Skip to main content

గుండె తడి 01092020

నిర్వహణ
వీరా గుడిపల్లి
సమన్వయం
శివునూరి లలితాకృష్ణ
సహకారం
మెరుగు మధు
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
*********""""
1.ఇంద్రావత్ రాహుల్ గారు
2.అయిత అనిత గారు
3.కోరాడ నరసింహా రావు గారు
4.స్వర్ణ సమత గారు
5.డా.పూర్ణకృష్ణగారు
6.డాక్టర్ ఆంజనేయులు బోనగిరి ఖమ్మం గారు
7. చివుకుల శ్రీలక్ష్మి గారు
8.sunanda garu
9.డా.దీపక్ న్యాతి గారు
10.కోరాడ గారు
11.కందూరి సుజాతా రాణి గారు
12.డాక్టర్ ఆంజనేయులు గారు
13.సునంద ఉరిమళ్ళ గారు
14.బ్రహ్మం గారు
15.మర్రి జయశ్రీ గారు
16.వల్లాల విజయ లక్ష్మి గారు
****************
1
చాలీచాలక కడుపు నింపుకొని
అంతో ఇంతో బతుకీడుస్తున్న
వలస కూలీల రుధిర ఘోష
లాక్ డౌన్ తో పని మాయమైన వ్యవస్థ
దిక్కుతోచని స్థితిలో ప[01/09, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
============

అంశం : గుండెతడి
తేది : 01/09/2020



             *గుండె తడి*



ఎన్నో ఆలోచనల సడి
ఎదలో కలబడి
వివిధ భావనల అలజడి
వేలకు వేలు పైబడి
గుండెకు ఎందుకో
నిత్యం ఈ రాపిడి
చిందే రక్తాశ్రువులతో
ఆరని తడి
అనుబంధపు అంటూ
తొక్కి పెంచుకుంటూ
స్నేహపు మడి
ఆత్మీయానురాగాలే నాకు రాబడి
అవి మోసుతు దుఃఖపు
కావడి అవే నా మది చుట్టూ
కట్టిన దడి పంచ ప్రాణాలకు
రక్షణగా నిలబడి !!..


*ఇంద్రావత్ రాహుల్*
      *కొత్తపేట్*
 *నిజామాబాద్*
9848054079..
2
[01/09, 8:07 PM] Anitha Aitha Poetess: *కవితా గానం*
అంశం : గుండె తడి
శీర్షిక: *ద్రవించిన హృదయం*

మాయరోగమేదో
మానవ జాతినే కబళించగా
ఉస్సూరుమంటున్న ఉర్వి!

మహమ్మారి కరోనా
విలయతాండవమాడగా
విలపిస్తున్న జన జీవనసరళి!

లాక్ డౌన్ అంటూ
స్తంభించిన పర్వపు పలువేడుకల సొదలు!
సందళ్లు కానరాని
సకల కార్యాలయాలు!!

పిల్లలు లేక వెలవెల పోతున్న బడులు
పేదలకు అందని ద్రాక్షలైన అంతర్జాల చదువులు!

శూన్యమై శూలమై
మదిని గుచ్చగా వేదనలనే పొదువుకున్న బతుకులు!
కూటికై కడుతిప్పలు పడుతున్న వలసల వెతలు!!

పదే పదే తారసపడు వ్యధలను గాంచగా
ద్రవిస్తున్న హృదయం
రోదిస్తున్న గమనం
దరిచేరుతున్న మరణం
చూసి భరించలేని వైనం!

అయిత అనిత
జగిత్యాల
8985348424
3
[01/09, 8:08 PM] Korada: కవితాగానం
అంశం:- * గుండె తడి *
కోరాడ నరసింహా రావు!
  * ఆనందంనిండాలి *
    ***************
ఆర్ద్రతా గుణం ఉంటేనే
గుండె తడితో..... కళ్ళుచెమ్మగిల్లేవి !

దయ,ప్రమ,జాలి...గల
మనసులేకదూ...గుండెనుతడి దేర్చేవి ...!

కరుణపూరిత దృశ్యం కంటబడితే ...స్పందించే
హృదయవేగంలో...మార్పులు చోటుచేసుకోవా?

దయనీయత దృశ్య మానమైనా...కరగక...
కేవల తన లబ్-డబ్ ల
గోలలో తానుండేది...
అది హృదయ మెలా ఔ తుంది....!?
అదికేవలంతనఅస్తిత్వాన్ని తాను నిలుపుకుందు కు పాటుపడే నాలుగు గదుల పరికరం  తప్ప !!

నవరసాలలోనూ....కరుణరసం...మనిషినిమహోన్నత త్యాగధనునిగా  మా ర్చేస్తుందోయ్...!

మనిషివై పుట్టినందుకు
స్పందించే మనసుండాలి
ఆ మనోస్పందన  లతో
నీ గుండె నిండాలి...!
కరుణరసం పండాలి ...
ఆ పంటతో నీ చుట్టూ...
ఆనందం నిండాలి ...!!
*******************
........కోరాడ.
4
[01/09, 8:15 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*01/09/2020*

       *గుండె తడి*

ఏడారైన జీవితానికి గుండె తడి
తప్పదు,
అలజ డుల సవ్వడి, అదో సుడి
కష్టాల కొలిమి,నష్టాల నజరానా
ఇష్టాలు దూరమై ,భారమై న
గుండె గూడులో సంద్రం
సయ్యాటలాడుతుంది,
కన్నీరు మున్నీరు కాలువలు
అయి పారుతుంది,
దుఃఖ సాగరంలో ఈదుతూ
సుదూర తీరాలకు పయనం.

*స్వర్ణ సమత*
*నిజామాబాద్*
5
[01/09, 8:21 PM] +91 94915 62006: గుండె తడి
::::::::::::::::::::::::::::::::::::::::::::::
🦜🦜🦜🦜🦜🦜🦜🦜
తపించి జపించగా
తల్లిదండ్రుల గర్భాశుక్తిముక్తాఫలం జన్మసార్థకతకు చిహ్నమే చిరునామా
 విలక్షణమైన సలక్షణ  దక్షతగా చరాచర జీవకోటి లో మహోన్నతమైన రూపాంతరం మానవజన్మ
కన్నీళ్ళను చూడగానే కారణజన్ముడవై
అంగవైకల్యం కనబడగానే ఆపద్బాంధవుడవై
దిక్కులేక అన్నమో రామచంద్రా అను వారికి దివ్య తేజ కిరణమై ఆర్ధ్రంగా  అభిమానంగా ఆప్యాయంగా చేయూతనిచ్చే నిష్కల్మషమైన సంకల్పం, సహృదయత, నీ గుండె తడి, సౌహార్ద్రమున మహనీయుడి గా నిలుపుతుంది
మానవతలో శ్రీకారముగ భవసార్థకమవుతుంది
మేలుకో సేవాభావనలో ఊర్ద్వత్వమును  చేరుకో
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*డా.పూర్ణకృష్ణ*
6

[01/09, 8:30 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: గుండె కింద తడి
డా. సిహెచ్ ఆంజనేయులు
గుండె కింద తడి ఉన్నప్పుడే మనిషి స్పందిస్తాడు స్పందన లేని హృదయం స్వార్ధం తో నిండి ఉంటుంది
స్వార్థంతో నిలువెల్ల దహింప బడతాడు

హృదయంలో ప్రేమ ఉంటే అది తడి తడి పలుకులతో గుండె నిండా ప్రేమ ను జాలువారుతుంది
ఈ విశాల విశ్వం నిండా ప్రేమైక జీవన మే మానవాళి అనుబంధాల పర్వం
మనిషిని ప్రేమించలేని వాడు తన పిల్లలను బంధువులను భార్యను ఎలా ప్రేమిస్తాడు అందుకే పాశానం వారి ఉదయం అలాంటి వాళ్ళు గుండె కింద తడి ని కోల్పోతారు

తడి లేని గుండె పొడి పొడి గా రాలిపోతుంది
తడి ఉన్న గుండె పొంగి పొర్లుతుంది ఆత్మీయతతో
ప్రేమిక ప్రపంచమే విశ్వమంతా వ్యాపించి చాలి అది తడి ఉన్న హృదయం అది తడి దానికి చక్కటి నిదర్శనం

డాక్టర్ ఆంజనేయులు బోనగిరి ఖమ్మం 7702537453
7
[01/09, 8:38 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం
తేది: 01-09-2020
అంశము:గుండెతడి
పేరు: చివుకుల శ్రీలక్ష్మి

ఎప్పుడూ అంతే! ఏమవుతుందో తెలీదు!
నాకే ఎందుకు ఇలా జరుగుతుందో తెలీదు?
రోడ్డు పక్కన కాలు లేని బిచ్చగాడిని చూడగానే
 కోవెల ముందు కళ్ళులేని బిచ్చగత్తెను చూడగానే
చేటలో రోజుల పిల్లని పెట్టుకుని ఆ తల్లి
నడిరోడ్డు మీద ఎండలో పరుగులు పెడుతూ
ఆగి ఉన్న ఒక్కో కారు దగ్గరకూ వెళ్లి యాచిస్తూంటే
పదేళ్ల పిల్లాడు రోడ్డు పక్కన చెత్త కుండీల దగ్గర
ప్లాస్టిక్ ఏరుకుంటూ
వాడి కంటే పొడవైన
ప్లాస్టిక్ సంచిలో పోసుకుని మోయలేక పోతుంటే
నడవలేని ముసలిది రోడ్డుమీద డేక్కుంటూ
వీధులన్నీ తిరుగుతూ ఉంటే
నా కోసం అమ్మ ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్
ఆమె చేతిలో పెట్టడం తప్ప
ఏమీ చేయలేని నిస్సహాయతకు
మనసంతా శోకంతో నిండిపోయినట్లు
గుండెల్లో రక్తం కాక నీరు ప్రవహిస్తున్నట్లు
అక్కడితో ఆగక
రెండు కళ్ళూ ద్రవీభవించి పెద్ద పెద్ద నీటి బొట్లు
జలజలా రాలుతుంటే ఆపుకోలేక
ఎప్పుడూ అనుకుంటాను
నాకే ఎందుకిలా జరుగుతుందో?
[01/09, 9:07 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ::01-09- 2020
8

పేరు మ్మం
శీర్షిక:: గుండె తడి
******************
లోలోపల పూడుకు పోయిన ధైర్యం
ఆవహించిన భయం పొరలు
ఘనీభవించిన ఆత్మ విశ్వాసం !
ఎటు చూసినా విచలితను చేసే
సంఘటనల పరంపర!

తల్లక్రందులైన బతుకుల వేదనా భరిత గాథలు
పుటలు పుటలుగా కళ్ళముందు కదులుతుంటే..

ఎన్ని బడబాగ్నులు  బుసలు కొట్టినా
ఎన్ని విపత్తులు విలయం సృష్టించినా..

మనిషిని చైతన్య స్రవంతిగా మార్చి
భవిష్యత్తు దిశలో నడిపించేందుకు
మిణుకు మిణుకు మనే
చిరు ఆశ ఒక్కటి చాలు!
ఎడారిని సుశ్యామలం చేసే
ఒయాసిస్సులా..

గుప్పెడు గుండె తడి చాలు
సహానుభూతితో  పరిష్కార దిశలో అడుగులు వేయించేందుకు!

ఇన్ని రోజులుగా గూడుకట్టుకున్న నిర్వేదం
జీవం తెగిన వర్తమానం
నవ జీవన రాగాలను అద్దుకొని
కొత్తగా పల్లవించేది గుండె తడితోనే..
9
[01/09, 9:17 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*
పేరు : డా.దీపక్ న్యాతి
తేదీ : 01-9-2020
అంశం : గుండె తడి
శీర్షిక : బతుకులు బద్దలై

ఎటు నుంచొచ్చారో ఎటెళ్తున్నారో
ఎండలో వేడెక్కిన శరీరాలను
చెమటలతో తడుపుకుంటూ
చేతిలో తట్ట భుజానో బుట్ట
తలపై ఏపుగా ఓ మోపు
ఆడ మగ ముసలి ముతక పిల్ల పాప
అందరిదీ ఇదే అస్త వ్యస్త దీనావస్థ
కొందరికి చంకలో పాప అయితే
మరికొందరికి భుజాన ఓ బాబు
ఎండమావులక్కూడా నోచుకోలేని పయనం
రెక్కాడితే కానీ డొక్కాడని బతుకునయనమయ్యారు
కరోనా రోగ తాండవానికి
బతుకులు బద్దలై బలయ్యాయి
వేలకువేలుగా కదలి పోతున్న వారిని చూసి
నాడు గుండె తడి గానిదెవ్వరికి
తలచుకుంటే నేటికీ గుండెతడే

డా.దీపక్ న్యాతి
హైదరాబాద్
10
[04/09, 8:04 PM] Korada: కవితాగానం
అంశం:- * గుండె తడి *
కోరాడ నరసింహా రావు!
  * ఆనందంనిండాలి *
    ***************
ఆర్ద్రతా గుణం ఉంటేనే
గుండె తడితో..... కళ్ళుచెమ్మగిల్లేవి !

దయ,ప్రమ,జాలి...గల
మనసులేకదూ...గుండెనుతడి దేర్చేవి ...!

కరుణపూరిత దృశ్యం కంటబడితే ...స్పందించే
హృదయవేగంలో...మార్పులు చోటుచేసుకోవా?

దయనీయత దృశ్య మానమైనా...కరగక...
కేవల తన లబ్-డబ్ ల
గోలలో తానుండేది...
అది హృదయ మెలా ఔ తుంది....!?
అదికేవలంతనఅస్తిత్వాన్ని తాను నిలుపుకుందు కు పాటుపడే నాలుగు గదుల పరికరం  తప్ప !!

నవరసాలలోనూ....కరుణరసం...మనిషినిమహోన్నత త్యాగధనునిగా  మా ర్చేస్తుందోయ్...!

మనిషివై పుట్టినందుకు 
స్పందించే మనసుండాలి 
ఆ మనోస్పందన  లతో 
నీ గుండె నిండాలి...!
కరుణరసం పండాలి ...
ఆ పంటతో నీ చుట్టూ...
ఆనందం నిండాలి ...!!
*******************
11
[04/09, 8:11 PM] కందూరి సుజాత Poetess: అంశం.. గుండ తడి
 శీర్షిక ....  🌹 గువ్వల జంట🌹గేయం
********   *****  *******
గువ్వలు రెండు గూడును కట్టి ఒదిగే ఉన్నాయి. 
గుడ్లను పొదిగి పిల్లల తీసి బాధ్యతగున్నాయి .

వర్షపు చినుకులు రానేవచ్చాయీ.
తోడుగా  వీచే గాలికి గూడు తడుస్తూ ఊగుతున్నాది .
గువ్వలు నాలుగు ఆపదలున్నాయి .
అయినా అడుగుట సాయం నేర్చుకోలేదు 

గువ్వ పిల్లల మింగగ వచ్చిన పామును
చంపగా గువ్వలురెండు యుద్ధం చేశాయి ముక్కుతో పొడిచి పామును  పారదోలాయీ. 
ప్రకృతితో పోరాడుతూ  పిల్లల సాకుతూ 
గువ్వలు రెండు ముందుకు సాగాయి .
చూసే  మదికి ఆనందం పంచాయి 
బదులు కోరడం నేర్చుకోలేదు .

జ్ఞానం ఉన్న మానవ పిల్లలు గూడును చెడిపి 
పిల్లల చంపి సఖిిలించి నవ్వారు.
పిల్లల కోసం వెతుకుతు 
గువ్వలు చేసిన ఆర్థనాదాలు గుండెను తడిపాయీ. 
జ్ఞానం ఉన్న ఫలితం లేని పనులకు గుండె జ్వాలను చిమ్మింది.

కందూరి సుజాతారాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్ 
9392162822🌹
12
[04/09, 8:17 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: గుండె కింద తడి
డా సిహెచ్ ఆంజనేయులు
గుండె కింద తడి ఉన్నప్పుడే దయార్థ హృదయం ఉప్పొంగుతుంది
ఎవరికి ప్రేమ uppangala అన్నా
ఆత్మీయత రంగరించి వెల్లువగా సాగాలన్నారు గుండె కింద తడి అవసరమన్నారు
గుండెలో ఆత్మీయ ద్రవం ప్రసరించినప్పుడు

తడే ఉండదు
తడి ఉన్నప్పుడే సమాజ అనుబంధాలు పెనవేసుకున్నాయి

తడి ఉన్నప్పుడే మొక్కలు పొలాలు పంటల నిస్తాయి ఫలాలను ఇస్తాయి

తడి తగిలితే చాలు ప్రతి జీవి ప్రాణం పోసుకుంటుంది
తడి ఎల్లప్పుడూ ఆత్మీయతకు సంకేతం అనురాగానికి మూలం
తడి ప్రవాహం ఎక్కడైనా ప్రవాహ గీత మవుతుంది
తడి నీ మనసు లోగిలిలో ఒక ఒక విలువగా ఉప్పొంగే గీతం అవుతుంది
తడి స్పర్శతో పులకిత మవుతుంది
పులకరింప చేస్తుంది

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు భువనగిరి ఖమ్మం 7702537453
13
[04/09, 9:04 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం* 
తేదీ::04-09-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
శీర్షిక:: గుండె తడి
************†*******
మోసే బాధ్యత నాదేనని గాలి
వినయంగా కంపార్ట్మెంట్లన్నీ తిరుగుతుంటే..
అలలు అలలుగా సాగి పోతున్న పాట అందరి మనసులను తడిమి వెళుతోంది!

పాట వింటున్న క్షణాలు 
బాధా తప్తమై
ఆ పసితనాన్ని అక్కున చేర్చుకుని
ప్రతి మనసు ముంగిట్లో నిలబడి
చేజారిన బాల్యం ఎలా చేయి చూపుతుందో చూడమని అర్థిస్తున్నాయి.

ముద్దు మురిపాల నడుమ
ముద్దుగా వికసించాల్సిన బాల్యం
ముక్కు పచ్చలారక ముందే
ముద్ద కోసం  చేయి చాస్తుంటే...

ఎద లోలోపల మానవీయ కదలిక  గుండె తడి చేసింది!

జేబులో  మిగిలిన ఒకే ఒక్క
పదినోటు
పాటలను ఆస్వాదిస్తున్న 
సత్తు గిన్నెలో చేరుతుంటే
ఓ పక్క ఆనందం మరోపక్క ఆవేదన..
నేను తనలా అడుక్కోలేని నిరుద్యోగినని....
14
[04/09, 9:14 PM] +91 96428 92848: కవితా గానం
------------------
గుండె తడి
౼౼౼౼౼౼౼౼౼

ఇంత దోసెడు నీళ్లు పోస్తే
విత్తనం గుండె కరిగి
భూమిపైకి వచ్ఛి నింగిని చూస్తుంది
నా హృదయాన్ని కరిగించిందెవరని!
నింగిలో నిండుకుండలా ఊరేగుతున్నా...నేల బాధను చూసి...భానుతప్తమై హృదయం కరిగి నీరై జారడంలో ఎంత హృదయముందో..
గాలలు వీస్తూ ఈలలు వేస్తుంటే
సుమాల సుందర విన్యాసంలో
ఆకులపై అలరారే నీటి ముత్యాలు నేలరాలు తుంటే 
ఎంత వేదాంత ముందో!
సుతి మెత్తని పువ్వు తనలో సుగంధాన్ని నింపు కొని గర్వంగా నిలబడి నప్పుడు అని పిస్తుంది
ఇంత మనీషినై ఉండి దాని ముందు నిలబడలేక పోతున్నానేమిటా అని!?
దాని హృదయంమంత గొప్పది 
నాది కాదు గదా!
ప్రకృతి లోని ప్రతి అద్భుత సందర్భానికి నా హృదయం స్పందించ గలిగితే
నా గుండె తడి
పొంగి పొర్లే మత్తడై ఊరేగూ తుంది...
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
            జల్లిపల్లి బ్రహ్మం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
15

కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..గుండెతడి

మానవ జీవనమే
ఆరాటాల అలలు
పోరాటాల సుడులు
ఏదో సాధించాలని
ఎంతో ఎదగాలని తపన
అనుకున్నది జరిగినా
కలుగును ఎంతో ఆనందం
అనుకోని అవాంతరాలు ఎదురయ్యేనా
పదే పదే సమస్యలు పదునైన శరములై గ్రుచ్చేనా
ధైర్యం సడలిపోయి
ఏదో  తెలియని అలజడితో
ఆరదు ఆ గుండె తడి
ఓదార్చే ఆపన్న హస్తం కోసం
ఎదురుచూస్తుంది
ఆత్మీయతానురాగాలకై 
ఆరటపడుతూ
అనుబంధాలకై ఎదురుచూస్తుంది
స్వార్థం కల్మషం నిండిన లోకంలో
గుండె తడి ఆరదని తెలిసినా
నా వేదన తీర్చే ఓ మనసు 
ఏదో ఒక చోట ఉండే ఉంటుందన్న చిన్న ఆశతో.
16.
*గుండెతడి* 

ఎల్లరిలో ఉండు గుండెసడి!
ఎందరిలో ఉంది గుండెతడి?
కనపడే కన్నీళ్లకే స్పందన లేదు!
కనపడని గుండెతడి తెలిసేదెవ్వరికి?

మాటలతో తూటాలు పేల్చే
నాటకాలలోకాన కరోనాతో రణాన
ప్రతిఒక్కరిది అనంత ఒంటరిపోరాటమే
బ్రతికి తీరాల'నే తప్పని ఆరాటమే

ముంచేస్తుoటే కరోనాసుడిగుండం
తప్పించుకునేదెలా ఈ పెనుగండం?
మనసుమాగాణాన మమతాపంటల మీద
కరోనారాళ్లు పడి మానవతాగింజలు రాలిపోయే

మనిషిని చూస్తే సంతసించే ప్రాణం
దగ్గరకొస్తే ముసురుకొనే భయమేఘం
సదా పొడిపొడి మాటల సంభాషణం
సర్వత్రా వడివడి నడకల ప్రయాణం

బెదురు జంటకన్నుల దర్శనం
ఎదురుపడలేని అనుమానపు దైన్యం
జనానికి కావాలి టీకా ఇచ్చే ధైర్యం
జగానికి రావాలి పూర్వవైభవం

:;వల్లాల *విజయలక్ష్మి*
ఆలేరు

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...