Skip to main content

సత్యాగ్రహం

నిర్వహణ ః వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం ః
శివునూరి లలితా కృష్ణ
అవధాని ః
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం ః
మెరుగు మధు
*****""****************
సత్యాగ్రహం
కవితా గానం జాబితా
1.దేవినేని అరవింద రాయుడు గారు
2.కోరాడ గారు
3.విజయ దుర్గ గారు
4.సంధ్యా శర్మ గారు
5.డా.రామక క్రిష్ణ మూర్తి గారు
6.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
7.దేశపతి మోహన్ గారు
8.అంబటి భాను ప్రకాష్ గారు
9.సాయి కుమార్ గారు
10.మర్రి జయశ్రీ గారు
11.వేంకట కృష్ణ ప్రగడ గారు
12.మహేందర్ జవ్వాజి గారు
13.తులసి వెంకట రమణాచార్యులు గారు"
14.వల్లాల విజయ లక్ష్మి గారు
15.శివునూరి లలితా కృష్ణ గారు
"""""""""""""""""""""""""""
1.
అరవిందరాయుడు దేవినేని
~~~~~~~~~~~~~~~~|సత్యాగ్రహం

కాలం
నాగరికత ను తొడుక్కున్న దగ్గర్నించి
ఎన్నెన్ని యుద్ధాల్లో స్నానమాడలేదీనేల...
ఎన్నెన్ని గాయాల
సలపరాలకు గురికాలేదీ సృష్టికాయం

కానీ
ఒక్కసారి....

అరిషడ్వర్గాలు సోకని మనిషి ...
మనీషి....
మహర్షి...
మహాత్ముడు

మాతృదేశ
విముక్తికోసం

రక్తం రంగులేని
తెల్లటి కపోతంలాంటి
యుద్ధాన్నొకటి స్వప్నించి....
హింసతెలియని
ఆయుధాన్ని రచించిన క్రమం
ఏ స్వాప్నికుని
ఊహకు అందకపోవచ్చు
ఏ దార్శనికుడూ
కలనైనా చూడక పోవచ్చు బహుశా.....

ప్రపంచాన్ని
జయించిన జాతిని
జయించడమంటే
ప్రపంచాన్ని జయించినట్టే కదా...

కోటి వజ్రాయుధాల పెట్టు
శతకోటి అణ్వాయుధాల గుట్టు కదా
సత్యాగ్రహమంటే

ద్వేషాన్ని సహిస్తూ
ద్వేషించే వారిని క్షమిస్తూ..
బాధల్ని ప్రేమించ గలగడం కదా
సత్యాగ్రహాన్ని
ఆవాహనం చేసుకోవడమంటే ...

సమాజం పుట్టలో
తేళ్ళూ జెర్రులూ పాములను భరిస్తూ
సమాధి స్థితిలో ఉంటూ
చైతన్యాన్ని ఉపాసించడం కదా
సత్యాగ్రహాన్ని ప్రత్యక్షం
చేసుకోవడమంటే

అహం నీటికి తడవని
తామరాకు కావడం కదా
సత్యాగ్రహమంటే

తనకూ
ప్రపంచానికి మధ్య
అద్వైతబంధాన్ని
నిర్మించుకోవడం కదా
సత్యాగ్రహమంటే.......
2

అంశం:- సత్యాగ్రహం
కోరాడ నరసింహా రావు
అసత్యం.....అక్రమమార్గంలో...అధర్మం గా చేస్తున్న అన్యా యాలు,అపరిమిత   మైపోయి...జనంఅంటే...
సత్యం చేతులు కట్టు కు కూచోదు...!

తన నిగ్రహాన్ని మరిం తంత్రించుకుంటూ...తనలోనిఆగ్రహాన్నిసన్మార్గ,శాంతి యుత నిరసనలతో
ధర్మ బద్దంగా ప్రద ర్శిస్తుంది  !

ఓ..., గొప్పమహితాత్ముడు
మహాత్మునిగాఅవతరించి...జగద్విదితంగా ఈ సత్యాన్నితను
ఆచరించి చూపి.....
విజయం సాధించి ...
నిరూపించారు...!!

సత్యం ఆగ్రహిస్తే ......
మార నా యు ధాలు ముట్టదు !
అహింసయే తన ఆయుధం...!
సన్మార్గశాంతియుతమే తనమార్గం...!
నిరాహార,మౌన,సహా య నిరాకరణాలే...
తన అస్త్ర,శస్త్రాలు!!

తనకు తెలుసు బల
ప్రయోగంతో...యేనా డూ...శాశ్వత విజ యాన్నీ సాధించ లే మని...!

ఈ రోజు వాళ్ళు పది మందయితే  మనం యిరవై మందిమి కా వచ్చు ...,రేపు వాళ్ళు   వందమవుతారు...
మోదుగ పూలలో...
దాశరధి చెప్పినట్ట వుతుంది...!
అలా ఐతే అది నిరం తర రావణ కాష్ఠమే !!

తాత్కాలిక ప్రయోజనాలెప్పుడూ
శాశ్వత పరిష్కారాలు కా నేరవు !
ఉదాత్తమైన ఆశయ సాధనకు ఉత్కృష్ట మార్గం తప్పని సరి !

అందుకే,ఆసత్యాన్ని
దర్శించ బట్టే...,
గాంధీ...ఈ సత్య మ హింసల నే అవలం భించి...సమస్తభూమండల సర్వ సామ్రా జ్యా ధికార దాహంతో
దేశసంపదనంతాకొల్లగొడుతూ...శతాబ్దాలుగా ప్రజలను అష్ట కష్టాల పాలు జెసి ...
శతాబ్దాలుగా వేధిం చినవలస వాదుల పిలకబట్టి ...జాడించి
ఎల్లలు దాటేలా తరి మి కొట్టి ..అవిశ్రాన్త
పోరాట ఫలాలైన
స్వతంత్ర,స్వరాజ్యాలనుమనకందించారు...గాంధీజీ...!
ఓ మహాత్మా....నీకు
జోహార్లు.....!!
******************.........కోరాడ
3
కవితా శీర్షిక : సత్యాగ్రహం
కవితా సంఖ్య: 01
తేదీ: 31/03/20

పీడిత ప్రజల గుండెల్లో
మండే నిరసన
చరచరాసృష్టిలో హితముకాని
అస్పష్టతలో
గంభీరంగా ఒదిగి ఆచరించు
ప్రళాళిక....!!

స్వేచ్చా సూర్యుడిని చూడని
జీవితాలు
సంధ్యలోనే అస్తమిస్తున్న
బతుకులు
వెతలను కనలేక దాస్యశృంఖాలలో
ఇమడలేక
ప్రతి హృదయం మండే అగ్ని కణికలు....!!

ఆశూన్యంలో ఒక్కటై
ఉప్పు సత్యాగ్రహమైనా
తిరుగుబాటైనా,యుద్దమైనా
నెరవక ఉరికే ప్రభంజనాలు....!!

దేశభక్తి వాసనలను నింపుకున్న
పరిపూర్ణ వ్యక్తిత్వాలు
తెలుగు వారికై ఆమరనిరాహర దీక్షలో
అసువులు బాసిన
నేడు అజరామరమే తెలుగు వాకిట....!!

అప్పటి గాంధీ అడుగుజాడలే
నేటికీ ఆదర్శం
స్వేచ్చావాయువులకు ఊపిరి
భారతబిడ్డ గుండెలో దేశభక్తి
తొణికసలాడిన ప్రతిక్షణం
భరతమాత కన్ను ల్లో సంతోష తరగలకు ఆహ్వానం.....!!


                            🌹వినీల🌹;
4
శీర్షిక:మార్గదర్శం
వై.కె.సంధ్యశర్మ
**************

నిశ్శబ్ద దుఃఖంలో
దశాబ్దాల మౌనం కళ్ళు తెరిచింది
మానవ మృగాల తప్పిదం
నిశాచర జీవులకు
ఉపద్రవం ముంచుకొచ్చినా
విష వాయువులు
అల్లకల్లోల అంతరాలను
సృష్టించినా....
మౌనం... గానే జయించమని
మాటకు హద్దు లేయమంది!

కాలం తుఫానులో
సంస్కరణలు
సంస్కార హీనులను చేసినా
అంతరంగం
ఆకుపచ్చటి లోకం కోసం
మౌనం...గానే నిరీక్షించింది!

రెక్కలు విప్పిన ఆశలు
ఖండాంతరాలు దాటినా
వినిపించని వేదనా గీతికలైనా
విశ్వాన్ని నిశ్శబ్దంగానే
మేల్కొలిపింది!

కల్లోలిత కడలి తరంగంలా
ఉప్పెన ముంచుకొ్చ్చినా
మౌనంగానే
ప్రశాంత సంద్రం రేపటి
ఉషోదయాలను
కనువిందు చేసే
మార్గదర్శకాలవుతాయి!

5
అంశం: సత్యాగ్రహం
రచన:డా.రామక కృష్ణమూర్తి


సత్యం కోసం, ధర్మం కోసం
రాజీ లేని పోరాటం
అహింస,శాంతి మార్గాలతో
న్యాయమైన ఉద్యమం
సహాయనిరాకరణ,సహనమనే ఆయుధాలతో
జాతిని ఏకం చేసే కర్మాచరణం
అన్యాయాలపై,అక్రమాలపై
దుర్మార్గాలపై,దౌర్జన్యాలపై
నిరసన వ్రతం,మహాయజ్ఞం
మనస్సులో వెల్లువెత్తిన భావావేశాలకు
నిగ్రహమైన ప్రతిస్పందన
ఓర్పు,నేర్పు,క్రమశిక్షణలతో
కార్యాన్ని నెరవేర్చుకొను విజయమార్గం
విచక్షణ,సంకల్పబలాలతో
సాంఘిక,వైయక్తిక సమస్యలకు
పరిష్కారం
ప్రజలతో,ప్రజలకోసం,ప్రజాసమస్యల
పరిష్కారానికి రాజమార్గం
మానసికధైర్యంతో,సంఘటిత శక్తితో
ప్రభుత్వాల తప్పిదాలను దారికి
తెచ్చే రామబాణం.

6
అంశం ..సత్యాగ్రహం
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి,31-3-20

ఏ ఆయధం లేకుండా సత్యాగ్రహం అనే ఆయుధం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన సత్యాగ్రహి
శాంతి,సహనం,సహాయనిరాకరణ పోరాటానికి ఆయుధాలుగా ఎంచుకున్నాడు
సత్యహరిశ్చంద్ర లోని సత్యాన్ని చిన్నప్పటి నుంచే ఆచరించిన మహానీయుడు
అహింసా పరమోధర్మః పరమావధిగా చేసుకుని
తనకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవరోధాలు ఎన్ని వచ్చినా లక్ష్యం సాధించడమే అతని ద్యేయం నియమం
జాతిని ఏకం చేసి సమైక్య చైతన్యంతో వారిలో దృఢమైన భావాలు అంకురింపచేసి
స్వాతంత్ర్య సాధనలో రక్తం చిందకుండా జాతిని జాగృతిని చేసి
స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్ముడు మహామనిషి
కఠిన మైన నిష్ఠతో నియమాలు పాటించి స్వదేశం లో జరుగుతున్న
అన్యాయాలను తరిమి కొట్టడానికి
ప్రజలను సంఘటితం చేసిన యోధుడు

7
దేశపతి మోహన్ శర్మ టీచర్ మెదక్
శీర్షిక :ధర్మపోరాటం
ఇచ్చిన అంశం :సత్యాగ్రహం
తేదీ :31-3-2020

అది ఒక ధర్మ పోరాటం
అహింసా పరమో ధర్మ అంటూనే
కోపతాపాలకు తావులేని పోరాటం

అది ఒక ఆశయం కోసం పోరాటం
సత్యం కోసం రాజీ లేని ఆరాటం

పీడిత ప్రజల గుండెల్లో
ఎగిసిన విప్లవాగ్ని
మహాత్ముడు కాగడ గా మారి
శాంతియుత బాటలో
స్వేచ్ఛ వెలుగు వైపు నడుపుటకు
అడుగులు వేసిన పోరాటం

అది సహాయ నిరాకరణకు
విదేశీ వస్తు బహిష్కరణ కు
ఊపిరి లూదినజాతి పోరాటం

దేశాన్ని ఏకతాటిపై నడుపుటకు
ఉప్పుతో విదేశీయుల తప్పులు ఎత్తిచూపుటకు
ముప్పును సైతం ఎదుర్కొనుటకు
దండి నుండి దండు గా మారిన పోరాటం

అది భారతదేశ దాస్య శృంఖలాలను
తుం చుటకు సమ్మెట లా
అది ఆంధ్ర రాష్ట్ర సాధనకు
శ్రీరాములు ఎత్తిన బావుటలా
గాంధీజీ అడుగులతో నాంది పలికిన
*సత్యాగ్రహ పోరాటం*

8

*అంబటి భాను ప్రకాశ్.*
జోగులాంబ గద్వాల జిల్లా.
చరవాణి :- 9948948787.
--------------------
(కందాలు)

సహనము చేతనె కార్యము
నిహపరములనిచ్చు ననుచు నిశ్చితముగ నీ !
సహనమె  విశ్వంబు బొగడ
మహనీయుడ వైతి వయ్య మా బాపూజీ!

సత్యము, అహింస, ధర్మము
నిత్యము తానమ్మి నాడు నిశ్చితముననే
సత్యం బాతని వ్రతమే
నిత్యం బాచరణజేసె నియమము తోడన్!

స్వచ్ఛత  జెప్పుచు నిరతము
స్వచ్ఛత తా జేసి జూపె జగమే మెచ్చన్
స్వచ్ఛత , సత్యమ హింసను
స్వచ్ఛముగా నిలిపినాడు జాతికి మేలున్!

నీతిని నమ్మినవాడై
రీతిగ తా నడిపినాడు రేయీపవలున్!
జాతిని యేకము జేసియు
జాతిపితగ వెలసి నేడు సాక్ష్యం బయ్యెన్!

కం.
ఆగ్రహమునువీడి ఘన
నిగ్రహమును దాల్చె గాంధి నిశ్చయముగ తా!
నాగ్రహమును బొందకనె తా
నగ్రజుడైనడిపె జనుల నంతయు తానై!
9.

సూన్యంలో వదిలేసి:
కం.ఒకనాటి కాల మందున
     చకచకమని యడుగులేయు చక్కని గాంధీ
     వికసిత మోమున యెన్నడు
     పకపకమని నవ్వుజూచి ప్రజలే మెచ్చెన్.........
కం.చేతిని కఱ్ఱను బట్టుచు
     వాతలునేబెట్టితెల్ల వారికి నాడే
     జాతికి స్వాతంత్ర్యమ్మును
     నేతలతోకలిసిదెచ్చె నేర్పరితనమున్
కం.పదవులు నాకేలనుచును
     కదిలెనుకద సచ్చరిత్ర ఘనతను జగతిన్
     వదిలెను సర్వసుఖమ్ములు
     నదివలె తాసాగినారు నానందముగన్
గాంధీతో రెండు మాటలు:
కం.భారత దేశము కీర్తిని
      వారధివైనెగురవేసి వాక్పాటవమున్
      హేరామని మమ్మొదలగ
      భారమ్మే మిగిలెమాకు భారత పుత్రా....
కం.నీలోటెప్పుడు తీరునొ
     కాలమ్మను నదియెనీండె కన్నీటి జడిన్
     జాలీదయమరణించగ
     మాలిన్యము బట్టెనుమరి మానితవర్యా.........
కం.నీగాత్ర విప్లవోన్నతి
     యేగాత్రమునందులేదు యీనాటికినీ
     సాగగ దుష్టుల పాలన
     యాగెను మనరైతుగుండె  యాత్మార్పణమై.........
కం.తీయని మాటల తోడుత
     వేయండని మాకువోటు విసెరద సొమ్ముల్
     మూయండిక మీనోళ్ళని
     ఖాయమ్మైనంతపదవి ఖలులే బలికెన్......
కం.రావా మాకొరకైనను
     రావా మాజాతికొరకు రావా గాంధీ
     రావా మళ్ళీ మళ్ళీ
     రావా జగతినవినీతి రధమును గూల్చన్........
రంప.సాయికుమార్,
        శ్రీకాకుళం.
10.
కవితా గానం
మర్రి జయశ్రీ
అంశం.సత్యాగ్రహం

చేతికర్రే వజ్రాయుధంగా
బోసినవ్వే త్రినేత్రంగా
చరఖా యంత్రమే స్వదేశీ సూత్రంగా
మాటే మంత్రంగా
భిన్న మనస్తత్వం గలిగిన భారతీయులను
ఏక తాటిపై నిలిపిన అధినేత
తెల్లజాతి వారి వివక్షతను తరిమికొట్టి
దేశమాత దాస్య కారుచీకట్లను పారదోళ
తూర్పున ఉదయించిన స్వేచ్చా భానుడు
వ్యక్తిగా జన్మించిన మహాశక్తి
నిజాయితీ, నిగ్రహం
శాఖాహారం, స్వీయ క్రమశిక్షణ అలవర్చుకొని
సత్యాగ్రహాన్ని మించిన ఆయుధం సామాన్యుడికి మరొకటి లేదని
సంకల్ప బలంతో
సమరం సాగించిన యోధుడు
అహింసే పరమ ధర్మమని చాటిన మరో బుద్ధుడు
కులమతాలకతీతుడు
స్త్రీ పురుష సమానత్వానికై నిలిచిన సనాతన వాది
తోటి వారిని మాటలతో వేధించడం భావ్యం కాదని
శాంతి పాఠాలు బోధించిన జ్ఞాని
గ్రామస్వరాజ్యమే దేశ సౌభాగ్యమన్న మహాత్ముడు
ప్రజలెన్నుకొన్న అవతారపురుషుడు
పదవులు ఆశించని పుణ్యమూర్తి
హృదయాలను గెలిచిన రారాజు
భారతమ్మ ముద్దు బిడ్డా
బాలందరికి బాపూజీ అయిన
ఓ మహాత్మాగాంధీ!
నీ మార్గం భావితరాలకు ఆదర్శం
యావత్ జగతికి అనుసరణీయం.


10
అంశం.సత్యాగ్రహం
తేది.31.3.2020
మర్రి జయశ్రీ

కోపతాపాలకు తావులేని
నిగ్రహం నిష్టలతో  కూడిన
సత్యాగ్రహమే ఆయుదంగా
సమరం సాగించిన మహర్షి
అహింసే పరమధర్మమనే
హింసతో సాదించేదేది లేదని
నిజం ఎరిగిన అహింసావాది
చేత కర్రబట్టిన సామాన్యుడే కాని
భిన్న మనస్తత్వం గలిగిన భార్తతీయులను
ఏకతాటిపై నిలిపిన నేర్పరి
తెల్లదొరలను తరిమికొట్టి
భారతావనికి
స్వేచ్చా వాయువులనందించిన
మహాపురుషుడు
భారత ప్రజలు ఎన్నుకొన్న అవతార పురుషుడు
తోటి మనిషిని మాటలతో గాయపరచడం భావ్యం కాదని
శాంతి పాఠాలు నేర్పిన జ్ఞాని
ఈ భూమిలో జన్మించిన పుణ్యం
నీతి ధర్మాలను బోధించి
నూలు వడికి
విదేశీ వస్త్రాలు బహిష్కరించి న గాంధీ గారి మార్గం
అందరికీ స్ఫూర్తిదాయకం
యావత్ జగతికి అనుసరణీయం.

11
వేంకట కృష్ణ ప్రగడ
విశాఖపట్నం
31.03.2020
అంశం : సత్యాగ్రహం

శీర్షిక : సత్యం

సత్యం కోసం
సత్య సాధన కోసం
సరాసరి
సవ్యంగా సాగిన
సత్యమైన ఆగ్రహం

ఒక ఉదయం
ఒక్క హృదయం
ఉక్కు హృదయం
ఒప్పును నమ్మి
ఓర్పు కట్టలు తెంచిన
అగ్ని శిఖల ఆగ్రహం

ఎక్కడో
ఆఫ్రికాలో నెట్టేస్తే
ఇక్కడ భరత ఖండంలో
పడ్డ అడుగు
బ్రిటిష్ వారి
గుండెల్లో పిడుగు

గుప్పెడు
ఉప్పుతో సత్యాగ్రహం
అపుడు అది
చప్పుడు చెయ్యని
మహోద్యమం

ఖండాలు చుట్టి
సంద్రాలు దాటి
చీకట్లు తెల్లారి
తెల్లవారిని అర్ధరాత్రి
తరిమిన సత్యాగ్రహం

సత్యాన్ని
వినిపించిన ఆగ్రహం
సత్యాన్ని
గెలిపించిన ఆగ్రహం
సత్యం సత్యం పునః సత్యం
ఆ సత్యాగ్రహం ...

        ...కృష్ణ"  కలం
12
మహేంధర్ జవ్వాజి
అంశం. సత్య గ్రహం
^^^^^^^^^^^^^^^౬౬౬^^^^^^^^౬^^^^&^^
తను నమ్మిన సత్యం అహింస
మార్గమే తతను జాతిపిత గా
నిలిపెను ...

బి)టిష్ వారి ని గడగడ వణికించిన అహింస వాది ఆయన ఓచంపకొడితే మరో చెంప చూపిన మృదుస్వభావి

మోములో చిరునవ్వు, కోపతాపాలకు మరో రూపు మహత్మ...సత్యగ్రహం పేర

సమరం మోగించిన స్వాతంత్ర్య ఉద్యమకారుడు గాందేయ వాద నాయకత్వం ముందు నిలిచిన ముఖ్యుడాయనా

చూపుకే సామాన్య మనిషతడూ విదేశీ వస్త్రబహిష్కరణ స్వదేశీ వస్తు వాడకం అంటూ కర్రను చేబూనిన చైతన్య పరుడాయన

బారతావని మెచ్చిన మోహన్ దాస్ కరీం చంద్ గాంధీ శాంతి స్థాపనకు కృషి వలుడూ

ఈదేశన అవతరించి న
నీతి నియమాలను పాటించు పావనమూర్తీ మన గాంధీ....

13
పేరు :తులసి వెంకట  రమణా చార్యులు.
అంశం: సత్యాగ్రహం.

శీర్షిక: నమ్మకమే పునాది.!
------////-------////-----///
మనిషికి నమ్మకమే పునాది
సంకల్పమే లక్ష్య సాధనకు నాంది
సత్యాన్ని నమ్మి శాంతి తోనే సమస్యకు పరిష్కారం అని నమ్మిన వ్యక్తి గాంధీ..
నల్లజాతి వాడవాని నిందించిన
తెల్ల దొరల సామ్రాజ్య ఆధిపత్య పోరును అంతమొందించుటకు..
గాంధీ ఎంచుకున్న మార్గమే సత్యాగ్రహం...
ఎన్ని విమర్శలు వచ్చిన ఎన్ని వడిదోడుకులు వచ్చిన ...
ఎదురు నిల్చి సత్య వాక్కు తో
పొరుసల్పి ...
సత్యమేవ జయతే అన్న నానుడికి చిహ్నం గాంధీ మార్గమే!
దేశ స్వేచ్ఛ కోసం ...
ఎన్నో మార్గాలకు గాంధీజీ చూపిన  బాటయే శిరోధార్యం గా నిల్చి ...
ఉప్పు సత్యాగ్రహం... ఒక ఉప్పెనగా నిల్చెను...
మరో అడుగు ముందుకేసి గాంధీజీ నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు శాంతి బాటలోనే నడిచి....
విజయ బాహుటా ఎగురవేసిన ఘనత మన దేశాంద్దే .
సంకల్ప దీక్షనే గాంధీ ని మహాత్మా గా మార్చింది
చరిత్ర పుటల్లో నిల్పింది
హితము కోసం కొంచెం ఆగ్రహం తప్పదు...
అదే మన సత్యాగ్రహం విజయ రహస్యం సుమా!!.

13
మర్రి జయశ్రీ
అంశం.సత్యాగ్రహం

చేతికర్రే వజ్రాయుధంగా
బోసినవ్వే త్రినేత్రంగా
చరఖా యంత్రమే స్వదేశీ సూత్రంగా
మాటే మంత్రంగా
భిన్న మనస్తత్వం గలిగిన భారతీయులను
ఏకతాటిపై నిలిపిన అధినేత
తెల్లజాతి వారి వివక్షతను తరిమికొట్టి
దేశ మాత దాస్యశృంఖలాలు తెంచుటకు
తూర్పున ఉదయించిన భానుడు
వ్యక్తిగా జన్మించిన మహాశక్తి
నిజాయితి నిగ్రహం
శాఖాహారం,స్వీయక్రమశిక్షణను అలవర్చుకొని
సత్యాగ్రహాన్ని మించిన నైతిక బలం
సామాన్యుడికి మరొక ఆయుధం లేదని నమ్మి
సమరం సమరం సాగించిన జాతిపిత
అహింసే పరమధర్మమని చాటిన మరో బుద్ధుడు
కులమతాలకతీతుడు
స్త్రీ పురుష సమానత్వానికై నిలిచిన సనాతనవాది
తోటి వారిని మాటలతో వేధించడం భావ్యం కాదని
శాంతి పాఠాలు బోధించిన గొప్ప గురువు
గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యమన్న మహాత్ముడు
భారతమ్మ ముద్దుబిడ్డ
ప్రజలెన్నుకొన్న అవతార పురుషుడు
పదవులు కోరని పుణ్యమూర్తి
హృదయాలను గెలిచిన రారాజు
గాంధీ మహాత్మా!
మీ మార్గం భావితరాలకు ఆదర్శం
యావత్ ప్రపంచానికి అనుసరణీయం.
14
**సత్యాగ్రహం*
‐--------**********------

చేసిన తప్పులు ఒప్పుకుంటూ
క్రమేణా వాటిని తగ్గించుకుంటూ
సత్యంతొ నిత్య ప్రయోగాలు చేస్తూ
అహింసావాదిగా జీవించిన అసాధారణ వ్యక్తిత్వమా!

నీవు మావంటి సాధారణ మనిషివంటే.                   నమ్మేదెలా ఓ మహాత్మా!                  !మానవరూపంలో నడయాడిన.                             మహాఆత్మవు మా జాతిపితా!

అహింసా సత్యాగ్రహాలె నీ ప్రత్యేకతలు
సదాలోచన ఆచరణ నీ ఊతాలు
అబద్దమాడని నిలువెత్తు సత్యరూపమా!
నీ సత్యాగ్రహం ప్రపంచానికి కొత్తమార్గమే

నిజాయితీని తప్పని చిన్నారి మొహన్దాస్!
తల్లికిచ్చిన మాటకై జీవితాంతం         శాఖాహారివైన హరిచంద్రుడా!
భారతావని చీకట్లను తొలిగించిన ఆదిత్త్యుడా!

దక్షిణాఫ్రిలో మొదలైన నీ సత్యాగ్రహపోరాటం
భారతాన శంఖారావమై మ్రోగి
సాధారణపౌరులను అలరించి అసాధారణ అర్జునులను చేసి ఉద్యమాన ఉరికించిoది

చంపారన్ నీలిమందు రైతులకందిన విజయoతొ                               ప్రారంభమైన నీ సత్యాగ్రహపాత్ర
స్వతంత్రసమరంలో ఎదురులేని జైత్రయాత్ర
నీ వెంటనె నడిచింది మన జాతి అంతా

సహాయనిరాకరణ ఉద్యమాన నీ పిలుపు                       జాతికంతటికి కొత్త మేలుకొలుపు
ఉప్పుసత్యాగ్రహంను నిప్పులా రగిలించిన పోరాటసూరీడా!
దేశాన్ని దండులా నడిపిoచిన శాసనోల్లంఘన వీరుడా!

నీవంటి మహాత్ముడు ఈ భువిపై నడయాడాడు అంటె భవిష్యత్ తరాలు నమ్మవేమొ* అని ఐన్ స్టీన్ అన్నాడoటె...అనడా మరి!
అంత గొప్ప మానవతామూర్తివి!

సత్యాగ్రహం అంటె సత్యం కోసం నిలిచి
ఆగ్రహాన్ని చూపుతూ అనుకున్నది సాధించటమని
క్విట్ ఇండియాఉద్యమాన *సాధించు లేదా మరణిoచు* నినాదాన్ని ఇచ్చి నిరూపించావు

నీ అసమాన ఓరిమిని నీ అపూర్వ పోరాటాన్ని నీ వెనుకనడిచే జనబలాన్ని చూసిన బ్రిటీష్ ప్రధాని తన అసహనాన్ని ప్రదర్శిస్థూ నిన్ను *అర్థనగ్నపకీరని ఎద్దేవా చేసీనా  నీ జవాబు..బోసినవ్వె

అంటరానివారిని హరిజనులుగా గుర్తించావు
కుష్టువ్యాధి నిర్మూలనకు కృషి సలిపావు
గ్రామస్వరాజ్యం కోసం సదా తపించావు
అధికారదాహాన్ని జయించిన బోసినవ్వుల తాతా!

అన్నిఅంశాలలో నీ ముద్రను వేశావు
ముప్పయేళ్ళు నీ యుగంగా గడిచిన చరితను   
మాకు ఇచ్చిన ప్రపంచ మార్గదర్శక నేతా!
నీకు సాటి నీవే *సత్యాగ్రహప్రదాత!

:వల్లాల విజయలక్ష్మి,,ఆలేరు

15
అంశం :సత్యాగ్రహం

*అహింసా పరమో ధర్మ :*
 *అన్న*బుద్ధుని బోధలను*.....
 అంతస్సూత్రంగా దాచుకున్న....... ధర్మపోరాటపు అస్త్రం

మాటే మంత్రంగా
శాంతి తంత్రంగా
సత్యం కోసం జరిపే
 సంగ్రామంలో నిత్యమై నిలిచినపాశుపతాస్రం

ఏళ్ళుగా పాదుకున్న పరాయి దురహంకారపాలనను వేళ్ళతో సహా  పెకిలించినఅస్త్రం

లక్షలాది బానిస బ్రతుకులవిమోచనమే
లక్ష్యమై......
స్వేచ్చాగీతికల
 విజయబావుటాను ఎగురవేయడానికి ఆధారమైన అస్త్రం

 గమ్యం చేరుకోవడానికి
గమనంలో సంయమనం
అలవరచుకొమ్మన్న
సమున్నతాస్త్రం

సమరం ఏదైనా
శత్రువును పరిమార్చడం  కాదని 
పరివర్తనే  పరమావధి గా కలిగిన  విజయరహస్యం
 *అజరామరాస్త్రం*
*సత్యాగ్రహం*

******** *పార్నంది  లలితాకృష్ణ*

Comments

Post a Comment

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...