Skip to main content

ఖిలాఫత్ ఉద్యమం 22,23,24/09/2020



 నిర్వహణ: వీరా గుడిపల్లి

The mathematics teacher and poet

సమన్వయం

శివునూరి లలితాకృష్ణ

***********************************

కవివరుల జాబితా

1.వీరా గుడిపల్లి

2.శ్రీ లక్ష్మీ చివుకుల గారు

3.కోరాడ గారు

4.భరద్వాజ గారు

5.స్వర్ణ సమత గారు

6.వురిమళ్ల సునంద ఖమ్మం

7.వల్లాల విజయ లక్ష్మి గారు

8.మర్రి జయశ్రీ గారు

*************************

1.

.ఇది వీరా గుడిపల్లి కవిత

22092020
విశ్వాసుల విజయం
************************
ప్రజాతంత్ర విధానాలు ప్రకాశించిన విశ్వాసం
ప్రజాస్వామ్య భావాలుగా పాదుకొన్న ప్రతీకలు
పవిత్ర గ్రంథం ప్రాతిపదికగా పాలించే కర్తవ్యం పొంది
ధార్మిక పాలనకు దారులు వేసిన వారసత్వం
అల్ ఘజాలీ అన్నట్లు
ధర్మబద్ధమైన అధికారం చలాయించేవరం
ధార్మిక పాండిత్యానికి దాసోహమనే చైతన్యం
న్యాయ విధులు,ధర్మాలను స్త్రీల పక్షపాతిగా చెలాయిస్తూ
సురాజ్యం, స్వరాజ్యం, నడుస్తున్న వేల
స్వయం ప్రకటిత ఖలీఫాలను పట్టించుకోని లోకం
విదేశీ అధికారం  తమ విశ్వాసాలపై దాడి చేసి నమ్మకాన్ని రద్దు చేస్తే
కళ్ళెర్ర జేసిన సందర్భం ఖిలాఫత్ ఉద్యమం.
మతవిశ్వాసాలను మంటగలపాలనిజూసిన
రవి అస్తమించని సామ్రాజ్యం
ప్రజాగ్రహానికి భీతిల్లక తప్పలేదు.
ఆంగ్లేయుల కుతంత్రాలకు బలై
నిషేధింఛబడిన ఓ విశ్వాసం పట్ల
విశ్వాసం ప్రకటించిన ఓ నిరసనోద్యమం
స్వాతంత్ర్య కాంక్షకు ఊపిరులూదిన
ఖిలాఫత్ ఉద్యమం
నమ్మకాలనపహాస్యం చేస్తే అంతేమరి
...... *ఇది వీరా గుడిపల్లి కవిత*

2.

కవితా గానం

తేదీ: 22-09-2020 

అంశము: ఖిలాఫత్ ఉద్యమం 

పేరు: శ్రీలక్ష్మి చివుకుల


మహమ్మద్ ప్రవక్త వారసునిగా

ఇస్లాం దేశాల రాజ్యాధినేతగా

అవతరించాడు *ఖలీఫా!* 

వీరి సామ్రాజ్యమే *ఖిలాఫత్!* 

ఖలీఫత్ రసూల్ అల్లాహ్ గా

ఇస్లాం మతాన్ని వారి విశ్వాసాలను

ఆచరణీయమైన నమాజు 

దానధర్మాలు తీర్థయాత్రలు చేస్తూ

అమీరులు సుల్తానులు 

ఖలీఫాకు విధేయులుకాగా

రాజకీయ వారసులై

ప్రజలచే ఎన్నుకోబడుతూ

న్యాయ సూత్రాలకు 

ఉలేమాలను ప్రతినిధులుగా

' *ఎన్నడూ నిదురించని నగరం'* 

కైరో అరబ్బులకు రాజధానిగా

స్వర్ణయుగపాలన సాగింది.


వర్తకం కోసం ప్రపంచమంతా 

చుట్టుముట్టిన ఆంగ్లేయులు 

శ్వేత జాతీయుల ప్రతినిధులుగా 

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి

మబ్బుల వోలే తోచిన 

ఖలీఫా ప్రాతినిధ్యాన్ని 

తగ్గించడమే కాదు తుడిచిపెట్టేసారు

ఆంగ్లేయులు తమ సామ్రాజ్యాన్ని 

కూలగొట్టడం సహించని ముస్లింలు 

లేవనెత్తిన ఉద్యమమే 

ఖిలాఫత్ ఉద్యమం!


ప్రధమ ప్రపంచ సంగ్రామానంతరం 

షౌకత్ ఆలీ సారథ్యంలో

అబుల్ కలాం ఆజాద్ నాయకులుగా 

ఉవ్వెత్తున ఎగిసి పడింది

 *ఖిలాఫత్ ఉద్యమం!* 

టర్కీ ప్రభుత్వం 

ఖలీఫా పదవి రద్దుతో

ఎగసిన అల విరిగిపడింది.

భారతదేశంలోని 

ముస్లిములంతా ఒక్కటైనారు

హిందువులంతా మద్దతు పలికారు

ఆంగ్లేయుల నుండి స్వేచ్ఛ కోరుకునే

స్వాతంత్రోద్యమంలో

3.

కవితాగానం 

నేటికవితాంశం :-

  * ఖిలాఫత్ ఉద్యమం *

కోరాడ నరసింహా రావు!

   @ స్ఫూర్తిప్రదాయి @

       *************

సామ్రాజ్య కాంక్ష....!

ఆది పత్య దాహం...!!

నాలుగేళ్లుసాగిన...మొద

టి ప్రపంచ యుద్ధం...!

గెలిచేది బలమైన కూటమే గా...!!ఫలితం

టర్కీ పై ఇంగ్లండ్...మత

పర కక్షసాధింపు  !

ప్రపంచవ్యాప్త గురు   పీఠాధికార ఖ లీ ఫా   పదవి రద్దుప్రకటన ..!!

ఆగ్రహించిన మతాభి  మానం...!

విశ్వ వ్యాప్త ఆగ్రహ రూపం...!!

ఆంగ్లేయాధికార దేశాల 

నిరసనల వెల్లువ...!

భారత్లో ...ఆలీ సోదరుల 

తంత్రం...!అర్ధించెను ప్రజాకర్షక  గాంధీజీ నాయకత్వం !

ఈ ఐకమత్యం...  సంపూర్ణ స్వాతంత్ర్య సముపార్జనకు సహకరిస్తుందనుకున్న  గాంధీజీఆశతో....ఆమోదం...!  

ఊపందుకున్న ఖిలాఫత్ ఉద్యమం...!!

సహాయ నిరాకారణాస్త్ర  ప్రయోగం....!

ధర్మపోరాటానికి లొంగి వచ్చిన తెల్ల దొరతనం !

ఖ లీ ఫా...పదవి పునః ప్రదానం  !!

గాంధీ యుగంలో ఖి లా ఫత్ఉద్యమం...సంపూర్ణ

స్వరాజ్య స్థాపనకు.... స్పూర్తి ప్రదాయకం...!!

*******************

........కోరాడ.

ఖిలాఫత్ ఉద్యమం భాగమైంది

 *హిందూ ముస్లిం*

 *భాయీ! భాయీ!* 

4

🙏కవితాగానం🙏

🏹నేటిఅంశం *ఖిలాఫత్ ఉద్యమం🏹

అలివి మాలిన  రాజ్యకాంక్ష   -

అంతులేని ఆధిపత్యాల ఆశ -

విశ్వసించించిన ప్రజాతంత్ర విధానాలు -

నమ్ముకున్నపవిత్రగ్రంథం సాక్షిగా -

ధర్మబద్ధ మైన పాలన సాగించే వరకు -

ప్రవక్త వారసులమని చెప్పుకుంటూ -

ఇస్లాం దేశాలాధినేతగా ఎదిగిన నేతను 

మొదటి ప్రపంచయుద్దానంతరం -

ఆజాద్ కలాం ల నాయకత్వాన ఎగసిన ఉద్యమం -

ధర్మబద్ధమైన అధికారం చెలాయించేవరకు -

న్యాయమైన  అధికారం సాధించుకునేవరకు -

పరాయిపాలలకుల దౌర్జన్యం సమ సేవరకు -

విశ్రమించని జనం -

బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవాలంటే -

ఐక మత్య మంత్రాన్నిపాటించాల్సిందే -

ధర్మపోరాటన సంపూర్ణ స్వాతంత్ర సముపార్జనకు 

నడుముకట్టాల్సిందే అన్న ఊపుతో ఊపందుకుంది -

గాంధీజీ ఆశయాలతో ఖలీఫా కు పదవి లభించింది -

చరిత్రలో ఒగొప్ప ఉద్యమంగా నిలిచింది ..!

ఇదినాస్వీయరచన 

భరద్వాజరావినూతల 🖍️(RB)

స్వాతంత్రోద్యమానికి

ఊపిరిలూదింది.

5

[24/09, 8:10 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*24/09/2020*

      *ఖిలాఫత్ ఉద్యమం*

ఖలీఫా అవతరణ
ఆచరణీయ మైన నమాజు
కైరో అరబ్బుల రాజ దానిగా
స్వర్ణ యుగంగా
పాలన సాగింది,
వర్తకం కోసం ప్రపంచమంతా
చుట్టిన ఆంగ్లేయులు,
పవిత్ర గ్రంథం ప్రతి పదికగా
అల్ ఘజాలి అన్నట్లు 
ధర్మ బద్ద మైన అధికారం
వారి ఆగ్రహాలకు భీతిల్లక
తప్పలేదు,
న్యాయ విధులు,ధర్మాలను
ఆడవారికి పక్షపాతిగా
చెలాయిస్తూ చేసిన
సూర్య స్తమయం కానీ
రాజ్యాంగ
భయపడక తప్పలేదు.

*స్వర్ణ సమత*
6
[24/09, 9:11 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ:24-09-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం:ఖిలాఫత్ ఉద్యమం
******************
వ్యక్తిత్వ నైతిక విలువలతో 
ధర్మ బద్ధంగా నిలబడే మతమేదైనా
అస్తిత్వ స్పృహకు భంగం  కలిగితే సహించేది లేదని
నిరూపించిన ఉద్యమమిది!

బ్రిటిష్ దుర్నీతిపై పిడికిలెత్తిన ఖిలాఫత్ ఉద్యమం
భారత స్వాతంత్ర్యోద్యమంలో
ఉదార జన బాహుళ్యం పొంది
చరిత్రలో లిఖించబడిన ముస్లిం ఉద్యమం!

ధర్మానుగుణంగా ఖలీఫా పరిపాలించిన
ఇస్లామీయ పరిపాలనా విధానమే ఖిలాఫత్!

ఉస్మానియా సామ్రాజ్యపు  పతనానికి కారణమైన
మొదటి ప్రపంచయుద్ధం!
మళ్లీ శక్తి పుంజుకునేందుకు చేసినదే ఖిలాఫత్ ఉద్యమం
7!
[24/09, 9:18 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *ఖిలాఫత్ ఉద్యమం* 
********************

హైందవసోదరుల లౌకికభావాలను
ప్రతిఫలించే ఇస్లాంమత ఉద్యమం
టర్కీ సుల్తాన్ అధికారాలను
పునఃప్రతిష్టించగ మొదలైన ఉద్యమం

కొందరు ముస్లిం నాయకుల
అంతరంగాన ఏ యోచనున్నా
బ్రిటీష్ ప్రభుతను ఉమ్మడిశత్రువుగా ఎంచి
హిందూ నాయకులు సైతం
నైతికమద్దతునిచ్చిరి ముస్లిం సోదరులకు.

చౌరీచౌరా సంఘటన జరగకుండా
సహాయనిరాకరణ ఆగిపోకుండా
ఉండినట్లయిన కొనసాగి ఉండదేమో
హిందుముస్లిం మతాల సమైక్యత

చరిత్రను మార్చలేము ఇపుడు
ముస్లిం ప్రజలను జాతీయ ఉధ్యమాన
భాగస్వాములను చేసిన *ఖిలాఫత్*నూ
మరువరాదు దేశచరిత్రలో ఏనాడు!

:వల్లాల *విజయలక్ష్మి*
8.
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..ఖిలాఫత్ ఉద్యమం

మత విశ్వాసాలకు విలువనిస్తూ
ధర్మాను గుణంగా ఖలీఫా పరిపాలించిన ఇస్లామియా విధానం ఖిలాఫత్
మొదటి ప్రపంచ యుద్ధంతో పతనమైన ఉస్మానియా సామ్రాజ్యం
పునర్వైభవం పొందేందుకు చేసిన ఉద్యమమై
ఆగ్రహించిన మతాభిమానంతో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమమై
భారత దేశంలో సర్వ జనుల ఆమోదయోగ్యమై నిలిచి
భారతీయులందరిని ఏకం చేసింది
బ్రిటిష్ దుర్నీతి పై ధ్వజమెత్తిన ఉద్యమమైంది
భారత స్వాతంత్ర్యోద్యమములో భాగమై నిలిచి ఖిలాఫత్ ఉద్యమం
మత పరమైనదైనా
నైతిక విలువలకు భంగం వాటిల్లితే సహించదని నిరూపించి 
 చరిత్రలో నిలిచింది.
ఆలేరు

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...