Skip to main content

ఓంకారం 2021

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
 వీరా గుడిపల్లి
***********************
1.డా.కమలాదేవి గారు
2.వాణి సరోజిని లక్కరాజు గారు
3.వురిమళ్ళ సునంద గారు
***************
1
[26/09, 8:07 pm] Lalita Sister: కవితాగానం
తేది : 25-9-21
అంశం : ఓంకారం
శీర్షిక : ఓంకార మహత్తు
అత్యంత మహిమాన్వితమైన
మంత్ర రాజం"ఓం"
ఏకాక్షర మంత్రమిది
శక్తివంతమైన మంత్రం
'ఓం,ఓమ్,లేదా ఓంకారం
త్రిమూర్తి స్వరూపం
పరమాత్మకు శబ్ద ప్రతీక 'ఓం'
బ్రహ్మ, విష్ణు,శివుల ప్రతిరూపమే ఈ ప్రణవం
సంపూర్ణ జగత్స్వరూపం 
అకార, ఉకార,మకార
మూడక్షరాల శబ్ద స్వరూపం
జగత్తులోని మూడవస్థల
ప్రతిరూపం
జాగ్రదావస్థకు 'అ'కారం
స్వప్నావస్థకు 'ఉ'కారం
సుషుప్తావస్థకు 'మ'కారం
ప్రతీకలు
హిందూ సంప్రదాయమేకాదు
బౌద్ధ, జైన మతాలలోను 
ఉంది ఓం కార ప్రస్తావన
ఆధ్యాత్మికశక్తి యుతము
వేదోపనిషత్ ప్రాశస్త్యము ఈ మంత్రం
అవినాశము, వినాశము లేనిది
శాశ్వతమైనది
సృష్టి, స్థితి,లయల స్వరూపం
ఓం కారం లేని పూజ లేదు
విఘ్నాలకు  అధిపతి వినాయకుని స్వరూపమట
ప్రథమ స్థానంయోగవిద్యలో 
అత్యంత ప్రయోజనకారి
ఆరోగ్యకారి
కలిగిస్తుంది మనశ్శాంతిని
చిత్తశుద్ధి కారి.
ఎంతో మార్పుతెస్తుంది జీవనవిధానంలో
"ఓం" కారమంత్రజపం
తొలగిపోతాయి నకారాత్మక భావాలు
పరిశుద్ధమవుతుంది మనసు
లభిస్తుంది మానసికారోగ్యం
తద్వారా శారీరిక ఆరోగ్యం
జపించండి ఓం కార మంత్రాన్ని అనునిత్యం
పొందండి మనశ్శాంతిని
జీవించండి
ఆరోగ్యానందాలతో

పేరు : డా.కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
చరవాణి : 9871096566

పైకవిత నా స్వంతం. అనుకరణ అనువాదం కాదు.
2
[26/09, 8:53 pm] +91 94910 54829: 26-9-21 ఆదివారం
కవితా గానం   సీజన్-2
అంశం. ఓం కారం
రచన. వాణి సరోజిని లక్కరాజు
విజయవాడ
ఆ.వు.మ.సమాహారం
పరమేశ్వరుని ప్రణవనాదం
నింగిన నినదించిన  ప్రకృతి  రాగాలాపన
సామవేదానుసంధానం.
నవరసభరిత. జీవరాగఝరి ఓంకారం.
విశ్వాంత రాళంలో ప్రతిధ్వనించే మహానాదం
పంచభూతాలలో ఆకాశానికి.  ప్రతినిధులుగా
ఓంకార. శబ్ద తరంగాలు.
మంత్రానికి ఆయువుపట్టు.
పూజలకు తొలిమెట్టు.ఓంకారం.
వినాయకుని అంతర్గత రూపం
త్రిమూర్తుల ఆత్మ స్వరూపం
 మానవుని అంతరాత్మ నినాదం.
మనిషి యొక్క జీవననాదం ఓంకారం.

పైకవిత నాస్వీయరచన
వాణి సరోజిని లక్కరాజు
వి జయవాడ.
3
[26/09, 9:32 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:26-09-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
*అంశం: ఓంకారం*
*******************
నీవే కదా మాలోని అహంకారాన్ని
పటాపంచలు చేసే సమ్మోహన నాదానివి..

నీవే కదా త్రికాల జ్ఞాన స్వరూపమై
మమ్మల్ని చైతన్య స్థితిలోకి తెచ్చే శబ్ధ తరంగానివి

నీవే కదా ముల్లోకాలను ఏలే
ఇంద్రాది దేవతలనూ
సూర్య చంద్రాదుల గ్రహాల గమనాన్ని నిర్దేశించే
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికవు!

 నీవే కదా
సర్వాంతర్యామివై అందరిలో 
వెలిగే దివ్య జ్యోతివి

నీవే కదా కాంతి వత్సరాలను 
శూన్యం నుండి అలవోకగా దాటి
అనంత మానవ జీవితానికి  జీవత్వాన్ని  ప్రసాదించిన జీవ కిరణానివి!

 నీవే నీవే నీవే
పెల్లుబికిన ప్రేమాతీత ప్రణయ రాగానివి
మరుజన్మ లేని ముక్తి ప్రసాదిత
ఓంకార నాదానివి
మనశ్శరీరాలను స్వస్థత చేకూర్చే దివ్య ఔషధివి!

మహిమాన్వితమైన ఏకాక్షర శక్తీ గీతానివి!
అచంచల భక్తి విశ్వాసాల జీవన వేద సౌరభవానిమి.
నిండు సంద్రంలో ఈదించే పడవ సరంగువు.

 *వురిమళ్ళ సునంద, ఖమ్మం*

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...