Skip to main content

స్వీయ క్రమశిక్షణ

సమూహ నిర్వహణః
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం
శివునూరి లలితా కృష్ణ
సహకారం
మెరుగు మధు
అవధాని
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు
**************


స్వీయ క్రమశిక్షణ
కవితా గానం జాబితా
*******"***********
1.కోరాడ గారు
2.ఇంద్రావత్ రాహుల్ గారు
3.విజయ దుర్గ గారు
4.పాల్వంచ హరికిషన్ గారు
5.డా.రామక క్రిష్ణ మూర్తి గారు
6.బొడ్డు మహేందర్ గారు
7.స్వర్ణలత గారు
8.మర్రి జయశ్రీ గారు
9.బల్లూరి ఉమాదేవి గారు
10.దీపక్ న్యాతి గారు
11.పోలా కిషోర్ గారు
12.వల్లాల విజయ లక్ష్మి గారు
13.సరితా నరేశ్ గారు
14.మహేందర్ జవ్వాజి గారు
15.నోముల సంజీవరెడ్డి గారు
16.ఉదయశ్రీ ప్రభాకర్ గారు
17.వురిమళ్ళ సునంద గారు
18.శివ లక్ష్మి గారు
19.వరయూరు జానకి రాం గారు
20.గుండ్ల రాజు గారు
************************"
1
తేదీ : 14-04-2020.
అంశం:-స్వీయ క్రమ
               శిక్షణ
 కోరాడ నరసింహా రావు.,*ఔన్నత్యం*
           *********
నేర్పవలసినవయసు
వరకే...తల్లీ,తండ్రీ,గు రువులు...క్రమశిక్షణ
విద్యాబుద్ధులునేర్పేది...!
చివరివరకూ ఎవరికి వారు స్వీయ నియం త్రణలో...క్రమ శిక్షణ గా బ్రతకాల్సిందే  !
క్రమశిక్షణ లేని బ్రతుకు తెగిన గాలి పటమే...!
యేగాలివాటుకెటుపోతుందో ...,ఎప్పుడు తెగి పోయి ఏ మై
పోతుందో...!!
వ్యక్తి క్రమ శిక్షణతప్పి
తే...కేవలం ఆ ఒక్క  వ్యక్తేకాదు ...అతనికుటుంబము...మొత్తం సమాజమే నష్ట పోతుంది...!
క్రమశిక్షణతో  నడచు కోవటమంటే...,తననుతానునియంత్రించు కోవటం...!
కష్టమే...,ఐనా...దాని ఫలితం సర్వ శ్రేయో దాయకం !శుభకరం!
ఇందుకు గాధీజీయే  గొప్ప ఉదాహరణ.,
తనచిన్నప్పుడుచూసినశ్రవణకుమారుడు,హరిశ్చంద్రుడు
సత్యము,అహింస లనే ఆదర్శంగా తీసు
కుని...స్వీయ క్రమ శిక్షణతో...తాను బ్ర తకటమే కాదు యావత్ భారత దేశాన్నీ తనవెంట క్ర మశిక్షణతోనడిపించగలిగినమహానాయకుడైనాడు !అసాద్య  మనుకున్నస్వాతంత్ర్యాన్నిసు సాద్యమే
అని నిరూపించిన మహోన్నతుడైనాడు
అదీ...స్వీయ నియం త్రణా వై శిష్ట్యం...!!
*****************
.......కోరాడ.
2
స్వీయ క్రమ శిక్షణ

కావాలి కావాలి నిత్య విద్యార్థులకు స్వీయ క్రమ శిక్షణ
ప్రతి మానవుడికి కావాలి శిక్షణ
ఒడిలో ఉన్న పసి గుడ్డుకు కావాలి అమ్మ  క్రమ శిక్షణ
బడిలో ఉన్న విద్యార్థులకు కావాలి గురువు శిక్షణ
గుడిలో ఉన్న పూజారికి కావాలి గుడి స్వీయ శిక్షణ
డాక్టర్లకు కావాలి పని శిక్షణ
పోలీసులకు కావాలి ప్రజలను రక్షణ ఇచ్చే శిక్షణ
దేశాన్ని కాపాడడానికి కావాలి నావికి శిక్షణ..
ఓ మానవ నేర్చుకో శిక్షణ వస్తుంది విజయం..
శిక్షణ లేనిదే ఎ పని కూడా అసాధ్యం..
సాధ్యం కావాలి అంటే నేర్చుకో స్వీయ క్రమ శిక్షణ
ఓ మానవుడా నువ్వు కరోనా గురించి స్వీయ క్రమ శిక్షణ తెలుసుకో నీ జీవితం అద్భుతం
నేర్చుకో... నేర్చుకో.. క్రమ శిక్షణ
నీ భవిష్యత్తు మలుపుకో సాపిగా.....


 🎯 *కవి పరిచయం* 🎯
***********************

పేరు : ఇంద్రవత్ రాహుల్
ఊరు : మల్కాపూర్
జిల్లా : ఇందూర్ /నిజామాబాదు
మండలం : ఇందూర్ /నిజామాబాదు
చరవాణి : *9848054079*

3
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : స్వీయక్రమశిక్షణ

సకల చరాచర జగత్తుకు
ఆధారం క్రమపద్ధతిలో
గమనాల పయనం
వెలుగు పంచే సూరీడు పయనమే
కాలానికి సమయం....!!

ప్రత మనిషికి ఆధారహేతువు
పద్దతిప్రకార హద్దులు
నాయకునికి ముఖ్యమే
ఒక నిర్ధిష్ట ఆంక్షల అడుగులు....!!

ఆకోవలో అడుగేసిన స్పూర్తిదాత
మన గాంధీతాత
దేశదేశాలలో స్థితి గతులను చదివి
అనుభవాలను కోసుకొని
స్వీయక్రమశిక్షణకై నాందిపలికారు.....!!

దేశాన్ని ఒకతాటి పై నడపాలన్నా
ఆదర్శంగా ముందు కు నడపాలన్నా
నాయకుడు లో ఉన్న క్రమశిక్షణే
ఉన్నతఫలితాల జోలి
ఆ దిశగా నిరాడంబర జీవనశైలితో
దేశప్రజలకే దిక్సూచిగా నిలిచాడు....!!


      4.           

శీర్షిక: తార్కాణము !!

నా.. అనంటే
ముందడుగే లేదు
మా..అనుకుంటే
వెనకడుగే ఉండదు
నా..లో నేనన్నది
గర్వానిదె పర్వం
మా లో మనమన్నది
గౌరవానిదె సర్వం
నా కోసమె నేనంటే
నేను నేనుగనే ఉంట
అందరితో నేనుంటే
అంతా మనదేనంట
ఎవరికి వారనునది
ఏటికి ఎదురీడమే
అందరు మనమనునది
నల్లేరుపై నడవడమే
పుట్టుట గిట్టుట తప్పదు
మధ్యమమే సార్ధకము
స్వీయ క్రమశిక్షణతో
నడిస్తే ప్రబంధము
సూర్య చంద్రుల గమనం
అందుకు తార్కాణము!
   
   -- పాల్వంచ హరికిషన్
       రామన్నపేట
       9502451780
           5
పేరు:డా.రామక కృష్ణమూర్తి
అంశం:స్వీయ క్రమశిక్షణ
శీర్షిక:ఉత్తమ గుణం
**************************

ఇంగితమున్న మనిషికి తప్పక‌ కావాల్సింది
విషయమున్న ప్రతిపనికి పాటించాల్సింది
బాల్యం నుంచి బ్రతుకు ఆఖరు వరకు
అందరూ ఆచరించాల్సిన గుణం
సమయానికి ఆచరించాలనే జ్ఞానం
విధివిధానాలను తప్పకూడదనే నిబంధన
నియమనిష్ఠలతో సక్రమంగా చేయాలనే ఆలోచన
వ్యష్ఠి నుండి సమష్ఠి వరకు కావాల్సిన సూత్రం
విజయాలకు మూలాధారమై నిలుస్తుంది
నిగ్రహానికి నిలువెత్తు నిదర్శనమై కనిపిస్తుంది
గౌరవాన్ని,పూజ్యనీయతను పెంచుతుంది
బద్ధకాన్ని,నిర్లక్ష్యాన్ని తొలగిస్తుంది
నలుగురిలో నిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుంది
గెలుపు బాటలకు సోపానమై కుదురుతుంది
విశిష్ట వ్యక్తిత్వాన్ని పంచి నిజమవుతుంది
వ్యవస్థకు శ్రీరామరక్షగా తోడుంటుంది
స్వచ్ఛతకు,పవిత్రతకు పాత్రమవుతుంది
లోకకళ్యాణానికి నాందీవాచకమై వెలుగుతుంది.
ఆపదలు రాకుండా సుదర్శనచక్రమై అడ్డుకుంటుంది
మనిషి నుండి 'మనీషి'ని చేసి చరిత్రలో స్థానం కల్పిస్తుంది
ఆరోగ్యాన్ని పెంచి,ఆయుష్షునిచ్చి ఆశీర్వదిస్తుంది
స్వీయ క్రమశిక్షణ నైతికవిలువల రాజమై
జీవితాన్ని ఆనందమయం చేస్తుంది
అందరూ పాటించాలి-వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి.
.      6
వైరస్సే కదా అది వైరాగ్యం ఎందుకు
విపత్తే కదా అది విస్మయం ఎందుకు
వ్యాధే కదా అది వ్యధ ఎందుకు
వ్యాప్తిని అరికట్టక వ్యర్ధపు నీ రొద ఎందుకు
ఎన్నో తట్టుకొని నిలబడితేనే కదా
నేడు నీ ముందున్న ప్రకృతి
ఎన్నో ఓర్చుకొని కలబడితేనే కదా
నువ్వు సాధించిన ఈ ప్రగతి
కష్టానిదేముంది భాయ్..
కలగానో, కన్నీటి ధారగానో తీరిపోతుంది
ఇష్టానిదేముంది భాయ్
ఇపుడో, అపుడో నిన్నే ఏరికోరి వస్తుంది
రాపిడికి ఓర్చితేనే గద్దముక్కు పదునయ్యేది
రాతి గుండెని చెక్కితేనే దేవుడిగా కొలువయ్యేది
కట్టడి అనుకోకు-కర్తవ్యం అనుకో
నియంత్రణ అనుకోకు-నిర్మూలన అనుకో
బంధనం అనుకోకు-బాంధవ్యం పెంచుకో
విరామం అనుకోకు-విశ్లేషణ చేసుకో
నిర్లక్ష్యం వీడితేనే ఈ తరానికి బ్రతుకు
నీ విధి పాటిస్తేనే రేపటి తరానికి మెతుకు
భారంగా భావిస్తావో..బాధ్యతగా జీవిస్తావో..
నీదే నిర్ణయం..మిత్రమా..
నేడు నీ దేహ రక్షణే ఈ దేశ సంరక్షణ

బొడ్డు మహేందర్
చెన్నూరు, మంచిర్యాల జిల్లా
ఫోన్ 9963427242
7
అంశం....స్వీయ క్రమశిక్షణ
పేరు.......స్వర్ణలత

నావకు చుక్కానిలా....
అవసరమేగా ప్రతివ్యక్తికీ
స్వీయ క్రమశిక్షణ
ఎవరికి వారూ రోడ్డుపై
నియమాలు పాటించినపుడే
ప్రమాదాల నియంత్రణ
స్వీయ క్రమశిక్షణ పాటించినపుడే
జీవితంలో అపజయాల నియంత్రణ
ఎవరి కోసమో కాదు...
స్వీయ క్రమశిక్షణ మనకోసమే
అడుగు అడుగున ఆపదలలో
ఎవరూ కాపాడక పోవచ్చు
స్వీయ క్రమశిక్షణతో...
ఆపదలకు మనం ఆమడ దూరం
ఒంటరిగా ఉన్నప్పుడు...
మన ప్రవర్తన ఎలా ఉంటుందో
పది మందిలోనూ అలాగే ఉండేలా
రక్షణ మంత్రం ...
జీవితాన ఉన్నతులుగా నిలిపే తంత్రం
ప్రతీ వ్యక్తి ఉన్నతుడిగా ఉన్నప్పుడు
దేశం ప్రగతి పథం లో ముందు ఉండదా
      8

మర్రి జయశ్రీ
అంశం.స్వీయక్రమశిక్షణ

మానవ వికాసానికి మూలం
జీవిత లక్ష్యాలను సాధించుటకు
జీవన పయనంలో ఎదురయ్యే
ఎన్నో సంఘర్షణలు,సవాళ్ళు ను ఎదుర్కొనే ఆయుధం
సమాజంలో పేరుకుపోయిన
అనేక రకాల తప్పిదాలను రూపుమాపి
కొత్త రూపాన్నిచ్చి
సామరస్య భావన నెలకొల్పేది
ఎవరికి వారుగా అలవర్చుకొని
ముందుకు సాగిపోయేది స్వీయక్రమశిక్షణ
స్వీయ క్రమశిక్షణతో ఎంత ఎత్తులకేదిగినా
ఆచరణలో పెడితే
అదే భావితరాలకు మనమిచ్చే
అపురూపమైన సంపద
మహాత్మాగాంధీ ఆ క్రమశిక్షణతో
భారత స్వాతంత్ర సంగ్రామంలో
వియజేతగా నిలిచాడు
నిజాయితీ నిగ్రహం
పవిత్రత,శాకాహారం
స్వీయక్రమశిక్షణ తో ఎదిగి
భారతీయులకు ఆరాధ్యదైవం అయ్యాడు
అందుకే ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణ అలవర్చుకొని
అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని.
    9
డా.బల్లూరి ఉమాదేవి
శీర్షిక :స్వీయ క్రమశిక్షణ

ప్రకృతి నేర్పును క్రమశిక్షణ జనాళికి

సూర్యుడుదయిస్తాడునిత్యం తూరుపు దిశలో

అస్తమిస్తాడు పశ్చిమాన సంజకు క్రమం తప్పక

యుగాలు మారినా  మారని క్రమశిక్షణ ఇదే

ఋతువులు ,సంవత్సరాలు  వస్తుంటాయి

క్రమశిక్షణతో గతి తప్పక ప్రతీయేడు

అదే క్రమంలో జగతిలో మానవులంతా

స్వీయ క్రమశిక్షణ వీడక పాటిస్తే

బ్రతికే అవుతోంది బంగారు బాట

బాల్య మాదిగ నాలుగు దశలలో

దశానుగుణముగా  మానక పనులను

క్రమశిక్షణతో చేసిన చెంతకు రావే చికాకులు

 క్రమశిక్షణతో పెరిగిన పిల్లలు ఔతారు

దేశ ప్రగతికి రథచక్రాలు వారే ఆశా కిరణాలు

 బాల్యం నుండే ఇంట్లో తల్లిదండ్రులు

బడిలో  గురువులు తప్పక నేర్పిన క్రమశిక్షణను

జ్ఞాన సూర్యులై వెలుగులు పంచుతూ

దశదిశలా  మేలిమి జాతి రత్నాలౌతారు.

10
స్వీయ క్రమశిక్షణ

కారణ జన్ముడంటారు
కారణం నీకు తెలుసా

సరెలే జన్మించావు
మోక్షమంటే నీకు తెలుసా

మోక్షం కోసం మోకరిల్లితే
జీవితమెందుకో నీకు తెలుసా

జీవితమే ముఖ్యమయితే
నిస్వార్థానికి అర్థం నీకు తెలుసా

స్వార్థమే సమంజసమనుకుంటే
పశువులమౌతామని నీకు తెలుసా

పశువులతో పోల్చుకుంటే
ఆశలుండవని నీకు తెలుసా

ఆశ లేని జన్మకు కారణం
అవసరం లేదని నీకు తెలుసా

విశ్వ విహారానికి విశిష్ట
సిద్ధాంత ముందని నీకు తెలుసా

డా.దీపక్ న్యాతి
11.


అంశం : స్వీయ క్రమశిక్షణ
రచన :  పోలా కిషోర్ కుమార్
---------------------------------------------
ఉషోదయపు భానుడి పలకరింపులతో తమ కిలకిలరావాలతో వినీలాకాశంలో ఒక నిర్దిష్ట ఆకారంలో ఎగిరే పక్షులకు ఎవరు నేర్పారు అలా ఎగరమని--  క్రమశిక్షణ వాటి సహజ గణం

సాయం సంధ్యా సమయంలో గోధూళి వేళ తమ లయబద్దమైన గిట్టల చప్పుడుతో
గోమాతలు ఒక వరుస క్రమములో దారి తప్పక నేరుగా తమ నివాసానికే వెళ్తాయి వాటికెవరు నేర్పారు అలా వెళ్ళమని ----క్రమ శిక్షణవాటి సహజ గుణం

నీటి లొని చేపలు సైతం ఈదెటప్పుడు వాటి వరుస క్రమం చూడడానికి మన రెడు కళ్ళు చాలవు వాటికి అలా ఈదమని ఎవరు చెప్పారు ----- క్రమ శిక్షణ వాటి సహజ గుణం

ఇలా వర్ణిస్తూ పోతే సృష్టి లోని సమస్త పశుపక్షాది జంతుజాలలు పకృతే ప్రాణంగా ప్రకృతిలో మమేకమై జీవిస్తాయి కాబట్టే ప్రకృతికి అణుగుణంగా క్రమశిక్షణ తో సహజ గుణంతో మెలుగుతాయి

ఇక మానవుడి విషయానికి వస్తే మనిషి. తన స్వార్థం కోసం ప్రకృతి మీద ఆధిపత్యం సాధించాలని చూస్తున్నాడు అలా సాధించే క్రమములో
స్వీయ క్రమశిక్షణను కోల్పొయి ప్రకృతి ప్రసాదించిన వాతావరణాన్ని కలుషితం చేస్తూ  లోక వినాశనానికి కారణమవుతాడు

ఒకవేళ మానవుడేకనుక తన దైనందిక జీవితంలో ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ స్వీయ క్రమశిక్షణతో సత్య మార్గమున జీవిస్తూ ప్రకృతి యెడల సమాజం యెడల పరోపకారిగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఈ లోకంలో అనర్థాలకు అసౌకర్యాలకు అశాంతికి అమంగళాలకు తావులేదు

సర్వేజనా సుఖినోభవంతు
12
 విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక::**స్వీయక్రమశిక్షణ*

కాళ్ళకు ఆగని చక్రాలున్నట్లు
అలా పరుగులు పెట్టేదెoదుకు?
మరికొన్నిరోజులు ఉందాం ఇంట్లో
ఊరిలో తిరగకుంటే ఆగే రాచకార్యాలేoటట?

పరిచయస్థులను ప్రత్యక్షంగానే
కలిసి మాట్లాడాల్సిన పని ఏమి?
ఫోన్ చేసి పలుకరించినా చాలును కదా
*స్వీయక్రమశిక్షణ* పాటించకుంటే తప్పదు అనాథచావు శిక్ష

"నాకేం అవుతుంది?అనిఅహంకరిస్తే                ఏమౌతుందో!అగ్రరాజ్యాలను చూస్తే.                         అర్థంకావటం లేదా సోదరా?!
ముప్పుతప్పిoచ వెనుకడుగేసినా తప్పుకాదురా!

సమయానుకూల స్పందకుడే విజేత             
దేశానికైనా దేహానికైన అత్యవసరం రక్షణకవచం
మనం గడప లోపలుండి రక్షించబడదాం.    స్వీయక్రమశిక్షణతో దేశసేవ గావిద్దాం

మాయదారి కరోనా తెల్లోళ్ల వారసురాలిలా
మనుషులను విడదీస్తున్నానని ఆనందిస్తుంది
విడివిడిగాఉంటూనే చూపుదాం ఐకమత్యాన్ని
ఉమ్మడిశత్రువును తరిమేద్దాం దేశాన్నుండి

తప్పక వచ్చు మనమంతా కలిసే శుభదినం
అపుడు చూపుదాం మన కలుపుగోలుతనం
భారతీయసంఘజీవన ప్రావీణ్యం
అoదాకా *దేహవాహనాన్ని* అవసర జాగ్రత్తలతో అర్ధవంత ఆలోచనలతో ఇంట్లోఉంచుదాం భద్రంగా

ప్రపంచాన్ని జయించాలనుకునే ముందు
సాధించు చూపుదాం మనసుపై అదుపు
ఊరంతా తిరిగి చూడాలనుకునే ముందు
తొంగి చూసుకుందాం మనసు లోతుల్లోకి

సమస్యలో అవకాశాన్ని చూసినోడే సాధించగలడు           సద్వినియోగం చేసుకుందాం ఈ అవకాశాన్ని
ఇంట్లో మనవారితో సంతృప్తితో గడుపుతూనే
బలపరుచుకుందాం మానవ బంధాలాన్నిటిని

క్రమశిక్షణ పాటించనివాడు ఏమీ సాధించలేడు
ఈ స్వీయనిర్బంధమే బాంధవ్యాలవారధి
మన కళలను వెలుగులోకి తెచ్చే సారధి
పర్యావరణాన్నిరక్షించే పెన్నిధి అనుకుంటే మంచిది

:వల్లాల విజయలక్ష్మి,,ఆలేరు

13
*స్వీయ క్రమశిక్షణ*

నీ జీవన నౌకను సవ్యంగా నడిపేది
సమాజంలో నీకు ఓ మంచి గుర్తింపునిచ్చేది
వ్యక్తిత్వపు శిల్పంగా నిను నిలుపేది
ఎనలేని గౌరవాన్ని తెచ్చి పెట్టేది
స్వీయ క్రమశిక్షణే

బాల్యానికి భద్రతనిచ్చేది
యవ్వనాన్ని గాడిన పెట్టేది
తద్వారా వృద్ధాప్యానికి
భరోసానిచ్చేది స్వీయ క్రమశిక్షణే

అంతెందుకు ఇపుడున్న కరోనా కష్టకాలం
తార్కాణంగా తర్కించుదాం
లాక్డౌన్ అమలు సమయం
లోకమంతా అల్లకల్లోలం
గడప దాటి బయట కాలు పెడితే
కరోనా కాటుకు బలి అవడం కాయం
అదే స్వీయ నియంత్రణ పాటిస్తూ
ఎవరింట్లో వారముంటే
కరోనా కట్టడిలో కలుగు కదా జయం
ఇపుడు స్వీయ క్రమశిక్షణే అత్యంతవసరం

అందుకే ఎప్పటికైనా
ఎలాంటి పరిస్థితి లోనైనా
స్వీయ క్రమశిక్షణ ఉత్తమ లక్షణం
ఎట్టి విజయానికైనా ఆదిమూలం

సరితనరేష్
నల్లగొండ
14
పేరు. మహేందర్ జవ్వాజి
అంశం.💥స్వీయ క్రమశిక్షణ💥
మన రోజు కార్యచరణ యె
అసలైన క్రమశిక్షణ మానవ జన్మ ఎంత ముఖ్యమో ఆజన్మలో భాగమే ఈ కార్యరూపం మన జీవిత
ఎదుగుదలకు పునాది రాయి అయ్యేనూ క్రమశిక్షణతో ఉండే వారు ఇతరులకు సహాయ పడుతూ సమాజనవ నిర్మాణానికి నాంది రేఖలయ్యేరూ పంచిన తరిగేది డబ్బు పంచిన పెరిగేది విద్య! స్వీయ క్రమశిక్షణ తోనే మంచికి మార్గం చెడుకు స్వస్తి.. మంచిని చూసి మారెరు మానవులు.. స్వీయ క్రమశిక్షణ తో నలుగురిలో ఖ్యాతిని పొందెరు సుమా!

15

         నోముల సంజీవరెడ్డి
        అంశం : స్వీయ క్రమశిక్షణ

ఆలోచనల్లో భాషణంలో కార్యనిర్వహణలో
పద్ధతిగా వ్యవహరించడమే కదా క్రమశిక్షణ
సర్వకాల సర్వావస్థలయందు
ఉచితానుచితాలు తెలుసుకొని
మసలుకోవడమే స్వీయ క్రమశిక్షణ
అందుకే మనిషికి అది నిత్య మార్గదర్శి
ఎందరో మహనీయుల విజయ గాధలకు
క్రమశిక్షణే కదా అనాదిగా పునాది
ఏ జాతి చారిత్రక వికాసానికైనా
క్రమశిక్షణే కదా మనకి కనిపించేది
భూమి పై మనిషి పుట్టినప్పటి నుండి
నేటివరకు సాధించిన అద్భుత ప్రగతికి
స్వీయ క్రమశిక్షణే దండలో దారంగా నిలిచింది
క్రమశిక్షణకు ఉపిరి చక్కటి ప్రణాళిక
సమయపాలన తన ముద్దు బిడ్డ
క్రమశిక్షణతోనే సత్వర ఫలితాల సాధన
లేకుంటే ఘోర పరాజయాల వేదన
మనిషి నిత్యజీవన పథంలో కరదీపిక
అణుక్షణం ప్రేరణగా నిలిచే విజయ గీతిక
అడుగడుగునా గొడుగు లా రక్షణ
సోమరితనాన్ని తరిమికొట్టే ఔషదం
మనిషి జీవితానికి తూరుపు వెలుగు .
16


అడ్డదిడ్డం ఎదిగిన చెట్టుకు
ఆయుష్షు తక్కువే
వంకర తింకర మాటలకు పడక తప్పవు లేవలేని దెబ్బలెన్నో..

వాటికే తప్పలేదు క్రమశిక్షణ
మనిషి మాత్రం ఎలా తప్పించుకోగలడు..?
విశృంఖలత్వo ఎంత ఎత్తు ఎగిసి పడితే
పురోగతి తిరోగతై వెక్కిరించెను మనిషిని

సహజత్వాలను వీడి
స్వేచ్ఛ పేరిట క్రమశిక్షణ హద్దు దాటాడనేమో..
మృత్యువు కరోనా రూపంలో
మనిషి ముంగిలిలో చేరింది
క్రమశిక్షణ లక్ష్మణరేఖ దాటి వచ్చే వారి కోసం
కాచుకు కూర్చుంది కబళించి వేద్దామని..

స్వయం క్రమశిక్షణతో సంప్రదాయాల పరిమళాలు ఆస్వాదిస్తూ బ్రతుకు బ్రతికించు నినాదంతో ఇంట్లోనే ఉంటూ
కరోనాతో యుద్ధం చేద్దాం
విజయ కేతనం ఎగిరిద్దాం

ఉదయశ్రీ ప్రభాకర్

17

పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:: స్వీయ క్రమశిక్షణ
*************************
తూరుపు వేదికపై ఉదయించిన
బాలుడైనా
విధి నిర్వహణలో  సమయ పాలన తప్పని  సూర్యుడు!

కొండా కోనల్లో ప్రభవించిన దేహమైనా
నడిచే దారంతా
హరిత వర్ణాలను బహూకరించకుండా ఉండలేని
నదీమతల్లి అర్పిత హృదయమది!

చూపులకు చిక్కుకున్న చిన్ని పక్షులే
 సుప్రభాత గీతాలను ఆలపించే నియమం తప్పని పక్షిరాజాలవి!

గతి తప్పని ఋతువుల సంచారంలో
చెట్టూ చేమా పాటించే ప్రకృతి నియమాల తోరణం!
ఆహార విహారాలతో ఆనందింప జేసే పశుపక్ష్యాదుల స్వీయ క్రమశిక్షణం!

మనిషి నేర్చుకోవాలనే తపన ఉండాలే కాని
సృష్టిలోని ప్రతిజీవి  బోధనలో అత్యున్నత గురువే!
స్వీయ క్రమశిక్షణ అంతరాత్మ ప్రబోధమే
మనిషిని సంస్కరించే మహా గురువు!

పాటిస్తే ప్రతి విషయంలో విజయం తథ్యం!
మనిషి నుండి మనీషిగా చేయిస్తుంది
జీవన ప్రయాణం!
18

 శ్రీ శ్రీ లక్ష్మీ రాజశేఖరుని
 అంశం: స్వీయ క్రమశిక్షణ

 శీర్షిక: మార్చుకో నిన్ను నీవు

 నాలుగు దిక్కుల్లో
 ఎక్కడుందో ఆ గమ్యం
 చెదరని దృక్కులతో
 సాగకుంటే
 ఫలితం శూన్యం

 నీకు నువ్వు రాసుకున్న
 క్రమశిక్షణ సూత్రం
 చేర్చు నిన్ను
 కోరుకున్న ఆశల క్షేత్రం

 సంకల్పం ఆయుధమై
 సడలని ధ్యేయపు  సాధనకై
 మలచుకో  నిన్ను నీవు
 గెలుచుకో నిన్ను నీవు

 ఒంటరిదైనా
 ఒక్కటే ప్రయాణం
 తప్పుల తడక అవుతావో
 నిప్పుల నడకవుతావో
 తేల్చుకో నీతో  నీవు
 మార్చుకో నిన్ను నీవు
19
శీర్షిక: స్వీయక్రమశిక్షణ

సాధారణంగా స్వీయక్రమశిక్షణ మనిషి ఉన్నతికి తోడ్పడుతుంది...
ఈనాటి పరిస్థితిలో
దేశ ఔన్నత్యానికి తోడ్పడుతుంది...

నేటి స్వీయక్రమశిక్షణ
గొప్ప దేశభక్తికి తార్కాణం...
మన దేశంలో లాక్డౌన్
విజయవంతం కావడానికి
స్వీయక్రమశిక్షణే కారణం...

ఈ కరోనా సీజన్లో
స్వీయక్రమశిక్షణ వల్లే
భారత్ ప్రపంచ దేశాలకు
ఆదర్శమైంది...
20
కవితా శీర్షిక : *స్వీయ క్రమశిక్షణ*

తూరుపుకొండల
వేకువ వేలుపు
సకల చరాచర సృష్టిని
మేల్కొలపడానికి
నెల బాలుడిలా
అరుణారుణ కాంతులతో
భానుని ఉదయం...

సూర్యాస్తమయంతో
తిమిర సమరం చేసి వెన్నెల
వెలుగులు పంచడానికి
చుక్కల గుంపుతో
చంద్రుని గమనం...

ఆరు ఋతువులు
మూడు కాలాలు
భూభ్రమణ, పరిభ్రమణాలు
నిప్పు, నీరు, నింగి,నేల, గాలి
సమస్త ప్రాణి కోటి (మానవుడు తప్ప)
తమ తమ ధర్మాను
క్రమంతోనే నడచుకొంటున్నాయి
ప్రకృతి కనుకూలంగానే ప్రవర్ధమానమవుతున్నాయి...

సమస్త ప్రాణి కోటికి
ప్రకృతే పాఠశాలయని
విజ్ఞాని వివేకవంతుడైన
మానవుడు గ్రహించిన రోజు
*స్వీయ క్రమశిక్షణ*
అను పదానికి
అర్థం పరమార్ధం...

*🌹🌹🌹గుండ్లరాజు🌹🌹🌹*


Comments

  1. స్వీయ క్రమశిక్షణ మంచి టాపిక్.రచనలు చేసిన నా సహ కవిమిత్రులకు అభినందనలు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...