సూనృత వాక్యం11/04/2020
*********************
నిర్వహణ
వీరా గుడిపల్లి
Mathematics teacher and poet
సమన్వయం.
శివునూరి లలితా కృష్ణ
అవధాని
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం
మెరుగు మధు గారు
************************
సూనృత వాక్యం
సత్యం పలకడం
కవితా గానం జాబితా
1స్వర్ణ సమత గారు
2.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
3.కోరాడ గారు
4.దండమూడి శ్రీ చరణ్ గారు
5సునంద ఉరిమిళ్ళ గారు
6.దేవులపల్లి పద్మజ గారు
7.ఇంద్రవత్ రాహుల్ గారు
8.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
9బల్లూరి ఉమాదేవి గారు
10విజయ దుర్గ గారు
11.స్వర్ణలత గారు
12మర్రి జయశ్రీ గారు
13.వల్లాల విజయ లక్ష్మి గారు
✳️✳️✳️✳️✳️
**కవితాగానం **
1.
**అంశం :సూనృత వాక్కు **
సత్యం నిత్యం
ప్రమిద వలే కాంతిని
హృదినిండా శాంతిని
పదిమందిలో క్రాంతిని
వసుధలోశక్తిని
స్వర్గంలో ముక్తిని
పరమాత్మవైపు భక్తిని
పలువురిలోయుక్తి
భువిలోభుక్తిని
మహిలోమణివలె
యాగంలోనిప్పు వలే
భావంలో ధ్వని వలే
రాగంలోశృతి వలే
కాలంలో కృతి వలే
వెలుగులోరవి వలే
వెన్నెలలోశశి వలే
పసిపాప నవ్వు వలే
నిష్కల్మష,నిర్మల ,
నిగర్వి,నిరాడంబరత ,నిస్వార్థ ,సద్భక్తికి ప్రతి నిత్యం నీడలా
ఉంటూ
నిన్ను నిన్నుగా
మన్నులోమిన్నగా
నిలిపేది సత్యం
జీవం--భావం
యోగం--యాగం
సత్యమే
కృత్యంలో తానుంటుంది
సుకృతిని ప్రసాదిస్తుంది .
**స్వర్ణసమత**
**నిజామాబాదు **
9963130856
అంశం:సత్యం పలకడం
2
రచన:డా.రామక కృష్ణమూర్తి
తేది:10-4-2020
శీర్షిక: సత్యం వద
**************************
"సత్యమేవ జయతే" సూక్తి కారాదు
ఒక జీవనవిధానం కావాలి
పలికే ప్రతిమాటలో శక్తి ఉండాలి
అది పవిత్రతకే దక్కుతుంది
సత్యాగ్నిలో పుటం పెట్టుకొని
వాక్కు శక్తి అవుతుంది
ఋజుత్వంతో శ్లోకమై ఆవిర్భవించి
ఋక్కై ప్రామాణికం చేయబడుతుంది
కఠినమైబా,ప్రియం కాకున్నా
ఆ మాటకు ఉండే విలువే వేరు
అందుకే దానికి విశ్వసనీయత
దానికే సమస్త రాజ్యపూజ్యత
ఏదైనా,ఏమైనా వ్రతంలా ఆచరింపబడి
నైతికవిలువల మార్గంలో ఉత్తమమవుతుంది
సత్యం చెప్పాలనీ,అది నీతి అని
బాల్యం నుండే బోధించాలి ప్రతిరోజు మనం
లేకుంటే జీవితాంతం అనుభవించాలని చెప్పాలి పాఠం
సత్యమే శిఖరమని ఘోషించాలి
అమృతం అదే అని నినదించాలి.
3
.,అంశం :-
సత్యంపలకడం
తేదీ:10-04-2020.
కోరాడ నరసింహా రావు .,
సత్యమేవ జయతే!
*****************
మాటకు సత్యము ప్రాణము అన్నారు !
సత్యము లేని వాక్కు
ప్రాణంలేని శవ శరీర మే కదూ ...!!
ఏది సత్యం ?
ఏది నిత్యమూ... శాశ్వతమో అదే.... సత్యం !
సత్యమునకు...హరిశ్చం ద్రుని సాటి న
భూతొ న భవిష్యతి!
ఏనాటికీ...సత్యమేజయిస్తుంది అని ఈ యుగంలో...గాంధీరుజువు చేశారు !
సత్యం కోసం సర్వ స్వా న్నీ త్యాగం చేసిన హరిశ్చంద్రుడే
ఆదర్శంగా బ్రతికారు గాంధీ...! కనుకనే
మరో చరిత్రను సృష్టించ గలిగారు !
మహాత్మునిగాపిలువబడి జాతి పిత యై వాసి గాంచారు !!
తనకేకాదు ...తానుపుట్టినభారత జాతికి
ఈ దేశానికే గొప్ప ఖ్యాతిని తేగలిగారు!
సత్య మంటే....ధర్మా నికి ప్రతి రూపం...!
ఆడితప్పినఅస త్య తంతుడు... వాడు ధర్మ ద్రోహియే !
ధర్మ నాశనమునకు పూనుకున్నవాడు నాశనము కాక తప్పదు !!
వున్నది లేదనుట ...
ఐనది కాదనుట ...
అదనుచిక్కినప్పుడల్లా అసత్యము లాడుట...ఇది...నేటి
సమాజ స్థితి !
అందుకే .....,మనకీ దుస్థితి...!!
అనిత్యము,అసత్యము ఐన ఈ మాయా జగత్తులో ...సత్యము,శాశ్వతమూ ఐన
ఆపరమాత్మ...తత్వమును తెలుసుకుని
ప్రవర్తిల్లు వారే.... ధన్యులు !!
**************,***
........కోరాడ.
4
*దండమూడి శ్రీచరణ్*
తేదీ:11-03-2020
అంశం: *సత్యం పలకడం*
శీర్షిక: *సత్యం వద!ధర్మం చర!!*
-------------------------------------
అంతరాత్మకు అడ్డదారి లేదు!
అది సూటిగా,స్పష్టంగా,సజావుగా ఉంటుంది.
కావాల్సిందల్లా,
నీ ముసుగులు,తొడుగులు
ఒకసారి తొలగించి,
కళ్ళు మూసికొని
నిన్ను నువ్వు చూసుకోవడమే!అంతే!!
అదేమంత కష్టం?
ఆకలికి ఆహారం అనే ఆలోచనలా,
దప్పికకు నీరు అనే అవగాహనలా,
మరుక్షణమే ప్రత్యక్షమవదూ?
ఓహో..నిజాయితీ గురించి గుర్తుచేస్తావా?
నిజాయితీ ఏమంత పెద్ద విషయం?
నిన్ను నువ్వు ఎలాంటి దాపరికాలూ,దాష్టీకాలూ లేకుండా,
వ్యక్తీకరించుకోవడమేగా!
అందుకు తెలివి కాదు కావాల్సింది,
మనసును అలాగే వెల్లడించడం!
అందుకు పెద్దగా కష్టపడఖ్ఖర్లేదు కూడా!!
ఈ జగత్తులో అలా బ్రతకలేం అంటావా?
సరే,
జగత్తు అనేది పెద్ద జఠిలమైనదేమీ కాదుగా?
నువ్వూ,నేనూ,అతడూ, అనే,మనం
కలిస్తేనేగా జగం!
నడుమ ఈ లౌక్యం దేనికి?
అబద్ధపు వ్యవహారాలు నడుపుకునేందుకు!
సత్యాన్ని మనం తొలినాళ్ళలోనే వధించాం!
ధర్మాన్ని పొత్తిళ్ల లొనే సంహరించాం!!
ఇక ప్రపంచమెలా ఉంటుంది?
మన ప్రతిబింబమేగా అది!
నువ్వు నిజమైన ఆనందాన్ని పొందేది ఏ క్షణాల్లో?
అవ్యాజమైన అనురాగాన్ని ఆస్వాదించేటప్పుడే!
అది కావాలనుకున్నప్పుడు,
అదే నిజమైనప్పుడు,
*నువ్వు సత్యాన్నే అనుసరిస్తావు!*
నీ అంతరాత్మనే శిరసావహిస్తావు!!
అపుడు నువ్వు నువ్వుగా జీవిస్తావు!!
----- *దండమూడి శ్రీచరణ్*
9866188266
[11/04, 8:15 PM] Devulapally Padmaja: కవితా గానం..అంశం..సత్యం పలుకు.....డాక్టర్ దేవులపల్లి పద్మజ
సత్యం అనుసరించ కష్టమే అనిపించు
స్థిరముగ నిలబడి ప్రయత్నించు
సత్యం ఎవరిముందు రాజీ పడని
విజయం
ఓటమి పెరుగుని శాశ్వతమైన
సామ్రాజ్యం
సత్యం ఒంటరిదైనా ధృఢముగ నుండు
సమూహ మానవుడు కూడా
ఎదురు నిలువకుండు
సత్యసంపద నిగ్రహమున్న వాని
వెంట నడుచుచుండు
సత్యము అద్వైతము అయినేమి
ప్రాఙ్ఞులు అనేక రీతుల వివరించె
సత్యవాక్కూ, దానము,యజ్ఞము
ధర్మము అనుసరించు మానవులకు జీవనమార్గమే
స్వర్ణ పుష్ప బాటలో పయనించు
సత్యం దర్శించు మానవుని
జిజ్ఞాసలో
త్యాగనిరతి అంతర్లీనమై యుండు
సత్యం తెలుసుకోవలెనన్న
విశ్వసనీయత అవసరమగు
సత్యం వెనుక మనం నడచిన
విజయం మన వెంట వచ్చు
నిజముగ సుమ్మీ! !
.................10.4.20
[11/04, 8:21 PM] సునంద ఉరిమిళ్ళ: తేదీ::11-04-2020
కవితా గానం
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:: సత్యం
శీర్షిక:: సత్యమొక సుప్రభాత కిరణం
::::::::::::::::::::::::::::::::::
సత్యమొక సుప్రభాత కిరణం
సర్వజీవులపై సమదృష్టి కిరణాలను ప్రసరింప జేస్తుంది!
బంగారానికి అబ్బిన తావిలా
సత్య సంధత సమాజంలో గుబాళిస్తుంది!
కష్ట నష్టాలను చవి చూసినా
సత్యమెప్పుడూ హరిశ్చంద్రునిలా
అంతిమంగా విజయాన్నే సాధిస్తుంది!
మనసులోని మలినాలను తొలగించిన సత్యశోధన
స్పటికంలా హృదయాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తుంది!
కళ్ళకు ఆభరణం కరుణ
మనసుకు ఆభరణం స్వచ్ఛత
మాటకు ఆభరణం సత్యం!
ఇలలో వ్యక్తిని వ్యక్తిత్వాన్ని చిరజీవిని చేసేవి ఇవే...
గుండెల్లో గుడికట్టుకుని
అజరామర స్మరణీయునిగా నిలిపింది
గాంధీజీ సత్యవాక్కే..
శివం సుందరమై భాసిల్లేది సత్యమే..
సుప్రభాత కిరణమై తేజస్సు పెంచేది సత్యమే!
[11/04, 8:30 PM] +91 98480 54079: 🙏నమస్కారం🙏
★★★★★★★★★★★
*అంశం*: ఒక సత్యం..
*రచన* *తేది*: 11/04/20
★ఓ మానవుడా వినరా
ఈ సత్యన్ని...
దొంగలు దోచుకోలేనిది
ఖర్చు పెట్టిన కరిగిపోనిది...
వరదల్లో కొట్టుకోపోనిది
జీవిత కాలం సహాయపడేది...
మానవునికి కీర్తి తెచ్చిపెట్టేది
జ్ఞానవంతులుగ చేసేది...
ప్రగతి బాటలో నడిపెంచేది
దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దెది...
అందుకే పలుకురా సత్యాన్ని
ఉండురా నిజాయితీగా.....
ధన్యవాదములు... 🌹
🎯కవి పరిచయం🎯
★★★★★★★★★★★
పేరు : ఇంద్రవత్ రాహుల్
ఊరు : మల్కాపూర్
జిల్లా : ఇందూర్ /నిజామాబాదు
మండలం : ఇందూర్ /నిజామాబాదు
చరవాణి : *9848054079*
8
అంసత్యం
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
సత్యం ఆచరించడం
సత్యహరిశ్చంద్ర డునికి వెన్నతో
పెట్టినవిద్య
సత్యానికి కట్టుబడి ఎన్ని ఆటంకములు ఎదురైనను సత్యధర్మాన్ని వీడలేదు
సత్యం మనసులోని స్వచ్చతభావాలను
పలుకును సత్యానికి జాతికుల వివక్షత లేదు
గాంధీజీ సత్యాన్ని ఆచరించి
నియమనిష్ఠలతో కూడిన వ్యక్తి త్వాన్ని తత్వాన్ని
ఔన్నత్యాన్ని ధర్మాన్ని
ఆచరించారు
సత్యం నీతికి న్యాయానికి
రక్షణ కల్పించును
ఎప్పటికైనా సత్యం నిన్ను రక్షించును
సత్యం పరమోధర్మః
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
9
అంశము:సత్యం పలుకు
పేరు:డా.బల్లూరి ఉమాదేవి
ప్రక్రియ పద్యములు
ఆ.వె:సత్య మాడ మదికి సంతోషమే కల్గు
తప్పిదమును చేయ దండమదియు
తప్ప దనుచు నెరిగి తగిన రీతిచరింప
మాన్య తంద వచ్చు మహిని నెపుడు
ఆ.వె:ఆడి తప్ప ననుచు వారినే తుమ్మినా
నేత జనుల మదిని నిలిచె గాదె
నెట్టి కష్ట మైన నించుకయు చలింప
కాచ రించి చూపె నవని యందు.
ఆ.వె:కల్లలాడ ఫలము కనరాదు జగతిలో
సత్యము విడి కుండ సాగు చున్న
విజయమెపుడు మనకు వెన్నంటి యేనుండు
ననుచు నుందు రార్యు లనవరతము
ఆ.వె:మాట నిలుపుకొనగ మదినెంచి యాగోవు
ప్రాణ మొసగ సిద్ధ పడియె నాడు
నీతి కథగ నదియు నేటికీ ఖ్యాతమై
సత్య వాక్య మహిమ చాటు చుండె
ఆ.వె:సత్యమెప్పు డైన సంపద వంటిదే
కంటిరెప్ప వలెను కాచుచుండు
ధర్మ మార్గమునకు దారిని చూపెడు
దీప మది యటంచు తెలియు డయ్య
10
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : సత్యం పలుకు
కవితా సంఖ్య: 04
తేదీ: 11/04/20
ప్రకృతి ధర్మం,చరాచర చలనం
సత్యమీద సాగు మహాన్నత
రూపాలు
చరిత్రలకు ఆధారం సత్యం లోని
అడుగుజాడలే....!!
వాటి మధ్య బతుకు మనుషికెందుకో
అసత్యాల బాణీలు
అతలాకుతలమే అబద్దాల
దారులలో సత్యం గీతికలు....!!
సత్యాన్ని నమ్ము సత్యం పలుకు
నిన్ను నిలబెట్టు నిన్ను ఉన్నతంగా
అంతా మిధ్య అయిన ఈ సృష్టిలో
సత్యాన్ని వెతుకు....!!
నీ మాటను బట్టే నీవిలువ
పాప పుణ్యాల లెక్క
నీ పలుకెప్పుడూ సత్యం నీడలో
సేదతీరిన
నీ జీవన వాహిని సూర్యతేజమే....!!
వినీల
11.
సత్యం పలకడం
బ్యూటీ పార్లర్ లో అందానికి మెరుగులద్దుకున్న
అమ్మాయి లా అందమైనది అబద్దం
ఆత్మ సౌందర్యానికి ప్రతీకలా నిలిచే అమ్మాయి
వంటిదే సత్యం
సత్య వాక్కులను వినడం కంటగింపే కొందరికి
అందమైన అబద్దాల ఆకర్షణ అటువంటిది
సత్యం నలుకుటకు వెరువరు...
వాస్తవంలో జీవించువారు
అబద్దాల ముసుగేసుకుని అర్థం లేకుండా
జీవించువారు...
వణికి పోదురు సత్యం వచియించవలెనన్న
ఒక్క అబద్దమును వాస్తవంగా చిత్రించవలెనన్న
వంద అబద్దములాడవలసినదే
సత్యమును మాత్రమే మాట్లాడవలెనన్న
గుండె ధైర్యం మెండుగా అవసరం
చిన్నతనం నుండి సత్యం పలుకుట
తెలిసియున్నవారు వాస్తవం నందు జీవిస్తూ
జీవన మాధుర్యం పొందగలరు
ఎం.టీ.స్వర్ణలత..మంచిర్యాల
12
మర్రి జయశ్రీ
అంశం.సత్యం పలకడం
తూలి పడే అమాయకత్వం నుండి జాగృతి చేసి
ధృడ0గా నిలిపేది
తెలిసి ముట్టుకున్నా
తెలియక ముట్టుకున్నా
అగ్నిలా దహించేది
దేవుడికన్నా గొప్పది
సన్మార్గంలో నడిపించే చైతన్య శక్తి
గొప్పకార్యాలకు దారి చూపే మార్గదర్శి
ఓటమి ఎరుగనిది
నిలదొక్కుకొని నిలబడేది
సంస్కృతి లో అగ్రస్థానమైన నిలిచింది పవిత్ర సత్యవాక్కే
సత్యం పలకడానికి ధైర్యం కావాలి
సత్యంతో వడకట్టి మాటను పలకాలి
సత్యం కు సంకల్పబలం తోడైతే
ఇక విజయం మన సొంతం
సత్య హరిచంద్ర నాటక ప్రేరణే
మహాత్ముడిని
స్వాతంత్ర్య ఉద్యమానికి ఊతమిచ్చి
శాంతి సత్యం ఆయుధాలతోనే
విజయం సాధ్యమని ఋజువు చేసింది
నేటి సమాజంలో అసత్యవచనాలే అధికమై
అవే రాజ్యమేలుతూ
ఆచరించే వారిని అపహాస్యం చేస్తూ అవమానపరుస్తున్నాయి
అన్నీ తెలిసినా నటిస్తూ బ్రతకడమే వారి పని
సత్యానికి మించిన ధర్మం లేదని
ఎన్ని మార్పులు వచ్చినా
దానంతట అది నిలబడేది సత్యవచనమే
ఆ విత్తనం నిరంతరం పెరిగే శక్తివంతమైన మొక్క
సత్యమేవ జయతే అన్న మాట శాశ్వతం.
13
కవితాశీర్షిక*సత్యవచనం(సూనృత వాక్యం)
హరిచంద్రుని జీవితం
నలదమయంతి జీవనం
గాంధీమహాత్ముని అనుభవం
సత్యవచనాలు ధర్మమార్గానికే అంకితం
అందమయిన అబద్దం
అద్దాలమేడ0టి భవనం
ఏ క్షణాన కూలునో తెలియం
నిజమనే పలుకురాయిని విసిరినా అబద్దాలమేడ పగులుట ఖాయం
అబద్దాలతో ఆకట్టుకోవటం కొందరి అవలక్షణం
తాత్కాలికంగా అది అందoగా అలరించినా నిజం నిలకడమీద తెలియకుండునా?
ఒక అబద్దాన్ని కాపాడుకోవటానికి అసంబద్ద అబద్దాల కొనసాగింపు అవసరమా?!
నిజం చేదుగా ఉన్నా దానిఫలం మధురమే కదా?
మనమట్టుకు మనమైనా మంచి మనసుకు అలంకారం మమత
పలుకుకు అలంకారం సత్యసంథత
*సత్యమేవ జయతే**అని నమ్ముదాo మనసారా
'సత్యమే నేను నమ్మే భగవంతుడు'
అన్న గాంధీతాత వారసులుగా నిర్భయంగా మాట్లాడుదాం నిజాన్ని
మానేద్దాం ఉబుసుపోక చెప్పే అబద్దాలైనా
గుర్తిద్దాం అదే గాంధీజీకి మనమిచ్చే నివాళి అని
పుకార్లను చిలవలుపలువలు చేసి ప్రచారం చేసే వికారాలు మానేద్దాo
ఒట్టుపెట్టుకుందాం మేం అబద్దమాడo'అని
::వల్లాల విజయలక్ష్మి,,ఆలేరు


సత్యమేవజయతే
ReplyDelete