Skip to main content

పద్యానువాదము (1to20)

సమూహ నిర్వహణః
వీరా గుడిపల్లి ః
The mathematics teacher and poet
సమన్వయం ః
శివునూరి లలితా కృష్ణ
అవధానిః
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం ః
మెరుగు మధు
********************
✳✳✳✳✳✳✳

*అవధాని గారు*
*శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు* *గారు* రోజూ...
*ఒకరి వచనకవితకు* పద్యానువాదం తో స్పందించడం
 నిజంగా..........
కవితాగానంసమూహంలోని   సభ్యులందరికి
 ఒక వరం.
తమ కవితకు ఎప్పుడెప్పుడా అనీ ఎదురు చూసేలా....
*అవధానసరస్వతి ఆశీస్సులు పద్యాక్షితలుగా  అందుకోవాలనే*  *ఉత్సుకతను రేకెత్తిస్తుంది*
*అందరిలో....*

తమ అమూల్య సమయాన్ని సమూహం కోసం వెచ్చిస్తున్న.......
*అవధాని గారికి*
*కవితాగానం సమూహపక్షాన*  హృదయపూర్వక కృతజ్ఞతలతో.......

 ఇప్పటివరకూ..
పద్యానువాదం లభించిన కవిమిత్రుల జాబితా

1.మువ్వప్రసాద్ గారు*
26.03.2020

2.కృష్ణ ప్రగడగారు*
27.03.2020

3..సాసుబిల్లి తిరుమల* *తిరుపతి రావు గారు*
28.03.2020

4.విజయదుర్గ గారు*
29.03.2020

5.డాక్టర్. రామకకృష్ణమూర్తి గారు*
30.03.2020

6.వీరా గుడిపల్లి గారు*
31.03.2020

7.గంజాం భ్రమరాంబగారు*
31.03.2020

8.గుండ్ల రాజు గారు*
01.04.2020

*9.డాక్టర్ పోరెడ్డి* *రంగయ్య గారు*
02.04.2020

*10.దేశపతి మోహన్ శర్మగారు*
03.04.2020

*11.అంబటి భానుప్రకాష్ గారు*
04.04.2020

*12.పార్నంది లలితాకృష్ణగారు*
05.04.2020

*13. ఛత్రపతి గారు*
06.04.2020

*14.*అయితఅనిత గారు*
07.04.2020

*15.తులసి వెంకటరమణాచార్యులు గారు*
08.04.2020

*16.ఉప్పలపద్మ గారు*
09.04.2020


*17.గుమ్మన్నగారిబాలసరస్వతి గారు*
10.04.2020

*18..కొలచన విజయభారతి గారు*
11.04.2020

*19.రమాదేవికులకర్ణి గారు*
12.04.2020

20.యేరువ ఇందిరా రెడ్డి గారు
13.04.2020
✳✳✳✳✳✳
1.

26.03.2020

*మువ్వ ప్రసాద్ గారి కవిత*

కరోనచేసే కరాళ నృత్యం కళ్ల ఎదుటే కనిపిసిస్తుంటే!

ప్రజలందరికి ప్రబలకుండా పాలకులేమో లాక్ డౌన్ తో లంఘిస్తుంటే !

సమన్వయముతొ సహకరిస్తూ సామాజిక దూరము పాటించండి .

కాదనినువ్వు కవ్విస్తే పోయేది నీ వొక్కడివికాదు!

 లక్షణంగాఉండాల్సిన లక్షలమంది !

ఇంటిపట్టున ఇల్లాలితో ఉంటూ పిల్లలకు ప్రేమను పంచె అద్భుతమైన అవకాశం ఇది .

వృత్తి పనిలొ విసుగుచెందిన నీకు

 ప్రవృతి పనులు ప్రదరిశించుటకు కాలం నీకు కల్పించిన సదావకాశము .

ప్రకృతితో పరాచికాలాడి జీవ సమతుల్యము ను దెబ్బతీస్తే!

 ప్రకృతే తనకు తానుగా ఏర్పరిచిన జీవసమతుల్య జీవన నాదము .

పర్యావణ కాలుష్యములేదు జీవరాసుల యధేచ్చా చలనము .

వైరస్ లిచ్చే వారినింగ్ కు    శుచి శుభ్రతులను పాటిస్తూ   

సామజిక దూరం తో
 సైలెంట్ అయ్యెను సమాజము మొత్తము .


✳✳✳✳✳✳

*అవధానిగారు  శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*

పంచచామరము

కరోన తాకరాళనృత్య గామియౌచునుండగా
పరాకు లేక లాకుడౌను పాలకుల్ విధించగా
మరేమియెంచకుండగా సమన్వయాన నోనరా
వరంబుగాను దూరముండి భార్యపిల్లజెల్లతో
తిరంబునిల్లుచేయి పుణ్యతీర్థమౌచు మించగా
పరాత్పరుండవీవు గాక భార్య ఆదిశక్తిగా
నిరంతరంబు చెంతనుండి నీవునీదువంతుగా
విరాలితో సహాయమింక వేగచేయి రాష్ట్రమే
కరోనతోడచేయు యుద్దకాండమందు కాండమై
వరించు నిష్టతోధరించుభాగ్యరాష్ట సంపదన్

మరిద్ది రాసుఖాలకౌచు మానవుండు సృష్టిలో
అరే సమస్తవృక్షజంతులన్ని నాశమింక చే
యరా సహించి ఇంచి యెంచె నౌరనీదు తిక్క మా
న్పరా ఇలాంటి వైరసుల్ సవాలు నీకుచేయగా
ఒరేయి త్రోసె ఇట్లునీవు ఉన్నమారకున్నచో
విరించిసృష్టి యందునీవు వేగలుప్తమౌదువో
సరేసరే ఒరేఒరే విచారమింకమాని సృ
ష్టిరక్షచేయ పూను నీకుసృష్టిమాతయౌ
ధరాస్థలంబు నోనరుండ ధర్మపూర్ణ జేయుమా

2
27.03.2020

*కృష్ణ ప్రగడగారి కవిత*

నేను రాసేవి అక్షరాలు
అ అక్షరాలు అక్షర సత్యాలు
అక్షరం అక్షరం అల్లుకొని
అక్షరాలు పదాలౌతాయి
పదాలు వాక్యాలౌతాయి

చదివిన ఆ వాక్యంలో
నీ రూపం ఉంటే
నువ్వే చెప్పు నాదెందుకు తప్పు ... ?
సత్యం చెప్పినందుకు సంతోషించు
సత్యం ఒప్పుకొని సత్యాన్ని విశ్వసించు

సత్యంతో పోరాడితే నీకే నష్టం
నేను సత్యం
సత్యం నిప్పు
తప్పు ఒప్పుకొంటే
తాను తప్పుకొంటుంది
గొప్పనుకొని తాకేవా
నిను తగలబెడుతుంది ...

❇❇❇❇❇❇

 *అవధాని గారు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*

అక్షరమక్షరమల్లుచు
నక్షయపదములునగుచును నాపై వాక్యా
లీక్షితి నక్షరసత్యాల్
వీక్షింపగ నేను వ్రాయ విరివిగనగుగా

ఏపుగ నట్టివాక్యములనేను రచించగ నందులోన నీ
రూపమదున్న తప్పదియ రూఢిగ నాదొకొ నీవు చెప్పు నే
నాపక చెప్పసత్యమును అందుకు  సంతసమంది మిత్రమా
ఓపుచు సత్యమెప్పుడిక యొప్పు కొనంగను ఒప్పుగాద నీ
వీ పృథివిన్ ధరించవలె ఎప్పటికైనను సత్యహారమున్
పోపొయనంగ సత్యమును పొందక పోరును చేయ బూనుచో
నీపనియౌను నష్టమది నీకగు సత్యము నిప్పులాంటిదౌ
దాపయి తప్పుఒప్పుకొన తప్పక నిన్ను క్షమించు కాల్చకే
ఏపొపొపో యిదేమిటన ఎవ్వడు ఆపిన ఆగకుండగన్
బాపురె కాల్చివేయునది బాగ గ్రహించు చరిత్రనంతటన్
3
29.03.2020
*విజయదుర్గ గారికవిత*
కవితా శీర్షిక: నిఖార్సుగా

మనసు అంతరాళం లో
జరిగే మధనం
కనురెప్ప కే తెలుసు కలవరాన
చెలియకట్టగా నిలిచిన సాక్షి

ఎందుకో అందరు ఒకే ఆలోచనల
విహంగాలే
మార్పులేని ఎండిన బీడులే
ఎద మాగాణి దున్నాలన్న
గొప్ప గ్రంధ సారథులే

దొరికితే గొప్పల భుజాల
మోస్తారు
దొరకకుంటే నిలువునా నేలపడేస్తారు
ఆడడమే చదరంగమై

తప్పు ఎవరిది కాదు
అందరు ఒప్పని లేదు
మసులుకో వనితా నీ బలహీనత
వారి ఆటకు మైదానం
సందివ్వకు పోరాడు నిఖార్సుగా
గెలుపు నీదే

❇❇❇❇❇❇

 *అవధానిగారు  శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*

మనసు లోపల జరిగెడి మధనమంత
తెలియు కనురెప్పలకు గాన కలవరమను
చెలియ కట్టగా నిలిచిన సాక్షి యదియె
ఔను నిజమౌను నిజమౌను అరయగాను

కం:
ఒకటే ఆలోచన ప
క్షికులము లెందుకు నరయగ క్షితి తామయిరో
అకటా ఏమని చెప్పను
ఇక మారని యెండబీడు లీవిధి నైనన్

మ:
ఎద మాగాణులదున్న కోరినను కారే గ్రంథపున్ సారథుల్
విదితంబే మరి దొర్కగొప్పలభుజాల్ వేగంబుగా మోయరే
అదనౌచున్ మరి  దొర్కకున్న నిలువమ్మా నేలపైవేయరే
ఇదె కాగన్ చదరంగ మాడుటయెకానీ యెంచ తప్పొప్పులన్

కం:
తప్పది కాదెవ్వరిదిక
ఒప్పని భావించలేమహో యందరినే
ఎప్పుడు నీబలహీనత
ఇప్పృథివిని వారి యాటకేమైదానం

బొప్పగ చేయకుచేయకు
నిప్పయి పోరాటపటిమనే దాల్చంగన్
తప్పక నిఖార్షుగాగెలు
పొప్పై నినుచేరువనిత ఉర్వరయందున్

4
28.03.2020
*సాసుబిల్లి తిరుమల తిరుపతి రావుగారి కవిత*
        *కరోనాతోసమరం*

కరోనా విజృంభిస్తుంది
మానవాళిమనుగడకు సవాల్
విసురుతుంది
ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
ఉసూరుమంటూ తీస్తుంది
ప్రాణాలు నిలబడాలంటే
కరోస్ ఎదురుగా నిలబడి పోరాటం
చేయలేం
యుద్ధం చేయడానికి కంటికి
కనిపించదు
అస్త్రశస్త్రాలు పనిచేయవు
ఉన్నది ఒక్కటే స్వీయనిర్బంధం
అనే అస్త్రంతో గెలవవచ్చు
చేతులను మాత్రం రోజులో వీలైనంత ఎక్కువ సార్లు కడగాలి
పరిశుభ్రత,మనిషి మద్య దూరం
పాటించాలి
స్వీయ నిర్బంధం యుద్దమే మన ప్రాణానికి రక్షణ కవచం
అష్టదిగ్బంధమే మన ఆయుధం
కరోన్ వైరస్ సమూలంగా నాశనం
అవుతుంది
❇❇❇❇❇


*అవధానిగారు  శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*

రోజు రోజుకు రెచ్చిపోయి కరోనయుద్ధము చేయగా
మాజియై నరజీవితాలు ప్రమాదమంద ప్రమోదమే
రోజులేకసవాలుజూపగ లోకమంతయు వణ్కెరా
భ్రాజితంబగునస్త్రశస్త్రము పట్టిచంపగలేమురా
రాజుకోకనె యద్ది బైటకురాక యింటిని యుంటు నీ
రోజునేమగు నంచునెంచగ రోచిరంబుగ దూరమే
మోజుగా దగయుంటు మాస్కుల ముక్కునోరులుమూయుచున్
తేజమందగ పెక్కుమారులు నీవుచేతులు కడ్గురా
పోజు గొట్టకు బైకు మీదను పోదు నంచని తమ్ముడూ

తే.గీ
అష్టదిగ్భంధమే మన ఆయుధమ్ము
స్వీయనిర్బంధ మేయెంత వీరుడైన
గరిమతోపోర రక్షణకవచమగును
ఊపిరుక్కురిబిక్కురి నాపకుండ
చేయునీకరోన మిగుల నోయినీవు
ఆదమరచిన కావున అద్భుతముగ
దానిని జయించపైదెల్పు ధర్మములను
ఆచరించ కరోనతానంతమగును
5
30.03.2020
*డా.రామక కృష్ణమూర్తిగారి కవిత*

శీర్షిక :మాయ

అంతా మాయ,అన్నీ మాయ
నీవు మాయ,నేను మాయ
సృష్టి మాయ,దృష్టి మాయ
కలలు మాయ,కలతలు మాయ
బంధువులు మాయ,బాంధవ్యాలు మాయ
ధనం మాయ,దర్పం మాయ
ఇల్లు మాయ,ఈశ్వరుడి మాయ
బతుకు మాయ,మెతుకు మాయ
ఆదాయం మాయ,వ్యయం మాయ
ఆనందాలు మాయ,విషాదాలు మాయ
జాతకం మాయ,అదృష్టం మాయ
అందం మాయ,బంధం మాయ
సంసారం మాయ,సమ్మోహనం మాయ
చింతలు మాయ,చిద్విలాసం మాయ
ఆలి మాయ,
దుఃఖం మాయ,సుఖం మాయ
వెలుగు మాయ,చీకటి మాయ
స్నేహం మాయ,ప్రేమ మాయ
ఎడబాటు మాయ,ఎద మాయ
అంతస్తులు మాయ,హోదాలు మాయ
యవ్వనం మాయ,రోగం మాయ
రాజపూజ్యం మాయ,అవమానం మాయ
అహం మాయ,గర్వం మాయ
కీర్తి మాయ,ఆర్తి మాయ
ప్రకృతి మాయ,ఆకృతి మాయ
సంతానం మాయ,సంపాదన మాయ
శరీరం మాయ,ప్రాణం మాయ
శబ్దం మాయ,వాగ్దానం మాయ
వాదన మాయ,వేదన మాయ
సర్వం మాయ,సకలం మాయ
అంతా మాయ,అన్నీ మాయ
మాయామోహం వదలరా మానవుడా!
దైవంపై చిత్తం నిలపరా ఓ మానవుడా!

❇❇❇❇❇❇

*అవధానిగారు  శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*

 మ.కో..

నీవు నేను సమస్తసృష్టి ననేక దుఃఖములున్ సుఖాల్
శ్రీవిశిష్ట సుబంధబంధులు చెప్పగాకలలున్ ధనం
బీ విలోలపు దర్పమిల్లులు నింతి బ్రత్కులు మెత్కులున్
నీవి రాబడులున్ వ్యయంబులు నేర జాతక గీతకాల్
చేవయై మను కాపురంబులు స్త్రి పురూషుల మోహముల్
భావముల్ పరిభావముల్ కలవారు లేరను భావముల్
కోవెలల్ వెలుగుల్ తమస్సులు లోక ద్రవ్య దరిద్రముల్
పోవయా ఎడబాటు ప్రేమ యమోఘమై చను స్నేహముల్
భా విలాసము రాజపూజ్యము రాజ కీర్తియు కానిదిన్
నీవిశిస్ట సుదేహశబ్దము నీకు స్వస్థత నామయం
బే వసించుట కీర్తి యార్తి గ్రహింపపూజ పురస్కృతుల్
నీవినావని అవ్వి యివ్వని నేరలేముర మానవా
ఆవిరై చను చీల్చుచుండగ అంత మాయయె మాయయే
యీవిధమ్మగు మాయదాటగ కృష్ణునీశు పరాత్పరున్
భావనంబును చేయరా భవవార్ది పొందుగ దాటరా
6
*వీరా గుడిపల్లి గారి కవిత*
31.03.2020
*శీర్షిక :ఏమని చెప్పేది?????*

*రేయన్నది లేకపోతే*
*ఎపుడో పోయేవాన్ని*
విశ్రాంతి
విశ్లేషణ
ప్రణాళిక
అన్నీ అప్పుడే
ఎంతటి పనైనా
చేయగలననే ధైర్యం లభించేదపుడే
*అభిమన్యుడు ఆవహించి*
*ఆ కాసేపు ఉపశమనం కలిగిస్తుంటాడు*
పద్మవ్యూహాలను ఛేదించే
ప్రణాళికలు ప్రాణం పోసుకునేదపుడే
రోజంతా ఎలా గడిచిందో సమీక్షించుకునే దపుడే
*రేయన్నది*
*నాకెప్పుడూ స్వయం శిక్షణా శిబిరం*
రేపటి కోసం నన్ను నేను తీర్చిదిద్దుకునే అవకాశం
రేయన్నది
లేకపోతే నేనన్నమాటే లేదు
*నీ గురించి ఆలోచించే క్షణాలవే*
నా గురించి మననం చేసుకునేదీ అప్పుడే

*ఏమని చెప్పేది????*
*రేయన్నది లేకపోతే నేనేమై పోయేవాడినో*
....... *వీరా గుడిపల్లి*

❇❇❇❇❇

*అవధానిగారు  శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*

రేయే లేకను పోయె వానినెపుడో; శ్రీలొల్కగా వ్యూహముల్
వేయుల్ పన్నగనప్పుడింక నివిగో విశ్రాంతి విశ్లేషణాలో
హోయారేయినె ధైర్యమెట్టిపని నేనోచేయ సంకల్పమౌ
నాయందా అభిమన్యుడావహముచే నా పాత్రమౌ కాలమై
హాయిన్ గూర్చగజల్లుగా నుపశమంబౌ వీరగంధంబు ఏ
మాయాశ్చర్య ప్రణాళికల్ పొడము పద్మవ్యూహముల్ ఛేదమై
రోయన్ లెస్స సమీక్షలన్ సలుపగా రోజంతనేరీతిగా
చేయంగల్గతినంచు శిక్షణనిడన్ శ్రేష్ఠంబుగా రేపటిన్
శ్రీ యానందముగాను దిద్దికొనగా నీగూర్చి నాగూర్చియున్
నే యోచించగ మించగా జగతిలో నిక్కంబు నేస్తంబుగాన్
రేయే యౌనదిలేకయున్న ధరలో నేనేమియౌదోగదా
7.

31.04.2020
*గంజాం భ్రమరాంబగారి కవిత*

*ఆ చేతులకు వందనం*
-------------------------------
ఆ చేతులు
నన్ను నవ్వించడానికి
చక్కలిగింతలు పెట్టాయి.
నేను కార్చిన కన్నిటికి
దోసిళ్లు  పట్టాయి

నా విజయాల వెనకాల
వెన్ను తట్టి నిలిచాయి
నా అపజయాల వేళల్లో
భుజం పట్టి నిలిపాయి

దుర్మార్గపు బాటవైపు
గోడలా నిలిచాయి
సన్మార్గపు దారులను
వారధి లా కలిపాయి

ముళ్ళ బాధ తామెరిగి
పువ్వులనే పరిచాయి
చేదునంతా స్వీకరించి
తీపి రుచే చూపాయి

నా గెలుపు తోటి చప్పట్లుగా
నా విజయ సంకేతాలు గా
మౌనంగా  మిగిలాయి
 నా జ్ఞాపకాలనే తడిమాయి
శిలలాంటి మనసును
శిల్పం గా మార్చాయి
జ్ఞాన జోతి ఆరకుండా
గుప్పెటగా మారాయి

ఆ చేతులు
నా హితులవి
సన్నిహితులవి
నా మది మందిరపు స్నేహితులవి.

✳✳✳✳✳

*అవధాని గారు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*

చక్కిలిగింతలుపెట్టెను
చక్కగనవ్వించ; దుఁఖసాగరమందున్
పొక్కుచు కన్నీల్లనకట
వెక్కసమున నేనుగార్చ వేగముతోడన్

ఆదుకొనగ దోసిళ్లను
మోదంబున చేతులవియె పొలుపుగపట్టెన్
నాదగు విజయంబువెనుక
కాదనకను వెన్నుతట్టి కరముగనిలిచెన్

నాయపజయమగు వేళల
పాయక నాభుజముపట్టి పడకను మనిచెన్
ఏపగు గోడగనిలిచెన్
పాపపు దుర్మార్గమయిన బాటతొలగగా

వారధులయికలిపెనుగద
భూరిగ సన్మార్గమగుచు పొలిచెడు దారిన్
నేరుచు ముళ్లది బాధను
స్ఫారితముగ పూలదారి పరచెన్ ప్రీతిన్

చేదును తామే గైకొని
కాదనకను తీపిరుచిని కడుకడు చూపెన్
నాదౌ గెలుపుకు చప్ప
ట్లై దాపైవిజయమునకు అవి చిహ్నములై

మానక దగ మిగిలినవిక
కానగ నాజ్ఞాపకాల కవి తడి యగుచున్
ఈనా శిల లాంటి మనసు
మానిత శిల్పంబుగాను మార్చెను ఘనతన్

జ్ఞానపు జ్యోతులనార్పని
వైనవి యగు గుప్పెటలుగ అవి మారెనుగా
ఆనా చేతులు హితులవి
కానగ సన్నిహితులునయి కన్పించింకన్

నామదిమందిరమందున
వైనపు స్నేహితులగుచును వర్దిలునెపుడున్
వీణాపాణిని కృపతో
నేనీరీతిగ వచించి నెగడుచునుందున్
8
01.04.2020
*గుండ్లరాజు గారి కవిత*
శీర్షిక : *కవిత*

పండితుల నోళ్ళన్ని పండేట్లుగా
పామరుల హృదయాలు పొంగేట్లుగా
దేశభక్తి ఎదలో రగిలేట్లుగా
దైవభక్తిలో ప్రజలు మునిగేట్లుగా
మట్టిలో మణులను ఏరేట్లుగా
సంద్రాన ముత్యాలు చూసేట్లుగా
ప్రభుత పాలనకుపకరించేట్లుగా
ప్రజల గుండె తలుపు తెరిచేట్లుగా
మహోదయంబుదయించేట్లుగా
మదిలోని గాధలను తవ్వేట్లుగా
ఎదలోని బాధలను తరిమేట్లుగా
భేద భావనలన్ని తొలగేట్లుగా
నవలోకముకు దారి చూపేట్లుగా
నవ్య కవితలు వ్రాసి నడిపించులోకమును
నవకవిత నవయువత కావాలి కావాలి
నవయువత నవకవిత రాయాలి రాయాలి...

❇❇❇❇❇


*అవధానిగారు  శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*

పండితుల నోళ్లవి పండగా నిండుగా
పామర హృదయాలు బాగపొంగ
దేశభక్తి యెదలో తీవ్రమై రగులగా
దైవభక్తిఁబ్రజలు దగమునుగగ
మట్టిలో మణులజేపట్టి ఏరుకొనగ
సంద్రానముత్యాలు సరిగఁజూడ
ప్రభుతపాలించగా ప్రజల గుండెతలుపు
తెరచి మహోదయంబరవిరియగ

తే.గీ:మదిని గల గాథలను త్రవ్వి ఎదను పదను

గలుగు బాధలను తరిమి తొలగ త్వరగ
భేద భావాలు నవలోక వీధిలోకి
దారి చూపి నవ్యకవితలారయగను
వ్రాసి నడిపించులోకంబు వాసి గాను
ఇపుడు కావాలి కావాలి ఈజగతికి
నవకవిత నవయువత యనారతముగ

✳✳✳✳✳✳
9
02.04.2020
*డాక్టర్ పోరెడ్డి రంగయ్యగారి కవిత*

*అంతరం*

అడుగులు అవే,
తరచి చూస్తే
ఎప్పుడూ కొత్తే.
నిత్య చైతన్యం
వాటి అంతస్సూత్రం.

బుర్ర బద్దలు
కొట్టుకుంటే వస్తాయా
ఆలోచనలు.
చెలిమె ఉబికి వస్తేనే కదా!
పుడమి మనసు
హరితాక్షర మయ్యేది.

రాయి విసరడమూ
ఓ కళే.
గుట్టకు విసిరి చూడు
ముక్కలు ముక్కలు.
అదే చెట్టు కొమ్మకు గురిపెట్టు
ఫలమై చేతికందు.

అక్షరం అంతే
పలక మీద దిద్దితే
రాత కుదరొచ్చు.
రక్తంలో కలుపుకో
చరిత్ర తిరగ రాయొచ్చు.

❇❇❇❇❇❇

*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*

అడుగులు నుడుగగ నవియె తరచిచూడ
క్రొత్తయై యెప్పుడు కొమరుమిగులు
నిత్యచైతన్యమే నెగడు అంతస్సూత్ర
మౌచుండు నౌచుండు నరయగాను
స్ఫూర్తితో యోచనల్ బుర్ర బ్రద్దలు కొట్టు
కుంటె వచ్చున చెల్మె ఉబక కుండ
అవని మనసుహరితాక్షారమైచన
గల్గున యోచించగాను నిజము

గీ: రాయి విసురుట కళ గీటురాయి గాదె
గుట్టకుమరియు ఒకచెట్టు కొమ్మకిమ్ము
విసర ముక్కలుముక్కలై వేగఫలము
నైక్రమంబుగ పరిణామమౌనుగాదె

అక్షరమ్మది యంతియే అదియె పలక
మీద దిద్ద వ్రాతకుదిరి మోదమిడును
రక్తమున నీవు కలిపిన రమ్యమైన
చరిత తిరుగ వ్రాయగవచ్చు జగతియందు

10
03.04.2020
*దేశపతి మోహన్ శర్మగారి*
*నానోలు*

1. *ప్రేమ*
    *వరం*
    *పెళ్లి*
    *యోగం*

2. *గతం*
    *జ్ఞాపకం*
    *భవిష్యత్తు*
    *నమ్మకం*

3. *సుఖం*
    *స్వర్గం*
    *దుఃఖం*
    *నరకం*

4. *నవ్వు*
    *ఆరోగ్యం*
    *ఏడుపు*
    *అనారోగ్యం*

5. *సలహా*
    *అనుసరణీయం*
    *సహాయం*
    *అభినందనీయం*

6. *అజ్ఞానం*
    *చీకటి*
    *విజ్ఞానం*
    *వెలుగు*

7. *విమర్శ*
    *దిద్దుబాటు*
    *విరోధం*
    *సిగ్గుచేటు*

8.  *స్నేహముంటే*..
     *ప్రమోదం*
     *ద్వేషముంటే*..
     *ప్రమాదం*

9. *అభిమానమే*
     *అదృష్టం*
     *అవమానమే*
     *దురదృష్టం*

10. *ఆత్మీయతే*..
      *అమృతం*
      *అసూయే*
      *విషం*

❇❇❇❇❇

*అవధాని శ్రీ ఐతగోనివెంకటేశ్వర్లు  గారిఅనువాదం*


 ప్రేమ వరమగు యోగంబు పెళ్లియగును
గతము వర్తమానంబున జ్ఞాపకమగు
నమ్మకము భవిష్యత్తు లోకమ్మునందు

సుఖము స్వర్గంబు నరకంబు చూడచూడ
దుఃఖమది యగు నరులిది తుష్టిగొనగ
నవ్వు ఆరోగ్యభాగ్యంబు నరులకిచ్చు
ఏడుపది అనారోగ్యము వేడుకనిడు

అనుసరించదగు సలహా అనవరతము
ఓయి సాయము అభినందనీయమగును
చీకటజ్ఞానమగు వెల్గు శ్రీలుగల్గు
చుండు విజ్ఞానమది యగుచుండు నిండు
దిద్దుబాటు విమర్శ నీ వద్దదనుచు
సిగ్గుచేటు విరోధంబు చేయ దాని
స్నేహమనగ ప్రమోదంబు నిఖిలజగతి
ద్వేషమద్ది ప్రమాదమున్ వేగనెట్టు

సరగ అభిమానమది యదృష్టంబు కాని
చదయు అవమానము దురదృష్టంబు బడయ

అమృతమాత్మీయత యగు తత్సమములేదు
విషమన అసూయ విషమమౌ విషయమద్ది

✳✳✳✳✳✳
11
04.2020
 *అంబటి భాను ప్రకాష్ గారి కవిత*

కలియుగం
కాదిది కరోనా కాలం
క్షణమొక దినమై
దినదిన గండమై  యుగమై
ఇంట నుండక,బయటికెళ్ళక,
ఏకాంతంలోఎంతకాలమని,
వింతకాలమిల  సాగదేమని
ఒంటరితనాన్ని భరించలేక
తుంటరినై బయటకు రాలేక
బాధగా వున్నా
భయంతో అడుగు ముందుకు
రాక,
ఇలలో కలలో
ఇల్లే స్వర్గసీమని,
వింటూ, వినిపిస్తూ
నాకై
నేను సమాధానం చెప్పుకుంటూ
ఇంట్లో ఒంటిగ బంధీయై
బ్రతుకు సాగదీస్తున్న
కనికరం మామీదెందుకు
ఓ కరోనా
కానరాని లోకాలకు వెళ్లిపో
వీడిపో,
తిరిగి రాకుండా సాగిపో.

❇❇❇❇❇

*అవధాని గారు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*

ద్విపద

1)కలియుగమాయిది కాదుకరోన
చెలరేగు  కాలమై శిథిలంబె యగును

2)క్షణమొకయుగమయి గడియకు గడియ
దినదినగండమై దిగులెంతొ గలిగె
3)ఇంటనుండగలేక ఇకబైటికేగ
నంటకరోనది అంటునన్ భయము
4) ఏకాంతముగనుండ నెంతకాలంబు
వీక సమీపింపె వింతకాలంబు

5)ఒంటరితన భారమో మోయలేక
తుంటరై బైటకు తుష్టి రాలేక
6)బాధగా యున్నను  భయముతో నడుగు
వేధనన్ ముందుకు వేయంగలేక
7)ఇలలోన కలలోన ఇల్లు స్వర్గంబు
తలపోసి వినిపించి తనరుచునుంటి
8)నాకై జవాబిట్లునాలోన చెపుతు
ప్రాకటంబుగనింట బంధియై యుండి
9)బ్రతుకు బండి కరోన లాగంగనుండ
మతిమతిన్ సతమతమయ్యయ్యొ నీవె
10)చేయంగ న్యాయమా శీఘ్రమ్మె  వీడి
ఓయమ్మ లోకాల వ్యోమమ్ము దాటు
11)కానరాని జగతికైవేగ వెడలు
మానవ లోకంబు మరలిరాకుండ

✳✳✳✳✳✳
12
05.04.2020
*పార్నంది లలితాకృష్ణ గారి కవిత*

*శీర్షిక :.వెన్నెల శిల్పం*

జీవనసాగరంలో
ఆనందాలనావలా....
మధుర స్మృతుల మంజూషలా...
కారు చీకట్లుకమ్ముకున్న వినీలాకాశంలో నిండు చందమామలా...
నిరాశల నిశీథిలో
 నిండుకున్న గుండె ధైర్యంలా...

కోరికలకలలను సాకార మొందించి...
సాంత్వననందించే కల్పతరువులా.....

మంద్రoగామనస్సు
తీరాన్ని  తాకే సంద్రపు కెరటంలా.....
నిదురిస్తున్న  మబ్బుల్ని
మేల్కొలిపేమెరుపు తీగలా....
 వర్షపు చినుకులను కురిపించేపవనపుస్పర్శలా...
అమాయకపుటంతరంగం లో అజ్ఞాతశక్తి లా... అవ్యక్తసాక్షిలా....

నన్నావరించిన అక్షరాలు
ఆవహించిన కవనసమీరం
గుండె గుహల్లో వెన్నెల శిల్పoలా.....

❇❇❇❇❇❇

*అవధాని గారు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*

సీ:
జీవన సాగరంబానందనావలా
మంజూష స్మృతులింక మధురమనగ
కారుచీకట్టులు క్రమ్ము వినీలంపు
టాకాశ పూర్ణ చంద్రాకృతముగ
నిండు నిరాశల నెఱినిశీథమ్మున
గుండె ధైర్యమ్మెంతొ నిండినట్లు
కోరికల కలలు భూరి సాకారము
నందించి స్వాంతననందజేయు
కల్పతరువు లాగ కనగ మందమనసు
కడలితీరము తాకగలుగు అలగ

గీ:
లీల నిదురించు మబ్బులన్ మేలు కొలుపు
మెఱపు తీగలా వర్షంబుమించి కురియ
సలుపు చల్లని పవనంబు స్పర్శలాగ
లలి నమాయకమ్మగునంతరంగమందు

నెగడు అజ్ఞాతశక్తిలా నిండుకున్న
యట్టి యవ్యక్తసాక్షిలా ఆవరించు
అక్షరాలావహించెడిదైన కవన
ఘనసమీరము గుండె గుహను వసించి
వెన్నెల విరియు శిల్పసంవృద్ధిలాగ

✳✳✳✳✳✳
13
06.04.2020
*ఛత్రపతి గారి కవిత*
*బడే...సమాజ దిక్సూచి*

 *బడి*
ఊరి పలుకు' *బడి* '
తడ *'బడే* '  అడుగుల్ని
నిల' *బడే* 'లా
శిక్షణ తో వెంట *'బడి* '
సమస్యలతో 'కల *బడి*
అన్యాయాలపై 'ఎగ' *బడి* '
విజయాలతో వికసింప' *బడే* 'లా
పట్టుదలే పెట్టు' *బడి* 'గా
జ్ఞాన సముపార్జనే రా' *బడి* 'గా
విజ్ఞానాన్వేషణలో పోటీ' *బడే'* లా
నవ సమాజ నిర్మాణానికి పాటు' *బడే'* లా
అసాంఘిక శక్తులపై తిరగ ' *బడే* 'లా
చదువు నేర్పే మన *'బడి* ' తరగతి
ప్రపంచాన్ని ఏలు ' *బడే'* లా
నలుదిక్కులు కీర్తింప ' *బడే'* లా
నూతనోత్సాహంతో సాగు *'బడి* 'కి  సలాం
✳✳✳✳
***********************
*అవధాని గారు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి  పద్యానువాదం*
*************************


బడియె  యూరి పలుకుబడి తడబడు అడు
గుల నిలబడగ శిక్షణనలను నిడుచు
వెంటబడి సమస్యలతోడ వేగముగను
కలబడుచును  అన్యాయము కనిన చనక
ఎగబడి విజయంబులు వికసింపబడగ
పట్టుదలపెట్టుబడి గాగ పక్వమైన
జ్ఞాన సముపార్జ నను తాను మానితముగ
రాబడిగను జ్ఞానాన్వేషణబడయంగ
నవసమాజ నిర్మాణమునకు ముదముగ
పాటుబడుచు అసాంఘిక భవ్యహీన
శక్తులపయి తిరుగబడ చదువునేర్పు
మనబడి తరగతి ప్రపంచ మంత ఏల
బడెడిలాగ నూతనమయి పరగవెలుగు
సాగుబడికి నిన్ నడిపించు సక్రమముగ


15
08.04.2020
*తులసి వెంకటరమణాచార్యులు గారి కవిత*
శీర్షిక..:
మధురరసగుళిక  ...మామిడి ఫలం

మధుర ఫలమా నీరసం ఎంత తీపి
అందరిని గుటకలు వేయిస్తావు ఆపి ఆపి
మండే ఎండలోనూ వలేసి లాగుతావు
ఊరుతున్న లాలాజలంతో నీముందు వాలుతాము..
పండు వెన్నెలను చకోరపక్షి తాగినట్టూ..
ఫలరారాజువైన అందరి చేరువలో ఒదిగిపోయే గుమ్మమావిడివి నీవే..
తీరొక్క పేర్లతో..వేసవి షికారు చేస్తూ..
ఊరగాయ గా..మాగాయా గా.ఆవగాయ... నంటూ.. కంచం అంచున నీవే అతిధివి
ఉప్పుకారం తో...వీధి బండిలో..తొతాపురి పలకరింపు...
సైజుల్లో ఫోజు...రుచుల్లో పసందైన విందునిచ్చే..కమ్మదనాన్ని అల్లుకున్న 'బంగిని పల్లి ' నంటూ..
జిహ్వ చాపల్యానికి వన్నె తరగని అమృత ఫలానివి ఓ మధుర రస గుళికవు నీవే..
కమ్మనైన పెరుగు అన్నముకు ఆవగాయ ముక్క కీకెక్కించు ను..
అందరి మదిలో రగడ లేకుండా రంజిల్లే  సోయగం మధుర జ్ఞాపిక మామిడికే సొంతం.

✳✳✳✳

*అవధానిగారు  శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యాను వాదం*


సీ:
మధురపు ఫలమ నీమహనీయ రసమది
ఎంత యెంతటితీపి ఎవరికెరుక
అందరిన్ గుటకలు పొందుగ వేయింతు
మండుటెండలలోన మాటమాట
వలవేసి లాగగ అలనోరు ఊరగ
నీముందు మేమంత నిజము వ్రాలి
పండువెన్నెలలనుపట్టి చకోరమ్ము
త్రాగెడి రీతిగా త్రాగుతాము

ఫలరాజువైనను తలపనందరిచేరు
వలనొదగ గలుగు భవ్యమైన
గుమ్మమామిడివీవె అమ్మ తీరొకపేర
వేసవిని షికార్లు వేగచేదు

తే.గీ
ఊరగాయగ మాగాయ నేరనింక
ఆవగాయగ ననికంచ మంచు నతిథి
వీవె ఉప్పుకారముతోడ వీథి బండి
నింక తొతాపురి పలకరింపు నీవె
సైజులన్ పోజు రుచుల పసందునైన
విందు నిచ్చు కమ్మదనము నందు నల్లు
కున్న బంగిని పల్లి నేనుందుననుచు

జిహ్వ చాపల్యమున వన్నె చెప్పనింత
తరగని యమృత ఫలమువు అరయ మధుర
రసగుళికవు కమ్మనగుచు రాణకెక్కు
పెరుగు అన్నము నావగాయరయ ముక్క
కిక్కునెక్కించి అందరునిక్కగాను
మదిని రగడలేకుండగ  మరులు గొలుపు
సోయగ మధుర జ్ఞాపిక చూడచూడ
మామిడివి నీకె స్వంతమౌ మహిని నిజము

14
07.04.2020
*అయిత అనితగారి కవిత*
శీర్షిక: *ఎద సడి*

గోముగా మా అమ్మ
గుండెకు హత్తుకున్న ప్రేమ!

గోరుముద్దలలో రంగరించి
తినిపించిన తియ్యదనాల చిరునామ!

నాన్న వీపుపై
గుర్రమెక్కి ఆడిన హంగామా!

వెన్నెల్లో విన్న
మధుర కథల నవనీతమా!

బుడి బుడి అడగుల
ముసిముసి నవ్వుల మాటల మాణిక్యమా!

నిన్నెనడు
మరిచానని..?
నా ఎద సడే నీవైతే!
నా తల్లి ఒడే నీవైతే!!

ఓ..మాతృభాష మమకారమా!
నను వీడని నా నేస్తమా!!
✳✳✳✳
*అవధానిగారు  శ్రీ ఐతగోనివెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*


గోముగా మాయమ్ము గుండెలోతులలోన
హత్తుకున్నది ప్రేమ యౌనునిజము
గోరుముద్దలతోడ కూర్మిగా రంగరిం
చియు తినిపించిన శ్రేష్ఠమైన
తియ్యదనాలనే తీయని చిరునామ
నాన్నవీపు పయిన నెన్న గుఱ్ఱ
మాటాడు హంగామ అవునౌను అదియౌను
వెన్నెలలోవిన్న వితత మధుర

తే.గీ కథల నవనీత రుచిమించు కమ్రరుచివి

బుడిబుడి బుడియడుగులతో ముసిముసిముసి
నవ్వు మాటలమాణిక్య నవ్యతయది
అనఘ నిన్నెన్నడు మరచి తనగనేను
నాయెద సడియె నీవైతె నాదుతల్లి
ఒడివి నీవైతె లెస్సగానుర్వియందు
ఆహ మాతృభాష మమకారంబు నీవు
నన్ను వీడని నేస్తమా సన్నుతింతు

16
09.04.2020
*ఉప్పలపద్మ గారి కవిత*
అంశం : గాంధీ మార్గం

 శీర్షిక : *సంస్కరణ సేద్యం*
         ******************

సత్యాగ్రహ బావుటాను చేపట్టి
చంపారన్ రైతుల ఉద్యమానికి
ఊపిరులూదిన ధీరుడు

భారతీయుల హృదిలో
అహింస విత్తనాలు నాటి
ప్రజాబలం ముందు
బ్రిటీషర్ల నియంతృత్వం నిలువదని నిరూపించిన సాహసి

ఒక చెంప కొడితే
మరో చెంప చూపించి
శాంతికి బాటలు వేసిన  బోధిసత్వుడు

సత్యం అహింస శాంతి
ఆయన ఆచరించి చూపిన సన్మార్గాలు
కానీ కాలశకటం వీటిని లాగలేక పోతుంది
అహం గుప్పిట్లో..కాసుల వేటలో..
తలమునకలైన స్వార్థ సమాజం
అవినీతి భేషజాల నడుమ
గాంధీ విధానాలు గగ్గోలు పెడుతూ
మంచి మనసులలో మౌనంగా రోదిస్తున్నాయి
స్వాతంత్ర్యానికి అర్థం మరిచి విలువలకు నీళ్లొదిలి
పబ్బం గడుపుతున్న నేటి సమాజోద్ధరణకు
మళ్ళీ మళ్ళీ గాంధీలు పుడుతూనే ఉండాలి
గాడి తప్పుతున్న వ్యవస్థలో
సంస్కరణ సేద్యం గావించాలి.

*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం* 


    సత్యాగ్రహకేతనమును
నిత్యము చేపట్టి రైతు నేస్తము అగుచున్
ముత్యపు టుద్యమ బీజము
సత్యము గామొలవజేసె చంపారనులో

భారతీయుల హృదులందు బాగ నాటెను తానహింస
భూరి విత్తనముల నవి యపూర్వముగమెలచి పోయి
వీర మహోద్యమ తరులు వేగంబు స్వాతంత్ర్య ఫలము
లారయనిచ్చి బ్రిటీషు లదినిరంకుశపాలనంబు
పారద్రోలెను గాదె ప్రబల వైదగ్ధ్య తేజంబునిచ్చి

సీ:
ఒకచెంపకొట్ట మరొక్కచెంపను చూపి
బోధిసత్వుడునౌచు పూర్ణమైన
శాంతికి బాటలు సత్వరమ్ముగవేసె
సన్మార్గ శాంత్యహింసయును సత్య
మీమీడు జీవితంబామహాత్ముడు తాను
ఆచరించియు జూపె ననవరతము
కాలశకటమిప్డు కాంచి వీటినిలాగ
లేకుండపోతుంది లెస్సగాను
అహము గుప్పిటబడి అరరె కాసులవేట
లోతలమునకలై లోపమైన
స్వార్థసమాజము అవినీతి భేషజా
లనడుమ విడుచుచు కనలజేసె
గాంధి విధానాలు గగ్గోలు పెడుచుండి
మంచి మనసులందు మౌనముగను

తే.గీ
తాము రోధించుచున్నవి తమినిగనుచు
మనుచు స్వాతంత్ర్యమునకర్థ మనగమరచి
విలువలకు నీళ్లు వదలి తాన్ విలసమనుచు
పబ్బము గడుపు నీనాటి వసుధినెల్ల
ఉద్ధరించగ గాంధీలు ఉరుతరముగ
మరల మరల జన్మించి మనుపగాను
గాడి తప్పు వ్యవస్థల గాడిబెట్టి
సంస్కరణసేద్య మూనంగ సాగవలెను
18
11.04.2020
*కొలచన విజయ భారతిగారి కవిత*
శీర్షిక:బాల్య స్మృతులు

రారమ్మని పిలుస్తున్నాయి
కమ్మని నా బాల్య స్మృతులు

గోరుముద్దలు తినిపించే వేళ
తలుపు చాటున నక్కి
అమ్మతో దోబూచులాడిన దృశ్యం

నాన్న వీపు ఎక్కి "చల్ చల్ గుర్రం"అంటూ ఆడలాడిన మురిపెం

అన్న చేతిలో బొమ్మలాక్కుని
తన్నులు తిన్న వైనం

అక్క చేయిపట్టి చెమ్మచెక్కలాడిన జ్ఞాపకం

తాతయ్య కళ్ళజోడు లాక్కుని
ఆడిన ఆటలు
అమ్మమ్మ  భుజాలపై నిదురబుచ్చి పాడిన జోలపాటలు

ఇలా ఎన్నో  ఎన్నెన్నో
మరపురాని మధురమైన జ్ఞాపకాల స్మృతులు

మొదటిసారి అనిపించింది
ఏ కాలయంత్రమో ఉంటే బావుండేదని
వెనక్కి వెళ్ళి రావచ్చని

ఏ మాయామంత్రమో
నేర్చి ఉంటే
కోరుకున్నది వచ్చునని

ఎంత చెల్లించినా మూల్యం
తిరిగి వచ్చునా ఆ బాల్యం

వెళ్ళలేను వెనక్కి
నా వారసత్వపు సంపదలో
చూసుకుంటా నా బాల్య స్మృతి

******************
     *అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*

రారమ్మని పిలుచుచుండురా నాదు బాల్యస్మృతులిల
గోరు ముద్దలు పెట్టకోరి కూర్మి రమ్మని అమ్మపిలువ
గారాము తలుపు చాటుండి గ్రన్నన దోబూచులాడి
మారాము చేసినయట్టి మధురస్మృతుల పెద్ద ఉట్టి
పేరిమి వీపుపై నాన్న వేగాన మురిపెంబు పొంగ
ఆరయ చల్చలు గుఱ్ఱమంటు ఆడించగా నపుడు

తే.గీ..
అన్న చేతిలో బొమ్మ లాకున్న యపుడు
తన్నులనుతిన్న వైనంబు తళుకుమనగ
అక్కతో చెమ్మచెక్కల హస్తముగొని
ఆడు దృశ్యము మనసులో నాడుకొనగ
తాత కండ్లద్దములు లాగి తాత తోడ
ఆడు ఆటలు మదిలోన వేడుకలగు
అమ్మమ భుజములపయిన ఇమ్ముగాను
ఆడిపించగ నిద్రనేనందగాను
జోలపాటలు నామదిన్ జోగుచుండు

ఇటులనెన్నెన్నొ యెన్నెన్నొ యెంచరాని
మరపురానట్టి వైనట్టి మధురమధుర
మైన స్మృతులుదలంచిన యంతనాకు
ఎదియొ ఒకకాలయంత్రంబదేలలేదు
ఉన్న వెనకకు పోయి నేనుందు ననుచు
లెస్స యనిపించు చున్నది రేయిబగలు
మాయమంత్రతంత్ర మదియె హాయిగాను
నేర్చుకొని యుంటె కోరనేనేది యగును

ఎంత చెల్లించినన్ మూల్యమేమి తిరిగి
వచ్చునా బాల్య మెపుడు ఈ వసుధయందు
వెనకకేగ లేను అయిన ప్రీతితోడ
నాదు వారసత్వమహత్వ నవ్యభవ్య
సంపదందున నేచూచి సాగుతాను
నాదు బాల్యపు స్మృతులెల్ల మోమోద
17
10.04.2020
*గుమ్మన్నగారిబాల సరస్వతి గారి కవిత*

శీర్షిక:బర్డ్స్ నేచర్..

బంగారు పిచ్చుకా...!
బుర్రుమని సవ్వడి తో
సర్రున ఇంట్లో దూరి
నాతో పోటీ పడుతూ
అద్దంలో నీ ముఖాన్ని నువ్వు చూసుకుం టే
నీ అందానికి నువ్వూ
నా చందానికి నేనూ
ఎంతగా మురిసి పోయేవాళ్ళం...
చిట్టి నేస్తమా!
నేను అన్నం తింటున్నంత సేపూ,
ఇంటి దూలాలకు
క్రమ బద్ధంగా వేలాడదీసిన
మొక్కజొన్న పొత్తులకు
ఒక్కో గింజా  ఏరుకుంటుంటే
నన్ను పరికిస్తూ నువ్వూ,
నిన్ను గమనిస్తూ నేనూ
కడుపు నిండా తినేవాళ్ళం_
పిచ్చుకా...
నువ్వు లయబద్ధంగా
రెక్కల ల్లా డిస్తూ
గాల్లో గిరికీలు కొట్టి
వాకిట్లో వేపచెట్టు స్థావరానికి దూసుకె ల్తే
నీ లానే నేనూ
రెండు చేతు లూ గాల్లోకి సాచి తుర్రున
బడికి పరిగెత్తే దాన్ని...
నేస్తమా...!నీ స్నేహాన్ని తల్చుకుంటే
స్తబ్ధ మనుకున్న నా మనస్సు
రెక్కలు తొడుక్కుని
గతపు  గగన వీధుల్లో
స్వేచ్ఛా విహారం చేస్తుంది
నా బంగారు పిచ్చుకా!
అంతలోనే ఆవేదన..
నా గతించిన బంగారు బాల్యాన్ని తిరిగి పొందడం ఎంత అసంభవమో..,
నీ స్నేహాన్ని తిరిగి పొందడమూ అంతే...
చిన్ని నేస్తమా..!
మా చేతుల్లో పదును లేని కత్తులూ,
పేల్చలేని బాంబులూ
మొనలు లేని బల్లేలూ
భద్రంగా పట్టుకుని,
విసరకుండానే వాటితో నిన్ను కర్కశంగా
తరిమి తరిమి చంపుతున్నాం..
ఇక రమ్మంటే ఎలా వస్తావ్?
బంగారు పిచ్చుకా...!
"నేచర్ 'కు ప్రతీకగా కనిపించే నిన్ను
చేజేతులా పోగొట్టుకొని
నీకు మారణా యుధమైన మాటల యంత్రం లో
నీ కువ కువల "బర్డ్స్ నేచర్ "రింగ్ టోన్ నివింటూ,
యాంత్రికంగా జీవితాన్ని గడిపేస్తున్నా...
పిచ్చుకా... ఎక్కడినుండైనా నన్ను గమనిస్తే,నువ్వు నన్ను
నీ స్నేహపు గురుతు లను
తల్చుకుంటన్నానను కుంటావో...లేక
గాయం చేసిన,లేపనం పూసే
"కిరాత"ననుకుంటావో...
*******************
*అవధాని గారు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*

బంగారు పిచ్చుకా నీవు వైళంబు బుర్రుమటంచు
చెంగున నాయింట్లదూరి చెప్పనా యద్దాన పోటి
రంగుగ నాతోడ పడుచు రమ్యమున్ నీముఖమందు
హంగామగాచూచి నీదు అందంబునకు పొంగినీవు
అంగనామణి నేనుగూడ ఔరపొంగితి నేను నాకు

సంగడి ఓచిట్టి పిట్ట చయ్యన నేతిను వేళ
అంగులము కదలలేక అపుడింటి దూలంబు మీద
సింగారమగు మొక్కజొన్న చేపైన పొత్తులన్ గింజ
లంగడు ముద్దుగానీవు రక్కొని ముక్కునన్ కరచి
ముంగురుల్ నావమ్మ చూదుపోయన గమనించు చుండు
చుంగురుచ నినుగమన మేను ఉద్ధృతి చేయంగ తిననె

తే.గీ:
ఇట్టు లకడుపు నిండ మనిద్దరమట
హాయిగా తిను వారలమపుడు గాదె
పిచ్చుకానీవు లయబద్ద విధిని రెక్క
లాడజేయుచు గిరికీలు రమ్యమొప్ప
గాలి యందు కొడుచు వేపకాడికి చన
నేను నీలాగ గాలికి నిక్కము గను
రెండు చేతులు సాచి నా లేత భుజము
పొత్తముల సంచి ధరియించి పోదు బడికి

నేస్తమా నీదు స్నేహంబు నేదలంప
స్తబ్దమనుకొన్న నామది దాల్చి రెక్క
లాహ గతమను వినువీధి నందు స్వేచ్ఛ
గావిహారమౌ ఆవేదనంబునంత
నా గతించు బంగరు బాల్యమే గతినిక
తిరిగి పొందనసాధ్యమో యరయనదియె
నీదు స్నేహంబు పొందుట నిజము కల్ల

మాదు చేతులు పదునేమి మరియు లేని
కత్తులన్ పేల్చలేనట్టివుత్త బాంబు
లన్ మెనలులేని బల్లంబు లన్ ధరించి

విసర కుండనె కర్కశ విధిని నిన్ను
తరిమి తరిమి చంపి నిన్నరసి రమ్ము
అనగ వత్తువ ముమ్మారు లమ్మ చిన్ని
ముద్దు బంగరు పిచ్చుకా పొంగి నీవు
ప్రకృతికి ప్రతీక గాకనబడెడు దాన
వేయు చేజేతులను కోలు పోయి నిన్ను
మాదు మారణాయుధమైన మాటలనెడి
యంత్ర మందు కువకువల హాయి నీదు
రవము రింగ్టోను గావింటు భువిని మేము
యాంత్రికముగాను జీవితమమ్మగడపు
చుంటిమిక నేను గూడనే కంటె నన్ను
ఎచట నుండైన గమనించి యెంతొ ముదము
మనవి స్నేహపు గర్తులు మననమమ్మ
చేసుకుందువ లేకుంటె ఛీచి యనుచు
గాయమును చేసి లేపనంబో యరయగ
పూసెడి కిరాతనను కొంటు పోదు వమ్మ

19
12.04.2020

*రమాదేవి కులకర్ణిగారి కవితలు*
శీర్షిక ----పలుకే బంగారం

యుద్ఢాలకు సంధి
కారణO మాట ,


ఉద్యోగాలకు ఊతం
వైయక్తికo, మాట ,


జ్ఞానానికి మార్గం
బోధనo,  మాట ,


గానానికి గాత్రం
సాధనo,  మాట ,


నాయకతకు ఆధారo
భాషణo, మాట,


మనిషి మనిషికి
బంధం,  మాట

అందుకే ...........

విషము చిమ్మ
వశముకాదేదీ ...! !
మాటను మలచుకో
మంచి ముత్యాల
మూటలా ...
నీ పలుకే బంగారంలా....!!
***********************

*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*



యుద్ధముల సంధి జరుగ ఉద్యోగమంద
జ్ఞానమార్గాన బోధనా కారణాన
గాన గాత్రపు సాధనంబౌను అనగ
నాయకుడు నౌచు రాణించ నరనరులకు
మంచి సంబంధమేర్పడి మనుటకైన
విషము చిమ్ముచు మోసంబువేగజేయ

అన్నిటికి మాటకారణంబన్న నిజము
మంచి ముత్యాలమూటగా  మలచుకొనుము
మాటనెప్పుడు మేటిగా మాన్యుడవయి
పలుకె బంగారమనునట్లు పలుకుమయ్య

✳✳✳✳✳✳
20
*అవధాని గారు*
*శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు*
*చేసిన పద్యానువాదం*
*️⃣*️⃣*️⃣
పద్యానువాదానికి ఎన్నికైన కవిత
 యేరువ ఇందిర రెడ్డి
అంశం::ముఖస్తుతి
శీర్షిక
చాపకింద నీరు
♟️♟️♟️♟️♟️♟️
ముఖస్తుతి పొగడ్త
చాప కింద నీరులా
ప్రమాదపు తెర..!!
నోటితో పొగిడి
నొసటి తో వెక్కిరించే
ప్రమాదకారి ముఖస్తుతి..!!
నమ్మామో అధో పాతాళం జీవనం.!!
వాళ్ళ పని కానిచ్చికోవటానికి విసిరే వల ముఖస్తుతి..!!

ఇదో రకం నవ అస్త్ర సందింపు ఎత్తుగడ
దీనికి లొంగామో
అంతే సంగతులు
మన గోతి తవ్వ యత్న
ప్రయత్నం
అని తెలుసుకున్నా వో
బతుకు భద్రం..!!

ఇది ఓ కొత్తరకం గానాబజానా
తెలియని దారిలో
గతుకుల పయనం
ఈ ముఖస్తుతి..

నిన్ను మచ్చిక చేసుకుని నీ కొంప ముంచే పన్నాగం..

ముఖస్తుతి కి
పొంగకు..
పోగిడేది తెగడ్త అని
తెలుసుకుని మరీ
సాగిపో..!!

చదరంగం ఆటలో ఎత్తుల పై ఎత్తుల
జిత్తుల జిమ్మిక్కే
నమ్మితే మన పని హుళక్కే..

-యేరువ ఇందిర రెడ్డి
హైదరాబాద్.
*********
పద్యానువాదం
*********

 వెంకటేశ్వర్లు:
ఆముఖస్తుతి పొగడుటమారయగను
చాపక్రిందు నీరుగ చాలచాలచాల
ఒక ప్రమాదపు తెరయౌచునొలయుచుండు
నోటితో పొగడిపొగడి నొసటితోడ
వెక్కిరించు ప్రమాదకారిక్క డక్క
డెక్కడైన ముఖస్తుతి ఎరుగగాను
నమ్మినను అధఃపాతాళ మమ్మ బ్రతుకు
వారి పనికై విసురువల స్ఫారితమగు
నట్టిదగును ముఖస్తుతి ఇట్టులిదియె
యెంచ నవ్యాస్త్రసంధానమే యగు ఒక
ఎత్తుగడ లొంగదీనికి ఇంతె గతులు
గోతి యౌనది తెలిసినకొద్దినీకు
భద్రమగునిది క్రొత్తది వైనమైన
దైన గానాబజాన యింకరయ గాను
సతము తెలియని దారిలో గతుకుల పయ
నంబు నిజము ముఖస్తుతి నాడునాడు
నిన్ను మచ్చిక చేకొని నీదుకొంప
ముంచు పన్నాగ మౌనయ్య పొంగకెపుడు
ఆపొగడ్తయన తెగడ్తగానెరుంగు
యెరిగి సాగిపో ఆగక యించుకైన
పృథ్వి చదరంగమను ఆట ఎత్తులపయి
ఎత్తు జిత్తులజిమ్మిక్కుయింతయేని
నమ్మిన మనపని హుళక్కు సుమ్మి తమ్మి
*️⃣*️⃣*️⃣*️⃣*️⃣


Comments

  1. అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారిచే కవితలకు పద్యానువాదం చేయించడం నూతనంగా ఉఙది.మంచి ప్రోత్సాహకంగా ఉంటుంది కవులకు.ధన్యవాదాలు అవధాని గారికి మరియు అడ్మిన్ లకు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...