Skip to main content

స్నేహం ౦౧౨౦౨౧

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*************************
కవివరుల జాబితా
౧.కొంపెల్లి రామయ్య గారు
౨.కేశరాజు వేంకట ప్రభాకర్ గారు
౩.తరణికంటి సూర్య లక్ష్మి గారు
౪.మద్ది పుల్లారావు గారు
౫.గొర్రెపాటి శ్రీను గారు
౬.దోసపాటి వేంకట రాంచంద్ర రావు గారు
౭.సింహాద్రి వాణి గారు
౮.గంగాపురం శ్రీనివాస్ గారు
౯.ధనాశి ఉషారాణి గారు
౧౦.అన్నా ప్రగడ గారు
౧౧.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
౧౨.వనపర్తి గంగాధర్ గారు
౧౩.తోట సులోచన గారు
౧౪.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
౧౫.మేకల రామస్వామి గారు
౧౬.తాతపూడి సోమశేఖర శర్మ గారు
౧౭.ఆర్ వి.వి.రాజా గారు
౧౮.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
౧౯.నాశబోయిన నరసింహ గారు
౨౦..పిన్నక నాగేశ్వరరావు గారు
౨౧.,సునంద వురిమళ్ల గారు
*****************



*కవితాగానం* సమూహంలోని
*ఆత్మీయులందరికి*
*స్నేహితులదినోత్సవ శుభాకాంక్షలు*
💐💐💐💐💐💐


*స్నేహితులదినోత్సవం*
*సందర్భంగా ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతున్నది* మనసమూహం

రాత్రి ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు కవితలు పంపగలరు.

ఆసమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.

ప్రత్యేక కవితలు ఈరోజు మాత్రమే తీసుకుంటాము.

 గమనించగలరు.

❇️❇️❇️❇️❇️❇️
[01/08, 7:59 pm] Kompelli Ramaiah Poet Kmm: శీర్షిక:శిలాక్షరం 
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

సృష్టిలో తీయని హితుడా
మధుర జ్ఞాపకాల సన్నిహితుడా
ఆపదలో ఆదుకునే స్నేహితుడా!

ప్రపంచమంతా ఎదిరించినా
చివరిదాకా నీడలా  తోడులా
ఆప్యాయత అనురాగాల కలబోతగా
ఆత్మీయ అనుబంధాల చేయూత స్నేహం!

రక్త బంధం మించిన  బంధంగా
కలిమి లేములను చూడనిదిగా
కులమత భేదం లేనిదిగా
బంధుత్వం కన్న బలమైనది  స్నేహం!

అమ్మ ఆలన  నాన్న పాలన
ప్రేమ కలగలిపిన మాధుర్యం
అన్నీ ఉన్నప్పుడే కాదు
ఏమి లేనప్పుడు కూడా
తోడుగా ఉండేదే స్నేహం!

నిష్కల్మషమైన మనసా
నిస్వార్థంగా చిగురించే బంధమా
కయ్యం ఎరగని నెయ్యమా
సన్మార్గంలో నడిపించే స్నేహమా
నీ బంధం నాకు శిలాక్షరం...!
[01/08, 8:04 pm] +91 6281 697 982: అంశం..
కవితా గానం సీజన్ 2
చెలిమి 
****** ***** ‌*****
ఆ.వె. 1.
చిరుత ప్రాయమందు చేసిన స్నేహము
చెలువ పట్టి నడుపు చెలిమి తోడ 
చీకు చింత లేని జీవమ్ము దొరికెను
నింత కన్న భవిత నెందు కలదు.
*******************************
ఆ.వె. 2.
స్నేహ మున్న మదికి సిరులేలజారును
కొండవోలె చెలిమిఅండ యుండ
చెలిమి వెంట సాగుభీరువుధీరుడే
కలిమి లేమి లేని కప్పు లేదు.
*****"*******"****************
ఆ.వె.3. 
నింగి నుండి జారి నీటిబిందువులెన్నో
పుడమి బుగ్గ గిల్లి పులక రించి
నేల నవ్వులన్ని నీరము దోచగ
పురిటి గదికి జేరె పుడమి తల్లి
***************************
ఆ‌వె.4
ఇరుగుపొరుగువారి కింపైనసొంపైన 
మనసు విప్పి చెప్పు మాట లుండ
కలతలనునవి కన కలికానకనవురా
 కేశరాజు మాట కెంపు మూట.
******************************
తేట గీతి: 5.
చెలిమి నీడలు జంటగా కులికి నడుచు
చెలియ చేతులు గట్టిగా కలియబట్టి
యేడు జన్మల బంధము విడువ నిన్ను
ననుచు ప్రేమ పాశంబును నాటు వేసె
********************************
స్వీయ రచన:: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.01082021
[01/08, 8:05 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్ 2 )1/8/2021 ఆదివారము
అంశము:- స్నేహితులదినోత్సవ సందర్భముగా:-

సీ!  ప్రియమిత్రు డొక్కడు  ప్రీతిగతోడున్న
గుండెనిబ్బరముగ  నుండ గలము

చెలిమితోమిక్కిలి  చేకూరుఫలితాలు
చెలిమికున్నబలము  చెప్పలేము

కష్టసమయమందు  కడతేర్చుకష్టాలు
కంటిరెప్పగనుండి  కాచునెపుడు

అనురాగబంథము  లన్నియు చెలిమితో
చిగురించు నెప్పుడు  చివరివరకు

ఆ!  ఒంటరితనమున్న  జంటగ తోడగు
కలిమి లేమి కూడ  కాంచరెపుడు
కయ్యమెరుగకుండ కలకాల మొకటిగ
స్నేహబంధమనగ  చెప్ప వచ్చు!
          తరణికంటి సూర్యలక్ష్మీ.
                      -----------
[01/08, 8:10 pm] +91 99512 87113: కవితాగానం(సీజన్ 2)
1/8/2021(ఆదివారం)
అంశం:స్నేహితుల దినోత్సవం
..........   

మంచి మిత్రులతో యశస్సు కలుగు
మధుర స్నేహం జీవితానికి ఉషస్సు
స్నేహాన్ని దీర్ఘ కాలం కొనసాగించుట తపస్సు
వయసుతోపాటు కొనసాగేది స్నేహం
వయోభేదాన్ని చూడనిది స్నేహమే
తరాలు మారినా తలరాతలు మారినా
మనస్సులో నిలిచిపోయెదే నిజమైన స్నేహం
సర్వకాల సర్వావస్థలయందు 
హృదిని వీడనిదే అసలైన స్నేహం
స్నేహం జీవితాలను పండిస్తుంది
మైత్రి మమతానుబందాలతో మురిపిస్తుంది
త్యాగానికి ప్రతిరూపం స్నేహం
తులతూగే సంపదలు
అలరారె బందువులు
స్నేహానికి సరిరారని ఓ సినీకవి
ఎంతో ఆర్ధ్రతతో చెప్పాడు
స్నేహబందం అతి పవిత్రం
కృష్ణ, కుచేలురు
కర్ణ,ధుర్యోదనులు
ఎందరో స్నేహానికి నిర్వచనమై నిలిచారు
.....
ఇది నా స్వీయరచన
........
మద్ది. పుల్లారావు
నందిగామ
9851287113
[01/08, 8:14 pm] +91 96528 32290: కవితా గానం (సీజన్ 2)
తేదీ : 01.07.2021
రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
అంశం: స్నేహితుల దినోత్సవం

హృదయాలను ఏకం చేసే బంధం స్నేహం!
ఏమీ ఆశించకుండా తోడై నిలిచే బంధం స్నేహం !
చిరు కష్టం ఎదురైనా "నేనున్నానంటూ.." భరోసా కల్పించే ధైర్యం స్నేహం !
వెన్నెలంటి చల్లదనాన్ని పంచే మాధుర్యం స్నేహం !
కుల మత ప్రాంతాలకు అతీతమై సాగే అనుబంధం స్నేహం !
వికసించే పుష్పాలు వెదజల్లే పరిమళాల్లా..
మనసులని మురిపిస్తూ ..
సంబరాలను కళ్ళముందు నిలిపే వేడుక వంటిది స్నేహం !
ఈ సమస్త లోకాన్ని నడిపించే చైతన్యం స్నేహం !


"వేడుక వంటిది స్నేహం !" అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.
రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్) చరవాణి: 9652832290
[01/08, 8:14 pm] +91 99373 80136: కవితాగానం(సీజన్2)
తేది01082021,ఆదివారం
స్నేహితులదినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కవితలపోటి.
అంశం:సృష్టిలో తీయనైనది స్నేహం
స్నేహం దేవుడిచ్చిన వరం
పూర్వజన్మసుకృతం
అప్యాయతానురాగాలను పంచి పెంచేబంధం
రక్తబంధాలకన్నా మించిన అపూర్వబంధం
నీ స్నేహితుడెవరో తెలుస్తే నీవెవరో తెలుస్తుంది
కష్టాలకడలిలోనుండి ఒడ్డుకుచేర్చే బంధం
ఆపదసమయంలో ఆపన్నహస్తమందించే బంధం
ఎన్నటికి వీడని బంధం
ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగిన హృదయాలసంగమం
సృష్టిలో తీయనైనబంధం
ఎడారిలో ఓయాసిస్సులాంటిది
మండుటెండలో మంచుబిందువులాంటిది
కంటిలో కన్నీరై కలసిపోయేది
కృష్ణకుచేలుల మైత్రిని మరపిస్తుంది
కర్ణసుయోధనుల స్నేహంలా శ్వాస ఆడే వరకు సాగేది
కడవరకు కలిసిమెలసి సాగేబంధం
మధురాతిమధరమైనది జన్మజన్మలకు కావాలనే బంధం
లోపాలనెత్తిచూపి సన్మార్గంలో నడిపించేబంధం
మంచిని ప్రోత్సహిస్తూ చెడును తిరస్కరించే బంధం
నిశ్చలమైన నిక్కచ్చితనంతో సాగే బంధం స్నేహబంధం

ఇది నా స్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం,శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
[01/08, 8:27 pm] Siimhadri Vani Poetess: కవితాగానం-సీజన్--2
కవితా శీర్షిక:-- చెలిమి నీడల వెంట
తారీఖు:--1--8--2021
ఆదివారం

నడినెత్తిన సూరీడు నిప్పులు కురిపిస్తున్నా,
చెంత చేరిన బాటసారికి
చెట్టు తన చేతులనడ్డు పెట్టి
చల్లగాలిని విసురుతూ నీడనిచ్చి సేదతీరుస్తుంది
చెమటనార్పి సేవ చేస్తుంది
తనకోసం దాచుకొనక తినేందుకు పళ్ళనిస్తుంది
నిస్వార్థం, స్నేహభావం,పరోపకారం చెట్టు నైజం.
ప్రకృతి అడుగడుగునా స్నేహధర్మాన్ని ప్రబోధిస్తూనే వుంటుంది
విజ్ఞానాన్ని పెంచుకొని,అన్నిటి పైనా ఆధిపత్యాన్ని ‌సాధించిన మనిషి
అహంకారంతో అజ్ఞానియై 
మానవతా విలువలను కోల్పోయి అఘోరిస్తున్నాడు
అహంభావంతో పతనపు అంచుల్ని స్వాగతిస్తున్నాడు
విచ్చలవిడిగా చెలరేగి
నానారకాల కాలుష్యాన్ని నింపి
ప్రకృతిని చెత్తబుట్టలా చేసి
ప్రాణులన్నిటికీ ప్రాణాలమీదికి తెస్తున్నాడు
ఇకనైనా కళ్ళు తెరిచి చెలిమి నీడల వెంట పయనిస్తే
జీవితం సుఖమయమై సంతోషంగా సాగిపోతుంది.

రచన:--సింహాద్రి వాణి
ఊరు:-- విజయవాడ
హామీ:---ఇదినా స్వీయ రచన.
[01/08, 8:36 pm] +91 96763 05949: 01.08.2021
స్నేహితుల దినోత్సవం సందర్భంగా

*"కలబంధ"లవ్వాలి!*
°°°°°°°°°°°°°°°°°°°°°

ఎడారిలో మొక్కల్లా చెల్లాచెదురుగా పడున్న మేఘాలు 
గాలి గంధర్వుడి వింజామరల వీచికలతో
సతత హరితారణ్యాల్లోని చెట్లల్లా దట్టంగా అలుముకొని
దాహంతో గొంతెండిపోయి పగుళ్ళ నోళ్ళను తెరిచిన పొలాలు 
చినుకులతో సహవాసం చేయగానే తృప్తిగా బ్రేవ్ మంటాయి

గొలుసు బంధాన్ని విడగొడితే నలుసు బాధ తప్పుతుందా
తాడు ముడులను విడదీస్తే మునుపటి పటుత్వముంటుందా 
అహంతో శత్రు గీతం పాడిన ఆవులు పులిపాలు కాలేదా
కట్టె పుల్లల్ని వేరు చేస్తే పుటుక్కున విరగ లేదా?

ఒకే మాట తాటిపై నిలిచిన పక్షులు వలతో సహా ఎగర లేదా
చీమలన్ని దండుగట్టి పామును పడగొట్ట లేదా
రాయి రాయి కలగలిసి రాజభవనమవలేదా
గడ్డిపోచలేకమై గజమును బంధించ లేదా?

చేయి చేయి కలిపిన మానవ హారానికేమైందో?
ఎక్కడికక్కడ కుటిలపు కుళ్ళుతో తెగ్గొట్టుకుంటున్నాయి 
మనుషులకు గుణపాఠం చెప్పాలనుకున్న తరువులు
కొమ్మల భుజం మీద కొమ్మలేసి హరితహారమై మెరుస్తున్నవి 

అవసరానికి ఆపన్న హస్తం అందించిన ఆత్మీయ మిత్రుల్ని 
ఆప్యాయతతో ఆలింగనం చేసుకోకున్నా సరే
మోసపు కత్తులతో దాడి చేయకుంటే సరి!
ద్రోహపు విషాన్ని, విద్వేషపు అక్కసును చల్లకుంటే సరేసరి!! 


               గంగాపురం శ్రీనివాస్ 
                      సిద్దిపేట
[01/08, 8:43 pm] +91 70755 17538: శీర్షిక.స్నేహము
ప్రక్రియ. సిరిమంజరి
......
సిరులు వలెను లాలించు
గుండె లోతు నందున
ముద్దు గాను నిలిచేను
సృష్టి లోన వెలుగురా
బలము నిచ్చు నిజమురా
పేద ధనిక చూపదు
జాతి కులము ఎరుగని
నిండు దనము నిచ్చును
బతుకు దిద్ది నిలుపును
సిరులు చెలిమి గురువురా

మమత పంచి నిలిపేను
సమత లన్ని కూర్చును
సంపదలను ఇచ్చును
మధుర భావ మందున
సిరులు కూర్చి నిలిపేను
ముద్దు గాను నిలుపును
జగతి మెచ్చె ఇలలోన
జయము నింపు భువిలోన
భవిత నిచ్చు స్వర్గమురా

ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
౧౦
[01/08, 8:44 pm] +91 93900 99056: *మిత్ర దినోత్సవ శుభాకాంక్షలు*💐💐💐
అంశం..చెలిమి
మిత్రమా...
నిన్ను కలసిననాడు నీ జాతి నేనెఱుఁగ..,
నీతో మాటాడ బాషబేధమును గాంచ...
నిన్ను ఎరిగిననాడు నీ కులము,మతము లెక్కించ...,
నీ సావాసమున ధనికపేద మాట రానివ్వ...,
నిన్ను హృదయాంతరముల నుండి నిండుగా నమ్ముద...,
నీ సానిహిత్యమున నే కాలమును మరచుద....,
నిన్ను గెలిపించుటకు నేను ఓడ సిద్ధమగుద..,
నీ కష్టాలను పంచుకొనుటకు,సుఖాలను పెంచుటకు విలువ నిచ్చెద...,
నీ ప్రేమను నిలుపుటకు ఎన్ని కష్టాలకూ వెనుకాడ....,
నిన్ను ఎల్లవేళలా వెలిగించుటకు నేను కరుగుటకు సిద్ధమగుద..

మిత్రమా... నీ చెలిమి నేను ఎన్నడు వీడ..

✍️అన్నాప్రగడ, గుంటూరు జిల్లా,9390099056
౧౧
[01/08, 8:48 pm] Aalla Nageshwar Rao Poet: కవితా గానం( సీజన్..2)
తేదీ; 01....08....2021..ఆదివారం
సందర్భం; స్నేహితుల దినోత్సవం
శీర్షిక:
     "" స్నేహబంధం ""

సంసారమనే సాగరంలో
జీవితమనే నౌకనెక్కి
స్నేహమనే తెడ్డు వేస్తూ సాగితే.....
జీవితం వడ్డించిన విస్తరౌతుంది
గమ్యాన్ని  చేరడం తేలికౌతుంది!
సృష్టిలో తియ్యనిది
ఎవ్వరూ విడదీయనిది
కులమత విభేదాలు ఎరుగనిది
ఆర్ధిక అసమానతలు అసలే  
చూడనిది
మంచు కన్నా చల్లనిది
మల్లేలంత స్వచ్ఛమైనది
ఎడారిలో ఒయాసిస్సులాంటిది
మండు వేసవిలో పన్నీటి జల్లులాంటిది  స్నేహం!
ఆపదల్లో అభయ హస్తం
సుఖదుఃఖాల్లో  వీడని నేస్తం స్నేహం!
శ్రీ కృష్ణుడు, కుచేలుల స్నేహంలా
దుర్యోధనుడు, కర్ణుల మైత్రీలా
సర్వకాల సర్వావస్థల యందు
నిత్యమై, నిఖిలమై నిలవాలి స్నేహబంధం!
అన్ని బంధాలోకి 
స్నేహబంధమే మిన్నరా
స్నేహాన కన్న మిన్న
లోకాన ఏది లేదురా!
నీకు మంచి స్నేహితుడు లభించాలంటే
ముందు నీవు మంచి స్నేహితుడవై మసలాలి!
హితం కోరేవాడే స్నేహితుడు
అందరి కన్నా అత్యంత సన్నిహితుడు!
...........     ............................
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాని సంఖ్య: 7416638823
.......................................
.పై వచనకవిత నా స్వీయరచనేనని హామీఇస్తున్నాను.
౧౨
[01/08, 8:54 pm] +91 94901 73053: కవితా గానం    సీజన్ -2
తేది  01-8-2021
రచన  తోట సులోచన
అంశం   స్నేహితుల  దినోత్సవం  శీర్షిక   తోడు, నీడైన మిత్రుడు

స్వార్ధ, లోభముల కతీ తుడై
కుల మత బే ధా లెరుగక
మనసులు , మమతలు పంచుకుని
కలిమి లేముల్లో  తోడునీడై
గుండెలో దాగిన బాధను తొలగించి
మధురామృతమును  చవి చూపు
ఆత్మీయుడై  నీ నీడలా నిన్ననుసరించు
చివరి శ్వాస వరకు  నిలచి మమతలు పంచు
కష్టాల  వూబి లో  నున్నపుడు
తోడై  నిన్ను  పైకి  లాగి
నీ బ్రతుకుకండగా నిలుచు
ఏ బంధుత్వాల కందని బంధమై
సతతం  హితమునే  కోరువాడు
మనసును మురిపించి  సంతోష సాగరంలో నోలలాడించు
పండు వెన్నెలలో  నిన్ను  వూయలలో  నూగించు
బాధలతో నిర్జీవుడైన నిన్ను
వెతలను తీర్చి సజీవుడుగా  నిలుపు
జగతిలో శ్రీకృష్ణ, కుచేలస్నేహాన్ని
మదిలో భావించు
స్నేహమే మనిషికి  యమూల్య యాభరణం

హామీ పత్రం
ఈ కవిత నా స్వంతమని హామీ యిచ్చు చున్నాను
తోట సులోచన
నెల్లూరు
చరవాణి   9490173053
౧౩
[01/08, 8:55 pm] Vanaparthy Gangadhar Poet: *కవితా గానం (సీజన్ 2)*
*****************************
*శీర్షిక:స్నేహ సుమం*


ఈ అనంతంలో ఆశలు ఆవిరైనపుడు
నేనున్నానంటూ నిశ్శబ్దన్గా వచ్చేవాడు
ఈ జగత్తులో భరోసా కరువైనపుడు
ఆసరా ఐ తోడుగా నిలిచేవాడు
నిన్ను ఏమీ ఆశించనివాడు
నిన్ను నిన్నుగా గౌరవించేవాడు మిత్రుడు

శూన్యమైన నీ హృదిని
విశాలం చేసి ఆనందం నింపేవాడు
నీవు నైరాశ్యంలో ఉన్నపుడు
నీలో ఆశలు నింపేవాడు
నీ దుఃఖపు దారిలోన
సంతోషపు తివాచీ పరిచేవాడు
జీవించాలని కోరికను కలిగించేవాడు
నిజమైన నీ ఆప్త మిత్రుడు

ఆగదు కాలం కరిగిపోతుంది
కానీ స్నేహ సుమం వాడిపోదు
సుమగంధ పరిమళమై వ్యాపిస్తుంది
విలువ కట్టలేని బంధం స్నేహబంధం


*పేరు:వనపర్తి గంగాధర్*
ఊరు:హన్మకొండ
తేదీ:01.08.2021
౧౪
[01/08, 8:55 pm] +91 90594 38068: స్నేహితుల దినోత్సవ సంధర్భంగా రాసిన కవిత

శీర్షిక: స్నేహితుడు 
...
మనిషికి జన్మనిచ్చిన అమ్మతో పేగుబంధం 
స్నేహితుడితో స్నేహబంధం 

స్నేహ బంధానికి 
మన కులంతో పనిలేదు 
మన ధనంతో పనిలేదు 
మన ఆస్తి ఆంతస్థులతో పనిలేదు 
మన హోదాతో చదువుతో పనిలేదు 

మనకు కష్టం కలగగానే వస్తాడు 
కష్టాన్ని తీరుస్తాడు 
ప్రతిఫలం కోరని నిస్వార్థం 
స్నేహితుడి కోసం 
ఎన్ని అవమానాలైనా  భరిస్తాడు 

మండే ఎండలో 
మలయమారుతం 
అతడొక శ్రావణమేఘం
అతడొక ఆపన్న హస్తం 
ఆతనిది అమృత హృదయం 
 ..
హామీ పత్రం 
ఈ కవిత నా స్వంత రచన 
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
కాజీపేట హన్మకొండ జిల్లా
౧౫
[01/08, 9:00 pm] Mekala Ramaswamy Poet: స్నేహం కోసం
**************
సంబంధాలలో 
సజీవంగా కొనసాగేది
అనుబంధాలలో 
అవ్యాజమై తులతూగేది
సహాయములో
సమాయాత్తమై ముందుండేది
సలహాలలో
ఉచితమై సొగసులీనేది
అపాయంలో
అమృతమై ప్రాణం నిలిపేది
ఎదుగుదలలో
వెన్నుతట్టి ప్రోత్సహించేది
కుంగుదలలో
నిస్వార్థ చేయూతనందించేది
ఒంటరితనంలో
జంటయై సేదతీర్చేది
భయపడు వేళలో
భరోసాయై తోడు నిలిచేది
ఆవేశ సమయంలో
శాంతి వచనాల మంత్రమయ్యేది
మానసికాందోళనలో
హితవచన శుశ్రూష చేసేది
ఆనందాల కేరింతలలో
హరివిల్లై వర్ణ రంజితమయ్యేది
నానా విధాల ఉపయుక్త స్నేహాన్ని
విస్మరించి విడనాడకండి
అమృతసంజీవియని
ఆస్వాదించి తరించండి
అందుకే విలువైనది స్నేహం
దాని విలువ అమూల్యం,,,,,
********************
మేకల రామస్వామి-చెన్నూర్
************************
స్నేహితుల దినోత్సవం సందర్భముగా
౧౬.

కవితగానం సీజన్ 2
అంశం.. స్నేహితుల దినోత్సవం 
శీర్షిక..స్నేహబంధం మధురం 

స్నేహమా! స్నేహమా! స్నేహమా!
బంధమా! బంధమా! బంధమా!
మన చిన్న అల్లర్లు నేస్తమా!
మరువలేము మరపురావు నేస్తమా!

పాఠాలు చెప్పుతుంటే మిత్రమా
క్లాసులోన మన గోల మిత్రమా
నీవెనుకనుండి నీకుతెలియకుండా 
నీ జుత్తులాగిన ఆరోజు మనస్నేహం 

సార్లచేత దెబ్బలుతింటూ నేస్తమా 
ఒకరినొకరు ఎక్కిరించుకుంటు నేస్తమా
కళ్ళనీళ్లుకార్చుకుంటు తుడుచుకుంటు
లాంగ్ కోసం ఎదురుచూసేమనస్నేహం

ఎంత గొప్పపదవికెళ్లినా మిత్రమా
నన్ను ఎన్నటికీ మరువవద్దు మిత్రమా
స్నేహాన్ని మరువకుండా వీడకుండా
కలకాలం అమృతభాంఢoలావుందాo

సృష్టిలో అందమైన ఈ స్నేహం
వజ్రాల కన్నా మెరుపైన ఈ స్నేహం
జీవనమాధుర్యమైన మన స్నేహం
శాశ్వతం కావాలి సుస్వరాలస్నేహం
స్నేహమే జీవితం స్నేహమే సౌందర్యం

హామీపత్రం
                 ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి
సోమశేఖర శర్మ, యానాం,8328079336
౧౭

తేది :01-08-21
అంశం :స్నేహం
శీర్షిక :చిరునామా 
**************************
నేను నిరాశల లోయలోకి జారుతున్నపుడు చేయి అందించి గెలుపు శిఖరం ఎక్కిస్తాడు
తన దుఃఖపు ఉప్పెనలను దాచి నాకు మాత్రం ఓదార్పు బహుమతులిస్తాడు...

పంచాలిసినవన్నీ పంచి ప్రాణాన్ని కూడా తెంచి బంధం చేసి నన్ను కాలం తోడిమలో పూయిస్తాడు
నేవదిలిన అన్నింటిని తనవి చేసుకొని ఆరాధిస్తాడు..

ఎవరూ లేని క్షణాల్ని కబుర్లు గంధంతో నింపి మైత్రి మరువమై
గుభాలిస్తాడు ఎడబాటును కూడా
తలపుల చినుకులతో తడిపి బతుకులో మధుర వనాలు మొలిపిస్తాడు...

ఏమీ ఆశించక మనకై శ్వాసించే మన ఆత్మ చంచరించే మరో దేహమే స్నేహం మన చిరునామా తన చిరునవ్వు లో దొరకడమే స్నేహం...
*****************-**********
ఆర్. వి. వి. రాజా, శృంగారాయునిపాలెం 9959492795. ఏనా కవిత ఇక దేనికిని అనుకరణ అనుసరణ కాదని హామీ ఇస్తున్నాను.
౧౮.
కవితాగానం(సీజన్ 2) 
తేది:-1-08-21
 
శీర్షిక: పవిత్ర స్నేహం

పేరు: అయ్యల సోమయాజుల ప్రసాద్
ఊరు: విశాఖపట్నం
చరవాణి: 9963265762

కులమతాలకు అతీతమైనది.
పేద-గొప్ప తారతమ్యం లేనిది.
నిష్కళంక నిరూపమానమైనది
అరమరికలు లేనిది
నీతి నిజాయితీలకు ప్రతీక
తల్లిదండ్రులకు,జీవితభాగస్వామికి కూడా చెప్పని విషయాలు ఆత్మీయ స్నేహితునితో పంచుకొనేది.
కృష్ణ- కుచేల స్నేహబంధం
రామ-సుగ్రీవుల మైత్రి
బాపు- రమణల ఆత్మీయ బంధం. అందుకే సృష్టిలో తీయనిది స్నేహబంధమేనోయ్ అన్నది అక్షర సత్యం. పవిత్ర స్నేహం పరమాత్మతత్వమే.....!!

హామీపత్రం: నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
౧౯

[01/08, 9:26 pm] +91 95422 36764: కవితా గానం సీజన్ 2
అంశం:స్నేహం
రచన: నాశబోయిన నరసింహ(నాన),
ఊరు:చిట్యాల,నల్గొండ, 
చరవాణి:9542236764.

*చెలిమి పరిమళం*
"""""""""""""""""""''"""""""
పరస్పర సహకార సమన్వయం నెయ్యం
మనీ సంబంధం కాని మైత్రి బంధం పదిలం
కరిగే కాలం కాదది తరగని సంపద స్నేహం
స్వచ్ఛమైన దోస్తికి చిరునామాగా నిలవాలి

కృష్ణ కుచేలుని స్నేహం సదా మార్గదర్శనం
మైత్రికి ఆర్థికాంతరాలు కాలేవు అడ్డుగోడలు
స్నేహం కోసం సోదరులపై పోరు చేసే కర్ణుడు
చెలిమి పరిమళంతో గుభాలించు గులాబీ

చెలిమి బలిమి లేకుంటే సరదాగా సాగదు జీవనం
స్వలాభాపేక్ష లేని స్వచ్ఛమైన సుగుణాల రాశి
ఎండకు నీడై వానకు గొడుగై 
చలిపులికి మంటై చేదోడు వాదోడై 
వెన్నంటి వుండే రక్షణ కవచం గాఢమైన నేస్తం

మదిలో విత్తిన స్నేహ బీజం                                                       ఇంతింతై ఆకాశమంత ఆనంద వృక్షమగు
ఆపద్బాంధవ సుమాలు వికసించే మైత్రి వనం
స్నేహ పూర్వక హృదయం మధురాతి మధురం

(అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో)

*హామీ పత్రం:* ఈ కవిత నా స్వీయ రచన. దేనికీ అనువాదం, అనుసరణ కాదనీ హామీ ఇస్తున్నాను.
✍️ *నాన*
౨౦
[01/08, 9:28 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం (సీజన్ 2).       1--8--2021.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- స్నేహితుల దినోత్సవం.

1. తే.గీ.
ఎనిమిదవ నెలలోన వచ్చేను మొదటి
ఆదివారము నాడు స్నేహ దిన యుత్స
వంబు, జరుగును ప్రతి వత్సరంబు కూడ
హితులు కలసి శుభాకాంక్షలిడుచు నుంద్రు.

2. తే.గీ.
గుణమె ముఖ్యము స్నేహమున్ కులములేదు
మమత ముఖ్యము చెలిమికి మతము లేదు
భావమొక్కటె చెలిమికి భాష లేదు
చెలిమి కన్నను మించిన కలిమి లేదు.

3. తే.గీ.
బంధములను గొప్పది స్నేహ బంధమౌను
కష్టములు వచ్చిన పిలువకనె మనలను
నాదుకొను వాడె నిజమైన నాప్తహితుడు
వెన్ను తట్టి నిలుచువాడె వెలయు హితుడు.

4. తే.గీ.
ఉల్లమందలి భావన లొకటిగాను
కలసినట్టి  స్నేహము కలకాలముండు
ప్రాణముల్ పణముగ పెట్టువాని చెలిమి
మట్టిలో కలియు వరకు మాసిపోదు.
*************************************
౨౧
[01/08, 9:28 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:01-08-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: స్నేహితుల దినోత్సవం
 శీర్షిక:స్నేహం
*****************
మెరుపులా ఎప్పుడు జనిస్తుందో తెలియదు
మరుపన్నది లేకుండా మనసును ఆక్రమిస్తుంది!

ఏ సమయంలో ఒకరినొకరు కలుస్తుందో అంతుపట్టదు
జీవితాంతం నీడలా వెంట నడుస్తుంది!

ఎందుకు చేతిలో చేయి వేస్తుందో అర్థం కాదు!
కంటనీరు ఒలకకుండా కాపలా ఉంటుంది!

ఎందుకిలా  లతలా పెనవేసుకుంటుందో చెప్పడమే రాదు
జీవన వృక్షానికెప్పుడూ వసంతాన్ని ప్రసాదిస్తుంది!

ఏమిటీ స్తబ్దత అనుకున్న క్షణంలోనే
చైతన్య పవనమై ఉత్తేజం కలిగిస్తుంది!

ఎందుకీ జీవితమనే నిరాశా నిస్పృహలలో
భవిష్యత్తుపై ఆశల హరివిల్లై విరుస్తుంది...

ఇంత గొప్ప బంధాన్ని మించి ఇలలో ఏమైనా ఉందా
అమ్మ నాన్న గురువుల సమ్మిళితం కదా స్నేహం!

కడలిని అలల్లా విడవనిదీ
చంద్రుని వెన్నెలంతా చల్లనిదీ
రవికిరణపు చైతన్య రూపమదీ

తరతరాలుగా జపిస్తున్న మంత్రమదీ
రెండక్షరాలలో ఒదిగిన అనంతమదీ
మనలో ప్రవహించాల్సిన జీవనదీ..

కృష్ణ కుచేలురా
కర్ణ సుయోధనులా
చరిత్రలో అజరామరమైనది కదా స్నేహం...

 *వురిమళ్ల సునంద,, ఖమ్మం*

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...