సమూహ నిర్వహణః
వీరా గుడిపల్లి ః
the mathematics teacher and poet
సమన్వయం ః
శివునూరి లలితా కృష్ణ
సహకారం ః మెరుగు మధు
అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
*************************
కవి వరుల జాబితా
1.నోముల సంజీవరెడ్డి గారు
2ఐలేని సంజీవరెడ్డి గారు
3.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
4.కోరాడ నరసింహా రావు గారు
5.విజయ దుర్గ గారు
6.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
7.మర్రి జయశ్రీ గారు
8.వల్లాల విజయ లక్ష్మి గారు
9.కోరాడ నరసింహా రావు ఊ
10.పాల్వంచ హరి కిషన్ గారు
11.కొలచన విజయ భారతి గారు
12.అంబటి భాను ప్రకాష్ గారు
13.వకుళ వాసు గారు
14.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
15.కాల్వ రాజయ్య గారు
16.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
17.మహేందర్ జవ్వాజి గారు
18.వల్లాల విజయ లక్ష్మి గారు
19.YLN Reddy garu
20.విజయ దుర్గ గారు
21.శివ లక్ష్మీ రాజు శేఖర్
22.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
23.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
24.వేంకట కృష్ణ ప్రగడ గారు
25.అభిరాం గారు
26.డాక్టర్ బండారు సుజాతా శేఖర్ గారు
27.మర్రి జయశ్రీ గారు
28.వైద్యం భాస్కర్ గారు
29.మువ్వా ప్రసాద్ గారు
30.స్వర్ణ సమత గారు
31.భూమయ్య గారు
32.సునంద గారు
33.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
34 దండమూడి శ్రీ చరణ్ గారు
35.సునంద వురిమిళ్ళ గారు
36.పోలా కిషోర్ కుమార్ గారు
37.రమా కులకర్ణి గారు
****************
1
నోముల సంజీవరెడ్డి
అంశం : శ్రీ శ్రీ
తెలుఁగు కవిత్వాన్ని ఖండించి దీవించి
ఊగించి శాసించి రక్షించిన కవి శ్రీ శ్రీ
మానవుడే నా సందేశం
మనుష్యుడే నా సంగీతం అన్నాడు
భావ కవితాకాశంలో కులుకుతూ విహరిస్తున్న
తెలుఁగు కవితా కన్యకను
నేలకు దింపి అభ్యుదయ పథంలో
సామాన్యుడే వస్తువుగా వాస్తవికతే
ప్రాణంగా పరుగుల పెట్టించిన అభ్యుదయ వాది
మాటల్ని కత్తులుగా ఈటెలుగా మంటలుగా
మలచడం తెలిసిన ఏకైక తెలుఁగు కవి
ప్రపంచం బాధను తన కలంలో
పలికించిన అనితర సాధ్యుడు
మరోప్రపంచం పిలిచిందంటూ
ప్రస్తుత వ్యవస్థమీద యుద్ధం ప్రకటించి
నవసమాజ స్థాపనకు ఆశలు నింపాడు
ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిదని
ఈ దోపిడీ సమాజాన్ని ప్రశ్నిస్తాడు
శ్రమైక జీవన సౌందర్యసానికి పట్టం కట్టిన
సాహితీ వైతాలికుడు
తాడిత పీడిత శ్రామిక వర్గాల దోపిడి
వ్యవస్థీకరించబడ్డ పెట్టుబడిదారీ వ్యవస్థపై
విప్లవశంఖం పూరించిన కవి సింహం
పాత పదాల చీరెలను ఛందో బంధనాలను
తెంచి తెలుగుసాహితీ కన్యకు
సహజ సౌందర్య భాషను అలంకరించాడు
ఆత్మాశ్రయ ధోరణుల పెడదారినుంచి
తెలుఁగు కవిత్వాన్ని సమాజ దారిని పట్టించాడు
అప్పటికే ఉన్న పాత దారులవెంట
పయనమెవరికైనా సులభం సుఖమయం
కాని శ్రీ శ్రీ తనే ఒక కొత్త బాటను వేసి
దానివెంట ధైర్యంగా నడిచి అందరినీ
నడిపించిన సాహసి ప్రగతి శీలుడు
ఆయన కవిత్వంలోని భుగభుగలకు
భగభగలకు జ్వలన పదాల జ్వాలకు
తన తరువాత వచ్చిన కవిత్వమంతా
మసకబారిందన్నది నిజం .
ఎదేమైనా అనితరసాధ్యం శ్రీ శ్రీ పథం .
2
: ...... శ్రీ శ్రీ.....
************
మరో ప్రపంచ నిర్మాణం కోసం
పునాదులు వేసిన మేస్త్రి
మూఢత్వపు సంకెళ్ళు తెంచి
ఆధునికతకు మార్గం వేసిన
అక్షర శిల్పి
పెను నిద్దుర నుండి సమాజాన్ని
నిర్లిప్తత నుండి యువతను
జాగురూకం చేసి
పదండి ముందుకు అంటూ
నవసమాజం వైపు నడిపించిన
ఆధునిక మార్గదర్శి
కార్మికుల కోసం
కర్షకుల కోసం
దగాపడ్డ తమ్ముళ్ళకోసం
ఎలుగెత్తి నినదించిన
నిత్య చైతన్య శీలి
నేను సైతం అంటూ
లోకంలో ఉన్న బాధనంతా
తన బాధగా చేసుకున్న
మానవతా మూర్తి
అభ్యుదయ వాదులకు
నిరంతర స్ఫూర్తి
ఆయనే శ్రీ శ్రీ
.... సంజీవరెడ్డి ఐలేని...
3.
**శ్రీ శ్రీ ***
✍️డా.పాండాల
నరులకు కర్తవ్యంబును
వరముగ భావించి ప్రభవ వైఖరులెన్నో!
నెరిగించిన శ్రీ రంగము
సిరులొల్కెనుశ్రీనివాసుసిరిసిరిమువ్వా!
చక్కని సినిమా పాటలు
మక్కువ రసభావయుక్తి మాన్యతనెంచీ!
వాక్కున పదలాలిత్యం
చిక్కని నవజాగృతాల సిరిసిరి మువ్వా
సరిరారిల మీకెవ్వరు
అరసవిరసపదవులైన అవలీలగనే
తరతరములవారధిగా
సిరిపదముల గడసరీవు
సిరిసిరి మువ్వా !
శ్రీ కారము నవకవులకు
శ్రీ కరమే శ్రేష్టతౌను స్థిరచిత్తముగన్
ఓంకారపు మమకారపు
ఘీంకారమునేర్పితివిల సిరిసిరి మువ్వా!
ఎండిన బతుకుల కొరకై
పండిస్తివి కవితనంత ప్రజ్ఞానిధిగా!
దండిగ విప్లవ స్ఫూర్తితొ
ఖండితముగ ఖడ్గసృష్టి కవితాస్త్రముతో..!
✍️డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
4
[🙏🌷శ్రీ శ్రీ 🌷🙏
*****************
అపసవ్య పు సమా జాన్ని...సవ్యముగా నడిపించగా...యుగయుగ మున సంభ వించిరి సాహితి వేత్తల రూపము దాల్చి !
ఎందరెందరో మహానుభావులు...
కందుకూరి,గురజాడ వంటి వారెందరో...!
కార్మిక...కర్షక...
పీడిత...తాడిత...
శ్రామిక వర్గపు ...
బతుకు చీకట్లు
తొలగించే....,
అభ్యుదయ బాల
భానూదయ మే ...
శ్రీ శ్రీ రూపము దాల్చె నహో....!
ప్రజ్వ లించె విప్లవ
మార్తాన్డమై...!!
నైరాస్యమునేతొలగించి,వవచైతన్యమునింపగా...!శుభములు చేకూర్చు
తొలిసంధ్య కు" శ్రీ " కార మై... "శ్రీ " కరమొసగిన ఆనందపు మలి
సంధ్య యై....!!
***🙏🌷🙏***
.....కోరాడ.
5
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : శ్రీశ్రీ
కవితా సంఖ్య: 19
తేదీ: 30/04/20
అసమతుల్యతలలో రగిలిన
నిప్పు కణిక
కష్టాల బీడులో మొలవలేక
అక్షర విత్తులను నాటిన వ్యక్తి....!!
అణగ దొక్కిన చోటే
కలమనే రాయతో విసిరిన
వడిశల సమూహం
పెత్తందారుల రెక్కలను విరిచే
పదాల ఖడ్గం....!!
సాహిత్యాన్ని సమాజ కొలిమిలో
మండించి వాడిగా వేడిగా శరాలను
వదిలిన కవితా ధనుస్సు
శ్రీశ్రీ మస్తిష్కమే అగ్నిపూల తేజస్సు....!!
పేదవాడికి వెన్నెల జల్లు
బడా బాబుకు ఎర్రని
రుధిరపు కత్తి
తనకలమే తన ఆయుధం...!!
అలుపెరగని పయనమే
తన పలుకే నిక్కబొడుచు
రోషపు చైతన్య రథం
నాటికి,నేటికి,రేపటికి ఎప్పటికీ
నిత్య నూతనమే కవులకు ఆదర్శమై....!!
🌹వినీల🌹
6
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:30-4-2020
అంశం:శ్రీ శ్రీ
శీర్షిక:భాస్కరుడు
**************************
కదనపాళిని ఎక్కుపెట్టి
బాధ్యతలను ఎలుగెత్తి చాటి
విప్లవశంఖం మోగించి
అగ్నివీణమెట్లను కదిలించి
సామాన్యుని ఘోషను వినిపించి
పీడిత,తాడిత ప్రజల పక్షం వహించి
అభ్యుదయాన్ని రంగరించి
కొత్తదనాన్ని సూత్రీకరించి
కవిత్వానికి నిర్వచనమిచ్చి
సంప్రదాయాలను తెంచి
నాగరికతను పెంచి
ప్రపంచబాధలను సమాంతరంగా సాక్షీకరించి
ఎరుపెక్కిన జ్వాలల్లోని
సెగలను తగిలించి
విస్ఫులింగాలను పుక్కిట నిల్పి
మానవతను మేల్కొలిపి
ఉద్యమాలను రగులుకొల్పి
ఎద తంత్రులను సుతిమెత్తగా మీటి
ఆకాశాన్ని అండగా చూపెట్టి
అవకాశాలను సమానంగా పంచి
ఇజాల నిజాలను దుమ్ముదులిపి
కమ్యూనిజమనే ఇమ్యూనిటీని అందించి
పేదవాడి మాటై,పాటై,నినాదమై మ్రోగించి
సహస్ర వెలుగులను చిమ్మిన భాస్కరుడు
మేడిపండు సమాజ స్కానింగ్లు
చేసి
ప్రణయగీతాలతో పదునైన మాటలతో
సాహిత్యంలో యుగకర్తగా నిలిచిన కవిశేఖరుడు
తెలుగుపాటకు వెలుగులందించి జాతీయ గుర్తింపు నిచ్చిన మార్గదర్శకుడు.
7
మర్రి జయశ్రీ
అంశం.శ్రీ శ్రీ
శీర్షిక.మహాకవి
విరుద్ధమైన భావాలు
విచిత్రమైన సంఘర్షణలు ఎదుర్కొంటూ
వయసొచ్చినా పసివాడుగానే ప్రవర్తిస్తూ
అహంకారం కలిగి ఉన్నా
ఆలోచనలెన్నో చేస్తూ
ప్రభ వతో ప్రారంభించి
మహాప్రస్తానంతో
తెలుగు సాహిత్యపు దశను,దిశను మార్చిన మార్గదర్శి
విప్లవ కవిగా
సాంప్రదాయ,ఛందోబద్ద కవిత్వాన్ని ధిక్కరించి
అల్పాక్షరములతో
అనల్పఅర్థాన్ని సృటించిన మహాకవి
ప్రాసకు,శ్లేషకు ప్రాధాన్యత నిచ్చే మేటి
శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపి
ఇరవెయ్యి శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన
అభ్యుదయ కవి
సినిమా పాటల రచయితగా వెల్గొంది
శ్రమ జీవుల పక్షాన నిలిచి
జాతిని జాగృతం చేసిన
నవయు గ వైతాళికుడు
శ్రమజీవి మదిలో చెరిగిపోని జ్ఞాపకం శ్రీ శ్రీ
8
శీర్షిక:******శ్రీశ్రీ*****
----------********---------
శ్రీ శ్రీ చైతన్య సాహితీ శిఖరం
శ్రీ శ్రీ లోతయిన భావ సముద్రం
శ్రీ శ్రీ ఉత్తేజభరిత కవిత్వం
శ్రీ శ్రీ ఊరికించే వచనసాహిత్యం
ఆ మహాకవి వెలిగించిన అక్షరజ్యోతులన్ని
సాహితీజగాన అఖండజ్యోతులై
వెలుగునిస్తూ మార్గం చూపిస్తున్నవి
ఆ కవిత్వం గురించి చెప్పటానికి తెలుగు భాషాపదాలు పోటీపడితుంటవి
అక్షరాలు ఎంతగా జ్వలించగలవో చూపినవాడు
ఆధునిక వచనకవితా ప్రపంచచక్రవర్తి
కమ్యు*నిజాన్ని* అభిమానించి ఖడ్గసృష్టి గావించి మహాప్రస్థానం సాగించిన సాహితీ ప్రచండుడు ..అదొక కోణం..
ఆయన కవితా పంక్తులు కవులెల్లరకు భగవథ్ గీతాపాఠాలు
ఆ విప్లవకవిలోని మరొక కోణాన్ని అవలోకిస్తే...
ఆయన సినీగీతాలను ప్రియంగా ఆలకిస్తే
కలుగు అలౌకికానందమే
'నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరునించుటకు నేనున్నానని నిండుగ పలికే తొడొకరుండిన అదే స్వర్గము
నా హృదయములో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ*ఆయన ప్రేమైక హృదయావిష్కరణలు
మనసున్న ప్రతివారు అనుభవించే కిరణాలు
'పాడవోయి భారతీయుడా అని దేశభక్తిని చాటుతూనే..స్వార్థమీ అనర్థకారణం-అది తెంచుకొనుట క్షేమదాయకం' అంటూ సామ్యవాదాన్ని భోధించటం మరువడు
కలసిపాడుదాం తెలుగు పాట అని తెలుగు గొప్పదనాన్ని గుర్తుచేసినా
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అంటూనే బ్రతుకు కన్నీటిధారలలోనే బలి చేయకు" అని చైతన్యపరచటం మరువడు..
.
ఎన్నేనో ప్రణాయగీతాలు ఆతని హృదయంలోని అర్థ కోణాన్ని ఆవిష్కరిస్తూ అబ్బురపరుస్తాయి
ప్రతి పాట సుమ గంధాలై సంతోషాన్నిస్తాయి
:వల్లాల విజయలక్ష్మి,,ఆలేరు
9
శుభాకాంక్షలతో...!
***************
కార్మికశ్రమచాతుర్యం
అపరస్వర్గధామంగా
మార్చెనుకదఈభువి
నే,వీరెమయబ్రహ్మలు
*****************
మనిషి మనుగడకు
సౌఖ్యాలుసమకూర్చే
శ్రామిక శక్తియె వీరు
జగతివందనీయులు!
*****************
అందాలనుఅద్దివీరు
ఆనందంకలిగింతురు
కళాత్మకతతొజీవిం
చు,కళాకారులే వీరు
*****************
శ్రమ చిందించే స్వేదం
అత్తరైపరిమళించుశ్ర
మనుచిన్నబుచ్చకగౌ
రవించవలెమనము!
*****************
........కోరాడ.
10
శీర్షిక: మే..డే..!
మేడలు కడుతారు
మెతుకుల తడుతారు
జీవన సమరంలో
చెమటను పడుతారు
బతుకు నావ నడిపిస్తారు
వ్యవసాయం..
వ్యయ ప్రయాసలతో చేసి
పంటను పండిస్తారు
అందరికి అన్నం పెడుతారు
అవసరానికి సాయమందక
చేసిన అప్పు తీర్చలేక
తనువును తప్పిస్తారు
శ్రామికులై కార్మికులై
ధనం మీరై ఇంధనాలై
జీవన చక్రం తిప్పేస్తారు
జన జీవన స్రవంతియై
గతులు మీరై జతులు మీరై
జీవన గమ్య శృతులు మీరై
దేశ చక్రపు ఇరుసు మీరైన
సమస్త కార్మిక శ్రామికులారా
మనదంతా ఒకే కులం
అదే అదే శ్రమకులం..
మనమంతా కార్మికులం..
కష్టాన్నే నమ్మకున్న..
కష్టపడి బతుకుతున్న
ప్రతీ ఒక్క కార్మికుడికి..
మే..డే శుభాకాంక్షలు.!
ఈ మేడే...
కార్మిక జాతికి దినోత్సవం
పీడిత జాతికి మహోత్సవం
వర్ధిల్లాలి.. ఈ జనోత్సవం..!!
(శ్రమను నమ్ముకున్న ప్రతి శ్రామికుని జీవితంలో వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూ..)
-- అర్జున(కలం పేరు)
పాల్వంచ హరికిషన్
9502451780
11
పేరు: కొలచన విజయ భారతి
ఊరు: హైదరాబాద్
అంశం:మేడే
కవిత సంఖ్య:7
తేదీ:1-5-2020
************************
తరతరాల తరబడి
రోజులు తరబడి
గంటల తరబడి
దోచుకోబడుతున్న కార్మిక శక్తికి
విమోచన కలిగిన శుభ దినం
వెట్టి చాకిరీ పనికాలం
స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న దినం
కార్మికులంతా ఏకశక్తిగా సంఘటితమై
ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించి
పోరాటం సాగించి సాధించుకున్న స్వేచ్ఛా దినం
కార్మిక రంగంలో కొత్త యుగానికి
నాంది పలికిన దినం
ఎర్రజెండా చీకటి బ్రతుకులలో
వెన్నెలలు రెపరెపలాడిన
పండుగ దినోత్సవం
తమ స్వేదపీ ప్రతి బొట్టునీ అక్షరాలుగా మార్చిచరిత్ర పుస్తకం లిఖించుకున్న
గ్రంథ వార్షికోత్సవ దినం
ప్రపంచ దేశ కార్మికులందరికీ
ఈరోజు వారి బ్రతుకు పుస్తకంలో ఒక పాఠ్యాంశంగా
మిగిలిన రోజు
🌹🌹🌹🌹🌹
12
*కార్మికదినోత్సవం*
🌷💐🌷
*కార్మికులు-ప్రగతి రథులు*
......................................
కం.
రక్తము కరిగించి మనకు
శక్తియె నిత్తురు నిరతము సంతోషముగా!
భక్తిగ పనినే జేసియు
ముక్తియె నా కందుననుచు మురిసెరు నిజమున్ !!
తే.
చెమట చిందించి శ్రమియించు చింతలేక
పనియె దైవంబు నాకంచు పరిత పించు!
విధిగ తనవంతు పనియంత వృద్ధి జేసె
కార్మికుడు వాడు ఘనుడయ్యె కలిమి బెంచ.!!
కం.
బండలు కరిగించి బలిమి
కండలు బెంచి సమాజ కలిమియె బెంచున్!
గండము లెదురైన విడడె
దండము కార్మికుల కంచు ధరణియె మ్రొక్కున్!!
కం.
కార్మికులు లేక సాగదు
ధార్మికులై సేవ జేయు ధరణి సుపుత్రుల్!
కార్మికులే ప్రగతి రథులు
కార్మిక జనతే వెలుగును కన్నుల వెలుగై!!
*అంబటి భాను ప్రకాశ్*
జోగులాంబ గద్వాల జిల్లా
9948948787.
13
వకుళ వాసు
హన్మకొండ
అంశం-మేడె
శీర్షిక-🍃సంకల్ప మొక్క🍃
కాలం కొమ్మకు ఆశల ఊయల కట్టుకున్న
శ్రమజీవన సౌందర్యాభిలాషిణై సాగుతున్న మున్ముందుకు
అత్యాశల మేఘాలు మనసులోన కురవకుండ ఈదరగాడ్పులతో చెల్లాచెదరు చేసి
చెమటచుక్కలతో
నేలను తడిపి సంకల్ప మొక్కను పెంచుకుంటున్న
శ్రమైక సోపాన భవంతిని నిర్మించుకుంటున్న ఏ ఆటుపోట్లకూ కూలిపోకుండా
అనుబంధాల లతలు అల్లుకొని ఎగబాకే పూలతీగకు ఆసరాగా మారనా
మొక్కవోని దీక్షతో కష్టాన్ని నమ్ముకొని శాఖోపశాఖలుగా విస్తరించిన తరువునై
నవసమాజానికి బాసటగా నిలుస్తూ బానిసత్వపు సంకెళ్ళు తెంచుకొని
స్వేచ్ఛా గాలులు వీస్తూన్నా కదలని మానునై
వేళ్ళూనుకొని నా గుండెబలంపై నిలుచున్న వ్యవస్థ ని నిలబెట్ట
అమ్మతనానికి అనాధిగా వెలకట్టలేని శ్రామికురాలినై
ప్రతిరోజు కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నా ఇల్లాలినై
🍀🌹వకుళ వాసు🌹🍀
14 ✍️ డా.పాండాల
అదిగదిగో అలజడి
విశ్వ జనులు శ్రామికులై
పిడికిలెత్తి పిలుపునిచ్చె
గుబులునంత తరిమికొట్టె..!
గుండెల శృతిలయ సవ్వడి
విశ్వాసమే చేతనంగ
ధరాతలంబంత జరిపే
కార్మికుల దినోత్సవం..!
ప్రపంచాన ప్రజ్జ్వలితం
కరాలల్ల బిగువచూపే
తరతరాల మనుగడెంచె
చైతన్యపు భావుకతా..!
త్యాగశీల నడవడికా
చేయిచేయి కలిపే బలం
అదే శ్రమకు మూలబలం
అన్నార్తులకాత్మబలం..!
అనాదిగా రాజరికం
ఆధునికపు క్యాప్టలిజం
శ్రమదోపిడి నైజంగా
అభివృద్ధి మంత్రంలో..!
ఇంతింతై ఆస్తిపెరిగె
కార్మికులే క్రుంగి పోయే
కుత్సితాల విలాసాల
గుట్టుబెట్టు పనిబట్టగ..!
కార్మికుల కలిసి జట్టు
శ్రమశక్తని చేతులెత్తి
యుక్తిరక్తి ఉపాయంగ
కాల నిర్ణయంబుజేసి..!
పనివేళలమార్పు కోరి
కష్టాలను యిష్టంగా
సంక్షేమం కోరుకున్న
సంఘటితమే శ్రమఫలమని..!
గని వనిలో కార్ఖానలో
పొలంగట్ల హలం పనిలో
వైద్యవిద్య రవాణము
రెవెన్యైన లేబరులే...!
స్వేధజలం ఆత్మబలం
అసంఘటిత రంగమైన
అందరమూ శ్రామికులం
మేధశక్తి లేబరులం...!
మేడేగా మేల్కొల్పె
నేడేగా నైపుణ్యం
తోడైనా నాగరికం
లేదు మనకు పేదరికం..!
విశ్వ క్రాంతి దినోత్సవం
విశ్వ శ్రేయ వినూతనం..
ఐశ్వర్యం ఆనందం
అవలోకన మన ధ్యేయం...!
✍️డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
15
కాల్వ రాజయ్య
1/5/2020
అంశము మేడె (కార్మిక దినోత్సవ0)
1ఆటవెలది
చేయి చేయి కలిపి చేయాలి సమరము
శ్రమను దోచువారి చర్మ మొలు వ
కష్ట జీవులాకు కర్మ గార ము లోన
బాగ మియ్యి మంటు బదులు జెప్ప
2ఆ వె
హలము బట్టి దున్ని యన్నంబు బెట్టేటి
కార్మికుండ సాగు కదలి ముందు
నీదు శ్రమకు లేదు నిజమైన ఫలితమ్ము
నడుము కట్టవోయి నాగలెత్తి
3 ఆ వె
కర్మాగార మందు కరిగించి
మాంసము
ముడిసరుకుల నంత ముత్య మోలె
తీర్చి దిద్ది నట్టి త్రీమూర్తులే మీరు
కష్ట జీవి వయ్య కార్మి కుండ
4ఆ వె
పగలు రేయనకను పడుదువు పాట్లెన్నొ
ఎంత జేసిన పని యింది లేదు
బీదరికము తోని బిక్కుబిక్కను కుంట
సాగు జీవ నంబు సంశయమున
5 ఆ వె
కష్టమునెది రించి కార్మిక సోదర
కొండ బండ లెన్నొ పిండి జేయ
శక్తి నంత చేర్చి చేసేవు పనులెన్నొ
స్వేద మంత బువిలొ చేరుకోగ
16
శ్రామిక శక్తి అనంతమైన శక్తి
శ్రమనే ఆయుధం గా చేసి
కారుతున్న చెమటబిందువులో
నెత్తురు తో చెమటోడ్చి
రేయింబవళ్ళు అలసిసొలసి
కంటినిండా నిద్రలేక
పెత్తందార్ల శ్రమదోపిడికి గురవుతున్న శ్రామికులు
కార్మికుల నెత్తురు ను జలగలా పీల్చి పిప్పి చేసి
శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వక దగాచేసి
శ్రమజీవులు కృషిని యంత్రాలు గా మార్చుకొని
నెత్తురు కూడుతిని బడాబాబులు కోటీశ్వరులు
అవుతున్నారు
కూడులేక,గుడ్డలేక
సరియైన సదుపాయాలు లేక
విలవిలలాడుతున్న
కార్మికుల ఆవేదనల రోదనలు
ఆక్రందనలయ పెడచెవినపెట్టి
కార్మికుల కష్టాలు వినక
యంత్రాలు గా పనిచేస్తున్నారు
రక్తాన్ని చిందించి శ్రమిస్తున్నారు
శ్రమదోపిడీని నిలువుదోపిడి
చేస్తుంటే
రేయనక
పగలనక
రాయనక
రప్పనక
కాదనక
లేదనక
దారిద్రంలో మగ్గుతుంటే
హీనమైన
హేయమైన
దుర్గందభరితమైన జీవనస్రవంతిలో
జీవిస్తున్న శ్రామికులను
ఆదుకున్న నాధుడెవడులేడు
తిరగబడండి
బడాబాబుల దౌర్జన్యాలకు
తిప్పికొట్టండి రాజ్యాంగబద్ధమైన
హక్కులుకు పోరాడండి
లేవండి నిదురలేవండి
ప్రఛండభానుడిలా
భగభగమండే అగ్ని జ్వాలలా
తిరగబడండి
శ్రమను సమాజానికి
తెలయజేయండి
సహస్రకవిరత్న
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
ఉపాధ్యాయులు
కామారెడ్డి
తెలంగాణ
17
మహేందర్ జవ్వాజి
అంశం. మేడే
~~~~~~~~~|~||~~~~~~~~~
మండె ఎర్రటి ఎండలో
కూటికొరకు రెక్కలు ముక్కలుగా చేసుకుని నమ్మిన సిద్ధాంతమే ఆయుధం గా సాగుతోంది తమ పయనం
గాలివానలు ,రేయింబవళ్లు సైతం లెక్క కట్టని కష్ట జీవి తనూ వారినమ్మకమే జీవితం గా ఎంతటి బాధనైనా అవలీలగా చేసెస్తారు కార్మికులు
కొండంత పని ఎలుకంతా వేతనం.. చాలి చాలినంత జీవితం అయినా కుటుంబ భారంతన గుండెలపై కావటి వలె మోయాల్సిందె సుమా
బతుకుదెరువుకై పోరుబాట ధరల పెరుగుదల గుక్కెడు మెతుకులు కుటుంబ సభ్యులకు పెట్టడానికి తను పూటపూట పస్తుల పండుగె మిగిలింది ఆకరకు అణాపైస లేక
కాలం మారిన నాయకులు మారిన మారవ ఓ మానవ కష్టజీవుల బతుకు గోసా...
18
శీర్షిక:;**మే డే**
ఆకాశంలో మేడలు కట్టేది మీరే
నేలమీద పక్కాఇళ్లయినా లేనిది మీకే
అందరికీ అన్నంపెట్టే అన్నదాతలు మీరే
అప్పులబాధతో పురుగులమందు తినేది మీరే
పట్టుబట్టలు తయారు చేసేది మీరే
కట్టుబట్టలకు కటకటలాడేది మీరే
గాజువస్తువులెన్నో తయారు చేసేది మీరే
గాజు కన్న సున్నితఆయుష్కులు మీరే
చిత్రవిచిత్ర వస్తుతయారీపనితనం మీదే
చెత్తకాగితాల కన్న చిత్తయ్యే బతుకులు మీవే
చక్రాలదగ్గర స్వేదం చిoధించేది మీరే
స్వార్థపుచక్రాలకింద నలిగిపోయేది మీరే
పొగగొట్టాల కదలికలకు కారణం మీరే
సమస్యల పొగచూరిన జీవితాలు మీవే
ఇవన్నీ ఒకప్పుడు ఎద రగిలించే నిజాలు
ఇప్పటిపరిస్థితులు కొంత మెరుగన్నది నిజం
బాగుపడుతుంది కార్మికకర్షకుల పరిస్థితి
సంఘటితరంగ కార్మికులకున్నయి హక్కులు
సౌకర్యాలు చట్టాలు యూనియన్లు-
కావాల్సింది అందరికీ హక్కులపై అవగాహన
రైతుల కందుతున్నయి ప్రభుత్వపథకాలు
పెట్టుబడి సాయాలు కనీసమద్దతుధరలు-
కావాల్సింది వాటిని సందర్భోచితoగ
తెలుసుకుంటూ వాడుకునే ఉత్సాహాలు
అసంఘటితరంగ కార్మికులకూ గలవు
ఆరోగ్య జీవిత ప్రమాధభీమాలు ఉపాధి హామీ-
కావాల్సింది మనకు ఏ అవకాశముంది
ఏ లబ్దినెలా పొందాలనే సమాచార గ్రాహకశక్తి
అవగాహన ఆలోచన వివేకం పెంచేది అక్షరాలే
*అక్షరాష్యులై కార్మికకర్షకులుంటే నిత్యం మే డే*
వృద్ధి అగు జాతియ నికర ఆహార వస్తుత్ఫత్తి*
అపుడే కార్మికకర్షకులది ఓటమెరుగని అజేయశక్తి
:;*వల్లాల విజయలక్ష్మి*,,ఆలేరు
19🔸
🔸మేడే🔸🔸🔸
ప్రపంచ కార్మికుల పండుగ
శ్రమజీవుల చైతన్యం నిండుగ
మానవజాతికి
ఆకలి తీర్చగ
మన్నుల నుండి
అన్నం తీసి
పాడి పంటలకు
పాణం బోసి
వ్యవసాయానికి
వెన్నై నిలిచిన
రైతు కూలీలే
మన అన్నదాతలు
2
మట్టిని పసికి
కుండగా జేసి
తోలును వలిచి
చెప్పుగా మలచి
మాసిన బట్టలు
తెల్లగా ఉతికి
కర్రును కాల్చి
నాగలి చెక్కి
దారం వడికి
బట్టను నేసి
చెట్టును ఎక్కి
కల్లును గీసి
క్షౌరం జేసి
గడ్డం గీసి
పొరకను చీరి
బుట్టలు అల్లి
సమస్త వృత్తుల
సమగ్ర రూపం
3.
బావి తరానికి
బాటలు వేస్తు
విద్యా వెలగుల
సారం చెబుతు
రేపటి పౌరుల
రూపం చెక్కు
అక్షర శిల్పులు
ఉపాధ్యాయులు
4.
రోగం ..నొప్పి
ప్రమాదమొస్తె
మాత్రలు ఇచ్చి
చిక్సిత చేసి
స్వస్తత కూర్చి
ప్రాణం నిలిపే
డాక్టర్ నర్సులె
ప్రాణదాతలు
5.
గనిలోపనిలో
ఖర్ఖానల్లో
రక్తం చెమటగా
ధారలు పోస్తు
వస్తుత్పుత్తుల
రూప కర్తలు
శ్రామిక శక్తే
కార్మికులు
6.
పల్లె పట్నం
పట్టణాల్లల్లో
వీథులు కాలువల
శుభ్రం జేస్తు
చెత్త చెదారం
తొలింగించేసి
శుభ్రత నేర్పే
పారిశుద్ధ్య
కార్మికులు
7.ట్రాపిక్ జాంల
చిక్కుల విప్పుతూ
నేరాల్ ఘోరాల్
నిరోధిస్తూ
శాంతి భద్రతల
పరిరక్షకులు
రక్షకభటులె
పోలీసులు
8.
బడులు గుడులు
ధవఖానలు
మాల్స్ షాపులు
మల్టిప్లెక్సులు
ఇండ్లు భవనాల్
ఆకాశ హార్మ్యాల్
రోడ్లు వంతెనలు
ప్రాజెక్టు పనులు
నిర్మించేను
కార్మికులే
9.వాహనాలన్నీ
ఓర్పుగ నడపి
గమ్యం చేర్చును
మన డ్రైవర్లే
మరయంత్రాలు
మోరాయిస్తే
యంత్రభూతంల
కోరలు తోమి
పరుగెత్తించును
మెకానిక్కులే
10.
తీగలు గుంజి
స్తంభాలు నాటి
గడపగడపకు
ప్రతిప్రరిశ్రమకు
వెలగులు పంచిరి
విద్యుత్ కార్మికులు
11.
చావు నోటిలో
తలలను పెట్టి
భూగర్భంలో
ఖనిజం తొవ్వె
గని కార్మికులు
సలాంమీకు
12.
విషాదమంత
కడుపున దాచి
బొమ్మల తెరపై
నవ్వులుపూసి
వినోదం పంచె
నటీనటులు
కవిగాయకులు
సీనికార్మికులే
శ్రమజీవులు
చిందినచెమటే
సమస్త వృత్తులు
సమస్త పనులు
సంపద మూలం
సమాన పనికి
సమవేతనమని
శ్రమదోపిడీని
ప్రశ్నేంచేటి
మిగులువిలువలో
భాగం అడిగే
జీవన ప్రమాణ
స్థితిగతి మార్చే
ప్రతి సమరంలో
అందరమొకటై
అడుగులు వెద్దాం
సమ్మె హక్కు
మన జన్మహక్కుని
కార్మిక కర్షక
పీడిత ప్రజలకు
సలాం చేద్దాం
వందనమందాం
జైకొడదాం
జేజేలు పలుకుదాం
(చెమట పూలతో ప్రపంచ చరిత్రను నిర్మిస్తున్న శ్రమజీవులందరికి అంకితం)
.......యన్.లక్ష్మీనర్సింహారెడ్డి
20
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : మేడే
కవితా సంఖ్య: 20
తేదీ: 01/05/20
సమాజ నేస్తాలు ప్రపంచ
ఆలంబనలు
స్వేదాన్ని చిందించు శ్రమపెట్టుబడీ
దారులు కార్మికులు....!!
రెక్కల కష్టంతో నిత్యం
కష్టపడే మనస్తత్వం
కూలిడబ్బులే కోట్లసంపాదనల
తృప్తి లో మునిగే అల్పజీవులు....!!
బడాబాబుల దౌర్జన్యం లో
అణగదొక్కే ఇనుప సంకెళ్ళతో
విసిగి వేసారి పోటెత్తిన
అగ్నిపూల ప్రవాహం....!!
కార్మికులంతా ఏకమై
యాజమాన్య జులుంను విదిలించ
నాయకత్వ మధిరోహించిన రోజు.....!!
కార్మికులు లేని క్షణం
స్థంభించు ప్రపంచం
ఆ కార్మికులే చైతన్యరధ చక్రాలు
శ్రమదోచిన పిడికిలి బిగించు
ఆదరించిన ప్రాణమే ఇచ్చు....!!
🌹వినీల🌹
21
అంశం: మే డే
పేరు: శ్రీ శివ లక్ష్మీ రాజశేఖరుని
శీర్షిక: శ్రమైక జీవన సౌందర్యం
శ్రమ సాగరమధనంలో
తానో అశ్రువు
దోపిడి రాజ్యపు రాబంధువు
రెక్కలు విరిస్తే
రెట్టింపు వేగంతో తిరిగివచ్చిన
స్వేదస్త్రపు బిందువు
పురిటి గది లోనే బిగిసిన
తన పిడికిలి
దిక్కులు పిక్కటిల్లేలా తొలి ఆకలి
ఉద్యమ గీతం లో ఎగిసినా
శ్రమ రాగపు స్వరములలో తడిసినా
ఆ గొంతులో మోగే నినాదాలు
చీకటి తరిమే బతుకుల కోసం
ఆకలి తరిమే మెతుకుల కోసం
రాళ్ళెత్తిన కూలీలా
పల్లకి మోసే బొయిలా
గనుల గుండెల్లో పగిలిన రాళ్లా
శ్రమైక జీవన చిత్రాలా
ఏమని పొగడను వేనోళ్ళ
22
డా.బల్లూరి ఉమాదేవి
అంశము: మేడే
శీర్షిక : సమైక్య శక్తి
రెక్కాడిన గాని డొక్కా డని
శ్రామికులకు ఊరటనిచ్చిందీ మేఢే
శ్రామిక శక్తికి సమైక్యతకుగా
జరుపుకుంటున్న పర్వదినం
గనుల్లో కార్ఖానాలో గొడ్ల లాగ పనిచేస్తూ
కడుపు మండి ఆకలి బాధతో
పెత్తందార్ల పై తిరుగుబాటు జెండాను
కార్మికులంతా సమైక్యంగా ఎగరేసిన రోజు
కాలం తో పని లేక పగలు రేయి పనిచేసే దుస్థితి రూపమాసిన పోసిన రోజు
ఎనిమిది గంటల పని చాలంటూ
కడుపు మండిన శ్రామికులు నినదిస్తూ
నేలకొరిగిన చీకటి రోజీ మేడే
శ్రమ దోపిడిని అరికట్టాలంటూ
ఎర్ర బావుటా లెగరేసి కార్మిక శక్తిని
జగతికి చాటిన రోజు ఇదే
త్యాగ ధనుల శక్తిని చాటే దివ్య దినం
బలవంతమైన పామైనా చలి చీమల చేత
చావక తప్పదు అన్న వాస్తవాన్ని
రుజువు చేసిన సంఘటిత శక్తి ఈ మేడే
డా.బల్లూరి ఉమాదేవి
డల్లాస్/ అమెరికా
23
డా.రామక కృష్ణమూర్తి
తేది:1-5-2020
అంశం: మేడే
శీర్షిక: దేవుళ్ళు
*************************
స్వేదం చిందించి
భవనాలను నిలబెడతారు
మోదం లేని బ్రతుకులను
చిరునవ్వులతో గడిపేస్తారు
కాయకష్టం చేసి
కంటినిండా నిద్రపోతారు
కష్టాలెన్నో ఓర్చుకొని
పౌరుషంతో జీవిస్తారు
సుఖాలను,దుఃఖాలను
సమపాళ్ళలో తీసుకుంటారు
పండుగలు,జాతరలలో
మమేకమై ఆస్వాదిస్తారు
సూటిగా మాట్లాడి
బ్రతుకుపోరాటాన్ని ప్రశ్నిస్తారు
పిడికిళ్ళు బిగించి
పీడలను,దోపిడులను ఎదుర్కొంటారు
ప్రజాస్వామ్యాన్ని గెలిపించే వేళ
సమయస్ఫూర్తి చూపిస్తారు
కార్మికులై,కర్షకులై
అభివృద్ధికి బాటలు పరుస్తారు
దేశమేదైనా తమ అస్తిత్వాన్ని
పతాకస్థాయిలో నిలుపుతారు.
24
వేంకట కృష్ణ ప్రగడ
విశాఖపట్నం
01.05.2020
అంశం : మే డే
శీర్షిక : కార్మికులు
కార్మికులు
మన ధార్మికతకు నోచుకోని
మన సాటి
మనుషులు ఈ కార్మికులు ...
ఓరిమితో
కాయ కష్టంతో
మగ్గం కండె తానే అయి
కానని కాయంతో తిరుగుతూ ...
పగ్గం
పడుగు పేక
పరుగుల బతుకు
తామయి నిలిచిన
సాలెలు ఈ సగటు కార్మికులు ...
కొలిమి వేడి
నీడయి తాము రగులుతూ
కత్తి పార గునపం
కొడవళ్ళను సాన పడుతూ ...
గొడ్డళ్ళను
తమ కరిగే కండలనే
కొలిమి చేసి
పదును పెడుతూ
దుంగలు పగలగొడుతూ ...
ఱంపాలను
తమ రక్తం చెమటల
సూది సేస్తూ
సాగేటి జీవులు
కమ్మరి పనివారు ఈ కార్మికులు ...
కూరిమి కుండల
కుమ్మరి చక్రం
తమ కండల బిగువూ
నరాల సత్తువ
కలిపిన కష్టం కురిపించిన
కుమ్మరి కూలీలు ఈ కార్మికులు ...
తమ రెక్కల వేగంతో
గుండెలు అలిసి
బండలు బాది పిండిగ చేసే
చిక్కని
చీకటి బతుకులు ఈ కార్మికులు ...
కార్మికులు
మన ధార్మికతకు నోచుకోని
మన సాటి
మనుషులు ఈ కార్మికులు ...
... ✍ "కృష్ణ" కలం
25
*కవితా గానం*
*అభిరామ్*
*అంశం:- మే డే*
*కార్మిక వేదన*
గంప కృషించిపోయింది
పలుగు పరివేదనొందింది
సెలిక సొమ్మసిల్లిపోయింది
ఇసుక చిన్నపోయింది
సిమెంటు అయోమయ పడింది
గోడ గోడును వెళ్ళగక్కింది
భవనం బాధనొందింది
అనుకోకుండా మహమ్మారి ఆటలో ఆవేదన పుండై
నడిరోడ్డుపై నలిగిపోయి
నేలలోకి జారుకుంటున్న
వలస బ్రతుకులను చూసి
*అభిరామ్* ఆదోని 9704153642
26.
[02/05, 8:39 PM] Bhaskar Vaidyam Poet Hyderabad: శీర్షిక :: మేడే -ఆశలు...
రచన.. వైద్యం భాస్కర్
(శ్రామికులకు సీస పద్య నీరాజనం)
//సీస //
సాంఘీక మాధ్యమం సంగతే తెలియదు,
కష్టంబు తెలియును ఇష్టముగను!
సాఫ్ట్వేరు ప్రావీణ్య సంగతి మతి లేదు,
మొరటుగా పనిజేసె మొండివాణ్ణి !
ఈక్విటీ మార్కెట్ ఇసుమంత తెలియదు,
ఈపూట సాపాటె ఇంగి తంబు!
బహుళసంస్థలతీరు బండారమేమెర్క,
శ్రామికా బతుకుల శ్రమలు తెల్సు!
తేట!!
దేశ దేశాల పాలించు ధన్యు లార,
విద్య వైద్యము ఉచితంబు విలువ మాకు,
యాద గిరిపుర వాసుడా అభయ మిచ్చి,
దుష్ట శిక్షణా జేసేటి శ్రేష్టు డావు !
29
[02/05, 8:45 PM] Muvva Prasad: కాలాలు మారినా కధనాలు మారలేదు
కూలీల శ్రమ కూటికి కష్టం
రైతుల శ్రమకు రాబడి కష్టం
ఉద్యమానికి ఊపిరి కష్టం
పోరాడినోడికి ఫలితం కష్టం
ప్రభువులకు పదవులు ఇష్టం
సోమరులకు సౌఖ్యాలు ఇష్టం
పామరులకు పధకాలు ఇష్టం
ఖజానాకు కాసులకష్టం
కలసికట్టుగా కదం తొక్కితే
దళారులకు దండుకొనుటకష్టం
ధరిత్రి చూడని చరిత్ర లేదు
దారినిచూపే దిక్కు మనమే
దివినుండి దిగిరాడెవ్వడు
పదండి పోదాం పోరాటానికి
చరిత్రలోచారితార్థులమౌదాం !
మువ్వా ప్రసాద్
30
[02/05, 8:52 PM] Swarna Samatha Poetess: **కవితా గానం **
**02/05/2020**
👧 **ఆడపిల్ల **👧
ఆడపిల్లలు
ఇంటికి లక్ష్మి
కంటికి క్రాంతి
మురిపెంతో మైమరిపించే
ప్రేమానురాగాల కల్పవల్లి
ఇలలో వేలసి న పాలవెల్లి
అందేల సవ్వడి
మోమున నవ్వుల సడి
ఆమె ఒక అమృతబాన్డము
ఆమెహృదయం చల్లని సంద్రం ఆమె కరుణ అనంతం
మమతానురాగాల మరుమల్లి ధైర్యంలో ధీశాలి ఆ తల్లి
సుఖదుఃఖాలలో సగమై
కార్యసాధనలో లీనమై
ముందుకు సాగే
ఆడపిల్ల
లేడిపిల్లల గంతులేస్తూ
బాధను--బాధ్యతను మోస్తూ
కన్నవారికి --కనుకున్న వారికీ ఆసరా అవుతుంది
పూట్టినింటికి --మెట్టినింటికి ఘనతను తెచ్చే వనిత
ముదములో మగువ
సాహసంలో తెగువ
ఆమెసొంతం .
**స్వర్ణసమత**
**నిజామాబాదు**
31
[02/05, 9:09 PM] BHOOMAIAH TP I RAYKAL: 💐💐🚩🚩🚩💐💐🚩🚩💐💐
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో..
*కార్మికుని ప్రాశస్త్యం*
*సీ*
*పగలు రాత్రులయందు పలుమారు కష్టించి*
*నిత్యమ్ము పనిజేయు నిష్ఠయోగి*
*బొగ్గుగనులయందు భుక్తికొరకుచాల*
*కష్టించి పనిజేయు కర్మయోగి*
*స్వేదమ్ము చిందించి క్షేమమ్ము కాంక్షించి*
*సత్యమ్ముదప్పని సాధుయోగి*
*బ్రతుకు భారంబైన బాధ్యత మరువక*
*బుద్ధిగాపనిజేయు సిద్ధయోగి*
గీ
*నీదు శ్రమయు లేకున్నను నిలువలేదు*
*జగతి,కార్మిక సేవలే!జాతిహితము*
*ప్రగతి పథమును నడిపించు బాటవీవె!!*
*ప్రస్తుతించి నీ పనులకు ప్రణతిజేతు!!*
మీ
సిహెచ్. భూమయ్య,
నారాయణఖేడ్.
💐💐💐🙏🙏🙏🙏🙏💐💐
32
[02/05, 9:18 PM] సునంద ఉరిమిళ్ళ: కవితా గానం
తేదీ::02-05-2020
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
శీర్షిక:: మహా కవి శ్రీ శ్రీ
::::::::::::::::::::::::::::::::::::
అక్షరం పదునెక్కిన ఆయుధం
కలం ఝళిపించి సాగించిన కవనం
ప్రపంచ మానవులకు ఇచ్చిన సందేశం
పీడిత తాడిత గుండెల్ని రగిలించి
మరో ప్రపంచం మీకోసం పిలస్తున్నదని
ఉత్సాహపు ఊపిరులూదిన శ్రీ శ్రీ!
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఆహుతిచ్చానని
లోకమంతా జయభేరి మోగించిన మహా కవి!
కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ
అన్నీ కవితా వస్తువులేనంటూ
ఉత్సహ పరిచి
కవిత్వం తీరని దాహమనీ
ఎంత చదివినా రాసినా ఇంకా ఇంకా
మనలో కోరిక పెంచుతుందని చెప్పిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు!
కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేది
కవిత్వమేననీ సగర్వంగా చాటుకున్న మహా కవి!
సాహిత్యం లో ఆయనొక విప్లవ కెరటం
అవినీతి బంధుప్రీతితో
సాధించిన స్వాతంత్ర్యం
ప్రమాదంలో పడిందని హెచ్చరించి
ఎన్నో కవితలు,ఋక్కులు
సినిమా పాటలతో
ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన కవి శ్రీ శ్రీ!
33
పేరు:డా.బల్లూరి ఉమాదేవి.
అంశం :శ్రీశ్రీ
కార్మిక కర్షక వీరుల స్వేదజలాన్ని
సిరాగా మార్చి కవితలల్లిన మహా కవీ
వందనం శుభాభివందనం
పదండి ముందుకటంచు
అణగారిన బ్రతుకులు గడిపే
అన్నార్తుల కాలంబనమై
ప్రోత్సహిస్తూ కొత్త వూపిరి నింపిన
యుగకవీ వందనం శుభాభివందనం
అగ్గిపుల్లయైనా కుక్కపిల్ల యైనా
కవిత కనర్హంకాదని తెలుపుచు
నవకవుల కాదర్శమై దారిచూపిన
నవయుగ కవివరేణ్యా వందనం
శుభాభివందనం
మేడలు కట్టిన,పల్లకీలు మోసిన
కూలీల శ్రమను గుర్తించి
జగతికి చాటిన విప్లవ కవివతంసా
వందనం అభివందనం
మరో ప్రపంచం పిలుస్తొందంటూ
సహస్రవృత్తులవారిని స్మరింపచేస్తూ
కవితా ప్రస్థానంచేసిన మహాకవీ
నీకిదే మా జోహార్
34
అంశం:శ్రీశ్రీ
అటు ఓ శ్రీ
ఇటు ఓ శ్రీ
తొలి తాను
తుది తాను
ఓ శ్రీశ్రీ!
అభ్యుదయానికి ఆరంభం ఓ శ్రీ
విప్లవానికి సంకేతం ఆ శ్రీ
విషం గొంతు దాచి శ్రీశ్రీ
అమృతుడయ్యాడు శ్రీశ్రీ
-- *దండమూడి శ్రీచరణ్*
9866188266
35
సునంద ఉరిమిళ్ళ: కవితా గానం
తేదీ::02-05-2020
పేరు:: వురిమళ్ల సునంద, ఖమ్మం
శీర్షిక:: మేడే
--------_-----------------------
చిందించిన చెమట చుక్కల్లో
చిరునవ్వులు పూచిన వేళ
కన్నీళ్ళు నిండిన కళ్ళలో
కాంతులు విరజిమ్మిన సమయం
పని హక్కుల సాధనకై
కనీస సౌకర్యాల కోసం
ఉద్యమించిన కార్మికుల కష్టాలు
నెరవేరిన రోజు మేడే
బతుకుల్లో పున్నమి వెలుగులు నింపిన రోజు
ఎందరో కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి
సాధించుకున్న విజయోత్సవ రోజు
ప్రపంచ పటంలో
చికాగో నగరం సాక్షిగా
కార్మికులు శ్రామికుల ఉద్యమం
వారి క్షేమం కోసం పోరాడి
గెలుపు కేతనం ఎగరేసిన రోజు!
మేడే కార్మిక కర్షక హ్యాపీ డే
36
01 May 2020
09:44
గీతలు మారినా
రాతలు మారక
గతులు మారినా
బతుకులు మారక
దోపిడి ప్రపంచంలో
నిలువు దోపిడికి గురై
దగా పడిన జీవితాల
చిరిగిన బతుకల
పగిలిన గుండెల
చిందిన నెత్తుటి
వేదన ఆవేదన రోదనల్లోంచి
పుట్టిన బతుకు దెరువు ఆకలి కేకలు
కార్మికులారా ఏకంకండి అని గొంతెత్తి
దిక్కులు పిక్కటిల్లేల చేసిన మహాగర్జన
కార్మికుల ఐకమత్యాన్ని సంఘటితం చేసి
చేయి చేయి కలిపి కదం తొక్కి
పిడికిలి బిగించి చెయ్యెత్తి
విప్లవ పోరాటానికి
ముందడుగు వేసిన రోజు
లోకానికి శ్రామిక శక్తిని చాటిన రోజు
బడుగు జీవుల పండుగ రోజు
విప్లవ గీతం పాడిన రోజు
నేడే మేడే
కార్మిక సొదర సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు
------------ పో లా
38
శ్రామిక సంగీతం
అతను
కఠినపాషాణాలను
చీల్చి స్వరాలు పలికించగలడు
మనుషుల గుండెలు తప్ప--!
అతను
అగ్నికణపు సోరంగాలను
ఛేదించి గమకాలు సృష్టించగలడు
మనుషులలో దయను తప్ప--!
అతను
కొండశిలలను గండరించి
ఢమరుక విన్యాసం చేయించగలడు
మనుషుల ఆలోచనలు తప్ప --!
అతను
మాడేపేగును కూడా
తంత్రినాదం చేసి శృతిచేయగలడు
మనుషుల మానవతను తప్ప --!
అతను
చెమటను నెత్తుటిచుక్క చేసి
ఎదుటివారికి సెంటు పూయగలడు
మనుషుల డీసెంటును తప్ప--!
అతను
ఎర్రనికొలనులో కాల్చబడే చువ్వై
ఆధునికతను నిర్మించగలడు
మనుషుల సమానతను తప్ప--!
అతనో............
నిత్య శ్రామిక జీవి
చైతన్య కణిక
కష్టం పై ఇష్టం గా
సేదదీరే కార్మికుడు
సమసమాజం
విస్మరించిన రాగం,
వెలుగుకై ప్రభవించే విప్లవ గీతం ..!!
కవితాగానం
రమాదేవి కులకర్ణి
హైదరాబాద్
8985613123
9716134567
వీరా గుడిపల్లి ః
the mathematics teacher and poet
సమన్వయం ః
శివునూరి లలితా కృష్ణ
సహకారం ః మెరుగు మధు
అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
*************************
కవి వరుల జాబితా
1.నోముల సంజీవరెడ్డి గారు
2ఐలేని సంజీవరెడ్డి గారు
3.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
4.కోరాడ నరసింహా రావు గారు
5.విజయ దుర్గ గారు
6.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
7.మర్రి జయశ్రీ గారు
8.వల్లాల విజయ లక్ష్మి గారు
9.కోరాడ నరసింహా రావు ఊ
10.పాల్వంచ హరి కిషన్ గారు
11.కొలచన విజయ భారతి గారు
12.అంబటి భాను ప్రకాష్ గారు
13.వకుళ వాసు గారు
14.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
15.కాల్వ రాజయ్య గారు
16.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
17.మహేందర్ జవ్వాజి గారు
18.వల్లాల విజయ లక్ష్మి గారు
19.YLN Reddy garu
20.విజయ దుర్గ గారు
21.శివ లక్ష్మీ రాజు శేఖర్
22.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
23.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
24.వేంకట కృష్ణ ప్రగడ గారు
25.అభిరాం గారు
26.డాక్టర్ బండారు సుజాతా శేఖర్ గారు
27.మర్రి జయశ్రీ గారు
28.వైద్యం భాస్కర్ గారు
29.మువ్వా ప్రసాద్ గారు
30.స్వర్ణ సమత గారు
31.భూమయ్య గారు
32.సునంద గారు
33.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
34 దండమూడి శ్రీ చరణ్ గారు
35.సునంద వురిమిళ్ళ గారు
36.పోలా కిషోర్ కుమార్ గారు
37.రమా కులకర్ణి గారు
****************
1
నోముల సంజీవరెడ్డి
అంశం : శ్రీ శ్రీ
తెలుఁగు కవిత్వాన్ని ఖండించి దీవించి
ఊగించి శాసించి రక్షించిన కవి శ్రీ శ్రీ
మానవుడే నా సందేశం
మనుష్యుడే నా సంగీతం అన్నాడు
భావ కవితాకాశంలో కులుకుతూ విహరిస్తున్న
తెలుఁగు కవితా కన్యకను
నేలకు దింపి అభ్యుదయ పథంలో
సామాన్యుడే వస్తువుగా వాస్తవికతే
ప్రాణంగా పరుగుల పెట్టించిన అభ్యుదయ వాది
మాటల్ని కత్తులుగా ఈటెలుగా మంటలుగా
మలచడం తెలిసిన ఏకైక తెలుఁగు కవి
ప్రపంచం బాధను తన కలంలో
పలికించిన అనితర సాధ్యుడు
మరోప్రపంచం పిలిచిందంటూ
ప్రస్తుత వ్యవస్థమీద యుద్ధం ప్రకటించి
నవసమాజ స్థాపనకు ఆశలు నింపాడు
ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిదని
ఈ దోపిడీ సమాజాన్ని ప్రశ్నిస్తాడు
శ్రమైక జీవన సౌందర్యసానికి పట్టం కట్టిన
సాహితీ వైతాలికుడు
తాడిత పీడిత శ్రామిక వర్గాల దోపిడి
వ్యవస్థీకరించబడ్డ పెట్టుబడిదారీ వ్యవస్థపై
విప్లవశంఖం పూరించిన కవి సింహం
పాత పదాల చీరెలను ఛందో బంధనాలను
తెంచి తెలుగుసాహితీ కన్యకు
సహజ సౌందర్య భాషను అలంకరించాడు
ఆత్మాశ్రయ ధోరణుల పెడదారినుంచి
తెలుఁగు కవిత్వాన్ని సమాజ దారిని పట్టించాడు
అప్పటికే ఉన్న పాత దారులవెంట
పయనమెవరికైనా సులభం సుఖమయం
కాని శ్రీ శ్రీ తనే ఒక కొత్త బాటను వేసి
దానివెంట ధైర్యంగా నడిచి అందరినీ
నడిపించిన సాహసి ప్రగతి శీలుడు
ఆయన కవిత్వంలోని భుగభుగలకు
భగభగలకు జ్వలన పదాల జ్వాలకు
తన తరువాత వచ్చిన కవిత్వమంతా
మసకబారిందన్నది నిజం .
ఎదేమైనా అనితరసాధ్యం శ్రీ శ్రీ పథం .
2
: ...... శ్రీ శ్రీ.....
************
మరో ప్రపంచ నిర్మాణం కోసం
పునాదులు వేసిన మేస్త్రి
మూఢత్వపు సంకెళ్ళు తెంచి
ఆధునికతకు మార్గం వేసిన
అక్షర శిల్పి
పెను నిద్దుర నుండి సమాజాన్ని
నిర్లిప్తత నుండి యువతను
జాగురూకం చేసి
పదండి ముందుకు అంటూ
నవసమాజం వైపు నడిపించిన
ఆధునిక మార్గదర్శి
కార్మికుల కోసం
కర్షకుల కోసం
దగాపడ్డ తమ్ముళ్ళకోసం
ఎలుగెత్తి నినదించిన
నిత్య చైతన్య శీలి
నేను సైతం అంటూ
లోకంలో ఉన్న బాధనంతా
తన బాధగా చేసుకున్న
మానవతా మూర్తి
అభ్యుదయ వాదులకు
నిరంతర స్ఫూర్తి
ఆయనే శ్రీ శ్రీ
.... సంజీవరెడ్డి ఐలేని...
3.
**శ్రీ శ్రీ ***
✍️డా.పాండాల
నరులకు కర్తవ్యంబును
వరముగ భావించి ప్రభవ వైఖరులెన్నో!
నెరిగించిన శ్రీ రంగము
సిరులొల్కెనుశ్రీనివాసుసిరిసిరిమువ్వా!
చక్కని సినిమా పాటలు
మక్కువ రసభావయుక్తి మాన్యతనెంచీ!
వాక్కున పదలాలిత్యం
చిక్కని నవజాగృతాల సిరిసిరి మువ్వా
సరిరారిల మీకెవ్వరు
అరసవిరసపదవులైన అవలీలగనే
తరతరములవారధిగా
సిరిపదముల గడసరీవు
సిరిసిరి మువ్వా !
శ్రీ కారము నవకవులకు
శ్రీ కరమే శ్రేష్టతౌను స్థిరచిత్తముగన్
ఓంకారపు మమకారపు
ఘీంకారమునేర్పితివిల సిరిసిరి మువ్వా!
ఎండిన బతుకుల కొరకై
పండిస్తివి కవితనంత ప్రజ్ఞానిధిగా!
దండిగ విప్లవ స్ఫూర్తితొ
ఖండితముగ ఖడ్గసృష్టి కవితాస్త్రముతో..!
✍️డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
4
[🙏🌷శ్రీ శ్రీ 🌷🙏
*****************
అపసవ్య పు సమా జాన్ని...సవ్యముగా నడిపించగా...యుగయుగ మున సంభ వించిరి సాహితి వేత్తల రూపము దాల్చి !
ఎందరెందరో మహానుభావులు...
కందుకూరి,గురజాడ వంటి వారెందరో...!
కార్మిక...కర్షక...
పీడిత...తాడిత...
శ్రామిక వర్గపు ...
బతుకు చీకట్లు
తొలగించే....,
అభ్యుదయ బాల
భానూదయ మే ...
శ్రీ శ్రీ రూపము దాల్చె నహో....!
ప్రజ్వ లించె విప్లవ
మార్తాన్డమై...!!
నైరాస్యమునేతొలగించి,వవచైతన్యమునింపగా...!శుభములు చేకూర్చు
తొలిసంధ్య కు" శ్రీ " కార మై... "శ్రీ " కరమొసగిన ఆనందపు మలి
సంధ్య యై....!!
***🙏🌷🙏***
.....కోరాడ.
5
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : శ్రీశ్రీ
కవితా సంఖ్య: 19
తేదీ: 30/04/20
అసమతుల్యతలలో రగిలిన
నిప్పు కణిక
కష్టాల బీడులో మొలవలేక
అక్షర విత్తులను నాటిన వ్యక్తి....!!
అణగ దొక్కిన చోటే
కలమనే రాయతో విసిరిన
వడిశల సమూహం
పెత్తందారుల రెక్కలను విరిచే
పదాల ఖడ్గం....!!
సాహిత్యాన్ని సమాజ కొలిమిలో
మండించి వాడిగా వేడిగా శరాలను
వదిలిన కవితా ధనుస్సు
శ్రీశ్రీ మస్తిష్కమే అగ్నిపూల తేజస్సు....!!
పేదవాడికి వెన్నెల జల్లు
బడా బాబుకు ఎర్రని
రుధిరపు కత్తి
తనకలమే తన ఆయుధం...!!
అలుపెరగని పయనమే
తన పలుకే నిక్కబొడుచు
రోషపు చైతన్య రథం
నాటికి,నేటికి,రేపటికి ఎప్పటికీ
నిత్య నూతనమే కవులకు ఆదర్శమై....!!
🌹వినీల🌹
6
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:30-4-2020
అంశం:శ్రీ శ్రీ
శీర్షిక:భాస్కరుడు
**************************
కదనపాళిని ఎక్కుపెట్టి
బాధ్యతలను ఎలుగెత్తి చాటి
విప్లవశంఖం మోగించి
అగ్నివీణమెట్లను కదిలించి
సామాన్యుని ఘోషను వినిపించి
పీడిత,తాడిత ప్రజల పక్షం వహించి
అభ్యుదయాన్ని రంగరించి
కొత్తదనాన్ని సూత్రీకరించి
కవిత్వానికి నిర్వచనమిచ్చి
సంప్రదాయాలను తెంచి
నాగరికతను పెంచి
ప్రపంచబాధలను సమాంతరంగా సాక్షీకరించి
ఎరుపెక్కిన జ్వాలల్లోని
సెగలను తగిలించి
విస్ఫులింగాలను పుక్కిట నిల్పి
మానవతను మేల్కొలిపి
ఉద్యమాలను రగులుకొల్పి
ఎద తంత్రులను సుతిమెత్తగా మీటి
ఆకాశాన్ని అండగా చూపెట్టి
అవకాశాలను సమానంగా పంచి
ఇజాల నిజాలను దుమ్ముదులిపి
కమ్యూనిజమనే ఇమ్యూనిటీని అందించి
పేదవాడి మాటై,పాటై,నినాదమై మ్రోగించి
సహస్ర వెలుగులను చిమ్మిన భాస్కరుడు
మేడిపండు సమాజ స్కానింగ్లు
చేసి
ప్రణయగీతాలతో పదునైన మాటలతో
సాహిత్యంలో యుగకర్తగా నిలిచిన కవిశేఖరుడు
తెలుగుపాటకు వెలుగులందించి జాతీయ గుర్తింపు నిచ్చిన మార్గదర్శకుడు.
7
మర్రి జయశ్రీ
అంశం.శ్రీ శ్రీ
శీర్షిక.మహాకవి
విరుద్ధమైన భావాలు
విచిత్రమైన సంఘర్షణలు ఎదుర్కొంటూ
వయసొచ్చినా పసివాడుగానే ప్రవర్తిస్తూ
అహంకారం కలిగి ఉన్నా
ఆలోచనలెన్నో చేస్తూ
ప్రభ వతో ప్రారంభించి
మహాప్రస్తానంతో
తెలుగు సాహిత్యపు దశను,దిశను మార్చిన మార్గదర్శి
విప్లవ కవిగా
సాంప్రదాయ,ఛందోబద్ద కవిత్వాన్ని ధిక్కరించి
అల్పాక్షరములతో
అనల్పఅర్థాన్ని సృటించిన మహాకవి
ప్రాసకు,శ్లేషకు ప్రాధాన్యత నిచ్చే మేటి
శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపి
ఇరవెయ్యి శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన
అభ్యుదయ కవి
సినిమా పాటల రచయితగా వెల్గొంది
శ్రమ జీవుల పక్షాన నిలిచి
జాతిని జాగృతం చేసిన
నవయు గ వైతాళికుడు
శ్రమజీవి మదిలో చెరిగిపోని జ్ఞాపకం శ్రీ శ్రీ
8
శీర్షిక:******శ్రీశ్రీ*****
----------********---------
శ్రీ శ్రీ చైతన్య సాహితీ శిఖరం
శ్రీ శ్రీ లోతయిన భావ సముద్రం
శ్రీ శ్రీ ఉత్తేజభరిత కవిత్వం
శ్రీ శ్రీ ఊరికించే వచనసాహిత్యం
ఆ మహాకవి వెలిగించిన అక్షరజ్యోతులన్ని
సాహితీజగాన అఖండజ్యోతులై
వెలుగునిస్తూ మార్గం చూపిస్తున్నవి
ఆ కవిత్వం గురించి చెప్పటానికి తెలుగు భాషాపదాలు పోటీపడితుంటవి
అక్షరాలు ఎంతగా జ్వలించగలవో చూపినవాడు
ఆధునిక వచనకవితా ప్రపంచచక్రవర్తి
కమ్యు*నిజాన్ని* అభిమానించి ఖడ్గసృష్టి గావించి మహాప్రస్థానం సాగించిన సాహితీ ప్రచండుడు ..అదొక కోణం..
ఆయన కవితా పంక్తులు కవులెల్లరకు భగవథ్ గీతాపాఠాలు
ఆ విప్లవకవిలోని మరొక కోణాన్ని అవలోకిస్తే...
ఆయన సినీగీతాలను ప్రియంగా ఆలకిస్తే
కలుగు అలౌకికానందమే
'నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరునించుటకు నేనున్నానని నిండుగ పలికే తొడొకరుండిన అదే స్వర్గము
నా హృదయములో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ*ఆయన ప్రేమైక హృదయావిష్కరణలు
మనసున్న ప్రతివారు అనుభవించే కిరణాలు
'పాడవోయి భారతీయుడా అని దేశభక్తిని చాటుతూనే..స్వార్థమీ అనర్థకారణం-అది తెంచుకొనుట క్షేమదాయకం' అంటూ సామ్యవాదాన్ని భోధించటం మరువడు
కలసిపాడుదాం తెలుగు పాట అని తెలుగు గొప్పదనాన్ని గుర్తుచేసినా
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అంటూనే బ్రతుకు కన్నీటిధారలలోనే బలి చేయకు" అని చైతన్యపరచటం మరువడు..
.
ఎన్నేనో ప్రణాయగీతాలు ఆతని హృదయంలోని అర్థ కోణాన్ని ఆవిష్కరిస్తూ అబ్బురపరుస్తాయి
ప్రతి పాట సుమ గంధాలై సంతోషాన్నిస్తాయి
:వల్లాల విజయలక్ష్మి,,ఆలేరు
9
శుభాకాంక్షలతో...!
***************
కార్మికశ్రమచాతుర్యం
అపరస్వర్గధామంగా
మార్చెనుకదఈభువి
నే,వీరెమయబ్రహ్మలు
*****************
మనిషి మనుగడకు
సౌఖ్యాలుసమకూర్చే
శ్రామిక శక్తియె వీరు
జగతివందనీయులు!
*****************
అందాలనుఅద్దివీరు
ఆనందంకలిగింతురు
కళాత్మకతతొజీవిం
చు,కళాకారులే వీరు
*****************
శ్రమ చిందించే స్వేదం
అత్తరైపరిమళించుశ్ర
మనుచిన్నబుచ్చకగౌ
రవించవలెమనము!
*****************
........కోరాడ.
10
శీర్షిక: మే..డే..!
మేడలు కడుతారు
మెతుకుల తడుతారు
జీవన సమరంలో
చెమటను పడుతారు
బతుకు నావ నడిపిస్తారు
వ్యవసాయం..
వ్యయ ప్రయాసలతో చేసి
పంటను పండిస్తారు
అందరికి అన్నం పెడుతారు
అవసరానికి సాయమందక
చేసిన అప్పు తీర్చలేక
తనువును తప్పిస్తారు
శ్రామికులై కార్మికులై
ధనం మీరై ఇంధనాలై
జీవన చక్రం తిప్పేస్తారు
జన జీవన స్రవంతియై
గతులు మీరై జతులు మీరై
జీవన గమ్య శృతులు మీరై
దేశ చక్రపు ఇరుసు మీరైన
సమస్త కార్మిక శ్రామికులారా
మనదంతా ఒకే కులం
అదే అదే శ్రమకులం..
మనమంతా కార్మికులం..
కష్టాన్నే నమ్మకున్న..
కష్టపడి బతుకుతున్న
ప్రతీ ఒక్క కార్మికుడికి..
మే..డే శుభాకాంక్షలు.!
ఈ మేడే...
కార్మిక జాతికి దినోత్సవం
పీడిత జాతికి మహోత్సవం
వర్ధిల్లాలి.. ఈ జనోత్సవం..!!
(శ్రమను నమ్ముకున్న ప్రతి శ్రామికుని జీవితంలో వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూ..)
-- అర్జున(కలం పేరు)
పాల్వంచ హరికిషన్
9502451780
11
పేరు: కొలచన విజయ భారతి
ఊరు: హైదరాబాద్
అంశం:మేడే
కవిత సంఖ్య:7
తేదీ:1-5-2020
************************
తరతరాల తరబడి
రోజులు తరబడి
గంటల తరబడి
దోచుకోబడుతున్న కార్మిక శక్తికి
విమోచన కలిగిన శుభ దినం
వెట్టి చాకిరీ పనికాలం
స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న దినం
కార్మికులంతా ఏకశక్తిగా సంఘటితమై
ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించి
పోరాటం సాగించి సాధించుకున్న స్వేచ్ఛా దినం
కార్మిక రంగంలో కొత్త యుగానికి
నాంది పలికిన దినం
ఎర్రజెండా చీకటి బ్రతుకులలో
వెన్నెలలు రెపరెపలాడిన
పండుగ దినోత్సవం
తమ స్వేదపీ ప్రతి బొట్టునీ అక్షరాలుగా మార్చిచరిత్ర పుస్తకం లిఖించుకున్న
గ్రంథ వార్షికోత్సవ దినం
ప్రపంచ దేశ కార్మికులందరికీ
ఈరోజు వారి బ్రతుకు పుస్తకంలో ఒక పాఠ్యాంశంగా
మిగిలిన రోజు
🌹🌹🌹🌹🌹
12
*కార్మికదినోత్సవం*
🌷💐🌷
*కార్మికులు-ప్రగతి రథులు*
......................................
కం.
రక్తము కరిగించి మనకు
శక్తియె నిత్తురు నిరతము సంతోషముగా!
భక్తిగ పనినే జేసియు
ముక్తియె నా కందుననుచు మురిసెరు నిజమున్ !!
తే.
చెమట చిందించి శ్రమియించు చింతలేక
పనియె దైవంబు నాకంచు పరిత పించు!
విధిగ తనవంతు పనియంత వృద్ధి జేసె
కార్మికుడు వాడు ఘనుడయ్యె కలిమి బెంచ.!!
కం.
బండలు కరిగించి బలిమి
కండలు బెంచి సమాజ కలిమియె బెంచున్!
గండము లెదురైన విడడె
దండము కార్మికుల కంచు ధరణియె మ్రొక్కున్!!
కం.
కార్మికులు లేక సాగదు
ధార్మికులై సేవ జేయు ధరణి సుపుత్రుల్!
కార్మికులే ప్రగతి రథులు
కార్మిక జనతే వెలుగును కన్నుల వెలుగై!!
*అంబటి భాను ప్రకాశ్*
జోగులాంబ గద్వాల జిల్లా
9948948787.
13
వకుళ వాసు
హన్మకొండ
అంశం-మేడె
శీర్షిక-🍃సంకల్ప మొక్క🍃
కాలం కొమ్మకు ఆశల ఊయల కట్టుకున్న
శ్రమజీవన సౌందర్యాభిలాషిణై సాగుతున్న మున్ముందుకు
అత్యాశల మేఘాలు మనసులోన కురవకుండ ఈదరగాడ్పులతో చెల్లాచెదరు చేసి
చెమటచుక్కలతో
నేలను తడిపి సంకల్ప మొక్కను పెంచుకుంటున్న
శ్రమైక సోపాన భవంతిని నిర్మించుకుంటున్న ఏ ఆటుపోట్లకూ కూలిపోకుండా
అనుబంధాల లతలు అల్లుకొని ఎగబాకే పూలతీగకు ఆసరాగా మారనా
మొక్కవోని దీక్షతో కష్టాన్ని నమ్ముకొని శాఖోపశాఖలుగా విస్తరించిన తరువునై
నవసమాజానికి బాసటగా నిలుస్తూ బానిసత్వపు సంకెళ్ళు తెంచుకొని
స్వేచ్ఛా గాలులు వీస్తూన్నా కదలని మానునై
వేళ్ళూనుకొని నా గుండెబలంపై నిలుచున్న వ్యవస్థ ని నిలబెట్ట
అమ్మతనానికి అనాధిగా వెలకట్టలేని శ్రామికురాలినై
ప్రతిరోజు కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నా ఇల్లాలినై
🍀🌹వకుళ వాసు🌹🍀
14 ✍️ డా.పాండాల
అదిగదిగో అలజడి
విశ్వ జనులు శ్రామికులై
పిడికిలెత్తి పిలుపునిచ్చె
గుబులునంత తరిమికొట్టె..!
గుండెల శృతిలయ సవ్వడి
విశ్వాసమే చేతనంగ
ధరాతలంబంత జరిపే
కార్మికుల దినోత్సవం..!
ప్రపంచాన ప్రజ్జ్వలితం
కరాలల్ల బిగువచూపే
తరతరాల మనుగడెంచె
చైతన్యపు భావుకతా..!
త్యాగశీల నడవడికా
చేయిచేయి కలిపే బలం
అదే శ్రమకు మూలబలం
అన్నార్తులకాత్మబలం..!
అనాదిగా రాజరికం
ఆధునికపు క్యాప్టలిజం
శ్రమదోపిడి నైజంగా
అభివృద్ధి మంత్రంలో..!
ఇంతింతై ఆస్తిపెరిగె
కార్మికులే క్రుంగి పోయే
కుత్సితాల విలాసాల
గుట్టుబెట్టు పనిబట్టగ..!
కార్మికుల కలిసి జట్టు
శ్రమశక్తని చేతులెత్తి
యుక్తిరక్తి ఉపాయంగ
కాల నిర్ణయంబుజేసి..!
పనివేళలమార్పు కోరి
కష్టాలను యిష్టంగా
సంక్షేమం కోరుకున్న
సంఘటితమే శ్రమఫలమని..!
గని వనిలో కార్ఖానలో
పొలంగట్ల హలం పనిలో
వైద్యవిద్య రవాణము
రెవెన్యైన లేబరులే...!
స్వేధజలం ఆత్మబలం
అసంఘటిత రంగమైన
అందరమూ శ్రామికులం
మేధశక్తి లేబరులం...!
మేడేగా మేల్కొల్పె
నేడేగా నైపుణ్యం
తోడైనా నాగరికం
లేదు మనకు పేదరికం..!
విశ్వ క్రాంతి దినోత్సవం
విశ్వ శ్రేయ వినూతనం..
ఐశ్వర్యం ఆనందం
అవలోకన మన ధ్యేయం...!
✍️డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
15
కాల్వ రాజయ్య
1/5/2020
అంశము మేడె (కార్మిక దినోత్సవ0)
1ఆటవెలది
చేయి చేయి కలిపి చేయాలి సమరము
శ్రమను దోచువారి చర్మ మొలు వ
కష్ట జీవులాకు కర్మ గార ము లోన
బాగ మియ్యి మంటు బదులు జెప్ప
2ఆ వె
హలము బట్టి దున్ని యన్నంబు బెట్టేటి
కార్మికుండ సాగు కదలి ముందు
నీదు శ్రమకు లేదు నిజమైన ఫలితమ్ము
నడుము కట్టవోయి నాగలెత్తి
3 ఆ వె
కర్మాగార మందు కరిగించి
మాంసము
ముడిసరుకుల నంత ముత్య మోలె
తీర్చి దిద్ది నట్టి త్రీమూర్తులే మీరు
కష్ట జీవి వయ్య కార్మి కుండ
4ఆ వె
పగలు రేయనకను పడుదువు పాట్లెన్నొ
ఎంత జేసిన పని యింది లేదు
బీదరికము తోని బిక్కుబిక్కను కుంట
సాగు జీవ నంబు సంశయమున
5 ఆ వె
కష్టమునెది రించి కార్మిక సోదర
కొండ బండ లెన్నొ పిండి జేయ
శక్తి నంత చేర్చి చేసేవు పనులెన్నొ
స్వేద మంత బువిలొ చేరుకోగ
16
శ్రామిక శక్తి అనంతమైన శక్తి
శ్రమనే ఆయుధం గా చేసి
కారుతున్న చెమటబిందువులో
నెత్తురు తో చెమటోడ్చి
రేయింబవళ్ళు అలసిసొలసి
కంటినిండా నిద్రలేక
పెత్తందార్ల శ్రమదోపిడికి గురవుతున్న శ్రామికులు
కార్మికుల నెత్తురు ను జలగలా పీల్చి పిప్పి చేసి
శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వక దగాచేసి
శ్రమజీవులు కృషిని యంత్రాలు గా మార్చుకొని
నెత్తురు కూడుతిని బడాబాబులు కోటీశ్వరులు
అవుతున్నారు
కూడులేక,గుడ్డలేక
సరియైన సదుపాయాలు లేక
విలవిలలాడుతున్న
కార్మికుల ఆవేదనల రోదనలు
ఆక్రందనలయ పెడచెవినపెట్టి
కార్మికుల కష్టాలు వినక
యంత్రాలు గా పనిచేస్తున్నారు
రక్తాన్ని చిందించి శ్రమిస్తున్నారు
శ్రమదోపిడీని నిలువుదోపిడి
చేస్తుంటే
రేయనక
పగలనక
రాయనక
రప్పనక
కాదనక
లేదనక
దారిద్రంలో మగ్గుతుంటే
హీనమైన
హేయమైన
దుర్గందభరితమైన జీవనస్రవంతిలో
జీవిస్తున్న శ్రామికులను
ఆదుకున్న నాధుడెవడులేడు
తిరగబడండి
బడాబాబుల దౌర్జన్యాలకు
తిప్పికొట్టండి రాజ్యాంగబద్ధమైన
హక్కులుకు పోరాడండి
లేవండి నిదురలేవండి
ప్రఛండభానుడిలా
భగభగమండే అగ్ని జ్వాలలా
తిరగబడండి
శ్రమను సమాజానికి
తెలయజేయండి
సహస్రకవిరత్న
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
ఉపాధ్యాయులు
కామారెడ్డి
తెలంగాణ
17
మహేందర్ జవ్వాజి
అంశం. మేడే
~~~~~~~~~|~||~~~~~~~~~
మండె ఎర్రటి ఎండలో
కూటికొరకు రెక్కలు ముక్కలుగా చేసుకుని నమ్మిన సిద్ధాంతమే ఆయుధం గా సాగుతోంది తమ పయనం
గాలివానలు ,రేయింబవళ్లు సైతం లెక్క కట్టని కష్ట జీవి తనూ వారినమ్మకమే జీవితం గా ఎంతటి బాధనైనా అవలీలగా చేసెస్తారు కార్మికులు
కొండంత పని ఎలుకంతా వేతనం.. చాలి చాలినంత జీవితం అయినా కుటుంబ భారంతన గుండెలపై కావటి వలె మోయాల్సిందె సుమా
బతుకుదెరువుకై పోరుబాట ధరల పెరుగుదల గుక్కెడు మెతుకులు కుటుంబ సభ్యులకు పెట్టడానికి తను పూటపూట పస్తుల పండుగె మిగిలింది ఆకరకు అణాపైస లేక
కాలం మారిన నాయకులు మారిన మారవ ఓ మానవ కష్టజీవుల బతుకు గోసా...
18
శీర్షిక:;**మే డే**
ఆకాశంలో మేడలు కట్టేది మీరే
నేలమీద పక్కాఇళ్లయినా లేనిది మీకే
అందరికీ అన్నంపెట్టే అన్నదాతలు మీరే
అప్పులబాధతో పురుగులమందు తినేది మీరే
పట్టుబట్టలు తయారు చేసేది మీరే
కట్టుబట్టలకు కటకటలాడేది మీరే
గాజువస్తువులెన్నో తయారు చేసేది మీరే
గాజు కన్న సున్నితఆయుష్కులు మీరే
చిత్రవిచిత్ర వస్తుతయారీపనితనం మీదే
చెత్తకాగితాల కన్న చిత్తయ్యే బతుకులు మీవే
చక్రాలదగ్గర స్వేదం చిoధించేది మీరే
స్వార్థపుచక్రాలకింద నలిగిపోయేది మీరే
పొగగొట్టాల కదలికలకు కారణం మీరే
సమస్యల పొగచూరిన జీవితాలు మీవే
ఇవన్నీ ఒకప్పుడు ఎద రగిలించే నిజాలు
ఇప్పటిపరిస్థితులు కొంత మెరుగన్నది నిజం
బాగుపడుతుంది కార్మికకర్షకుల పరిస్థితి
సంఘటితరంగ కార్మికులకున్నయి హక్కులు
సౌకర్యాలు చట్టాలు యూనియన్లు-
కావాల్సింది అందరికీ హక్కులపై అవగాహన
రైతుల కందుతున్నయి ప్రభుత్వపథకాలు
పెట్టుబడి సాయాలు కనీసమద్దతుధరలు-
కావాల్సింది వాటిని సందర్భోచితoగ
తెలుసుకుంటూ వాడుకునే ఉత్సాహాలు
అసంఘటితరంగ కార్మికులకూ గలవు
ఆరోగ్య జీవిత ప్రమాధభీమాలు ఉపాధి హామీ-
కావాల్సింది మనకు ఏ అవకాశముంది
ఏ లబ్దినెలా పొందాలనే సమాచార గ్రాహకశక్తి
అవగాహన ఆలోచన వివేకం పెంచేది అక్షరాలే
*అక్షరాష్యులై కార్మికకర్షకులుంటే నిత్యం మే డే*
వృద్ధి అగు జాతియ నికర ఆహార వస్తుత్ఫత్తి*
అపుడే కార్మికకర్షకులది ఓటమెరుగని అజేయశక్తి
:;*వల్లాల విజయలక్ష్మి*,,ఆలేరు
19🔸
🔸మేడే🔸🔸🔸
ప్రపంచ కార్మికుల పండుగ
శ్రమజీవుల చైతన్యం నిండుగ
మానవజాతికి
ఆకలి తీర్చగ
మన్నుల నుండి
అన్నం తీసి
పాడి పంటలకు
పాణం బోసి
వ్యవసాయానికి
వెన్నై నిలిచిన
రైతు కూలీలే
మన అన్నదాతలు
2
మట్టిని పసికి
కుండగా జేసి
తోలును వలిచి
చెప్పుగా మలచి
మాసిన బట్టలు
తెల్లగా ఉతికి
కర్రును కాల్చి
నాగలి చెక్కి
దారం వడికి
బట్టను నేసి
చెట్టును ఎక్కి
కల్లును గీసి
క్షౌరం జేసి
గడ్డం గీసి
పొరకను చీరి
బుట్టలు అల్లి
సమస్త వృత్తుల
సమగ్ర రూపం
3.
బావి తరానికి
బాటలు వేస్తు
విద్యా వెలగుల
సారం చెబుతు
రేపటి పౌరుల
రూపం చెక్కు
అక్షర శిల్పులు
ఉపాధ్యాయులు
4.
రోగం ..నొప్పి
ప్రమాదమొస్తె
మాత్రలు ఇచ్చి
చిక్సిత చేసి
స్వస్తత కూర్చి
ప్రాణం నిలిపే
డాక్టర్ నర్సులె
ప్రాణదాతలు
5.
గనిలోపనిలో
ఖర్ఖానల్లో
రక్తం చెమటగా
ధారలు పోస్తు
వస్తుత్పుత్తుల
రూప కర్తలు
శ్రామిక శక్తే
కార్మికులు
6.
పల్లె పట్నం
పట్టణాల్లల్లో
వీథులు కాలువల
శుభ్రం జేస్తు
చెత్త చెదారం
తొలింగించేసి
శుభ్రత నేర్పే
పారిశుద్ధ్య
కార్మికులు
7.ట్రాపిక్ జాంల
చిక్కుల విప్పుతూ
నేరాల్ ఘోరాల్
నిరోధిస్తూ
శాంతి భద్రతల
పరిరక్షకులు
రక్షకభటులె
పోలీసులు
8.
బడులు గుడులు
ధవఖానలు
మాల్స్ షాపులు
మల్టిప్లెక్సులు
ఇండ్లు భవనాల్
ఆకాశ హార్మ్యాల్
రోడ్లు వంతెనలు
ప్రాజెక్టు పనులు
నిర్మించేను
కార్మికులే
9.వాహనాలన్నీ
ఓర్పుగ నడపి
గమ్యం చేర్చును
మన డ్రైవర్లే
మరయంత్రాలు
మోరాయిస్తే
యంత్రభూతంల
కోరలు తోమి
పరుగెత్తించును
మెకానిక్కులే
10.
తీగలు గుంజి
స్తంభాలు నాటి
గడపగడపకు
ప్రతిప్రరిశ్రమకు
వెలగులు పంచిరి
విద్యుత్ కార్మికులు
11.
చావు నోటిలో
తలలను పెట్టి
భూగర్భంలో
ఖనిజం తొవ్వె
గని కార్మికులు
సలాంమీకు
12.
విషాదమంత
కడుపున దాచి
బొమ్మల తెరపై
నవ్వులుపూసి
వినోదం పంచె
నటీనటులు
కవిగాయకులు
సీనికార్మికులే
శ్రమజీవులు
చిందినచెమటే
సమస్త వృత్తులు
సమస్త పనులు
సంపద మూలం
సమాన పనికి
సమవేతనమని
శ్రమదోపిడీని
ప్రశ్నేంచేటి
మిగులువిలువలో
భాగం అడిగే
జీవన ప్రమాణ
స్థితిగతి మార్చే
ప్రతి సమరంలో
అందరమొకటై
అడుగులు వెద్దాం
సమ్మె హక్కు
మన జన్మహక్కుని
కార్మిక కర్షక
పీడిత ప్రజలకు
సలాం చేద్దాం
వందనమందాం
జైకొడదాం
జేజేలు పలుకుదాం
(చెమట పూలతో ప్రపంచ చరిత్రను నిర్మిస్తున్న శ్రమజీవులందరికి అంకితం)
.......యన్.లక్ష్మీనర్సింహారెడ్డి
20
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : మేడే
కవితా సంఖ్య: 20
తేదీ: 01/05/20
సమాజ నేస్తాలు ప్రపంచ
ఆలంబనలు
స్వేదాన్ని చిందించు శ్రమపెట్టుబడీ
దారులు కార్మికులు....!!
రెక్కల కష్టంతో నిత్యం
కష్టపడే మనస్తత్వం
కూలిడబ్బులే కోట్లసంపాదనల
తృప్తి లో మునిగే అల్పజీవులు....!!
బడాబాబుల దౌర్జన్యం లో
అణగదొక్కే ఇనుప సంకెళ్ళతో
విసిగి వేసారి పోటెత్తిన
అగ్నిపూల ప్రవాహం....!!
కార్మికులంతా ఏకమై
యాజమాన్య జులుంను విదిలించ
నాయకత్వ మధిరోహించిన రోజు.....!!
కార్మికులు లేని క్షణం
స్థంభించు ప్రపంచం
ఆ కార్మికులే చైతన్యరధ చక్రాలు
శ్రమదోచిన పిడికిలి బిగించు
ఆదరించిన ప్రాణమే ఇచ్చు....!!
🌹వినీల🌹
21
అంశం: మే డే
పేరు: శ్రీ శివ లక్ష్మీ రాజశేఖరుని
శీర్షిక: శ్రమైక జీవన సౌందర్యం
శ్రమ సాగరమధనంలో
తానో అశ్రువు
దోపిడి రాజ్యపు రాబంధువు
రెక్కలు విరిస్తే
రెట్టింపు వేగంతో తిరిగివచ్చిన
స్వేదస్త్రపు బిందువు
పురిటి గది లోనే బిగిసిన
తన పిడికిలి
దిక్కులు పిక్కటిల్లేలా తొలి ఆకలి
ఉద్యమ గీతం లో ఎగిసినా
శ్రమ రాగపు స్వరములలో తడిసినా
ఆ గొంతులో మోగే నినాదాలు
చీకటి తరిమే బతుకుల కోసం
ఆకలి తరిమే మెతుకుల కోసం
రాళ్ళెత్తిన కూలీలా
పల్లకి మోసే బొయిలా
గనుల గుండెల్లో పగిలిన రాళ్లా
శ్రమైక జీవన చిత్రాలా
ఏమని పొగడను వేనోళ్ళ
22
డా.బల్లూరి ఉమాదేవి
అంశము: మేడే
శీర్షిక : సమైక్య శక్తి
రెక్కాడిన గాని డొక్కా డని
శ్రామికులకు ఊరటనిచ్చిందీ మేఢే
శ్రామిక శక్తికి సమైక్యతకుగా
జరుపుకుంటున్న పర్వదినం
గనుల్లో కార్ఖానాలో గొడ్ల లాగ పనిచేస్తూ
కడుపు మండి ఆకలి బాధతో
పెత్తందార్ల పై తిరుగుబాటు జెండాను
కార్మికులంతా సమైక్యంగా ఎగరేసిన రోజు
కాలం తో పని లేక పగలు రేయి పనిచేసే దుస్థితి రూపమాసిన పోసిన రోజు
ఎనిమిది గంటల పని చాలంటూ
కడుపు మండిన శ్రామికులు నినదిస్తూ
నేలకొరిగిన చీకటి రోజీ మేడే
శ్రమ దోపిడిని అరికట్టాలంటూ
ఎర్ర బావుటా లెగరేసి కార్మిక శక్తిని
జగతికి చాటిన రోజు ఇదే
త్యాగ ధనుల శక్తిని చాటే దివ్య దినం
బలవంతమైన పామైనా చలి చీమల చేత
చావక తప్పదు అన్న వాస్తవాన్ని
రుజువు చేసిన సంఘటిత శక్తి ఈ మేడే
డా.బల్లూరి ఉమాదేవి
డల్లాస్/ అమెరికా
23
డా.రామక కృష్ణమూర్తి
తేది:1-5-2020
అంశం: మేడే
శీర్షిక: దేవుళ్ళు
*************************
స్వేదం చిందించి
భవనాలను నిలబెడతారు
మోదం లేని బ్రతుకులను
చిరునవ్వులతో గడిపేస్తారు
కాయకష్టం చేసి
కంటినిండా నిద్రపోతారు
కష్టాలెన్నో ఓర్చుకొని
పౌరుషంతో జీవిస్తారు
సుఖాలను,దుఃఖాలను
సమపాళ్ళలో తీసుకుంటారు
పండుగలు,జాతరలలో
మమేకమై ఆస్వాదిస్తారు
సూటిగా మాట్లాడి
బ్రతుకుపోరాటాన్ని ప్రశ్నిస్తారు
పిడికిళ్ళు బిగించి
పీడలను,దోపిడులను ఎదుర్కొంటారు
ప్రజాస్వామ్యాన్ని గెలిపించే వేళ
సమయస్ఫూర్తి చూపిస్తారు
కార్మికులై,కర్షకులై
అభివృద్ధికి బాటలు పరుస్తారు
దేశమేదైనా తమ అస్తిత్వాన్ని
పతాకస్థాయిలో నిలుపుతారు.
24
వేంకట కృష్ణ ప్రగడ
విశాఖపట్నం
01.05.2020
అంశం : మే డే
శీర్షిక : కార్మికులు
కార్మికులు
మన ధార్మికతకు నోచుకోని
మన సాటి
మనుషులు ఈ కార్మికులు ...
ఓరిమితో
కాయ కష్టంతో
మగ్గం కండె తానే అయి
కానని కాయంతో తిరుగుతూ ...
పగ్గం
పడుగు పేక
పరుగుల బతుకు
తామయి నిలిచిన
సాలెలు ఈ సగటు కార్మికులు ...
కొలిమి వేడి
నీడయి తాము రగులుతూ
కత్తి పార గునపం
కొడవళ్ళను సాన పడుతూ ...
గొడ్డళ్ళను
తమ కరిగే కండలనే
కొలిమి చేసి
పదును పెడుతూ
దుంగలు పగలగొడుతూ ...
ఱంపాలను
తమ రక్తం చెమటల
సూది సేస్తూ
సాగేటి జీవులు
కమ్మరి పనివారు ఈ కార్మికులు ...
కూరిమి కుండల
కుమ్మరి చక్రం
తమ కండల బిగువూ
నరాల సత్తువ
కలిపిన కష్టం కురిపించిన
కుమ్మరి కూలీలు ఈ కార్మికులు ...
తమ రెక్కల వేగంతో
గుండెలు అలిసి
బండలు బాది పిండిగ చేసే
చిక్కని
చీకటి బతుకులు ఈ కార్మికులు ...
కార్మికులు
మన ధార్మికతకు నోచుకోని
మన సాటి
మనుషులు ఈ కార్మికులు ...
... ✍ "కృష్ణ" కలం
25
*కవితా గానం*
*అభిరామ్*
*అంశం:- మే డే*
*కార్మిక వేదన*
గంప కృషించిపోయింది
పలుగు పరివేదనొందింది
సెలిక సొమ్మసిల్లిపోయింది
ఇసుక చిన్నపోయింది
సిమెంటు అయోమయ పడింది
గోడ గోడును వెళ్ళగక్కింది
భవనం బాధనొందింది
అనుకోకుండా మహమ్మారి ఆటలో ఆవేదన పుండై
నడిరోడ్డుపై నలిగిపోయి
నేలలోకి జారుకుంటున్న
వలస బ్రతుకులను చూసి
*అభిరామ్* ఆదోని 9704153642
26.
27
కవితా గానం
మర్రి జయశ్రీ
అంశం..మే డే
శీర్షిక.చైతన్య దినం
బానిస బతుకుల విముక్తికోసం
సమాన పనికి సమాన వేతనమంటూ
కార్మికులంతా నినదిస్తూ
ఉద్యమానికి పురుడు పోసిన దినం
ఎనిమిది గంటల పని దినం కోసం సాధించిన విజయం
కార్మికుల జీవితాలలో వెలుగు నిపుటకు
చికాగో వీరుల రక్త తర్పణం
తమ ప్రాణాలు లెక్కచేయని వీరుల పోరాట పటిమకు నిదర్శనం
పెట్టుబడిదారీ వ్యవస్థపై
శ్రమజీవుల పోరాట ఫలితం
కుల మత ప్రాంత భేదాలేని ఎరుగక
విశ్వశ్రామిక జనులు
విజయ గర్వంతో
త్యాగజీవుల రక్తంతో
ఎరుపెక్కిన ఎర్రజెండా ఎగురవేసి
ఐక్యంగా జరుపుకునే పర్వం
అమర వీరుల స్మారక దినం
కార్మికుల సెలవు దినం
ఒక చారిత్రాత్మక చైతన్యదినం మే డే.
28.
రచన.. వైద్యం భాస్కర్
(శ్రామికులకు సీస పద్య నీరాజనం)
//సీస //
సాంఘీక మాధ్యమం సంగతే తెలియదు,
కష్టంబు తెలియును ఇష్టముగను!
సాఫ్ట్వేరు ప్రావీణ్య సంగతి మతి లేదు,
మొరటుగా పనిజేసె మొండివాణ్ణి !
ఈక్విటీ మార్కెట్ ఇసుమంత తెలియదు,
ఈపూట సాపాటె ఇంగి తంబు!
బహుళసంస్థలతీరు బండారమేమెర్క,
శ్రామికా బతుకుల శ్రమలు తెల్సు!
తేట!!
దేశ దేశాల పాలించు ధన్యు లార,
విద్య వైద్యము ఉచితంబు విలువ మాకు,
యాద గిరిపుర వాసుడా అభయ మిచ్చి,
దుష్ట శిక్షణా జేసేటి శ్రేష్టు డావు !
29
[02/05, 8:45 PM] Muvva Prasad: కాలాలు మారినా కధనాలు మారలేదు
కూలీల శ్రమ కూటికి కష్టం
రైతుల శ్రమకు రాబడి కష్టం
ఉద్యమానికి ఊపిరి కష్టం
పోరాడినోడికి ఫలితం కష్టం
ప్రభువులకు పదవులు ఇష్టం
సోమరులకు సౌఖ్యాలు ఇష్టం
పామరులకు పధకాలు ఇష్టం
ఖజానాకు కాసులకష్టం
కలసికట్టుగా కదం తొక్కితే
దళారులకు దండుకొనుటకష్టం
ధరిత్రి చూడని చరిత్ర లేదు
దారినిచూపే దిక్కు మనమే
దివినుండి దిగిరాడెవ్వడు
పదండి పోదాం పోరాటానికి
చరిత్రలోచారితార్థులమౌదాం !
మువ్వా ప్రసాద్
30
[02/05, 8:52 PM] Swarna Samatha Poetess: **కవితా గానం **
**02/05/2020**
👧 **ఆడపిల్ల **👧
ఆడపిల్లలు
ఇంటికి లక్ష్మి
కంటికి క్రాంతి
మురిపెంతో మైమరిపించే
ప్రేమానురాగాల కల్పవల్లి
ఇలలో వేలసి న పాలవెల్లి
అందేల సవ్వడి
మోమున నవ్వుల సడి
ఆమె ఒక అమృతబాన్డము
ఆమెహృదయం చల్లని సంద్రం ఆమె కరుణ అనంతం
మమతానురాగాల మరుమల్లి ధైర్యంలో ధీశాలి ఆ తల్లి
సుఖదుఃఖాలలో సగమై
కార్యసాధనలో లీనమై
ముందుకు సాగే
ఆడపిల్ల
లేడిపిల్లల గంతులేస్తూ
బాధను--బాధ్యతను మోస్తూ
కన్నవారికి --కనుకున్న వారికీ ఆసరా అవుతుంది
పూట్టినింటికి --మెట్టినింటికి ఘనతను తెచ్చే వనిత
ముదములో మగువ
సాహసంలో తెగువ
ఆమెసొంతం .
**స్వర్ణసమత**
**నిజామాబాదు**
31
[02/05, 9:09 PM] BHOOMAIAH TP I RAYKAL: 💐💐🚩🚩🚩💐💐🚩🚩💐💐
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో..
*కార్మికుని ప్రాశస్త్యం*
*సీ*
*పగలు రాత్రులయందు పలుమారు కష్టించి*
*నిత్యమ్ము పనిజేయు నిష్ఠయోగి*
*బొగ్గుగనులయందు భుక్తికొరకుచాల*
*కష్టించి పనిజేయు కర్మయోగి*
*స్వేదమ్ము చిందించి క్షేమమ్ము కాంక్షించి*
*సత్యమ్ముదప్పని సాధుయోగి*
*బ్రతుకు భారంబైన బాధ్యత మరువక*
*బుద్ధిగాపనిజేయు సిద్ధయోగి*
గీ
*నీదు శ్రమయు లేకున్నను నిలువలేదు*
*జగతి,కార్మిక సేవలే!జాతిహితము*
*ప్రగతి పథమును నడిపించు బాటవీవె!!*
*ప్రస్తుతించి నీ పనులకు ప్రణతిజేతు!!*
మీ
సిహెచ్. భూమయ్య,
నారాయణఖేడ్.
💐💐💐🙏🙏🙏🙏🙏💐💐
32
[02/05, 9:18 PM] సునంద ఉరిమిళ్ళ: కవితా గానం
తేదీ::02-05-2020
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
శీర్షిక:: మహా కవి శ్రీ శ్రీ
::::::::::::::::::::::::::::::::::::
అక్షరం పదునెక్కిన ఆయుధం
కలం ఝళిపించి సాగించిన కవనం
ప్రపంచ మానవులకు ఇచ్చిన సందేశం
పీడిత తాడిత గుండెల్ని రగిలించి
మరో ప్రపంచం మీకోసం పిలస్తున్నదని
ఉత్సాహపు ఊపిరులూదిన శ్రీ శ్రీ!
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఆహుతిచ్చానని
లోకమంతా జయభేరి మోగించిన మహా కవి!
కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ
అన్నీ కవితా వస్తువులేనంటూ
ఉత్సహ పరిచి
కవిత్వం తీరని దాహమనీ
ఎంత చదివినా రాసినా ఇంకా ఇంకా
మనలో కోరిక పెంచుతుందని చెప్పిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు!
కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేది
కవిత్వమేననీ సగర్వంగా చాటుకున్న మహా కవి!
సాహిత్యం లో ఆయనొక విప్లవ కెరటం
అవినీతి బంధుప్రీతితో
సాధించిన స్వాతంత్ర్యం
ప్రమాదంలో పడిందని హెచ్చరించి
ఎన్నో కవితలు,ఋక్కులు
సినిమా పాటలతో
ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన కవి శ్రీ శ్రీ!
33
పేరు:డా.బల్లూరి ఉమాదేవి.
అంశం :శ్రీశ్రీ
కార్మిక కర్షక వీరుల స్వేదజలాన్ని
సిరాగా మార్చి కవితలల్లిన మహా కవీ
వందనం శుభాభివందనం
పదండి ముందుకటంచు
అణగారిన బ్రతుకులు గడిపే
అన్నార్తుల కాలంబనమై
ప్రోత్సహిస్తూ కొత్త వూపిరి నింపిన
యుగకవీ వందనం శుభాభివందనం
అగ్గిపుల్లయైనా కుక్కపిల్ల యైనా
కవిత కనర్హంకాదని తెలుపుచు
నవకవుల కాదర్శమై దారిచూపిన
నవయుగ కవివరేణ్యా వందనం
శుభాభివందనం
మేడలు కట్టిన,పల్లకీలు మోసిన
కూలీల శ్రమను గుర్తించి
జగతికి చాటిన విప్లవ కవివతంసా
వందనం అభివందనం
మరో ప్రపంచం పిలుస్తొందంటూ
సహస్రవృత్తులవారిని స్మరింపచేస్తూ
కవితా ప్రస్థానంచేసిన మహాకవీ
నీకిదే మా జోహార్
34
అంశం:శ్రీశ్రీ
అటు ఓ శ్రీ
ఇటు ఓ శ్రీ
తొలి తాను
తుది తాను
ఓ శ్రీశ్రీ!
అభ్యుదయానికి ఆరంభం ఓ శ్రీ
విప్లవానికి సంకేతం ఆ శ్రీ
విషం గొంతు దాచి శ్రీశ్రీ
అమృతుడయ్యాడు శ్రీశ్రీ
-- *దండమూడి శ్రీచరణ్*
9866188266
35
సునంద ఉరిమిళ్ళ: కవితా గానం
తేదీ::02-05-2020
పేరు:: వురిమళ్ల సునంద, ఖమ్మం
శీర్షిక:: మేడే
--------_-----------------------
చిందించిన చెమట చుక్కల్లో
చిరునవ్వులు పూచిన వేళ
కన్నీళ్ళు నిండిన కళ్ళలో
కాంతులు విరజిమ్మిన సమయం
పని హక్కుల సాధనకై
కనీస సౌకర్యాల కోసం
ఉద్యమించిన కార్మికుల కష్టాలు
నెరవేరిన రోజు మేడే
బతుకుల్లో పున్నమి వెలుగులు నింపిన రోజు
ఎందరో కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి
సాధించుకున్న విజయోత్సవ రోజు
ప్రపంచ పటంలో
చికాగో నగరం సాక్షిగా
కార్మికులు శ్రామికుల ఉద్యమం
వారి క్షేమం కోసం పోరాడి
గెలుపు కేతనం ఎగరేసిన రోజు!
మేడే కార్మిక కర్షక హ్యాపీ డే
36
01 May 2020
09:44
గీతలు మారినా
రాతలు మారక
గతులు మారినా
బతుకులు మారక
దోపిడి ప్రపంచంలో
నిలువు దోపిడికి గురై
దగా పడిన జీవితాల
చిరిగిన బతుకల
పగిలిన గుండెల
చిందిన నెత్తుటి
వేదన ఆవేదన రోదనల్లోంచి
పుట్టిన బతుకు దెరువు ఆకలి కేకలు
కార్మికులారా ఏకంకండి అని గొంతెత్తి
దిక్కులు పిక్కటిల్లేల చేసిన మహాగర్జన
కార్మికుల ఐకమత్యాన్ని సంఘటితం చేసి
చేయి చేయి కలిపి కదం తొక్కి
పిడికిలి బిగించి చెయ్యెత్తి
విప్లవ పోరాటానికి
ముందడుగు వేసిన రోజు
లోకానికి శ్రామిక శక్తిని చాటిన రోజు
బడుగు జీవుల పండుగ రోజు
విప్లవ గీతం పాడిన రోజు
నేడే మేడే
కార్మిక సొదర సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు
------------ పో లా
38
శ్రామిక సంగీతం
అతను
కఠినపాషాణాలను
చీల్చి స్వరాలు పలికించగలడు
మనుషుల గుండెలు తప్ప--!
అతను
అగ్నికణపు సోరంగాలను
ఛేదించి గమకాలు సృష్టించగలడు
మనుషులలో దయను తప్ప--!
అతను
కొండశిలలను గండరించి
ఢమరుక విన్యాసం చేయించగలడు
మనుషుల ఆలోచనలు తప్ప --!
అతను
మాడేపేగును కూడా
తంత్రినాదం చేసి శృతిచేయగలడు
మనుషుల మానవతను తప్ప --!
అతను
చెమటను నెత్తుటిచుక్క చేసి
ఎదుటివారికి సెంటు పూయగలడు
మనుషుల డీసెంటును తప్ప--!
అతను
ఎర్రనికొలనులో కాల్చబడే చువ్వై
ఆధునికతను నిర్మించగలడు
మనుషుల సమానతను తప్ప--!
అతనో............
నిత్య శ్రామిక జీవి
చైతన్య కణిక
కష్టం పై ఇష్టం గా
సేదదీరే కార్మికుడు
సమసమాజం
విస్మరించిన రాగం,
వెలుగుకై ప్రభవించే విప్లవ గీతం ..!!
కవితాగానం
రమాదేవి కులకర్ణి
హైదరాబాద్
8985613123
9716134567


Comments
Post a Comment