Skip to main content

శ్రావణ మాసం పౌర్ణమి 2

నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*************************
కవితాగానం
శ్రావణ మాసం పౌర్ణమి పోటీలకు స్పందించిన వారి జాబితా

1. ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు

2. బాలు కత్తులగారు

3. కవిత వెంకటేశ్వర్లు గారు

4. నాశబోయిననరసింహ గారు

5. అన్నాప్రగడవేంకట నరసింహారావు గారు

6. తరణి కంటి సూర్య లక్ష్మి గారు

7. మదునూరి సూర్య నారాయణ శర్మ గారు

8. ముత్యం వెంకటేశ్వర రావు గారు

9. కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు

10. పిట్ల కావ్యగారు

11. తాతపూడి సోమశేఖరశర్మ గారు

12. సింహాద్రి వాణి గారు

13. కొంపెల్లి రామయ్య గారు

14. గజవెళ్లిశ్రీనివాసాచారి గారు

15. మేకల రామస్వామి గారు

16. పిన్నకనాగేశ్వరరావు గారు

17. దారల విజయకుమారి గారు

18. తిప్పావఝలనరసింహ మూర్తి గారు

19. బొప్పెనవెంకటేష్ గారు

20. జోషి పద్మావతి గారు

21. మద్ది పుల్లారావు గారు

22. ఆళ్ల నాగేశ్వరరావు గారు

23. దోసపాటి వెంకటరామచంద్రారావు గారు

24. ధనాశి ఉషారాణి గారు

25. గొర్రెపాటి శ్రీను గారు

26. వనపర్తి. గంగాధర్ గారు

27. సింగీతం సంతోష్ కుమార్ గారు

28. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు

29. మొహమ్మద్ ఆఫ్సరవలీషా గారు

30. దారస్నేహలత గారు

31. ఇంద్రావత్ రాహుల్ గారు

32. దేవికా రాణి రత్నాకర్ గారు

❇️❇️❇️❇️❇️❇️

[30/08, 8:31 pm] Lalita Sister: శ్రావణమాసం పౌర్ణమి నగదు బహుమతులపోటీ విజేతలు

ప్రథమ స్థానం లో 
 నాశబోయిననరసింహ గారు


ద్వితీయ స్థానంలో
1. సింహాద్రి వాణి గారు

2. గొర్రెపాటి శ్రీను గారు

3. కవిత వేంకటేశ్వర్లుగారు

4. మేకల రామస్వామిగారు

5. ఆళ్ళ నాగేశ్వర్ రావు గారు

6. దోసపాటి వెంకటరామచంద్రారావు గారు

7. వనపర్తి గంగాధర్ గారు

8. సింగీతం సంతోష్ కుమార్ గారు

9. దేవికారాణి రత్నాకర్ గారు

10.జోషి పద్మావతి గారు
*******************************
డా.బల్లూరి ఉమాదేవి గారి లఘు సమీక్ష
************************************

1. ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు

అన్నదమ్ముల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అక్కాచెల్లెళ్లం రంగు దారాలతో కట్టే బంధమే రక్షాబంధన్ అని చక్కగా వివరించారు. వచనం పాలు ఎక్కువగా ఉందనిపించింది.

2. బాలు కత్తులగారు

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధనం అది వెలకట్టలేని రక్తపాశమని వివరించారు.
తోబుట్టువుల మధ్య నున్న అనురాగ గీతిక ఈ రక్షాబంధనమని చక్కగా వివరించారు.

3. కవిత వెంకటేశ్వర్లు గారు

పౌరాణిక అంశాలను జోడిస్తూ విడదీయరాని బంధం అంటూ ఈ రాఖీ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే అంటూ రక్షకభటులు కంటికి రెప్పలా కాపలా కాయాలి సూచించడం చాలా బాగుంది. టైపు మిస్టేక్స్ ను సరి చేసుకోవాలి.

   4. నాశబోయిననరసింహ గారు


సమైక్యతా రాగం తో అన్నాచెల్లెళ్ల అపురూపమైన బంధాన్ని చారిత్రక పౌరాణిక అంశాలతో పోలుస్తూ కవితలో తెలపడం చాలా బాగుంది. రాఖీ అనేది రక్షా కవచం అని ఆప్యాయతలకు నిలువుటద్దం అని చక్కగా వివరించారు. నాకు నీవు నీకు నేను మనం దేశానికి రక్షగా ఉండాలని చక్కని సందేశం ఇచ్చారు.


5. అన్నాప్రగడవేంకట నరసింహారావు గారు

రాఖీ ని నేటి దైనందిన కార్యక్రమాల తో పోలుస్తూ రాఖీ గురించి వ్రాసిన కవిత మరో కోణంలో ఆవిష్కరించడం చాలా బాగుంది.

6. తరణి కంటి సూర్య లక్ష్మి గారు

తోబుట్టువుల బంధాలు కలకాలం తోడుగా నిలిచిన రాఖీ బంధన్ తో బలపడతాయి అన్నది సీస పద్యం లో చక్కగా వివరించారు.మనుషులు దూరమైన ప్రేమానుబంధాలు దూరం కావని వివరించారు.

7. మదునూరి సూర్య నారాయణ శర్మ గారు

అన్నా చెల్లెళ్ల అనుబంధాలకు సాక్ష్యం చెప్పిన రాఖీ గురించి అలనాటి విష్ణు చక్రమే రాఖీ రూపున చెల్లి రక్షణ భారం మోసిందని అన్నారు

8. ముత్యం వెంకటేశ్వర రావు గారు

సిరులు కురిపించే శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మి పండుగ గురించి చక్కగా వివరించారు

9. కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు


రాఖీల అమ్మకాలను వయోభేదం తో పని లేక అందరూ పని చిత్రమైన రాఖీలను గురించి పుట్టింటిబంధానికి పెనవేసి రాసిన కవిత బాగుంది. మనం దేశానికి రక్ష అనే భావంతో కూడిన కవిత చక్కగా వుంది.

10. పిట్ల కావ్యగారు


అన్న చెల్లి కి రక్షణగా ఉంటాడని చెల్లి ఏడిస్తే ఊరుకోడనిఅంటూ, ఆరాటం అన్నకు ఉంటే కష్టాలను ఎదిరించే ధైర్యం చెల్లికి ఉంటుందంటూ రాసిన కవితబావుంది.వెల తక్కువైన రాఖీ చే రక్షణను గూర్చి అది పనిచేసే ప్రేమానురాగాలను గురించి చక్కగా వివరించారు.

11. తాతపూడి సోమశేఖరశర్మ గారు


రాఖీ బంధాన్ని గురించి అన్నాచెల్లెళ్ల ప్రేమను గురించి వివరిస్తూ రాఖీ పండగ వచ్చిందని ప్రేమాభిమానాలను ఇచ్చిందంటూ వ్రాసిన కవిత బాగుంది.

12. సింహాద్రి వాణి గారు

అన్నాచెల్లెళ్ల ప్రేమను చక్కనైన పద్యాలలో తెలియ చేసిన తీరు చాలా బాగుంది పౌరాణిక కథల మేళవింపుతో సీస పద్యం తేటగీతి పద్యాలు అమ్మానాన్నల వలె అన్న కూడా రేయింబవళ్ళు రక్షగా ఉంటాడు అంటూ వ్రాసిన పద్యాలు చక్కగా ఉన్నాయి


13. కొంపెల్లి రామయ్య గారు

మానవ మృగాల నుండి రక్షణ కవచంలా ఉండేది ఈ రాఖీ అంటూ ఇది అన్నాచెల్లెళ్ల మణిహారమై పాశ్చాత్య విష సంస్కృతి లో మరిచిపోతున్న సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కై వచ్చిందంటూ కవితాత్మకంగా చెప్పడం చాలా బాగుంది.

14. గజవెళ్లిశ్రీనివాసాచారి గారు


పండుగల పౌర్ణమి అంటూ రాఖీతో పాటు హయగ్రీవుని సంతోషిమాతను రాధాకృష్ణులకు ఊయలలూపే రోజని రాఖీ పౌర్ణమి విశిష్టతలను తెలుపుతూ రాసిన కవిత చక్కగా ఉంది.

15. మేకల రామస్వామి గారు


ఆత్మీయ ఆనందాలకు ప్రతీకగా సోదరులకు అక్క చెల్లెళ్ళు కట్టేది ఈ రాఖీ తన్మయత్వంతో తనకే కాక తన  తోటి సోదరీమణులకు కూడా రక్షణ కవచం గా ఉండాలని ఆకాంక్షిస్తూ రాసిన కవిత బాగుంది.



16. పిన్నకనాగేశ్వరరావు గారు

ప్రతి ఏటా వచ్చే రాఖీ పౌర్ణమను వివరిస్తూ,శ్రావణ మాసపు  విశేషాలను తెలిపే పద్యాలలో రాఖీ పండుగ అని వివరించిన తీరు చాలా బాగుంది.

17. దారల విజయకుమారి గారు


వాత్సల్యం పేరుతో ఆత్మ శ్రయకవితగా రాసిన కవిత బాగుంది. అన్నా అంటే రక్షా దీపమని ఆ వెలుగు నిన్న నేడు రేపు కూడా ఉంటుందనే భావనతో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి గాఅన్న అభివర్ణించడం బాగుంది.

18. తిప్పావఝలనరసింహ మూర్తి గారు


మహిళా మణులు ఎదుర్కొనే సమస్యలను ప్రస్తావిస్తూ, దానితోపాటు స్త్రీలను గౌరవించిన శివాజీని,ద్రౌపదికి రక్షణ గా నిలిచిన శ్రీకృష్ణుని వాత్సల్యాన్ని  వివరించి, ఆడపడుచు అంటే ఇంటికి దీపమని ఆమె కంట నీరు రానీయకుండా చేసేది  బాధ్యత అన్నదే అంటూ రాసిన కవిత యజ్ఞోపవీత ధారణం కూడా ప్రస్తావించడం బాగుంది

19. బొప్పెనవెంకటేష్ గారు 

రక్షణ బంధం కవితలో గత స్మృతులను ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ రాసిన కవిత బాగుంది ప్రేమతో వేసిన ముడి భారం అయిందని ప్రేమ పంచిన చేతులు దూరంగా వెళ్లాయని పౌర్ణమి రోజున మదిలో మెదిలిన భావాలను కవితలో అందించారు.

20. జోషి పద్మావతి గారు

శ్రావణ పౌర్ణమి విశేషాలను చక్కని కవితలో వివరించారు. హయగ్రీవ జయంతి, రాఖీ పండుగ  ఆచరించాల్సిన తీరును అనుబంధ రక్షణ కవచం రాఖీ గురించి కవితలో వివరించారు

21. మద్ది పుల్లారావు గారు

అపురూపమైన రక్షాబంధనాన్ని చక్కని తేటగీతులలో అందించారు. చారిత్రిక తో ఆరంభించి అన్నాచెల్లెళ్ల బంధానికి సాటి ఏదీ లేదని ఎన్ని యుగాలు గడిచినా తిరుగులేని మమతకు తార్కాణమని రాఖీ పండుగ గురించి వివరించారు.

22. ఆళ్ల నాగేశ్వరరావు గారు 


 అమ్మ నాన్న ల లోని తొలి మలి అక్షరాల కలయికే 'అన్న' అంటూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతలకు ప్రతీకగా నిలిచిన రాఖీ వర్ణిస్తూ చక్కని కవితను అందించారు ఈ పండుగను మతాలకు అతీతంగా నిర్వహించాలని సూచించారు.

23. దోసపాటి వెంకటరామచంద్రారావు గారు

సౌభ్రాతృత్వమునకు ప్రతీకగా రాఖీ పండుగ జరుపుకుంటారని అంటూ అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని అతి సహజంగా పౌరాణిక చారిత్రక కథనాలతో క్రోడీకరిస్తూ వ్రాసిన కవిత చక్కగా ఉంది.

24. ధనాశి ఉషారాణి గారు 


రాఖీ అంటే పుడమిలో విరిసిన పవిత్రబంధం అని కోటి వేలుగుల అండ నిచ్చే రాఖీ రక్షణగా నిలవాలని తెలిపే పండుగ రాఖీ అంటూ రాఖీ బంధం కవితలో వివరించారు.


25. గొర్రెపాటి శ్రీను గారు

అన్నాచెల్లెళ్ల ఆనందాల వేడుక రాఖీ పండుగ అంటూ ఇలలో జరిగే సంతోష సంబరాలకు నిలువెత్తు నిదర్శనం ఈ రాఖీ పండుగ అన్నారు .ద్రౌపది కృష్ణుల అనుబంధం, గ్రీకు రాజుల కథలను ప్రస్తావిస్తూ చిన్న రాఖీలో కొండంత ప్రేమ నింపుకొన్న వైనాన్ని చక్కగా కవితలో వివరించారు.

26. వనపర్తి. గంగాధర్ గారు 


తోబుట్టువుల రక్తసంబంధాన్ని  వివరిస్తూ రాసిన కవిత చక్కగా ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు  ఈ రాఖీ పండుగ ఆలవాలం అని అంటూ ఇది ఆప్యాయత పంచే పవిత్ర బంధమని, అది ఆనంద దివ్వెలా వెలగాలని ఆకాంక్షిస్తూ జన్మ జన్మల బంధమై నిలవాలంటే వ్రాసిన కవిత బాగుంది


27. సింగీతం సంతోష్ కుమార్ గారు

అన్నాచెల్లెళ్ల ప్రేమను తెలిపే పండుగే శ్రావణ పౌర్ణమి అని దీనినే జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు రాఖీలు కట్టి అన్నదమ్ములు విజయం దిశగా సాగాలని ఆకాంక్షిస్తూ కట్టే రాఖీని గురించి చక్కగా వివరించారు.

28. దేవికా రాణి రత్నాకర్ గారు 

పాలుపంచుకొని అనే శీర్షికతో చక్కని అంత్యాక్షరాలతో రాసిన కవిత. అమ్మానాన్నల జాగ్రత్తలు, చెలిమి కొమ్మల్లా ప్రేమ చకోరాలని అక్క చెల్లెళ్ళ దీవెనలు ప్రేమకు సాక్ష్యాలని రక్షరేఖ శాంతి లేఖ అంటూ ఆశీస్సులసుమమాలిక అంటూ ముగించడం బావుంది.

29. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు

చెల్లెలు అన్నకు కట్టే ఆత్మరక్షణ బంధమని ఆయురారోగ్యాలు రక్షణకై కట్టే కవచమని అంటూపౌరాణిక చారిత్రక అంశాలతో రచించిన కవిత బాగుంది

30. దారస్నేహలత గారు

రాఖీ పౌర్ణమి శీర్షికతో ఏడాదికి ఒకసారి ఇ మదిలో దాగిన కొమ్మకు పూసే పూల బంధమే రాఖీ బంధనమని చక్కగా వర్ణించారు. కాలాలు మారినా ఒకరికొకరు రక్షణగా నిలిచిన బంధమని ముగించడం బాగుంది

31. ఇంద్రావత్ రాహుల్ గారు 

కేవలం అన్నాచెల్లెళ్ల కే కాదు భారతదేశంలో ప్రతి స్త్రీకి నైతిక బాధ్యత పురుషుల మెలగాల్సిన తీరు అంటూ అందుకై స్వీకరించేదీ రాఖీ అని రక్షాబంధనాన్ని గురించి చక్కగా వివరించారు.

32
మొహమ్మద్ ఆఫ్సరవలీషా గారు

అన్నల అభివృద్ధిని కోరుతూ చెల్లెలు కట్టే ఆత్మరక్షణా బంధమే రాఖీ అని అది ముంజేతికి కట్టిన వీరకంకణం అంటూ రాఖీ యొక్క గొప్పదనాన్ని పౌరాణిక చారిత్రిక కథలతో చెప్పిన కవిత బాగుంది.
************************************************************

1.
మద్ది పుల్లారావు గారు

శీర్షిక:అపురూప బందం రక్షాబంధన్
ప్రక్రియ:తేటగీతి పద్యాలు
....
1)
 శూరుడగు రాజు మన పురుషోత్తమునికి
రక్ష బందనమును  గ్రీకు రాజు భార్య
భర్త మేలుగోరుచుగట్టె భారతాన
ఆచరించుచుండిరదియె విశ్వ జనులు

2)

అక్కజెల్లెళ్ళు జగతిన యాత్మ సములు
అన్నదమ్ములు వారికత్యంత విలువ
నిచ్చి బాగుగ కోర్కెలన్నిటిని దీర్చి
సంతసింపజేయవలెను సాదు హృదయ

3)

కలిమిలేములనునవి కల్లలనుచు
ప్రేమబందాలు గొప్పవై ప్రీతి గొలుప
మనసు యూరడిల్లునటుల మాటలాడి
సోదరి హృదయమును గెలుచు సోదరుండు

4)

రక్తసంబందమునకేది రాదు సాటి
ఎన్ని యుగములు గడిచినయీ జగతిన
తిరుగులేని మమతలకు దేవుడిచ్చు
బందమే తోడబుట్టినవారి దనుము

5)

పౌర్ణమి దినము తోబుట్టువుల మనమున
ముఖ్యమైనది శ్రావణమునకు నెపుడు
సోదరుల చేతి రాఖీలు శోభనిచ్చు
గుర్తు తెచ్చును సోదరి కూర్మినెపుడు
...
ఇది నా స్వీయరచన
......
 2.
ఆళ్ళ నాగేశ్వరరావు గారు

కవిత *
శీర్షిక;  "" పడతికి రక్షా కవచం ""
శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి
అదియే శ్రావణ పౌర్ణమిగా
జంధ్యాల పౌర్ణమిగా పొందింది ప్రఖ్యాతి!
అమ్మ లోని తొలి అక్షరం అ
నాన్న లోని మలి అక్షరం  న్న
రెండూ కలిస్తే అన్న
అమ్మానాన్నల ఆనక అన్నే
ఆడపడుచులకు  శ్రీరామరక్ష!
అన్నాచెల్లెళ్ళ అనురాగబంధమే
రక్షాబంధన్ పర్వదిన వేడుక
భారతీయ సంస్కృతి సంప్రదాయాల విశిష్టతలకు ప్రతీక!
శిశుపాలుని సంహర యత్నంలో
గాయపడిన శ్రీకృష్ణుని  వెలుకి
చీరకొంగు  చింపి  ద్రౌపది కట్టిన కట్
నిండు సభలో ద్రౌపదికి జరిగిన వస్త్రాపహరణం 
నుంచి
శ్రీకృష్ణుడు వస్త్రాన్ని అందించి రక్షయై నిలిచాడు!
గల్లికో దుశ్శాసను లున్న ఈ కలికాలంలో
ప్తతి పడతికి ప్రతి అన్నా రక్ష కవచమై.నిలవాలి!
ఆడపడుచు ల మాన ప్రాణాలకు సురక్షయై
కులమతాల కతీతంగా రక్షాబంధన్  
జరుపుకోవడం నేటి తక్షణ ఆవశ్యకం!

 3.
గాడెపల్లి మల్లికార్జునుడు
ఈశ్రావణ మాసం
అధికమైన వర్షాల చల్లదనముతో
నేల తల్లికి పరవశం
ఆపరవశం వర్ణనా తీతం
మనోహరమైన దృశ్యాలతో
ప్రతి మదిలో అనిర్వచనీయమైన ఆనందం
ప్రతి గృహసీమ
శ్రీ మహాలక్ష్మి వ్రతాల, పౌర్ణమి పూజల,
మానవ జాతి మనుగడకే మూలాధారమైన
మగువల పేరంటాల సందడితో
ఈశ్రావణ మాసమంతా
ఒకటే ఆనందోత్సాహాల  సందడి
మరో వైపు  * యజ్ఞోప వీత ధారణకు సుముహూర్తమైన  భారతీయ సంస్కృతికి
నిలువుటద్దమైన* జంథ్యాల పూర్ణిమ *
మరో సాక్ష్యం 
ఇదిసంధ్యా వందనమునకు, గాయత్రీ 
మంత్రోపాసనకు పలుకుతుంది శుభ స్వాగతం  
ఇలా, అనేక విధములా 
పరమ పవిత్ర మైన భక్తికి
ఇంటిల్లి పాది  శ్రీ మహాలక్ష్మి
 అనుగ్రహానికి అనువైన శుభ మాసం
ఇలా ఇంతుల సందడితో
ప్రతి ఇంటికి కళ కళ
మన హైందవ సంస్కృతికే 
ఈశ్రావణ మాసం భళా భళా


 4.

కవిత *
కవితాగానం(సీజన్2)
కవితలపోటికి
అంశం:శ్రావణపూర్ణిమ/రాఖీ
శీర్షిక:శ్రావణశోభ

శ్రవణానక్షత్రములో చంద్రుని ప్రవేశము
శ్రావణపౌర్ణమిగా ప్రాచుర్యము
శ్రావణశోభతో విరాజిల్లుమాసము
శ్రావణపౌర్ణిమి యే రక్షబంధనముగా ప్రసిద్దము
శ్రావణపౌర్ణమియే రాఖీ పౌర్ణమి గా మరోక నామము
రాఖీపౌర్ణమి సౌభ్రతృత్వమునకు ప్రతీక
హైందవసాంప్రదాయములో మచ్చుతునక
అన్నాచెల్లెల్ల అక్కా తమ్ముల్ల అనురాగబంధం
అన్నకు చెల్లి అక్క తమ్ముడునకు కట్టును రాఖీ
అన్న చెల్లెలకు రక్షణ నిచ్చును
అక్క తమ్మునకు సంరక్షణచేయును
అమ్మనాన్నల అప్యాయతానురాగములందించును చెల్లెకు అన్న
అనాదిగా వచ్చుచన్నది సాంప్రదాయము
శ్రీకృష్ణునకు ద్రౌపది కట్టెను చీరచెంగు చింపి
వస్త్రాపహరణమునందు ద్రౌపది మానముకాపాడె శ్రీకృష్ణుడు
అమరేంద్రునకు శచీదేవి కట్టెను రక్షాబంధనము
అసురులపై విజయము సాధించెను అమరేంద్రుడు
రుక్సానా పురుషోత్తమునకు కట్టి అలెగ్జాండరు ప్రాణము కాపాడెను
గణేశుడు సంతోషిమాతకు కట్టెను రక్షాబంధనము
చిత్తూర్ రాణి మొగల్ సామ్రాట్టు హుమాయూన్కు  కట్టెను
మహవిష్ణవు బలిచక్రవర్తికోరికమై అతనివశములొనుండెను
మహలక్ష్మీ బలిచక్రవర్తికి రక్షాబంధనము కట్టి విష్ణువును విడిపించెకొనెను
నేడు ఆధునికసమాజమునందు సౌబ్రాతృత్వచిహ్నముగా రాఖీపౌర్ణమిని వేడుకగా జరుపుకొందురు.

ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా.


 5.
కాకరపర్తి సుబ్రహ్మణ్యం
 కాకరపర్తి సుబ్రహ్మణ్యం
జిల్లా *
తెనాలి, గుంటూరు జిల్లా
కవిత *
అంశం:శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ
శీర్షిక:అనురాగబంధం
        *************
అన్నంటే అనుబంధాల హరివిల్లు
చెల్లెంటే ప్రేమాభిమానాల పొదరిల్లు
అదే అన్నా చెల్లెళ్ళ అనురాగబంధం
అమ్మలో సగం నాన్నలో సగం
కలిపి సృష్టించిన అపూర్వ పదం
అపురూపంగా అవతరించినఅన్న
చిరునవ్వులకు చిరునామాగా
అనుబంధాలకు ప్రతిబింబంగా
ఆత్మీయతకు అందమైనపేరుచెల్లి
మమకారానికి మారుపేరుగా
అనురాగానికి ఆలంబనగా
ప్రేమకు ప్రతిరూపంగా అన్న
కనిపించని దైవంకన్న మిన్నగా
కనిపించే అన్నే సర్వస్వంగా
మనసునమమతనునింపుకున్నచెల్లి
కాలంమారినా దూరంపెరిగినా
చెదరనిబంధం అన్నాచెల్లెళ్ల బంధం
తరతరాలకు తరగనిబంధం
కలకాలం నిలిచే ప్రేమానుబంధం
జన్మజన్మలకు కొనసాగాలిఈబంధం
మనసుల్లో మధురానుభూతినినింపే
రక్షాబంధానికిదే నా అక్షరాంజలి.



6
ధనాశి ఉషారాణి
జిల్లా *
చిత్తూరు
కవిత *
రాఖీ బంధము
......
పుడమి లోగిలిలోన 
విరిసిన పవిత్ర బంధము
అమ్మలోని అనురాగమును
నాన్న లోని మమకారమును
నిండు నూరేళ్లు కలబోసుకోని
అన్న అనే అభయహస్తముతో
కష్టాలు సుఖాలులో తోడుంటూ
నిండు భాగ్యము కూర్చును
అంధకారము అల్లుకున్న  వేళ
కోటి వెలుగుల అండను యిచ్చి
కన్నీటిని తుడిచి ఓదార్చును
రాఖీ రక్షణగా నిలవాలని
నిండుగా సిరిసంపదలు  విరియాలని
దేవున్నీ కోరుకుని నిలిచేను
ఆడపడుచుల బతుకులు
నిండుగా నూరేళ్లు నింపేటి
రక్షణ బంధము మనిషి జాతికే
నిండు వరములిచ్చు నిలిపేను
బతుకులో వెలుగులు పంచేను

 ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
 భాకరాపేట

 7.
కవితా గానం ప్లవ నామ సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి నగదు బహుమతుల కవితా పోటీ కోసం*..
అంశం: శ్రావణ పౌర్ణమి/రాఖీ
కవి పేరు: నాశబోయిన నరసింహ (నాన),
ఊరు:చిట్యాల,నల్గొండ జిల్లా,
చరవాణి:9542236764
ప్రక్రియ: వచన కవిత
⚜️⚜️⚜️⚜️⚜️🙏♦️🙏⚜️⚜️⚜️⚜️⚜️

ఆత్మీయ సుగంధం
""""""""""""""""""""""""""""""""
శచీదేవి పతి చేతికి కట్టిన రక్షా బంధనం
సాధించే విజయం రాక్షస పోరున ఇంద్రుడు 
శ్రీ మహా లక్ష్మి బలిచక్రవర్తికి కట్టిన రాఖీ బంధం
పాతాళం నుంచి తీసుకెళ్ళే భర్త శ్రీహరిని 
శ్రావణ పౌర్ణమి తరగని సోదరిప్రేమ చిరకాల స్వప్నం

రక్షా బంధన్ విలువ తెలిసిన రమణి రోక్సానా 
కట్టే పురుషోత్తముని చేతికి రాఖీ సోదర భావన 
పరాజితుడైన పతి అలెగ్జాండర్ కి ప్రాణభిక్ష పెట్టగ 
పరాయి స్త్రీ కట్టిన రక్షా బంధనం సైతం 
పరమ పవిత్ర భావనతో సోదరిగా తలిచే ధర్మం 

ఉప్పొంగే అనురాగం పంచుకునే
తనివి తీరని ఆప్యాయతకు నిలువుటద్దం 
పుట్టింటి పందిరిపై ఎగబాకే మమకారపు లతాంగి  
అన్నా చెల్లెళ్ల అక్కా తమ్ముళ్ల ఆత్మీయ సుగంధం

ఆపదలో ఆదుకునే 
ఆప్యాయతలు పంచుకునే బంధం 
ఎల్లవేళలా రక్షణ కవచంలా 
కష్టాల కడలిలో తోడుగా కన్నీళ్ల ఓదార్పుగా 
సోదరీ సోదరుల పవిత్ర రక్షా బంధనం 

నాకు నీవు నీకు నేను రక్షణగా 
మనమంతా దేశానికి సురక్షగా 
బంధాలను బలోపేతం చేసుకునే రక్షాబంధనం
సమైక్యతా రాగరంజిత భారతీయ సంస్కృతీ వైభవం
🌀🌀🌀🌀🌀🙏🙏🌀🌀🌀🌀🌀
హామీ పత్రం: ఈ కవిత నా స్వీయ రచన. దేనికీ అనువాదం అనుసరణ కాదనీ హామీ ఇస్తున్నాను.ధన్య వాదాలు.
✍️ *నాన*


 9.
కవితా గానం (సీజన్ 2 ) 
అంశం : రాఖీపౌర్ణమి పండుగ  
రచన : గొర్రెపాటి శ్రీను
శీర్షిక : "రాఖీపౌర్ణమి "  




సోదర సోదరీమణుల అనురాగానికి ప్రతీక "రాఖీ పౌర్ణమి!"
శ్రావణ పౌర్ణమి నాడు అరుదెంచె ఆనందాల వేడుక "రాఖీ పౌర్ణమి!"
తోబుట్టువులందరూ ఒకచోట చేరి పరస్పర ఆదరాభిమానాలతో
ప్రియమైన తీయని మాటల కొలనులో ఓలలాడుతూ జరుపుకునే ఉత్సవం "రాఖీ పౌర్ణమి !"
తోబుట్టువుల అభ్యున్నతిని కాంక్షిస్తూ చెల్లెమ్మలు అన్నయ్యలకు రాఖీలు కట్టగా
ఆ సుందర దృశ్యాన్ని చూస్తూ దేవతలందరు శుభమంటూ దీవించగా
ఇలలో జరిగే సంతోష సంబురాల వైభవాలకు నిలువెత్తు నిదర్శనం .."రాఖీ పండుగ మహోత్సవం !"
ద్రౌపతి శ్రీ కృష్ణుడిని అన్నయ్యగా భావిస్తూ రక్షాబంధనం కట్టగా ..
ద్రౌపదిని అడుగడునా కాపాడుతూ సోదర వాత్సల్యాన్ని పంచాడు శ్రీకృష్ణుడు !
పురుషోత్తముడి ని అన్నయ్యగా భావిస్తూ
అలెగ్జాండర్ భార్య "రొక్సానా " రక్షాబంధనం కట్టగా ..
అమిత పరాక్రమవంతుడైన పురుషోత్తముడు అలెగ్జాండర్ కి ప్రాణహాని తలపెట్టక
"రొక్సానా" కి సోదర ప్రేమ ని వ్యక్తపరిచాడు పురుషోత్తముడు !
ఆత్మీయత అనే పదానికి అర్థం తానై
చిన్ని రాఖీ లో కొండంత ప్రేమ ని నింపుకొని
అన్న కళ్ళ ముందు నిలిచిన చిట్టి చెల్లి కి
సదా రక్షణ కవచమై నిలిచే ధీమంతుడు అన్నయ్య !
"రాఖీ పౌర్ణమి " అంటే
అనురాగం ,ఆత్మీయత ,అభిమానాల మేలు కలయిక !
"రాఖీ పౌర్ణమి "అంటే
తోబుట్టువులందర్నీ కలకాలం కలిపి వుంచే ముచ్చటైన కూడిక .. !

"రాఖీ పౌర్ణమి "  అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను. - గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్).


 10.
కవితా గానం పౌర్ణమి నగదు పురస్కారాల పోటి
అంశం:: శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ.

శీర్షిక:::నీకు నేను రక్ష -- నాకు నీవు రక్ష
***************************************
నలుచెరుగులా ఎటు చూసినా  
ఉరుకుల పరుగుల హడావుడి
వీధులన్నీ కోలాహలంగా కిక్కిరిసి
ఇసుకేస్తే రాలనంతగా జనసమూహాలు

అడుగడుగునా తీరైన రాఖీల విపణి,
విపణుల  రారమ్మని పిలిచే పిలుపులు
దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి
రక్షాబంధన్ రక్షణలో సురక్షితంగా

చల్లని చిరుమందహాసం దట్టించి
స్నేహ చూపుల తళుకులు మెరిపించి
మెండైన రాఖీలు అమ్మేసే అందెవేసిన
చేతుల ఇంద్రజాలంబే తరచి జూడ

కొంటూనే ఉన్నారు ఇబ్బడి ముబ్బడిగా
ఆడ మగ పిల్లాపాపలు ముసలి ముతకా,
చిత్రాతి చిత్రమైన వన్నెలెన్నో పులిమిన,
ఏరికోరి మరీ బేరమాడి మనసు తృప్తి పొందగ

ఆడపడుచు లాత్మీయంగ అన్నదమ్ముల
ముంజేయిన రాఖీ కట్టి 
పుట్టింటి బంధాన్ని పెనవేస్తారు అండాదండలు
ముడివేస్తారు

ఇరుగు పొరుగు, ఊరు వాడను, పిలిచి రక్షాబంధన్ జుట్టీ స్నేహవారధి నిలిపి
వెన్నెల నంతా పొదివి కలతల పైన పూసి
మమతల పందిరి వేసి సమతారాగం పాడిన శ్రావణ పౌర్ణమి పూర్ణకుంభమే

నాకు నీవు రక్షా.. నీకు నేనురక్ష ,"మనం దేశానికి రక్ష,"
శ్రావణ వెన్నెల్లో పొంగిన పాలు దేహానికి రక్ష.
 

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
21082021.

సెల్ ఫోన్:: 8497924605
భద్రాద్రి కొత్తగూడెం.507101

 11.
వనపర్తి గంగాధర్ గారు

 
వనపర్తి గంగాధర్
జిల్లా *
వరంగల్ అర్బన్
కవిత *
శీర్షిక:ఆత్మీయ బంధం రాఖీ

అనంతమైన హృదిలోని ప్రేమకు
తోబుట్టువుల రక్త సంబంధమునకు
సంస్కృతి సంప్రదాయానికి ఆలవాలమై
నిలిచె పర్వదిన సంబరమై

మానస సరోవరాన మమతలు
మధురానుభూతుల ఆశా కిరణమై
పరిఢవిల్లిన పవిత్ర బంధం
ఆప్యాయతల మధురామృతం రాఖీబంధం

ఆజన్మంతము నీ నీడ కావాలని
ఆ నీడలో హాయిగా జీవించాలని
తోబుట్టువులా ఆదరించాలని
ఆశించి కట్టు స్వర్ణ బందం
రక్షా కోరునది రక్షా బంధం
నీ శ్రేయస్డును కోరు అపురూప బంధం

కలికాల కోరల్లో నుండి కాపాడి
కాలం చేసిన బంధానికి
బద్ధులమై సాగాలని కరుణామృత
భావాలతో కలకాలం బతకాలని
ఆనంద దివ్వెలమై వెలగాలని
కాక్షించు బంధం రక్షా బంధం
జన్మ జన్మలకు బంధమై నిలుచు బంధం


ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను

 12.
దార స్నేహలత గారు
12.

శీర్షిక : రాఖీ పౌర్ణమి

ఏడాదికోమారు ఎదన దాగిన
ఆత్మీయకొమ్మకు పూసేటి
శ్రావణమాసపు సోదర పూలబంధం
రక్షాబంధనం 

దూరమైనా భారమైనా
లెక్కచేయక చేరే ఆప్యాయత 
బాల్యపుస్మృతికాగిత రక్షకదారమే 
రక్షాబంధనం

తోబుట్టువులన్నాక కాసింత
ఎక్కువ తక్కువ సంపదతరాజున 
దూదిపింజలగును బేరీజుల్లేని 
దూదిబంతుల రక్షాబంధనం 

అమ్మ పేగున ఒకరివెనుక ఒకరుగా
ధరణి వెలుగు చూసిన 
నిష్కల్మ పూల మనసులు 
సోదరసోదరీమణుల అనుబంధం

రాజుల కాలములనుండీ
రక్షణ బంధముగా ప్రాణాలను
కాపాడు బంధమొకటిగా
కాలాలు మారుతున్నా
ఒకరికి ఒకరు రక్షగా 
నిలిచినదీ రాఖీపౌర్ణమి

13.
అంశం:రాఖీ
శీర్షిక:నీకు నేను రక్ష నాకు నీవు రక్ష ...!

_ కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

అమ్మ గర్భ గుడి లో నవ మాసాలు ఎదిగిన గువ్వలై 
బంధాలు అనుబంధాలు సిరి సిరి మువ్వ లై
అక్క చిటికెన వ్రేలు పట్టుకొని లోకాన్ని చూసిన ఉదయ భాను లై
చెల్లి చెట్టా పట్టాలతో విహంగం లా ఎగిరే  కవల కాంతు లై
అక్కా తమ్ముళ్ళ ప్రేమానురాగాల రక్త సంబంధ మై
శ్రావణ పౌర్ణమిన పుట్టింట సందడి  చేయ
వచ్చింది సోదర సోదరీ మణుల మణిహార మై రాఖీ పర్వదినం...!

అబలల  రక్షణ కై శిశుపాలుని నీచపు గుణ  తత్వాన్ని  అంతమొందించే విష్ణు చక్రమై
దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకాన్ని మట్టు పెట్టుట కై
రావణా సుర కీచక వారసుల అంతాని కై
వచ్చింది సోదర సోదరీ మణులు మణిహార మై రాఖీ పర్వదినం...!

మానవ మృగాల నుండి రక్షక కవచమై
ఆడ బిడ్డల రక్త కన్నీరు ను తూడ్చుటకై
భావి భారత రేపటి తల్లుల రక్షణ కై
వచ్చింది సోదర సోదరీ మణుల మణిహార మై రాఖీ పర్వదినం...!

పాశ్చాత్యపు విష సంస్కృతి సుడిగుండం లో
మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై 
సంస్కార హీన సమాజం లో నైతిక విలువలు నేర్పుటకు 
వచ్చింది సోదర సోదరీ మణుల మణిహారమై రాఖీ పర్వదినం...!
పెళ్ళై దూరమైన సోదరి సోదర చేతి స్పర్శ కై
రెండు హృదయాల స్పందనల ఆత్మీయ పలకరింపు కై
నీకు నేను రక్ష నాకు నీవు రక్ష యని దీవెనలిచ్చుటకై 
వచ్చింది సోదర సోదరీ మణుల మణిహారమై రాఖీ పర్వదినం...!

హామీ పత్రం 
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను

14.
జోషి పద్మావతి గారు

శ్రావణపౌర్ణిమావైశిష్ఠ్యం
------------------------------
క్షీరసాగర సంజాతుడే ఆ పూర్ణచంద్రుడు
సిరిదేవి సహోదరుడు షోడశకళాపరిపూర్ణుడు
హయగ్రీవజయంతి,రాఖీ,జంధ్యాలపౌర్ణమా 
పర్వసమాహారమీశ్రావణ పౌర్ణిమ
జ్ఞానసిరిప్రదాత వేదసంరక్షణావేలుపు 
ఆహయవదనఅవతరణదినోత్సవమై 
జ్ఞాన పౌర్ణమియైన శ్రావణ పౌర్ణమి
పరమపవిత్రమయం యజ్ఞోపవీతధారణం
వైదిక నిత్యకర్మానుష్ఠాన ‌యజ్ఞోపవీత ధారణం
గృహాశ్రమధర్మానుచరణోపాంగవస్త్రం 
యజ్ఞోపవీతధారణంవేదోక్తకర్మాచరణాధికారం 
యథాశక్త్యానుసారం గాయత్రీమంత్రోపాసనం
అగ్రత్వాయుర్వృద్ధి నిర్మలస్వధర్మాచరణ
సామర్థ్య తేజో ప్రభావప్రసాదితం
సౌభ్రాతృత్వక్షేమ రక్షాకంకణధారణం
పురాణేతిహాసకాలానుసరణీయ పర్వం
సోదరీసోదరుల అనుబంధ రక్షణకవచం
శశి శ్రవణానక్షత్రసంచార శుభదినం శ్రావణపౌర్ణిమ
సర్వ సంపద్ప్రదాయకం 
సర్వమంగళసిద్ధిదాయకం శుభం!

 16.
సింగీతం సంతోష్ కుమార్ గారు


అంశం:- రక్షా బంధన్ 


శీర్షిక:- గొప్పనైన పండుగ - రాఖీ


"రక్ష" అంటేరక్షించడం"బంధన్" సూత్రం కట్టడం 
 అక్కా,తమ్ముడు
అన్నా చెల్లెళ్ల మధ్య 
బంధానికి ప్రతీక 
భారతీయ సంప్రదాయంలో అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలను తెలియజేసే పండుగే 
రాఖీ పండుగ
చిన్నారి నుంచి బామ్మల వరకు ఆ రోజున తమ సోదరులకు రాఖీలు కట్టి వారి ఆశీర్వాదంతీసుకొని
ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ
కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా
పిలిచే పండుగ..
అన్నాచెల్లెళ్లు
అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచక
అన్నకుగాని,తమ్మునికిగాని ప్రేమ సూచకంగా
 సోదరి కట్టే రాఖీ 
 ఈపండుగ ప్రధాన విశేషం..
అన్నదమ్ములు విజయం దిశగా అడుగేయాలని
అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ
రాఖీ కట్టే పండుగ
సోదరుడి విజయాన్ని సోదరి కాంక్షిస్తూ
ఏ కష్టమైనా నీకు అండగా నిలుస్తానని సోదరుడు హామీ ఇస్తూ,
తనను సంతోషపెట్టడానికి చిరుకానుకలు ఇస్తూ జరుపుకునే పండుగ....
అన్నయ్యతలపెట్టే కార్యాలు విజయవంతమై సుఖసంపదలు కలగాలని
ఆకాంక్షించే  సంప్రదాయం పండుగ...
అన్నదమ్ములు విజయం దిశగా అడుగేయాలని
అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ
రాఖీ కట్టే పండుగ....

17.

కవితా గానం పౌర్ణమి కవితల పోటీ
అంశం : శ్రావణ పౌర్ణమి/ రాఖీ
శీర్షిక : వాత్సల్యం
21-8-2021
********************

జీవితం మొదలుపెట్టే సరికే నాకు జీవన రక్షగా నియమించు కున్నోడు

నే చదివిన మొదటి పుస్తకం అమ్మ నాన్నలయితే..రెండో పుస్తకం నా అన్న

నిర్ఘాంతపోనీడు..నిశ్శబ్దంగా ఉండనీడు
ఆటైనా..అల్లరైనా తన తోనే

నా బాధ్యతలు..బరువులలో..తాను పక్కనుండగా ఓడిందే లేదు

కొతి పిల్లనతికించుకు
మోసినట్టు..లేగదూడను చెర్చుకున్నట్టు..బుజ్జిపిట్టను పొదుపుకున్నట్టు..

వెక్కిపడినపుడో..బెంగతో వెనక్కి చూసినపుడో..కొండంత ధైర్యాన్నిచ్చే ఆ చిరునవ్వు

నా అడుగుల కోసమే..తానే ఓ రక్షా దీపంగా 
పుట్టింటి నుంచీ మెట్టినింటి దాకా పరుచుకున్న ఆ పచ్చని వెలుగు 

నిన్నైనా నేడైనా నా నేపథ్యం తానే..
బతుకు ఏ కోనలో ప్రస్తావించినా.. ప్రతి అనుభవం లోనూ తనే 

శ్రావణ శుక్ల త్రయోదశి నాడు తన
క్షేమం కోసమే అనురాగ దారాల రక్షాబంధనం..అదే ఈ చెల్లికి అభయం 

నా ఊహల్లో ఇంకా అన్న చేయిపట్టుకుని
నడుస్తూనే ఉన్నా..తన సమక్షంలో ఆడుతూనే ఉన్నా..సైకిల్ లో వెనక కూర్చొని తిరుగుతూనే ఉన్నా

తల్లిదండ్రులిచ్చిన వాత్సల్యపు ఆస్తి అన్న
నా జీవన భరోసా అన్న

దారల విజయ కుమారి

హామీ పత్రం
**************
నమస్తె సర్/ మేడం
ఈ కవిత నా స్వంత రచన.అనువాదం కాదు.ఎక్కడా ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
దారల విజయ కుమారి

18.
సయ్యద్ జహీర్ అహ్మద్ గారు


అనురాగ సంకేతం:-
భిన్న దృక్పథాల కలబోత
అన్న ఉన్నతి శిఖరాగ్రాల నధిరహించాలని
చెల్లెలు అన్నకు కట్టే ఆత్మరక్షణ బంధం
తమ్ముడి ఉజ్వల భవిష్యత్తుకు
ఆయురారోగ్యరక్షణార్థం దీవించే రక్షణ కవచం
ఆత్మీయానురాగాలను పెంపొందించిన కట్టు
ఆనందమయ ఆచార సంప్రదాయ పర్వదినం!
దేవదానవ పుష్కరకాల యుద్ధానంతరం
ఇంద్రుడు అమరావతిలో దాగిన పరాజేత
ఇంద్రాణి యుక్తితో సమరోత్సాహం నింపిన శ్రావణ పౌర్ణమి....
శివపార్వతుల వేడుకొని పతిని ఉసిగొల్పి కడుతుంది విజయోస్తు రక్ష సురవరులు అర్చిత లక్షలు ఇంద్రునకు సురక్ష!
ముంజేతికి కట్టిన వీరకంకణం దానవ విజేత
శ్రీకృష్ణ శిశుపాల సంహార వేళ సుదర్శన చక్రం తర్జనీని తాకగా ద్రౌపది కొంగు చించి కట్టిన ఫలితమే దుశ్శాసన వధకు కారణభూతం!
శ్రీలక్ష్మి బలిచక్రవర్తికి కట్టిన రక్షాబంధనం
రమాపతులు వైకుంఠానికి పునఃప్రవేశం
అసుర హయగ్రీవ సంహార యత్నం నిహతుడైన హరి హయగ్రీవం రూపుదాల్చి
అసుర హయగ్రీవుని సంహరించు దినమే శ్రావణ పౌర్ణమి
అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడికి కట్టిన రక్షాబంధన్ పతికి ప్రాణభిక్ష జగద్విజేత
రక్షాబంధన్ సోదరత్వానికి ప్రాణం సురక్ష!!

19.

మొహమ్మద్. అఫ్సర వలీషా 

అనురాగ సంకేతం:-
భిన్న దృక్పథాల కలబోత
అన్న ఉన్నతి శిఖరాగ్రాల నధిరహించాలని
చెల్లెలు అన్నకు కట్టే ఆత్మరక్షణ బంధం
తమ్ముడి ఉజ్వల భవిష్యత్తుకు
ఆయురారోగ్యరక్షణార్థం దీవించే రక్షణ కవచం
ఆత్మీయానురాగాలను పెంపొందించిన కట్టు
ఆనందమయ ఆచార సంప్రదాయ పర్వదినం!
దేవదానవ పుష్కరకాల యుద్ధానంతరం
ఇంద్రుడు అమరావతిలో దాగిన పరాజేత
ఇంద్రాణి యుక్తితో సమరోత్సాహం నింపిన శ్రావణ పౌర్ణమి....
శివపార్వతుల వేడుకొని పతిని ఉసిగొల్పి కడుతుంది విజయోస్తు రక్ష సురవరులు అర్చిత లక్షలు ఇంద్రునకు సురక్ష!
ముంజేతికి కట్టిన వీరకంకణం దానవ విజేత
శ్రీకృష్ణ శిశుపాల సంహార వేళ సుదర్శన చక్రం తర్జనీని తాకగా ద్రౌపది కొంగు చించి కట్టిన ఫలితమే దుశ్శాసన వధకు కారణభూతం!
శ్రీలక్ష్మి బలిచక్రవర్తికి కట్టిన రక్షాబంధనం
రమాపతులు వైకుంఠానికి పునఃప్రవేశం
అసుర హయగ్రీవ సంహార యత్నం నిహతుడైన హరి హయగ్రీవం రూపుదాల్చి
అసుర హయగ్రీవుని సంహరించు దినమే శ్రావణ పౌర్ణమి
అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడికి కట్టిన రక్షాబంధన్ పతికి ప్రాణభిక్ష జగద్విజేత
రక్షాబంధన్ సోదరత్వానికి ప్రాణం సురక్ష!!

 20.
రాఖీ 
ఇంద్రావత్ రాహుల్ గారు
*******
గతి తప్పిన ఆచారవ్యవ హారాల సమాహారాలు
సన్నగిల్లు తున్న సంస్కృతీ 
సౌలభ్య వైనం....

ప్రకృతిరమణి   కలవోసిన
సింగారాలతో పురవీధులలో

కనువిందు చేసే వివిధా
కృతుల భిన్న రంగుల  రాఖీలతో,

ముంగిళ్ళల్లోరంగవల్లులతో
సింగారించిన  లోగిల్లతో

కేవలము అన్నా చెల్లెలు
భాందానికి ఆప్యాయతకు

మాత్రమే ముడి పెట్టిన 
మన  సంస్కృతి ఆచా
రాల తీరు

సృష్ఠిలో "స్త్రీ"జీవన 
సంరక్షణకు పురుషుని 
రక్షణ బాధ్యత
        
ను నిక్కచ్చిగా సూచించి 
ప్రేమాభినాలు ను పంచే
రాఖీపౌర్ణమే రాఖీపండుగ 

సోదర సోదరీ మణులకు మాత్రమేపరిమితము కాదు

నిండు భారతావణి లో ప్రతి
స్త్రీ మూర్తికి ప్రతి పురుషుడి

ప్రేమా ఆప్యాయలతో నైతిక
రక్షణ బ్యాద్యత స్వీకరించేదదే 

నిజమైన రాఖీ పండుగ ,ఇది
నేటి సమాజానికి అవశ్యము

ఇది నేను ఊహించే కల్పన
కాదుసుమీ,నిక్కమైన నిజం

శాస్త్ర ,చరిత్ర ఆధారితము.
********
[20/08, 8:43 pm] Lalita Sister: పేరు.. అన్నాప్రగడ వేంకట నరసింహారావు
నరసరావుపేట, గుంటూరు జిల్లా
చరవాణి..9390099056
అంశం..రాఖీ
శీర్షిక.. కొత్త అర్ధం తెలుస్తూ..

నాలుగు పదులేగా వయసు, నాకేమిటిని విర్రవీగే మనసుకు..
మొదటి దెబ్బ తగిలింది చత్వారమనే కంటి మసకతో..
అక్షరంముక్క చదవాలన్న, చరవాణి లో అంకెలు చూడాలన్న తోడుగా నిలిచింది రెండద్దాల జోడు..

ఆనాటినుండి రక్షగా నిలిచిన కళ్లద్దాలకు కట్టాడు మనిషి మొదటి రాఖీ..

నాలుగేళ్లు గడిచాయో లేదో చేసుకున్నవారికి చేసుకున్న భాగ్యములా రక్తానికి ఒక పోటు, అందులో మధువు..

మనిషి రెండవ రాఖీ కట్టాడు పొద్దున్నే,అదో మాత్ర, ఇదో మాత్రకి..

మరో కొన్ని రోజులు గడవగానే గుండెకు రక్తంచేరక కొట్టింది మొదటి గంట..

మురిపంగా మరో రెండు మాత్రలు, ఒకటి బలిసిన కొవ్వుకు, రెండవది రక్తపు పలచనకు..
కట్టాడు ముచ్చటగా మూడో రాఖీ..

శీతల పెట్టెలో సేదతీరుతూ పూదండలు వేయించుకొనేలోపు  ఎన్ని రాఖీలు కట్టాలోయేమో మనిషి..

పొద్దునే కళ్ళజోడు వెతుకుతూ మొదటి రెండుమాత్రాలు మింగుతూ రక్షాబంధన్ రోజు సోదరి ఆప్యాయంగా పెట్టిన మిఠాయిముక్క తినుటకును భయపడే సోదరు లెందరో...

✒అన్నాప్రగడ
[20/08, 9:54 pm] Lalita Sister: రాఖీ పౌర్ణమి

మమతలవర్షం  కురియగధరిత్రి
వర్షపు ధారలు మరిచింది.
   శ్రావణ మేఘం అబ్బురమందగ
ఇంద్రధనుస్సే విరిసింది.
 అన్నా చెల్లెలి అనుబంధాలకు 
  రాఖీ సాక్ష్యం చెప్పింది.
 నేనున్నానని రక్షణ ఛత్రం 
 చెల్లి కి పట్టెను అన్నయ్యే.
  కుటుంబ విలువల 
  కూరిమి తెలిపెను బుడిబుడి నడకలచెల్లెమ్మే.
  తరతరాల సంస్కృతిఇదియని
 వారధి పట్టెను హారతితో.
     చెల్లెలి కిచ్చిన భరోస
 జూచిన ధరిత్రి హాయిగ నవ్వింది.
   పున్నమి వెన్నెల పుడమికి 
వెలుగై పుత్తడి బొమ్మ కు 
  ధైర్యము నివ్వగ
మమతల జల్లులు కురిసింది.
విష్ణువు చక్రం విక్రమమై
రక్కసులను దునుమాడింది.
రాఖీ రూపము తీసుకుని 
 రక్షణభారము మోసింది

మదునూరి సూర్య నారాయణ శర్మ
[21/08, 7:35 am] Lalita Sister: శీర్షిక: శ్రావణ పూర్ణిమ
శ్రావణ మాసం అంటే సిరులు కురిపించే 
మహాలక్ష్మి అమ్మవారికి మహా ప్రీతి 
శ్రావణ పూర్ణిమ శుక్రవారం రోజున 
ముత్తైదవులను పిలిచి వరలక్ష్మీ వ్రతం జరిపి 
వారి ఆశీస్సులు పొందితే సకల శుభాలు కలుగుతాయి 
రవికంచు చీరను అమ్మవారికి సమర్పించి 
పసుపు కుంకుమ గాజులు పండ్లు పూలు 
అన్నీ ఆతల్లికి అందిస్తే సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు
 చేకూరుతాయి 
ఆడవారికే ప్రత్యేకం ఈ వరలక్ష్మీ వ్రతం 
సంప్రదాయ దుస్తులే ఆ తల్లికి నిండైన ఆనందం 
జగతిలో వెలిసిన లోక మాతను 
వరాలిచ్చే కల్పవల్లిగా ఆరాధిస్తారు 
పరిశుభ్రతను అనుసరించి 
భక్తి భావంతో వరలక్ష్మీ వ్రతాన్ని 
పాటించడం 
వలన ఆ ఇంటిలో శాంతి సుఖాలు చేకూరుతాయి 
లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది 
శాంతి నిలయంగా మారుతుంది 
శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుదాం 
తెలుగింటి ముంగిట్లో వరలక్ష్మీ 
వ్రతం జరిపి ఆ తల్లి ఆశీస్సులు పొందుదాం 
****************************** 
ముత్యం వెంకటేశ్వరరావు 
గురజాల, గుంటూరు జిల్లా 
చరవాణి: 7997840591 
హామీపత్రం: ఈ రచన నా స్వీయ రచన ఎటువంటి అనువాదం కానీ అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను
[21/08, 1:38 pm] Lalita Sister: కవితా గానం పౌర్ణమి నగదు పురస్కారాల పోటి
అంశం:: శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ.

శీర్షిక:::నీకు నేను రక్ష -- నాకు నీవు రక్ష
***************************************
నలుచెరుగులా ఎటు చూసినా  
ఉరుకుల పరుగుల హడావుడి
వీధులన్నీ కోలాహలంగా కిక్కిరిసి
ఇసుకేస్తే రాలనంతగా జనసమూహాలు

అడుగడుగునా తీరైన రాఖీల విపణి,
విపణుల  రారమ్మని పిలిచే పిలుపులు
దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి
రక్షాబంధన్ రక్షణలో సురక్షితంగా

చల్లని చిరుమందహాసం దట్టించి
స్నేహ చూపుల తళుకులు మెరిపించి
మెండైన రాఖీలు అమ్మేసే అందెవేసిన
చేతుల ఇంద్రజాలంబే తరచి జూడ

కొంటూనే ఉన్నారు ఇబ్బడి ముబ్బడిగా
ఆడ మగ పిల్లాపాపలు ముసలి ముతకా,
చిత్రాతి చిత్రమైన వన్నెలెన్నో పులిమిన,
ఏరికోరి మరీ బేరమాడి మనసు తృప్తి పొందగ

ఆడపడుచు లాత్మీయంగ అన్నదమ్ముల
ముంజేయిన రాఖీ కట్టి 
పుట్టింటి బంధాన్ని పెనవేస్తారు అండాదండలు
ముడివేస్తారు

ఇరుగు పొరుగు, ఊరు వాడను, పిలిచి రక్షాబంధన్ జుట్టీ స్నేహవారధి నిలిపి
వెన్నెల నంతా పొదివి కలతల పైన పూసి
మమతల పందిరి వేసి సమతారాగం పాడిన శ్రావణ పౌర్ణమి పూర్ణకుంభమే

నాకు నీవు రక్షా.. నీకు నేనురక్ష ,"మనం దేశానికి రక్ష,"
శ్రావణ వెన్నెల్లో పొంగిన పాలు దేహానికి రక్ష.
 

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
21082021.

 సెల్ ఫోన్::8497924605
భద్రాద్రి కొత్తగూడెం.507101
[21/08, 1:38 pm] Lalita Sister: కవితాగానం ( సీజన్‌ 2 )
20/8/2021/ శుక్రవారము
పౌర్ణమి నగదు బహుమతులపోటి
అంశం:-  " రాఖిబంధము "

సీ!                 (1)
సర్వశుభములను  సమకూర్చు పౌర్ణమి
రాఖి పౌర్ణమనగ  రానె వచ్చె

అక్కచెల్లెళ్ళంత  ఆతుర జూపేటి
రాఖిపండుగ యెంత  రాగమొలుకు

అనురాగ మమతల  కర్ధముదెలుప గ
తోబుట్టుబంథాలు  తోడు నిలువ

తొలగించలేనివి  తోబుట్టువులతోడి
బంధమొకటిరక్త  బంధమనగ

ఆ!  హారతులనుబట్ట,  అన్నసోదరికిచ్చు
కానుకలకొరకు  నాశపడదు
తోడబుట్టు కట్టు  తోరబంధమొకటి,
బంధమదియెరాఖి  బంధ మనగ!
                 (2)
సీ!  అన్నదమ్ములకును,  అక్కచెల్లెలు గట్టు
రాఖిబంధ మనగ  రాగమొలుక

పసుపుదారంబైన  పసిడిదారంబైన
అనురాగమమతల  బంధమదియె

తొబుట్టు బంధాలు  తోడుగ నిలుచును
రాఖి బంధముతోడ  రాజుకొనును

దూరమరిగినంత  దూరాలుకాలేవు
మమతలెపుడు  మారకుండు

ఆ!  తోడువిడువకుండు  తోబుట్టు బంధాలు
మమత బంధ మెపుడు  మాసిపోదు
ఆడబడుచుకిచ్చు  నపురూపకాన్కలు
యింటి ఆడబడుచు  యిచ్చు మమత!
         తరణికంటి సూర్యలక్ష్మి.
                     ------------
[21/08, 1:49 pm] Lalita Sister: 🌷🌷కవితాగానం శ్రావణమాసం పౌర్ణమి నగదు బహుమతుల పోటీ కొరకై🌷🌷.....
*అంశం* : శ్రావణమాసం లేదా రాఖీ
 *శీర్షిక*: అన్నాచెల్లెల అనుబంధం

 *కవిత*

అమ్మలా ప్రేమగా లాలిస్తావు
నాన్నలా వెంటుండి నడిపిస్తావు
అనుకోకుండా ఎదురయ్యే కష్టాలనుండి
నీ చేతులు అడ్డుపెట్టి కాపాడుతావు
అన్నయ్యా!ఇంట్లో నీవెంత గొడవపడిన
బయట నీ చెల్లి ఏడుస్తూ కనిపిస్తే వూరుకోవు
ఆమె కన్నుల్లో ఆనందం చూడాలని
ఎంతో ఆరాటపడుతావు
జీవితంలో అన్నయ్యా అనే ఒక తోడుంటే
ఎలాంటి కష్టమైనా సరే!ఎదిరిస్తా!!
అనే ధైర్యం ప్రతి చెల్లెలికి ఉంటుంది
అలాంటి అన్నతమ్ముళ్ల క్షేమం కోరుతూ
వాళ్ళు చేసే ప్రతిపనిలో విజయం పొందాలని
ఎల్లప్పుడూ సుఖశాంతులతో
కష్టాలకు లొంగకుండా జీవితంలో
ఉన్నత స్థాయికి ఎదగాలని
గట్టి సంకల్పంతో నీపై ఉన్న ప్రేమను
"నేను కట్టే ఈ రాఖీ ఎల్లప్పుడూ
రక్షా కవచం లా నిన్ను కాపాడుతూ ఉండాలని"
ప్రతి సోదరి తన అన్నతమ్ముళ్లకు
ఈ రాఖీ కడుతుంది
అలాగే తను కట్టే రాఖీ
నీ స్థాయికి తక్కువగా అనిపించొచ్చు
కానీ అందులో నీ సోదరి 
ప్రేమానురాగాలు ఉన్నాయని మరవొద్దు
అన్నయ్యా!!అనే పిలుపులో ఉన్న ఆత్మీయత
ఎన్నో అనురాగాల కలబోత
అలాంటి నీ నిండు హృదయంతో
నాకోసం ఏమి ఇవ్వకపోయినా పరవాలేదు
నీ చల్లని దీవెనలు
ఎల్లప్పుడూ నాపై ఉండాలని కోరుకుంటూ....

 *పేరు* : పిట్ల కావ్య
 *చరవాణి* : 8978656976
        🌹🌹🌹🌹🌹🌹
[21/08, 1:50 pm] Lalita Sister: కవితాగానం (సీజన్ 2)
అంశం..  శ్రావణపూర్ణిమ లేక రాఖీ 
శీర్షిక.. రక్తసంబంధమైన బంధం 
ప్రక్రియ.. వచన ప్రక్రియ 

వచ్చింది వచ్చింది రక్షాబంధనపండుగ వచ్చింది
తెచ్చింది తెచ్చింది  ప్రేమాభిమానాలు
తెచ్చింది
కట్టింది కట్టింది విలువైన రక్షాబంధనమే
కట్టింది 
మెచ్చింది మెచ్చింది చెల్లాయి మనసే
మెచ్చింది
విచ్చింది విచ్చింది అక్కయ్య వదనమే
విచ్చింది 
పొంగింది పొంగింది అన్నయ్య మనసే
పొంగింది 

రాఖీలో నిండె అన్నయ్య ప్రేమ
రాఖీలో వుండె సోదరి అనురాగం
రాఖీలో ఇమిడె జీవన సారాంశం
రాఖీతో కలిసె అన్నాచెల్లెళ్ళబంధం

సోదరి రక్షణే సోదరుడు
సోదరి గౌరవ బాధ్యుతుడు
సోదరి విలువకు రక్షకుడు
సోదరి ప్రేమకు ఆరాధ్యకుడు
రక్షణపండుగ....అన్నాచెల్లెళ్ళపండుగ 

అమ్మ కడుపున పుట్టిన బంధము  అనురాగం మూర్తీభవించినబంధము 
అవనియందు అపురూపమైనబంధము 
అమూల్యమైనదే ఈ ఆత్మీయబంధము
సోదరీసోదరుల పవిత్ర తోడు బంధము
రక్షాబంధనబంధం.. సోదరిరక్షణబంధం

తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

హామీ పత్రం
                 ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
[21/08, 5:09 pm] Lalita Sister: కవితా గానం  (సీజన్--2)
ప్లవ నామ సంవత్సరం
శ్రావణ మాసం
పౌర్ణమి నగదు బహుమతుల పోటీకై
అంశం:--శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ
శీర్షిక:--రక్షాబంధనం
రచన:--సింహాద్రి వాణి
ఊరు:--విజయవాడ
తారీఖు:--21--8--2021
వారం:-- శనివారం

1) సీ. ఇతిహాస చరితలో నింపుగ ‌వెలుగొంది
తరతరముల నుండి తరలి వచ్చె
సకల శుభములిచ్చు శ్రావణ పౌర్ణమి
తెలుపును కథలెన్నొ ‌దివ్యముగను
మనుజ లోకము‌ నందు మహిమాన్వితంబయ్యె
దీక్షతో కట్టెడు రక్ష మిగుల
కట్టెను ద్రౌపది కన్నయ్య చేతికి
చీరను చించియు చిన్ని కట్టు

ఆ.వె. అన్న చెల్లెలనెడి యనుబంధ ముప్పొంగి
నిండు సభను గాచె మెండు విధము
వస్త్ర దానమిచ్చి వైభవమ్ముగ బ్రోచె
నల్లనయ్య మిగుల యుల్ల మలర

2) తే.గీ. విష్ణువు బలి కోర వెడలె పాతాళమ్ము
తిరిగి తెచ్చు కొనెను దీక్ష తోడ
రక్ష కోరి కట్టె రక్ష బంధనమును
లక్ష్మి మాత బలికి లక్షణముగ

3) తే.గీ.అమ్మ నాన్న వలెనిలను యన్న కూడ
రక్షణిచ్చును చెల్లికి రాత్రి పగలు
రక్ష బంధన సాక్షిగా రక్తి తోడ
బంధ నంబుయె మరి ననుబంధ సరము

తే.గీ. అక్క తమ్ముల నడుమన యమర ప్రేమ
పొంగి పొరలుచు నుండును నింగి కెగయ
అనుజునికి రాఖి ప్రేమతో నక్కకట్ట
తోడు నీడగ బంధమౌ తుద‌వరకును.

హామీ:--ఈ పద్యాలు నాస్వీయరచన
చరవాణి:--7569820872
[21/08, 7:27 pm] Lalita Sister: అంశం:రాఖీ
శీర్షిక:నీకు నేను రక్ష నాకు నీవు రక్ష ...!
_ కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం
అమ్మ గర్భ గుడి లో నవ మాసాలు ఎదిగిన గువ్వలై 
బంధాలు అనుబంధాలు సిరి సిరి మువ్వ లై
అక్క చిటికెన వ్రేలు పట్టుకొని లోకాన్ని చూసిన ఉదయ భాను లై
చెల్లి చెట్టా పట్టాలతో విహంగం లా ఎగిరే  కవల కాంతు లై
అక్కా తమ్ముళ్ళ ప్రేమానురాగాల రక్త సంబంధ మై
శ్రావణ పౌర్ణమిన పుట్టింట సందడి  చేయ
వచ్చింది సోదర సోదరీ మణుల మణిహార మై రాఖీ పర్వదినం...!

అబలల  రక్షణ కై శిశుపాలుని నీచపు గుణ  తత్వాన్ని  అంతమొందించే విష్ణు చక్రమై
దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకాన్ని మట్టు పెట్టుట కై
రావణా సుర కీచక వారసుల అంతాని కై
వచ్చింది సోదర సోదరీ మణులు మణిహార మై రాఖీ పర్వదినం...!

మానవ మృగాల నుండి రక్షక కవచమై
ఆడ బిడ్డల రక్త కన్నీరు ను తూడ్చుటకై
భావి భారత రేపటి తల్లుల రక్షణ కై
వచ్చింది సోదర సోదరీ మణుల మణిహార మై రాఖీ పర్వదినం...!

పాశ్చాత్యపు విష సంస్కృతి సుడిగుండం లో
మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై 
సంస్కార హీన సమాజం లో నైతిక విలువలు నేర్పుటకు 
వచ్చింది సోదర సోదరీ మణుల మణిహారమై రాఖీ పర్వదినం...!

పెళ్ళై దూరమైన సోదరి సోదర చేతి స్పర్శ కై
రెండు హృదయాల స్పందనల ఆత్మీయ పలకరింపు కై
నీకు నేను రక్ష నాకు నీవు రక్ష యని దీవెనలిచ్చుటకై 
వచ్చింది సోదర సోదరీ మణుల మణిహారమై రాఖీ పర్వదినం...!

హామీ పత్రం 
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
[21/08, 8:33 pm] Lalita Sister: కవితా గానం సీజన్ 2
శ్రావణ పౌర్ణమి కవితా పోటీకి
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
అంశం: శ్రావణ పౌర్ణమి 
శీర్షిక: పండగల పౌర్ణమి 
...
శ్రావణ పౌర్ణమి 
పండుగల పౌర్ణమి 

సోదరుని హస్తానికి 
సోదరి రాఖీ ధారణ 
ఆత్మీయతకు ప్రతీక 

హరి హయగ్రీవుడై
జ్ఞాన స్వరూపుడై 
వేదాలను రక్షించిన శుభదినం 

సోదరులకు సంతోషం పంచే 
సంతోషిమాత పుట్టినరోజు 

ఝలాన్ పౌర్ణమి పేరిట
రాధాకృష్ణులకు 
ఊయలూపే రోజు 
కజరీ పౌర్ణమియని 
భగవతీదేవిని అర్చించే రోజు 

భారతీయులంతా 
భిన్న ఆచారాలతో 
పండగ జరిపే రోజు 
... 
హామీ పత్రం 

ఈ కవిత నా స్వంత రచన
[21/08, 8:33 pm] Lalita Sister: రాఖీబంధమై
*************
ఆత్మీయతానందాలకు
ప్రతీకగా
అనురాగ మమకారాలకు
ఆలంబనగా
సోదరసోదరీ బంధం
సుధృడమొనరించె
రాఖీ బంధం
అద్వితీయ అనుబంధం
అవ్యాజమైన ప్రేమకు
సాక్షిగా
అనిర్వచనీయ అనుభూతికి
సూచికగా
బాంధవ్యాల సులక్షణమై
యొప్పారు రాఖీ బంధం
ఎదలను స్ప్రశించే సంబంధం
రక్షణకోరే సోదరి
జీవనరక్షణ లక్ష్యంగా
సోదరుడు అందించే అభయహస్తంతో
నిక్షేపంగా కాలం గడిపేస్తుంది 
విరిసిన హరివిల్లులా మెరుస్తున్న
మణికట్టును జూసి
మైమరచిపోతుంది
తాను కట్టిన రాఖీ తనుకుళీనుతుంటే
పచ్చగా పదికాలాలపాటు
ఆనందమయ జీవితమనుభవించాలనే
నిరంతర తపన జెందే
తదేకంగా తాను కట్టిన రాఖీ
వైపుజూచి తన్మయత్వమొందుతుంది
అభయమొసగే చేయి
తనవారినే కాకుండా
తోటి సోదరీమణుల రక్షణకవచమై
నిలవాలని 
రాఖీపౌర్ణమి ఆకాంక్షిస్తుంది
**********************
మేకల రామస్వామి - చెన్నూర్
9912747214

ఫోటీ నిమిత్తము
[21/08, 8:36 pm] Lalita Sister: పిన్నక నాగేశ్వరరావు.         21--8--2021.
శ్రావణ పౌర్ణమి కవితల పోటీకి.

అంశము :-- శ్రావణ పౌర్ణమి.

1. తేటగీతి.
వత్సరమ్మున నేతెంచు ద్వాదశకపు
పున్నముల యందు శ్రావణ పున్నమికి వి
శిష్టమౌ స్థానము కలదు శిఖరము వలె
ప్రకృతి యారాధనయు ననురాగ బంధ
ములును పూజలారాధనల్ పున్నమందు
కొనును ప్రతి వత్సరమున ఘనముగాను.

2. తేటగీతి.
రాఖి, జంధ్యాల పున్నములనెడు పేర్లు
దీనికి గలవు; పాత జందెముల వదలి
క్రొత్త జందెముల్ ధరియింత్రు కొంతమంది
దీనినే "యుపాకర్మ" గా దీక్ష గొనుచు
పిలుచు చుందురు యజ్ఞోపవీత మనుచు.

3. తేటగీతి.
పౌర్ణమికి మున్నడిన్ శుక్రవారమందు
నమ్మనున్ వరలక్ష్మి రూపమ్మునందు
నర్చనల్ జేయుచు వ్రతము నాచరించ
నమ్మయు ప్రసన్నమగునంచు నమ్ముచుంద్రు.

4. తేటగీతి.
అక్క,చెల్లెండ్రు రాఖీని యాదరముగ
కట్టి సోదరులకు, కలకాలమున్ ప 
విత్రమైన బంధమ్ము జీవితము నంత
నిలిచి యుండగా వలెనను నిశ్చయాన
జరుపుకొనెడు పండుగ "రాఖి" సంతసాన.
**************************************
[21/08, 8:41 pm] Lalita Sister: కవితా గానం పౌర్ణమి కవితల పోటీ
అంశం : శ్రావణ పౌర్ణమి/ రాఖీ
శీర్షిక : వాత్సల్యం
21-8-2021
********************

జీవితం మొదలుపెట్టే సరికే నాకు జీవన రక్షగా నియమించు కున్నోడు

నే చదివిన మొదటి పుస్తకం అమ్మ నాన్నలయితే..రెండో పుస్తకం నా అన్న

నిర్ఘాంతపోనీడు..నిశ్శబ్దంగా ఉండనీడు
ఆటైనా..అల్లరైనా తన తోనే

నా బాధ్యతలు..బరువులలో..తాను పక్కనుండగా ఓడిందే లేదు

కొతి పిల్లనతికించుకు
మోసినట్టు..లేగదూడను చెర్చుకున్నట్టు..బుజ్జిపిట్టను పొదుపుకున్నట్టు..

వెక్కిపడినపుడో..బెంగతో వెనక్కి చూసినపుడో..కొండంత ధైర్యాన్నిచ్చే ఆ చిరునవ్వు

నా అడుగుల కోసమే..తానే ఓ రక్షా దీపంగా 
పుట్టింటి నుంచీ మెట్టినింటి దాకా పరుచుకున్న ఆ పచ్చని వెలుగు 

నిన్నైనా నేడైనా నా నేపథ్యం తానే..
బతుకు ఏ కోనలో ప్రస్తావించినా.. ప్రతి అనుభవం లోనూ తనే 

శ్రావణ శుక్ల త్రయోదశి నాడు తన
క్షేమం కోసమే అనురాగ దారాల రక్షాబంధనం..అదే ఈ చెల్లికి అభయం 

నా ఊహల్లో ఇంకా అన్న చేయిపట్టుకుని
నడుస్తూనే ఉన్నా..తన సమక్షంలో ఆడుతూనే ఉన్నా..సైకిల్ లో వెనక కూర్చొని తిరుగుతూనే ఉన్నా

తల్లిదండ్రులిచ్చిన వాత్సల్యపు ఆస్తి అన్న
నా జీవన భరోసా అన్న

దారల విజయ కుమారి

హామీ పత్రం
**************
నమస్తె సర్/ మేడం
ఈ కవిత నా స్వంత రచన.అనువాదం కాదు.ఎక్కడా ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
దారల విజయ కుమారి
[21/08, 10:01 pm] Lalita Sister: ప్లవనామ సంవత్సరశ్రావణమాస నగదు బహుమతుల పోటీకి
అంశం: శ్రావణ పూర్ణిమ/రాఖీ పం
డుగ
శీర్షిక:రక్షాబంధనం
తిప్పావఝల నరసింహమూర్తి
బుచ్చిరెడ్డి పాలెం.నెల్లూరుజిల్లా
మహిళా సాధికారతను గూర్చి చెప్పుకొంటాం గొప్పలు
స్త్రీలపై అత్యాచారాలు తెప్పలు
నేటికీ వారికి తప్పలేదు తిప్పలు
 శివాజీ గౌరవించాడు స్త్రీలను సోదరీమణులుగా
ఆదరించాడు మాత్రుమూర్తులుగా.
శ్రీకృష్ణుడు నిలిచాడు సోదరి ద్రౌపదిక రక్షణ వలయంగా
ఆమె మానాన్ని కాపాడి కంటికి .రెప్పలా నిలిచాడు ఎల్లవేళలా.
ఆడపడుచు ఇంటికి దీపం.
ఆమె కంటికన్నీరొలకకుండా చూడడంసోదరుల కర్తవ్యం. 
శ్రావణమాసం శుభకార్యాలమయం.
శ్రావణ పూర్ణిమ ఇంద్రుడుమంత్రజపంతో రక్షాబంధనం ధరించిన పుణ్యదినం.
ఈరోజున సోదరీమణులందరూ కడతారు సోదరులు చేతికి రాఖీ.
ఆకాంక్షిస్తారు వారి సంక్షేమం.
గుర్తుచేస్తారు తమకండగా నిలవాల్సిన కర్తవ్యం.
జంధ్యాల పండుగైన ఈరోజున
విసర్జిస్తారుపాత జంధ్యాన్ని.
ధారణ చేస్తారు నూతన యజ్ఞోపవీతాన్ని.
మనం విసర్జిదాం స్త్రీ లపైచులకనభావాన్ని.
పరిఢవింపచేద్దాంసోదర,సోదరరీ భావాలను.
నిలబడదాం స్త్రీలసమస్యలపై ఏకత్రాటిపై.
అదేమనం మన సోదరీ మణులకిచ్చేనిజమైన బహుమతి.
[21/08, 10:01 pm] Lalita Sister: కవిత అంశం : రాఖీ పౌర్ణమి

 శీర్షిక : రక్షణ బంధం

ప్రభాత వేళలో
మణికట్టు దారంలో పొదిగిన రాయి కిరణాలు / మూసిన రెప్పలను చురకగా తడుముతున్నాయి / మరి ఈ దారానికి ఆధారం ఏంటని ఆలోచనలలో... / మునుపటి యాదిలో తొలుస్తూనే జ్ఞాపకాలు.../ బ్రతుకు బాట బాసటగా నిలవాలని వేసిన / భరోసా ముడి నేడు భారం అయ్యిందా / ఈ చేయి అండతో పెరిగిన ప్రేమ ఇవాళ పిలిస్తే పలకలేని ప్రాంతం చేరిందా / చేయి పట్టుకుని కూడా నడిచిన తోడు నేడు / చేతికందని దూరంలో దాగిందా / బెట్టు చేసి పట్టు చీర కొని పించే మంకుతనం ఈరోజు మచ్చుకైనా మనలేదా / చిలిపి తగాదాలతో చిన్న చిన్న అల్లరితో / ముద్దులొలికే మా ఇంటి లక్ష్మి మమ్ముల మరిచి పోయిందా / సరదాలతో ఆటపట్టించే చిన్నతనం ఇప్పుడు చేరలేని చోటుకి వెళ్ళిందా / రక్షణగా ముడివేసిన చేతులు ఇపుడు / అభద్రతా అరాచకాల ముళ్ళలో చిక్కుకుని చేజారుతున్నాయా / .. అని నా నిశీధి మదిలో శ్రావణమాస పున్నమిలో పొడిచిన / ఈ ఆలోచనల యాదిలో తడచిన రక్షణ దారంతో / గుండె బరువెక్కి వీధి గుమ్మానికి కేసి /   కళ్ళు  వేసారుతూ చూస్తున్నాయి


పేరు : బొప్పెన వెంకటేష్ 
జిల్లా: సిద్దిపేట్
చరవాణి : 9866584062


హామీ పత్రం: నేను రాసిన నా కవిత దేనికి అనువాదము అనుకరణ కాదు, నా సొంతం అని హామీ ఇస్తున్నాను.
***********************************
డా.బల్లూరి ఉమాదేవి గారి అభినందన
**********************************
కవితాగానం నిర్వాహకులు శ్రీ వీరా గుడిపల్లి గారికి శ్రీమతి లలిత కృష్ణ గారికి ముందుగా శుభాభినందనలు .ప్రతి నెల పౌర్ణమి పోటీలను నిర్వహిస్తూ ఎటువంటి పక్షపాతాలకు తావివ్వకుండా పౌర్ణమి పోటీలను నిర్వహించడం నిజంగా అభినందించదగిన విషయం. కవుల యొక్క పేర్లను కూడా తెలపకుండా ఏవో కోడ్ నెంబర్లను ఇవ్వడంతోనే వీరి నిష్పాక్షిక ధోరణి కనిపిస్తుంది. విజేతలకు నగదు పురస్కారాల నివ్వడమే కాకుండా చక్కనిపాటతో లలిత వీడియో ద్వారా అభినందించడం అభినందించదగిన విషయం. కవితా గానం 2 సమూహంలో ప్లవ నామ సంవత్సరం శ్రావణ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన పోటీలకు నన్ను న్యాయనిర్ణేతగా నిర్ణయించినందుకు కార్య నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదములు. శ్రావణ పౌర్ణమి పోటీలలో పాల్గొని కవులందరికీ శుభాభినందనలు.
సాధారణంగా పోటీలు అనగానే అందరికీ బహుమతులు రావనే విషయం అందరికీ తెలిసిందే. నియమాలకు అనుగుణంగా పరిశీలించి విజేతను నిర్ణయించడం కత్తి మీద సాము వంటిదని అందరికీ తెలిసిన సంగతే.
    ఒకటే అయినా రాసే విధానంలో ఒక్కొక్క కవి ఒక్కొక్క శైలిని అనుసరిస్తాడు. ఆ విధంగా రాఖీ అంశంపై విభిన్న రీతిలో కవులు తమ కవితలు రచించారు. అన్ని కవితల్లోని విషయ వివరణ ఉన్న కొన్ని పంక్తులు ఎక్కువగా కావడం కొన్నింటిలో వచనం ఎక్కువగా ఉండటం కొన్ని కవితలు మధ్యమధ్యలో పుల్ స్టాప్ లు ఉండడం వాక్యాలుగా విడగొట్టడం కొన్ని కవితల్లో కనిపించింది.
ఏది ఎలా ఉన్నా రాయాలి అన్న తపనతో శ్రావణ పౌర్ణమి పోటీలలో పాల్గొన్నందుకు కవులు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...