Skip to main content

సన్మానం 2021

నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*****************************
కవివరుల జాబితా
1.కోరాడ గారు
2.దోసపాటి వెంకటరామచంద్రరావుగారు
3.తాతపూడి సోమశేఖర శర్మ గారు
4.పిన్నక నాగేశ్వరరావు గారు
5.ఆర్. వి. వి. రాజా, శృంగారాయునిపాలెంగారు
6.డా.ఆంజనేయులు గారు
7.సునంద వురిమళ్ళ గారు
8.కవిత వెంకటేశ్వర్లు గారు
9.గొర్రెపాటి శ్రీ ను గారు
10. జక్కిడి వెంకట్ రెడ్డి గారు
11.తరణికంటి సూర్య లక్ష్మి గారు
12.సయ్తద్ జహీర్ అహ్మద్ గారు
13.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
14.సునంద వురిమళ్ళ గారు
15.మోత్కూరి బ్రహ్మా-ఆచార్య గారు
16.ఆపరాజిత్ గారు
17.తంగిరాల నాగలక్ష్మి గారు
న్యూజిలాండ్
18.దారల విజయ కుమారి గారు
19.గజవెళ్ళి శ్రీ నివాసాచారి గారు
20.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
21.జోషిపద్మావతి  గారు 
22.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
23.డా.బల్లూరి ఉమాదేవి గారు
******************
1.
      "అత్యంత ప్రీతి కరం"
    కోరాడ నరసింహా రావు 
      ****************
సన్మానమంటే... ప్రతిభను గుర్తించటం... గౌరవించటం 
తగురీతిలో సత్కరించటం !
మరింత ఉత్సాహాన్ని పెంచటం 
మునుముందుకు నడిపించటం 
నిన్ను మరింత ఉన్నత స్థితిలో కూచోబెట్టే ప్రయత్న మే...
సన్మానమంటే.... !!

 నీ ప్రతిభను గుర్తించి నీకు జరిపించే సన్మానం... నిన్ను 
బాధ్యతాయుతుడ్ని చెయ్యాలే గానీ... నీలో అహంకారాన్ని పెంచిందా...., ఇంతకాలమూ అవిశ్రాన్తంగా నువ్ చేసిన... 
పరిశ్రమా ఫలం  కుళ్ళిపోయి 
దుర్గంధ భరితమై... నువ్వనుభ వించి ఆనదించలేకుండా చేసే స్తుంది సుమా .... !!

సన్మానమంటే... అంతెత్తున నిన్ను నిలబెట్టటం !
అప్రమత్తుడవై నిలబడి మరింత ఎత్తుకు సాగే ప్రయత్నం నువ్ చెయ్యాలి !
గర్వం నీలోఏమాత్రమైనా  ఎమరుపాటును కలిగించిందా.,అదఃపాతాళమే !

అపాత్రులకు సన్మానం... 
సన్మానానికే అవహేళనం !
పాత్రత కలిగిన వారిని ప్రక్కకు తోసేయటంకన్నా...అవమానం 
మరోటుంటుందా... !?
ఆతల్లి ఆమోదిస్తుందా !?
ఆనందిస్తుందా... ?!
సన్మానం చెయ్యటమంటే కళామ తల్లిని ఆరాధించటం !
నిష్పక్షపాతనిర్మలహృదయులు 
జరిపే ఆరాధనే... ఆ అధి దేవతలకు అత్యంత ప్రీతికరం!!
      *****************
        ....... కోరాడ.
2

అంశం:సన్మానం
సన్మానం అదొక వ్యసనం
సన్మానం అదొక మానసికరుగ్మత
సన్మానం ప్రతిభకు పట్టాభిషేకం ఒకప్పుడు
రాయలకాలంకాదుగా ఇది
రాశిలేనివారికి జరుగేది
వాసితకక్కువవారికి చేసేది
చేసేదొకరు
చేయించేదొకరు
చేయించుకునేవారొకరు
అదొక వ్యాపారముడిసరుకుగా మారే
అదొక వినోదకార్యక్రమమైపోయే
వారినిచూచివీరు వీరినిచూచివారు
ఒకరికొకరు పోటాపోటీగా జరుపుతున్నారుగా
సమూహాలు ఏర్పాటు చేస్తున్నారుకదా
సన్మామనమంటే పడిచస్తారు ఎందరో
సన్మాము పొందినవారు కొందరే
సన్మాము పొందనివారు మరికొందరు
సన్మాము పొందలేనివారు ఇంకొందరు
సన్మాము వద్దనుకున్నవారు ఉన్నారేమో.

ఇది నా స్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి 7780594995.
3
 కవితా గానం
అంశం.. సన్మానం
శీర్షిక.. ప్రతిభకు పట్టాభిషేకం
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

ప్రతిభకు పట్టాభిషేకం
ప్రజ్ఞకు పుష్పాభిషేకం
పాత్రతకు పాలాభిషేకం
పాండిత్యానికి ప్రణావాభిషేకం

సన్మానం అనేది గొప్ప ఘట్టం
సామాన్యులకు అలవికాదిది
సంగీతసాహిత్యాలకు వరము
సులక్షణమైన గొప్ప విజయం

కళాకారులకు పండితులకు
కవిశేఖరులకు దార్శినికులకు
చలన చిత్ర వివిధరంగాలవారికి
గురువరేన్యులకు మాన్యులకు
బాలలకు బాధ్యతాయుతులకు
అధికారులకు అనధికారులైన
ప్రతిభగల గొప్పవారందరికి
అభిమానంగా  జరిపించేదే
సన్మానం.. అభినందన సన్మానం

మధురానుభూతులు పొందే
మృదుమధుర జీవితానందం
అందరూ పొందలేనిది
కొందరికే అలవి ఐనది
ప్రతిభను గౌరవించేది
కొలమానమునకు సరిపోనిది
పొందినవిలువను తూయగలిగేది
సన్మానం.. అభినందన సన్మానం

సన్మానగ్రహీతలను ఆదరిద్దాం
అర్హులందరికీ సన్మానం చేద్దాం 
మనం ప్రేమనిండారా సన్మానిద్దాం
ఘనంగా పూలమాలతో సత్కరిద్దాం
ప్రణామంతో మనం మోకారిల్లుదాం

హామీ పత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
4

పిన్నక నాగేశ్వరరావు.

అంశము :-- సన్మానం.

1.తే.గీ.
వ్యక్తి ప్రతిభను గుర్తించి శక్తి కొలది
చేయ సన్మానములను విజేతలకును
వారి కెంతయో ప్రోత్సాహకారకమయి
భవిత యందున రాణించ నవసరంబు.

2. తే.గీ.
దేశ క్షేమము కోరుచు దీక్ష తోడ
శాస్త్ర సాంకేతికమగు నంశములలోన
నవ నవోన్మేష యన్వేషణమ్ములందు
విజయులైన వారిని గౌరవించ వలయు.

3. తే.గీ.
ఎన్నికలయందు నాయకులెట్టి వార
లైన గెల్చినను, పదవులందు వారి
నెల్ల సన్మానమున్ జేతురెల్ల జనులు
వారి ప్రాపకమున చిన్న పదవి గాని
యితర లబ్ధిని పొంద యత్నించుటకును.

4. తే.గీ.
సంఘమందు సమస్యలఁ జక్కదిద్ద
ప్రజలయందు చైతన్యము ప్రబలునట్లు
మానసికముగ వారిని మరలజేయ
స్ఫూర్తి కలిగించు రచనల నార్తితోడ నందజేసెడు కవుల సన్మానములను
చేయుటెంతయో యుచితమై చెలగు భువిని.

5. తే.గీ.
ప్రతిభ సుంతయు లేకున్న పదుగురెదుట
గౌరవమును పొంద దలచి ఘనముగాను
ఖర్చులన్ తానె భరియించి కార్యమంత
చేయ మనుజులన్ నియమించి చివరి వరకు
తనదు సన్మానమున్ జేసుకొనుచు తానె
సంతసించెడు వారుంద్రు కొంతమంది.
**************************************
5
[14/09, 9:21 pm] +91 90594 92795: తేదీ :14-09-21
అంశం : సన్మానం
శీర్షిక :ఏ వసంతం 
*********-*****************
ఏ వసంతం సన్మానించిదో చెట్టు
తలనిండా పూలు ఏ వర్షం అభిషేకించిందో
నది ఒంటినిండా అలల విరుల రేకులు ఏ గాలి     గౌరవవించిందో దారి గుండెల్ని అంటిన పూలకుంకుమలు...

ఏ పూదోటో గాలి కంఠాన్కి గంధం రాసి ఊరంతా ఊరేగిస్తుంది ఏ స్వేద జలమో కరువు రక్కసిని
గెలిసిన విత్తు యోధుణ్ణి పూజిస్తుంది వేలసార్లు
జారిపాడిన మళ్ళీ మూలలో వల అల్లిన సాలీడును గోడ అభినందిస్తూనేవుంది...

ఏ శిఖరం ఓటమి లోయలోకి తోసినా నిలదొక్కుకొని లేచే అడుగుల్ని నాన్న చూపు
నిత్యం సన్మానిస్తూనేవుంది అమ్మ బతుకు   నురుదుపై ప్రోత్సాహక సంతకం చేస్తూనేవుంది...

ఏ చేతులు మాలిన్యాన్ని మాలిమి చేశాయో
వీధులన్నీ తెల్ల మబ్బు తునకలై అతని చేతుల్లన్ని ముద్దడుతున్నాయి ఈ లోక దుఖాన్ని
కవిత్వంగా పాడానని చేతుల చెంగల్వలు వేసి
కౌగిలి దుశాలువా కప్పిన ప్రియరాలు చుంబనాల గుచ్ఛాలు గుది గుచ్చుతుంది...

ఓటమిని గెలుపుతో సన్మానించు 
కష్టాన్ని చిరునవ్వుతో సత్కరించు..
********************************
ఆర్. వి. వి. రాజా, శృంగారాయునిపాలెం
తూ. గో. జిల్లా,9059392795.
6
: సన్మానం సన్మానం

లోకం కోసం సంక్షేమం కోసం
త్యాగం చేసిన ఘనత జీవులకు సన్మానం

ప్రజల కోసం సర్వస్వం ధారపోసిన
ప్రాణాలు సైతం లెక్క చేయక పరుల కోసం పాటు పడిన
మహనీయులకు సన్మానం


ఒక రావి నారాయణ రెడ్డి కి సన్మానం ఒక పుచ్చలపల్లి కి సన్మానం ఒక దేవులపల్లి కి సన్మానం

చక్కని పాటలు కవితలు అల్లిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కు సన్మానం

ఒక దాశరధి కవనానికి సన్మానం ఒక రంగాచార్య అక్షర వాచస్పతి సన్మానం

సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని అందించి నిలిచిపోయిన ఆరుద్రకు సన్మానం

నిరంతరం పరుల కోసం పాటుపడిన ఎందరికో రవీంద్రభారతి కవీంద్ర భారతీ
కవన గీతిక కాలానికి సన్మానం


పంటలు ఎన్నో పండించి 
ప్రపంచానికి అన్నం పెట్టిన రైతన్న కు సన్మానం

అతని మనసుకు సన్మానం అతని చెమట కు సన్మానం

సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడికి సన్మానం

దేశ రక్షణకు త్యాగం చేసిన సైనికుడికి సన్మానం

దుశ్శాలువతో సన్మానించడం దేశానికి ఘన సన్మానం
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453
7

తేదీ:14-09-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: సన్మానం
*******************
గీ సంయుక్తాక్షర పదం కోసమే
కొందరు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటరు..
శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటరు..
సన్మానం చేయించుకోంగనే సంబరం కాదు
గాదాన్ని నిలుపుకోవడం
నెత్తి మీద కొండనెత్తుకున్నంత బరువని  
కొందరైతే మస్తు భయపడుతుంటరు!

గదేందో గని కొందరైతే
డబ్బో దస్కమో పలుకబడో మరింకేదో  ఉపయోగించుకుని
ఏదార్లైతేంది గా సన్మానం చేయించుకుని
పెద్దోళ్ళతో కలిసి దిగిన పుటువాలు వార్తలు పేపర్ల వేయించుకుని 
ఈ భూ ప్రపంచంలో తమకంటే గొప్పోళ్ళు లేరని
డమ్కా వాయించుకుంటరు!

గిదంత సూత్తుంటే దిమాక్ తిరిగి
వామ్మో !
ఎవరన్నా చేస్తాను రమ్మనమని గారవంగా పిలిచినా
ఒంట్లో లోలోపల వణుకొత్తుంటది..
లోపలున్న ఆత్మ ఏలుబెట్టి ఎచ్చరిత్తున్నట్టుంటది..

 గా బరువు పేర్ను మొయ్యనీకి గప్పన్నించే
మనసు మస్తు పరేషాన్ అవుతుంటది...

మన్లో పతిభో తెలివో  మరేదో ఖచ్చితంగా పత్యేకత ఉందని
ఓ పది మందైనా  మెచ్చుకున్నంక
 నలుగురిలో సమజైనంకగని 
అర్హత ఉందని తేలిక పడుతుంది..

 ఏదేమైనా సన్మానం చేయించుకోవాలంటే 
మన్లో చానా చానా గ్నానం,పెతిభ  ఉండాల్సిందే..
గప్పుడే  సన్మానం చేసినోళ్ళకూ
చేయించుకున్నోళ్ళకు దిల్ ఖుష్ అవుతుంది..

ఎవ్వురెవ్వరి యిసయం నాకు తెల్వదు గని
నా బుర్రతే  ఎప్పుడూ గిట్లనే అనుకుంటది మరి.

 *వురిమళ్ల సునంద, ఖమ్మం*
 ( *నా అభిప్రాయాన్ని కవితగా*వ్యక్తం చేశాను*. *దయచేసిఅన్యధా భావించవద్దు*)🙏
8
[14/09, 9:31 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం సీజన్ -2
అంశం:: సన్మానం
తేదీ::14.9.21...మంగళవారం
శీర్షిక :: ఉత్సాహ భరితము

కళాకారులకు సన్మానం
ఉత్సాహభరితం
ఉల్లాసభరితం
చెప్పలేని సంతోషం

సన్మానమన్నది ఒక గుర్తింపు
మర్యాద మన్ననకు పెంపు
గర్వాన్ని పెంచుకోని చేసుకోకండి కంపు
శాంపు పెట్టి రుద్దిన పోదండి
ఆ కంపు

సన్మానం జరిగితే
సంతోషం కలిగితే
అది సన్మాన గృహితలది కాదు గొప్పతనం 
సన్మానం చేసిన వారిది గొప్పతనం

సన్మానం వారు చేయాలి గాని
మనము చేయించుకొని
కాలర్ ఎగిరేయరాదు
సంస్థలు చేస్తే సంబరం
ఎదిగిన ఒదిగుండడమే మంచి గుణం

సన్మానం ఇస్తుంది ఒక అర్హత
నీ జ్ఞానానికి ప్రతిభకు వారిచ్చే ప్రాధాన్యత
పెరుగుతుంది గౌరవం అందరి చెంత
నీకు నీ బంధువులకు మేనులు
పులకింత
లలిత కళలతో సంబంధమున్న
మానవ జన్మలు చెందును ధన్యత!!
                  కవిత వెంకటేశ్వర్లు 
9
రచన : గొర్రెపాటి శ్రీను 
అంశం: సన్మానం
శీర్షిక :    సన్మానం


ప్రతిభకు గుర్తింపు పొందడమే సన్మానం !
ఎంచుకున్న రంగంలో ..
ఎవరి స్థాయిలో వారు కృషి చేస్తుంటారు !
నిన్ను ,నీ అభ్యున్నతిని లోకం గుర్తించిన నాడు ..
నీకు లభించే గౌరవమే సన్మానం !
సన్మానం..
మనసుకి అంబరాన్ని అందుకున్నంత ఆనందాన్ని కలిగిస్తున్నా
గర్వాన్ని దరిచేరనీయకు..
వినయం , విధేయత అనే లక్షణాలు వీడకుంటే..గెలుపెన్నడూ నీ వెంటే !
నీ లోని తపనని,తపస్సుని ..విడవకుండా మరింత పట్టుదలగా..
లక్ష్యం దిశగా సాగుతుంటే..
జనుల గుండెల్లో పొందే స్థానం ..ఎంతో ఘనమైనది !
అది సన్మానం కంటే గొప్పది !

 "సన్మానం" అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.
                                                  _  గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
10
**జీవనచక్రం- రైతు బతుకు  **
    అంశం :సన్మానం .
   --  జక్కిడి వెంకటరెడ్డి .
   ...    ...  ...   ...   ...   ...
  మట్టిగంధం పూత నీ నుదిటి రాత 
దినమంతా తండ్లాటా నీ బతుకుపాట 
పండించేది నీవైనా వండినోడిదే గొప్ప 
కడుపులు నింపుతున్నా కనిపించవేనాడు 
పొద్దంత మదిలోన పైరుపంటల చింతే 
లేగదూడల కేక  ఆంబోతులరంకే 
ఇదేగా సంగీతం  ఇవ్వేగా నీసొంతం   
వెలిగేటి సూరీడే దినమంత నీనేస్తం
పొద్దుగూకితే సిగలో చంద్రుడే నీతోడు 
మేడమిద్దెలు లేవు చెట్ల నీడేచాలు 
తడిచినా ఎండినా తప్పువట్టవు నీవు 
గాలిదుప్పటే చాలు  ఎప్పటికీ అదేతోడు 
చిన్నారి మొలకలే నీమోముపై చిరునవ్వు 
అర్రోంచిన చేనే మృష్టాన్నభోజనం  
పంట ఇంటికిరాకున్న బెంగపడవునీవు  
ఇంకా ... మళ్లొచ్చె  పంటకై పాటుపడతావు 
నీదంతా ఒకే ధ్యాస ఆ పాడిపంటలే నీశ్వాస 
సన్మాన సత్కారాలు నీకెన్నడు కావు 
చప్పట్ల దుప్పట్లు నీదరికిరావు
రైతే రాజంటు నినాదాలుచేస్తూ 
సామాన్యుడిలాగ పక్కనే పెట్టేరు 
సాయం చేసేనీవు వ్యవసాయం బంజేస్తే   
పూటకు తిండిలేక మల మల మాడిపోయేరు 
నీవులేని లోకం....జనం లేని భూగోళం ....
  --జక్కిడి వెంకటరెడ్డి .
11
అంశము:-  " సన్మానం "

సీ!  సన్మానములుజేయ  సంతోష మెంతయో
యితరులుజేసిన  యింపుగొలుపు

సన్మానములుజేసి  సత్కరించంగాను
నతనిఘనతనంత  నందరెరుగు

ఎంతవారికినైన  సంతసంబుగలుగు
సన్మానములుజేసి  సత్కరించ

మంచినికోరెడు  మహనీయులందరు
నార్భాటములజేయ  నాశపడరు

ఆ!  అర్హత దెలుపుచు  నతనికళలకున్న
విలువనెరుగగాను  వీలుపడును
సత్కరించంగాను  సన్మానములుచేయ
దర్పమంతచూప  తగదుయెపుడు!
             తరణికంటి సూర్యలక్ష్మి.
                          ----------
12

అంశం: సన్మానం

    ఔచిత్యం

ఏ రంగంలోనైనా అసామాన్య ప్రతిభను
కనబరుస్తూ
అహర్నిశలు శ్రమిస్తున్న పిపాసువులకు అనురక్తిగా గౌరవంగా సత్కరించుట అనాది 
సంప్రదాయం!
అర్హులైన వారికి సామాజిక సేవలందు
నిత్యం తలమునకలయ్యే
నిస్వార్థ సేవలను 
అందించినవారికి
సన్మాన గౌరవం
న్యాయ సమ్మతం!

అప్రతిభుడు అనాకారి అభ్యుదయం లేమి
సృజనాత్మకత లేని
నిష్క్రియుడు
ధనం పోసి కొను వ్యక్తికి
స్వప్రయోజనాల కోసం
దుశ్శాలువ కప్పి భుజాలెగరేసుకొను
సన్మానాలు సత్కారాలు
సార్ధకత లేని నిరర్ధకాలు!
     ***
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.

        హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
13
 సన్మానం
శీర్షిక;
      "" ప్రతిభకు పట్టాభిషేకం ""

మరుగున పడియున్న
ప్రతిభను ప్రజ్వలింప చేస్తూ
నలుగురిలో ప్రతిభను
సభలు, సమావేశాల ద్వారా
ప్రదర్శింప చేసే వేడుకలకు
రూపకల్పన చేస్తూ
గుర్తించిన ప్రతిభకు చేసే
పట్టాభిషేకమే సన్మానం
ఇదియే ప్రతిభకు కొలమానం!
రాను రాను ఈ కొలమానం
ఇచ్చి పుచ్చుకునే విష సంస్కృతిని ప్రోత్సహించే దిశగా పయనిస్తోంది
వ్యాపారాత్మకంగా మారి
ఈ జిగా ధనార్జనకై
వక్రమార్గాన పయనిస్తోంది!
సాహితీ సంస్థలు కొన్ని వ్యాపార సంస్థలుగా మారి
నిజమైన ప్రతిభను ప్రోత్సహించడంలో విఫలమౌతున్నాయి
ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి!
నిఖార్సయిన ప్రతిభావంతులను గుర్తించి
అర్హులనే సన్మానంతో అందల మెక్కించాలి
వారిని సన్మార్గంలో పయనింప
చేయాలి
సమాజ హితం వైపు సాహితీవేత్తలను నడిపించాలి!
అదియే సన్మానపు సత్కార్యం
కావాలి!
...........................................
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాని.సంఖ్య;7416638823
...........................................
పైంవచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
14.
[15/09, 9:00 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:15-09-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: సన్మానం
*శీర్షిక: అసలైన సన్మానం*
*******†"*********†**
ఏ సన్మానాలు సత్కారాలు కోరుకోని వారు కొందరుంటారు.

నిరంతరం రెప్పవేయకుండా జన్మ భూమిని
రక్షక కవచాలై కాపాడే సైనికులు!

భూగోళాన్ని భుజాలపై ఎత్తుకుని
ఆకలి బాధ లేకుండా 
అహరహం కష్టించే సైరికులు!

సమాజ సుఖ సౌఖ్యాల కోసం
కండలు కరిగించి
గుండెల కొండల్లోంచి స్వేద నదులై ప్రవహించే కార్మికులు..

అనవరతం  ప్రజా శ్రేయస్సు కొరకు
సాహిత్య సృజన చేస్తూ
జనులను జాగృతం చేసే  
సాహితీ వేత్తలు...

ప్రజా హితమే పరమార్ధంగా
అన్యాయం అక్రమాలపై
కలం గళం ఎత్తే  మానవీయ హృదయాలు..
 
ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు
సరికొత్త అన్వేషణలు చేసే పరిశోధక బృందాలకు...

 సన్మానాల కోసం వెంపర్లాడక
జీవితాలను సమాజానికి అంకితం చేసే
మహోన్నతమైన మనసుల ప్రతిభకు..
 చేయాలి పట్టాభిషేకం..

 *వురిమళ్ల సునంద,ఖమ్మం*
15

మోత్కూరి బ్రహ్మా-ఆచార్య.
కవన గానం సీజన్2నిర్వహించే
కవితల సమాహారం.
తేది.15.9.21.
అంశం:సన్మానం.
సన్మానాలు చాలారకాలు
ఉ త్కృష్టపు వర్ణనలతో
నికృష్టుల పొగడినా సన్మానమే.
కల్లబొల్లి మాటలతో,ఊ దరగొట్టు
ఉపాన్యా సాలతో అనర్హులు
అందళమెక్కిన సన్మానమే
ఈ సన్మానాలకు సరియైనవారు
చలాదూ రంగా వుంటారు
పైసలిచ్చికొందరు,ఇ తరులది


కాపీకొత్తికొందరు సన్మానాలు
పొందుతారు.
అసలైన సన్మాన గ్రహీతలు
ఎ వరంటే?
సామాజహితమే తన అభిమతంగా,
మాటల మూట లతోకాక
చేతల చేవలతో చూ పేవానికి
తనపర భేదం చూ పని
సర్వజనహితైషికి చేసేదే
అసలైన సన్మానం..
మోత్కూరి బ్రహ్మా-ఆచార్య.
        మోత్కూర్.
16.

సన్మానం!

అర్హత గల పండితులు పొందే సన్మానం 
పదుగురికి ఆదర్శం నిండైన ఆనందం!
చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరి గుడిసెలులా 
అన్ని దుర్వ్యసనాలకు బానిస,,,,,,,!
కనకపు సింహాసనంపై శునకము కూర్చుండ బెట్టిన చందం!
అయినా ఈరోజుల్లోసన్మానాలకు కొలమానాలంటూ లేవు 
అనుకుంటే పొరపాటే!
సన్మానం చేసేవాళ్ళు గ్రహీతలను ఎంచుకోవడంలోనే 
అసలు విషయం సన్మానం విలువలతోకూడుకున్నదై 
ఆదర్శాల నిలయమైన పండితులే సముచితం సమంజసం!
దారిన పోయే దానయ్యలందరికి సన్మానం అసమంజసం అనుచితం!
ఇది నా భావన!

అపరాజిత్ 
సూర్యాపేట
17.
[16/09, 7:59 pm] Lalita Sister: సన్మానం
మనము ఉన్నవాళ్ళకి చేసేది సన్మానం
ధనమున్న వారికా కాదు కాదు
మానమున్న వారికి సన్మానం
అంతర్లీనమై ఉన్న శక్తి  బహిర్గతమైతే
 అదే ప్రతిభ దానికే సన్మానం
సన్మానం ఓ వేడుక  కాదు ఒక గుర్తింపు
సన్మానం కాదు కొలమానం అదో అభిమానం
మానవతా విలువలకు మన్నన సన్మానం
సంగీత సాహిత్య కవితా సామ్రాజ్యానికి సన్మానం
కళా కోవిదులకు కళా నిధులకు సన్మానం
అవసరమైనప్పుడు  అందించే సేవాతత్పరతకు సన్మానం
ఉత్సాహంగా  మునుముందుకు పురోగమించాలని గుర్తు చేసేది సన్మానం
జ్ఞాన విజ్ఞా నాలకి  సన్మానం
వివిధరంగాలలో  విద్యార్థుల విజయ పతాకానికి సన్మానం
జీవిత నాటకం లో సరైన  పాత్ర
సత్య ధర్మ బద్దంగా పోషిస్తే  సన్మానం
దివ్య చరితకు భవ్య నడతకు కు చేయాలి సన్మానం
సన్యాసులకు గౌరవ చిహ్నం సన్మానం
ధర్మ భోధా పరాయణులకు సహకరించి గౌరవించి ఆదరించటమే సన్మానం
కన్నతల్లి దండ్రుల ఔచిత్యము తెలుసు కోవటమే సన్మానం
భారత  జాతికి  భారత మాతకి అకుంఠిత
సేవలందించే  ఘనులకు చెయ్యాలి సన్మానం
జన్మ సాఫల్యమే అసలైన సిసలైన సన్మానం
తంగిరాల నాగలక్ష్మి
న్యూజిలాండ్
ఈ కవిత నా సొంతమని హామీ
18
దారల విజయ కుమారి Poetess:
 కవితా గానం సీసన్ 2
అంశం : సన్మానం
16-9-2021
*********************
కలల సాగు చేసే కలాల ఎద్దులు
మోరలెత్తి చూస్తూ..పని పంచేటుచేసుకునే
సన్మానాలు..అంత మంచివేం కాదు

ముఖాల పాదులలో  
పెదవుల మొక్కలకు నీ వళ్ళే విరబూసిన 
చిరునవ్వుల పూలే..
నీకు సన్మానాలు కాదా..?

సాహితీ వనాలలో ఇంకా వికసించి..
పరిమలించాల్సిన విరులను..దండలుగా గుచ్చి 
కలామతల్లి కంఠసీమ నలంకరించే 
ఆర్భాటాల కాలమిది

లవనమంటి వాసి కొరవడిన కవన పాకాలు..
శాలువలే బిడియ పడే 
సన్మానాలు సత్కారాలంటే..
ఏనుగులను బహుమతులుగా పొందడమే కద !

నీ ప్రతిభా పాటవాల పావురాయిల్నెంతగా
చెదరగొట్టినా
మళ్లీ వచ్చి బుజం పై వాలడం కంటే ఆనందమేముంది..?

నేలలో దాగిన వజ్రాలు 
ఏ జడివానకైనా 
పొరలు తొలుచుకుని వెలుగు చూడవా..?

అరా కొరా..అర్హతలే
సన్మానాలకు కొలబద్దలైన చోట
గాలి..నీరు..నింగి..నిప్పూ..అవని..
అడగవెందుకో... ఈ సన్మానాలను

ప్రతిభ చెట్టు..ఆకులు రాల్చుకున్నా..
సరికొత్త వికాస చిగుళ్ల తో..
దట్టమౌతూనే ఉంటుంది

కీర్తికండూతి..శ్రీనాధుని పల్లకో
భగవతి మెచ్చిన..పోతన కలమో..తేల్చుకోవాలి

పొగడ్తలు పాకుడురాళ్ళు
ఆచితూచి అడుగులేయాలి

కలల ఆత్మ సౌందర్య గమ్యం
సర్వజనీన ఆనందమే..
పరమాత్మ అర్చనమే కదా..!

దారల విజయ కుమారి
19
[16/09, 8:21 pm] +91 90594 38068: అంశం: సన్మానం 
...
నేటి రోజుల్లో 
సన్మానాలో కూడా వ్యాపారకోణమే 
ప్రతిభకు ఎక్కడున్నది విలువ

డబ్బులతో పురస్కారాలు 
సన్మానాలు చేయించుకునే 
ప్రబుద్ధులు కొందరు 
కీర్తి కిరీటాలు కాదు కావల్సింది 
ప్రతిభా పాటవాలు 
శాలువాలు కప్పుకుంటే కాదు 
గ్రహీతలలో ఉండాలి సృజనాత్మకత
విలక్షణ వ్యక్తిత్వం 

ఏమిటో ఈ రోజుల్లో
వాట్సప్ వేదికగా 
ఎన్నో సాహితీ సమూహాలు 
వాసితో పనిలేదు 
రాశిని పరిగణించి 
ప్రశంసాపత్రాలతో సత్కరించేది 

కాలంతో పాటుగా 
మారాలేమో మనుషులు 
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి
20
[16/09, 8:22 pm] +91 6281 697 982: అంశం...‌సన్మానం
శీర్షిక.....పూజనము
*****************
మెడలో సుమమాల వేసి
బుజాల మీదుగా శాలువా కప్పి
చేతికి పూల బొకే ఇచ్చి ఘనంగా
సత్కారం జరుగుతోంది వేదిక పైన

జోరుగా హుషారుగా పట్టలేని ఆనందం
ఎటు చూసినా పండుగ వాతావరణం
తమను తాము మరచి పోయి చేస్తున్న
ఆ సత్కారం ఒక మంచికి వేస్తున్న అగ్రపీఠం

మానవత్వపు విలువలు  మెండుగా
సమాజ హితంలో అండగా ముందుండి
దండిగా ఉపకారం అందించే ఆపద్భాందవులను
గౌరవించుకోవటం ఆ జాతికే గర్వకారణం

పాండితీప్రకర్షతో జనహితంగా రచనలు చేసిన
కవులు
దురాచారాలను రూపుమాపుటకు ప్రయత్నం  చేసిన సంఘ సంస్కర్తలను
అమేయమైన తమ ప్రతిభాపాటవాలతో
నూతన ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలను
తరగతి గదిలో భావి పౌరులను తయారు చేసిన
ఉపాధ్యాయ బృందం
నాట్యంతో ఉర్రూతలూగించిన నాట్య కళాకారులు
పాటలు పాడి మైమరపించే గానకోకిలు
అందరూ పూజనీయులే
అనేకానేక రంగాలలో తమ జీవితాలను అంకితం చేసి నిష్ణాతులైన  మహనీయులు
దేశానికి జయ కేతనాలు 
వారిని సన్మానించడం అంటే తమకు తాము
సన్మానించుకున్నట్లే

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
16092021
21
నేటి అంశం:సన్మానం
నా కవితా శీర్షిక:-
సమరసతాసంస్కారం
÷÷÷÷÷÷÷÷÷÷÷÷

ప్రతిభకు చేసే పట్టాభిషేకం
ఘనతను చాటే గౌరవం
ఉత్సాహం పెంచే ఉపకారం
మునుముందుకునడిపే ప్రోద్బలం
మనుగడకిది మార్గదర్శనం 
మంచిని పెంచి పంచే పనితనం
వంచనలను వారించే వైనం
ఆదరణను చూపే నైజం
ఆనందం కలిగించే ఆశయం
ఆశయసాదనకు సోపానం
క్రియాశీలక కర్తవ్యం
సంస్కృతికిది దర్పణం
సాంప్రదాయానికి ప్రతిబింబం  
ప్రావీణ్యత పెంచేదే దీని అంతరార్థం
సమిష్టి గా చేసే ఈ సన్మానం
            ----------------------

👆ఈకవిత నా స్వీయ రచన 
జోషిపద్మావతి మహబూబ్ నగర్
22.
అంశం:సన్మానం
శీర్షిక: మధురానుభూతి
రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగారవీంద్రభారతిలోచేసారు సన్మానం

అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా కలెక్టరు గారు చేసారు సన్మానం.
విద్యార్థులను తీర్చిదిద్దినందుకు గుర్తింపుగా.
రోటరీ సన్మానం జరిగింది వృత్తిలో కత్తిలాంటి వ్యక్తిగా
గ్రామస్తులు చేసారు సన్మానం
వారితో మమేకానికిగుర్తింపుగా.
బదిలీపై వచ్చేటప్పుడు చేసారు విద్యార్థులు సన్మానం ఆత్మీయతకు గుర్తింపుగా.
పూర్వవిద్యార్థులు చేసారు సన్మానం వారి మనస్సుల్లో నిలిచినందుకు గుర్తుగా.
పదవీ విరమణ సన్మానం జరిగింది ఘనంగా
విజయవంతగ పదవీ నిర్వహణ చేసిన ఫలితం గా
ఎన్నో సన్మానాలు, తీపి గురుతులు.
వృత్తినే దైవంగా భావించి చేసే సేవలకు ఉంటుంది గుర్తింపు ఖచ్చితంగా.
భగవద్గీత లో చెప్పినట్లు మన విద్యుక్తధర్మాన్నిమనం నిర్వహిస్తేవాటంతట అవే వస్తాయి సన్మానాలు నిరంతరంగా

23
[16/09, 9:22 pm] Balloori Umadevi Poetess: 16/9/21
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం:సన్మానం

పుట్టిన ప్రతి జీవికి సన్మానమంటేనే
చెప్పరాని మోజిలలో
పుట్టిన పసికూన మోదలు
పండుముసలి వారు వరకుప్రశంసలంటే
చూపేరు మక్కువనధికంగా
అంతర్గత ప్రతిభను చూసి
పదుగురిలను మెచ్చుకొన్న
నంతకన్న గొప్ప సన్మానం
యెందు వెదికిన కనరాదు
నడకనేర్చిన పసివాడు
తప్పటడుగులేయగానె
కన్నవారు మురిసి కొట్టు చప్పట్లే
పసివాడికి గొప్ప సన్మానం
విద్యారంగమైన క్రీడారంగమైన
అసలు రంగమేదైనా
విజయం సాధించినపుడు
కలిగే ఆనందమే గొప్ప సన్మానం
ప్రతిభకు కొలమానం సన్మానం
అనుకోవడం భ్రమే సుమా
సన్మానం చేయలేదను దిగులు వలదు
స్వశక్తిని నమ్మి పనులచేయుమెపుడు
ఫలితమేదియైన హుందాగా
స్వీకరించడమే గొప్పసన్మానమని తెలుసుకో!

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...