నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
************---
కవివరుల జాబితా
1.ఆళ్ల నాగేశ్వరరావు గారు
2.ఆపరాజిత్ గారు
3.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
4.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా.
5. కోరాడ గారు
6.కవిత వెంకటేశ్వర్లు గారు
7.ఏడెల్లి రాములు ✍️
8.జోషి పద్మావతి గారు
9.వీరా గుడిపల్లి గారుు
10. దార స్నేహలత గారు
*******
[27/08, 7:54 pm] Lalita Sister:
❇️❇️❇️❇️❇️❇️
కవితాగానం
నేటి అంశం
మళ్ళీ బళ్లు..
ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.
ఆ సమయంలో ఎలాంటి
ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.
❇️❇️❇️❇️❇️❇️
1
[27/08, 7:54 pm] Aalla Nageshwar Rao Poet: అంశం; మళ్ళీ బళ్ళు.....
శీర్షిక;
"" కనుపాపల్లా కాపుకాద్దాం ""
బహుకాల దర్శనంలా
చాలా కాలం ఆనక
బళ్ళు తెరుచుకోబోతున్నాయి
సరస్వతమ్మ నిలయాలై
ఆనందపు లోగి ళ్ళై!
ఉపద్రవం ఉపమించినట్లు అన్పించినా
మరో ఉపద్రవం పొంచి చూస్తూంన్నందున
ముందు కన్నా మిన్నగా
జాగరుకులమై మసలాలి
పిల్లలకు పెద్దలుజాగ్రతలు చెప్పి పంపాలి
ఆరోగ్యమే మహాభాగ్యమని
బోధించాలి
అధికారులు అలసత్వాన్ని వీడి
అప్రమత్తులై మెలగాలి!
మొక్కు బడి గా కాకుండా
మొక్కేబడిగా తీర్చిదిద్దాలి ఒజ్జలు
కన్నవారి కన్నా మిన్నగా పిల్లల్ని
కనిపెట్టుకోనుం డాలి!
,మీ.జాగర్తలను.మీరు తీసుకుంటూ
పిల్లలచే పాటించేలా చేయాలి!
మాస్క్ ధారణ,
చేతుల శాని టైజేషన్,
దూరం పాటింపులనే
ముచ్చటైన మూడు సూత్రాలను పాటీంప చేస్తూ
వచ్చే మూడో ముప్పును నివారించేందుకు
తెరచిన బళ్ళు మళ్ళీ మూతబడకుండా ఉండేందుకు
తెలివిగా ప్రవర్తిస్తూ
ముందస్తు జాగర్తలు తీసుకుంటూ
ఇంటా బయటా కనుపాపల్లాంటి పిల్లల్ని
కంటికి రెప్పల్లా కాపాడుకుందాం
ఆశాజ్యోతులు ఆరిపోకుండా కాపు కాద్దాం!
...........................................
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు....జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రము
చరవాని సంఖ్య; 7416638823
...........................................
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను
2.
[27/08, 7:56 pm] Aparajith: బడులు తెరుస్తారట,,,,!
బడులు తెరుస్తారట
పిల్లలు అల్లరి మూకలై
బర్రెల గొర్రెల కాపరులై
అక్షర జ్ఞానం కోల్పోయారు!
పెద్ద పిల్లలు దినసరి కూలీలుగా
పాతికో పరకో సంపాదిస్తూ
ఇదే జీవితం అనుకుని
భవిష్యత్ పై ఆశలు వదులుకున్నారు!
డిజిటల్ పాఠాలు
కొందరికే అందరికీ కావు!
కరోనా గత్తర తగ్గుముఖం పట్టింది
ఇక బళ్ళు తెరుస్తున్నామోచ్ అంటే,,,,,!
సంవత్సరంన్నర తరువాత
చదువుకునెందుకు పుస్తకాలిచ్చి
మళ్ళీ మధ్యాహ్న భోజనం మొదలుపెడతాం
బడికి రండిరా పిల్లలూ,,,,,,,,!
చదువుకుంటే ఏముంది?
అన్నం పెట్టని అక్షరం దేనికి!?
దీనికన్నా ఊరచెరువులో
చేపలు పట్టుకోవడం ఉత్తమం!
అనే గ్రామీణ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు
చదువు విలువ ఎలా వివరించి చెప్పాలో
తెలియక తలలు పట్టుకుంటున్న ఉపాద్యాయులు
చదువు సంధ్య లేక
అంధకారమైన పిల్లల మనస్సులు
గ్రామాలకు గ్రామాలలోని పిల్లలు
వెర్రి ముహాలతో తిండి తిప్పలే జీవితమనుకుని
బ్రతుకు అర్థం తారుమారై
కరోనా పెట్టిన చిచ్చు
ఆ ఉచ్చులో పడి గిల గిలలాడే పక్షుల్లా
చదువంటే అయోమయం అగమ్యగోచరం
కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టెదాక
ప్రాపంచిక ఙ్ఞానంతో
అక్షరం రాడార్ కన్నా శక్తిగలది
బడి శాస్త్ర ఙ్ఞానానికి అంబులపొది
అని పిల్లలకు తెలిసి రావాలి!
వేచి చూద్దాం,,,,,,!
అపరాజిత్
సూర్యాపేట
3
[27/08, 8:00 pm] +91 6281 697 982:
అంశం...మళ్లీ బళ్ళు... 27082021
మోగింది బడి గంట
******************************
చెల్లాచెదురైన పెంట కుప్పల్లా
విడిచేసిన చావడీల్లా
వెలిసిపోయిన ముతక బట్టల్లా
పాఠశాలల దీనావస్థ
పెరిగిన చీదులో పంతులమ్మల పరుగులు
భయం భయంగా
పంతులయ్యల ప్రసంగాలు కడురమ్జుగా
ఎంతో వినయంగా
బడి తెరుస్తారనే వార్త వ్యాపించింది
దావానలంలా
పిల్లల సంబరాలు అంబరాన్ని తాకేలా
పేలాయి చిచ్చుబుడ్లు సిసింద్రీల ముఖాల్లో
తెగిపోయిన బడి గంటలు
మళ్లీ కడుతున్నారు గట్టిగా
మాసిన బడిని తుడుస్తూ
కడిగేస్తున్నారు మిల మిలా
పంచాయతీ కార్యదర్శులు
కార్మికుల ఎడతెరిపి లేని
శ్రమ, చేస్తోంది అద్భుతాలు
సకల సౌకర్యాలు సుసంపన్నం
మధ్యాహ్న భోజన సిబ్బంది
నడుంబిగించింది
నాణ్యమైన భోజనం పిల్లలందరికి
ప్రేమతో వడ్డించాలని
పండుగ వచ్చింది బడి పండుగ వచ్చింది
బాలల భవితకు బంగరు బాటే వేసింది
భవిష్యత్తుకు పునాది రాయి వేసింది
కళ్ళల్లో నీళ్ళు , మళ్లీ బళ్ళు అనగానే
జల జలా రాలాయి ఆనంద భాష్పాలు
స్వీయ రచన:::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
27082021
సెల్ ఫోన్:: 8497924605
4
[27/08, 8:00 pm] +91 99373 80136: కావ్యగానం
తేది27082021,శుక్రవారం.
అంశం:మళ్ళీ బళ్ళు
శీర్షిక:బడిగంటలు మ్రోగుతున్నాయి.
మళ్ళీ బళ్ళు తెరచుకొంటున్నాయి
బడిగంటలు మ్రోగబోతున్నాయి
అటు బడిపంతుళ్ళకు
ఇటు బడి పిల్లలకు ఆటవిడుపే
తల్లిదండ్రలకు మాత్రం ఆందోళనే
మూడోదశ కరోనా వచ్చేస్తుందట
అది పిల్లలపైనే ప్రభావం చూపుతుందట
అన్ని జాగ్రత్తలు బడులలో తీసుకుంటారో లేదో
మళ్ళీ బడిపిల్లలు బలికావల్సిందేనా?
ఆలోచించేదెవరూ?
సమస్యలవలయంలో బడిపిల్లలు చిక్కుకోకతప్పదా?
చూద్దాం ఏమైతుందో నని చేతులు ముడుచుకుందామా?
ముందస్తుచర్యలు తీసుకుందామా?
అసలే అరాకొరా సౌకర్యాలున్నాయి బళ్ళలో
పరిశుభ్రతపాటిస్తారో లేదో?
పిల్లలకు నేర్పుతారోలేదో?
అన్నీ సందేహాలే?
అవి తీర్చేవారెవరూ?
పరిష్కరించేవారెవరూ?
ఇది నా స్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా.
చరవాణి7780594995.
5
[27/08, 8:05 pm] Korada: కవితాగానం :-@మళ్ళీబళ్ళు@
కోరాడ నరసింహా రావు !
* విజయం సాధించాల్సిందే *
********************
హమ్మయ్య... బళ్ళు తెరుస్తున్నారు...* ఆశ *
మహమ్మారి మళ్లీ విజృంభి స్తోంది..." భయం..."నిరాశ !
భావిభారత పౌరులుగా తీర్చి దిద్దే ఆలయాలవి !
ఆ దేవుడు తొలుత తల్లైతే...
తదుపరి గురువు గానే అవత రించాడు !!
అజ్ఞానాన్నితొలగించి..జ్ఞానాన్ని
కలిగించి... విజ్ఞానిగా మార్చి...
ఈ సమాజంలో హాయిగా బ్రతక టానికి సుందర జీవిత హర్మ్యా నికిపునాది,పిల్లర్లు... బడి,ఉపా ద్యాయులు....!
అపచారమో... గ్రహచారమో
మనిషిచేసినపాపాలకుశాపమో
వారమా... పదిరోజులా !?
నెలా... రెండునెల్లా... ?!
ఏకంగా రెండేళ్ల పైబడి... పిల్లలు బడులు మరచి పోయి !
శ్రద్దగా చదువుకోవాల్సిన బాల్యం..., యాగశాలల్లాంటి
బడులు... ఋత్విక్కుల్లాంటి ఉపాధ్యాయులు,వేదఘోష
లాంటి పాఠ పఠనాలు....,
హవిస్సులాంటి పాఠ సారాన్ని గ్రహించే బాలదేవుళ్లు !
అంతా అదృశ్యం... !!
పునః ప్రారంభానికై తెగిస్తుంటే విజృంభిస్తూ భయపెడుతున్న మహమ్మారి... !
ఎన్నాళ్లీ పరాజయాన్ని సహించటం !?
చెయ్యాల్సిందే...యుద్ధం
చెయ్యాల్సిందే.... !
వైరికి వెన్ను చూపరాదు !!
మాస్కుల కవచాలు... శానిటైజేర్ ఖడ్గాలు ధరించి
భౌతిక దూర యుద్ధం చెయ్యాల్సిందే... !
విజయం సాధించాల్సిందే !!
****************
6.
కవితా గానం సీజన్ - 2
అంశం :: మళ్లీ బళ్లు
శీర్షిక:: పిల్లలను కాపాడుకోవాలి
పిల్లలూ...........
మళ్లీ బళ్లు
జాగ్రత్త ఒళ్ళు
మన చుట్టూ తిరుగుతుంది
కరోనా సుళ్ళు
అది చాచుకొనివుంది
తన కబంధ హస్తాలు
చిక్కకుండ వుండాలి నేస్తాలు
అందుకు ధరించాలి మాస్కులు
వాడాలి శానిటైజర్లు
కడగాలి శుభ్రంగా చేతులు
పాటించాలి భౌతికదూరం
సాగించాలి కరోనాతో ప్రయాణం
ఒకటిన్నర సం!!రాలుగా
చదువుకు దూరం
ఇది ఎవరు చేసిన నేరం
ప్రపంచానికి పట్టుకుంది జాడ్యం
ఎప్పుడు వీడిపోతుందో ఈ మౌఢ్యం
మీ చదువులు చక్కగా సాగాలి
బడిలో గ0టలు మోగుతూ ఉండాలి
ఉపాధ్యాయులు ఊతంగా నిలవాలి
అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పాఠాలు బోధించాలి
ఎన్నో విజయాలు మీరు సాధించాలి
పాఠశాలకు కళాశాలకు పేరు
తేవాలి
మీ ఆశలు ఆశయాలు నెరవేరాలి
మంచి పేరుతో మంచి భవిషత్తుతో
మీ జీవితాలు నవనవోన్మేష0గా
మారాలి
దేశానికి మార్గ దర్శకులుగా ఉండాలి!!
కవిత వేంకటేశ్వర్లు
పై కవిత నా స్వంత రచన అని హామీ
7
[27/08, 9:02 pm] +91 94948 00454: కవితా గానం
*మళ్ళీ బళ్ళు*
శీర్షిక*చదువులమ్మ ఒడిలో...
ఓం ప్రథమం
అక్షర పుష్పం
పుష్పించే సమయం
బడి గంట
జణ గణ మన జయహే గీతం
బడీ
చదువులమ్మ ఒడిలో ఓలలాడే వేళా
పాఠ్య పుస్తకాలు పంతుల్ల ఆరోవేదం
జ్ఞాన సముపార్జన దేవాలయాలు
విద్యా కుసుమాల శోభా నిలయాలు
అమ్మా విద్యాదరీ
నీ నిక్వణ స్వర రాగాలలో
విలువైన బడి పీరియడ్స్ లలో
శ్రద్దను మనసు పొద్దుగా అందించూ
నీ చల్లని దీవెనలతో ఆరోగ్యాన్ని
ప్రసాదించూ
గురు పూర్ణిమ నీ అనుగ్రహం
నీవే శిష్యుల మనో విజ్ఞాన వికాసం
అవాంఛిత ఆటంకాలు లేని
విద్యా కాలాన్ని కొనసాగించూ
అమ్మా శ్రీవాణీ
బడి పిల్లలంతా నీ పూజా కుసుమాలు
విజయ తీరాలకు చేర్చు
శ్రీమాతా నమోస్తు నమామ్యహం
రక్షమాం రక్షమాం నమో నమః
ఏడెల్లి రాములు ✍️
ది*27*08*2021(21*00)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
8
[27/08, 9:16 pm] +91 95420 10502: కవితాగానం సీజన్ 2
అంశం:మళ్ళీ బళ్ళు
తేదీ:27/08/2021
శీర్షిక: పరివర్తనం
**************
మళ్ళీ బళ్ళు,క్రొత్తగా .స
ఉత్సాహం,ఉల్లాసం,ఆసక్తికరం.
చదువుల్లోకొత్తదనంవేసవిసెలవులనంతరం
మాస,ద్వైమాసాలకే ఎదురుచూపులు
ఎప్పుడో మళ్ళీ బళ్ళు అంటూ....
రెండేళ్లైనా బడిబాటపట్టని పిల్లల ఆతృత మళ్ళెప్పుడో బళ్ళు అంటూ....
ఆనవాయితీగా వేసవి సెలవుల సందడితరువాత అది
కనీవినీ ఎరుగని రీతిలో ఎదురు చూపు ఇది
కరోనా కట్టడిలో చదువులంతా ఆగం
మళ్ళీ బళ్ళు అన్న వార్త తెచ్చింది ఉత్తేజం.
ప్రైవేటు ఉపాధ్యాయులకు,సకల విద్యార్థులకు
పెరిగిందిలే అధికంగా మనోబలం.
నీరు గారి పోరాదు ఆశయం.
మరలా రారాదిలాంటి గడ్డుకాలం.
మొదటి,రెండవ విడతలతో
విద్యావ్యవస్థ ఐనది అతలాకుతలం
మూడవవిడతేవస్తే ఏమౌనోజనజీవనం!
జాగ్రత్తలు పాటిస్తూ మునుపటిలా మెలగాలి మనమందరం
^^^^^^^^^^_________^^^^^^^^^
జోషిపద్మావతి మహబూబ్ నగర్,
9
[27/08, 9:18 pm] Veera Gudipally: అంశం,:మళ్ళీ బడి
శీర్షిక: ప్లీజ్
26082021
*************
బడి అంటే అదో గంగోత్రి
కానీ
కరోనా కాటుతో
సమస్త మానవాళిని
శాపగ్రస్తులను చేసింది
స్వీపర్లను తరిమేసింది
శానిటైజేషన్ ప్రశ్నార్థకంగా మార్చింది
అఆలను అందుబాటులో లేకుండా చేసింది
ఆటపాటల ఊసే మూసేసింది
అమ్మా నాన్న లను
ఆందోళనకు గురి చేసి
బీపీలు సుగర్ లను బహుమతి గా ఇచ్చింది.
ప్రైవేటు పంతుల్లను
ప్రత్యామ్నాయం వెతుక్కోమంది.
చదువులంటే ఉన్న చులకన భావం
దూరం చేసింది
బడి
గుడి కంటే
అమ్మ ఒడికంటే
గొప్పదని తెలిసేలా చేసింది
10.
కవితాగానం (సీజన్ -2)
అంశం : మళ్ళీ బళ్ళు
శీర్షిక : కరోనా వారియర్స్ గా మనకు మనమై...
అవును మళ్ళీ బళ్ళు
వినగానే అందరికీ ఒకింత సంబరమే
మరింత భయాందోళన థర్డ్ వేవ్
మృత్యు శంఖారావం పూరించేందుకు
సన్నద్ధమవుతున్న కొత్తరకం కోవిడ్
కరోనా కదనరంగమందు రెండు దశలలో
కొన్ని ఓడిపోయిన ప్రాణార్పణలు
మరికొన్ని నిస్సహాయతన పోగొట్టుకున్నవి
ఇంకొన్ని తుదిశ్వాస అంచును ఎదురొడ్డినవి
చాలామందిని కాపాడిన మాస్కు లు
భౌతికదూరం శానిటైజర్లు
కరోనాతో సహజీవనం చేస్తూ
నిమ్మదించిన సెకండ్ వేవ్ కారణంగా
మళ్ళీ బళ్ళు ప్రాంగణానికి ఆరంభం
పలక పుస్తకం కలం స్థానాలలో
భౌతికదూరం మాస్క్ శానిటైజర్
ప్రాదాన్యతన మనమందరం
మళ్ళీ మోగిద్దాం బడిగంట
కరోనా వారియర్స్ గా మనకు మనమై...
దార.స్నేహలత
గోదావరిఖని
పెద్దపల్లి
9849929226
బళ్ళు తెరుస్తారంటే
లేని స్వర్గం కనబడుతోంది
ఆశలు నేరవేరేదాకా పోరాడుదాం
మాకు బడి తెరవడం చాలు
బడి కెల్తామనే ఆలోచనే
గాల్లో తేలినట్లు ఉంది
మమ్మల్ని ప్రేమిస్తే
బడి తెరవండి ... ప్లీజ్
... *వీరా గుడిపల్లి*
Comments
Post a Comment