సమూహ నిర్వహణః
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం
శివునూరి లలితా కృష్ణ
అవధాని
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం
మెరుగు మధు
*************
1 విజయ దుర్గ గారు
2.రామక కృష్ణ మూర్తి గారు
3.సునంద వురిమళ్ళ గారు
4.మర్రి జయశ్రీ గారు
5.దీపక్ న్యాతి గారు
6.కోరాడ గారు
7.గుండ్ల రాజు గారు
8.కాల్వ రాజయ్య గారు
9.విజయ లక్ష్మి గారు
10.డా.బల్లూరి ఉమాదేవి గారు
11.ఇంద్రవత్ రాహుల్ గారు
*****************
1
విజయదుర్గ
ఉప్పు సత్యాగ్రహం
తేదీ: 21/04/20
పరపీడనల దాష్టీకంతో
అల్లలాడిన భరతమాత
దాస్యశృంఖలాలలో
అసహనం రాజుకొని ఊపిరి
నింపిన విప్లవం....!!
ఎవడబ్బ సొమ్మనో
ఉప్పు పై పన్ను మోతతో
బ్రిటీష్ రాజ్యం
ఎళ్ళతరబడి పరాయిపాలనలో
నలిగిన భారతీయుల సంఘీభావమే
ఉప్పు సత్యాగ్రహం....!!
ఎక్కడ దౌర్జన్యం ఇనుపపాదాల
తొక్కను స్వైరవిహారం కై
రెక్కలు తొడుగునో
అక్కడే ప్రజల తిరుగుబాటు
ప్రాణం పోసుకొని తరిమికొట్టే
ఆయుధమై ఉరుకుతుంది.....!!
గాంధీజీ అడుగు జాడలు
అలుపెరగని ఉద్యమపాదాలు
ఒక్కతాటిపై దేశమంతా కలిపిన
ఉప్పుసత్యాగ్రహ పోరుబాటై
స్వాతంత్ర్యనికై ఆగక విజృంభించిన
మహాసంగ్రామం....!!
వినీల
2
అంశం:ఉప్పుసత్యాగ్రహం
శీర్షిక: దండియాత్ర
**************************
సంపూర్ణ స్వరాజ్యం కోసం సల్పిన మహోద్యమం
అహింసాయుక్త శాసనోల్లంఘన
ప్రజాపోరాటం
సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డిన
పెనువిప్లవం
బ్రిటిష్ అణచివేత విధానాలకు
వ్యతిరేకంగా మోగించిన పాంచజన్యం
అక్రమపన్నుల పెంపునకు నిరసనగా సాగిన సత్యాగ్రహం
సబర్మతి నుండి దండి వరకు సాగిన పాదయాత్రా చైతన్యం
దేశమంతా ఒక్కటై,రాజ్యపాలనపై
సాగించిన పవిత్రయుద్ధం
భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో
లిఖింపబడ్డ సువర్ణఘట్టం
జాతి ఐక్యతకు గాంధీమార్గంలో
జరిగిన శాంతిపర్వం
ఉప్పే నిప్పై,ఉప్పే ఉప్పెనై
ఉద్యమానికి ఊపిరులూదిన వైనం
స్వచ్ఛమైన,ధర్మమైన,
సాధుజనుల దీక్షావ్రతం
ఒక్కరు గాంధీ కోట్ల గొంతుల
సమర నినాదం
దుర్మార్గపాలనపై సామాన్యులు
చేసిన దండియాత్ర
స్వేచ్ఛావాయువులకు కదిలిన
ప్రజాగ్రహ వెల్లువ
గాంధీ-ఇర్విన్ సంధితో
విజయశంఖం పూరించి
భారతీయుల సత్యాగ్రహ పోరాటానికి
తలలు వంచిన రవి అస్తమించని
బ్రిటిష్ సామ్రాజ్యానికి పెనునిద్దుర వదిలించింది.
3
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:: ఉప్పు సత్యాగ్రహం
*********************
తలచుకున్నా కొద్దీ
జ్ఞాపకాల చెమ్మ చెలిమలా ఊరుతూనే ఉంది!
అరచేతిలో పట్టుకున్నప్పుడల్లా
లాఠీ దెబ్బలతో రక్తసిక్తమైన పిడికిలిలో
రుధిర వర్ణం పులుముకున్న ఉప్పు కణం.
సత్యాగ్రహం వీడని శాంతి పావురమై
కళ్ళముందు కదలాడుతుంటుంది!
చెట్టూ పుట్టాతో పాటు పశుపక్ష్యాదులను కొలిచిన
మన సంస్కృతి నేర్చుకున్న విలువలు..
మహాత్మా గాంధీ అడుగు జాడలే
ఉద్యమ వెలుగు బాటలవుతుంటే
సాగిన దండి సత్యాగ్రహం యాత్రలో
కాలినడకన బారులు తీరిన కార్యకర్తలు
చీమల దండోలే కనిపిస్తుంటే
బ్రిటిష్ పాలకుల గుండెల్లో
భయం అణుబాంబై పేలింది!
భారతీయులందరినీ
ఏకతాటిపై నడిపించిన గాంధీజీ తీరు
ముచ్చెమటలు పట్టించి
మూర్ఖంగా అణచాలని ప్రయత్నించిన
మహోద్యమమే ఉప్పు సత్యాగ్రహం!
మన దేశ చరిత్రలోనే
మరువరాని సమైక్యతా రాగం!
4
మర్రి జయశ్రీ
అంశం.ఉప్పు సత్యాగ్రహం
సామ్రాజ్యవాదానికి
అణచివేత విధానాలకు
పన్నుల పెంపుదలకు వ్యతిరేకంగా
మహాత్ముడు ఆరంభించిన ప్రచారోద్యమం
సంపూర్ణ స్వరాజ్యమే ధ్యేయంగా
సబర్మతి నుండి సాగిన
అహింసాత్మక శాసనోల్లంఘన ఉద్యమం
ఉప్పు పై పన్నుకు నిరాకరించి న ఒక మౌనగళం
అహింసాత్మక ప్రతిఘటన విజయాలలో ఒక పుష్ప మాలిక
అన్యాయం పై శాంతియుత పోరాటం
డెబ్బది ఎనిమిది అనుచర గనం తో
వందల మైళ్ళు సాగిన చైతన్యం
ఆంక్షలెన్ని విధించిన ఆంధ్రా దాకా
ఉధృతమై సాగిన మహోజ్వల ఉద్యమం
భారతీయులలో స్వాతంత్ర్య కాంక్ష రగిలించిన గాంధీ మార్గం
బ్రిటిష్ వారిలో వణుకు పుట్టించిన సత్యాగ్రహం
భారత చరితలో ఒక సువర్ణాధ్యాయం.
5
అంశం : ఉప్పుసత్యాగ్రహం
రుచి అంటే ముందుగా గుర్తొచ్చేది ఉప్పు
ఉప్పు ఎక్కువైతే రుచి విషం అవుతుంది అందుకే సముద్రపు నీరు రుచికి దూరంగా ఉంటుంది
నాలుగు దిక్కులు ఉన్న మనకు
మన భారతదేశం మూడు వైపులా
సముద్రపు జలాలే నిండుగా
అందులో ఉప్పు ఉంది మెండుగా
అంత సొంత వనరులు ఉండగా
ఉప్పు కొనడం దండగ
మన ఉప్పును మనకు అమ్మి
దండుకో చూశారు డబ్బును బ్రిటిష్ వారు
స్వభిమానం ఉన్న మనము చేసాము సత్యాగ్రహము
దేశ స్వతంత్రం కోసం చేసే విప్లవానికి
ఉప్పు సత్యాగ్రహం మంచి ఐక్యతను తెచ్చింది
మహాత్మాగాంధీ పథకము పాకింది
బ్రిటిష్ వాళ్ళ ముక్కుపిండి మెడలు వంచింది
విధిలేక తోక ముడిచారు బ్రిటిష్ పాలకులు
స్వాతంత్ర్య పోరాటం ఉప్పుసత్యాగ్రహం ప్రముఖమైన భూమికను పోషించింది మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చి ఇచ్చింది
రచన
డాక్టర్ దీపక్ న్యాతి
నంది అవార్డు గ్రహీత హైదరాబాద్
6.
ఉప్పుసత్యాగ్రహం
కోరాడ నరసింహా రావు.,
* ఉత్తమ మార్గం *
************
పాలకులు పన్నులతో
ప్రజలను వేధిస్తే ...
సహనం చచ్చిన ప్రజా చతన్య నాయ కత్వం ...సత్యాగ్రహమై విష్పోటనం చెం దుతుంది...!
పాద యాత్రలతో...
ప్ర కం ప నాలు సృ ష్టిస్తుంది !!
దేశసంపదనంతాదోచుకున్నా...ఇక్కడినుండిముడి సరకు నెంతో సంగ్రహించు కున్నా...అక్కడివస్తువులకు ఈ నేలను బజారుగామార్చుకుని లాభాలార్జిస్తున్నా
తీరని ఆ వలస సా మ్రాజ్యవాద దాహం
ఉప్పు పైనా పన్ను విధించింది !
భరించి-భరించి ఇక
సహించలేని ప్రజలకు నాయకత్వం వహించిన గాంధీజీ దీన్నిప్రతిఘటించాలన్న పిలుపు మేరకు
ప్రజాచైతన్యం వెల్లు వెత్తింది కదూ !
ఎందరెందరుఎన్నెన్ని లాఠీ దెబ్బలు తిన లేదూ !
జై ల్ల లోకి ఎందరో నెట్టబడ లేదూ !.
యిదంతా...కేవలంఉప్పు కోస మేనా !?
కాదు...కానే కాదు !
న్యాయమైనహక్కులు హరిస్తుంటే ...
చేతులుకట్టుకుకూచోవచ్చా...?!
గాంధీజీ చూపిన ఆ మార్గంలో ...శాంతి యుత నిరసనలతో సత్యాగ్రహాయుధాన్ని ధరించి సమరం చెయ్యటమే ఉత్తమం
అంతిమవిజయం ధర్మబద్ధమైన న్యాయమార్గ సత్యానిదే అని నిరూపించ బడ లేదూ...!!
ఆఖరికి...వాళ్ళఅన్యాయ,అధర్మ,నిరంకుశ,నియంతృత్వాలే వాళ్ళను ఈ నేల నుండి వెంట తగల్లేదూ !
ఇదీ...గాంధీజీ మన కు నేర్పిన మహోన్నత పరిష్కార మార్గం!!
ఇదే...ఆశయ సిద్ధికి
అత్యుత్తమ మార్గం !
****************
.......కోరాడ.
7
కవితా శీర్షిక : *ఉప్పు సత్యాగ్రహం*
వేష భాషలు
అలవాట్లు ఆచారాలు
కులాలు మతాలు
విభిన్న సంస్కృతీ నాగరికతలకు
ఆలవాలమని పేరుగాంచిన
నా భారతజాతి ఐక్యతను
విడగొట్టాలని యత్నించిన
రవియస్తమించని
బ్రిటీష్ సామ్రాజ్యాన్ని
గడగడ లాడించిన
నిప్పు రవ్వ *ఉప్పు సత్యాగ్రహం*
భరతమాత వ్యధాభరిత
పరతంత్ర జీవనాన్ని
భస్మీపటలం చేయడానికి
ఆసేతు హిమాచలపర్యంతం
దేశప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను
రగిలించి ఏకతాటిపై
నడిపించిన
వ్రతం *ఉప్పు సత్యాగ్రహం*
సత్యం, శాంతి, అహింసలకు
ప్రతి రూపమైన రూపం
గాంధీ మహాత్ముని
మహోన్నత ఏకతా సూత్రం
*ఉప్పు సత్యాగ్రహం*
*🌹🌹🌹గుండ్లరాజు🌹🌹🌹*
8
కవితా గానం
కవి పేరు:కాల్వ రాజయ్య
చరవాణి:9177494235
కవితా శీర్షిక :ఉప్పుసత్యాగ్రహం
సీసము
బ్రిటిషు పాలనలోన భీభత్స మునుజూసి
దేశ మంత జెదిరి తెల్లబోగ
సత్యాగ్రమును జేయసాహసించియు బాపు
ఆశ్రమ మందున యా
ద్యమయ్యి
దండి వరకు సాగె మెండైన యాత్రలో
నేత లంతయు జేరె నీతిగాను
తెల్లదొరల తోటి తెగ దెంపు
లనుజేయ
పన్ను గట్ట మనియు ప్రజలు దెలిపె
ఆటవెలది
అదియు మెచ్చలేని యధికారి యప్పుడు
అంతు జూడు మంటు యజ్ఞ జేసె
భారతీయుజనుల బంధించి జైళ్లల్లో
కర్ర తోని గొట్టి కష్ట పెట్టె
కందము
మెండుగ జేసెను గాంధియు
దండిన సత్యాగ్రహమున్ దారిన నడవన్
కండలు బెంచిన తెల్లలు
గుండెల పై తూట బెట్టి కొట్టిరి జనులన్
9
శీర్షిక: *ఉప్పు సత్యాగ్రహం*
గాంధీజీ ప్రపంచానికిచ్చిన
గొప్ప ఆయుధం సత్యాగ్రహం
మొక్కవోని దీక్షతో మహాత్ముడు
నడిపిన మహోధ్యమo ఉప్పు సత్యాగ్రహం
బాపూజీ నడిపిన మూడు ఉద్యమాల్లో ముఖ్యమైన మలి ఉద్యమం
బ్రిటీష్ వారి సార్వభౌమత్వాన్ని
ధిక్కరించే కార్యాలు సాగించి
వారినెదిరించటమే శాసనోల్లం*ఘనo*
మానవుడి కనీస అవసరమైన *ఉప్పు*తయారీ ప్రధానంగా సాగి
ఉప్పు సత్యాగ్రహమై.
ప్రజలెoదరినో ఉద్యమాన ఉరికించే...
ఇరవైనాలుగు రోజుల పాదయాత్ర
ప్రతిరోజు పదిమైళ్లు సగటున సాగి
పన్నుల విధానానికి వ్యతిరేకంగా
ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా
*పూర్ణ స్వరాజ్* నినాదంగా
ఎనబైమందితో సబర్మతి
ఆశ్రమంనుండి ప్రారంభమై ఆరేబియా సముద్ర తీర గ్రామమైన*దండి*వరకు చేరి దండి సత్యాగ్రహమై పిలువబడి
మూడువందల యాభై కిలోమీటర్లకు పైగా నడుపబడి
దేశాన్నoతా ఉత్తేజితం చేసి తెల్లోళ్ల పెత్తనం పై సాగిన మన దండయాత్ర
ఎనభైవేలకు పైగా ప్రజలు పాల్గొన్న
*మహా*(త్ముడి) పాదయాత్ర
బ్రిటీషోళ్లను బెదిరించిన
అప్రతిహత జైత్రయాత్ర
అరవైవేల ప్రజల అరెస్టులు
క్రిప్స్ రాయబారం రౌండ్ టేబుల్ సమా*వేశాలతో* తెల్లోళ్లు మనల వంచించినా
విస్మరించరానిది స్వతంత్ర సముపార్జనలో దాని పాత్ర
*వల్లాల విజయలక్ష్మీ*ఆలేరు
10
చైత్ర పౌర్ణమి పోటీ కొరకు
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
ఉప్పు సత్యాగ్రహం
ఆ.వె:పన్ను ఉప్పుపైన వాసిగా వేయంగ
నిలను గాంధి తాత హింస రహిత
మైన నిరసనమ్ము నయ్యెసత్యాగ్ర హ
ములకు నెల్ల నదియె నాంది యయ్యె
ఆ.వె:నిరసనములు చూప నెట్టిరి చెరలోన
భారతీయుల నట బందిఖాన
యందు యదియు నాంది యయ్యెను ప్రజలకు
కోర్కెలమలు పర్చు కొనగ తమకు
ఆ.వె:దండి లోన జరిగె దాటిగా నీసమ్మె
పాలు పంచుకొనిరి ప్రజలు కూడ
నిరసన గళమెత్తినినదించుచు వడిగ
తెలుగు వారు కూడా ధీటుగానె
ఆ.వె:వీరగంధములద వీరులెవరొ తెల్పు
కొనుచు త్రిపురనేని యాంధ్రభాష
యందు వ్రాసి మాన్యు డయ్యెనవని యందు
కలము బలము చూపి ఘనము గాను
ఆ.వె:నిలిపివేయ పన్ను నిలుపుదుమీ సమ్మె
యనుచు హెచ్చరించి రవని యందు
నైకమత్యమూని యార్జించ స్వాతంత్ర్య
సమర మనకు నాంది జగతి నయ్యె.
11
*కవిత గానం*
*అంశం*: ఉప్పు సత్యాగ్రహం
23/04/2020
ఆనాటి ఉప్పు సత్యాగ్రహం
నేడు నాడును మోడ లేదు
కులం, మతం, జాతి, రంగు బేధం మన భారత దేశపు నాగరికతను విడగొట్టలనే
ప్రయత్నం చేసిన ఆ బ్రిటిష్ రాజ్యము..
తెల్ల దొరలను గడ గడ లాడించిన గొప్ప దేశం మన భారత్ దేశం
అందర్నీ ఒకే తాటి పైనా నడిపించిన యోదులు ఎందరో
సత్యం, శాంతి, అహింసలను నడిపించిన గాంధీ మహాత్ముడు అతని త్యాగం మరువలేనిది..
ఏకతా సూత్రాము ఉప్పు సత్యాగ్రహం...
*ఇంద్రవత్ రాహుల్*
*ఇందూర్*
*9848054079*
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం
శివునూరి లలితా కృష్ణ
అవధాని
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం
మెరుగు మధు
*************
1 విజయ దుర్గ గారు
2.రామక కృష్ణ మూర్తి గారు
3.సునంద వురిమళ్ళ గారు
4.మర్రి జయశ్రీ గారు
5.దీపక్ న్యాతి గారు
6.కోరాడ గారు
7.గుండ్ల రాజు గారు
8.కాల్వ రాజయ్య గారు
9.విజయ లక్ష్మి గారు
10.డా.బల్లూరి ఉమాదేవి గారు
11.ఇంద్రవత్ రాహుల్ గారు
*****************
1
విజయదుర్గ
ఉప్పు సత్యాగ్రహం
తేదీ: 21/04/20
పరపీడనల దాష్టీకంతో
అల్లలాడిన భరతమాత
దాస్యశృంఖలాలలో
అసహనం రాజుకొని ఊపిరి
నింపిన విప్లవం....!!
ఎవడబ్బ సొమ్మనో
ఉప్పు పై పన్ను మోతతో
బ్రిటీష్ రాజ్యం
ఎళ్ళతరబడి పరాయిపాలనలో
నలిగిన భారతీయుల సంఘీభావమే
ఉప్పు సత్యాగ్రహం....!!
ఎక్కడ దౌర్జన్యం ఇనుపపాదాల
తొక్కను స్వైరవిహారం కై
రెక్కలు తొడుగునో
అక్కడే ప్రజల తిరుగుబాటు
ప్రాణం పోసుకొని తరిమికొట్టే
ఆయుధమై ఉరుకుతుంది.....!!
గాంధీజీ అడుగు జాడలు
అలుపెరగని ఉద్యమపాదాలు
ఒక్కతాటిపై దేశమంతా కలిపిన
ఉప్పుసత్యాగ్రహ పోరుబాటై
స్వాతంత్ర్యనికై ఆగక విజృంభించిన
మహాసంగ్రామం....!!
వినీల
2
అంశం:ఉప్పుసత్యాగ్రహం
శీర్షిక: దండియాత్ర
**************************
సంపూర్ణ స్వరాజ్యం కోసం సల్పిన మహోద్యమం
అహింసాయుక్త శాసనోల్లంఘన
ప్రజాపోరాటం
సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డిన
పెనువిప్లవం
బ్రిటిష్ అణచివేత విధానాలకు
వ్యతిరేకంగా మోగించిన పాంచజన్యం
అక్రమపన్నుల పెంపునకు నిరసనగా సాగిన సత్యాగ్రహం
సబర్మతి నుండి దండి వరకు సాగిన పాదయాత్రా చైతన్యం
దేశమంతా ఒక్కటై,రాజ్యపాలనపై
సాగించిన పవిత్రయుద్ధం
భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో
లిఖింపబడ్డ సువర్ణఘట్టం
జాతి ఐక్యతకు గాంధీమార్గంలో
జరిగిన శాంతిపర్వం
ఉప్పే నిప్పై,ఉప్పే ఉప్పెనై
ఉద్యమానికి ఊపిరులూదిన వైనం
స్వచ్ఛమైన,ధర్మమైన,
సాధుజనుల దీక్షావ్రతం
ఒక్కరు గాంధీ కోట్ల గొంతుల
సమర నినాదం
దుర్మార్గపాలనపై సామాన్యులు
చేసిన దండియాత్ర
స్వేచ్ఛావాయువులకు కదిలిన
ప్రజాగ్రహ వెల్లువ
గాంధీ-ఇర్విన్ సంధితో
విజయశంఖం పూరించి
భారతీయుల సత్యాగ్రహ పోరాటానికి
తలలు వంచిన రవి అస్తమించని
బ్రిటిష్ సామ్రాజ్యానికి పెనునిద్దుర వదిలించింది.
3
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:: ఉప్పు సత్యాగ్రహం
*********************
తలచుకున్నా కొద్దీ
జ్ఞాపకాల చెమ్మ చెలిమలా ఊరుతూనే ఉంది!
అరచేతిలో పట్టుకున్నప్పుడల్లా
లాఠీ దెబ్బలతో రక్తసిక్తమైన పిడికిలిలో
రుధిర వర్ణం పులుముకున్న ఉప్పు కణం.
సత్యాగ్రహం వీడని శాంతి పావురమై
కళ్ళముందు కదలాడుతుంటుంది!
చెట్టూ పుట్టాతో పాటు పశుపక్ష్యాదులను కొలిచిన
మన సంస్కృతి నేర్చుకున్న విలువలు..
మహాత్మా గాంధీ అడుగు జాడలే
ఉద్యమ వెలుగు బాటలవుతుంటే
సాగిన దండి సత్యాగ్రహం యాత్రలో
కాలినడకన బారులు తీరిన కార్యకర్తలు
చీమల దండోలే కనిపిస్తుంటే
బ్రిటిష్ పాలకుల గుండెల్లో
భయం అణుబాంబై పేలింది!
భారతీయులందరినీ
ఏకతాటిపై నడిపించిన గాంధీజీ తీరు
ముచ్చెమటలు పట్టించి
మూర్ఖంగా అణచాలని ప్రయత్నించిన
మహోద్యమమే ఉప్పు సత్యాగ్రహం!
మన దేశ చరిత్రలోనే
మరువరాని సమైక్యతా రాగం!
4
మర్రి జయశ్రీ
అంశం.ఉప్పు సత్యాగ్రహం
సామ్రాజ్యవాదానికి
అణచివేత విధానాలకు
పన్నుల పెంపుదలకు వ్యతిరేకంగా
మహాత్ముడు ఆరంభించిన ప్రచారోద్యమం
సంపూర్ణ స్వరాజ్యమే ధ్యేయంగా
సబర్మతి నుండి సాగిన
అహింసాత్మక శాసనోల్లంఘన ఉద్యమం
ఉప్పు పై పన్నుకు నిరాకరించి న ఒక మౌనగళం
అహింసాత్మక ప్రతిఘటన విజయాలలో ఒక పుష్ప మాలిక
అన్యాయం పై శాంతియుత పోరాటం
డెబ్బది ఎనిమిది అనుచర గనం తో
వందల మైళ్ళు సాగిన చైతన్యం
ఆంక్షలెన్ని విధించిన ఆంధ్రా దాకా
ఉధృతమై సాగిన మహోజ్వల ఉద్యమం
భారతీయులలో స్వాతంత్ర్య కాంక్ష రగిలించిన గాంధీ మార్గం
బ్రిటిష్ వారిలో వణుకు పుట్టించిన సత్యాగ్రహం
భారత చరితలో ఒక సువర్ణాధ్యాయం.
5
అంశం : ఉప్పుసత్యాగ్రహం
రుచి అంటే ముందుగా గుర్తొచ్చేది ఉప్పు
ఉప్పు ఎక్కువైతే రుచి విషం అవుతుంది అందుకే సముద్రపు నీరు రుచికి దూరంగా ఉంటుంది
నాలుగు దిక్కులు ఉన్న మనకు
మన భారతదేశం మూడు వైపులా
సముద్రపు జలాలే నిండుగా
అందులో ఉప్పు ఉంది మెండుగా
అంత సొంత వనరులు ఉండగా
ఉప్పు కొనడం దండగ
మన ఉప్పును మనకు అమ్మి
దండుకో చూశారు డబ్బును బ్రిటిష్ వారు
స్వభిమానం ఉన్న మనము చేసాము సత్యాగ్రహము
దేశ స్వతంత్రం కోసం చేసే విప్లవానికి
ఉప్పు సత్యాగ్రహం మంచి ఐక్యతను తెచ్చింది
మహాత్మాగాంధీ పథకము పాకింది
బ్రిటిష్ వాళ్ళ ముక్కుపిండి మెడలు వంచింది
విధిలేక తోక ముడిచారు బ్రిటిష్ పాలకులు
స్వాతంత్ర్య పోరాటం ఉప్పుసత్యాగ్రహం ప్రముఖమైన భూమికను పోషించింది మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చి ఇచ్చింది
రచన
డాక్టర్ దీపక్ న్యాతి
నంది అవార్డు గ్రహీత హైదరాబాద్
6.
ఉప్పుసత్యాగ్రహం
కోరాడ నరసింహా రావు.,
* ఉత్తమ మార్గం *
************
పాలకులు పన్నులతో
ప్రజలను వేధిస్తే ...
సహనం చచ్చిన ప్రజా చతన్య నాయ కత్వం ...సత్యాగ్రహమై విష్పోటనం చెం దుతుంది...!
పాద యాత్రలతో...
ప్ర కం ప నాలు సృ ష్టిస్తుంది !!
దేశసంపదనంతాదోచుకున్నా...ఇక్కడినుండిముడి సరకు నెంతో సంగ్రహించు కున్నా...అక్కడివస్తువులకు ఈ నేలను బజారుగామార్చుకుని లాభాలార్జిస్తున్నా
తీరని ఆ వలస సా మ్రాజ్యవాద దాహం
ఉప్పు పైనా పన్ను విధించింది !
భరించి-భరించి ఇక
సహించలేని ప్రజలకు నాయకత్వం వహించిన గాంధీజీ దీన్నిప్రతిఘటించాలన్న పిలుపు మేరకు
ప్రజాచైతన్యం వెల్లు వెత్తింది కదూ !
ఎందరెందరుఎన్నెన్ని లాఠీ దెబ్బలు తిన లేదూ !
జై ల్ల లోకి ఎందరో నెట్టబడ లేదూ !.
యిదంతా...కేవలంఉప్పు కోస మేనా !?
కాదు...కానే కాదు !
న్యాయమైనహక్కులు హరిస్తుంటే ...
చేతులుకట్టుకుకూచోవచ్చా...?!
గాంధీజీ చూపిన ఆ మార్గంలో ...శాంతి యుత నిరసనలతో సత్యాగ్రహాయుధాన్ని ధరించి సమరం చెయ్యటమే ఉత్తమం
అంతిమవిజయం ధర్మబద్ధమైన న్యాయమార్గ సత్యానిదే అని నిరూపించ బడ లేదూ...!!
ఆఖరికి...వాళ్ళఅన్యాయ,అధర్మ,నిరంకుశ,నియంతృత్వాలే వాళ్ళను ఈ నేల నుండి వెంట తగల్లేదూ !
ఇదీ...గాంధీజీ మన కు నేర్పిన మహోన్నత పరిష్కార మార్గం!!
ఇదే...ఆశయ సిద్ధికి
అత్యుత్తమ మార్గం !
****************
.......కోరాడ.
7
కవితా శీర్షిక : *ఉప్పు సత్యాగ్రహం*
వేష భాషలు
అలవాట్లు ఆచారాలు
కులాలు మతాలు
విభిన్న సంస్కృతీ నాగరికతలకు
ఆలవాలమని పేరుగాంచిన
నా భారతజాతి ఐక్యతను
విడగొట్టాలని యత్నించిన
రవియస్తమించని
బ్రిటీష్ సామ్రాజ్యాన్ని
గడగడ లాడించిన
నిప్పు రవ్వ *ఉప్పు సత్యాగ్రహం*
భరతమాత వ్యధాభరిత
పరతంత్ర జీవనాన్ని
భస్మీపటలం చేయడానికి
ఆసేతు హిమాచలపర్యంతం
దేశప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను
రగిలించి ఏకతాటిపై
నడిపించిన
వ్రతం *ఉప్పు సత్యాగ్రహం*
సత్యం, శాంతి, అహింసలకు
ప్రతి రూపమైన రూపం
గాంధీ మహాత్ముని
మహోన్నత ఏకతా సూత్రం
*ఉప్పు సత్యాగ్రహం*
*🌹🌹🌹గుండ్లరాజు🌹🌹🌹*
8
కవితా గానం
కవి పేరు:కాల్వ రాజయ్య
చరవాణి:9177494235
కవితా శీర్షిక :ఉప్పుసత్యాగ్రహం
సీసము
బ్రిటిషు పాలనలోన భీభత్స మునుజూసి
దేశ మంత జెదిరి తెల్లబోగ
సత్యాగ్రమును జేయసాహసించియు బాపు
ఆశ్రమ మందున యా
ద్యమయ్యి
దండి వరకు సాగె మెండైన యాత్రలో
నేత లంతయు జేరె నీతిగాను
తెల్లదొరల తోటి తెగ దెంపు
లనుజేయ
పన్ను గట్ట మనియు ప్రజలు దెలిపె
ఆటవెలది
అదియు మెచ్చలేని యధికారి యప్పుడు
అంతు జూడు మంటు యజ్ఞ జేసె
భారతీయుజనుల బంధించి జైళ్లల్లో
కర్ర తోని గొట్టి కష్ట పెట్టె
కందము
మెండుగ జేసెను గాంధియు
దండిన సత్యాగ్రహమున్ దారిన నడవన్
కండలు బెంచిన తెల్లలు
గుండెల పై తూట బెట్టి కొట్టిరి జనులన్
9
శీర్షిక: *ఉప్పు సత్యాగ్రహం*
గాంధీజీ ప్రపంచానికిచ్చిన
గొప్ప ఆయుధం సత్యాగ్రహం
మొక్కవోని దీక్షతో మహాత్ముడు
నడిపిన మహోధ్యమo ఉప్పు సత్యాగ్రహం
బాపూజీ నడిపిన మూడు ఉద్యమాల్లో ముఖ్యమైన మలి ఉద్యమం
బ్రిటీష్ వారి సార్వభౌమత్వాన్ని
ధిక్కరించే కార్యాలు సాగించి
వారినెదిరించటమే శాసనోల్లం*ఘనo*
మానవుడి కనీస అవసరమైన *ఉప్పు*తయారీ ప్రధానంగా సాగి
ఉప్పు సత్యాగ్రహమై.
ప్రజలెoదరినో ఉద్యమాన ఉరికించే...
ఇరవైనాలుగు రోజుల పాదయాత్ర
ప్రతిరోజు పదిమైళ్లు సగటున సాగి
పన్నుల విధానానికి వ్యతిరేకంగా
ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా
*పూర్ణ స్వరాజ్* నినాదంగా
ఎనబైమందితో సబర్మతి
ఆశ్రమంనుండి ప్రారంభమై ఆరేబియా సముద్ర తీర గ్రామమైన*దండి*వరకు చేరి దండి సత్యాగ్రహమై పిలువబడి
మూడువందల యాభై కిలోమీటర్లకు పైగా నడుపబడి
దేశాన్నoతా ఉత్తేజితం చేసి తెల్లోళ్ల పెత్తనం పై సాగిన మన దండయాత్ర
ఎనభైవేలకు పైగా ప్రజలు పాల్గొన్న
*మహా*(త్ముడి) పాదయాత్ర
బ్రిటీషోళ్లను బెదిరించిన
అప్రతిహత జైత్రయాత్ర
అరవైవేల ప్రజల అరెస్టులు
క్రిప్స్ రాయబారం రౌండ్ టేబుల్ సమా*వేశాలతో* తెల్లోళ్లు మనల వంచించినా
విస్మరించరానిది స్వతంత్ర సముపార్జనలో దాని పాత్ర
*వల్లాల విజయలక్ష్మీ*ఆలేరు
10
చైత్ర పౌర్ణమి పోటీ కొరకు
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
ఉప్పు సత్యాగ్రహం
ఆ.వె:పన్ను ఉప్పుపైన వాసిగా వేయంగ
నిలను గాంధి తాత హింస రహిత
మైన నిరసనమ్ము నయ్యెసత్యాగ్ర హ
ములకు నెల్ల నదియె నాంది యయ్యె
ఆ.వె:నిరసనములు చూప నెట్టిరి చెరలోన
భారతీయుల నట బందిఖాన
యందు యదియు నాంది యయ్యెను ప్రజలకు
కోర్కెలమలు పర్చు కొనగ తమకు
ఆ.వె:దండి లోన జరిగె దాటిగా నీసమ్మె
పాలు పంచుకొనిరి ప్రజలు కూడ
నిరసన గళమెత్తినినదించుచు వడిగ
తెలుగు వారు కూడా ధీటుగానె
ఆ.వె:వీరగంధములద వీరులెవరొ తెల్పు
కొనుచు త్రిపురనేని యాంధ్రభాష
యందు వ్రాసి మాన్యు డయ్యెనవని యందు
కలము బలము చూపి ఘనము గాను
ఆ.వె:నిలిపివేయ పన్ను నిలుపుదుమీ సమ్మె
యనుచు హెచ్చరించి రవని యందు
నైకమత్యమూని యార్జించ స్వాతంత్ర్య
సమర మనకు నాంది జగతి నయ్యె.
11
*కవిత గానం*
*అంశం*: ఉప్పు సత్యాగ్రహం
23/04/2020
ఆనాటి ఉప్పు సత్యాగ్రహం
నేడు నాడును మోడ లేదు
కులం, మతం, జాతి, రంగు బేధం మన భారత దేశపు నాగరికతను విడగొట్టలనే
ప్రయత్నం చేసిన ఆ బ్రిటిష్ రాజ్యము..
తెల్ల దొరలను గడ గడ లాడించిన గొప్ప దేశం మన భారత్ దేశం
అందర్నీ ఒకే తాటి పైనా నడిపించిన యోదులు ఎందరో
సత్యం, శాంతి, అహింసలను నడిపించిన గాంధీ మహాత్ముడు అతని త్యాగం మరువలేనిది..
ఏకతా సూత్రాము ఉప్పు సత్యాగ్రహం...
*ఇంద్రవత్ రాహుల్*
*ఇందూర్*
*9848054079*
Comments
Post a Comment