Skip to main content

ఇంకెన్నాళ్ళు 2021

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
***************
కవివరుల జాబితా
1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.గారు
2.కోరాడ గారు
3.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
4.డా.ఆంజనయులు గారు
5.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
6.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు
7.జక్కిడి వెంకట రెడ్డి గారు
8.కవిత వెంకటేశ్వర్లు గారు
9.మన్నె పిన్నక లలిత గారు
10.అన్నా ప్రగడ గారు
11.గొర్రెపాటి శ్రీ ను గారు
12.అపరాజిత రెడ్డి గారు
13.తరణికంటి సూర్య లక్ష్మి గారు
14.తాతపూడి సోమశేఖర శర్మ గారు
15.సయ్యద్ జహీర్ అహ్మద్ర్ గారు కర్నూల్
16.వాణి సరోజిని లక్కరాజు గారు విజయవాడ
17.వురిమళ్ల సునంద గారు ఖమ్మం
18.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
19.ఏడెళ్ళి రాములు గారు
20.కొంపెల్లి రామయ్య గారు
21.వనపర్తి గంగాధర్ గారు
22.పిన్నక నాగేశ్వరరావు గారు
23.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
కాజీపేట 
24.వురిమళ్ళ సునంద గారు
************--
1.
అంశం... ఇంకెన్నాళ్ళు...17092021
శీర్షిక....‌.. ఎన్నాళ్ళు....
******************************
ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు
ఈ మోసాలు ఇంకెన్నాళ్ళు
ఊక దంపుడు ఉపన్యాసాలు
ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు

ఓటు పండుగ వచ్చినపుడే
నోటు పట్టుకొని సచ్చినోడు చూరు కింద
పచ్చనోట్ల కర కర చప్పుడు
చెవిన గుస గుస చేతిని చేయి

అరచేతిలో తేనెలు పూసి
మోచేతిని నాకించే నమ్మక ద్రోహుల
మోసాలు ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు

పక్కా ప్లాన్ తో పక్కాఇండ్లు
పంటలు పండే భూముల వితరణ
పేదల సాదల బతుకు భరోసా
చేసిన బాసలు గీసిన గీతలు గోడలమీద
అని
కాయ కష్టం కడుపు నింపునని
కాళ్ళు చేతులే కలల పంటయని
కళ్లు కుళ్ళును చూడబోవని
కోళ్ళ కూత వేళ్ళకు లేచి పోయే
*కూలీ* వెతలు ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు

పొద్దు మాపు పెయ్యి నొయ్యగ
పనిమీదే పాదు కొంటిమి
ఏమి కర్మో ఏమో గాని
గంజి గంటెడు గగన మాయే

చిటికెడు ఉప్పు జానెడు గుడ్డ
బారెడు జాగా మూరెడు పందిరి
లేనే లేని *లేమి బతుకుల* *కతల పోషణ*
ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు.

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
17092021
2
కవితాగానం :- "ఇంకెన్నాళ్లు !?"
  కోరాడ నరసింహా రావు... !
ఎన్నాళ్ళైనా.,ఇంకెన్నాళ్ళయినా
    @@@@@@@@@@@
ఎన్నాళ్ళు...ఇంకెన్నాళ్లీ అరాచ 
కాలు...!?ఆ త్రేతాయుగం కంటే
ఘోరం గా... ద్వాపర యుగం కంటే హేయంగా...పైశాచిక మగ తనం...మహిళలనుసురు 
పెడుతోంది... !
కామోన్మత్తతతో... పశు బలం ప్రదర్శించి... మానప్రాణాలను 
నిరాఘాటంగా...హరించటం  కొనసాగిస్తూ నే ఉంది !!
ఇంకానా... ఈ ఘోరాలు... మీ 
నేరాలు... ఇంకానా !? ఇంకెన్నాళ్లు... ?!
తగిన శిక్షలు లేకనే కదూ... !
వావి, వరుస, వయసులు కానక... కసురు మొగ్గలవంటి పసిదేహాలనూ వదలకున్నారు!
ఎలాకుదిరితే అలా... ఒకరైతే ఒక్కరు ! కుదరకపోతే నలుగు రేసి కలిసైనా... మాటువేసి వెంటాడి... వేటాడి... కుతి తీర్చుకుంటున్నారే... !!
రాక్షసులను మించి... చెరిచి చంపేస్తున్నారే... !!!
 మీ మీ పదవులకోసం..,కాంతా
కనకాల కోసం... ఎంత నీచాని కైనా...ఎంతటి పైశాచిక దుర్మార్గానికైనా తెగిస్తారా !?
మీకు ఏ కోశానా... అయ్యో పాపం అనిపించదా...?!జాలి, దయ అనేవి మీలో అస్సలు లేవా... !?
 ఎన్నాళ్ళు...ఇంకెన్నాళ్లీదుస్థితి 
మార్చుకోరా... మీతీరు... 
మార్చుకోరా... !?
కామంతో చూసే మీ కళ్ళను 
కొరివిలతో కాల్చి, పేల్చేసే వరకూ...,లొంగదీసుకుందుకు 
సహకరించిన ఆ చేతులను 
పట, పట మని విరిచేసేవరకూ 
ఆ దుశ్చర్యతో చెలరేగిపోయిన అంగాన్ని పర పర కోసి కారం పెట్టేవరకూ... బహిరంగంగా కొట్టి.. కొట్టి చంపేవరకూ.... 
మీరీ  దుశ్చర్యలు మానరు !
ఎన్నాళ్లయినా......,
ఇం కెన్నే ళ్లయినా..... !!
      ***************
      ..... కోరాడ.
3.
[17/09, 8:14 pm] Aalla Nageshwar Rao Poet: అంశం :ఇంకెన్నాళ్లు...?!

శీర్షిక:  ""  పరివర్తనే పరిష్కారం"

బాలికైతేనేమి బాలింతైతేనేమి
ముదుసలి అయితేనేమి
మూగది.అయితేనేమి
తొమ్మిది నెలల పసి బాలికైతేనేమి
ఆడతనముంటే చాలు
అత్యాచార యత్నానికి అర్హురాలే యని నుడివి
వావివరుసలు గాంచక
మాన భంగాలు గావిస్తున్న
మృగాళ్ల అకృత్యాలు ఇంకెన్నాళ్లు!?
పట్టపగలే జంటగా తిరుగాడు చున్న
అబలలపై అత్యాచారాలు గావిస్తూన్న 
మదాంధ ముష్కరులపై
కొరడా ఝుళిపించే దెవ్వరు!?
ఆడదంటే ఆటబొమ్మ కాదని
ఆడదే సృష్టికి మూలమని
తన చెల్లి, చెలియ, భార్యలు ఆడవారేనని
తన జన్మ ప్రదాత అడదేనని
వారిని గౌరవించడంతన కర్తవ్యమని
ప్రతి మగాడు గ్రహించి
పరివర్తనతో ప్రవర్తించిన నాడు
ఆనాడే స్త్రీ జాతికి వెలుగు!
అప్పుడే పసిపిల్లలపై సైతం
అత్యాచారాలు తొలుగు
అదియే బాపూజీ కలలు కన్న 
రామరాజ్య స్థాపనకు తొలిఅడుగు!
...........................................
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు....జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాని సంఖ్య; 7416638823
...........................................
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను
4
[17/09, 8:15 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఇంకెన్నాళ్లు

స్వార్థం పెంచుకున్న నాయకుల పాలన ఇంకెన్నాళ్లు

నియంతృత్వ పోకడలు ఇంకెన్నాళ్లు
తమకు తామే గొప్ప మనుషులం అనుకుని కాలం ఇంకెన్నాళ్లు

దౌర్జన్య పరుల రాజ్యం ఇంకెన్నాళ్లు

ప్రభుత్వం లేని రాజ్యపాలన ఇంకెన్నాళ్లు నాజీ నియంత రాజ్యం ఇంకెన్నాళ్లు

ప్రజా పాలన అత్యవసరం ఈనాడు
జన చైతన్యమే అత్యవసరం 
అన్నాళ్ళు


యుగానికి చైతన్యం కలిగించే మహిళా శక్తి ఎప్పటికీ అవసరం ఉన్న రోజులు


శ్రామిక స్వర్గం ఆవిష్కరించడం ఇంకెన్నాళ్లు సమసమాజ ఆవిష్కరణ ఇంకెన్నాళ్లు

ఒక ధర్మభిక్షం ఒక రావి నారాయణరెడ్డి ఇ ఒక చాకలి ఐలమ్మ ఒక నల్ల నరసింహులు

ఒక భీమిరెడ్డి ఒక మల్లు స్వరాజ్యం అవసరం ఈనాడు ఏనాడైనా

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453
5
[17/09, 8:16 pm] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: కవితాగానం( సీజన్-2) ఆధ్వర్యంలో
తేది 17-09-21
అంశం:- ఇంకెన్నాళ్ళు???
శీర్షిక:- బ్రతుకు పోరాటం
.................................
బాల్యంలో అమ్మను పోగొట్టుకుని నాన్న ప్రేమతో అన్నీ తానై  పెంచినా
ఇరుగు పొరుగు నష్టజాతకురాలని అన్నప్పుడు సమాజం తీరే అంతా అని ఆప్యాయత, అనురాగాలతో నాన్న నాతో అక్షరం ముక్క వస్తే అన్నానికి లోటు ఉండదు అని చెప్పినది ఆచరించి డిగ్రీ లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత నొంది ప్రభుత్వ ఉద్యోగం పొంది ఇంకెన్నాళ్ళు నాన్న మన కష్టాలు పోతాయి అన్న క్షణాన నాన్న కళ్ళలోని ఆనంద భాష్పాలు ఇప్పటికీ జ్ఞాపకమే........ !!

ఉద్యోగం చూసి అతను నాన్నతో ప్రస్తావించి నన్ను వివాహం ఆడినపుడు అదృష్టవంతురాలివి అయ్య చేతిలో పెడుతున్న
అన్న మూడవ రోజునే శ్రీరామచంద్రుని దరి చేరినపుడు నన్ను దగ్గరగా తీసుకొని ఇంకెన్నాళ్ళు భాధపడతావు  నాలో మీ నాన్నని చూసుకో అన్న పతిదేవుని మాటలు ఇప్పటికీ జ్ఞాపకమే......!!


కాలగర్భంలో ఇద్దరు మగపిల్లలకు తల్లినై వారు ప్రయోజకులై మా సంసారం 
సుఖసంతోషాలతో ఉండగా
అన్నీ తానై ,కష్ట సుఖాలలో
సుఖ దుఃఖాలలో తోడు నీడగా ఉండే భర్తను పోగొట్టుకున్నప్పుడు 
అమ్మా ఇంకెన్నాళ్ళు .ఇది బ్రతుకు పోరాటం. విధిబలీయం. మేమున్నాము అన్న పిల్లల ఓదార్పు జీవితాన మరువలేను......!!
...............................
లోకా సమస్తా సుఖినో భవంతు.
.................................
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
.................................
హామీపత్రం:-
ఇది నా స్వీయకవిత దేనికి అనువాదం కాదు
..................................
6
[17/09, 8:26 pm] +91 99373 80136: కావ్యగానం
తేది17092021,శుక్రవారం
అంశం:ఇంకెన్నాళ్ళు?
రాబంధులరెక్కలచప్పుడు ఎన్నాళ్ళు?
శవాలగుట్టలపై కరాళనృత్యం ఎన్నాళ్ళు?రాజకీయదురంధరుల రాక్షసక్రీడ ఎన్నాళ్ళు?
ఉచితాలు తాయిలాలతో ఓట్లుదండుకోవడం ఎన్నాళ్ళు?
దాచేసుకోవడాలు దాగుడుమూతల రాజకీయక్రీడ ఎన్నాళ్ళు?
మనిషికి మనిషికి మధ్య విబేధాలు సృష్టి ఎన్నాళ్ళు?
మద్యంమత్తుతో అత్యాచారపర్వాలు ఎన్నాళ్ళు?
వావివరుసలు మరచి పసికూనలపై అఘాయిత్యాలెన్నాళ్ళు?
మతవిధ్వేషాలతో మారణహోమాలు ఎన్నాళ్ళు?
ఉగ్రవాద ఉచ్చులెన్నాళ్ళో మరి?
సరిహద్దులలో శతృదేశాల కుట్రలెన్నాళ్ళో?
రైతుల ఆత్మహత్యలెన్నాళ్ళో?
మనిషిని చూసి మనిషిదూరంగా పారిపోయేస్థితి
ఎన్నాళ్ళు?
విషక్రిమిచేస్తున్న విలయతాండవం ఎన్నాళ్ళు?
ఒడిదుడుకులు తట్టుకుంటూ భయంభయంగా ఇలా 
బ్రతకడం ఎన్నాళ్ళు?
ఆత్మవిశ్వాసంతో ఆత్మనిర్భరంతో అందరూ జీవించడం
ఎప్పుడు జరిగేను?
నిత్యం అస్థవ్యస్థ వ్యవస్థలో కొట్టుమిట్టాడుకోవడం
ఎన్నాళ్ళు?ఇంకెన్నాళ్ళు?

ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995
7
[17/09, 8:46 pm] Venkat Reddy Jakkidi Math Sa Poet: **కవితాగానం -2 .**
అంశం : ఇంకెన్నాళ్లు. 
పేరు   : జక్కిడి వెంకటరెడ్డి .
....    ....    ....     .....     ....
 మండెగుండెలు 
 ఎండిన బతుకులు 
 మరిగే నెత్తురు 
 తరగని ఆక్రోశం 
 కాలం మారిన 
 కత మారలేదు 
 మారింది కేవలం 
 అన్యాయం తీరే  ....
 మనిషి తన తీరుతో 
 మృగాలని సయితం 
 మరిపిస్తుండు.... 
   అవకాశం దొరికితే చాలు 
 ఆదమరిచిన మానవత్వాన్ని 
  నడిబజార్లో పోగులు వేసి 
 ఫలారం పంచినట్టు పంచుతుండు 
 అన్యాయానికి ఉన్న  అరవై దార్లని 
 అరచేతిలో అమర్చుకొని 
  అనువైతే చరిత్రలో లేని 
  కొత్త రూపులో కాటు వేస్తుంటే 
  గుండెలు పగిలి 
  గూడు చెదిరి 
  అభాగ్యులు ఆహాకారాలు చేస్తుండ్రు ...
  రుపేదైనా దారేదైనా 
  మనిషి పయనం మాత్రం 
   కలి  పురుషునికి కానుకిచ్చి 
  కాటుకల్సిపోయేకాలం వచ్చినట్టుంది 
   ఇలాగే సాగితే ....ఇంకెన్నాళ్లు 
  ఇదిగో కళ్లకు కనిపిస్తుంది 
   మనిషి అంతం ....
    ఈ వెగటు పుట్టించే 
   వెర్రి వేషాలు .....
  'అంతం' సొంతం చేసుకోవడానికి 
మనిషి దౌర్భాగ్యపు చేష్టలతో 
  దార్లు పరిచి ...ఎదురు చూస్తున్నాడు 
 తన అంతానికి ....జాతి మొత్తానికి .
  --- జక్కిడి వెంకటరెడ్డి .
8
[17/09, 8:59 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం సీజన్ - 2 
అంశం:: ఇంకెన్నాళ్లు
తేదీ::17.9.21..శుక్రవారం
శీర్షిక:: ఎన్నాళ్ళు? -- ఎన్నేళ్లు?

కాలానికి డబ్బుల ముల్లెలు
మొలిచాయి
కళ్ళకు కామపు కోరికల కత్తులు పుట్టుకొచ్చాయి
జిత్తుల నక్కలు ఊరంతా
తిరుగుతున్నాయి
సుకుమార కుసుమాలను
గుండు సూదులతో గుచ్చుతున్నాయి

మోసాల వలలు పట్టుకొని
అమాయకపు చేపలను పడుతున్నారు
ద్రోహాల ఊబిని కడుపులో
నింపుకొని మునిగేవారిని 
వెతుకుతున్నారు 
కోట్లకు పడగెత్తాలని కుళ్లు
ఉపాయాలను బుర్రలో
పెంచుకున్నారు

వాగ్దానాల బుట్టలు పట్టుకొని
నాయకులు చేస్తున్నారు మీటింగులు
డబ్బుల కట్టలు పెట్టుకొని పంచుతూ వేయమంటున్నారు ఓట్లు 
పంచినదానికి పదింతలు వెనకేసుకోవాలని ప్లాన్లు
పరువుకన్న పదవే ముఖ్యమనుకొనే రాజకీయ
(వి)నాయకులు
ప్రజాక్షేమము సంక్షేమం
పట్టించుకోని పాలకులు

దొంగతనాలు దారి దోపిడీలు
అత్యాచారాలు ఆడపిల్లపై
అఘాయిత్యాలు పసిపిల్లలపై 
మానభంగాలు హత్యలు అబలలపై

విత్తనాలు కల్తీలు
ఎరువులు కల్తీలు
అమ్మబోతే దళారీలు
చేస్తారు మోసాలు
రైతుకు పంగనామాలు
చేసిన కష్టం బూడిదెపాలు
అప్పులు సాయంత్రం నీడ
కనుమరుగు రైతు జాడ
ఇలా జీవితాలు 
ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్లు!!
                 కవిత వెంకటేశ్వర్లు
పై కవిత నా సొంత రచన అని
హామీ
9
[17/09, 9:04 pm] మన్నె లలిత గారు కవయిత్రి: కవితా గానం
 తేదీ :17/ 9 /21 -శుక్రవారం
 అంశం :ఇంకెన్నాళ్లు
****************************
 ఇంకెన్నాళ్ళు బిడ్డల్ని బాహువుల్లో
 పొదువుకుంటుంది తల్లి
 గర్భంలో మోసిననాళ్ళే భద్రత
   పృథివి మీద పడ్డనుండీ
 పృధివిలో కలిసేవరకు ఆడబిడ్డ
 రక్షణ ఇంకెన్నాళ్లు
 రాబందరాక్షసుల నుండి పసిగుడ్డులను
 కాపాడుకోవటం ఇంకెన్నాళ్లు
 ఇంటింటా మృత్యుఘోష ఇంకెన్నాళ్ళు
 మారణహోమాలు మృత వినోదాలు ఇంకెన్నాళ్లు
 చట్టవిరుద్ధ సంపాదనలు ఇంకెన్నాళ్లు
 మాననీయ విలువలకు మచ్చ పోయేది ఇంకెన్నాళ్లు
  మనిషి మనిషి మధ్య పచ్చగడ్డి  వేస్తే
భగ్గున మండేది ఇంకెన్నాళ్లు
 జగత్తు అంతా శాంతిమంత్రం పలికేది ఇంకెన్నాళ్ళకు
**********************************************
  హామీ పత్రం:
పై కవిత నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను.
  మన్నె లలిత
 హైదరాబాద్
10.
పేరు.. అన్నాప్రగడ
అంశం..ఇంకెన్నాళ్లు
17/9/21శుక్రవారం

కొన్నేళ్ళుగా కొందరు విద్రోహదినం అని..
కొందరు విమోచనదినం అని..
కొందరు విలీనదినం అని.. విద్వేషాలు నింపుతున్నారు వినాశనాన్ని కోరుతూ..
*ఇంకెన్నాళ్ళు* సాగుతుంది ఈ రాజకీయ క్రీడ..
ఆ మాటలను విసర్జించి వికాసంవైపు దృష్టిపెట్టే రోజు ఎప్పుడు వచ్చునో..
ఆ నిరీక్షణకు ముగింపు ఇంకెన్నాళ్లకో..

✍️అన్నాప్రగడ
11
[18/09, 8:06 pm] +91 96528 32290: కవితా గానం ( సీజన్ 2 )
రచన :   గొర్రెపాటి శ్రీను 
అంశం:   ఇంకా ఎన్నాళ్ళు !?
శీర్షిక :    "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా.."


"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా.."
ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు పూజలందుకుంటారు..!
అంటూ స్త్రీ లను గౌరవించిన సనాతన దేశం మనది !
మరి నేడు..
మహిళలపై దాడులు,అరాచకాలు అసంఖ్యాకంగా జరుగుతున్నాయి.
సమాజం ఎటు పయనిస్తుందో అర్థం కాని స్థితి !
టెక్నాలజీ పేరుతో పురోగమన బాటలో పయనిస్తున్నాం అనుకుంటున్నాం..!
కానీ విలువలకి పాతరేసి..తిరోగమన దిశగా సాగుతున్నాం !
నేడు మానవతా విలువలు పతనం అవుతుంటే..
"మహిళల రక్షణ చట్టాలు " కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి !
నేడు ఏ వార్తా పేపర్ తిరగేసినా..
దేశంలో ఏదో మూల మహిళలపై అకృత్యాలు జరుగుతున్న ఘటన ల వార్తలు దర్శనమిస్తున్నాయి !
ఇంకా ఎన్నాళ్ళు ఈ విపరీత దోరణలు !?
మహిళల అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్న ఈ సమాజం మారాలి ! 
మహిళలను గౌరవించే ..
అభ్యున్నతి చెందిన ..పరిణతి చెందిన ..సంస్కారవంతమైన సమాజం ఏర్పడాలని కాంక్షిద్దాం !

  "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా.."అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.  _ గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్).
12
[18/09, 8:12 pm] Aparajith: ఇంకెన్నాళ్ళు????

నీవెక్కడ మిత్రమా !?
పడిగాపులు గాచీ గాచీ 
కళ్ళు ఎరుపెక్కాయి!
నీ కోసం ఎక్కడని వెతకను 
ఎన్నాళ్ళు ఈ పడిగాపులు!?
ఇంకెన్నాళ్ళకు నా చెంతన చేరి 
కబుర్లు చెబుతావ్ మిత్రమా!
నీ మనసు దోచిన తెల్లని కొంగలు 
నీ మిత్రుడేడీ? ఇంకెన్నాళ్ళకు వస్తాడు!?అంటున్నాయి!
ఆ ముళ్ల తొవ్వలో వెళ్లకన్నానా 
అయినా నీవు నన్ను లెక్కచేయలేదు 
గగనంలో నెలవంక అగుపించగానే 
రంజాన్ నెల ఉపవాసాలు విడిచి 
నన్ను ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నావ్!
మహ్మద్ జిలానీ హైస్కూలు కబడ్డీ వాలీబాల్ ఛాంపియన్ 
అర్ధాంతరంగా చదివే చదువు వదలి 
బ్రతుకు తెరువు కోసం పడరాని పాట్లు 
గ్యాస్ సిలిండర్లు నింపే కంపెనీలో చేరి 
కష్టాల కడగండ్ల జీవితంలో 
నీ చుట్టూరా నీఅన్నవాళ్ళు ఎవరూ లేని ఎడారి జీవితం 
దాంట్లోనె భగ్గుమని సిలిండరు పేలి 
ఇంకెన్నాళ్ళు ఈ నిరుపేద జీవితమని హృదయం పగిలి 
ఆ అనంత లోకాల్లో ఎవరున్నారు సోదరా!?!
ఇన్నాళ్ళ మన స్నేహం మట్టిపాలయ్యింది!!

అపరాజిత్ 
సూర్యాపేట
13
[18/09, 8:14 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్ 2 ) 18/9/2021/ శనివారము
అంశము:- " ఇంకెన్నాళ్ళు "

సీ!  ఎన్నాళ్ళుగడచిన  యేముంది జగతిలో
చావుపుట్టుకలన్ని  జరుగుచుండు

రాత్రిపగలనుచు  రాకపోకలతోడ
రోజు మారుచునుండు  రోజుతరుగు

మార్పులుచేర్పులు  మహినిజరుగుచుండు
మళ్ళితిరిగినదే  మాదిరుండు

యేదిదాచినకాని  యేదివెంటనురాదు
నంతుతెలియరాదు  నవనివిధము

ఆ!  మనకుదెలుపదెపుడు  మహికిదెలిసినను
మహినిజరుగుమాయ  మనమెరుగము
జగతిజరుగుచున్న  జగడాలు ఘోరాలు
ఇంక నెన్ని నాళ్ళు  నిలనుసాగు!
         తరణికంటి సూర్యలక్ష్మి.
                   ------------
14
[18/09, 8:17 pm] Thathapudi Somashekara Sharma: కవితా గానం ( సీజన్ 2 )
తేదీ 18.9.2021
అంశం.. ఇంకెన్నాళ్లు???
శీర్షిక... మనదితినేమనవాళ్లే 
కోరుతున్నమనచెడు 

పిల్లల్లి కష్టపడి తపస్సు ధారపోసి కని
పెంచుతాము 
వాళ్లకు విద్యాబుద్ధులు సహనంతో
నేర్పిస్తాము  
క్యాంపస్ సెలక్షన్ పొందడానికై వారితో సమానంగా పోరాడుతాం
రాకపోతే ఉగ్యోగాల వేటకై ఊరురా
తిరుగుతాము
ఎక్కడో అక్కడ ఎవరి కాల్లో పట్టుకుని
ఉద్యోగం వేయిస్తాము
మంచిసంబంధంచూసి కట్నప్రమేయం
లేకుండా పెళ్లిచేసేస్తాము
పెళ్లిఅయ్యాక అత్తమామలు నాకు వద్దు
వేరేకాపురం పెడతామంటే అంటే పెట్టించేయడం తప్పదు 
అమ్మ బంగారం చెల్లికి ఏదైనాపెడితే
అన్న అదినాకుకావాలంటే ఇచ్చేయవలసిందే 
ఊరిలోవేరేకాపురంలోవున్నా భర్త అమ్మగారింటికి వెళుతున్నట్లు తెలిస్తే ఊరు ఉద్యోగం మార్పే 
అక్కడికి కూడా వెల్లి కావలిసిన సామాన్లు
ఇచ్చి సర్ది ఇంటికి వచ్చేయవలసిందే 
పండగపబ్బానికిమనమెళ్లిన వారొచ్చిన
భయంగానే పండగవెళ్ళబుచ్చుతాము
లేకపోతేకోపగించిపండుగ సమయానికి
పుట్టింటికెళ్లిమనల్లిబాధపెట్టిన సహిస్తాం
అత్తపెత్తనంబు ఆ రోజుల్లోనే అడగంటి
పోయింది
కోడలుచెప్పినట్లువినకపోతే నేను మేడెక్కి
దూకి చచ్చిపోతానని బెదిరిoపుతో భయం 
పిల్లలనుకూడామార్చి తాతమామ్మలపై 
నేరాలు చెప్పడం
వారిని దూరంగాఉంచి వారిపైపిల్లలచే  తప్పుడు మాటలుచెప్పించడం
పెళ్ళయాక ఏడాదిదాటాక ఏడాదిక్రితమే
మాఅత్తమామ చచ్చిపోయారని
ఇదేపున:శ్చరణ రెండేళ్లు మూడేళ్లయి
నాలుగేళ్లుఐదేళ్లయి లెక్కతప్పకుండ
వరుసక్రమంలో మనం మర్చిపోకుండా
ప్రతీఏడుఇదేఅత్తమామలకుపండుగ
ఎన్నేళ్లుఅయినఇదేసంబరం భరించేశక్తి
లేకున్నా తప్పదు రక్తసంబంధం 
మనం ఏం మాట్లాడినతప్పే పోలీసు కేసుపెడతా విడాకులిచ్చేస్తానని బెదిరింపులు 
ఆడపడుచుమీద నేరాలు వాళ్ళకి పెట్టేస్తున్నారని నిందలు
ఒకరకంకాదు పుట్టింటివారి చేతకూడా
నీలపనిందలేయించడం               కష్టాలు పురుళ్ళు పేరంటo శుభాలు
మన డబ్బు చాకిరీ కావాలి
పనిఅయిపోతే ఒక్కనిముషం ఉండొద్దు
వెళ్ళిపోవాలి తక్షణం
ఇలా ఎన్నాళ్లు ఇంకెన్నేళ్ళు??????
 భరించే శక్తిలేదు బాధపడే ఓపికలేదు
వద్దు వద్దుబాబోయ్ వద్దువద్దు.......
పగవాడికి కూడా అసలేవద్దు.....
భరించలేం అసలు ఒక్క క్షణం భరించలేం..ఎన్నాళ్ళు????
ఇంకెన్నేళ్ళు????
ఇంకెన్నాళ్లు?????

హామీ పత్రం
                  ఈ కవిత నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
15.
కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితల సమాహారం

అంశం: 
ఇంకా ఎన్నాళ్ళు?

పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు

   *రుధిర భాష్పాలు*

రాతి యుగంలో  వున్నామా
లోహ యుగంలో
వున్నామా
టైం మిషన్ లో పరుగులు తీస్తున్నామా 
కఠిన శిక్షలు పడుతున్నా
కామాంధుల ఆగడాలు కళ్ళెం పడ్డంలేదు
అబలల మీద అత్యాచారాలకు ముగింపు పడలేదు!
రక్షణశాఖకు పెనుసవాళ్లకు జవాబు దొరకని ప్రశ్న!
జన్మస్థానం మించిన ఉత్తమ స్థానం కనబడదు
తన జన్మస్థానమెట్టిదో మరచి పోయారు మదమెక్కిన కబంధులు!

కళ్ళకింత అందం కనిపిస్తే చూసి పుట్టించిన దేవుడిని
చేతులెత్తి మొక్కాలి
వేనోళ్ళ కొనియాడాలి

తమ లోకమంతా కామాంధకారంల వుంటే
కళ్ళు పూడుకుపోతాయి!
కరుణ చూపి వదిలేస్తే
కలకాలం ఇలాగే కొనసాగుతుంటాయి!

ఎక్కడ ప్రేరేపింపబడిందో
అక్కడి నుంచి చర్మం ఒలిచి
బహిరంగ ఊరేగింపు తీయాలి
భీతావహ దృశ్యాన్ని పరికించిన కామికుడు
గిజగిజ వణికిపోవాలి!
భారత శిక్షా స్మృతిలో
అదనపు ప్రకరణం చేర్చాలి!
       ***
      హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
16.
18-9-21 శనివారం
అంశం. ఇంకెన్నాళ్ళు? 
రచన వాణి సరోజిని లక్కరాజు
విజయవాడ

ఎన్నాళ్ళీ వేదన? ఏనాడు దీని ముగింపు
ఎంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నావు?
ఎన్ని సంసారాలను నట్టేట ముంచేశావు
తల్లిని కోల్పోయిన తండ్రీ పిల్లలు
తండ్రి ని కోల్పోయి న తల్లి బిడ్డలు
తల్లిదండ్రులను కోల్పోయి అనాధలయిన బిడ్డలు
తల్ల డిల్లి ఆకలితో రోడ్లపాలైన జీవితాలు
అయిన వాళ్ళెవరూ ఆదుకోక పోగా
అంతిమ సంస్కారాలకు సైతం
ఆమడదూరమైనారు
అవును ఎవరి ప్రాణం వారికి ఎక్కువేగా లోకంలో
మాస్కలతో నోరు మూసి మాటిమాటికీ చేతులుకడుగుతూ 
మనుషుల మధ్య దూరాన్ని మరింతగా
పెంచుకుంటు  ఇంకాఎన్నాళ్ళిలా?
కర్కటి కరోనా కాటుకు కాటికి జేరిన వారెందరో
ప్రపంచాన్ని గడగడలాడించిన
ఈ పాడురోగానికి విరుగుడెన్నడో
పంచభూతాలను వంచనచేస్తూ
పర్యావరణాన్ని కలుషితం చేస్తే
ఫలితం గా ప్రకృతి వేసేశిక్షేమోయిది
ఏదిఏమైనా  ఫలితం అనుభవించాల్సి దేగా
ఇంకెన్నాళ్ళో యీబాధలు?
17.
*కవితా గానం సీజన్ 2*
తేదీ:18-09-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: ఇంకా ఎన్నాళ్ళు!?
********************
వనారణ్యంలో జంతువులకున్న నీతి నియమాలు
జనారణ్యంలో మృగ్యమై పోతున్నాయి
మాయమవుతున్న మనిషి తనంతో
తిరగబడుతున్న గాయాలు..

పాల బుగ్గల పసినవ్వులను
అమానుషంగా చిదిమేస్తున్న  కామాంధులు
 జన్మనిచ్చిన అమ్మతనపు గర్భగుడులను ధ్వంసం చేస్తున్న కిరాతక మూకలు..

ఆధిపత్య దురహంకారంలో
అడుగడుగునా
హింసను భరిస్తున్న స్త్రీలు.
 ఆమె లేనిదే
క్షణమైనా మనుగడ సాగదని తెలిసీ
వేధింపులకు గురి చేస్తున్న పైశాచికత్వం...

ఆకాశంలో సగానికి
ఎటుచూసినా అవమానాలే
అండం నుండి అవసానం దాకా బాధల సుడిగుండాలే..

ఇంకా ఎన్నాళ్ళు..‌ఈ దారుణాలు..
ఎప్పటికి ఆగేను హింసాత్మక ఘటనలు..
ఇంకా ఎన్నేళ్ళు.. ఈ అసమానతల చాకిరి పర్వాలు...
రండీ! సంకల్పం ఉక్కు పిడికిళ్లు బిగిద్దాం...
స్కానింగ్ కళ్ళతో దుష్టత్వాన్ని కనిపెట్టి
నిలువునా పాతరేద్దాం..

 *వురిమళ్ల సునంద, ఖమ్మం*
18.
కవితా గానం

శీర్షిక ఇంకెన్నాళ్ళు
తిప్పావఝల నరసింహమూర్తి
ఇంకెన్నాళ్ళీ తిట్ల రాజకీయం.
ఇంకెన్నాళ్ళీ బూతు పురాణం
మనం ప్రజాస్వామ్యంలో వున్నామా అని అనుమానం
గతంలో లేవా రాజకీయాలు
ఏనాడైనా మీరారా హద్దులు
నోరు పారేసుకొంటే వస్తాయా పదవులు
నోరు  పారేసుకోవడం రాజకీయ హీరోయిన్గా
నోరు అదుపులో పెట్టుకోండి.
రాజకీయ గౌరవం కాపాడండి
19.
[19/09, 8:24 pm] +91 94948 00454: *ఇంకెన్నాళ్ళు..

పూల కొమ్మల కొలువు లో
మొగ్గల పొత్తిళ్ళే కీటకాల పాలైతే
వసంతాలు పూచేదెలా
కోయిల పాడెదెలా

మానవత్వ సంక్షోభంలో
నరుడే రాకాసై సంచారం
తల్లి ఒడినే మరిచిన ప్రవర్తనలు
కలుపు మొక్కల కాఠిన్యాలు

గంజాయిమత్తు లో చిత్తౌతూ
పెడసరి బుద్దులతో హద్దులు దాటడం

తల్లి పాలు తాగనోళ్ళెవరూ?
అమ్మ కడుపు తీపి రుచి తెలియనిదెవరికీ??! 

చిన్నారి బోసి నవ్వులన్నీ
అమ్మ నవ్వుల అనురాగాలే
ఎందుకో విషపు చూపుల వలలో
గిలగిలా కొట్టుకుంటున్న బాల్యం

నా దేశం పవిత్ర పుణ్యక్షేత్రం
అడుగడుగునా జననీ జగన్మాత
కొలువైన పుణ్యభూమి

దేవభూమి దేహం అరాచకాలతో
తల్లడిల్లుతోంది
నా తల్లి భారతి పసివాడని నవ్వుల్లో
 వెక్కిళ్ళను చూసి
చెక్కిళ్ళు దుఃఖాశ్రువులతో ధారలు వారుతున్నవి

ఈ ఘోర కలికి నివారణా మార్గాలే
లేవా
చట్టమా నిదుర లే
రాజ్యమా మత్తు విత్తం లోంచి
బయటకు రావా

ఓట్లకోసం నోట్లూ మధ్యం పంపిణీల్లో
పార్టీల వైఖరి సత్య ధర్మాలు దాటాకే
తప్పులన్నీ ఒప్పుల చిట్టాలో చేరీక
నేరగాళ్ళు ఇక్కడే తప్పటడుగులు
వేసేది

దుర్ఘటనలు జరిగాకా 
కొవ్వొత్తుల ర్యాలీ కాదు కావాల్సింది
నివారణా చర్యలకు ఉపక్రమిస్తేనే
మేలు మేలు

ఏడెల్లి రాములు
ది*18*09*2021(22*21)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
20
[19/09, 8:44 pm] Kompelli Ramaiah Poet Kmm: అంశం: ఇంకెన్నాళ్ళు...?
శీర్షిక:రక్త కన్నీరు...!
_కొంపెల్లి రామయ్య (ఖమ్మం)

అమ్మ గర్భవతని తెలిసినంత సమయం పట్టలేదు 
ఆడ శిశువని  తెలియగానే  భ్రూణ హత్య చేయడానికి

భూమ్మీద పడ్డ బిడ్డ ఏడ్చినంత కాలం గడవలేదు
ఆడ బిడ్డ పీక నొక్కి బొందలో పాతి పెట్టడానికి

ఎదుగుతున్న చిన్నారి మైదానంలో సీతాకోక చిలుకలా
ఆనందంగా  ఎగురుతున్నంత సేపు పట్టలేదు 
కామాంధుడు చేతిలో చితికి నిర్జీవ రక్తపు ముద్దగా మారడానికి

అమ్మ కొంగు విడిచి మూలమలుపు తిరిగినంత నిమిషం పట్టలేదు
కామ పిశాచి మత్తు ముసుగులో నోరు నొక్కి
రేపటి అమ్మ తనాన్ని చిదిమి అగ్గిలో బుగ్గి చేయడానికి

ఫేస్ బుక్ లో పరిచయమైంనంత  సేపు కాలేదు
ప్రేమ పేరుతో మోస పోయి ఆర్తనాదం చేయడానికి

అందం చూసి సొల్లు గార్చినంత   క్షణం పట్టలేదు
వావివరసలు మరిచిన మదాంధుల కబంధ హస్తాల్లో కాలి పోవడానికి

తేనె పూసిన మాటల ముత్యాలు పెదవి జారి కర్ణ భేరికి తగిలినంత సేపు పట్టలేదు
అమాయకపు తల్లులు మానవ మృగాలకు బలికావడానికి

గది గోడల మాటున జరిగేవెన్నో...?
ఇది ఒక రావణ కాష్టం ....
ఎక్కడ పడితే అక్కడ
ఎవడు పడితే వాడు
నైతిక విలువలు నాశనం చేస్తూ
కన్న వాళ్లకు గర్భశోకం మిగిలిస్తూ
చంటి పిల్లా  చిన్న పిల్లా ముసలి తల్లా ఎవరైతే ఏమి ఆడదైతే చాలు
నిస్సిగ్గు నీచపు అమానవీయతతో 
గర్భగుడినీ నాశనం చేస్తూనే ఉన్నారు....
మానవతను మంట గలుపుతూ రేపటి అమ్మకు ఘోరీ కడుతూనే ఉన్నారు...
డెబ్బది ఐదు వత్సరాల స్వతంత్ర భారతం లో
సభ్య సమాజ నిర్మాణం జరిగేదెప్పుడు ?
నీచపు పిశాచాల మూలాలు నరికేదెప్పుడు?
చట్టాలు చేసే పాలకులు మదమెక్కిన మత్తు సమాజాన్ని అంతం చేసేదెప్పుడు?
ఇంకెన్నాళ్ళు ఈ రక్త కన్నీరు...?
21
[19/09, 8:59 pm] Vanaparthy Gangadhar Poet: *కవితా గానం సీజన్ 2*
*****************************
*పేరు:వనపర్తి గంగాధర్*
ఊరు:హన్మకొండ
తేదీ:19.09.2021
*అంశం:ఇంకెన్నాళ్లు..??*
*శీర్షిక:మృగాళ్ల లోకం*

మనం ఎక్కడున్నాం...
మానవ సమాజంలోనా...
రాక్షస మృగాల మధ్యనా...
పారుతున్న రక్తపుటేరులలోన...

మానవ మృగాల పాపిష్టి చేతుల్లో
బలైన పసి హృదయాల ఘోష
చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి
గుండె బాధతో పాశానంగా మారిందెప్పుడో

మనుషులా....రాక్షసులా....
మీ నికృష్ట నీచ చేతలకు
చేతులు ఎలా వచ్చాయి
కళ్ళుమూసుకు పోయిన ఓ కామాంధులారా...
ఎంతకాలం ఈ దానవ కృత్యాలు
ఇంకా ఎన్నాళ్ళు...ఎన్నేళ్లు...

అవనిని, అంబరాన్ని జయించాడు మనిషి
కానీ,తన నీచ బుద్ధిని జయించలేక పోయాడు
ఈ దారుణ మారణకాండలు ఆగేదెప్పుడు..
పసి హృదయాల మోముపై 
వెన్నెల నవ్వులు వికసించేదెప్పుడు..
రామచిలుకల్లా స్వేచ్ఛగా విహరించేదెప్పుడు..

ఓ సమాజ మేధావుల్లారా...మేల్కొండి..
ఎంతకాలం...
ఈ దుష్ట అసహ్య కృత్యాలు
ఆ రాబందుల రెక్కలు విరిచిననాడే
ఆ నీచుల తలలు తీసిననాడే
అతివల మోముపై ఆనందం
జగతి సిగలోన నవ్వు చుక్కల విహారం
22
[19/09, 9:10 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం (సీజన్ 2).      19--9--2021.
పిన్నక నాగేశ్వరరావు.    
అంశము :-- ఇంకెన్నాళ్లు.

శీర్షిక :-- ఎన్నాళ్లకు...ఇంకెన్నాళ్లకు.

పసి పిల్లలనుంచి పండు ముదుసలులపై
అత్యాచారాలకు, హత్యాచారాలకు పాల్పడే
మృగాళ్ల అకృత్యాలకు తెరపడే రోజు...
ఎన్నాళ్ళకు... ఇంకెన్నాళ్లకు...

మానవత్వపు విలువలను మట్టిలో కలిపి
చిన్న చిన్న సమస్యలకే
ఉన్న బంధాలను తెంచుకొని
అశాశ్వతమైన అర్ధం కోసం
శాశ్వతం కాని సంపద కోసం
పగలు,ప్రతీకారాలంటూ
ఒకరి నొకరు చంపుకుంటూ
సాగే దారుణాలు ఆగేది
ఎన్నాళ్ళకు... ఇంకెన్నాళ్లకు...

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా
ఎంతోమంది కూడూ గుడ్డా లేక
ఉండటానికి కొంపలేక
అల్లాడుతున్న పేదవాళ్ల జీవితాలలో
మార్పు వచ్చేది
ఎన్నాళ్ళకు... ఇంకెన్నాళ్లకు....
*************************************
23
[19/09, 9:13 pm] +91 90594 38068: గజవెళ్ళి శ్రీనివాసాచారి 
కాజీపేట 
తేదీ:19.09.2021
అంశం: ఇంకెన్నాళ్ళు 
శీర్షిక: ప్రకృతి భీభత్సం
...
ఓ మనిషీ!

ఇంకెన్నాళ్ళు సాగిస్తావు 
ఈ ప్రకృతి భీభత్సం 

పచ్చని ప్రకృతిపై 
ఎందుకు నీకింత శతృత్వం 
నీకు ఊపిరి ప్రసాదించే
వృక్షాల ఊపిరి తీస్తున్నావు 

ప్రకృతి పచ్చని గొడుగును 
ఛిద్రంచేస్తూ 
ప్రగతి పేరిట 
వృక్షాలను తెగనరుకుతున్నావు 
వన్య సంపదను 
కొల్లగొడుతున్నావు 
నీవు చేసిన పాపమే 
నేటి ప్రకృతి విలయతాండవం 

ఇంకెన్నాళ్ళు నీ ఆధిపత్యం 
ఇంకా ఎన్నాళ్ళో సాగదు 
ప్రపంచమంతా ఎడారైతే 
మనిషి పని అధోగతే
24
[19/09, 9:18 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:19-09-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
*అంశం: ఇంకెన్నాళ్ళు????*
******"*************
నీలో నీవే తాబేలులా ముడుచుకు పోతూ
నిర్లిప్తతా నిశీధిలో భారంగా గడుపుతావు.‌‌..

దీనుల వేదనలు బాధలు చూసి  ఎందుకలా నిశ్శబ్దంగా కుమిలిపోతావు

బోర విరుచుకుని తిరుగుతున్న
దానవత్వాన్ని పైశాచికత్వాన్ని
చేష్టలుడిగి చూస్తావెందుకు?

 ఎదిరించలేనని 
ఉక్కు లాంటి మనసును
భయం తుప్పు పట్టిస్తావెందుకు?
ఇంకెన్నాళ్ళు.. నీలో ఈ స్తబ్ధత?

పోరాడితే పోయేది ఏం లేదు
బానిస సంకెళ్ళు తప్ప..అన్న
మహనీయుని మాటలు వినలేదా..?

రాజ్యమేలుతున్న అమానవీయ రోజులను
మొక్కవోని సంకల్ప ఆయుధంతో తలపడు...

 ఇంకెన్నాళ్ళని దీనంగా ఎదురు చూస్తున్న
బాధా తప్త హృదయాలకు బాసటగా నిలబడు..

వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు
నీవొక చిరు దివ్వెవయినా చాలు
వారిలో పోరాడే ఆత్మ విశ్వాసం పెంచేందుకు
నీవొక సమిధవైనా చాలు

మనకు ఉన్న ఒకేఒక్క
మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు...

 *వురిమళ్ల సునంద ఖమ్మం*

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...