నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
**************************
కవితా గానం సీజన్ 2
గతం అంశానికి స్పందించిన కవివరుల జాబితా
నిర్వహణ :వీరాగుడిపల్లి
లలితాకృష్ణ
పార్నంది లలితా కృష్ణ
1.కేశరాజు వేంకట ప్రభాకర్ గారు
2.అపరాజిత్ గారు
3. దోసపాటి వెంకటరామచంద్రా రావు గారు
4. పైమాలగారి సహదేవుడు గారు
5. వాణి సరోజిని లక్కరాజు గారు
6. వురిమళ్ళ సునంద గారు
7.గొర్రెపాటి శ్రీ ను గారు
8.తరణికంటి సూర్య లక్ష్మి గారు
9.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
10.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
11.కవిత వెంకటేశ్వర్లు గారు
12.మొహమ్అమద్ అఫ్సర్ వలీషా గారు
13. కోరాడ గారు
14.డా.ఆంజనేయులు గారు
15.దార. స్నేహలత గారు
16. ఆళ్ళ నాగేశ్వరరావు గారు
17. సింహాద్రి వాణి గారు
***************
అంశం :గతం
*కవితాశీర్షిక .*భవితకు సేతువు*
చీకటి గతానికై చింతిస్తూ
గాయాలను గేయాలుగా మలచుకొన్నామంటూ...
ప్రతికూలతల పూర్వానుభవాల
పర్వాన్ని వల్లెవేయడం మానేస్తే....
అవగతమవుతుంది
గతమంటే....
పొరపాట్లను
పునరావృతమవనివ్వని పురోగమనమే కదా గతమంటే...
వేలపరిచయాలు అక్కర్లేదంటూ...
వేళ్లపై లెక్క పెట్టుకునే ఆత్మీయతల నక్కున చేర్చుకునే
మధుర స్మృతులఅక్షయపాత్ర
గతమంటే
గతాన్ని మననం చేసుకుంటూ....
వర్తమానoలో విహరిస్తూ
రేపటికై రేపగలు శ్రమిస్తే..
అందమైన భవితకు సేతువు కదా
గతమంటే.....
....... పార్నందిలలితాకృష్ణ
1.
అంశం....గతం..28092021
************************
గతం ఎప్పుడూ కవ్విస్తుంది
జ్ఞాపకాల దొంతర కన్నుగీటి
కోరికల కలం నిండా సిరా నింపి
ప్రణయ కావ్యం సుందరంగా రాయమని
గతం పునాదులు తవ్వి
ఝుమ్మంటూ పూల పుప్పొడి మధువును
గ్రోలుచు భ్రరాల రమణీయ రాస క్రీడల
సొగసును రమ్యంగా అక్షరాల కందించమని
గతం జాలు హోరులో వర్తమానం వికసించి
సుగంధ సుమనోహర ప్రకృతి పరవశించి
పంచే ప్రేమామృతం ధారలతో పూదోటలు
పెంచి వర్ణ వర్ణాల విరుల వినోదం రసరంజకంగా విశ్వ శాలలో శృంగార నైషధం నాట్య మాడె
గతం గమ్మత్తుగా చరిత్ర పుటల్లో పుంఖానుపుంఖాలుగా
వింత వింత ఆకృతిలో విందులు చేస్తుంది
పొంతనలేని అంశాలతో పరేషాన్ చేస్తుంది
కనువిందు చేసే కోటలు బురుజులు
అంతఃపుర సౌధాల సౌందర్య సంపద
ఆహ్లాదం అందించి పూర్వ వైభవ
వెండి వెన్నెల తటాకంలో స్నానం పర్వం
సంబరాలే
భయంకర యుద్ధాలలో చిన్నాభిన్నమై
ఏరులై పారిన రుధిరం
ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడివున్న
అమూల్య కళాఖండాల మొండెములు
చూస్తుంటే... విషాదమే మనసంతా
స్వీయ రచన:::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
28092021
2
[28/09, 8:00 pm] Aparajith: నేను,,,,,!
అద్దంలో
ముప్పది సంవత్సరాల కిందట
ప్రతిబింబంలా లేదిపుడు
ఏబది ఏళ్లు దాటిపోయె!
వెంట్రుకలు తెల్లబడి
ముహం ముడతలు తెలీ
వృద్దాప్యంలోకి అడుగిడుతున్న ఛాయలు ,,,,,,,,,,,!
ఈ మధ్యకాలంలో,,,,,,,,
వేదనాభరిత సంఘర్షణలెన్నో
సముద్రపు అలలు
రౌధ్రంగా కొండలను ఢీకొన్నట్లు
మనసుకయిన గాయం
ఎవరో శరీరంలోంచి రక్తాన్నంతా తోడేస్తున్నట్లు!
తలచుకుని తలచుకుని
తలదిమ్ముతో
కాలం గతించినా కొద్ది
ఆలంబనగా నిలచిన వాళ్లను తప్ప
కావాలని అందరినీ దూరం చేసుకున్నాను!
ఈ రోజుకీ ఏభై ఆరు నిండి ఏభై ఏడో పడి!
మబ్బుతునకంటూ లేని ఆకాశం
భగ భగ మంటలతో మండుటెండలు
నా బ్రతుకే అంత
విషాద ఘంటికల్లో
ఆనందానికై అర్రులు చాచి చాచి
తలవేలాడేసుకున్న వెర్రిముహం!
దృష్టికందని దృగ్గోచర చిత్రం జీవితం
పగుళ్లుదేరిన బీళ్ళలో
నాగేటి చాళ్ళకై పెనుగులాట!
ఆ నెలవంక సాక్షిగా
నేను అడవిలో పూచిన అగ్నిపూవును!!
ఆపరాజిత్
3
[28/09, 8:23 pm] +91 99373 80136: కావ్యాగానం(సీజన్2)
తేది28092021,మంగళవారం
అంశం:గతం
గతం ఎప్పడూ కవ్విస్తుంది
నవ్విస్తుంది బ్రతుకిస్తుంది
ఊరిస్తుంది ఊరడిస్తుంది
రేపటిపై ఆశలురేకిస్తుంది
గతం గతః అనుకోలేము
గతం భవితకు పునాది
గతం వర్తమానానికి పాఠం
గతమొక గుణపాఠం
గతం గాయాలను మాన్పుతుంది
నిన్న నిజం
నేడు సత్యం
రేపు అనుహ్యం
కాలచక్రభ్రమణంలో
గిర గిరా గిరగిరా తిరగాల్సిందే
నిలకడగా నిలచేవరకు
నిశ్చలతను పొందేవరకు
ఏది శాశ్వతం కాదనుకుంటాం
ఏది సత్యం కాదనుకుంటాం
సత్యమేదో తెలిసేవరకు
న్యాయమేదో పొందేవరకు
కాలగమననాన్ని అనుసరించాల్సిందే!
ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
4
[28/09, 8:37 pm] +91 91605 94801: కవితాగానం సీజన్ 2
పైమాలగారి సహదేవుడు
నేటి అంశం :గతం
శీర్షిక : గతం నేర్పినపాఠం
గతాన్ని విస్మరించినా వుండదు భవిత
గతాన్ని నెమరువేస్తూ
వర్తమానంలో వెతకాలి
భవిష్యత్తును
గతాన్ని మరచిన రాదు ఘనకీర్తి
కీర్తి పొందువారు మరువరు గతాన్ని
గతం లేక గమనంలేదు
గమనం లేక భవిష్యత్తు లేదు
గతం నేర్పిన గుణపాఠంతో
భవిష్యత్తు ఫలితాల బాటలో పయనిస్తావు
గత ఓటమిలే
భవిష్య మానవ మనుగడకు
సోపానములు
5
[28/09, 9:10 pm] +91 94910 54829: 29-9-21 సోమవారం
అంశం గతం
రచన. వాణి సరోజిని లక్కరాజు
విజయవాడ.
గతం భవిష్యత్తుకు వర్తమానానికి
మధ్య వారధి.
భవితకు దిక్సూచి వర్తమానానికి వరం
గతజీవిత ఙ్ఞాపకాలు
మరుపురాని మధుర స్మృతులు.
తప్పొప్పులు సరిచేసే
చక్కనైన మార్గదర్శి.
గతం నేర్పిన పాఠాలు
భవితకు గుణపాఠాలు.
దూరమయిన బంధాలకు
మరుపురాని అనుభూతి
చరిత్రలో నిక్షిప్తమయిన
గతబంధపు ఆనవాళ్లు
దూరమయిన మమతలు మమకారాల కు
మరుపురానితీపిగురుతు.
గతం వర్తమానానికి పునాది రాయి
గతకాలపు పాఠాలు నేర్పిన
అనుభవాల నేపధ్యంలో
వర్తమాన భవిష్యత్ లను
మలచుకొనుటెమానవధర్మం.
6
[28/09, 9:29 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:28-09-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం; గతం
*****************
కనిపించకుండా
కళ్ళ ముందే కరిగిపోతూ
ఆనుభవాల ఆనవాళ్ళను మిగిల్చి నింపాదిగా అనంత కాలనదిలా సాగిపోయేదే గతం
క్షణాలను భూతంలా హాంఫట్ చేసి
ఔనా ఔరా ఏమిటి వింత అనుకునేలా
తీయని నిమిషాలను ఐస్క్రీంలా
కారం కారంగా వేదనలను మిగిల్చి
మనసును గాయం చేస్తూ గడిచి పోయే చిత్రమైన సమయమే గతం..
గతం పునాదులపై నడిచే వర్తమానం..
భవిష్యత్ కు కావలసిన పాఠాలు నేర్చుకుంటుందనేది నిజం..
7.
[29/09, 8:14 pm] +91 96528 32290: కవితా గానం ( సీజన్ 2 )
రచన : గొర్రెపాటి శ్రీను
అంశం: గతం
శీర్షిక : "జీవితమంటే .."
గతం..మరపురాని జ్ఞాపకం !
గతం..తిరిగిరాని ఓ సన్నివేశం !
తిరిగే కాలం..గడియారం ముల్లు ..ఆగవెన్నడు !
గతాన్ని తలూస్తూ వగచేవాడు ..
....వర్తమానాన్ని ఆస్వాదించలేడు !
.... భవిష్యత్ లోకి ప్రయాణించలేడు !
కొన్నిసార్లు ..గతం బాధాకరం !
మరికొన్నిసార్లు..గతం సంతోషకరం !
బాధని ఓర్చుకోవాలి !
సంతోషాన్ని నిలుపుకోవాలి !
ఏదైనా..కాలంతో పాటుగా కలిసి ప్రయాణించాలి !
గడచిన కాలం మిగిల్చిన గాయాలన్నీ రూపుమారిపోతుంటే ..
రేపటి అశలై పల్లవించాలి !
తడబడుతున్నప్పుడు తగిలిన అవమానాలన్నీ..
తట్టుకుని నిలబడ్డప్పుడు ..ఆ అవమానాలే రేపటి విజయసొపానాలవ్వగా..
నీ గెలుపు జయకేతనమై నింగికి ఎగరాలి !
"జీవితమంటే .." అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.
- గొర్రెపాటి శ్రీను ( హైదరాబాద్)
8
[29/09, 8:29 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్2 ) 29/9/2021/ బుధవారము
అంశము:- " గతం "
సీ! గతగాయములుమాన గతము మరచిపొమ్ము
వెనుతిరిగిచూడ వెతలుమిగులు
కళ్ళముందుకదులు కాల మంతయుకూడ
గతములోచేర్చును కాలమంత
మరితలవకెపుడు మరిగతమునెపుడు
తలపోయు మంచిని, తలవకు, చెడు
క్షణములు లెక్కించ క్షణములు మెల్లగ
జారు, గతములోకి చల్లగాను
ఆ! గడచె యుగము లెన్నొ గతము తిరిగిరాదు
వెనుకబడినగతము వెనుకనుండు
ముందుదారినెరిగి ముందుచూడమనుచు
గట్టిపాఠమొకటి గతముదెలుపు!
తరణికంటి సూర్యలక్ష్మి.
-----------
9
[29/09, 8:32 pm] Thathapudi Somashekara Sharma: కవితా గానం (సీజన్ 2)
అంశం.. గతం
శీర్షిక.. జరిగిపోయినది
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
గతకాలపు అనుభవాలు
భవితకు నిజమైన గుణపాఠాలు
రేపటికి మనం నేర్చుకునే నిజాలు
మరపురాని మృదుమధురజ్ఞాపకాలు
గతం భూతకాలం జరిగిపోయినది
ప్రస్తుతం వర్తమానం జరుగుతున్నది
భవ్యమానం భవిష్యత్తు జరగబోయేది
వర్తమానానికి భవిష్యత్తుకి వారధి గతం
గతం చెడ్డది అయితే వదిలేయ్
గతంనాస్తిఅనే పెద్దలమాటనుపాటించు
గతంమంచిదిఅయితేనువ్వుమర్చిపోకు
గతాన్నిఆహ్వానించిసుఖమయంచేసుకో
గతకాలపు నేర్చుకున్న పాఠాలు
నీ భవిష్యత్తుకు పునాదిరాళ్లు
గతంలోనీమంచి అనుభవాలతో
రాబోయే వర్తమానాన్ని భవిష్యత్తుని
బంగారు బాట చేసుకో....
హామీపత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
10/
[29/09, 8:45 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితా మాలిక
తేది: 29-09-2021
సమయం: గం. 8-43 ని.
అంశం: గతం
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
*మనోగతం*
గతం గురించి వగచేవెందుకు
వ్యధలు తలచుకుంటూ
వర్తమానం గడుస్తుంది తలమునకలవుతూ
భవిష్యత్తు ప్రణాళికలు
ప్రధానం
గతం ఎప్పుడూ మరచిపోము
తలచుకున్నప్పుడల్లా
తీయని అనుభూతుల సారాంశం
కష్టాలను సంయమనంతో అధిగమించిన సుఖాలను జ్ఞప్తికి తెచ్చుకొని
11.
కవితా గానం సీజన్ - 2
అంశం:: గతం
గతం ఒకప్పటి అగతం
చేసుకోవాలి అవగతం
నేడుకు నిన్న గతం
రేపటికి నేడు గతం
గతమొక మధురోహ
మధుర స్మృతులుంటే
గతమొక పీడకల
అరిష్టాలు జరిగివుంటే
గతమే బంగారు బాట వేస్తుంది
మంచి మనిషికి పూల బాట పరుస్తుంది
తప్పుడు మనిషికి దాని ఫలితమందిస్తుంది
కష్టపడి చదివిన విద్యార్థికి
ఫస్ట్ క్లాసు ఇచ్చి సంతోషామిస్తుంది
సరిగ్గా రాయని విద్యార్థికి
అనుభవం నేర్పిస్తుంది
గతమొక చక్కని గుణపాఠం
నేర్చుకున్నవారికి వేస్తుంది పెద్ద
పీఠం
నేర్చుకోవాలి పోటీ తత్వం
విడువరాదు ఎప్పటికి మానవత్వం
గతానికి పలకాలి సుస్వాగతం
ఏదైనా అవుతుంది భూతం
ప్రాముఖ్యం కారాదు మతం
బాధలన్ని మారువడానికి
ఉండాలి మందస్మిత0!!
కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు. 8309920625
పై కవిత నా స్వీయ రచన
అని హామీ
అనుభూతులు నెమరేసుకుందాం
12.
కవితా గానం (సీజన్ 2)
అంశం....గతం
శీర్షిక....చెరగని చిత్రాలు
గతకాలపు స్మృతులన్నీ చెరగని చిత్రాలై
కంటి కాన్వాసు పై చిత్రంగా అద్దుకుంటున్నాయి....
మరికొన్ని మధురానుభూతులు
అంతరంగ మస్తిష్కంలో నిక్షిప్తమై
తవ్వేకొద్దీ సంతోషాల తునకలుగా తగులుతున్నాయి....
గతించిన అనుభూతులు అనుభవాలు అణువణువునూ
ఆరనీయకుండా తడుముతూ
తడుపుతూ ఉన్నాయి....
ఆప్యాయతల వెలుగు రేఖలు
కనుల నీరు చెంపల కద్ద నీయక
ముళ్ళ గోడలను తొలగించుకుని....
కొడిగొట్టిన నిరాశా దీపాలలో
ఆశల చమురు పోసి చిరునవ్వుల పూలు పూయించడానికి....
13.
నేటి అంశం :- * గతం *
కోరాడ నరసింహా రావు... !
* భవిష్యత్తుకు పునాది *
*****************
గతాన్ని ఓ గుణపాఠం గా తీసుకుని... రేపటి బంగారు భవిష్యత్తుకు నేడు అకుంఠిత దీక్షతో...పరిశ్రమించేవారికే...
జీవితం ఆనంద దాయకం !
గతాన్ని తలుస్తూ... వర్తమా నాన్ని విస్మరిస్తే... భవిష్యత్తు
సూన్యమే కదా.... !
గతానుభవాలు... మనిషిని రాటుదేల్చేస్త్తాయి... ! సమస్యలను తట్టుకోగల శక్తిని కలుగజేస్తాయికదూ !!
గతమెంతో ఘనకీర్తి గలది మన
మన భారత జాతి.... !
ఆ వైభవాన్ని నిలుప వలసిన బాధ్యత మనందరి పైనా ఉందన్న సంగతి మరిచిపోతే ఎలా... !?
****************.
........ కోరాడ.
పచ్చదనాల పైరగాలిలా మానవత్వపు పరిమళాలు వెదజల్లాలని....
14.
గతం వర్తమానం
గతం నుండి వర్తమానానికి సాగిపోవడమే మానవ సాహసం
గతం నుండి వర్తమానానికి
రకరకాల ప్రయోగాలతో
మంచితనం ప్రశంసించడం నాటి నుంచి నేటి దాకా
నిజజీవిత మే నిన్ను కాపాడుతుంది
గతం అనుభవాల నుండి నేటి వర్తమానానికి ఓడించడమే
మానవ జీవితాల అనుభవాలే నవయుగ పాటలకు నాంది పలుకుతోంది
నవ త్వం మానవ తత్వం
అతన్నుంచి వర్తమానానికి ప్రయోగించడం ప్రవహించడం చరిత్ర చెప్పే గుణపాఠం
డాక్టర్ సి ఎస్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453
15.
కవితాగానం సీజన్ @2
అంశం : గతం
శీర్షిక : జ్ఞాపకాల తోవ
జ్ఞాపకాల తోవలో
విరబూసిన ఆనందపూలు
ఆరబోసిన వెతలపూలరేకులు
అన్నీ చెబుతున్నాయి నేను
నేర్వని బతుకుపాఠం
అడుగులు తడబడినా
వెనుకడుగులు వేసినా
ముందడుగు వేయాడానికేనని
మౌనంగా బోధించిన గతకాలపు
మహోన్నత సందేశం
అడపా దడపా ఆటుపోట్లు
ఆగాధాలు కమ్మే కారుమబ్బులు
అన్నింటికీ ఒకే సమాధానమై
నిలిచింది సహనమై
సాహసవుపేతమై సాగిన
బాటసారిదే అంతిమవిజయమని....
పేరు : దార. స్నేహలత
గోదావరిఖని
16.
[30/09, 8:14 pm] Aalla Nageshwar Rao Poet: కవితా గానం
నేటి అంశం; గతం
శీర్షిక;
"" భవితకు వారధి ""
గతం కన్నా వర్తమానం
వర్తమానం కన్నా భవితవ్యం
ఉజ్వలంగా ఉండాలని
ఆశించే ఆశాజీవి సగటు మనిషి!
గతమెంతో ఘనమని
గర్వించక
ఎదిగొచ్చిన మూలలను మరువక
గతాన్ని నెమరువేసుకుంటు
వర్తమానంతో.బేరీజు వేసుకుంటూ
ఉజ్వల భవితకు
గతాన్ని వారధి గా చేసుకుని
గతపు పునాదులపై
ఆకాంక్షల సౌధాన్ని నిర్మించుకోవాలి
కన్న కలల సాఫల్యతకై
నిరంతరం కృషి సల్పాలి!
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్
సెల్ నెంబర్.7416638823
పై కవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
17
[30/09, 8:20 pm] Siimhadri Vani Poetess: కవితా గానం సీజన్--2
నేటి అంశం:-- గతం
తారీఖు:-- 30--9--2021
శీర్షిక:-- ఆకుపచ్చ వసంతం
కాలచక్రంలో పగలూ రాత్రుల
నిశ్చితమైన రాకపోకలు
జగద్విదితాలు
తిరుగుతున్న జీవనచక్రంలో
సుఖదుఃఖాల ఆగమనాలు
అనూహ్యాలు --అనివార్యాలు
మానవ జీవనం సమస్తం
అనుభవాలు అనుభూతుల సమాహారం
మనిషి మస్తిష్కపు దర్పణంలో
అనుభవాలు అనుభూతుల
బింబాల ప్రతిబింబాలు
నిక్షిప్తమౌతూ వుంటాయి
బింబాలు మారుతూవున్నా
నిక్షిప్తమైన ప్రతిబింబాలు
గతకాలపు అనుభవాలను గుర్తు చేస్తూనే వుంటాయి జీవితం వున్నంత వరకూ
జ్ఞానం ప్రసాదించిన జ్ఞాపకాలు
ఊహ తెలిసిన బాల్యంనుండీ
వెన్నంటి నడిచే సహచరులు
విధి విధానపు వింత నాటకంలో
మానవ జీవిత చరిత్ర పుటలలో చేరిన
ఎన్నో రంగు రంగుల జ్ఞాపకాలు
అందమైన ఆనందపు సీతాకోక చిలుకలు
మధ్య మధ్యన ఝుమ్మని ముసురుతూ రొదచేసే
బాధావీచికల నల్లని గండు తుమ్మెదలు
జీవితపు నందన వనంలో విరబూసే స్వచ్ఛమైన నవ్వుల వెన్నెలలు
అప్పుడప్పుడూ అలముకొనే అమావాస్య చీకట్లు
హృదయాలలో స్నేహమధువులు నింపే అనురాగభరిత మందార మకరందాలు
శుభాల సోయగాల పసుపు పచ్చని చేమంతులూ పూబంతులు
మనసులను సున్నితంగా స్పృశించే ఆప్యాయతా పరిమళాల గులాబీలు
మనసూ మనసును ముడివేసే
అనుబంధ మాలికల తోరణాల నడుమ
సాగిపోయే జీవితంలో యెన్నో రంగు రంగుల జ్ఞాపకాలు
గతకాలపు అనుభవాలను భావి జీవితానికి మార్గదర్శకాలుగా మలచుకొని
తప్పొప్పుల నడుమ తారతమ్యాన్ని
గెలుపు ఓటముల కారణాలను గ్రహించి
భావి జీవితపు ఆకుపచ్చ వసంతానికి ఆహ్వానం పలుకుతూ
ముందుకు సాగడం మానవ ధర్మం
సింహాద్రి వాణి
విజయవాడ
చరవాణి:--7569820872

Comments
Post a Comment