Skip to main content

త్యాగం 2021

నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
**********************

కవివరుల జాబితా
1. కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
2.ఆళ్ల  నాగేశ్వరరావు గారు,తెనాలి
3.డా.బల్లూరి ఉమాదేవి గారు
4.కవిత వెంకటేశ్వర్లు గారు
5.గజవెళ్ళి శ్రీ నివాసాచారి గారు
6.డా.సి హెచ్ ఆంజనేయులు గారు
7.వురిమళ్ళ సునంద గారు
8.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు,
పాతపట్నం,శ్రీకాకుళంజిల్లా
9.తరణికంటి సూర్యలక్ష్మి గారు
10.ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ గారుు
11.జోషి పద్మావతి గారు
12.నాశబోయిన నరసింహ గారు
13.జంపని శ్రీ నివాస మూర్తి గారు
14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
15.వంటిపులి నాగరాజు గారు
16.గొర్రెపాటి శ్రీ ను గారు

**************************
1.
నేటి అంశం.. శుక్రవారం..13082021
కవితా గానం
శీర్షిక.. త్యాగం
*******************************
*********


అల్పులా అనల్పులా !!?అనేది కాదు!
త్యాగం ఎవరు చేసినా                                         
అది మానవత్వపు సులక్షణమే
రాజ్యం వీర భోజ్యం త్యాగం అపౌరుషేయం


త్యాగం చేయునొక భాగ్యశాలి
నవరత్నఖచిత స్వర్ణాభరణాలు
ధనధాన్య రాసులన్నిటిని

భూములందజేసి ఊళ్ళుకు ఊళ్ళు నిర్మించి
పునరావాసం కల్పించు నొక ఉదారవాది

కోవెలలో కోనేరు నిర్మించి
భక్తుల దాహము దీర్చు భక్తాగ్రేసరుండింకొకడు
ఆకలి దీర్ప నెంచి నిత్యాన్న ప్రసాదంబు 
వితరణ జేయు విశిష్టుడొకడు

విద్యాదానం జేసి సంస్కారం నేర్పి
సర్వశ్రేష్ఠ సర్వోన్నత సమాజ నిర్మాణం కై
ప్రయత్నించే పండితులు

స్వాతంత్ర్యం కొరకు
ప్రాణ త్యాగం చేసిన వీరులు
మన ప్రాతః స్మరణీయులు

స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని
గర్జించిన తిలక్ నినదించిన లాల్ పాల్
పరాయి పాలన విముక్తి కోసం ఉరి కొయ్యల
వ్రేలాడిన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్

అప్నాఖూన్ దో మై ఆజాదీదూంగా
సౌ సాల్ కా గులామి సె ఎక్ సాంస్ బెహత్తర్ హై
అని గర్జించిన మన నేతాజీ సుభాష్ చంద్రబోస్

సైమన్ కమిషన్ తుపాకీ గుండుకు గుండెచూపిన మన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ,అహింసామూర్తి జాతిపిత                                       ఈ భారత మాత ముద్దు బిడ్డలు
నవయుగ వైతాళికులు

ఎందరో త్యాగధనుల ధన ప్రాణాల త్యాగఫలమే  ఈనాటి మన ఘనాఘనభారత్

త్యాగం ఒక భోగం
త్యాగం ఒక యోగం
వరించు వలపుల
స్మరించు తలపుల

స్వీయ రచన:::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
13082021.శుక్రవారం
2.
అంశం;  త్యాగం
శీర్షిక ;

    ""  త్యాగధనుల నేల ""



ఎందరో వీరుల త్యాగఫలం
నేటి స్వేచ్చా స్వాతంత్ర్య దినం
ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి
భరతమాతకు విముక్తి కల్గించేందుకు
ఉత్తంగ తరంగమై కదలి
ఉద్యమాల ఉప్పెనై చుట్టుముట్టి
ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి
వీరోచిత పోరాటం గావించి
అమరులైన స్వాతంత్ర్య సమరయోధుల
ప్రాణ త్యాగ ఫలితం
నేటి మన ఘన స్వాతంత్ర్య శుదినం!
కనిపించని నాల్గవ సింహంలా
పరోక్షంగా ఉద్యమాలకు ఊపిరి పోస్తూ
కుటుంబ బాధ్యతలను  స్వీకరిస్తూ
భర్త నడయాడిన బాటలో పయనిస్తూ
వారితో పాటు అనేక  ఉద్యమాల్లో పాల్గొంటూ
కరాగార శిక్షలను అనుభవిస్తూ
ప్రాణాల ను సైతం తృణ ప్రాయంగా త్యజిస్తూ
ఆడది అబల కాదు సబల యని నిరూపిస్తూ
సర్వ సుఖాలను త్యాగం చేసి
వీర నారిమణులై 
స్వాతంత్య్ర దీక్షాదక్షులై
భరతమాత  స్వేచ్ఛకై
సొంత లాభం కొంత మానుకుని
దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన
త్యాగధనుల నేల
నేటి 75వ అమృతోత్సవ హేళ!
...₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
చరవాని సంఖ్య: 7416638823
.......................................
పైవచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
3.
13/8/21
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం:త్యాగం



నాది నాకు నావారికి
అనుకొన్నదాన్ని
పరులకు నిస్స్వార్థంగా
ఇవ్వడమే త్యాగం
విలువైన వలువలు కానీ
భుజించే ఆహారం కానీ
పరోపకారార్థం యివ్వడమే త్యాగం
ఒక పావురం కోసం తన
శరీరంలోని మాంసాన్ని కోసి యిచ్చి
త్యాగధనుడై వెలిగాడు శిబిచక్రవర్తి
మూడడుగుల నేల నడిగిన వామనునకు
తన తలపై నిడమని చెప్పి 
సర్వస్వాన్ని త్యాగం చేశాడు
బలి చక్రవర్తి
తన ఆహారమే కాదు భార్యా బిడ్డల ఆహారాన్ని కూడా త్యాగం చేసి
తుదకు
"అన్నము లేదు కొన్ని మధురాంబువు లున్నవంటూ"
త్రాగే నీటిని సైతం త్యాగం చేసిన
రంతిదేవుడు
పేలాల పిండిని కూడ త్యాగం చేసిన సక్తుప్రస్తుడు
సోదరుని కోసం సర్వ సుఖాలను
త్యాగం చేసిన లక్ష్మణాదులు
ఇలా ఎందరెందరో అయ్యారు
త్యాగానికి ప్రతీకలు
దేశం కోసం కన్నవారిని కట్టుకొన్నవారిని వీడి
దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న 
సైనికులది మహత్తరమైన త్యాగం
ఎందరొ వీరుల త్యాగ ఫలమే
నేడు మనమనుభవిస్తున్న స్వాతంత్ర్యం
త్యాగజీవులందరికి అందిద్దాం
మన జేజేలు 
అర్పిద్దాం నమస్సుమాంజలులు.
4.
Kavita Venkateshwarlu Garu
: కవితా గానం సీజన్ 2

అంశం :: త్యాగం



త్యాగం ఒకరు చెప్తే చేసేది కాదు
త్యాగం ఒకరు ఇస్తే ఇచ్చేది కాదు

త్యాగం ఒకరికి ఆలంబన కావాలి
త్యాగం వేరొకరికి జీవితమివ్వాలి
త్యాగం ఒక నిండు ప్రాణాన్ని
నిలపాలి
త్యాగం ఒక సంసారాన్ని నిలపాలి 

శిబి చక్రవర్తి పావురాన్ని కాపాడుటకై తన శరీర0 అర్పించాడు
దానవులను సంహరించుటకై
తన వెన్నెముకను వజ్రాయుధం
కొరకు దధీచి చేసేను త్యాగం

స్వాతంత్ర్యము కొరకు ఎందరో
త్యాగధనులు ప్రాణాలర్పించిరి
ఆస్తులను సమర్పించిరి
స్వేచ్ఛ స్వాతంత్ర్యము సాదించిరి

కరోనా కాలంలో కష్ట కాలంలో
సోనూసూద్ మహనీయుడు
ఎన్నో కష్ట నష్టాల కోర్చి
ఎందరినో ఆదుకున్న మహానుభావుడు
కోట్లు ఖర్చుపెట్టి జీవితాలను
బాగుచేసిన పుణ్యాత్ముడు
పేదల ప్రాణాలను కాపాడి
ఆకలి తీర్చిన ధర్మాత్ముడు
ఇలా ఎందరో తెర వెనుక
ఎందరో
వారందరికి త్యాగమయూ
లందరికి వందనములు
హృదయ పూర్వక అభినందనలు!!
                  కవిత వేంకటేశ్వర్లు
కర్నూలు.       8309920625
5
 అంశం: త్యాగం 
...

మనిషి జీవితంలో
త్యాగం గొప్ప గుణమే 
వెలకట్టలేని ధనం 

దేశమాత దాస్య శృంఖలాలు త్రుంచ 
దేహాలను త్యాగం చేసిన 
త్యాగధనులెందరో 

దేశ రక్షణలో 
ప్రాణాలను త్యాగం చేసిన 
జవాన్లెందరో 

పిల్లల ఉన్నతికై 
సుఖాలను త్యాగం చేసిన 
తల్లిదండ్రులెందరో 

త్యాగం కోరదు గుర్తింపు
త్యాగం మనిషికి 
దేవుడిచ్చిన వరం 
...
గజవెళ్ళి శ్రీనివాసాచారిి
6.
డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: 
స్వరాజ్య రథం సాగింది 


ఎందరో త్యాగధనుల వీరుల ఫలమే స్వరాజ్య రథం
ఈ దేశంలో ప్రజలంతా ఒక్కతాటిపై సాగిన ప్రజాస్వామ్య ప్రచార రథం


స్వరాజ్య సమరంలో కులమతాలకతీతంగా
సాగిన ప్రజాస్వామ్య రథం ఇది గాంధీజీ ఐక్యతతో సాగిన స్వాతంత్ర ప్రచార రథం


భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్

బిస్మిల్లా ఖాన్ ఎందరో త్యాగధనుల ఫలితమే పోరాటం ఫలించి స్వతంత్ర భారతావనిలో నా

స్వరాజ్య రథం సాగుతున్నది ప్రజల కోసము

ఇది అల్లూరి లాలా లజపతిరాయ్ బిపిన్ చంద్రపాల్ ఎందరో త్యాగధనుల ఫలితమే

స్వరాజ్య రధం

వన్నెల జండాను సృష్టించెను మూడు రంగుల జెండా ఎగిరింది
పింగళి వెంకయ్య సృజించెను మూడు రంగుల జెండా ఇది

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట
సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:13-08-2021 శుక్రవారం
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: త్యాగం
******************

భారత మాత కన్నుల్లో వెలుగు పూలు పూయించేందుకు
బ్రిటిష్ పాలకుల కబంద హస్తాలలో చిక్కిన 
మన దేశ అస్థిత్వ చెర విడిపించేందుకు
తమ ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయులు...

తలుచుకుంటే అణువణువూ రోమాంచితం
ఈనాటి స్వేచ్ఛా వాయువుల జీవనం
ఎందరో వీరుల త్యాగ నిరతి ఫలితమే...
దేశమే కుటుంబంగా
దేశ రక్షణ కోసం జీవితాలను అంకితం చేసిన అమరులదే త్యాగమంటే.
లాఠీ దెబ్బలు ఉరికొయ్యలు ఊచకోతలను 
లెక్క చేయక దేశ స్వాతంత్య్రానికై ప్రాణాలు కోల్పోయిన వారిదే త్యాగమంటే...

త్యాగ గుణం భారతీయుల నరనరాన ప్రవహించే జీవ నది...
పరోపకారార్ధం ఇదం శరీరం 
తరువుల్లా త్యాగించడంలో ఉన్న తృప్తి అనిర్వచనీయం!

 *వురిమళ్ల సునంద,ఖమ్మం*
8.
కవితాగానం(సీజన్2)
తేది14082021,శనివారం
అంశం:త్యాగం


శీర్షిక:కొందరికే సాధ్యం
త్యాగం ఒక మహత్తర గుణం
సాధ్యం కాదు అందరికి
కొందరికే అది సాధ్యం
తల్లి పిల్లలకోసం చేస్తుంది త్యాగం
ప్రేమికుడు ప్రేమికురాలికోసం చేసెను త్యాగం
చరిత్రలో గలవెన్నో సాక్ష్యాలు
దేశకోసం చేసారెందరో త్యాగం
వారి త్యాగ ఫలితమే స్వాత్తంత్ర్యం
త్యాగమన్నది డబ్బుతో కోనలేం
త్యాగానికి విలువ కట్టలేం
త్యాగం ఆమూల్యం
త్యాగమన్నది ద్రోహం కాదు
త్యాగం మోసం కూడాకాదు
త్యాగం వంచన కాదు
త్యాగం చేసేవారు చిరంజీవులవుతారు
త్యాగం అనేది ఒక ధనమే
అందుకే అది త్యాగధనం
దేశంకోసం తమధనమానప్రాణాలర్పించినవారికర్పిద్దాం
నివాళులు
త్యాగమే ధ్యేయంగా జీవిస్తున్నవారికందరికి జోహార్లు!

ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం,శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
9.

కవితాగానం ( సీజన్‌ 2 ) శనివారము
అంశం:-    " త్యాగం "



ఫలాపేక్ష లేక యిచ్చేదానం పరమేశుమెచ్చు
మనసుతోచేసే దానం మహిని నిలుచు

త్యాగమనేది ఒకగొప్పశక్తి
ఈశక్తి మహనీయుల త్యాగనిరతిలోనున్నది

బ్రిటిషు పరిపాలనకు వ్యతిరేకంగా యుద్యమాల్లో పాల్గొన్న మహనీయుల త్యాగశక్తిని ఏమని చెప్పగలము
దేశమాత స్వేచ్చకై ప్రాణములర్పించిన త్యాగధనులువారు

స్వరాజ్య సాధనకై పాటుపడుచు మాన ప్రాణము లర్పించిన త్యాగధనులెందరో వారి వూరుపేరైన మనకు తెలియరాదు అట్టివారి త్యాగమునేమనాలి

చైనాయుద్దమందుగాని, పాకిస్తాన్‌ యుద్దమందుగాని, సరిహద్దురక్షణ యందుగాని ప్రాణాలర్పించిన త్యాగధనులున్న భరతభూమిమనది

కవులుకూడజాతీయస్థాయిలో దేశభక్తి గీతరచనలు జేసిన త్యాగ నిరతి జూపిన మానవతామూర్తులు

భారతీయుల నరనరాల్లో త్యాగనిర తినిచూపేజీవనది ఈభూమి

మానవత ఔన్నత్యాన్ని జగతికిచాటిన భారతీయ సంస్మృతి
యజ్నం, దానం, తపస్సు, త్యాగం అన్నవాటికి ప్రతీకగాయున్నది భరతభూమి
ఈయజ్ఞ దానతపస్సులలో అంతర్గతంగా దాగియున్నది త్యాగం
త్యాగనిరతితో కృతజ్ఞతాభావంతో కర్తవ్యజ్ఞానంతో మనిషి బతకాలి

దేవయజ్ఞం, పిత్రుయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్నం, రుషియజ్నం ఈ పంచయజ్ఞాలు కర్తవ్యంగా భావించడమే అసలైన జీవితయజ్ఞం
   అదేనిజమయిన త్యాగం!
   తరణికంటి సూర్యలక్ష్మిం.
              -----------
10.
కవితా గానం( సీజన్- 2)
తేది'- 13-08-21
అంశం- త్యాగం
శీర్షిక:- 
 త్యాగాల ఫలితమే  నవభారతం
.................................


భరతభూమి సనాతన సంప్రదాయలకు నిలయం
త్యాగనిరతికి ఆదర్శభూమి
ఆడినమాటకై సర్వస్వాన్ని త్యాగంచేసిన హరిశ్చంద్రుడు, శిబి, రంతిదేవుల వారసులం..!

భరతమాత ద్రాస్యశృంఖలాల విముక్తికై 
చివరివరకు పోరాడి
వందేమాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా ప్రాణత్యాగం చేసిన అల్లూరి, భగత్ సింగ్
చంద్రశేఖర్ ఆజాద్ ల కన్నదేశం.
శాంతి...అహింసలే ఆయుధాలుగా  
స్వాతంత్య్ర సముపార్జన చేసి 
మతం కాదు మానవత్వం ముఖ్యం,ప్రేమతత్వం ముముక్షత్వానికి సోపానం అని దుండగుని చేతిలో ప్రాణ త్యాగం చేసిన జాతిపిత బాపూజీ లు త్యాగానికి ప్రతీకలు ...!

దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ 
స్వంతలాభం కొంతమానుకు పొరుగు వానికి తోడ్పడవోయ్ అన్న
మహాకవి గురజాడ 
తెలుగు రాష్ట్ర ఏర్పాటుకై ప్రాణత్యాగం చేసిన  పొట్టి శ్రీరాములు
విశాఖ ఉక్కు ఆంధ్రులహాక్కు అని నినదించిన ఎందరో మరెందరో త్యాగఫలితమే నేటి డెబ్బది ఐదవ సంవత్సరపు నవభారతం
అజాది కా అమృత్ మహోత్సవ్ 
నేడు ఆ త్యాగధనుల అడుగుజాడల్లో మనమంతా నడిచి రామరాజ్యం గాంధీ మహాత్ముడు కలలు గన్న రాజ్యం తప్పక ఏర్పడుతుందని ఆశిద్దాం..!!
.
     వందేమాతరం
   భారతమాత కి జై
...............................
పేరు:-
 ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
..............................
హామీపత్రం:-
ఇది నా స్వీయకవిత
..................................
11.

కవితాగానం (సీజన్-2)
తేది : 14/08/2021
అంశం :త్యాగం
శీర్షిక:అనిర్వచనీయం-త్యాగం
_____________________________


ధార్మిక ప్రగతికి మూలం
శ్రామిక శక్తికి నూతనోత్తేజం
లక్ష్యసాధనకు పట్టే యోగం
ఆశించదెన్నడూ ఏ భోగం
సుఖసంతోషాలను పంచే మార్గం
మంచితనానికిది నిదర్శనం 
కనిపించని కల్మషహరణం
కనిపెంచేవారికిది సహజగుణం
తనపరభేదమెరుగని వైనం
తపనల తమకాన పొందే మోక్షం
కష్టాల కడలినీదే సాహసం
ఫలితానికుండదులే ఆటంకం
అనిర్వచనీయం ఆ గుణం
అదేలే అందరికీ అలవికాని త్యాగం
త్యాగనిరతికి నిదర్శనం రామాయణేతిహాసం
త్యాగనిరతికి ప్రతిబింబం 
మన సనాతన సాంప్రదాయం
తనూమనధనప్రాణత్యాగ ప్రతిఫలం 
నేటి మన స్వాతంత్ర్య జీవన గమనం
ఐనదందుకే మన భరతావని త్యాగాలగని 
              _____________

జోషిపద్మావతి 
మహబూబ్ నగర్ 
చరవాణి 9542010502

హామీపత్రం:అనిర్వచనీయం-త్యాగం శీర్షికతో రచించిన ఈ కవిత నా స్వీయ రచన
12.
కవితా గానం సీజన్ 2

అంశం:త్యాగం
తేదీ:14/08/2021
శీర్షిక: రేపటి తరం ఆశల వారధి
"""""""""""""""""""""""""""""""""""""""""""""


నిరంతరం వందేమాతరమని 
వందల వేల డెసిబల్ సవ్వడితో 
ఎందరెందరో సమరయోధులు 
స్వేచ్ఛా వాయువు నింపుట కోసం 

ఓ గాంధేయ అహింసా వాదం 
మరో సాయుధ పోరాట మార్గం 
ఆంగ్ల వలస పాలన విముక్తి కోసం
బానిస బంధనాల విచ్ఛేదనే ధ్యేయం

ఉరికంబమే ఊయలగా తలచి     
దేశం కోసం దేహం తృణప్రాయంగా                         
ఆంగ్ల అరాచక తూటా జల్లులో తడిసి 
భరతమాత పాదానికి నెత్తుటి పారాణియై 

శత వసంతాల పోరాట స్వాతంత్ర సంగ్రామం 
ఆజాదీకా అమృత వజ్రోత్సవ శుభ తరుణం 
కుల మత భాషా భేషజాలకు నిప్పంటించగ
రేపటి తరం ఆశల వారధికై ధీరుల త్యాగఫలం

హామీ పత్రం: ఈ కవిత నా స్వీయ రచన.దేనికీ అనువాదం, అనుసరణ కాదనీ హామీ ఇస్తున్నాను.ధన్యవాదాలు.

పేరు: నాశబోయిన నరసింహ (నాన),
ఊరు:చిట్యాల
జిల్లా:నల్గొండ
13.
[9:08 PM, 8/14/2021] +91 80742 97465:

కవితాగానం సీజన్ 2
జంపని శ్రీనివాసమూర్తి ( జలజ )🦜
గుంటూరు
14 - 8 - 2021
80742 97465

అంశం: త్యాగం
శీర్షిక: అమ్మ

స్వార్ధం లేని మనోవాక్కాయములతో
చేయు సత్ కలాప సంపుటియే త్యాగం.

మాతృ మూర్తి నవమాసముల గర్భస్థ
శిశువును మోస్తూ, 
తన ప్రాణాలను లెక్కచేయక జన్మనిస్తూ
బిడ్డ సంరక్షణకై జిహ్హా రుచులను బహిష్కరిస్తూ
పొత్తిళ్ళ బిడ్డ మలమూత్రాదులను
ఓర్మితో, ప్రేమగా శుభ్రం చేస్తూ...

అడుగు అడుగు అడుగు అడుగుల
సోపానాలను ఎక్కిస్తూ
తొలిగురువై, విద్యాజ్ఞాన వివేకాలందిస్తూ
భావిజీవిత ఉషస్సులను కల్పిస్తూ
కుటుంబంలో విశ్రాంతి లేని రక్షణియై...

అలుపు - సొలువు లేని సతిగా, 
తల్లిగా, అత్తగా, అమ్ముమ్మగా, నానమ్మగా
పలు బాధ్యతల కర్తవ్య దీక్షతో
తన స్వలాభాన్ని కాంక్షించక
కుటుంబ సభ్యుల వృద్ధికై
పాటుపడే మాతృమూర్తి త్యాగం
భూదేవి కన్నా గొప్ప! అందుకే మాతృభ్యోనమః🙏🦜.
---------------------------------------------------
హామి: త్యాగం అనే అంశముకు శీర్షికగా అమ్మ ను పేర్కొంటూ నా స్వీయ భావాలుగా🦜
14
[9:09 PM, 8/14/2021] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం (సీజన్ 2) నిర్వహించు కవితల సమాహారం

అంశం: త్యాగం



సయ్యద్ జహీర్ అహ్మద్,
కర్నూలు.

      త్యాగధనులు 

ఎటువంటి లాభాపేక్ష రహిత గుణం
నవమాసాలు గర్భం ధరించిన మాతృమూర్తిదే!
తను కడుపు కాల్చుకున్న
కన్నపాశానికి సహృదయంగా
కన్నీళ్లు త్రాగి తన ఆహారం పంచిపెడుతుంది

ఎవరు ఏమీ సంతోషం ఇవ్వలేక పోయిన
తన రెక్కలు ముక్కలు చేసి ఉంటే కొని కొండలకు రాళ్ళు
మోస్తాడు
పిల్లల భవిష్యత్తు కోసం పితృమూర్తి
తన ఆడంబరాలను
ఉరికొయ్యకు తగిలించేసి 
భవిష్యత్తు వర్తమానాల మీద దృష్టి నిలిపి పిల్లల కోరికలు ఇష్టాలను 
స్వీకరించి సర్వం ఇచ్చేసి నిష్క్రియుడవుతాడు!

అజ్ఞానం నుండి విజ్ఞాన సర్వస్వం చూపించి
తనకు అందిన ప్రతిఫలాన్ని శిష్యులకు ధారపోసి
రిక్తహస్తమవుతాడు
ఆచార్య గురుదేవోభవుడు!
త్యాగ గుణం ముగ్గురిలో వుంది
అందించిన దారులు వేరు.....
      *   *
        హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
            ఇట్లు మీ
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
15.
[14/08, 9:16 pm] Vantipuli Nagaraju Poet

 కవితా గానం
పేరు: వంటిపులి నాగరాజు
చరవాణి: 98480 13844
అంశం: త్యాగం
శీర్షిక: గుర్తిస్తే నీ జీవితం స్వర్గం
**********************
నువ్వు  గమనించట్లేదుగానీ
ఎంతోమంది త్యాగంతోనే
నీ జీవితం ఇంత ఫలవంతంగా
ఉందంటే నా మాట నమ్ముతావా?

దేశప్రజల ధన, మాన, ప్రాణ
రక్షణ కొరకు ప్రాణాలను
లెక్కచేయక పోరాడుతున్న
వీర జవానులది 
గొప్ప త్యాగం కాదంటావా?

తన సుఖ సంతోషాల కన్నా
సంతానం జీవితం ముఖ్యమని
ఆజన్మాంతం
అష్టకష్టాలు పడే తల్లిదండ్రుల
త్యాగాన్ని ఒప్పుకుంటావా?

నీవెవరో తెలియకుండా
పెళ్ళి అనే బంధంతో
అన్నీ తానై మరణం వరకూ
వీడని మమతగా నిలబడే 
జీవిత భాగస్వామిది త్యాగం
కాదని చెప్పగలవా?

నువ్విప్పుడున్న స్థాయికి
నువ్వు చేరడానికి
నీ స్నేహితులు, బంధువులు
నీకు అండగా రక్షణ వ్యవస్థలు
కాపాడటానికి డాక్టర్లు
విజ్ఞాన వినోదాలకు
మేథావులు, కళాకారులు
ఒకటేమిటి ఒకరేమిటి
నువ్వు పుట్టిన దగ్గర్నుంచీ
చివరివరకూ
ఎంతమంది త్యాగంతో
నీ జీవితం నడుస్తుందో,
గడుస్తుందో గమనిస్తున్నావా?

అందరి త్యాగాన్ని గుర్తించే
మనసు నీకుంటే
నీ హృదయం వారి
రుణాన్ని తీర్చుకొనే
మమకారపు జల్లుగా మారి
నీ జీవితం స్వర్గతుల్యమవుతుంది
త్యాగాన్ని గుర్తించక
అంతా స్వార్థమని 
పరుల సాయాన్ని వక్రీకరిస్తే
నీ మనసు విషతుల్యమై
రకరకాల విద్వేషాలతో
జీవితం నరకప్రాయమవుతుంది
నిర్ణయం నీదే దాని ఫలితం నీదే!!
*******************************
ఇది నా స్వీయ రచన. 
16
🙏🙏
[14/08, 9:28 pm] +91 96528 32290: కవితాగానం (సీజన్ 2)
అంశం : త్యాగం


శీర్షిక :  "ప్రత్యక్షదైవాలు"
రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
*************************
తల్లిదండ్రులు తమ విలువైన జీవితాన్ని
పిల్లల అభ్యున్నతి కోసం త్యాగం చేస్తూ
రాత్రనక పగలనక తేడాలేకుండా శ్రమిస్తుంటారు !

తమ బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా
నిరంతరం కృషి చేస్తుంటారు !

ఆడేపాడే వయసులో వేలుపట్టుకుని నడిపిస్తూ..
రకరకాల ఆటలు ఆడిస్తూ.. మురిసిపోతుంటారు !

యవ్వనంలో ప్రేరణ తామై..
దిక్సూచిగా నిలుస్తూ..
విజయపథంలో సాగేలా.. సూచనలిస్తూ ప్రోత్సహిస్తుంటారు !

తల్లిదండ్రులు తమ బిడ్డల అభివృద్దికి చేసే త్యాగాలు వెలకట్టలేనివి !

అవనిలో వెలసిన ప్రత్యక్ష దైవాలు
తల్లిదండ్రులని తెలుసుకుని
ప్రతి ఒక్కరూ
తమ తల్లిదండ్రుల మలిదశలో ..చేయూతగా వుండాలి !
 
'వృద్దాశ్రమాలే' లేని భూమండలాన్ని ఆవిష్కరించాలి !
**********************
 "ప్రత్యక్షదైవాలు"అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను. - గొర్ర్రెపాటి శ్రీను

Comments

Post a Comment

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...