నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*******************************
కవివరుల జాబితా
1.కేశపాటి వేంకట ప్రభాకర్ గారూ
2.దోసపాటి వెంకట రాంచంద్ర రావు గారు
3.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
4.ఆళ్ళనాగేశ్వర రావు గారు తెనాలి
5.కొత్తపల్లి కృష్ణా రావు, గారు ఖమ్మం.
6. జక్కిడి వెంకట్ రెడ్డి గారు
7.పిన్నక నాగేశ్వరరావు గారుు
8.తాతపూడి సోమ శేఖర శర్మ గారుు
9.వంటిపులి నాగరాజు గారుు
10.గొర్రెపాటి శ్రీను గారు
11.వురిమళవురిమళ్ల సునంద గారు ఖమ్మం
12.డా.సి.హెచ్.ఆంజనేయులు గారు ఖమ్మంం
13.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
15.తరణికంటి సూర్యలక్ష్మి గారు
16.డా.సి.హెచ్.ఆంజనేయులు గారు
17.ఆర్. వి. వి. రాజాగారు ,శృంగారాయునిపాలెం
18.ధనాశి ఉషారాణి గారు.చిత్తూరు
19.మన్నె పిన్నక లలిత గారు
20.జంపని శ్రీనివాసమూర్తి గారు ( *జలజ* )
గుంటూరు
21.కవిత వెంకటేశ్వర్లు గారు కర్నూలు
22.వురిమళ్ళ సునంద గారు ఖమ్మం
23.డా.బల్లూరి ఉమాదేవి గారు
*******
1
నేటి అంశం.. మంగళవారం..
10082021
సీతాకోక చిలుక
**************
సీతాకోక చిలుక
రంగు రంగుల
రెక్కల పూదోట
మనసు ముచ్చట పడే
మరుమల్లెల విరి బాల
అప్పుడే విరిసిన హరివిల్లు
మెరిసెను ఆకాశాన
కనువిందు చేసే
కమ్మని కమనీయ దృశ్యం
మనసు వెంటపడే
మాయాజాలం
ప్రకృతి ఒడిలో
పరవశాల ప్రవాహం
ఉత్తేజ పరిచే నాయిక విసిరే
మన్మధ బాణాలు
సీతాకోక చిలుక
సమ్మోహన రాగాల కలికి
వివశుల జేసే
వయ్యారాల వనిత
సీతాకోక చిలుక
రెక్కల సవ్వడి
ఆహ్లాదానికి ఆనందానికి
సుస్వర నాదమే
సీతాకోక చిలుకలు
ప్రకృతి ప్రసాదించిన
మానసిక వైద్యులు
మానవ జాతికి
ప్రాణం పోసే సంజీవిని
మొలకలు.
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.10082021
2
కవితాగానం
తేది20082021మంగళవారం
అంశం:సీతాకోకచిలుక
శీర్షిక:రంగులప్రంపంచం
గుడ్డుదశనుండి గొంగలిపురుగు దశవరకు ఒక చిత్రం
గొంగలిపురుగు దశనుండి సీతాకోక చిలుక దశ మరో విచిత్రం
రంగురంగుల రెక్కలతో కన్నులకు కనువిందు చేస్తుంది
పంచవన్నెలరంగులతో ప్రపంచాన్ని మైమరపిస్తుంది
చిన్నపిల్లలకు తూనిగై ఆటపాటలతో అలరిస్తుంది
చిత్రకారుల కుంచెలవడికి చిత్రంగా
చిత్రంగీయిస్తుంది
కవులకల్పనలకు కావ్యవస్తువవుతుంది
గాయకాగ్రజులకమ్మనిగొంతుకు సప్తస్వరరాగమవుతుంది
పృకృతి పరవశించెలా పర్యాటనచేస్తుంది
తేనెలూరు కుసుమాలపై వ్రాలి మధువును గ్రోలుతుంది
రంగురంగులప్రపంచాన్ని పరిచయంచేస్తు పరవశింపజేస్తుంది
సీతాకోకచిలుక వన్నెచిన్నెలు కావ్యనాయికలకు
పోలికై సాగుతుంది
సహజసౌందర్యానికి ప్రతీకలా పదికాలాలు నిలుస్తుంది
కసాయిహృదయాలకు కన్నుకుట్టెలా చేస్తుంది
నిరాశచెందిన హృదయాలకు సేదతీరుస్తుంది
రసహృదయాలను రంజింపజేస్తుంది!
ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం,శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
3
అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
Poet Vizag: కవితాగానం( సీజన్-2) ఆధ్వర్యంలో
అంశం:- సీతాకోకచిలుక
శీర్షిక: దిగివచ్చిన దేవత
..............................
బాల్యంలో అగ్రహారపు పెరట్లో ,బంతి ,చామంతి, మందార, గులాబీల పూలపై చిన్ని చిన్ని రెక్కలతో ఇంద్రధనుస్సు రంగులలో అటు, ఇటు తిరుగుతూ, వ్రాలుతూ ఉన్న సీతాకోకచిలుకలని లక్ష్మక్కతో కలసి పట్టుకుంటున్నప్పుడు
వెనకనుంచి నానమ్మ దేవదూతలు పట్టుకోకండర్రా అన్న మాటలు ఇప్పటికీ మధురస్మృతులే ....!!
నూనూగు మీసాల పరువంపు ప్రాయంలో అవి తిరుగుతున్న దేవకన్యలే అని యదలోంచి ఉప్పొంగే భావాలు హృదయస్పందనకి సంకేతాలు.ఇప్పుడవి మధుర జ్ఞాపకాలే.....!!
నేటి ఆధునిక సమాజంలో
మనిషి స్వార్ధానికి కాంక్రీట్ వనాల,బహుళ అంతస్థులతో నాటి దేవదూతలు సీతాకోకచిలుకలు మధుర జ్ఞాపకాలే .ఆనాటి సుందర దృశ్యాలు నేడు మృగ్యమే
కావున ఓ మానవా
"వృక్షో రక్షతి రక్షితః" అన్నది పాటించి ఆరోగ్యవంతంగా వసుదైవకుటుంబ నిర్మాణం చేసుకొందాం........!!
................................
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
................................
ఇది నా స్వీయకవిత
...............................
4
Aalla Nageshwar Rao Poet:
కవితా గానం( సీసన్2)
అంశం; సీతాకోక చిలుక
శీర్షిక;
"" స్వేచ్ఛకు ప్రతీక ""
గొంగళి పురుగు నిద్రావస్థనుంచి
మేల్కొని
తన చుట్టూ అల్లుకున్న గూడును ఛేదించుకుని
సీతాకోకచిలుక రూపం దాల్చి
రంగు రంగుల స్వేచ్చా విహంగమై విహారించినట్లు....
ఆంగ్లేయులు అల్లిన నిరంకుశ పాలనను
ఉద్యమాల ఉప్పెనతో ఛేదించుకుని
త్రివర్ణ పతాక రంగులను
ధరించుకుని
స్వేచ్చను రెక్కలుగా తగిలించుకుని
దాస్యశృంఖలాలను వదిలించుకుని
భిన్నత్వంలో.ఏకత్వమై
విభిన్నపూల రంగుల మణిహారమై
భరతమాత కంఠంలో మణిహారమై
నిత్యనూతనమై
విశ్వ మణి హారమై
ప్రపంచ దేశాలకు మార్గదర్శకమై
సీతాకోకచిలుక మాదిరి
స్వేచ్ఛకు.ప్రతికయై
విరాజిల్లితున్న నవ్య భవ్య
స్వేచ్చాయుత శాంతికాముక దేశం నా భారతదేశం!
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
చరవాని సంఖ్య. 7416638823
మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్.................
పై వచనకవిత.నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
5
కవితా గానం*
*నేటి అంశం: సీతా కొక చిలుక*
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
*శీర్షిక: కొత్త ప్రపంచం లోకి*...
&&&&&&&&&&&&&&&&&&&&&
గత జన్మ నుండి కొత్త ప్రపంచం లోనికి పూవుల సహవాసం కోసం
వచ్చాను
నా నివాసం రంగు రంగుల పుష్ప లోకమే
నా నేస్తాలు చిన్నారి బాలలు
గత కాలపు వాసనలు మరచి పోయి నేనిప్పుడు విహంగ వీక్షణం
చేస్తున్నాను
నా జీవన చిత్రం జీవశాస్త్ర వేత్తలకు
ఓ పరిశోధనా పాఠం
నా కుటుంబంతో మకరందం సేవిస్తూ సంతోషం గా వుంటాను
సీతా రాముల వన వాసం లో సీతమ్మకు నేను నెచ్చెలి నయ్యాను
చుక్కల చీరె లకు నా రెక్కలే కుంచె కు పని చెప్పాయి
అజ్ఞానం నుండి జ్ణానం వైపు
చీకటి నుండి వెలుగు వైపు
పయనించే వారికి
నా జీవితమే ఆదర్శం
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
*హామీ పత్రం:*
నేను వ్రాసిన ""కొత్త ప్రపంచం లోకి..'' అన్న కవిత నా స్వంతమే నని దేనికీ అనుసరణ మరియు అనుకరణ కాదనీ తమకు హామీ ఇస్తున్నాను.
ఇట్లు
మీ విశ్వాస పాత్రుడు
కొత్తపల్లి కృష్ణా రావు,
ఖమ్మం.
8897467671.
6
Venkat Reddy Math Sa గారు
కవితాగానం @@
శీర్షిక : సీతాకోకచిలుక ....
పేరు :జక్కిడి వెంకటరెడ్డి .
.. .. ... .. .. ...
రంగురంగుల హరివిల్లు
పూలమొక్కలపై ఎగురుతున్నట్టు
ఆశలని మూటగట్టుకొని
నా వైపే వస్తున్నట్టు
రేపటి తరాన్ని
రెక్కలపై మోస్తూ
చిగురాకులపై చిద్విన్యాసం చెస్తూ
బతుకు చరమాంకంలో
వెలిగే రంగులతో
కొత్త జీవాన్ని సృష్టిస్తూ
లొట్టపీసు పువ్వైనా
జట్టుకట్టేస్తానంటూ
ప్రకృతి పరవశాన్ని
ఆస్వాదిస్తూ ....
ఆశల పతంగలా
ఎగిరొస్తుంది రంగుల చిలకా
ఈ సీతాకోకచిలక ....
...ఇది నా స్వీయరచన...
-- జక్కిడి వెంకటరెడ్డి .
7
పిన్నక నాగేశ్వరరావు గారు Poet:
కవితా గానం (సీజన్ 2). 10--8--2021.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- సీతాకోకచిలుక.
1. తే.గీ.
అందమైన రెక్కలతోడ నలరుచుండు
చిలుక కాని సీతాకోక చిలుకలిలను
నాల్గు జీవిత దశలు కనపడు వీటి
యందు; గ్రుడ్డు,లార్వా,ప్యూప యనెడు దశల
చివర రంగు సీతాకోక చిలుక వచ్చు.
2. తే.గీ.
ఇట్టివి 'లెపిడొప్టెర' జాతి కీటకములు
పగలు మాత్రమెగురుచు చూపరులకు కను
విందు చేయు వివిధ రంగులందు రెక్క
లుండి, రెపరెప లాడుచు నుండగాను.
3. తే.గీ.
పుష్పముల పైన వ్రాలుచు భుక్తి కొఱకు
పరపరాగ సంపర్కమున్ జరుపుచుండి
యవి యెఱుక లేకనే పరోక్షమ్ము గాను
సాయపడుచు రైతుకు వ్యవసాయమందు
వృక్ష సంపద నెంతయో పెంపుజేయ
సహకరించు కీటకములు జనులకిలను.
**************************************
8.
కవితా గానం (సీజన్ 2)
అంశం..సీతాకోక చిలుక
శీర్షిక..అందాల రంగుల చిలుక
చిలుకా ! ఓ సీతాకొకచిలుకా !
అందాలు కురిపించే అందాలచిలుకా !
పూదోటకు యువరాణివే నీవుచిలుకా !
ప్రతిపువ్వునీకోసమేఎదురుచూస్తున్నది
ప్రతీమొక్క నీరాకకై తపియించుచున్నవి
చిలుకా ! ఓ సీతాకొకచిలుకా !
నీ రంగుల వన్నెలు ముద్దొస్తున్నాయి
నీ మోతల గానాలైన రిమ జిమలు మాకు వినసొంపును ఇస్తున్నాయి
చిలుకా ! ఓ సీతాకొకచిలుకా !
నువ్వు మొక్కమీద వ్రాలుతూనే
తన లోని మకరందాన్ని త్రాగుతావని
పూలు తేనె దాచి ఎదురుచూస్తున్నాయ్
నువ్వు తేనె త్రాగుతుంటే స్వర్గలోకంలో
విహరిస్తూ ఆనందంఅనుభవిస్తున్నాయి
రంగులు మార్చే ఓ ! తుమ్మదా !
గోవిందుడొస్తాడు ఓ ! తుమ్మెదా !
ఎదురుచూస్తూ వుండు తుమ్మదా !
రాధతో వస్తాడు తుమ్మదా ! నీ ప్రేమపాశంబు కృష్ణుడు !
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
తాతపూడిసోమశేఖర శర్మ, యానాం,8328079336
9.
కవితాగానం
ది10/08/21
అంశం: సీతాకోకచిలుక
శీర్షిక: కోరుకునే పరిణామం
**************************
లోకం నన్ను గొంగళిపురుగని
విదిలిస్తుంది
నేను విస్మయవర్ణాల
విందునౌతాను...
పూరెక్కల అంచుల్లో కూచుని
పున్నాగ పురాగాలు పంచే
సీతాకోకచిలుకనౌతాను...
నా గురించి చరిత్రకు ఒక వాక్యమైనా
మిగిల్చకపోతే ఈడ్చిన బ్రతుకంతా
ఎడారిలోతేరుఊరేగినట్టనుంటాను !
ఎదురైన ప్రతిభయాన్నీ
కరవాలం తీసి కర్కశంగా
హతమారుస్తాను
నా రహస్య దౌర్బల్యాలన్నింటినీ
నాకే తెలిసిన నేల మాళిగలో
నిక్షిప్తించి తాళం చెవి
దిగంతాల్లోకి విసిరేస్తాను
నేను పొందినదేన్నీ గుర్తించని లోకం
నేనిచ్చిన సమస్తానికి
జయధ్వానాలు విసిరింది!
అందుకే అంతరంగంలో
వేదన తొక్కి పెట్టి
అష్టదిక్కులకీ
ఆనందం పంచుతాను!
నేను వారధిని నిరాశ, దురాశ
దరిజేరనీయని సారధిని!!
చీకటిని చూసి కళ్ళు మూయను
నక్షత్రాలు కనబడే వేళ అది
వెలుగును చూసి వెనుదిరగను
సత్యం స్నేహ హస్తం సాచే సమయమది
గమ్యం వైపు అడుగు వేస్తూ-
దూరాన్ని చూసి భయపడితే ఎలా?
గొంగళిపురుగై పుడితేనేం-
నా గమ్యం సీతాకోకచిలుకే కదా!
***************************************
హామీ పత్రం: ఇది నా స్వీయరచన.
దేనికీ అనువాదం కాదని మనవి.
పేరు: వంటిపులి నాగరాజు
ఊరు: హైదరాబాద్
చరవాణి: 98480 13844
10.
కవితాగానం (సీజన్ 2)
శీర్షిక : "ఓ సుమధుర దృశ్యం !"
రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
అంబరానికి సంబరాన్ని పరిచయం చేస్తున్నట్లుగా
నీలల నింగిలో సప్తవర్ణశోభితమై మెరుస్తుంటుంది ఇంధ్రదనస్సు !
ఇంధ్రదనస్సును నేలపైకి చేర్చినట్లుగా
రంగురంగుల రెక్కలు ఆడించుకుంటూ సీతాకోకచిలుకలు
అవని అంతటా ఆనందభరితంగా ఎగురుతూ..
ప్రకృతిని పరవశింపజేస్తుంటే
వీక్షిస్తున్న నయనాలు పొందేను వేవేల పారవశ్యాలు !
నింగీనేలా కలిసినట్లుగా అగుపించేచోట ..
అద్భుతమై ఆవిష్కృతమవుతుంది .."ఓ సుమధుర దృశ్యం !"
"ఓ సుమధుర దృశ్యం !" అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నను .
11.
సునంద వురిమళ్ళ గారు:
*కవితా గానం సీజన్ 2*
తేదీ:10-08-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: సీతాకోకచిలుక
శీర్షిక: అవును నేను సీతాకోకచిలుకనే
*******************
అవును నేను సీతాకోకచిలుకనే
ఒకనాడు మీతో ఛీ! ఛీ అని
అసహ్యించుకున్న దాన్ని!
ఎంతగా విలవిల్లాడిపోయానో
నన్ను ఓదార్చుకున్న నా మనసుకే తెలుసు!–
పుట్టించిన ఆ బ్రహ్మను ప్రసన్నం చేసుకునేందుకు
ఎంత తపన తపస్సు చేశానో
మానేసిన నిద్రాహారాలను
అడిగితే చెబుతాయి...
సింగిడి రంగుల ప్రపంచంలో మునిగి
యెత్తిన కొత్త జన్మతో
పూల నేస్తాలతో విహరించే
నేనిప్పుడు రంగురంగుల కోకను గట్టిన
రమణీయ సీతాకోకచిలుకను..
కష్టాల కడలి దాటితే
సుఖాల తీరం చేరొచ్చని
ఋజువు చేసిన గొంగళి పురుగును...
బతుకు పూల తోటలో జీవితాన్ని
పరిమళ భరితంగా మార్చుకున్న చిరుప్రాణిని
అవును నేను సీతాకోకచిలుకనే..
అందాలతో కనువిందు చేసే
చిన్నారి చిలకమ్మను..
*వురిమళ్ల సునంద,ఖమ్మం*
12
[10/08, 9:24 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: మీ జంట పరవశాల పంట
మీ ఆదర్శం సుమధుర దృశ్యం మీరు ఎల్లప్పుడూ
పార్వతీ పరమేశ్వరుల లాగ పది మందికి ఆదర్శంగా
జీవితం ఆనందం విశేషాల సమ్మేళన్ కాబట్టి మీరు
అక్షరం తో విన్యాసాలు చేయిస్తారు ఆదర్శ జీవితాన్ని అందిస్తారు ఉత్తమ మార్గం అని బోధిస్తారు
13.
అంశం: సీతాకోకచిలుక
...
సీతాకోకచిలుక
అందమైన రెక్కలున్న కీటకం
అందరికీ ఇష్టమే ఈ చిలుక
ఎగిరే సీతాకోకచిలుకను
బంధించాలని
పరుగులు తీసేది పసిపిల్లలు
ఎంతమందికి తెలుసు
మనం అసహ్యించుకునే
గొంగళి పురుగు
ఎన్నో మార్పులు చెంది
అందమైన రెక్కలతో
సీతాకోకచిలుకగా
అవతరించిందని
ఈ మనిషి
ఎందుకు మారడు
గొంగళి పురుగు నుంచి
మంచి ఎందుకు స్వీకరించడు
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి
14
[ సయ్యద్ జహీర్ అహ్మద్
Poet Kurnool: కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితల సమాహారం
అంశం: సీతాకోకచిలుక
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
ప్రకృతి పులకరింత
ఎంత అందంగా మలచుకున్న ఆకృతి
విధాత జీవం పోసిన జీవరాశి
చప్పుడు చేయని రెక్కల మీద కూసింత
కళాకృతి
విచిత్రాలలో అరుదైన చిత్రం!
***
ఏ కాలం నాటిదో దీని రూప లావణ్యము
మనోహరం పరిణితి చెందిన ప్రకృతి దృశ్యము
***
ప్యూపా నుంచి మొదలైన ప్రస్థానం
బాలిక నుంచి బాల వరకు
రెపరెపలాడుతూ లేతరేకుల సుకుమార శరీరము
పూలతలపై గారికి నేలపై ముద్దాయి ఆడుకొంటున్న ఋతువు సంసారము
***
పిల్లల ఆట విడుపు వేళ
బృందం బృందాలుగా
సీతాకోకచిలుకల సింగారాము
***
ప్రకృతి ఒడిలో పరవశించు కేళీ విలాసము
సీతాకోకచిలుకల స్వైరవిహారం
జీవిత పరమార్ధము!
***
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
ఇట్లు మీ
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
15
కవితాగానం ( సీజన్ 2 )
11/8/2021/ బుధవారము
అంశం:- " సీతాకోకచిలుక "
* సీతాకోకచిలుకకు స్వాగతమ్ము *
సీతాకోకచిలుకా సీతాకోకచిలుకా
నీకుస్వాగతమ్ము స్వాగతమ్ము
పరపరాగసంపర్కమున వృక్షసంపదను
వృద్దిచేయు సీతాకోకచిలుకకు స్వాగతమ్ము
సీతాకోకచిలుక సింగారముచూడు
చూడముచ్చటగనున్నది దానికోక
రెక్కల సోయగాలుచూడ రెపరెపలాడుచు
వన్నెలవిసనకర్ర వోలె వయ్యారముగ నూపుచుండె
రమణీయమైన కోక రంగురంగుల కోకనుగట్టె
హరివిల్లులోలేనిరంగులు సీతాకోక చీరనందుచూడు
చీరయందమంతయు రెక్కలమద్యపూలు
కనురెప్పలార్పకుండ కాంచగాను
వివిధరంగులపూలు విరివిగ బూసెను
సీతాకోకచిలుక కు స్వాగతమీయగ
రానెవచ్చెసీతాకోకచిలుకలు రంగుల పూలనుగాంచి
పూవుపూవును ముద్దాడి మకరంద మును గ్రోల
చిట్టిచిట్టి చిన్నారి సీతాకోకచిలుకలు
చిన్నారులను మురిపించ
పెద్దలైనవారు పరవసించగా
నేతగాళ్ళు సీతాకోకచిలుకలు గట్టిన చీరలుజూసి
ఈచీరలెవరు నేసిరనుచు అశ్చరు వొందె!
తరణికంటి సూర్యలక్ష్మి.
-------------
16
డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: పిల్లలు
ఆటవిడుపు కాదా
ఆహ్లాద సంగీతపు
జీవన సంగీతాన్ని ఆలాపించే బాలల యొక్క గీతాలు మధుర స్వప్నాలు మనసును కదిలించే పాటలు
వసంతకాలపు వేణు గీతాలు
తల్లి ఒడిలో ఏడుస్తుంటె అల్లారుముద్దుగా లాలించి బువ్వ తినిపించే తల్లి
ప్రేమ సుగంధాలు మధుర భావాలు
మమతల కోవెల గంటల
జుమ్మ నినాదాలు
కేరింతలతో పరవశాలు
బుజ్జి బుజ్జి మాటలతో ముచ్చటైన మాటలతో
ముద్దు ముద్దు మాటల
తియ్యని మాటల గీతాలు
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట
7702537453
జానకి విలువలను తెలియజేస్తారు
రాముని ఉత్తమ తత్వాన్ని బోధిస్తారు
ఇప్పుడు అందాల కనువిందు చేసే సీతాకోకచిలుకల
గోరువంక రామచిలక ల
మంచికి మారుపేరు లా ఉండాలని ని ఆ శుభోదయం తో భావిస్తో
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట
7702537453
17.
తేదీ :10-08-2021
అంశం :సీతకోక చిలుక
శీర్షిక :ఇంద్ర చాప శకలం
*****************************
కంపరపు కొమ్మ పొదిగిన
అబ్బురపు రెక్కల పూవు
తోట సజ్జలో రాలిపడ్డ
ఇంద్రచాప శకలం...
గాలి ఇంటిపై ఎగిరే రంగుల
పతంగం చెట్టు కాన్వాసుపై
వాలిన సప్తవర్ణ కిరణం పాప కళ్లలో
పాలపుంతలెలిగించిన నేస్తం...
వైవిధ్య జీవితానికి ఆమోదమే
మనుగడకు వేదమని చెప్పే అందమైన
చందమామ కధే కదా ఈ రంగుల మొలక..
*********************************
ఆర్. వి. వి. రాజా, శృంగారాయునిపాలెం
తూ. గో. జిల్లా.,9059492795.
18.
శీర్షిక.సీతాకోక చిలుక
.......
పుడమి లోగిలిలో
ముద్దు లొలుకు సోయగాలుతో
హరివిల్లు లోని రంగులన్నీ
సీతాకోకు సింగారాలై
ముద్దు లొలుకును మదిని మురిపించును హాయి హాయిగాను
పసిడి పిల్లల గుండెల్లో
దోబూచు లాడేటి శృతిమెత్తని
ఊహలు
రేపేటి ముద్దులు లోగిలిని కూర్చు
చిట్టి చిట్టి రెక్కలు తోను
మదిని మురిపించేను హాయిగాను
పచ్చ పచ్చని చెట్టులుపై
తియ్యని మకరందమును ఆరగించి
చీరలోని సింగారాన్ని తనలోన
దాచుకోని మురిసిపోవును
అలా ముచ్చట కలిగించును
సమస్త జనులకును ఆహ్లాదముగాను
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
భాకరాపేట
19
కవితా గానం( సీజన్ 2)
తేదీ :12/ 8 /21 -గురువారము
అంశము: సీతాకోకచిలుక
పేరు : మన్నె లలిత
హైదరాబాద్
*********************************
కష్టానికి ప్రతి రూపం సీతాకోకచిలుక
ప్యూపా బంధనాలలో బంధించబడ్డా
స్వేచ్ఛా ప్రపంచంలోకి రాకున్నా
తనదయిన ప్రపంచంలో బంధించబడి
"అమావాస్య తరువాత పౌర్ణమిలా,
పులు కడిగిన ముత్యంలా"
రంగురంగుల పువ్వుల్లా
నేత్రపర్వంగా ఆకర్షిస్తూ
చిన్నగా గూడు వదిలి వచ్చే
సీతాకోకచిలుక
ఆబాల గోపాలానికి కనువిందు చేస్తూ
కొత్త ప్రపంచాన్ని వీక్షిస్తోంది
పుట్టే పుట్టగానే శ్రమ తత్వాన్ని నేర్చుకుని
పువ్వేదో, ఆకేదో తెలుసుకుంటూ
తోడులేని ఒంటరి ప్రపంచంలో
ఆహారాన్వేషణ చేస్తుంది
మెల్లమెల్లగా పెద్దదై తన రెక్కలలో
సప్త వర్ణాలు నింపుకుని
సుమ బాలలకు తన రెక్కలతో
వీవనలు వీచి ,మరులు గొలిపించి
తనకోసం వంగిన సుమబాలలలోని
మధువును గ్రోలి స్వేచ్ఛగా
రెక్కలల్లార్చుకుని,ఎగిరి వెళ్ళిపోయి
నేటి అమ్మాయిలకు
గుణపాఠం నేర్పుతుంది.
********************************
మన్నె లలిత
హైదరాబాద్
20.
కవితాగానం సీజన్ 2
*జంపని శ్రీనివాసమూర్తి* ( *జలజ* )🦜
గుంటూరు. 12 - 8 - 2021
80742 97465
అంశం: సీతాకోకచిలుక
శీర్షిక: *మానవాళికి సందేశం*
సీతమ్మ చెలిమి తోటలో
సొగసుల *చిలుక* అందాలకు
నృత్యం చేసేను *సీతాకోకచిలుక*.
ఆకాశ చీరపై నక్షత్రాల బుట వలె
రంగురంగు వర్ణాల రెక్కల చీరతో
పువ్వు పువ్వును ముద్దాడుతూ
రెమ్మరెమ్మలపై ఊయల ఊగుతూ
అందాల ప్రకృతిలో మోహనాంగియై
ఆనంద విహారిగా కులికే *సీతాకోకచిలుక*....
అద్భుత వయ్యారాల నెచ్చలిలతో
అందీ అందక తుర్ర్ మని ఎగురుతూ
*రా రా రా అని పిలుస్తూ*
బాల్య కౌమార యవ్వన వృద్దులను
కిలిగింతల ఆనందంలో ముంచేస్తూ....
గొంగళి పురుగులాంటి అజ్ఞానాన్ని
వదిలి, జ్ఞానార్జనతో ఎగరండి..
ఇంద్రధనస్సు రంగులతో
పచ్చని జీవితాలు పొందండి.
అని, పచ్చని చెట్ల పువ్వులపై వాలుతూ
సమాజానికి తెలిపే సీతాకోక చిలుకల *సందేశాల దండోరాలు మనోహరంగా*.🦜
21.
[12/08, 9:19 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం సీజన్ 2
కవిత వేంకటేశ్వర్లు
కర్నూలు
తేదీ 12.8.21..గురువారం
8309920625
పల్లెల్లో ఊర్లల్లో
హరివిల్లు రంగుల్లో
పిల్లలకు ముచ్చటైన
అందమైన అపురూపమైన
సుకుమార శరీరాలతో
పరుగులు పెడతాయి
పిల్లలకు పెద్దలకు
కనువిందు చేస్తాయి
ఫ్యూపా నుంచి
గొంగళి పురుగుగా
రూపాంతరం చెంది
ఎన్నో తిప్పలు పొంది
మారుతుంది సీతాకోకచిలుకగా
శిల్పి చెక్కిన శిల్ప0గా
దేవుడు చేసిన ప్రకృతి వరంగా
చిలుకను చూస్తూనే నయనా
నందకరంగా
సృష్టిలో అద్వీతీయంగా
నిలిచింది సీతాకోకచిలుక
పిల్లలకు ప్రేమిక!!
కవిత వేంకటేశ్వర్లు
22
[12/08, 9:24 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:12-8-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: సీతాకోకచిలుక
******************
ఏ దేవుని వరం అడిగిందో
ఎంతెంత తపస్సు చేసిందో
ఎన్ని వన్నెల సుమాలను అర్థించిందో
ఏ ఇంద్ర ధనుస్సు వర్ణాలలో మునకలేసిందో...
ఎంత సహన పరీక్షకు తట్టుకొని నిలబడిందో
ఓర్పును మించిన విజయం లేదని నిరూపించింది
కష్టాలు కలకాలం ఉండవని బోధించింది
అనుకున్నది సాధించడానికి కఠోరమైన తపస్సు అవసరమంది!
వేధించే బాధించే వారి ముందు మౌనమే మహాయుధమని
కళ్ళముందు హరివిల్లు పతాకను ఎగురవేసి
పూల నేస్తాలతో సయ్యాటలాడేందుకు
రివ్వున ఎగిరి పోయింది..
అందాల సీతాకోకచిలుక..
*వురిమళ్ల సునంద,ఖమ్మం*
23.
10/8/21
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం:సీతాకోకచిలుక
శీర్షిక:సీతాకోకచిలుక
రంగు రంగుల సీతాకోకచిలుక
రంగు రంగుల సీతాకోకచిలుకా
అందించవే మాకు నీ ఒంటి మిలమిల
గడియకో రంగు మారేవు నీవు
సరికొత్త రంగుల్లో కనువిందు చేస్తావు
నీ హొయలు నీ కులుకు చూస్తుంటె మాకు
నిను తాకి ముద్దాడ మనసౌను చూడు
ప్రతి పూవుపై వాలి అందంగ నీవు
మకరందమే గ్రోలి మురిసి పోతున్నావు
ఆ తేనె లో తీపి నీ కంటె నేమో
మరి మరీ తీయగా ముద్దొస్తు వున్నావు
ఎవ్వరికి దొరకక వూరిస్తు వున్నావు
ఒక్క చోటనైన కుదురుగా వుండనే లేవు
రంగు లాగే బుద్ధి మార్చుకొంటున్నావు
ఈ రంగు ఈ పొంగు స్థిరము గాబోదు
వెలిసి పోయాకెవరు పట్టించుకోరు
బాహ్యసౌందర్యము బుద్బుదప్రాయము
అంతస్సౌందర్యము అజరామరము.
Comments
Post a Comment