Skip to main content

భాద్రపద మాసం పౌర్ణమి 2021

నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
అంశం: నిరీక్షణ
***********************
కవివరుల జాబితా
1.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు
2.ఆపరాజిత్ గారు
3.సింగీతం సంతోష్ కుమార్ గారు
4.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
5.తరణికంటి సూర్య లక్ష్మి గారు
6.డా.భమిడిమఱ్ఱి కమలాదేవి గారు
7.నాశబోయిన నరసింహ గారు
8.గొర్రెపాటి శ్రీ ను గారు
9.బాలు కత్తుల గారు
10.తాతపూడి సోమశేఖర శర్మ గారు
11.గంగాపురం శ్రీనివాస్ గారు
12.ఇంద్రావత్ రాహుల్ గారు
13.దార. స్నేహలత గారు
14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
15.వనపర్తి గంగాధర గారు
16.కొంపెల్లి రామయ్య గారు
17.మద్ది పుల్లారావు గారు
18.కే దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు
19.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.గారు


****************
దోసపాటి వేంకట రామ చంద్ర రావుగారు  :-* ఎడబాటు  *
      *****************
. ఎడబాసిన తన ప్రియుని ఆప్యాయతానురాగ స్పర్శ కై 
తపించే ప్రేయసి విరహ వేదన !
ప్రకృతితో అనుసంధానం చేసుకుంటూ.... ఆతలపులతో 
ఆ నిరీక్షణను... చక్కని భావ వ్యక్తీకరణ తో కవిత్వీకరించి ప్రవహింప జేశారు ! బాగుంది.
💐


ఎం. అపరాజిత్ రెడ్డి గారు :-
      * నిరుద్యోగి నిరీక్షణ *
         **************
ఆర్ధిక ఇబ్బందులు... ఆకలి బాధలను తట్టుకుని.... ఉద్యోగం వస్తే కష్టాలు తీరుతాయనే ఆశతో అహరహం శ్రమించి ఎంతో ఆశతో ఎదురుచూస్తే.... ఎంతకూ ఫలించని నిరీక్షణ !
ఎండమావి లాంటి ఉద్యోగాలకోసం అలా ఎదురు చూడటం కన్నా... చేతనైన పనేదైనా చేసుకుంటూ హాయిగా బ్రతకమని సందేశాత్మక కవిత ! బాగుంది.
💐


తరణికంటి సూర్యలక్ష్మి గారు :-
             శీర్షిక లేదు 
         **************
ఎదురుచూపులలోనిఆనందమే
ఆనందం !దానికెంతో ఓపిక అవసరం... నిరాశ చెందక ఆశతో ఎదురు చూడాల్సిందే !
ఆ నిరీక్షణ  ఫలిస్తుందనే ఆశే మనిషిని బ్రతికిస్తుందంటూ... 
ఆ ఎదురు చూపులు ఫలిస్తే 
పొందే ఆనందమే... ఆనందమన్నారు ! బాగుంది.
💐

డాక్టర్.భమిడిమర్రి కమలా దేవిగారు :-*ఎదురుతెన్నులు* 
         *************
నిరీక్షణ ఫలిస్తే... ఆ ఆనందం అనిర్వచనీయ అద్భుతానందం 
అంటూ...కలువలరేడుకై  ఎదు రుచూసే కలువబాలని... ఆరేరాజు రాకకై తన తపనను వర్ణిస్తూ... నిరీక్షణ దేనికైనా అనుభూతు లిలాగే ఉంటాయని నిరీక్షణని సాధారణీకరించారు బాగుంది !
💐

నాశబోయిన నరసింహ గారు :-
    * నిఖార్సైన తిరస్కారం *
        *****************
ప్రేమించే ప్రేయసికై ఊహాలోకాల్లో తేలిపోతూ... 
తన తిరస్కారమే ఆతని విజయానికి శ్రీకారం చేసుకుని  భావకవిత్వారాధనతో... 
తననే ఆరాధిస్తూ... నిరీక్షణ బాగుంది !
💐

కేశరాజువెంకటప్రభాకర రావు:- 
    * ఎదురు చూపులు *
        *************
తనను రెచ్చగొట్టి పిచ్చెక్కించిన 
ప్రేయసి.... దూరముకాగా... 
రాయీ రప్పా... పుట్టాగట్టూ చెట్టూ చేమా.. కొండాకోనలన్నిటినీ అడుగుతున్నాడు !అణువణువులో తనే కనిపించి తనకొరకే ఎదురుచూడటం... బాగుంది,!
💐


కొంపెల్లి రామయ్యగారు :-
             * నీ స్నేహం  *
        **************
నిను చూడనిదే నామనసు ఆగదు క్షణం... నీ స్నేహంకోసం పరితపించే రోజులలో...ఎటు  చూసినా నీ ప్రేమామృతమే!నాలో ప్రవహించే ప్రాణవాయువూ,నరాల్లో ప్రవహించే రక్తమూ .నీ స్నేహమే అంటూ నీకోసం నావొళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తు న్నా ననటం  బాగుంది !
💐


పిన్నక నాగేశ్వర రావు గారు :-
   అంశమే గానీ శీర్షిక లేదు 
       **************
బిడ్డలపుట్టుకకోసం...తల్లిదండ్రులు, సహాయoకోసం... నిస్సహాయులు,ఉద్యోగాలకోసం....నిరుద్యోగులు,లాభాలకోసం వ్యాపారులు పరీక్షా ఫలితాలకోసం విద్యార్థులు !పోటీ ఫలితాలకోసం కవులు 
నిరీక్షిస్తుంటారని 4 తేట గీతులలో... కవిత్వీకరించారు బాగుంది !
💐


దారల విజయకుమారి గారు :-
       @ ఎడబాటు @
          *********
ప్రేయసి తను ఎడబాసిన ప్రియునికై పరితపిస్తూ నిరీక్షణ !
నామనోపక్షి నీకోసం ఊహలతో అలసి సొలసిపోతోంది !నీకోసం నా వెతల గుండెను పరుస్తాను 
నీ జ్ఞాపకాలతో గాలిలో నీ అడువులసవ్వడి గుర్తు పడతాను అంటూ... నీవెచ్చని మదిలో చొరబడిపోయే రోజుకోసం ఈ ఎద దారి కాసే ఉంది... ఎప్పుడొస్తావంటూ నిలదీయటం... బాగుంది !
💐


సింహాద్రి వాణి గారు :-
         *  నిరీక్షణ  *
        *************
చేసిన పనికి ఫలితం దక్కుతుందన్న నమ్మకంతో... 
ఆ ఫలితం తెలిసే వరకూ... 
ఆ నిరీక్షణలో... నరాలు తెగిపోయే ఉత్కంఠ !
సీత, ఊర్మిళ, శకుంతల.... 
యే కాలంలోనైనా... యే విష యం లోనైనా... నిరీక్షించటం సహజమే అంటున్నారు బాగుంది.... !
💐

బొప్పెన వెంకటేష్ గారు :-
  * నిరీక్షణా. నిట్టూర్పు లో *
      *****************
పల్లెల్లో బ్రతుకులు లేక... 
వలసలు పోయిన వైనం... 
పల్లెలలో... తాండవిస్తున్నకరువు !
చెట్టుకో పిట్టగా... చెదిరిపోయిన కుటుంబాలు !
అప్పులు.... అశలు.... 
చీకటిని చితి చెయ్యాలని... వేకువను చూడాలని... పల్లె నిరీక్షణ... ఇందులో నిరీక్షణ కంటే... ఆవేదనే ఎక్కువుంది బాగుంది !
💐


కవిత వెంకటేశ్వర్లు గారు :-
           # నరకం #
        #########
నిరీక్షణ కుండాలి ఓర్పు - నేర్పు 
జరుగ వచ్చును మాఫ్పుల కూర్పు... విద్యార్థుల ఉద్యోగుల 
పరీక్షలు -ఇంటర్వ్యూ లు... బస్సులకై ప్రేమికులు ఒకరి కొరకుఒకరు...ఎదురుచూపులు
ఇలా అన్ని విషయాల్లోనూ ఈ ఎదురుచూపుల్లో ఉండడు సుఖం అంటున్నారు !బాగుంది.
💐

మద్ది పుల్లారావు గారు :-
     * తేటగీతి పద్యాలు *
        **************
మనసు లొకటైన తరువాత ఒకరికొరకు ఒకరి నిరీక్షణ క్షణమొక యుగంలా సావుతుందని.... 
ఆ విరహ బాధ ననుభవిస్తూ 
వెర్రివారై పోతారని... 
ఆ నిరీక్షణను భరించ తరమా.,
అంటూచక్కని  తేట గీతులలో 
కవిత్వీకరించారు! బాగుంది.
💐


దార స్నేహలత గారు :-
           *  నిరీక్షణ *
        *************
కవితమొత్తం... స్త్రీ... కష్టాలు 
అసమానత్వం అవమానాలు పురుషాధిక్య బేషజాలు అత్యాచారాలు... అందమైన పదబంధాలకవిత్వీకరణ అంతా బాగుంది
💐
కానీ... అసలు విషయాన్నసలు పట్టించుకోలేదనిపించింది.


ఆళ్ళ నాగేశ్వరరావు గారు:-
          * నిరీక్షణ *
         ***********
బాల్యంనుండే... నాన్న ఏమి తెస్తారో... అమ్మ ఏమిదాచి
ఇస్తుందో...అని ఆశగా ఎదురుచూడటంతో మొదలై 
జీవితంలో... ఎన్నో విషయాలకు నిరీక్షణ... ఆఖరికి 
వృద్దాప్యంలో... కూతురు, అల్లుడు... ఏమి తెస్తారో ఏమి ఇస్తారో అని ఎదురు చూపులే 
ఆప్యాయతానురాగాలే చేతులు మారాయి...అప్పుడూ  ఇప్పుడు... ఎప్పుడూ  నిరీక్షణ తప్పదు అంటున్నారు బాగుంది !
💐

సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 
            *  నిరీక్షణ  *
        ***************
నిరీక్షణ లో... మనిషి దుర్బలతపై సవాల్ విసిరినట్టు 
విసుగూ విరామం లేకుండా... 
నిర్వికారంగా కాలం కొన్నిసందర్భాలలో కరిగి పోదు 
కనికరం లేకుండా దహిస్తుంది !నిరుద్యోగ బతుకులపైస్వారీ చేస్తూ...భారంచేస్తుంది... 
కసాయితనం... తీపిదనం రెండూ నిరీక్షణలో భాగాలే... 
బాగుంది !
💐

సింగీతం సంతోష్ కుమార్ గారు  :-  శీర్షిక లేదు 
      **************
పరీక్ష ఫలితంకోసం... మొక్క ఎదుగుదల కోసం... రైతు పంటకోసం... ఫాల్గుణం చైత్రంకోసం... ఆమని కోకిల కోసం వేసవి మృగశిరకోసం... 
ఒక్కొక్క విషయానికీ ఒక్కొక్కరు నిరీక్షిస్తారని వ్యాసం లాగా చెప్పేసారు.... కొంచం కవిత్వీకరణ శ్రద్ద పెట్టి ఉంటే బాగుణ్ణు... !
💐


బాలు కత్తుల  గారు :- నిరీక్షణ 
        **************
ప్రేమంటె.... అంటూ  ప్రేమను వివరిస్తూ కేవలం ప్రేమకే ప్రాధాన్యత నిచ్చి... నిరీక్షణలో నిజమైన ప్రేమ మరణం లేని మాధుర్యం ప్రేమ అని ప్రేమను ఏకరువు పెట్టటంతోనే సరిపెట్టేసారు !
💐


ఇంద్రావత్ రాహుల్ :- మౌనం 
      **-***--*--********
పోటీకి సంబంధం లేని కవితను పోస్ట్ చేశారు !
కవిత్వీకరణ బాగుంది
💐

కానీ 
అసలు విషయాన్ని విస్మరిస్తే ఎలా !?


గొర్రెపాటి శ్రీను గారు :- 
          శుభ వేళ 
       ************
 ప్రేయసితో తన అనుభవాల జ్ఞాపకాలన్నీ ఏకరువు పెడుతూ 
వియోగ శృంగార విరహ ప్రకృతి వర్ణన తన నిరీక్షణంతా ప్రేయసికోసమే
💐

అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు :-  * ఎదురు చూపులు *
      *****************
బాల్యము, విద్య, ఉద్యోగమూ 
ఇన్ని ఎదురుచూపులతరువాత 
మాతా, పితరుల వియోగ బాధలు... అన్నిటినీ తట్టుకుని భార్యా పిల్లలతో ప్రశాంతంగా గడపాలనుకుంటే భార్య కాలధర్మం గీతాసారంతో జ్ఞానోదయం.... నిరీక్షణాల కన్నా... వేదనలే ఎక్కువయ్యాయి.... !
💐


వనపర్తి గంగాధర్ గారు :-
         @ నిరీక్షణ @
      ****************
స్వతంత్ర భారతం లో... 
యువత ఆశలు నెరవేరుతా యని...నవసమాజ స్థాపన జరుగుతుందని... సమస్య  లన్నీ  సమసిపోయి... ప్రపంచంలో మన భారత దేశం 
అత్యున్నత స్థానం లో నిలుస్తుందని స్త్రీలు స్వేచ్ఛగా సుఖ, శాంతులతో బ్రతుకుతా రని... గాంధీజీ ఆశలు నిజమౌ తాయని... మధురమైన కలలతో సగటు మనిషి సుదీర్ఘ నిరీక్షణ అన్యాయం, అరాచకం 
అశాంతి లేని సమాజంకోసం 
నిరీక్షణ... నిరీక్షణ గానే మిగిలి పోయిందని...కవి... ఈ సమాజం పట్ల బాధ్యతాయుత ఆవేదనతో నిరీక్షణ... చాలా బాగుంది ! అభినందనలు !!
💐


అఫ్సరవలీషాగారు :-
    * మానవీయ స్పర్శ *
       *************
మంచి శృంగార భావ కవిత్వీకరణ... చక్కని పద చిత్రాలు... అన్నీ ప్రేయసికే 
పరిమితం !చివర "దేశ సేవకై ఉప్పొంగి పొర్లే నీ మానవీయ స్పర్శ కై...వేచి ఉంటా... 
ఎన్నాళ్ళైనా... ఎన్నేళ్ళైనా.. !"
వాహ్... !అభినందనలు !!
💐


వాణీ సరోజినీ లక్కరాజు గారు 
       * ఎదురు తెన్నులు *
          *************
చక్కని ఆటవెలదుల్లో.... 
సీతా వియోగం దగ్గరనుండి 
చూడామణితో హనుమ వచ్చేవరకూ... వర్ణించారు బాగుంది
💐

 కాకపొతే 
మనం పురాణాల పునాదులపై 
వర్తమాన సమాజాన్ని. లోపాల సవరణ తో చదును చేసుకుని భవిష్యత్ అద్భుత సమాజ నిర్మాణానికి మన సాహితీ వేత్తలం కృషి సలుప వలసిందే 
అక్కడితోనే ఆగకుండా


తాతపూడి సోమశేఖర శర్మ గారు :-  *ఎదురు చూపులు * 
       *****************
ప్రతి క్షణం మన జీవితం నిరీక్షణే నంటూ... పుట్టినరోజు నుండి... విదేశాల చదువులు ఊహించుకునే కలల సాకారంకోసం... చక్కనైన భార్యకోసం... నిరీక్షణే నంటారు 
బాగుంది !
💐


దేవికా రాణీ రత్నాకర్ గారు 
    * తూరుపు వాకిళ్ళలో *
        ***************
ప్రకృతే తానని.... ప్రకృతిలోని అన్ని అందాలనూ... తమకు ఆపాదించుకుని ఆ పారవశ్యంలో మునిగి పోయారే తప్ప... ప్రస్తుత వాస్తవ విషయాన్ని పట్టించుకోలేదు !
మీ కవిత్వీకరించగలిగే సామర్ధ్యాన్ని సామాజిక సాహిత్యం వైపు మళ్లించండి 
మంచి సాహితీవేత్త కాగలరు !

💐
****************
1
 
కావ్యగానం
బాద్రపదమాసం పౌర్ణమి నగదుపోటిలకు
అంశం:నిరీక్షణ
శీర్షిక:ఒక జీవితంకాలం....లేటేమో?!
ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు ఎంతో నిరీక్షణతో...
నిరీక్షణ ఫలించి ప్రేమపెళ్ళీ జరిగి అన్యోన్యదంపతులైయ్యారు...
అనురాగఫలం కడుపుపండింది...
అష్టకష్టాలుపడి గండంగడిచి పిండం బయటపడడానికి నవమాసాల నిరీక్షణ.....
నిరీక్షణఫలించి కండనుకొండగా చేయడానికి మళ్ళీ నిరీక్షణ....
నడకను నడతను నేర్పి మనిషిగా మలచి
మనీషిగా చేయడానికి మళ్ళీ నిరీక్షణ....
ఉన్నతచదువులు చదివించి ఉన్నతోద్యోగానికి
నిరీక్ణణ......
ఉన్నతోద్యోగంతోపాటు ఉన్నతకుటంబమునుండి
ఉన్నత అమ్మాయికోసం నిరీక్షణ....
విత్తునాటి మొలకలెత్తడానికి వానచినుకులకై రైతన్న నిరీక్షణ....
తనఘర్మజలాన్నిచిందించి కంపెని ఉన్నతస్థితిలోకెళ్తే
యజమాని ఇచ్చే బోనసుకోసం కార్మికుని నిరీక్షణ....
ఎన్నికలప్పుడు ఓట్లపండగయ్యాక ఫలితాలకోసం
రాజకీయనాయకుల నిరీక్షణ....
ఎన్నికఫలితాలలోఘనవిజయం పొందితే మంత్రపదవికోసం నిరీక్షణ....
పెట్టినపెట్టుబడికి రెండింతలు లాభాలకోసం వ్యాపారస్తుని నిరీక్షణ....
పాతిక సంవత్సరాలుగా కష్టపడి పనిచెసే చిరుద్యోగి
పదవోన్నతికై నిరీక్షణ.....
చిరుద్యోగంనుండి పదవోన్నతిపొంది ఇంకా పైస్థాయికై
పైరవిలుచేసే సోమరిపోతు నిరీక్షణ....
కరోనాబారినుండి తప్పించుకొని పూర్వపు ప్రశాంతజీవనానికై ప్రజలంతా నిరీక్షణ....
సరిహద్దులలోగస్తీతిరుగుతున్న సైనికదళాలు ఎదురుదాడికై నిరీక్షణ....
ఉగ్రవాద ఉచ్చునుండి బయటపడడానికి పేదదేశాలు
నిరీక్ణణ....
మతోన్మాదశక్తులనుండి తప్పించుకునేందుకు
మతసామరస్యుల నిరీక్షణ.....
అడవులసంరక్షణతో పర్యావరణపరిరక్షణకై
పర్యావరణవేత్తల నిరీక్షణ.....
ఉపాధికోల్పోయిన వలసజీవులు మళ్ళీ ఉపాధికోసం
నిరీక్షణ....
కన్నబిడ్డలు ర అనాదరణకు గురై జీవచ్ఛవాలైన
వయోవృద్ధుల చితికిచేరడానికి నిరీక్షణ....
ఈ నిరీక్షణ జీవితకాలం లేటు కాకూడదని
నిరీక్షణ....!

ఇది నా స్వీయరచన.కావ్యగానంపోటీలకై రాసినదని
హామి ఇస్తున్నాను.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి 7780594995.
2.
 అంశం: నిరీక్షణ 
శీర్షిక: నిరుద్యోగి నిరీక్షణ!
పేరు:ఎం ఆపరాజిత్ రెడ్డి 
ఊరు: సూర్యాపేట 
ఫోన్ నంబర్:9848532031

అర్డాకలితో నిరుద్యోగి 
క్షణం క్షణం లక్ష్యసిద్దికై 
చదివిందే చదువుతూ వ్రాస్తూ 
ఉద్యోగానికై పడే శ్రమ వర్ణణాతీతం 
పరీక్ష వ్రాసి నిరీక్షించి నిరీక్షించి,,,,,,,,,,!
ఫలితాల్లో తన పేరు లేదని తెలిసి 
రెండు కాళ్ల కింద భూమి బద్దలైనట్లు 
రెండు కనుగుడ్ల నిరీక్షణ కన్నీళ్ల పర్యంతమై,,,,,,!
జవసత్వాలుడిగి తూలుతు ఇంటిదారిపట్టి 
నిద్రరాకున్నా దుప్పట్లో కూరుకుపోయిన వైనం!
ఏం చదువులాయెరా నాయనా!?
ఈ చదువులు మాకొద్దు 
అంటున్న యువతరం!
ఆకలి దప్పికలు మరచి చదివిన చదువులు వ్యర్ధమై 
ఆశల నిరీక్షణలతో నలిగిపోతున్న యువత 
చిరుద్యోగానికైనా వెయిల మంది పోటీ!
మొక్కవోని దీక్షతో 
అలవిగాని చదువులు చదివి 
రాని కొలువులకై ఎందుకీ నిరీక్షణలు!
డబ్బున్న వాళ్ళకు అమ్ముడుబోయిన 
దివాలాకోరు దళారీ ప్రభుత్వాలు 
ఉద్యోగాలేం ఇచ్చి చావవుగాని 
నీ నిరీక్షణ నీరుగారి పోకముందే 
స్వయం ఉపాధి మార్గం చూసుకో!!
ఈ రోజుల్లో ఏపనీ నామోషీ కాదు!
నీ మనోనేత్రం తెరిచి 
ఇన్నాళ్ల నీ నిరీక్షణ నీ భుజస్కందాలపై తేలిపోనీ!
బ్రతుకు పుటలో కొత్త అధ్యాయం లిఖించు!

ఆపరాజిత్ 

హామీ: ఇది నా స్వీయరచన
3.

సింగీతం సంతోష్ కుమార్ గారు
**************
కవిత *
పరీక్షరాసిన విద్యార్థి ఫలితాలకొరకునిరీక్షణ మొక్కనాటినచో ఎదిగెవరకునిరీక్షణ... వరివేసినరైతుపంటవచ్చెవరకునిరీక్షణ ఫాల్గుణమాసం చైత్రం కొరకునిరీక్షణ ఆమనిలోకోకిలకూతకైనిరీక్షణ.. ఎండకాలంమృగశిరకైనిరీక్షణ ఎండినబీళ్ళువర్షం కోసంనిరీక్షణ ఆడపిల్లలుబతుకమ్మపండుగకోసంనిరీక్షణ మగవారుదసరాపండుగకోసంనిరీక్షణ... పేదవానికిపనికొరకునిరీక్షణ నిరుధ్యోగిఉధ్యోగంకొసంనిరీక్షణ ప్రతిపక్షంపాలనకోసంనిరీక్షణ......
4
ఆళ్ళ నాగేశ్వరరావు గారు
****************
కవిత *
శీర్షిక : "" నిరీక్షణ "" వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు నాన్న సాయంత్రం ఏమి తెస్తాడో ఇంటికెళ్ళే సరికి అమ్మ ఏమి తాయిలం చేసి దాచి పెడుతుందోనని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవాళ్ళు! నాన్న తెచ్చిన వాటిని తింటూ అమ్మ చేసి దాచి పెట్టి పెట్టిన తాయిలాన్ని రుచి చూసేప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించిన మెరుపులాంటి కాంతి మాకింకా బాగా గుర్తు! వాళ్ళు పెరిగి పెద్దయ్యారు ఇప్పుడు మేము వాళ్ళకి పెద్ద పిల్లలమయ్యాం కూతురే కోడలై అల్లుడే కొడుకైన వేళ అల్లుడు సాయంత్రం వస్తువస్తూ ఏమి తెస్తాడోనని కూతురు మధ్యాహ్న్నాం ఏమి చేసి పెడుతుందోనని నిరీక్షించే పనిలో మేమున్నామిప్పుడు! సాయంత్రం అల్లుడు తెచ్చినదానిని కూతురు చేసి దాచి పెట్టి పెట్టిన తాయిలాన్ని తింటున్నప్పుడు మా కళ్ళలో మెరిసెకాంతిని ఇప్పుడు వాళ్ళు వీక్షిస్తున్నారు! పిల్లలు పెద్దయ్యారు, పెద్దలం పిల్లలమయ్యాము ఆప్యాయతానురాగలే చేతులు మారాయి నిరీక్షించడం మాత్రం తప్పని సరైంది!
5.
20/9/2021/ సోమవారము
కవనజ్యోతి
పౌర్ణమినగదుపురస్కారాలకవితలపోటీ
భాద్రపదమాససందర్భంగా
అంశం:- " నిరీక్షణ "

ఎదురుచూపులలోన  యెంతనానందము
నీనిరీక్షణలోన  నిజము నెరుగు

కార్యముసాధించ  కాస్తంత వోపిక
యెదురుచూపులలోన  నంతదొరకు

ఎదురుచూసినదంత  యెదురుగవచ్చిన
సంతోష మెంతయో  సంత రించు

పిల్లలరాకకు  ప్రీతిని చూపెడి
నానిరీక్ష నెరుగు  నంతదెలియు

ఆ! ఆత్రతంతనణచ  ననువుగనుండదు
జీవనమునకదియె  జీవగర్ర
యెదురుచూపులందు  యేదోతెలియనినా
నందమంతదొరకు  నవనిలోన!
                (2 )
ఆ!  నీవెపుడునిరాశ  నిసృహలబడకుండ
నాశతోడనుండు  ననవరతము
మహిని వెలుగు జూపు  మనుజులబ్రతుకులు
నాశయున్నచాలు  నవనిలోన!
          తరణికంటి సూర్యలక్ష్మి.
                       ----------
6
భాద్రపద మాసం పౌర్ణమి కవితలపోటీ కోసం కవిత
అంశం : నిరీక్షణ
శీర్షిక : ఎదురు తెన్నులు
అంతర్లీనంఆనందంనిరీక్షణలో
ఫలించిన ఎదురుతెన్నులు
కలిగించే ఆనందం
అపురూపం, అనిర్వచనీయం
అద్భుతం, అనుభవైకవేద్యం
కలువలరేడుకై ఎదురుతెన్నులు చూస్తోంది కలువభామ
వళ్లంతా కన్నులు చేసుకుని
నిరీక్షిస్తోంది తనవలపుల రేడికై
కలువకన్నుల కలువభామ 
సింగారాలు సంతరించుకొని
సిగ్గుల మొగ్గై
వయ్యారాలు  ఒలకబోస్తూ 
చిరునవ్వులు చిందిస్తూ 
ఎదురుతెన్నులు చూస్తోంది
పరితపిస్తోంది తన రేని
చల్లని  చూపులకై
వెన్నెల రాసుల్లో జలకాలాడాలని 
అమృతకిరణాల దృక్కులలో కరిగిపోవాలని
తహతహలాడుతోంది
కలువభామ
శీతలకిరణునితో
సరససల్లాపాలాడాలని
సిగ్గులమొగ్గై అరుణపుకెంపై
శ్వేతాంబరధారియై 
పచ్చల ముత్యాల  హారాలతో
తన వెలుగుల వెన్నెల రేని
పరిష్వంగానికై
పలవరిస్తోంది మనసు
కలవరిస్తోంది ఎద
తలపులకే పులకరిస్తోంది
దేహం
సాగుతోంది  కలువలరే
డిరాకకై
కలువభామ నిరీక్షణ
ఎవరి నిరీక్షణ అయినా పొందే అనుభూతి ఇదే.

పేరు: డా.భమిడిమఱ్ఱి కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
చరవాణి : 9871096566

హామీ : పైకవిత నాస్వంతం. అనుకరణ, అనువాదం కాదు.
7.
*కవితా గానం సీజన్ 2, ప్లవనామ సంవత్సరం భాద్రపద మాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితా పోటీ కోసం*:
అంశం: నిరీక్షణ
ప్రక్రియ: వచన కవిత
కవి పేరు: నాశబోయిన నరసింహ (నాన)
ఊరు:చిట్యాల, నల్గొండ జిల్లా
చర వాణి:9542236864
⚜️⚜️⚜️⚜️⚜️💘⚜️⚜️⚜️⚜️⚜️

*నిఖార్సైన తిరస్కారం*
"""""""""""""""""""""""""""""""""
ఒకప్పుడు...నీ జ్ఞాపకాల జాడ కోసం                     
విశ్వమంతా వెతుకుతూ  
అణువణువు గాలించినా 
ఉనికి కానరాక ఊహల్లో తేలిపోతూ... 

అప్పుడప్పుడు...నీ అందెల సంగీతం 
వంపు సొంపుల వయ్యారం నీలి కురుల సాహిత్యం 
నా అం'తరంగ శ్రోణి ద్రోణుల పరంపర 
అలజడి బీజమై అంకురించినా 
నా ఎదలో సం’వేదన దాచుకుంటూ... 

నా ఆరాధన నివేదన 
నీ నిర్మల మౌన రాగాన్ని ఆటంక పరిచినా 
నా సప్త వర్ణాల ఇంద్ర చాపమా!
శరత్ చంద్రిక జలపాతమా! 
ఆనాడు నీ మది తీరం తాకని కెరటాన్ని !
నా మనోహర సంధ్యా స్వరూపమా! 
నిఖార్సైన నీ తిరస్కారమే నా విజయానికి శ్రీకారం!

అలనాటి... నీ ప్రేమ అసమ్మతి తాకిడి 
నా మది నిద్రావస్థను జాగృత పరిచి
కఠోర సాధనా వృక్షమై ఉన్నతంగా ఎదిగి    
స్వప్న సౌధం సాకార మైనందుకు                                  
ఇదిగో... నీ ఆగమనం కోసం కోటి కళ్ళతో   
నిరీక్షించే ప్రేమ సమీరాన్ని చేరుకో !  
🌀🌀🌀🌀🌀♦️🌀🌀🌀🌀🌀
హామీ పత్రం: ఈ కవిత నా స్వీయ రచన. దేనికి అనువాదం,అనుసరణ కాదనీ హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు.
✍️నాన
 8.
కవితా గానం (సీజన్ -2) అంశం: నిరీక్షణ శీర్షిక : శుభవేళ రచన :గొర్రెపాటి శ్రీను * శుభ వేళ * వెన్నెల రాతిరి వేళ.. సాగర తీరాన కూర్చుని..చెప్పుకున్న కబుర్లు జ్ఞాపకం ! చేతులలో చేతులు వేసుకుని .. అడుగులలో అడుగులు కలుపుకుని.. ఒకరి వెనుక ఒకరం నడిచిన మధుర జ్ఞాపకాలు హృదయం లో పదిలం ! చిరు చిరు ఆశలు మదిలో మెదిలే వేళ.. మన ఇద్దరి హృదయాలు పంచే స్పందన లు.. ఒక్కటే అని తెలిసిన వేళ.. ఇదే కదా ప్రేమంటే అనుకున్న ఊసులెన్నో జ్ఞాపకం ! కురుస్తున్న వర్షం లో ఒక్కటిగా తడిసి ముద్దవుతూ.. ఆనందించిన రోజులు ఇప్పటికీ జ్ఞాపకమే ! చేరువ అయినట్లే అయి... అంతలోనే దూరమయ్యావు.. వేదనా భరితమైన ఈ హృదయం.. నీ రాకకై నిరీక్షిస్తుంది ప్రియా ! కానీ.. మదిలో ఏదో మూల చిరు ఆశ..నువ్వొస్తావని..! తిరిగి సంబరాల హేల ను పంచుతావని ! ఒంటరిగా.. సాగర తీరాన కూర్చున్నప్పుడు.. ఎగసి పడే కెరటాలు.. నీకై నేను కన్న కలలని తిరిగి తెస్తున్నాయి..! అల్లరిగా చుట్టేసే.. చల్లని చిరుగాలులు.. నీఊసులనే వెంటేసుకుని వస్తున్నాయి ! వెన్నెల ఱేడు నా వైపు చూస్తూ.. మన ప్రేమ సఫలం కావాలన్నట్లు గా దీవిస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. సాగిపోతున్నాడు ! కలలు.. ఆశలన్నీ నిజమవుతున్న .. తొలిపొద్దు ల వేళ.. వికసిస్తున్న రవిబింబం.. మంచు తెరలను తొలగించుకుంటూ వస్తున్న ఉషోదయ ఉదయాల సమయాన.. మల్లెల గుభాళింపులు.. పారిజాతాల పరిమళాలు.. సంపెంగ ల సువాసనలు.. నీ రాకను సూచిస్తున్నాయి ! నా నిరీక్షణ లన్నీ ఫలించిన శుభ వేళ.. కన్నుల ముందు అస్పష్టంగా సాక్షాత్కరిస్తున్న నీ రూపం.. నువ్వు నా దగ్గరకే వస్తున్నావని.. తెలుపకనే తెలుపుతుంది...! "శుభ వేళ " అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను. _ గొర్రెపాటి శ్రీను ( హైదరాబాద్
9.
కవిత *
నిరీక్షణ ప్రేమంటే.... హరివిల్లు రంగుల వలే భావాలు లోలికిస్తుంది సప్త స్వరాలు వలే కోటి రాగాలు పలికిస్తుంది వెయ్యి వేణువుల బలాన్ని చేకూరుస్తుంది తన మాటే బలాదూర్గా వినిపిస్తుంది వేదంగా అనిపిస్తుంది ఎక్కడ ఉన్న ప్రేమించిన వ్యక్తి కళ్ల ముందే కదులుతున్నట్టు ఊహల్లో తెలియాడుతూ తనలో తాను భ్రమిస్తూ.. పది మందిలో ఉన్న ఒంటరి తనం కోరుకుంటూ.. తుల్లి పడుతూ తనలో తాను నవ్వుకుంటూ... నిశ్శబ్ద విప్లవంగా మారుస్తుంది ప్రేమ.. తనువులు కలుస్తేనే కాదు ప్రేమ మనసు కలుస్తే ప్రేమ దూరంగా ఉన్న ఆలోచన ఒక్కటే ప్రేమ యేండ్లు గడుస్తున్న ఎదురు చూపులొనే మధురమైన ప్రేమ నిరీక్షణలో నిజమైన ప్రేమ మరణం లేని మాధుర్యం ప్రేమ బాలు కత్తుల 9676219655
10.
అంశం..నిరీక్షణ శీర్షిక.. ఎదురుచూపు ప్రతీ క్షణం మనజీవితం నిరీక్షణే ప్రతీ రోజూ ఏదోఒక పని కోసం నిరీక్షణే ప్రతీ మాటలో ప్రతీ కదలికలో నిరీక్షణే ప్రతీ విషయానికి ఎదురుచూసే నిరీక్షణే పుట్టినరోజు రోజునుండి పాలకోసం ప్రేమగా ముద్దాడే అమ్మ లాలన కోసం పెద్దలు చేతులతో ఎత్తుకునే ఎత్తుకొసం ప్రియమైనబొమ్మలుఇస్తేఆడుకుందుకు ఆటకోసం ప్రతీ సెకను ఎదురుచూపే .... నిరీక్షణే.. పెద్దయాక పలక బలపం కోసం పుస్తకం కలము బ్యాగుల కోసం పక్కింటి మిత్రునిలాంటి బట్టలకోసం ప్రేమగా నాన్న తెచ్చే మిఠాయిపొట్లంకోసం ప్రతీ నిముషం ఎదురుచూపే.. నిరీక్షణే.. చదువుల ర్యాంకుల విజయాలకోసం చలించే విదేశాలలో చదువులకోసం చంద్రబింబంలాంటి క్యాంపస్ సెలక్షన్ కోసం చందన పూరితమైన భార్యామణి కోసం చల్లనైన ఎదురుచూపే... నిరీక్షణే ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
 తాతపూడి సోమశేఖర శర్మ, యానాం 
11
గంగాపురం శ్రీనివాస్
జిల్లా *
సిద్దిపేట
సమూహం *
కవితా గానం
ఫోన్ నెంబర్ *
9676305949
కవిత *
కవితా గానం సీజన్ 2

బాద్రపద కవితల పోటీ కొరకు

కళ్ళగంతలు

'చైత్ర' పు మొగ్గ విచ్చుకోకముందే
తుచ్ఛపు చూపులు గుచ్చుకొనె
అరేళ్లకే నూరేళ్ళ ఆరళ్ళు అల్ముకొని
'ఫాల్గుణ' ప్రస్థానం పూర్తి చేసుకునె

నిర్భాగ్యులు 'నిర్భయం'గా బత్కల్నాని
దిక్కు లేనోళ్ళకు 'దిశా' నిర్దేశం కావాల్నని
పటిష్ట చట్టాల పట్టాలేసినా...
పట్టాలు దాటిన పొట్టేళ్లు కుమ్మవట్టే!

గంజాయి పొగను ఎంజాయి చేస్తూ
మందు, మత్తుమందుకు చిందేస్తూ
అరటాకులు, పండుటాకుల్నే కాదు,
చిగురుటాకులనూ చిదిమేస్తున్నారు!!

అద్దుమరాత్రి ఒంటరి నడకలేమోగని
నట్ట నడిపొద్దున నగరం నట్టింట
సూర్యుడి 'నిఘా' కళ్ళకు గంతలు కట్టి
మైకపు గుంతలో మాయా నృత్యం!

సమస్య సమసిపోవాలని మసిపూసి,
గాయం ఒకచోటైతే వార్తాగానం మరోచోట
చిత్కిన బత్కుల కుత్కెలు పిస్కిన
పంజాల పాతరకై యుగాల నిరీక్షణ!

'రాజు'ల నెత్తిన మొలకెత్తిన
మోజుల బూజులు దుల్పకుండా
రాణుల గదుల గోడలు మెర్వవు,
గుడ్శెల మొల్శిన పొక్కిలి నున్పెక్కదు!!
12.
ఇంద్రావత్ రాహుల్ గారు

నిరీక్షణ మౌనం🌹

అనంతమైన తలపులు ఎన్నో.. మదిలో   సుడిగుండాలయి సుడులు తిరుగుతున్నా....

చిరునవ్వుకవి దాసోహం.. 

నిశ్చలంగా, మౌనముగా వుండటం  పరిపాటి.. 

ఓ..పూదోయి ... 
చరిస్తూనే 
వుంటుంది మౌనం...
 దానికెన్ని   ఊహల సౌరభాలో ...

మౌనానికెన్ని వేకువలో  నిద్రలేమికెర్రబడుతూ... 
ఉఛ్వాస నిచ్వాస మద్య నలిగిపోతూ..
 ఆకృతి కోల్పోతోంది మౌనం...

మాటల ఆకులను రాల్చుతోంది మౌనం మోడయి..

 చిగురించాలని
మనసుకి పరవశమే
మౌనపు కన్నీళ్లను ఒత్తుకుంటూ..

మౌనం మనుష్యులను     
 మనసులను కలుపుతాయి...
ఆఖరి శ్వాస వరకు
 కలిసుండాలని
ఇది లిఖితమే తదా...
13.
దార. Snehalatha
జిల్లా *
పెద్దపల్లి 
సమూహం *
కవితా గానం సీజన్ 2
ఫోన్ నెంబర్ *
9849929226
కవిత *
కవితా గానం సీజన్ @2
అంశం : నిరీక్షణ
శీర్షిక : ఫలించేనా నిరీక్షణ

అనాది నుండి ఆమె నిరీక్షణలు
ఆకాశంలో  అర్ధభాగవు విహంగాలు
ఐనా పంజరానా బంధించే చిలుకలు

తల్లిదండ్రుల ఒడిలో పసిప్రాయం 
చదువుల పేరున ఉన్నత ఉద్యోగాలు
ఔనానిపించేంత ముందరికాళ్ల బంధనాలు 

యుగాల నాటి అసమానత్వం
తరాలనాటి పాతుకుపోయిన వివక్ష బీజం
ఇంకెన్నాళ్ళు సమానత్వనిరీక్షణల నిర్వేదనలు

ఆమె అంగడిలో ఆటబొమ్మగా
చిత్రిస్తూ విలువల వలువలు
తెంచేస్తున్న పురుషాధిక్యపు భేషజాలు
పెంచుతున్న అత్యాచార ఘటనలు
అంతమయ్యే కాలానికి వేచి చూసే
నిరీక్షణ ఫలిoచేనా...

అమ్మ కడుపున పుట్టి
అమ్మ పాలు తాగి
రొమ్మునే చీల్చు మానవ మృగాలను
మట్టుబెట్టే కాలం ఆసన్నమైంది
ఎవరికి వారే రక్షక బటులై 
దానవుల పాలిట రాసిన ముగింపుకాలం
రక్షణాస్త్రమైన మృత్యుశాసనాలుగా...
ఫలించేనా నిరీక్షణ.... స్వీయ రక్షణగా...

హామీ : ఇది నా స్వీయ రచన. ఎక్కడా పోస్ట్ చేయబడలేదు.

పేరు : దార. స్నేహలత
ఊరు : గోదావరిఖని
జిల్లా : పెద్దపల్లి
14.
సయ్యద్ జహీర్ అహ్మద్ గారు

నిరీక్షణ:
వేయి జన్మించారు ఋణబంధమేమో
నిరీక్షణ వీక్షకులు పాలిట కాలంలో సంబరం
నిరీక్షణ పత్రం మీద నిఖార్సైన రాతలు
సహనపు సంతకాలతో కూడిన బహుముఖ
వీచికలు భ్రుకుటి మీది ముడత రేఖలు
మాట నిలకడ కోసం మనసుపెట్టే
మధురమైన తేనె ఊటలు
ప్రవర్తన పల్లకి మోత పరీక్షించినట్టు
ఎంతకీ పొద్దుపొడవని ఏకాంత తత్వము
మనిషి దుర్బలత్వంపై సవాల్ విసిరిన ట్టు
నిరీక్షణ ఎండలో వేడెక్కిన కొవ్వొత్తి వెలిగినట్టు
విసుగూ విరామము లేకుండా నిర్వికారంగా
కాలం కొన్ని సందర్భాల్లో కరిగిపోదు
కనికరం లేకుండా దహిస్తుంది
నిలుచున్న చోటు గొంగళి పురుగులాగనో
తేబేలు నత్తలాగనో చిన్నగా కదులుతూ
నిట్టూర్పుల ను ఆవిరిగా మార్చి
వంచన వంహశం చేస్తుంది
అది ప్రేమైక జీవితంలోనూ 
నిరుద్యోగ బతుకులుపై స్వారీ చేస్తూ
బతుకు భారం చేస్తుంది
అదే నిరీక్షణలో కషాయితనం తియ్యతనము!
15.
[10:33 pm, 26/09/2021] Veera Gudipally: వనపర్తి గంగాధర్
జిల్లా *
హన్మకొండ
సమూహం *
కవితా గానం సీజన్ 2
ఫోన్ నెంబర్ *
9440146435
కవిత *
75 వసంతాల స్వతంత్ర భారతంలో
యువత ఆశలు నెరవేరుతాయని
వారి జీవితాల్లో వెన్నెలలు వికసిస్తాయని
సమ సమాజ స్థాపన జరుగుతుందని
ప్రతి హృదయం ఆశతో నిరీక్షణ...

నిరక్షరాస్యత,పేదరికం
పెరుగుతున్న జనాభా,నిరుద్యోగం
సమసిపోయి ప్రపంచాన మన దేశం
ఉన్నతమై నిలుస్తుందని
సగటు భారతీయుడు అసహన నిరీక్షణ...

స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగే రోజోస్తుందని
స్త్రీ ఆట బొమ్మ కాదని,శక్తి స్వరూపినని
దేవతా రూపమని కొలిచే రోజోస్తుందని
అహింసా మూర్తి గాంధీజీ ఆశలు నిజమౌతాయని
మధురమైన కలలు కంటూ నిరీక్షణ...

హత్యలు,అత్యాచారాలు,అక్రమాలు
దోపిడీలు,హింసలు, దౌర్జన్యాలు 
లేని అహింసల శాంతి నిలయం
మన భారతదేశం అవుతుందని
ఎన్నో ఏళ్ల ఆనంద నిరీక్షణ...

ప్రజలకు సేవ చేసే పాలకులు
లంచాలు తీసుకోని అధికారులు
కల్తీ లేని నిఖార్సయిన సమాజం
అవతరిస్తుందని ఓ నమ్మకం
సుదీర్ఘ కాలంగా  అభివృద్ధి చెందుతూనే ఉన్నా దేశం
అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని
ఓ అపనమ్మకపు అసత్య నిరీక్షణ...

ఈ కవిత నా స్వీయ రచన
16.
కొంపెల్లి రామయ్య గారు

అంశం: నిరీక్షణ
శీర్షిక:నీ స్నేహం...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం
నీ  స్నేహం కోసం ప్రతి క్షణం
నిను చూసిన మరు క్షణం
నీ సుందర  చిరు దరహాసం
చూడని ఆ మధుర క్షణం
నా మనసు ఆగదు మరోక్షణం
అందని నింగి నేలా స్నేహానిగా
అనుకొన్న రోజులలో
నీ స్నేహం కోసం వెతకాడే ప్రతి క్షణం
ఎటు చూసినా నీ ప్రేమామృత రూపం 
నా హృదయ స్పందనలో 
నీ నామ స్మరణం
నా హృదయ దమనుల్లో  ప్రాణ వాయువై 
నా నరనరాల్లో ప్రవహించే  స్నేహ బంధ రుధిరమై
నా దేహమంతా నీవై
నీతో స్నేహం హృదయానందమై
నా గుండె గుడిలో నిదిరించే చెలియై
ఎన్నడు వీడని స్నేహ సుగంధానివై 
నీ సుకుమార మనసు కోవెలలో చోటుకై
నా కంటిలో  వెలిగే నీ ప్రతి బింబ జ్యోతినై
వేచి వుంటా నీ రాకకై ప్రతి క్షణం
నా కాయం నిండా కళ్ళు చేసుకొని
జన్మ జన్మల  నిరీక్షణ తో
నా ప్రాణం లో ప్రాణమై....

హామీ పత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
17.

మద్ది పుల్లారావు గారు

....
తేటగీతి పద్యాలు
----------
1)
మనసులొక్కటైనట్టి ప్రేమైక జనులు
క్షణమొక యుగముగ నిరీక్షణల తోటి
విరహ బాధననుభవిస్తు వెర్రి వారై
స్వప్న లోకాల నిజముగ సంచరించు

2)

నరకమగునెడబాటు ధీనమగు బ్రతుకు
విసుగధికమగు సంతోషమీడిపోవు
వలచిన మనిషి కొరకై తపమధికమగు
రాగజీవులకిదియె మరణ సదృశము

3)

ప్రణయమేమొగాని మదిన ప్రళయమొచ్చు
చిక్కి శల్యమై గోల్పోవు జీవ కళను
ప్రేమ గీతాలు పాడేరు పిచ్చి ముదిరి
గుండె దిగులుజెందునకటా! కూర్మి మీర

4)
బాష పలుకలేరు తెలుప భావములను
నిజ నిరీక్షణ లోకాన నిలుప త‌రమె
ఎదురు చూపులలోయున్న దెంత హాయి
మధురబావ నిరీక్షణ మనసుకెరుక

5)మోహ భావాలు పొడజూపు మోములోన
ఆకలియు,నిద్ర,దప్పికలాగిపోవు
అనుభవించిన వారికదర్దమగును
రేయి,పగలు భేదములన్ని రిక్తమగును

6)
కళ్ళు రెండు కావవిదెల్ప కనులు వేయి
తలపులు తరుముచుండును తరచుగాను
దూరమగుటలు వారికి ధోషమగును
చిత్తమంతగుబులగును చింత వలన
...
ధన్యవాదాలు
18.
అంశం: నిరీక్షణ
శీర్షిక: తూరుపు వాకిళ్ళలో......
***************
నిశిరాతిరి దాచుకున్న రెప్పల నిదురమ్మ నై....
మెలకువ రాగాల కై తూరుపు వాకిళ్ళలో సంధ్యా కెంజాయ లొలుకు మందారపు మొగ్గనై....
మంచు చినుకు రాలు వేళ విచ్చుకునే మల్లికనై....
లోయలోకి ప్రవహించే జలపాతపు నీటినై...
వసంతాన చిగురించే శిశిరపు తొలి మోడు నై...
అమృతాల చిగురు మేసి కొత్త పాట అల్లుకునే కోకిలమ్మ వై నాకై... కబురు మోసుకొస్తావని...
నీకోసమే చూస్తున్నా....
ఆడపిల్ల సహచరి అని అందమైన అల్లిక యని
నీలాగే తానూ అని ఆమె నిండు మనిషి అని
వ్యక్తిగాను గుర్తిస్తూ.... ప్రేమతోను లాలిస్తూ....
స్వేచ్ఛా గౌరవ స్ఫూర్తి.. సమానమగు ప్రతిపత్తి
ఆమెకంటూ ఇవ్వాలని.... ఆడదంటే సుఖాన్నిచ్చు ఆటబొమ్మ కాదని... అందమైన మంచి మాట నా చెవిలో వేస్తావని..,.
పెడదారులు పడుతున్న యువత నడత మార్చే వని

తప్పిపోవు మార్గానికి చుక్కానివి అవుతావని

జీవన సుందర దృశ్యం అవలోకన గావించే చెరొక కన్ను మనమేనని......
ఇరు పెదవులు పలుకు పలుకు ప్రతి పాదపు నడక ఒడుపు ఒకటంటే ఒకటేనని...

మనసంతా అర్ణవంగ మలచుకుని చూస్తున్నా....

మానవతా విలువలకు హిమాలయంనీవైతే....

కరిగే నీహారిక నై నీలోనే నేనుంటా.....

రచన: కే దేవికారాణి రత్నాకర్ తెనాలి.
19.
శీర్షిక... ఎదురు చూపులు
********
ఓ ప్రియా నిరీక్షిస్తున్నా
నీ జ్ఞాపకాల లోకంలో ఒంటరిగా....!
ఓ తుంటరి పనుల తూనీగ
నా కొంటె చూపుల కోణంగీ

వలపు తాపమెంతో మదినిండా రగిలించావు
మధుర ప్రణయ మధువు పీకల దాకా తాగించావు
ఎదని దున్ని మరులే మేను నిండా పండించావు
మదిని దోచి ప్రేమపిచ్చి ఒంటినిండా దట్టించావే

ఎక్కడికెళ్లావు ఏమైపోయావు
ఎచ్చట వెదకాలి ఏమని చెప్పాలి
ఎవరు కనపడినా నువ్వే తలపించి
ఎదురు చూస్తున్నా ఎదురొస్తావని

అడుగు తున్నా రాయిని రప్పను
నీ జాడేదని
చెట్టుచేమ పుట్టాగట్టు కొండాకోనల
దారులలో నీ అడుగుల ఆనవాళ్ళకై
వెతుక్కుంటూ వెళుతున్నా నీవెదురొస్తావని

ఆకురాలు సవ్వడిలో నీ అలికిడి వినిపించే
కోయిలమ్మ పాటలోన నీ పాటే వినిపించే
దూకుతున్న జింక లోన నీ వగలే కనిపించే
పారుతున్న వాగు లోన నీ హొయలే కనిపించే

సోలిన నా కన్నీటి దారలా చెక్కిలి పై
నునువెచ్చగా జారుతావని
నీ మేని సుమ సుగంధ పరిమళాలు 
నా చుట్టూ పరిభ్రమిస్తాయని
నీ కొరకై ఎదురు చూస్తున్నా ....‌‌..!!!

స్వీయ రచన :::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
22092021.

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...