సమూహ నిర్వహణః
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం
శివునూరి లలితా కృష్ణ
అవధాని
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు
సహకారం
మెరుగు మధు
**************
కవితా గానం జాబితా
1.కోరాడ నరసింహా రావు గారు
2.ఇంద్రవత్ రాహుల్ గారు
3.విజయ దుర్గ (వినీలమ్మ) గారు
4.వల్లాల విజయ లక్ష్మి గారు
5.దీపక్ న్యాతి గారు
నంది అవార్డు గ్రహీత
6.పాల్వంచ హరికిషన్ గారు
7.రమా కులకర్ణి గారు
8.డా.రామక కృష్ణ మూర్తి గారు
9.మర్రి జయశ్రీ గారు
10.వురిమళ్ళ సునంద గారు
11.డా.బల్లూరి ఉమాదేవి గారు
12.సంధ్యా శర్మ గారు
**********************"
1
తేదీ:18-04-2020.
అంశం:-,ఉపవాసం
నిరాహారదీక్ష !
కోరాడ నరసింహా రావు.,
* సహక రిస్తుంది *
*****************
ధర్మ విరుద్ధమైన... అన్యాయానికి
నీ ని రసనను నిరాహార దీక్షతో ప్రకటించు..!
ఉపవాసదీక్షతో ఆ సర్వేశ్వరునిప్రార్ధించు
నీ దీక్ష ఫలిస్తుంది !
నీ న్యాయమైన కోర్కెనెరవేరితీరుతుంది !!
లోకానికి మేలు జరి గి...
శాంతి ,సౌఖ్యాలు చేకూరుతాయి...!
ఇదీ...నిరాహార దీక్షతో ఉపవాసం చేస్తే...
వచ్చే గొప్ప ఫలితం...!
ఆనాడుగాంధీ,మరోనాడుపొట్టిశ్రీరాములు.,
నేడెందరో...అక్కడక్కడా...అప్పుడప్పుడు! ఉదాహర ణలుగా నిలిచాయి !
హింసా,దౌర్జన్యాలతో...
సాధించేదేమీ ఉండదు సోదరా !
మరింత అశాంతీ అలజడులు తప్ప !!
క్రోధంతో...ద్వేషంతోసాధించలేనిది...
శాంతి,సత్యాగ్రహప్రతిపా దితాలైన నిరాహార,ఉపవాస దీక్షలే సాధించ గలవు !!
చెడును నిరసిస్తూ ...చెడుగానేప్రవర్తిస్తే ...
మంచినెలా సాధించ గలం...!?
చెడు అనే చెత్తను...
మంచిఅనేచీపురుతో
పూర్తిగా తుడిచి...పెంటమీద పారెయ్ !
ఆ చెడే...పనికొచ్చేసారవంతమైన
పెంట ఎరువై...మంచిసారాన్నందిస్తుంది...
మనకు చ క్కగా సహకరిస్తుంది!
*****************
.......కోరాడ.
★★★★★★★★★★★
2.
*అంశం* : ఉపవాస దీక్ష
*రచన తేది*: 18/04/2020
మనిషి చేయాలి ఉపవాస దీక్ష
జీవితం కోసం పోరాడే దీక్ష
భగవంతుడికి కావాలి సత్యం, దయ, ఉపవాస దీక్ష
మానవుడికి కావాలి దానం చేసే ఉపవాస దీక్ష..
జ్ఞానం కోసం చేయాలి ఉపవాస దీక్ష..
పేరు కోసం చేయాలి ఉపవాస దీక్ష...
మానవులు చేయాలి భగవంతుడికి మోక్షం ఇచ్చే ఉపవాస దీక్ష..
వ్యాస మహర్షి చేసాడు ఆకలి ఉపవాసపు దీక్ష..
మనం చేయాలి ఆ దేవుడికి మన భవిష్యత్తు కోసం ఉపవాసపు దీక్ష...
🎯 *కవి పరిచయం* 🎯
*************************
పేరు : ఇంద్రవత్ రాహుల్
ఊరు : మల్కాపూర్
జిల్లా : ఇందూర్ /నిజామాబాదు
మండలం : ఇందూర్ /నిజామాబాదు
చరవాణి : *9848054079*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
3.
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : నిరాహార దీక్ష
ఉపవాస దీక్ష
కవితా సంఖ్య: 07
ఏ దీక్షయినా మనలోని
ఆశ నిరాశలకు మూలస్థానమై
ధ్వజస్థంభంలా నిలబెట్టు
పట్టుదల ప్రాకారాలు....!!
అసహన కట్టలు తెంచుకొని
పెత్తందారీ తనాన్ని మోయలేక
అణగారి ఉన్న నిస్తేజం
మీసాలను తొడిగి ఓర్పుతో స్నేహాన్ని
చేస్తూ ఆత్మవిశ్వాస పట్టుతో
నిరాహార దీక్షలో ఎజెండా నే....!!
ఆధ్యాత్మిక వాసనలతో
చల్లని కరదీపికలకై
మనసు నిండా భక్తి బావాల వెల్లువలో
ఉపవాసదీక్షలో ముక్తికై
మనోపుష్పాలను అర్పించును....!!
దీక్ష ఒక్కటే రూపాలే
ద్విపాత్రాభినయనాలు
ఆత్మవాసనలకు ఒకటైతే
సమాజ సమతుల్యానికి ఒకటి
మానవ జన్మకు రెండూ పురోగమనమే....!!
వినీల
4
శీర్షిక::**ఉపవాస(నిరాహార)దీక్ష**
ఇంట్లో మనముండిన చాలు
కరెంటు లేకుండా పనిచేసే
నోటిమిషను నడుస్తనే ఉంటది
పంటికి పని చెబుతనే ఉంటం
ఒంటికి పడని పదార్థాలైనా
కంటికి కనిపిస్తే చాలు ఊరిళ్ళొచ్చి
చాలు అనుకుంటూనే
కటకటమనిపించటం
ఆనక చిటపటలతో చిందులేయటం
ఫంక్షన్లలో *పదార్థాలపై నోరు చేసుకోవటం*
ఆపై ఆపసోపాలతో ఆయాసపడటం
లావై పోతున్నానని ఆలోచి0చటం
బరువెక్కుతున్నానని బాధపడటం
పలువురికి అనుభవం
దేహపోషణకవసరం సంపూర్ణ ఆహారం
అనవసర చిరుతిండ్లు తెచ్చు ఊబకాయం
శారీరకశ్రమ తగ్గిన నేటిరోజుల్లో
కొన్ని సమస్యలకు పరిష్కారం
వారానికోసారి ఉపవాసదీక్షావ్రతం
జీర్ణవ్యవస్థకు విశ్రాంతి దక్కును
మనసుకు సంతృప్తి దొరకును
నిరాహారదీక్షకు భక్తిభావం తోడయిన...
ఆలోచనలను శుద్ధిచేయు ఉపవాస దీక్షయగు
*ఆహారానికి దూరముండటమంటే
ఆ భగవంతునికి దగ్గరుండటమే*
మోక్షమార్గానికి దారిన పడటమే
ఆరోగ్యాన్ని దృష్టినుంచుకునే ఉపవాసం
సదాలోచనలకు సహవాసం
గాంధీజీ ఆయుధమై గెలిపించిన. నిరాహారదీక్ష నవీనయుగాన అస్త్రం
ఆహారపదార్థాలను పొదుపుచేయు మార్గం
ఏవిధంగాచూసినా ఈ దీక్ష *సoరక్ష*
*వల్లాల విజయలక్ష్మి* ,,ఆలేరు
5
అంశం : ఉపవాస దీక్ష నిరాహారదీక్ష
రచయిత : దీపక్ న్యాతి
శీర్షిక : దీక్ష దీక్షే
ఓం గురి ఓ లక్ష్యం దీక్ష
ఓ ఆశ ఓ కోరిక దీక్ష
ఓ పట్టుదల ఓం నమ్మకం దీక్ష
ఆద్యాత్మిక ఉపవాస దీక్ష
నిరసన నిరాహార దీక్ష
దైవ సన్నిధిని ఆకాంక్షించి
భగవంతుని ధ్యాస కోరి
దేవుని కటాక్షం ఆశించి
సన్నిహితంగా మెలిగే దీక్ష
ఉపవాస దీక్ష ఉప వాసమే దీక్ష
రక్త సంబంధీకుల క్షేమానికి
ఆత్మీయుల శ్రేయమాశించి
ఉపచారాలు చేయ ఉప వాసమున్నా
అదికూడా ఉపవాస దీక్ష
కొంత ఆశించి దొరకక
శాంతి అహింసా మార్గాన
అన్న పానీయాలు మాని
ఆహారం త్యజించి
సానుభూతిని సంపాదించి
నమ్మకాన్ని చూరగొని
అనుకున్నది సాధించే
తపనే నిరాహారదీక్ష
తన కోసమే కాదు
తన వారి కోసం
తన దేశం కోసం
స్వార్థం లేక ఇతరుల కోసం
నిరాహార దీక్షలు చేసి
లక్ష్యాన్ని సాధించుకున్న
సందర్భాలెన్నో వున్నా
ఆమరణ నిరాహార దీక్ష చేసి
ప్రాణత్యాగం చేసిన సంఘటనలు
చరిత్రలో చాలా ఉన్నాయి
తెలుగు ఉభయ రాష్ట్రాలు
వీడక ముందు సంయుక్త రాష్ట్రాం
ఏర్పడటానికి కారణం
శ్రీ పొట్టిశ్రీరాములు నిరాహారదీక్షే
డా.దీపక్ న్యాతి
6
తేది: 18-04-2020
శీర్షిక: దీక్ష..!
ఆరోగ్యం అప్రమత్తతకు
చేయవలలిందే
ఉపవాస దీక్ష..
మానవత్వం అప్రమత్తతకు
చేయవలసిందే
ఆత్మీయతల దీక్ష..
రాక్షసత్వం అణచివేతకు
చేయవలసిందే
సాదుస్వభావ దీక్ష..
దాన గుణం దక్షతకు
చేయవలసిందే
దాతృత్వ దీక్ష..
ధర్మం నడవాలంటే
చేయవలసిందే
ధర్మ దీక్ష..!
--పాల్వంచ హరికిషన్,
రామన్నపేట
9502451780
7.
రమాదేవి కులకర్ణి
హైదరాబాద్
క స 9
అంశం - నిరాహారదీక్ష
----------------------------------------------------------
*సంయమనం*
మనిషి మనసు దాకా
చేరాలంటే....
కడుపు నుండే దారి
అన్నారు కదా
పొట్ట సూసేది తల్లే
అన్నారు కదా
అన్నమయ కోశమే
అతి ముఖ్యము
సహస్రారము
వికసించాలంటే
అన్నమయ శుద్ధితోనే
ఆరంభము
అన్నారు కదా
నీ శరీరం నీమాట
వినాలంటే
నీ ఆరోగ్యం నీ
చేతుల్లో ఉండాలంటే
మితిమీరి తినొద్దు
అన్నారు కదా
ఆధ్యాత్మిక ఉన్నతిలోన
పరంధాముని
కనుగొనుట లోన
ఉపవాసమొక
మార్గమని
సాధకులెందరో
అన్నారు కదా
నిరసనలు, ఉద్యమాలు
అహింసామార్గాన
నడిపిన నేతలు
నిరాహారదీక్షనే
తగిన రీతి యని
అన్నారు కదా
అయ్యదగ్గర గారాము
చేయాలన్నా
ఆలి మాట మగని దగ్గర
నెగ్గాలన్నా
తిండి మానేయడమే సరియని
అన్నారు కదా
ఎవరెలా ఎంచుకున్నా
నిన్ను
ఓ నిరాహార దీక్షా....
అప్పుడప్పుడు
ఆత్మసంయమమునకు
ఆరోగ్య వృద్ధికి
నీవు బహు బాగు... !
బాగు....!!
నేనంటున్నా కదా..... !!
8
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:18-4-2020
అంశం: ఉపవాసదీక్ష
శీర్షిక: వజ్రాయుధం
*************************
నిరసన తెలపడానికి ఋజుమార్గం
కదలిక తేవడానికి ధర్మసూత్రం
ప్రాణాన్ని ఇచ్చే ఆహారాన్ని,నీటిని
తీసుకోకుండా చేసే సత్యాగ్రహం
నిరాహారమే నిరసనకు ఆయుధం
ఉపవాసమే ఉద్యమానికి ఊతం
నిస్సత్తువ ఆవహించినా,శక్తి సన్నగిల్లినా
లక్ష్యమే ఆహారంగా,సాధనే కర్తవ్యంగా
నేటికీ ఆచరింపబడుతున్న గాంధీమార్గం
పాలకులపై ఎక్కుపెట్టే పాశుపతాస్త్రం
ఇంద్రియనిగ్రహంతో చేసే యోగం
ప్రాయశ్చిత్తం, పరివర్తనలు ఆకాక్షించే వ్రతం
మార్పుకోసం,మనుగడ కోసం సల్పే దీక్ష
అహింసామార్గంలోని అజేయ యుద్ధం
తాను తపిస్తూ,శరీరాన్ని తపింపజేస్తూ
ఎదుటివారిలోని మానవతకు పెట్టే పరీక్ష
ఓర్పు,సహనాలతో స్వీయశిక్ష ననుభవిస్తూ
శాంతి,సౌజన్యాలతో ప్రకటిత నిరసనను తెలియజేస్తూ
నాటి నుండి నేటి వరకు ప్రజలకోసం,పరిష్కారాలకోసం
మార్పుకోసం చేసిన,చేస్తున్న
మహాయజ్ఞం
వ్యష్ఠిగానైనా,సమష్ఠిగానైనా
చేసే ఐక్యపోరాటం
సహనశక్తే విజయాలకు మూలం
అది ఉపవాసదీక్ష అందించే
సందేశం.
9
మర్రి జయశ్రీ
అంశం.నిరాహారదీక్ష
హక్కులని హరించి
స్వేచ్చకు భంగం కలిగించి
న్యాయమైన కోర్కెలను
నిరాకరించిన వేళ
అధికార మదాంధుల
అహంభావాన్ని నిరసిస్తూ
మనలో కలిగే తిరుగుబాటు
కార్యసాధకుని లక్ష్యం
ఆగ్రహావేశాలు లేని
మారణాయుదాలు చేపట్టని
శాంతియుత సమరం
నిగ్రహంతో చేసే మహాయజ్ఞం
అన్న పానీయాలు నిరాకరించి
అన్యాయం పై తిరగబడి
విజయం సాధించే ధర్మ మార్గం
స్వార్ధమెరుగని నిస్వార్థ పోరాటం
అందరు ఐక్యతతో చేసే దీక్ష
ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేస్తూ
పనులకు ఆటంకం కలిగిస్తూ
పరివర్తన కలిగించి
మానవత్వంతో అంగీకరించే టట్లు చేసే మహా అస్త్రం
మహాత్ముడి శాంతి అహింసా ఆయుధాలతో చేసిన సత్యాగ్రహం
నేడు మనం అనుభవించే స్వాతంత్ర్య ఫలం
పొట్టి శ్రీరాములు త్యాగం
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం
ఉపవాసం,నిరాహారదీక్షలు
ఆరోగ్యాన్ని చేకూరుస్తూ
ఉద్యమానికి బలం చేకూరుస్తూ
సమస్యల్ని పరిష్కరించి
విజయ తీరాలను చేర్చే సోపానాలు.
10.
వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:: ఉపవాస దీక్ష
::::::::::::::::::::::::::::::::::
దేహాలు చెప్పిన మాట వినకున్నా
మనసులు మాత్రం నిష్ఠ తో
ఉపవాసం చేస్తున్నాయిప్పుడు..
ఇంద్రియాల నిగ్రహమే
ఆగ్రహాలను అంతం చేస్తుందని
మనసంతా సమతా భావనలే
సమైక్యతా రాగాలాపనలవుతాయనీ
గాంధీ మహాత్ముడు చెప్పిన వాక్కులు
అక్షర సత్యాలై ప్రకాశిస్తున్నవి..
భగవన్నామ స్మరణతో
సాన్నిధ్యంలో
మననలను మనం తరచి చూసుకునే
మహా భాగ్యమే ఉపవాసం..
అందరం ఆ దీక్ష చేపడదాం
11.
డా.బల్లూరి ఉమాదేవి
శీర్షిక : ఉపవాస దీక్ష
నిరాహార దీక్ష
ఉపవాసం అంటే హరిచెంతనె వాసం
తనువును మనసును కుదుట పరిచే వ్రతం
భజనలతో శ్రీహరి నారాధించే దీక్ష యిది
శ్రీహరి యందే మది లగ్నం చేసి
తిండి నీరు మానేసి మదిలో చింతన చేస్తూ
హరిధ్యాసలో గడపడం విశేషంఉపవాసం
నిరాహాం నిర్జల మంటూ
పక్షం రోజులకొకసారి
నిష్టతొ కొందరు శ్రద్ధతొ చేసే దీక్ష ఇది
భక్తిని పూని తను ధృడతను కోరి
పలువురు పలు విధాలుగా చేసే
దివ్యమైన వ్రతరాజమీ ఉపవాసం
నిసనలకైనా కార్యసాధన కైనా
ఉద్యమాలకు ఊపిరి నొసగే
బలవత్తరమైన ఆయుధం
హింసలు దాడులు లేకుండా
రక్తపాతం లేకుండా
కార్య సాఫల్యం దిశగా సాగించే
అత్యద్భుతమైన దీక్ష యిది.
12.
అంశం : నిరాహారదీక్ష
పేరు:వై.కె.సంధ్యశర్మ
సహనానికి పరీక్షే నిరాహారదీక్ష
మహాత్ముని కదే సమరాయుధమై
సాగింది స్వతంత్ర సామ్రాజ్యంలో
తన అడుగుజాడలో
ఒంపిన ఆత్మస్థైర్యమే
అణువుణువు నింపిన దీక్ష !
మాటకు మాట కరవాలమై
సంయమయనం లోపించి
సత్యాగ్రహానికి నిరోధకమైతే
ఆత్మ శుద్ధితో ఆయువు పణమై
మౌనమే శరణ్యమై
మహాత్ముడు అక్కున చేర్చుకున్న
ఆయుధం నిరాహారదీక్ష!
ఇంద్రియ నిగ్రహంతో
మనుస్సు నిర్మలంతో
వాక్ శుద్ధితో సచేతనంగా
సారస్వతంగా పాటించి
సహాయనిరాకరణోద్యమంలో
ఆమూలాగ్రం అమోదించుకున్న
మహాత్ముని ఆయుధం
నిరాహారదీక్ష!
సామరస్యమే స్వామ్యంగా
సాధుజనీనత సర్వంగా
దేశ స్వాతంత్ర్య పోరాటంలో
సగర్వంగా విదేశీయుల దర్పమణచి
స్వదేశాన్ని సాధించిన ఆయుధం
మహాత్ముని నిరాహారదీక్ష!
ఆనాటి తన ఆయుధం స్వతంత్ర సాధనకైతే
ఈనాడు మన ఆరోగ్య సాధనం లాక్ డౌన్
నిరాహారదీక్ష... పాటిద్దాం
అందరం ఆరోగ్యంగా వుందాం
కరోనా మహమ్మారి ని అంతమొందిద్దాం!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం
శివునూరి లలితా కృష్ణ
అవధాని
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు
సహకారం
మెరుగు మధు
**************
కవితా గానం జాబితా
1.కోరాడ నరసింహా రావు గారు
2.ఇంద్రవత్ రాహుల్ గారు
3.విజయ దుర్గ (వినీలమ్మ) గారు
4.వల్లాల విజయ లక్ష్మి గారు
5.దీపక్ న్యాతి గారు
నంది అవార్డు గ్రహీత
6.పాల్వంచ హరికిషన్ గారు
7.రమా కులకర్ణి గారు
8.డా.రామక కృష్ణ మూర్తి గారు
9.మర్రి జయశ్రీ గారు
10.వురిమళ్ళ సునంద గారు
11.డా.బల్లూరి ఉమాదేవి గారు
12.సంధ్యా శర్మ గారు
**********************"
1
తేదీ:18-04-2020.
అంశం:-,ఉపవాసం
నిరాహారదీక్ష !
కోరాడ నరసింహా రావు.,
* సహక రిస్తుంది *
*****************
ధర్మ విరుద్ధమైన... అన్యాయానికి
నీ ని రసనను నిరాహార దీక్షతో ప్రకటించు..!
ఉపవాసదీక్షతో ఆ సర్వేశ్వరునిప్రార్ధించు
నీ దీక్ష ఫలిస్తుంది !
నీ న్యాయమైన కోర్కెనెరవేరితీరుతుంది !!
లోకానికి మేలు జరి గి...
శాంతి ,సౌఖ్యాలు చేకూరుతాయి...!
ఇదీ...నిరాహార దీక్షతో ఉపవాసం చేస్తే...
వచ్చే గొప్ప ఫలితం...!
ఆనాడుగాంధీ,మరోనాడుపొట్టిశ్రీరాములు.,
నేడెందరో...అక్కడక్కడా...అప్పుడప్పుడు! ఉదాహర ణలుగా నిలిచాయి !
హింసా,దౌర్జన్యాలతో...
సాధించేదేమీ ఉండదు సోదరా !
మరింత అశాంతీ అలజడులు తప్ప !!
క్రోధంతో...ద్వేషంతోసాధించలేనిది...
శాంతి,సత్యాగ్రహప్రతిపా దితాలైన నిరాహార,ఉపవాస దీక్షలే సాధించ గలవు !!
చెడును నిరసిస్తూ ...చెడుగానేప్రవర్తిస్తే ...
మంచినెలా సాధించ గలం...!?
చెడు అనే చెత్తను...
మంచిఅనేచీపురుతో
పూర్తిగా తుడిచి...పెంటమీద పారెయ్ !
ఆ చెడే...పనికొచ్చేసారవంతమైన
పెంట ఎరువై...మంచిసారాన్నందిస్తుంది...
మనకు చ క్కగా సహకరిస్తుంది!
*****************
.......కోరాడ.
★★★★★★★★★★★
2.
*అంశం* : ఉపవాస దీక్ష
*రచన తేది*: 18/04/2020
మనిషి చేయాలి ఉపవాస దీక్ష
జీవితం కోసం పోరాడే దీక్ష
భగవంతుడికి కావాలి సత్యం, దయ, ఉపవాస దీక్ష
మానవుడికి కావాలి దానం చేసే ఉపవాస దీక్ష..
జ్ఞానం కోసం చేయాలి ఉపవాస దీక్ష..
పేరు కోసం చేయాలి ఉపవాస దీక్ష...
మానవులు చేయాలి భగవంతుడికి మోక్షం ఇచ్చే ఉపవాస దీక్ష..
వ్యాస మహర్షి చేసాడు ఆకలి ఉపవాసపు దీక్ష..
మనం చేయాలి ఆ దేవుడికి మన భవిష్యత్తు కోసం ఉపవాసపు దీక్ష...
🎯 *కవి పరిచయం* 🎯
*************************
పేరు : ఇంద్రవత్ రాహుల్
ఊరు : మల్కాపూర్
జిల్లా : ఇందూర్ /నిజామాబాదు
మండలం : ఇందూర్ /నిజామాబాదు
చరవాణి : *9848054079*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
3.
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : నిరాహార దీక్ష
ఉపవాస దీక్ష
కవితా సంఖ్య: 07
ఏ దీక్షయినా మనలోని
ఆశ నిరాశలకు మూలస్థానమై
ధ్వజస్థంభంలా నిలబెట్టు
పట్టుదల ప్రాకారాలు....!!
అసహన కట్టలు తెంచుకొని
పెత్తందారీ తనాన్ని మోయలేక
అణగారి ఉన్న నిస్తేజం
మీసాలను తొడిగి ఓర్పుతో స్నేహాన్ని
చేస్తూ ఆత్మవిశ్వాస పట్టుతో
నిరాహార దీక్షలో ఎజెండా నే....!!
ఆధ్యాత్మిక వాసనలతో
చల్లని కరదీపికలకై
మనసు నిండా భక్తి బావాల వెల్లువలో
ఉపవాసదీక్షలో ముక్తికై
మనోపుష్పాలను అర్పించును....!!
దీక్ష ఒక్కటే రూపాలే
ద్విపాత్రాభినయనాలు
ఆత్మవాసనలకు ఒకటైతే
సమాజ సమతుల్యానికి ఒకటి
మానవ జన్మకు రెండూ పురోగమనమే....!!
వినీల
4
శీర్షిక::**ఉపవాస(నిరాహార)దీక్ష**
ఇంట్లో మనముండిన చాలు
కరెంటు లేకుండా పనిచేసే
నోటిమిషను నడుస్తనే ఉంటది
పంటికి పని చెబుతనే ఉంటం
ఒంటికి పడని పదార్థాలైనా
కంటికి కనిపిస్తే చాలు ఊరిళ్ళొచ్చి
చాలు అనుకుంటూనే
కటకటమనిపించటం
ఆనక చిటపటలతో చిందులేయటం
ఫంక్షన్లలో *పదార్థాలపై నోరు చేసుకోవటం*
ఆపై ఆపసోపాలతో ఆయాసపడటం
లావై పోతున్నానని ఆలోచి0చటం
బరువెక్కుతున్నానని బాధపడటం
పలువురికి అనుభవం
దేహపోషణకవసరం సంపూర్ణ ఆహారం
అనవసర చిరుతిండ్లు తెచ్చు ఊబకాయం
శారీరకశ్రమ తగ్గిన నేటిరోజుల్లో
కొన్ని సమస్యలకు పరిష్కారం
వారానికోసారి ఉపవాసదీక్షావ్రతం
జీర్ణవ్యవస్థకు విశ్రాంతి దక్కును
మనసుకు సంతృప్తి దొరకును
నిరాహారదీక్షకు భక్తిభావం తోడయిన...
ఆలోచనలను శుద్ధిచేయు ఉపవాస దీక్షయగు
*ఆహారానికి దూరముండటమంటే
ఆ భగవంతునికి దగ్గరుండటమే*
మోక్షమార్గానికి దారిన పడటమే
ఆరోగ్యాన్ని దృష్టినుంచుకునే ఉపవాసం
సదాలోచనలకు సహవాసం
గాంధీజీ ఆయుధమై గెలిపించిన. నిరాహారదీక్ష నవీనయుగాన అస్త్రం
ఆహారపదార్థాలను పొదుపుచేయు మార్గం
ఏవిధంగాచూసినా ఈ దీక్ష *సoరక్ష*
*వల్లాల విజయలక్ష్మి* ,,ఆలేరు
5
అంశం : ఉపవాస దీక్ష నిరాహారదీక్ష
రచయిత : దీపక్ న్యాతి
శీర్షిక : దీక్ష దీక్షే
ఓం గురి ఓ లక్ష్యం దీక్ష
ఓ ఆశ ఓ కోరిక దీక్ష
ఓ పట్టుదల ఓం నమ్మకం దీక్ష
ఆద్యాత్మిక ఉపవాస దీక్ష
నిరసన నిరాహార దీక్ష
దైవ సన్నిధిని ఆకాంక్షించి
భగవంతుని ధ్యాస కోరి
దేవుని కటాక్షం ఆశించి
సన్నిహితంగా మెలిగే దీక్ష
ఉపవాస దీక్ష ఉప వాసమే దీక్ష
రక్త సంబంధీకుల క్షేమానికి
ఆత్మీయుల శ్రేయమాశించి
ఉపచారాలు చేయ ఉప వాసమున్నా
అదికూడా ఉపవాస దీక్ష
కొంత ఆశించి దొరకక
శాంతి అహింసా మార్గాన
అన్న పానీయాలు మాని
ఆహారం త్యజించి
సానుభూతిని సంపాదించి
నమ్మకాన్ని చూరగొని
అనుకున్నది సాధించే
తపనే నిరాహారదీక్ష
తన కోసమే కాదు
తన వారి కోసం
తన దేశం కోసం
స్వార్థం లేక ఇతరుల కోసం
నిరాహార దీక్షలు చేసి
లక్ష్యాన్ని సాధించుకున్న
సందర్భాలెన్నో వున్నా
ఆమరణ నిరాహార దీక్ష చేసి
ప్రాణత్యాగం చేసిన సంఘటనలు
చరిత్రలో చాలా ఉన్నాయి
తెలుగు ఉభయ రాష్ట్రాలు
వీడక ముందు సంయుక్త రాష్ట్రాం
ఏర్పడటానికి కారణం
శ్రీ పొట్టిశ్రీరాములు నిరాహారదీక్షే
డా.దీపక్ న్యాతి
6
తేది: 18-04-2020
శీర్షిక: దీక్ష..!
ఆరోగ్యం అప్రమత్తతకు
చేయవలలిందే
ఉపవాస దీక్ష..
మానవత్వం అప్రమత్తతకు
చేయవలసిందే
ఆత్మీయతల దీక్ష..
రాక్షసత్వం అణచివేతకు
చేయవలసిందే
సాదుస్వభావ దీక్ష..
దాన గుణం దక్షతకు
చేయవలసిందే
దాతృత్వ దీక్ష..
ధర్మం నడవాలంటే
చేయవలసిందే
ధర్మ దీక్ష..!
--పాల్వంచ హరికిషన్,
రామన్నపేట
9502451780
7.
రమాదేవి కులకర్ణి
హైదరాబాద్
క స 9
అంశం - నిరాహారదీక్ష
----------------------------------------------------------
*సంయమనం*
మనిషి మనసు దాకా
చేరాలంటే....
కడుపు నుండే దారి
అన్నారు కదా
పొట్ట సూసేది తల్లే
అన్నారు కదా
అన్నమయ కోశమే
అతి ముఖ్యము
సహస్రారము
వికసించాలంటే
అన్నమయ శుద్ధితోనే
ఆరంభము
అన్నారు కదా
నీ శరీరం నీమాట
వినాలంటే
నీ ఆరోగ్యం నీ
చేతుల్లో ఉండాలంటే
మితిమీరి తినొద్దు
అన్నారు కదా
ఆధ్యాత్మిక ఉన్నతిలోన
పరంధాముని
కనుగొనుట లోన
ఉపవాసమొక
మార్గమని
సాధకులెందరో
అన్నారు కదా
నిరసనలు, ఉద్యమాలు
అహింసామార్గాన
నడిపిన నేతలు
నిరాహారదీక్షనే
తగిన రీతి యని
అన్నారు కదా
అయ్యదగ్గర గారాము
చేయాలన్నా
ఆలి మాట మగని దగ్గర
నెగ్గాలన్నా
తిండి మానేయడమే సరియని
అన్నారు కదా
ఎవరెలా ఎంచుకున్నా
నిన్ను
ఓ నిరాహార దీక్షా....
అప్పుడప్పుడు
ఆత్మసంయమమునకు
ఆరోగ్య వృద్ధికి
నీవు బహు బాగు... !
బాగు....!!
నేనంటున్నా కదా..... !!
8
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:18-4-2020
అంశం: ఉపవాసదీక్ష
శీర్షిక: వజ్రాయుధం
*************************
నిరసన తెలపడానికి ఋజుమార్గం
కదలిక తేవడానికి ధర్మసూత్రం
ప్రాణాన్ని ఇచ్చే ఆహారాన్ని,నీటిని
తీసుకోకుండా చేసే సత్యాగ్రహం
నిరాహారమే నిరసనకు ఆయుధం
ఉపవాసమే ఉద్యమానికి ఊతం
నిస్సత్తువ ఆవహించినా,శక్తి సన్నగిల్లినా
లక్ష్యమే ఆహారంగా,సాధనే కర్తవ్యంగా
నేటికీ ఆచరింపబడుతున్న గాంధీమార్గం
పాలకులపై ఎక్కుపెట్టే పాశుపతాస్త్రం
ఇంద్రియనిగ్రహంతో చేసే యోగం
ప్రాయశ్చిత్తం, పరివర్తనలు ఆకాక్షించే వ్రతం
మార్పుకోసం,మనుగడ కోసం సల్పే దీక్ష
అహింసామార్గంలోని అజేయ యుద్ధం
తాను తపిస్తూ,శరీరాన్ని తపింపజేస్తూ
ఎదుటివారిలోని మానవతకు పెట్టే పరీక్ష
ఓర్పు,సహనాలతో స్వీయశిక్ష ననుభవిస్తూ
శాంతి,సౌజన్యాలతో ప్రకటిత నిరసనను తెలియజేస్తూ
నాటి నుండి నేటి వరకు ప్రజలకోసం,పరిష్కారాలకోసం
మార్పుకోసం చేసిన,చేస్తున్న
మహాయజ్ఞం
వ్యష్ఠిగానైనా,సమష్ఠిగానైనా
చేసే ఐక్యపోరాటం
సహనశక్తే విజయాలకు మూలం
అది ఉపవాసదీక్ష అందించే
సందేశం.
9
మర్రి జయశ్రీ
అంశం.నిరాహారదీక్ష
హక్కులని హరించి
స్వేచ్చకు భంగం కలిగించి
న్యాయమైన కోర్కెలను
నిరాకరించిన వేళ
అధికార మదాంధుల
అహంభావాన్ని నిరసిస్తూ
మనలో కలిగే తిరుగుబాటు
కార్యసాధకుని లక్ష్యం
ఆగ్రహావేశాలు లేని
మారణాయుదాలు చేపట్టని
శాంతియుత సమరం
నిగ్రహంతో చేసే మహాయజ్ఞం
అన్న పానీయాలు నిరాకరించి
అన్యాయం పై తిరగబడి
విజయం సాధించే ధర్మ మార్గం
స్వార్ధమెరుగని నిస్వార్థ పోరాటం
అందరు ఐక్యతతో చేసే దీక్ష
ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేస్తూ
పనులకు ఆటంకం కలిగిస్తూ
పరివర్తన కలిగించి
మానవత్వంతో అంగీకరించే టట్లు చేసే మహా అస్త్రం
మహాత్ముడి శాంతి అహింసా ఆయుధాలతో చేసిన సత్యాగ్రహం
నేడు మనం అనుభవించే స్వాతంత్ర్య ఫలం
పొట్టి శ్రీరాములు త్యాగం
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం
ఉపవాసం,నిరాహారదీక్షలు
ఆరోగ్యాన్ని చేకూరుస్తూ
ఉద్యమానికి బలం చేకూరుస్తూ
సమస్యల్ని పరిష్కరించి
విజయ తీరాలను చేర్చే సోపానాలు.
10.
వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:: ఉపవాస దీక్ష
::::::::::::::::::::::::::::::::::
దేహాలు చెప్పిన మాట వినకున్నా
మనసులు మాత్రం నిష్ఠ తో
ఉపవాసం చేస్తున్నాయిప్పుడు..
ఇంద్రియాల నిగ్రహమే
ఆగ్రహాలను అంతం చేస్తుందని
మనసంతా సమతా భావనలే
సమైక్యతా రాగాలాపనలవుతాయనీ
గాంధీ మహాత్ముడు చెప్పిన వాక్కులు
అక్షర సత్యాలై ప్రకాశిస్తున్నవి..
భగవన్నామ స్మరణతో
సాన్నిధ్యంలో
మననలను మనం తరచి చూసుకునే
మహా భాగ్యమే ఉపవాసం..
అందరం ఆ దీక్ష చేపడదాం
11.
డా.బల్లూరి ఉమాదేవి
శీర్షిక : ఉపవాస దీక్ష
నిరాహార దీక్ష
ఉపవాసం అంటే హరిచెంతనె వాసం
తనువును మనసును కుదుట పరిచే వ్రతం
భజనలతో శ్రీహరి నారాధించే దీక్ష యిది
శ్రీహరి యందే మది లగ్నం చేసి
తిండి నీరు మానేసి మదిలో చింతన చేస్తూ
హరిధ్యాసలో గడపడం విశేషంఉపవాసం
నిరాహాం నిర్జల మంటూ
పక్షం రోజులకొకసారి
నిష్టతొ కొందరు శ్రద్ధతొ చేసే దీక్ష ఇది
భక్తిని పూని తను ధృడతను కోరి
పలువురు పలు విధాలుగా చేసే
దివ్యమైన వ్రతరాజమీ ఉపవాసం
నిసనలకైనా కార్యసాధన కైనా
ఉద్యమాలకు ఊపిరి నొసగే
బలవత్తరమైన ఆయుధం
హింసలు దాడులు లేకుండా
రక్తపాతం లేకుండా
కార్య సాఫల్యం దిశగా సాగించే
అత్యద్భుతమైన దీక్ష యిది.
12.
అంశం : నిరాహారదీక్ష
పేరు:వై.కె.సంధ్యశర్మ
సహనానికి పరీక్షే నిరాహారదీక్ష
మహాత్ముని కదే సమరాయుధమై
సాగింది స్వతంత్ర సామ్రాజ్యంలో
తన అడుగుజాడలో
ఒంపిన ఆత్మస్థైర్యమే
అణువుణువు నింపిన దీక్ష !
మాటకు మాట కరవాలమై
సంయమయనం లోపించి
సత్యాగ్రహానికి నిరోధకమైతే
ఆత్మ శుద్ధితో ఆయువు పణమై
మౌనమే శరణ్యమై
మహాత్ముడు అక్కున చేర్చుకున్న
ఆయుధం నిరాహారదీక్ష!
ఇంద్రియ నిగ్రహంతో
మనుస్సు నిర్మలంతో
వాక్ శుద్ధితో సచేతనంగా
సారస్వతంగా పాటించి
సహాయనిరాకరణోద్యమంలో
ఆమూలాగ్రం అమోదించుకున్న
మహాత్ముని ఆయుధం
నిరాహారదీక్ష!
సామరస్యమే స్వామ్యంగా
సాధుజనీనత సర్వంగా
దేశ స్వాతంత్ర్య పోరాటంలో
సగర్వంగా విదేశీయుల దర్పమణచి
స్వదేశాన్ని సాధించిన ఆయుధం
మహాత్ముని నిరాహారదీక్ష!
ఆనాటి తన ఆయుధం స్వతంత్ర సాధనకైతే
ఈనాడు మన ఆరోగ్య సాధనం లాక్ డౌన్
నిరాహారదీక్ష... పాటిద్దాం
అందరం ఆరోగ్యంగా వుందాం
కరోనా మహమ్మారి ని అంతమొందిద్దాం!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Thankyou
ReplyDeleteఒక గొప్ప పోరాట ఆయుధం నిరాహారదీక్ష.నేటితరం కూడా ఆచరిస్తున్న ఉద్యమ సూత్రం.బాగుంది.మంచి అంశం.
ReplyDelete