నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
న్యాయ నిర్ణేత
శ్రీమతి జ్ఞాన ప్రసూనా శర్మ గారు
***********"*****
1.కొలచన విజయ భారతి గారు
2.సుధారాణి కృష్ణం రాజు గారు
3.డా.బల్లూరి ఉమాదేవి గారు
4.ఇంద్రవత్ రాహుల్ గారు
5.భరద్వాజ గారు
6. ఎ.భూపతి గారు
7.వేదాల ఇందిర గారు
8.చెన్నా విజయ లక్ష్మి గారు
9.పరాంకుశం రఘు నారాయణ గారు
10. కె.సి.నరసయ్య గారు
11.మిట్టా లక్ష్మి గారు
12.సునంద వురిమిళ్ళ గారు
13.గాజుల భారతీ శ్రీనివాస్ గారు
14.సత్య నీలిమ గారు
**********
1
03/11, 8:05 PM] కొలచన విజయ భారతి Poetess: కవన జ్యోతి
పేరు: కొలచన విజయ భారతి
ఊరు: హైదరాబాద్
అంశం:కల్తీ
తేదీ:3-11-2020
*********************
కుక్క పిల్ల..
సబ్బు బిళ్ళ..
అగ్గి పుల్ల..
కాదేదీ కవితకనర్హం అన్నారు
నాడు శ్రీశ్రీ గారు.
కానీ నేడు కాదేదీ కల్తీ కనర్హం
అంటున్నారు నేటి "కల్తీ శ్రీ"లు
పాలు కల్తీ నీళ్ళు కల్తీ
పప్పు కల్తీ. ఉప్పు కల్తీ
నేయి కల్తీ. నూనె కల్తీ
కారంలో రంపం పొట్టు కల్తీ
మిరియాలలో బొప్పాయి
గింజలు కల్తీ
ఓటు కల్తీ. నోటు కల్తీ
రాజకీయ నాయకులు చేసే
వాగ్దానాలే అతి పెద్ద కల్తీ
సమాజంలో జీవన పయనమే
సహజత్వానికి దూరమై
అసహత్వంతో నిండిపోయింది
కృత్రిమ అవయువాలు ధరించి
మానవ దేహమే కల్తీ అయిపోయింది
అసలుకన్నా పైపై మెరుగులపూతల మోసమే
అందంగా ఉంటుంది
అసలేదో,నకిలీ ఏదో తేలీని
మాయాజాలంలో
ప్రపంచం పయనిస్తోంది
🌺🌺🌺🌺🌺
2
[03/11, 8:07 PM] +91 74165 92715: 🙏🙏కవన జ్యోతి🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*అంశం*కల్తీ*
*కల్తీ*కల్తీ*నేటి సమాజం "కల్తీ"లమయం ఎక్కడ చూసినా అక్కడ "కల్తీ" ఇది నేటి సమాజ స్థితి
*నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి వ్యాపార కాంక్షతో తోటి మనుషుల బాగోగులు చూడకుండా కేవలం లాభాపేక్ష తోనే బ్రతుకుతున్న మానవ నైజం*
ఎంత సంపాదించామని తప్ప ఎలా సంపాదిస్తున్నామన్న జిజ్జాస లేక "కల్తీ "చేశయినా సరే పాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాల దిశలో వ్యాపారం చేయడమే లక్ష్యం పాల రుచిని
మార్చి మనుషుల మీద ప్రయోగం
*కల్తీ*పాలు తాగిన తరువాత బయట పడుతున్నాయి వ్యాధులు దానితో ఆరోగ్య కేంద్రాలకు పరుగు పెడుతున్నారు జనాలు*
తినుబండారాలకు అలవాటు పడిన జనం ఇంట్లో చేయలేక పానీ పూరీలు నూడిల్స్ సుష్టుగా తిన్న తరువాత కాని దానిలో వాడిని నీరు, మసాలా, నూనె.అన్నీ కల్తీ అన్ని విషయం
మరునాడు వాంతులు , జ్వరం
ఇవన్నీ వచ్చినప్పుడు తెలుసుకుని చేసేది లేక ఆసుపత్రుల పాలు
*భోజన శాలలు, టిఫిన్, సెంటర్ లు వీటన్నింటిలో వస్తువులను వేడి చేసి ఇచ్చినా
గమనించకుండా లొట్టలేసుకుంటూ తిని ఇంట్లో వంట నచ్చక ఆ కల్తీ వంటకాలనే రుచికరమైనవి తిన్నామన్నా సంతృప్తి చెందిన
వినియోగదారులు ఉన్నంత వరకు కల్తీ లకు చరమాంకం ఉండదు*
*నెయ్యి లోను కల్తీ పప్పు , బియ్యం, పసుపు, కారంపొడి
బియ్యం లోను ప్లాస్టిక్ బియ్యం
వినడానికే విడ్డూరం*
తాగునీరు కూడా కల్తీ నీటి వ్యాపారం చేసేవారు కూడా నీటిని అపరిశుభ్రంగా సరఫరా చేయడం వలన అనేక వ్యాధులు
*మద్యానికి బానిసైనవారు కల్తీ మద్యం సేవించి కల్తీ ఆహారం తినడం వల్ల ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను వంటరి వారిని చేసిన వారు లెక్క లేనంత మంది
కాలం కాని కాలంలో పండ్లను ముగ్గించడానికి రసాయనాలు వాడి వాటిని విక్రయిస్తే వాటిని కొని ఫ్రిడ్జ్ లో భద్ర పరుచుకుని మరీ రోగాల బారినపడుతున్నారు*
మందులు కల్తీ ద్వారా అనుమతి లేకుండా నే వారి మందులను అమ్మడం వలన
ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు
అందుకు కారణం కల్తీ కల్తీ
*తనిఖీ లు చేపట్టే నిఘా నేత్రం
వాటిని అరికట్టేందుకు ముందుకు రాలని ధృతరాష్ట్రులు ఉన్నంత కాలం
ఏదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం కల్తీ విక్రయాలు తప్ప సమాజంలో
మరణాలు తప్ప*వ్యవస్థ లో మార్పు రావాలి అనేకన్నా జనంలో చైతన్యం వచ్చి
ప్రశ్నించి న నాడు కల్తీ రాక్షసిని
మట్టు పెట్ట వచ్చు*🙏🙏👍
3
[03/11, 8:17 PM] Balloori Umadevi Poetess: కవి సమయం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం:కల్తీ.
ఆ.వె:నకిలి మందులవియు నరుల ప్రాణములను
దీయుచుండు నిజము దేశమందు
పంటకైనగాని వొంటికైననుగాని
హానికల్గజేయు ననవరతము.
ఆ.వె:మంచి విత్తనాలు మానుగా కొనితెచ్చి
పొలము నందు విత్తి పురుగు మందు
కూడ జల్లి యెదురు జూడ పంటచెడగ
నకిలి మందువల్ల నష్టపడియె.
ఆ.వె:గుండె చెరువు యగును కువలయమందున
కల్తి చేయ మందు కర్షకులకు
కాలిపోగ పంట కన్నీరు మిగలగ
తల్లడిల్లు చుంద్రు తపన తోడ.
ఆ.వె:కలిమి కాశ పడుచు కల్తిమందు లొసగ
బాధ్యుడౌదు వారి బాధలకును
నమ్ముకొన్న వారి నాశము కోరకు
హితము కలుగ బోదు నిలను నీకు.
ఆ.వె:వెలయు నెక్కువైన విరివిగా పండున
టంచు దలచి దెచ్చి యన్నదాత
నెరువు లన్ని వేయ నెదుగు దలయు లేక
నరసి నకిలిమందు లనగ కుమిలె
ఆ.వె.స్వార్థబుద్ధి తోడ జగతిన కొందరు
మందు కల్తి చేసి మహిని నమ్మ
వాడినట్టి జనులు వసుధలో మరణింప
దూరమగును శాంతి దోషి యౌను.
ఆ.వె:పుడమిలోన జనులు పురుగు మందుల కల్తి
చేసి యమ్ము చుంద్రు కాసుల కాశించి
నట్టి వారి వలన నన్నదాత బతుకు
కాలి బూడి దౌను గడియలోనె.
4
[03/11, 8:29 PM] Indravat Rahul Poet Ks 11: *కవన జ్యోతి*
===========
అంశం : కల్తీ
తేది : 03/11/20
శీర్షిక : జీవితమంతా కల్తీ
*జీవితమంతా కల్తీ*
కల్తీ కల్తీ అంతా కల్తీ
మానవుని మనసు కల్తీ
మొత్తం కల్తీ
మనసంతా కల్తీ
చూసే చూపుల్లో కల్తీ
పలికే మాటల్లో కల్తీ
నడిచే నడకలో కల్తీ
నవ్వే నవ్వులో కల్తీ
తినే పదార్థము కల్తీ
ప్రకృతి కల్తీ
అంతా కల్తే జీవిస్తున్న
జీవితం మొత్తం కల్తీ...
*ఇంద్రావత్ రాహుల్*
*కొత్తపేట్*
నిజామాబాద్
9848054079
5
[03/11, 8:42 PM] భరద్వాజ గారు: 🎊🌱కవనజ్యోతి 🙏
పేరు-భరద్వాజరావినూతల
ఊరు -కొత్తపట్నం
9866203795
రచన-6
03-11-20
అంశం- కల్తీ
శీర్షిక -సర్వాంతర్యామి --!
మట్టినవ్వితే పరమాన్నం -
నీరునవ్వితే చైతన్యం -
నింగి నవ్వితే తొలకరి -
నిప్పునవ్వితే వెలుతురు -
గాలినవ్వితే ఊపిరి -
కానీ పంచభూతాలను తనలో దాచుకున్న మనిషినవ్వితే కాలుష్యం వైషమ్యం
కల్తీగా బ్రతకటం -
కల్తీగానవ్వడం -
కల్తీ గామాట్లాడడం మనిషికి వెన్నతో పెట్టినవిద్య
గాలినీరు నిప్పు అన్ని కల్తీ అయినఈదేశంలో -
కల్తీ కానిదేది -కల్తీ లేకుండా నడిచేదియేది -
తల్లిపాలుతప్ప కల్తీ లేనివస్తువులేదు -
ప్రేమలుబంధాలు -
తల్లిదండ్రులూ
గురుశిష్యులూ -
భార్యాభర్తలూ -
వీళ్ళందరూ మనస్సులో కల్తీ లేకుండా నడుస్తున్నారని నిజం -
నేతిబీరలో నెయ్యితియ్యడమే -
ఈరోజుల్లో కల్తీలేని కల్మషం లేని ప్రేమనివెతుక్కోవడం -
గొంగళిలో వెంట్రుకలురాకుండా కూడూతినడంలాంటిదే -
ఇదినాస్వీయరచన
భరద్వాజ రావినూతల (RB)✒️
6
[03/11, 8:45 PM] Bupathi Sir: ...........కల్తీ........
కల్తీ లేని కాలం కాలమాయే...
మనసులోని కల్తీ మనిషిని
మరగుజ్జు చేసే....
నిత్యావసర సరుకుల కల్తీ
ఆరోగ్యాన్ని అంతం చేస్తే
నమ్మక ద్రోహాలు మనిషిని,
మోస పూరిత ఆకర్షణ
మాట ల కల్తీ మనిషి నే
మయం చేస్తుంది...
చెప్పే మాటలో ఇచ్చే సరుకులో
చూసే చూపులో, మందు లో,
పండులో ,పాలలో,నీలలో,
ఎక్కడ చూసిన కల్తీ...
కల్తీ కల్లు, మధ్యం, ఆకరకు
ఆర్థిక నోట్ సహితం ,
కల్తీ గా కబడటం ఓ చిత్ర
దృశయం..... నేడు ఈ
కల్తీ సామ్రాజ్యం లో
మని షి కొట్టుకొని విల విల
లాడే జీవనానికి ప్రతి రూపమై
సాగుతున్నాడు..... మార్చే
శక్తి మానవుని కెపుడో....
........
ఈ కవిత నా సొంతం ,ఎక్కడ ప్రచురించ లేదు...
ఏ , భూపతి.. ఎల్బీనగర్ హైద్రాబాద్..
7
[03/11, 8:54 PM] +91 98858 21189: కవనజ్యోతి
అంశం: కల్తీ
వేదాల ఇందిర
శీర్షిక: కల్తీ ని గుర్తించండి
చౌకగా దొరికే పదార్థాలతో మంచి పదార్థాలు కలపడమే కల్తీ
అనగా కలిపి చెరపడం
కల్తీ గురించి చెప్పాలంటే వారం సరిపోదు
తినే మెతుకు మెతుకు కల్తీ నే
పిల్లలు తాగే పాలు గుక్కెడు విషమే
చిన్న పిల్లల శారీరక మానసిక ఆరోగ్యం దోచేస్తోంది ఈ మాయదారి కల్తీ
కల్తీ మద్యానికి బలయ్యే ప్రాణాలెన్నో
పెట్రోలు డీజిల్ సంగతి చెప్పనలవి కాదు
ఆహారపదార్థాలే కాదు ప్రతి వస్తువూ కల్తీ యే
ఇందుగలడందు లేదని లేదు ఈ కల్తీ
ఇంతింతై వటుడింతైనట్లు విస్తరించి
ప్రజల ను అనేక
అనారోగ్యాలకు గురి చేసి చివరకు ప్రాణాలు హరంచివేయుచున్నది కదా ఈ మాయదారి కల్తీ
వ్యాపారుల లో నైతికత లేకపోవుట ప్రజల పేదరికమే అకటా ఈ మాయదారి కల్తీ కి ప్రధానంగా కారణభూతాలాయె
ఈ కవిత నా స్వీయమేని హామీ ఇస్తున్నాను .
ధన్యవాదాలు.
8
[03/11, 9:02 PM] Vijayalakshmi Ch KS 38: కవనజ్యోతి
అంశం :కల్తీ
తేది :03-11-2020
శీర్షిక :సర్వాంతర్యామి
పేరు :చెన్నా విజయలక్ష్మి
ఊరు :బీర్కూర్, కామారెడ్డి
************************
కల్తీ.. కల్తీ... కల్తీ... కల్తీ...
సర్వాంతర్యామియై వెలుగుతోంది
ఆహారం నుండే ఆరోగ్యం అన్నది ఆర్యోక్తి
అనారోగ్యానికి బాటలు వేయు నేటి ఆహారం నేటి సూక్తి
అధిక దిగుబడికోసంవాడే ఎరువులు కల్తీ
త్వరిత పక్వము చేసే ప్రక్రియలు
తాజాదనంకోసం వేసే వెర్రి వేషాలు
తాగేనీటినుండి తినే ప్రతీ పదార్ధం
తినే ప్రతీ పదార్ధమూ ఎంతోకొంత కల్తీ...
చేయకుంటే లేదు సంపాదనకు ప్రశాంతి..
అవసరం తీరడంకోసం
అవసరం తీర్చడంకోసం
హంగు ఆర్భాటాలకోసం
ఆస్తులకోసం అనుబంధాలు
బంధాలకోసం ఆప్యాయతలు
స్నేహం ముసుగులో మిత్రులు
జీవన గమనంలోనూ నేనున్నానంటూ
పుట్టుక నుండి చావు వరకూ
"అ "నుండి "ఱ "వరకు అన్నింటా తానై వైరసై...
అన్ని వ్యవస్థలనూ అతలా కుతలం చేస్తూ.....
ఇందు గల డందు లేదను సందేహమువలదంటూ
సర్వత్రా వ్యాపించిన కల్తీ...
అమ్మ పాలను కూడా కల్తీ చేసే దిశగా సాగిస్తోంది...
తను విజృంభిస్తూ...
విజయభేరి మ్రోగిస్తూ...
మానవ పతనానికి బాటలు వేస్తూ...
మేలుకో... మానవా....
నీ తప్పును తెలుసుకో...
నిన్ను నీవు దిద్దుకో....
ఆరోగ్య వంతమైన మానవ జాతి మనుగడకు...
బాటలు వేయి....
హామీ ::ఇది నా స్వీయ రచన
.. చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్, కామారెడ్డి
9
[03/11, 9:06 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవన జ్యోతి ఆధ్వర్యంలో*
కవితా అంశం :కల్తీ
++++++++++++++++++++
*కవితా శీర్షిక: కల్తీ- గల్తీ*
++++++++++++++++++++
మనిషి మాయాజూదంలో
కల్తీ ప్రపంచం రాజ్యమేలుతోంది!
మనిషిని కట్టిపడేసే కనికట్టు విద్యతో..
నేడు మనిషిని మనిషి మోసగించే...,
అనాగరికత విషం చిమ్ముతోంది !
ప్రతి ఆలోచన వ్యాపార కోణమే !
దానంలో స్వార్థం ఓ.. కల్తీ!
ఔదార్యంలో కీర్తి కాంక్ష ఓ.. కల్తీ !
సహకారంలో మరొకటి ఆశపడటం కల్తీ!
స్నేహంలో భావిఆసరా అనే కల్తీ!
మనిషిని మాటలతో మోసంచేయడం ఓ.కల్తీ!
రాజకీయ నాయకుల్లో శుష్క వాగ్దానాల కల్తీ !
అమ్మతనంలో పోతపాలు ఓ.. కల్తీ !
విద్యాలయాలలో వ్యాపార ధోరణి ఓ. కల్తీ !
వినోదంలో ధనాకాంక్ష ఓ.. కల్తీ!
శ్రమజీవిలో సుఖ జీవనం ఓ. కల్తీ!
ఔషధాల్లో ఆకర్షణల నేపథ్యం కల్తీ!
వ్యవసాయంలో నిస్సారపంట కల్తీ !
విత్తనాల్లో నాసిరకం విత్తనం కల్తీ!
పురుగుమందుల్లో దోపిడీ చెదలు కల్తీ !
జీవనంలో యాంత్రికత ఓ.. కల్తీ!
వస్తూత్పత్తిలో మిస్మరిజం కల్తీ !
ప్రతి అడుగులో ధనదాహం కల్తీ!
వ్యాపారంలో లాభాపేక్ష కల్తీ!
నాయకగణంలో పదవీకాంక్ష కల్తీ!
ఆహార ఉత్పత్తుల్లో నాణ్యతలేమి? ఓ కల్తీ !
భూవిక్రయాల్లో దళారీమాటలు కల్తీ!
విద్యార్థుల్లో విద్యా ప్రమాణాల లోటు కల్తీ !
ఉద్యోగుల్లో లంచగొండితనం కల్తీ!
సమస్త విశ్వం కల్తీమయం!
సర్వత్ర సర్వం గల్తీమయం !!
++++++++++++++++++++
-పరాంకుశం రఘు నారాయణ
మహబూబాబాద్
10
[03/11, 9:11 PM] KC Narsaiah KS 26: కవన జ్యోతి కవిసమయం
పేరు: కట్టెకోల చిన నరసయ్య
ఊరు: బోదులబండ
జిల్లా: ఖమ్మం
అంశం: కల్తీ
చరవాణి: 7981814784
శీర్షిక: కాదేది కల్తీ కనర్హం
మారిన సమాజం వ్యాపార మయం
మారుతున్న సమాజం కల్తీ మయం
మారని మనిషి ఆగని అవినీతి
నీతిలేని పోకడలు అవినీతికి పరాకాష్ట
గతి తప్పుతున్న మతిలేని మనుగడ
ఓటుకు నోటులో పేదోడికి పన్ను పోటు
అవినీతి పడగలో
బుసలు కొడుతున్న రెవెన్యూ రాజు
అభివృద్ధి పరుగులో అవినీతి ప్రవాహం
కలరా వ్యాధిలా కల్తీ కరాళ నృత్యం
కల్తీకి రక్షణ కవచమయిన అవినీతి
అవినీతికి అండదండగా రాజకీయ పోకడలు
తింటున్న తిండి తాగుతున్న పాలు నీళ్లు
నిర్మిస్తున్న ప్రాజెక్టులు భవనాలు
వైద్యంలోనూ విద్యలోనూ నిత్యవసర వస్తువులలోనూ
ఒకటేమిటి అందు ఇందు ఎందెందులోనూ
పతాక శీర్షికన రాజ్యమేలుతున్న కల్తీ పాలన
ప్రజల నాలుకల్లో తిరుగుతున్న వాక్యం కాదేదీ కల్తీ కనర్హం
గడచిన ఉద్యమాల అనుభవాలు
11
సమస్యల పరిష్కారాలపై సమాలోచనలు
11
[03/11, 9:18 PM] +91 94400 97002: కవన జ్యోతి
3 /11/ 2020
అంశము :కల్తీ
.........................
మిట్టా లక్ష్మి
చిత్తూరు
చరవాణి:9440097002
................................
ద్వాపరయుగం తరువాత
దాపురించినది కల్తీయుగం
అక్షరాల ఇది సత్యం...
కాదే ఇది కలియుగమే అని
అనుకుంటే కూడా కలియుగం ప్రధాన లక్షణం కల్తీ
కల్తీ చేయడంలో సిద్ధహస్తులం
ఎందుకంటే మనం కల్తీమనుషులం
కల్తీ తిండి..కల్తీ వాతావరణం
కల్తీ మనసులు..కల్తీ బంధాలు
కల్తీ లో ఘనులం మనం..
గాలినీ , నీటిని, భూమిని
కల్తీ చేసి ఆ కల్తీని నింగివరకు
ఎగబాకించేసి ఓజోన్ పొరకు
చిల్లులు చేసిన ఘన చరిత్ర
ఉన్నవారం....నిలచినవారం
కంటికి కనిపించకుండా
మన చుట్టూ ఎన్నో కల్తీలు
ప్రతిదీ వ్యాపార వస్తువు
వస్తువులన్నీ కల్తీలే
భుక్తి కల్తీ భక్తి కల్తీ
దానం కల్తీ స్నేహం కల్తీ
ప్రేమలు కల్తీ పెళ్ళీ కల్తీ
విద్యా భ్యాసం కల్తీ
పరీక్షలు కల్తీ ఫలితాలు కల్తీ
పంటలకు గింజలు కల్తీ
పైరులకు ఎరువులు కల్తీ
పసిపిల్లల తిండికి కల్తీ
ఆఖరికి బెజవాడ దుర్గమ్మ
అర్పించే నెయ్యి కల్తీ...
దేవుళ్ళకి కల్తీ బాధలు తప్పలేదు
మరి మానవ మాత్రులమైన మనమెంత? మన బతుకెంత?
చివరకు మందులు కల్తీ
వైద్యశాలకు వెళితే వైద్యం కల్తీ
చివరకు స్వర్గసీమ అయిన ఇంటిలో కూడా ఈ కల్తీ దాపురించింది
అనుబంధాలు కల్తీ
ఆత్మీయతలు కల్తీ
మాటలు కల్తీ మమతలు కల్తీ
స్వార్థం నిలువెల్లా ఆవహించి మనిషి అన్నిటినీ కల్తీ చేసి పారేశాడు
అకటా! వెదికి చూసినా
కల్తీ లేని ప్రదేశం లేదు
మనిషి లేదు వస్తువు లేదు అంతా కల్తీ కల్తీ కల్తీ
సర్వం కల్తీ మయం
కలి ఆగ మనమే శరణ్యం
కల్తీ లను అంతం చేసి దుష్టశిక్షణ చేసి పరిశుద్ధంగా ధరించి కొత్త మానవ చరిత్రను ప్రారంభించడానికి కలియే శరణం
...................................
ఈ కవిత నా స్వీయ రచన దేనికి అనుకరణ కాదు.
12
[03/11, 9:20 PM] సునంద ఉరిమిళ్ళ: *కవన జ్యోతి*
తేదీ:03-11-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం:కల్తీ
********************
ఊపిరి గుక్క పట్టి ఏడుస్తోంది
వడపోతల వలపోతలతో అలసిపోయి అంతః కుహరంలో ముడుచుపోతున్న ఆకారాన్ని చూసి...
స్వచ్ఛమైన ప్రాణవాయువు చిరునామా దొరక్క..
గుక్కెడు నీళ్లు గుబులు పడుతున్నాయి
గొంతు తడిపే నీళ్ళలో గోరంతైనా స్వచ్చత లేక.
వట్టిపోయిన గొడ్డులా మారిన
పల్లె తల్లి దేహాన్ని చూసి..
అవును. ఎటు చూసినా కల్తీ
పంట దిగుబడి కోసం
ఎరుపుల కల్తీ!
ఎటు చూసినా కల్తీ
నోటి తో మాట్లాడుతూ నొసలు తో వెక్కిరించే మాటల కల్తీ!
అవసరాల కోసం అవతారాలను ఎత్తే వికృత భావాలు..
ఇందు కలడందు లేదను సందేహం లేనే లేదు!
అంతటా సర్వాంతర్యామియై సంచరిస్తున్న సమయంలో..
అదిగో ..వేగు చుక్కలా
అమ్మ పాల స్వచ్చధనం ..
ఇంకా బతుకు మీద ఆశలు కల్పిస్తూ..
బతుకుల్లో పిడికెడంత ఆశ
కల్తీలేని ప్రపంచం..
వెతుక్కుంటూ వెళితే
అమ్మ పాలు బోసినవ్వు..
.
కల్తీ ప్రపంచంలో బతకడం
గొంగట్లో మెతుకులు
ఏనాటి కైనా మారేనా రోజులు
13
[03/11, 9:22 PM] Gajula Bharati KS 20: కవనజ్యోతి
**********
అంశం:కల్తీ
శీర్షిక:విషతుల్యం
అందివచ్చిన సాంకేతికతతో
ప్రకృతికి-వికృతిగా మారి
కల్తీ సామ్రాజ్యానికి నేనే రాజు,,నేనే మంత్రినంటూ
సకలం, సమస్తం కల్తీమయం చేస్తున్నారు
డబ్బుకు దాసోహం లోకం
పచ్చనోటుకు పాదాక్రాంతం జగం
ఇందుకలదు, అందులేదన్నా సందేహం వలదు..వలదు అన్నట్టు అంతా.. అంతటా..కల్తీ..కల్తీ..కల్తీ
చడీ చప్పుడు లేకుండా
చాపకింద నీరులా విశ్వవ్యాప్తమై
జీవజాతుల ఉనికే ప్రమాదకర అంచున ముప్పు ఏర్పడి మరణమృదంగం మోగిస్తున్నా మహమ్మారి మాయదారి కల్తీ!
చల్లని చంద్రోదయాలు
వెచ్చని సూర్యోదయాలు కల్తీకి మినహాయింపు కాబోలు
సకలం..సమస్తం కల్తీతో భస్మంచేసి
పచ్చనోట్లతో స్వచ్ఛతను తీసుకురాగలమా??
మానవ!
స్వార్ధపు ఆలోచనలు వీడి
ఆశ,అత్యాశలూ విడనాడి
నేడు నువ్వు చేసిన కల్తీనే
రేపు నిన్ను కబళించే మృత్యువని మరువకు
స్వచ్ఛతగా ఉంటూ..ఉండేలా చేస్తూ పునుకుందాం
విశ్వ కల్యాణానికి పందిళ్లు వేద్దాం!
మానవ వికాసానికి దోసిళ్లు పడదాం!!
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
గాజుల భారతి శ్రీనివాస్
ఖమ్మం
9849788108
*****************
యువత మేల్కొనాలి
సమాజ రుగ్మతలపై జులుం జుళి పించాలి
14
కవనజ్యోతి
అంశం:కల్తీ
శీర్షిక : కల్తీ
ఎక్కడ చూసినా కల్తీ
సహజ వనరుల కల్తీ
మనిషి చేస్తున్నాడు కల్తీ
అవుతున్నాడు మనిషే కల్తీ
అవసరానికి మాత్రమే
అవుతున్నాయి బంధాలు
ఆ బంధాలు కూడా కల్తీ
ఊహలలో బ్రతుకుతూ
వాస్తవాన్ని విస్మరిస్తూ
అనుబంధాలు అన్నీ కల్తీ
నీరు కల్తీ, గాలి కల్తీ
పాలు కల్తీ, నూనె కల్తీ
సమాజమే కల్తీ కల్తీ
భావితరాలను కాపాడాలి కల్తీ అనే మహమ్మారి నుండి
మారాలి మనిషి
స్వచ్ఛమైన నవ వనరులను
ముందు తరాలకు అందిద్దాం
కల్తీని నాశనం చేద్దాం...
✍..సత్యనీలిమ,
Comments
Post a Comment