Skip to main content

జీవన సమరం 2021

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
********₹₹₹₹₹&&&###&&₹₹&&₹
కవివరుల జాబితా
1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
2.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు
3.కోరాడ గారు
4.కొంపెల్లి రామయ్య గారు
5.ఆపరాజిత్ గారు
6.మద్ది. పుల్లారావు గారు
నందిగామ
7.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
8.సునంద వురిమళ్ళ గారు
9.కవిత వెంకటేశ్వర్లు గారు
10. తాతపూడి సోమశేఖర శర్మ గారు
11.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
12.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
13.గొర్రెపాటి శ్రీను గారుు
14.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
15.దార స్నేహలత గారు
16.డా.సి.హెచ్.ఆంజనేయులు గారు
17.లలితా కృష్ణ గారు
************-----

కవితాగానం

నేటి అంశం
11.09.2021

*జీవనసమరం*

ఎనిమిది నుండి
తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో
స్పందించగలరు.

ఆ సమయంలో
ఎలాంటి ఇతర
స్పందనలు తెల్పకుండా
సహకరించగలరు.

🔶🔶🔶🔶🔶🔶
1
[11/09, 8:00 pm] +91 6281 697 982: అంశం... జీవన సమరం...11092021
శీర్షిక.... బతుకు పోరు
********************************
ప్రభంజనమై పరుగెత్తుకుంటూ వస్తోంది
జనం మీద పడుతున్నట్లు జనం లోలోనకు
పెద్దగా కూతవేస్తు వీను విరిగేలా గుండెపగల
కానీ! జనమే దానిపైనే విరుచుకుపడ్డారు ఉప్పనై

అరుపులు కేకలు పరిగెత్త పడిపోవ పట్టింపెవరికి
బతుకు పోరులో జాలి దయ భయం మాయం
నిస్తేజమైన నిస్త్రాణ నిస్త్రింశమ్ములా మనసు
ఒకటే ధ్యాస ఒకటే ఆశ  బతకాలి బతికించాలి
 
నీళ్ళమ్మేవాడు పాలమ్మేవాడు పల్లీలమ్మేవాళ్ళు
పండ్లమ్మేవారు పాటలుపాడి కడుపుచూపేవారు
చిటికలు వేసి మెటికలు విరిచే  మూడో రకం
గుంపున దూరి ఒత్తిడి చేసి జేబులు కోసే కిలాడి

ఒంటమీద చొక్కావిప్పి జనంవేసిన చెత్తతుడిచి
ఆకలితో నోరుచూపే నిర్భాగ్యుల బతుకు పోరు
చంకకున్న సరుకు మూట దించి అమ్మే బేహారి
అందరిని ఆకర్షించ వస్తువుల విరిచి చూపు

అరువుకు సరుకు తెచ్చి అమ్మకం లేక అమ్మలేక
ఆసామి అఘాయిత్యాలు భరించలేక సిగ్గుతో బతుకు పోరు చాలించగ ఆర్తనాదాలు మిన్నంటే
ఎవరిక్కావాలి ఎవడు యేమైతే మాత్రం.

కూత వేస్తు నిత్యం ప్రభంజనంలా వస్తూనే ఉంటుంది
నిరంతరాయంగా సాగే బతుకు పోరులో విజేతలు పరాజితులు ఎవరికి వారే

జీవన సమరం కావాలి బృందావనం
నీ వెంచుకున్ళ దారి కావాలి రహదారి
ఆ రహదారికి నువ్వే మహరాజై వెలగాలి

స్వీయ రచన:::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
11092021.
2
[11/09, 8:02 pm] +91 99373 80136: 
కావ్యగానం
తేది11092021,శనివారం
అంశం:జీవనసమరం
ఆశలవలయంలో ఆనందించాలంటే
జీవనసమరం సాగించాల్సిందే
ఆనందానుభూతులను అస్వాదించాలంటే జీవనసమరం సాగించాల్సిందే
ఆశయాలకోసం జీవనసమరం చేయాల్సిందే
ఆదర్శాలకోసం జీవనసమరం జరగాల్సిందే
ఆదరించాల్సినవారికోసం జీవనసమరం 
అందరిసంక్షేమంకోసం జీవనసమరం
బ్రతకాలన్నా బ్రతికించాలన్నా జీవనసమరం
రెక్కాడితేగాని డొక్కాడనివారు చేసేది జీవనసమరం
ఆకాశహార్మ్యాలలో నివసించేవారిది జీవనసమరం
అందలాలు ఎక్కాలన్నా జీవనసమరం
అందలాలు ఎక్కించాలన్నా జీవనసమరం
ఆరాటాలు ఆందోళనలు జీవనసమరం
విప్లవాలు ఉద్యమాలు జీవనసమరం
భుక్తికోసం భూమికోసం జీవనసమరం
కూలికోసం గూడుకోసం జీవనసమరం
నీటికోసం గాలికోసం జీవనసమరం
ధ్యాసకోసం శ్వాసకోసం జీవనసమరం
ఇదినిరంతరం సాగే ప్రక్రియ.

ఇది నా స్వీయరచన.
 వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా.
చరవాణి7780594995.
3
[11/09, 8:02 pm] Korada: కవితాగానం 
 అంశం :- @ జీవనసమరం @
     కోరాడ నరసింహా రావు 
  "* శాంతి, సౌభ్రాతృత్వాలు *"
       *******************
 ఈ జీవన క్షేత్రంలో...అనాదిగా 
మనిషికి  తన అస్తిత్వపు ఉనికి కోసం...బ్రతుకుకోసం మొదలైన
సమరం...ఈనాటికీ తప్పలేదు!
ఇంక ఏనాటికీ తప్పదేమో !!

కూటికోసం... గుడ్డకోసం...., 
గూటికోసం... !
దాస్య విముక్తి కోసం... 
వివక్షా నిర్మూలన కోసం... 
ప్రాధమిక హక్కులకోసం  ఆరాటంతో... సగటుమనిషి ఆవిశ్రాoత పోరాటాలఫలితం అలసట, ఆయాసాలే... !!

ప్రత్యర్థి తెలివీ బలముల అస్త్రాలతో...అన్యాయ,అధర్మాలశస్త్రాలతో విజయాలు సాధిస్తూ... నిర్విఘ్నంగా దోచుకుని...దాచుకుంటున్నాడు

ఫలితంగా...కష్టాలు, నష్టాలు 
రోగాలు ,బాధలు,అశాంతి...
అలజడి...ఆందోళన...!
ఐనా జ్ఞానోదయం కాదు... !
ఓ అవివేకీ ... !
నీ సమరం సాటిఅమాయకులు
అర్భకులతో కాదు... నీ నిజ మై న శత్రువులు బయట ఎవరూ లేరు...!
నీకు అసలైన శత్రువులు నీలోనే ఉన్నారు... జ్ఞానాస్త్రము  వివేక 
శస్త్ర ములతో సమరం సాగించి 
ఆ ఆరుగురినీ జయించు... 
అప్పుడిక ఈ జీవన సమరా లన్నీ సమసి పోతాయి... ! 
శాంతి, సౌభ్రాతృత్వాలే.... 
వెల్లివిరుస్తాయి.... !!
    ***************
     ...... కోరాడ.
4
[11/09, 8:09 pm] Kompelli Ramaiah Poet Kmm: అంశం:జీవన సమరం
శీర్షిక:జీవన చదరంగం...!
జీవన చదరంగంలో ఎన్నో ఆరాటాలు పోరాటాలు
అమ్మ గర్భ గుడి నుండి బాహ్య ప్రపంచానికి పరిచయం కావాలంటే 
పురిటి నొప్పులతో  తల్లి చేసే పోరాటం మృత్యువుతో  యుద్ధమే
నేలను ముద్దాడిన  లేలేత పాదాలు జీవన గమనానికి తొలి అడుగు టప్పటడుగే
ఎదుగుతున్న కొద్దీ పుస్తకాలతో కుస్తీ చేస్తూ ర్యాంకులకై పోరాటమే
సమాజ మనుగడ లో అడుగడుగున అవకాశ వాదం
మేక వన్నె పులిలా ఎదురు చూస్తుంటే
భయం గుప్పిట్లో మగువ కాలం  గడుపుతూ ఉంటే
మానవత్వం లేని సమాజం
కల్లుండి చూడలేని స్థితిలో అంధులుగా ప్రవర్తిస్తే
పెరిగి పెద్ద కాగానే పెళ్లి కోసం అమ్మానాన్నల ఆరాటం
పరిగేరినట్లు అప్పో సప్పో చేసి పెండ్లి చేస్తే
అత్త గారింట్లో  గృహ హింసలు
కాళ్ళ పారాణి ఆరక ముందే నూరేళ్ల జీవితం అగ్గిపాలే
పుట్టుక నుండి చావు వరకు
జీవన తరంగాలు ఎన్నో ఆటు పోటులతో కాలం తో పాటు 
పరుగెత్తి పరుగెత్తి
అలసి సొలసి నేలమ్మ ఒడిలో నిద్రించాల్సిందే...!
5
[11/09, 8:09 pm] Aparajith: విజ్ఞాన జీవన రేఖలు!

మెదడు పొరల్లో నిక్షిప్తమైన ఙ్ఞానం 
చీకట్లు కమ్ముకున్న కాళరాత్రిలో 
చుక్కాని ఆసరాగా తుఫాను రేయి తీరం చేరిన నావ 
ముసురుకున్న మబ్బులతో ఆకాశమంతా అంధకారం 
చెకుముకి రాయితో చీకట్లను చీల్చే వెలుగు రేఖలు 
మనసు నిండా మినుగురు పురుగుల వెలుగుల విహారాలు 
భువి నుండి దీవికి మనిషి ఆలోచనా తరంగాల విశాలత్వం!
ఆత్మ తనలోని వెలుగుల ఙ్ఞానాన్ని వెలికి తీస్తూ 
కొలనులో విరిసిన పద్మం దేవతయై 
మనసుకు అంటిన జుగుప్సా జీవనం క్రమేణా అంతమవుతూ,,,,,,!
గుండెలవిసి కన్నీటి సుడిగుండాలు మాయమవుతున్న ఆనవాళ్లు 
భావి భారత పౌరులుగా ఎదిగే పిల్లల పాల మనస్సులు 
విష కోరల్లో చిక్కి శళ్యమవకుండా 
పాలు తేనె కలయికలా మనసులు ఒక ఇంద్రచాపం కావాలి!
పూల పరిమళాలు పసిపిల్లల మనస్సుల్లో విరిసినట్లు 
అంతరంగం తెల్లని గులాబీలా అందాల సుగంధమైతే 
ఈ మండుటెండలు విషాదాలు క్షణ భంగురాలై తేలిపోవూ,,,,,,!
జీవన వీణాతంత్రులు మీటినా కొద్ది రాగాలు వేలకు వేలు 
పండిన పండు తినడానికేనా!?అందులోని గింజలను అదనులో విత్తిచూడు 
సముద్రం ఎప్పుడూ నిర్మలంగానే వుంటుందా!?విరుచుకు పడదా !?
జీవితాలెవరివైనా వైరుధ్యాలమయం 
చదువే ఆత్మ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసే సూరీడు!

ఆపరాజిత్ 
సూర్యాపేట
6
[11/09, 8:12 pm] +91 99512 87113: కవితాగానం
అంశం:జీవన సమరం  
శీర్షిక: సగటు జీవి
మద్ది. పుల్లారావు
నందిగామ
11-9-2021
      - - - - - - - - - -
ఇదే ఇదే సగటు జీవి జీవితం
పదేపదే పడిలేచే బొంగరం
గడియకో విషాదం
నిమిషానికో నిశీధం

పై వాడిలా బ్రతుకలేడు
క్రిందివాడిలా ఉండలేడు
అడకత్తెర లో పోకచెక్క లా నలుగుతాడు

క్లాస్ లో కలవలేడు
మాస్ లో ఇమడలేడు
అటో కాలు ఇటో కాలు
జీవితమంతా శోకాలు

పిల్లల చదువులకై కొన్నాళ్లు కార్పొరేటు
చమురు తగ్గిన తర్వాత గవర్నమెంటు

అబ్బాయి ని చదివిస్తాడు మద్యతరగతి చదువు
వరించదెన్నటికీ ఆతనిని ఉద్యోగ వదువు
ఉద్యోగ ప్రయత్నం లో ఆస్థి ఆవిరి
ముదిమి మీద పడినా రెక్కల కష్టమే ఆతని దరి

అమ్మాయి వివాహానికి చేయాలి యత్నం
ఇచ్చుకోక తప్పదు ఎంతో కొంత కట్నం
ఆర్బాటాలకై అంతా తాకట్టు
దిగక తప్పదు జీవితం మరోమెట్టు

జీవితమంతా వ్యథలే
బ్రతుకంతా భాదలే
కరుణరస గాథలే
అంతులేని కథ లే
________________
మద్ది. పుల్లారావు ___
నందిగామ________
7
[11/09, 8:25 pm] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: కవితాగానం( సీజన్-2) ఆధ్వర్యంలో
తేది :- 11 -09 -21
అంశం:- జీవన సమరం
శీర్షిక :- 
అలుపెరుగని పోరాటం
..................................
పుట్టుక నుంచి మరణం వరకు మానవుడు నిరంతరం  మనుగడ కొరకై పోరాటం చేస్తు జీవనయాత్ర కొనసాగిస్తు ఉంటాడు
బాల్యంలో  జన్మనిచ్చిన తల్లిదండ్రుల అదుపు- ఆజ్ఞలో, ఆలనా- పాలనలో
ఉన్నతస్థితి పొందుటకై  విద్యాసంస్థలలో,ఇరుగు పొరుగు వారితో పోటీపడటమే మొదటి జీవనపోరాటం......  !!

ఉద్యోగాన్వేషణకై ఉన్నతచదువులు చదివినా కాలంతో పోరాటం, ప్రొమోషన్లకై ఆరాటం,
తదుపరి వివాహమై జీవితభాగస్వామితో చెలగాటం, సంతానం విషయమై వారి ఉన్నతి కోసం పగలనక,రేయనక 
ఉరుకుల,పరుగుల జీవితంతో సగటు జీవి నిత్య పోరాటం......!!

కాలం ఎవరికోసం ఆగదు కదా. విశ్రాంత జీవితాన భాగస్వామితో యాత్రలు, దేముళ్ళ సందర్శనాలు చేస్తు మనుమల ఆట పాటలతో ఆనందించే వేళ
ఆదిశంకరులు చెప్పినట్లు 
కన్ను,పన్ను వంటి రుగ్మతలు జాగ్రత్త  నీ జీవిత ప్రయాణం లో ఆఖరి మజిలీ అనుకునే లోపునే 
అనుకోకుండా శ్రీరామచంద్రుని పాదాల దరికి నలుబది సంవత్సరాలు నాతో కలసి ఆలనా పాలన చూసే
మీ కేమి తెలియదు ఎలా బ్రతుకుతారో అన్న సహధర్మచారిణి  పరలోకపయనం.
కావున మనిషి జీవితమంతా జీవన సమరమే ఇది తెలుసుకుని
జీవిత పరమార్ధాన్ని  అర్ధం చేసుకో మానవా మానవత్వమే మాధవత్వమని 
ప్రేమతత్వమే ముముక్షత్వమని తెలుసుకో......!!
.........................
పేరు:-
 ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
..............................
హామీపత్రం:-
ఇది నా స్వీయకవిత దేనికి అనువాదం కాదు
..................................
8
[11/09, 8:52 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:11-09-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: జీవన సమరం
*********†*****†****
కాలంతో పోటీ పడి జీవితం
జీవితాన్ని వెనుక పడేసి కాలం 
టామ్ అండ్ జెర్రీ లా పరుగులు తీస్తూనే ఉంటుంది...

అనుకున్నది సాధించేందుకు చేసే సమరంలో
గెలుపు ఓటముల చిట్టా ఒకటి
మనసు చిలుక్కొయ్యకు వేలాడుతూ
కర్తవ్యం  ఒకటి కన్రెప్పల కింద దోబూచులాడుతుంది!

జీవితం అక్షరమై పోవాలని తపిస్తే
భావోద్వేగ జీవాణువులను ప్రోది చేసి
ఓ సరికొత్త ప్రపంచంతో పోరాడి గెలవాలి...

ఆర్థికంగానో హార్థికంగానో  బలపడేందుకు
క్షణాలనేవీ విడిచిపెట్టకుండా
గురిపెట్టి లక్ష్య సిద్ధి కై రణం సాగించాలి..
ఋణానుబంధాల హార్థికతను కాపాడుకునేందుకు
 అపోహలతో పోరాటం చేసి
నమ్మకపు పునాదులు వేసుకోవాలి..

 రంగమేదైనా 
జీవన సమరానికి
మంచి మానవత  లక్ష్యాల 
ఆయుధాలను 
మనసు అమ్ముల పొదిలో
సిద్ధం చేసుకుంటే 
విజయం ఎప్పుడూ మనతో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపుతుంది..

 *వురిమళ్ల సునంద, ఖమ్మం*
9
[11/09, 9:15 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం సీజన్ - 2
అంశం:: జీవన సమరం
శీర్షిక:: నిత్య పోరాటం

బతుకు తెరువుకై పోరాటం
జీవనానికై ఆరాటం
పూట పూటకు కుస్తీ
ఇంత ముద్ద పెడుతుంది బస్తీ

ఉంటుంది కూలీల అడ్డ
ఎదురుచూపులతో సౌఖారీ
ఎదురు బడ్డ
ఆ రోజు కూలీ దొరికినట్టే
ఆ రోజు కడుపు నిండినట్టే

కాలమంటే డబ్బు
డబ్బుంటే నయమవు జబ్బు
దేనికయిన ధనం
ఉంటేనే ఘనం

పిల్లలను బడికి పంపాలన్న
ఆడపిల్లకు పెండ్లి చేయాలన్న
అప్పులు తీరాలన్న
కొంచం గొప్పగా బతకాలన్న
పండుగ పబ్బం చేసుకోవాలన్న
పది మందిలో పరువుగా జీవించాలన్న కావాలి ధనము
కష్టపడితేనే సంపాధనము

పనుల్లేని కాలాల్లో వలసలు
సుగ్గికి కుటుంబంతో ఇతర
ప్రాంతాలు
ఊర్లకు ఊరిలే ఖాళీ
ముసలి వారే ఇంటిదగ్గర
చూపరేవారు జాలి

ఆరు నెలలు బయట
ఆటు పోట్లతో బతుకు బాట
కష్ట సుఖాల కలయిక
ఒడిదుడుకుల నావలా జీవిక

మధ్య దళారులతో బెడద
ఈ వ్యవస్థ మారదా
మా జీవన భృతి పేరగదా
సమసమాజ స్థాపన జరగదా

ఎప్పటికి ఇంతేనా మా జీవితాలు
గుంతలా లోపలికేనా
బంతిలా తిరగడమేనా 
అయినా బాగు పడేనా
మా బతుకులు ఎక్కడ వేసిన
గొంగళి అక్కడే
గొప్పోళ్ళు మమ్ముల తొక్కుడే!!
                  కవిత వేంకటేశ్వర్లు
కర్నూలు.       8309920625
పై కవిత నా స్వీయ రచన అని
హామీ
10
[11/09, 9:22 pm] Thathapudi Somashekara Sharma: కవితాగానం సీజన్ 2
అంశం.. జీవన సమరం
శీర్షిక..జీవనపోరాటం 
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328069336

ప్రతిమానవుడికి తప్పనిదే 
ప్రతిజీవికి తప్పనిసరియే 
ప్రతీమనిషికి పోరాటమే
ప్రతినిముషము ఉండేదే
అదే.. అదే..జీవన పోరాటం

పుట్టుకనుండి ప్రతీసెకనుకూడా 
నిమిషము గంటలు రోజులుకూడా 
నెలలు సంవత్సరములు కూడా 
అన్నీరోజులు ప్రతీ మనిషికికూడా 
ప్రతివిషయం జీవన్మరణ పోరాటమే
అదే.. అదే.. జీవన పోరాటం

బాల్యంలో ఇంట్లో అందరి ఆజమాహిషి
విద్యారంభంలో గురువులభయభక్తులు
విద్యపూర్తయేదాకాచదువుతోపోరాటం
ఫస్ట్ ర్యాంక్ లకొరకు ప్రాకులాడేఆరాటం
ఉద్యోగాల వేటలకు ప్రాధేయపడే కష్టం
పెళ్లిళ్లు చేసే వెదుకులాటల సయ్యాట
పిల్లలకోసం మొక్కుబడులప్రాకులాట
వారి చదువులు వారి భవిష్యత్తులు
ఓహో.. ఓహో.. జీవితమేఒకపోరాటం

హామీ పత్రం
                  ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
11
[11/09, 9:23 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితల సమాహారం
తేది: 11-09-2021
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు

అంశం: జీవన సమరం

 *యాంత్రిక జీవితం*

పరుగులు తీసే కాలప్రభంజనంలో
మానవ మనుగడ
యాంత్రికంగా మారిపోయింది!

బతకడానికి అవసరమైన ఇంధనం సమీకృతం కావాలంటే బద్ధకింపును బద్దలు చేసి
యుద్ధం ప్రాతిపదికన సమాయాత్తం కావాలి!

కాలం ఆవిష్కరించిన కొత్త దిశలో పరుగులు
తీసే పోటీ మొదలైంది

లక్ష్యం దిశన సామాజిక భద్రత
గౌరవం మేళవింపుల మధ్య జనించు ఆలోచనా ధోరణి
నిర్ణిద్ర క్షుద్బాధకు ప్రేరణ అవుతుంది!

కాయా కష్టం చేసే కర్మిష్టులకు కనురెప్పలు తెరిచీ తెరవగానే
రాత్రి ఊహించిన వ్యూహాలకు స్వస్తి చెప్పి
జీవన సమరంలో
విధులకు హాజరవడం
శునకరాజపు శుష్క కోరికలు చెవులు దులిపినంత తేలికగా
మళ్ళీ సాధారణ బతుకు పోరుకు 
రంగం సిద్ధం చేసుకున్న సైనికుల్లా ఉద్యుక్తం!!
          ***
         హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.

 *సయ్యద్* *జహీర్* *అహ్మద్* , *కర్నూలు*
12
 అంశం;  జీవన సమరం
శీర్షిక;
      ""  నిత్య పోరాటయోధులు"

గొర్రె తోక బెత్తెడులా
పెరిగే ధరలకు తగ్గట్టు
పెరగని వేతనం
అప్పులతో తులతూగే జీవితం
ఆ జీవన గమనపు పయనంలో
నిత్య పోరాట యోధులం మనం!
పరీక్షల సంగ్రామంలో విద్యార్థులు
వ్యవసాయ క్షేత్రంలో హాలికులు
ప్రభుత్వ రంగ సంస్థల
పరిరక్షణకై కార్మికులు
హక్కుల సాధనకై ఉద్యోగులు
ఓటర్ల ఓట్లు పొందుకై నాయకులు
మాన ప్రాణ సంరక్షణకై అతివలు
పనికి తగ్గ వేతనంకై శ్రామికులు
రాయితీలు పొందుటకై పారిశ్రామిక వేత్తలు
 చిరుద్యోగ సాధనకై నిరుద్యోగులు
ఉపాధి హామీ పనులకై నిరుపేదలు
ఇలా...
నిత్య జీవన సమరంలో
అలుపెరగక ఉద్యమిస్తూ
పట్టువీడని విక్రమార్కుల్లా
ఉదయించే సూర్యునిలా
వెలుగురేఖలు విచ్చుకునేందుకు
అవిరల  కృషి సల్పుతున్న బడుగుజీవులు
జీవన సమరంలో నిత్య సైనికులు!
............................................రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
సెల్ నెంబర్.7416638823
..........................................
పైన పంపుచున్న వచనకవిత.నా స్వీయారచనేనని
13
 హామీఇస్తున్నాను.
 కవితా గానం (సీజన్ 2)

అంశం:జీవన సమరం
రచన : గొర్రెపాటి శ్రీను
శీర్షిక : "వెలుగు నీడల సయ్యాట"  



మనసు లోలకమై ఊగుతుంటుంది ఆశకి..నిరాశకి మధ్య!
పుట్టింది మొదలు మరణించే వరకు
మనిషి చేసే జీవన్మరణ పోరాటమే జీవన సమరం!
జీవిత గమనంలో
ఎన్నో అమావాస్యలు ..ఎన్నో పౌర్ణమిలు..!
చీకట్లు..
మనిషి ని ఇక్కట్లకు గురిచేస్తూ..
బ్రతుకు భారమయ్యేలా..కన్నీళ్ళ అగాధాలలోకి నెట్టేస్తూ..
'ఎలా బ్రతకాలా!?'అనే సంశయాన్ని కలిగిస్తాయి!
అక్కడక్కడా అగుపించే వెలుగులు..పూలవర్షాలను కురిపిస్తూ..
అప్పటి వరకూ పడిన కష్టాలను రూపుమాపుతూ..
మోములపై చిరునవ్వుల దివ్వెలను వెలిగిస్తాయి !
కష్టం ఎదురైనప్పుడు ..
నిలువెల్లా నిరాశకు గురై ..దిగులు చెందుతూ ..
కన్నీటి సంద్రమై నిలిస్తే..
......జీవితం "అసమర్థుడి జీవయాత్ర"
కష్టాలపై తిరుగుబాటు చేస్తూ ..చైతన్యమై కదులుతుంటే ..
......జీవితం "సమర్థుడి దండయాత్ర"
ఏదైనా ..
"జీవన సమరం " అంటే వెలుగునీడల సయ్యాట !


"వెలుగునీడల సయ్యాట" అనే కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.  - గొర్రెపాటి శ్రీను ( హైదరాబాద్ )
14
కవితా గానం
అంశం:జీవనపోరాటం.
శీర్షిక:నిరంతరం సమరం.
తిప్పా వఝల నరసింహమూర్తి
బుచ్చిరెడ్డి పాలెం.నెల్లూరుజిల్లా.
నాజీవితం పోరాటాలమయం.
నిరంతరం నేను చేస్తూనేవున్నానుజీవన పోరాటం.
బాల్యంలో చేసానుఅనారోగ్యసమస్యలతోయుద్ధం.
విద్యార్థిగాచేసాను ర్యాంకులకై సమరం.
ఉద్యోగం కోసం చేసాను ఇంటర్వూలపోరాటం
ఉద్యగంనిర్వహణలో చేసాను సమస్యలతో యుద్దం.
ఉద్యోగం లో చేసానుహక్కులపోరాటం
పిల్లల చదువులకై చేసానుడొనేషన్లతో సమరం.
మిన్నంటుతున్నధర లతో చేస్తూనేవున్నానుఅలుపెరుగని పోరాటం.
కార్పొరేట్ ఆసుపత్రులతో చేస్తున్న పేకేజీలయుధ్ధం.
కుమార్తెలపెండ్లిండ్లకుచేసానుఅప్పులతో పోరాటం.
వృద్ధాప్యంలో చేస్తున్న ఒంటరితనంతోసమరం.
జీవనపోరాటంచేస్తూ
సాగిస్తూనేవున్నానుముందుకు ప్రయాణం.
పొందుతూనే వున్నాను నిరంతరం విజయం. 
నావిజయానికికారణం నాశరీరంలో సగం.
ఆమె సారధ్యం లోచేరుకుంటున్నానువిజయాలతీరం.
15
[12/09, 9:28 pm] +91 98499 29226: కవితాగానం సీజన్ @2
శీర్షిక : జీవన సమరం

సమరం చేయాల్సిందే
జీవన కదనరంగం  ఆశామాషీ కాదుగా
ఏకాకి జీవనం కారాదు
సంఘజీవులం అందునా
 మానవత్వము నిండిన మనుషులం

విధిరాత తెచ్చే వెలుగునీడలు
దాటుటకు గుండెలనిండా 
ఆశాజ్యోతులు నిత్యం
వెలిగించాలి నిరాశలను
వెనుకకునెడుతూ...

తెలిసీ తెలియని ముందడుగులు 
స్వయకృతాపరాధపు గాయాలనీడలు
వెన్నంటి వేటాడుతున్నా
మడమతిప్పక  ముందడుగేస్తూ
లేపనగంధాలను పూసుకోవాల్సిందే...

సంఘజీవులం అందునా
 మానవత్వము నిండిన మనుషులం
జీవనసమరం చేయాల్సిందే..

పేరు : దార. స్నేహలత
గోదావరిఖని
పెద్దపల్లి

హామీ : ఇది నా స్వీయ రచన. అనువాదం కాదు.
16
[12/09, 9:37 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఈ జీవన సమరం ఆగిపోదు

సమస్త వృత్తుల వాళ్ళు

జీవనసమరం సాగిస్తూనే ఉన్నారు జానెడు పొట్ట కోసం రాత్రి పగలు కష్టపడితేనే నాలుగు మెతుకులు వారికి దొరికేది

జీవన సమరం అంటే బ్రతుకు అస్తిత్వం కోసం పోరాటం
జన్మ ఎత్తినందుకు మనిషిగా మసా లాలీ అంటే

బ్రతుకు ఒక చదరంగం i బ్రతుకొక వేదన భరితమై బ్రతుకొక జీవన చిత్రమై బ్రతుకొక ఆశయ పత్ర మై

జాలరి పగ్గం సాలెల మగ్గం
కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం
రోడ్డు పక్క పాన్ డబ్బా

సిగరెట్ బీడీ అమ్ముకొని ప్రతివాడు జీవనసమరం సాగిస్తూనే ఉన్నాడు

నేడో మాస్కులు శానిటైజర్ లు
కర్చీఫ్ లు బిస్కెట్లు చాక్లెట్లు
చిన్నపిల్లల బలపాలు

జీవితం ఒక సమరం సమరం రావూరి భరద్వాజ జీవన సమరం కళ్ళముందు
దృశ్య గానమై కనిపిస్తుంటుంది

ఎవరికైనా బుద్ధి జీవులకు భౌతిక శ్రమ జీవులకు సమస్త రంగాన్ని శ్రమ లోని రూపుదిద్దుకొని సృజనాత్మకమైన శక్తులు

జీవితం ఒక సమరం జన్మనిచ్చినందుకు అది ఒక అంతిమ ఆశయం దాక ఒక పోరాటం సాగేది
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453
17
అంశం :జీవనసమరం 

శీర్షిక :ఆత్మానందం


మంచితనపు మార్ధవాన్ని 
వంచనవెంటాడుతుంటే...
ప్రాపంచికత కురుక్షేత్రంలో 
ప్రతీ మనిషి చేస్తున్న సమరం   

అరమరికలు లేకుండా ఉండలేక ...... 
మరకలతెర మనసు పొరపై పరచుకుంటూ... 
గడియ గడియకో గందరగోళం  మధ్య
వెతలతో...
సంతసపు వెలితితో చేస్తున్న
సమరం  

అభినవ అభిమన్యుడిలా 
సంసారపద్మవ్యూహంలో
ప్రవేశిస్తూ......
యోగ సాధన కై తపిస్తూ.........
రాగద్వేషాలను 
ఛేదించ శోధించలేక ..... 
చేస్తున్నసమరం 
 
తనువు పై తాదాత్మ్యత
కీర్తి కిరీటాలపై ఆర్తివదిలి.. ....... 
వ్యూహాన్ని ఛేదించగల  కిరీటి 
కావాలి............ 

*పసి* డి మనసే  పరమాదర్శంగా 
ఆత్మానందపు బావుటా నెగరేయాలి
జీవనసమరం లో 
అమరుడై......

*****శివునూరి లలితాకృష్ణ

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...