Skip to main content

ఎందుకో ౨౦౨౧

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
********************
కవివరుల జాబితా
1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
2. కవిత వేంకటేశ్వర్లు గారు
3.తాతపూడి సోమశేఖర శర్మ గారు
4.వంటిపులి నాగరాజు గారు హైదరాబాదు
5.జక్కిడి వెంకటరెడ్డి గారు
6.తరణికంటి సూర్య లక్ష్మి గారుు
7.ఆళ్ళ నాగేశ్వరరావు గారుు
8.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
9.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారుు
10.వనపర్తి గంగాధర్ గారుు
11.జంపని శ్రీనివాస మూర్తి గారు
12.డా.బల్లూరి ఉమాదేవి గారు
13.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 
14.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
15.కొంపెల్లి రామయ్య గారు
16.సునంద వురిమళ్ళ గారు
17.డా.ఆంజనేయులు గారు ఖమ్మం
18.వీరా గుడిపల్లి
19.శివునూరి లలితా కృష్ణ
**************************
Lalita Sister

కవితాగానం

నేటి అంశం
04.08.2021

ఎందుకో...

ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు.

ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.

❇️❇️❇️❇️❇️❇️
1
 అంశం..04082021.. బుధవారం
కవితా గానం
ఎందుకో..
********************************
ఎందుకో
హృదయ మంతా భారంగా ఉంది
ఎ చిన్న శబ్దం వినిపించినా భయం
మేనంతా వణుకుతోంది

కాళ్ళు తడబాటు పడుతుంటే  చేతులు కొంకర్లు పోతున్నాయి

ఏం జరుగుతోంది ,ఏం జరిగిందో
అర్ధమయ్యే సరికి 
అనర్ధంముంగిట్లో పీటముడి వేసి కూర్చుంది

ఎవరికి వారే బందించుకున్నారు
బందీలైనారు
గాలిని పీల్చాలన్న వదలాలన్నా భయం.

ఇంటికి ఎవరైనా వస్తున్నారనితెలిసినా 
హడల్
అవసరానికి ఎవరింటికైనా వెళ్ళాలన్నా
సారీ వద్దు తరువాత కలుద్దాం అటునించో చిన్న విన్నపం.

రెక్కలు అమ్ముకునే వాళ్ళకు దేవుడే
దిక్కయ్యాడు.
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
చూడక తప్పని తిప్పలు

ప్రపంచం నలుమూలల ఎటు చూసినా                             
మారణ హోమం.   
కలవర పెడుతోంది థర్డ్ వేవ్ నై తడాఖా చూపిస్తానని.

ఎందుకో దానికంత కక్ష
శిక్ష మనకే వేయాలని

ఇందుకేనేమో నా హృదయం భారంగా ఉంది 
నిత్యం చచ్చి పుట్టట మంటే 
ఇదే నేమో

జర భద్రం జాగ్రత్తలు పాటించండి
నీవు బాగుంటే నీ కుటుంబం నీ వాళ్ళు
నీ ఈ ప్రపంచం బాగుంటుంది.

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.04082021
2
[04/08, 9:17 pm] +91 83099 20625: కవితా గానం (సీజన్ - 2)
తేదీ..4.8.21...బుధవారం
అంశం:: ఎందుకో
శీర్షిక:: నిజంగా ఎందుకో

ఎందుకో....
ఈ జన్మలు ఎందుకో
ఈ బంధాలు ఎందుకో
ఈ అనుబంధాలు ఏమిటో
ఈ సంబంధాలు ఏమిటో

ఎవరెవరో కలుస్తారు
ఎక్కడేక్కడో కలుస్తాము
మిత్రులవుతారు
ఏదో చిన్న కారణముతో
శత్రువులవుతారు... ఎందుకో

ఉద్యోగరీత్యా ఒకటవుతాము
బదిలీ అవుతూనే మారుస్తాము
ఉపకారం పొందుతాము
అది మరచి అపకారం చేస్తాము
ఎందుకో

పాప పుణ్యాలు ఎందుకో
మంచి చెడులు ఎందుకో
ధనంపై ఆశలు ఎందుకో
లక్షలు కోట్లు సంపాదన దురాశ ఎందుకో

కళ్లెదుట అన్యాయం జరుగుతున్న పట్టించుకోరు
తిండి లేక పేదలు అల్లాడుతున్న కదలరు
కష్టాలతో కన్నీళ్లతో
అలుమగలు విడిపోతున్నారు
సహాయము చేసే పరిస్థితి వున్న
సాయము చేయరు
ఎందుకో

లంచం తీసుకొని పక్క ఉద్యోగి
జైలు పాలయిన
ఉద్యోగులు మారరెందుకో
తప్పులపైన తప్పులు
చేస్తుంటారు ఎందుకో
అవసరాలకు అప్పులు చేసి
ముంచి పోతారు ఎందుకో
చీటీలు వేసి డబ్బులు వసూలు
చేసి రాత్రికిరాత్రే ఉడాయిస్తారు
ఎందుకో

ప్రేమించి హత్యలు చేస్తారెందుకో 
చిన్న పిల్లలను పండు ముదుసళ్లను అత్యాచారం
చేసి గొంతులు కొస్తారెందుకో
దొంగతనం చేసి ఊచలు
లెక్కపెట్టిన మళ్ళీ అదే పని
చేస్తారెందుకో
అన్ని చర్వితచరణం అవుతాయి ఎందుకో
చక్రముల తిరుగుతాయి ఎందుకో.......?
                  కవిత వేంకటేశ్వర్లు
కర్నూలు.       8309920625
3
[04/08, 9:20 pm] తాతపూడి సోమశేఖర శర్మ: కవితాగానం సీజన్ 2
అంశం.. ఎందుకో
శీర్షిక..ఇల్లాలే నాజీవనజ్యోతి 

ఎందుకో.. అది ఏమిటో
ఈ వింత హాయి
ఎందుకో.. మరి ఎందుకో
నీ చెంత హాయి
అందమా !... నా స్వప్నమా !
అందుకో !.... నన్ను అందుకో !
ఎందుకో !..... మరి ఎందుకో !
అందుమా ! ఓ నా జీవన సౌఖ్యమా!
నీవే నా జీవిత గమ్యమా !

అనుకోకుండా నాలో ప్రవేశించావు
అందమై అనందమై నిలిచున్నావు
అనుకోలేదు నేనసలు ఊహించలేదు
అదేమిటో ! నన్నే కావాలన్నావు !
నీవాళ్ళు నన్నే కావాలన్నారు !
అమ్మకోరిక కూడా అదేనంటా !
ఎందుకో !  మరేమిటో నిజమైంది !
నా స్వప్న సుందరి నిజసుందరయింది !

జీవితంలో ఎంతో ఆనందన్నిస్తుంది
మధుర్యాన్ని నాల్గు పదుల నుండి పంచుతుంది నా మనసు నిండుగా
నా చిరుకోపానికి  విసుగుదుమారానికి
ఏనాడూ కోపగించు కోలేదు ఏమిటో ?
ఎందుకో ?  మరేమిటో ?
నా అదృష్ట వరమో ?
కష్టసుఖాలలో తోడునీడగా
నా దేవత నిలిచింది 
అందుకే నేను అదృష్టవంతుడిని
ఎందుకో !  మరి ఎందుకో !
అది నా పూర్వజన్మ సుకృతమో !
ఏమిటో !  మరి ఏమిటో !               నాకుఆదేవత అర్ధాంగిఅయిందేమిటో?
నా జన్మ ధన్యం చేయడానికేనా !
ఎందుకో కాదు ! అందుకే... అందుకే..
ఇల్లాలే నా ఇంటికి జీవనజ్యోతి !

తాతపూడి సోమశేఖర శర్మ,
యానాం,8328079336

హామీపత్రం
                  ఈ కవిత నా స్వీయరచన
అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
4
[04/08, 9:23 pm] +91 98480 13844: కవితా గానం సీజన్ 2
అంశం: ఎందుకో
శీర్షిక : అంతర ఇంద్రియం
**********************
చిన్న తీగ మీటితే వచ్చే
సంగీతం చెవికింపుగా
వుండొచ్చుగానీ
మదికి అంత పరవశమెందుకో

అప్పుడే విరబూసిన
మందారాన్ని  చూస్తే
కంటికి వెలుగు రావచ్చుగానీ
హృదిలో అంత మురిపెమెందుకో

కురిసిన వానకి
తడిసిన మట్టి పరిమళానికి
నాసిక కానందమవ్వొచ్చుగానీ
మనసుకు పులకింత ఎందుకో

ప్రేమగా అమ్మ వండిన 
కమ్మని వంటరుచికి తిన్న నోటికి
పంట పండొచ్చుగానీ,చిత్తానికింత
చిత్రమైన పలవరింత ఎందుకో

అప్పుడే పుట్టిన పాపాయి 
నునులేత స్పర్శకు,మేను 
రోమాంకితమవ్వొచ్చుగానీ
అంతరంగానికంత
అవధుల్లేని ఆనందమెందుకో

పంచ జ్ఞానేంద్రియాలకు,
అంతర ఇంద్రియానికీ
అనుసంధానమెందుకో
అన్ని ఆనందాలకూ అదే
మూలమైనదెందుకో!!

***************************

✍️ వంటిపులి నాగరాజు,
       హైదరాబాదు
       చరవాణి : 98480 13844
5
[04/08, 9:27 pm] Venkat Reddy Math Sa Csdo: @ కావితాగానం @
అంశం /శీర్షిక : ఎందుకో ....
పేరు : జక్కిడి వెంకటరెడ్డి .
 @@@    @@@    @@@

   ఎందుకో ....
కాలం కలవరపెడుతున్నా
కాళ్ళుమాత్రం ఆగడంలేదు 
రేపటి ఉషోదయం కోసం 
భయంగానే అయినా 
ఆశల స్వప్నాలకోసం నిద్రిస్తున్నా.....
వెలుగురేఖలు విచ్చుకోకముందే 
కలవరపాటుతోనే కళ్ళుతెరుచుకున్నా ...
నిన్నటి గాయాలు సలపరం పెడుతున్న గాని 
ఎందుకో...
ఈ ఉదయం కొత్తగా వుంటుందనే నమ్మకం 
అడుగులు పడుతున్నాయ్ 
మార్నిగ్ వాక్ రూపంలో 
కాలరీలు కరిగించడానికి 
వీది దీపాలు వెలుగులను పారిస్తున్నాయి 
దారిని మరింత స్పష్టం చెస్తూ ....
అయినా నేనే ....
నిన్నటి బ్రాంతి నుండి తేరుకోకా 
చీకటి తెరల చాటునుండి 
కనిపిస్తున్న వీధికుక్కను చూసినా 
పులిలా కన్పిస్తుంది ....
కన్పించని కల్లోలమే 
కాలయముడై తరుముతుంటే 
భయమనేది బట్టలేసుకున్నట్లే 
వంటిమీదే అంటుకొని ఉంటుంది ....
కొంతకాలంగా గడ్డకట్టుకపోయిన భయం 
మనసులో లావాలా ఉండిపోయింది  
ఎప్పుడూ వెల్లువెత్తి 
ముంచి సమాధి చేస్తుందోనని ....
అయినా ఎందుకో ఆశ .....
కాలపరీక్ష  కఠినంగానే ఉన్నా 
పాత తరాలు తమాయించుకొని 
నిలబడి మననీరోజు  
ఇలా నిలబెట్టినాయి ....
అందుకే ....
ఆటుపోట్లు సహజం 
పొంగిన లావా ఐనా చల్లారుతుంది ....
ఖచ్చితంగా రేపటిరోజు 
కొత్తగా వుండకపోదు .....
ఆశే శ్వాసగా సాగాల్సిందే .....
-‐- జక్కిడి వెంకటరెడ్డి .
6.
కవితాగానం ( సీజన్‌ 2 )
5/8/2021/ గురువారము
అంశం:-    " ఎందుకో "

సీ!  ఎందుకోపుట్టుక  యెందుకో మరణము
జనులకుతెలియని  సత్యమిదియె

మహినిజరుగుచున్న  మార్పులన్నియుచూడ
యెందుకోతెలియదు  యేమొగాని

పెరిగెనుస్వార్ధము  తరిగెనుబంధాలు
యెందుకోసంపద  యెవరికెరుక

కూడబెట్టధనము  కూడమోసుకుపోము
మరియెందుకుధనము  మనమెరుగము

ఆ!  జగతినందుజనులు  జగడములెందుకో
మహినిచూడవచ్చె  మహికిజనులు
అతిధులనగ వచ్చి  నవనిలో నెందుకో
ఈర్షతోడమెలగు  యిలనువారు!

                    (2)
ఆ!  జీవజాతిపుట్టి  జీర్ణించిపోవగ
ధరణిభారమంత  ధరణిమోయు
మార్పుచేర్పులన్ని  మహికిసహజమోగ
ఎందుకెందుకనుచు  యేలతపన!
             తరణికంటి సూర్యలక్ష్మి.
                       ------------


7.
కవితాగానం
నేటి అంశం;
ఎందుకో....
తేదీ; 5...08....2021
శీర్షిక;

      "" సజీవ శవమై....!?""

అధిక ధనార్జనకై
ప్రశాంత జీవనాన్ని వదలి
ఉరుకుల పరుగుల జీవనయానంలో
అక్రమార్జనను అలవర్చుకుంటూ
అవినీతి మార్గాన పయనిస్తూ
జీతం కన్నా గీతంపైనే మక్కువ 
పెంచుకుంటూ
లంచం కై వెంపర్లాడుతూ
క్షణం క్షణం భయపడుతూ
సమాజంలో మర్యాద మన్ననలు కోల్పోతు
ఉన్న ఉపాధిని పోగొట్టుకుంటు
అధర్మానికి కొమ్ముకాస్తూ
నైతిక విలువలకు తిలోదకలిస్తూ
మనిషి ..మనీ..షి గా మారుతున్నాడు ఎందుకో....!?
దూరపుకొండలు నునుపని తెలియక
అక్రమార్జన పాపకార్యమని తెలుసుకోలేక
భోగాలకు అలవాటుపడి
లేని రోగాలను కొని తెచ్చుకుంటు
పచ్చని జీవితంలో చిచ్చును రేపుకుంటూ
తనకు తానే ఆహుతౌతున్నాడు
ప్రశాంత జీవనానికి సమాధి కట్టుకుంటున్నాడు
అనునిత్యం సజీవశవంలా బతుకీడుస్తున్నాడు!
............................................రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాని.7416638823
.........................................
పై క విత నా స్వీయారచనేనని హామీ ఇస్తున్నాను.
8.
కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితల మాలిక

అంశం: ఎందుకో

     *ఎందుకో* *ఏమో*!

చరవాణిలో పేరు నమోదు చేయని సంఖ్య
ఆకస్మికంగా పదే పదే
మ్రోగిననపుడు
గుండె చప్పుడు వేగవంతమవుతుంది

పేరు పెట్టి పిలిచిన వ్యక్తి
తనను పరిచయం చేసుకున్నాక
కాస్త స్థిమితపడుతుంది!

అది అపరిచిత కంఠం అనిపించగానే
నిందారోపణలు మీదనుకొని భ్రమపడుతుంది!

బహుశా ఆ సంఖ్య పన్నెండు అంకెలైతే
అంతర్జాతీయ పిలుపు ఏమో!
ఏ దేశస్థులదో కనగొనలేని సందిగ్ధత
అది మిస్ కాల్ అయితే మరీ జలదరింపు
తీరా అంకెలను తడిమితే
తప్పుడు సంఖ్యకు పిలిచావనే బెదిరింపు!

ఎందుకో అపుడపుడు ఆరగించేటపుడు
రద్దీ రోడ్డు మీద
మేడపైకి మెట్లు ఎక్కేటపుడు దిగేటపుడు
ఆకతాయి మెట్రోరైలు ప్రమాదకరంగా
అపరిచిత స్వరాలు
అప్రస్తుతం వెకిలింపులు కంగారు పెట్టిస్తాయి.
అవి అంతే! గుండె నిబ్బరం కావాలంతే!!
ఎదురాడే చొరబాటు వుండాలంతే!!!
      ***

      హామీ పత్రం

ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
          ఇట్లు మీ
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.

9.
అంశం: ఎందుకో 
శీర్షిక: నేటి మనిషి
...
ఎందుకో...
నేటిరోజుల్లో 
ప్రతి మనిషికి ధనంమీద యావ 
ఆత్మీయతలు 
ప్రేమానురాగాలకేది విలువ

అధికారం 
పదవులే నేటి జనానికి ముఖ్యం

స్వార్థం వెర్రితలలు వేసిన ఫలితం
ఉమ్మడి కుటుంబాలు 
ముక్కలు చెక్కలై 
ఊరినుంచి పట్నానికి వలసలు

ఆత్మీయతల పిలుపులు కరువై 
స్పందనలు మాయమై 
యంత్రాల్లా బతికేది కొందరు 
అందని ఆకాశానికి 
ఆశల నిచ్చెనలు వేసి 
బొక్కబోర్లా పడేది మరికొందరు
శ్రామికుల చెమట చెక్కలను 
పీల్చేసే రాక్షసగణం 

ఏమిటో..
ఈ తీరు మారేదెన్నడో
...
హామీ పత్రం 
ఈ కవిత నా స్వంత రచన 
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి
10.
*కవితా గానం (సీజన్ 2)*
*****************************
*అంశం:ఎందుకో....*
*శీర్షిక:మానవా మేలుకో...*
తేదీ:05.08.2021

కన్ను తెరిస్తే జననం
కన్ను మూస్తే మరణం
ఈ రెప్ప కాలపు జీవితానికి
ద్వేషాలు,రోషాలు,స్వార్థాలు ఎందుకో...!

బతికినంత కాలం
కలిసి మెలసి జీవించక
ఈ కుల మతాలు
అసమానతా భావాలు
పేద,ధనిక అంతరాలు ఎందుకో...!

ప్రేమ,ఆప్యాయత,అభిమానాలు
బంధాలు,అనుబంధాలు
మానవతా విలువలు
మచ్చుకైనా కానరాక మాయమైన వెందుకో...!

కన్నవారిని ఆస్థులకై
అంతమొందించే కసాయి
సంతానమున్న వికృత సమాజాన
సొంత రక్తంలోనే పరాయితన మెందుకో...!

బుద్ధుని పవిత్ర భూమిలో
గాంధీ అహింసా అవణిలో
ఈ హత్యలు,హత్యాచారాలు
అక్రమాలు,అవినీతులు ఎందుకో...!

మానవా మేలుకో...
మానవులంతా ఆనందంగా జీవించి
పరుల హితాన్ని కాక్షించి
స్వార్థాన్ని విడనాడేదెప్పుడో...!


*పేరు:వనపర్తి గంగాధర్*
ఊరు:హన్మకొండ
చరవాని:9440146435

ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
11.
[05/08, 9:14 pm] +91 80742 97465: కవితాగానం ( సీజన్ 2)

*జంపని శ్రీనివాసమూర్తి* ( *జలజ* )🦜
ఎర్రచందనం మొక్కల డెవలపర్స్ ( *డైరెక్టర్* )
గుంటూరు.
5 - 7 - 2021
80742 97465

అంశము: ఎందుకో
శీర్షిక: *ఇలా*

మదిలో సుధలు నింపింది
మధురమైన నీ గానం విని.
మనసంతా పరవశమై ఊగింది.
*ఎందుకో*? ఈనాడు *ఇలా!*

అందమైన అనుబంధమై
దివ్యమధుర బంధమై
నాలో పలికింది నవరాగాలు
*ఎందుకో*? ఈనాడు *ఇలా!*

ఏదో ప్రేమ నాలో నిండె
ఏదో భావం నాలో కదిలె
ఏదో ఆనందం నాలో కురిసె
*ఎందుకో*? ఈనాడు *ఇలా!*

పాడి పాడి నాలో గళం మురవగా
పాడుతూ పాడుతూ చిటికెలు వేయగా
మరీ మరీ ప్రకృతి పులకించగా
*ఎందుకో*? ఈనాడు *ఇలా!*
----------------------------------------------------
*ఈనాటి అంశానికి నా స్వీయ రచనగా*🦜
12
[05/08, 9:15 pm] Balloori Umadevi Poetess: 5/8/21
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం:ఎందుకో
శీర్షిక: బదులు దొరకని ప్రశ్న

ధనము పైన యావ ఎందుకో
దిన దినానికి హెచ్చుతోంది
మానవత్వం మరచి ఎందుకో 
కొందరు ధనం వెంట పరిగెడుతున్నారు
ఏది వెంట రాదు అని తెలిసినా
ఎందుకో మరి ఈ వ్యామోహం 
నేను నాది అనే స్వార్థమే తప్ప 
మనము మనది అనే భావన 
ఎందుకో-- ఎక్కడా కానరాదు 
జీవితం అశాశ్వతం అని తెలిసినా
రేయింబవళ్ళు భ్రమలో మునిగిపోయి 
ఆశల వలలో చిక్కిన పడిపోయి
శ్లేష్మం లో పడ్డ ఈగల్లా ఎందుకో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు 
ఉన్న ఊరిని కన్నవారిని వీడి 
పర దేశాలకు పైసల కోసం 
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు 
ఒకరిని చూసి మరొకరువలసలు పోతున్నారు
 అది "ఎందుకో" అనేది మిగిలిపోయింది 
బదులు లేని చిక్కు ప్రశ్న గా
 అది ఒక చిదంబర రహస్యంగా--
13.
అంశం:- ఎందుకో
శీర్షిక:- 
గమ్యం లేని పయనం
.........................
కనుతెరిస్తే జననం
కనుమూస్తే మరణం
అని తెలిసినా నేటి సమాజంలో ఎందుకో మనుషుల మథ్య
కులమత భేధాలు
పేద గొప్ప తేడాలు
స్త్రీ, పురుష వివక్షతలు
అహంకార, ప్రతీకార దోరణలు చూస్తుంటే
మానవత్వం లేని  మృగాల మధ్య  ఉండి నిరాశ, నిస్పృహలతో జీవిస్తూ
గమ్యంలేని పయనం 
ఎందుకో, ఎటువైపుకో ఒకసారి ఆలోచించి మానవత్వం కలిగి  మాధవుని లా ప్రవర్తించి
సమాజాభివృద్ది కి తోడ్పడే
ఆదర్శమానవుని గా జీవనయానం కొనసాగించు  మానవా.....!!
...........................
పేరు:-
అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
.............................
ఇది నా స్వీయకవిత.  
..............................
14.

[06/08, 8:11 pm] తిప్పావఝల నరసింహ మూర్తి Poet Nellore: కవితా గానం

అంశం:ఎందుకో
ఎందుకో అప్పుడప్పుడు ప్రకృతి విజృంభిస్తుంది.
జూలు విదిల్చిసింహంలా గుర్తిస్తుంది
వరదలతో ముంచెత్తి బ్రతుకులను చేస్తుందిఅస్తవ్యస్తం
సునామీలతో సృష్టిస్తుందిప్రళయం
భూకంపాలతో చేస్తుందిభయభ్రాంతులను
దావానాలను వ్యాపింపచేసి చేస్తుంది భయకంపితులను.
అతివృష్టి, అనావృష్టి లతో నెడుతుందిరైతన్నలబతుకులను అగాధం లోకి
ప్రకృతి మాత ఆగ్రహించింది ఎందుకో అనుకొంటాం.
మానవతప్పిదాలే ప్రకృతి ప్రకోపానికి కారణం.
మనిషి ప్రకృతిని సైతం గుప్పెట్లో 
పెట్టుకొన్నారని విర్రవీగుతుంటాడు.
మనకు తగిన గుణపాఠం చెప్పేందుకే అమ్మ ఆగ్రహిస్తుందనేది వాస్తవం.
[06/08, 8:11 pm] తిప్పావఝల నరసింహ మూర్తి Poet Nellore: తిప్పా వఝల నరసింహమూర్తి
బుచ్చి రెడ్డి పాలెం.నెల్లూరుజిల్లా
15.
అంశం:ఎందుకో?
శీర్షిక:ఆకలి తీర్చేటందుకు...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

తూనీగలు గుంపులు గుంపులుగా పరుగెత్తుకుంటూ వస్తాయెందుకో
మట్టి వాసన పరిమళాలను చల్లని గాలులు మోసుకొస్తాయెందుకో
నీలి మేఘాలు ఆకాశాన్ని కమ్మేసి పచ్చని ప్రకృతినీ పరవశింపచేస్తాయెందుకో
కర్షకుని కళ్ళల్లో ఆనందం నింపే తొలకరి చినుకుల పలకరింపు కోసం...!

పసి పాపాల కన్నులలో ఆ ఆనందపు  వెలుగులెందుకో
పరుగెత్తు కొచ్చే లేగ దూడ లో ఆ ఆత్రపు అడుగులెందుకో
పక్షి గూళ్ళల్లో చిట్టి పిల్లల కిలకిల రావాలు ఎందుకో
కన్న తల్లుల కౌగిలింతల మాతృత్వపు మాధుర్యం కోసం...!

బడి గంటల గణగణ మోతల పిలుపులెందుకో
వడి వడి నడకల చిన్నారుల పరుగులెందుకో
విజ్ఞానపు జ్ఞాన గురువు అక్షర ఝరి ఎందుకో
దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించేందుకు...!

పొలాల కేసి హలదారి అడుగుల సందడెందుకో
కాడెద్దుల రాజస నడకల గజ్జెల సవ్వడి ఎందుకో
కొంగు నడుముకు చుట్టి కొడవలి చేత బట్టిన కోమలి గుంపుల నడకలెందుకో
పైరు పచ్చని చేనులో పంట పండించి ఆకలి తీర్చేటందుకు...!

హామీ పత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
16.
*కవితా గానం ( సీజన్ 2*)
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం:ఎందుకో...
********************
ఎందుకో ఏమో...
ప్రవహించే రక్తం ఒకటైనా
పన్నెత్తితే పలురకాల వివక్షతా తరంగాలు పోటెత్తుతాయెందుకో...
చూపు అందరికీ ఒకటే ఇచ్చినా
దృష్టిలో వికృత దోషాలెందుకో..

జీవితం బుద్బుధ ప్రాయమనీ
ఈ పుడమి మన అతిథి గృహమని అర్థమయినా..

ఆవేశకావేశాల కక్షలూ
అంతులేని స్వార్థం
కట్టల పాముల సంపాదనలో
కన్నవారిని త్రాసులో తూచే
విపరీత ప్రవర్తన ఎందుకో...

 ఓ చెట్టు ఎంత త్యాగశీలో
ఓ పిట్ట ఎంత నిరాడంబర జీవో
తెలిసీ
అంతులేని వ్యామోహాల వలయాల్లో చిక్కుకుని
పేడలో పురుగులా బతుకుతుంటాడెందుకో...

మనం మనుషులం 
మనల్ని బతికించే తరువులనూ.. జీవరాశులను
కౄరంగా ధ్వంసించడమెందుకో..

ఇంగితాన్ని ఉపయోగించి
ఇకనైనా మనీషిగ కాకపోయినా
మనుషులుగా బతికేద్దాం..
ఎందుకో ఏమో పాటలోని సందేహాలను నివృత్తి చేద్దాం!

 *వురిమళ్ల సునంద, ఖమ్మం*

17.

ఎందుకో

నా మదిని ఎన్ని వేదనలు
వృద్ధిని గాయపరచి
హృదయమంతా విషాదంలో నింపింది
నా మదిలో యదలో

ఆనంద ఘడియలు రావాలని
పరిపరి విధాల ఆలోచనలు చెలరేగాయి

మనసులో మమతలు మాధుర్యాలు పంచాలని నా తనువంతా తహ తహ లాడింది

కాలం ఏం సమాధానం చెబుతుందో ఎవరికి తెలుసు
అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను

ఈ రాత్రి వెన్నెల వెలుగులో అమావాస్య చీకటి మరువగలను

మిణుగురులు చుక్కల తోటలో విహరిస్తాను

మానవతా సంచారిని నేను మమకారపు తీగను నేను
నిరాడంబరతను పోగు చేసుకుంటాను

నిశ్చలత లో నిర్మలమైన హృదయాన్ని ఆవిష్కరించుకుంటూ

ఎందుకో ఈ రేయి
నా మదిలో చెలరేగె ను
తోటి మనిషి పట్ల మానవతా సంగీతం అంతరంగ హృదయ గీతం వాడుకుంటూనే ఉంటాను రాత్రి పగలు

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట
18
ఎందుకో గానీ
ఇది వీరా గుడిపల్లి కవిత
***************
మూడొంతులు నీళ్ళంటారు
దానడుగున నేలున్నా
తనికెళ్ళైతే 
నాలుగోవంతూ వదల్లేదు
ఎందుకో గానీ
నిజమని పిస్తుంది.

సత్యమే గెలుస్తుందట కానీ
గెలిచేదంతా సత్యం కాదట
ఎందుకో గానీ
నమ్మాలనిపిస్తుంది
నమ్మకం కలగకున్నా

కలలుగనడమలవాటై పోయింది
కలం పట్టి నప్పటినుండి
నిజంచేసుకోవాలన్న 
కలాం మాటలతో ఎందుకో గానీ
నిజమే ననిపిస్తోంది

మట్టిలో కలిసేదంతా మట్టైపోతుంది
ఎనకో ముందో
ఎందుకో గానీ
విత్తనమొక్కటే
మిన్నెక్కడంటూ మొలకెత్తి వస్తుంది

ఎందుకో గానీ
విత్తినా,విసిరేసినా
మొలకెత్తి ఎదిగొస్తా
తిత్తుల్ని చింపేసి తొత్తుల్ని తరిమేసి
నిజాలు నాటడానికి
.....వీరా గుడిపల్లి
19.
ఎందుకో   ...?
ఈరోజు వర్ణమాల వనం లోకెళ్ళి  ఎన్ని చుట్లు చుట్టినా.... 
పదాలమొగ్గలన్నీ  
ముడుచుకుని
భావసౌరభాలు గుభాలింపలేకున్నవి
వాక్యాలవిరిమాల నందిoచమంటూ  ..
 
ఆప్యాయతా జల్లులలో తడుపుతూ...
ఆత్మీయ స్పర్శ తో తడిమే... వనమాలిప్రేమకు దూరమైన
వర్ణరహితపు వనoలా
 
 నేనే లోకమై... 
నా క్షేమమే ప్రాణమైన  
తన ప్రేమను పొందలేని
ఆరాటపు  
క్షణాలన్నీ కలవర పెడుతుంటే...
మనసు 
ముడుచుకు పోయింది
ముభావమై...

భావాలకవనమైనా ..
ఆనందాల నందన వన మైనా
అన్నీ తనతోనే నంటూ....

*********శివునూరి లలితాకృష్ణ


Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...