Skip to main content

రాజ్ ఘాట్ 9

నిర్వహణ ః వీరా గుడిపల్లి
The mathematics teacher and poet

 సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ

అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం ః మెరుగు మధు
**********************
1.ఇంద్రవత్ రాహుల్
2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
3. డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
4. డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
5.సునంద వురిమళ్ళ గారు
6.కోరాడ నరసింహా రావు గారు
7.తగిరంచ నర్సింహారెడ్డి గారు
8.వల్లాల విజయ లక్ష్మి గారు
9.డా.బల్లూరి ఉమాదేవి గారు
10.గుండ్ల రాజు గారు
11.మర్రి జయశ్రీ గారు

**********
1
*అంశం*:  రాజ్ ఘాట్
 బాపూజీ ఆశయం
 ఆ మహాత్ముడి పవిత్రమైన చోటు
 సత్యం, అహింసను జయించిన మహా వీరుడు
 ఢిల్లీలోని తన రాజ్ ఘాట్
 స్మారక స్థలం
 మన జాతిపిత బాపూజీ
 ఇక లేరు
 ప్రజల గుండెలో రాయి పడ్డది
 ప్రతి ఏటా వస్తూనే ఉన్నది మనకు
 స్వాతంత్ర దినం కానీ
 ఏమి సాధిస్తున్నాం ఆలోచించాలి
 క్షణం క్షణం గాంధీ మాట
  ఘడ్సే తూటా..
 అక్రమాల బాట
 నిలవాలి నిలవాలి గాంధీజీ ఆశయం
 రాజ్ ఘాట్కు శాంతిని అందించాలి..


*ఇంద్రవత్ రాహుల్*
       *ఇందూర్*
   *9848054079*
2.
అంశం...రాజ్ ఘాట్
గాంధీజీ స్మారక చిహ్నాన్నికి గుర్తు
రాజ్ ఘాట్
పరవళ్ళు తొక్కుతూ యమునానది
రాజ్ ఘాట్ ను తాకి పులకించగా
భారత స్వాతంత్ర్య రధసారధి పోరాటపటిమని స్తుతియించగా
నల్లపాలరాతి గాంధీజీ
సమాధికి దహనసంస్కారాలకు
గుర్తుగా నిటారుగా నిలబడి సెల్యూట్ చేయగా
హేరామ్ నామస్మరణంతో శిలాఫలకంపై అక్షరాలు ధ్వనియించగా
నిలువెత్తు రగిలే జ్వాలలు గాంధీజీ
నిలువెత్తు నిగ్రహాన్ని,శాంతికామున్ని
ఎర్రని అగ్ని జ్వాల లతో  ఎగిసిపడగా
పూలమూలలు శిలాఫలాకాన్ని ముద్దాడగా
నిత్యం గాంధీజీ సిద్ధాంతాలు హోరెత్తగా జాతికి నిజనిర్ధేశాలను
చూపగా
రాజ్ ఘాట్ పవిత్రమైన స్థలంగా
నెలవైవుంది ఇలలో

సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి

3
:డా.రామక కృష్ణమూర్తి
తేది:28-4-2020
అంశం: రాజ్ ఘాట్
శీర్షిక: హేరామ్
**************************

జాతిని‌ ఏకతాటి పైకి తెచ్చిన
ఆ పాదాలు విశ్రాంతి పొందిన *క్షేత్రమది*
అహింసతో స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపిన‌
ఆ చేతులు  శయనించిన *స్థానమది*
సత్యాగ్రహంతో సందేశాలిచ్చిన
ఆ కంఠధ్వని మూగబోయిన *భూమది*
ప్రార్థనలతో గడిపిన ఆ కళ్ళు
అలసిసొలసి సేదతీరిన *ధ్యానమందిరమది*
హిందూ-ముస్లిములను రెండు ప్రాణాలుగా శ్వాసించిన
ఆ గుండె ఒదిగిన *ఆశ్రమమది*
నిత్యం చర్చలను,సమావేశాలను,
ఉద్యమాలను నడిపించిన మెదడు నిద్రించిన‌ *నేలది*
బ్రిటిషువారిని‌ భయపెట్టిన ఆ
అమృతమూర్తి కాయం నిలిపిన *చోటది*
అతివాదుల హింసకు బలైన
బోసినవ్వుల బాపూజీకి *శాశ్వత స్వర్గమది*
గాంధీమార్గం బోధించి,స్ఫూర్తి నింపిన ఆ చైతన్యం
మమేకమైన *పవిత్ర స్థలమది*
చేతికర్రను‌పట్టి,అపూర్వ మేధాసంపత్తిని
ప్రపంచానికి తెలిపిన కీర్తిశేషి *స్మారకమది*
కొల్లాయిగట్టి పేదప్రజల‌ పక్షాన నిలిచిన మహాత్ముని స్మరణ *నివాసమది*
చరిత్రకెక్కిన చారిత్రకుని భావితరాలకు పరిచయంచేసే
*విజ్ఞానకేంద్రమది*
నిరాడంబరతకు నిలయమైన‌ వినయసంపన్నుని ఆవాసమది
భరతమాత ముద్దుబిడ్డై,మార్గదర్శకుడైన
మహితాత్ముని *స్మృతిచిహ్నమది*
సమత,మమత,ఐక్యతలను చాటిన దేశసేవకుని *దేవాలయమది*
రాజ్ ఘాట్.......
పరిపాలకులకు స్ఫూర్తినింపే *గురుపీఠమది*

4
                        ✍️ డా.పాండాల.
ఔనన్నా కాదన్నా గాంధీ వాదిని
సత్యమేవజయతేయనే సత్యవాదిని..

బోసి నవ్వు మురిపాలు బోలెడున్నవి
మాసిపోని విలువలున్న మాననీయుడు ...!

వలువలేమి లేకుండావాసిగాంచెనూ
శాంతి అహింసల సమున్నతుడు...!

సంస్కారపుశ్రేయోదీప్తి సమతవాదుడు
అఖండభరతజాతిస్వేచ్చవాదుడు

కార్యదీక్ష తత్పరతకు కర్మయోగుడు
అరశతాబ్ది ఆకాంక్షకుఆదిగురుడుగా

సకలజనుల సంక్షేమపు సామ్యవాదిగ
గాడ్సే తూటాలకు బలైన ప్రాణం..!

ఆ మూర్తిని తలచుకునే ఆ సమాధియే
రాజఘాటు పవిత్రం రక్తిదాయకం..

ఓంశాంతి ఓంశాంతి ఓంకారం
హిందురాజ్య బంధువులకు శ్రేయదాయకం...!


✍️డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి
[28/04, 9:08 PM] సునంద ఉరిమిళ్ళ: కవితా గానం
తేదీ::28-04-2020
5
వురిమళ్లసునంద, ఖమ్మం
శీర్షిక::రాజ్ ఘాట్
::::::::::::::::::::::::::::::::::::
హరిశ్చంద్రుడు ఏలిన స్థలం కాదు
అహింస సత్యాగ్రహంతో
భారత దేశాన్ని పుణ్యభూమిగా మార్చిన మహాత్ముడు
శాశ్వతంగా నిద్రిస్తున్న చోటది!

బ్రతుకు అర్థం తెలియజేసి
భారతీయుల కలను సాకారం చేసేందుకు
నడుం బిగించి సాగిన
బోసినవ్వుల బాపూజీ పవిత్ర హృదయం  విశ్రమించిన  నేల అది!

పర్యటనకు వచ్చే ప్రపంచ నాయకులు
వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించే మానవతా మూర్తి
శయనించిన స్థలమది!

గాంధీజీ ఇష్టపడే..
''రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరే నామ్:"

 హృదయాలను తడిమే సమైక్యతా రాగంలో
మనో మాలిన్యాలను తొలగించే గానం
మహనీయుడు గాంధీజీ ఆత్మీయత
రాగంతో పులకించిన
పవిత్రమైన రాజ్ ఘాట్ అది..
6.
కవితాగానం
అంశం:-  * రాజ్ఘాట్ *
కోరాడ నరసింహా రావు,*పస్చాత్తాపం*
*****************
రాజ్ఘాట్...! తాను నమ్మినసత్యము,అహింసలతోనే...దేశానికి స్వాతంత్ర్యాన్ని తేగలిగానన్నతృప్తితో
తనసిద్ధాంతం కోసం
తనప్రాణాలనుబలిపపెట్టి... హేరామ్...! అంటూ తుది శ్వాస విడిచి...స్మ్రుతి చిహ్నమై నిలిచిన గాంధీ సమాధికి ఏడాదికిరెండు,మూడుమార్లుహడావుడిగా...నేతలుశ్రద్ధాంజలి ఘటించి వదిలే స్తున్నా ...,
గాంధీసమాధిముందు గాడ్సే ఆత్మ నిల దీబడేవుంది!
నేరం నీదా...,నాదా ?
పాపం చేసింది మీరా
నేనా...అప్పుడుచెప్పలేకపోయినాయిప్పుడు  చెప్పు !,
నాముఖంచూసిచెప్పు  గాంధీజీ అని గాడ్సేఆత్మ  నిలదీ స్తోంది !
ఎన్నోఆత్మలు గాంధీ సమాధి చుట్టూ చేరి
దేశానికిస్వాతంత్ర్య ,స్వరాజ్యాల కోసం అంత పాటుపడి ...
మాకెందుకింత  అన్యాయం చేసావని
రోధిస్తున్నాయా ఆత్మ లు...!
విభజన పేరుతొ ...
హక్కులన్నీ  వాళ్ళ కిచ్చేసి ...మాకెందుకింతఅన్యాయంగా కష్టాలను కడగండ్లనూ  అనుభవించ మన్నావు గాంధీజీ
అని వాదిస్తున్నాయి!
ఆ కంట పన్నీటిని పొంగించడం కోసం ఈ కంట కన్నీటి నేందుకు ప్రవహింప
జేసావని కుమిలి పో తున్నాయ్!
వాళ్ళకోసం మాకు శాంతి ప్రబోధాలు  చేస్తూ ...మాలోయింత అశాంతి నెందుకు నింపావని రోధిస్తున్నాయ్ !
ఆ ఆత్మలకు సమాధానాలు చెప్ప లేక...గాంధీజీ ఆత్మ
అంతర్మథనంలో ప డింది...!!
నేనుచేసింది...పుణ్యమా ! పాపమా!?
న్యాయమా....!?
అన్యాయ మా...?!
ధర్మమా.!అధర్మమా?
తననుతానుప్రశ్నించుకుంటుందాఆత్మ!
ఒకరి మెప్పు కోసం
ఇంకొకర్ని నొప్పించా
నా...?
నాజీవితాంత జీవన పరిశ్రమలైన  అహింస,సత్యాగ్రహములు  వ్యర్ధమై  పోయాయా  !?
ఇప్పటి ఈ పరిస్థితులనుచూస్తుంటే నేను పెద్ద తప్పేచేసాననిపిస్తోందే  ,!!
నామంచితనంలోయింతమూర్ఖత్వముందా..!
నిష్కృతిలేనిపాపాన్ని
చేసానా పరమాత్మా
నన్ను క్షమించు...
అంటూ... గాంధీజీ ఆత్మ క్షోభిస్తోంది !
*****************
........కోరాడ.
7.
అంశం: రాజ్ ఘాట్
రచన : తగిరంచ నర్సింహారెడ్డి
 *నానీలు*

          ***
అదొక స్మారక చిహ్నం
కాదు కాదు..
సత్యాహింసల
సజీవ దైవం ! .... 1
           ****
స్వేచ్ఛా పతాకపు
ఊపిరి చిహ్నం!
 రాజ్ ఘాట్!
శాంతిమంత్ర దేవాలయం!  ...2
            ***
నివాళి  అర్పించుటేనా !?
ప్రతినిత్యం
అనుసరించాల్సిన
జీవన సత్యం!     ...3
            ** **
యమునా తీరం
మహాత్ముని మార్గం
రాజ్ ఘాట్ -
నిరాడంబర హృదయం !...4
         ****
నల్లరాతి నిర్మాణం..
శాశ్వత జ్వాల..
రాజ్ ఘాట్
ప్రపంచానికే వెలుగురేఖ ...5
         ****
ఆదర్శజీవితం
ప్రతి తరానికి వరం
రాజ్ ఘాట్ ..
జాతిపిత ఆలయం! ...6
   ****----------**********---------
8.
దేశ రాజధాని ఢిల్లీ నగరాన
యమునానది పడమటి వైపున
గాంధీమార్గ్ లో నలుబైఐదు ఎకరాల
విశాలస్థలాన ఉన్న సత్యమందిరం *రాజ్ ఘాట్*

గాంధీజీ చివరిగ పలికిన *హే రామ్*                               పదాలు చెక్కబడిన చిన్ని స్మారకఫలకం
ఒకవైపు శాశ్వత జ్వాలా ప్రకాశం
చుట్టూ రాతితోవ పచ్చని మైదానం

భరతజాతిని ఒక్కటి చేసిన అహింసాయోగి
బాపూజీ శాశ్వతంగ ఉన్న స్థలo
'వానుజి భుట" నిరాడంబర నిర్మాణశైలితో
నిర్మలానందాన్ని కలిగించు  సాకారం

అహింసామార్గాన తొనకక నడిచిన
పాదపద్మాలు విశ్రాంతిపొందే స్థానమది
ఉప్పు సత్యాగ్రహాన్ని అజేయంగ
నడిపిన కరం(చంద్)సుమాలుండే వనమది

భరతమాత ప్రియపుత్రుని స్మృతి చిహ్నం
సత్యపాఠాన్ని నేర్పిన గురువు శాశ్వతస్తానం
గాంధీజీ మనసులాగే అందమైన వనం
ఆ సిద్ధాంతాలస్మరణతో మది అగు పావనం

చుట్టు శాంతివనం శక్తిస్తల్ విజయఘాట్
ఏక్తాస్థల్ వీరభూమి'లచే ఆవరించబడ్డ రాజఘాట్
నిరాడంబరాన్ని ప్రతిఫలించే ప్రజాయోగి
పవలిస్తున్న పవిత్ర దేవాలయం

విదేశీయులెవరైన భక్తితో దర్శించుకునే
భారతీయ తొలిదర్శనీయ ప్రాంతం
స్వదేశీయులనెoదరినో ఆకర్షించే                       పవిత్ర పర్యాటక శాంతిపీఠం

ప్రతి శుక్రవారం స్మారక కార్యక్రమాలు
గాంధీజయంతి వర్థంతి జాతీయపర్వదినాల్లో
ఆ గుడి గాంధీజీ భజనగీతాలతో ప్రతిధ్వనించు
గాంధీజీ ఉన్నతభావాలను ప్రతిఫలించు

:;*వల్లాల విజయలక్ష్మి*,,ఆలేరు
[29/04, 8:39 PM] Balloori Umadevi Poetess: కవితా గానం
9.
డా.బల్లూరి ఉమాదేవి
అంశము:రాజఘాట్

యమునా నది తీరం
 జాతిపిత బాపూజీ స్మారక కేంద్రం
 భరతమాత శృంఖలాల త్రెంచుటకై
 సర్వస్వమర్పించిన మహాత్ముని స్మృతి చిహ్నం
 తాను లేకున్నా తన ఆశయాలు నిరంతరం
ప్రతిధ్వనిస్తూ జగతికి చాటి చెప్పేపవిత్ర స్థలం
నల్ల పాలరాతి కట్టడం మీద
"హేరామ్' అనే అక్షరాల విన్యాసం
 సత్యాహింసలనే  ఆయుధాలుగా మార్చి
జాతికి స్వాతంత్ర్య ఫలమందించిన
  మహాత్ముని శాశ్వత విశ్రాంతి స్థలం
 సత్యమేవ జయతే అన్న వేదోక్తిని
 మనసా వాచా నమ్మి ఆచరించి ఆదరించి
ఆదర్శప్రాయుడై వెలుగు బాట చూపిన
 మహనీయుని దివ్యస్మృతి కేంద్రం
ఆశ్రమంలా అలరారే  ప్రశాంత ప్రదేశం
ప్రతి శుక్రవారం ఎడతెరిపిలేని
 భజనలతో గీతాపఠనం తో
మార్మ్రోగు నీ పవిత్ర ప్రదేశం
[29/04, 8:48 PM] Gundla Raju Sir: *కవితా గానం*
10
అంశం: *రాజ్ ఘాట్*

కవితా శీర్షిక : *అహింసా మూర్తి*

సహాయ నిరాకరణోద్యమంతో
ఆసేతు హిమాచలపర్యంతము
భారతజాతిలో స్వేచ్ఛ స్వాతంత్ర్య కాంక్షలను
రగిలించిన *అహింసా మూర్తి*
నిద్రిస్తున్న *ధన్యభూమి*
ఉప్పు సత్యాగ్రహంతో
శాసనోల్లంఘనము చేసి
రౌండ్ టేబుల్ సమావేశాలకు
తలుపులు తెరిపించిన *చేతులు*
దీవిస్తున్న *సత్యభూమి*
చేయండి లేదా చావండి
అని నినదించి
క్విట్ ఇండియా అని
గర్జించిన *కంఠము*
మూగబోయిన *శాంతి భూమి*
పోరు బందరు పోరాట యోధుడు
బక్కపలుచని శరీరంతో
తెల్లదొరల గుండెలలో
గుబులు పుట్టించిన *గుండె*
సేద దీర్చుకుంటున్న *పుణ్య భూమి*

*🌹🌹🌹గుండ్లరాజు🌹🌹🌹*
11
మర్రి జయశ్రీ
అంశం.రాజ్ ఘాట్

బానిస సంకెళ్ళు తెంచి
భారత ప్రజలకు విముక్తి ప్రసాదించిన మహాత్ముడు
భారతమ్మ ముద్దుల తనయుడు
నాధురామ్ గాడ్సే చేతిలో హతమై
హస్తిన ఒడిలో
హాయిగా నిద్రిస్తున్న శయన మందిరమది
సామాన్యంగా అసమాన్యుడు బాపూజీ దహన స్థలమది
సత్యాహింసల మార్గ జ్యోతి స్మారక చిహ్నమది
మనిషి మనిషిగా బతకాలని
నీతిగా నడుచుకోవాలని బోధించిన శాంతమూర్తి మానవతా మందిరమది
యమునా తీరమున వెలసిన
అత్యంత ప్రజాకర్షక ప్రదేశమది
ఆ జాతిపితకు నచ్చిన రఘుపతి రాఘవ రాజారామ్ నిత్యం ఆలపించబడే ధ్యాన మందిరమది
హెరామ్ అనే అక్షరాలు రాతి ఫలకం పై చెక్కబడిన మూర్తి శాశ్వత నివాసమది
విదేశీ ప్రతినిధులు వినమ్ర0గా
చేతులు జోడించి
పుష్పాంజలి ఘటించే పుణ్యభూమది
పర్యాటక కేంద్రమై విరాజిల్లుతున్న విజ్ఞాన కేంద్రమది
అనునిత్యం స్మరించుకొనే
ఆ మహనీయుడు గాంధీజీ కొలువైన స్వర్గం రాజ్ ఘాట్
భావితరాలకు తెలిపే చరిత్ర.

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...