఉంది

గొంతు వినాలన్నా మనిషిని చూడాలన్నా కుటుంబమంతా పలకరించుకోవాలన్నా

వైఫై ఉంటే చాలు

గృహప్రవేశాలు పెళ్లిళ్లు బాలసారెలు

శస్త్ర చికిత్సలు శవదహనాలు పిండప్రదానాలు 

అన్ని అందించే చూపించే చరవాణి

ఎన్నడూ చూడని మహనీయులనూ

అద్భుతమైన ప్రదేశాలనూ

అరచేతిలో చూడడం మాట్లాడడం

సాధ్యమైందిప్పుడు

ఓం సాంకేతిక రాణీ!

చరవాణీ!

స్వేచ్ఛగా తిరిగే మనిషి

అయ్యాడు నీకు గులామ్!

స్వేచ్ఛ కోరుకుంటూనే

చేస్తున్నాడు నీకు సలామ్!

           ************

3

[18/09, 8:30 PM] Korada: కవితాగానం 

    అంశం:- చరవాణి

కోరాడ నరసింహా రావు!

     @వీడని నైజం@

    ###########

ఏది ఏమైనా...విజ్ఞాన వికాసం...హర్ష నీయమే!

యుగాలకాలపుసనాతనఅద్భుతాలను అవన్నీ

పుక్కిటిపురాణాలనికొట్టిపారేసిన వాళ్ళమే...!

ఓ చిన్ని బోషాణంలాంటి

పెట్టెలోనించి ...ఓ ఆహ్లాద కరమైన పలకరింపు సంగీతస్వరంతో ...ఆకాశవాణి విశాఖ పట్నం కేం ద్రం...అని వినిపించ గానే

పులకించిపోయేవాలం !!

తృప్తి తీరని అన్వేషణ...

ఫలం గా టేపు రికార్డర్ లనుచూసి...మురిసిపోయాం !

కేవలం వినిపించటమేనా

కనిపిస్తూవినిపించాలనేఆశ ఫలించి...టీ వీ లు గాఅవతరిస్తే ...ఉత్సాహపుఉరకలు.. ..!!

అవిఎక్కడుంటే...అక్కడికిమనంకాదు ...మనమున్నచోటనేఅవి ...అదంతా మన అరచేతిలోకే...

సంకల్పంసిద్దించి...స్మార్ట్ఫోనై  చేతిలో...!

ప్రపంచాన్నిమనపాకెట్ లలో పదిల పరచి చర వాణియై వినుతికెక్కింది 

మనం ఎక్కడవుంటే  ...

అక్కడి నుండే...సకల విశ్వ చిత్ర,విచిత్రా లన్నీ

భూత,భవిష్యత్,వర్తమానాలన్నీ క్షణాల లో...!!

యిది మనిషి సృష్టించిన  అద్భుత అక్షయ పాత్ర !

జీవితంలోనిప్రతికోణాన్నీ

పెనవేసుకుంది...!

అన్ని ప్రశ్నలకూ ఒకటే...

పరిష్కారపరికరమై....

ప్రగతిపదంలో పరుగులు తీయిస్తోంది...!

ఇన్నిగుణాలున్న ఓ చర వాణీ ...నీలోనూదోషాలనునింపాడీమనిషి...!

కిర్రెక్కిoచే వెర్రి వ్యామో హాలనునీలోనింపి...వినూత్న  వింత నేరాలకు నిన్ను పావు ను చేసి...

మతిపోగొట్టే బూతులను

నీకతికించి...మాయని

మచ్చను నీ కాపాదింప

జేస్తున్నాడీ మేధావి..!

పూజించ వలసిననిన్ను

తిట్టిస్తున్నాడు...!!

నీదగ్గరా  తన నైజాన్ని

వదులుకోలేదు...!

మనిషిబుద్ధిపోనిచ్చుకోలేదు....!!

********************

.......కోరాడ.

4


[18/09, 8:35 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: చరవాణి మోజు

డా సిహెచ్ ఆంజనేయులు

ఎంత దూరం వెళ్ళినా

చరవాణి అంటేనే హృదయం లేచి వస్తుంది

దూర తీరాల్లో ఉన్న బంధువులను చిన్ననాటి మిత్రులను కలిపేది చరవాణి

షిరిడి వెళ్లిన రామప్ప వెళ్లిన నా ఫోటోలు తీయాలంటే కావాల్సింది చరవాణి

ముసలి ముతక పసి బాలుడు ఆడ మగ పెద్ద చిన్న తారతమ్య మే లేదు


ఫోటోలు కాదు షేరింగ్ చేసుకోవాలంటే చరవాణి కావలసిందే సెల్ఫీలు దిగుతూ మర్చిపోతే నదీ తీరాలలో ప్రాణాపాయాన్ని కొని తెచ్చుకున్న విద్యార్థులు ఎందరో

చరవాణి లేందే ఒక క్షణమైన గడవదు

విద్యార్థులకు నేడు పాఠ్యాంశాల బోధన జరగాలంటే ఆన్లైన్ క్లాసులకు 

చరవాణి అంటేనే ఒక డిజిటల్ యుగం అన్నట్టు చరవాణి ఎవరు కనిపెట్టారో కానీ అందరికీ ఈరోజు తప్పనిసరి నిత్య అవసరమైంది

ఈనాడు సాఫ్ట్వేర్ ప్రపంచంలో చరవాణి ఆధిక్యత ఎంతో తెలుసు కదా


పాఠ్యాంశాల ఫోటోలు పెట్టి విద్యార్థులకు ఆన్సర్లు నోట్స్ ఇస్తున్నాం


చరవాణి ఆధిక్యత సాధించింది

వీడియోలు పెడుతున్నావ్

యూట్యూబ్ లో పాటలు పెడుతున్నాం

చరవాణి విశ్వానికి చక్రం తిప్పే

శక్తి శాలిని

ఎవరు ఎవరు ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్న ఒక్క సింగిల్ కాల్ చాలు

మనకు కనెక్ట్ అవుతారు


జయహో జయహో ఇదే ఆధిక్యత 

విశ్వంలో నేడు


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

5

[18/09, 8:39 PM] Shiva Kumar Medisree: ......... పోరాటం......

మనం పోరాడినపుడూ... 

అస్థిత్వానికై ఆరాట పడినప్పుడూ ...


ఆంక్షలన్నింటినీ

తుంగలో తొక్కినాము


అడ్డంకులకు

ఎదురొడ్డినాము..


అధికారం

గద్గధ స్వరమైతే


పోరాటానికి

ఎవరైనా ఎదురైతే


తిట్ల దండకానికి 

ఏ వక్తా మన ముందు నిలువలేడు


మన చాణక్య నీతి ముందు

ఏ తంత్రమూ ప్రదర్శించలేడు


అనుకున్న ప్రకారం

కోటలో పాగా  వేశాము


అందరూ....

వంతలు పాడేలా చేశాము


త్యాగ ధనులను కీర్తిస్తేనే కదా

మనం పీఠం పైకి ఎక్కేది..


కొండమీద కోతిని తీసుకురాలేమని

తెలిసినా..


కోరికల్ని ఎరవేసే కదా

మనం కోటలోకి జొచ్చింది..


నమ్మిన వాడినే కదా

నట్టేట ముంచేది..


పోరాడిన ఆట పాట

అందలమెక్కింది..


మిద్దెలు,గద్దెలు దొరికినంక

పక్క వాయిద్యాలతో పనేముంది 


అన్ని చేతులు కలిసి

శిఖరానికి చేర్చాయి..


భుజాలన్నీ కలిసి

పతాకాన్ని మోసినాయి


ప్రశ్నించే గొంతులు లేకుండా

చేశాము


పక్కలోని బల్లాన్ని 

పరువంగా మార్చుకున్నాము..


వంది మాగధులు

ఎక్కువై పోయారు


అప్పుడు అడ్డు పడిన వాళ్ళు

ఇప్పుడు ఆప్తులై పోయారు


పోరాడిన యోధులేమో

పలుచనై పోయారు


భుజ కీర్తులేమో

ఎక్కువై పోయారు..


భజన కీర్తుల ముందు

నిలువ లేక పోయారు

తాయిలాలకు అలవాటైన జనం

ప్రశ్నించడం మరిచిపోయారు

6

[18/09, 8:56 PM] కందూరి సుజాత Poetess: శీర్షిక... చరవాణి

🌸🌸🌲🌲🌸🌸

పవన వీచికలచేత కర్ణబేరిని సృజిస్తూ -

గుండె గూటికి చేరు ధ్వనిలయల నిధి- చరవాణి/


కాసుల వ్యయంతో- కాలయాపన లో-

వృధాకబుర్లకు ఇకిలిస్తూ- 

గొడవలు గాడులు తప్పగా సకిలిస్తూ  -

ఉన్మాద క్రియలను ప్రేరేపిస్తూ -

అద్భుత చరవాణి కే చురకలు వేయగా - ప్రవర్తించు జనం/ 

విధులను మరిచి చరవాణిలో కెవ్వుకేకలు చిందిస్తూ -

సకాలానికి స్పందించని వైనం /

చిన్నాపెద్దా తేడా మరిచి- 

మర్యాదలు  మంటనగలిపి -

వెకిలి భాషల నిషాలో మునకలువేయుట నేటి నైజం /

ప్రతిఘటించగా ప్రయత్నించు నిజం /


అభద్రత నిర్మూలనకారినీ చరవాణి/ అత్యవసర  పరిస్థితులలో -

సూక్ష్మ సహాయకారిణీ /

ప్రాణసంకటంలో అద్బుత అస్త్రరూపిణి -

వార్తావాహిని చరవాణి/ 


పావురము సంజ్ఞలు దూరమై -

చరవాణి ఆజ్ఞలు చేరువయ్యే /

యజ్ఞం చేయకనే విశ్వం అరచేతిలో- ఒదిగిపాయే/ 

విలువల కాలం  తోడగా లేము /

చరవాణిలో సొల్లు కబుర్లకు చరమగీతం పాడగరమ్ము/


కందూరి సుజాత రాణి 

రాజేంద్రనగర్, హైదరాబాద్ 

9392162822🌷

7

[18/09, 9:04 PM] KC Narsaiah KS 26: కవితా గానం

అంశం: చరవాణి

జిల్లా: ఖమ్మం 18/9/2020 

పేరు: కట్టెకోల చిన నరసయ్య

శీర్షిక: జ్ఞాన భాండాగారం



చేతిలో సెల్

అరచేతిలో వైకుంఠం

నడకలో స్టైల్

నడతలో అనాగరికం

సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లు

కొంపలో కుంపట్లు

అవసరంలో పరిహాసం

ఆనందంలో పైశాచికానందం

చేతికి తగలని చరవాణి

గాఢనిద్రలో ఉలిక్కిపాటు

మొబైల్ కోసం కీచులాటలు

కుమ్ములాటలో సొమ్మసిల్లి

రావణకాష్టంలా

రగులుతున్న కుటుంబ పాలన

యంత్ర పరికరంగా మంత్ర సాని

వికృత చేష్టల చిత్రీకరణ

బ్లాక్ మెయిలింగ్ లతో

బూడిద పాలవుతున్న బంగారు భవిష్యత్తు

ప్రాణం పోతున్నా

సెల్ఫోన్ కోసం వెతుకులాట

యువత వెర్రి పోకడలు

పస్తులతో బెదిరింపులు

బర్రె గొర్రె తెగ నమ్మి

నట్టింట్లో తిష్ట వేసిన మాయదారి ఫోన్

సద్వినియోగంలో జ్ఞాన భాండాగారం


హామీ పత్రం:

ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను

8

[18/09, 9:09 PM] Deshapathi Mohan: కవితాగానం నేటి అంశం: చర వాణి

దేశపతిమోహన్ శర్మ.మెదక్

9000512526


         📱  "చెర" వాణి బందీలు📲

నేటి దశాబ్దాన్ని...

చరవాణి శాసించింది 

ఈనాటి మానవ బంధాల్ని ..

తన చెరలో బందీలుగా చేసింది .


చిన్నాపెద్దా ..ఆడా మగా 

పేద ధనిక తేడా లేకుండా 

అందరినీ అంతర్జాల వల వేసి..

జాలరి లా బంధించింది .


ఆదివారం వస్తే ...ఆటవిడుపుగా 

ఆరుబయట ఆటలాడాల్సిన బాలలు 

ఆరంగుళాల ఫోనులకుబానిసలై 

అలుపు ..అదుపులేని వీడియోగేముల వ్యసనపరులు 


అటు పెద్దలూ ..ఇటు పిన్నలూ ..

ఆత్మీయ పలకరింపులు ..అనురాగ స్పర్శలు మరచిపోయి 

అరచేతి అంతర్జాల మైకంలో ..

"చెర"వాణి కట్టిపడేసిన కర "బంధాలు ".


నేటి యువత ...

టెక్స్ట్ బుక్ చదవడం మర్చిపోయి ..

ఫేస్ బుక్ చాటింగ్ లో మైమరచిపోయి ..

సామాజిక మాధ్యమాలకు దాసులై ..తమ

భవితను విస్మరించి పెడదోవ పట్టిరి.


అచ్చ తెలుగును దూరం పెట్టి ..

ఆంగ్ల సందేశాలకు పట్టం కట్టి ..

అంతర్జాల రహస్య శోధనలు 

అశ్లీలత జుగుప్స లను బహిర్గతం చేసినవి.


ప్రతి ఇంట్లో ప్రవేశించి ..

ప్రతిదాన్నీ పుకారుచేసి..

పరువు ప్రతిష్ట బజారుకీడ్చి 

ప్రతికూలత గామారింది .


సత్యమో.. అసత్యమో తెలీక 

లాభమో.. నష్టమో గ్రహించక 

ప్రపంచమంతా మాయాజాలమై..

మనిషి బంధాలకు సంకెళ్లు వేసి ..

"చెర"వాణి తన బందీలుగా మార్చింది .

9

[18/09, 9:16 PM] అమరగాని మధు Poet SDPT: కవితా గానం నేటి అంశం

శీర్షిక: చరవాణి ( *సెల్ ఫోన్* )

మధు అమరగాని. సిద్దిపేట

9177860792


ఫోను ఇప్పుడిదే నా జాను

నువ్వు లేకపోతే నేనేంగాను

అయ్యాను నీకు పెద్ద ఫ్యాను

నువ్వు  నా చేతిలో లేకుంటే 

నేను అస్సలు బయటకు పోను


మనసు వేగంతో పరుగెడుతున్నవ్

క్షణంలో మంచి, చెడును చేరేస్తున్నవ్

మాతో టిక్ టాక్ వీడియోలు చేపిస్తున్నవ్

దూరమున్నొల దగ్గర చేస్తున్నవ్

ఎందుకు దగ్గరున్నొల్ల దూరం చేస్తున్నవ్


ఫోటోలేన్నో తీసేస్తున్నవ్

జ్ఞాపకాలుగా దాచేస్తున్నవ్

ప్రపంచాన్ని చేతిలో చూపిస్తున్నవ్

నువ్వే ప్రపంచం అనేలా మార్చేస్తున్నవ్


పబ్జి ఆటలు  ఆడిస్తున్నవ్

పిల్లల మనసును దోచేస్తున్నవ్

మైదానాలలో పిల్లలు లేకుండా చేసేస్తున్నవ్

అయినా నువ్వు ప్రతి వ్యక్తి జేబులో భద్రంగున్నవ్


వాటర్ బిల్లు, పేపర్ బిల్లు

పాలు,రెంటు ,కరెంటు బిల్లు

పబ్బు, క్లబ్బు, షాపింగ్ బిల్లు

నువ్వు నా చేతిలో ఉంటే క్షణంలో చెల్లు

నీ వల్ల అయ్యే నా బ్యాంక్ అకౌంట్ నిల్లు


ఎన్నో కొత్త ఫీచర్స్ ఉన్న ఓ సెల్లు

నువ్వు లేకుండా లేదు ఏ ఒక్క ఇల్లు

నీకు ఫిదా అయ్యింది నా దిల్లు

ఎప్పటికీ కాదు నీ మెమరీ పుల్లు

నీ వల్ల పడింది నా పర్సుకు చిల్లు


అయినా నా కలం కూడా 

నీకు గులాం అయ్యి, సలాం చేస్తుంది

అది రాసిన కవితలను నీలో బంధించి,భద్రపరిచి

ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు…

10.

[18/09, 9:19 PM] వేంకట కృష్ణ ప్రగడ,విశాఖపట్నం 

కలం  : "కృష్ణ" కలం: కవితాగానం

వేంకట కృష్ణ ప్రగడ

విశాఖపట్నం 

18.09.2020

9885160029


అంశం : చరవాణి


శీర్షిక : "చరవాణీ నీకో సలామ్"


గుప్పెట్లో ప్రపంచం 

గూగుల్లో అనంతం

కాలు కదపకుండా 

భూ కైలాసం నీ సొంతం ...


నిన్న టిక్కెట్ల కోసం 

గంటల కొద్దీ ఇక్కట్లు

క్యూ లైన్లంటూ 

కుస్తీలు మల్ల గుల్ల సాములు

నేడు ఒక్క నొక్కుతో 

అన్నీ అక్కున చేర్పులు ...


సినిమాలు 

శీతల రూములు

బేంకు డబ్బులు 

కట్టే పన్నులు 

కరెంటు బిల్లులు

చివరికి తన పద్దులు

పని ఏదైనా 

పంపే ఊరేదైనా ...


దారం కూడా 

ఆధారం లేకుండా 

వాదం ఖేదం ఆమోదం 

ఇది ఏదీ లేని 

ఆనంద విధానం ...


నిన్న వంటింటికే

పరిమితి ఇల్లాలు 

ఊక పొయ్యలు 

కట్టెల పొయ్యలు 

పిడకల దాలిలు 

తర్వాత స్టౌవ్వులు

మొత్తంగా 

రోజంతా వంటలు వార్పులు ...


నేడు వంటలతో 

వైఫుకు పనిలేదు

నెట్టింట్లో స్విగ్గీ జొమేటో

కొయ్యక్కర లేదు 

కనీసం టమోటో

నట్టింట్లో చరవాణి 

వంటిట్లో విస్తట్లో వడ్డన ...


చేతిలో కూర్చొని 

చమ్కాయించే

చరవాణీ నీకో సలామ్ ...


         ... ✍ "కృష్ణ"  కలం


హామీ పత్రం : 

ఇది నా స్వీయ కవిత 

కాపీ కానీ అనుకరణ కానీ కాదు

12.

[18/09, 9:21 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*

తేదీ:18-09-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం::చరవాణి

""""""""""""""""""""""""""""""

బతుకు చలనంలో 

ఊపిరిలో ఊపిరైన చరవాణి

రకరకాల ఆకారాల్లో

ఒదిగిన కరభూషణి!


ప్రపంచాన్ని చిన్ని క్రిష్ణుడిలా

అరచేతిలో చూపిన అంతర్జాల రూపిణీ!

మాటలతో  మైమరిపించే మధురవాణి!


మధురోహల సవ్వడితో  ఊయలూగించే మమతల పూబోణి!


అవసరానికి ఉపయోగిస్తే

అనంత విశ్వ గాథలను కళ్ళముందే

అతిగా ఉపయోగిస్తే అనర్థాలు

వెంటాడే నీడలే...


రెండు వైపులా పదునైన కత్తిలా

కలలను కల్లోలాలను  సృష్టించే

చరవాణి!


పేదా గొప్ప తేడా లేకుండా

అందరినీ కనికట్టులా మాయ చేస్తుంది!

అనుబంధాలను పెంచుతుంది

అబద్ధాలతో కొంప ముంచుతుంది!


ప్రతి పలుకును డబ్బులతోనే పలికిస్తుంది!

ప్రతి క్షణం వైఫైల చుట్టూ తిప్పేస్తుంది!

12.

కవితా గానం

అంశం: *చరవాణి*

18/9/2020

(పద్యాల రూపంలో)


ఆ.వె1:కరము లోనె వుండి కలకలమ్మును రేపు

మనుజు లందరలను మాయ చేయు

మేజు వాణి లాగ మోజుకలుగజేసి 

మత్తు లోనె వుంచు మాయ లేడి!


ఆ.వె2:అన్ని చేతిలోనె యనునట్లు చూపుతు

నంగినాచి లాగ నటన సేసి

మనుజులందరి యెద మాయలాడిగ చేరు

సెల్లు సొల్లు వినగ  చెప్ప లేము!


ఆ.వె3:మాయ లేడి లాగ మనసును ముంచేసి

మత్తు నొదల కుండ చిత్తు చేసి

చలన మందు కూడ చరవాణి గొప్పను

చూపు నట్టి బేల సొల్లు వినుమ!


ఆ.వె4:కల్ల తనము చూపు కరవాణి చరవాణి

కనుల ముందు యన్ని కదుల చేయు

మాయ లాడి లాగ మత్తు మందును జల్లు

సెల్లు గొప్ప తనము చెప్ప తరమె!

 

పేరు: కె.ఇ.నిలమంగై

కలం పేరు:నీలా రంగనాధం

ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.

చరవాణి సంఖ్య:8897155600.

*ఈ పై పద్యాలు ఈ సమూహం కోసం రాసినవేనని హామీ ఇస్తున్నాను.*

13.

కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి

అంశం:చరవాణి

ఆ.వె:సెల్లు లేని యిల్లు  సెర్చినా /యిలలోన గనరాదు


     అదియు లేని వాని నధము డనుచు


      బాలలాదిగాను ప్రజలునెల్లరునిట


       దీని చేత బట్టి తిరుగు చుంద్రు.



2.ఆ.వె:ఒక్క యింట నున్న నొకరితో నొకరికి


       మాటలాడ బోరు మహిని చూడ


        సతము సెల్లు పట్టి సంచరించుచు నుంద్రు


        వారి నాప తరమె బ్రహ్మకైన.



3.ఆ.వె:హాని కలుగు వేళ ఆసరాగనిలుచు


         బంధు జనుల కెల్ల పరవశాన


  కుశలవార్త తెలుప కువలయమందున


      సెల్లె యందురయ్య చెవిన వినుము.



4.ఆ.వె:నెట్టు చూడవచ్చు నిబ్బరముగ నిందు


         బస్సులోన గాని బడిని గాని


       సొల్లు కబురులాడి జోగుతూ నిలుచుండి


       పొద్దు పుచ్చ వచ్చు పుడమి యందు.



5.ఆ.వె:బంధు బలగములను పలకరించుట మాని


       వేడుకలకు కూడ వెళ్ళకుండ


      సెల్లు నున్న చాలు నిల్లు వాకిలి కూడ


       మరచి పోవు చుంద్రు మహిని జనులు.



6.ఆ.వె:అవసరమ్ము మించి యవనిలో జనములు


       సెల్లు ఓఒ్ఫోను వాడ చెవికి చేటు

       ననుచు బుధులు పల్కు లనవరతము విన్న

       బతుకు బాగు పడును బాలలార.



7.ఆ.వె:దూరమున్న జనుల చేరువ చేయును

     మోము చూడకున్న ముచ్చటాడ

      నెదుటివారి మనము నెంచక్కగా గెల్చి

      విజయమందవచ్చు విశ్వమందు.



8.ఆ.వె:స్మార్టు ఫోనులందు చక్కగా వ్రాయుచు

      పద్యములను మరియు వ్యాసములను

       బహుమతందవచ్చు వసుధలో జనులచే

      సాధ్యమయ్యె గనుడు సరిగ నేడు.



9.ఆ.వె:ప్రాంతమేది యైన బాటతప్పిన గాని

       ఒక్కచోట చేర్చు నుర్వియందు

        చిన్నవారు వాడ చెడిపోవు చుందురు

         టంచు పల్కుచుందు రవని యందు.



10.ఆ.వె:అరయ చేతిలోన నందముగ నిముడు             

        ఫోను యనున దిదియె పుడమి యందు

        సందియముల దీర్చి సంతసమును గూర్చు

        మితము గాను వాడ హితము కలుగు.


చరవాణి చెరలో పడకుండా

చైతన్యానికి ఉపయోగించాలి

సాంకేతిక విప్లవానికి సలాం చేస్తూ మునుముందుకు సాగాలి!

         .  

14


[19/09, 8:09 PM] Korada: కవితాగానం 

    అంశం:- చరవాణి

కోరాడ నరసింహా రావు!

     @వీడని నైజం@

    ###########

ఏది ఏమైనా...విజ్ఞాన వికాసం...హర్ష నీయమే!

యుగాలకాలపుసనాతనఅద్భుతాలను అవన్నీ

పుక్కిటిపురాణాలనికొట్టిపారేసిన వాళ్ళమే...!

ఓ చిన్ని బోషాణంలాంటి

పెట్టెలోనించి ...ఓ ఆహ్లాద కరమైన పలకరింపు సంగీతస్వరంతో ...ఆకాశవాణి విశాఖ పట్నం కేం ద్రం...అని వినిపించ గానే

పులకించిపోయేవాలం !!

తృప్తి తీరని అన్వేషణ...

ఫలం గా టేపు రికార్డర్ లనుచూసి...మురిసిపోయాం !

కేవలం వినిపించటమేనా

కనిపిస్తూవినిపించాలనేఆశ ఫలించి...టీ వీ లు గాఅవతరిస్తే ...ఉత్సాహపుఉరకలు.. ..!!

అవిఎక్కడుంటే...అక్కడికిమనంకాదు ...మనమున్నచోటనేఅవి ...అదంతా మన అరచేతిలోకే...

సంకల్పంసిద్దించి...స్మార్ట్ఫోనై  చేతిలో...!

ప్రపంచాన్నిమనపాకెట్ లలో పదిల పరచి చర వాణియై వినుతికెక్కింది 

మనం ఎక్కడవుంటే  ...

అక్కడి నుండే...సకల విశ్వ చిత్ర,విచిత్రా లన్నీ

భూత,భవిష్యత్,వర్తమానాలన్నీ క్షణాల లో...!!

యిది మనిషి సృష్టించిన  అద్భుత అక్షయ పాత్ర !

జీవితంలోనిప్రతికోణాన్నీ

పెనవేసుకుంది...!

అన్ని ప్రశ్నలకూ ఒకటే...

పరిష్కారపరికరమై....

ప్రగతిపదంలో పరుగులు తీయిస్తోంది...!

ఇన్నిగుణాలున్న ఓ చర వాణీ ...నీలోనూదోషాలనునింపాడీమనిషి...!

కిర్రెక్కిoచే వెర్రి వ్యామో హాలనునీలోనింపి...వినూత్న  వింత నేరాలకు నిన్ను పావు ను చేసి...

మతిపోగొట్టే బూతులను

నీకతికించి...మాయని

మచ్చను నీ కాపాదింప

జేస్తున్నాడీ మేధావి..!

పూజించ వలసిననిన్ను

తిట్టిస్తున్నాడు...!!

నీదగ్గరా  తన నైజాన్ని

వదులుకోలేదు...!

మనిషిబుద్ధిపోనిచ్చుకోలేదు....!!

********************

.......కోరాడ.

15

[19/09, 8:09 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*

*19/09/2020*


      *చర వాణి*


చేతులలో చర వాణి

మనుషులు అంతా

దూరము _దూరము

వాట్స్ యాప్ లు,

ఫేస్ లేని ఫేస్ బుక్

బుక్ అసలే లేనే లేదు,

మాటల మూటలు

ఓ మూలన మూలుగుతూ

ఉన్నవి,

అనురాగాలు దూరమై

రోగాలు దగ్గ రయ్యాయి

పలక రింపు లు కంపు 

కొడుతున్నాయి,

ఫోనే ప్రపంచ మయి

బ్రతుకు తున్నారు,

ఎన్ని యాప్ లో

జూమ్ మీట్స్, 

ఒకరకంగా మంచి,

మరో రకంగా చూస్తే చెడు,

ప్రపంచాన్ని అర చేతుల్లో

చూసే అవకాశం ఉంది,

పిల్లలతో రంది,

జ్ఞానానికి వేదిక,

అజ్ఞాన అవిద్య కు కారకము.

మనిషి మేధస్సుకు పదును

పెడుతుంది,

అరాచకాలు ,అనవసర కార్యాలు సృష్టి స్థుంది.


*స్వర్ణ సమత*

16

[19/09, 8:30 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: **** చరవాణి ***

                              ✍️డా.పాండాల


సెల్లు లేని మనిషి యిలలోన గనరాడు

హస్తభూషణంబు యతనికిపుడు!

సెల్లు లేక పోతె ఘోల్లుమంటుంటాడు

మనిషి నడతకెపుడు మార్గదర్శి!


ఉన్న ఇంటిలోనె ఒకరితో నొకరికి

మాటలాడ బరువు భాగ్యమేమొ!

సెల్లులోన చూస్తు వల్లుమరచుటాయె

ఎవరినాప తరము ఎవరికెరుక?


వార్తజేరవేయు అవనిలో ఏడున్న

రింగుచేస్తెచాలు చెంగుగాను!

బంధు మిత్రులకును బాగోగు పరవశం

కుశలమురిపమెచ్చు కూర్మి కురియు!


నెట్టుజూసుకుంటు నిఖిలంబు తాతిర్గు

బస్సురైలులోన బడిల నైన!

సెల్లుసొల్లుకాదు కళ్ళకానందిని

పొద్దు పుచ్చవాడె పోకిరోడు!


దేశమేదియైన దీప్తిగా పెళ్ళిళ్ళ

వేడుకలనుజూసె వీలుగలదు!

హద్దుమీరుటేల?అహముపెంచగనేల?

ఖర్చు తక్కువెంచె మర్మమిప్పు!


అవసరాలకొరకు యవనిలో చెడిపోకు

సెల్లు ఫోను వాడు చెలిమిపంచు!

చేతిలోనహృదియు చేజార్చకెప్పుడు

బతుకు వృద్దిదిద్దు భాగ్యమదియె!


దూరమున్నప్రజలచేర్చేటి యంత్రము

ముచ్చటలను నేర్పు మోములకును!

ఎదుటివారి మనసు ఎంచక్కగాగెల్చు

విజయమిచ్చునీకు విశ్వమందు!


స్మార్టు ఫోనులందు చక్కని టైపుతో

కవిత పద్యములను కలముతీరు!

కవితగానమెంచికవులను మెప్పించి

కానుకలను గెల్చుకర్మ నియతి!


ప్రాంతభాషయాస భావుకతనునేర్పి

ఒక్కచోట చేర్చె చక్కగాను!

నీతినియమమెంచి నిత్యసత్యాలతో

మేలుకోరెచిన్న మిసిమిపెట్టె!

✍️డా.పాండాల మహేశ్వర్

గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.

17.

......చర వాణి........


మనుషులు లేని మాటలతో

మురిపం లేని భాషణ తో

రోజులు తెలువని రందులతో

కంటి చూపుకు పని లేక

గొంతు లన్ని ఘోష ల తో

ఎవరి రందిన వారే ఎక్కడి

కక్కడ యమునా తీరుగా

చరవాణుల జోరులయే,...

ప్రపంచా న్ని అరచేతి లో

బిగించింది చర వాణి..

ధనిక పేద  తే డా లేక, చిన్న

పెద్ద కలిసి మెచ్చే హస్త భూషణం చర వాణీ....

18.

కవితాగానం                         అంశం : చరవాణి

శీర్షిక :  నువ్వు స్మార్టే

******************


అమ్మో ! 

ఏమో అనుకున్నా గానీ

నువు భలే స్మార్టే


నా నట్టింట్లో

తిష్టవేసి

నెట్టింట్లోనే

నలుగురితోను

నెట్టుకువచ్చేలా

చేసేశావు!


నెల జీతంతో 

మొదలయ్యే

బేర సారాలను

ప్రక్కన దోసి

ప్రపంచంలోని

షేర్ మార్కెట్లకు 

విలువ పెంచేలా

చేసేశావు!


కరువు కాటకాలతో

పని లేదు

కలసి మాట్లాడలేదన్న

దిగులసలే లేదు

కాలక్షేప కబుర్లతో

విసుగే రాదు

కమ్మటి నిద్రలోనైనా

నీ పిలుపే

నా గెలుపని.....

నీ కోసమే

నేనంటూ

అరచేతిలోనే

ఒదిగిపోయి

అధ్భుతాలు చూపించి

అచ్చెరువొందేలా

చేసేస్తావు!


పండుగల సందడంతా నీదే

పలకరింపులకయినా

పలవరింతలకయినా

వియ్యానికైనా

కయ్యానికైనా

నీ మాటే

నా బాట.....

దశదిశలా

దాగుడు మూతలతో

దశావతారాలను

తలపించేస్తావు!


మధురమైన వ్యాపకాలకెన్నో

ఆలవాలమై

ఆనంద డోలికల్లో

ముంచేస్తావు!


నీవు లేని ..... క్షణం

తరలి రాదు...

మరలి రాదు...

మరపుకసలే రాదు...

నువ్వు ఏమైనా భలే స్మార్ట్

మా గుండె గూటిలో నీకు గుడి కట్టేసాం!

మా మనసే నీకిచ్చేసాం!


అమ్మో 

ఏమో అనుకున్నా గానీ 

నువు స్మార్టే!!

19.

[20/09, 8:46 PM] Lakshmi Chamarthi Khammam: కవితాగానం 

రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి 


సహచరవాణి 



 అల్లరిచిల్లరిగా ఒకడు

 చరవాణి చేతి బానిసయ్యాడు

 స్నేహాల మత్తులో మంచిచెడులు మరిచే

 గమ్మత్తయిన ఆటల మోజులో రేపవలు గడిపే

 స్వీయ చిత్రాల భంగిమల్లో ప్రాణాలు పణంగా పెట్టే

 అమ్మ అరిచినా నాన్న పిలిచినా స్పందించని వాడు

 నేస్తాల వింత చిత్రాలకు అభిప్రాయాలు రచిస్తాడు

 చదువు పక్కన పెట్టే చెడు స్నేహాల దారి పట్టే


 

సక్రమ మార్గాన బుద్ధిమంతుడైన ఒకడు

 చరవాణి చేత బట్టి సంచరించు నేడు

 అద్భుతాల్ని  ఆవిష్కరిస్తున్నాడు 

 సాంకేతిక నిచ్చెనగా అధిరోహిస్తూ ఉన్నాడు

 విద్యకు ఉపయోగించి నైపుణ్యాన్ని పెంచి అనుకున్నది సాధించి ఉన్నతుడై నిలిచాడు 


మంచిని పంచేది నువ్వే 

చెడుకు బలిచ్చేది నువ్వే 

బద్దకాన్నిచ్చేది నువ్వే 

బతుకుకో అర్ధాన్నిచ్చేది నువ్వే 

చరవాణీ మా సహచరవాణి 

నువ్వెప్పుడూ మా చేతుల్లోనే వుండు 

మమ్మల్ని నీ చేతుల్లోకి తీసుకోకు

[20/09, 8:47 PM] Dhanasi Usha Rani Poetess: కవితా గానము

పేరు. ధనాశి ఉషారాణి

శీర్షిక.సెల్ ఫోన్

........

సంబంధము లేని వారిమధ్య

తియ్యని భావాలను అల్లి

దూరమైన మనిషి మధ్యన

తియ్యని బంధము కూర్చి


వ్యామోహమనే ఉచ్చులోకి లాగి

మానవత్వంను నిండుగా చంపి

విలువలు లేని బతుకును చేసి

వీధిలోకి విసురుతున్నటి సెల్ వైనం


కేటుగాళ్లకు కాసులు వర్షముకురిపించి

అమాయకుల గుండెల్లో కుంపటిగా నిలిచి

సాహిత్యంను అందరికీ పంచుతూనే ఓవైపు ద్వేషాలను రెచ్చగొట్టుతూనే నిలిచి

బతుకును నవ్వులు పాలు చేసేటి సెల్ పోన్


కళికాలపు మాయాజాలమా

పసిబుగ్గలను కూడా చిదిమేస్తున్నటి వైనము

 పాపాల ఉచ్చులోకి నెట్టి

భవితను బలిని జేసినిలిచిట్టి నేటి తీరు సెల్ ఫోన్

మంచికి మాత్రము వాడి చెడును దూరము చేసి భవితను దిద్దుకోవుటే మన కర్తవ్యం

హామీ పత్రము.ఇది నా స్వంతము అని హామీ ఇస్తున్నాను

ధనాశిఉషారాణి

21

అంశం :చరవాణి 

శీర్షిక :నేనెవరు? 


నేను 

ప్రేమానురాగాలను మింగేస్తూ బంధాలమధ్య  అంతరం .. అవాంతరం 

సృష్టిoచే మీ ప్రియ నేస్తాన్ని 


మంచి చెప్పే మామ్మ కథలు మరుగైన 

మరుగుజ్జు కుటుంబాల

నేటి తరానికి  

అపరిచిత బంధాలకు తెరతీసే...

చీటింగ్ల  చాటింగ్ ని 


అవసరాలకే మాటలు

 ఆప్యాయతలు పంచుకునే పలుకులు కొరవైనచోట 

మాంచి కాల క్షేపాల సమూహాన్ని 


 సద్వినియోగం  తెలియనివారికి  

విషపుసాలెగూడులోచిక్కి

విలవిలలాడేలా చేసే వీడియోని 


వయసుతో నిమిత్తం లేకుండా...... 

అన్నీ నీవే అనే ... 

అందమైన మాటల

వలలో చిక్కేలా...  

అర్థరాత్రి వరకూ తోడుంటా   


ఏమాత్రం శ్రమ లేకుండా 

ఎమోషన్స్ అన్నీ ఎమోజిల్లోనే అందించే సాంకేతికతను....!!


మానవత్వం మాయమయేలా 

అనైతికత ఉప్పెనతో

సమాజాన్ని ముంచెత్తే.... అంతర్జాలపు వలను... !!


నేనే.... మీరు చూస్తున్న"తెర తాకే చరవాణిని" !

అర్థం కాలేదా.....? 

అదేనండి  ---మీ స్మార్ట్ ఫోన్ ని

22

*ప్రియమైన శత్రువు*

*******************


ఆధునిక పరికరానివి!

అద్భుత పరిజ్ఞానానివి!

అందరి ప్రియ నేస్తానివి!

అందాల ముద్దురాక్షశివి!


తిట్టుకుంటూనే నిన్ను 

హృదయాన పెట్టుకుంటాము!

నువ్వు లేక గంట కూడా

గడువదు మాకెవ్వరికీ!


ఎంత వింత మోహమో నీ మీద!

ఎంత విచిత్రబంధమో నీ తోడు!

ఎంత ప్రియప్రదమో నీ సాన్నిహిత్యం!

ఎంత సంతోషమో సంగీతసాహిత్యమా! 


నా పాతనేస్తాలు రేడియో పత్రిక పుస్తకం

టేప్ ల్యాండ్ ఫోన్ కెమెరా కేలండర్ అలారం

ఆల్బమ్ క్యాలుక్యులేటర్ గడియారం

ఎన్నిటినో వెనక్కినెట్టిన ముద్దుగుమ్మా!


జేబుకు బానే చిల్లు పెట్టేస్తావు!

అపుడపుడు అలిగి చికిత్సకెళ్లొస్తావు!

చేతి చమురు చాలానే వదిలిస్తావు!

నీ డ్రెస్సుల కొరకూ నే ఆలోచిస్తుంటాను!


ఎన్ని ప్రత్యేకతలో నీకు చరవాణీ!

అరచేత ఇమిడే విశ్వవిజ్ఞానదీపమా!

మా సమయమే నీకు భోజనమేమో!

మా మెదడును మాత్రం భుజింపకుమా!


ఎన్ని సౌకర్యాలు నీ వలన ఓ లలన!

అన్నివయసుల ఎల్లరి జనుల ప్రియసదన!

నువ్వు మంచికి వాడబడితే 'ప్రియ బాంధవివి!

విచక్షణ మరచి వాడితే *ప్రియమైన శత్రువు'వి!


:వల్లాల *విజయలక్ష్మి*

ఆలేరు

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...