Skip to main content

గీతా మార్గం 24/11/2029

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ (వెన్నెల శిల్పం కవయిత్రి)

వీరా గుడిపల్లి

****************""************

కవివరుల జాబితా

1.అపరాజిత్ గారు

2.కోరాడ నరసింహారావు గారు

3.సుధారాణి కృష్ణంరాజు గారు

4.సునంద వురిమళ్ళ గారు

5.భరద్వాజ గారు

6.డా.సి‌హెచ్ ఆంజనేయులు గారు

7.కెసి నరసయ్య గారు

8.సంధ్యా శర్మ గారు

9.వల్లాల విజయ లక్ష్మి గారు

10.మర్రి జయశ్రీ గారు

*************[24/11, 8:23 PM] Aparajith: 

1

జీవిత పాఠం 

జీవితం ఓ ఆరాటం ఓ పోరాటం 

ఒక సమస్య వెంట ఇంకొకటి తయారు 

గీతా పఠనం, ధ్యానం దినచర్య చేసుకో 

పలువురు నీ ఓటమిని చూసి గెలిచేస్తున్నారని బాధపడకు !

ప్రశాంతంగా నీ వనుకున్న రంగం లో 

అలుపెరుగని శ్రామికునివై ఇష్టపడి కష్టపడు 

శ్రమే నీ ఆయుధం !

ఆ భగవంతుడు ఉన్నత శిఖరాలపై నిలబెడతాడు !!

నీవిక కోలుకోలేవని సంబరపడ్డ వాళ్లే నీ కోసం అర్రులు చాస్తారు !

కస్టపడితే జీరో నుంచి కూడా ఎదుగుతావ్ !

నీకు ఎవరూ సహాయం చేయరు 

నీకు నీవే తన్నుకుని గుద్దుకుని బయటపడాలి !

నిరంతరం భగవత్ ధ్యానం చేయ్ 

నీ మానాన నీవు దారిలో వెళ్తుంటే 

ఓ పది మంది పనిగట్టుకొని రాళ్లు విసిరితే 

పిరికి వాడైతే పారిపోతావ్ !

ధైర్యవంతుని వైతే ఎదురు తిరిగి రాళ్లు విసురు !

మేధావివైతే విసిరిన రాళ్లతో మేడ కట్టుకుంటావ్ !!

అన్ని వేళల జయం నీదేనని మిడిసిపడకు 

ఇప్పుడు నీవు తరువాత ఇంకొకరు !

నీ జీవితం నేర్పిన పాఠాలను మరువక వాళ్ళను మెచ్చుకో !!

ఈర్ష్య ద్వేషం వదులుకో !

మంచు కరిగినట్లు వయస్సుతరిగిపోతుంది !!

వృద్ధుడవైన నిరంతర విద్యార్థి గానే ఉండు !!

ఆత్మ నిర్మలంగా ఉంటే అన్నీ సుసాధ్యం !!? 


అపరాజిత్

2

[24/11, 8:44 PM] Korada: కవితాగానం

   అంశము :-  గీతామార్గం

    కోరాడ నరసింహా రావు !

 *న భూతో......న భవిష్యతి *

    *********************

మన మార్గం  సక్రమ మైతేనే ...

మాన గమనం నిష్కంటకం!

గమ్యం ....సుఖాంతం...!!

 అక్రమ మార్గ ప్రయాణం....

అనార్ధ దాయకం....!

మన జనన,మరణాల మధ్య

జీవితం...ఆనంద సాయక మై

నపుడే ...జన్మకు సార్ధకత!

అర్ధ,పరమార్ధాలు చేకూరేద ప్పుడే....!!

కర్తవ్య విముఖుడైన మట్టిముద్ద

పార్ధుని లోని సందిగ్ధతలను సవరించి,నిస్పృహా నిస్తేజాలను

తొలగించి...చైతన్యాన్నినింపి...

అపసవ్యం నుండి శవ్యానికి నడిపింది...పరమాత్మ ప్రభోధి త మైన గీతాయే కదా....!

 ఆ పాండవ మధ్యముని నిమిత్తమాతృని గా ...ఈ ప్రపంచానికి అందించిన అద్భుత బోధనామృతము గీతా మకరందము....!!

భగవద్గీతఅంటే....వ్యక్తిత్వ

వికాస ఉత్కృష్ట గ్రంథ రాజము!

గీత అంటే...ఆజ్ఞా నాంధకారా న్ని.. పటాపంచలు చేసే దివ్యజ్ఞాన ప్రకాశము ...!

గీతంటే ...ప్రశ్నఏదైనా...సమాధానంచెప్పగలిగే సాద్గ్రంధం!!

సందేహనివృత్తికి.,సాధనాసమ్పత్తికి...అక్షయ అక్షర జలది...!

యే వ్యక్తి గానీ...యే గ్రంధము

గాని....సమాధాన పరచలేని స్థితిలో...మన భాగద్గీతయే...

జగద్గురువు....!

గీతను శ్రద్ధతో అధ్యయనం చేయ్....,ఓ యోగివి కాగలవు

ఓ ఋషివై పొగలవు...!

నిన్ను మించిన పండితుడుండ డు...!!  సమత్వాన్ని సాధించిన

స్థితప్రజ్ఞుడవు కాగలవు...!

అన్నిటినీ మించి....ఈ అస్తవ్యస్తసమాజంలో...హాయిగాబ్రతక గలిగే...ఆదర్శమానవు నివి కాగలవు....!!

ఈ మానవ జీవితానికి... గీతనుమించిన మార్గదర్శి

3

🙏🙏కవితా గానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*అంశం*గీతాగానం*

మానవ జీవితంలో భగవత్ గీతా సారాంశం అర్థం చేసుకున్నట్లయితే *ఏవిధంగా జీవించాలి అన్న విషయం మనకు గీతాజ్ఞానం బోధిస్తుంది

పుట్టిన వానికి మరణం తప్పదు

మరణించిన వారికి జననం తప్పదు *ఈమధ్య జీవితం ఒక నాటకం కామ, క్రోధ లోభ మోహ,మద, మాత్సర్యము అనే అరిషడ్వర్గాలను జయించిన వాడే పురాణ పురుషుడు అని అర్జునుడికి

శ్రీ కృష్ణుడు ఉపదేశించిన సందర్భం ప్రతి వారి జీవితం లో

జరిగినవి జరగబోయేవి అన్ని

వివరించే భగవత్ గీతా గానం

విన్నా చదివినా ఎంతో పుణ్యం

4.

*కవితా గానం*

తేదీ:24-11-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: గీతా మార్గం

*********************

అదుపు తప్పే మనసు చేయిపట్టి

నైతిక విలువల దారిలో నడిపించే బ్రహ్మ జ్ఞానం!


జీవన విజయాలకు దిశా నిర్దేశం చేసే ఉద్దీపన రూపం!

వ్యక్తిత్వానికి పుటం పెట్టి కర్తవ్య బోధ చేసే గురు మార్గం!


ఆధ్మాత్మిక భావనలతో ముందుకు నడిపించి

మనో మాలిన్యాలను తొలిగించే దైవ నిర్ణయ మార్గం!

సహనం ఓర్పు శాంతి త్యాగం  సేవా దృక్పథంతో ముందుకు  నడిపించే ప్రయత్నం!

ఏక్రియ నైనా చేసేది‌ చేయించేది

నేనే అన్న గీతా సారాంశం తో 

ప్రతి జీవి జన్మ ధన్యం🙏🙏👍

న భూతొ....న భవిష్యతి!!

*********************

..........కోరాడ.

5

[25/11, 8:26 PM] భరద్వాజ గారు: 🎻🥁కవితాగానం 🎊🌱

అంశం- గీతామార్గం  --!

శీర్షిక-  . నమ్మాలి !

పేరు-భరద్వాజరావినూతల 

కొత్తపట్నం 

రచన-28

నిరంతర జీవంపోరాటం మనిషిది -

ఆశలతో దహించుకుపోతున్న కాష్టం అతనిది -

అదుపులేనికోరికలతో -

నియమబద్దంలేని బ్రతుకుతో పడుతుంటాడు అవస్థలు -

నిర్ణయంలేని లక్షణాలతో చేస్తాడు ప్రయాణం -

సహనం ఓ ర్పులకు అవుతాడు దూరం -

జరిగేది జరగనున్నది మిధ్యఅ న్న గీతాసారం తెలుసుకోగలిగితే -

ఏదిజరిగినా మనచేతులలో ఉండదు -

భారమంతా భగవంతుడిదే అనితెలుసుకోగలిగితే -

మనిషిచెందుతాడు ప్రశాంతం -

తల రాత బాగాలేనప్పుడు 

ఎగీత ఏమిచెయ్యదు అనినిరాశపడకుండా -

దైర్యంగా ముందుకుఅడుగేస్తే విజయం నీసొంతం -


ఇదినాస్వీయరచన 

భరద్వాజ రావినూతల ((RB)🖍️

కొత్తపట్నం 

9866203795

6

[25/11, 8:39 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: శీర్షిక విధి వంచితులు

మనిషి తాను ఎంతగా ముందుకు అడుగు వేసిన

ప్రతి అడుగు విజయ అపజయాల

మార్గం అని తెలుసుకో

కొన్ని గీతలు దాటితే నీకే ముప్పు వస్తుంది అసలుకే ఎసరు వస్తుంది



మనిషి హద్దూ అదుపూ లేని కోరికల పుట్ట ఏది ఉండేదో ఏది పోయేది ఎవరికీ తెలియదు

ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలుసు అంతా దైవేచ్ఛ



కాలం మాయాజాలం కాలం గీత

గీసిన చిక్కుల్లో దాటి వచ్చే వారు ఎవరు అందుకే కాలం మహేంద్రజాలం



కాలానికి హద్దు లేదు అది నిరంతర ప్రవాహం అడ్డుకునేది ఎవరూ లేరు


శక్తివంతులు ఎవరైనా ఉన్నారా

దాని గీతను చెరిపేసే మహాయోధులు ఎవరైనా ఉన్నారా చెప్పండి

దాని గుట్ట ఏమిటో ఎవరైనా చెప్పగలుగుతారా అంతా

సర్వం అంతా విష్ణు మయం



డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

7

[25/11, 9:13 PM] KC Narsaiah KS 26: కవితా గానం


పేరు: కెసి నరసయ్య

చరవాణి: 7981814784

తేది: 25-11-2020

అంశం: గీతా మార్గం

శీర్షిక: సాధించిందేమిటో?



గమ్యం కోసం మార్గం

లక్ష్యం కోసం సన్మార్గం

లక్ష్యసాధనలో

కక్షసాధింపులెన్నో?


మార్గం కోసం అన్వేషణ

సన్మార్గం కోసం సత్యాన్వేషణ

సత్యాసత్యాల నడుమ

జరిగిన పరిణామాలెన్నో?


గీత దాటిన సీతాపహరణ

సీతాన్వేషణ కోసం

ధర్మాధర్మాల ప్రవచనాలు 

బలియైన అమాయకులెందరో?


నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణ

జూదంలో పాచికయిన పాంచాలి

అర్జునుడికి కనువిప్పయిన గీతోపదేశం

మహాభారత యుద్ధం సాధించిందేమిటో?

8

[25/11, 9:16 PM] Sandya Sharma Poetess: కవితాగానం


వై.కె.సంధ్యశర్మ


అంశం:  గీతా మార్గం


౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧


ఘనీభవించిన  మనసు పొత్తులో


మంచిగంధపు పరిమళాన్ని ఒంపే


అమృత కలశం....


కలత ఒడిలో  శయనించే కన్నీటి కెరటంలో


కలువల కలలు పండించే


కౌముది ఫలకం..


నిరాశ నీడలో నిదురించే  నిస్పృహకు


నిర్భయత్వాన్ని  నరనరాన నింపే


నక్షత్ర సమూహం...


అధైర్యపు నూలు పొగులో  చుట్టుకుపోతున్న


అమలిన హస్తాలకు ఆసరాగా


అమరత్వాన్ని నింపే  అలౌకిక సన్నిధానం......


దుఃఖ నదీలోయలను పారద్రోలి


వెలుగు రెక్కల తరంగాలను


మది మదిలో నిక్షిప్తం చేసే అనంత  భావాలకు


ఏకైక మార్గం...


భగవంతుడు చూపిన గీతా మార్గం!

9

[25/11, 9:35 PM] Lalita Sister: *గీతా మార్గం*

************


*సకల సత్గ్రంధాలసారం *గీత*

*సకల శాస్త్రాల ప్రయోగఫలం*

*మానవుల తలరాతను మార్చే గీత* 

*ఔత్సాహికులకు స్ఫూర్తి మంత్ర*


*దైవం నిజాయితీపరులకు 

ఇచ్చిన భరోసాలపర్వం* 

*ఓటమివేళల ఓదార్పునిచ్చు మహా నైతికబలం*

*దుఃఖించేవేళల కన్నీటిని తుడిచే స్నేహహస్తం*

*విడువనినేస్తం పరమాత్మ'

అని చాటే విశ్వదర్శనం*


*జగద్గురువు సృష్టించిన మనోవిశ్లేషణగ్రంథం*

*ఆధునికమానసిక చికిత్సాశాస్త్రానికి ఆధారం*

*కర్మ*ను అనుభవించమనేది కాదు లక్ష్యం*

*ధర్మాన్ని నెరవేర్చమనేదే మార్గదర్శి కర్తవ్యం*


**పాపభీతిని పెంచి మంచి మార్గాన 

 నడిపే పరమ ఉత్కృష్టకార్యం* 

*పుణ్యచరితుల పెంచే 

ఆదర్శ శిక్షణాలయం*

*అపూర్వ అమూల్య సాహితీసుగంధభరితం* 

*మధురాతి మధుర పరిమళ కృష్ణప్రవచనాగీతం*


*కర్తవ్యం మన వంతు 'అని ప్రవచించే ప్రేరణం*

*భగవంతుడు మంచిని గెలిపిస్తాడనే ధైర్యం*

*జననమరణ పాపపుణ్యాల చిక్కుముడి విశ్లేషణo* 

*అంతుచిక్కని తత్వవిచారణకు అధ్బుతశ్లోకరూపం*


**గీతా పఠనం*ఉత్తమాభిరుచికి నిర్వచనం* 

*గీతామార్గం అందరు 

సాగాల్సిన రాచ మార్గం*

*'గీతాచార్యుడు' అన్నివేళలా

 నడిపించే అదృశ్యహస్తం*

దైవ దారిలో సాగుతూ

ధర్మ చింతనతో జీవిద్దాం


:*వల్లాల* *విజయలక్ష్మి*

*ఆలేరు*

10

[25/11, 9:39 PM] Lalita Sister: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..గీతామార్గం

శీర్షిక..జ్ఞానమార్గం



బాధలను బాపి,భక్తిని పెంచుతూ

మనో మాలిన్యాన్ని తొలగిస్తూ

ముక్తిని ప్రసాదించే ఆధ్యాత్మిక భావన

జీవన పయనంలో ఎదురయ్యే

ఒడిదుడుకులను అధిగమించి

మంచి చెడుల వైరుధ్యాన్ని తెలుపే గురు బోధ

సమస్యలనదిగమించి ఓరిమి,సహనంతో

 నడిపించే జ్ఞాన మార్గం

మానవతా విలువల్ని రక్షిస్తూ

కుల మత వర్గ భేద మేమిలేకుండా

జాతీయతను పెంచే

శాంతియుత మార్గం

ప్రశాంతతను చేకూర్చు పవిత్ర గీతం

అన్యాయాన్ని,అధర్మాన్ని దరిచేరనివ్వని ధర్మమార్గం

అదే గీతాచార్యుడు అందించే జీవన సూత్రం

ఆచరిస్తే చేర్చును విజయ తీరం

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...