Skip to main content

కస్తూర్బా గాంధీ

సమూహ నిర్వహణః
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం
శివునూరి లలితా కృష్ణ
సహకారం
మెరుగు మధు
అవధాని
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
**************
List of poets
1.డా.రామక కృష్ణ మూర్తి గారు
2.ఇంద్రవత్ రాహుల్ గారు
3.అనుముల తేజస్విని గారు
4.నీలా రంగనాధం గారు
5కోరాడ గారు
6.విజయ దుర్గ గారు
7.బల్లూరి ఉమాదేవి గారు
8.మహేందర్ జవ్వాజి గారు
9.మర్రి జయశ్రీ గారు
10.వురిమళ్ళ సునంద గారు
11. విల్లాలు విజయలక్ష్మి గారు
12.వేంకట కృష్ణ ప్రగడ గారు
13.సర్ఫరాజ్ అన్వర్ గారు
14.కాల్వ రాజయ్య గారు
*****************
1
పేరు:డా.రామక కృష్ణమూర్తి
అంశం:కస్తూరిబాయి గాంధీ
తేది:16-4-2020
శీర్షిక:సతి
**************************

సంప్రదాయ కుటుంబంలో పుట్టిన తాను
సంవత్సరం చిన్నవాడైన గాంధీజీని‌ మనువాడింది
పెళ్ళంటే ఏమిటో తెలియని
వయసులో సహధర్మచారిణి అయ్యింది
అతనితో కలిసి జీవుతంలో
ఎత్తుపల్లాలెన్నో చవిచూసింది
నిర్భంధాలను ఎదుర్కొని
విద్యతో వికసించింది
తోడూ నీడై మహాత్ముని వెంట
ఉద్యమాల్లో పాల్గొంది
సేవ,ప్రార్థనలతో కర్తవ్యనిర్వహణ ప్రేమతో చేసింది
ఆశ్రమాల్లో అనాథలకు అమ్మై సేవలందించింది
భార్యగా భర్త అడుగుజాడల్లో
చివరివరకు సాగింది
స్వాతంత్ర్యోద్యమ పోరాటాల్లో
తన పాత్ర సమర్థవంతంగా నిర్వహించింది
తోటి స్త్రీలకు చదవడం,వ్రాయడం,శుభ్రతలను నేర్పింది
తన సంతానాన్ని బంధంతో పెనవేసుకున్నది
ఆరోగ్యం సహకరించకపోయినా
సేవచేయడం మానలేదు
సాధ్విగా,సేవా మాయిగా
అంకితభావం చూపింది
బంధమై,అనుబంధమై,కర్తవ్యమై
జన్మ సార్థక్య మొనరించుకుంది
గాంధీజీ సహజ నిరాడంబరతలో
కమలమై వికసించింది
స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో
మహిళామణియై నిలిచిపోయింది.

 ★★★★★★★★★★★★

2
*అంశం*: కస్తూర్బ గాంధీ
*రచన తేది* : 16/04/2020


 వీర మాత యుద్ధంలో నీకు ఎవరు సాటి లేరు...
పౌరుషంలో ఉజ్వల మాతవు..
ఆడపిల్లల చదువుకోసం నువ్వు చేసిన సమరం మరువలేనిది...
మహిళా అంటే అబల కాదు సబల అని నిరూపించావ్..
మగవారితో సమానం అన్నావ్
 జాతి, మతం అనే బేధం లేకుండా పోరు సాగించావు..
భర్త విదేశీ చదువు కోసం గొప్ప బంగారు లాంటి త్యాగం చేసావ్
తల్లిగా పిల్లల విద్యా అందించడానికి తపన చేసావ్..
భారతీయుల హక్కుల కోసం సత్యగ్రహం సాగించావు...
భారత జాతియోద్యమాంలో పోరాడి నా వీర మాత...
క్విట్ ఇండియా ఉద్యమంలో అత్యంత పాత్ర పోషించావు
ఓ వీర మాత నీకు నా జోహార్లు జోహార్లు... వందనాలు...


ధన్యవాదములు.. 🙏🙏



   🎯  *కవి పరిచయం* 🎯
*************************

పేరు : ఇంద్రవత్ రాహుల్
ఊరు : మల్కాపూర్
జిల్లా : ఇందూర్ /నిజామాబాదు
మండలం : ఇందూర్ /నిజామాబాదు
చరవాణి : *9848054079*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
3
 అంశం:కస్తూరిభా గాంధీ
రచన తేదీ:16/4/2020
శీర్షిక:మార్గదర్శి

నీవే మార్గదర్శివి
ఆడపిల్లల పట్ల ఆపన్న హస్తానివి
దీరుడికి తోడు దీరురాలివైనవు
పసితనంలో బంధం ఏర్పడిన
నీ ఉనికిని కోల్పోలేదు
దేశదౌర్భాగ్యాన్ని వేదలగొట్టడానికి
నీ వంతుగా పోరాడవు
కుటుంబంలో నీవే ఆధారివై
పిల్లల జీవితాలను తీర్చిదిద్దావు
నీ బంధానికి విలువనిచ్చి
స్వాతంత్ర్య పోరాటంలో సమీధలా వెలిగావు
సమరశంఖం పూరించావు
ఆడపిల్లలకు ఆశ్రమాలు ఏర్పాటుచేశావు
నీ పేరుతో చదువు
నీ పేరుతో నీడ
నీ పేరుతో జీవితాన్ని చూపించావు
అందుకే నీవే మార్గదర్శివి......

అనుముల తేజస్విని
తేజస్
నర్సంపేట
వరంగల్ గ్రామీణ.

4
కలం పేరు: నీలా రంగనాధం
తేది: 16/4/2020
అంశం: కస్తూర్బా గాంధీ
గాంధికి సహచరివై ఘనత సాధించావు..
తోడు నీడగ మారి మనసు గమనించావు..
చిన్న తనపు చెలిమి పెరిగి పెద్దైనాను తగిన సాయమునిచ్చి సాధ్విగా అయ్యావు..!
స్త్రీల కష్టాలను ఎరిగిన దానివై చేయూతనిచ్చావు ..!
ఇంటి పట్టున వుండి సర్వ విషయాలను ఏకసంథాగ్రాహివై తెలుసుకున్నావు..!
సహధర్మ చారిణిగ నీ శ్రమను గుర్తించి  మహాత్ముడే నీకు సలాంను చేశాడు..!
కస్తూర్బా గాంధీ నీ సేవకు చేస్తున్నాం వందనం..!
అందుకో మా అభివందనం..!!!!
🌹 *నీలా రంగనాధం* 🌹

5
 స్ఫూర్తి ప్రదాత *
   *************
మాట వినని భార్య
భర్తకు శాపమే...!
యిది ఎన్నో జీవి తా లలో...నిజమే...అనిపించినా.,
ప్రతి భర్త విజయం వెనుకా ...ఆ భార్య ప్రోత్సాహం ఉండి తీరుతుంది !అన్నది కూడా అక్షర సత్య మే...కదూ !
కస్తూర్బాను...భార్య
గాపొందటం ...గాంధీజీ  అదృష్టం !!
తనకంటేకాస్తపెద్దదే  ఐనా...పెద్దలుకుదిర్చి నవివాహాలుపూర్ణత్వాన్ని సిద్దిoప జే సు కో గలవని గాంధీ
కస్తూర్బా దంపతులు రుజువు చేశారు !
కుటుంబము కన్నా...
దేశ మే ముఖ్యమైన
గాంధీజీ ఆశయాలకు  అడ్డుతగలక ,ఇంటిని
సమర్ధంగ నడిపిన...
సమర్ధురాలీ ధర్మ పత్ని...!
భర్త అడుగు జాడల లో ...జనజాగృతికై
శక్తి వంచన లేక...కృ షి సలిపిన నారీ శిరో  మణి !
స్వాతంత్ర్య,సంస్కరణోద్యమాలలో...చురుకుగా పాల్గొన్న స హ ధర్మ చారిణి !!
సాంప్ర దాయ కత కూ...నవీనతకూ
రెంటికీ విలువ నిచ్చి
మూడాఛారాలను నిరసించి శ్రమించిన కస్తూర్బా మాతా...!
నీవీ నారీ లోకానికి
స్ఫూర్తి ప్రదాతవు!!
నీ కివే......మా వందనములమ్మా!
*****************
........కోరాడ.
6
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : కస్తూర్బా గాంధీ
కవితా సంఖ్య: 06
తేదీ: 17/04/20

కాలమెంత కఠినమైన
కష్టాలు,సమస్యలు కన్నీళ్ళలో
దేవులాడినా
కర్తవ్య దీక్షకై సలిపిన పోరాటమే
ఆమె ప్రతి అడుగు....!!

అక్షరం ఆలింగనం చేసుకోకున్నా
ఆత్మాభిమానం కొంగులో
ముడులేస్తూ
తల్లిగా,భార్యగా,మహిళగా
ఆత్మవిశ్వాసం తో అడుగేసిన పడతి....!!

భర్త అడుగుజాడల్లోనే
తన జీవన కొమ్మలను విస్తరింపచేసి
ప్రతి పోరాటానికి తానొక సమిధగ
వెలిగిన స్పూర్తి కిరణం....!!

మహిళా చైతన్యాన్నానికి
ఆజ్యం పోసి
నాయకురాలై నడిపించిన
ధీరవనిత
కబళిస్తున్న రోగాన్ని తొక్కేస్తూ
ఆఖరి బొట్టు వరకు దేశం కై
పాటుపడిన గాంధీజీ సతీమణి
మహిళా ఊపిరి....!!


                                🌹వినీల🌹
7
డా.బల్లూరి ఉమాదేవి
శీర్షిక : కస్తూరిబా గాంధీ

1ఆ.వె:పోరుబంద రందు పుట్టె కస్తూరిబా
      జాతి పిత కు తాను జాయ యయ్యె
     వయసు పైన పడిన వగవక భర్తతో
       సమర మందు తాను సహకరించె.

2ఆ.వె:ఆశ్రమముల యందు నమ్మగా తామారి
      యందజేసి సేవ యార్తులకును
    నుద్యమముల యందు నుత్సుకతను చూపి
      యడుగు ముందుకేసె నవని యందు.

3ఆ.వె: వీర పత్ని తాను వీరమాత యునయ్యె
         స్త్రీల చదువు కొరకు చేసె పోరు
      భర్త చదువు కొరకు బంగారమేయమ్మి
     చాటె   నవని యందు  చదువు విలువ

4ఆ.వె: సహకరించె పతికి స్వాతంత్ర్యసమరాన
        జైలు శిక్ష లందె నడుపు లేక
        కార్యశీలి యున్న కస్తూరిబాయని
       ప్రస్తుతింప బడియె ప్రజల చేత.

5ఆ.వె: అరువదేళ్ళ కన్న నధికముగా తాను
       భర్త తోడ గడుపు భాగ్య మందె
       సాటిలేని యట్టి  మేటి మహిళటంచు
       పొగడి రెల్ల జనులు పుడమి యందు
8
మహేందర్ జవ్వాజి
అంశం.కస్తూర్బాగాందీ
తేదీ.17.4.2020
___________________________________
మహిళలను ఏకతాటిపైకి తెచ్చిన మహనీయురాలు
తల్లిగా, చెల్లి గా,భార్య గా ఖ్యాతిని గాంచి కదిలిన కావ్య జగతి ఆమె..

యాభయారు తెలుగక్షరాలను తన చైతన్య భాసటగా ముందు సాగిన అక్షర ఆలింగనం తను.


అటు భర్త అడుగులో అడుగులు వేస్తు..మహిళలను చైతన్య ముగ్దుల్నీ చేసిన తేజోరూపం.

తనలోని చివరి రక్త బొట్టు దేశం కోసం అర్పిస్తాననీ ముందు నడిచిన నాయకురాలు
9
మర్రి జయశ్రీ
అంశం.కస్తూర్భాగాంధీ

పోరు బందరులో  గుభాళించిన కస్తూరి పరిమళం
ఏమి ఎరుగని పసితనములో వివాహం
భర్త అడుగులో అడుగై
జీవనయాం సాగించిన గొప్ప ఇల్లాలు
అక్షర జ్ఞానం లేకపోయినా
మహాత్మాగాంధీ ప్రేరణతో
భారత స్వాతంత్రోద్యమ ములో పాల్గొన్న ధీరవనిత
భారత రాజకీయ కార్యకర్త
దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుల పోరాటంలోను
నిర్బంధాలను ఎదుర్కొని
జైలు జీవితం గడిపిన ధీశాలి
భర్తగా తనపై అధికారం చేలాయించినా
పుట్టింటి వారిచ్చిన నగలను
భర్త ఉన్నత చదువులకు అమ్మిన త్యాగమూర్తి
సత్యాగ్రహ ఉద్యమంలో
మొదటి సత్యాగ్రహ నాయకురాలు
పూనే లోని  ఆగాఖాన్ ప్యాలెస్ లో నిర్బంధముండి
బడికి వెల్లడం తీరని కోరికగా మిగిలిందని
ప్యాలెస్ ను పాఠశాలగా మార్చిన అక్షర పిపాసి
ఆడవాళ్ళు బయటకు రాకుండా ఆంక్షలు
సంప్రదాయ చట్రంలో ఉన్న వారిని జాగృతి చేసి
స్వాతంత్రోద్యమ పోరాటానికి కార్యోన్ముఖులను చేసిన సాహస వనిత
అనారోగ్యం బాధిస్తున్నా
తన తుదిశ్వాస వరకు దేశం కోసం సేవ చేసిన పుణ్యమూర్తి
భర్త అడుగుజాడలను అనుసరిస్తూ
మహాత్మాగాంధీ సతీమణి గా
జీవితాన్ని సార్థకం చేసుకున్న మహాసాద్వి
నేటి కస్తూర్భాగాంధీ పాఠశాలలు
ఆమె పై గౌరవానికి నిదర్శం
ఆమె జీవితం స్త్రీ జాతికి స్ఫూర్తి దాయకం.
10
తేదీ::17-04-2020
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:: కస్తూరిబా గాంధీ
శీర్షిక:::
::::;;:::::;:;:::::::::::::::::::::::::
తెలిసీ తెలియని వయసులో
తోడుగా వచ్చిన సతి ఆమె!

అర్థనారీశ్వర తత్వమై పతి
అడుగు జాడలలో నడిచిన పత్ని!
అడగకుండానే అవసరాలను గుర్తించి
అమ్మలా అవతారమెత్తిన   భోజ్యేషు మాత!

స్వాతంత్ర్య సమరంలో సహచరిగా నిలిచి
సలహాలిచ్చిన కరుణేషు మంత్రి!
ఉద్యమ బాధ్యతలు చేపట్టిన భర్తకు
శ్రమ కలిగించక
సంతానాన్ని చక్కదిద్దిన కార్యేషు దాసి!

ఆయువును క్షీణింప చేస్తున్న
అనారోగ్యాన్ని  లెక్క చేయకుండా
మహిళా చైతన్యం కోసం ప్రతి క్షణం తపించి
మూఢాచారాలు తొలగించేందుకు
అహరహం శ్రమించిన
మహిళా పోరాట స్ఫూర్తి
మమతల మణి దీపం కస్తూర్బా గాంధీ!

గాంధీజీ ఆశయాల ప్రతి రూపమై
నేటి కేజీబీవీ పాఠశాలలకు స్ఫూర్తియై
జీవితాన్ని అజరామరం చేసుకున్న మహా సాధ్వి కస్తూర్బా గాంధీ!]
11
 విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:*కస్తూరి బా*
--------**********--------

కరంచంద్ గాంధీ మహాత్ముడిగా.                      మారటంలో ఆమెపాత్ర ప్రముఖం
ధర్మపత్నిగా ఆమె త్యాగం అమోఘం
ఆమె ఓరిమి సేవాభావం ప్రశంశనీయం

గాంధీజీ బలాలను ప్రోత్సహిస్తూ
   బలహీనతలను గమనించి భరిస్తూ
  తన అడుగుజాడల్లో పయనిoచిన
 తొలి శిష్యురాలు ఆయన సహధర్మచారిణి

క్విట్ ఇండియాఉద్యమసమయాన
గాంధీకి జైలుకెళ్లినరోజుల్లో ప్రజల్లోఉత్తేజాన్ని నింపే ఉద్యమాన్ని నడిపిoచ ముందుకొచ్చిన వీరనారి
న్యుమోనియాతో బాధపడుతూ సంకెళ్లకు వెరవని ధీర

పెద్దచదువరి కాకున్నా భర్తమనసు చదివిన నారి                         .
భర్త చదువుకోసం తన నగలు అమ్మి విదేశాలకు వెళ్లేందుకు సమ్మతించిన దూరదృష్టిగల ఆధునిక వనిత సంఘబహిష్కరణకు గురైన సగటు ఇల్లాలు

చూపులకు సనాతనమైనా చేతల్లో నవీనమహిళ
స్వతంత్రంకై జైలుకెళ్లినా శిక్షాకాలాన్ని తన చదువుకు కేటాయించాలనుకున్న ముదిత
ప్రథమపుత్రుడికై ఆదేపనిగ పలవరించిన మాత

స్వతoత్రసిద్ధికి ముందే కన్నుమూసెను ఆ పోరాటమూర్తి
హరిజనోద్ధరణకు ఆమెసేవ ఓ స్ఫూర్తి
అరవైరెండేళ్లు గాoధీజీ జీవితభాగస్వామిగ వెలుగొందిన *భారత జాతిమాత*-
సార్థక నామధేయయై సుగంధాలను వెదజల్లిన *కస్తూరి భా*

 వల్లాల విజయలక్ష్మి,,ఆలేరు
12

వేంకట కృష్ణ ప్రగడ
విశాఖపట్నం
22.04.2020
అంశం : కస్తూరిబా గాంధీ


కపాడియాల సుసంపన్న కుటుంబం పుట్టిల్లు
పెళ్ళైన కొత్తలో భర్త ఆంక్షలు భరిస్తూ
కస్తూరి పేరుకు బా ( అమ్మ ) కలిపి ఆమే కస్తూరీబా

కట్టుబాట్లు కారణంగా అక్షరాలు రాక
చదువ పుస్తకం వద్దు కాగితం చాలన్న భర్త
ఆత్మాభిమానం నిలిచి గెలిచి పుస్తకం విడిచి

మొదటి స్వాతంత్ర్య పోరాటం భర్తపైనే
భర్త క్రమశిక్షణా రాహిత్యం వల్లనే
మొదటి బిడ్డ ప్రాణం పోయింది పురిటిలోనే

హిందూ ముస్లిం ఉమ్మడి ప్రార్ధనా మందిరం
అత్త పుత్లీబాయి సాంప్రదాయం ప్రణామి
ఉన్నత చదువు కోసం భర్త ఇంగ్లాండ్ ప్రయాణం

బనియా సమాజం ఆ కుటుంబం వెలివేతకు కారణం
అప్పు కూడా దొరకని కుంటుపడ్డ ఇంటి ఆర్ధిక పరిస్థితి
నగలమ్మి భర్తని చదువుకు పై దేశాలకు పంపిన వనిత

నలుపు తెలుపు కాక బ్రౌన్ కారణం బౌన్స్కూల్ దూరం
గ్రుహ విద్యకూ దూరమై తనలా నిరక్షరాశ్యులైన పిల్లలు
ఇల్లు విడిచి దూరమై మనోవేదన మిగిల్చిన పెద్దకొడుకు

కష్టాలకు కుంగని పరిస్థితులకు లొంగని గుండె
క్రిస్టియన్ పద్ధతిలో వివాహ తీర్మానం వ్యతిరేకిస్తూ
దక్షిణ ఆఫ్రికాలో మొదటి మహిళా సత్యాగ్రహంలో
మారిట్జ్‌బర్గ్ జైలులో సత్యాగ్రాహిగా మొదటి మహిళ

సహాయ నిరాకరణ ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా
మొత్తంగా అరు సార్లు జైలులో భర్త అడుగు జాడలలో
చివరిగా 18 నెలలు పూనా ఆగాఖాన్ ప్యాలస్ లో నిర్భంధంలో బడికి వెళ్ళి చదువలేదు అనే
తీరని కోరికతో విడిచిన ఆఖరి ఊపిరి ...


                          ... ✍ "కృష్ణ"  కలం
13

🌸 *కవితాగానం...*🌸

అంశం.  : కస్తూర్బా గాంధీ
తేది.      : 23.04.2020
కవిపేరు : సర్ఫరాజ్ అన్వర్

🌸 *మహాత్ముడి హృదయ దస్తూరీ..*🌸

మహాత్ముడి అడుగుజాడల్లో నడిచి
ఎల్లవేళలా ఆయనకు తోడునీడై నిలిచి
వెలుగునీడల్లో వెన్నెముకై నిలబడి
స్వాతంత్రోద్యమంలో ఉత్తుంగతరంగమై కదిలిందా స్వేచ్చా పిపాసి..

బ్రిటీష్ వారికి వెరువక మహాత్ముడి *ఉద్యమాలకు ఊపిరియై* నిలిచి అతను అరెస్టుయై జైలుకెళ్లినా ప్రతిసారి  పోరాటంలో ఉత్సాహం నింపిన చైతన్య సిరి..

సబర్మతి ఆశ్రమంలో చిగురించిన ఈ *స్వేచ్చాచామంతి* స్వతంత్ర సౌగంధాల్ని
వెదజల్లి మహిళలందరికి ఆదర్శంగా నిలిచి
పోరాటపథంలో నడిచిన ధీశాలి..

గాంధీజీ నిర్బధంలో ఉండి నిర్బల
పరిస్థితుల్లో చిక్కుకున్నపుడు దుర్బలతను
పారద్రోలి ఆయన ఆశయసాధనకు
ఆలంబనగా నిలిచిన పోరాట స్ఫూర్తి

*మహాత్ముడి అహింసావనంలో*
పూసిన *నిర్మల ప్రశాంత పుష్పం*
ఆ మహనీయుడి *సత్యపూదోటలో*
చిగుర్లు తొడిగిన చిరుమొగ్గ..

గాంధీజీ ఆరాధన మంజరి
నాటి స్వాతంత్రోద్యమ లహరి
మహాత్ముడి జీవన సహచరి
ఆయన అందమైన *హృదయ దస్తూరి*..

*కస్తూరీబా  గాంధీ..*

*సర్ఫరాజ్ అన్వర్..*✍🏻
14

కవితా గానం

కవి పేరు:కాల్వ రాజయ్య

కవితా శీర్షిక:కస్తూర్భా గాంధి

.
.1ఆటవెలది

స్త్రీలు చదువు కుంటె చింతయుండదనియు
బడుల నెన్నొ తెరిచె బాగుగాను
విద్య  బుద్ధు లన్ని వివరంగ నేర్పియు
మార్పు దెచ్చె బాయి మహిళ లందు
 2 ఆ వె
అమ్మ తాను యయ్యి నాశ్రమ మందున
కన్న బిడ్డ లోలె కలుపు కొనియు
పోరు జేయు మంటు వీరపురుషులను
బానిసత్వ ములను బాపు మనెను

3 ఆ వె
గాంధి జేయు పనుల గౌరవించిన సతి
వెన్ను దండ గుండి వెళ్ళు మనుచు
శాంతి మార్గమునకు కాంతి రూపములయ్యి
దేశ సేవ కొరకు తేజరిల్లె
.


Comments

  1. స్త్రీ సహనం,సేవలను తెలుసుకొనే అవకాశం కలిగింది ఈ అంశం ద్వారా.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...