Skip to main content

అహింస


సమూహం నిర్వహణ ః వీరా గుడిపల్లి
The mathematics teacher and poet

సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ
అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం ః మెరుగు మధు గారు
****************************
కవివరుల జాబితా
1.కోరాడ గారు
2.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
3.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
4.పాల్వంచ హరికిషన్ గారు
5.సునంద వురిమిళ్ళ గారు
6.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
7.డా.బండారి సుజాతా శేఖర్ గారు
8.కందూరి సుజాతా గౌడ్ గారు
9.సునంద వురిమళ్ళ గారు
10.ఇంద్రవత్ రాహుల్ గారు
11.కోరాడ నరసింహా రావు గారు
12.విజయ దుర్గ గారు
13.వల్లాల విజయ లక్ష్మి
*************************

1
కోరాడ నరసింహా
రావు.,"అహింసా
        పరమో ధర్మః"
      *************
హింస పసులక్షణ మోయ్.,హింసించటం...హింసింపబడటం...రెండూ త ప్పే!
ఓయ్  మానవా  !
నీవీ హింసావిధా నాన్ని  మానవా !?
ఒక చెంప కొడితే ...
రెండో చెంప చూప మన్న  గాంధీ రోజు లుకావోయ్యివి...!
దయా,దాక్షిణ్యం వెదికినా కానరాని కసాయి రోజులు !
గాంధీజీ అహింస వ్యక్తిగతానికే గానీ సమాజ హితానికి  ఈ రోజుల్లో..... పనికిరావోయ్  !
సమాజ హితం  కోసం ప్రతి హింస చేయవలసి  వచ్చి నపుడు చేతులు ముడుచుకు కూచోవటమే  పెద్ద హింస! ఆత్మ హింస!!
దేహహింసకన్నా ఇది
యింకా... హేయ మైనది!
వంద మంది చుట్టు ముట్టి...మానవత్వాన్ని మచ్చు కైనా చూపించక కొట్టి కొట్టి
చంపినపుడు...న్యాయం కళ్ళు మూసు కుంటే...చట్టం ఉదా సీనంగా  చూస్తుంటే
ఎవరికి వారు...అంద రూ...మనకెందుకులే అనుకుంటే .,
అన్యాయం రాజ్య మేలదా...!?
అధర్మము పెచ్చరిల్ల
దా...?!
కనీసం సంబంధిత వ్యక్తియో,వర్గమో...
అక్కడజరిగిన అన్యా
యానికి తగిన శాస్తి జరుప వద్దా !
సమాజ హితం కోసం జరిపే హింసాయినా
అదే హింసను నిరోధించే  నిజమైన అహింస...!
సామాజిక అహింస వర్ధిల్లును గాక...!!
****************
........కోరాడ.
2
**అహింస     ✍️డా.పాండాల

శాంతి దీక్షల తాతగా
జాతీయోధ్యమనేతగా
బోసి నవ్వులమోముతో
కోట్ల కాంతులరేడుగా
చెడు వినవద్దు చెడు మాట్లాడొద్దు
చూడొద్దంటూ
ధర్మంగా కర్మల సాక్షిగా
దండైన శక్తులున్న పోరు బందరు బిడ్డ

ఆ పోరాటస్ఫూర్తియే
అఖిలభారతావని బిడ్డలకు
స్వేచ్ఛా ఫలాలనిచ్చింది
ఆంగ్లేయులను ఇంగ్లాండు తరిమింది
గుజరాతు గుణనిధిగా
కులవర్ణ సంకీర్ణ సంకెళ్ళను
తెగనర్కిన తేజో సత్యమూర్తి..!

శాంతి అహింసలనే ఆయుధాలే
గాంధీ తత్త్వంగా ప్రపంచశాంతి మూలనిధిగా
త్యాగాల కర్మఫలమంతా
సంఘ శ్రేయమన్న
సంస్కార మనస్కులు ...!
మన జాతిపితను
గుండెల్లో దాచి వారి అహింసనే పరమోధర్మంగా ముందుకెళితే ఎవరికైనా ఎపుడైనా
విజయాలు ముంగటికొస్తాయి
అపజయం ఆమడదూరం లో ఉంటుంది..
కావున అహింసే
జగతిలో ఆచరించే
అత్యుత్తమ సంపద...!

✍️డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి

3
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు

అహింస పరమోధర్మః అన్న దాన్ని ఆచరణలో ,ఆచరణాత్మకంగా
ఆచరించిన వ్యక్తి సంఘటిత శక్తి
జాతిపిత మహాత్మాగాంధీ
హింసా మార్గం ద్వారా తాత్కాలిక
పరిష్కారం లభించవచ్చుగాని
శాశ్వత పరిష్కారం చేకూరదు
స్వతంత్రం అహింసా మార్గంద్వారా
సాధించిన మహోన్నతమైన శక్తి
శాంతియుత మార్గంలో,రక్తపు మరకలు లేకుండా ధర్మంగా విజయం సాధించిన  నేత
శాంతి మంత్రంద్వారా జాతీయత ఐక్యతను చాటారు
కోపాన్ని అదుపులో‌పెట్టుకుని శాంతి
యుతంగా మౌనపోరాటంద్వారా
నిదర్శనలు దీక్షలు ద్వారా పోరాడి
శాంతి సహనం సత్యశీలత గల‌మామ్యడు
అహింస మార్గాన నడవండి
హింస మార్గాన్ని  వీడండి

సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
4

శీర్షిక:  మనుషుల తీరు..!

తప్పును నిలదీయరు కానీ
నిలదీసే వారు లేరంటారు
లంచమివ్వడం మానరు కానీ
నిరోధించేవారు లేరంటారు
సమస్యలు పట్టించుకోరు కానీ
పరిష్కరించేవారు లేరంటారు
అబద్ధాలు చెప్పడం మానరు కానీ
నిజం చెప్పేవారు లేరంటారు
ఓటుకి నోటిస్తే  వద్దనరు కానీ
దానిని ఆపేవారు లేరంటారు
మంచిని  ఆచరించరు కానీ
చెపితే వినేవారు లేరంటారు
కలుషితం చేయకుండా ఉండరు కానీ
పర్యావరణం కాపాడేవారు లేరంటారు
వృధా చేయకుండా ఉండలేరు కానీ
నీటిని పొదుపుగా వాడేవారు లేరంటారు
నోటాకన్నా ఓటు వేయరు కానీ
ఎన్నికలలో మంచి నాయకులు లేరంటారు
ఒకరు చెబితే వినరు కానీ
చెప్పింది ఎవరూ వినరంటారు
జరుగుతున్న దానిపై ఆలోచించరు కానీ
తామనుకుంది జరుగుతలేదంటారు
హింసకు ప్రతిహింస వద్దంటారు కానీ
అహింస మార్గాన్నెవరూ పాటించరు
వినాశకాలే విపరీత బుధ్ధి అంటారు కానీ
అందుకు తామూ బాద్యులంటే ఒప్పరు
ఇదే నేటి మనుషుల.. తీరు..!
యధా రాజా.. తథా ప్రజా.. నారు..!!

    --✍️పాల్వంచ హరికిషన్
            రామన్నపేట
            9502451780
5

పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:: అహింస
*******************
అదిగో అతడే
భలే తాత మన బాపూజీ అంటూ
పిల్లలంతా ప్రేమగా పిలుచుకునే గాంధీ తాత!
చిన్ని పిలకా బోసి నవ్వులతో
దేహానికి చిన్నా కొల్లాయి కట్టుకుని
దేశ ప్రజల హృదయాన్ని గెలుచుకున్న  నేత
మహాత్మా గాంధీ తాత!

సత్యశోధనతో సంస్కరించుకునీ
సమాజానికి ఇచ్చిన విలువైన సందేశం
శాంతి  సహనం అహింసా మార్గం!

అహింసను ఆయుధంగా చేసుకొని
యుద్ధంలో గెలవొచ్చని నిరూపించిన బాపూజీ!
అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఆరాధ్యుడే!

తల్లి పుత్లీబాయి పెంపకంలో
మానవీయ విలువలు నేర్చుకుని
హరిశ్చంద్ర,శ్రవణ కుమారుడి  నాటకాలు చూసీ
 సత్యం అహింస గొప్ప తనం తెలుసుకున్న
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ!
సత్యం అహింసల రూపమైన
భారతీయుల జాతి పిత!
6
అంశం:అహింస
శీర్షిక: అహింసా పరమోధర్మః
**************************

శాంతిమార్గంలో తెలిపే నిరసన
దౌర్జన్యానికి‌ ప్రేమతో ఇచ్చే జవాబు
హింసకు ప్రతిహింస చేయకుండుట
ప్రాచీన భారతీయ సనాతన ధర్మమది
సృష్టిలోని సర్వజీవులకు వర్తించేది
బుద్ధుడు బోధించిన శాంతిమార్గం
జైనుడు అనుసరించిన జీవన విధానం
పంచమహావ్రతాల్లో మొదటిది
అశోకుడు తెలుసుకున్న నిజం
మానవకర్మల్లో ఉత్కృష్టం
మహావీరుని అనన్య సామాన్య అస్త్రం
మాటలు,చేతలు,ఆలోచనలు కూడా భాగాలే
ఋగ్వేద,యజుర్వేదాలు చాటిన గొప్పమంత్రాలు
పశుపక్ష్యాదుల పట్ల చూపవలసిన దయ
ఉపనిషత్తులు తెలిపిన సారం
సర్వభూతాలపై చూపవలసిన గొప్పగుణం
సత్యవచనం,ఆర్జవం,దానం,తపం,అహింసలు
మానవాళి అనుసరించాల్సిన మార్గాలు
శాకాహారమే దానికి అనుకూలం
ఎవరినీ హింసించకు అనే మానవత్వం
ఎవరినీ చంపకు అనే దైవత్వం
అహింసే అత్యుత్తమ ధర్మం
అహింసే గొప్పదైన స్వీయనియంత్రణం
అహింసే ఉత్తమమైన బహుమతి
అహింసే మంచిదైన ప్రయత్నం
అహింసే గొప్పదైన త్యాగం
అహింసే మంచి స్నేహితుడు
అహింసే గొప్పదైన ఆనందం
అహింసే గొప్పదైన సత్యం
అహింసే ఉత్తమమైన బోధన

7
[26/04, 7:38 PM] బండారు సుజాతా శేఖర్: శీర్షిక :అహింస
రచన :డాక్టర్ బండారు సుజాతశేఖర్
Dt 26-04-2020
"బాపూ మళ్ళీ పుట్టాలి "

మనిషి మనసే సంఘర్షణల
కొలిమిగా
నిత్యం సాగుతున్న అధిపత్యాల పోరు
కల్మష సంద్రాల సునామీల సృష్టిస్తూ
కలికాలం -న్యాయం ,ధర్మం అర్ధాల
మారుస్తూ ;తానే నాయకుడు అనుకుంటున్న మనసు
కుతంత్రాల తంత్రం తో
హింసాహింసల తేడా నెప్పుడో మరిచింది -
అఖండ భరతమాత శృంఖలాల విడిపించి ,రవికాంచని రాజ్యం మాదేనన్న అధిపతుల ఝులుమ్ నేలరాసిన -నీమార్గం అహింస .
ఏమూల ప్రపంచ ఏనోట విన్నా
అహింస సంకేతానివి నీవే .---
బాపూ నీవు చరితవు ,మా చరితల
ప్రధాతవు -
నిన్నను మరిచి ,నేటిని విడిచి
రేపటి వికట చేష్టలకు ఆజ్యమౌతున్న
అకృత్యాలు
అలజడులు
కులమత వర్గవైషమ్యాలు
అహింసో పరమో ధర్మ :అన్న
నినాదంతో  తొలగాలి
రేపటి సమతా శాంతుల నవ్య భారతానికి ఊపిరవ్వాలి .
మాదైవం ,ఆయుధం నీవే
బాపు అహింస మార్గమై -నీవు మళ్ళీ
పుట్టాలి -మా అహింసవై
బాపూ మళ్లీ పుట్టాలి .
బాపు మళ్ళీ పుట్టాలి "
-//-///-//::::::::::;;///--/:::n
[26/04, 7:43 PM] కందూరి సుజాత Poetess: కవితాగనం
8
అంశము... అహింస
శీర్షిక... హింసాగమనము🌲
 .................................
అహింస అష్టావధానమాయె నేడు -ద్వేషించే హింస అడుగడుగున -అవసరమాయె చూడు/
మొరాయించు అవయవాలకు-
హింసించు శస్త్రచికిత్సలు -
హంసతుల్యమాయే /

జన్మిస్తూ శిశువు,మాతనే  హింసిస్తాడు/ బోధిస్తూ గురువు,బడితె హింస -
పాటిస్తాడు /
అలంకరణకు ముక్కు చెవులకు  -
పోగుకుట్ల హింస /
ఆరోగ్యమునకు సూదిపోట్ల హింస /
అపరాధమెరుగని అందమాయ హింస/

కపటనాటకము వినాశనం /
సహాయకుడునని సంఘం గద్దెనెక్కి- తీయటి మాటలు నేర్చి -
సామాన్యుడి  వెన్నువిరిచి -
కత్తిపోట్లహింస చేసినా -
మత్తీడని  మాయాజాలమాయె/
తేనేపూసిన కత్తి,తియ్యనైన తీరులాయె/

అభివృద్ధి పరుగొచ్చి  అడవులను -
నరికేసి కాలుష్యాం  కానుకఇచ్చే/
నాగరికత మొలకెత్తి -
జానేడు వస్త్రాలు ధరించి  -
వరుసలు మార్చేసి బ్రతుకునే హింసించే/ ప్రకృతిగుడిలోంచి,కార్పోరేటర్ గుహల్లోకి పిల్లలాయె/
బట్టీల మంత్రములు బాల్యమును- హింసించే  /
కటకటా కనిపించని హింసలకు కాసుల- కుప్పలాయె/

అప్పుడప్పుడు వినిపించు-
అహింస అష్టావధానము ధార్మిక స్థలంకే పరిమితమాయె/
హింసాగమనము -
సమాజ పారంపర్యమాయే/

కందూరి సుజాత గౌడ్
9
పేరు::వురిమళ్ల సునంద, ఖమ్మం
శీర్షిక::  పరిమళించిన మానవత్వం
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;:;;;;;;
కరోనా హంతకీ.. మానవ భక్షకీ!
నిన్ను  కసిదీరా తిట్టాలని ఉంది!
కనిపిస్తే కాల్చి పారేయాలనీ వుంది!
....
మాయావివై ప్రతాపం చూపిస్తున్నావు!
ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావు!
ఇంట్లో బంధించి తమాషా చూస్తున్నావ్!

బతుకంతా చిందర వందర చేస్తూ
భవిష్యత్తుకు దారులు మూయాలని చూస్తున్న కరోనా!
అలనాడు  విర్రవీగిన అడవి రాజు
కోల్పోలేదా ప్రాణాన్ని
 చిన్న కుందేలు తెలివికి ..

కరోనా! నిన్ను చంపేందుకు
ప్రయోగాల కోసం ముందు కొస్తున్న
సాహసీకులను చూడు
రెక్కాడితే డొక్కాడని ప్రాణాలను
ముప్పు తిప్పలు పెట్టాలనుకునే  నీ కుట్రను
పరిమళించిన మానవత్వం
సేవలోఎలా గుబాళిస్తుందో చూడు!

 మా హృదయాలు పలికే  సమైక్యతా పొలికేకలు
నిన్నీ లోకంలోంచి తరిమేంత వరకు ఆగవు కరోనా..
ఇకనైనా మర్యాదగా వెళ్ళిపో.
10
*అంశం*:🌈 అహింస 🌈
26/04/2020


 ఓ మహాత్మా ఓ మహర్షి
 ఓ క్షమా పియూష వర్షి
 వందనం వందనం
 వేల వేల వందనాలు
 ఎక్కడయ్యా నీ అహింస
 ఏడ నీ కరుణ రీరంస
 దేశం కోసం పాటు పడి
 సర్వమానవ సమానత్వం
 సరే అది నీ మూలతత్వం
 అమానుష పైశాచికత్వం
 అదే ఎదురవుతున్న సత్యం
మతంను చూడలేదు చులకన
మతం మీద మక్కువ చేసావ్ జాగా
ఎందుకయ్యా ఈ మతాలు
అందుతాయా గత దినాలు
ఓ మహాత్మా అహింస అనే ఆయుధంను పట్టుపట్టి
అందరి చేత అహింసను
గరళం చేసావ్
ఈ జగతిలో నీకు ఎవరు సాటి లేరు..
నేటి యువతకు కావాలి అహింసమార్గం..
నీ బాటను అనుసరిస్తే అదే అందరికి జీవితపు బంగారు బాట అవుతుంది..
ఓ మహాత్మా ఇదే నీకు నా జోహార్లు..

   
   ధన్యవాదములు.. 🌹


*ఇంద్రవత్ రాహుల్*
      *ఇందూర్*
11
కోరాడ నరసింహా
రావు.,"అహింసా
        పరమో ధర్మః"
      *************
హింస పసులక్షణ మోయ్.,హింసించటం...హింసింపబడటం...రెండూ త ప్పే!
ఓయ్  మానవా  !
నీవీ హింసావిధా నాన్ని  మానవా !?
ఒక చెంప కొడితే ...
రెండో చెంప చూప మన్న  గాంధీ రోజు లుకావోయ్యివి...!
దయా,దాక్షిణ్యం వెదికినా కానరాని కసాయి రోజులు !
గాంధీజీ అహింస వ్యక్తిగతానికే గానీ సమాజ హితానికి  ఈ రోజుల్లో..... పనికిరావోయ్  !
సమాజ హితం  కోసం ప్రతి హింస చేయవలసి  వచ్చి నపుడు చేతులు ముడుచుకు కూచోవటమే  పెద్ద హింస! ఆత్మ హింస!!
దేహహింసకన్నా ఇది
యింకా... హేయ మైనది!
వంద మంది చుట్టు ముట్టి...మానవత్వాన్ని మచ్చు కైనా చూపించక కొట్టి కొట్టి
చంపినపుడు...న్యాయం కళ్ళు మూసు కుంటే...చట్టం ఉదా సీనంగా  చూస్తుంటే
ఎవరికి వారు...అంద రూ...మనకెందుకులే అనుకుంటే .,
అన్యాయం రాజ్య మేలదా...!?
అధర్మము పెచ్చరిల్ల
దా...?!
కనీసం సంబంధిత వ్యక్తియో,వర్గమో...
అక్కడజరిగిన అన్యా
యానికి తగిన శాస్తి జరుప వద్దా !
సమాజ హితం కోసం జరిపే హింసాయినా
అదే హింసను నిరోధించే  నిజమైన అహింస...!
సామాజిక అహింస వర్ధిల్లును గాక...!!
****************
........కోరాడ.
12.
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : అహింస
కవితా సంఖ్య: 09
తేదీ: 26/04/20

దొరతనాల జాగీరుతనాల
వేడిక్కిన రుధిరం
విప్లవ గీతమై పోటెక్కును....!!

చావో రేవో కదం తొక్కే అడుగులే
వెరవక ఆత్మత్యాగ పూలను
పరుచుకుంటూ
మరణాన్ని జయించు దేశభక్తి లో దివ్వెలు....!!

వేలప్రాణ దీపాలు ఆరినా
పొందలేని స్వాతంత్ర్యం
గాంధీ ఆలోచనల లో పురుడోసుకుని
అహింసా పరమోధర్మః గ
పారిన మానవతా సమూహం....!!

హింస బతుకును తుంచితే
అహింస ఊపిరి పోస్తూ
స్నేహమందిరాన్ని కట్టు సమర్ధురాలు
నడవాలి ఆ బాటలోనే సదా తొలిఅడుగు....!!

13
             శీర్షిక:**అహింసో పరమొధర్మః**

నిన్నుమించిన అహింసామూర్తి లేడు..మహాత్మా!
నీ ఆచరణను మించిన నిరంతరస్ఫూర్తి లేదు.. బాపు!

నీ జీవితమే ఆదర్శాల ఊట
నీ అహింసావిధానమే చక్కనిబాట
నీ ఆలోచనే వజ్రవైఢూర్యాల మూట
నీ ఆచరణే మానవసుగంధాల తోట

శక్తివంతుల ఆయుధాలు సత్యాగ్రహం అహింసే'అని మనస్ఫూర్తిగ నమ్మి
ఆత్మస్త్థెర్యం లేని పిరికివారే హింసకు పాల్పడుతారు'అనుకుని

జీవితాంతం ఆ సమర్థవంతమైన
ఆయుధాన్ని ధరించిన మహాత్మా!
నీ పవిత్రదారిలో నడిచేలా మము దీవించు
నీ అహింసాయుధాన్ని ధరించేలా మము నడిపించు

అహింస అంటే మారణాయుధాలు
ధరించకపోవటమే కాదు
అబద్ధాలు ఆడకపోవటం
ఎవరినీ దూషించకపోవటం
అని నమ్మిన ఆలోచనామూర్తీ!
అమూల్య సిద్ధాంతాలను జీవితాంతం కాపాడుకున్న కారుణ్య స్ఫూర్తీ!

మానేద్దాం మనస్ఫూర్తిగ హింసను
వదిలేద్దాం క్రూర ఆలోచనలను
అనుసరిద్దాం అహింసామార్గాన్ని
అనుభవిద్దాం అలౌకిక ఆనందాన్ని

::వల్లాల విజయలక్ష్మి,,ఆలేరు                   వినీల


Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...