నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
****************
1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
2.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
3.కొంపెల్లి రామయ్య గారు
4.కోరాడ గారు
5.వంటిపులి నాగరాజు గారు
: హైదరాబాదు
6.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
7.డా.ఆంజనేయులు గారు
8.సునంద వురిమళ్ళ గారు
9.డా.బల్లూరి ఉమాదేవి గారు
10.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
11.కవిత వెంకటేశ్వర్లు గారు
12.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
13.తరణికంటి సూర్యలక్ష్మి గారు
14.జోషి పద్మావతి గారు
15.ప్రభాశాస్త్రి జోశ్యుల గారు,,మైసూరు.
**************
[[24/08, 7:47 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️
కవితాగానం
నేటి అంశం
24.08.2021
జ్ఞాపకాలఊట
ఎనిమిది నుండి
తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.
ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.
❇️❇️❇️❇️❇️❇️
1
[24/08, 8:00 pm] +91 6281 697 982: శీర్షిక... జ్ఞాపకాల ఊట
*******************
మరీ కంకర దట్టించి
కొత్తగా వేసారు రోడ్డు
సవాలే !? నడక సవారీ!!
పాఠశాలకు వెళ్ళాలంటే....!!!
సూది మొనల్లాతేలి అడుగడుగుకు
గుచ్చుకుంటున్న కంకర
కూచిపూడి కథాకళి నృత్యమే
వళ్ళంతా వంకర టింకర్లతో
కూని రాగాల తూనీగల్లా
బాధను మరిచి వేదన విడిచి
ఎగిరే సీతాకోక చిలుకల్లా
నవ్వులతోటై పువ్వులు పూచిన
మొలకలం భవిష్యత్తుకు బాటలం
బాట వెంబడి
తోడిన చెలమల నిండా జ్ఞాపకాల ఊటలే
చెప్పు కున్న ఊసుల కుసుమాలే
పెనవేసుకున్న నేస్తాల ప్రియ బంధాలే
గండు మల్లెల గుబాళింపు జేబు నిండా.....
గుంజు కొనే స్నేహితురాళ్ళే తరగతి గది నిండా
నలిపేసిన కాగితానికి సెంటు అద్దినట్టు
అమ్మాయిల పౌడరంటి సుగంధాలు
వెదజల్లుతుంటే
ఉక్రోషంతో రగిలే స్నేహితుల చిర్రు బుర్రులు
పరీక్షలు
త్రైమాసిక షణ్మాసిక సంవత్సరీకాలు
ముందు వెనుక రెండు వైపులా గర్ల్స్
నా గుండె గుభెల్ల్ అందరికి అందాలి
అందుకే ముందే రాసి పెట్టా అందరికి అందేలా
ఎన్నో ఎన్నెన్నో
తియ్యని చెలమల నీరులా, ఊరుతూనే
జీవన పర్యంతం తరంగాలై పరిభ్రమిస్తూనే,
ఊరుతున్నాయి జ్ఞాపకాల ఊటలే ఊటలు
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
24082021
2
[24/08, 8:01 pm] +91 99373 80136: కవితాగానం
తేది24082021
అంశం:జ్ఞాపకాల ఊట.
నా చిన్నప్పుడు
నా పక్కనే పక్కింటి చిన్నిగాడున్నపుడు
ఇద్దరంకాలసి ఊరిచివర చెరువులో ఈతకోట్టినప్పుడు
నీటిలో వాడు మునిగిపోయిన్నడు
భయంతోనేను ఇంటికి పరుగెట్టినప్పుడు
గదిలోకిదూరి దుప్పటిలోకి దూరి పడుక్కున్నప్పుడు
పక్కింటి చిన్నిగాడింట్లో ఏడ్పులు వినిపించినప్పుడు
మళ్ళీ భయంతో నేను వణికీపోయినప్పుడు
అమ్మవచ్చి దుప్పటితీసి చూసినప్పడు
అప్పుడు అమ్మను హత్తుకొనిబోరుమని ఎడ్చినప్పుడు
అమ్మ నన్ను ఓదార్చుంది....
బడిలో చదువుతున్నప్పుడు
నా వెనుకనుండి బాబిగాడు గిల్లినప్పుడు
అబ్బా అని అరిస్తే పంతులు బడితపూజ చేసినప్పుడు
బాబిగాడు నవ్వుకుంటునప్పుడు
నా కళ్ళులో సుడులు తిరుగినప్పడు
చొక్కాతో తుడుచుకున్నప్పుడు
సాయంత్రం బడివదిలినాక బాబిగాడి బేచంతా మళ్ళి నా వెంటబడి ననన్ను ఆటపట్టించినప్పుడు
ఉక్రోషంతో నేను రాయిని బాబిగాడిపై విసిరినప్పుడు
అప్పుడు వాడికి దెబ్బతగిలితే
మళ్ళీ నేను పరుగున ఇంటికెళ్ళి దుప్పట్లో దూరిపోయానప్పుడు
బాబిగాడి వాళ్ళ అమ్మ ఇంటికొచ్చి గొడవచేసినప్పుడు
నాన్నతో మళ్ళి దెబ్బలు తిన్నప్పుడు
ఇలాంటి జ్ఞాపకాల ఊట ఊరుతూనే ఉన్నప్పుడు
ఎంతకీ తెగదుకదా ఈ ఘోష!
ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి 7780594995.
3
[24/08, 8:05 pm] Kompelli Ramaiah Poet Kmm: అంశం:జ్ఞాపకాల ఊట
శీర్షిక: మనసా...!
పేరు: కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం
ప్రక్రియ:గేయం
పల్లవి:
మనసా...! మనసా...!
ఒక్కసారి వచ్చి పోవా మనసా
తనివితీర పలికిపోవా మనసా
మదినిండిన భావాలను మురిపెంగ తడిమి పోవా మనసా మనసా... //మనసా//
చరణం:1
ఊహాలకే రెక్కలు కట్టి
ఊపిరిలే బిగ బట్టీ
ఊరినంత కలియ తిరిగి
ఊడలతో ఉయ్యాలలూగి
తాటి చెట్టు,ఈత చెట్టు
పొలం గట్టు,మైసమ్మ మెట్టు
ఊరవాడ పలకరిద్దామ మనసా... మనసా...//మనసా//
చరణం:2
పైటేసిన పైరు అందం
కాళ్ళ పారాణి చంద్ర బింబం
నాగలితో రైతన్న నడక
పాద ధూళిలో వృషభ రాజసం
గలగల పారే సెలయేరు
శిశిరం లో చందమామ
పల్లెలు కనువిందు కదా మనసా... మనసా...//మనసా//
చరణం:3
పాకాల సరసు సొగసులు
పాలపిట్టల వరుస పరుగులు
పాలబుగ్గల పసిడి మనసులు
వాన చినుకులతొ చిలిపి చేష్టలు
చిర్రగొనే చేడుగుడాటలు
అష్ట చెమ్మ పచ్చీసాటలు
బాల్య స్మృతుల సవ్వడే కద మనసా... మనసా...//మనసా//
హామీ పత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
4
[24/08, 8:06 pm] Korada: కవితాగానం :- జ్ఞాపకాల ఊట
కోరాడ నరసింహా రావు... !
* సేద దీర్చింది *
**********
నా మది క్షేత్ర చెలమ నుండి...
జ్ఞాపకాలు...ఎంత తోడుతున్నా
ఇంకా ఉన్నట్టు ఊట లా....
ఊరుతూనే ఉన్నాయి... !
నేటి ఈ స్థితిని చేరటానికి...
ఎన్నెన్ని అవరోధ సోపానాలు అధిగమించ వలసి వచ్చిందో
తలచుకుంటే... ఒళ్ళు జలద రిస్తుంది.... !
ఏ కొందరికో జీవితం వడ్డించిన
విస్తరి కావచ్చు... !
గానీ... ఎందరికో అది కుక్కలు కాట్లాడుకునే ఎంగిలాకే... !!
నేనింత దురదృష్ట వంతుడినా
అనిపిస్తుంది !...నిజమే నేనెన్ని
పాపాలు చేసి ఉండకపోతే...
నా కిలాంటి దుర్భర జన్మ వచ్చు0టుంది...!?
ఆట, పాటలతో హాయిగా గడపాల్సిన బాల్యంలో అన్నన్ని
కష్టాలా... ?!
తినే తిండికి ... కట్టబట్టకి...
తల దాచుకునే గూటికి...
అన్నన్ని ఇక్కట్లా.... !!
నిజమే... ఘోరమైన పాపాలే చేసుంటాను ! కాకపొతే....,
ఆ అభం - శుభం ఎరుగని బాల్యంలోనే... అన్నన్ని ఆర్ధిక ఇబ్బందులతో పాటు...శారీరక రోగాలు !... ఒకటా, రెండా !
చెయ్యి విరిగి... కాలు గాలి...
తలమీద కాలిన పండుకు పురువు పట్టి... ఎన్నెన్ని బాధలు... బాగాగుర్తు... ఆచిన్నవయసులో... గొంగళి పురుగు చెవిలో దూరి... పుండైపియి, చీముపట్టి ఎంత నరకమనుభవించానని !
టైఫాయిడ్, మలేరియా... గజ్జి,
చికెన్ఫాక్స్... ఎన్నెన్నిమార్లు దాడిచేసి... ఎంతగా కసి తీర్చుకున్నాయో... !ఎంతైనా అమ్మ అమ్మే... ఈ రోగాలు - రొష్టులు నాకు వచ్చినా... ఆ బాధలన్నీ నిజానికి నా అమ్మే అనుభవించింది !ఏమి చేసినా తీరని ఆ అమ్మ రుణాన్ని తీర్చుకునేందుకు నేనేమీ చేయలేకపోయానే అనే బాధే నాకుమిగిలింది...!
దుర్భరం...అవన్నీతలచుకుంటే
స్వర్గం - నరకం వేరెక్కడో లేవు అనిపిస్తుంది... !అవన్నీ ఇక్కడే ఈ భూమ్మీదే... !!నేననుభవించిన ఈ బాధల కంటే వేరే నరకం ఉండదు !!
బాల్య, కౌమార... యవ్వన పూర్వార్ధాల వరకు నాజీవిత
శాపగ్రస్తమే,నాణెపు ఒకవైపు ఐతే నాతదుపరి జీవితం నాకో గొప్ప ఊరటే అని చెప్పాలి !!
పదమూడేళ్ల నా సేవ, శ్రమలు ఫలించి స్వయంపోషక సమృద్ధికి దారితీయగా...,
వివాహం, పిల్లలు, సాహిత్యం సాంస్కృతికం ఊరటతో పాటు
ఉత్సాహాన్నీ, ఉల్లాసాన్నీ కలి గించాయి... !
నా ఈ జ్ఞాపకాల ఊట... అనేక
ఆటు పోట్ల జీవితానుభవాలను
గుర్తుచెయ్యటంతో పాటు...
పడ్డ శ్రమను, అలసటను మరిపించి సేదదీరుస్తోంది !!
******************
....... కోరాడ.
5
[24/08, 8:30 pm] Vantipuli Nagaraju Poet: కవితాగానం
పేరు: వంటిపులి నాగరాజు
ఊరు: హైదరాబాదు
నేటి అంశం: జ్ఞాపకాల ఊట
శీర్షిక: బంగారు కణికలు
*****************************
జ్ఞాపకాలు ఎంత బలమైనవంటే
వాటి వేళ్ళు గతం పునాదుల్లోనే!
చెట్టు ఆకాశంలోకి ఎంత ఎదిగినా
పాదుకునేది మాత్రం
మరింతగా మట్టిలోలోపలికే!
స్మృతులూ అంతే!
వయసు మీద పడేకొద్దీ
అవి మరీ మరీ వెనక్కే
నిన్న మొన్నటివేవీ గుర్తురావు
అమ్మ పెట్టిన గోరుముద్దలు
నాన్న వేలు పట్టుకున్న పసిముద్రలు
మధ్యదారిలో మరలిపోయిన నేస్తాలు
కాలరేఖకిరువైపులా ఎన్నెన్నో గుర్తులు
జ్ఞాపకాలు బలహీనపరుస్తాయి కూడా!
భూభ్రమణం ఇరుసు హృదయమే!
సరిహద్దుల బంధనాలకతీతంగా
ముళ్ళగొంగళిలాంటి కాలం ముసుగులోంచి
వేదనా వీచికలు జ్ఞాపకాల ఊటలు..
వర్తమానం పరుగులు రేపువైపే అయినా
విముక్తంకాని జ్ఞాపకాలు....
రాలిపోయిన ఎండుటాకుల కుప్పల్లో
బంగారుకణికల్ని అన్వేషిస్తుంటాయి
**********************************
ఇది నా స్వీయరచన.
🙏🙏🙏
6
[24/08, 8:31 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితల సమాహారం
అంశం:
జ్ఞాపకాల ఊట
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
మధుర స్మృతులు
మనసు గాయపడినపుడు
మనోవేదన అనుభవిస్తున్నపుడు
గత కాలపు సుఖదుఃఖాలు నెమరేసుకుంటూ
మైమరపించే అదో లోకం
బాల్యం నాటి అనుభూతులు కాలం చేసిన మార్పులకు ఖేద మోద విచారంతో గడిపేస్తూ
భూత కాలమే బావుండే
వర్తమానం అయోమం
భవిష్యత్తు పునాదిపై ఆశాజనకం
చివరికి మిగిలిపోవు శూన్యం
ఏముంది లోకాన అంతా మాయ జగాన!!
సంతోషాలను పెంచుకోవాలి
వ్యధలను మరచిపోవాలి!!
***
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
ఇట్లు మీ
సయ్యద్ జహీర్ అహ్మద్
7
[24/08, 9:02 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: జ్ఞాపకాలు
సందడి చేస్తుంటాయి అప్పుడప్పుడు
జ్ఞాపకాలు నిధులు
జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నిలుచునే ఉంటాయి
జ్ఞాపకాలు సజీవ సంతకాలు జ్ఞాపకాలు హృదయంలో పదిలపరచి మధుర అమృతాలు
జ్ఞాపకం పచ్చని ప్రకృతి చిత్రాలు
జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవమైన శిల్పాలు
జ్ఞాపకాలు అందరికీ అలా దగ్గర విశేషాలు
జ్ఞాపకాలు పూటలా ప్రవహిస్తూనే ఉంటాయి
మర్చిపోలేని విశేషమైన అంశాలు జ్ఞాపకాలు సజల నయనాల కలిగించేవి
సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453
8
[24/08, 9:09 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:24-08-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: జ్ఞాపకాల ఊట
******†***†********†**
అలా అలా కదిలే మేఘాలనో
కళ్ళముందు చైతన్య స్రవంతియై
సాగిపోయే బాల్యాన్ని చూస్తున్నప్పుడో
చిన్న నాటి నేస్తం కలిసినప్పుడో
లోలోపల ఓ చిన్న కదలిక,..
జ్ఞాపకాల చెలిమలో తీపి గురుతుల ఊట
మనసు నిండా స్మృతుల
మకరందాన్ని నింపుతూ....
అమ్మ కొంగు కప్పుకుని వానతో ఆడిన దోబూచులాటలు
నేస్తాలతో పోటీలు పెట్టుకుని
గెలుపు కోసం పోరాడిన అవిశ్రాంత క్షణాలు...
బాల్యం నుండి యవ్వనంలోకి
యవ్వనం లోంచి బాధ్యతల్లోకి
జీవితం ప్రవహించే వేళ
అక్కడక్కడా మరపురాని జ్ఞాపకాలు
మది కాన్వాస్ పై చేసిన శాశ్వత సంతకాలు
తలచిన కొద్దీ అనుభవాల ఊటలో మునకలు వేయించి
కళ్ళూ మనసును చెమ్మగిల్లేలా చేస్తుంటాయి!
*వురిమళ్ల సునంద, ఖమ్మం*
9
[24/08, 9:11 pm] Balloori Umadevi Poetess: 24/8/21
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం: జ్ఞాపకాల ఊట
శీర్షిక:నిప్పుల్లో కలిసిన జ్ఞాపకం
ప్రేమానురాగాలు పంచి
వేలు పట్టి నడిపించి
జన్మనిచ్చి పెంచిన కన్న తండ్రి
బ్రతుకు బాటలో అన్ని వేళలా
సాయంగా ఉన్న ప్రత్యక్ష దైవం
వృద్ధాప్యంతో దైవ సన్నిధి చేరడం
నిన్న లో కలిసిన జ్ఞాపకం
కాలగర్భంలో కలిసిపోయిన బాల్యం
తొక్కుడుబిళ్ళ.ఒప్పులకుప్ప ఆటలు
కాకి ఎంగిలితో పంచుకున్న మిఠాయిలు
ఒకటా రెండా స్నేహ పరిమళాలు
అన్ని మరపురాని తీపి గుర్తులే
అపురూపమైన అనుభవాల మూటలే
సంతోషం తో మొదలైన కాపురం
సంతాపం తో ముగిసిన వైనం
సంసారంలో సరాగాలు చిరు చిరు అలకలు
మరపురాని మధురమైన నిన్నటి జ్ఞాపకాలు
మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచి
జీవితాంతం ఉంటానని నమ్మబలికి
అకాల మృత్యువు కబళిస్తే ఆ సంతోషం
అయింది నిన్న లో కలిసిన జ్ఞాపకం
మరపురాని మధురమైన
అనుభూతులునుకొన్నైతే
ఒంటరితనాన్ని గుర్తు చేస్తూ
అనుక్షణం వెన్నంటే జ్ఞాపకాలు మరికొన్ని
నిన్న లలో కలిసిన జ్ఞాపకమా
గుండె గదిలో దాగిపో పదిలంగా కలకాలం.
10
[24/08, 9:23 pm] తాతపూడి సోమశేఖర శర్మ: కవితాగానం
అంశం.. జ్ఞాపకాల ఊట
శీర్షిక.. గుర్తుకొస్తున్నాయి
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఏ మూలనో దాగివున్న జ్ఞాపకాలు
గుర్తుకొస్తున్నది గుర్తుకొస్తున్నది
జ్ఞాపకాల మరిచిపోని దొంతర
నాచిన్ననాటి జ్ఞాపకాలు మర్చిపోలేదు
జ్ఞాపకాలఊట రోజూఊరుతూనేవుంది
బాల్యంలో మొదటి జ్ఞాపకం జ్ఞాపకం
పుట్టువెంట్రుకలు తీస్తుంటే పరుగులు
బోడిగుండుకు రాయించుకున్న గంధం
నుదిటపెట్టించుకున్న మూడునామాలు
ఆరోజు చూసిన అంతస్తులు సినిమా
పిల్లలు చుట్టూ చుట్టుకున్న తుంగచాప
ఇంటికొచ్చి చెల్లినేనుచుట్టుకున్నజ్ఞాపకం
గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి
అక్షరాభ్యాసానికి ఎర్రబొమ్మల చొక్కా
తెల్లనిక్కరు పలకకి అమ్మపెట్టినబొట్లు
బడికి వెళ్ళనని ఏడ్చి వెళ్లిన రోజులు
నాన్నని బడివదిలేదాకా ఉండమన్నవి
గుర్తుకువున్నాయి.. గుర్తుకువున్నాయి
పలకమీద రెండవైపులావేసిన ఎక్కాలు
పలకకి పెట్టిన బొగ్గు పలకఆకు రసాలు
పిల్లలతో కొట్టుకుంటూ ఆడుకున్నాటలు
మాస్టర్లు అంటే విపరీతమైన భయాలు
గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి
హైస్కూల్ లో ఐదు ఏండ్ల చదువులు
ప్రతిసంవత్సరం స్కూలుడే డాన్స్ లు
కబడ్డీ కో కో ఆటలు గ్రిగ్ స్కౌట్ క్యాంప్స్
పడవతరగతి లెక్కలుపరీక్షకి ఏడ్పులు
గుర్తుకున్నాయి.. గుర్తుకున్నాయి..
కాలేజీచదువులు ఉద్యోగాల వేటలు
టెంపరరీఉద్యోగాలు పెర్మనెంట్ఉద్యోగo
పెళ్లిపిల్లలు పిల్లలచదువులుఉద్యోగాలు
పిల్లపెల్లిళ్లుకాపురాలుకట్నాలుకానుకలు
మనుమలు వారితో ఆటలు పాటలు
అన్నీ జ్ఞాపకాల ఊటలు జ్ఞాపకమే
గుర్తున్నాయి ఆ మృదుమధుర జ్ఞాపకాలు
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
11
] Kavita Venkateshwarlu Garu: కవితా గానం సీజాన్ - 2
అంశం:: జ్ఞాపకాల ఊట
తేదీ : 24.8.21..మంగళవారం
శీర్షిక :: నీడలా వుండు
మనిషికి మరుపు జ్ఞాపకము
రెండు మనిషికి సమానము
జ్ఞాపకమోక గొప్ప వరము
ఎంత వయసొచ్చిన వీడని
నీడ వైనము
జ్ఞాపకము చెడైన మంచైన
మస్తిష్కపు పోరలలో
మెదడులోని అరలలో
ఒద్దికగా పొందికగా ఒదిగివుంటాయి
అవసరమైన వేళా అవి
తలుపులలోకి వస్తాయి
తలకిందులు చేస్తాయి
శుభాలైతే సంతోషంతో
మదిలో మహదానందం
అశుభాలైతే అశ్రువుల
వర్షదారలు సుడుగుండం
ముదిమి వయసున
వివాహము జరిగిన సంఘటనలు
ముద్దు ముచ్చట్లు
అప్పటి అచ్చట్లు
వెనక్కి వెళుతారు 60 ఏండ్లు
చెమ్మ గిల్లుతాయి ఆనందంతో
నాయనాలు ఆ కొద్ది సేపైన
మరచిపోతారు కష్టాలు కన్నీళ్లు
స్నేహితులతో సినిమాలు షికార్లు
చెప్పుకున్న ఊసులు
ఎగొట్టిన క్లాసులు
పగలగొట్టిన మందు గ్లాసులు
అబద్దాలు చెప్పి
క్లాసు టీచర్ కళ్ళు గప్పి
మ్యాట్నీలకి పోవడం
స్కూటీలు నడపడం
కష్టసుఖాలు అన్ని
సుఖ దుఃఖాలు కొన్ని
నవ్వుల విషయాలు
ఏడుపుల సంగతులు
అన్ని జ్ఞాపకాల యవనికపై
కంటి తెరపై
నిలుస్తాయి సినిమా రీలులా
కదిలిస్తాయి మదిలో తరంగాలలా!!
కవిత వేంకటేశ్వర్లుు
12.
[25/08, 8:03 pm] Aalla Nageshwar Rao Poet: అంశం : జ్ఞాపకాలఉట
శీర్షిక: జీవితం
బాల్యం నుంచి వృద్దాప్యం వరకు
జరిగిన జీవితం మొత్తం
జ్ఞాపకాలమయం
భూమిలో తవ్వేకొద్దీ
నీటిజలం ఊరినట్లు
జీవితంలో గతమంతా
అనుభవాల స్మృతుల మయం!
కొన్ని జ్ఞాపకాలు
వర్తమానానికి గుణపాఠాలైతే
ఇంకొన్ని జ్ఞాపకాలు
భవితకు మార్గ నిర్ధేశకాలౌతాయి!
మరికొన్ని పధిల పరుచుకునే
మధుర స్మృతులై మిగులుతాయి!
జ్ఞాపకాలనే అనుభవాలుగా స్వీకరిస్తూ
అనుభవాలనుంచే పశ్చాత్తాపాలు పొందుతూ
చేసిన తప్పులు మళ్ళీ చేయక
చేయక వదిలేసిన పనుల్ని ఇకనుంచైనా చేస్తూ
జీవితపు గనిలో
జ్ఞాపకాల ఖనిజాన్ని తవ్వుతూ
ఉజ్వల భవితకు ముడిసరుకుగా వాడుతూ
జ్ఞాపకాల జడివానలో తడుస్తూ
ఆనందమయ జీవనానికి శ్రీకారం చూడదాం!
..........................................
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాని సంఖ్య. 7416638823
..........................................
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
13
[25/08, 8:12 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్2 ) 25/8/2021/ బుధవారము
అంశం:- జ్ఞాపకాల ఊట
చిన్నారివయసున చిందులు త్రొక్కుచు
ఆటపాటల గడచిపోయె
అట్టితలపెంత మధురము
ఆనందలోకాలకు సాగిపోవు
యవ్వనమందున యెన్నో కోర్కెలు
కళ్ళముందుకదలె కాలమంత
ఆజ్ఞాపకాలన్నియు నవధులుదాటిన ఆనందభరితాలు
ఊటబావిలోని నీరులావూరుచుండు
గడచినగతస్మృతులలో మంచిచెడుల కలబోతలెన్నో
చెడుస్మృతుల దలచినచేదువిషము
మంచి స్మృతులను మదిని దలచ
మధువు గ్రోలినట్లు మనసుకానందము
అట్లతదియనాటి ఆడినఆటలు
ఏడిండ్ల ఉయ్యాల లూగినతీరు
తలచు కున్ననేటికి ఒళ్ళుపులకరించు
తోటి నేస్తాలతొక్కుడుబిళ్ళాటలు
వామనగుంటలు గచ్చకాయలు
ఒకటేమిటి ఆచిన్నారివయసున
ఆడినఆటలు తనవుపులకరించు
కార్తీకమాసానచలిలో నానమ్మతోటి
నదీస్నానాలు అరటిదొన్నెలో దీపాలనుంచి
నానమ్మనదిలో వదలినదీపాలవెలుగుతో
నావసాగిపోవచూసి చప్పట్లుచరిచేటి నాచేతులు
నేడుకొడుతున్నట్లుగతస్మృతులలో మునిగిపోతిని
నాటిస్మృతులనుతలచిన ఈనాడు
జరిగినట్లుండునుఆమధురస్మృతులలో
ముసలితనము మేనుకు వచ్చును
మనసుకు రానెరాదు!
తరణికంటి సూర్యలక్ష్మి.
------------
14.
[25/08, 8:59 pm] +91 95420 10502:
కవితాగానం (సీజన్ 2)
బుధవారం 25/08/2021
అంశం:జ్ఞాపకాల ఊట
శీర్షిక : అస్తవ్యస్త మస్తిష్కం
************************
ఊహల ఒరవడితో నిండినదీ బుర్ర
ఆశలు అలలుగా తోయగా
ఆలోచనలు సుడిగుండాలవగా
గండాలెన్నిటినో గట్టుకునెట్టుతూ
హృదిలో చేరినవన్నీ
రొదలతో బయల్పడుతూ
మనుగడకొక మార్గం చూపుతూ
కల్మషాలను కానరానీక
స్వచ్ఛతను తేటతెల్లం చేయలేక
ఆర్భాటాలకు అడ్డుకట్ట వేయలేక
నిరంతరం తరం తరం లోని
తీరుతెన్నులను తెలపవలెనని
తవ్వేకొద్దీ ఊరుతునే ఉంటుందని
జ్ఞాన ప్రకాశమును పంచుతూ,
జీవితాన వెలుగులనే నింపి
ప్రయత్నము చేసేదే
మన మస్తిష్కాన ఊరే
ఈ జ్ఞాపకాల ఊట
బతుకు తెరువున సయ్యాట
_____________
జోషిపద్మావతి
మహబూబ్ నగర్
15
[25/08, 9:16 pm] +91 73493 92037: జ్ఞాపకాలు
--------------
ఎపుడు చూచినా నీ జ్ఞాపకాలే
ఎదలో ఎనలేని కష్టం
ఏకాంతంలో వెనకబడి
మానసమున బాధిస్తున్నాయి.
నీవు లేని ఈ మంచం
పరుపు లేని వేసవి
చల్లని గాలివీస్తే నీ నవ్వులా
గలగల చేరి నీ స్పర్శసానందం
పువ్వులు సువాసనలు జల్లితే
అవి గుభాళించి,నీ మకరందాలై
నాలో వెలికితీయు నీ తలపులు.
నీవు ఎంత దూరంలో వున్నా
నాకు నీతో వున్నట్టు జ్ఞాపకాలు
ఆ గడిపిన క్షణాలు నిరంతరము
తరంగాలై తలలో తిరుగును.
చిగురాకుల మంచు బిందువులు జాలువారుతొంటే
ప్రేమతో ఫించము విప్పి నువ్వు
మయూరిలా నాట్యం చేస్తున్నట్టు
నేను వర్షపు జల్లులో పులకరిస్తున్నట్టు ఏవేవో భావాలు
అందుకే నీకు వీడ్కోలు యివ్వలేక
కలలో నిన్ను తనివితీర చూస్తున్నాను.
చీకటికి తారలు జాబిలి
స్నేహితులైనట్టు
నీ ఊహల్లో ఇంకా పులకరిస్తున్నాను
నీ వలపుల నీడనే సేదదీరుతున్నాను.
ఎందుకు నాకు సదా ఎదురు లేని
ఈ.... నీ తోడు నీడలు!
జ్ఞాపకాల చెమటల తడి
జ్ఞాపకాల జీవన ఊహలు
జ్ఞాపకాల ఊపిర్లు
అందుకే,వాటిని చితిలో కలుపుతా!
ప్రభాశాస్త్రి జోశ్యుల,మైసూరు.
mob :7349392037.

Comments
Post a Comment