Skip to main content

ఉపవాసం 17/11/2020

 నిర్వహణ

శివునూరి లలితాకృష్ణ 

Author of వెన్నెల శిల్పం

వీరా గుడిపల్లి

***************

1 భరద్వాజ గారు

2.వల్లాల విజయ లక్ష్మి గారు

3.శ్రీలక్ష్మి చివుకుల గారు

4.మువ్వ ప్రసాద్ గారు

5.డా.ఆంజనేయులు గారు

6.కెసి నరసయ్య గారు

7.డా.బల్లూరి ఉమాదేవి గారు

8.వినీలమ్మ

9.సునంద వురిమళ్ళ గారు

10.సుధారాణి కృష్ణం రాజు గారు

*****************

1

[17/11, 8:25 PM] భరద్వాజ గారు: 🎊☘️ *కవితాగానం* 🎊☘️

అంశం-ఉపవాసం

శీర్షిక- ఆరోగ్య రక్షణకు ఆయుధం

పేరుఃభరద్వాజ

ఊరు-కొత్తపట్నం

రచన-32

ఉపవాసం-

మన పూర్వులు పెట్టిన సాంప్రదాయం-

భక్తి తో భగవంతుని‌ చేరేందుకు మార్గం-

హిందూ మతాన అలరారే‌ ఆచారం-

కార్తీక మాసాన దీని ప్రయోజనం అనన్యం-

పగలంతా భక్తితో భగవంతుని సేవించి-

నిరాహారంగా దైవ ధ్యానాన గడిపి-

సాయం సంధ్య‌వేళ‌స్నానానంతరం‌ఆహారం‌స్వీకరించేందుకు చేస్తారు‌ ఉపవాసం--

రోగి‌ చేసేది‌ లంఖణం-

భక్తుడు‌ చేసేది‌ ఉపవాసం-

రేకెత్తించే భక్తి భావం-

అరిషడ్వర్గాలను జయించటం దీని పరమార్ధం-

అయ్యప్ప‌స్వాములు‌ మండలం చేసే  దీనిలో‌నెలకొంటుంది భక్తిభావం-

ఉద్యమాలలో‌‌కూడా‌ నిరాహారంగా

సమస్యల కెదురొడ్డి చేస్తారు‌ నిరాహార దీక్ష-

ఏది‌చేసినా పెద్దలు పెట్టింది ఆరోగ్య‌సంరక్షణకే-

జీవన‌వయో‌ప్రమాణాలు పెంచడమే--!

ఇది‌నాస్వీయరచన

భరద్వాజ రావినూతల(RB)🖍️

2

[17/11, 8:28 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక::**ఉపవాసం**

      ***************


ఇంట్లో మనముండిన చాలు

కరెంటు లేకుండా పనిచేసే

నోటిమిషను నడుస్తనే ఉంటది

పంటికి పని చెబుతనే ఉంటం


ఒంటికి పడని పదార్థాలైనా

కంటికి కనిపిస్తే చాలు ఊరిళ్ళొచ్చి 

చాలనుకుంటూనే కటకటమనిపించటం

ఆనక చిటపటలతో చిందులేయటం


*పదార్థాలపై నోరు చేసుకోవటం*

ఆపై ఆపసోపాలతో ఆయాసపడటం

లావవుతున్నానని బరువెక్కుతున్నానని 

బాధపడటం పలువురికి అనుభవం


దేహపోషణకవసరం సంపూర్ణాహారం

అనవసర చిరుతిండ్లతో ఊబకాయం

శరీరశ్రమ తగ్గిన నేడు ఆరోగ్యసమస్యల 

పరిష్కారం వారానికోమారు ఉపవాసదీక్షావ్రతం


జీర్ణవ్యవస్థకు విశ్రాంతి దక్కును

మనసుకు సంతృప్తి దొరకును

ఉపవాసానికి భక్తిభావం తోడయిన

ఆలోచనలు శుద్ధయి ఉపవాసం అర్థవంతమగు


*ఆహారానికి దూరముండటమంటే

దైవానికి దగ్గరయ్యే మోక్షమార్గాన సాగటమే

ఆరోగ్యాన్ని దృష్టినుంచుకునే ఉపవాసం

అద్వైతాలోచనలకు సహవాసం


గాంధీజీ ఆయుధమై గెలిపించిన ఈ దీక్ష 

నవీనయుగ ఆరోగ్యరక్షణా(శ)స్త్రం

ఆహారపదార్థాలకో పొదుపు మార్గం

ఏవిధంగా చూసినా ఈ దీక్ష జీవనసoరక్ష*


*వల్లాల విజయలక్ష్మి* ,,

ఆలేరు

[17/11, 8:29 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక::**ఉపవాసం**

      ***************


ఇంట్లో మనముండిన చాలు

కరెంటు లేకుండా పనిచేసే

నోటిమిషను నడుస్తనే ఉంటది

పంటికి పని చెబుతనే ఉంటం


ఒంటికి పడని పదార్థాలైనా

కంటికి కనిపిస్తే చాలు ఊరిళ్ళొచ్చి 

చాలనుకుంటూనే కటకటమనిపించటం

ఆనక చిటపటలతో చిందులేయటం


*పదార్థాలపై నోరు చేసుకోవటం*

ఆపై ఆపసోపాలతో ఆయాసపడటం

లావవుతున్నానని బరువెక్కుతున్నానని 

బాధపడటం పలువురికి అనుభవం


దేహపోషణకవసరం సంపూర్ణాహారం

అనవసర చిరుతిండ్లతో ఊబకాయం

శరీరశ్రమ తగ్గిన నేడు ఆరోగ్యసమస్యల 

పరిష్కారం వారానికో ఉపవాసదీక్షావ్రతం


జీర్ణవ్యవస్థకు విశ్రాంతి దక్కును

మనసుకు సంతృప్తి దొరకును

ఉపవాసానికి భక్తిభావం తోడయిన

ఆలోచనలు శుద్ధయి ఉపవాసం అర్థవంతమగు


*ఆహారానికి దూరముండటమంటే

దైవానికి దగ్గరయ్యే మోక్షమార్గాన సాగటమే

ఆరోగ్యాన్ని దృష్టినుంచుకునే ఉపవాసం

అద్వైతాలోచనలకు సహవాసం


గాంధీజీ ఆయుధమై గెలిపించిన ఈ దీక్ష 

నవీనయుగ ఆరోగ్యరక్షణా(శ)స్త్రం

ఆహారపదార్థాలకో పొదుపు మార్గం

ఏవిధంగా చూసినా ఈ దీక్ష జీవనసoరక్ష*


*వల్లాల విజయలక్ష్మి* ,,

ఆలేరు

3

[17/11, 8:32 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం 

తేది:17-11-2020 

అంశము: ఉపవాసం 

పేరు: శ్రీలక్ష్మి చివుకుల 

కవితా శీర్షిక

   ఉప-వాసము

ఏకాదశి ఉపవాసం ఉండగా నెంచి

ఒకానొక ముసలవ్వ 

ముందు రోజు రాత్రంతా

తింటూనే ఉందట! 

తెల్లవారుజాము కోడి కూత విని 

అప్పుడే కూసేసావా? అని 

అదిలించిందట దానిని.

మానవుని జిహ్వ చాపల్యానికి 

పరాకాష్ట ఇది!

చిన్ననాడు విన్న గాధ!

అన్నపానీయాలు వర్జించుటయే 

ఉపవాసమని తలతురు కొందరు

శరీర సక్రమ నిర్వహణ కొరకు 

ఒక రోజు వాటిని 

వదిలి వేయుట మంచిదే కానీ….

ఉప అనగా సమీపము

వాసము అనగా నివసించుట

ఎవరికి దగ్గరగా నివసించుట??!

భగవంతునికి సమీపముగా

నవవిధభక్తి రీతుల

శారీరక మానసిక 

ప్రక్షాళన గావించుకొనుట

అంతర్ముఖులమై

మనలను మనము

శోధించుకొనుట!

నవరాత్రులందు ఉపవాసము చేసి

దేవతలను కొలుచుకుని

జాగరణలు చేయుట

సామూహిక ప్రార్థనలు చేయుట

ఆధ్యాత్మిక పురోగతిని పొందుటకై 

దారి చూపు కర్మ లివి!

మానవజన్మ కర్మభూయిష్టం!

ఉప-వాసం చేయుట అవసరం

యుగయుగాలుగా మన పెద్దలు 

అనుసరించిన దానిని ఆధునికులు 

తేలికగా కొట్టిపారేసినా

జర్మన్ శాస్త్రజ్ఞులు

తమ పరిశోధనలలో

ఏకాదశి ఉపవాస ఆవశ్యకత తెలిపి

నోబెల్ పురస్కారము పొంది

భారతదేశ గొప్పతనాన్ని 

ప్రపంచానికి చాటారు!

తర్క వితర్క కుతర్కాలు వదిలి

అప్పుడప్పుడైనా వీలున్నప్పుడైనా

ఉపవాస జాగరణలు చేయుట

భక్తి ముక్తిలకు సోపానాలు!

4

[17/11, 8:34 PM] Muvva Prasad: కవితాగానము 


అంశము:- ఉపవాసము 


పేరు :-మువ్వా ప్రసాద్   ఖమ్మం




మతమేదైనా మంత్రమొక్కటే

 దీక్ష ఏదైనా దిశ ఒక్కటే


 మొక్కవోని ఏకాగ్రతకు 

మనిషీ దగ్గర ఉన్నమాత్రఒక్కటే

 


నరునియొక్క

 నాజూకుతనమునకైనా


నారాయణయుని

స్మరించుటకైనా 


సర్వకాల

సర్వావ్యవస్థలయందున

 సారూప్యత ఉన్నదొక్కటే


 దగ్గరున్న దరిచేరనీయక

 నీవు చేయునది


ఈజగతినఉపవాసమొక్కటే .......

5

[17/11, 8:47 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఉపవాసం శీర్షిక

ఉపవాసం కార్తీక మాసపు రోజుల్లో

భక్తికి మార్గంగా

శివనామ అర్చన చేస్తూ

మానవ 


  పాపములను పోగొట్టి

పార్వతీ పరమేశ్వరుల ఆరాధనతో

రుద్రాభిషేకములు చేస్తూ


పాలతో అభిషేకాలు విభూదితో అభిషేకాలు చేస్తూ

నవ విధ భక్తి మార్గములు

పాల్గొంటూ


నిరంతరం నామస్మరణ

శివోహం శివోహం

పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ


ఓం నమశ్శివాయ

ఓం నమ శివాయ అంటూ

ఆకాశ దీపాన్ని చూస్తూ

ఈ పుణ్యదినాలలో

కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది


ఉపవాసం వల్ల శరీరానికి చక్కటి ఆరోగ్యప్రదం గా గావించడం


శుభదాయకం పవిత్ర దాయకం

ఆది దంపతులైన ఆది దేవుళ్ళు అయినా పార్వతీ పరమేశ్వరులు

వందే పార్వతీ పరమేశ్వరౌ


శివోహం శివోహం అంటూ

భక్తులు శివనామ అర్చన చేస్తూ

దీపాలను వెలిగించే ఈ శుభవేళ

ఉపవాస దీక్షలు వదులుతూ

కైలాస ప్రాప్తిని పొందుతారు


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

6

[17/11, 8:58 PM] KC Narsaiah KS 26: కవితా గానం


 అంశం: ఉపవాసం

 పేరు: కెసి నరసయ్య

 చరవాణి: 7981814784

 శీర్షిక: పాశుపతాస్త్రం



 ఆరోగ్యములో ఆవాసం

 అందరికీ అవసరం ఉపవాసం

 రాజకీయాల దీక్షల బెదిరింపు

 ప్రజా సమస్యల పరిష్కారంలో

 పాలకవర్గాలను నిలదీస్తున్న దీక్షలు

 స్వాతంత్ర్యోద్యమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం

 ఉద్యమం ఏదైనా ఆయుధం ఒక్కటే నిరాహారదీక్షలు

 అమ్మ నాన్నలకు బెదిరింపులు

 అనుకున్నది సాధించుకునేందుకు

 అన్నం తినని మొరాయింపులు

 బెదిరింపుల మాటున ఉపవాసం

 భక్తితో చేయు వాసం ఉపవాసం

 పాపాల పరిహారం కోసం ప్రాకులాటలు

 ముక్తి కోసం భక్తితో చేసే ఉపవాసం

 కార్తీకమాసంలో దీపోత్సవాలు

 శివపార్వతుల ప్రసన్నం కోసం ఉపవాసాలు దీక్షలు

 ఉపవాసం ప్రజల పాశుపతాస్త్రం

7

[17/11, 9:27 PM] Balloori Umadevi Poetess: 17/11/20

కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి

అంశము:ఉపవాసము


భక్తితో భగవంతుడి చెంత

 వాసముండుటే ఉపవాసం

 ఇదే ఇదే వేదాంత సారం 

 ఆరోగ్యానికీ ఆధ్యాత్మికతకు

  మూల రూపం ఉపవాసం 

 తిండి తిప్పలు మానిన కాదు 

 వండని వస్తువులే ఆహారంగాగొని

 భగవన్నామ స్మరణను చేస్తూ

 పానియాల తో పండ్ల రసాలతో

 కాలం గడపడమే ఉపవాస లక్ష్యం 

 కులాలు మతాలు వేరైనా

  ఉపవాస దీక్షలు మాత్రం సాధారణం

 ఒక్కరోజు వారం రోజులు

  మండల   దినములు

 చేస్తారు ఉపవాసాలు 

 నిరాహారం నక్తం ఏకభుక్తం పేరిట

 ఉపవాసాలు పలురకాలు

  దేహ శక్త్యానుసారం ఉపవాసం

  చేయడమే సమర్థనీయం

 ఏకాదశి ఉపవాసం పుణ్యప్రదం

  శివరాత్రి ఉపవాసం ముక్తి ప్రదం 

 వారానికి ఒక రోజు అయినా 

 వస్తుండడం అందరికీ ఆరోగ్యప్రదం

8

[17/11, 9:28 PM] Vineelamma: కవితాగానం

పేరు: విజయదుర్గ

కవితా శీర్షిక : ఉపవాసం

కవితా సంఖ్య: 36

తేదీ: 17/10/20 


కోరికలను నియంత్రిస్తూ

ఆద్యాత్మిక దీపాన్ని వెలిగిస్తూ

ఆత్మద్వారాలు తెరిచే

అద్భుత వాసం....!!


దైవానికి మనిషికి మధ్య

మూలాధారవాహికై

సనాతన ధర్మాన్ని నిలబెట్టే

హిందూ ప్రామాణిక....!!


కష్టమేదైనా,గాలివానల

విసురు లైనా

నమ్మక ఒత్తులతో వెలిగించే

కార్తీకదీపమై

ఉపవాసం ప్రకృతి లో వెలిగే

విశిష్టమైన క్రియ....!!


ఆరీగ్యానికి ప్రధమ కర్తవ్య మై

జీర్ణశక్తికి ఉత్సాహాన్నిచ్చే ఔషధమై

విజ్ఞానపరంగా,తాత్వికత పరంగా

మానవాళికి ఫలితాన్నిచ్చే

అమృతవాహిని ఉపవాసం....!!



                              🌹వినీల🌹

9

[17/11, 9:28 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*

తేదీ:17-11-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: ఉపవాసం

********************

మనసు శరీరాలను భగవంతుని సాన్నిధ్యంలో నిలిపి

ఏకాగ్రతతో కొలిచే దీక్షా వ్రతం!

మానసిక ఒత్తిడికి నివారణోపాయం!

ఆరోగ్యానికి ఔషధీయ మూలం!


మతమేదైనా పేరేదైనా ఉపవాసం 

అంతఃకరణ శుద్ధి చేసే అమోఘమైన శక్తి స్వరూపం

స్వీయ నియంత్రణకు

మనో నిగ్రహాన్ని పరీక్షించుకునే

మహత్తర అవకాశం!


 కార్తీక మాస ఉపవాసం 

ఋతు మార్పుకు అనుకూలంగా

మనల్ని మనం తయారు చేసుకునే  ఉపకరణం!

10

🙏🙏కవితాగానం🙏🙏

🙏 సుధారాణి కృష్ణంరాజు🙏

*అంశం*ఉపవాసం*

మహాశివరాత్రి, ముక్కోటి ఏకాదశి దసరా నవరాత్రులు

కార్తీక మాసం లో ను ప్రతివారు

ఈ ఉపవాసం ఉండి నియమ నిష్ఠలతో పూజలు చేసి తద్వారా తమ కోరికలు నెరవేరాలని కష్టాలు తొలగి

సుఖ సంతోషాలు సకల సౌభాగ్యాలు కలగాలని 

ఉపవాసాలు చేస్తారు

అరిషడ్వర్గాలను జయించడానికి

ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్య పరంగాను ఈ ఉపవాసం

ఎంతో మేలు కలిగిస్తుంది

అయితే ఇవి మరి చాందస భావాలు కలిగించకుండా

ఉండే విధంగా ఉండాలి

మనసారా భక్తితో పూజించివారికి ఆభగవంతుడు

వెన్నంటి ఉంటాడు

మనం చేసే మంచి పనులలో

దైవత్వం ఉంటుంది🙏🙏👍


వారానికి ఒకసారైనా ఉపవాసం ఉందాం

అంతర్గత బాహ్య శరీరాలను శుద్ధి చేసుకుందాం!

లఘు సమీక్షలు

*************

[19/11, 2:33 PM] Veera Gudipally: *శ్రీ భరద్వాజ గారు*

మన పూర్వీకులు పెట్టిన సంప్రదాయం....ఆరోగ్య రక్షణకు ఆయుధం ఈ ఉపవాసం అంటున్నారు శ్రీ భరద్వాజ గారు.

నిరాహారంగా ఉండడం ఉపవాసం కాదని....

రోగి నిరాహారంగా ఉంటే అది లంఖణం తప్ప ఉపవాసం కాదని అంటారు వీరు.

ఉద్యమాలలో చేసేది దీక్ష అంటూ

యేది ఉపవాసం,?

యేది ఉపవాసం కాదో.. స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు....

భరద్వాజ గారు... అభినందనలు సార్

[19/11, 2:34 PM] Veera Gudipally: 2

*శ్రీమతి వల్లాల విజయ లక్ష్మి గారు*

కరెంట్ లేకుండా పనిచేసే నోటిమిషన్ నడుస్తూనే ఉంటుంది.... చక్కని పదబంధం పడింది.


ఈ కవనం ఆరోగ్య ప్రయోజనాల గురించిన కేంద్రబిందువు గా సాగింది.


ముగింపు లో... ఉపవాసం అద్వెతాలోచనలకు సహవాసమంటూనే... గాంధీజీని గెలిపించిన ఆయుధమని.... పొదుపు మార్గమని...అనేక భావాలను జొప్పించారు.

ఒకే కవితలో భిన్నపార్శ్వాలను చూపించిన మీకు అభినందనలు.

[19/11, 2:34 PM] Veera Gudipally: 3

*శ్రీమతి వురిమళ్ళ సునంద గారు*

మానసిక ఒత్తిడి నివారణకు ఔషధం 

అంతఃకరణ శుద్ధి చేసే

అమోఘమైన శక్తి స్వరూపం 

స్వీయ నియంత్రణకు... పరీక్ష

ఋతుమార్పుకు అనుకూలంగా మనల్ని మనం మార్చుకునే అద్భుతమైన ఉపకరణం గా.... చెప్తున్నారు.


ఉపవాసం తో అంతర్గత,బాహ్య శుద్ధి చేసుకోవాలంటూ పిలుపు నిస్తున్న శ్రీమతి సునంద గారికి అభినందనలు

[19/11, 2:35 PM] Veera Gudipally: 4

*శ్రీమతి వై కె సంధ్యా శర్మ గారు*

భగవంతుని సేవలో తరించే ఏకైక మార్గం అంటూ...ఆడంబరాలకతీతంగా ఆహార్యం ఉండాలంటున్నారు.

ఆత్మ జ్ఞానానికై ... అవధులు లేని భక్తి.....యెరుగుని ఎల్లలు తీర్చిదిద్దగల జీవన సరళ రేఖల్ని స్పృశించారు. అభినందనలు మేడమ్

[19/11, 2:36 PM] Veera Gudipally: 5

*డాక్టర్ సి హెచ్ ఆంజనేయులు గారు*

ఉపవాసం యెప్పుడు చేస్తారు. ఎలా చేస్తారు.విడుపు ఎప్పుడు ?? ఉపవాస కాలంలో చేసే జపమేంటి అనే విషయాలను స్పష్టంగా చెప్పే ప్రయత్నం చక్కగా చేశారు డాక్టర్ సి హెచ్ ఆంజనేయులు గారు.... అభినందనలు సార్

[19/11, 2:36 PM] Veera Gudipally: 6

*డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు*

భగవంతునిచెంత వాసముండుటే ఉపవాసం అదే వేదాంత సారం అంటారు ఉమాదేవి గారు.

ఉపవాసం అంటే తిండీ తిప్పలు మానడం కాదని,వండని వస్తువులను ఆహారం గా తీసుకుంటూ భగవన్నామ స్మరణ లో గడపాలంటున్న ఉమాదేవి గారికి ధన్యవాదాలు.

చక్కని అభిప్రాయం మేడమ్.

[19/11, 2:37 PM] Veera Gudipally: 7.


*శ్రీమతి సుధారాణి కృష్ణం రాజు గారు*

అరిషడ్వర్గాలను జయించడానికి ఉపవాసమే మార్గం అంటారు వీరు.


మంచి పనులు చేయడమే దైవత్వం అంటూ వాస్తవ వాది లా కనిపిస్తారు.


చాందస వాదులు గా మారకూడదంటూ....అనేక పార్శ్వాలు స్పృశించిన  ఈ కవిత ను...అందించిన సుధారాణి కృష్ణం రాజు గారికి అభినందనలు.

[19/11, 2:37 PM] Veera Gudipally: 8


*మువ్వా ప్రసాద్ గారు*

మొక్కవోని ఏకాగ్రతకు

నరుని నాజూకు తనానికి

నారాయణుని స్మరించడానికి

ఈ జగతిలో ఉపవాసమొక్కటే మార్గమంటారు... మువ్వా ప్రసాద్ గారు.

చక్కని భావాన్ని సమగ్రంగా అందజేసిన మువ్వా గారికి అభినందనలు

[19/11, 2:38 PM] Veera Gudipally: 9

*శ్రీమతి విజయ దుర్గ* గారు

దైవానికి మనిషికి మధ్య మూల ధారా వాహికై సనాతన ధర్మాన్ని నిలబెడుతుందంటారు. కోరికలను నియంత్రిస్తూ ఆత్మ ద్వారాలు తెరిచే మార్గమంటూ...చెబుతున్న...

మా వినీలమ్మ యెంత లోతైన పరిశీలన గావించిందో తెలుస్తోంది.

కోరిక లే... దుఃఖానికి కారణమని గౌతముడు యెప్పుడో చెప్పాడు కదా... అభినందనలమ్మా...

[19/11, 2:39 PM] Veera Gudipally: 10

*శ్రీ కెసి నరసయ్య గారు*

ఉద్యమం ఏదైనా ఆయుధం ఒక్కటే అంటూ... ఉపవాసాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించే ఆయుధమంటున్నారు కవిరాజు పురస్కార గ్రహీత శ్రీ కెసి నరసయ్య గారు.

ఉపవాసం ప్రజల పాశుపతాస్త్రం అంటున్న వీరికి ధన్యవాదాలు తెలుపకుండా ఉండలేం. భిన్నరీతుల విశ్లేషణ చూడగలగడం కవికులానికే సాధ్యం కాదా...

[19/11, 2:39 PM] Veera Gudipally: 11


*శ్రీ లక్ష్మి చివుకుల గారు*

భగవంతునికి సమీపంగా, నవవిధ భక్తుల్లో శారీరక, మానసిక ప్రక్షాళన చేసుకోవడం తో పాటు... అంతర్ముఖులమై మనల్ని మనం శోధించు కోవడమే... ఉపవాస రహస్యం అంటున్నారు శ్రీ మతి చివుకుల శ్రీలక్ష్మి గారు.

అంతే  కాదు సుమా! ఉపవాసం జాగరణ అనేవి భక్తి, ముక్తి కి సోపానాలంటున్నారు.

ఆధ్యాత్మికత భావనలను తనకంటే బాగా యెవరు చెప్పగలరనిపించేలా.... చెప్పారు.ధన్యవాదాలండీ.

[19/11, 2:40 PM] Veera Gudipally: 12

*మర్రి జయశ్రీ గారు*

ఋతువులలో మార్పుకు అనుగుణంగా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవడమే ఉపవాసాల రహస్యం అంటూ పండగల వెనుకున్న శాస్త్రీయ కోణాన్ని తెలుపుతూ, ఉపవాసమనేది అంతరంగ శుద్ధి కి కూడా దోహదపడుతుందంటారు. మర్రి జయశ్రీ గారు. మానసిక వత్తిడి తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడే ఉపవాసం శుభకరమంటున్న ఈ కవయిత్రి కి .... సాహో... అనాల్సిందే మరి.


Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...