Skip to main content

ఓటమి 2021

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
❇️❇️❇️❇️❇️❇️

కవితాగానం

నేటి అంశం
07.09.2021

*ఓటమి*

ఎనిమిది నుండి
తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలు
పంపగలరు.

ఆ సమయంలో
ఎలాంటి ఇతర స్పందనలు
తెల్పకుండా సహకరించగలరు.

❇️❇️❇️❇️❇️❇️
కవివరుల జాబితా
1.దోసపాటి వెంకటరామచంద్రరావు గారు
2.డా.ch.ఆంజనేయులు గారు
3.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
4.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.గారు
5.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
6.ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్. గారు
7.డా.బల్లూరి ఉమాదేవి గారు
8.డా.సి.హెచ్. ఆంజనేయులు గారు
9.కోరాడ గారు
10.మోత్కూరి బ్రహ్మా-ఆచార్య. గారు
11.గొర్రెపాటి శ్రీను  గారు
12.కవిత వేంకటేశ్వర్లు గారు
13.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
14.సింహాద్రి వాణి గారు
15.వీరా గుడిపల్లి 
16.తాతపూడి సోమశేఖర శర్మ గారు
17.పిన్నక నాగేశ్వరరావు గారు
18.సునంద వురిమళ్ళ గారు
19.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు, కర్నూలు.
20.అపరాజిత రెడ్డి గారు, సూర్యాపేట
****************
1.
[07/09, 7:33 pm] +91 99373 80136: 
కవితాగానం
తేది07092021,మంగళవారం
అంశం:ఓటమి
ఓటమి మనిషిని దిగజారుస్తుంది
ఓటమి మనిషిని ఉత్తేజపరుస్తుంది
ఓటమి మనిషిని ఉద్రేకపరుస్తుంది
ఓటమి మదిలో మంటలు రేపుతుంది
ఓటమి ఓటమిని ఓడిస్తుంది
ఓటమి మళ్ళి గెలిచేలా చేస్తుంది
ఓటమి ఎప్పుడూ ఓడిపోదు
ఓటమి ఎప్పడూ వీడిపోదు
ఓటమి నీకు తోడుగా వుంటుంది
ఓటమి నిన్ను వెంటాడుతుంది
ఓటమి నిన్ను ప్రేమిస్తుంది
ఓటమి నిన్ను ప్రేరేపిస్తుంది
ఓటమి పాలవడం పొటినుండి విరమించడంకాదు
ఓటమి మళ్ళీ పోటీ లో పాల్గోనెలా చేయిస్తుంది
ఓటమి నిన్ను పరుగులు పెట్టిస్తుంది
ఓటమి నిన్ను నీరసించెలా చేస్తుంది
ఓటమి నిన్ను నీర్వీర్యం చేస్తుంది
ఓటమి నిన్ను దారితప్పేలా చేస్తుంది
ఓటమి నిన్ను దారి వెదికెలా చేస్తుంది
ఓటమి నీకు దారిచూపుతుంది.

ఇది నా స్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
2
[07/09, 7:35 pm] 
డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఓటమి

మనిషి జీవితంలో ఓటమి సహజమే
జీవితం అంటేనే ఓటమి-గెలుపు భయం

ఓటమి పై గెలుపు సహజాతి సహజం అనుకోకు

ఓటమి గుణపాఠాలు తీసుకొని గెలుపు కోసం ప్రయత్నించడం ప్రతి మనిషి కర్తవ్యం దీక్షతో గెలుపు పొందు

ఓడిపోతే మరిచిపోదు
ఓటమి వల్ల విజయ పతాకం ఎగుర వేయవచ్చు

ఓటమి మనిషి జీవితంలో
నిరంతర సాధనతో కొత్త మార్గం లోకి కొత్త ప్రణాళిక లోకి ఓటమి భయాన్ని లెక్కచేయక గెలుపు కోసమే ప్రయత్నం చేయడం ఓటమి యొక్క సారమే

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453
3
[07/09, 7:42 pm] Aalla Nageshwar Rao Poet: అంశం; ఓటమి
శీర్షిక :
        "" విజయానికి పునాది ""

పడ్డవాడు చెడ్డవాడు కాదనేది
నాటికి నేటికి మేటి  సూక్తి!
పొందే ప్రతి ఓట మీ
విజయ సాధనకు కావాలి పునాది
అనుభవాల దొంతెరలై
మార్గ దర్శకం చేయాలి!
ఓడామని నిరుత్సాహ పడక
ఓటమికి కారణాలను అన్వేషించి
అన్వేషణలో ప్రగతి సాధించి
విజయ సాధనకై
పట్టు వీడని విక్రమార్కునిలా
అలుపెరగని పోరాటం సాగించాలి
నిత్య కృషివలులై విజయ పదం వైపు  పయనించాలి!
గెలుపోటములు సహజాతి సహజములు
ఓటమికి కృంగక
విజయానికి పొంగక
సమతుల్యత పాటిస్తూ
ఓటమి పునాదులపై
విజయాల సౌధాన్ని నిర్మిస్తూ
ప్రగతిశీల భావకులై
మున్ముందుకు ముందడుగు
 వేయాలి
అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలి!
........................................
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్.....రాష్ట్రం
చారవని సంఖ్య; 7416638823
............................................పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
4
[07/09, 8:00 pm] +91 6281 697 982: అంశం... ఓటమి...07092021
శీర్షిక......పడిన కెరటం
**************************
కవిత లల్లాలని 
నేనైతే కలంపట్టాను
మనసేమో మొరాయించింది
కాగితం గాలికి ఎగిరింది

ఓడిపోవద్దని
ఓటమి చెందొద్దని.......

ఒహ పట్టాన వింటేనా
మర్కట మానసము

అందుకే
వేయి చేతుల
ఒడిసి పట్టాను
తోలు తిత్తుల
మడిసి పెట్టాను

అక్షరాలు
అలుక్కుపోతున్నాయి
కాటరాక్ట్ కమ్మిన కళ్ళల్లో లా

ఆలోచనల ఎగిరిపోతున్నాయి
పక్షిలా రెక్కల చప్పుడు చేస్తూ

పాళీ పగిలి పోయింది
బాధల పోటుకు బద్దలైన 
గుండెలా రెండుగా

సిరా ఆరిపోయింది 
ఏడ్చేసిన గొంతుకలా
పూడ్చేసిన నూతిలా

ముప్పేట దాడిలో
తప్పలేదు ఓటమి
ఓటమి విజయానికి పాఠం.
అవుతుంది గుణపాఠం
మరోసారికి విజయ సోపానం.

స్వీయ రచన కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
07092021.
5
[07/09, 8:07 pm] 
తిప్పావఝల నరసింహ మూర్తి Poet Nellore: కవితా గానం

అంశం:ఓటమి
శీర్షిక:ఓటమే సోపానం
7-9-2౦21
ఓటమికి కుంగిపోను నేను
గెలుపుకు పొంగిపోను నేను
ఓటములే సోపానాలుగా
నిర్మించుకొంటాను గెలుపు సౌధాన్ని..
గెలుపోటములు దైవాధీనం
ఓటమనేది నిర్దేశిత సమయానికి
పరిమితం
మారవచ్చదిగెలుపుగా సందర్భానుసారం.
ఓటమే గెలుపుకు మెట్టు
వి శ్లేషణేవిప్పుతుందిగుట్టు
చక్కని వ్యూహంతో సాగుతాముందుకు
కెరటాన్ని తీసుకొంటారు ఆదర్శంగా.
ఎన్నిసార్లు పడ్డా లేస్తుంది కెరటం
, కొన్ని సార్లు ఓడితే ఎందుకు ఆరాటం?
లక్ష్యాన్ని చేరేవరకు సాగిస్తాపోరాటం
గమ్యం చేరేవరకు
చేస్తాను ప్రయాణం.
గెలవటం కంటే గెలిచే పద్ధతికిస్తా ప్రాముఖ్యం
అక్రమ గెలుపు కంటే ఓటమే గొప్ప.
ఓటమి ప్రయత్నలోపం.
కఠోర శ్రమతో ఓటమికి చెపుతాగుడ్ బై.
ద్విగుణీకృతఉత్సాహంతోశ్రమిస్తా గెలుపు కై.
తిప్పా వఝల నరసింహమూర్తి
బుచ్చి రెడ్డి పాలెం.నెల్లూరుజిల్లా.
6.
కవితా గానం( సీజన్ -2)
ఆధ్వర్యంలో
అంశం:-  ఓటమి
శీర్షిక:- మరణానికి సోపానం
.................................
కనుతెరిస్తే జననం
కనుమూస్తే మరణం
లిప్తపాటు జీవిత కాలం
కష్ట సుఖాల కలయిక మనిషి జీవితం.కష్టాలకు భయపడి ఓటమి ని అంగీకరిస్తే అది మరణంతో సమానమే. ఓర్పు, సహనం కలిగి దృఢ సంకల్పంతో
భగవద్గీత లో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు 
శీతోష్ణ సుఖదుఃఖేషు తథామానవమానయో  అని స్థితప్రజ్ఞతకు దర్పణంలా ఉండి ఓటమి కి  విజయాన్ని ఒకే విధంగా తీసుకుంటే  జీవిత సాఫల్యం చేకూరుతుంది..!!

ఆదరక,బెదరక ఓర్పుతో కష్టపడే వాడికి ఓటమి దరి చేరదు.. మానవుడు ఆశాజీవి.
అబ్దుల్ కలామ్ చెప్పినట్లు కలలు కనండి, ఆ కలలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నించండి.ఓటమి ఎదురైన తిరిగి ప్రయత్నిస్తే తప్పక విజయం మీ పరమవుతుంది అన్నది అక్షర సత్యం అని నిరూపిద్దాం.......!!
...............................
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.
విశాఖపట్నం
9963265762
..............................
హామీపత్రం:-
ఇది నా స్వీయకవిత దేనికి అనువాదం కాదు.
.................................

7.
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం:ఓటమి

ఆ.వె:విజయమందదలచ విధిగ జనులెపుడు
        నేర్పు కనపరచుచు నోర్పు తోడ
            ఓటమినిల యందు నోడించ గల్గిన
         వచ్చి చేరు జయము వలదు జంకు.

2.   ఆ.వె:బ్రతుకు బాట యందు భయపడకుండగ
          నపజయమ్ము నెపుడు నావలకును
         ద్రోయ కలుగు చేయు  తోషము జనులకు
           వలదు సందియమిది పచ్చినిజము.

3.  ఆ.వె:ఓటమినితరుమగ నుర్వియందు కలుగు
           విజయ మెపుడు గాన వెరపు లేక
         ధైర్యమనెడి నాయుధమును బూని చనుము
          వచ్చును విజయమ్ము  వలదు భయము.

4.ఆ.వె:దీపము వెలిగింప తిమిరము జగతిలో
         మాయమగును గాదె మానుగాను
        నటులె  నపజయమ్ము నావలకున్ దోల
         వెదకి కొనుచు వచ్చు విజయ మపుడు.

5.తే.గీ:విజయము వలయు నన్నచో విధిగ కష్ట 
      పడుచు విడువక నోడించ వలయునిలను
      నపుడె పరుగుల నిడుచును నావిజయము
      నిన్ను చేరి ముదంబును నీకొసగును
     

6తే.గీ:ఓటమిని పార ద్రోలిన నుర్వియందు
      విజయ మునుకూర్చు  గావున వెరపు లేక
      ధైర్యమనెడి యాయుధమును తలను దాల్చి
       విజయపథమునసాగుమో వీర పుత్ర.
8
డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఓటమి

మనిషి జీవితంలో ఓటమి సహజమే
జీవితం అంటేనే ఓటమి-గెలుపు భయం

ఓటమి పై గెలుపు సహజాతి సహజం అనుకోకు

ఓటమి గుణపాఠాలు తీసుకొని గెలుపు కోసం ప్రయత్నించడం ప్రతి మనిషి కర్తవ్యం దీక్షతో గెలుపు పొందు

ఓడిపోతే మరిచిపోదు
ఓటమి వల్ల విజయ పతాకం ఎగుర వేయవచ్చు

ఓటమి మనిషి జీవితంలో
నిరంతర సాధనతో కొత్త మార్గం లోకి కొత్త ప్రణాళిక లోకి ఓటమి భయాన్ని లెక్కచేయక గెలుపు కోసమే ప్రయత్నం చేయడం ఓటమి యొక్క సారమే

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453
9.
కవితాగానం 
    నేటిఅంశం :-@  ఓటమి @
       కోరాడ నరసింహా రావు 
     *  చిరునవ్వే.... నీవై... ! *
          ***************
ఓడినవాడికే... గెలుపు విలువ 
తెలిసేది... !
జీవితం  ఎప్పుడూ యే ఒక్కరికీ 
అన్నీ గెలుపులనే ఇవ్వదు !
జీవితమంతా ఓటమిపాలే... 
చేయదు !!
గెలుపు -  ఓటమిల  మిశ్రమ  మే ... జీవితమోయ్... !
ఆటల్లో ఓటమి కాస్తంత బాధనుకలిగించినా...రెట్టించిన 
పట్టుదలతో... సాధించే వరకూ 
ప్రయత్నించే వాడేకదూ నిజమై
న ఆటగాడు !
 ఈ సమాజమూ ఓ ఆట  స్థలమే...,మన జీవితమూ... 
ఎన్నెన్నో ఆటలతో అలరారేదే 
ఓటమితో చతికల బడిపోతే 
ఎలా... !?
మన ఒక్కొక్క ఓటమీ.. ఒక్కొక్క పాఠమై... మనకు గుణ పాఠం నేర్పుతుంది !
నేర్చుకో.... !!
నిజానికి ఈ సమాజక్షేత్రం ఓ 
రంగస్థలమేనని... అందులో నీవూ కొన్నిపాత్రలు పోషిస్తు న్నావని... నీ పాత్రలను నీవు సమర్ధ వంతంగా పోషించాలని 
నాటకం ముగిసిపోతే... ఆపాత్రలేవీ  నీవు కావని..., 
నీవు కేవలం నటించావనే 
సత్యాన్ని గ్రహించగలిగితే 
తత్వజ్ఞానివై తరిస్తావ్... !
అప్పుడిక యే ఓటమీ నిన్ను 
బాధించలేదు !
ఈ జీవితంకూడా జీవుడు కంటున్న కలేనోయ్ !
నీలో మెలకువ కలిగితే... 
ఈ గెలుపోటములకు.. మానవ మానములకూ పొంగులూ ఉండవు...క్రుంగులూఉండవు !
స్థిత ప్రజ్ఞనతోఁ ... నువ్వో వేదాంతపు చిరునవ్వువే... 
అయిపోతావ్.... !!
     *****************
      ....... కోరాడ.
10
శుభసాయంత్రం. 7.9 21
కవితాగానం.
ఓటమికి బాధ పడకు:....
ఓటమికి బాధపడకు
 .ఓరిమితో చరించు
ఓరిముంటే ఓటమియే
గె లుపుకునాంది యని గ్రహించు
అశ్రద్ధ,నిర్లక్ష్యం నీ ఓటమికి
              ఆనవాళ్లు.
పట్టుదల,ప్రయత్నాలు
నీ గెలుపుకు పునాదులు
ఉత్సాహం, ఉద్రేకముంటే
దరి చేరదు ఓటమెపుడు
ప్రపంచయుద్దాలలోన
పథన మైన అజపాన్
పడిలేచిన కెరటంలా
ప్రగతిని సాధించింది
ప్రపంచ ప్రతిభావంతులుఅంతా
ఓడి గెలిచినవారే.
ప్రయత్నాలు ఎన్నో చేసి
ఫలితం పొందినవారే
Our wisdom comes from
Ourexpience.
Our expience from
Our foolishness.
ఓటమి అంటే అనుభవం
ఆ అనుభమిచ్చును గెలుపువరం.
ఇది నాస్వీయారచన.
మోత్కూరి బ్రహ్మా-ఆచార్య.
విశ్రాంత గజిటడ్ ప్రధానోపాధ్యాయులు.
   9848960090.
11.
కవితా గానం ( సీజన్ 2 )
రచన : గొర్రెపాటి శ్రీను 
అంశం: ఓటమి
శీర్షిక : "విజేత"

బ్రతుకు పోరు లో అక్కడక్కడా ఓటమి లు ఎదురవుతాయి !
నిన్ను, నీ ఉనికిని నలుగురు ప్రశ్నించేలా..కారణమవుతాయి !
అలాంటప్పుడే..
"ఓటమిని" ఓర్చుకుని ..
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా..
నిబ్బరంగా నిలబడగలగాలి !
జీవితమంటే..గెలుపు ఓటమిల సంగమం !
ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకుండా
గెలుపు పలకరించి పూల వర్షం కురిపించినప్పుడు పొంగిపోకుండా
గెలుపు ఓటములు జీవితంలో భాగంగా భావించాలి !
"గెలుపు"
మనస్సుకి ఉత్తేజాన్ని అందిస్తుంటే
గెలుపు.. బ్రతుకు ప్రతి మలుపులో ఎదురయ్యేలా
నీ పయనం లో అడుగడుగునా "కృషి" ని తోడు చేసుకోవాలి !
"కృషితో నాస్తి దుర్భిక్షం "అని గ్రహించి
ఓటమిల అగాధాల ని దాటుకుంటూ
ధీమాగా గెలుపు శిఖరాల దిశగా సాగాలి !
నేస్తం..
ఓటమి ఎదురైనప్పుడు
"ఓటమి" నేర్పే పాఠాలను గ్రహించగలిగితే
అవే విజయాలకు సోపానాలై నిలుస్తాయి!
నిన్ను విజేతగా ప్రపంచానికి పరిచయం చేస్తాయి !

"విజేత" అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.                                                                                _ గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
12.
కవితా గానం సీజన్ - 2
అంశం :: ఓటమి
శీర్షిక :: అపజయం అయినా....

అదరకు బెదరకు
భయపడకు కృంగకు
ఓటమి వచ్చేనని
అపజయం అవహించేనని
ఓటమి గెలుపుకు గట్టి పునాది
గెలిస్తే అవుతుంది నీది
ప్రయత్నలోపం వుండకూడదు
నిశ్చయాన్ని మార్చుకోకూడదు
పిరికితనాన్ని మనసులోకి రానీయకూడదు
దౌర్బల్యాన్ని దరి చేరనీయకూడదు
పరీక్ష తప్పిన
సహనం కోల్పోరాదు
ఆత్మహత్యకు పాల్పడరాదు
గుండె నిబ్బరం కోల్పోరాదు
జయం వైపు దృష్టి పెట్టాలి
గెలుపు వైపు గురి పెట్టాలి
విజయం వైపు లక్ష్యముండాలి
మనిషి తలుచుకుంటే వెనుతిరిగేది ఉండదు
గట్టి నమ్మకముంటే
గెలుపు తథ్యం
ఇది ముమ్మాటికీ సత్యం
ఎన్నో నిరూపించాయి నిత్యం
ఓటమి ఓర్చుకో
గెలుపుని గెలుచుకో!!
                  కవిత వేంకటేశ్వర్లు
కర్నూలు.     8309920625
పై కవిత నా స్వీయ రచన అని
హామీ
13
అంశం: ఓటమి
...
రచన: గజవెళ్ళి శ్రీనివాసాచారి 
శీర్షిక:గురువు
...
జీవిత గమనంలో 
గెలుపు ఓటములు సహజమే 

గెలుపుకు పొంగిపోయి 
ఓటమికి కుంగపోతే 
ఏమి లాభం 

ఓటమి నుంచి 
నేర్చుకోవాలి పాఠాలు 
గుణపాఠాలు
ఓటమికి కారణాలు 
విశ్లేషించాలి 
గెలుపుకు మెట్లుగా 
చేసుకోవాలి 

ఓటమిని చీదరించుకోకు 
పడిలేచే కెరటంలా 
ముందుకు సాగాలి
నీ సత్తా ఏమిటో 
నిరూపించుకోవాలి 
జగతికి చాటాలి విజేతవై
14.
[08/09, 8:46 pm] Siimhadri Vani Poetess: అంశం:--ఓటమి
శీర్షిక:--విజయానికి సోపానం
తారీఖు:--8--9--2021
వారం:-- బుధవారం

జీవితమే పోరాటం చేసుకొంటు సాగిపొమ్ము
అనుభవాల పాఠాలను మోసుకొంటు సాగిపొమ్ము

ప్రతిచోటా విజయమ్మును పొందలేక పోయిననూ
గుండెనిండ ధైర్యాన్నీ పోసుకొంటు సాగిపొమ్ము

అపజయాన్ని విజయానికి సోపానం చేసుకొనీ
పద్ధతిగా ప్రణాళికలు రాసుకొంటు సాగిపొమ్ము

ఓటమికీ భయపడకా ఓరిమితో
పయనిస్తూ
నీభవితకు వెలుగురేఖ గీసుకొంటు సాగిపొమ్ము

కృషి చేస్తూ పరాజయపు మొదళ్ళనూ పెకలించీ
విజయానికి విత్తులనూ వేసుకొంటు ‌సాగిపొమ్ము

రాజమార్గ మెంచుకొనీ రాజసంగ పయనిస్తూ
ముళ్ళకంప దారులూ మూసుకొంటు సాగిపొమ్ము

దీక్షతోటి లక్షణంగ ధ్యేయంతో ఓవాణీ
గెలుపు ‌గుర్ర మెక్కేందుకు దూసుకొంటు సాగిపొమ్ము

రచన:-- సింహాద్రి వాణి
ఊరు:--విజయవాడ
చరవాణి:--7569820872
15
[08/09, 8:58 pm] Veera Gudipally: *ఓటమి*
***********
You are my friend

వాడితో పరుగెత్త లేనప్పుడు తెలిసింది
నేనింకా ప్రయత్నించాలని

వాడే మొదటి స్థానంలో నిలిచాక తెలిసింది
నేనింకా చదవాలని

ప్రతీ సారీ నేనేంటో చెబుతున్న
నీకంటే నాకింకెవరు... నేస్తం
ఓటమి కంటే గొప్ప గురువెవరని

Ofcourse nobody likes you..

  But my dear 
Some times you are sweet

పిల్లల చేతిలో ఓడినపుడు
మా ఆవిడ చేతిలో ఓడినపుడు
మా చెల్లి తో , తమ్ముడితో
సరదా వాదనలో ఓడినపుడు
నీవంటే.... చాలా ఇష్టం

 ఇంతకీ ఓటమి గురించి చెప్పమంటే
ఒక్క మాట
నేనెప్పుడూ ఓడిపోలేదు
నీ గెలుపు నా లక్ష్యమైనపుడు
నేనెలా ఓడిపోతాను

ఓటమి నా గెలుపై..నిలిచాక
...... *వీరా గుడిపల్లి*
16.
[08/09, 9:01 pm] Thathapudi Somashekara Sharma: కవితాగానం (సీజన్ 2)
అంశం.. ఓటమి
శీర్షిక..
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

గెలుపు ఓటమిలు
ప్రతి మనిషికి తప్పవు
సుఖ దుఃఖాలు
మంచి చెడులు
గెలుపు ఓటమిలవంటివే

ఓటమికి దుఃఖానికి చెడుకు
ఓరిమి పడితే చాలు
గెలుపుకు సుఖానికి మంచికి
ఆనందించు
గర్వంతో ఉప్పోంగిపోకు
ఎదుటిమనిషిని చులకనగా చూడకు
సంతోషమును అందరికీఇచ్చిపంచుకో

పట్టుదల ఉంటే విజయం నీదే
నిర్లక్ష్యం చేస్తే తప్పదు ఓటమి
జీవితం సుఖదుఃఖముల సయ్యాట
మంచి చెడుల మిశ్రమము
గెలుపు ఓటమిల సంగమం
విజేతగా గెలుపు పొందు
విఖ్యాతగా పేరుగాంచు
ఓటమికి బాధ పడకు
ఓనమాలుతో ప్రారంభించు
విశ్వవిజేతవై శోభిళ్లు పరిమళించు

హామీపత్రం
                ఈ కవిత నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
17.
కవితా గానం(సీజన్ 2).        8--9--2021.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- ఓటమి.

1. తే.గీ.
గెలుపు నోటములు సహజములగు నిలను
పొంగిపోకు మెపుడు జయమొందగానె
యటులె క్రుంగవల దపజయమ్ము కలుగ
నదియె గెలుపుకున్ సోపానమని యెఱుంగు.

2. తే.గీ.
ఆశయమ్మును సాధించు యత్నమందు
నపజయమ్ము కలిగిన నిరాశ పడక
నెన్ని సార్లైన నోటమి నెదురుకొనుచు
మరల నొకమారు యత్నించ మరువ వలదు.
18.
*కవితా గానం సీజన్ 2*
తేదీ:08-09-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: ఓటమి
*******************
ఓటమిని చూసి ఎందుకలా చిగురుటాకులా వణికి పోతావు
ఇక జీవితంలో గెలుపు వెలుగు లేదని కృంగి పోతావు..

నిరాశా నిస్పృహలకు ఆతిథ్యం ఇచ్చి
నీ మనసు ఇంటి దూరాలను లెక్కించమంటావు...

ఓటమి నేర్పిన అనుభవాలే
విజయానికి సోపానాలనే పరిజ్ఞాన మరుపెందుకు..?

 ఓటమి చెప్పే పాఠాలే
సుఖ జీవన ప్రస్థానానికి రహదారులని తెలిసీ విలపిస్తావెందుకు..?

రేయీ పగలనక సాగరం చేసే సాధన చూడు ..

క్షణమైనా ఆగని అలల పోరాటం
పడుతూ లేస్తూ తీరం చేరేందుకు పడే ఆరాటం...

 లక్ష్యమన్నది ఖరారు అయ్యాకేగా
విలక్షణంగా గెలుపు సాధించేది

3. తే.గీ.
బ్రతుకు,నాటల సమరాన పట్టుదలయు
నాత్మ విశ్వాసము, శ్రమయు నవసరంబు
కలుగ నివియన్ని విజయమ్ము కచ్చితముగ
దొరకు నోటమియు పాఱు తోక ముడిచి.

4. తే.గీ.
ఓటమి యెదురైనను గాని యోర్పుతోడ
లక్ష్యమున్ జేరువరకు నలక్ష్యమింత
చూపకుండ సహనమును చూపగాను
విజయమే వచ్చు నీదరి వెదకుకొనుచు.
**************************************
19.
[09/09, 8:19 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవన గానం సీజన్ 2 నిర్వహించు కవితల సమాహారం

అంశం: ఓటమి

     *ఒక పక్షమే* 

బలహీన క్షణాలే
బలవంతుని చేస్తాయి
జ్వరంతో జ్వలనమైన దేహం
తిరుగుబాటు వెనుకాడదు
మూడక్షరాలు నిస్పృహకు గురిచేస్తే
కృంగుబాటు కూడకు
వందసార్లు వెనక్కు లాగిన ఓటమి
విజయారోహణక్రమంలో తత్ఫలితం సత్ఫలితం!
ఓటమి ఎప్పుడూ వెనుకబాటుతనం
ఆత్మవిశ్వాసం చొరబాటుతనం
జిగీషకు గట్టి పోటీ
మొద్దు పోయిన ఉత్తేజానికి 
వాదర పెట్టిన ప్రోద్బలం
ఓటమికి సమాధి కడుతుంది!
ప్రయత్న శూన్యమే మిగిలిపోతే విజయదరహాసం ముందు ఓటమి వెక్కిరిస్తూ సిగ్గుపాలవుతుంది!
ఎప్పుడూ వెరవకు ఓటమికి
ఫణంగా నూరిపెట్టు విజయానికి
తలవంపుకు మరీమరీ తలచకు
తల దించకు తుదికైనా గెలుపుకు!
       ***
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
          
        హామీ పత్రం
     ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
20
[09/09, 8:25 pm] Aparajith: ఓటమి!

గెలుపు ధైర్యాన్నిస్తే 
ఓటమి కృంగదీస్తుంది!
మహోన్నత ఆవిష్కరణలన్నీ 
అనేక పర్యాయాలు ఓటముల పాలయ్యాయి 
ఓటమి దగ్గరే ఆగిపోతే 
ఇంతటి సైన్స్ ఆవిష్కరణలేవి సాధ్యపడేవి కావు!
చెట్టు మొలకెత్తిన దగ్గరనుంచి 
విరిగి నలిగి పెరగడానికి 
నానాపాట్లు పడుతూ చివరికి విరబూసిన చెటైనట్లు!
మనిషి మనుగడ అభివృద్ది పథంలో సాగడానికి 
ఎన్నెన్ని బ్రతుకు పుటలు చిరిగిపోయాయో!
మొగ్గలొనే చిదిమివేయబడ్డ బ్రతుకులెన్నో 
అయినా లోకం పోకడ వైవిద్యాల పరంపరతో 
అపజయాలు దాటుకుని గెలుపు బావుటాలెగరేస్తూ,,,,,,!
సామాజిక ఉద్యమాలు మార్పుకోసం 
చేసే ప్రయత్నాలు తొలుత ఓటమి పాలైనా 
తుది విజయం సత్యవంతమైన మార్పుకే!
నిరంతర ఓటములతో మనిషి కృంగి కృశించిపోయినా 
సంకల్పంలో ప్రయత్నాల్లో లోపం లేకుంటే 
తుది గెలుపు ఎంతో సంతృప్తినిస్తుంది!

అపరాజిత్ 
సూర్యాపేట

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...